అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన రేవతి భర్త
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. బన్నీ అరెస్ట్‌పై సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త స్పందించాడు. ఈ ఘటనకు అల్లు అర్జున్‌కు సంబంధం లేదు. ‘అల్లు అర్జున్ అరెస్టయిన విషయం టీవీల్లో చూసి తెలుసుకున్నాను. నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు. నాకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సినిమా చూస్తానంటేనే నా భార్య, కొడుకును థియేటర్‌కి తీసుకెళ్లాను. అందులో అల్లు అర్జున్ తప్పేమి లేదు. అవసరం అయితే కేసును ఉపసంహరించుకుంటాను’ అని రేవతి భర్త అన్నారు.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన చిక్కడ పల్లి పోలీసులు.. అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో, పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
అసలేం జరిగింది
అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప 2 ఈ నెల 5న విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్‌కి ఒక్క రోజు ముందు డిసెంబర్ 4న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో సినిమా చూసేందుకు రేవతి అనే మహిళ తన కుమారుడితో కలిసి వెళ్లింది. అదే థియేటర్స్‌కి అల్లు అర్జున్ కూడా వెళ్లాడు. దీంతో బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఈ కేసు విషయంలోనే పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment