Actress Sangeetha shares her working experience in Khadgam movie - Sakshi
Sakshi News home page

Actress Sangeetha: కృష్ణవంశీకి పిచ్చా, ఈమె హీరోయిన్‌ ఏంటీ? అని హేళన చేశారు: నటి సంగీత

Published Wed, Mar 1 2023 11:50 AM | Last Updated on Wed, Mar 1 2023 12:29 PM

Actress Sangeetha About Khadgam Movie Experience in Latest Interview - Sakshi

నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క చాన్స్‌ అంటూ ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్‌ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చింది. 

దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్‌ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మసూద చిత్రంతో పలకరించిన ఆమె గతంలో ఖడ్గం మూవీపై ఆమె చేసిన కామెంట్స్‌ తాజాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఖడ్గం మూవీ సమంయలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఈ సినిమా సంగీత ఫుల్‌ జూవేల్లరితో సినిమా చాన్స్‌ల కోసం సిటీకి వచ్చిన పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సీన్‌లో తనకు వేసిన మేకప్‌ అసలు నచ్చలేదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

కృష్ణవంశీకి పిచ్చా అన్నారు: సంగీత
‘‘ఖడ్గం’ సినిమాలో నా ఎంట్రీ సీన్‌ మేకప్‌ నాకు మైనస్ అయ్యింది. అది నాకు అసలు నచ్చలేదు. దాంట్లో నన్ను నేను చూసుకోలేకపోయా. చాలా ఇబ్బందిగా ఫీల్‌ అయ్యాను. అయితే అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆ సీన్‌ షూటింగ్‌ జరిగింది. షూట్‌ అనంతరం చిత్ర యూనిట్‌ అంతా నా దగ్గరికి వచ్చి ‘మీరు బాగా చేశారు. షాట్‌ చాలా బాగా వచ్చింది’ అని ప్రశంసించారు. కానీ షూటింగ్‌ చూడటానికి వచ్చిన పబ్లిక్‌ మాత్రం ‘ఈమె హీరోయిన్‌ ఏంటీ?’ అంటూ హేళన చేశారు.

‘కృష్ణవంశీకి పిచ్చా. ఈమెను హీరోయిన్‌గా తీసుకున్నారేంటి’ అంటూ విమర్శించారు’’ అని సంగీత చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి ముందు సంగీతకు పెళ్లి తర్వాత సంగీతకు తేడా ఏంటి? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ‘నాకు నా భర్త ఎలాంటి షరతులు పెట్టలేదు’ అని చెప్పారు. ఆ తర్వాత తనకు పడుకోవడమంటే చాలా ఇష్టమని, వదిలేస్తే 24 గంటలు పడుకూనే ఉంటానంది. తన బెస్ట్‌ హాలిడే స్పాట్‌ ఏంటని అడగ్గా.. తన ఇల్లే తనకు బెస్ట్‌ హాలిడే స్పాట్‌ అంటూ ఆసక్తిగా సమాధానం ఇచ్చింది. 

చదవండి: 
30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్‌ రీఎంట్రీ, సూపర్‌ స్టార్‌కు చెల్లిగా..
అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement