sangeetha
-
పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్.. ఇప్పుడు గుడ్‌న్యూస్‌తో సీరియల్ నటి
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023 డిసెంబర్ 10న బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే, ఈ జంట ఇప్పుడు గుడ్‌న్యూస్ చెప్పింది. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించింది. వారి వివాహం తర్వాత అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. కానీ, సంగీతకు కూడా ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదంటూ మరికొందరు కామెంట్లు చేశారు.కొంతకాలంగా ప్రేమలో ఉన్న వారిద్దరూ.. ఒకరోజు సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. అయితే, ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ గుడ్‌న్యూస్ చెప్పారు. సంగీత సీమంతం వేడుక జరిగే వరకు ఎక్కడా కూడా ఈ విషయాన్ని వారు తెలుపలేదు. ఇలా సడెన్‌గా తాము తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. Toకాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బీస్ట్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.సంగీతకు రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిపై ఆ సమయంలో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ చాలామంది విమర్శించారు. వాటికి సమాధానంగా సంగీత ఇలా చెప్పింది. 'మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by Archana Saravanan (@archana_makeover_hair) -
నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్
అనుపమా పరమేశ్వరన్, సంగీత, దర్శనా రాజేంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను డిజిటల్‌గా రిలీజ్ చేశారు దుల్కర్ సల్మాన్. హైదరాబాద్‌లో జరిగిన ‘పరదా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో నా మోస్ట్ ఫేవరెట్ మూవీ ‘పరదా’, ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్’అన్నారు. హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అనుపమ, సంగీత గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమాలో మ్యాజిక్ కు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అన్నారు . ‘‘ఇలాంటి గొప్ప కథ రాసిన డైరెక్టర్‌కు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు సంగీత. ‘‘ఉమెన్ ఒరియంటెడ్ సినిమాలకు బిగ్ ఓపెనింగ్స్ వచ్చేలా ఈ మూవీ ఉంటుంది’’ అని పేర్కొన్నారు ప్రవీణ్. ‘‘ఈ సినిమా మలయాళం రైట్స్‌ను దుల్కర్ సల్మాన్ తీసుకున్నారు’’ అన్నారు విజయ్ డొంకాడ. ‘‘ఉత్తరాంధ్ర నుంచి ఓ నిర్మాత వచ్చి ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళా సాధికారత ఉన్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ‘‘ఈ సినిమా తీయడం మాకు ‘బాహుబలి’లాంటి ప్రయత్నం’’ అని స్పష్టం చేశారు శ్రీధర్. -
ట్రెండింగ్‌లో #JusticeforSangeetha.. అంతా త్రిష వల్లే?
ఆన్‌స్క్రీన్‌పై సూపర్ హిట్ అనిపించే జోడీలు కొన్ని ఉంటాయి. విజయ్ - త్రిష కూడా ఈ జాబితాలోకే వస్తారు. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా వీరు జంటగానే ఉంటారంటూ ఎప్పటినుంచో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ ఓ ప్రైవేట్ జెట్‌లో కలిసి ప్రయాణించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవగా జస్టిస్ ఫర్ సంగీత అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.భార్యకు దూరంగా విజయ్?సంగీత మరెవరో కాదు, విజయ్ భార్య. వీరిద్దరూ 1999లో పెళ్లి చేసుకోగా జేసన్ సంజయ్, దివ్య సాష అని ఇద్దరు సంతానం. గతేడాది విజయ్- సంగీత మధ్య పొరపచ్చాలు వచ్చాయని ప్రచారం జరిగింది. విజయ్ సినిమా ఈవెంట్లలోనూ కనిపించకపోవడంతో దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. అయితే సంగీత వెకేషన్లో ఉండటం వల్లే విజయ్ మూవీ ఈవెంట్లకు హాజరు కాలేదన్నది మరో వాదన.ట్రెండింగ్‌లో విజయ్ -త్రిషఇప్పుడేకంగా వీరు కలిసి ట్రావెల్ చేస్తుండటంతో నెటిజన్లు విజయ్-త్రిష వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఏదైనా సినిమా కోసం కలిసి వెళ్తున్నారనుకోవచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.Co-stars or power couple? Vijay and Trisha spotted boarding a private jet together. The industry is talking!#JusticeforSangeetha#AlluArjun #Delhi #AlluArjunArrest pic.twitter.com/q0NT6DQMB3— Roshan meena (@1f8be1a6f3fe4ad) December 13, 2024Exclusive footage of Vijay and Trisha sparks buzz! 🛩️👀 Work or something more? 🔥 #JusticeforSangeetha #TrishaKrishnan #ThalapathyVijay𓃵 pic.twitter.com/no2kkMUzuH— Rahul Kumar Pandey (@raaahulpandey) December 13, 2024చదవండి: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ -
కనీసం మర్యాద కూడా ఇవ్వరు.. ఫోన్ చేస్తే ఇలా మాట్లాడుతారు: సంగీత
నటి సంగీత ఒకప్పుడు సౌత్ ఇండియాలో పాపులర్ హీరోయిన్గా కొనసాగింది. తెలుగులో ఖడ్గం చిత్రంలో పెద్ద సినిమా నటి కావాలన్న ఆశతో పల్లెటూరి నుంచి తల్లితో కలిసి హైదరబాద్‌కు వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమలాడుతూ కంట తడిపెట్టే సన్నివేశంలో ఆమె నటనను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అలాంటి సంగీత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగునే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించిన ఈమె గాయకుడు క్రిష్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉన్నారు. వివాహానంతరం గుణ చిత్ర పాత్రల్లో నటిస్తున్న సంగీత ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు తమిళ చిత్రాల్లో కంటే తెలుగు చిత్రాల్లో నటించడమే ఇష్టం అని చెప్పారు. కారణం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ గౌరవం లభిస్తుందన్నారు. తనకు తమిళంలో నటించడం ఇష్టం లేదు అంటే తమిళ అభిమానులు ఆగ్రహించవచ్చని అయినా తాను నిజమే చెబుతున్నానన్నారు. కోలీవుడ్‌లో నటించేటప్పుడు సరైన మర్యాద ఉండదన్నారు. నిజం చెప్పాలంటే తమిళంలో తానెవరినీ అవకాశాలు అడిగింది కూడా లేదన్నారు. ఎందుకంటే తెలుగులో తనకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. అంతే కాదు మంచి పారితోషికం, అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అయితే తమిళంలో కొందరు అవకాశాల కోసం ఫోన్ చేసినా, వారు మర్యాద లేకుండా మాట్లాడతారన్నారు. వారే తనకు జీవితాన్ని ఇస్తున్నట్లు మాట్లాడతారని అన్నారు. తన పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించేసి వచ్చి నటించి వెళ్లండి అని అంటారన్నారు. తనకు తమిళ చిత్ర పరిశ్రమలో మర్యాద లేదని, అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించడం లేదని సేర్కొన్నారు. ఈమె చెప్పిన విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
గుండె సమస్యలపై అవగాహన అవసరం
మాదాపూర్: గుండె సమస్యలపై అందరికీ అవగాహన అవసర మని అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో శుక్రవారం 3 రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గుండె సమస్యల నుంచి ఉపశమనానికి అనేక కొత్త పద్ధతులున్నాయ న్నారు. ఇంటర్వెన్షనల్ కార్డియా లజీ రోగిని గాయం, అనారో గ్యం, మరణాల నుంచి కాపాడు తుందని తెలిపారు.గతంలో ధమనులు పూర్తిగా బ్లాక్ అయిన ప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసేవారన్నారు. ఇప్పుడు ధమ నులను క్లియర్ చేయడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయ న్నారు. రోగులు కోలుకోవడా నికి సాధ్యమైనంత వరకు చౌకగా ఉండే తాజా పద్ధతులపై ప్రతినిధులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్డియాలజిస్టులు కార్డియోథొ రాసిక్ సర్జన్లతో కూడిన 1,200 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ఈ సదస్సులో ఇంట్రాకోరోనరీ ఇమేజింగ్, కాల్షియం మేనేజ్మెంట్, టీఏవీఆర్, ఇతర కొత్త ఆవిష్కరణల వంటి వివిధ సెషన్లు జరుగనున్నట్లు తెలిపారు. -
పురుషుల వంధ్యత్వ సమస్యను పరిష్కరించే ఆండ్రోమాక్స్ ప్రారంభం
-
'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. వివాహం తర్వాత తన ఫస్ట్ బర్త్‌డేను భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. ఇకపోతే సంగీతకు ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదు. రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన పెళ్లిపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. సంగీత మాట్లాడుతూ.. ఈ వయసులో పెళ్లి అవసరమా? అంటున్నారు. మా వయసు పెరగలేదుమానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను అని పేర్కొంది.కమెడియన్‌గా గుర్తింపుకాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.సీరియల్స్- సినిమాలుఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాల్లో నవ్వులు పూయించాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేయగా సీరియల్స్‌లోనే ఎక్కువగా నటించింది. -
Sangeetha Sringeri: పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Redin Kingsley- Sangeetha: జైలర్ నటుడితో ఏడడుగులు.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
46 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్ (ఫొటోలు)
-
లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్
ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లిపీటలెక్కాడు. 46 ఏళ్ల వయసున్న ఇతడు బుల్లితెర నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఆదివారం జరిగిన ఈ శుభకార్యానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. నటుడు, డ్యాన్సర్ సతీష్ కృష్ణన్ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త జంట పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు. అలాగే ఇదేమీ సినిమా షూటింగ్ కాదని, వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈయన డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది. #RedinKingsley and #Sangeetha were in a relationship for more than an year or so ❤ They got married at chamundeshwari temple at Mysore pic.twitter.com/iDEQ9wtqaZ — Kollywood Pictures (@KollywoodPics) December 10, 2023 Actor #RedinKingsley sir married to a Serial Actress #Sangeetha mam.Congrats & Happy Marriage Life 💐❤️💫pic.twitter.com/ppMjGy0zmH — 𝘚𝘸𝘦𝘵𝘩𝘢™ (@Swetha_little_) December 10, 2023 చదవండి: క్యాసినో వల్ల డబ్బులు పోగొట్టుకున్నాం.. ఆ రోజు పోలీసులు.. -
అమ్మవారి సేవలో ఖడ్గం హీరోయిన్.. !
సినీనటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాదిలోనే మసూద చిత్రంతో పలకరించింది. అయితే తాజాగా సినీనటి సంగీత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సంగీత గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా.. అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
ఈమె తెలుగు హీరోయిన్, పక్కనే ఉన్నది స్టార్ డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టారా?
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? కచ్చితంగా గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఫొటో అప్పుడెప్పుడో 28 ఏళ్ల క్రితం తీసుకున్నది. ఈ బ్యూటీ తెలుగులో దాదాపు పదేళ్ల పాటు సినిమాలు చేసింది. కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న టైంలోనే ఓ సింగర్‌ని పెళ్లి చేసేసుకుంది. ఆ తర్వాత కారణమేంటో తెలీదు గానీ తెలుగు మూవీస్‌ని పక్కనబెట్టేసింది. ఇంతలా చెప్పాం కదా.. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సంగీత. అవును మీరనుకున్నది కరెక్టే. ఖడ్గం, పెళ్లాం ఊరెళితే, సంక్రాంతి తదితర సినిమాల్లో కనిపించిన బ్యూటీనే ఈ సంగీత. తమిళనాడులోని చెన్నైలో పుట్టిపెరిగిన ఈ ముద్దుగుమ్మ.. 1997లో 'గంగోత్రి' అనే మలయాళ మూవీతో నటిగా పరిచయమైంది. అదే ఏడాది కన్నడ, తర్వాతి సంవత్సరం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే 1999లో తెలుగులోకి ఎంటరైంది. 'ఆశల సందడి' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత.. ఆ తర్వాత నవ్వుతూ బతకాలిరా, మా ఆయన సుందరయ్య తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే 'ఖడ్గం'తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. అనంతరం పెళ్లాం ఊరెళ్తే, ఆయుధం, ఖుషిఖుషీగా, విజయేంద్రవర్మ, సంక్రాంతి, మా ఆయన చంటిపిల్లాడు తదితర చిత్రాలు చేసింది. 2010లో 'కారా మజాకా' చేసిన తర్వాత తెలుగు సినిమాలు చేయడం తగ్గించేసింది. మళ్లీ 2020లో 'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇచ్చింది. 'ఆచార్య'లో సాంగ్, 'మసూద'లో ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించింది. సంగీత వ్యక్తిగత జీవితానికొస్తే.. 2009లో తమిళనాడుకు చెందిన సింగర్ క్రిష్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు గుర్తుగా శివయ్య అనే కొడుకు పుట్టాడు. తెలుగు సినిమాల్లో ఈమె పేరు సంగీత అయినప్పటికీ.. మలయాళంలో రషిక, కన్నడలో దీప్తి అనే స్క్రీన్ నేమ్‌తో సినిమాలు చేసింది. ఇకపోతే పైన ఫొటోలో ఈమెతో పాటు ఉన్నది తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు. వీళ్లిద్దరి ఫ్రెండ్స్ కావడంతో అప్పట్లో ఈ ఫొటో తీసుకుంది. తాజాగా వెంకట్ ప్రభు పుట్టినరోజు సందర్భంగా ఈ పిక్ పోస్ట్ చేసింది. సో అదన్నమాట విషయం. View this post on Instagram A post shared by Sangithakrish (@sangithakrish) View this post on Instagram A post shared by Sangithakrish (@sangithakrish) -
హీరో విజయ్ విడాకుల రూమర్స్.. లియో నటి ఏమందంటే?
అభిమానిని పెళ్లి చేసుకున్న కొద్దిమంది కళాకారుల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒకరు. సంగీత.. లండన్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి. విజయ్ సినిమాలు చూసి అతడికి వీరాభిమానిగా మారిపోయింది. ఆయనను చూడటానికే 1996లో లండన్ నుంచి చెన్నై వచ్చింది. విశ్వప్రయత్నాలు చేసి విజయ్ను కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్ నుంచి వచ్చారా’ అని విజయ్ ఆశ్చర్యపోయాడు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతాను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. విజయ్ పేరెంట్స్‌కు ఆమె బాగా నచ్చేసింది. అప్పుడప్పుడూ సంగీత తన పేరెంట్స్‌తో ఈ హీరో ఇంటికి వచ్చేది. విజయ్ పేరెంట్స్ ఆమెను పెళ్లిచేసుకోమన్నారు. విజయ్ కష్టసుఖాల్లో తోడుగా సంగీత విజయ్‌కు కూడా తనపై ఇష్టం ఏర్పడటంతో 1999లో వీరి పెళ్లి జరిగింది. వీరికి కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె శాషా సంతానం. విజయ్ దంపతులు 24 ఏళ్లుగా కలిసిమెలిసి ఉంటున్నారు. విజయ్ జయాపజయాలలోనూ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంది సంగీత. అయితే ఆ మధ్య వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారంటూ ప్రచారం జరిగింది. ఓ హీరోయిన్‌తో విజయ్ ప్రేమలో ఉన్నాడని, ఆమె కోసం భార్యను వదిలేయడానికి సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. దీనిపై విజయ్ దంపతులు స్పందించనేలేదు. భార్య అంటే ఎంత ప్రేమో! తాజాగా లియో నటి జనని.. దళపతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలతో విజయ్ విడాకుల వార్త ఉట్టి పుకారేనని తేలిపోయింది. జనని మాట్లాడుతూ.. 'విజయ్‌తో కలిసి కూర్చునే అవకాశం వచ్చినందుకే పొంగిపోయాను. అతడు నాతో మాట్లాడతాడని కలలో కూడా ఊహించలేదు. నేను శ్రీలంకన్ తమిళ్ మాట్లాడుతుంటే ఆయనకు తన భార్య సంగీతాయే గుర్తుకువచ్చేదనేవాడు. ఆమె కూడా నాలాగే శ్రీలంకలోని జఫ్నాలోనే పుట్టిపెరిగిందట. ఈ విషయాన్ని విజయ్ నాకు స్వయంగా చెప్పాడు. ఆయన నన్ను తన చెల్లెలిగా చూసుకున్నారు, అలాగే మాట్లాడారు' అని చెప్పుకొచ్చింది. కాగా జనని వ్యాఖ్యలతో విజయ్‌కు సంగీత మీద ఎంత ప్రేముందో అర్థమవుతోందంటున్నారు అభిమానులు. చదవండి: జీవితం నీటిబుడగలాంటిది, మాటలు రావడం లేదు.. కంటతడి పెట్టిస్తున్న యాంకర్ ఝాన్సీ పోస్ట్ -
అలాంటి రోల్స్ వల్ల నన్ను ఆంటీ అని పిలిచేవారు
-
సాక్షి టీవీ క్యాంటీన్ లో సంగీత..!
-
ఆ గెటప్ నాకు అసలు నచ్చలేదు..!
-
నా స్టార్ డమ్ చూసి మా ఆయన అందుకు ఒప్పుకున్నారు..!
-
మణిరత్నం గారు అంటే నాకు చాలా అభిమానం
-
షూటింగ్ టైం లో విక్రమ్ గారు ఒక మాట అన్నారు : నటి సంగీత
-
అర్ధం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం
-
రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!
నటి సంగీత గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేం లేదు. అప్పుడెప్పుడో 'ఖడ్గం' నుంచి స్టిల్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. పెళ్లాం ఊరెళితే, ఆయుధం, ఖుషీఖుషీగా, సంక్రాంతి తదితర చిత్రాలు ఈమెకు బోలెడంత ఫేమ్ తెచ్చిపెట్టాయి. 2010 తర్వాత దాదాపు పదేళ్లపాటు టాలీవుడ్‌కు దూరమైన సంగీత.. 'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు-తమిళంలో సినిమాలు చేస్తున్న ఈమె.. తన పెళ్లి జీవితంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్) తొందరపడ్డామా అనిపించింది 'పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో ఈ లైఫ్ అంటేనే చిరాకేసింది. దీని నుంచి బయటపడాలని ప్రయత్నించాను. త్వరగా ఈ మ్యారేజ్ లైఫ్‌ని వదిలేయాలనుకున్నాను. ఎందుకంటే మొదట్లో పరిస్థితులు అంత దారుణంగా ఉండేవి. మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఆయన ఫ్యామిలీ నుంచి ఒత్తిడి, మా ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో వాళ్లకు దూరమైపోయాం. తొందరపడి పెళ్లి చేసుకున్నామా అనే డౌట్ వచ్చింది' అర్థం చేసుకున్నాం 'తెలిసో తెలియకో ఓ నిర్ణయం తీసుకున్నాను. అది తప్పా ఒప్పా అనేది నాకు తెలియదు. కానీ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మాత్రం నాపైనే ఉంది. దీన్ని పరిష్కరించాలా? దీని నుంచి బయటకొచ్చేయాలా? నా ముందు రెండే ఆప్షన్స్ కనిపించాయి. అప్పట్లో మా ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు. ముందు దానిపై వర్క్ చేశాం. ఒకరినొకరు అర్థం చేసుకుని, బాగా నమ్మకం ఏర్పరుచుకున్నాం' (ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. తను కూడా!) వదిలేద్దామనుకున్నా 'ఇద్దరం ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆలోచనలు, మనస్తత్వాలు, చేసే పనులు అన్నీ మా విషయంలో డిఫరెంట్. దీనిపై వర్క్ చేసి అర్థం చేసుకున్నాం. క్రిష్(సంగీత భర్త) అమేజింగ్ పర్సన్. నన్ను వదులుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదు. నేను చాలాసార్లు ఆయన్ని వదిలేద్దామనుకున్నాను. కానీ.. 'అలా చేయొద్దు. జీవితం చాలా చిన్నది. ఇష్టమైన వాళ్లు కొందరే ఉంటారు. వారిని అస్సలు వదులుకోవద్దు' అని నన్ను మోటివేట్ చేశాడు' నాపై చాలా ప్రేమ 'క్రిష్ తో పోలిస్తే నేను ఓ రకమైన రాక్షసిని. నేను ఏది అనుకుంటే అది జరగాలని ఫిక్సవుతాను. తను మాత్రం నాకోసం ఏదైనా చేస్తాడు. అందుకే పెళ్లి జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నాను. తను నన్ను చాలా ప్రేమిస్తాడు. చాలా కమాండ్ ఉన్న వ్యక్తి కూడా' అని సంగీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి తన పెళ్లి జీవితంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!) -
పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే..?
Pakistani Film Actress Sangeeta: పాకిస్థాన్‌లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ ఉంటుందని అందరికి తెలుసు. అయితే అక్కడ అతి తక్కువ సంఖ్యలో హిందువులు కూడా నివసిస్తున్నట్లు గతంలో చాలా సందర్భాల్లో తెలిసింది. 1947లో విభజన జరిగినప్పటి నుంచి కొందరు అక్కడే ఉండిపోయారు. అలాంటి వారిలో 'సంగీత' ఒకరు. ఈమె ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న అత్యంత ధనిక హిందూ మహిళ కావడం విశేషం. ఇంతకీ సంగీత ఎవరు? ఆమె సంపాదన ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన వేళ అత్యంత సంపన్నుల జాబితాలో హిందువులు కూడా ఉండటం గమనార్హం. ఇందులో అత్యంత ధనిక హిందువు 'దీపక్ పెర్వానీ' అనే ఫ్యాషన్ డిజైనర్ కాగా, ధనిక హిందూ మహిళగా 'సంగీత' రికార్డ్ సృష్టించింది. వీరిద్దరూ కూడా సినీ రంగానికి చెందినవారు కావడం మరో గొప్ప విషయం. సంగీత పాకిస్థాన్‌లో ప్రముఖ నటి. ఈమెను 'పర్వీన్ రిజ్వీ' (Parveen Rizvi) అని కూడా పిలుస్తారు. అయితే తన పేరు అక్కడ మతానికి వ్యతి రేఖంగా ఉండటం వల్లే పర్వీన్ రిజ్వీగా పేరు మార్చుకుంది. విభజనకు ముందు ఇండియాలో జన్మించిన సంగీత హిందూ మహిళగానే పాకిస్థాన్‌లో జీవనం సాగిస్తోంది. కాగా ఇప్పుడు పాకిస్థాన్‌లో అత్యంత ధనిక మహిళగా రికార్డ్ సృష్టించింది. (ఇదీ చదవండి: బిర్యాని అమ్ముతూ రూ. 10 కోట్లు టర్నోవర్.. బెంగళూరు యువతి సక్సెస్ స్టోరీ!) పర్వీన్ రిజ్వీ కేవలం నటి మాత్రమే కాదు, చిత్ర దర్శకురాలు కూడా. ఈమె కోహ్-ఎ-నూర్ అనే సినిమాతో సినీ రంగంలో అరంగేట్రం చేసినప్పటికీ.. తన 21 ఏట నుంచి ఈ రంగంలో మరింత దృఢంగా నిలదొక్కుకోగలిగింది. నికాహ్, ముత్తి భర్ చావల్, యే అమన్, నామ్ మేరా బద్నామ్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే ఒక పాపులర్ నటిగా గుర్తింపు పొందగలిగింది. (ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం) సంగీత కేవలం పాకిస్థాన్‌లోని హిందూ మహిళగా మాత్రమే కాకుండా.. భారతదేశంలో కూడా బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఈమె దివంగత భారతీయ నటి 'జియా ఖాన్'కు అత్త. సంగీత సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది అనే విషయం ఖచ్చితంగా అందుబాటులో లేదు, కానీ ఈమె ఏడాదికి సుమారు రూ. 39 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఆమె సంపాదన అంతకంటే ఎక్కువ వుండే అవకాశం ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
Sangita Success Story: విజయాన్ని పెట్టెలో పెట్టింది
పిండి కొద్ది రొట్టె ఏమోకాని స్వీటు కొద్ది పెట్టె ఉండాలంటుంది సంగీతా పాండే. స్వీట్ బాక్సులను అందంగా తయారు చేయడం మొదలుపెట్టిన ఈ గోరఖ్‌పూర్ సాధారణ గృహిణి 500 రూపాయల పెట్టుబడితో బయల్దేరి ఆరేళ్లలో 3 కోట్ల టర్నోవర్‌కు చేరింది. అత్తామామలు, భర్త సహకరించకపోయినా గృహిణికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని పట్టుదలగా విజయం సాధించింది. తనలాంటి 100 మంది స్త్రీలకు ఉపాధి కల్పించడంతో ఆమె పొందుతున్న సంతృప్తి వెల లేనిది. ఆరేడేళ్ల క్రితం. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. మూడవ సంతానంగా కుమార్తె పుట్టాక 9 నెలలు నిండేసరికి ఇక ఇంట్లో ఉంటూ కేవలం అత్తామామల సేవ, వంట వంటి పనులు మాత్రమే చేయకూడదు అనుకుంది సంగీతా పాండే. భర్తకు పోలీసు ఉద్యోగం. బదిలీల మీద తిరుగుతుండేవాడు. ఆర్థికస్థితి అంతంత మాత్రం. తనూ ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది. భర్త ఒప్పుకోలేదు. అత్తామామలు ఒప్పుకోలేదు. కాని ఎదిరించి తను చదివిన డిగ్రీ అర్హత మీద ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం తెచ్చుకుంది. మొదటిరోజు కూతురితోపాటు హాజరైంది. ఆఫీసువాళ్లు అభ్యంతరం చెప్పడంతో మరుసటి రోజు పాపను ఇంట్లో వదిలి ఆఫీసుకు వెళ్లింది. మనసు ఒప్పలేదు. పిల్లలను దూరం పెట్టి పని చేసే ఉద్యోగం వద్దు అనుకుని మరుసటి రోజే మానేసింది. కాని ఏదో చేయాలి. ఏం చేయాలి? స్వీట్‌షాపులో డబ్బాలు ఆమె ఒకసారి స్వీట్‌షాపులో స్వీట్స్ కొంటున్నప్పుడు ఎవరో వచ్చి ఖాళీ బాక్సులు స్టాకు పడేసి వెళ్లడం చూసింది. తనక్కూడా అలాంటివి తయారు చేసి అమ్మాలని అనిపించింది. అందుకోసం గోరఖ్‌పూర్‌లో వాటిని తయారు చేస్తున్న ఒకరిద్దరు స్త్రీలను కలిసింది. అయితే వారు ఆమెకు పని గురించి అంతంత మాత్రమే చెప్పారు– పోటీకి వస్తుందని. సంగీతా పాండేకి సృజన ఉంది. కొత్తగా చేసే ఆలోచన ఉంది. అందుకే తానే రంగంలో దిగింది. అప్పటికి తన దగ్గర 1500 ఉన్నాయి. ఓ పాత సైకిలుంది. ఆ సైకిల్ మీద తిరుగుతూ రా మెటీరియల్ కొని తెచ్చింది. 8 గంటల్లో 100 డబ్బాలు తయారు చేసింది. తనే వాటిని సైకిల్ వెనుక కట్టుకుని స్వీట్ షాపులకు అమ్మేందుకు బయలుదేరింది. అవి బాగుండటంతో అమ్ముడుపోయాయి కాని ఇంతకంటే తక్కువకు సరుకు వేస్తున్నారని తెలిసింది. గోరఖ్‌పూర్ రత్న ఇటీవలే ఉత్తరప్రదేశ్ సి.ఎం ఆదిత్యానాథ్ మహిళా అంట్రప్రెన్యూర్‌గా ఎంతో స్ఫూర్తినిస్తున్న సంగీతా పాండేని ‘గోరఖ్‌పూర్ రత్న’ బిరుదుతో సత్కరించాడు. ఇప్పుడు సంగీతా పాండే తయారు చేస్తున్న స్వీట్ బాక్సులు ఢిల్లీ వరకూ వెళుతున్నాయి. స్వీట్లను ఒకదాని మీద ఒకటి కుక్కే విధంగా కాకుండా సంగీతా స్వీట్‌బాక్సులు ఒకదాని పక్కన ఒకటి అంటకుండా అమర్చేలా ఉండటంతో ఆదరణ పొందుతున్నాయి. సంప్రదాయం కోసం కొద్ది స్వీట్లతో ఒక బుట్టను ప్రెజెంట్ చేసేలా కూడా పెట్టెలు తయారు చేస్తోంది. స్వీట్లలోని రకాలను బట్టి ఈ ప్యాకింగ్ బాక్సులు మారిపోతుంటాయి. సృజన, శ్రమ కలిస్తే సక్సెస్ అదే వస్తుందనడానికి మరో ఉదాహరణ సంగీతా పాండే. అసలు కిటుకు రా మెటీరియల్ లక్నో, ఢిల్లీలలో తక్కువకు దొరుకుతుందని, వాటితో కళాత్మకంగా డబ్బాలు తయారు చేసి తక్కువకు ఇవ్వగలిగితే చాలా గిరాకీ ఉంటుందని తెలుసుకుంది సంగీతా పాండే. వెంటనే చురుగ్గా ఉండే నలుగురైదుగురు స్త్రీలను పనిలోకి తీసుకుంది. డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి 2 లక్షలు లోన్ సాధించింది. పనిలోకి దిగింది. కిలో, అరకిలో, పావుకిలో డబ్బాలు మంచి రంగులతో లోపల జలతారు వస్త్రంతో తయారు చేసి గోరఖ్‌పూర్, లక్నోలలో స్టాకు వేయడం మొదలెట్టింది. ‘నాణ్యత విషయంలో ఒక పైసా నష్టం వచ్చినా రాజీ పడకూడదు అనే నియమం పెట్టుకున్నాను’ అంటుంది సంగీతా పాండే. ఆ నాణ్యత, ముస్తాబు వల్ల ఆమె ఖాళీ బాక్సులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు ఆమె నగలు కుదువ పెట్టి మరో 3 లక్షలు తీసుకుని వ్యాపారాన్ని విస్తరించింది. ఆ తర్వాత బ్యాంకులే వెతుక్కుంటూ వచ్చి 30 లక్షలు లోను మంజూరు చేశాయి. ఒక ఫ్యాక్టరీ ఆవరణ, పని చేసే స్త్రీలు, వీరు కాకుండా ఇళ్ల దగ్గర ఉంటూ పనిచేసే స్త్రీలు వీరంతా ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు. సంగీతా పాండే దూసుకుపోయింది. -
‘ఖడ్గం’లో ఆ సీన్ చేస్తుండగా నన్ను హేళన చేశారు: నటి సంగీత
నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మసూద చిత్రంతో పలకరించిన ఆమె గతంలో ఖడ్గం మూవీపై ఆమె చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఖడ్గం మూవీ సమంయలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఈ సినిమా సంగీత ఫుల్ జూవేల్లరితో సినిమా చాన్స్‌ల కోసం సిటీకి వచ్చిన పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సీన్లో తనకు వేసిన మేకప్ అసలు నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కృష్ణవంశీకి పిచ్చా అన్నారు: సంగీత ‘‘ఖడ్గం’ సినిమాలో నా ఎంట్రీ సీన్ మేకప్ నాకు మైనస్ అయ్యింది. అది నాకు అసలు నచ్చలేదు. దాంట్లో నన్ను నేను చూసుకోలేకపోయా. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అయితే అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆ సీన్ షూటింగ్ జరిగింది. షూట్ అనంతరం చిత్ర యూనిట్ అంతా నా దగ్గరికి వచ్చి ‘మీరు బాగా చేశారు. షాట్ చాలా బాగా వచ్చింది’ అని ప్రశంసించారు. కానీ షూటింగ్ చూడటానికి వచ్చిన పబ్లిక్ మాత్రం ‘ఈమె హీరోయిన్ ఏంటీ?’ అంటూ హేళన చేశారు. ‘కృష్ణవంశీకి పిచ్చా. ఈమెను హీరోయిన్గా తీసుకున్నారేంటి’ అంటూ విమర్శించారు’’ అని సంగీత చెప్పుకొచ్చింది. ఇక పెళ్లికి ముందు సంగీతకు పెళ్లి తర్వాత సంగీతకు తేడా ఏంటి? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ‘నాకు నా భర్త ఎలాంటి షరతులు పెట్టలేదు’ అని చెప్పారు. ఆ తర్వాత తనకు పడుకోవడమంటే చాలా ఇష్టమని, వదిలేస్తే 24 గంటలు పడుకూనే ఉంటానంది. తన బెస్ట్ హాలిడే స్పాట్ ఏంటని అడగ్గా.. తన ఇల్లే తనకు బెస్ట్ హాలిడే స్పాట్ అంటూ ఆసక్తిగా సమాధానం ఇచ్చింది. చదవండి: 30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్ రీఎంట్రీ, సూపర్ స్టార్‌కు చెల్లిగా.. అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. -
పెళ్లైన స్టార్ హీరోతో కీర్తి సురేష్ ప్రేమాయణం అంటూ తమిళనాట ప్రచారం
కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ భార్య సంగీతతో విడిపోతున్నాడని, త్వరలోనే వీళ్లు విడాకులు తీసుకోనున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్‌కి బలం చేకూర్చేలా విజయ్‌కు సంబంధించిన ఈవెంట్స్‌లోనూ సంగీత ఎక్కడా కనిపించడం లేదు. 22 ఏళ్ల తమ వివాహ బంధాన్ని విజయ్ తెగదెంపులు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే విజయ్ విడాకులకు స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ కారణమని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో కీర్తి సురేష్ విజయ్‌తో కలిసి ‘భైరవ’, ‘సర్కార్’ వంటి సినిమాల్లో నటించింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అది ప్రేమగా మారిందని, భార్య సంగీత ఎన్నిసార్లు చెప్పినా విజయ్ కీర్తితో క్లోజ్‌గా ఉంటున్నాడని తమిళ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. భార్యతో విడాకుల తర్వాత కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో #JusticeForSangeetha (విజయ్ భార్య పేరు)అనే హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. అదే విధంగా కీర్తి సురేష్‌ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే దీనిపై విజయ్ కానీ, సంగీత కానీ, కీర్తి సురేష్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే వారీసు హిట్‌తో కొందరు ఓర్వలేక ఇలాంటివి తెరపైకి తీసుకొస్తున్నారని, కావాలనే కీర్తి సురేష్‌ను ఇందులోకి లాగుతున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై స్వయంగా విజయ్ స్పందిస్తే తప్పా ఇది ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. Worst Ra da vijay 😤#JusticeForSangeethapic.twitter.com/CIq4q7qxKV — 🇧🇷DILLIᵀʰᵘⁿⁱᵛᵘ⚜️ (@itsdilli0700) January 22, 2023 -
కన్నీటి పర్యంతమైన వినేశ్ ఫొగాట్..! నిరూపిస్తే ఉరేసుకుంటానన్న ఎంపీ
Indian Wrestler Vinesh Phogat: ‘పలువురు కోచ్‌లు అదే పనిగా లక్నోలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారు. 10, 12 మంది అమ్మాయిలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పను. ప్రధానిని కలిసే అవకాశమిస్తే ఆయనకే వివరిస్తా. నేను ఇదివరకు ఒకసారి బ్రిజ్‌భూషణ్‌పై ఫిర్యాదు చేస్తే చంపుతామని బెదిరించారు’ అని కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్, ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ విలేకర్ల ముందు విలపించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మీడియా ఎదుట ఆవేదన పంచుకున్నారు. కాగా చాలా కాలంగా బ్రిజ్‌భూషణ్ తమని లైంగికంగా వేధిస్తున్నారని భారత మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. సంగీతా ఫొగాట్ భర్త, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత బజరంగ్ పూనియా, అతని కోచ్ సుజిత్ మాన్ సహా ఫిజియో ఆనంద్ దూబే వారికి మద్ధతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బజరంగ్ మాట్లాడుతూ తమ పోరాటం ప్రభుత్వం, కేంద్ర క్రీడా శాఖ, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)పై కాదని... కేవలం బ్రిజ్‌భూషణ్ నియంతృత్వంపైనే అని స్పష్టం చేశారు. అయితే, డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ బ్రిజ్‌భూషణ్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేయడం గమనార్హం. ఈ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఉరేసుకొంటానని సవాల్ చేశారు. ఓ పారిశ్రామిక వేత్త ప్రోద్బలంతో ఇదంతా జరుగుతోందని 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చదవండి: Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్ ENG vs SA: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన! స్టార్ బ్యాటర్ వచ్చేశాడు -
ఆ సినిమా నన్ను చాలా భయపెట్టింది: పరుచూరి గోపాలకృష్ణ
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుంది. ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ) తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాని తెరకెక్కించిన విధానం బాగుందని కొనియాడారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. చిన్న కథను దర్శకుడు సాయి కిరణ్ ఎంతో నేర్పుతో తెరకెక్కించారని మెచ్చుకున్నారు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి ప్రతిభ చూపారని ప్రశంసించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'మసూద సినిమా ఓ చిన్న కథ. అద్భుతంగా నడిచిన సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మూవీ. ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయా అనే కోణంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా చూస్తే ఆత్మలు ఉన్నాయనే నమ్మకం ప్రేక్షకులకు కచ్చితంగా వస్తుంది. ఈ కథలో ఓ తల్లీ, బిడ్డ ఆధారంగా తెరకెక్కించారు. నాజియా అనే అమ్మాయిని మసూద ఆత్మ ఆవహిస్తే ఏం జరిగిందనేదే కథ. సాయి కిరణ్ ఓ వైపు మంచి ప్రేమకథను చూపించారు. కాసేపటికే కథను మలుపులు తిప్పారు. కథను మలిచిన విధానం చాలా బాగుంది. ఇలాంటి కథలకు బ్యాక్ గ్రౌండ్ ముఖ్యం. కాంతారలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను వణికించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.' అని అన్నారు. (ఇది చదవండి: ఏ టైటిల్ పెట్టాలో తెలియక 'మసూద' అని పెట్టాం : నిర్మాత) అయితే ఈ సినిమా విషయంలో ఆయన కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. మసూద బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ సినిమా ఆరంభంలోనూ.. మళ్లీ మధ్యలోనూ చూపించారు. అలా కాకుండా ఒకేసారి మధ్యలో ఆ కథ చెప్పి ఉంటే బాగుండేదన్నారు. సినిమా క్లైమాక్స్‌లోనూ మసూద ఆత్మను బయటకు పంపించేటప్పుడు హీరోపై ఎటాక్ చేస్తున్నట్లు చూపించారు. అదే సమయంలో నజియాలో ఆత్మ.. చుట్టూ ఉన్న వాళ్లపై దాడి చేసినట్లు చూపారు. కానీ ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో ఆత్మ ఎలా ఉంటుంది అనే సందేహం వచ్చిందన్నారు. సినిమా కల్పన కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిత్రాలను ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడొచ్చని పరుచూరి వివరించారు. -
షాకింగ్.. భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్? ఫ్యాన్స్ ఆందోళన
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వనున్నారంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. కొంతకాలంగా ఇద్దరికి విభేదాలు తలెత్తాయని, ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉన్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. నిజానికి విజయ్‌కు సంగీత వీరాభిమాని. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలా అర్థాంతరంగా విడాకులు తీసుకోవడం ఏంటని విజయ్ ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ విడాకుల రూమర్స్ ఎలా వచ్చాయంటే.. రీసెంట్గా వారీసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంగీత రాకపోవడం, ఆమధ్య డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ సీమంతం వేడకలోనూ విజయ్ ఒక్కడే వెళ్లడంతో వీరిద్దరికి విబేధాలు తలెత్తాయంటూ తమిళవర్గాల్లో వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇందులో నిజం లేదని విజయ్ సన్నిహితవర్గాలు తేల్చేశాయి. ప్రస్తుతం పిల్లలతో కలిసి సంగీత అమెరికాలో ఉందని, త్వరలోనే ఆమె ఇండియాకు రానున్నట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మకండి అంటూ రూమర్స్‌కి చెక్ పెట్టారు. మరోవైపు వారీసు రిలీజ్ నేపథ్యంలో కొందరు కావాలనే ఇలాంటి అవాస్తవాలు పుట్టిస్తున్నారంటూ విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. -
ఓటీటీకి 'మసూద' చిత్రం.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన తిరువీర్‌కు.. చాలా గ్యాప్ తరువాత మంచి పాత్రతో కనిపించిన సంగీతకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది మసూద. దర్శకుడు మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా.. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. -
కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ అవసరం లేదు: దిల్ రాజు
‘మంచి సినిమాలకు సీజన్ అంటూ ఏమి ఉండదు. కంటెంట్ ఉన్న సినిమాను ఎప్పుడు విడుదల చేసిన ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మసూద’ మరోసారి నిరూపించింది’ అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సంద్భంగా తాజాగా చిత్ర యూనిట్ థాంక్యూ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఒక నిర్మాత ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు సినిమా తియ్యాలి అనుకుని, మంచి సంకల్పం తో సినిమాకు ప్రాణం పెట్టి తీస్తే హిట్ రిజల్ట్ వస్తుందని ఈ జనరేషన్ లో రాహుల్ ప్రూవ్ చేశాడు. తన హోమ్ బ్యానర్( స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్) లో వరుసగా మూడు సినిమాలు( మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్, మసూద) హిట్ సాధించిన రాహుల్ కు & టీం కు కంగ్రాట్స్. నవంబర్ 18 న మసూద ఆ తరువాత "లవ్ టుడే", "హిట్ 2" ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించడం చూస్తుంటే ఇండస్ట్రీ కి మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది’ అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మళ్ళీ రావా, ఏజెంట్ ఆత్రేయ సినిమాలు బిగ్ హిట్ అయిన తరువాత నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న టైమ్ లో మసూద లాంటి స్క్రిప్ట్ ఇచ్చిన సాయికి బిగ్ థాంక్స్. ఈ స్క్రిప్ట్ పూర్తిగా చదివిన తరువాత ఈ కథకు నిర్మాతగా న్యాయం చేయగలుగుతానా లేదా, చివరి వరకు ఈ సినిమాను తీసుకెళ్ల గలిగే ఓపిక ఉందా లేదా అనుకున్నాను. అయితే నాకు సాయి ఫుల్ సపోర్ట్ చేశారు. మసూద కోసం టీమ్ అంతా కష్టపడి పని చేశారు. అందుకే ఇలాంటి విజయం వచ్చింది’ అని అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ.. ‘రాహుల్ తో గత ఆరేళ్లుగా జర్నీ చేస్తున్నాను. తన బ్యానర్ లో మెదటి సినిమా "మళ్ళీ రావా" చేశాను. ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. చాలా రోజుల తర్వాత మసూదతో రియలిస్టిక్ హారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించాడు. ఇంత పెద్ద హిట్ సాధించిన మసూద టీం సభ్యులందరికీ అల్ ద బెస్ట్ ’అన్నారు ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకొని సినిమా తియ్యడమే కాకుండా ఎంతో దైర్యంగా సినిమాను రిలీజ్ చేసి విజయం సాధించిన రాహుల్ టీమ్‌కు అభినందనలు. మసూద సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ కు గురవుతాడు’అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. ‘నాకు హరర్ సినిమాలు అంటే భయం. కానీ ఈ సినిమాను రాహుల్ తో కలసి మెదటి రోజు చూశాను చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నాకు అలాంటి సినిమా తియ్యాలని ఉంది’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. -
నాకు ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చేవి : నటుడు తిరువీర్
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా హీరో తిరువీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ► పరేషాన్ సినిమా చేస్తున్న సమయంలో మసూద గురించి తెలిసింది. సినిమాటోగ్రఫర్ జగదీష్ చీకటి ద్వారా ఈ సినిమా గురించి నాకు తెలిసింది.మసూద డైరెక్టర్ నన్ను ఓ సారి కలిశాడు. కలిసినంత మాత్రాన నిన్ను సినిమాలో తీసుకుంటానని అనుకోకు.. నిర్మాతకు నచ్చితేనే తీసుకుంటాను అని అన్నారు. ఆడిషన్ కోసం ఓ సీన్ చేశాం. అందులో ఇంగ్లీష్ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. ఐదారు టేక్స్ తీసుకున్నా. ఇక సినిమా ఆఫర్ రాదని అనుకున్నా. కానీ చివరకు దర్శక నిర్మాతలకు నచ్చింది. మసూద ఆఫర్ వచ్చింది. ►ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు బాధగా అనిపించింది. నాకు ఎక్కువగా విలన్, సైకో పాత్రలే వచ్చాయి. అలాంటి కారెక్టర్లే నేను చేస్తానా? వాటికే సూట్ అవుతానా? అనే భావన నాలో కలిగేలా చేశారు. అందుకే అందులోంచి బయటకు రావాలి, వెరైటీ పాత్రలు చేయాలని అనుకున్నా. పైకి ఎవ్వరూ చెప్పకపోయినా కూడా అందరికీ హీరో అవ్వాలని ఉంటుంది. చిన్నప్పటి నుంచి గోడ మీద పోస్టర్లు చూసి కథలు అనుకుంటూ ఉండేవాడిని. పలాస టైంలోనూ నా పోస్టర్ ఉంటుంది. కానీ మసూద నాది అఫీషియల్‌గా ఫస్ట్ పోస్టర్. ►ప్రతి ఒక్కరిలో భయాలు ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచీ చీకటి అంటే భయం. నేను నా జీవితంలోనూ గోపీలానే ఉంటాను. నాకు ఈ పాత్రను పోషించడం పెద్ద కష్టంగా అనిపించలేదు. మిగతా సినిమాల్లో చేసిన కారెక్టర్లే కష్టంగా అనిపించాయి. మసూదలో క్లైమాక్స్‌లో చేసిన స్టంట్స్ కాస్త కష్టంగా అనిపించాయి. ►నాకు చిన్నప్పటి నుంచి నటీనటులను చూడటం ఇష్టం. షూటింగ్‌లు జరిగే సమయంలో వారిని చూసి తెగ సంబరపడిపోయేవాడిని. శుభలేక సుధాకర్, సంగీత, సత్యం రాజేష్ ఇలా అందరితో పని చేయడం సంతోషంగా ఉంది. వారితో పని చేస్తూ ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోగలం. ► నేను చేసిన చిత్రాలన్నీ అవార్డ్ విన్నింగ్, విమర్శకుల ప్రశంసలు వచ్చేలానే ఉంటాయి. మల్లేశం, పలాస, జార్జిరెడ్డి వల్ల నేను ఇండస్ట్రీ జనాలకు తెలిశాను. కానీ మసూదలో గోపి పాత్ర వల్ల కామన్ ఆడియెన్స్ వరకు చేరాను. నన్ను వారు గుర్తు పడుతున్నారు. సోషల్ మీడియాలో మెసెజ్‌లు పెడుతున్నారు. ► మసూదతో నాలోని ఇంకో కోణం కూడా అందరికీ తెలిసిందే. నెగెటివ్ మాత్రమే కాదు ఇలాంటి పాత్రలు కూడా పోషించగలడని అంతా నమ్ముతున్నారు. దిల్ రాజు గారికి నా పాత్ర చాలా నచ్చింది. ► ఒకప్పుడు నేను ఎక్కువగా మీమ్స్ వేసేవాడిని. కానీ ఇప్పుడు నా మీద మీమ్స్ వేస్తున్నారు. గోపీ పాత్రతో జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ► హీరో అనే ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ప్రకాష్ రాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారిలా అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరిక ఉంది. నేను సినిమాలో ఉంటే బాగుంటుందని జనాలు అనుకుంటే చాలు. ► నా పేరు తిరుపతి రెడ్డి. నేను గురువుగా భావించే రఘువీర్ నుంచి వీర్ అని తీసుకుని తిరువీర్ అని పెట్టుకున్నా. అయితే వీర్ అనేది మరో సెంటిమెంట్ కూడా యాడ్ అయింది. వీరమ్మ అనేది మా అమ్మ పేరు. అమ్మ, గురువు నుంచి తీసుకోవడంతో తిరువీర్ అనేది నాకు రెండు రకాలుగా సెంటిమెంట్ అయింది. ► ప్రస్తుతం పరేషాన్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మోక్షపటం అనే చిత్రం కూడా లైన్లో ఉంది. వైజయంతీ మూవీస్‌లో ఓ వెబ్ సిరీస్ ఉంది. పారాహుషార్ అనే మరో సినిమా కూడా లైన్లో ఉంది. అలా మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి. కొత్తగా ఏ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. కథ నచ్చితేనే సినిమాలు చేద్దామని, కౌంట్ కోసం చేయకూడదని అనుకుంటాను. ► కమల్ హాసన్ ద్రోహి, విచిత్ర సోదరులు, స్వాతి ముత్యం ఇలా వెరైటీ కథలు, కారెక్టర్లు చేయాలని ఉంది. అయితే రెమ్యూనరేషన్ కోసం మాత్రం సినిమాలు చేయను. కథ, స్క్రిప్ట్ నచ్చితేనే సినిమాలు చేస్తాను. -
నేనేదో డబ్బు కోసం ఈ పని చేయట్లేదు: దిల్ రాజు
‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న విడుదలైన ఈ హారర్ డ్రామా ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని ఎస్విసి బ్యానర్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు యాంకర్‌గా మారి చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్‌ను కొన్ని ఆసక్తకరమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వారిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ మీకోసం... దిల్ రాజు: 50 సినిమాలు తీసిన నిర్మాతగా అడుగుతున్నా... నాకు 2గం. ల 45 నిమిషాల సినిమా చూపించావు. నిడివి తగ్గించమని అడిగితే.. కుదరదని అన్నావు.. అసలు నీ ధైర్యం ఏంటి? నేను అయితే.. ఇంకో 15 నిమిషాలు ఎడిట్ చేయించేవాడిని. రాహుల్ యాదవ్: ఏం లేదు సార్.. సినిమా విషయంలో హానెస్ట్‌గా ఉండాలనుకున్నా. కమర్షియల్‌గా చేయడానికి స్క్రిఫ్ట్ పరంగా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ స్క్రిప్ట్ ఒప్పుకుందే.. హర్రర్ అంశాలతో పాటు ఎవరికైనా సహాయం చేయడానికి రీజన్ అవసరం లేదన్న మెసేజ్ కూడా కారణం. దిల్ రాజు: ఇంత డబ్బు పెట్టావు.. ఓటీటీ, శాటిలైట్ అమ్మావా? అంటే అమ్మలేదు సార్ అన్నావ్. రిలీజ్ అంటున్నావ్.. ముందు నాన్ థియేట్రికల్ అమ్మి డబ్బు సేవ్ చేయమంటే.. పరవాలేదు సార్ అన్నావ్. అసలు ఏంటిది? అంత డబ్బు పెట్టావ్.. నీ కాన్ఫిడెన్స్ ఏంటి? రాహుల్: నిజంగా చెప్పాలంటే.. కొన్ని ఆఫర్స్ వచ్చాయి సార్. హీరో లేడు.. హర్రర్ సినిమా.. ఇలా రకరకాల కామెంట్స్‌తో వాళ్లు నాకు కొన్ని నంబర్స్ (డబ్బు) చెప్పారు. కానీ ఆ నెంబర్స్ నేను తీసుకున్నా... తీసుకోక పోయినా పర్లేదు అనుకున్నా. అందుకే అమ్మలేదు. దిల్ రాజు: చాలా మంది సినిమాలు తీస్తుంటారు. కానీ కొంతమందికే సక్సెస్ అవకాశం ఉంటుంది. అందులో నువ్వు కూడా ఒకడివి. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా.. మంచి సినిమాకి సపోర్ట్ చేస్తున్నా. నీ సినిమా టేస్ట్‌కి సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది అనుకుంటారు.. నేను ఏదో మనీ కోసం చేస్తున్నా అని. కానే కాదు. కానీ ఒక మంచి సినిమా తీసినప్పుడు.. సపోర్ట్ చేస్తే.. కొంతమందికైనా సినిమా రీచ్ అవుతుందనేది నా నమ్మకం. రాహుల్: థ్యాంక్యూ సార్ దిల్ రాజు: సౌండ్ డిజైనింగ్ దగ్గర నుంచి, డైరెక్టర్ విజన్ వరకు అంతా రాహులే చూసుకున్నాడు. నేను డైరెక్టర్‌తో కూడా మాట్లాడలేదు. రాహుల్‌తోనే లెంగ్త్ గురించి మాట్లాడా. కానీ ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేసేది లేదు సార్ అంటాడు. అప్పుడనిపించింది.. అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని! అని చెప్పుకొచ్చాడు. అనంతరం నటి సంగీత మాట్లాడుతూ.. ‘‘మామూలుగా నాకు హర్రర్ సినిమాలంటే చాలా భయం. పెద్దగా చూడను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. మేకప్ లేకుండా చేయాలంటే ఏ ఆర్టిస్ట్‌కి అయినా భయమే. కానీ నేనే థ్రిల్ అయ్యేలా చేశారు కెమెరా మ్యాన్’’ అన్నారు దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. '‘వెళ్లిపోమాకే’ దగ్గర నుంచి దిల్ రాజుగారిని ఫాలో అవుతున్నా. ఒక మంచి ప్రయత్నాన్ని ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్యూ దిల్ రాజుగారు. ఒక సంవత్సరం క్రితం రాహుల్ ఆఫీస్‌కి వెళితే.. ఇప్పుడే వస్తానని చెప్పి రాహుల్ బయటికి వెళ్లి రెండు గంటల వరకు రాలేదు. అక్కడెవరూ లేకపోవడంతో.. నేనంతా పరీక్షగా చూస్తూ ఉన్నా. ఒక కార్నర్లో పిచ్చిపిచ్చి బొమ్మలు గీసి ఉన్నాయి. పిచ్చి పిచ్చి అని కాదు. చాలా క్రీపీ స్టఫ్ ఉంది.ఆ రోజు నేను చూసిన బొమ్మలు.. వాటి నుంచి వచ్చిన చిత్రాన్ని నేను తెరపై చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది’’ అని కోరారు. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘10 ఏళ్ల క్రితం కాంజురింగ్ సినిమా చూశా.. ఆ తరువాత మళ్లీ ఈ సినిమాలో భయపడ్డా. సాయికిరణ్ ఈ సినిమాను చాలా అందంగా రాశాడు. హారర్ సినిమా కూడా ఎందుకింత అందంగా ఉందీ అంటే.. అది మీరు చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాకు, నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ.. సినిమా చూశాక అందరినీ అభినందించాలని అనిపించింది. తిరువీర్ అంటే నాకు ఈర్ష్య. చాలా మంచి నటుడు. 10 ఏళ్ల క్రితం నేను, తిరువీర్ ప్రయాణం మొదలెట్టాం. ఇలాంటి సినిమాలకు సపోర్ట్ వస్తే.. అలాంటి నటీనటులు బయటికి వస్తారు. ఈ సినిమా సీక్వెల్లో నేనే హీరో (నవ్వుతూ)..’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తీరువీర్, కావ్య కల్యాణ్ రామ్, బాందవీ శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి, సినిమాటోగ్రాఫర్ నగేశ్, నటుడు కృష్ణతేజ, మసూద పాత్ర పోషించిన అఖిల రామ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హౌస్మేట్స్ పొట్ట కొడుతున్న సింగర్ రేవంత్ కృష్ణానదిలో కృష్ణ అస్థికల నిమజ్జనం -
Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ
టైటిల్: మసూద నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు నిర్మాణసంస్థ: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా రచన, దర్శకత్వం: సాయికిరణ్ సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్ ఎడిటర్: జెస్విన్ ప్రభు విడుదల తేది: నవంబర్ 18, 2022 ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్ 18) విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. కథేంటంటే.. నీలం(సంగీత) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్త అబ్దుల్(సత్య ప్రకాశ్)కు దూరంగా ఉంటూ.. కూతురు నాజియా(బాంధవి శ్రీధర్)తో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంట్‌కు ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉండే గోపీ(తీరువీర్) ఓ సాఫ్ట్వేర్. తన సహోద్యోగి మినీ(కావ్యా కళ్యాణ్ రామ్)ని ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్మెంట్లో ఉండడంతో నీలం ఫ్యామిలీకి క్లోజ్ అవుతాడు. అప్పుడప్పుడు గోపీతో కలిసి నీలం, నాజియా బయటకు వెళ్తుంటారు. అయితే ఓ రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అర్థరాత్రి వేళ ఏదోదో మాట్లాడుతుంది. కూతురిని అలా చూసి భయపడిన నీలం.. గోపీని సహాయం అడుగుతుంది. నాజియా ప్రవర్తను చూసిన గోపీ.. ఆమెకు దెయ్యం పట్టిందని గ్రహిస్తాడు. ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్(సత్యం రాజేశ్) సలహాతో పీర్ బాబా(శుభలేఖ సుధాకర్)ను కలుస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సమస్యలు ఏంటి? నాజియా ఆత్మలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? మసూదను మీర్ చాచా ఎందుకు చంపాడు? నాజియాను రక్షించడానికి గోపీ చేసిన సాహసం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మసూద’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఒకప్పుడు టాలీవుడ్లో చాలా హారర్ మూవీస్ వచ్చి, విజయం సాధించాయి. కానీ ఈ మధ్య కాలంలో హారర్ అంటే.. కామెడీనే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులను భయపెట్టడం కంటే నవ్వించడమే తమ లక్ష్యం అనేలా హారర్ మూవీస్ తీస్తున్నారు. కానీ చాలా కాలం తర్వాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చింది ‘మసూద’. ఈ చిత్రం కథ పాతదే అయినా.. కథనం మాత్రం చాలా కొత్తగా, ఢిఫరెంట్‌గా సాగుతుంది. కథంతా ముస్లిం నేపథ్యంలో జరుగుతుంది. ఆత్మలను వదిలించడానికి పీర్ బాబాలు వస్తారు. మసీదులో మంత్రాలు చదువుతారు. అందుకే కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలాంటి సీన్స్ పెడితే ప్రేక్షకులు భయపడతారో..అలాంటి వాటిపై దర్శకుడు సాయికిరణ్ మరింత ఫోకస్ పెట్టాడు. ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు హారర్‌ని చూపిస్తూ.. మరోవైపు గోపీ, మినీల లవ్ట్రాక్ని నడిపించాడు. దీంతో ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేశాడు. అసలు కథంతా సెకండాఫ్‌లో సాగుతుంది. పీర్‌బాబా ఎంటర్ అవ్వడంతో కథలో వేగం పెరుగుతుంది. అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏమై ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే కథనం సాదాసీదాగా సాగినా.. ఓక్కో సీన్ ప్రేక్షకులను దారుణంగా భయపెడుతాయి. మసూద నేపథ్యం గురించి చెప్పే క్రమంలో కొన్ని సీన్స్ భయానికి గురి చేస్తాయి. ఇక చివరి అరగంట మాత్రం హారర్ అదిరిపోతుంది. ప్రేక్షకుడిని భయపెట్టడమే లక్ష్యంగా కథనం సాగుతుంది. హారర్‌తో పాటు.. తల్లి సెంటిమెంట్‌ని కూడా టచ్ చేశాడు దర్శకుడు. కూతురిని గొలుసులతో కట్టేసినప్పుడు.. తల్లిగా సంగీత పడే బాధ, ఏడుపు హృదయాలను హత్తుకుంటుంది. నిడివి ఎక్కువే అయినా.. హారర్ మాత్రం అదిరిపోయింది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు సంగీత, తిరువీర్, కావ్య, భాందవిల పాత్రలే చాలా కీలకం. గోపీ పాత్రలో తీరువీర్ ఒదిగిపోయాడు. హీరోలా కాకుండా నిజంగా పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఇక సంగీత అయితే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించింది. నీలం పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కన్నీళ్లు పెట్టించింది. ఇక సినిమాకు మరో ప్రధాన బలం బాంధవి శ్రీదర్ పాత్ర. నాజియాగా ఆమె తనదైన నటనతో అందరిని భయపెట్టింది. కథంతా నాజియా పాత్ర చుట్టే తిరుగుతుంది. బాలనటిగా పలు సినిమాల్లో కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్.. ఈ చిత్రంలో మిలీ పాత్ర పోషించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ తెరపై అందంగా కనిపించింది. పీర్‌బాబా పాత్రలో శుభలేఖ సుధాకర్ ఒదిగిపోయాడు. అల్లా ఉద్దీన్‌గా సత్యం రాజేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం. ఓ హర్రర్ సినిమాకు సౌండ్, విజువల్స్ చాలా ముఖ్యం. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ జెస్విన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మసూద’ ఒక ట్రూ హారర్ డ్రామా.. యువ దర్శకుల ప్రశంసలు
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హారర్-డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 18న విడుదల కానుంది. చిత్రం ప్రీమియర్ ని చిత్రయూనిట్ తో పాటు... యువ దర్శకులు చూశారు. ఈ సదర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద్భంగా యువ దర్శకులు స్వరూప్ అర్. ఎస్. జే, వెంకటేశ్ మహా, వివేక్ ఆత్రేయ, వినోద్ అనంతోజు, సందీప్ రాజ్ లు మసూద మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే... హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు. ఇలాంటి హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే వారికి కలిగిన అనుభూతి, ప్రేక్షకులకి కూడా కలుగుతుందని చెప్పారు. ఈ జానర్ లో ఇంకొన్ని కథలు రావటానికి మసూద ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మా చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని మెప్పించిందో మసూద కూడా అంతే జెన్యూన్ గా మెప్పిస్తుందన్నారు. ఈ కథను నమ్మి హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించారు. దర్శకుడు సాయి కిరణ్ గురించి మాట్లాడుతూ... కథలోనే హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు, అలా క్రియేట్ చేయడం చాలా కష్టమని, ఆ విషయంలో దర్శకుణ్ణి అభినందించారు. ఈ చిత్రానికి సౌండ్ అండ్ విజువల్ ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. మళ్లీరావా, ఏజెంట్ తరువాత మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద రేపు రిలీజ్ కాబోతోంది. మేం సినిమాను జెన్యూన్‌గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది అని మా నమ్మకం. సినిమా కోసం టీంలో అందరూ కష్టపడి పని చేశారు.' అని అన్నారు. -
సీసీఐకు తాత్కాలిక చైర్పర్సన్ సంగీతా వర్మ నియామకం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీతా వర్మను నియమించింది. ప్రస్తుత ఫుల్‌టైమ్ చైర్‌పర్శన్ అశోక్ కుమార్ గుప్తా మంగళవారం వైదొలగడంతో ప్రభుత్వం సంగీతా వర్మకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. సీసీఐలో సభ్యురాలైన వర్మ బుధవారం(26) నుంచి మూడు నెలలపాటు చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. పూర్తిస్థాయి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేటంతవరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ వర్మ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. మంగళవారం రాజీనామా చేసిన గుప్తా 2018 నవంబర్‌లో సీసీఐకు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర
సక్సెస్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆనందాన్నిస్తుంది కాబట్టి. ఆనందాలు మళ్లీ మళ్లీ కావాలి... కొత్త కొత్త రూపాల్లో రావాలి... ఇదీ సంగీతారాజేశ్ ఆకాంక్ష. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో నిస్వార్థసేవ. ఫ్యాషన్ ఇండస్ట్రీకి కొత్త నడక. బ్యూటీ ఇండస్ట్రీ అధ్యయనం. మహిళలకు మార్కెట్ పాఠాల బోధన. అన్నింటిలో రాణిస్తున్న... ఆమె ‘సక్సెస్ మంత్ర’ ఏమై ఉంటుంది? ఓ ముప్పై– నలభై ఏళ్ల కిందట... ‘ఇది ఇంపోర్టెడ్ శారీ, మా అన్న సింగపూర్ నుంచి తెచ్చాడు’ అని ఒకరు హోదా ఒలకబోసేవారు. ‘నాది కూడా ఇంపోర్టెడే. ఫలానా నగరంలో స్మగుల్డ్ గూడ్స్ దొరుకుతాయి’ అని మరొకరు... మీకు నేనేమీ తీసిపోను అన్నంత ధీమాగా. అప్పట్లో ఇలా నడిచేవి సగటు మహిళల కబుర్లు. వాళ్లలో ఎవరికీ స్మగుల్డ్ గూడ్స్ కొనడం చట్టరీత్యా నేరమనే విషయం తెలియదు కూడా. సింథటిక్ మోజుతోపాటు ఇలాంటి హోదాల ప్రదర్శనలో మన సంప్రదాయ వస్త్రాలు తెరమరుగయ్యాయి, క్రమంగా వస్త్రాల తయారీదారులు కనుమరుగవడం కూడా మొదలైంది. అలాంటి సమయంలో గ్లోబలైజేషన్ రూపంలో వచ్చింది ఓ పెనుమార్పు. మన చేనేతలకు విదేశాల్లో అందుతున్న గౌరవాలను స్వయంగా చూసిన మన మహిళలే మన సంప్రదాయ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. నిర్లిప్తంగా మిగిలిపోయిన చేనేత, హస్తకళాకారుల వైపు చూసింది భారతీయ ఫ్యాషన్ ఇండస్ట్రీ. అలాంటి సమయంలో పెన్ కలంకారీని పునరుద్ధరించడానికి స్వచ్ఛందంగా సేవ చేశారు సంగీతా రాజేశ్. అంతకంటే ముందు ఆమె పిల్లల చదువు వారి మానసిల్లోసానికి, మే«ధావికాసానికి దోహదం చేయాలి తప్ప బడి అంటే భయపడేలాగ ఉండకూడదని స్పెషల్ కిడ్స్ కోసం ప్రత్యేకమైన కరిక్యులమ్ తయారు చేశారు. పిల్లల్లో మేధావికాసానికి మన తాతమ్మల నుంచి ఇంట్లో ఆడుకున్న బోర్డ్‌గేమ్స్ దోహదం చేస్తాయని ఆచరణ లో చూపించారామె. సోషల్ మీడియా లో లక్షలాది ఫాలోవర్లున్న ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ఇప్పుడు తాజాగా ‘మనిషిని సమాజంలో ఆత్మవిశ్వాసం తో ముందుకు నడిపించే సాధనం అందంగా కనిపించడం కూడా’ అని మరో ప్రయోగానికి తెర తీశారు. ♦ స్పెషల్ పాఠాలు ‘‘నేను మధురైలో పుట్టాను, దిండిగల్‌లో పెరిగాను. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలోని అబ్బాయితో పెళ్లయింది. అలా పాతికేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చాను. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని, స్పెషల్ చిల్డ్రన్‌కి స్పీచ్ థెరపీ, వాళ్లకు కాన్సెప్ట్ అర్థమయ్యేటట్లు టీచింగ్ మెటీరియల్, ప్రత్యేకమైన టీచింగ్ మెథడాలజీతో క్లాసులు చెప్పి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పరీక్షలు రాయించి మెయిన్ స్ట్రీమ్‌కి పంపించడం నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. అందులో బిజీగా ఉన్నప్పుడు కలంకారీ మీద ఆసక్తి కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో నిష్ణాతులు చేసే పెన్ కలంకారీ మీద అధ్యయనం చేశాను. వాళ్ల చేతిలో కళ ఉంది, నా దగ్గర సృజన ఉంది. ఆ రెండింటినీ కలుపుతూ కొత్త ప్యాటర్న్స్ తెచ్చాం. వాటి ఖరీదు ఎక్కువే. కానీ ఒక చీర అమ్మగలిగానంటే దానిని తయారు చేసిన కుటుంబం నెలంతా ఆకలి లేకుండా జీవించగలుగుతుంది. పెన్ కలంకారీని ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాను. వీవర్స్‌కి ప్రయోజనం కల్పించడంలో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత చాలామంది ఇదే పంథాను అనుసరించారు. పెన్ కలంకారీ కళాకారుడికి సూచనలు ఇస్తూ... ♦ పంచడానికే జ్ఞానం! నేను ప్రధానంగా టీచర్ని కావడంతో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను నాలో దాచుకోలేను. జ్ఞానం ఉన్నది పలువురికి పంచడానికే అన్నట్లు ఉంటాను. వినడానికి నా ఎదురుగా ఎవరూ లేకపోతే ఫేస్బుక్లో చెబుతాను. అలా తొమ్మిదేళ్ల కిందటే నేను ఎఫ్బీ వేదికగా కాస్ట్యూమ్ ప్రజెంటేషన్ ఇచ్చాను. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. నాకు అప్పటికే ఎనిమిది లక్షల ఫాలోవర్లున్నారు. ఆ టైమ్‌లో నాకు అసలైన చాలెంజ్ నా వ్యాపారాన్ని కొనసాగించడం కాదు, నా ఉద్యోగులకు జీతాలివ్వడం. రెండు వారాలు మినహా మిగతా కోవిడ్ సమయమంతా పని చేశాను. అప్పుడు షోరూమ్‌లు, మాల్స్‌లో జనం కనిపించలేదు, కానీ ఆన్లైన్లో చాలా ఎక్కువగా కొనుగోళ్లు చేశారు. ♦ అదే నా సక్సెస్ సూత్ర నేను కోవిడ్ టైమ్‌లో సూరత్, జైపూర్‌కు వెళ్లి అక్కడి నుంచి లైవ్‌లో డిస్ప్లే చేశాను. గంటల్లోనే కొనుగోళ్లు జరిగాయి. స్టాక్ అక్కడి నుంచే నేరుగా డెలివరీ ఇచ్చేశాను. ఒక రవాణా ఖర్చు, ఒక స్టేట్ జీఎస్టీ తగ్గిపోతే ఎంత ఆదానో ఆలోచించండి. విదేశాలకు వెళ్లాల్సిన స్టాక్ ఆగింది, మార్కెట్ చేసి పెట్టమని అడిగిన వాళ్ల స్టాక్‌ను ఆన్లైన్లో అమ్మేశాను. దాంతో స్టాక్ కొనుగోలుకు డబ్బు పెట్టాల్సిన అవసరం రాలేదు. అటు ఉత్పత్తిదారులు, నేను– నా ఉద్యోగులు, వినియోగదారులు... అందరికీ ప్రయోజనమే. అందుకే విన్ విన్ డీల్ ఎప్పుడూ సక్సెస్ అవుతుందని నమ్ముతాను. గృహిణులు కొంతమంది ఇంట్లోనే చిన్న స్థాయిలో దుస్తులు, ఇతర ఇంటికి అవసరమైన వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. కానీ అదంతా అవ్యవస్థీకృతంగా ఉంది. అలాంటి హోమ్ సెల్లర్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఔత్సాహిక మహిళలకు బోధన తరగతులలో పాఠాలు చెప్తున్నాను. వ్యాపారం కోసం ఓ సొంత ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంట్ నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలలో శిక్షణ, మార్కెట్ మెళకువలతోపాటు డెడ్స్టాక్ను ఎలా డీల్ చేసే సులువు కూడా నేర్పిస్తున్నాను. హోమ్ సెల్లర్స్ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే... స్నేహితులు, బంధువులలో కస్టమర్లను వెతుక్కోవడం. ఆ పొరపాటు వల్ల స్నేహితులు, బంధువులు దూరమవుతారు తప్ప, లాంగ్ టర్మ్ కస్టమర్లను ఏర్పరుచుకోవడం సాధ్యం కాదు. ప్రొఫెషన్నీ, కుటుంబ బంధాలను కలపకూడదు’’ అని తాను నేర్చుకున్న, అనుసరించిన సక్సెస్ సూత్రను వివరించారు సంగీతారాజేశ్. స్పెషల్ చాలెంజ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని బాగా అధ్యయనం చేశాను, కాబట్టే బ్యూటీకి ఉన్న ఆదరణ, మేకోవర్ అవసరాన్ని కూడా తెలుసుకోగలిగాను. ఫ్యాషన్, బ్యూటీ... ఈ రెండూ ఒకదానితో ఒకటి కలగలిసి ఉంటాయి. అందం అనేది మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనం. మరి అలాంటప్పుడు అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో అధునాతన సాధనాలు అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో అందంగా కనిపించడం అనే ఆకాంక్షకు ఎవరైనా ఎందుకు దూరంగా ఉండాలి? నేను వయసులో ఉన్నప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పరుగులు పెట్టాను, రిటైర్మెంట్ లేకుండా ఒకచోట స్థిమితంగా ఉంటూ నిర్వహించుకోవడానికి ఇప్పుడు కొత్త కెరీర్లోకి అడుగుపెట్టాను. ఇందులో కూడా సక్సెస్ అయ్యి, మరో ఐదేళ్లలో కొత్త తరానికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుతాను. నేను కెరీర్ రోల్స్ ఎన్ని మార్చినా స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్లో కొనసాగుతూనే ఉంటాను. – సంగీతారాజేశ్, స్పెషల్ ఎడ్యుకేటర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో
ఐదేళ్ల కెరీర్. బానే ఉన్నట్టు. పదేళ్లు. అబ్బో కేక. చాలా పెద్ద హీరోయిన్. ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమాని ఏలేసింది అంటారు. అదే హీరోలకైతే పదేళ్లు అన్నది చాలా తక్కువ టైమ్. వాళ్లకి 60 దాటినా హీరోలే. సో విషయం ఏంటంటే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఇలా వచ్చారు. అలా వెళ్లిపోయారు అన్నట్టుగా ఉంటుంది. ఈ టైమ్‌లో వాళ్లు పోషించే ఛాలెంజింగ్ పాత్రలే ఆ తర్వాత కూడా వాళ్ల గురించి మాట్లాడుకునేలా చేస్తాయి. లేదా వాళ్ల లైఫ్ స్పాన్స్ని పెంచుతాయి. లేడి ఓరియంటెడ్ సినిమాలే తెలుగులో తక్కువ. అందులో ఒక గ్లామర్ హీరోయిన్ ఏకంగా లేడి అమితాబ్ అన్న బిరుదును దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. విజయశాంతికి అది ఎందుకు సాధ్యమైందంటే తను అసామాన్యురాలు కాబట్టి. ఒకటి కాదు. రెండు కాదు. తానే ముందుండి నడిపించిన సినిమాల లిస్ట్ ఒసేయ్ రాములమ్మ దాకా చాలా పెద్దదే ఉంది. అయితే వీటన్నింటికీ పునాది మాత్రం కర్తవ్యం సినిమానే. అందులో పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి పెర్ఫామెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సావిత్రి బయోపిక్ తీస్తున్నారు. కీర్తిసురేష్ సావిత్రిగా చేస్తుందన్న వార్త బయటకు రాగానే రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. సావిత్రిని మరిపించేలా కీర్తి సురేష్ నటించగలదా అన్న సందేహాలు కూడా వ్యక్తమైయ్యాయి. కానీసావిత్రి పాత్రలో పరాకాయ ప్రవేశం చేసింది కీర్తి సురేష్. సావిత్రి జీవితంలోని ప్రతి దశను అద్భుతంగా వెండి తెర మీద ఆవిష్కరించింది. శివపుత్రుడు చిత్రంలో గోమతి క్యారెక్టర్‌తో అందరినీ ఆశ్చర్యపర్చింది సంగీత. అందులో గంజాయి అమ్మే యువతి పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించింది. ఆ పాత్రలో జీవించింది. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్ల తర్వాత 2002లో ఖడ్గంతో హిట్ అందుకుంది సంగీత. ఆ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిలిమ్‌ఫేర్ అవార్డు తెలుగు అందుకుంది. ఆ వెంటనే పితామగన్ చిత్రంలో గంజాయి అమ్మే పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గ్లామర్ పాత్రలతో ఇల్లు చక్కపెట్టుకోవాల్సిన టైమ్‌లో ఇలాంటి రోల్స్ అవసరమా అని సలహాలు కూడా ఇచ్చారట. కానీ డైరెక్టర్ బాలా మీద నమ్మకంతో డేట్స్ ఇచ్చేసింది సంగీత. హీరోయిన్ అంటే గ్లామర్ రోల్. అంతే అని ఇండస్ట్రీ అంతా ఫిక్స్ అయిన టైమ్ సోలో గా కథలను లీడ్ చేసే ప్రతిభను ప్రదర్శించిఅవకాశాలనూ దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ తొలి నుంచి సమంతకి దక్కు తూనే ఉన్నాయి. ఏమాయ చేశావే, రంగస్థలం, ఓ బేబీఇలా చాలా సినిమాల్లో నటిగా తన సత్తాని చాటింది. ఛాలెంజింగ్ రోల్స్ గురించి ప్రస్తావించాలంటే అనుష్క గురించి చాలా చాలా మాట్లాడుకోవాలి. కేవలం గ్లామర్ డాల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. అయితే అనుష్కలోని ప్రత్యేకత ఏంటంటే ఒక మూస లోనే ఉండకపోవడం. అరుంధతి విడుదలైన తర్వాత ఇక అనుష్కకి గ్లామర్ పాత్రలు పెద్దగా రావంటూ చాలా విశ్లేషణలు వచ్చాయి. కానీ ఆ అంచనాలను తప్పని నిరూపించింది. అటు గ్లామర్ రోల్స్, అటు ఛాలెంజింగ్ రోల్స్ అదరగొట్టింది. విభిన్నమైన పాత్రలు చేయాలని సహజంగానే ఎవరికైనా ఉంటుంది. కానీ దాని కోసం కెరీర్‌ని రిస్‌లో పెట్టడానికి కూడా వెనుకాడని వాళ్లు అతి అరుదుగా ఉంటారు. నటన పై వారికున్న గౌరవానికి అతి ప్రతీక. స్వీటి ఆ కోవలోకే వస్తుంది. అసలు హీరోయిన్ అంటేనేగ్లామర్. కేవలం ఒక పాత్ర కోసం బరువు పెరగడం అంటే కెరీర్ చుట్టూ క్వశ్చన్ మార్క్‌లు పెట్టుకోవడమే. ఆ సాహసాన్ని అనుష్క చేసింది. సైజ్ జీరో సినిమా కోసం 17 కేజీలు బరువు పెరిగింది. -
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్
నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఖడ్గం మూవీతో ఒకే ఒక్క చాన్స్ అంటూ అమాయకపు మాటలతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరిగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: హాట్‌టాపిక్ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పారితోషికం, ఎవరెవరికి ఎంతంటే..! సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆడపదడపా చిత్రాలు చేస్తూ.. పలు డాన్స్, కామెడీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె ‘మసూద’ అనే హార్రర్ చిత్రంలో నటిచింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె సరిలేరు నీకెవ్వరు మూవీ, ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌కి తల్లిగా చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో ఆమె చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్‌కి మదర్‌గా చేయడం ప్లస్ అయ్యిందా? మైనస్అయ్యిందా? అని హోస్ట్ ప్రశ్నించగా.. రెండూ అని సమాధానం ఇచ్చింది. చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్ ఆ తర్వాత అనిల్ రావిపూడి వచ్చి తనకు కథ వివరించారని చెప్పంది. ఇక ఇప్పుడు అనిల్‌ని చూస్తే ‘రేయ్ ఇలా చేశావ్ రా నన్ను’ అని తింటుకుంటాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సంగీత. ఆ తర్వాత అవకాశం వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా అని కూడా సంగీతని అడగ్గా.. ఓ సినిమా షూటింగ్ కి రెండు రోజులు వెళ్లానని, ఆ తర్వాత వాళ్లు చిత్రం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా సరిలేరు నీకెవ్వరులో సంగీత హీరోయిన్గా తల్లిగా ‘అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించ్చింది. -
భర్త చనిపోయాక మీనా తొలిసారి ఇలా.. ఫొటో వైరల్
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే భర్త విద్యాసాగర్‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అతడి మరణంతో ఆమె కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తాజాగా మీనాను పరామర్శించేందుకు సీనియర్ హీరోయిన్స్ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీనా వారితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త చనిపోయాక మీనా చేసిన తొలి పోస్ట్ ఇది. ఇందులో మీనా నవ్వుతూ కనిపించగా ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. కాగా ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న మరణించారు. ఆయన మరణంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. ఇటీవలే ఆమె ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్‌లో రాజేంద్రప్రసాద్ బర్త్‌డే సెలబ్రేట్ చేయగా ఆ వేడుకల్లో మీనా తళుక్కున మెరిసింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: మహేశ్‌కు చిరు, వెంకీల స్పెషల్ బర్త్‌డే విషెస్ ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ -
'గంగోత్రి' బాలనటి హీరోయిన్గా 'మసూద'.. భయపెట్టేలా టీజర్
Masuda Teaser Launched By Natural Star Nani: ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకుంది స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్. ఈ ప్రొడక్షన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘మసూద’. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకోగా.. మంగళవారం (ఆగస్టు 2) నేచురల్ స్టార్ నాని ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించారు. ఈ టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుందని, ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అని అనిపిస్తుందని నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో నూతన డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (లలన్ సింగ్ పాత్రధారి) నటిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాలనటిగా అలరించిన కావ్య కల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన నేచురల్ స్టార్ నానికి మా టీమ్ తరఫున ధన్యవాదాలు. ఆయనకు టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థలో వస్తున్న ఈ మూడో చిత్రం కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ చిత్రంతో సాయికిరణ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాము. సాయికిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి తీరు.. ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే పనిచేసిన సాంకేతిక నిపుణులకు, సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్, అలాగే మూవీ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం’’ అని తెలిపారు. -
తెలంగాణ దేవుడు మూవీ రివ్యూ
టైటిల్ : తెలంగాణ దేవుడు నటీనటులు : శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, సుమన్, సునీల్, బ్రహ్మాజీ, సంగీత, మధుమిత, సత్యకృష్ణ, అజయ్, వెంకట్, కాశీ విశ్వనాధ్, వడత్యా హరీష్ తదితరులు నిర్మాత : మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ దర్శకత్వం : వడత్యా హరీష్ సంగీతం : నందన్ బొబ్బిలి ఎడిటింగ్: గౌతంరాజు విడుదల తేది : నవంబర్ 12, 2021 ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరెకెక్కాయి. తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్జీవిత కథ ఆధారం సినిమాలు వచ్చాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తెలంగాణ దేవుడు’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. తెలంగాణ దేవుడు కథేటంటే..? దర్శకుడు ముందుగా చెప్పినట్టే సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీని ఎమోషనల్ డ్రామాగా రూపొందించారు. విజయ్ దేవ్ (జిషాన్ ఉస్మాన్, శ్రీకాంత్) తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి దారి తీసిన కారణాలేంటి? చదువుకునే టైమ్‌లో విజయ్ దేవ్ ఎలా ఉండేవాడు? ఎలా విజయ్ దేవ్ ఉద్యమంలో అడుగుపెట్టి.. ఉద్యమ నాయకుడు అయ్యాడు? ఉద్యమ నాయకుడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం అతను చేసిన ప్రయత్నాలేంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా ఆయన చేసిన అభివృద్ది ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘తెలంగాణ దేవుడు’కథ. ఎవరెలా చేశారంటే..? యువ విజయ్ దేవ్‌గా జిషాన్ ఉస్మాన్ అద్భుత నటనను కనబరిచాడు. జీషాన్కి ఇది తొలి సినిమా అయినప్పటికీ.. తెరపై ఎక్కడా జంకకుండా నటించాడు. యవ్వనంలో కేసీఆర్ ఇలానే ఉండేవాడు అన్నట్లుగా జిషాన్ నటన ఉంటుంది. స్టూడెంట్‌గా, కబడ్డీ ప్లేయర్‌గా, పెళ్లి, భూస్వాములను ఎదిరించి ఉద్యమం వైపు అడుగులు వేయడం వంటి ఘట్టాలలో జిషాన్ సమర్థవంతంగా నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుత విజయ్ దేవ్‌గా శ్రీకాంత్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. కేసీఆర్‌ని ఇమిటేట్ చేస్తూ నడక, ఆహార్యం ప్రదర్శించడమే కాకుండా కథనంతా తన భూజానా వేసుకొని నడిపించాడు. ఇక విజయ్ దేవ్‌కి విద్యాబుద్దులు నేర్పే గురువు పాత్రలో బ్రహ్మానందం ఒదిగిపోయాడు. భూస్వామిగా తనికెళ్ల భరణి, ప్రొఫెసర్ జైశంకర్‌గా సుమన్, విజయ్ దేవ్ కొడుకుగా చేసిన వెంకట్, రమేశ్ రావుగా అజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. తెలంగాణ దేవుడు ఎలా ఉందంటే..? ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌గా రూపుదిద్దుకున్న చిత్రమే ‘తెలంగాణ దేవుడు’. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటనేది అందరికి తెలిసిందే. అయితే చిన్నపుడు కేసీఆర్ ఎలా ఉండేవాడు? ఆయన ఉద్యమంలోకి ఎలా వచ్చాడు? అనే అంశాలను తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు వడత్యా హరీష్. తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమంలో కేసీఆర్ పాత్రపై చాలా సినిమాలే వచ్చాయి. కానీ పూర్తిగా ఉద్యమ నాయకుడి నేపథ్యంలో వచ్చిన మూవీ ఇదేనని చెప్పాలి. 1969 నుంచి కథను తీసుకున్నాడు. ముఖ్యంగా కేసీఆర్‌గారి చిన్నతనం నుండి మొదలుకొని తన కాలేజ్ లైఫ్, ఉద్యమం, సీఎం వరకు కథ సాగుతుంది. కేసీఆర్ జీవితం గురించి చెబుతూ.. కమర్షియల్ బయోపిక్‌లా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడనే చెప్పాలి. తండ్రి నడిపే తెలంగాణ ఉద్యమ పార్టీలోకి చేరిన విజయ్ దేవ్.. నేషనల్ పార్టీలోకి వెళ్లడం, ఆ తర్వాత ఓ ప్రాంతీయ పార్టీలోకి వెళ్లడం.. ఇవేవీ తెలంగాణ ఆశయానికి సహకరించడం లేదని అన్నింటికీ రాజీనామా చేసి మళ్లీ సొంతంగా పార్టీ పెట్టడం వంటి వన్నీ కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఈ విషయాలన్ని దాదాపు అందరికి తెలియడం, కథ కూడా నెమ్మదిగా సాగడం సినిమాకు కాస్త మైనస్. సీరియస్‌గా సాగుతున్న సినిమాలోకి మధ్య మధ్య వచ్చే కొన్ని పంచ్ డైలాగ్స్ , సీన్స్ కథలో సీరియస్ నెస్ ని తగ్గించేవిగా ఉన్నాయి. పూతరేకులు సీన్, రోశయ్య పాత్రలో చేసిన దుర్గయ్య సీన్స్ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇక సాంకేతిక విషయానికొస్తే.. నందన్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతం అందించాడు. ఎడిటర్‌కి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసే అవకాశం అయితే ఉందనిపించింది. ఇక నిర్మాత జాకీర్ ఉస్మాన్ ఈ సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఆయన పెట్టిన ప్రతి పైసా.. సినిమాలో కనిపిస్తుంది. -
సంగీత విద్వాంసుడు సంగీతరావు కన్నుమూత
సాక్షి, చెన్నై: సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు అయిన పట్రాయని సంగీతరావు ఇకలేరు. కరోనా మహమ్మారి బారిన పడ్డ ఆయన బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతం లో చెన్నైలో కన్నుమూశారు. సినీ సంగీత దిగ్గజం ఘంటసాలకు సహాయకుడిగా పనిచేసిన ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు. 1920 నవంబర్ 2న విజయనగరం జిల్లా కిండాం అగ్రహారంలో జన్మించిన సంగీతరావు వయసు 101 ఏళ్లు. పట్రాయని వారి సంగీత కుటుంబంలో మూడోతరానికి చెందిన సంగీత రావు అసలు పేరు నరసింహమూర్తి. అయితే, హార్మోనియం వాయించడంలో దిట్ట అయిన ఆయన సంగీతరావుగానే సుపరిచితులు. ఘంటసాల స్వర సహాయకుడిగా 1974 వరకు సుమారు పాతికేళ్ల పాటు తెలుగు సినిమాతో సంగీతరావు జీవితం ముడిపడివుంది. సాహితీ రంగంలోనూ సంగీతరావు ఎంతో ప్రతిభను కనపరిచారు. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జగతి వంటి ప్రముఖ పత్రి కలలో సంగీతరావు రచనలు వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం సంగీతరావును కలై మామణి బిరుదుతో సత్కరించింది. చదవండి: వరదగూడు.. కనువిందు చేసెను చూడు! -
కరోనా కాటు: ఇటుకల బట్టీలో ఫుట్‌బాల్ కెప్టెన్
వెబ్‌డెస్క్: పైన ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు సంగీతా సోరెన్. ఊరు జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా బాసమూది. వయసు ఇరవై ఏళ్లు. లాక్డౌన్ ప్రభావంతో ఇలా ఇటుకల బట్టీలో పనిచేస్తుంది. లేకుంటే ఆపాటికి ఫుట్‌బాల్ స్టార్‌గా వెలిగిపోయేదేమో! అవును.. సంగీత మంచి ఫుట్ బాల్ ప్లేయర్. 2018–19లో భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్17,అండర్18 పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించింది. మంచి పర్ఫార్మెన్స్తో సీనియర్ టీమ్‌కు సెలక్ట్ అయ్యింది. టీంలో చేరుతుందనుకున్న టైంకి కరోనా మహమ్మారి వచ్చిపడింది. కుటుంబం ఆర్థిక స్థితి బాగోలేదు. పైగా ఆమె తండ్రి దూబా సోరెన్ కు కళ్లు లేవు. కూలి పనిచేసి జీవితాన్ని నెట్టుకొచ్చే అన్నకు.. లాక్డౌన్ ప్రభావంతో పని దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తోంది సంగీత. ప్రాక్టీస్ ఆపలేదు తల్లితో కలిసి బట్టీలో ఇటుకలు మోసే పనిచేస్తోంది సంగీత. ఫుట్‌బాల్ కెప్టెన్‌గా రాణించిన సంగీతకు ప్రోత్సాహం అందిస్తామని, ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గతంలో ప్రకటించాడు. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా తమను సంప్రదించలేదని ఆమె తండ్రి దూబా వాపోయాడు. జార్ఖండ్‌లో మంచి ప్లేయర్స్ ఉన్నారని, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని సంగీత అంటోంది. అయినప్పటికీ తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఫుట్ బాల్‌ను వదిలేది లేదని చెబుతోంది. పనికి పోయే ముందు రోజూ ఉదయం పొలాల్లో సంగీత తన ఆటకు మెరుగులు దిద్దుకుంటోంది. -
ఉద్యమ ధీరుడి చరిత్ర
శ్రీకాంత్ , సంగీత, జిషాన్ ఉస్మాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. వడత్యా హరీష్ దర్శకత్వంలో మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. హరీష్ మాట్లాడుతూ– ‘‘1969 నుండి 2014 వరకు తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చిన ఉద్యమ ధీరుడి చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌తో అన్ని వర్గాలవారికీ నచ్చేలా చిత్రీకరించాం. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన మహ్మద్ జాకీర్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘మాక్స్ ల్యాబ్’ సీఈవో మహ్మద్ ఇంతెహాజ్ అహ్మద్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సాధించాక ఏర్పడిన పరిణామాలను మా చిత్రం ద్వారా తెలియజేశాం. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్. -
అభిమానితో పెళ్లయ్యి 20 ఏళ్లు
ఆగస్ట్ 25న తమిళ సూపర్‌స్టార్ విజయ్ తన 21వ పెళ్లిరోజు జరుపుకున్నారు. అభిమానులను పెళ్లి చేసుకున్న కళాకారులు చాలామంది ఉన్నారు. విజయ్ కూడా తన కరడు గట్టిన అభిమాని సంగీతను పెళ్లి చేసుకోవడం విధి రాసిపెట్టి ఉండటం వల్లే సాధ్యమైందని భావిస్తారు. విజయ్, సంగీతాల పెళ్లి 1999లో జరిగింది. వారిద్దరికి పెళ్లి జరుగుతుందని వారికే తెలియదు. సంగీతా లండన్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి. అయితే విజయ్ సినిమాలు చూసి అతడికి వెర్రి ఫ్యాన్‌గా మారింది. విజయ్‌ని చూడటానికే 1996లో లండన్ నుంచి చెన్నైకి వచ్చింది. ఎవరో తెలిసినవారి ద్వారా విజయ్‌ని కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్ నుంచి వచ్చారా’ అని విజయ్ ఆశ్చర్యపోయారు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతాను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన సంగీతాను విజయ్ తల్లిదండ్రులు (తండ్రి ప్రసిద్ధ సినీ దర్శకుడు చంద్రశేఖర్) గమనించి ఇష్టపడ్డారు. ‘ఈసారి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులతో రామ్మా’ అన్నారు. సంగీతా రెండు మూడేళ్లలో తల్లిదండ్రులతో విజయ్ ఇంటికి వచ్చింది. విజయ్ తల్లిదండ్రులే ‘అమ్మాయి లక్షణంగా ఉంది. పెళ్లి చేసుకోరా’ అని విజయ్‌కు చెప్పారు. విజయ్‌కు కూడా మెల్లగా సంగీతా అంటే అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. సంగీతాకు ఎలాగూ తెగ ఇష్టమే. చివరకు మూడేళ్ల తర్వాత పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు జేసన్ సంజయ్. కుమార్తె దివ్య శాషా. సంగీతా ఎక్కువగా సినిమా వర్గాల మధ్య కనిపించరు. కుటుంబ బాధ్యత, పిల్లల పెంపకం గురించి శ్రద్ధ పెడతారు. గృహశాంతి ఉంటే మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉంటే విజయమూ ఉంటుంది. విజయ్ విజయాల వెనుక సంగీతా ఉన్నారు. -
ఆ గ్లామర్ ఎంతో స్పెషల్
సాక్షి,సిటీబ్యూరో:ర్యాంప్‌పై మెరుపులు మెరిపిస్తుంది. మంచి మనసుతోనూ మురిపిస్తుంది. మంచిని పంచేందుకు ముందుంటుంది. సిటీ మోడల్ చందనా ప్రేమ్... సేవాలంటీర్‌గా సామాజిక కార్యక్రమాల్లో తన ఆలోచనల్ని పంచుకుంటోంది. కిడ్స్– మామ్స్ ఫ్యాషన్ రన్ వే 29న ఆ చిన్నారుల కోసం ఏమైనా పెద్ద సాయం చేయాలనే ఆలోచనతో నాకు పరిచయం ఉన్న ర్యాంప్‌ను వేదిక చేసుకున్నాను. అలా కిడ్స్ అండ్ మామ్ ఫ్యాషన్ రన్ వే కార్యక్రమం రూపుదిద్దుకుంది. దీనిలో భాగంగా స్పెషల్ చిన్నారుల డ్యాన్స్, లైవ్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్, తల్లులూ, పిల్లల ర్యాంప్ వాక్, స్పెషల్ చిల్డ్రన్ ర్యాంప్‌వాక్...వంటివి ఉంటాయి. ఈ నెల 29న కొండాపూర్‌లోని హార్ట్ కప్ కఫేలో దీన్ని నిర్వహిస్తున్నాం. ఇదో స్పెషల్ ప్రోగ్రామ్... ఐటి ఉద్యోగినిగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కాని చందనా ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ చాలా ప్రత్యేకమైనది. స్పెషల్ చిల్డ్రన్ గురించి ఎంత చేసినా తక్కువే. ఈ ఈవెంట్ సక్సెస్ అవడం అంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ గెలిచినట్టే. – సంగీత మోడలింగ్ ప్రొఫెషనల్‌లో బిజీగా ఉంటూనే లైఫ్‌స్కిల్స్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాను..కొంతకాలంగా సోషల్ యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యాను. అందులో భాగంగా శ్రీవిద్య సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ హోమ్‌కి వెళ్లాను. ఆ సెంటర్ తొలుత 8 మందితో మొదలై ఇప్పుడు 160 మంది íస్పెషల్ చిల్డ్రన్కు ఆశ్రయం ఇస్తోంది. అమాయకమైన పిల్లలను చూస్తుంటే బాధ, వాళ్ల గురించి ఏమైనా చేయాలనిపించింది. వీలున్నప్పుడల్లా స్నేహితురాలు సంగీతతో అక్కడికి వెళ్లొచ్చేదాన్ని. అక్కడి చిన్నారుల్లో ప్రతిభ ఉంది. దానికి వెలుగునిచ్చి, అదే చేత్తో వారికి కావాల్సిన అత్యాధునిక వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని అనుకున్నా. -
జైట్లీ భార్యకు సోనియా భావోద్వేగ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చివరి వరకు ధైర్యం కోల్పోకుండా మృత్యువుతో పోరాడి అరుణ్ జైట్లీ పోరాట పటిమను ప్రదర్శించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె జైట్లీ భార్య సంగీతా జైట్లీకి సంతాప లేఖ రాశారు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను అని పేర్కొన్నారు. ‘జైట్లీ మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన స్వభావంతో పార్టీలకతీతంగా మిత్రులు, అభిమానుల్ని సంపాదించుకున్నారు. కేంద్ర మంత్రి, సుప్రీం కోర్టు న్యాయవాది, ప్రతిపక్ష నేత ఇలా ఏ పదవిలో ఉన్నా.. ఆయన గొప్ప వాగ్ధాటి, విజ్ఞతను ప్రదర్శించారు. ఇంకా దేశానికి ఎంతో చేయాల్సి ఉన్న తరుణంలో, చిన్న వయసులో మరణించడం జీర్ణించుకోలేని విషయం. ఈ సమయంలో మాటలు ఓదార్పును చేకూర్చలేవని తెలుసు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను. దేశం గొప్ప ప్రజానాయకుణ్ని కోల్పోయింది. పార్టీలకతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేతని కోల్పోయాం. అరుణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని సోనియా గాంధీ తన సంతాప సందేశాన్ని సంగీతాకు పంపారు. తీవ్ర అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు
ఒక కుటుంబం ఎదగాలంటే.. ఆ కుటుంబంలోని మహిళకు చేయూతనివ్వాలి. పిల్లల ముఖాల్లో సంతోషం చూడాలంటే... తల్లి చేతిలో నాలుగు డబ్బులు ఉండాలి. అందుకే.. ఇంటికే పరిమితమైన మహిళల్లో దాగిన నైపుణ్యానికి ఒక వేదిక కల్పిస్తున్నారు సంగీత, మీనా. ఒకే ఆలోచన, ఒకే అభిరుచి ఉన్న వీళ్లిద్దరూ కలిసి ఊరూవాడకు తోడుగా ఉంటున్నారు..బతుకు జాడ చూపిస్తున్నారు. ‘‘గురువారం ఉదయం పండ్లు కొందామని మొజాంజాహీ మార్కెట్కెళ్లాను. పండ్లు కొనుక్కుని డబ్బులిస్తుంటే ఆ షాపు కుర్రాడు డబ్బు తీసుకోకుండా ‘మేడమ్ బాగున్నారా’ అని పలకరించాడు. నేను ఇతడి షాపుకి రెగ్యులర్‌గా కస్టమర్‌ని కాదు, ఇంతకు ముందెప్పుడూ ఇతడిని చూసినట్లు కూడా లేదు’ అనుకుంటూనే ‘నీకు నేనెలా తెలుసు’ అని అడిగాను. మీరు మా కాలనీలో పిల్లలకు ఆటల పోటీలు పెట్టి, గెలిచిన వాళ్లకు బహుమతిగా బియ్యం, చక్కెర ఇచ్చేవాళ్లు. చాలా ఏళ్ల కిందట పార్దీవాడాలో మీ చేతుల మీద ఐదు కేజీల బియ్యం తీసుకున్నాను’ అని పదేళ్ల నాటి సంగతి గుర్తు చేశాడు. తన పేరు మాధేశ్ అని పరిచయం చేసుకున్నాడు. ‘నా సంతోషం కోసం ఇస్తున్నాను పండ్లు పట్టుకెళ్లండి, డబ్బులు వద్దు’ అన్నాడు. నేను కాదు కూడదంటే... అప్పుడు ధర తగ్గించి తాను కొన్న ధర మాత్రం తీసుకున్నాడు. ‘నా ఫోన్ నంబరు తీసుకోండి మేడమ్. ఏమైనా కావాలంటే చెప్పండి’ అని నంబర్ షేర్ చేశాడు. చెప్పలేనంత సంతోషం అది. మనం నాటిన మొక్క పెద్దదై పువ్వు పూచినప్పుడు కలిగే ఆనందం అది. ఇరవై ఏళ్లుగా అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో సర్వీస్ చేస్తున్నాం. అప్పటి చిన్న పిల్లవాడు ఇప్పుడు ప్రయోజకుడై మమ్మల్ని గుర్తు పట్టి అభిమానంగా పలకరించాడు. ఇంతకంటే సంతృప్తి ఇంకేం కావాలి?’’ అని ఎంతో ఉద్వేగంగా అన్నారు మీనా కస్లీవాల్. ఆమెతోపాటే సంగీత మహేశ్వర్ ఉన్నారు. ‘‘గౌలిగూడా, పార్థీవాడా, ఎంజీమార్కెట్, జుమ్మేరాత్ బజార్ కాలనీలకు, జగదీశ్ కన్యా పాఠశాల, మార్వాడీ హిందీ విద్యాలయలకు వెళ్లినప్పుడు పిల్లలు మా దగ్గరకొచ్చి ‘మంచిగ చదువుకుంటున్నాం, పరీక్షలు బాగా రాశాం. వచ్చే ఏడాది కూడా మాకు పుస్తకాలు ఇస్తారా’ అని ఆశగా అడుగుతుంటారు. చిన్న పిల్లలు వచ్చి ‘మేము చదువుకుంటాం, పుస్తకాలిస్తారా’ అని అడిగితే కాదనగలమా. మేము చిన్నగా మొదలు పెట్టిన సర్వీస్ విస్తరించడానికి కారణం కూడా పిల్లల అభిమానమే’’ అన్నారు సంగీత. ‘మహిళా జాగృతి’ నిర్వహకులు సంగీత, మీనా. పండుగ రోజు పరమాన్నం సంగీత పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. వారిది హైదరాబాద్‌లో స్థిర పడిన రాజస్థాన్ కుటుంబం. మీనా పుట్టింది ఉత్తరప్రదేశ్‌లో. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. పెళ్లితో హైదరాబాద్‌కి వచ్చారామె. ఇద్దరూ పాతికేళ్లుగా స్నేహితులు. ఇద్దరూ వేర్వేరు సంస్థలతో పని చేసేవారు. ‘‘మా జైన్ కుటుంబాల్లో... మనిషి చనిపోయే లోపు సమాజానికి చేతనైన సహాయం ఏదయినా చేయాలని చెబుతారు. ఆ స్ఫూర్తితోనే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పని చేశాం. సంగీత కూడా అలాగే చేస్తుండేది. అలా ఇద్దరం ఒకరికొకరం పరిచయమయ్యాం. మహిళల కోసం ఏదైనా చేయాలనే మా ఆలోచనలే ఇద్దర్నీ దగ్గర చేశాయి. ‘మహిళా జాగృతి’ పేరుతో సంస్థను స్థాపించాం. ఇంటికే పరిమితమైన మహిళలు బయటకు రావాలంటే వాళ్లకు పరిచయమైన వేదిక ఒకటి ఉండాలి. వాళ్లకు తెలిసిన పని అయితేనే ధైర్యంగా ముందుకు రాగలుగుతారు. అందుకే కుకింగ్ కాంపిటీషన్స్ పెట్టాం. ఇరవై ఏళ్ల కిందట మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన ఇప్పుడున్నంతగా ఉండేది కాదు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో హెల్త్ క్యాంపుల అవసరం చాలా ఉండేది. ఆ కాలనీల్లో హెల్త్క్యాంపులతో పాటు పండుగ సమయాల్లో పిల్లలకు ఆటలపోటీలు పెట్టేవాళ్లం. గెలిచిన వాళ్లతోపాటు పోటీలో పాల్గొన్న అందరికీ బియ్యం, చక్కెర ఇచ్చేవాళ్లం. ఆ కుటుంబాల్లో నిజానికి వాటి అవసరం చాలా ఉండేది కూడా. పిల్లలకు తల్లులు పండగ రోజు మిఠాయిలు పెట్టలేకపోయినా కనీసం తియ్యటి అన్నమైనా పెట్టగలగాలనేది మా కోరిక. అలా పెట్టిన ఆటల పోటీల్లో పాల్గొన్న కుర్రాడే మాధేశ్’’ అన్నారు మీనా. జీవన నైపుణ్యాలపై బాలికలకు, మహిళలకు వర్క్‌షాప్ బంధువులే ముందుకొచ్చారు ‘‘ఉద్యోగినులు వాళ్ల బిజీలో వాళ్లుంటారు. చదువుకుని కూడా గృహిణిగా ఇంటికే పరిమితమైన వాళ్లలో ఏదో తెలియని వెలితి కనిపిస్తుండేది. వాళ్లంతా మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాళ్లు. మళ్లీ ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు పెడతారా అన్నట్లు ఎదురు చూసేవాళ్లు. సోషల్ గ్యాదరింగ్స్ కూడా వాళ్లకు అందనివి అన్నట్లు ఉండేవి. చాలామంది నిరుత్సాహంగా రోజులు గడుపుతున్నట్లు కూడా అనిపించేది. వాళ్లలో స్కిల్ ఉంటుంది, దానిని ప్రదర్శించడానికి వేదిక లేకపోవడంతో టాలెంట్ మరుగున పడిపోతోంది. వేదిక ఒకటి ఉంటే వాళ్లలో హిడన్ టాలెంట్ బయటికొస్తుందనుకున్నాం. ఆ అనుకోవడమే... 2000లో ఒక ఎగ్జిబిషన్ రూపం సంతరించుకుంది. మేము మా ఆలోచన బయట పెట్టగానే బంధువుల్లోనే ఎక్కువ మంది మహిళలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. అప్పటి నుంచి ఏటా మూడు రోజులు మహిళల కోసం ఎగ్జిబిషన్ పెడుతున్నాం. ఇది 19వ ఎగ్జిబిషన్ (జూలై 19, 20, 21 తేదీల్లో జరిగింది). ఇంట్లో ఖాళీ టైమ్‌లో వాళ్లకు చేత వచ్చిన హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసుకుంటారు. మూడు రోజులు స్టాల్లో అమ్ముకుంటారు. టేబుల్ స్పేస్ నుంచి స్టాల్ వరకు వాళ్ల అవసరాన్ని బట్టి అద్దెకు తీసుకుంటారు. అలాగే ఏటా ఫ్రీ స్టాల్స్ కూడా ఉంటాయి. బేగంపేటలో దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్‌లో ఉండే అంధ విద్యార్థులు క్యాండిల్స్, పేపర్ ప్లేట్లు, గ్లాస్‌ల వంటివి తయారు చేస్తారు. ఆ స్టూడెంట్స్‌కి స్టాల్ ఉచితంగా ఇవ్వడంతోపాటు వాళ్లను హోమ్ నుంచి ఎగ్జిబిషన్‌కు తీసుకురావడం, భోజనాల వంటి ఏర్పాట్లు కూడా మేమే చూసుకుంటాం. అలాగే ఇతర దివ్యాంగులతోపాటు లంబాడీ మహిళలకు కూడా స్టాల్ ఉచితంగా ఇస్తున్నాం. ఈ ఏడాది 15 స్టాళ్లను ఉచితంగా ఇచ్చాం’’ అన్నారు సంగీత మహేశ్వర్. ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు సంగీత, మీనా ఇద్దరూ ఒకేరకమైన వస్త్రధారణలో కనిపించారు. ఏడాదంతా కాదు, ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నప్పుడు, కాలనీల్లో ఇతర కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఇలా ఒకేరకమైన చీరలు కట్టుకుంటారు. ఎందుకంటే.. ఎవరికైనా అక్కడ సహాయం అవసరమైతే ఎవర్ని సంప్రదించాలనే అయోమయం లేకుండా చూడగానే అర్థం కావడం కోసమేనంటారు ఈ స్నేహితులు. ‘‘దీపం వెలిగించే వత్తుల నుంచి రత్నాలు, మరకతాల ఆభరణాల వరకు రకరకాల స్టాల్స్‌కు వేదిక ఇది. ఒక మహిళ తన చేత్తో పది రూపాయలు సంపాదించుకోవాలంటే ఎంతో చదువు అక్కర్లేదు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పనులే డబ్బు సంపాదించి పెడతాయి. రుచిగా వండడం వస్తే అదే వాళ్ల పరిశ్రమకు పెట్టుబడి అవుతుంది. ఎగ్జిబిషన్లో ఎప్పుడూ ఫుడ్‌కోర్ట్‌లో చోళాబటూరా, వడాపావ్‌ల వంటి నార్త్ వంటకాలు ఎక్కువగా ఉండేవి. ఈ దఫా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉన్నాయి.. దోశె కోసమే ఒక స్టాల్ పెట్టాం. సంపాదించే వాళ్లకు మాత్రమే గౌరవాలందుతున్న సమాజంలో న్యూనతకు లోనవుతున్న గృహిణులకు భరోసా కల్పించడమే ‘మహిళా జాగృతి’ ఉద్దేశం. మహిళ సమాజంలో సగౌరవంగా జీవించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అందుకు తోడ్పాడునందించడంలో సంతృప్తి ఉంది. ఇన్నేళ్ల అనుభవంలో మహిళలకు మేము చెప్పేది ఒక్కటే... రోజుల్ని నిరుపయోగంగా గడిపేస్తే, జీవించడమే దుర్భరంగా ఉంటుంది. ప్రతి రోజునీ ఉపయుక్తంగా మలుచుకుంటే జీవితం మన విజయం వెంట పరుగులు తీస్తుంది. రోజును ఫలప్రదం చేసుకోండి’’ అంటున్నారు సంగీత, మీనా. మనకోసం చేసిన పనిలో ఫలితం మన చేతుల్లోకే వస్తుంది. ఇతరుకు చేసిన పనికి ఫలితం అభిమానం రూపంలో ఆత్మ సంతృప్తినిస్తుంది’’ అన్నారిద్దరూ సంతోషంగా. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: జి. అమర్ -
‘అమ్మా... నీకు కృతజ్ఞతలు’
కన్నతల్లిని నిష్టూరం ఆడిననటి సంగీత. తల్లీకూతుళ్ల మధ్య ఆస్తిపాస్తుల అగ్గి నటీనటుల జీవితాలు వెండితెర మీద వెలుగుతూ ఉంటాయి. కాని చాలామంది తారలు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు ‘మా జీవితాలు పూలపాన్పులు కావు... ముళ్లబాటలు’ అని. కీర్తి ఉన్నచోట, సంపద ఉన్న చోట కుటుంబ సంబంధాలు మలుపులు తిరుగుతుంటాయి. పరీక్షకు నిలబెడుతుంటాయి. సొంత మనుషులు, స్నేహితులు, దూరపు చుట్టాలు అందరూ ఏదో ఒక మేరకు ‘గేమ్’ ఆడే పరిస్థితులు ఉంటాయి. వాటిలోకి దిగని మనుషులను పొందిన వారు ధన్యులు. లేని వారు దురదృష్టవంతులు. నటి కాంచన ఉదంతం మనకు తెలుసు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ కన్న తల్లి కన్నతండ్రి నిర్దాక్షిణ్యత వల్ల ఆస్తులన్నింటినీ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. సొంత వాళ్లే ద్రోహం తలపెట్టారని తెలిసి తట్టుకోలేక ఏళ్ల తరబడి అజ్ఞాతంలోకి వెళ్లి జీవించింది. చివరకు ఆమెకు కొద్దిపాటి ఆస్తి దక్కింది కానీ ఈలోపు ఆమె పడిన క్షోభ మామూలు కాదు. సీనియర్ నటి మంజులకు, ఆమె కుమార్తె వనితకు జరిగిన ఘర్షణ కూడా లోక విదితం. కుమార్తె ప్రేమ వివాహాన్ని అంగీకరించని మంజుల ఆమెకు పుట్టిన కుమారుణ్ణి తన పెంపకంలో ఉంచుకుంది. ఆ తర్వాత గొడవ కోర్టులకెక్కింది. నటి సౌందర్య ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఇప్పుడు కోర్టు కేసులు నడుస్తున్నాయి. 2004 నాటి విమాన ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ చనిపోయారు. అయితే 2003లోనే ఆమె ఒక విల్లు రాసిందని ఆమె ఆస్తిపాస్తులు కుటుంబ సభ్యులకు సమానంగా చెందాలని అందులో ఉందని సౌందర్య తల్లి కె.ఎస్.మంజుల, సౌందర్య భర్త రఘు ఒక విల్లును ప్రవేశ పెట్టారు. కాని ఆ ప్రకారం చూసినా తమ వాటా తమకు దక్కకుండా చూస్తున్నారని సౌందర్య వదిన నిర్మల తన కుమారుడి చేత కోర్టులో కేసు వేయించింది. తాజాగా ఇప్పుడు నటి సంగీత ఇంటి గొడవ వార్తలకెక్కింది. ‘శివపుత్రుడు’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖడ్గం’ వంటి సినిమాలతో తెలుగులో ప్రాచుర్యం పొందిన సంగీత చెన్నైలో భర్త క్రిష్, కుమార్తె షివియాతో తన సొంత ఇంటిలో నివాసం ఉంటోంది. అయితే పై అంతస్తులో ఆమె, కింది అంతస్తులో ఆమె తల్లి భానుమతి ఉంటారు. కాని ఇటీవల సంగీత తల్లి భానుమతి సంగీత మీద బహిరంగ ఆరోపణలు చేసింది. ‘నా కుమార్తె నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. ఆ ఇల్లు మా మామగారి కాలం నుంచి మాకు వచ్చింది. అందులో సంగీతకు భాగం లేదు’ అనేది ఆమె ఆరోపణ. దీని మీద సంగీతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినపడ్డాయి. మూడు రోజుల క్రితం సంగీత ట్విట్టర్ ద్వారా తల్లిని భావోద్వేగంతో నిష్టూరం ఆడారు. ఆ ట్వీట్ ఇలా ఉంది: ‘అమ్మా... నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. చదువుకుంటూ ఉండగా 13 ఏళ్ల వయసులో స్కూలు మాన్పించినందుకు కృతజ్ఞతలు. నా చేత ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు. మద్యానికీ డ్రగ్స్‌కూ బానిసయ్యి ఏనాడూ పని చేయని నీ ఇద్దరు కొడుకుల సౌఖ్యం కోసం నన్ను దగా చేసినందుకు కృతజ్ఞతలు. నీ ఆదేశాలు లెక్కచేయలేదని మన సొంత ఇంటిలో నన్ను ఒంటరిని చేసినందుకు కృతజ్ఞతలు. నాకై నేను పోరాడి దారి ఏర్పరుచుకుంటే తప్ప నేను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడినందుకు కృతజ్ఞతలు. పెళ్లయ్యాక నిత్యం నాకూ నా భర్తకూ అంతరాయం కలిగిస్తూ మా మానసిక శాంతిని దెబ్బ తీసినందుకు కృతజ్ఞతలు. ఒక తల్లి ఎలా ఉండకూడదో నాకు నేర్పినందుకు కృతజ్ఞతలు. ఆఖరుగా ఇటీవలి నిందలకు, ఆరోపణలకు కృతజ్ఞతలు. తెలుసో తెలియకో నువ్వు చేసిన మంచిపని ఏమిటంటే నన్ను ఒక దద్దమ్మ స్థాయి నుంచి ఒక పోరాడే మహిళగా, శక్తిమంతమైన ఇల్లాలిగా నిలబడేలా చేశావు అందుకు తప్పకుండా నేను నీకు కృతజ్ఞురాలినై ఉంటాను. నీ అహం నుంచి బయటపడిన నాడు తప్పక నన్ను చూసి గర్వపడతావు’... సంగీత భర్త, గాయకుడు అయిన క్రిష్ కూడా సంగీతకు బాసటగా నిలిచాడు. ‘నీ నిర్ణయాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని అతడు ట్వీట్ చేశాడు.సంగీత ట్వీట్లో ఎంతో నొప్పి ఉందని చదివిన వాళ్లకు అనిపిస్తుంది.వెలిగే తారల జీవితాల్లోని ఇటువంటి పార్శా్వలను మన జీవితాల ఘటనలతో పోల్చి చూసుకోవాలనే ఆలోచన వస్తుంది. మానవ సంబంధాలు బూటకమో శాశ్వతమో అనే చింతను రాజేస్తుంది. -
విషం తాగిన ప్రేమజంట
అన్నానగర్: నత్తమ్ సమీపంలో ఆదివారం తమ ప్రేమకు పెద్దలు అంగీకరించలేదనే మనస్థాపంతో ప్రేమికులు విషం సేవించారు. ఇందులో యువతి మృతిచెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. దిండుక్కల్ జిల్లా, నత్తమ్ సమీపంలోని గోపాల్‌పట్టికి చెందిన చిన్నయ కుమార్తె సంగీత (22) ప్లస్‌టూ పూర్తిచేసి, సమీపంలోని ప్రైవేట్ మిల్లులో పనిచేస్తోంది. తిరుచ్చి జిల్లా మణప్పారై కలింగపట్టి సమీపంలోని రాజాలి కౌండమ్‌పట్టికి చెందిన నల్లతంబి కుమారుడు కనకరాజ్ (26). ఇతని తల్లిదండ్రులు మృతిచెందడంతో కరూర్ జిల్లా, సిద్ధపట్టిలోని బంధువుల ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ స్థితిలో గోపాల్‌పట్టి సమీపంలో జరిగిన ఓ వివాహానికి కనకరాజ్ వెళ్లాడు. అక్కడ సంగీతతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. రెండేళ్లుగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరుకావడంతో వారి ప్రేమను బంధువులు అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమికులు ఆదివారం సిద్ధపట్టిలోని ఓ తోటలో విషం తాగి స్పృహతప్పి పడి ఉన్నారు. సమాచారంతో కనకరాజ్ బంధువులు అక్కడికి వచ్చి ఇద్దరినీ మణప్పారైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సంగీత మృతిచెందింది. కనకరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. సంగీత తండ్రి చిన్నయ ఫిర్యాదు మేరకు తోగైమలై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు -
అమ్మా నీకో దండం!
పెరంబూరు: నా విషయంలో ఒక తల్లి ఏమేం చేయకూడదో అవన్నీ చేశావు. అమ్మా నీకో దండం అని నటి సంగీత ఆవేదనను వ్యక్తం చేశారు. దక్షిణాది భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించిన సంగీతపై ఆమె తల్లి భానుమతి ఇటీవల తమిళనాడు మహిళా పోలీస్ కమిషన్‌లో ఫిర్యాదు చేసి కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. తన కూతురు తన ఇంటిని అపహరించడానికి ప్రయత్నిస్తోందని, అవసాన దశలో ఉన్న తనను ఇంటి నుంచి బయటకు పొమ్మంటోంది లాంటి ఆరోపణలను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నటి సంగీతకు నోటీసులు జారీ చేయడం, ఆమె తన భర్త క్రిష్‌తో కలిసి పోలీస్ కమిషనర్ ముందు హాజరవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నటి సంగీత తన తల్లిపై ఆరోపణలు గుప్పిస్తూ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అందులో ప్రియమైన అమ్మకు నన్ను ఈ లోకానికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. నా పాఠశాల చదువును నిలిపేసి 13 ఏళ్లకే పనికి పంపావే అందుకు కృతజ్ఞతలు. ఖాళీ చెక్కులపై నీవు చెప్పినట్టల్లా సంతకాలు చేయించుకున్నావే అందుకు కృతజ్ఞతలు. పనికే వెళ్లకుండా, శ్రమ అన్నది తెలియని నీ కొడుకులకు మద్యం కోసం, డబ్బు కోసం నన్ను తప్పుడు పనులకు వాడుకున్నావే అందుకు కృతజ్ఞతలు. అందుకు నేను వ్యతిరేకించినప్పుడు సొంత ఇంటిలోనే నిర్భంధించావే అందుకూ కృతజ్ఞతలు. నేను గొడవ చేసి బయటకు వచ్చే వరకూ నాకు పెళ్లి చేయలేదే అందుకూ కృతజ్ఞతలు. నా భర్తపై ఒత్తిడి చేశావు, నా కుటుంబానికి సంతోషాన్ని దూరం చేసినందుకూ చాలా చాలా కృతజ్ఞతలు. ఒక తల్లి ఎలా ఉండకూడదో అలాంటి చేసి నాకు ఉదాహరణగా ఉన్నావు అందుకూ కృతజ్ఞతలు. చివరిగా నాపై అసత్యపు ఫిర్యాదు చేశావు అందుకూ కృతజ్ఞతలు. ఎందుకంటే నువ్వు ఒక మైనముద్రలో ఉన్న నన్ను పోరాడే ధైర్యవంతురాలిగా మారడానికి, ఆరితేరడానికి కారణం అయ్యావు. ఈ ఒక్క కారణంగానే నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనూ ఉంటాను. మోహం నుంచి నువ్వు ఒక రోజు బయటపడి నన్ను చూసి గర్వపడతావు అని నటి సంగీత పేర్కొంది. -
నటి సంగీతపై తల్లి ఫిర్యాదు
పెరంబూరు: తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నట్టు నటి సంగీతపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి సంగీత తల్లి పేరు భానుమతి. ఈమె స్థానిక వలసరవాక్కంలో నివశిస్తున్నారు. ఆ ఇల్లు తన మామగారి నుంచి ఆమె కు వచ్చింది. ఇంట్లో కింద భాగంలో భానుమతి నివశిస్తుండగా పైభాగంలో నటి సంగీత, క్రిష్ దంపతులు నివశిస్తున్నారు. ఇల్లు ప్రస్తుతం నటి సంగీత పేరుతో ఉంది. ఆ ఇంటిని వదిలి వెళ్లిపోవలసిందిగా సంగీత తల్లిపై ఒత్తిడి చేస్తోంది. దీనిపై భానుమతి ఇటీవల తమిళనాడు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సంగీత ఇంటిని తన అన్నా, తమ్ముడు అపహరిస్తారనే భయంతో తనను ఇల్లు వదిలి వెళ్లిపోమని ఒత్తిడి చేస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సంగీత తమ్ముడు ఆ మధ్య మరణించారు. భానుమతి అవసాన దశలో ఉన్నారు. ఇలాం టి పరిస్థితుల్లో తాను ఇల్లు విడిచి ఎక్కడికి పోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సంగీతకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో ముడు రోజుల క్రితం సంగీత భర్త క్రిష్‌తో కలిసి కమిషన్ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఈ వ్యవహారంపై ప్రశ్నించిన మీడియాతో సినిమాల గురించి అడగండి చెబుతాను, ఇది వ్యక్తిగత వ్యవహారం. దీని గురించి తానేం మాట్లాడను అని సంగీత బదులిచ్చారు. -
సేంద్రియ సంగీత సేద్యం
రెండే రెండు ఎకరాల వ్యవసాయ భూమి. ఆ చారెడు నేలలోనే రెండు వందల రకాల స్థానిక కూరగాయలు పండించారు.ఒక్కో చెట్టు నుంచి 24 కేజీల దిగుబడి వచ్చేలా ఏపుగా పెంచారు.పద్దెనిమిది సంవత్సరాలుగా విత్తనాలను స్వయంగా సమకూర్చుకుంటున్నారు.సేంద్రియ వ్యవసాయం మీదే దృష్టి కేంద్రీకరించారు కర్ణాటక రాష్ట్రానికిచెందిన సంగీత అనే మహిళ.వ్యవసాయ రంగంలో ఆమె సాధించిన విజయం గురించి... సంగీత తండ్రి పరమానంద శర్మ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మిలిటరీ డైరీ ఫారమ్‌లో పనిచేసేవారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తను దాచుకున్న డబ్బులు, కుటుంబ సహకారంతో బెంగళూరు నగర శివార్లలో కొద్దిపాటి భూమి కొన్నారు. రాళ్లు, తుప్పలు, పాములతో నిండి బీడులా ఉన్న ఆ భూమిని తన స్వయంకృషితో సుక్షేత్రమైన మాగాణంలా మార్చుకున్నారు. వ్యవసాయంలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కుమార్తె సంగీత. అదే భూమిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో అగ్రో – ఇకాలజీ నాలెడ్జ్ ఫార్మ్ ప్రారంభించింది. స్థానికంగా పండే వంకాయల నుంచి సుమారు రెండు వందల రకాలు పండించారు సంగీత. పచ్చి మిర్చి, పొద్దు తిరుగుడు, దానిమ్మ, వెలక్కాయలు, గోధుమ, చిరుధాన్యాలు పండించడమే కాకుండా, పద్దెనిమిది సంవత్సరాలుగా స్వయంగా విత్తనాలు సేకరిస్తున్నారు.సంగీత నాయకత్వంలో చాలామంది రైతులు ఇందులో పనిచేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా పండే వంకాయలను ఒకే చెట్టు నుంచి 24 కేజీల దిగుబడి వచ్చేలా కృషి చేశారు. తండ్రి ప్రారంభించిన ‘అన్నదానం’ సంస్థ నుంచి ఇప్పటికి మిలియన్ ప్యాకెట్ల కంటే ఎక్కువ వెరైటీ విత్తనాలను ఉచితంగా రైతులకు అందించారు. ‘‘నేను పొలాల మధ్య పుట్టి పెరిగాను, టాంగా మీద స్కూల్‌కి వెళ్లాను. అందువల్ల చిన్నతనం నుంచే ప్రకృతికి చేరువగా పెరిగాను. మా నాన్నగారు పొలం పండిస్తూ, 80 ఆవులతో డైరీ ఫారమ్ నడిపారు. నాకు చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. సీతాకోకచిలుకలు, గొంగళి పురుగు గూళ్లు, చిన్నవిత్తనం నుంచి మహావృక్షం రావడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉండేది’ అంటారు సంగీత. అది 2001. అప్పుడే వారి కుటుంబం రీ లొకేట్ అయింది. ఓ రోజున అవొకాడో చెట్టు కింద తండ్రి, చెల్లెలితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, ‘మనం తినే ఆహారాన్ని రసాయనాలతో ఎందుకు తయారు చేస్తారు, క్యాలీఫ్లవర్ ఎందుకు అంత తెల్లగా ఉంటుంది, ద్రాక్షలమీద తెల్లటి పొర ఎందుకు ఉంటుంది. మన రైతులు రసాయన ఎరువులను ఎందుకు వాడుతున్నారు’ అని అడిగేది. అలా వారి సంభాషణలో ఒకసారి సంగీత చెల్లి అనిత, ఇటువంటి విషయాల గురించి విస్తృతంగా పరిశోధన చేయమని సంగీతను ప్రోత్సహించింది. అలా తన ప్రయాణం వ్యవసాయం వైపుకు మళ్లిందంటారు సంగీత.ఈ తపన ఆమెను దేశమంతా పర్యటించేలా చేసింది. గ్రామగ్రామాన అడుగు పెట్టి, రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. భగవంతుడు ఇచ్చిన ఆశ్చర్యకరమైన, అద్భుతమైన వరం. నేటికీ హైబ్రీడ్ కోసం విత్తన కార్పొరేషన్ మీద ఆధారపడుతున్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి అధికంగా డబ్బులు ఖర్చు చేయవలసి వస్తోంది. అందువల్ల అన్నదానం ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వాల కోసం సీడ్ బ్యాంక్‌ను నడుపుతోంది. 200 రకాల విత్తనాలను రెండు ఎకరాలలో వేసి పండించేలా కృషి చేశారు. కేరళ వరదలు... ‘అన్నదానం’ సంస్థలో ఉన్న ఐదు లక్షలకు పైగా విత్తనాల ప్యాకెట్లను కేరళ వరదలతో పొలాలు నీట మునిగిపోయి, నష్టపోయిన అక్కడి రైతులకు అందచేశారు. ఆ తరవాత కేరళకు చెందిన 14 మంది రైతులు స్వయంగా విత్తనాలను ఉత్పత్తి చేసుకునేలా శిక్షణ పొందారు. కనీస ధర్మం దేశంలో 45 కోట్ల మంది రైతులు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. వారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలని, సేంద్రియ వ్యవసాయం చే యడమే వారికి మనం చెప్పుకునే కృతజ్ఞత. సహజంగా పండించే పంట వల్ల, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వైద్య ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు అంటారు సంగీత. పురుగు మందులు, రసాయనాల బెడద ఉండని వీరి పంటపొలాలు రకరకాల పక్షులను, జంతువులను ఆకర్షిస్తూ జీవవైవిధ్యానికి తోడ్పడుతున్నాయి. – జయంతి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలలో మొత్తం మూడు లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వారికి కావలసిన ఆహారం ఏ విధంగా పండించుకోవాలి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తినాలి? అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. రాతి ఉప్పు దగ్గర నుంచి దేనినీ వీరు కొనుగోలు చేయట్లేదు. అన్నీ స్వయంగా పండించుకుంటున్నారు. వరి, గోధుమ, చిరుధాన్యాలు, వందల రకాల కూరగాయలతో పాటు, పండ్లు, మూలికలకు కావలసిన పదార్థాలను సైతం పండిస్తున్నారు. భూమిని దున్నడంతో పాటు, పేడ సహజ ఎరువులతో కంపోస్టు తయారుచేసి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వీటికి సోలార్ వాటర్ హీటర్లు, బయో గ్యాస్ ప్లాంట్ సహాయంతో సొంతంగా వంట చేసుకుంటున్నారు. బిందు సేద్యం చేస్తూ, నీరు వృథా కాకుండా జాగ్రత్తపడుతున్నారు.ఆగ్రో ఇకాలజీ అనేది వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నదే. మన సంప్రదాయ పద్ధతులను తిరిగి పాటిస్తున్నారు ఈ సంస్థ ద్వారా సంగీత. స్థానిక పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. -
సంగీత ఈజ్ బ్యాక్
సినిమా: నటి సంగీత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. బహుభాషా నటి. కథానాయకిగానే కాకుండా ప్రతినాయకి ఛాయలున్న పాత్రలనైనా సమర్థవంతంగా పోషించి మెప్పించగల సత్తా ఉన్న నటి. అలాంటి నటి గాయకుడు క్రిష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత నటనను తగ్గించుకుంది. ఆ మధ్య అడపాదడపా నటించినా రెండేళ్ల నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే బుల్లితెర కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలా పాల్గొంటూ ఆ వర్గ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. తాజాగా మళ్లీ సంగీత బ్యాక్ అంటూ ఒక బ్యాంగ్ పాత్రలో వెండితెరపై కనిపించబోతోంది. అవును నటుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తిమిళరసన్ చిత్రంలో సంగీత ప్రధాన పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఎన్ఎస్.మూవీస్ పతాకంపై కౌసల్యరాణి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో విజయ్‌ఆంటోని సరసన నటి రమ్యానంబీశన్ నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో సురేశ్‌గోపి, రాధారవి, సోనూసూద్, యోగిబాబు, రోబోశంకర్, కస్తూరి, చాయాసింగ్, మధుమిత, వైజీ.మహేంద్రన్, కదిర్, శ్రీలేఖ, శ్రీజా, కేఆర్.సెల్వరాజ్, సెండ్రాయన్, కుంకీ అశ్విన్, మేజర్ గౌతమ్, స్వామినాథన్, మునీశ్కాంత్, రాజ్‌కృష్ణ, రాజేంద్రన్ నటిస్తున్నారు. వీరితో పాటు దర్శకుడు మోహన్‌రాజా కొడుకు మాస్టర్ ప్రణవ్ కీలక పాత్రలో పరిచయం అవుతున్నాడు. ఇందులో ఒక ప్రధాన పాత్రలో నటి సంగీత నటిస్తోంది. రెండేళ్ల క్రితం నెరుప్పుడా చిత్రంలో ప్రతినాయకిగా నటించిన సంగీత ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఇదే విషయాన్ని ఈ అమ్మడిని అడగ్గా తనకు తగ్గ పాత్రలు అనిపించకపోవడంతో వచ్చిన చాలా అవకా>శాలను తిరస్కరించినట్లు తెలిపింది. ఇప్పుడు నటించడానికి కారణం తమిళరసన్ చిత్రంలో తన పాత్ర చర్చనీయాంశంగా ఉంటుందని చెప్పింది. అందుకే ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. ఈ చిత్రంలో తాను ఒక పెద్ద ఆస్పత్రిని నిర్వహించే డాక్టర్‌గా నటిస్తున్నానని చెప్పింది. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని నటి సంగీత పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా బాణీలు కట్టడం మరో విశేషం. ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తమిళరసన్ చిత్ర షూటింగ్ చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటోంది. -
సేవల విస్తృతిపై అపోలో ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆసుపత్రుల విస్తరణ కంటే సేవల విస్తృతిపైనే ఈ ఏడాది ఎక్కువగా ఫోకస్ చేస్తామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఫిక్కీ సమావేశంలో పాల్గొన్న ఆమె ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఆసుపత్రుల పరంగా దేశంలో మేమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. అవసరమైన చోట హాస్పిటల్, ఫార్మసీల ఏర్పాటు ప్రక్రియ సహజంగా జరుగుతుంది. దానికంటే ముఖ్యంగా ఇప్పుడున్న మొత్తం ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవటంపై దృష్టి సారిస్తాం. హెల్త్ చెకప్స్‌ను ప్రమోట్ చేయడం, జన్యు ఔషధాలు, రోగుల ఇంటెస్టిన్ (ప్రేగు) అధ్యయనం ప్రధానాంశాలుగా చేసుకున్నాం. ఒక అడుగు ముందుకేసి వైద్య సేవల రంగాన్ని నిర్వచిస్తాం. చెన్నైలో అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్‌ను 150 పడకల సామర్థ్యంతో నెలకొల్పాం. దక్షిణాసియాలో ఇది తొలి ప్రోటాన్ థెరపీ సెంటర్. క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక పెన్సిల్ బీమ్ టెక్నాలజీని వాడుతున్నాం. లక్నోలో 250 పడకలతో ఏర్పాటవుతున్న ఆసుపత్రి రెండు నెలల్లో ప్రారంభం కానుంది’ అని సంగీత రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో లాజిస్టిక్స్ పార్కులు తెలంగాణలో మరో రెండు లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. అదానీ గ్రూప్, టెక్స్టైల్ రంగ సంస్థ వెల్స్పన్ గ్రూప్ వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వెల్లడించారు. బుధవారమిక్కడ జరిగిన ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విషయం చెప్పారు. ‘తెలంగాణకు గడిచిన నాలుగున్నరేళ్లలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 60 శాతం కార్యరూపం దాల్చాయి. రానున్న కాలంలో ఇది 90–95 శాతానికి వెళ్తుందన్న నమ్మకం ఉంది. కొన్ని కంపెనీలు రెండు, మూడవ దఫా కూడా విస్తరించాయి. ఈ రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానమే ఇందుకు కారణం. ఏడు కేసుల్లో మినహా 8,500 పైచిలుకు కంపెనీలకు 15 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేశాం’ అని గుర్తు చేశారు. -
బ్యాక్ టు బి.సి
సంగీత.. ఫ్యాషన్ డిజైనర్. ఎంతమంది లేరూ! సంగీత.. మోడల్ కూడా. వెరీ కామన్ థింగ్. అయితే డిజైనింగ్, మోడలింగ్ కాదు ఆమె ప్రత్యేకత. అవి రెండూ టైమ్ ఉన్నప్పుడు చేస్తుంటారు సంగీత. టైమ్ అంతా పెట్టి చేస్తున్నది వేరే ఉంది. అదీ డిజైనింగే, అదీ మోడలింగే! అవును. సంగీత ఓ కొత్త తరం పిల్లల్ని డిజైన్ చేస్తున్నారు. ఆ పిల్లల్ని ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి రోల్ మోడల్స్‌గా అందిస్తున్నారు. అందుకు ఆమె ఎంచుకున్న దారి.. ఆటలు! పబ్జీలు, పొకెమాన్ల ఆన్లైన్ ఆటలు కాదు. పచ్చీస్, బారాగట్టా వంటి బీసీ (బిఫోర్ సెల్‌ఫోన్) ఆటలు! అది ప్రైమరీ స్కూలు. పిల్లలకు అక్షరాలు దిద్దిస్తోంది టీచర్. ఓ తొమ్మిదేళ్ల బాలుడికి అక్షరాలు చక్కగా కుదరడం లేదు. తన ప్రి–స్కూల్ కోర్సులో భాగంగా అన్ని క్లాసులనూ పర్యవేక్షించడానికి అప్పుడే ఆ క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన సంగీతా రాజేశ్ కంట పడిందా పిల్లవాడి చేతిరాత. పలక మీద ఇంగ్లిష్‌లో ‘ఏ’ అక్షరాన్ని రాయమన్నారామె. ఆ పిల్లవాడు రాశాడు. అయితే దానిని అక్షరం అనడానికి ఆమె మనసొప్పుకోలేదు. కుదురుగా కూర్చుని అక్షరాలన్నింటినీ చక్కగా రాసి చూపించమన్నారు సంగీతారాజేశ్. ‘‘అప్పుడా పిల్లవాడు ఇచ్చిన సమాధానంతో నా బుర్ర తిరిగిపోయింది’’ అన్నారామె. ‘‘అక్షరాలను గుర్తు పట్టడం వస్తే చాలు కదా మేడమ్, అందంగా, గుండ్రంగా రాయకపోతే ఏమవుతుంది? ఏది రాయాలన్నా కీ బోర్డు మీదనే టైప్ చేస్తాను కదా’’ అన్నాడా కుర్రాడు! మెదడు పరుగులే.. కాళ్ల పరుగుల్లేవు! వీడియో గేమ్‌ల తరాన్ని దాటేశాం. ఈ తరం చేతిలో స్మార్ట్‌ఫోన్ ఆటవస్తువైపోయింది. ఆటలన్నీ అందులోనే. ఆ ఆటలు ఆడేటప్పుడు వాళ్ల మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంటుంది. పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు. ప్రతి చిన్న విషయానికీ అసహనమే. లిఫ్ట్ పై అంతçస్తు నుంచి కిందికి వచ్చే వరకు కూడా నిరీక్షించలేకపోతున్నారు. కంప్యూటర్ సెకన్లలో రెస్పాండ్ కాకపోతే మౌస్‌ను టపటపా కొడుతున్నారు. క్యూలో తమ వంతు వచ్చే వరకు డిసిప్లిన్‌తో నిలబడటానికీ విసుగే. ఇలాగే పిల్లలు పెరిగి పెద్దయితే సమాజంలో ఇమడలేరు. ఇలాంటి పిల్లలతో తయారయ్యే సమాజంలో మనుషుల మధ్య పరస్పర సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండవు. వీటన్నింటికీ విరుగుడు వాళ్లను కూర్చోబెట్టి ఆటలాడించడమేనంటారు సంగీత. పులీమేక ఆటల్లో జీవితం ఉంటుంది ‘‘అవుట్డోర్ గేమ్స్ శారీరక చురుకుదనాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తాయి. ఇన్డోర్ గేమ్స్ పిల్లల్లో పరిణతిని తెస్తాయి. లైఫ్‌స్కిల్స్ నేర్పిస్తాయి. ఒక టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు దాని మీద నుంచి దృష్టిని పక్కకు పోనివ్వని విధంగా ఏకాగ్రతను అలవరుస్తాయి. వ్యక్తిత్వ వికాసం, నిగ్రహశక్తి, సిచ్యుయేషన్ మేనేజ్మెంట్ వంటివి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం ఉండదు. అవన్నీ మన ఆటల్లో నిబిడీకృతమై ఉన్నాయి. అందుకే పచ్చీస్, వామనగుంటలు, విమానం (యుద్ధంలో మెళకువలు), పరమపదసోపాన పటం (వైకుంఠపాళీ), పులి– మేక, చదరంగం, బారాగట్టా వంటి ఆటలను అలవాటు చేస్తే పిల్లల్లో మెదడు స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడుతుందనిపించింది. ఇప్పుడు పిల్లలు ఎదుర్కొంటున్న అటెన్షన్ డెఫిషియెన్సీకి కూడా అసలైన మందు మన ఇన్డోర్ గేమ్స్‌లో ఉంది’’ అన్నారామె. సంగీత ప్రి స్కూల్ ఎడ్యుకేషన్‌లో కోర్సు చేశారు. ప్రి స్కూల్స్‌కి కరికులమ్ డిజైన్ చేసిన అనుభవం కూడా ఉందామెకి. ఆమె స్వయంగా ‘స్మైల్’ పేరుతో స్పెషల్ చిల్డ్రన్‌కి స్కూల్ నడుపుతున్నారు. పిల్లలు స్కూల్‌కి.. తను ‘ప్రి–స్కూల్’కి తమిళనాడు, మదురై దగ్గర దిండిగల్‌లో పుట్టి పెరిగిన సంగీత డిగ్రీ వరకు అక్కడే చదివారు. పెళ్లి అనంతరం హైదరాబాద్ వచ్చారు. ‘‘పెళ్లయిన తర్వాత పీజీ చేశాను. తొమ్మిదేళ్లపాటు ఇద్దరు పిల్లలతో గృహిణిగా ఉన్నాను. నా పిల్లలను స్కూలుకి పంపించాల్సి వచ్చినప్పుడు ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ మీద నా దృష్టి పడింది. నా కెరీర్‌ని స్కూల్లో డెవలప్ చేసుకుంటే పిల్లలతోపాటు వెళ్లి రావచ్చు అనుకున్నాను. ప్రి స్కూల్ కోర్సు చేశాను, కొన్ని కార్పొరేట్ స్కూళ్లతో కలిసి పని చేశాను. ఆ అనుభవంతో సొంతంగా స్కూలు పెట్టాను. స్పెషల్ కిడ్స్‌కి అవసరమైనట్లు డిజైన్ చేశానా స్కూల్‌ని. నార్మల్ కిడ్స్ కోసం ఒక సెక్షన్ ఉండేది. అప్పట్లో దుబాయ్ నుంచి ఒక తల్లి తన పిల్లవాడి కోసం అక్కడ మంచి స్కూల్ లేదని మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడా అబ్బాయి మా దగ్గరే ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయితో మొదలైన స్కూల్ ఇప్పుడు 45 మంది పిల్లలతో నడుస్తోంది. స్కూల్‌ని విస్తరించాలనే ఉద్దేశంతో ఐఎస్బీ కోర్సు చేశాను. కోర్సు చేసిన తర్వాత స్పెషల్ కిడ్స్ కోసం డిజైన్ చేసిన స్కూల్‌ని వ్యాపారపరంగా ఫ్రాంచైజీలు ఇవ్వడానికి నాకు మనసు రాలేదు. ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్లు నేను నడిపినట్లు నడపకపోతే ఆ పిల్లల భవిష్యత్తు మరింత గందరగోళమవుతుంది. అందుకే స్కూలును నా ఆత్మసంతృప్తి కోసమే నడపాలి, వ్యాపారం చేయకూడదనే నిర్ణయానికి వచ్చేశాను’’ అన్నారు. ఆడించడానికి బొమ్మలు చేయించారు ‘‘ఒక సమస్య నా దృష్టిలో పడితే దానికి పరిష్కారం కోసం ఆలోచించడం నాకలవాటు. అది నాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అనేది తర్వాతి మాట. ముందా పని చేసేస్తాను. అలా మొదలైందే ఈ ఆటబొమ్మల పునః పరిచయం. మన సంప్రదాయ ఆటవస్తువులను పిల్లలకు పరిచయం చేయాలంటే ఆటవస్తువులను తయారు చేయించాలి. వాటికోసం హైదరాబాద్‌లో వడ్రంగులు సరిగ్గా దొరకలేదు. దాంతో తమిళనాడు, కర్ణాటకలోని పల్లెలకు వెళ్లి అక్కడి వడ్రంగుల చేత ఆటవస్తువులను తయారు చేయిస్తున్నాను. పిల్లలకు ఆడటం నేర్పించడానికి స్కూళ్లలో చిన్న చిన్న పోటీలు పెడుతున్నాం. నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే.. ఈ ఆటలు కొన ఊపిరితో ఉన్నాయి. కొన్ని ఇళ్లలో పిల్లలకు అలవాటు చేస్తున్నారు. అయితే అది నూటికి పది మందిలోపే. తొంభై శాతం పిల్లలకు మేము పెడుతున్న వర్క్షాపులతోనే పరిచయమవుతున్నాయి ఈ ఆటలు. మా ఆటవస్తువుల అమ్మకం కోసమే అయితే ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టవచ్చు. నా ఉద్దేశం పిల్లలకు ఆడటం నేర్పించడం. అందుకే స్కూళ్లకు వెళ్లి పిల్లలకు ఆట నేర్పించే పని కూడా మేమే చేస్తున్నాం. పరీక్షలకూ ఆటల ప్రిపరేషన్! ఆటలు నిజాయితీగా ఆడితే తోటి పిల్లలందరూ స్నేహితులవుతారు, మోసపూరితంగా ఆడే వాళ్లను దూరం పెడతారు. మోసం చేసే వాళ్లు తమను తాము తెలివైన వాళ్లమనే భ్రమలో ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం నిలవదనే వాస్తవాన్ని ఆటల్లోనే తెలుసుకుంటారు. ఒక పిల్లాడు తాను గెలవడం కోసం ఒక అబద్ధం చెబితే, అది అబద్ధం అని తెలిసినప్పుడు మిగిలిన పిల్లలందరూ ఆ పిల్లవాడిని దొంగను చూసినట్లు చూస్తారు. అది ఆ ఒక్కడికే కాకుండా అప్పుడు ఆటలో ఉన్న వాళ్లందరూ తెలుసుకుంటారు. అలాగే ఈ ఆటలు చదివిస్తాయి కూడా. కొన్ని ఆటలు పూర్తవడానికి రెండు–మూడు గంటల టైమ్ పడుతుంది. అంతసేపూ ఏకాగ్రతతో కూర్చోవడం అలవాటవుతుంది పిల్లలకు. పెద్ద తరగతులకు వెళ్లిన తర్వాత పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే ఒక టాపిక్ మీద అంత టైమ్ ఉండగలగడం వస్తుంది ఈ ఆటలతో. ‘మా వాడికి తెలివి ఉందండీ. చాలా చురుగ్గా ఉంటాడు. కానీ కుదురుగా కూర్చోవడమే కష్టం. ఒక గంట కూర్చోపెట్టలేకపోతున్నాం’ అని బాధపడే తల్లిదండ్రులందరికీ ఈ ఆటలు చక్కటి పరిష్కారం’’ అన్నారు సంగీత. – వాకా మంజులారెడ్డి ఫొటో : శివ మల్లాల మా అమ్మ కోప్పడుతుంటుంది ‘‘స్కూలు, ఆటవస్తువుల పునః పరిచయం వంటివన్నీ నా ఆత్మసంతృప్తి కోసం చేస్తున్నాను. నేను ఉపాధి పొందడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మళ్లింది నా ఆలోచన. అందులో దిగిన తర్వాత అదొక బిజినెస్ సైన్స్, చాలా సెన్సిబుల్‌గా మార్కెట్ చేయాలని తెలిసింది. డిజైనింగ్‌లో క్రియేటివిటీతోపాటు చాలా శాస్త్రబద్ధంగా చేయగలుగుతున్నాను. కానీ మార్కెట్ దగ్గర విఫలమయ్యాను. నా ఇంట్రెస్ట్లన్నీ కలగలుపుతూ ఒక పీస్ చేయగలుగుతున్నాను. దానిని అంత ధరకు అమ్మడం ఎలాగో నేర్చుకోవాలిప్పుడు. నేను డిజైన్ చేసిన చీరను ప్రదర్శించడానికి మోడల్స్‌కి డబ్బిచ్చే బడ్జెట్ లేదు నాకు. అందుకే నేనే స్వయంగా ప్రదర్శిస్తూ ఫేస్బుక్ పోస్ట్ చేస్తున్నాను. కాళహస్తిలో కలంకారీ కళాకారుల కష్టాన్ని నా ఫోన్లో షూట్ చేసి వీడియోలు పోస్ట్ చేశాను. ఒక చీర అందంగా తయారు కావాలంటే కోట నుంచి సాదా చీర, కాళహస్తిలో పెన్‌కలంకారీ డిజైన్ వేయడం, రంగులు అద్దడం, మగ్గం మీద పని, టైలర్ అప్లిక్ వర్క్ చేయడం వంటి దశలన్నీ చూపించాను. పదివేల రూపాయల చీర వెనుక ఎంతమంది శ్రమ ఉందో తెలియచేయడంలో, ఆ చీర కొంటే పరోక్షంగా ఎంతమంది ఉపాధి పొందుతారో తెలియచేయడంలో సక్సెస్ అయ్యాను. చీరల గురించి పాఠాలు చెప్పడం మాని వ్యాపారం చేయడం నేర్చుకోమని మా అమ్మ కోప్పడుతుంటుంది’’ అన్నారు సంగీత తన ‘సంగీత ఫ్యాషన్ స్టూడియో’ గురించి చెబుతూ. – సంగీతా రాజేశ్ -
లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే!
ఈ సన్నివేశం సినిమాల్లో బాగా చూసి ఉంటారు.హీరోయిన్ వెళ్లిపోతుంటే హీరో చూస్తుంటాడు.ఫ్రెండ్‌తో చెబుతాడు – అమ్మాయి తిరిగి చూసిందంటే లవ్‌లో పడినట్లే అని.అమ్మాయి తిరిగి చూస్తుంది. ఆడియన్స్ కూడా హీరోలాంటి వాళ్లే.ఏ హీరోయిన్ తిరిగి వచ్చినా..ఏ హీరో రిటర్న్ ఇచ్చినా లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీతో పాటు రీఎంట్రీ కూడా ఉంటుంది. చనిపోయాడనుకున్న హీరో సెకండ్‌హాఫ్‌లో బతికి కనిపించినట్టే తెరమరుగైపోయారనుకున్న తారలు ఒక్కసారిగా మళ్లీ స్క్రీన్ మీద తళుక్కుమని మెరవడానికి వస్తారు. ఒక్కోసారి ఎంట్రీలోని ఇమేజ్ కన్నా రీఎంట్రీలోని క్రేజ్ వారిని ఎక్కడికో తీసుకెళ్లే అవకాశం ఉంది. చిరంజీవి వంటి మెగాస్టారే బ్రేక్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చినప్పుడు.. పెళ్లి, బాధ్యతలు, సరైన పాత్రలు రాకపోవడం వంటి కారణాల వల్ల బ్రేక్ తీసుకున్నవారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పేముంది? సీనియర్ నటి జయప్రదతో పాటు ఇలియానా, లయ, ప్రియమణి, సంగీత, భాగ్యశ్రీ, హీరో ఆర్యన్ రాజేశ్ తదితరులు టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్నారు. టేక్‌కి రెడీ అంటున్నారు. జయప్రదం ‘ఝుమ్మంది నాదం.. సయ్యంది పాదం’.. అన్న జయప్రద ఆ తర్వాత దశ తిరిగి ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అన్నారు. 1970ల చివరలో 1980లలో ఆమె స్టార్ హీరోయిన్. అయితే ఇక్కడ కెరీర్ పీక్‌లో ఉండగానే బాలీవుడ్‌కు వెళ్లిపోయి తెలుగు సినిమాలు తగ్గించుకున్నారు. ఆ తర్వాత కొత్తతరం రావడం, రాజకీయాల్లో బిజీ కావడం తదితర కారణాల వల్ల తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం జరగలేదు. ‘సాగర సంగమం’, ‘దేవత’ వంటి మంచి సినిమాలు చేసిన జయప్రద తెలుగు సినిమాలో మళ్లీ కనిపిస్తే ప్రేక్షకులకు అదే పెద్ద ఆనందం.పి.వాసు దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘మహారథి’లో కీలక పాత్రలో నటించిన ఆమె 11ఏళ్ల తర్వాత ‘శరభ’ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆకాష్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్.నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆమెను తెలుగులో బిజీ చేస్తుందని ఆశిద్దాం. సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. అలాగే ‘సువర్ణ సుందరి’ అనే మరో తెలుగు చిత్రంలోనూ జయప్రద ముఖ్యమైన పాత్ర చేశారు. సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తయారైన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా రెండు సినిమాలతో జయప్రదంగా ఆమె రీఎంట్రీ ఇవ్వడం అభిమానులకు ఆనందం. గోవా బ్యూటీ వచ్చేశారు ‘దేవదాసు’ ఆ వెంటనే ‘పోకిరి’ సినిమాతో యూత్ గుండె గోడల మీద పోస్టర్ గర్ల్‌గా నిలిచారు ఇలియానా. ఆ తర్వాత మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ .. వంటి హీరోలందరితో జోడీ కట్టారు. ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ వంటి సూపర్ హిట్స్ ఆమె ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. టాలీవుడ్లో అతి తక్కువ టైమ్‌లో కోటి రూపాయలు పారితోషికం అందుకున్న స్టార్ హీరోయిన్గా ఆమెకు పేరుంది.2012లో విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత టాలీవుడ్‌కి బై చెప్పి ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయారామె. ఆరేళ్ల తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటొని’ (అఅఆ)తో తెలుగు చిత్ర పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చారు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తయారైన ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఈ నెల 16న రిలీజైంది. ఇలియానా టాలీవుడ్‌కి వచ్చిన 12ఏళ్లలో తొలిసారి ‘అఅఆ’కి డబ్బింగ్ చెప్పారు.ఈ రీఎంట్రీతో ఆమె మరిన్ని సినిమాలు చేస్తారని చెప్పవచ్చు. ప్రియమైన వెన్నెల ప్రియమణి తెలుగు టీవీ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు కానీ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. హుషారైన బాడీ లాంగ్వేజ్‌తో, అందమైన చిరునవ్వు, యాక్టింగ్ టాలెంట్‌తో ముఖ్యమైన హీరోలతో పని చేసిన ప్రియమణి ఎక్కువ కాలం తెలుగు మీద ఫోకస్ చేయలేదనే చెప్పాలి. ఎక్కువ సమయం హీరోయిన్గా నిలవలేదనీ చెప్పాలి. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలను సుడిగాలిలా చుట్టి ఖాళీ అయిన ఈ నటి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుక్ ఖాన్‌తో ఐటమ్ సాంగ్ చేసి తానున్నట్టు రిఫ్రెష్ బటన్ నొక్కారు. 2016లో విడుదలైన ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే తెలుగు చిత్రంలో నటించలేదు. ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారట. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మైనే ఫిర్ ఆగయీ భాగ్యశ్రీని చూసి కనీసం అరకోటి మంది అబ్బాయిలైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉంటారు ‘మైనే ప్యార్ కియా’ సమయంలో. అయితే ఆమె సినిమాల్లో కంటిన్యూ కాకుండా హిమాలయ్ను భర్తగా చేసుకుని లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. తెలుగులో ‘ఓంకారమ్’, ‘రాణా’ సినిమాల్లో ఆమె నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1998లో వచ్చిన ‘రాణా’ చిత్రంలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో కనిపించిన భాగ్యశ్రీ 20ఏళ్ల తర్వాత ‘2 స్టేట్స్’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. అడివి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శివాని తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. టాలీవుడ్ కే పాస్ మై ఫిర్ ఆగయీ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భాగ్యశ్రీ. తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ ‘ప్రేమించు’ చిత్రంలో అంధురాలి పాత్రలో లయ నటించారనడం కంటే జీవించారనడం కరెక్టేమో. 1992లో అక్కినేని కుటుంబరావ్ దర్శకత్వంలో వచ్చిన ‘భద్రం కొడుకో’ సినిమాతో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ‘స్వయంవరం’ సినిమాతో కథానాయికగా మారారు. ఆ తర్వాత తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి, అలరించారు. ‘మనోహరం, ‘ప్రేమించు’ చిత్రాలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. 2010లో ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ చిత్రం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయిపోయారు. చాలా రోజులుగా లయ రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. 8 ఏళ్ల తర్వాత తాజాగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు లయ. ఈ చిత్రంతోనే లయ కూతురు శ్లోక బాలనటిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఒకే సినిమాతో తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ .. ప్రేక్షకులకు డబుల్ ధమాకాయే కదా! ఆరేళ్ల తర్వాత హాయ్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘హాయ్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హాయ్ చెప్పారు ఆర్యన్ రాజేష్. ఆ తర్వాత తెలుగులోనే కాదు తమిళంలోనూ సినిమాలు చేశారు.రామకృష్ణ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘బాలరాజు ఆడి బామ్మర్ది’ చిత్రం తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ ఆయన నటించలేదు. ఆరేళ్ల తర్వాత తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చెర్రీ (రామ్‌చరణ్) సోదరుని పాత్రలో నటిస్తున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. పద్మావతి వస్తున్నారహో... సంగీత మంచి డాన్సర్, నటి. ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమాలోని ‘పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే.. దగ దగ ముద్దొస్తున్నావే’ పాట ఆమెకు మంచి హిట్ ఇచ్చింది. 1999లో ‘ఆశల సందడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగీత ‘ఖడ్గం’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘సంక్రాంతి’ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. 2010లో వచ్చిన ‘కారా మజాకా’ చిత్రంలో నటించిన సంగీత ఆ తర్వాత తెలుగు సినిమాలేవీ చేయలేదు. 8 ఏళ్ల విరామం తర్వాత ‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నారామె. ‘‘తెలుగులో ఇది నా సెకండ్ ఇన్నింగ్స్.. ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలి’’ అని పేర్కొన్నారు సంగీత. పాతికేళ్ల తర్వాత టాలీవుడ్‌కి... ‘సాక్షి’, ‘మగాడు’, ‘దోషి..నిర్దోషి’, ‘20వ శతాబ్దం’... తదితర చిత్రాలతో 1990వ దశకంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన లిజీ దర్శకుడు ప్రియదర్శన్‌ను వివాహం చేసుకుని టాలీవుడ్‌కి దూరంగా ఉండిపోయారు. 25ఏళ్ల తర్వాత ‘ఛల్ మోహన్‌రంగ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా అడివి శేష్, శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కుతున్న ‘2 స్టేట్స్’ సినిమాలో లిజీ ఓ కీలక పాత్ర చేసేందుకు అంగీకరించారని వార్త. అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ 11 ఏళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతేడాది వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో జగపతిబాబు చెల్లెలి పాత్రలో ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా మెప్పించారు. ఇక 1980లో ‘మా భూమి’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిచంద్ చిరంజీవితో ‘మంచు పల్లకీ’తో పాటు అనేక చిత్రాల్లో నటించారు. 1989లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివ’ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదాయన. 27ఏళ్ల తర్వాత ‘ఫిదా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సైరా’ సినిమాలో ఆయన ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారట. దాంతో ‘మంచుపల్లకీ’ తర్వాత 36 ఏళ్లకు చిరంజీవి, సాయిచంద్ కలిసి నటించినట్టవుతుంది ఈ సినిమాతో. – ఇన్పుట్స్: డేరంగుల జగన్ -
శ్రీకాంత్ నా లక్కీ హీరో
‘‘నాది ఖమ్మం. 2002లో ఇండస్ట్రీకి వచ్చాను. సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. డి.ఎస్.రావుగారి సహకారంతో సాగర్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అదే నాకు ఈ రోజు బాగా ఉపయోగపడింది’’ అని డైరెక్టర్ హరీష్ వడ్త్యా అన్నారు. శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, సంగీత ముఖ్య తారలుగా హరీష్ వడ్త్యా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. మ్యాక్ ల్యాబ్స్ పతాకంపై మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. నందన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను శ్రీకాంత్, మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ విడుదల చేశారు. హరీష్ వడ్త్యా మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో నాకెవరూ గాడ్‌ఫాదర్ లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతగారే నా దేవుడు. మరో సినిమా కూడా నాతో చేస్తానని మాట ఇచ్చారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు మొహ్మద్ జాకీర్ ఉస్మాన్. ‘‘మై లక్కీ హీరో శ్రీకాంత్. మేమిద్దరం ఐదు చిత్రాల్లో నటించాం. ఈ చిత్రం నా సెకండ్ ఇన్నింగ్స్’’ అన్నారు సంగీత. ‘‘ఎక్కడా ఏ పొరపాటు రాకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని చాలా చక్కగా చేసిన చిత్రమిది’’ అని శ్రీకాంత్ అన్నారు. జిషాన్ ఉస్మాన్, మ్యూజిక్ డైరెక్టర్ నందన్, దర్శకుడు సాగర్, నటులు బ్రహ్మానందం, అలీ, అజయ్, వెంకట్, దర్శకుడు రవికుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
అభిమానుల అత్యుత్సాహం.. స్టార్‌హీరోకు గాయాలు
అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందన్నది నటుడు విజయ్‌కు శుక్రవారం అనుభవంలోకి వచ్చింది. ఆయన ఇబ్బంది పడడంతో పాటు గాయాలపాలయ్యా రు. వివరాలు చూస్తే విజయ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చారు. విజయ్ అఖిలభారత అభిమాన సంఘం అధ్యక్షుడు, పాండిచ్చేరి మాజీ శాసన సభ్యుడు ఆనంద్ కూతురు వివాహం శుక్రవారం పాండిచ్చేరిలో జరింగింది. ఈ వేడుకకు నటుడు విజయ్ వస్తున్నారన్న విషయాన్ని ముందుగానే ఆనంద్ అభిమానులందరికీ తెలియజేశారు. కల్యాణ మండపం ప్రాంతంలో విజయ్ ఫొటోలతో కూడిన పోస్టర్లలను, కటౌట్లను ఏర్పాటు చేశారు. విజయ్ తన సతీమణి సంగీతతో కలిసి వధూవరులను ఆశీర్వదించడానికి శుక్రవారం సాయంత్రం పాండిచ్చేరికి వెళ్లారు. కల్యాణమండపంలోకి వెళ్లగానే అభిమానులు ఆయన్ని చుట్టు ముట్టారు. బౌన్సర్లు అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. విజయ్ అలాగే వేదికపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించే ప్రయత్నం చేశారు. అయితే అభిమానుల తోపులాటతో ఆయన కిందపడబోయారు. కాలికి దెబ్బ కూడా తగి లింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులపై లాఠిచార్జ్ చేసి విజయ్ సంగీత దంపతులను సురక్షితంగా అక్కడి నుంచి పంపించేశారు. -
భారత హాకీ జట్ల గోల్స్ వర్షం
బ్యాంకాక్: యూత్ ఒలింపిక్స్ కోసం జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత పురుషులు, మహిళల హాకీ జట్లు అసాధారణ ప్రదర్శనతో హోరెత్తించాయి. పురుషుల జట్టు 25–0తో ఆతిథ్య థాయ్‌లాండ్‌పై, మహిళల జట్టు 14–0తో సింగపూర్‌పై భారీ విజయాలు సాధించాయి. పూల్ ‘బి’లో జరిగిన మహిళల పోరులో సంగీత కుమారి (2, 8, 15, 17, 21, 28వ ని.) ఆరు గోల్స్ చేయగా, లాల్రేమిసియామి (7, 17, 21వ ని.) మూడు గోల్స్ చేసింది. మిగతా వారిలో ముంతాజ్, దీపిక చెరో 2 గోల్స్ చేయగా, ఇషికా చౌదరి ఒక గోల్ సాధించింది. పురుషుల విభాగంలో జరిగిన పోరులో భారత జట్టులో మొహమ్మద్ అలీషాన్ (4, 10, 17, 20, 25, 29వ ని.) ఆరు గోల్స్, రాహుల్ కుమార్ (2, 12, 18, 22, 23వ ని.) ఐదు గోల్స్‌తో చెలరేగారు. రవిచంద్ర మొయిరంగ్తెమ్ (10, 15, 20, 29వ ని.), కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్ (7, 9, 27, 28వ ని.) చెరో నాలుగు గోల్స్ చేశారు. గోల్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు గోల్ కొట్టడం విశేషం. నేడు జరిగే పోటీల్లో పురుషుల జట్టు జపాన్‌తో, మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడతాయి. -
సంగీతపై మరోసారి దాడి
-
సంగీతపై మరోసారి దాడి
హైదరాబాద్ : ఇంటి నుంచి గెంటేయడంతో భర్తపై పోరాటం సాగిస్తున్న సంగీతపై మరోసారి దాడి జరిగింది. ఆమె తమ్ముడు ఇంటికి వచ్చాడన్న కారణంతో అత్తమామలు, మరిది దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడంతో సంగీత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. భర్త ఇంట్లో ఉండాలని, ఆమె ఖర్చులకు నెలకు రూ.20 వేలు చెల్లించాలని ఇటీవల ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆమె బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో భర్త, టీఆర్ఎస్ మాజీ నేత కె.శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె తమ్ముడు రంజిత్‌రెడ్డి.. ఆ ఇంటికి రావడంతో ఎందుకు వచ్చావంటూ సంగీత మరిది శ్రీధర్‌రెడ్డి దాడికి దిగాడు. ఇది గమనించిన సంగీత.. వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కొని అత్తమామలు, మరిది కలిసి దాడికి దిగారు. దీంతో సంగీత మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మామ బాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
కోర్టు ఆదేశాలున్నాయ్.. ఇంట్లోకి వెళ్తా
సాక్షి, హైదరాబాద్ : అత్తమామలు, భర్త తనను వేధిస్తున్నారంటూ 54 రోజులుగా సంగీత దీక్ష చేసిన ఇంటి వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు సంగీత ప్రయత్నించారు. శ్రీనివాసరెడ్డి, సంగీతల కేసును విచారించిన మియాపూర్ ఫ్యామిలీ కోర్టు ఆమెను ఇంట్లోనే ఉండనివ్వాలని, నెలకు రూ. 20 వేలు భరణంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతో కోర్టు నుంచి బోడుప్పల్‌లోని ఇంటి వద్దకు చేరుకున్న సంగీత తలుపు తాళం పగులగొట్టారు. అనంతరం కూతురుతో తలుపు గడి తీయించి, ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. పాప భవిష్యత్ ముఖ్యం ఇంటి తాళం పగులగొడుతున్న సంగీతకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. కోర్టు తీర్పుతో సంగీతకు కొంత బలం చేకూరిందని చెప్పాయి. కోర్టు తీర్పుతో కాకుండా సంగీత అత్తమామలు వచ్చి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్తే బావుండేదని అభిప్రాయపడ్డాయి. పాప భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస రెడ్డి, సంగీతతో రాజీకి రావాలని కోరాయి. సంతోషంగా చూసుకుంటే తీసేస్తాను.. కోర్టు తీర్పు నేపథ్యంలోపై సంగీత ‘సాక్షి’తో మాట్లాడారు. 54 రోజులుగా ఇంటి బయటే దీక్ష చేశానని చెప్పారు. అత్తింటివాళ్లు వస్తారని ఎదురుచూశానని తెలిపారు. శ్రీనివాస రెడ్డి వస్తే కలసి జీవించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. శ్రీనివాస రెడ్డికి వివాహేతర సంబధాలు ఉండటం వల్లే ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయని చెప్పారు. హ్యాపీ ఉంటున్నామని అనుకున్న రోజే కేసును ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. పెళ్లి అయిన నాటి నుంచి తాను ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్నానని చెప్పారు. అందుకే కోర్టు తీర్పు అనంతరం తాళం పగులగొట్టి లోపలికి వెళ్తున్నానని తెలిపారు. చాలా నష్టం జరిగింది : శ్రీనివాస రెడ్డి కోర్టు తీర్పు వల్ల తమకు చాలా నష్టం జరిగిందని బహిష్కృత టీఆర్ఎస్ నేత, సంగీత భర్త శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం పిటిషన్ దాఖలు చేయగా.. గురువారమే ఉత్తర్వులు రావడం బాధకరమని చెప్పారు. తాను సంగీతతో కలసివుండాలంటే కేసును ఉపసంహరించుకోవాల్సిందేనని తెలిపారు. సంగీత డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో.. బోడుప్పల్‌లోని ఇల్లు తన తల్లిదండ్రులదని చెప్పారు. ఆ ఇంటితో తనకు సంబంధం లేదన్నారు. సంగీతకు నిజంగా నాతో జీవించాలని ఉంటే తానెక్కడ ఉంటే ఆమె అక్కడే ఉండాలన్నారు. అందుకు ఇష్టపడితే తాను ఎక్కడ ఉంటున్నానో ఆమెకు చెబుతానన్నారు. -
కోర్టు తీర్పుతో సంగీతకు ఊరట
-
రోడ్డున పడ్డాం, రాజీకి రావా..?
సాక్షి, హైదరాబాద్: తనపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకుంటేనే తన మొదటి భార్య సంగీతను కాపురానికి రానిస్తానని బహిష్కృత టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... 53 రోజులుగా తాను, తన తల్లిదండ్రులు రోడ్డుపై ఉంటున్నామని తెలిపారు. తమ ఇంటిని సంగీత అధీనంలోని తీసుకుందని, ఆమెను కొంతమంది తప్పుదోవ పట్టించారని వాపోయారు. తనతో రాజీకి సంగీత రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపించారు. మూడేళ్లుగా రాజీకి ప్రయత్నిస్తున్నా, ఆమె ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. తన పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవని, తల్లిదండ్రులపైనే ఆధారపడి బతుకుతున్నానని చెప్పారు. కూతురంటే ప్రాణమని, తనకు వచ్చే ఆస్తి ఆమెకే చెందుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా తన కూతురి పేర ఆస్తి రాయాల్సిన అవసరం లేదన్నారు. విభేదాలన్నీ మర్చిపోయి వస్తే సంగీతను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. కేసులు ఉపసంహరించుకుంటేనే ఆమెతో రాజీ పడతానని తేల్చి చెప్పారు. నిరూపిస్తే దీక్ష విరమిస్తా: సంగీత రాజీకి తాను రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే ఇప్పుడే దీక్ష విరమిస్తానని సంగీత తెలిపింది. ఎక్కడోవుండి మాట్లాడం కాదని, ఇంటికి వచ్చి రాజీ గురించి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం శ్రీనివాస్‌రెడ్డికి సరదా అని ఆరోపించారు. కాగా, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బోడుప్పల్‌లోని భర్త ఇంటి ముందు సంగీత 53 రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. -
52 రోజులుగా భర్త ఇంటి ముందు దీక్ష
-
హైకోర్టుకు చేరిన సంగీత వివాదం
సాక్షి, హైదరాబాద్ : తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్న సంగీత వ్యవహారం తాజాగా హైకోర్టుకు చేరింది. బోడుప్పల్‌లోని ఇంటి నుంచి సంగీతను ఖాళీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె అత్తింటివారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సంగీత బలవంతంగా ఇంటి తాళాలు పగులగొట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసిందని, తమను ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటుందని.. ఇంటి ముందు దీక్ష కొనసాగించవద్దని ఆదేశించాలని, సంగీత అత్తింటి వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో, సంగీతకు నోటిసులు అందాయి. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్లో టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం 20వ రోజుకు చేరుకుంది. అత్తింటి వారు చేసిన దాడికి నిరసనగా తనకు న్యాయం కావాలని సంగీత గత ఇరవై రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సంగీతకు రోజురోజుకూ మహిళా సంఘాల మద్ధతు పెరుగుతూనే ఉన్నా.. ఆమె ఆరోగ్యం మాత్రం రోజురోజుకూ క్షీణిస్తుంది. ఇప్పటికే సంగీత భర్త, అత్త జైలులో ఉండగా.. మామ బాల్రెడ్డికి కూడా కోర్టు బెయిల్ రద్దు చేసింది. సంగీత మాత్రం న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తోంది. -
పేదలకు చేరువగా ఆధునిక వైద్యం..
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక వైద్యాన్ని నిరుపేదలకు చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అపోలో గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని చెప్పారు. ఈ నెల 28 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న జీఈఎస్‌లో మాట్లాడే అవకాశం ఆమెకు లభించిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ రంగంలో విశేష కృషి చేయడమే కాకుండా, 140 దేశాల్లో 50 మిలియన్ల మందిని ప్రభావితం చేయగలిగే స్థాయికి అపోలో గ్రూప్‌ను తీసుకెళ్లిన ఆమె సదస్సులో మాట్లాడబోయే అంశాలను శుక్రవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా ప్రసంగంలో ప్రజావైద్యం బలోపేతం... ఔషధ పారిశ్రామిక రంగం విస్తరణ వంటి అంశాలే కీలకంగా ఉంటాయి. టెలీమెడిసిన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు ఎలా అందించవచ్చు. ఆపదలో ఉన్న రోగిని ఎలా కాపాడవచ్చు.. తక్కువ ధరకు అధునాతన వైద్యసేవలు ఎలా అందించవచ్చు.. వైద్య రంగం అవసరాలు.. ఔషధ కంపెనీల ఉత్పత్తులు, ప్రస్తుత మార్కెటింగ్.. వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తా. ప్రభుత్వ పరంగా ఆయా ఆస్పత్రుల్లో నమోదవుతున్న వ్యాధుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి, విశ్లేషించడంతో వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్స అందించే అవకాశం ఉంది. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ అనేక ఔషధ కంపెనీలకు కేంద్రంగా మారింది. తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందుతుండటంతో విదేశీ రోగులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ తయారైన మందులు విదేశాలకు సరఫరా చేస్తున్నారు. కానీ వ్యాధి నిర్ధారణలో కీలకంగా మారిన ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి వైద్య పరికరాలను మాత్రం ఎక్కువ ధర చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రులు ఈ ఖర్చులను రోగులపై రుద్దుతున్నాయి. అదే కంపెనీ తమ ఉత్పత్తులను స్థానికంగా కొనసాగిస్తే.. రవాణా, ఇతర చార్జీలు తగ్గే అవకాశం ఉంది. తద్వారా రోగులకు తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం లభిస్తుంది. ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ఈ అంశాలను ప్రధానంగా వివరించి, పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తా’అని సంగీతారెడ్డి చెప్పారు. -
చర్లపల్లికి చేరిన సంగీత పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆయన రెండో భార్య సంగీతల పంచాయితీ చర్లపల్లి సెంట్రల్ జైలుకు చేరింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట ఆరు రోజులుగా సంగీత నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విదితమే. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నేతలు కలిసి రాజీ కుదుర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంగీతకు ఎంతో కొంత డబ్బు చెల్లించి వదిలించుకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతల రాకతో జైలు ప్రాంతం సందడిగా మారింది. కాగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజీ కుదిర్చేందుకు వచ్చిన సామాజికవేత్తల, రాజకీయ నాయకుల ప్రయత్నాలను కొంతమంది మహిళా కార్యకర్తలు ముందుకు సాగనివ్వడంలేదు. సంగీత కోరుతున్న షరతులకు మామ బాల్‌రెడ్డిని ఒప్పించి దీక్ష విరవింపజేసేలా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
క్షీణిస్తున్న సంగీత ఆరోగ్యం.
-
క్షీణిస్తున్న సంగీత ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్ : తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్లో టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం ఆరో రోజుకు చేరింది. తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేస్తున్నారు. రోజురోజుకూ ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజీ కుదిర్చేందుకు వచ్చిన సామాజికవేత్తల, రాజకీయ నాయకుల ప్రయత్నాలను కొంతమంది మహిళా కార్యకర్తలు ముందుకు సాగనివ్వడంలేదు. సంగీతకు మొదటగా ఆర్ధిక సాయం చేసి, దీక్ష విరవింపజేయిస్తే బాగుంటుందన్నది కొంత మంది మహిళా నేతల ఆలోచనగా ఉంది. తన బిడ్డ భవిష్యత్తు కోసం అయినా ఆమెకు కొంత ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలని సంగీత కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. సంగీత కోరుతున్న షరతులకు మామ బాల్‌రెడ్డిని ఒప్పించి దీక్ష విరవింపజేసేలా చూస్తామని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. -
హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తా
-
స్పష్టమైన హామీ ఇస్తేనే...: సంగీత
సాక్షి, హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలంటూ సంగీత చేస్తున్న దీక్ష గురువారానికి ఐదోరోజుకు చేరింది. బోడుప్పల్‌లోని భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్దే ఆమె ఆందోళన కొనసాగిస్తోంది. తనకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ ఆందోళన కొనసాగుతుందని సంగీత స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి, మరిది శ్రీధర్ రెడ్డి, అత్త, మామలు ఐలమ్మ, బాల్‌రెడ్డిలను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు కాగా, అత్త ఐలమ్మకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. కాగా అమ్మాయి పుట్టిందనే నెపంతో తనను ఇంటి నుంచి గెంటేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డిని, అందుకు ప్రోత్సహించిన అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గత అయిదు రోజులుగా సంగీత బోడుప్పల్‌లోని అత్తగారింటి వద్ద ఆందోళన చేస్తోంది. ఈ క్రమంలో భర్త శ్రీనివాస్‌రెడ్డి ఆమెపై దాడికి సైతం పాల్పడ్డాడు. అప్పటికే మొదటి భార్య స్వాతి నుంచి విడాకులు తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను ఇంటి నుంచి గెంటేసి దేవీ జగదీశ్వరీ అనే మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో సంగీత న్యాయపోరాటానికి దిగింది. ఆమెకు పలు మహిళా, ప్రజాసంఘాలు మద్ధతుగా నిలిచాయి. మంత్రి కేటీఆర్ సూచన మేరకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి సైతం బుధవారం బాధితురాలిని పరామర్శించి దీక్షకు మద్ధతు పలికారు. ఈ క్రమంలో ఆమె అత్తింటి వారితోనూ, బంధువులతో ఆయన జరిపిన చర్చలు విఫలం కావడంతో సంగీత భర్త, అత్త,మామల ను పోలీసులు అరెస్టు చేశారు. వారి అరెస్టులతో తనకు న్యాయం జరిగినట్లుగా భావించడం లేదని, సామాజికంగా, ఆర్ధికంగా తనకు భద్రత కల్పించాలని సంగీత కోరారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. హోటల్లో చర్చలు.. సంగీతకు మద్ధతు తెలిపిన ఎంపీ మల్లారెడ్డి ఆమెకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన తన అనుచరులతో కలిసి సంగీత అత్తింటి వారితో మేడిపల్లిలోని ఒక హోటల్లో చర్చలు జరిపా రు. సంగీత తరుపున రాపోలు రాములు, తోటకూర జంగయ్య, సంగీత బాబాయి చర్చల్లో పాల్గొన్నారు. సంగీతకు పరిహారం, రక్షణ, జీవన భృతిపై చర్చలు జరిగాయి. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో చర్చలు విఫలమయ్యాయి. దీనికితోడు సంగీతకు అన్ని వైపుల నుంచి మద్ధతు పెరగడంతో పరారీలో ఉన్న సంగీత అత్త పులకండ్ల ఐలమ్మ, మామ బాల్‌రెడ్డి, భర్త శ్రీనివాస్ రెడ్డిలను నిన్న సాయంత్రం పోలీసులు.... అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు: సంగీత
సాక్షి, హైదరాబాద్: తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించలేదని సంగీత స్పష్టం చేశారు. తన అత్తమామలను అరెస్ట్ చేసి, తనకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తన పాపకు భరోసా కల్పించాలని, భార్యగా తనకు దక్కాల్సిన గౌరవం కావాలన్నారు. అత్తింటి వారిని తాను డబ్బులు డిమాండ్ చేయలేదని తెలిపారు. రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. తన భర్త పులగండ్ల శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద వరుసగా నాలుగు రోజు ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. నిద్రాహారాలు మాని చంటిపిల్లతో కలిసి పోరాటం చేస్తున్నారు. సంగీతను మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంగీతకు న్యాయం చేస్తామని, మరో మహిళకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని హామీయిచ్చారు. సంగీత అత్తమామలను అరెస్ట్ చేసి, శిక్ష పడేలా చేస్తామన్నారు. సంగీత, ఆమె బిడ్డను అన్నివిధాల ఆదుకుంటామని భరోసాయిచ్చారు. శ్రీనివాసరెడ్డి ఆస్తిలో వాటా ఇప్పించడమే కాకుండా, కొంత నగదు కూడా ఇప్పిస్తామన్నారు. అత్తమామలను అరెస్ట్ చేసే వరకు తాను దీక్ష విరమించబోనని సంగీత స్పష్టం చేయడంతో.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంగీతకు టీజేఏసీ చైర్మన్ కోదండరాం సంఘీభావం ప్రకటించారు. ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా కోదండరాంకు ఆమె తెలిపారు. సంగీతకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు. -
క్షీణిస్తున్న సంగీత ఆరోగ్యం
-
క్షీణిస్తున్న సంగీత ఆరోగ్యం
హైదరాబాద్: మూడో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి వద్ద పోరాటం చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమెతోపాటు ఆమె కుమార్తె ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఆమె చేపట్టిన న్యాయ పోరాటం నాలుగో రోజుకు చేరింది. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ నిద్రాహారాలు మాని చంటిపిల్లతో కలిసి పోరాటం చేస్తున్నారు. నాలుగు రోజులుగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటిముందు ధర్నా కొనసాగిస్తున్నా అత్తింటి వారి నుంచి స్పందన లేదు. అత్తామామలు లేదా ప్రభుత్వం తనకు హామీ ఇచ్చే వరకు ఇంటిముందే పోరాటం సాగిస్తానంటోన్నారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
నిత్య పెళ్లికొడుక్కి షాక్
సాక్షి, హైదరాబాద్: నిత్య పెళ్లికొడుకు, తమ పార్టీ నేత శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ షాకిచ్చింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు బోడుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు సంజీవరెడ్డి తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి రెండో భార్య సంగీతకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీయిచ్చారు. మరోవైపు సంగీతకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సంగీతకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆయన వెనుదిరిగారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. మూడు రోజులుగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటివద్ద తన రెండేళ్ల కూతురితో కలిసి సంగీత ఆందోళన చేస్తోంది. ఇంటికి తాళం వేసి అత్తమామలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది. తనతో విడాకులు తీసుకోకుండా మూడో పెళ్లి చేసుకున్న భర్తను నిలదీసేందుకు వచ్చిన సంగీత, ఆమె సోదరుడు రంజిత్‌రెడ్డిపై శ్రీనివాస్‌రెడ్డి దాడి చేసిన సంగతి తెలిసిందే. సంగీత ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, మామ బాల్‌రెడ్డి, అత్త ఐలమ్మ, మూడో భార్య దేవిజగదీశ్వరిలపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
న్యాయం కోసం భర్త ఇంటి ముందు దీక్ష