యాక్షన్ సినిమా మీకు గూస్‌బంప్స్ తెప్పించొచ్చు.. హారర్ మూవీ భయపెట్టొచ్చు.. థ్రిల్లర్ మునివేళ్లపై కూర్చోబెట్టొచ్చు. రొమాంటిక్ లవ్‌స్టోరీ మిమ్మల్ని మైమరిచిపోయాలా చేయొచ్చు. ఇలా ఆయా జానర్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వీళ్లందరికీ నచ్చేది ఒకటుంది. అదే 'దేశభక్తి' జానర్. ఎన్నేళ్లు గడుస్తున్నా సరే ఈ తరహా సినిమాలకు ఉన్న డిమాండే వేరు. అయితే అన్నిసార్లు దేశభక్తి.. మన సినిమాను కాపాడిందా?
తెలుగులో దేశభక్తి సినిమాలు బోలెడు. వీటిలో ది బెస్ట్ అంటే చాలామంది చెప్పేమాట 'ఖడ్గం'. ఏ ముహుర్తాన కృష్ణవంశీ ఈ మూవీ తీశారో గానీ ఈ జానర్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. చాలా సరదాగా మొదలై, క్లైమాక్స్ వచ్చేసరికి ఈ సినిమా మీలో ఎక్కడో మూల దాగున్న దేశభక్తిని రగిలిస్తుంది. అలానే 'ఖడ్గం'లోని ప్రతి పాట సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా హిట్ అయిందంటే దానికి ప్రధాన కారణం ఒక్కటే. అదే దేశభక్తి.
(ఇదీ చదవండి: 'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ))
అలానే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించి, అలరించి ఆకట్టుకున్న దేశభక్తి సినిమాల్లో 'అల్లూరి సీతారామరాజు', 'మేజర్ చంద్రకాంత్', 'ఆర్ఆర్ఆర్' లాంటివి టాప్‌లో ఉంటాయి. వీటిలో ప్రారంభ సన్నివేశం నుంచి దేశభక్తిని ప్రతిబింబించే సీన్సే ఉండటం హైలెట్ అని చెప్పొచ్చు. వీటిల్లో కమర్షియల్ అంశాలున్నప్పటికీ మెయిన్ థీమ్‌ని దర్శకులు మర్చిపోలేదు. దీంతో ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేశాయి. దేశభక్తి పవర్ ఏంటో ప్రూవ్ చేశాయి. ఈ లిస్టులో మేజర్, సైరా తదితర చిత్రాలు కూడా ఉన్నాయి.
ఇకపోతే మిగతా భాషల్లో వచ్చిన దేశభక్తి చిత్రాలు మనవాటికి తక్కువేం కాదు. 'భారతీయుడు' దగ్గర నుంచి 'బోర్డర్', 'షేర్షా', 'కేసరి', 'ఉరి', 'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్', 'రాజీ'.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా ఉంటుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర అన్నిసార్లు దేశభక్తి వర్కౌట్ అయిందా అంటే 90 శాతం మాత్రమే అని చెప్పొచ్చు. ఆ 10 శాతం ఎందుకు అని మీరు కోపం తెచ్చుకోవచ్చు. ఆ పాయింటే ఇప్పుడు మాట్లాడుకుందాం.
(ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ)
దేశభక్తి అనేది కచ్చితంగా హిట్ అయ్యే జానర్ అని చాలామంది దర్శకులు అభిప్రాయం. అయితే ఈ పాయింట్‌తో సినిమాలు తీస్తున్నప్పుడు కొన్నిసార్లు తేడా కొట్టేస్తుంది. అంతెందుకు తెలుగులోనే విక్టరీ వెంకటేశ్ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు.. 'సుభాష్ చంద్రబోస్' అనే మూవీ తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఇది ఫెయిలైంది. బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు.. 'పరమవీరచక్ర' అనే దేశభక్తి సినిమా తీశారు. కానీ ఏం లాభం. ప్రేక్షకులు ఈ రెండు చిత్రాల్ని తిరస్కరించారు.
ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే.. ఏ భాషలో అయినా 'దేశభక్తి' సినిమాలకు కొదవలేదు. కాకపోతే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే ఆయా స్టోరీని సరిగా హ్యాండిల్ చేయాలి. లేదంటే మాత్రం బొక్కబోర్లా పడటం గ్యారంటీ. ఇప్పటివరకు వచ్చినవాటిలో మాత్రం దాదాపుగా 90 శాతం సినిమాలి అద్భుతమైన విజయాల్ని అందుకున్నాయని చెప్పడంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదు.
(ఇదీ చదవండి: ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment