Khadgam movie
-
ఖడ్గంలో నన్ను తీసుకోవద్దన్నారు: శ్రీకాంత్
‘‘ఖడ్గం’ సినిమాలో నన్ను తీసుకోవద్దని నిర్మాత మధు మురళిగారు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి, ఆయన్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు. నా జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేను. తరాలు మారినా దేశభక్తి చిత్రాలన్నింటిలో ‘ఖడ్గం’ గొప్ప చిత్రం. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, శివాజీ రాజా, షఫీ, సోనాలీ బింద్రే, సంగీత తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబర్ 29న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.కాగా ఈ నెల18న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాను’’ అని చెప్పారు. ‘‘ఖడ్గం’లో నేను చేయనని చెప్పాను. కానీ, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటిలో నాకు మంచి పేరు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే’’ అన్నారు శివాజీ రాజా. ‘‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ‘ఖడ్గం’. ఈ సినిమాలో చాన్స్ ఇచ్చి నా వనవాసం ముగింపునకు కారణమైన కృష్ణవంశీగారికి కృతజ్ఞతలు’’ అని నటుడు షఫీ తెలిపారు. -
22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న దేశ భక్తి సినిమా
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన దేశ భక్తి సినిమా ఖడ్గం. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2002లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. అక్టోబర్ 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ, “మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమా కి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం.22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్.” అని చెప్పారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమా లో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.” అన్నారు. ‘షనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు’ అని షఫి అన్నారు. -
కనీసం మర్యాద కూడా ఇవ్వరు.. ఫోన్ చేస్తే ఇలా మాట్లాడుతారు: సంగీత
నటి సంగీత ఒకప్పుడు సౌత్ ఇండియాలో పాపులర్ హీరోయిన్గా కొనసాగింది. తెలుగులో ఖడ్గం చిత్రంలో పెద్ద సినిమా నటి కావాలన్న ఆశతో పల్లెటూరి నుంచి తల్లితో కలిసి హైదరబాద్‌కు వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమలాడుతూ కంట తడిపెట్టే సన్నివేశంలో ఆమె నటనను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అలాంటి సంగీత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగునే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించిన ఈమె గాయకుడు క్రిష్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉన్నారు. వివాహానంతరం గుణ చిత్ర పాత్రల్లో నటిస్తున్న సంగీత ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు తమిళ చిత్రాల్లో కంటే తెలుగు చిత్రాల్లో నటించడమే ఇష్టం అని చెప్పారు. కారణం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ గౌరవం లభిస్తుందన్నారు. తనకు తమిళంలో నటించడం ఇష్టం లేదు అంటే తమిళ అభిమానులు ఆగ్రహించవచ్చని అయినా తాను నిజమే చెబుతున్నానన్నారు. కోలీవుడ్‌లో నటించేటప్పుడు సరైన మర్యాద ఉండదన్నారు. నిజం చెప్పాలంటే తమిళంలో తానెవరినీ అవకాశాలు అడిగింది కూడా లేదన్నారు. ఎందుకంటే తెలుగులో తనకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. అంతే కాదు మంచి పారితోషికం, అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అయితే తమిళంలో కొందరు అవకాశాల కోసం ఫోన్ చేసినా, వారు మర్యాద లేకుండా మాట్లాడతారన్నారు. వారే తనకు జీవితాన్ని ఇస్తున్నట్లు మాట్లాడతారని అన్నారు. తన పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించేసి వచ్చి నటించి వెళ్లండి అని అంటారన్నారు. తనకు తమిళ చిత్ర పరిశ్రమలో మర్యాద లేదని, అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించడం లేదని సేర్కొన్నారు. ఈమె చెప్పిన విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ఆగస్టు 15.. ఓటీటీలో ఈ మూవీస్ మిస్ అవ్వొద్దు!
స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేసింది. చాలామందికి ఈ రోజు సెలవు. మరోవైపు థియేటర్లలో 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్', 'ఆయ్' తదితర మూవీస్ రిలీజ్. సరే ఇవేం చూస్తాంలే. ఇంట్లోనే ఎంటర్ టైన్మెంట్ కావాలా? అయితే ఈ సినిమాలు మీకోసమే. ఎందుకంటే రెగ్యులర్ రొటీన్ కాకుండా కాస్తంత దేశభక్తిని గుర్తొచేసే చిత్రాలివి. ఇంతకీ ఇవన్నీ ఏ ఓటీటీల్లో ఉన్నాయి? అనేది తెలియాలంటే దిగువన లిస్ట్ చూసేయండి.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)ఓటీటీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చూడాల్సిన మూవీస్ఖడ్గం - సన్ నెక్స్ట్, యూట్యూబ్ (తెలుగు)మేజర్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)ఘాజీ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)గగనం - హాట్ స్టార్, యూట్యూబ్ (తెలుగు)భారతీయుడు - నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ (తెలుగు డబ్బింగ్)మేజర్ చంద్రకాంత్ - యూట్యూబ్, సన్ నెక్స్ట్ (తెలుగు)అల్లూరి సీతారామరాజు - అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ (తెలుగు)ఆర్ఆర్ఆర్ - జీ5, హాట్‌స్టార్ (తెలుగు)సర్దార్ పాపారాయుడు - అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)రాజన్న - హాట్ స్టార్ (తెలుగు)ఉరి - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)షేర్షా - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)సామ్ బహదూర్ - జీ5 (హిందీ)రాజీ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)బోస్: ద ఫర్గాటెన్ హీరో - యూట్యూబ్ (హిందీ)ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ - యూట్యూబ్ (హిందీ)బోర్డర్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)కేసరి - అమెజాన్ ప్రైమ్ (హిందీ)చక్ దే - అమెజాన్ ప్రైమ్ (హిందీ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?) -
ఆ గెటప్ నాకు అసలు నచ్చలేదు..!
-
ప్రతి ఒక్కరి గుండెల్ని తాకే దేశభక్తి పాటలు ఇవే
భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 15)న జరుపుకుంటుంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుంచి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నారు. అలా కొన్ని పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'తేరి మిట్టీ' -కేసరి కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఎంతో గొప్పగా రచించారు. ఈ పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ పాటను 1బిలియన్కు పైగా వీక్షించారు. 'మేమే ఇండియన్స్' - ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు. 'ఎత్తరా జెండా' - RRR విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్‌లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. 'దేశం మనదే తేజం మనదే' - జై తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు. 'పాడవోయి భారతీయుడా' -వెలుగు నీడలు 'పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా' అంటూ మహాకవి శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున మార్మోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన 13 ఏళ్ల తరువాత అక్కినేని నాగేశ్వరరావు 'వెలుగు నీడలు' చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను పి.సుశీల , ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి 60 సంవత్సరాలు గడిచినా నేటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. 'పుణ్యభూమి నాదేశం' -మేజర్ చంద్రకాంత్ ఇక ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట. మేజర్ చంద్రకాంత్ మూవీలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి'. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావున త్యాగాలను గుర్తు చేస్తూ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈపాటకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. 'వినరా.. వినరా' రోజా ఏ.ఆర్ రెహమాన్ దేశభక్తి గీతాలు యూత్‌లో దేశభక్తిని రగిల్చాయి. రోజా చిత్రంలో వినరా.. వినరా.. దేశం మనదేరా అంటూ రాజశ్రీ రాసిన పాటతోపాటు.. మా తేఝే సలాం వందేమాతరం అంటూ రెహమాన్ పాడిన పాట సంచలనం అయ్యింది. -
సినిమాని 'దేశభక్తి' కాపాడిందా? లేదంటే..!
యాక్షన్ సినిమా మీకు గూస్బంప్స్ తెప్పించొచ్చు.. హారర్ మూవీ భయపెట్టొచ్చు.. థ్రిల్లర్ మునివేళ్లపై కూర్చోబెట్టొచ్చు. రొమాంటిక్ లవ్‌స్టోరీ మిమ్మల్ని మైమరిచిపోయాలా చేయొచ్చు. ఇలా ఆయా జానర్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వీళ్లందరికీ నచ్చేది ఒకటుంది. అదే 'దేశభక్తి' జానర్. ఎన్నేళ్లు గడుస్తున్నా సరే ఈ తరహా సినిమాలకు ఉన్న డిమాండే వేరు. అయితే అన్నిసార్లు దేశభక్తి.. మన సినిమాను కాపాడిందా? తెలుగులో దేశభక్తి సినిమాలు బోలెడు. వీటిలో ది బెస్ట్ అంటే చాలామంది చెప్పేమాట 'ఖడ్గం'. ఏ ముహుర్తాన కృష్ణవంశీ ఈ మూవీ తీశారో గానీ ఈ జానర్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. చాలా సరదాగా మొదలై, క్లైమాక్స్ వచ్చేసరికి ఈ సినిమా మీలో ఎక్కడో మూల దాగున్న దేశభక్తిని రగిలిస్తుంది. అలానే 'ఖడ్గం'లోని ప్రతి పాట సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా హిట్ అయిందంటే దానికి ప్రధాన కారణం ఒక్కటే. అదే దేశభక్తి. (ఇదీ చదవండి: 'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) అలానే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించి, అలరించి ఆకట్టుకున్న దేశభక్తి సినిమాల్లో 'అల్లూరి సీతారామరాజు', 'మేజర్ చంద్రకాంత్', 'ఆర్ఆర్ఆర్' లాంటివి టాప్‌లో ఉంటాయి. వీటిలో ప్రారంభ సన్నివేశం నుంచి దేశభక్తిని ప్రతిబింబించే సీన్సే ఉండటం హైలెట్ అని చెప్పొచ్చు. వీటిల్లో కమర్షియల్ అంశాలున్నప్పటికీ మెయిన్ థీమ్‌ని దర్శకులు మర్చిపోలేదు. దీంతో ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేశాయి. దేశభక్తి పవర్ ఏంటో ప్రూవ్ చేశాయి. ఈ లిస్టులో మేజర్, సైరా తదితర చిత్రాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మిగతా భాషల్లో వచ్చిన దేశభక్తి చిత్రాలు మనవాటికి తక్కువేం కాదు. 'భారతీయుడు' దగ్గర నుంచి 'బోర్డర్', 'షేర్షా', 'కేసరి', 'ఉరి', 'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్', 'రాజీ'.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా ఉంటుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర అన్నిసార్లు దేశభక్తి వర్కౌట్ అయిందా అంటే 90 శాతం మాత్రమే అని చెప్పొచ్చు. ఆ 10 శాతం ఎందుకు అని మీరు కోపం తెచ్చుకోవచ్చు. ఆ పాయింటే ఇప్పుడు మాట్లాడుకుందాం. (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) దేశభక్తి అనేది కచ్చితంగా హిట్ అయ్యే జానర్ అని చాలామంది దర్శకులు అభిప్రాయం. అయితే ఈ పాయింట్‌తో సినిమాలు తీస్తున్నప్పుడు కొన్నిసార్లు తేడా కొట్టేస్తుంది. అంతెందుకు తెలుగులోనే విక్టరీ వెంకటేశ్ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు.. 'సుభాష్ చంద్రబోస్' అనే మూవీ తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఇది ఫెయిలైంది. బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు.. 'పరమవీరచక్ర' అనే దేశభక్తి సినిమా తీశారు. కానీ ఏం లాభం. ప్రేక్షకులు ఈ రెండు చిత్రాల్ని తిరస్కరించారు. ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే.. ఏ భాషలో అయినా 'దేశభక్తి' సినిమాలకు కొదవలేదు. కాకపోతే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే ఆయా స్టోరీని సరిగా హ్యాండిల్ చేయాలి. లేదంటే మాత్రం బొక్కబోర్లా పడటం గ్యారంటీ. ఇప్పటివరకు వచ్చినవాటిలో మాత్రం దాదాపుగా 90 శాతం సినిమాలి అద్భుతమైన విజయాల్ని అందుకున్నాయని చెప్పడంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదు. (ఇదీ చదవండి: ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ) -
‘ఖడ్గం’లో ఆ సీన్ చేస్తుండగా నన్ను హేళన చేశారు: నటి సంగీత
నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మసూద చిత్రంతో పలకరించిన ఆమె గతంలో ఖడ్గం మూవీపై ఆమె చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఖడ్గం మూవీ సమంయలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఈ సినిమా సంగీత ఫుల్ జూవేల్లరితో సినిమా చాన్స్‌ల కోసం సిటీకి వచ్చిన పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సీన్లో తనకు వేసిన మేకప్ అసలు నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కృష్ణవంశీకి పిచ్చా అన్నారు: సంగీత ‘‘ఖడ్గం’ సినిమాలో నా ఎంట్రీ సీన్ మేకప్ నాకు మైనస్ అయ్యింది. అది నాకు అసలు నచ్చలేదు. దాంట్లో నన్ను నేను చూసుకోలేకపోయా. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అయితే అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆ సీన్ షూటింగ్ జరిగింది. షూట్ అనంతరం చిత్ర యూనిట్ అంతా నా దగ్గరికి వచ్చి ‘మీరు బాగా చేశారు. షాట్ చాలా బాగా వచ్చింది’ అని ప్రశంసించారు. కానీ షూటింగ్ చూడటానికి వచ్చిన పబ్లిక్ మాత్రం ‘ఈమె హీరోయిన్ ఏంటీ?’ అంటూ హేళన చేశారు. ‘కృష్ణవంశీకి పిచ్చా. ఈమెను హీరోయిన్గా తీసుకున్నారేంటి’ అంటూ విమర్శించారు’’ అని సంగీత చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి ముందు సంగీతకు పెళ్లి తర్వాత సంగీతకు తేడా ఏంటి? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ‘నాకు నా భర్త ఎలాంటి షరతులు పెట్టలేదు’ అని చెప్పారు. ఆ తర్వాత తనకు పడుకోవడమంటే చాలా ఇష్టమని, వదిలేస్తే 24 గంటలు పడుకూనే ఉంటానంది. తన బెస్ట్ హాలిడే స్పాట్ ఏంటని అడగ్గా.. తన ఇల్లే తనకు బెస్ట్ హాలిడే స్పాట్ అంటూ ఆసక్తిగా సమాధానం ఇచ్చింది. చదవండి: 30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్ రీఎంట్రీ, సూపర్ స్టార్‌కు చెల్లిగా.. అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. -
రిపబ్లిక్ డే: ఓటీటీలో చూడాల్సిన దేశభక్తి సినిమాలివే!
రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు స్కూళ్లు, కార్యాలయాలు జాతీయ జెండాలతో అలంకరించుకుంటాయి. దేశభక్తిని పెంపొందించేలా నినాదాలు, పాటలతో ఊరూవాడా హోరెత్తిపోతుంది. మనకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినవారిని, ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరించుకోవడంతో మనసు ఉప్పొంగుతుంది. ఇక ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఏ ఛానల్లో చూసినా దేశభక్తి సినిమాలే! అవును మరి.. గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి సినిమా చూడకపోతే ఆ రోజు అసంపూర్తిగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజు ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి.. వూట్ ► ఖడ్గం ► మేజర్ చంద్రకాంత్ (ప్రైమ్‌లోనూ లభ్యం) అమెజాన్ ప్రైమ్ వీడియో ► భారతీయుడు ► సర్దార్ పాపారాయుడు ► రాజీ ► సర్దార్ ఉద్ధమ్ ► చక్‌దే ఇండియా ► మణికర్ణిక ► షేర్షా హాట్‌స్టార్ ► మంగళ్‌పాండే ► కంచె నెట్‌ఫ్లిక్స్ ► మేజర్ ► లగాన్ ► ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ ► స్వేడ్స్ ► రంగ్ దే బసంతి జీ5 ► ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ► సుభాష్ చంద్రబోస్ ఇవే కాకుండా మేజర్ చంద్రకాంత్, సైరా నరసింహారెడ్డి, చిట్టగాంగ్, ఎల్ఓసీ కార్గిల్, మంగళ్ పాండే, బార్డర్, ఇలా మరోన్నో సినిమాలు దేశభక్తి ఆధారంగా తెరకెక్కినవే! ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఓ మంచి సినిమాతో సెలబ్రేట్ చేసుకోండి. -
Kim Sharma: ‘ఖడ్గం’ ఫేమ్ కిమ్ శర్మ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తోంది?
Kadgam Actress Kim Sharma Life Story: ‘ముసుగు వేయొద్దు మనస్సు మీద.. వలలు వేయొద్దు వయస్సు మీద’ అంటూ ‘ఖడ్గం’ సినిమాలో అలరించిన కిమ్ శర్మ గుర్తుంది కదా.. తన గ్లామర్ తో కుర్రాల మనసుల మీది ముసుగు లాగేసిందీ ఈ బోల్డ్ బ్యూటీ. తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’మగధీర (స్పెషల్ సాంగ్) వంటి సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామ.. ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్ మూవీ డర్(1993)లో అతిథి పాత్రతో వెండితెరకు పరిచయం అయింది కిమ్ శర్మ. ఆ తర్వాత మొహబతీన్ సినిమాలో హీరోయిన్ గా అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు బాలీవుడ్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ .. 2002లో ఖడ్గం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది కిమ్ శర్మ. ఆ తర్వాత మగధీర సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించి మెప్పించింది. (చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా) యువరాజ్ ప్రేమాయణం.. బిజినెస్ మ్యాన్‌తో వివాహం ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించింది ఈ భామ. పబ్లిక్‌గా చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అప్పట్లో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఏమైందో ఏమో కానీ వీరిద్దరికీ 2007లో బ్రేకప్ అయిపోయింది. 2010లో బిజినెస్ టైకూన్ అలీ పంజనీని పెళ్లి చేసుకున్న కిమ్ శర్మ భర్తతోపాటు కెన్యాకు వెళ్లిపోయింది. అయితే ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో అతనితో విడాకులు తీసుకొని తిరిగి ముంబై వచ్చేసింది. విడాకులు తీసుకునే సమయంలో ఆమె మాజీ ప్రియుడు యువరాజ్ సింగ్ కిమ్ కెన్యాకు వెళ్లడం గమనార్హం. అలీతో విడాకులు తీసుకున్న తర్వాత కిమ్ శర్మ, హర్షవర్థన్ రాణేల డేటింగ్ నడిపిందని వార్తలు వచ్చాయి. లియాండర్ పేస్‌తో డేటింగ్! ప్రస్తుతం ఈ బ్యూటీ టెన్నిస్ మాజీ ప్లేయర్ లియాండర్ పేస్‌తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి గోవాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే వీరిద్దరూ ఆస్పత్రికి వెళ్లిన ఫోటోలు కూడా మీడియాకు చిక్కాయి. అయితే వీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కానీ.. వారి డేటింగ్ విషయమై ఇంతవరకు నోరు విప్పలేదు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కిమ్.. త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఖడ్గం’ సినిమా ఘర్షణలపై కేసులు కొట్టివేత
హిందూపురం : పట్టణంలో 2002 డిసెంబర్ 21న ‘ఖడ్గం’ చిత్రం ప్రదర్శన సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసును హిందూపురం కోర్టు నిన్న కొట్టి వేసింది. వివరాల్లోకి వెళితే.. 'ఖడ్గం’ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మత పరంగా కించపరిచేలా ఉన్నాయన్న నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఆందోళనలు, ఘర్షణలకు, పోటాపోటీగా ర్యాలీలు చేశాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ, కాల్పులతో పట్టణం అట్టుడికింది. ఈ ఘటనల్లో ఉమర్ ఫరూక్, మాజీ ముతవల్లి అజీజ్, బాబా, ఫరూక్, సాధిక్తో పాటు మొత్తం 53 మందిపై కేసు నమోదయింది. తొలుత ఆందోళన చేసిన కేసులో మాజీ మున్సిపల్ చైర్మన్ విద్యాసాగర్, రమేష్‌రెడ్డి, గోపాల్, నాగరాజు, అశ్వర్థనారాయణ, శివకుమార్, మరో 15 మందిపై కేసు పెట్టారు. మరో వర్గంలోని 56 మందిపై కౌంటర్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పలువురు జైలు పాలయ్యారు. సుదీర్ఘ వాదనల అనంతరం నిందితులపై సాక్ష్యాధారాలు రుజువు కాకపోవడంతో జూనియర్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి గీతా మొదటి కేసులోని 15 మందిపై కేసు కొట్టి వేశారు. తర్వాత కౌంటర్ కేసులోని 36 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ తీర్పునిచ్చారు. కాగా ఉమర్ ఫరూక్, అజీజ్, బాబా వర్గంలోని 26 మందిపై గత జులై నెలలో కోర్టు కేసులు కొట్టి వేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం విముక్తి లభించడంతో బాధితుల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.