Mindless trolls linking Thalapathy Vijay is dating with Keerthy Suresh - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: విడాకులకు సిద్దమైన విజయ్‌? కీర్తిసురేష్‌తో ప్రేమే కారణమంటూ వార్తలు

Published Tue, Jan 24 2023 3:12 PM | Last Updated on Tue, Jan 24 2023 4:07 PM

Trolls Linking Thalapathy Vijay Is Dating With Keerthy Suresh - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో తళపతి విజయ్‌ భార్య సంగీతతో విడిపోతున్నాడని, త్వరలోనే వీళ్లు విడాకులు తీసుకోనున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్‌కి బలం చేకూర్చేలా విజయ్‌కు సంబంధించిన ఈవెంట్స్‌లోనూ సంగీత ఎక్కడా కనిపించడం లేదు. 22 ఏళ్ల తమ వివాహ బంధాన్ని విజయ్‌ తెగదెంపులు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే విజయ్‌ విడాకులకు స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేష్‌ కారణమని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గతంలో కీర్తి సురేష్‌ విజయ్‌తో కలిసి ‘భైరవ’, ‘సర్కార్’ వంటి సినిమాల్లో నటించింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అది ప్రేమగా మారిందని, భార్య సంగీత ఎన్నిసార్లు చెప్పినా విజయ్‌ కీర్తితో క్లోజ్‌గా ఉంటున్నాడని తమిళ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. భార్యతో విడాకుల తర్వాత కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది.

ఈ క్రమంలో #JusticeForSangeetha (విజయ్‌ భార్య పేరు)అనే హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు. అదే విధంగా కీర్తి సురేష్‌ను దారుణంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. అయితే దీనిపై విజయ్ కానీ, సంగీత కానీ, కీర్తి సురేష్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే వారీసు హిట్‌తో కొందరు ఓర్వలేక ఇలాంటివి తెరపైకి తీసుకొస్తున్నారని, కావాలనే కీర్తి సురేష్‌ను ఇందులోకి లాగుతున్నారంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. దీనిపై స్వయంగా విజయ్‌ స్పందిస్తే తప్పా ఇది ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement