independence day 2023
-
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్.. వీకెండ్ మస్తీతో ఉర్రూతలు (ఫోటోలు)
-
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే బ్లూప్రింట్ వంటిదని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. మోదీ ప్రసంగంలో గత దశాబ్దంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ, 2047 నాటికి భారతదేశం ‘వికసిత భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా మారేందుకు బ్లూప్రింట్‌ను రూపొందించిందని పరిశ్రమల సంఘం సీఐఐ తెలిపింది. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్) భారత్‌ను మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలన్న ప్రధాని దార్శనికత వచ్చే ఐదేళ్లలో సులువుగా ఫలించగలదని సీఐఐ విశ్వసిస్తోందని డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ప్రధాని తన ప్రసంగంలో వివరించిన విజయాలు, దార్శనికత అమృత్ కాలంలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు కావాల్సిన బలం, ధైర్యాన్ని అందిస్తాయి. ఇందుకు తగిన వేదికను ఏర్పాటు చేస్తాయి’’ అని ఆయన అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే జాతీయ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు -
మువ్వన్నెల పతాకమా.. అందుకో నా వందనం
రామచంద్రపురం రూరల్: దేశ స్వాతంత్య్రోద్యమ నేతల్లోని అగ్రగణ్యుల్లో ఒకరు.. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి.. నేతాజీ సుభాష్‌చంద్రబోస్. ద్రాక్షారామ ప్రధాన రహదారిపై ఆయన విగ్రహం సైనిక దుస్తుల్లో ఠీవీగా సెల్యూట్ చేస్తూ నిలబడి ఉంటుంది. బోసు బొమ్మ సెంటర్‌గా పేరొందిన ఆ ప్రాంతంలో నేతాజీ విగ్రహం ఎదురుగా ద్రాక్షారామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యాన మంగళవారం జాతీయ జెండా ఎగురవేశారు. ఆ జెండాకు నేతాజీ సెల్యూట్ చేస్తున్నట్టుగా విగ్రహం వెనుక నుంచి పంచాయతీలో ట్యాంక్ వాచర్‌గా పని చేస్తున్న ఆకుల శ్రీనివాసరావు (ట్యాంకు శ్రీను) ఫొటో తీశారు. ఇది మంగళవారం బాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటోను పలువురు తమ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. -
సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
ప్రేమించిన వ్యక్తితో సహజీవనం.. పుట్టిన పిల్లలకు ఆస్తి వస్తుందా?
భారత చట్టాల గురించి మీకు ఈ విషయాలు తెలుసా? హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956 దేశంలోని ఏ ఒంటరి స్త్రీ అయినా పిల్లలను దత్తత తీసుకునే హక్కును కల్పిస్తోంది ఈ చట్టం. అమ్మాయి.. అబ్బాయి అనే తేడా లేకుండా వాళ్లకు నచ్చిన పిల్లల్ని దత్తత తీసుకునే వెసులుబాటును ఇస్తోంది. అయితే ఇదే వెసులుబాటును ఒంటరి పురుషులకు ఇవ్వడం లేదు ఈ చట్టం. ఒకవేళ ఒంటరి పురుషుడెవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలను కుంటే కేవలం అబ్బాయిని మాత్రమే దత్తత తీసుకోవచ్చు. అమ్మాయిని కాదు. ఒకవేళ అమ్మాయినే దత్తత తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ చట్టంలోని సెక్షన్ 11 (3) ప్రకారం తన కన్నా 21 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని మాత్రమే దత్తత తీసుకునే వీలు కల్పిస్తోంది. అంటే దత్తత తీసుకోవాలనుకుంటున్న వ్యక్తికి.. దత్తతకు వెళ్లబోతున్న అమ్మాయికి కనీసం 21 ఏళ్ల వయసు అంతరం ఉండాలన్నమాట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మేజర్లు అయిన అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేస్తుంటే దాన్ని చట్టబద్ధమైన బంధంగానే భావించాలని చెబుతోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. దీని ప్రకారం ఏ వ్యక్తికైనా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. సహజీవనం కూడా దాని కిందకే వస్తుంది. దేశంలో.. 2005 నుంచి సహజీవనం చట్టబద్ధం అయింది. సహజీవనం చేస్తున్న జంటకు పుట్టిన పిల్లలకు ఆస్తిహక్కునూ కల్పిస్తోందిది. జీవించే హక్కు,ఆర్టికల్ 21 దేశంలోని పౌరులు అందరికీ జీవించే హక్కును కల్పిస్తోంది ఈ ఆర్టికల్. ప్రభుత్వంతో సహా ఎవరికీ ఎవరి జీవితాన్ని హరించే హక్కు లేదు. పైపెచ్చు దేశంలోని ప్రతి పౌరుడి జీవితానికి ప్రభుత్వం భద్రత కల్పించాలి. ఎవరి జీవితమైనా ప్రమాదంలో పడితే వారిని రక్షించేందుకు కావలసిన చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. జీవించే హక్కుకు అవరోధం కల్పిస్తున్నవారిలో ప్రభుత్వ అధికారులనూ బాధ్యులను చేస్తుందీ ఆర్టికల్. ప్రభుత్వాల జోక్యం వల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే బాధ్యుల మీద విచారణను కోరే హక్కును పౌరులకు అందిస్తోందీ ఆర్టికల్. చదువుకునే హక్కు, ఆర్టికల్ 21 (ఏ).. ఇది దేశంలోని ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య హక్కును కల్పిస్తోంది. దీని ప్రకారం దేశంలోని ప్రైవేట్ బడులన్నీ ఉచిత విద్య కింద 25 శాతం సీట్లను రిజర్వ్ చేయాలి. ఆ ఖర్చును ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వామ్యం కింద ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు ప్రభుత్వ గుర్తింపు లేని బడులను రద్దు చేస్తుంది. అలాగే డొనేషన్లు, కార్పొరేట్ ఫీజులు వసూలు చేయకూడదని చెబుతోంది. స్కూళ్లల్లో పిల్లల ప్రవేశ సమయంలో స్కూల్ సిబ్బంది.. పిల్లలను, పిల్లల తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడాన్నీ నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ విద్య అయిపోయే సమయానికి ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయడం కానీ.. పై తరగతికి పంపకుండా మళ్లీ అదే తరగతిలో ఉంచడం కానీ.. బడి నుంచి బహిష్కరించడం కానీ చేయకూడదు. అంతేకాదు బోర్డ్ ఎగ్జామ్ తప్పకుండా పాస్ కావాలనీ బలవంతపెట్టకూడదు. చదువులో వెనుకబడిన పిల్లలను అలా వదిలేయకుండా తోటివారికి సమంగా తయారు చేయాలనీ చెబుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ 1988 మోటార్ వెహికిల్ యాక్ట్, సెక్షన్ 185, 202 ప్రకారం.. మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నప్పుడు.. వంద మిల్లిలీటర్ల రక్తం నమూనాలో 30 మిల్లీ గ్రాముల మద్యం ఉంటే గనుక అరెస్ట్ వారెంట్ లేకుండానే పోలీసులు వాహనం నడుపుతున్న వారిని అరెస్ట్ చేయొచ్చు. ఇదే చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం.. టూ వీలర్‌ను నడిపేవాళ్లు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే. పార్ట్ 128.. టూ వీలర్ మీద ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతోంది. ఒకవేళ.. ఏ కారణం లేకుండా ట్రాఫిక్ పోలీసులు.. పౌరుల వాహనం తాళం చెవిని లేదా డాక్యుమెంట్స్‌ను తీసుకుంటే ఆ దృశ్యాన్ని ఫొటో తీసి.. ట్రాఫిక్ పోలీసుల మీద ఫిర్యాదు చేసే హక్కునూ కల్పిస్తోందీ చట్టం. -
"మా తుఝే సలామ్" అని హోరెత్తిన లండన్ వీధులు
77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురసర్కరించుకుని యావత్ భారతదేశంలోనే గాదు విదేశాల్లో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు యూకేలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకి సంబంధించిన ఒక వీడియో ఆన్‌లైన్‌తో తెగ ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ సంగీత కళాకారుడు " మా తుఝే సలాం", 'సందేసే ఆతే హై' 'తేరీ మిట్టి' వంటి పాటలతో యూకేలోని భారతీయలును అలరించాడు. యూకే వీధులన్ని స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలతో సందడిగా మారాయి. యూకేలో ఈ వేడుకను భారతీయులు, పాకిస్తానీయులు కలిసి జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా బ్రిటీష్ సామ్రాజ్యం ముంగిటే ఈ వేడుకలను భారతీయులు పాకిస్తానీయులు ఘనంగా జరుపుకోవం మరింత విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగానే నెటిజన్ల అంతా ఈ స్వాతంత్య్ర దినోత్సవం అత్యంత విశేషమైనది. భారతీయుల దేశభక్తి పాటలతో యూకే వీధులు మారుమ్రోగాయి. భారతమాత బానిస సంకెళ్లను తొలగించుకుని స్వేచ్ఛవాయువులను పీల్చుకున్న ఈ శుభదినాన్ని రవి అస్తమించిన బ్రిటీష్ సామ్రాజ్యం ముందే సగర్వంగా జరుపుకోవడం అత్యంత సంతోషంగా ఉంది. ఇది అత్యంత భావోద్వేగకరమైన క్షణం అంటూ అక్కడున్న భారతీయులందర్నీ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Vish (@vish.music) (చదవండి: స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ స్వీట్ ఏంటో తెలుసా! ఎలా చేయాలంటే) -
విజయవాడ: సంక్షేమ శకటాలు.. సేవాపతకాల అందజేత(ఫొటోలు)
-
ఎర్రకోట వేడుకకు హాజరుకాని మల్లికార్జున ఖర్గే.. నెట్టింట వైరల్‌గా ఖాళీ కుర్చి
న్యూఢిల్లీ: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎగురవేశారు. అనంతరం ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని అతిథులు అందరూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దీంతో ఆయన కుర్చీ ఖాళీగా కనిపించింది. వేడుకకు ఆయన హాజరుకాకపోయినా.. ఖర్గే తన ట్విట్టర్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఓ వీడియో షేర్ చేశారు.అందులో.. గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, నేతాజీ, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజిని నాయుడు, అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. భారత దేశ తొలి ప్రధాని నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, నర్సింహారావు, మన్మోహన్ సింగ్, అతల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి చేసిన మేలు గురించి వివరించారు. ప్రతి ప్రధాని దేశ ప్రగతి కోసం ఎంతో కొంత సహకరించారని, కానీ ఈ రోజుల్లో కొందరు మాత్రం గత కొన్నేళ్లలోనే దేశం ప్రగతి సాధించినట్లు చెబుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు కొత్త విధానాలను వాడుతున్నారని, సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని, ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచారని, విపక్ష నోళ్లను మూయిస్తున్నారని, వాళ్ల మైక్‌లను లాగేసి సస్పెండ్ చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఇదిలా ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా మల్లికార్జున్ ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని కాంగ్రెస్ తెలిపింది. -
స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ స్వీట్ ఏంటో తెలుసా!
యావత్తు దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. ఈ సెలవురోజును త్రివర్ణ రంగులతో కూడిని తీపి వంటకాలతో మరింత ఆనందంగా వేడుక చేసుకోండి. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఓ ఐకానిక్ వంటకం గూర్చి తెలుసుకుందాం. దీన్ని వారణాసిలోని ఓ ప్రముఖ ఐకానిక్ షాప్ 1939లో తయారు చేసింది. ఆ షాపు వాళ్లు త్రివర్ణ రంగులతో కూడిన బర్ఫీ అనే స్వీట్‌ని దేశభక్తిని రగిల్చేందుకు తయారు చేశారు. అది బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించిందట. దీంతో ఈ స్వీట్ స్వాతంత్య్ర పోరాటంలో ప్రతికగా నిలిచిన ఐకానిక్ వంటకంగా పేరుతెచ్చుకుంది. ఏకంగా వంటకాలతో కూడా బ్రిటీషర్లను గడగలాడించిన ఘనత మన భారతీయులదే. స్వేచ్ఛ కోసం పరితపించిన అలానాటి త్యాగధనులను స్మరించుకుంటూ.. ఈ త్రివర్ణ బర్ఫీ స్వీట్ తయారీ ఎలాగో తెలుసుకుందామా!. తిరంగ్ బర్ఫీ తయారీ విధానం: కావల్సిన పదార్థాలు: పంచదార: వంద గ్రాములు పాలు: రెండు లీటర్లు యాలకుల పొడి - 5 గ్రా నెయ్యి - 50 గ్రా కుంకుమపువ్వు తగ్గింపు (కాషాయం రంగు కోసం) బచ్చలికూర పేస్ట్ (ఆకుపచ్చ రంగు కోసం) తయారీ విధానం: ఒక కడాయి తీసుకుని అందులో పాలు పంచాదార వేసి బాగా మరిగించాలి. సగం వరకు బాయిల్ అయ్యేలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి మిశ్రమం బాగా చిక్కబడుతుందనంగా యాలకుల పొడి వేయండి. ఆ తర్వత దించుకుని ఆ మిశ్రమాన్ని మూడు బాగాలుగా చేసుకుని ఒకదానిలో కుంకుమ పువ్వు రంగను మరొక దానిలో బచ్చలి కూర పేస్ట్‌ను వేయండి. ఇక మిగిలిన మూడో భాగం నెమ్మదిగా పరుచకుని దానిపై ఆ రెండు రంగుల భాగాలను పరుచుకోండి ఆ తర్వాత చక్కటి షేప్‌లో ముక్కలుగా కొయ్యండి. అంతే మదురమైన త్రివర్ణ బర్ఫీ రెడీ. (చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!) -
ఫోన్లలో మారుమోగుతున్న ‘హర్‌ఘర్ తిరంగా’
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుతున్నాయి. ఈ సందర్భంగా దేశ పౌరులు తమలోని దేశభక్తిని పలు రకాలుగా చాటుకుంటున్నారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలువురి ఫోన్లలో ‘హర్ ఘర్ తిరంగా' కాలర్ ట్యూన్ మారుమోగుతోంది. ఫోన్ చేసినప్పుడు హర్ ఘర్ తిరంగా సందేశం వినిపిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ హర్‌ఘర్ తిరంగా కాలర్ ట్యూన్ మోరుమోగింది. ఈ సారి కూడా పలువురికి ఫోన్ చేసినప్పుడు హర్‌ఘర్ తిరంగా కాలర్ ట్యూన్ వినిపిస్తోంది. త్రివర్ణ పతాకంతో దిగిన ఫొటోను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలనే సందేశం వినిపిస్తోంది. జాతీయ జెండాను ఎగురవేయడాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం చేస్తున్న ప్రచారంలో భాగంగా ఈ కాలర్ ట్యూన్లను మార్చారు. జెండా సందేశం తర్వాత హర్ ఘర్ తిరంగా థీమ్ సాంగ్‌కు సంబంధించిన చిన్న క్లిప్ ప్లే అవుతోంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు అత్యంత వైభవంగా జరుపుకునే 'హర్ ఘర్ తిరంగ' ఉద్యమంలో భారతీయులందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు. In the spirit of the #HarGharTiranga movement, let us change the DP of our social media accounts and extend support to this unique effort which will deepen the bond between our beloved country and us. — Narendra Modi (@narendramodi) August 13, 2023 -
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సెలబ్రిటీలు షేర్ చేసిన ఫోటోలు
► 100 జాతీయ జెండాలను పంచిన హీరోయిన నమిత ► జాతీయ జెండాతో రాశీ ఖన్నా ► స్వాతంత్య్ర దినోత్సవం రోజున బేబి సినిమా నుంచి మరో న్యూస్ ► వైట్ డ్రెస్‌లో జాతీయ జెండాతో హీరోయిన్ శ్రీలీల ► సైంధవ్ టీజర్‌ను పోస్ట్ చేసిన వెంకటశ్ View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) View this post on Instagram A post shared by Sunny Deol (@iamsunnydeol) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
హైదరాబాద్ : ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
‘ధన’ చరిత్ర! భారతీయ కరెన్సీ నోట్ల విశేషాలు తెలుసుకోండి..
భారతీయ కరెన్సీ సంవత్సరాలుగా మారుతూ వేగంగా అభివృద్ధి చెందింది. దేశ స్వాతంత్య్రానికి ముందే కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చినా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం గణతంత్ర రాజ్యంగా మారిన అనంతరం అనేక డినామినేషన్ల నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇప్పటివరకు భారతీయ కరెన్సీ నోట్లపై ఎవరెవరి చిత్రాలు కనిపించాయి? మొదటిసారిగా మహాత్మా గాంధీ చిత్రం ఎప్పుడు కనిపించింది? నోట్లపై ఏయే భాషలు ఎప్పుడు ముద్రించారు? నోట్ల రద్దు, ఉపసంహరణలు ఎప్పుడు జరిగాయి? వంటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం. వలసరాజ్యాల నుంచి స్వతంత్ర భారతదేశానికి కరెన్సీ నిర్వహణ బదిలీ సాఫీగానే జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది. అయితే, 1950 జనవరి 26న దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. కానీ అంతకు ముందు నుంచే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ నోట్లను జారీ చేయడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం రూపాయి నోటు కొత్త డిజైన్ని 1949లో తీసుకొచ్చింది. అప్పటికింకా స్వతంత్ర భారతదేశానికి నూతన చిహ్నాలను ఎంపిక చేయాల్సి ఉంది. నోట్లపై మొదట్లో ఉన్న రాజు చిత్రం స్థానంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని పెట్టాలని భావించారు. ఆ మేరకు డిజైన్లు కూడా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో గాంధీ చిత్రానికి బదులుగా సారనాథ్‌లోని లయన్ క్యాపిటల్ ఎంపికకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మొదటి నోట్లు ఇవే.. రిపబ్లిక్ ఇండియా మొదటిసారిగా 1950లో రూ. 2, రూ. 5, రూ.10, రూ.100 కరెన్సీ నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల రంగు, డిజైన్లలో స్వల్ప వ్యత్యాసం ఉండేది. అయితే రూ. 10 నోటు వెనుకవైపు ఉన్న షిప్ మోటిఫ్‌ను మాత్రం అలాగే కొనసాగించారు. 1953లో కొత్త నోట్లపై హిందీని ప్రముఖంగా ముద్రించారు. రూపాయ హిందీ బహువచనంపై చర్చ జరగడంతో రూపియేగా మార్చారు. 1954లో రూ. 1,000, రూ. 5,000, రూ.10,000 వంటి అధిక విలువ కలిగిన నోట్లు తిరిగి ప్రవేశపెట్టారు. 1946 నాటి నోట్ల రద్దు వంటి కారణాలతోనే 1978లో మరోసారి అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేశారు. రూ. 2, రూ.5 వంటి చిన్న డినామినేషన్ నోట్లను తీసుకొచ్చినప్పుడు ప్రారంభంలో ఆయా నోట్లపై పులి, జింక వంటి జంతువుల చిత్రాలను ముద్రించారు. 1975లో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారతదేశం చేస్తున్న కృషి తెలియజేసేలా రూ. 100 నోటుపై వ్యవసాయం, తేయాకు ఆకులు తెంపడం వంటి పనులకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు. మొదటిసారిగా గాంధీ చిత్రం 1960ల ఆరంభంలో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 1967లో నోట్ల సైజ్‌లను తగ్గించారు. కరెన్సీ నోట్లపై మొదటిసారిగా గాంధీజీ కనిపించింది ఈ కాలంలోనే. మహాత్మా గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 1969లో సేవాగ్రామ్ ఆశ్రమం వద్ద కూర్చున్న గాంధీ చిత్రాన్ని ముద్రించిన స్మారక డిజైన్ సిరీస్‌ను విడుదల చేశారు. నోట్ల ముద్రణా ఖర్చులు తగ్గించుకునేందుకు 1972లో రూ.20 నోట్లు, రూ. 1975లో రూ.50 నోట్లను ముద్రించింది భారత ప్రభుత్వం. 1980 దశకంలో పూర్తిగా కొత్త నోట్లను విడుదల చేశారు. ఈ నోట్లపై మూలాంశాలను పూర్తిగా మార్చేశారు. సైన్స్ & టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని తెలియజేసేలా రూ. 2 నోటుపై ఆర్యభట్ట చిత్రం, దేశ పురోగతిని చాటేలా రూ. 1 నోటుపై ఆయిల్ రిగ్, రూ. 5 నోటుపై ఫార్మ్ మెకనైజేషన్, రూ. 100 నోటుపై హీరాకుడ్ డ్యామ్ చిత్రాలను ముద్రించారు. అలాగే భారతీయ కళా రూపాలను ప్రదర్శించేలా రూ. 20 నోటుపై కోణార్క్ ఆలయ చక్రం, రూ. 10 నోటుపై నెమలి, షాలిమార్ గార్డెన్ చిత్రాలను తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ సిరీస్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీ నిర్వహణ భారంగా మారడంతో 1987 అక్టోబర్‌లో మహాత్మా గాంధీ చిత్రంతో రూ. 500 నోటును ప్రవేశపెట్టారు. అశోక పిల్లర్ లయన్ క్యాపిటల్ మాత్రం వాటర్ మార్క్‌గా కొనసాగింది. రిప్రోగ్రాఫిక్ టెక్నిక్‌లు అభివృద్ధి చెందడంతో నోట్ల సాంప్రదాయ భద్రతా లక్షణాలు బలహీనమయ్యాయి. దీంతో కొత్త ఫీచర్లను పరిచయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగా 1996లో కొత్త 'మహాత్మా గాంధీ సిరీస్'ను ప్రవేశపెట్టారు. కొత్త వాటర్‌మార్క్, విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్, గుప్త చిత్రం, అంధుల కోసం ఇంటాగ్లియో ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఇవే కొత్త ఫీచర్లతో 2000 అక్టోబర్ 9న రూ. 1000 నోట్లను కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2000 నవంబర్ 18న రూ. 500 నోట్ల రంగు మార్చారు. అదనపు భద్రతా ఫీచర్‌గా మధ్యలో ఉన్న సంఖ్యా విలువలో కలర్-షిఫ్టింగ్ ఇంక్‌ను చేర్చారు. మెరుగైన భద్రతా ఫీచర్లు 2005లో మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా రూ.100, అంత కంటే ఎక్కువ డినామినేషన్ నోట్లపై వైడ్ కలర్ షిఫ్టింగ్ మెషిన్ రీడబుల్ మాగ్నెటిక్ విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లను తీసుకొచ్చారు. 2005లో మొదటిసారిగా నోట్లపై ముద్రణ సంవత్సరం ప్రవేశపెట్టారు. సీక్వెన్స్‌ని నిర్వహించడానికి, అదే క్రమ సంఖ్యతో లోపభూయిష్టమైన నోట్లను మళ్లీ ముద్రించకుండా ఉండేందుకు 2006లో నోట్లపై “స్టార్ సిరీస్” ప్రవేశపెట్టారు. రూపాయి చిహ్నం (₹) భారత రూపాయి గుర్తింపు చిహ్నంగా 2011లో రూపాయి చిహ్నాన్ని (₹) ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి 2010లో భారత రూపాయికి ఒక విశిష్ట చిహ్నాన్ని (₹) లాంఛనప్రాయంగా రూపొందించాయి. 2011లో కొత్త రూపాయి చిహ్నాన్ని బ్యాంకు నోట్లు, నాణేలపై ముద్రించడం ప్రారంభించారు. నకిలీ నోట్ల బెడదను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కరెన్సీ నోట్ల భద్రతా ఫీచర్లను కాలానుగుణంగా అప్-గ్రేడేషన్ చేస్తుంటాయి. భారతదేశంలో అటువంటి అప్-గ్రేడేషన్ 2005లో జరిగింది. తర్వాత 2015లో అధిక డినామినేషన్లపై బ్లీడ్ లైన్లు, ఎక్స్‌ప్లోడింగ్ నంబర్లు వంటి కొన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు. రూ. 50, రూ. 20 నోట్లపై ఇంటాగ్లియో ప్రింటింగ్‌ను 2016లో ఆపేశారు. భారత ప్రభుత్వం 2015లో రూపాయి నోటును తిరిగి ప్రవేశపెట్టింది. మహాత్మ గాంధీ నూతన సిరీస్ ద్రవ్య సంస్కరణల్లో భాగంగా భారత ప్రభుత్వం 2016 నవంబర్‌లో రెండో సారి పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 500, రూ. 1,000 డినామినేషన్ల మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించింది. ఆ తర్వాత దేశ సాంస్కృతిక వారసత్వం , శాస్త్రీయ విజయాలను హైలైట్ చేస్తూ మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. ఒక్కో డినామినేషన్ నోటును ఒక్కో రంగు, సైజ్‌ల్లో రూపొందించారు. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 2000 నోటును 2017 ఆగస్టు 23న రూ. 200 నోటును కొత్తగా తీసుకొచ్చారు. కాగా రూ.2000 నోటును 2023 మే 19న చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇదీ చదవండి: Independence Day 2023: స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్ చరిత్ర -
తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: అన్ని రంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోంది. వివిధ పథకాల ద్వారా నేతన్నకు అండగా నిలుస్తున్నామన్నారు. మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా అమలు చేస్తున్నమని తెలిపారు. సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే వ్యవసాయరంగంతో పాటు.. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. దుక్కి దున్నిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటోందన్నారు. గత ప్రభుత్వాలు 200 వందల పెన్షన్ ఇస్తే కేసీఆర్ రూ. 2016, వికలాంగులకు 4016 ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హర్ ఘర్ జల్ యోజన పథకం ప్రారంభించామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నీతి అయోగ్ అభినందించిందని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అనే నినాదం నుంచి ఛలో పోదాం పదరా సర్కారు దవాఖానాకు అనేలా రోగులకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిచ్చిందని పేర్కొన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులపై 1 లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 సర్వేలో పారిశుధ్య విభాగంలో తెలంగాణాకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. చదవండి: తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం: సీఎం కేసీఆర్ -
ప్రతి ఒక్కరి గుండెల్ని తాకే దేశభక్తి పాటలు ఇవే
భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 15)న జరుపుకుంటుంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుంచి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నారు. అలా కొన్ని పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'తేరి మిట్టీ' -కేసరి కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఎంతో గొప్పగా రచించారు. ఈ పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ పాటను 1బిలియన్కు పైగా వీక్షించారు. 'మేమే ఇండియన్స్' - ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు. 'ఎత్తరా జెండా' - RRR విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్‌లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. 'దేశం మనదే తేజం మనదే' - జై తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు. 'పాడవోయి భారతీయుడా' -వెలుగు నీడలు 'పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా' అంటూ మహాకవి శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున మార్మోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన 13 ఏళ్ల తరువాత అక్కినేని నాగేశ్వరరావు 'వెలుగు నీడలు' చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను పి.సుశీల , ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి 60 సంవత్సరాలు గడిచినా నేటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. 'పుణ్యభూమి నాదేశం' -మేజర్ చంద్రకాంత్ ఇక ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట. మేజర్ చంద్రకాంత్ మూవీలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి'. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావున త్యాగాలను గుర్తు చేస్తూ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈపాటకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. 'వినరా.. వినరా' రోజా ఏ.ఆర్ రెహమాన్ దేశభక్తి గీతాలు యూత్‌లో దేశభక్తిని రగిల్చాయి. రోజా చిత్రంలో వినరా.. వినరా.. దేశం మనదేరా అంటూ రాజశ్రీ రాసిన పాటతోపాటు.. మా తేఝే సలాం వందేమాతరం అంటూ రెహమాన్ పాడిన పాట సంచలనం అయ్యింది. -
పేదలు గెలిచి, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు 68 శాతం మంత్రి పదవులు కల్పించినట్లు వెల్లడించారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్. అనంతరం ప్రసంగించారు. శాసన సభ స్పీకర్‌గా బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీని నియమించినట్లు చెప్పారు. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం నవరత్నాల పాలన ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం నవరత్నాల పాలన అని సీఎం జగన్ పేర్కొన్నారు. 99.05శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. 50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి చేరుకగా.. 2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. పంట నష్టపోతే ఆ సీజన్లో పరిహారం అందిస్తున్నామన్నారు. ఆక్వా జోన్లలో ఉన్న రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తున్నమని చెప్పారు. పాల రైతుల కోసం పాలవెల్లువ కార్యక్రమం తీసుకొచ్చామని.. పాల ధర లీటర్‌కు రూ. 10 నుంచి రూ. 22 వరకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ప్రారంభమైనట్లు సీఎం తెలిపారు. భోగాపురం అంతార్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరసగా మూడేళ్లు ఏపీనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రానికి రూ. 67,196 కోట్ల పెట్టుబడులు రాగా.. కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ. 13.42 లక్షల కోట్లకు ఎంవోయూలు చేసుకున్నామని, కొత్తగా ప్రారంభమైన ఎంఎఎస్‌ఎంఈ యూనిట్లు 2,00,995 అని చెప్పారు. చదవండి: పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడమూ అంటరానితనమే: సీఎం జగన్ విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మారగా.. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగీష్ మీడియం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానం.. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నామన్నారు. భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన అందిస్తున్నామని.. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అమలు చేస్తున్నామని చెప్పారు. డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్ పోస్టుల భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించాం. పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం అంటరానితనమేనన్నారు సీఎం జగన్. పేదలు ఇంగ్లీష్ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే, పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే, పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే, పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమే, పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధంనని స్పష్టం చేశారు. 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ చేసినట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నామని, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు చేసినట్లు చెప్పారు. చదవండి: Independence Day 2023: వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించిందని.. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. రాష్ట్రంలో 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని చెప్పారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తెచ్చామని.. పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చామన్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నామన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని.. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని, అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నామని తెలిపారు. శరవేగంగా పోలవరం పనులు డివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. 2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశామని.. రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. సామాజిక న్యాయం నినాదం కాదు.. దాన్ని అమలు చేసి చూపామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పిచినట్లు చెప్పారు. వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయం అర్హులందరికీ పథకాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నామని.. విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందిస్తూ, రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని.. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 98.5 శాతం వాగ్దానాల అమలు పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. 98.5 శాతం వాగ్దానాలను అమలు చేశామన్నారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామని తెలిపారు. మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశామని అన్నారు. భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టామని చెప్పారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సూపర్ పవర్‌గా భారత్!
ఇటీవలి కాలంలో భారతదేశానికి చైనా ప్రధాన భద్రతా ముప్పుగా పరిణమించింది. చైనా.. పాకిస్తాన్‌తో జతకట్టి, భారత్‌కు ఆందోళనకరంగా మారింది. చైనా తన సరిహద్దుల్లో భారత్‌తో తలపడుతున్న ఘర్షణల ఫలితంగా ఈ రెండు దేశాలు ప్రత్యర్థులుగా మారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్- భారత్ మధ్య వ్యూహాత్మక ప్రయోజనాల కలయిక భారత్‌కు మరింత శక్తిని అందించనుంది. ఇటీవల భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను నియంత అని అభివర్ణించారు. సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగంలో యూఎస్ భాగస్వామ్యం ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అటు బైడెన్ లేదా ఇటు మోదీ తమ భాగస్వామ్యం ప్రధానంగా చైనా సవాళ్లను ఎదుర్కోవడం గురించేనని ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. కానీ ఈ భాగస్వామ్యం ఇందుకేనని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్.. అగ్రరాజ్యం అమెరికా తమ సంబంధాలను బలపరు కోవడం చూస్తుంటే ఇది భారత్‌కు చైనాను ఎదుర్కొనేందుకు కలసివచ్చే అంశంలా కనిపిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. ఆమధ్య భారత జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పర్యటన చైనా గురించి కాదని, అయితే సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగంలో చైనా పాత్రకు గురించిన ప్రస్తావన ఎజెండాలో ఉన్నదన్నారు. భారత్- అమెరికా మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందాలలో భారతదేశంలో జనరల్ ఎలక్ట్రిక్ ఫైటర్-జెట్ ఇంజిన్ల తయారీ, జనరల్ అటామిక్స్ సాయుధ డ్రోన్ల కొనుగోలు ప్రముఖంగా ఉన్నాయి. వీటి సాయంతో భారత్ చైనా సైన్యం ఎత్తుగడలను గుర్తించి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోనుంది. ఇది కూడా చదవండి: ‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం! రాబోయే 30 ఏళ్లలో.. భారత్- అమెరికాల బిలియన్-డాలర్ల జీఈ డీల్‌లో అత్యాధునిక జెట్ ఇంజన్ టెక్నాలజీ ఒకటి. ఈ భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల రక్షణ పరిశ్రమల సామర్థ్యాన్ని మరింత పెంపొందించనుంది. యుఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ సీనియర్ నిపుణుడు సమీర్ లాల్వానీ మాట్లాడుతూ ‘ఇది ప్రతిష్టాత్మక సున్నితమైన సాంకేతికత అని, దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్ డిమాండ్ చేస్తోందని అన్నారు. ఇది భవిష్యత్తులో అనేక తరాల జెట్ ఇంజిన్ల తయారీకి దారి తీస్తుందన్నారు. రాబోయే 30 సంవత్సరాలలో భారతదేశ రక్షణ రంగం, ఆవిష్కరణ అభివృద్ధిలో ఈ భాగస్వామ్యం కీలకం కానున్నదని పేర్కొన్నారు. టెక్ స్టార్టప్‌లు పుష్ చేసే దిశగా భారత్ కొన్ని దశాబ్దాలుగా సైనిక ఆధునికీకరణలో నిమగ్నమై ఉన్న చైనాతో పోటీ పడాలంటే, భారత్‌లోని టెక్ స్టార్టప్‌లను ఎలా పుష్ చేయాలో, తద్వారా సైనిక స్థాయిలో ఎలా సాంకేతికతలను రూపొందించాలనే దానిని మోదీ ప్రభుత్వం గుర్తించిందని యుఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ ఒక కథనంలో పేర్కొంది. సాంకేతికత, రక్షణ సహకారానికి ఉన్న అడ్డంకులను తొలగించడమనేది ప్రధాని మోదీ పర్యటనలో చోటుచేసుకున్న ప్రధాన అంశమని ఆ కథనంలో పేర్కొన్నారు. వివరాలు వెల్లడించిన వాషింగ్టన్ పోస్ట్ కరోనావైరస్ మహమ్మారి సమయంలో సుమారు మూడు సంవత్సరాలు ప్రపంచం నుండి తనను తాను వేరుచేసుకున్న చైనా తిరిగి ఇప్పుడు తన పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా 2014 నుండి 2018 వరకు మోదీకి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ సైనిక పరికరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించే దీర్ఘకాల ప్రయత్నంలో భాగంగానే భారత్.. అమెరికాతో జీఈ ఒప్పందం చేసుకున్నదన్నారు. ప్రస్తుతం బ్రౌన్ యూనివర్శిటీలో సీనియర్ ఫెలోగా ఉన్న సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలను ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. అమెరికాతో కుదిరిన చిప్ ప్లాంట్, డిఫెన్స్ ఒప్పందాలు రక్షణ రంగంలో తయారీలను పునరుద్ధరించే లక్ష్యాన్ని పూర్తి చేయనున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే రాయితీలను కల్పించే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహమ్మారి సమయంలో పెట్టుబడిదారులకు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. హిమాలయ సరిహద్దుల్లో ఘర్షణలు అమెరికా పరిపాలన అధికారులు భారతదేశం తమకు ప్రధాన ఆర్థిక, సైనిక భాగస్వామిగా చేరడంపై సంతృప్తిగా ఉన్నారు. ఇది చైనాకు వ్యతిరేకంగా ఇండో-పసిఫిక్‌లో పోషించగల వ్యూహాత్మక పాత్రను స్పష్టం చేస్తున్నదంటున్నారు. కాగా గత దశాబ్దం కాలంగా భారతదేశానికి చైనా ముప్పుగా పరిణమించింది. 2020 నుండి ఇరు దేశాలు తమ హిమాలయ సరిహద్దుల గురించి ఘర్షణపడుతున్నాయి. ఈ ఘర్షణల్లో 20 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. 1962 యుద్ధం తర్వాత చైనాపై భారతదేశవాసుల అభిప్రాయంలో మార్పు వచ్చింది. చైనాను వ్యతిరేకించేవారి సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 100కి పైగా చైనీస్ యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ను కూడా నిషేధించింది. చైనాను అధిగమించి.. మీడియాతో మాట్లాడిన భారత జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ భారత్- అమెరికాల భాగస్వామ్యం రక్షణ రంగంలో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందన్నారు. భారతదేశం తన స్వయంప్రతిపత్తిని సంరక్షించుకుంటూనే, అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపేతం చేసుకుంటున్నదన్నారు. పరిస్థితులన్నింటినీ గమనిస్తే భారత్ రాబోయే కాలంలో చైనాను అధిగమించి సూపర్ పవర్ కానున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్1 ప్రయోగం! -
విజయవాడ: జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ కింద రూ. వెయ్యి కోట్లు : సీఎం కేసీఆర్
►సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణది 15 స్థానం ఉండగా.. ప్రస్తుతం వరి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానం కోసం పోటీ పడుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తూ.. రైతులు 3 గంటల కరెంట్ చాలన కొందరు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. ►ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి గృహలక్షి పథకం ►రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉచిత మంచినీరు అందిస్తున్నాం ►దళితబంధు దేశానికే దిక్సూచిగా నిలిచింది ►నేతన్నల కోసం తెలంగాణ మగ్గం పేరుతో కొత్త పథకం ►ఆసరా పెన్షన్లకు రూ.2016కు పెంచాం ►ఆర్టీసీ బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టాం ►ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం ►సింగరేణలో రూ.12వేల కోట్ల టర్నోవర్‌ను 30 వేల కోట్లకు పెంచాం ►సింగరేణిలో కార్మికులకు ఈ సారి దసరా, దీపావళి బోనస్ కింద రూ. వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు ► జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ..హైదరాబాద్‌లో నేటి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రూ.37 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, పోడు సమస్యకు పరిష్కారం చూపించడంతో పాటు తెలంగాణలో తాగునీటి సమస్య లేకుండా చేశామని చెప్పారు. రాష్ట్రం ప్లోరోసిస్ రహితంగా మారిందని కేంద్రమే ప్రకటించిందన్నారు. ►సమైక్య పాలనతో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. ►రాష్ట్ర సాగునీటి రంగంలో స్వర్ణయుగం నడుస్తోందని అన్నారు. 44 లక్షల మందకి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ► స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు చేరుకున్న సీఎం కేసీఆర్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్కగచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండకు చేరుకుంటారు. అనంతరం ఆ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. -
2047 నాటికి మన దేశమే నంబర్ వన్
హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన 2047 నాటికి భారత్‌ను నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణిస్తూ రాజకీయాలకతీతంగా దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగం, పేదరికం లేనటువంటి దేశంగా అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు ఆధ్వర్యంలో సోమవారం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయం వద్ద తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారిలో వెలుగులోకి రానివారి జీవిత చరిత్రను, ఆధ్యాత్మికమైన ప్రముఖ వ్యక్తుల చరిత్రను రేపటి తరానికి అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గత ఏడాది దేశంలో 25 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేశారని, అదే స్ఫూర్తితో ఆగస్టు 15, జనవరి 26న ప్రతి భారతీయుడి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. 75 మీటర్ల జాతీయ జెండాతో బర్కత్‌పురా చమన్ నుంచి కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ విగ్రహాం వరకు తిరంగా ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి జి.కావ్యారెడ్డి, బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి, నీరజ, కార్పొరేటర్లు బి.పద్మ వెంకట్‌రెడ్డి, కన్నె ఉమారమేష్ యాదవ్, వై.అమృత, పార్టీ నేతలు అట్లూరి సుభాషిణి, కృష్ణాగౌడ్, ఎ.సూర్యప్రకాష్ సింగ్, ఎడెల్లి అజయ్ కుమార్, సి.నందకిషోర్ యాదవ్, సి.వినోద్ యాదవ్, వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా, చైనా తర్వాత భారతదేశమే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాధిపతులు, క్యాబినెట్ మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ముఖ్య అతిధులు హాజరయ్యారు. వరుసగా పదోసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం ప్రారంభానికి ముందు రాజ్ ఘాట్ వద్ద స్వాతంత్య్ర సమరయోధలకు నివాళులు అర్పించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకల కావడంతో జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. #WATCH | PM Narendra Modi says, "...I firmly believe that when the country will celebrate 100 years of freedom in 2047, the country would be a developed India. I say this on the basis of the capability of my country and available resources...But the need of the hour is to fight… pic.twitter.com/IbODcqlW6b — ANI (@ANI) August 15, 2023 దేశ ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మొదటగా మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ దేశం స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు. వారందరి త్యాగఫలమే ఈ స్వాతంత్య్రం. ఈ సందర్బంగా ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని గడిచిన పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. #WATCH | PM Modi speaks on dynastic politics during his Independence Day speech "Today, 'parivarvaad' and appeasement has destroyed our country. How can a political party have only one family in charge? For them their life mantra is- party of the family, by the family and for… pic.twitter.com/xxmumTCc4Z — ANI (@ANI) August 15, 2023 ఈ పదేళ్లలో భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. శాటిలైట్ రంగంలో దూసుకుపోతున్నాం, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తోంది. 30 ఏళ్ల లోపు యువతే భారత్‌కు దిశానిర్దేశం చేయాలి. సాంకేతికంగానే కాదు వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందుతోందని అన్నారు. నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలమని భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు అంశాలు భారత దేశానికి ఎంతో ముఖ్యమైనవి. టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడి డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోన్నట్లు తెలిపారు. క్రీడా రంగంలో సైతం యువత ప్రపంచ పాఠం మీద తన సత్తా చాటుతోంది. అలాగే సాంకేతికంగా స్టార్టప్స్ రంగంలో భారత్ టాప్-3లో ఉంది. ఇక ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక జీ-20 సమావేశానికి ఆతిధ్యమిచే అరుదైన అవకాశం భారత్‌కు లభించిందని అన్నారు. #WATCH | PM Narendra Modi says, "In 2019, on the basis of performance, you blessed me once again...The next five years are for unprecedented development. The biggest golden moment to realise the dream of 2047 is the coming five years. The next time, on 15th August, from this Red… pic.twitter.com/PtwL73Sahg — ANI (@ANI) August 15, 2023 కేవలం అవినీతి రాక్షసి వలననే దేశం వెనక్కు వెళ్లిందని అందుకే ప్రజలు సుస్థిరమైన అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని.. పీఎం సహాయనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సైన్యంలో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేస్తూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నామని దేశ ఆర్థిక వ్యవస్త బాగుంటేనే దేశం బాగుంటుందని రూ. 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించామని రూ. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చినట్లు తెలిపారు. #WATCH | ..."Chalta chalata kaal chakra, Amrit kaal ka bhaal chakra, sabke sapne apne sapne, panpe sapne saare, dheer chale veer chale, chale yuva humare, neeti sahi reeti naayi, gati sahi raah nayi, chuno chunauti seena taan, jag mein badhao desh ka naam..." PM Modi on 77th… pic.twitter.com/o6KUmBe0Mt — ANI (@ANI) August 15, 2023 కరోనా లాంటి అక్షిత సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత దేశం దిక్సూచిగా మారింది. కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలమని ప్రతి నిర్ణయంలో దేశ ప్రగతికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకురావడంతో అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోందన్నారు. ఇక వైద్య రంగానికి వస్తే జన ఔషధితో ప్రజలందరికీ చౌకగా మందులు అందజేస్తున్నామని, అందుకు వీలుగా జన ఔషధి కేంద్రాల సంఖ్య 10 వేల నుంచి 25 వేలకు పెంచామన్నారు. జన్‌ధన్ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపామని తెలిపారు. #WATCH | ..."Chalta chalata kaal chakra, Amrit kaal ka bhaal chakra, sabke sapne apne sapne, panpe sapne saare, dheer chale veer chale, chale yuva humare, neeti sahi reeti naayi, gati sahi raah nayi, chuno chunauti seena taan, jag mein badhao desh ka naam..." PM Modi on 77th… pic.twitter.com/o6KUmBe0Mt — ANI (@ANI) August 15, 2023 మారుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ను అందుబాలోకి తీసుకువచ్చామని వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత దేశమే ఉంటుందని భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు. ఇది కూడా చదవండి: అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ -
Independence Day 2023: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడమూ అంటరానితనమే: సీఎం జగన్
LIVE UPDATES: ► స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ పోలీసులకు మెడల్స్ ప్రదానం చేసిన సీఎం జగన్ ►అధికారులకు మెడల్స్ ప్రదానం చేసిన సీఎం జగన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ ప్రసంగం ►రాష్ట్రంలో కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు ►రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులు రూ. 67, 196 కోట్లు ►గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ. 13. 42 లక్షల కోట్లకు ఎంవోయూలు ►కొత్తగా ప్రారంభమైన ఎంఎస్ఎంఈ యూనిట్లు 2,00,995 ►శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా ఏపీ ►139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పోరేషన్లు ►50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి ►2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ►రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ప్రారంభం ►భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయి ►ఈజ్ ఆఫ్ డూయింగ్బిజినెస్లో వరుసగా మూడేళ్లు మనమే నంబర్‌వన్ ►పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం అంటరానితనమే ►పేదలు ఇంగ్లీష్ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే ►పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే ►మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశాం ►విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నాం ►నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్పు ►గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగీష్ మీడియం అమలు ►3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానం ►ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నాం ►భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన ►రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అందిస్తున్నాం ►డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్సమెంట్ ►ట్రిపుల్ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్ పోస్టుల భర్తీ ►వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ ►రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నాం ►108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు ►పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే ►పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమే. ►పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం ►పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చాం ►98.5 శాతం వాగ్దానాలను అమలు చేశాం ►పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశాం ►మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశాం. ►భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టాం ►వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం ►వడివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయి. ►2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి ►వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశాం ►రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతాయి. ►సామాజిక న్యాయం నినాదం కాదు.. దాన్ని అమలు చేసి చూపాం. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత. ►వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. ►కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. ►అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించాం. ►అర్హులందరికీ పథకాలు అందించేందుకు ఏర్పాట్లు. ►రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నాం. ►విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నాం. ►రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు. ►రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నాం. ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం. ►ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. ►అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నాం ►గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చాం ►సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నాం. ►2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించాం. ►ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు ►స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోంది: సీఎంజగన్ ►76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించింది. ►వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించింది. ►50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం. ►గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తెచ్చాం. ►పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగాం. ►గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చాం ►రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన ►పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్ ► ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ►జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్ ►సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్ ► కాసేపట్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకోనున్న సీఎం జగన్. ►జాతీయ జెండాను ఎగురవేయనున్న సీఎం జగన్ ►రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ►రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన ►సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం ►సాయంత్రం 5.30 ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్ ►స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. ►విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహించనున్న ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం ►ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం జగన్ ►ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించనున్నాయి. -
స్వాతంత్య్ర వేళ పాకిస్తాన్‌కు ఘోర అవమానం
దుబాయ్: ఏదైనా దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటే వారికి శుభాకాంక్షలు చెబుతూ బుర్జ్ ఖలీఫాపై ఆ దేశపతాకాన్ని గౌరవ ప్రదర్శనగా లైట్లతో ప్రదర్శించడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో భారత దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ బుర్జ్ ఖలీఫాపై భారత జెండా ఆవిష్కృతమైంది. భారత దేశానికి ఒక రోజు ముందుగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న పాకిస్తాన్ తమ జెండా కూడా ప్రదర్శిస్తారేమోనని భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు పాకిస్తానీయులు. కానీ వారిని నిరాశ పరుస్తూ వారి జెండాను అక్కడ ఆవిష్కరించలేదు. నిరాశ చెందిన పాకిస్తానీయులు దుబాయ్ అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆగస్టు 15, భారత దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోన్న వేళ దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై లైట్ల వెలుగు జిలుగులతో భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ అంతకు ముందు రోజున భారతదేశం లాగే పాకిస్తాన్ జెండా కూడా ప్రదర్శిస్తారేమోనని భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు పాకిస్తానీయులు. కానీ వారిని నిరాశ పరుస్తూ వారి జెండాను ఆవిష్కరించలేదు. దీంతో నిరాశ చెందిన పాకిస్తానీయులు బుర్జ్ ఖళీఫా అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వేళా సంఖ్యలో వచ్చి బుర్జ్ ఖలీఫా వద్ద గుమికూడిన పాకిస్తాన్ దేశీయులు 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఒక పాకిస్తానీ మహిళ మాట్లాడుతూ.. ఇప్పుడు సమయం 12.01, కానీ బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జెండాను ఆవిష్కరించడం లేదని దుబాయ్ అధికారులు తెలిపారు. ఇప్పుడిది మాకు పరువు సమస్యగా మారింది. అక్కడితో ఆగకుండా వేలాది సంఖ్యలో పాకిస్తానీయులు ఇక్కడ చేరి నినదిస్తున్నారు.. అయినా కూడా వారు పట్టించుకోవడంలేదు. ఇది పాకిస్తాన్ దేశాన్ని అవమానించడమేనని అన్నారు. A Pakistani lady narrates, How Pakistan flag didn't show up on Burj Khalifa on their Independence day😂😂🤣🤣 pic.twitter.com/WNbEOetANL — Gems of Politics (@GemsOf_Politics) August 14, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు చిరుద్యోగిని -
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా భారత ప్రధాని 'X(ఒకప్పటి ట్విట్టర్)' వేదికగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించి వారు కన్నా కళలను సాకారం చేతియడానికి కృషి చేయాలన్నారు. ఎర్రకోటపై వరుసగా పదోసారి జాతీయా జెండాను ఆవిష్కరించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ కార్యక్రమానికి ముందే సోషల్ మీడియాలో భారత్ ప్రజానీకానికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ట్వీట్ చేస్తూ ఏమని రాశారంటే.. " అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు నా ఘానా నివాళులు. వారు కన్న కలలను సాకారం చేయడానికి మనవంతుగా నిబద్ధతతో కలిసి కృషి చేద్దాం. జై హింద్." అని రాశారు. आप सभी को स्वतंत्रता दिवस की अनेकानेक शुभकामनाएं। आइए, इस ऐतिहासिक अवसर पर अमृतकाल में विकसित भारत के संकल्प को और सशक्त बनाएं। जय हिंद! Best wishes on Independence Day. We pay homage to our great freedom fighters and reaffirm our commitment to fulfilling their vision. Jai Hind! — Narendra Modi (@narendramodi) August 15, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్–3కి నాలుగోసారి కక్ష్య తగ్గింపు -
Independence Day 2023: వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని
Updates ఎర్రకోటలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ ►2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం ►2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ►దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయి ►దేశంలో తీవ్రవాదం, నక్సలిజం తగ్గాయి ►భారత్ ఇప్పుడు సురక్షితంగా ఉంది ►ప్రపంచానికి మిత్రుడిగా భారత్ మారింది ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►దేశాభివృద్ధే కాదు.. ప్రపంచాభివృద్ధిని కూడా భారత్ కోరుకుంటోంది ►మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ల శిక్షణ ►దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ను అందుబాలోకి తీసుకువచ్చాం ►వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుంది ►ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత్ ఉంటుంది ►భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది ►జన ఔషధితో ప్రజలందరీ చౌకగా మందులు ►జన ఔషధి కేంద్రాల సంఖయ 10 వేల నుంచి 25 వేలకు పెంచాం ►జన్‌ధన్ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం ►మారుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించాం ►భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం ►ప్రతి నిర్ణయంలో దేశానికి మొదటి ప్రాధాన్యత ►దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. ►గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకుచవచ్చాం ►అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోంది. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతోంది. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుంది. ►క్రీడా రంగంలో యువత సత్తా చాటుతోంది. ►స్టార్టప్స్ రంగంలో టాప్-3లో భారత్ ఉంది. ►జీ-20 నిర్వహించే అరుదైన అవకాశం భారత్‌కు లభించింది. ►కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. ►కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారింది ►కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ►ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. ►ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నాం ►దేశ ఆర్థిక వ్యవవస్త బాగుంటే దేశం బాగుంటుంది. ►రూ, 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించాం. ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ►పీఎం స్వనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశాం ►సైన్యంలో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేశాం ►అవినీతి రాక్షసి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లింది ►ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ►సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ►దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. ►డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు భారత్‌కు ఎంతో ముఖ్యం ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం ►భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉంది. ►టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడింది. ►డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోంది. ►గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ►శాటిలైట్ రంగంలో మనమే ముందున్నాం. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్తిఉంది. ►30 ఏళ్ల లోపు యువత భారత్‌కు ఆశాకిరణం. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ ►ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ►దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. ►అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం ►ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంది: ప్రధాని మోదీ ►మణిపూర్‌లో శాంతిస్థాపనకు కృషి చేస్తున్నాం. ►మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ► ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ ► గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ ►పూలవర్షం కురిపించిన హెలికాప్టర్లు ► ఎర్రకోటపై వరుసగా పదోసారి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎర్రకోటపై పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ►ఈ స్వాతంత్ర్య దినోత్సవంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ముగియనున్నాయి. ►ఆ తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. సామాన్యులే అతిథులు ►దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు ►10 వేల మంది పోలీసులతో నాలుగు అంచెల భద్రత.. భద్రత కోసం 1000 సెక్యూరిటీ కెమెరాలు ►దేశ వ్యాప్తంగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం ►ఢిల్లీలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు ►కాసేపట్లో ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని ►రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధాని మోదీ ►వరుసగా పదోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. ►2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆయన చివరి ప్రసంగం కానుంది. ►ఈ వార్షిక ప్రసంగంలో ప్రధాని మోదీ తన ప్రభుత్వ ప్రగతి రిపోర్టు, కీలక కార్యక్రమాలను ప్రకటించడంతోపాటు రానున్న సంవత్సరాల్లో దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారో కూడా వివరిస్తారు. ►2014 మొదలుకొని వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను ప్రధాని ప్రకటించనున్నారు. రాజకీయ పరమైన అంశాలను కూడా ఆయన స్పృశిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. -
కంబదూరుకు చెందిన ఓబయ్య..
కళ్యాణదుర్గం: కంబదూరుకు చెందిన ఓబయ్య.. అదే గ్రామంలోని పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించి 1937లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కంబదూరులో 70 మంది హరిజనులను సమీకరించి పాఠశాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, పెడబల్లి చిదంబరరెడ్డి, విద్వాన్ విశ్వం, గుత్తి రామకృష్ణ తదితరులతో కలసి స్వాతంత్య్ర ఉద్యమంలోకి కాలు పెట్టారు. అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓబయ్య చేసిన ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఓబయ్య టీచర్ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. 1942లో బ్రిటీష్ ప్రభుత్వం అణచివేత ఎక్కువ కావడంతో కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే ఏడాది ఆగస్టు 25న ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఓబయ్యను బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి, అనంతపురం సబ్‌జైలుకు తరలించింది. క్షమాపణకు ఓబయ్య నిరాకరించడంతో బళ్లారి సబ్‌జైలుకు తరలించారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత 1972–78 మధ్య కాలంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఓబయ్య ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేశారు. అంతకు ముందు ఆర్డీఓ అధ్యక్షతన సమితి ఉపాధ్యక్షుడిగా, కంబదూరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. నరసింహమై గర్జించాడు అనంతపురం కల్చరల్: ‘క్షమాపణ చెప్పు నిన్ను వదిలేస్తాం. లేదంటే 27 కొరడా దెబ్బలు, ఆరు నెలల కఠిన కారాగార శిక్ష తప్పదు’ అని తీవ్రంగా హెచ్చరించిన పోలీసుల ముందు ఆత్మగౌరవాన్ని ప్రదర్శించిన కాటప్పగారి నరసింహారెడ్డిది అనంతపురం రూరల్ మండలం పూలకుంట గ్రామం. 1921 జని్మంచిన ఆయన మదనపల్లిలో ఎస్ఎస్ఎల్సీ చదువుకుంటున్న రోజుల్లో మహాత్ముడి ప్రసంగాలతో చైతన్యం పొంది స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చారు. బ్రిటీష్ పాలకులకు కొరకరాని కొయ్యగా మారారు. తమ గ్రామంలో హరిజన వాడకు 7 ఎకరాల సొంత భూమిని దానంగా ఇచ్చారు. ప్రాథమిక వైద్య కేంద్రం, పాఠశాలకు భూములు దానమివ్వడమే కాకుండా అనేక ఆలయాలకు సొంత భూమిని విరాళంగా అందజేశారు. గాందీజీ మాటే శిరోధార్యంగా రాయదుర్గం టౌన్: గాం«దీజీ మాటే శిరోధార్యంగా స్వాతంత్య్ర ఉద్యమంలో రాయదుర్గం వాసులు ప్రధాన భూమికను పోషించారు. వరదా చెన్నప్ప, తిప్పయ్య, గురుమాల్ నాగభూషణం, డాక్టర్ ఆర్.నాగన్నగౌడ్, ఓబుళాచార్యులు, కెరె శరణప్ప, ఎన్సీ శేషాద్రి, జగన్నాథసింగ్, నిప్పాణి రంగరావు, వై.హెచ్.సుబ్బారావు, వై.హెచ్.సత్యభామాదేవి, మోపూరు చంద్రకాంతనాయుడు, నాగిరెడ్డిపల్లి నివాసి కట్టరావుప్ప.. తదితరులు స్వాతంత్య్రోద్యమంలో పాలు పంచుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అరెస్ట్ అయి మూడు నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో రాయదుర్గం నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా గురుమాల్ నాగభూషణం పనిచేశారు. త్యాగధనుల గుర్తుగా 74 ఉడేగోళంలో స్మారక స్తూపాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్యమకారుల ఆకలి తీర్చి రాయదుర్గం: జాతిపిత మహాత్మా గాంధీ బాటలో నడిచి గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డికి చెందిన దామోదర్‌సింగ్ జైలు జీవితం అనుభవించారు. 1918లో జని్మంచిన ఆయన 1942లో క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. వంటలు చేయడంలో సిద్ధహస్తుడైన ఆయన రుచికరమైన ఆహార పదార్థాలు చేసి ఉద్యమకారుల ఆకలి తీర్చేవారు. 2000వ సంవత్సరంలో ఆదోని వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోరాటం విలక్షణం అనంతపురం కల్చరల్: అనంత స్వాతంత్య్ర సమరయోధుల్లో చిరస్మరణీయ పాత్ర పోషించిన వారిలో వేములేటి ఆదిరానాయణరెడ్డి ఒకరు. శ్రీసత్యసాయి జిల్లా గుట్టూరు మండలం చిన్నప్పరెడ్డి పల్లిలో జని్మంచిన ఆయన కొత్తచెరువు మండలం లోచర్లలో స్థిరపడ్డారు. బాల్యంలో పెనుకొండలో విద్యనభ్యసించే సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ తరఫున అనేక సత్యాగ్రహాలు, ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. తర్వాతి రోజుల్లో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి స్వాతంత్య్ర ఉద్యమంలోకి కాలు పెట్టారు. 1941లో పోలీసులు అరెస్ట్ చేసి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. -
థార్ జీప్ బీభత్సం.. ఇద్దరు రిజర్వు కానిస్టేబుళ్ల దుర్మరణం
మైసూరు: మైసూరు నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం చెందారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో బైక్‌ను థార్ జీప్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రాష్ట్ర రిజర్వు పోలీసు విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు మహేశ్ (23), అమర్నాథ్ (24) అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని కుంబార కొప్పళకు చెందిన పి మహేశ్, బీజాపుర జిల్లా జమఖండి తాలూకాకు చెందిన అమరనాథ్‌లు ఐదో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు రాత్రి 10.30 గంటల సమయంలో నగరంలోని సిద్ధార్థ లేఔట్ సమీపంలోని ఫుడ్‌స్ట్రీట్‌లో భోజనం చేసి పల్సర్ బైక్‌లో కేఎస్ఆర్పీ బెటాలియన్ కేంద్రానికి బయలుదేరారు. నగరంలోని లలిత్ మహల్ హోటల్ సమీపంలో ఎదురుగా వచ్చిన థార్ జీప్ వీరి బైక్‌ను వేగంగా ఢీకొంది. దాదాపు పది మీటర్ల వరకు వారిని లాక్కెళ్లింది. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. థార్ జీప్ నడిపిన వ్యక్తి పారిపోయాడు. సిద్దా నగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Independence Day 2023: మేరా భారత్ మహాన్
దేశం అనగానే భారతీయ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయిపోతారు. సరైన దేశభక్తి సినిమా వస్తే సూపర్ డూపర్ హిట్ చేసి భావోద్వేగంతో ఊగిపోతారు. బాలీవుడ్లో మంచి మంచి దేశభక్తి సినిమాలు వచ్చాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన 10 దేశభక్తి సినిమాలు.. హకీకత్ (1964): దేశాల మధ్య యుద్ధాలు వస్తే సైనికుల వీరోచిత పోరాటాలు, త్యాగాలు తప్పనిసరి. వాటిని చూపుతూనే యుద్ధాలు ఎలా సగటు సైనికుడి ్రపాణాలు బలిగొంటాయో కూడా చూపిన సినిమా హకీకత్. 1962 నాటి ఇండో చైనా యుద్ధం మీద వచ్చిన ఈ సినిమా అతి తక్కువ మంది భారత సైనిక పటాలం చైనా భారీ సేనతో ఎలా తలపడిందో చూపుతుంది. బల్రాజ్ సహానీ, ధరేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. కైఫీ ఆజ్మీ రాసిన ప్రఖ్యాత దేశభక్తి గీతం ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఏ వతన్ సాథియో’ ఇందులోదే. ఉప్కార్ (1967): దేశభక్తి సినిమాలు తీసి ‘మిస్టర్ భరత్’ బిరుదు ΄÷ందిన నటుడు మనోజ్ కుమార్ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సూచన మేరకు ‘జై జవాన్ జై కిసాన్’ నినాదానికి ఇచ్చిన సినీ రూపం ‘ఉప్కార్’. సైనికులు దేశ సరి హద్దుల వద్ద మాత్రమే సంఘర్షణ చేస్తారు... కాని రైతులు దేశంలో జీవితాంతం సంఘర్షణ చేసి గింజలు పండించి జనం కడుపులు నింపుతారు... వారే నిజమైన హీరోలు అని చెప్పే సినిమా ఇది. ‘ఇస్ దేశ్ కి ధర్తీ ఉగ్లే హీరా మోథీ’ హిట్ గీతం ఇందులోదే. బోర్డర్ (1997): యుద్ధంలో చావు కళ్ల ముందు కదలాడుతుంటే దేశం తప్ప మరేమీ గుర్తు రాక సంతోషంగా బలిదానం ఇచ్చే సైనికుల వీరత్యాగం ఎలా ఉంటుందో ‘బోర్డర్’లో చూడాలి. 1971 నాటి ఇండో పాక్ యుద్ధాన్ని కథాంశంగా తీసుకుని దర్శకుడు జె.పి. దత్తా తీసిన ఈ సినిమా ఒక గొప్ప వార్ మూవీ. సన్ని డియోల్, సునీల్ శెట్టి తదితరులు నటించిన ఈ సినిమాలో సైనికుల జీవితాన్ని వాస్తవికంగా చూపడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. యుద్ధ వ్యూహాలు కూడా ఈ సినిమాలో తెలుస్తాయి. లగాన్ (2001): దేశభక్తికి క్రీడలు జత చేసి గొప్ప సంచలనం సృష్టించిన సినిమా ‘లగాన్’. పన్నుల మీద పన్నులు వేసి దాష్టీకం చేస్తున్న బ్రిటిష్ వారిని చిన్న పల్లెజనం క్రికెట్లో ఓడించడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఆస్కార్ నామినేషన్ ΄÷ందింది. అద్భుతమైన కథనం, సంగీతం, నటన, భావోద్వేగాలు, ఆటలో ఉండే మలుపులు తోడు కావడంతో ప్రేక్షకులు జేజేలు పలికారు. ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్ (2002): అమర దేశభక్తుడు భగత్ సింగ్ కథను తీసుకుని రాజ్ కుమార్ సంతోషి తీసిన అద్భుతమైన సినిమా ఇది. అజయ్ దేవగణ్– భగత్ సింగ్ పాత్రను పోషించి ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించాడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్... ఈ ముగ్గురు దేశభక్తులు తమ ఉడుకు నెత్తురుతో దేశం కోసం పోరాడి లేత వయసులో మరణించడం ప్రేక్షకుల మనసు కలచి వేసేలా ఈ సినిమా చూపుతుంది. దేశం కోసం ఎలాంటి స్ఫూర్తితో ఉండాలో తెలుపుతుంది. లక్ష్య (2004): మంచి దేశభక్తి సినిమా మాత్రమే కాదు యువతను లక్ష్యం వైపు నడిపించే సినిమా కూడా. రిలీజైనప్పుడు ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నా ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కార్గిల్ వార్‌ను నేపథ్యంగా తీసుకుని గొప్ప సాంకేతిక విలువలతో తీశారు. హృతిక్ రోషన్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. మిలట్రీ వాతావరణం, క్రమశిక్షణ, ధీరత్వం ఈ సినిమాలో పుష్టిగా చూడొచ్చు. స్వదేశ్ (2004): ఈ దేశం నీకేమిచ్చిందని కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అని తరచి ప్రశ్నించుకోవాలని నెహ్రూ అన్నారు. ఆ ప్రశ్నకు జవాబు ఈ సినిమా. ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకుని పరాయి దేశానికి వెళ్లి ఆ దేశానికి సేవ చేయడం తప్పు కాదు కానీ మన దేశానికి ఏదైనా చేయాలన్న బాధ్యతను మరువకూడదని ఎంతో గట్టిగా చెప్పింది ‘స్వదేశ్’. షారూక్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఎన్ఆర్ఐల బాధ్యతను నిలదీసిన సినిమా ఇది. రంగ్ దే బసంతి(2006): ఉద్యోగం వచ్చే చదువును చదువుకోవడం వేరు, దేశం పట్ల చైతన్యాన్ని కలిగించుకుని బాధ్యతను గుర్తెరగడం వేరు. నేటి యువత తమ కెరీర్‌ను వెతుక్కుంటున్నది గాని దేశం కోసం ఏం చేయాలో ఆలోచించడం లేదు. ‘రంగ్ దే బసంతి’... అల్లరి చిల్లరి యూనివర్సిటీ కుర్రాళ్లను దేశం కోసం ఏదైనా గట్టిగా చేయాలని నిర్ణయించుకోవడాన్ని చూపుతుంది. పుచ్చిపోయిన వ్యవస్థను సరిచేయాలనుకుని ్రపాణాలు అర్పించే కుర్రాళ్ల కథ ఇది. రాకేష్ మెహ్రా దర్శకుడు. ఆమిర్ ఖాన్ హీరో. ది ఫర్గాటెన్ హీరో (2004): నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం ఈ దేశం గుండె సగర్వంగా స్పందిస్తూనే ఉంటుంది. బ్రిటిష్ వారిపై పోరాడటానికి ఏకంగా సైన్యాన్ని నిర్మించిన ధీరుడు ఆయన. నేతాజీ మరణం ఇంకా మిస్టరీనే. నేతాజీ జీవితాన్ని అథెంటిక్‌గా చూపిన సినిమా ఇది. శ్యామ్ బెనగళ్ దర్శకునిగా ఎంత రీసెర్చ్ చేశాడో తెలుస్తుంది. నేతాజీగా సచిన్ ఖడేకర్ అద్భుతంగా నటించారు. గతించిన చరిత్రకు దర్పణం ఈ సినిమా. రాజీ (2018): దేశం కోసం గూఢచారిగా పని చేసి త్యాగాలు చేసిన వారు ఎందరో. వారిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి ఒక స్త్రీ కథ ‘రాజీ’. ఆలియా భట్ నటించిన ఈ సినిమా పాకిస్తాన్‌కు కోడలుగా వెళ్లి అక్కడ భారత్ కోసం గూఢచారిగా పని చేసిన సెహమత్ అనే స్త్రీ ఎదుర్కొన్న సవాళ్లను చూపుతుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో నిర్మితమైనా భారీ వసూళ్లను రాబట్టింది. -
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... ఆల్ ఉమెన్ పెట్రోల్ బంక్
కారాగారంలో గడిపే సమయం శిక్ష సమయం కాదు, శిక్షణ సమయం. కారాగారం మానసిక పరివర్తన దిశగా శిక్షణ ఇచ్చే ప్రదేశం. శిక్ష పూర్తయి విడుదలైన తర్వాత సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చే ప్రదేశంగా ఉండాలి. అలాగే ఉంటాయి కూడా. అయితే ఈ ఏడాది దేశం మరో అడుగు ముందుకేసింది. శిక్ష అనుభవిస్తున్న మహిళలకు ఉపాధి అవకాశాలను జైలు గోడల మధ్య కాకుండా సమాజంలో కల్పించడం ఈ స్వాతంత్య్ర దినోత్సవం ప్రత్యేకత. చెన్నై నగర శివారులో అంబత్తూరు– పుఱల్ రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ‘ఆల్ ఉమెన్ పెట్రోల్ బంక్’ అనే ప్రయోగాత్మకమైన సంస్కరణకు వేదికైంది. పుఱల్ మహిళల కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న మహిళల్లో ముప్ఫై మందికి ఉద్యోగం ఇచ్చింది. దేశంలో ఇదే మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంతో ఈ పెట్రోల్ బంకు ఫ్రీడమ్ ఫిల్లింగ్ స్టేషన్ అనే గౌరవ సూచికకు అర్హత సాధించింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటలు మహిళలు విధులు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత పురుష ఖైదీలు విధుల్లోకి వస్తారు. ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తయిన తర్వాత సమాజంలో గౌరవంగా జీవించడం కోసం రకరకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తారు. అవన్నీ జైలు గోడల మధ్యనే ఉంటాయి. మారుతున్న సమాజానికి తగినట్లు కొత్త కొత్త ఉపాధి మార్గాలకు తగిన ఏర్పాట్లు ఉండవు. అందుబాటులో ఉన్న పనుల్లోనే శిక్షణ ఇవ్వడమే జరిగేది. ఇదిలా ఉంటే... జైళ్లలో మహిళా ఖైదీలకు తగిన సౌకర్యాల పర్యవేక్షణ కోసం అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన మహిళా కమిషన్ సభ్యుల పరిశీలనలో కొత్త విషయాలు తెలిశాయి. జైలు గోడల మధ్య ఉండడం వల్ల మహిళలు మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారని, వారికి సమాజంలో భాగస్వామ్యం కల్పించాలని సూచించడంతో, ఆ సూచనను అందుకున్న జైలు అధికారుల్లో మొదటగా పుఱల్ జైలు అధికారులు ఈ ప్రయత్నం చేశారు. మహిళలకు పెట్రోల్ పట్టడంలో శిక్షణ ఇవ్వడంతోపాటు వినియోగదారులతో మాట్లాడడం, ఉద్యోగానికి తగిన ప్రవర్తనా నియమావళిలో కూడా మహిళలకు శిక్షణ ఇప్పించారు. పెట్రోల్ బంకులో విధులు నిర్వర్తిస్తున్న మహిళలు తమకు స్వాతంత్య్రం వచ్చినట్లు సంతోషిస్తున్నారు. శిక్ష కాలాన్ని ఆనందంగా పూర్తి చేస్తామని, పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో సమాజంలోకి విడుదలవుతామని చెప్పారు. శిక్ష కాలం సమాజంలోనే! శిక్షణ కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకు రావడంతోపాటు ఖైదీలను సమాజంతో అనుసంధానం చేయడం, వారి పునరావాసం కోసం పని చేయడం కూడా అవసరమే. ఆ అవసరాన్ని గుర్తించి మహిళలతోనే ముందడుగు వేసింది జైళ్ల శాఖ. శిక్ష సమయంలో కూడా సమాజంలో మనుషులతో మాట్లాడుతూ ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సమాజానికి దూరంగా ఉన్నామనే ఆవేదన దూరమవుతుంది. సమాజంలోనే నివసిస్తున్న భావనతో జీవిస్తారు. -
Independence Day 2023: స్వాతంత్య్రాన్ని ఇలా ఎంజాయ్ చేయండి!
నేటి టెక్నాలజీ యుగంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని హాలిడేగా తీసుకుని ఆనందించే వారే ఎక్కువ. స్కూలు, కాలేజీ విద్యార్థులైతే జెండా వందనం తరువాత ఇంటికెళ్లిపోవచ్చు అని తెగ సంబరపడిపోతుంటారు. కానీ డెబ్బై ఆరేళ్లుగా విరామం లేకుండ జరుపుకొంటూ నేడు 77వ వసంతంలో అడుగు పెట్టాం. దేశాన్ని పాలించే అధికారులు అధికారికంగా ఈ వేడుకలు జరిపిస్తున్నారు. బాధ్యత గల పౌరులుగా మనం ఇలా సెలబ్రేట్ చేసుకుందాం.... ► ఉదయాన్నే ఎర్రకోటపై జరిగే జెండావందనం, వివిధ కార్యక్రమాలను టీవీలో చూడాలి. డెభ్బై ఏడేళ్ల స్వాతంత్య్ర భారతం ఎంత ఎత్తుకు ఎదిగిందన్న అంశాలను ప్రత్యక్ష ప్రసారాలు చూడడం ద్వారా తెలుసుకోవచ్చు ► తరువాత ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లేసుకి ఈరోజు వెళ్లండి. ఒక రోజులో వెళ్లిరాగల ప్రాంతానికి వెళ్లి అక్కడ గడిపి మీ ఒత్తిడిని దూరం చేసుకోండి. అక్కడ స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తుండిపోయేలా గడపండి. ► రోజూ వేసుకునే దుస్తులు కాకుండా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలాంటి దుస్తులు ధరించండి. వీలైనంత వరకు డ్రెస్‌లో తెలుపు, కాషాయం, ఆకుపచ్చని రంగులు ఉండేలా చూసుకుని వేసుకోవాలి. అప్పుడు త్రివర్ణ పతాకానికి మరింత వన్నె తెచ్చిన వారవుతారు ► ఎక్కడికీ వెళ్లే ఓపిక లేనప్పుడు ఇంట్లోనే ఉండి దేశభక్తి సినిమాలు చూడండి. మీతోపాటు మీ పిల్లలకు మన దేశ చరిత్ర, ఔన్నత్యాలు తెలుస్తాయి ► మరింత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే మూడు రంగులు ఉండేలా వెరైటీ డిష్‌లు తయారు చేసుకుని తినండి ► స్వాతంత్య్ర దినోత్సవం అర్థం ఉట్టిపడేలా గాలిపటాలు ఎగరవేయండి. మూడు రంగుల్లో ఉన్న గాలిపటాలను వీలైనంత ఎత్తుకుఎగరేస్తూ మనకొచ్చిన స్వేచ్ఛను ఎంజాయ్ చేయవచ్చు ► పుస్తకాల పురుగులు అయితే దేశభక్తి పుస్తకాలను చదవండి. స్వాతంత్య్ర సమర యోధుల విజయగాధలు, వీరిలో బాగా పాపులర్ అయిన నాయకుల బయోగ్రఫీని చదివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ► దేశభక్తి గీతాలు వింటూ కూడా సంబరాలు జరుపుకోవచ్చు. అలనాటి పోరాట, అసామాన్య త్యాగాలను గుర్తుచేసే పాటలను వినాలి. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ, ఏఆర్ రెహ్మాన్ పాటలు మనలో నిద్రపోతున్న దేశభక్తిని తట్టి లేపుతాయి ► ఇంటి చుట్టుపక్కల వారు లేదా బంధువులు, కుటుంబ సభ్యులతో దగ్గరలో జరుగుతోన్న జెండా పండుగకు వెళ్లి రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి జైహింద్ కొట్టాలి ∙దేశానికి పెద్ద సేవ చేయలేక పోయినప్పటికీ మీ చుట్టుపక్కల ఉన్న వారందరికి స్వీట్లు పంచి, నోరు తీపి చేస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోండి. ► ప్రతి భారతీయుడికి ఎంతో విలువైన బహుమతులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. అందుకే వీలైనంత వరకు అందరితో కలిసి జరుపుకోవాల్సిన జెండా పండుగ ఇది. సెలవు దొరికింది అని సంబరపడిపోక వీటిలో ఏ ఒక్కదాన్ని పాటించినా స్వాతంత్య్ర దినోత్సవాన్ని గౌరవించినట్లే. -
ఆగస్టు 15: ఆమె... దేశంలో సగం ఎప్పుడు!?
స్వాతంత్య్ర దినోత్సవం దేశ ఔన్నత్యాన్ని మాట్లాడుతుంది. దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తుంది. కాని దేశంలో సగమైన స్త్రీలు సంపూర్ణ స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పొందవలసే వుంది. ఏనాడైతే స్త్రీల పట్ల సురక్షితమైన, సంస్కారవంతమైన ప్రవర్తనను ఈ సమాజం చూపుతుందో అప్పుడే స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టు. అప్పుడే దేశ ఔన్నత్యం ఇనుమడించినట్టు. ‘ఆకాశంలో సగం’లాగా దేశంలో సగం ఇంకెప్పుడు? నేడు ఆగస్టు 15న ఎర్రకోట మీద జెండా ఎగుర వేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు సహకారం అందిస్తారు. మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్ కౌర్ పతాకావిష్కరణ సమయంలో ప్రధానితో పాటుగా ఉండి జెండా వందనం సమర్పిస్తారు. ఈ విశేష ఘట్టంలో ఇద్దరు మహిళలకు ఈ విధంగా చోటు దక్కడం సంతోషపడాల్సిన సంగతి. 76 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్త్రీల స్థితిగతుల్లో వచ్చిన పురోభివృద్ధికి ఇదీ ఒక సంకేతమే. నాటి నుంచి నేటి వరకు విద్య, ఉపాధి, ఉద్యోగం, సైన్యం, పాలనా యంత్రాంగం, శాసన వ్యవస్థ... వీటిల్లో స్త్రీలకు గణనీయంగా స్థానం దక్కింది. ప్రాముఖ్యం లభించింది. అయితే అంతమాత్రాన స్త్రీలు సంపూర్ణంగా స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నారా అనేది ప్రశ్న. స్త్రీల త్యాగం దాస్య భారతంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో స్త్రీలు పాల్గొన్నారు. అన్నింటికి మించి పురుషులు దేశం కోసం ప్రాణాలు అర్పించినా, జైళ్ల పాలైనా స్త్రీలు ధైర్యంగా ఇళ్లు నడిపి కష్టాలను ఈదారు. దేశ విభజన సమయంలో తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. అంతెందుకు 1930 నాటికి దేశ వ్యాప్తంగా 30 వేల మంది స్త్రీలు స్వాతంత్య్ర పోరాటంలో ఏదో విధాన జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్త్రీల పోరాటం చాలామటుకు చరిత్రలో నమోదు కాకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడిప్పుడే నాటి వీర వనితల గాధలు వెలికి వస్తున్నాయి. ఇంత పోరాటం, త్యాగం చేసి స్త్రీల భాగస్వామ్యంతో తెచ్చుకున్న స్వాతంత్య్రంలో స్త్రీలు నిజంగా సంతోషంగా ఉన్నారా? సురక్షితం కాని దేశం ‘ఒక స్త్రీ అర్ధరాత్రి క్షేమంగా నడిచి వెళ్లినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ ఏ ముహూర్తంలో అన్నారో కాని అలాంటి స్థితి నేటికీ రాకపోగా నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఎన్ని చట్టాలు చేసినా, శిక్షలు తెచ్చినా స్త్రీలను గౌరవించాలి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని మెజారిటీ సమాజం అనుకోవడం లేదు. ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే భావన సమాజంలో ఆది కాలం నుంచి చొప్పించి ఉండటం వల్ల స్త్రీ చేసే ప్రతి పనిలో తప్పు ఎంచడం, అదుపు చేయడం, చులకనగా చూడటం, వివక్ష చూపడం, దండించడం ఆనవాయితీగా మారింది. పిల్లల పెంపకం దశ నుంచే స్త్రీలను గౌరవించడం నేర్పించడం లేదు. ఇంట్లో అమ్మాయిని ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా పెంచడం వల్ల ఈ అబ్బాయిలు ‘సమాజం’గా మారి స్త్రీ పాలిట బెడదగా మారుతున్నారు. తమ మాటకు ఎటువంటి తిరస్కారం చెప్పినా పురుషుడు శిక్షించేవాడై స్త్రీని చంపేందుకు వెనుకాడటం లేదు. స్త్రీకి ఒక అభిప్రాయం కలిగి ఉండే స్వాతంత్య్రం ఆమెకు ఎందుకు ఇవ్వడం లేదు? స్త్రీలను ప్రేమ, మర్యాద, గౌరవాలతో కుటుంబం చూసుకోవాలి. అప్పుడు ఆ మర్యాద, గౌరవాలు సమాజంలోకి ఆటోమేటిక్‌గా వస్తాయి. కుటుంబం స్త్రీకి ఎలా రక్షణ ఇస్తుందో సమాజం కూడా స్త్రీకి అలా రక్షణ ఇవ్వాలనే పౌర శిక్షణ, సంస్కారం అవసరం. పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా కుటుంబం, సమాజం, దేశం కోసం గొప్పగా ఆలోచించగలరు. వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చి చూస్తే తెలుస్తుంది. అటువంటి వేకువలోకి దేశం ఉదయించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోరుకుందాం. -
విజయవాడ: 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు (ఫోటోలు)
-
ఇండిపెండెన్స్ డే స్పెషల్: ఆగస్టు 15న చూడదగిన సినిమాలేవో తెలుసా?
ఈ ఏడాది స్వాతంత్య్ర సంబురాలకు యావత్ భారవతావని సిద్ధమవుతోంది. ఎంతోమంది వీరుల త్యాగాలతో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ వారికి తమ ప్రాణాలను ఎదురొడ్డి నిలిచిన వీరులెందరో భారతమాత ఒడిలో చేరారు. వారిలో ముఖ్యంగా అల్లూరి సీతరామరాజు, సుభాశ్ చంద్రబోస్ పేర్లు వినిపిస్తాయి. స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి చరిత్ర గురించి మనం చాలా సినిమాల్లో చూశాం. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనలో దేశభక్తి గురించి తెలిపే టాలీవుడ్ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 1.అల్లూరి సీతారామ రాజు ఎన్ని ఏళ్లు గడిచినా అందరికీ గుర్తుండి పోయే సినిమా 'అల్లూరి సీతారామ రాజు'. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా 1922-24 మద్రాసు ప్రెసిడెన్సీలో స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన కథాంశంగా ఈ చిత్రం రూపొందించారు. అనేకమంది జీవితాలకు స్ఫూర్తిగా నిలిచిన అల్లూరి.. బ్రిటిష్ వారిపై యుద్ధంలో తన దళాన్ని ముందుకు నడిపించారు. ఈ 'అల్లూరి సీతారామ రాజు' రిలీజై 175 రోజులు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించారు. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు. జి హనుమంత రావు, జి ఆదిశేషగిరి నిర్మించిన చిత్రంలో విజయ నిర్మల, కొంగర జగ్గయ్య, చంద్ర మోహన్ కీలక పాత్రల్లో నటించారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో విప్లవకారుడు, మన్యం దొర అల్లూరి సీతారామ రాజు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. 2.సర్దార్ పాప రాయుడు స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో 1980లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం సర్దార్ పాపరాయుడు. ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కొన్ని థియేటర్లలో అయితే ఏకంగా 300 రోజులపాటు ప్రదర్శించారు. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా సర్దార్ పాపరాయుడు ఘనత సాధించింది. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీదేవి, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. 3.మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్, మోహన్ బాబు, శారద ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'మేజర్ చంద్రకాంత్'. 1993లో విడుదలైన ఈ చిత్రం ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే లక్ష్యంలో ఉన్న సైనికుడి జీవితం చుట్టు తిరుగుతుంది. నగ్మా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ దేశభక్తి చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని 'పుణ్యభూమి నాదేశం', 'ముద్దులతో ఓనమాలు' వంటి పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. 4. బొబ్బిలి పులి దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం బొబ్బిలి పులి. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, జయచిత్ర, మురళీమోహన్, ఎం. ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్ బాబు, అల్లు రామలింగయ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 5.భారతీయుడు తమిళ స్టా హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భారతీయుడు. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని అందంగా చిత్రీకరించారు. స్వాతంత్రద్యోమంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాన్ని ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. 6.ఖడ్గం దేశభక్తిపై రూపొందించిన చిత్రాల్లో ఖడ్గం మూవీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. ఈ టాలీవుడ్ ఐకానిక్ చిత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్, సోనాలి బింద్రే, ప్రకాష్ రాజ్, రవితేజ కీలక పాత్రల్లో నటించిన ఖడ్గం థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. 2002లో వచ్చిన ఈ చిత్రానికి సరోజిని అవార్డు, ఐదు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ముగ్గురు యువకుల జీవితాలను ప్రభావితం చేసే అమానవీయ ఉగ్రవాద చర్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 7.సుభాష్ చంద్రబోస్ 2005లో విడుదలైన హిస్టారికల్ డ్రామా స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కించారు. వెంకటేష్, శ్రియ శరణ్, జెనీలియా డిసౌజా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మూడు నంది అవార్డులను గెలుచుకుంది. బ్రిటీష్ వారితో పోరాడి చింతపల్లి గ్రామాన్ని రక్షించే సుభాష్ చంద్రబోస్ అనుచరుడి చుట్టూ కథను రూపొందించారు. 8.మహాత్మ టాలీవుడ్‌లోని ఉత్తమ దేశభక్తి చిత్రాలలో మహాత్మ ఒకటి. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధానపాత్ర పోషించారు. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు, త్యాగం ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా తెరకెక్కించారు. 9. సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. బ్రిటీశ్ పాలనలో వారిని ఎదురించి నిలిచిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మించారు. 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. 10. ఆర్ఆర్ఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బ్రిటీష్ కాలంలో ఓ మన్యం వీరుడైన కొమురం భీం జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ బ్రిటీష్ పోలీసు అధికారి పాత్రలో కనిపించగా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లూ సాధించగా.. ఆస్కార్ అవార్డ్‌ను సైతం సాధించింది. వీటితో పాటు స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో పల్నాటి యుద్ధం, నేటి భారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్ర కేసరి, మరో ప్రపంచం(1970), మనదేశం(1949) ఘాజీ(2017), మేజర్, సైరా నరసింహా రెడ్డి(2019), గౌతమి పుత్ర శాతకర్ణి, పరమవీరచక్ర చిత్రాలు కూడా ఉన్నాయి. -
గుడ్ న్యూస్: రూ. 1515కే విమాన టికెట్, ఫ్రీ ఫ్లైట్ వోచర్ కూడా!
SpiceJet I-Day Sale: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ఇండిపెండెన్స్ డే సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. "ప్రత్యేక ఇన్క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్" పేరుతో స్పెషల్ సేల్ ప్రకటించింది. దీని ప్రకారం ఆగస్ట్ 14నుంచి ఎంపిక చేసిన దేశీయ డైరెక్ట్ వన్-వే ఫ్లైట్లలో ఈ సేల్ రూ.1,515 నుండి ప్రారంభమవుతుంది. అలాగే రూ. 2,000 వరకు ఉచిత విమాన వోచర్లను పొందవచ్చు. అంతేకాదు రూ. 15కే నచ్చిన సీటు ఎంపిక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఆగస్ట్ 14- ఆగస్ట్ 20 వరకు అందుబాటులో ఉండే ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లో భాగంగా కేవలం రూ. 1515కే (వన్ వే టికెట్) విమాన టికెట్నుకొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్రీ ఫ్లైట్ వోచర్, రూ. 15కే సీటు సెలెక్షన్ వంటి సర్వీసులు అందిస్తోంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్ట్ 15 నుంచి 2024 మార్చి 30 వరకు ప్రయాణించవచ్చు. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) లాభాలు జంప్ మరోవైపు బలమైన విమాన ప్రయాణ డిమాండ్ కారణంగా స్పైస్‌జెట్ జూన్‌తో ముగిసినతొలి త్రైమాసికంలో రూ. 205 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 789 కోట్ల నష్టాలను నమోదు చేసింది. దేశీయంగా ఉన్న డిమాండ్ కారణంగా 90 శాతం నమోదు చేసింది. మొత్తం నిర్వహణ ఆదాయం క్షీణించింది. అంతకుముందు సంవత్సరంఇదే త్రైమాసికంలో రూ. 2,457 కోట్లతోపోలిస్తే ఆదాయం రూ. 2,002 కోట్లుగా ఉంది. ఎబిట్టా మార్జిన్ 525 కోట్లుగా ఉన్నాయి. (టమాట భగ్గు: 15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం) -
954 మందికి పోలీసు పతకాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 63 మంది ఎంపిక
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను.ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG), 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు(PPM), 642 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 55 మంది పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్ నుంచి 27, ఛత్తీస్‌గఢ్ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం(PPMG) ఒకరిని వరించింది. సీఆర్పీఎఫ్ అధికారి లౌక్రక్‌పామ్ ఇబోంచా సింగ్‌కు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఏపీ నుంచి 29 మందికి ఈ పతకాలు దక్కాయి. 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. ఇక తెలంగాణ నుంచి 34 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. 22 మందికి పోలీస్ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. కాగా స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది. తెలంగాణ నుంచి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు పొందిన ఇద్దరు వీరే ►అదనపు డీజీ విజయ్ కుమార్, ►ఎస్పీ మదాడి రమణ కుమార్ తెలంగాణకు చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు ►ఎస్పీ భాస్కరన్, ఇన్ స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్సై బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కాన్ స్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు. గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కాన్స్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్. తెలంగాణ నుంచి పోలీస్ సేవా పతకాలు లభించిన పది మంది పోలీస్‌ల వివరాలు : ►బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ,ఖైరతాబాద్. ►మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు, అదనపు ఎస్పీ. ►ఆత్మకూరి వెంకటేశ్వరి, అదనపు ఎస్పీ. ►ఆందోజు సత్యనారాయణ, ఆర్ఎస్ఐ. ►కక్కెర్ల శ్రీనివాస్, ఆర్ఎస్ఐ. ►మహంకాళి మధు, ఆర్ఎస్ఐ. ►అజెల్ల శ్రీనివాస రావు, ఆర్ఐ. ►రసమోని వెంకటయ్య, సీనియర్ కమాండో. ►అరవేటి భాను ప్రసాద్ రావు, ఇన్ స్పెక్టర్,హైదరాబాద్. ►సాయన వెంకట్వార్లు, ఏఎస్ఐ. -
ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్
కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన వాళ్లని కూడా గుర్తుపట్టలేకపోతుంటాం. వాళ్లు గెటప్ మార్చడం దీనికి కారణం అయ్యిండొచ్చు. ఇప్పుడు అలానే ఓ తెలుగు స్టార్ యాంకర్ డిఫరెంట్ లుక్‌తో కనిపించింది. తొలుత ఈమె ఎవరా అనుకున్నారు. అసలు విషయం తెలిసి రిలాక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ గెటప్ సంగతేంటి? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె యాంకర్ అనసూయ. కాకపోతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ యోధురాల్ని గుర్తుచేసుకుంది. ఆమె వేషధారణలోకి మారిపోయింది. అసలు ఆమె ఎవరో ఏంటో కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియాలో పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. '1857 కాలం నాటి స్వాతంత్ర్య సమరయోధురాలు, ఆవాదీ క్వీన్ బేగం హజ్రత్ మహల్.. దేశం కోసం పోరాడినందుకు 1984 మే10న ప్రభుత్వం ఆమె ఫొటోతో ఓ స్టాంప్ విడుదల చేసింది. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆమె పోరాటాన్ని గుర్తు చేసుకుందాం' అని అనసూయ పోస్ట్ పెట్టింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) 1857లో బ్రిటీషర్స్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొని కోట్లాది మంది భారతీయులు అమరులయ్యారు. అయితే ఈ ఉద్యమంలో మగాళ్లతోపాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. వారిలో ఒకరే బేగం హజ్రత్ మహల్. తన ధైర్య సాహసాలతో అవధ్ విముక్తి కోసం పోరాటం చేసిన మహాయోధురాలు. అందుకే ఈమెని అభినవ లక్ష్మీబాయి అని అంటుంటారు. అలాంటి గెటప్‌లో ఇప్పుడు అనసూయ కనిపించడం ఆసక్తికరంగా మారింది. అయితే మిగతా వాళ్లు ఎవరు చేసినా నెటిజన్స్ పెద్దగా పట్టింకునేవారు కాదేమో. ఇక్కుడున్నది అనసూయ కావడంతో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో ట్రెండింగ్‌లో ఉండే ఈ హాట్ యాంకర్.. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధురాలి గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలా ఉండే ఈమె ఎలా మారిపోయిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) (ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!) -
నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి
న్యూఢిల్లీ: ‘ఇతరులు ఇచ్చే కానుకలు, బహుమానాల వెనుక స్వార్థపూరిత కారణం ఉండొచ్చు. మన నుంచి ఏదో ఒకటి ఆశించి ఇలాంటివి ఇస్తుంటారు. అది స్వీకరించే ముందు ఈ విషయం ఆలోచించాలి’.. ప్రఖ్యాత సైంటిస్ట్, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బాల్యంలోనే తన తండ్రి వద్ద నేర్చుకున్న పాఠమిది. ఈ పాఠాన్ని జీవితాంతం ఆయన ఆచరించారు. విలువలకు, నిజాయతీకి మారుపేరైన అబ్దుల్ కలాం ఇతరుల నుంచి ఏనాడూ కానుకలు ఆశించలేదు. ఎవరైనా ఇలాంటివి ఇస్తే దాని ధర ఎంతో తెలుసుకొని చెక్కు లేదా డబ్బులు పంపించేవారు. మిస్సైల్ మ్యాన్ కలాం గొప్పతనాన్ని తెలియజేసే మరో సంఘటన వెలుగులోకి వచి్చంది. కలాంకు సంబంధించిన ఈ ఉదంతాన్ని ఐఏఎస్ అధికారి ఎం.వి.రావు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2014లో కలాం ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే సంస్థ ఆయనకు ఒక గ్రైండర్‌ను బహూకరించింది. దాన్ని స్వీకరించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. చివరకు బలవంతం మీద స్వీకరించారు. ఆ మరుసటి రోజే దాని ధర తెలుసుకొనేందుకు తన సహాయకుడిని మార్కెట్‌కు పంపించారు. తర్వాత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి చెక్కును సౌభాగ్య సంస్థకు పంపారు. చెక్కును ఆ సంస్థ నగదుగా మార్చుకోకపోవచ్చన్న అనుమానం ఆయనకు వచ్చింది. తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందో లేదో కనుక్కున్నారు. కాలేదని తెలిసింది. గడువులోగా నగదుగా మార్చకోకపోతే గ్రైండర్‌ను వెనక్కి ఇచ్చేస్తానని సౌభాగ్య సంస్థకు కలాం సమాచారం పంపారు. ఇక చేసేది లేక ఆ సంస్థ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసి, డబ్బులు తీసుకుంది. అబ్దుల్ కలాం ఇచ్చిన చెక్కును జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకుంది. ఎం.వి.రావు షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కలాం వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు. -
స్వాతంత్య్ర దిన వేడుకలు.. సామాన్యులే అతిథులు
న్యూఢిల్లీ: భారత 77వ స్వాతంత్య్ర దిన వేడుకలకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పంద్రాగస్టున ఢిల్లీలోని ఎర్రకోటలో అంబరాన్నంటే సంబరాల్లో సామాన్యుడికి పెద్దపీట వేసింది. దేశానికి వెన్నుముకలాంటి రైతులు, చెమటోడ్చి పని చేసే కార్మికులు, జీవనోపాధి కోసం ప్రాణాలనే పణంగా పెట్టే జాలర్లు, సేవాగుణం కలిగిన నర్సులు, గ్రామాల సర్పంచ్‌లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఢిల్లీలో ఎర్రకోటపై మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. 2047 స్వాతంత్య్ర దిన శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగానే స్వాతంత్య్ర దిన వేడుకల్ని జరుపుతున్నారు. ఇక ఇంటింటిలోనూ త్రివర్ణ పతాకం ఎగరాలన్న ప్రచారం ఆదివారం నుంచే మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో ప్రతీ ఒక్కరూ జాతీయ జెండాను డిస్ప్లే పిక్చర్ (డీపీ) గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. చైతన్యవంత గ్రామాల నుంచీ.. స్వాతంత్ర దిన వేడుకలకు ప్రత్యేకంగా 1,800 మంది అతిథుల్ని ఆహ్వానించారు. దేశంలోని అత్యంత చైతన్యవంతమైన గ్రామాలుగా గుర్తింపు పొందిన 660కి పైగా గ్రామాల నుంచి 400 మందికి పైగా సర్పంచ్‌లు, 250 మంది రైతులు, పార్లమెంటు కొత్త భవనం, సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంలో భాగస్వామ్యులైన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ పనివారుతో పాటు జాలర్లు, టీచర్లు, నర్సులు ఇలా సమాజంలో కీలకమైన వర్గాల వారందరికీ ఆహ్వానం పలికినట్టుగా కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. సతీ సమేతంగా హాజరయ్యే ఈ అతిథులకి బస ఏర్పాట్లు చేస్తోంది. సెల్ఫీ పాయింట్లు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా యువతీయువకులకు సెల్ఫీ పోటీలు నిర్వహిస్తోంది. ఇందు కోసం 12 ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లను వివిధ థీమ్‌లతో తీర్చి దిద్దింది. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్, జమా మసీదు మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్,, ఇలా 12 ప్రాంతాల్లో పెట్టిన సెల్ఫీ పాయింట్లలో సెల్ఫీలు తీసుకొని ఆగస్టు 15–20 మధ్య మైగవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఒక్కో సెల్ఫీ పాయింట్ నుంచి అత్యుత్తమమైన దానిని ఎంపిక చేసి 12 మంది విజేతలకు రూ.10 వేల చొప్పున బహుమానం అందిస్తారు. డీపీలుగా జాతీయ జెండా హర్‌ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులందరూ తమ అకౌంట్లలో డీపీని జాతీయ జెండాతో మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ తన అకౌంట్లలో త్రివర్ణ పతాకాన్నే డీపీగా పెట్టుకున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఇదో ఉద్యమంగా చేయాలన్నారు. దేశానికి, ప్రజలకి మధ్య ఉండే ఉద్వేగభరితమైన సంబంధానికి ప్రతీకగా జాతీయ జెండాను డీపీగా ఉంచాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ జెండాలతో ఫోటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. -
Inspiration is freedom: స్ఫూర్తిదాయకం స్వాతంత్య్రం
ఏ దేశానికైనా ప్రధానంగా ఉండాల్సింది స్వాతంత్య్రం. ప్రపంచంలో పలుదేశాలు ఏదో సందర్భంలో ఇతర దేశాల పాలనకు లోబడి అటుపైన స్వాతంత్య్రాన్ని సాధించు కున్నవే. స్వాతంత్య్రాన్ని సాధించుకున్న దినాన్ని ఉత్సవ దినంగా ప్రతి దేశమూ జరుపుకుంటూ ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమే. ‘దేశానికి రూపకల్పన చేసేది ఏది? ఎత్తైన నిర్మాణాలు, భవనాల గోపురాలతో ఉండే గొప్ప నగరాలు కాదు; విశాలమైన ఓడరేవులు కాదు, కాదు; మనుషులు, గొప్ప మనుషులు’ అని ఒక గ్రీక్ చాటువును ఆధారంగా తీసుకుని ఇంగ్లిష్ కవి విలిఅమ్ జోన్స్ చెప్పారు. ఆ మాటల్ని తీసుకుని గురజాడ అప్పారావు ‘దేశమంటే మట్టికాదోయ్ /దేశమంటే మనుషులోయ్’ అని చెప్పారు. ఔను, దేశం అంటే మనుషులే. ‘నువ్వు నీ దేశాన్ని ప్రేమించు’ అని ఇంగ్లిష్ కవి ఆల్ఫెడ్ టెన్నిసన్ అన్నారు. ఆ మాటల్ని తీసుకునే గురజాడ అప్పారావు ‘దేశమును ప్రేమించుమన్నా‘ అని అన్నారు. దేశాన్ని ప్రేమించడం దేశ ప్రజల్ని ప్రేమించడం ఔతుంది; దేశప్రజల్ని ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం ఔతుంది. దేశాన్ని ప్రేమించలేనివాళ్లు దేశ పౌరులుగా ఉండేందుకు ఎంతమాత్రమూ అర్హులు అవరు; వాళ్లు దేశానికి హానికరం ఔతారు. ‘నితాంత స్వాతంత్య్రమ్ము వెల్లి విరియు స్వర్గాన/నా మాతృదేశమును మేలుకొన నిమ్ము ప్రభూ’ ఈ మాటల్లో పలికిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావం మాతృదేశం, దేశ స్వాతంత్య్రం ఆవశ్యకత నూ, ప్రాముఖ్యతనూ ఘోషిస్తూ ఉంది. విదేశీ ఆక్రమణ దారుల క్రూరమైన, భయానకమైన పాలనలో పెనుబాధను అనుభవించి, లెక్కలేనంత సంపదను కోల్పోయి, ఎన్నిటినో వదులుకున్న మనదేశం వందల సంవత్సరాల పరపీడన నుండి విముక్తమై 75 యేళ్లుగా స్వాతంత్య్రాన్ని శ్వాసిస్తోంది. మనం ఇవాళ స్వతంత్ర దేశంలో ఉన్నాం; మన దేశంలో మనం మనదేశ పౌరులుగా ఉన్నాం. ఈ దేశం మనది; ఈ మనదేశం మన సంతతికి పదిలంగా అందాలి. ఈ చింతన మనల్ని నడిపించే ఆశయమై మనలో, మనతో సర్వదా, సర్వథా ఉండాలి. ‘నువ్వు, నీ దేశం నీకు ఏం చేస్తుంది అని అడిగే రాజకీయవాదివా? లేకపోతే నువ్వు, నీ దేశానికి ఏం చెయ్యగలను అని ఆడిగే పట్టుదల ఉన్నవాడివా? మొదటి ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు పరాన్నజీవివైన పురుగువి, రెండవ ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు ఎడారిలో ఉద్యానవనంవి’ అని ఖలీల్ జిబ్రాన్ మాటలు మన మెదళ్లను కదిలించాలి; మనదేశానికి మనం ఉద్యానవనాలం అవ్వాలి. ‘జంబూద్వీపే వైవస్వత మన్వంతరే భరతఖండే... ‘ఇలా ఆలయాల్లో సంకల్పం చెప్పడం మనకు తెలిసిందే. ఈ సంకల్పం చెప్పడం కాశ్మీర్ నుండీ కన్యాకుమారి వరకూ ఉండే ఆలయాల్లో ఉంది. ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోనూ ఉండే ఆలయాల్లోనూ ఉండేది. దీని ద్వారా భరతఖండం సాంస్కృతికంగా ఒకటే అన్న సత్యం విశదం ఔతోంది. 2,000 ఏళ్లకు పూర్వందైన తమిళ్ సాహిత్యం పుఱనానూఱులో ఉత్తరాన హిమాలయాల నుండీ దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్న దేశం ఇది అని చెప్పబడింది. దీని ద్వారా ఎప్పటి నుండో భారతం భౌగోళికంగా ఒకటే అన్న సత్యం అవగతం ఔతోంది. 2,300 యేళ్ల క్రితంనాటి గ్రీక్ చరిత్రకారుడు మెగస్తనీస్ హిమాలయం నుండీ దక్షిణాన కడలి వరకు ‘ఇండికా’ అని గుర్తించాడు. అవగాహనారాహిత్యంతో కొందరు మనదేశం అసలు ఒక దేశమే కాదని, మరొకటని మనలో దేశవ్యతిరేక భావ అనలాన్ని రగిలిస్తూ ఉంటారు. ఆ అనలాన్ని చదువుతోనూ, విజ్ఞతతోనూ మనం ఆర్పేసుకోవాలి. ‘నా తల్లీ, తండ్రీ సంతోషంగా ఉన్నది ఈ దేశంలోనే’ అనీ, ‘తియ్యనైన ఊపిరినిచ్చి కని, పెంచి అనుగ్రహించింది ఈ దేశమే’ అని అన్నారు తమిళ్ మహాకవి సుబ్రమణియ బారతి. ఆయన జాతీయతా సమైక్యతను కాంక్షిస్తూ ‘కాశి నగర పండితుల ప్రసంగాన్ని కంచిలో వినడానికి ఒక పరికరాన్ని చేద్దాం’ అనీ అన్నారు. జాతీయతా సమైక్యత ఆపై సమగ్రత దేశానికి ముమ్మాటికీ ముఖ్యం. ‘వందేమాతరం జయ వందేమాతరం; ఆర్యభూమిలో నారీమణులూ, నరసూర్యులూ చేసే వీరనినాదం వందేమాతరం’ అనీ, ‘వందేమాతరం అందాం; మా దేశమాతను పూజిస్తాం అందాం’ అనీ నినదించారు సుబ్రమణియ బారతి. మనదేశాన్ని ప్రేమిస్తూ ఉందాం, మనదేశాన్ని పూజిస్తూ ఉందాం, మనం దేశభక్తులుగా మసలుతూ ఉందాం. దేశభక్తితో, భారతీయతతో బతుకుతూ ఉందాం. భారతీయులమై మనసారా, నోరారా అందాం, అంటూ ఉందాం ‘వందేమాతరం’. ‘దేశవాసులు అందరికీ జాతీయతా భావం ఉండాలి. జాతీయతా భావం లేకపోవడం క్షంతవ్యం కాదు. జాతీయతా వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అనేవి భయంకరమైన మానసికవ్యాధులు. అవి ఉండకూడదు. జాతీయత–దేశ విద్వేషవాదం నుండి మనల్ని, మనదేశాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి’ ‘భారత(ప్ర)దేశం... ‘భా’ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’ అనీ, ‘రత’ అంటే అంకితమైన, అసక్తి కల అనీ అర్థాలు. భగవంతుడు కాంతిరూపుడు. ‘భారతం’ అంటే ‘భగవంతుడికి అంకితమైంది’ లేదా ‘భగవంతుడిపై ఆసక్తి కలది’ అని అర్థం. ఈ అర్థాన్ని మనం ఆకళింపు చేసుకుందాం‘ – రోచిష్మాన్ -
Independence day celebrations 2023: స్వేచ్ఛాగీతం
స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంతర్జాలంలో ఆరంభం అయ్యాయి. ఆనాటి దేశభక్తి గీతాల నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల వరకు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు... వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడి వడి స్వేచ్ఛా వాయువు పీల్చి – రాట్నగీతము (గురజాడ రాఘవశర్మ) వీరభారతి సందేశం పరదేశీయులు తొలగండి ఈ భారతదేశం మా దేశం వినండి! వినండి! విశ్వప్రజలు వీరభారతి సందేశం – వానమామలై వరదాచార్యులు చిత్రం: 1857 సిపాయి తిరుగుబాటు ఉప్పోయమ్మ ఉప్పు ముప్పది కోట్ల ప్రజల ముప్పు దీర్చే ఉప్పు ఉప్పుగాదిది రత్నపు తిప్ప మన పాలిటికి – ఉప్పుపాట (గరికపాటి మల్లావధాని) ఫోటో: దండి సత్యాగ్రహం: ఏప్రిల్6, 1930 చెప్పరా...లేకున్న ముప్పురా! చెప్పరా! నీ కన్నులిటపై/ విప్పరా! ఆ ప్రభుత నింతట త్రిప్పరా! లేకున్న–నీకగు ముప్పురా! మాయప్ప ఇప్పుడు – పాంచాలము (గరిమెళ్ల) ఫొటో: సహాయనిరాకరణ ఉద్యమ కాలంలో బాంబేలో బ్రిటిష్ వారి వస్తువులతో ఉన్న ఎడ్లబండి ముందుకు పోకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్న ఉద్యమకారుడు -
ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు..
History Of The Indian Rupee: భారతదేశానికి స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. అయితే 1947 నుంచి ఇండియన్ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఎలా ఉండేది? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ. 3.30గా ఉండేది. అయితే ఈ విలువ క్రమంగా ప్రతి సంవత్సరం పడిపోతూ వచ్చింది. ఇప్పుడు అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 82.73 రూపాయలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే మన కరెన్సీ విలువ ఎంతగా తగ్గిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. కాగా 1949 నుంచి 1966 వరకు USD-INR ఎక్సేంజ్ రేటు రూ. 4.76 వద్ద కొనసాగింది. ఆ తరువాత క్రమంగా పడిపోతూ వచ్చింది. 1947 నుంచి 2023 వరకు ఇండియన్ రూపాయి హిస్టరీ.. సంవత్సరం - ఎక్సేంజ్ రేట్(USD/INR) 1947 3.30 1949 4.76 1966 7.50 1975 8.39 1980 7.86 1985 12.38 1990 17.01 1995 32.427 2000 43.50 2005 (జనవరి) 43.47 2006 (జనవరి) 45.19 2007 (జనవరి) 39.42 2008 (అక్టోబర్) 48.88 2009 (అక్టోబర్) 46.37 2010 (జనవరి) 46.21 2011 (ఏప్రిల్) 44.17 2011 (సెప్టెంబర్) 48.24 2011 (నవంబర్) 55.39 2012 (జూన్) 57.15 2013 (మే) 54.73 2013 (సెప్టెంబర్) 62.92 2014 (మే) 59.44 2014 (సెప్టెంబర్) 60.95 2015 (ఏప్రిల్) 62.30 2015 (మే) 64.22 2015 (సెప్టెంబర్) 65.87 2015(నవంబర్) 66.79 2016(జనవరి) 68.01 2016(జనవరి) 67.63 2016(ఫిబ్రవరి) 68.82 2016 (ఏప్రిల్) 66.56 2016 (సెప్టెంబర్) 67.02 2016 (నవంబర్) 67.63 2017 (మార్చి) 65.04 2017 (ఏప్రిల్) 64.27 2017 (మే) 64.05 2017 (ఆగస్టు) 64.13 2017 (అక్టోబర్) 64.94 2018 (మే) 64.80 2018 (అక్టోబర్) 74.00 2019 (అక్టోబర్) 70.85 2020 (జనవరి) 70.96 2020 (డిసెంబర్) 73.78 2021 (జనవరి) 73.78 2021 (డిసెంబర్) 73.78 2022 (జనవరి) 75.50 2022 (డిసెంబర్) 81.32 2023 (జనవరి) 82.81 2023 (జూన్) 83.94 నిజానికి 1950 లలో ఒక రూపాయికి 16 అణాలు, 64 పైసలుగా విభజించారు. ఆ తరువాత 1 రూపాయికి 100 పైసలుగా ఫిక్స్ చేశారు. కాలక్రమంలో రూపాయి మాదిరిగానే అమెరికన్ డాలర్ కూడా ద్రవ్యోల్భణ ప్రభావానికి గురైంది. కొన్ని నివేదికల ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో రూపాయి & డాలర్ రెండూ సమానమే అని నమ్మేవాళ్ళు. దీనిపైనా అనేక వాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో మెట్రిక్ సిస్టం వంటివి లేదు కాబట్టి అన్ని కరెన్సీలు ఒక విలువను కలిగి ఉండేవని భావించేవారు. అధికారిక రికార్డుల ప్రకారం ఇది ఎప్పటికి సమానం కాదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా.. 1947కి ముందు భారతదేశం బ్రిటిష్ పాలిత రాష్ట్రంగా ఉండేది, కాబట్టి పౌండ్ విలువ ఎక్కువగా ఉన్నందున INR విలువ ఎక్కువగా ఉండేది. ఇక్కడ 1947లో 1 పౌండ్ 13.37 రూపాయలకు సమానమని నమ్మేవారు. 1944లో బ్రిటన్ వుడ్స్ ఒప్పందాన్ని ఆమోదించినప్పటి నుంచి చరిత్ర ప్రధానంగా ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందం ప్రపంచంలోని ప్రతి కరెన్సీ విలువను నిర్ణయించింది. -
స్వాతంత్య్ర దినోత్సవం: క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు నగదు బహుమతులు
సాక్షి, హైదరాబాద్: భారత్ 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తుంది.విద్యార్థులు క్విజ్, జనరల్ ఎస్సే, Art/ Drawing లలో పాల్గొనవచ్చును. ☛ క్విజ్ పోటీ : http://special.sakshi.com/independence_day_quiz/ ఈ లింక్ ద్వారా క్విజ్ పోటీలో పాల్గొనాలి. ఈ క్వీజ్‌లో పాల్గొనే అవకాశం.. ఆగస్టు 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ☛ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 'టెక్నాలజీ' ఎలా అభివృద్ధి చెందింది? అనే అంశం పై ఒక జనరల్ ఎస్సేను, అలాగే Independenceకి సంబంధించిన Art/ Drawing ని 9010050984 నెంబర్‌కు వాట్సప్ (లేదా) sakshieduinfo@gmail.comకి పంపండి. ఈ పోటీలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవి పూర్తి ఉచితంగా రాయవచ్చును. మీరు జనరల్ ఎస్సే, Art/ Drawingని పంపాల్సిన చివరి తేదీ ఆగస్టు 15, 2023. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వబడును. అలాగే పోటీలో పాల్గొన్న అందరికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. విజేతల ఫోటోతో పాటు పేరుని కూడా www.sakshieducation.comలో ప్రచురిస్తాము. ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడే మీ తెలివికి పదును పెట్టండి.. నగదు బహుమతి పొందండి. ఆల్ ది బెస్ట్.. -
ఎలుగెత్తి చెబుదాం గొంతెత్తి పాడుదాం
పిల్లలు నోరు తెరిచి దేశం గురించి మాట్లాడే రోజు ఆగస్టు 15. గొంతెత్తి దేశభక్తిని గానం చేసేరోజు మన స్వాతంత్య్ర దినోత్సవం. సంవత్సరంలో 364 రోజులు వారు ఫోనులోనో గేమ్స్లోనో మునిగి ఉన్నా ఈ ఒక్కరోజైనా వారి చేత దేశం గురించి మాట్లాడించాలి. దేశ ఘనతను పాడించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల చేత కనీసం ఒక పాట పాడించాలి. ఐదు నిమిషాలు మాట్లాడించాలి. ఏ పాటలు? ఏ మాటలు? ఇవిగోండి సలహాలు... ‘దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టొయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్’... అన్నారు గురజాడ. ‘దేశమును ప్రేమించాలి’ అని పిల్లలకు తెలుసు. కాని దేశంలో మంచి పెరిగితేనే అది ప్రేమించ దగ్గ దేశమవుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగినప్పుడే అది గొప్ప దేశమవుతుందని గురజాడ చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి ఒక పాటైనా పిల్లల చేత పాడించకపోతే తల్లిదండ్రుల పెంపకంలో నిర్లక్ష్యం ఉన్నట్టే అర్థం. ‘చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవ వలెనోయ్... అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్’ అని కూడా గురజాడ అన్నారు. ఇవాళ్టి సందర్భంలో పిల్లలకు ఈ పాట నేర్పి, దాని అర్థం మనసుకు ఎక్కించకపోతే భవిష్యత్తులో వారు ‘దేశమంటే మట్టే’ అనుకుంటారు. ‘మనుషులు’ అనుకోరు. త్యాగఫలం తెలియచేయాలి ఇవాళ మనం పీలుస్తున్న ప్రతి శ్వాస మన పూర్వికుల రక్తం, చెమట, త్యాగం ఫలితం. మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి భావితరాల చేతుల్లో పెట్టారు దేశాన్ని. ఎంతో విలువైన ఈ దేశ సంపద, దేశ సంస్కృతి పట్ల పిల్లలకు గౌరవం, బాధ్యత తెలియాలంటే వారిలో జాతీయ భావాలు, సుహృద్భావం కలగాలంటే ఆగస్టు 15ను ఒక సందర్భంగా చేసుకుని తెలియచేయాలి. ఇవాళ దురదృష్టవశాత్తు కొన్ని ఇళ్లల్లో పిల్లలకు తెలుగు నేర్పించడం లేదు. కొన్ని స్కూళ్లలో పిల్లలు జెండా వందనం రోజు జైహింద్ చెప్తే సరిపోతుందనుకుంటున్నారు. కనీసం ఒక బృందగానంలో కూడా పాల్గొనడం లేదు... వక్తృత్వంలో నాలుగు ముక్కలు దేశం గురించి మాట్లాడటం లేదు. అందుకే తల్లిదండ్రులు పూనుకుని తమ ప్రతి పిల్లల చేత అయితే తమ అపార్ట్మెంట్లో, లేదా తమ వీధిలో, ఇంట్లో ఏదో విధాన ఒక పాట పాడించడం, దేశం గురించి తప్పకుండా నాలుగు ముక్కలు మాట్లాడించడం అవసరం. పిల్లలు సరిగ్గా చెప్తే వింటారు. నేర్చుకుంటారు. వారికి ఆ వేళ విశేషమైన దుస్తులు, దేశభక్తులు వేషాలు వేస్తే ఎంతో సంబరపడతారు. ఆ స్ఫూర్తిని నింపుకుంటారు. ఆగస్టు 15 అంటే సెలవు దినం, ఆ రోజు ఎటైనా వెళ్లొద్దాం అని ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులు పిల్లలను దేశం వైపు నడిపించడంలో నిర్బాధ్యతగా ఉన్నట్టే లెక్క. ఎన్నో పాటలు పిల్లలు నేర్చుకుని పాడటానికి తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రయివేటు గీతాలతో పాటు సినీ గీతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి నేర్పించవచ్చు. ‘దేశమును ప్రేమించుమన్నా’ (గురజాడ), ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ (శంకరంబాడి), ‘జయజయ ప్రియభారత జనయిత్రి’ (దేవులపల్లి), ‘తేనెల తేటల మాటలతో’ (ఇంద్రగంటి శ్రీకాంత శర్మ), ‘మాకొద్దీ తెల్లదొరతనము’ (గరిమెళ్ల), ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ’ (వేములపల్లి శ్రీకృష్ణ)... ఇవన్నీ ఉన్నాయి. ఇక సినిమా పాటల్లో ‘పాడవోయి భారతీయుడా’ (శ్రీశ్రీ) పిల్లలు పాడటానికి సులువుగా ఉంటుంది. మన పిల్లలకు ‘వందేమాతరం’, ‘జనగణమన’, ‘సారే జహాసే అచ్ఛా’ కనీసం వచ్చునా రావా అన్నది కూడా గమనించుకుంటే మంచిది. దేశం గురించి మాట్లాడాలి పిల్లలు దేశం గురించి, దేశ ఔన్నత్యం గురించి మాట్లాడాలి. మాట్లాడటంలో వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఏం మాట్లాడాలన్న విషయంలో కొంచెం సాయం చేసినా పర్వాలేదు. ‘భిన్నత్వంలో ఏకత్వం’, ‘మన జాతిపిత’, ‘దేశాభ్యున్నతికై పర్యావరణ పరిరక్షణ’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్త్రీ శక్తి’, ‘సామాజిక బాధ్యత’... ఇలా ఏదో ఒక అంశం ఇచ్చి ఐదు నిమిషాలు మాట్లాడేలా చేయాలి. ఇది ఒక సంప్రదాయం. ఒక తరం నుంచి మరో తరానికి అందాలి. అమృతోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయడంలో పిల్లలను భాగస్వాములను చేయాలి. దేశ పతాకం పిల్లల చేతుల్లో రెపరెపలాడాలి. దేశభవిష్యత్తుకు వారే విధాతలు కావాలి. -
దేశమాతకు నెత్తుటి తిలకం
తెనాలి: క్విట్ ఇండియా.. ప్రతి భారతీయుడి నోట వినిపించిన రణన్నినాదం.. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన మహోజ్వలిత పోరాటం..! చైతన్యానికి మారుపేరైన తెనాలిలో ఆనాడు ఉద్యమం తారాస్థాయికి చేరింది. పోలీసు కాల్పుల్లో ఏడుగురి పోరాటయోధుల బలిదానానికి దారితీసింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టిన మహోద్యమంగా మలుపుతిరిగింది. గాంధీజీ పిలుపు మేరకు.. తెల్లదొరలను దేశం విడిచివెళ్లాలంటూ 1942లో గాంధీజీ ఇచ్చిన ‘క్విట్ఇండియా’ నినాదం మేరకు కాంగ్రెస్ వాదులు, విద్యార్థులు ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్నారు. ముంబై సమావేశంలో పాల్గొన్న ఆనాటి జిల్లా నేతలు కల్లూరి చంద్రమౌళి, వెలువోలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు, అవుతు సుబ్బారెడ్డి, శరణు రామస్వామి తెనాలి వచ్చారు. అగ్రశ్రేణి ఉద్యమ నేతల అరెస్టుతో నాటి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (వెర్రెయ్యగారి మేడ)లో కార్యకర్తలు సమావేశమై, మరుసటిరోజు ఆగస్టు 12న పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. కల్లూరి చంద్రమౌళి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నన్నపనేని వెంకట్రావు, కార్యదర్శి రావి అమ్మయ్య నేతృత్వంలో తెనాలి తాలూకా హైస్కూలు, భారత్ ట్యుటోరియల్ కాలేజి విద్యార్థులు సహా వేలాదిమంది బంద్‌లో పాల్గొన్నారు. రైల్వేస్టేషను సమీపంలో తెరిచి ఉంచిన హోటల్లోని ఫర్నిచరు, సామగ్రిని బయటపడేశారు. రైల్వేస్టేషనులో పండ్లదుకాణం, హోటల్‌నూ మూయించారు. అక్కడే స్పెన్సరు క్యాంటిన్‌లోకి వెళ్లి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. నార్త్ క్యాబిన్ దగ్గర్లోని ఆయిల్ ట్యాంకరుకు నిప్పటించారు. రెండు వ్యాగన్లలోని షాహి డక్కన్ సిగరెట్ బండిల్స్‌ను ప్లాట్‌ఫాంపై వేసి తగులబెట్టారు. రైల్వేస్టేషన్‌కు మంటలు వ్యాపించాయి. అప్పుడే చైన్నె నుంచి వచ్చిన ప్యాసింజరు రైలులోంచి ప్రయాణికులను దించేసి, నాలుగు బోగీల్లో కిరోసిన్ పోసి నిప్పంటించారు. అడ్డుకున్న బ్రిటిష్ కలెక్టర్, ఎస్పీ రైల్వేస్టేషను నుంచి కొత్తపేటలోని సబ్‌ట్రెజరీ కార్యాలయానికి వెళ్తుండగా, ప్రస్తుత రణరంగ్ చౌక్ ప్రాంతంలో ప్రత్యేక బలగాలతో వచ్చిన బ్రిటిష్ కలెక్టర్, ఎస్పీలు, ఉద్యమకారులను నిలువరించారు. దీంతో ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. సమీపంలోని కట్టెల అడితీ నుంచి కట్టెలు పైకిలేచాయి. పోలీసులు కాల్పులకు తెగబడటంతో ఏడుగురు అమరులయ్యారు. అంతర్జాతీయస్థాయిలో సంచలనం ఈ పోరు అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన చర్చిల్, సింగపూర్‌లో ఉన్న నేతాజీ దృష్టికి వెళ్లింది. బెర్లిన్, టోక్యో రేడియోలు ప్రసారం చేశాయి. ఘటన తర్వాత తెనాలిలో పౌరజీవితం పోలీసుల దయాదాక్షిణ్యమైంది. నాయకులు, దేశభక్తులను అరెస్టుచేసి, కోర్టుల్లో శిక్షలు విధించారు. మొదటి ముద్దాయి రావి అమ్మయ్యను కడలూరు జైలుకు పంపారు. విద్యార్థుల కోసం తాలూకా హైస్కూలుకు వెళ్లిన పోలీసులను ప్రధానోపాధ్యాయుడు జొన్నలగడ్డ శివసుందరం అనుమతించలేదు. తెనాలి ప్రజలపై రూ.2 లక్షల సామూహిక జరిమానా విధించి, వసూలుకు నానా బాధలు పెట్టారు. నేడు అమరవీరుల స్మరణ రణరంగ్ చౌక్‌లో ఏటా ఆగస్టు 12న మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వీరసంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యవేక్షణలో జరగనున్న కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. అమర వీరులకు నివాళి అర్పించనున్నారు. -
సీతకు అరుదైన అవకాశం
విజయనగరం ఫోర్ట్: ఢిల్లీలోని ఎర్రకోటలో ఈనెల 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకలను వీక్షించేందుకు చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామానికి చెందిన ఉపాధిహామీ వేతనదారు యందవ సీతకు ఆహ్వా నం అందింది. దేశవ్యాప్తంగా 1800 మందికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తోంది. వీరిలో సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, రైతులు, నర్సులు, మత్య్సకారులు, కూలీలు తదితర వర్గాలకు చెందిన వారు ఉంటారు. ఉపాధిహామీ వేతనదారుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి అవకాశం లభించగా అందులో సీత ఒకరు. ఈ నెల 13వ తేదీన గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. సంతోషంగా ఉంది ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు టీవీలో చూస్తేనే ఎంతో గొప్పగా ఉంటాయి. అలాంటి వేడుకులకు దగ్గరుండి వీక్షించేందుకు అవకాశం లభించడం ఆనందంగా ఉంది. మూడు రోజుల కిందట ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఆ తరువాత జిల్లా అధికారులు ఫోన్ చేశారు. ఈనెల 13న గన్నవరం నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. జీవితంలో మరిచిపోలేని సంఘటన ఇది. డిగ్రీవరకు చదువుకున్నాను. డైట్ శిక్షణ కూడా పొందాను. గత ఏడాది డిసెంబర్ వరకు ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేశాను. ఆరోగ్య సమస్య తలెత్తడంతో మానేసి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాను. – యందవ సీత, రామలింగాపురం గ్రామం, చీపురుపల్లి మండలం -
అలా మొదలై.. కాసుల పంట పండిస్తోంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. భారత క్రికెట్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. అభిమానులకు టీ20 క్రికెట్ రుచిని చూపించేందుకు పుట్టుకువచ్చిన ఐపీఎల్.. ఇప్పుడు కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌గా మారిపోయింది. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యారు. కోహ్లి నుంచి తిలక్ వర్మ వరకు ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన వారే. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను కోట్లకు అధిపతి చేసిన ఘనత కూడా ఈ ఐపీఎల్‌దే. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు. ఈ ఏడాదితో మొత్తం 16 సీజన్లను ఐపీఎల్ దిగ్వజయంగా పూర్తిచేసుకుంది. ఐపీఎల్‌తో భారత క్రికెట్లో ఒక కొత్త శకం మొదలైందనే చెప్పాలి. ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఐపీఎల్.. అంతే స్థాయి లాభాలతో మురిసిపోయింది. ఒక సాధరణ ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్‌గా మొదలైన ఐపీఎల్.. ప్రపంచక్రికెట్‌ను శాసించే స్ధాయికి ఎలా చేరుకుందో ఓ లూక్కేద్దాం. అలా మొదలైంది.. 15 ఏళ్ల క్రితం వరకు భారత డొమాస్టిక్ క్రికెట్లో కనీస మౌళిక సదుపాయాలు ఉండేవి కావు. ఈ క్రమంలో జాతీయ జట్టు నుంచి ఆటగాళ్లు రిటైర్ అయ్యాక.. వారిని భర్తీ చేసేందుకు సరైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోయేవారు. ఈ సమయంలో ఈస్సెల్ గ్రూపు సీఈవో సుభాష్ చంద్ర భారత క్రికెట్‌ను అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చాడు. భారత్‌లో జరిగే మ్యాచ్‌ల ప్రసారాల కోసం జీ స్పోర్ట్స్ ఛానల్‌ను ప్రారంభించాడు. అదే విధంగా టెన్‌స్పోర్ట్స్ ఛానల్లోని 50 శాతం వాటాను కూడా సుభాష్ చంద్ర కొనుగోలు చేశాడు. దీంతో పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్‌లో జరిగే మ్యాచ్‌లను ప్రసారం చేసే కాంట్రాక్ట్ టెన్‌స్పోర్ట్స్ దక్కించుకుంది. అయితే భారత్‌లో జరిగే మ్యాచ్‌లు టెలికాస్టింగ్ రైట్స్ మాత్రం జీ స్పోర్ట్స్ దక్కలేదు. జీ ఛానల్‌కు స్పోర్ట్ మార్కటింగ్ అనుభవం లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రసార హక్కులను తిరష్కరించాడు. సుభాష్ చంద్ర తన రాజకీయ పలుకుబడి ఉపయోగించిన ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రజాధారణ పెరుగుతోంది. దీంతో 2007లో దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ నిర్వహించింది. ఈ టోర్నీలో అండర్ డగ్స్గా బరిలోకి దిగిన భారత్.. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్ సాధించినప్పటికీ.. భారత్‌లో మాత్రం టీ20 క్రికెట్‌కు అదరణ పెద్దగా లేదు. ఈ క్రమంలో బీసీసీఐకు రెబల్‌గా ఉన్న సుభాష్ చంద్ర దేశీవాళీ క్రికెట్లో ఓ టీ20 టోర్నీని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లోని స్టార్ ఆటగాళ్లు, ప్రపంచంలోని కొంతమంది క్రికెటర్లతో సుభాష్ చంద్ర ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్‌కు అతడు ఇండియన్ క్రికెట్ లీగ్ అని నామకారణం చేశాడు. ఇండియన్ క్రికెట్ లీగ్ మొదటి సీజన్ 2007లో ప్రారంభమైంది. అయితే ఈ లీగ్‌పై బీసీసీఐ మొదటి నుంచే అంసతృప్తిగా ఉంది. ఈ లీగ్‌ను అపేందుకు బీసీసీఐ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా డొమాస్టిక్ క్రికెట్లో ఆటగాళ్ల జీతాలను భారీగా పేంచేసింది. ఆటగాళ్లు ఎవరూ ఈ లీగ్‌లో ఆడకూడదని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఐసీఎల్‌కు ఎండ్‌కార్డ్ వేయాలని బీసీసీఐ వ్యూహాలు మొదలుపెట్టింది. క్రమంలో బీసీసీఐ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న లలిత్ మోడీకి ఆలోచన వచ్చింది. బీసీసీఐ అద్వర్యంలోనే ఓ క్రికెట్ లీగ్ మొదలుపెడితే బాగుటుందని మోడీ నిర్ణయించుకున్నాడు. లలిత్ మోడీ ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిందే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్. 13 సెప్టెంబర్ 2007న ఐపీఎల్‌ను బీసీసీ అధికారంగా లాంఛ్ చేసింది. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) ఫార్మాట్ ఆధారంగా ఐపీఎల్ ఫార్మాట్‌ను మోడీ తీర్చిదిద్దాడు. మొదటి ఐపీఎల్ వేలం జనవరి 24, 2008న జరిగింది. 2008లో ప్రారంభమైన తొలి సీజన్లో మొత్తం 8 జట్లు పాల్గొనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్,డెక్కన్ ఛార్జర్స్,ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైటరైడర్స్ జట్లు, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మొదటి సీజనన్‌లో భాగమయ్యాయి. ఈ క్యాష్‌రిచ్ లీగ్ విజేతగా దివంగత షేన్ వార్న్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రూపంలో మరో రెండు జట్లు ఈ లీగ్‌లో భాగమయ్యాయి. ఇప్పటివరకు 16 సీజన్లలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలవగా.. కోల్‌కతా, డెక్కన్ ఛార్జర్స్ రెండు సార్లు, రాజస్తాన్, గుజరాత్ ఒక్కసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. యువ క్రికెటర్లు ఎంట్రీ.. యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఐపీఎల్ ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి జాతీయ జట్టులో చోటు దక్కించకున్నారు. ప్రతీ ఐపీఎల్ సీజన్ నుంచి సరికొత్త యంగ్ టాలెంట్ ప్రపంచానికి పరిచయవుతోంది. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడంతో యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చకుంటున్నారు. భారత్ మాత్రమే కాకుండా విదేశీ యువ క్రికెటర్లు కూడా ఐపీఎల్లో దుమ్మురేపుతున్నారు. బీసీసీఐపై కాసుల వర్షం... ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెటర్లపైనే కాకుండా భారత క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురిపిస్తోంది. బీసీసీఐను ప్రపంచక్రికెట్లో ధనిక బోర్డుగా ఐపీఎల్ మార్చేసేంది. బీసీసీఐకు ఐపీఎల్ బంగారు బాతు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ భారీగా అర్జిస్తోంది. తాజాగా ఐపీఎల్ ఐదేళ్ల(2023-27) మీడియా రైట్స్‌ను రూ. 48,390 కోట్లకు బీసీసీఐ విక్రయించింది. అంతేకాకుండా ఫ్రాంజైలు, కార్పొరేట్ స్పాన్సర్స్‌ల నుంచి వేల కోట్లు బీసీసీఐ ఖాజానాలో వచ్చి చేరుతున్నాయి. అభిమానులకు పండగే.. ప్రతీ ఏడాది క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు ఈ క్యాష్‌రిచ్ లీగ్ అలరిస్తోంది. మార్చిలో మొదలై మేలో ఈ వరల్డ్ ఫేమస్ లీగ్ ముగుస్తుంది. మ్యాచ్‌లో సమయంలో అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రతీ జట్టుకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఐపీఎల్ వల్ల నష్టాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. ఈ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో మోజులో పడి ఆటగాళ్లు తమ దేశం తరపున ఆడేందుకు విముఖత చూపుతున్నారు. కొంతమంది అయితే ఈ లీగ్‌ల్లో భాగం కావడానికి ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కే విడ్కోలు పలుకుతున్నారు. ఒకప్పుడు తమ దేశం తరపున ఆడితే చాలని భావించిన క్రికెటర్లు.. ఇప్పుడు ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్ల్లొ ఆడితే చాలని అనుకుంటున్నారు. అంతే కాకుండా ఐపీఎల్లో విరామం లేకుండా రెండు నెలలపాటు ఆడటంతో ఆటగాళ్లు అలసటకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ లీగ్‌లో గాయపడి దేశం తరపున ఆడే కీలక టోర్నీలకు దూరం అవుతున్నారు. అదే విధంగా ఈ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లు వల్ల టెస్టుక్రికెట్ కూడా ఆడేందుకు ఆటగాళ్లు ముందుకు రావడం లేదు. చాలా కెరీర్ ఉన్నప్పటికీ ముందుగానే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. బెట్టింగ్‌లు జోరుగా ఇక ఐపీఎల్లో మొదలైతే చాలు బెట్టింగ్ రాయులకు పండగే. ఈ క్రికెట్ పండగ జరిగే రెండు నెలలపాటు దేశవ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. చాలా మంది బెట్టింగ్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఐపీఎల్లో చీకటి కోణాలు.. ఇక విజయవంతంగా దూసుకుపోతున్న ఐపీఎల్లో వినోదం మాత్రమే కాదు ఎన్నో చీకటి కోణాలు కూడా ఉన్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం 2013 సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ తీవ్ర కలకలం రేపింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజయ్ చండీలా, అంకిత్ చౌహాన్ బుకీల నుంచి డబ్బు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. దీంతో బీసీసీఐ వారిపై జీవితకాల నిషేధం విధించింది. అలాగే రాజస్థాన్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించారు. ఐపీఎల్ లో ఓ సారి రాహుల్ శర్మ, దక్షిణాఫ్రికా ప్లేయర్ వైన్ పార్నెల్ ఓ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ పార్టీలో డ్రగ్స్ కూడా దొరికాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. అదే విధంగా ఛీర్ గర్ల్స్ ఊదంతం కూడా ఐపీఎల్ ను ఓ ఊపు ఊపేసింది. కొంతమంది ఆటగాళ్లు తామతో అసభ్య ప్రవర్తన చేశారని ఛీర్ గర్ల్స్ గతంలో ఆరోపణలు చేశారు. చదవండి: PV Sindhu Headlines This List: అప్పుడు వాళ్లు అలా! ఇప్పుడు వీరిలా.. తలెత్తుకునేలా చేశారు.. శెభాష్! -
ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించే సినిమాలు ఇవే
సినిమా అనేది వినోదాన్ని మాత్రమే కాదు పంచుతుందనుకుంటే పొరపాటే.. కొన్ని సనిమాలు యువకుల్లో దేశభక్తిని రగిలించింది. అందుకు తగినట్లుగానే కొందరు హీరోలు,దర్శకులు కథలను ఎంచుకుంటుంటారు. ఇలా వారు భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై 77వ స్వాతంత్య్రం సందర్భంగంగా కొన్నింటిపై ఫోకస్ చేయండి. గాంధీ (1982) 1982లో వచ్చిన గాంధీ సినిమా రిచర్డ్ అటెన్ బరో తీశారు. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. గాంధీజీ పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం ప్రత్యేకం. అయితే దానికి ప్రత్యేకమయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాను రూపొందించింది ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్లే. ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్‌లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్లే కి అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది. భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో ఆగష్ట్రు 14వ తేదీ నుంచి 24 వరకు 'గాంధీ' చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (2000) భీంరావ్ రాంజీ అంబేడ్కర్ పాత్రలో మమ్ముట్టి రోల్ ఔట్‌స్టాండింగ్ అనే చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా జబ్బర్ పటేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదట ఆంగ్లంలో నిర్మించబడింది. తరువాత ప్రాంతీయ భాషలలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంలో మమ్ముట్టి డాక్టర్ అంబేడ్కర్ పాత్రను పోషించారు. అతని నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేద్కర్ యొక్క పోరాటాలను దృశ్యమానం చేసిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్రం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాలని పిలుపునిచ్చింది. నిర్మాణాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. డాక్టర్ అంబేద్కర్గా మమ్ముట్టి నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002) హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు భగత్ సింగ్ గురించి 2002లో ఈ చిత్రం విడుదల అయింది. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ క్యారెక్టర్‌తో పాటు సుశాంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పూర్తిగా చూపించారు. 1931 మార్చి 24న అధికారిక విచారణకు ముందు జలియన్ వాలాబాగ్ మారణకాండను చూపినప్పటి నుంచి భగత్ సింగ్ ని ఉరి తీసే వరకు ఈ సినిమాలో చూయించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబానికి ఎలా ఎక్కాడో తెలిపే చిత్రమే ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. లగాన్ (2001) బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2001లో ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో ఎందరిలోనే దేశభక్తిని రగిలించిన సినిమా ఇది. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (2004) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా వచ్చిన Netaji Subhas Chandra Bose: The Forgotten Hero హిందీ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ని సినిమాగా తెరకెక్కించింది. ఇందులో నేతాజీగా సచిన్ ఖేడేకర్ కరెక్ట్‌గా సెట్ అయ్యారు. బ్రిటీష్ ఇండియాలో మహాత్మా గాంధీతో రాజకీయ విబేధాల తర్వాత, బోస్ అరెస్టు, విడుదలయ్యాక జరిగిన కథను వివరించారు. ఈ చిత్రానికి ఇండియన్ ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ దక్కింది. సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కింది. అలాగే 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఇండిపెండెన్స్ డే ఫిల్మ్ ఫెస్టివల్లో ఆగష్టు 14, 2016న ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ సినిమాకు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఎమ్ ఎక్స్ ప్లేయర్,యూట్యూబ్‌లో ఈ సినిమా ఉంది. సర్దార్ (1993) 1993లో ఈ చిత్రం విడుదలైంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను ఇండియన్ ఆఫ్ యూనియన్‌లో చేరేలా శ్రమించిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవితం ఆధారంగా నిర్మించిందే ఈ చిత్రం. ఈ సినిమాలో పరేష్ రావల్ సర్దార్‌గా నటించారు. ఈ సినిమాలో క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగిన అల్లర్లతో పాటు నెహ్రుతో సర్దార్కు ఉన్న విబేధాలను చూపుతుంది. సర్దార్ లాంటి వ్యక్తి లేకుండా ఉండి ఉంటే భారత్ ఇప్పటికి కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడొచ్చు కేసరి (2019) కేసరి 2019లో విడుదలైన బాలీవుడ్ సినిమా. 1897న భారత్‌లోకి సుమారు 10 వేలకు పైగా ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా చొచ్చుకొని వస్తారు. అప్పుడు వారందరినీ కేవలం 21 మంది సిక్కులు మాత్రమే ఎలా అడ్డుకున్నారు. అనేది ఈ సినిమాలో చూపిస్తారు .ఈ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట సన్నివేశాలు మెప్పిస్తాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మంగళ్ పాండే: ది రైజింగ్ (2005) మంగళ్ పాండే జీవితం ఆధారంగా 2005లో కేతన్ మెహతా దర్శకత్వంలో మంగళ్ పాండే: ది రైజింగ్ మూవీ వచ్చింది. ఇందులో ఆమీర్ ఖాన్ లీడ్ రోల్లో నటించారు. మంగళ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జులై 19, 1827న జన్మించారు. పాండే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో రెజిమెంట్‌లో సిపాయిగా చేరారు. అప్పట్లో అతను తన అసాధారణమైన ప్రతిభ, తెగువతో సైనిక దళ నాయకుడిగా ఎదిగారు. అయితే ఆ కాలంలో బ్రిటిష్ వారు అందించిన తుపాకీ తూటాలను సిపాయిల వీసమెత్తు నచ్చలేదు. ఈ గుండ్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. హిందువులు, ముస్లింల మత విశ్వాసాలకు ఇది విరుద్ధమని భావించిన సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. ఆ సందేహాలే చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు ఎలా దారితీసింది. పాండే ఉరి శిక్ష సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మణికర్ణిక (2019) 2019లో వచ్చిన ఈ సినిమా ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్ ఝాన్సీగా తన నటనతో భారతీయులను మెప్పించింది.1828లో వారణాసిలో తన పుట్టుకతో కథ మొదలౌతుంది. పరాక్రమానికి మారుపేరుగా లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఉంటుంది. ఝాన్సీ రాజు అయిన గంగాధర్ రావుతో ఆమెకు వివాహం అవుతుంది. రాజ్యం గంగాధర్ అన్న అయిన సధాశివ్ బ్రిటీష్ వారితో కలిసి కుట్ర పన్నుతాడు. అందులో భాగంగా గంగాధర్ రావును బ్రిటీష్ వారు చంపేస్తారు. తన భర్తకు ఇచ్చిన మాట కోసం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా రాజ్యాధికారం అందుకుంటుంది. ఈ క్రమంలో తెల్లవారిపై ఆమె చేసిన దండయాత్ర ఎలా ఉంటుందో చెప్పేదే మణికర్ణిక చిత్రం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!
Gold rates1947-2023 భారతీయులకు బంగారం అంటే లక్ష్మదేవి అంత ప్రీతి. చిన్నా పెద్దా తేడా లేకుండా భారతీయులు అందరూ పసిడి ప్రియులే. ఒక విధంగా చెప్పాలంటే పుత్తడి భారతీయ సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లు అయినా, పండగొచ్చినా, పబ్బమొచ్చినా, బంగారం ఒక భాగం కావాల్సిందే. అంతేకాదు భూమి, పొలంతోపాటు, భారతీయులు బంగారాన్ని 'సురక్షితమైన' పెట్టుబడిగా పరిగణిస్తారు. అందుకే గోల్డ్ వినియోగంలో చైనా తరువాత ఇండియా నిలుస్తోంది. బంగారం దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయితే 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బంగారం ధరల ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం! 1964లో బంగారం అతిపెద్ద పతనం ఇండిపెండెన్స్ తరువాత మొదలైన బంగారం ధర పెరుగుదల అలా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. కేవలం 1942లో క్విట్ ఇండియా సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.రూ.88.62 రెట్టింపు అయింది. ఇక తరువాత తగ్గడం అన్న మాట లేకుండా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే. 1947లో బంగారం ధర రూ. 88.62 అంటే అప్పట్లో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు 10 కిలోల బంగారం ధర కంటే ఎక్కువ ధర ఉండేది. కేవలం 5 సంవత్సరాల క్రితం అంటే 1942లో బంగారం ధర 10 గ్రాములకు రూ.44 ఉండేది. 1950 - 60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది. 1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర 184కి చేరింది. ఇది 1980లో రూ.1,330గా మారి 1990 నాటికి రూ.3,200 దాటింది. 2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది. 2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటి 2000-2010 మధ్య బంగారం రేటు పరుగులు పెట్టింది. రూ 4,400 నుండి 18,500 వరకు పెరిగింది. ఆ తరువాతి దశాబ్దంలో కూడా ధరలు రెండింతలు పెరిగాయి. 2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720. 2023లో రూ. 60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్ చేసింది. 2023లో పసిడి ధర హెచ్చుతగ్గులకు లోనైంది. అయితే 2022తో పోలిస్తే బంగారం ధరలు ఆల్‌టైం హైంకి చేరాయి.తొలి ఆరు నెలల్లో, ధరలు దాదాపు రూ.3,000 పెరిగాయి, దాదాపు 6.5శాతం లాభాన్ని చూసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ ఫెడ్ రేటు పెరుగుదల, ద్రవ్యోల్బణం బంగారం ధరలు పెరగడంలో పాత్రను పోషించాయి. బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల ఈక్విటీ మార్కెట్ సంవత్సరం ప్రారంభంలో నష్టపోయినా దలాల్ స్ట్రీట్‌లో గత రెండు నెలలుగా వరుసగా రికార్డు స్థాయిలు నమోదవుతున్నాయి. బంగారం ధరను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? పెట్టుబడి పరంగా బంగారం అత్యంత నమ్మదగిన ఎంపిక గోల్డ్. ప్రపంచ మార్కెట్లలో కదలిక కూడా బంగారం విలువను నిర్ణయిస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర పెరగడం, తగ్గడం దేశీయంగా ప్రభావం చూపుతుంది. భౌగోళిక, రాజకీయ అంశాలే కాకుండా, ఆర్థికమాంద్య పరిస్థితులు, ప్రభుత్వ విధానం కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. డాలరు, బంగారం , ద్రవ్యోల్బణం ఒకదానికొటి భిన్న దశలో కదులుతాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం తగ్గుతుంది. దిగుమతి ఎక్కడ నుంచి? స్విట్జర్లాండ్ నుంచి దాదాపు సగం బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. 2021-22లో మొత్తం బంగారం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ వాటా 45.8శాతం. స్విట్జర్లాండ్ బంగారం కోసం అతిపెద్ద రవాణా కేంద్రం. అక్కడి అత్యుత్తమ శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసిన బంగారం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతోంది. బంగారంలో దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో నష్టాలను తగ్గించే డైవర్సిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే చాలా కష్ట సమయాల్లో తక్షణం అక్కరకు వచ్చే ముఖ్యమైన ఎసెట్. స్టాక్ మార్కెట్లలో ఈక్విటీలలో నష్టాలొచ్చినా బంగరం మాత్రం మెరుస్తూనే ఉంటుంది. గోల్డ్ రేటు హిస్టరీ 1947 -రూ. 88.62 1964 -రూ. 63.25 1970 -రూ. 184 1975 -రూ.540 1980 -రూ.1,333 1985 - రూ.2,130 1990 - రూ.3,200 1995 - రూ.4,680 2000 - రూ.4,400 2005 - రూ.7,000 2010 - రూ.18,500 2015 - రూ.26,343 2016 - రూ.28,623 2017 - రూ.29,667 2018 - రూ.31,438 2019 - రూ.35,220 2020 - రూ.48,651 2021 - రూ.48,720 2022 - రూ.52,670 2023 - రూ.61,080 -
సినిమాని 'దేశభక్తి' కాపాడిందా? లేదంటే..!
యాక్షన్ సినిమా మీకు గూస్బంప్స్ తెప్పించొచ్చు.. హారర్ మూవీ భయపెట్టొచ్చు.. థ్రిల్లర్ మునివేళ్లపై కూర్చోబెట్టొచ్చు. రొమాంటిక్ లవ్‌స్టోరీ మిమ్మల్ని మైమరిచిపోయాలా చేయొచ్చు. ఇలా ఆయా జానర్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వీళ్లందరికీ నచ్చేది ఒకటుంది. అదే 'దేశభక్తి' జానర్. ఎన్నేళ్లు గడుస్తున్నా సరే ఈ తరహా సినిమాలకు ఉన్న డిమాండే వేరు. అయితే అన్నిసార్లు దేశభక్తి.. మన సినిమాను కాపాడిందా? తెలుగులో దేశభక్తి సినిమాలు బోలెడు. వీటిలో ది బెస్ట్ అంటే చాలామంది చెప్పేమాట 'ఖడ్గం'. ఏ ముహుర్తాన కృష్ణవంశీ ఈ మూవీ తీశారో గానీ ఈ జానర్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. చాలా సరదాగా మొదలై, క్లైమాక్స్ వచ్చేసరికి ఈ సినిమా మీలో ఎక్కడో మూల దాగున్న దేశభక్తిని రగిలిస్తుంది. అలానే 'ఖడ్గం'లోని ప్రతి పాట సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా హిట్ అయిందంటే దానికి ప్రధాన కారణం ఒక్కటే. అదే దేశభక్తి. (ఇదీ చదవండి: 'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) అలానే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించి, అలరించి ఆకట్టుకున్న దేశభక్తి సినిమాల్లో 'అల్లూరి సీతారామరాజు', 'మేజర్ చంద్రకాంత్', 'ఆర్ఆర్ఆర్' లాంటివి టాప్‌లో ఉంటాయి. వీటిలో ప్రారంభ సన్నివేశం నుంచి దేశభక్తిని ప్రతిబింబించే సీన్సే ఉండటం హైలెట్ అని చెప్పొచ్చు. వీటిల్లో కమర్షియల్ అంశాలున్నప్పటికీ మెయిన్ థీమ్‌ని దర్శకులు మర్చిపోలేదు. దీంతో ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేశాయి. దేశభక్తి పవర్ ఏంటో ప్రూవ్ చేశాయి. ఈ లిస్టులో మేజర్, సైరా తదితర చిత్రాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మిగతా భాషల్లో వచ్చిన దేశభక్తి చిత్రాలు మనవాటికి తక్కువేం కాదు. 'భారతీయుడు' దగ్గర నుంచి 'బోర్డర్', 'షేర్షా', 'కేసరి', 'ఉరి', 'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్', 'రాజీ'.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా ఉంటుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర అన్నిసార్లు దేశభక్తి వర్కౌట్ అయిందా అంటే 90 శాతం మాత్రమే అని చెప్పొచ్చు. ఆ 10 శాతం ఎందుకు అని మీరు కోపం తెచ్చుకోవచ్చు. ఆ పాయింటే ఇప్పుడు మాట్లాడుకుందాం. (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) దేశభక్తి అనేది కచ్చితంగా హిట్ అయ్యే జానర్ అని చాలామంది దర్శకులు అభిప్రాయం. అయితే ఈ పాయింట్‌తో సినిమాలు తీస్తున్నప్పుడు కొన్నిసార్లు తేడా కొట్టేస్తుంది. అంతెందుకు తెలుగులోనే విక్టరీ వెంకటేశ్ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు.. 'సుభాష్ చంద్రబోస్' అనే మూవీ తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఇది ఫెయిలైంది. బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు.. 'పరమవీరచక్ర' అనే దేశభక్తి సినిమా తీశారు. కానీ ఏం లాభం. ప్రేక్షకులు ఈ రెండు చిత్రాల్ని తిరస్కరించారు. ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే.. ఏ భాషలో అయినా 'దేశభక్తి' సినిమాలకు కొదవలేదు. కాకపోతే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే ఆయా స్టోరీని సరిగా హ్యాండిల్ చేయాలి. లేదంటే మాత్రం బొక్కబోర్లా పడటం గ్యారంటీ. ఇప్పటివరకు వచ్చినవాటిలో మాత్రం దాదాపుగా 90 శాతం సినిమాలి అద్భుతమైన విజయాల్ని అందుకున్నాయని చెప్పడంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదు. (ఇదీ చదవండి: ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ) -
Independence Day: అంతా పగలు జెండా ఎగరువేస్తే..అక్కడ మాత్రం..
అందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉదయమే జరుపుకుంటే అక్కడ మాత్రం అర్థరాత్రే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అంతా ఒకలా చేస్తే ఆ రాష్ట్రంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారు? పైగా వారికి అనాదిగా వస్తున్న సంప్రదాయమట. వారి పూర్వీకుల నుంచి ఇలానే చేస్తున్నారట. అసలు ఎందుకిలా అంటే.. బిహార్‌లోని పుర్నియా అనే ప్రాంతంలోని వాసులు మాత్రం అర్థరాత్రి 12.01 గంటలకు జెండా చౌక్ అనే ప్రాంతంలో జెండా ఎగురవేసి సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని ఇప్పటి వరకు అలానే కొనసాగిస్తున్నారు. వారంతా నాటి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు.. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించింది, మనకు స్వాతంత్య్రం వచ్చింది అని ప్రకటించడం.. రేడియోలకి అతుక్కుపోయి మరీ విన్నారు. ఆ తర్వాత వెంటనే పుర్నియా వాసి రామేశ్వరప్రసాద్ సింగ్, దాదాపు పదివేలమంది వ్యక్తులంత కలిసి ఇలా నెహ్రు ప్రకటించగానే అర్థరాత్రి ఆ క్షణమే జెండా ఎగరువేసి వారంతా సంబరాలు చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి దీన్ని ఒక ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ ఈ వేడుకల్లో ఆటంకం ఎదురుకాలేదని చెబుతున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం అతని వారసులు దీన్నికొనసాగిస్తున్నట్లు చెప్పారు. రామేశ్వర ప్రసాద్ మరణాంతరం ఆయన కూతురు సురేఖ దీన్ని పాటించిందని, ఇప్పుడూ మనవడు విపుల్ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో తెలుసా!ఏంటీ డౌంట్? అంటే..) -
‘నో జీ టూ 5జీ’ : టెలికాం రంగంలో భారత్ సాధించిన అతి పెద్ద విజయం ఇదే
ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎలా లైన్లు కట్టేవారో, అయినవారితో మాట్లాడడం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటల కొద్దీ వేచి ఉండేవారో చాలామంది తమ రాతల్లో చెబుతున్నారు. 90ల తరువాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చు. కానీ పాత తరాలకు ఇవి అనుభవమే. అలా ‘నో జీ నుంచి 5 జీ’ వరకు దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులే చోటు చేసుకున్నాయి. నోజీ నుంచి 2జీ, 3జీ, 4జీ, 5జీ వరకు స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ముబైల్ విప్లవంలో సంభవించిన మార్పులు గురించి తెలుసుకునే ముందు సాక్షి పాఠకులకు 76వ స్వంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర భారతదేశంలో టెలిఫోన్ అనేది ఓ విలాసవంతమైన సౌకర్యం. 90లకు ముందు కొత్త ఫోన్ కనెక్షన్ కోసం దరఖాస్తుకు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలే పట్టేది. మరణ వార్తను ఎక్కడో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటే రోజుల సమయం పట్టేది. దీంతో కడ చూపు చూసుకోకుండా పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన సందర్భాలు అనేకం. అలా బరువెక్కిన హృదయ విదారకరమైన సంఘటనల నుంచి తేరుకొని ఎన్నో విప్లవాత్మక మార్పులలో భాగమయ్యాయి. అందుకు 1991 నుండి టెలికాం రంగంలో జరిగిన మార్పులేనని చెప్పుకోవాలి. అప్పట్లో 1000 మందికి ఆరు ఫోన్లు మాత్రమే ఉండేవి. 2015లో 1 బిలియన్ ఫోన్ల మార్కును దాటింది. 24 సంవత్సరాల వ్యవధిలో ఏప్రిల్ 2022 నాటికి 1.14 బిలియన్ కనెక్షన్లను సాధించింది. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారత్‌లో కేవలం 80,000 టెలిఫోన్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ట్రంక్ బుకింగ్ 1990లకు ముందు, వైర్‌లైన్ కనెక్టివిటీ చాలా తక్కువ. సర్కిల్‌లలో స్థానికులతో మాట్లాడే వీలుంది. వేరే ప్రాంతానికి కాల్ చేయాల్సి వస్తే ఆ వ్యక్తి ‘ట్రంక్ కాల్’ బుక్ చేసుకోవాలి. ఇందుకోసం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే ఆపరేటర్‌కు కాల్ చేయాలి. వాస్తవానికి, ఇది 1970, 1980లలో ఒక సాధారణ జాబ్. ఆపరేటర్ కాల్ చేసి సాధారణ కాల్ (సాధారణ పల్స్ రేటు), అవసరమైన కాల్ (2x పల్స్ రేటు), అత్యవసర కాల్ (8x పల్స్ రేటు) మాట్లాడాలని కోరేవారు. మీరు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో..వారికి కాల్ కలిసేందుకు రోజంతా పట్టేది. అయితే అవసరమైన కాల్ సాధారణంగా నాలుగు గంటలలోపు, అత్యవసర కాల్ గంటలోపు కనెక్ట్ అయ్యేది. ఆపరేటర్ కాల్‌ను మాన్యువల్‌గా కలిపేవారు. వారి సంభాషణల్ని వినే అవకాశం ఉండేది. సబ్‌స్క్రైబర్ ట్రంక్ డయలింగ్ (STD) 1980ల చివరలో, 1990ల ప్రారంభంలో, టెలికాం కనెక్టివిటీ మెరుగైంది. ట్రంక్ బుకింగ్ ఆపరేటర్ వ్యవస్థ కనుమరుగైంది. సాంకేతిక విస్తృతంగా వ్యాపించింది. సిటీ కోడ్ (STD కోడ్) , ఫోన్ నంబర్‌ను డయల్ చేసి ఆపరేటర్‌తో పని లేకుండా వెంటనే కనెక్ట్ అయ్యేది. కాల్ రేట్లు రాత్రి 10 గంటల తర్వాత చేసే కాల్లకు 1/4 వ వంతు ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది. సూదూర ప్రాంతాలకు ఫోన్ చేసేందుకు దేశవ్యాప్తంగా STD/ISD/PCO బూత్‌లను ఏర్పాటు చేయడంతో STD కాల్లు చాలా మందికి కొత్త వ్యాపారం అవకాశంగా మారాయి. అయితే, మెరుగైన కనెక్టివిటీ రావడంతో, దాదాపు 2010ల వరకు STD కాల్ రేట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అవి దూరాన్ని బట్టి దేశంలో ఎక్కడికైనా కాల్ చేయాలంటే ఒకే ధరను చెల్లించాలని వెసలు బాటు ఉంది. అలాగే, గత దశాబ్దం ప్రారంభంలో, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP),చౌకైన సెల్‌ఫోన్ టారిఫ్‌లు STD/ISD/PCOల వ్యాపారం చేసుకునేందుకు చెల్లించే వారు. ఇంటర్నెట్ 1986 నుండి భారతదేశంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. కానీ గుర్తింపు, ఎంపిక చేసిన కొన్ని పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. 1995 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాత్రమే వీఎస్ఎన్ఎల్ (విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులకు ఇంటర్నెట్‌ని అందించింది. 1995లో ఇంటర్నెట్ కనెక్షన్‌కు విద్యార్థి అకౌంట్‌కు సంవత్సరానికి రూ. 5,000, టీసీపీఐపీ Transmission Control Protocol/Internet Protocol అకౌంట్ కోసం రూ. 15,000 ఖర్చవుతుంది. 133 కేబీబీఎస్ డయల్-అప్ మోడెమ్‌లు ప్రమాణంగా ఉండటంతో నేటితో పోలిస్తే వేగం చాలా నెమ్మదిగా ఉంది. సాధారణ 1ఎంబీ ఫోటోను డౌన్లోడ్ చేయడానికి అరగంట సమయం పట్టేది. ప్రస్తుతం అదే ఇంటర్నెట్ సాయంతో వాయిస్, వీడియో ,డేటా కాల్‌లను సజావుగా చేసుకోగలుగుతున్నాం. పేజింగ్ సేవలు 1990వ దశకం మధ్యలో ఫోన్లను ఎలాగైతే వినియోగించే వారో పేజింగ్ పరికరాలు (లేదా వన్-వే కమ్యూనికేషన్ పరికరాలు) అలా వినియోగించే వారు. వీటి ధర రూ. 2,000 నుంచి రూ. 7,000 మధ్యలో ఉన్నాయి. ఈ పేజర్లతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేవారు. మనం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ నుంచి ఎలా అయితే కాల్ చేస్తున్నామో అప్పుడు పేజర్లతో కాల్ చేసే వెసలుబాటు ఉంది. మొబైల్ ఫోన్ విప్లవం 1995లో అప్పటి ప్రభుత్వాలు టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించాయి. దేశంలో 20 టెలికాం సర్కిల్‌లుగా విభజిస్తే అందులో ఒక్కో సర్కిల్‌కు ఇద్దరు ఆపరేటర్లు 15 ఏళ్ల లైసెన్స్ పొందేవారు. అయితే, ప్రారంభంలో సెల్‌ఫోన్ టారిఫ్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్కమింగ్ కాల్స్‌కి కూడా నిమిషానికి రూ. 16.80కి చెల్లించేవారు. 2000 సవంత్సరం ప్రారంభంలో మాత్రమే సీపీపీ (కాలింగ్ పార్టీ పేస్) ద్వారా ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవడం ప్రారంభమైంది. ది జనరేషన్స్ భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడుకలోకి రావడంతో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చింది. 2000వ దశకం ప్రారంభంలో WAP (వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్) ద్వారా ఫోన్ లేదా, సాధారణ టెక్స్ట్ ద్వారా ఇమెయిల్‌ను యాక్సెస్ చేయవచ్చు. అదే సమయంలో స్మార్ట్ ఫోన్లలో పూర్తి బ్రౌజర్ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2జీ, 3జీ, 4జీ ఇలా లేటెస్ట్ సెల్యులార్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్నాం. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తక్కువ సెల్యులార్ కాలింగ్ ఛార్జీలు ఉన్న దేశంగా కొనసాగుతుంది. భవిష్యత్‌లో మానవ శ్రేయస్సుతో టెలికాం రంగం మరింత అభివృద్ది జరగాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఇదీ చదవండి : స్టార్టింగ్ శాలరీ రూ.25,500.. జాబ్ కోసం అప్లయ్ చేసుకుంది 10లక్షల మంది! -
అప్పుడు వాళ్లు అలా! ఇప్పుడు వీరిలా.. తలెత్తుకునేలా చేశారు.. శెభాష్!
Independence Day 2023: ఝాన్సీ లక్ష్మీబాయి.. బేగం హజ్రత్ మహల్.. అనీ బిసెంట్.. కమలా నెహ్రూ.. సరోజిని నాయుడు.. ఇలా ఎంతో మంది వీరవనితలు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని మహిళలు ఎవరికీ తీసిపోరని నిరూపించారు. స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు బ్రిటిషర్లతో జరిగిన మహాసంగ్రామంలో తాము సైతం అంటూ ముందడుగు వేసి జాతిని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తితో మరెంతో మంది స్త్రీమూర్తులు వంటింటి నుంచి బయటకు వచ్చి విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో తమ ప్రాతినిథ్యం ఉండేలా అడుగులు వేశారు. అయితే, నేటికీ స్వతంత్ర భారతంలో ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతుండటం విచారకరం. అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిందని సంతోషంతో స్వాగతాలు పలికేది కొందరైతే.. తల్లి కడుపులో ఉండగానే ఆడ శిశువులను చిదిమేసే కిరాతకులలు ఎందరో! మహిళల ఆహారపుటలవాట్లు మొదలు వస్త్రధారణ, చేయాల్సిన ఉద్యోగం గురించి కూడా తామే నిర్ణయించే ఈ పురుషాధిక్య ప్రపంచంలో.. అసమానతలను అధిగమించి ‘విశ్వవేదిక’పై సత్తా చాటడటమంటే మామూలు విషయం కాదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి క్రీడల్లో తలమానికమైన ఒలింపిక్స్‌లో భారత జాతి గర్వపడే విజయాలు సాధించిన బంగారు తల్లుల గురించి తెలుసుకుందాం! కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్‌లో మొట్టమొదటి పతకం సాధించిన భారత మహిళగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్- 2000లో వెయిట్‌లిఫ్టింగ్ 54 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. తద్వారా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ప్లేయర్‌గా సైనా నెహ్వాల్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. లండన్ ఒలింపిక్స్-2012లో ఈ మాజీ వరల్డ్ నంబర్ 1.. కాంస్య పతకం గెలిచింది. అంతకు ముందు బీజింగ్-2008, ఆ తర్వాత 2016- రియో ఒలింపిక్స్‌లోనూ ఆమె భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. మేరీ కోమ్ భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్యం అందించింది. బాక్సింగ్‌లో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్‌గా చరిత్రకెక్కింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య గెలిచిన విజేందర్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బాక్సర్‌గా నిలిచింది ఈ మణిపురీ ఆణిముత్యం. పీవీ సింధు ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పూసర్ల వెంకట సింధుది అసాధారణ విజయం. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనలిస్టు అయిన బ్యాడ్మింటన్ స్టార్ సింధు.. రజత పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ సింధు మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. గతంలో సిల్వర్ గెలిచిన ఆమె.. ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే, ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కడం విశేషం. సాక్షి మాలిక్ 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాలిక్ భారత్‌కు కాంస్యం అందించింది. 58 కేజీల విభాగంలో మెడల్ గెలిచింది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. మీరాబాయి చాను 2016లో నిరాశను మిగిల్చిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో మాత్రం సత్తా చాటింది. 49 కేజీల విభాగంలో వెండి పతకం గెలిచింది. తద్వారా ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో.. సిల్వర్ మెడల్ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించింది. లవ్లీనా బొర్గొహెయిన్ అసామీ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచింది. కనీస వసతులు లేని గ్రామం నుంచి వచ్చిన లవ్లీనా తన ప్రతిభతో తమ ఊరి పేరును ప్రపంచానికి తెలిసేలా చేసింది. చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్‌కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు -
ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో తెలుసా!ఏంటీ డౌంట్? అంటే..
ఆగస్టు 15 భారతదేశం తెల్లవాళ్ల పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు ఇది. 1947లో బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన తర్వాత నుంచే ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సంపాదించిపెట్టిన ఎందరో త్యాగధనులు, సమర యోధుల అలుపెరగని పోరాటాలను స్ఫురణకు తెచ్చకుని వారికి నివాళులర్పిస్తూ పండుగలా చేసుకుంటాం. అయితే అందరిలోనూ ఎదురయ్యే సందేహం ఇప్పుడూ మనం ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం? అని. ఇది 76వ? లేక 77వ దినోత్సవమా! అని మదిలో ఒకటే డౌట్. అందరూ చెప్పేది మాత్రం మనం 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని కరాఖండీగా చెబుతున్నారు. అసలు ఈ సందేహం ఎందుకు వస్తోంది అంటే.. నిజానికి మనం బ్రిటీష్ పాలన నుంచి మన దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారిగా 1948 ఆగస్టు 15న ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఆ లెక్కన గణిస్తే ఇది 76వ స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని చాలా మంది కాన్ఫిడెంట్‌గా అనడానికి గల కారణం ఏంటంటే..భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం లభించిందినే ఆధారంగా లెక్కిస్తే 2023 అనేది 77వ స్వాతంత్య్ర దినోత్సవం అవుతుంది. అయితే ఎక్కువగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతేకాదు దాదాపు 200 సంవత్సారాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ఈ దినోత్సవం థీమ్: "నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్" ఈ థీమ్ ముఖ్యోద్దేశం "కష్ట సమయాల్లో కూడా దేశ ప్రయోజనాలకే తొలి స్థానం" ఇవ్వాలనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక దినోత్సవాన్ని ఊరు, వాడతో సంబంధం లేకుండా అంతా ఒక్కటిగా ఆనందంగా జరుపుకునే గొప్ప సంబరం. త్రివర్ణ పతాకం ఎగరువేయడంతో ప్రారంభమైన ఈ దినోత్సవం..దేశం సాధించిన విజయాలను పరంపర నుంచి సాధించాల్సిన నిరంతర ప్రగతి ఆవశక్యతను గూర్చి తెలియజేసే సుదినం. ఇది గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు..ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూసే అవకాశం. ఇది భారతదేశానికి ఆధారమైన భిన్నత్వంలోని ఏకత్వం ప్రాముఖ్యత తోపాటు ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ప్రధాని జెండా ఎగరువేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ రోజంతా భారతదేశ గొప్ప సాంస్కృతికి వారసత్వం, వైవిధ్యాన్ని ప్రదర్శించేలా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కవాతులు జరుగుతాయి. అంతేగాదు రాబోయే తరాలకు బలమైన, సమగ్రమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే నిబద్ధతను పునరుద్దరించేందుకు ఈ దినోత్సవం ఓ మంచిరోజు. (చదవండి: స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం! బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!) -
మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా..
Indian Automobile History: సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో పూర్తి తెలుసుకుందాం. 1957 వరకు కూడా సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్‌హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి.. ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఆవిరితో నడిచే వాహనాలు.. తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్‌లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్‌లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది. భారతీయ ఆటోరంగానికి ఆటంకం.. ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్‌ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది. అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని.. అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్‌కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి. SIAM ఏర్పాటు.. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్‌హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది. వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్.. విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్‌గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది. ➤ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ➤ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ➤స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ➤భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి. ఇదీ చదవండి: స్వాతంత్య్రానికి ముందు దేశంలో ఎన్ని బ్యాంకులు ఉండేవో తెలుసా? ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకి ఎదుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!
భారత సంతతికిచెందిన టాప్ సీఈవోలు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ మొదలు, గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వరకు భారతీయులు గ్లోబల్ కంపెనీలకు సారధులుగా ఉండిమెప్పిస్తున్నారు. 76వ ఇండిపెండెన్స్‌డే సందర్భంగా దిగ్గజ కంపెనీల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ, దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంటున్న సీఈఓలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్థాయి వారికి అలవోకగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని, మొక్కవోని ధైర్యంతో అడుగులు వేయడమేకాదు, ఆధునిక టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 1990 దశకం నుంచి భారత సంతతికి చెందిన టెక్ నిపుణులు, వ్యాపార దిగ్గజాలు గ్లోబల్ కంపెనీల్లో కీలక పదవుల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాహ్మ్ అండ్ హాస్ ఛైర్మన్, సీఈఓగా రాజ్ గుప్తా బాధ్యతలు స్వీకరించి కొత్త శకానికి నాంది పలికారు. ఆ తరువాత స్టాన్ర్ట్ఫోర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్, సీఈఓగా యూఎస్ ఎయిర్వేస్ గ్రూప్‌నకు రాకేశ్ గంగ్వాల్ సీఈగా ఎంపికై తమ ఘనతను చాటుకున్నారు. అజయ్‌పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్‌పాల్ సింగ్ బంగా లేదా అజయ్‌బంగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కుమారుడు. పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ,అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశారు.నెస్లే తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అజయ్‌పాల్ సింగ్ బంగా అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా, అంతకు ముందు ఏప్రిల్ 12, 2010 నుంచి 11 సంవత్సరాల పాటు మాస్టర్‌కార్డ్ సీఈవోగా పనిచేశారు. గతంలో పెప్సికో ,సిటీ గ్రూప్‌లో కూడా పనిచేశారు.ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. గీతా గోపీనాథ్ గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్లోనికోల్కతాలో పుట్టారు. 2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికై తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2019-2022 దాకా ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ఐఎంఎఫ్‌లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు. జాన్ జ్వాన్‌స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (2005-2022), అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. గోపీనాథ్ క్రీడలు, సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ. అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిచాయ్ సుందరరాజన్ సుందర్‌పిచాయ్ తమిళనాడులో చెన్నైలోని అశోక్ నగర్లో జన్మించారు. తల్లి లక్ష్మి వృత్తిరీత్యా స్టెనోగ్రాఫర్, తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. 2015లో గూగుల్ సీఈగా నియమితులయ్యారు. అనంతరం కేవలం నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈవోగా ఎంపిక కావడం గమనార్హం. సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్స్ డిగ్రీని, విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.2021లో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అరవింద్ కృష్ణ ఐబీఎం ఛైర్మన్ , సీఈవో 1990లో ఐబీఎంలోచేరారు కృష్ణ. ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవో ఆతరువాత జనవరి 2021లో ఛైర్మన్‌గా బాధ్యలను స్వీకరించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్ ,బ్లాక్‌చెయిన్, నానోటెక్నాలజీతో సహా కోర్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆవిష్కరణలతో ఐబీఎం మార్కెట్‌ను విస్తరించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అరవింద్ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , అలాగే నార్త్రోప్ గ్రుమ్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన అరవింద్ కాన్పూర్ ఐఐటీనుంచి డిగ్రీ , అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేశారు. లక్ష్మణ్ నరసింహన్ స్టార్‌బక్స్ సీఈఓ 2023 ఏప్రిల్ 1న స్టార్‌బక్స్ సీఈవోగా ఎంపికయ్యారు. లక్ష్మణ్ నరసింహన్ యూనివర్సిటీ ఆఫ్ పుణెలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ , యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జర్మన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఆయనకు ఎంఏ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్ష్టన్ స్కూల్ నుంచి ఆయన ఫైనాన్స్‌లో ఎంబీఏ పొందారు. ఇంద్రా నూయి: భారత సంతతికి చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి 12 ఏళ్ల పాటు అమెరికా దిగ్గజం పెప్సీకోకు సీఈవోగా పనిచేశారు. 2018లో ఆమె పదవీ విరమణ చేశారు. చెన్నైకి చెందిన నూయి, 1996లో పెప్సికోలో చేరిన ఆమె 2006- 2018 వరకు సీఈఓగా పనిచేశారు. శ్రీకాంత్ దాతర్ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్. హార్వర్డ్ హార్వర్డ్ లో ఏకకాలంలో ఆర్థర్ లోవ్స్ డికిన్సన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా పనిచేసారు 2021లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శ్రీకాంత్ 1976-78లో IIMAలో మేనేజ్మెంట్లో PGP చేసారు. 1978-80 టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తో కలిసి పనిచేశారు. 1985లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం (అకౌంటింగ్)లో పీహెచ్డీ పొందారు. కార్నెగీ మెల్లన్ అండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, 1996 నుండి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో IIMAలో విద్యార్థిగా, విద్యార్థి వ్యవహారాల మండలి సమన్వయకర్త (1977-78) గా పనిచేయడమే కాదు ఔట్ స్టాండింగ్ ఓవర్ ఆల్ పెర్పామెన్స్ అవార్డు' అందుకున్నారు. ఆతరువాత, IIMA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (2012-18)లో పనిచేశారు. డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా 2009లో ఆసియాలోనే పాపులర్బ్యాంకు డీబీఎస్గ్రూప్ సీఈవో డైరెక్టర్‌గా ఎంపికైనారు.ఈ గ్రూప్ ఆస్తుల విలువ 2019లో నాటికి 500 బిలియన్ల కంటే ఎక్కువ. 1960లో మీరట్‌లో జన్మించిన పీయూష్ గుప్తా ఢిల్లీలోని సెయింట్ కొలంబా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1980లో అహ్మదాబాద్‌లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. ప్రముఖ కంపెనీల్లోని మరికొంతమంది భారత సంతతి సీఈవోలు వివేక్ శంకరన్- ఆల్బర్ట్సన్స్ అధ్యక్షుడు, సీఈవో సంజయ్ మెహ్రోత్రా- మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్,సీఈవో శాంతను నారాయణ్- అడోబ్ ఐఎన్‌సీ ఛైర్మన్, సీఈవో సీఎస్ వెంకట కృష్ణన్- బార్క్లేస్ సీఈవోపునిత్ రెన్జెన్- డెల్లాయిట్ సీఈవో రేవతి అద్వాతి- ఫ్లెక్స్ సీఈవో -
స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్ చరిత్ర
బ్యాంకులు చాలా కాలంగా మన జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. బ్యాంకింగ్ రంగం మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్ర చాలా దశలు, సంస్కరణలను చూసింది. అప్పటి నుంచి నిరంతరం అభివృద్ధి చెందుతోంది. 1949 బ్యాంకింగ్ కంపెనీల చట్టం ప్రకారం, బ్యాంకింగ్ అనేది ప్రజల నుంచి రుణాలు లేదా పెట్టుబడి కోసం డిపాజిట్లను తీసుకునే ఆర్థిక సంస్థగా నిర్వచించారు. ఖాతాదారులకు అవసరమైనప్పుడు డిపాజిట్లను బ్యాంకులు తిరిగి చెల్లిస్తాయి. ప్రాథమికంగా బ్యాంకులు అందించే సేవలు ఇవే అయినప్పటికీ కాలానుగుణంగా బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. (మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!) భారతీయ బ్యాంకింగ్ చరిత్ర వేద కాలం నుంచి భారతదేశంలో బ్యాంకింగ్ ప్రాబల్యం ఉంది. భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రను మూడు దశలుగా వర్గీకరించవచ్చు. 1947 స్వాతంత్య్రానికి ముందుది మొదటి దశ, 1947 నుంచి 1991 వరకు రెండో దశ, 1991 తర్వాతది మూడో దశ. 600లకు పైగా బ్యాంకులు స్వాతంత్ర్య పూర్వ దశలో భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రలో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ దశలో దేశంలో 600 కంటే ఎక్కువ బ్యాంకులు ఉండేవి. భారతదేశంలో మొదటి బ్యాంక్ 1770లో ఏర్పాటైంది. అదే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. తద్వారా భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ పునాదిగా మారింది. మొదటి దశలో దేశంలో మూడు బ్యాంకులు విలీనం అయ్యాయి. అవి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. అవన్ని విలీనమై తర్వాత ఇంపీరియల్ బ్యాంక్‌గా ఉనికిలోకి వచ్చాయి. తరువాత 1955లో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇదే కాలంలో మరికొన్ని ఇతర బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయి. అలహాబాద్ బ్యాంక్ 1865లో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో, బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఏర్పాటయ్యాయి. -
దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్‌కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు
సౌరవ్ చండీదాస్ గంగూలీ.. ఈ పేరు తెలియని భారత క్రికెట్ అభిమాని ఉండడు. ఇతన్ని అందరూ ముద్దుగా దాదా (బెంగాలీలో అన్న అని అర్ధం) అని పిలుచుకుంటారు. 90వ దశకంలో (1992) అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగపెట్టి, దాదాపు 16 ఏళ్ల పాటు (2008) దిగ్విజయంగా కెరీర్‌ను కొనసాగించిన ఈ కోల్‌కతా ప్రిన్స్.. అత్యుత్తమ బ్యాటర్‌గా, ఆల్‌రౌండర్‌గా, అత్యుత్తమ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకున్నాడు. 1992లో విండీస్‌తో వన్డేతో ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభించిన దాదా.. ఆ మ్యాచ్‌లో విఫలం కావడంతో దాదాపు నాలుగేళ్ల పాటు భారత జట్టుకు ఆడలేకపోయాడు. అనంతరం 1996 ఇంగ్లండ్ పర్యటనలో రెండో టెస్ట్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన గంగూలీ.. తానాడిన తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి, సెన్సేషన్‌గా మారాడు. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోని గంగూలీ భారత క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగాడు. టీమిండియాలో ఓ పక్క సచిన్ హవా నడుస్తున్నా, బ్యాటర్‌గా గంగూలీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకున్నాడు. దూకుడే మంత్రంగా గంగూలీ తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అప్పటివరకు గంగూలీలా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన భారత బ్యాటర్లు లేరు. 1997లో శ్రీలంకపై తొలి వన్డే శతకాన్ని బాదిన దాదా.. ఆ తర్వాతి కాలంలో వన్డే క్రికెట్లో దాదాగిరి కొనసాగించాడు. 1998లో పాక్‌తో జరిగిన సహారా కప్‌లో 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న గంగూలీ, ఆ సిరీస్‌తో తనలోని బౌలర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 1999 వరల్డ్‌కప్‌లో గంగూలీ బ్యాటింగ్ శిఖరాగ్ర స్థాయికి చేరింది. ఆ మెగా టోర్నీలో అతను ఎన్నో రికార్డులను సాధించాడు. ప్రపంచ క్రికెట్‌పై మొదలైన దాదాగిరి.. అనూహ్య పరిణామాల మధ్య 2000 సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. కెప్టెన్‌గా తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఆట పరంగా, వ్యక్తిగతంగా దూకుడు స్వభావి అయిన గంగూలీ అదే మంత్రాను కెప్టెన్‌గానూ కొనసాగించాడు. అదే దూకుడును భారత జట్టుకు కూడా నేర్పించాడు. అప్పట్లో ఆటతో పాటు మాటకు కూడా పని చెప్పే ఆస్ట్రేలియన్లతో సై అంటే సై అన్నాడు. అప్పటిదాకా నిదానంగా ఉండిన టీమిండియా ఆటగాళ్లలో ధైర్యాన్ని నూరిపోశాడు. గంగూలీ నేతృత్వంలో భారత జట్టు డిఫెన్సివ్ మోడ్ నుంచి అటాకింగ్ మోడ్‌కు గేర్ మార్చింది. దీని ఫలితంగా టీమిండియా ఎన్నో అపురూప విజయాలు సాధించింది. ఆ సమయంలో భారత జట్టు తిరుగులేని జట్టుగా చలామణి అయ్యింది. ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లన్నీ టీమిండియా దెబ్బకు గడగడలాడాయి. భారత క్రికెట్‌కు అది స్వర్ణయుగంగా చెప్పవచ్చు. మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు దాదా హయాంలో వెలుగులోకి వచ్చారు. ఓరకంగా చెప్పాలంటే వారు దాదా అండర్లోనే రాటుదేలారు. ఆతర్వాత ప్రపంచ స్థాయి క్రికెటర్లుగా పేరొందారు. ఈ క్రమంలోనే దాదా సారధ్యంలో భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. అప్పటివరకు విదేశాల్లో అడపాదడపా విజయాలు సాధించిన టీమిండియా గంగూలీ నేతృత్వంలో ఆసీస్ లాంటి జట్టును వారి స్వదేశంలోనే ఓడించి చరిత్ర సృష్టించింది. అదే దాదాగిరితో 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2003 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరింది. Making us believe in our abilities with pride & passion, he turned us into "Overseas Tigers". We've had many great leaders & will keep having them. But the foundation you built at the time of crisis will never ever be forgotten. HBD @SGanguly99 "Dada" ❤pic.twitter.com/WzN9yQGIob — North Stand Gang - Wankhede (@NorthStandGang) July 8, 2023 2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచాక గంగూలీ షర్ట్ విప్పి చేసుకున్న సంబురాలు భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అత్యన్నత శిఖరాలు అధిరోహించిన గంగూలీ.. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అత్యుత్తమ కెప్టెన్లలో ప్రథముడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌పై దాదాగిరి చేసిన గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలను మార్చాడని వేనోళ్ల కీర్తించబడ్డాడు. గంగూలీ నేతృత్వంలో భారత జట్టు అత్యుతన్న శిఖరాలను అధిరోహించిందని, కెప్టెన్‌గా గంగూలీ జమానా భారత క్రికెట్‌కు స్వర్ణయుగం లాంటిదని విశ్లేషకులు సైతం అభివర్ణిస్తారు. -
స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం!బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!
1942 ఆగస్టు 9న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో లేవనెత్తిన 'డూ ఆర్ డై అనే నినాదమేస క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది. ఇదే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వలసవాద వ్యతిరేక ఉద్యమాలలో ఒకటిగా పేరుగాంచింది. దీనినే భారత్ చోరో ఆందోళన అని కూడా పిలుస్తారు. ఈ ఉద్యమే భారత స్త్రీ ఆవేశాన్ని వెలకితీసింది. ఆ ఉద్యమంలో వారేమీ సంప్రదాయ ముసుగులో మగ్గిపోతున్న వంటింటి కుందేళ్లు గాదని అవసరమైతే దేశం కోసం చీరను నడుముకి బిగించి కథన రంగంలోకి దిగే అపర కాళీశక్తులని ఎలుగెత్తి చెప్పారు. బ్రిటిషర్ల గుండెల్లో భయాన్ని పుట్టించారు. భారత స్త్రీ అంటే ఏంటో చూపించారు. వారి ధైర్యసాహసాలు, అపార త్యాగనిరతితో కరడుగట్టిన బ్రిటిషర్ల మనసులనే కదిలించారు. చివరికి నారీమణుల ధీ శక్తికి తెల్లవాళ్లే తలవంచి నమస్కరించి "జయహో భారత్" అనేలా చేసింది. పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్న తరుణంలో నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ధీరవనితలు గురించి తెలుసుకుందామా! బహుశా ఆమే తొలి రేడియో జాకీ..! క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 22 ఏళ్ల విద్యార్థిని ఉషా మెహతా. ఆమె తన గాత్రంతో నాటి ఉద్యమ పరిస్థితులను వివరిస్తూ బ్రిటిషర్లను గడగడలాడించింది. ఆమె బహుశా బారతదేశపు తొలి రేడియో జాకీ కావచ్చు. మెహతా ఎంత ధైర్యవంతురాలు అంటే భూగర్భ రేడియో స్టేషన్ ద్వారా ఉద్యమాల్లో జరుగుతున్న తాజా పరిణామాలను గురించి దేశాన్ని ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేసేది. వార్తా సంస్థలను అణివేసే వార్తలన్నింటిని ధైర్యంగా ప్రసారం చేసేది. పోలీసుల కళ్లుగప్పి రహస్యంగా సేవలందించేది. తన ఉనికిని కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ.. వివిధ ప్రదేశాల్లోని స్టేషన్లలో దేశభక్తి గీతాలతోపాటు మనోహర్ లోహియా వంటి విప్లవకారుల ప్రసంగాలను ప్రసారం చేసింది. ఈ రేడియో స్టేషన్ ఆగస్టు 27, 1942న 41.72 మీటర్ల బ్యాండ్‌తో ప్రారంభమయ్యింది. ఇది మార్చి6, 1943 వరకు కొనసాగింది. ఇది చివరిసారిగా జనవరి 26, 1944న ప్రసారమయ్యింది. గాత్రంతో కూడా దేశాన్ని రక్షించుకుంటూ వలసవాదుల గుండెల్లో గుబులు తెప్పించొచ్చు అని రుజువు చేసిన ఘట్టం. గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ అరుణ్ అసఫ్ అలీని గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని కూడా పిలుస్తారు. అరుణా అసఫ్ అలీ 1942లో గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో త్రివర్ణ భారత జెండాను ఎగురవేశారు. బ్రిటిష్ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్న తరుణంలో అరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లి మరీ స్వాతంత్ర పోరాటం కోసం చేస్తున్న ఉద్యమానికి నాయకత్వం వహించింది. అలాగే ఈ ఉద్యమంపై ప్రజల్లో చైతన్యం తెప్పించేలా భూగర్భ రేడియో స్టేషన్, ఇంక్విలాబ్' అనే పత్రికల సాయంతో ప్రచారం చేసింది. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు, 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. 1932లో, తీహార్ జైలులోని ఖైదీల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఆమె నిరాహారదీక్ష చేసింది. ఆ ఉపవాస ఫలితంగా ఆమె శరీరంలలో ఒక్కసారిగా జీవక్రియ స్థాయిలు పడిపోయి పరిస్థితి విషమించి మరణించింది అరుణ్ అసఫ్ అలీ. ఈ ఘటన కొంతమంది బ్రిటిషర్లను కదిలించడమే గాక భారత స్త్రీలు సహనమే ఆభరణంగా చేసుకుని పోరాడగలరనే విషయాన్ని గుర్తించారు. నెత్తురొడ్డుతున్న లెక్కచేయని తెగువ.. వృద్ధారాలు సైతం దేశం కోసం పరాక్రమంతో పోరాడగలదని చెప్పిన ఘట్టం. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాకు చెందిన మాతంగిని హజ్రా అనే 73 ఏళ్ల మహిళ క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అంతగా తెలియని, గుర్తించని నాయకురాళ్లో ఒకరామె. సెప్టంబర్ 29న 6 వేల మంది స్వాతంత్య్ర సమరయోధులను తమ్లుక్ పోలీస్ స్టేషన్‌ను దోచుకున్నారు. ఆసమయంలో కాల్పులు జరగగా..ఆమె బుల్లెట్ల బారినపడ్డప్పటికీ తలెత్తి వందేమాతరం అంటూ జెండాపట్టుకుని మరీ ఊరేగింపులో కొనసాగింది. నెత్తురొడ్డుతున్న లెక్కచేయలేదు. వందేమాతరం అంటూ కన్నుమూసింది. చివరి శ్వాసవరకు దేశం కోసం పోరాడటం అంటే ఏంటో చాటి చెప్పింది హజ్ర. ప్రజల్ని కదిలించిన గొప్ప ఘట్టం అది. మీ డ్యూటీ మీరు చేయండి! అస్సాంలోని గోహ్పూర్ నివాసి కనకలత బారువా. ఆమె 17 ఏళ్ల వయసులో 5 వేల మంది సైన్యానికి నాయకత్వం వహించి ఏకంగా పోలీస్ స్టేషన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఆ పోలీస్టేషన్‌కి ఇన్చార్జ్గా ఉన్న నాటి ఆఫీసర్ రెబాతి మహన్ సోమ్ దీన్ని ఆపమని బారువాను అభ్యర్థించినా వినలేదు. పైగా మీరు మీ డ్యూటీ చేయండి నేను నా పని చేస్తానని తెగేసి చెప్పింది. ఏ మాత్ర భయం లేకుండా తన పాదయాత్రను కొనసాగించింది. దీంతో పోలీసులు చేసేదేమి లేక ఆమెపై కాల్పలు జరిపారు. ఆ ఫైరింగ్ కారణంగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘట్టం ఒక స్త్రీలోని దాగున్న తెగువతో కూడిన ఆవేశాన్ని తెలియజేసింది. ఈ ఘటన ఒకరకంగా బ్రిటిషర్లను మదిలో భయాందోళలనలను రేకెత్తించిందనే చెప్పాలి. రెండు నెలల పాపతో పోరాటంలోకి దిగిన ఓ తల్లి కేరళలోని అత్యంత ప్రసిద్ధ చెందిన స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరు కుట్టిమలు అమ్మ. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులలో ఒకరు. స్థానిక మహిళలతో బ్రిటిష్ సైనికులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే కథనాన్ని ప్రచురించినందుకు ప్రభుత్వం ఆమె మాతృభూమి పత్రికను నిషేధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమ్మ మహిళల ఊరేగింపుకు నాయకత్వం వహించింది. ఆమెతో పాటు రెండు నెలల పాప కూడా ఉంది. వెంటనే నాటి బ్రిటిష్ ఆఫీసర్లు ఆమెను బిడ్డతో సహా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. అంతేగాదు ఆమె భారత స్వాతంత్య్ర పోరాటాలన్నింటిల్లో చురుగ్గా పాల్గొంది. రెండు సార్లు జైలు పాలైంది కూడా. ఆమె విడుదలైన తదనంతరమే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైంది కూడా. 1985లో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచింది. (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
కత్తి మీద సాములా సాగిన కపిల్ దేవ్ జమానా.. వరల్డ్‌కప్ విజయం మినహా..!
భారత క్రికెట్ అంటే సగటు క్రికెట్ అభిమానికి ముందుగా గుర్తొచ్చేది 1983 వరల్డ్‌కప్. ఆ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. నాటి అగ్రశ్రేణి జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి జగజ్జేతగా అవతరిచింది. ఈ వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ ఆడిన ఇన్నింగ్స్ (175 నాటౌట్), విండీస్‌తో జరిగిన ఫైనల్లో మొహిందర్ అమర్నాథ్ మ్యాజిక్ బౌలింగ్ (7-0-12-3) భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి. అలాగే ఈ టోర్నీలో కపిల్ దేవ్ భారత జట్టును విజయవంతంగా ముందుండి నడిపించిన తీరును భారత క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. ఈ గెలుపు తర్వాత ప్రతి భారతీయుడు గర్వంతో పొంగియాడు. ఈ విజయం ప్రతి భారత క్రీడాకారుడిలో స్పూర్తి నింపింది. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం కపిల్ డెవిల్స్ అందించిన స్పూర్తితోనే తన కెరీర్‌ను విజయవంతంగా సాగించాడు. అయితే, ఇంత గొప్ప విజయం సాధించి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన కపిల్‌కు కెప్టెన్‌గా ఆ తర్వాతి కాలం మాత్రం అంత సాఫీగా సాగలేదు. వరుస పరాజయాలు, ఫామ్ లేమి, సహచరుడు, మాజీ కెప్టెన్ గవాస్కర్‌తో విభేదాల కారణంగా వరల్డ్‌కప్ గెలిచిన ఏడాదిలోపే కెప్టెన్సీని కోల్పోయాడు. వరల్డ్‌కప్‌కు ముందు 1982లో సారథ్య బాధ్యతలు చేపట్టిన కపిల్ రెండేళ్ల పాటు కెప్టెన్‌గా కొనసాగాడు. కెప్టెన్‌గా తన టర్మ్‌లో కపిల్ వరల్డ్‌కప్ విజయం, అంతకుముందు విండీస్ పర్యటనలో ఓ వన్డేలో విజయం మినహా పెద్దగా సాధించింది లేదు. అయితే వరల్డ్‌కప్‌కు ముందు విండీస్ పర్యటనలో మాత్రం కపిల్ వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించాడు. ఆ సిరీస్‌లో అతను ఓ మ్యాచ్ సేవింగ్ సెంచరీతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. కపిల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాక సెలెక్టర్లు మళ్లీ భారత జట్టు పగ్గాలు గవాస్కర్‌కు అప్పగించారు. ఈ విడత గవాస్కర్ ఏడాది పాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. అనంతరం మళ్లీ 1985 మార్చిలో కపిల్ టీమిండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా ఘనంగా పునరాగమనం చేసిన కపిల్.. 1986లో భారత్‌కు అపురూప విజయాలను అందించాడు. ఆ ఏడాది భారత్.. ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఇదే ఊపులో 1987 వరల్డ్‌కప్ బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో కపిల్ నిజాయితీ భారత్ కొంపముంచింది. ఆసీస్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కపిల్ అంపైర్ చేసిన ఓ పొరపాటును సరిచేయగా.. అప్పటివరకు 268 పరుగులుగా ఉన్న ఆసీస్ స్కోర్ 270కి చేరింది. ఆ మ్యాచ్‌లో అంపైర్ పొరపాటున సిక్సర్‌ను ఫోర్‌గా పరిగణించగా, కపిల్ ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం స్వచ్ఛందంగా వెళ్లి ఈ విషయాన్ని అంపైర్‌తో చెప్పాడు. దీంతో ఆసీస్ స్కోర్ 270 అయ్యింది. ఛేదనలో భారత్ 269 పరుగులకు పరిమితం కావడంతో పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి తర్వాత కపిల్ భారత సారధ్య బాధ్యతలను ఎప్పుడూ చేపట్టలేదు. భారత్‌కు వరల్డ్‌కప్ అందించానన్న తృప్తి తప్ప కెప్టెన్‌గా కపిల్‌కు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ లేవు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత క్రికెట్లో చెప్పుకోగదగ్గ, చారిత్రాత్మక విజయాన్ని అందించిన సారథిగా మాత్రం కపిల్ దేవ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వ్యక్తిగతంగా అతను సాధించిన పలు రికార్డులు క్రికెట్ అభిమానులకు సదా గుర్తుండిపోతాయి. సంచలనాలకు ఆధ్యుడిగా కపిల్ చరిత్రలో నిలిచిపోతాడు. కాగా, 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ డెవిల్స్ అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి, అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్‌కు ఓటమిని పరిచయం చేసిన విషయం తెలిసిందే.