ఆన్‌స్క్రీన్‌పై సూపర్ హిట్ అనిపించే జోడీలు కొన్ని ఉంటాయి. విజయ్ - త్రిష కూడా ఈ జాబితాలోకే వస్తారు. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా వీరు జంటగానే ఉంటారంటూ ఎప్పటినుంచో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ ఓ ప్రైవేట్ జెట్‌లో కలిసి ప్రయాణించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవగా జస్టిస్ ఫర్ సంగీత అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
భార్యకు దూరంగా విజయ్?
సంగీత మరెవరో కాదు, విజయ్ భార్య. వీరిద్దరూ 1999లో పెళ్లి చేసుకోగా జేసన్ సంజయ్, దివ్య సాష అని ఇద్దరు సంతానం. గతేడాది విజయ్- సంగీత మధ్య పొరపచ్చాలు వచ్చాయని ప్రచారం జరిగింది. విజయ్ సినిమా ఈవెంట్లలోనూ కనిపించకపోవడంతో దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. అయితే సంగీత వెకేషన్‌లో ఉండటం వల్లే విజయ్ మూవీ ఈవెంట్లకు హాజరు కాలేదన్నది మరో వాదన.
ట్రెండింగ్‌లో విజయ్ -త్రిష
ఇప్పుడేకంగా వీరు కలిసి ట్రావెల్ చేస్తుండటంతో నెటిజన్లు విజయ్-త్రిష వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఏదైనా సినిమా కోసం కలిసి వెళ్తున్నారనుకోవచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.
Co-stars or power couple? Vijay and Trisha spotted boarding a private jet together. The industry is talking!
#JusticeforSangeetha#AlluArjun #Delhi #AlluArjunArrest pic.twitter.com/q0NT6DQMB3— Roshan meena (@1f8be1a6f3fe4ad) December 13, 2024
Exclusive footage of Vijay and Trisha sparks buzz! 🛩️👀
Work or something more? 🔥 #JusticeforSangeetha #TrishaKrishnan #ThalapathyVijay𓃵 pic.twitter.com/no2kkMUzuH— Rahul Kumar Pandey (@raaahulpandey) December 13, 2024
Comments
Please login to add a commentAdd a comment