Trisha Krishnan
-
అజిత్ 'పట్టుదల' HD మూవీ స్టిల్స్
-
హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కిన ఐడెంటిటీ(Identity Movie) సినిమా నేడు తెలుగులో విడుదలైంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన కూడా అధికారికంగా వెలువడింది. వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ చిత్రాన్ని అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టింది.'ఐడెంటిటీ' సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఇప్పటికే మలయాళ వర్షన్ విడుదలై చాలారోజు అయింది. దీంతో తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన చేశారు. అయితే, తెలుగులోనూ ఈరోజే (జనవరి 24) రిలీజ్ అయింది. ఇంతలోనే మరో వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం. జనవరి 31న జీ5లో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు. -
త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఐడెంటిటీ(Identity Movie) చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. ఈమేరకు తాజాగా తెలుగు వర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగులో జనవరి 24న రిలీజ్ కానుంది.ఉత్కంఠగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉందని ఇప్పటికే మలయాళ రివ్యూలు తేల్చేశాయి. దీంతో సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎండీబీ రేటింగ్‌లో కూడా 9 వరకు ఉంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై మక్కువ చూపారు. అయితే, మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ‘ఐడెంటిటీ’ టైటిల్‌తోనే రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నేనూ మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి: సాయిపల్లవి)ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు.టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ గతేడాది సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.120 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆయన కెరీర్లో ఈ చిత్రం ఓ ల్యాండ్‌మార్క్ అని చెప్పవచ్చు. ఇప్పుడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
'96' సినిమా సీక్వెల్.. సింగపూర్, మలేషియా నుంచి కథ
ప్రస్థుతం చిత్రపరిశ్రమలో సీక్వెల్ నడుస్తోందని చెప్పవచ్చు. అయితే అన్ని చిత్రాల సీక్వెల్స్ హిట్ అవుతాయని గ్యారంటీ లేదు. బాహుబలి,పుష్ప వంటి కొన్ని చిత్రాల సీక్వెల్స్ మాత్రమే విజయం సాధించాయి. ఇండియన్–2, విడుదల-2 వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు పొందలేక పోయాయి. కాగా 2018లో తమిళ్లో విడుదలైన 96 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇది పాఠశాల ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. విదేశాల్లో ఉన్న త్రిష పాఠశాల స్నేహితులను కలవడానికి చైన్నెకి వస్తుంది. అప్పుడు తన చిన్ననాటి ప్రేమికుడు కూడా విజయ్‌సేతుపతి కూడా వస్తాడు. వారి మధ్య జరిగే మూగ ప్రేమే 96 చిత్ర కథ. కాగా ఏడేళ్ల తర్వాత ఈ చిత్ర సీక్వెల్‌కు దర్శకుడు ప్రేమ్‌కుమార్ సిద్ధం అవుతున్నారు. ఈయన ఇటీవల కార్తీ, అరవింద్‌స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం విడుదల సమయంలోనే 96 చిత్రానికి సీక్వెల్ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్ర కథ సింగపూర్, మలేషియాల్లో జరిగే విధంగా ఉంటుందని దర్శకుడు ప్రేమ్‌కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి భాగంలో త్రిష విదేశాల నుంచి చైన్నెకి వచ్చినట్లు చూపించిన విషయం తెలిసిందే. దీంతో రెండవ భాగం విదేశాల్లో జరుగుతుందని దర్శకుడు ఈసందర్భంగా చెప్పారు. అదేవిధంగా 96 చిత్ర కథను ప్రేమ ఇతివృత్తంతో రూపొందించగా, దాని సీక్వెల్ ప్రేమతో పాటు కుటుంబసమస్యలు, భావోద్రేకాలు వంటి అంశాలతో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఆలయంలో త్రిష పూజలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
నెటిజన్లకు ఎక్కువగా కంటెంట్స్ ఇచ్చే నటీమణుల్లో త్రిష ఒకరు అని చెప్పవచ్చు. కారణం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ చైన్నె బ్యూటీ ఎప్పుడు చర్చనీయాంశమే. వృత్తిపరంగా చూస్తే 22 ఏళ్లు పూర్తి చేసింది. తన కెరీర్లో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని, జయపజయాలను చవిచూసి ఇప్పటికీ అగ్రకథానాయకి స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించడానికి ఏకై క ఆప్షన్‌గా వెలుగొందుతున్నారు. ఇక వ్యక్తిగతంగా త్రిష ఎప్పుడు సంచలనమే. ప్రేమ వ్యవహారంలో ఈమె గురించి పలు రకాల వార్తలు ప్రచారమవుతుంటాయి. అదేవిధంగా ఇంతకుముందే త్రిష పెళ్లి నిశ్చితార్థం వరకు వెళ్లి ఆగిపోయింది. 41 ఏళ్ల పరువాల ఈ భామ ఇప్పటికీ అవివాహితే అన్నది గమనార్హం. నటుడు విజయ్‌తో ఈమెను కలుపుతూ చాలాకాలంగా వదంతులు సామాజిక మాధ్యమాల్లో అవుతున్నాయి. తాజాగా నటి కీర్తి సురేష్ వివాహానికి నటుడు విజయ్, త్రిష చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు ప్రచారం హోరెత్తుతోంది. అయితే నటి త్రిష ఇలాంటి విషయాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. కాగా ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 45వ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి త్రిష కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్(కుమారస్వామి) ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని, విశేష పూజలు నిర్వహించారు. అక్కడ ఆమెను చూసిన ఇతర భక్తులు సాధారణ ప్రజలు ఆమెతో ఫొటో తీసుకోవడానికి గుమిగూడారు. వారందరితో ఫొటోలు దిగిన త్రిష అక్కడి నుంచి బయల్దేరి వచ్చేశారు. ఆ ఫొటోలు, వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే నటి త్రిష దైవ దర్శనం చేసుకోవడంపై కూడా నెటిజన్లు ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. View this post on Instagram A post shared by NTC Talks (@ntctalks) -
ట్రెండింగ్‌లో #JusticeforSangeetha.. అంతా త్రిష వల్లే?
ఆన్‌స్క్రీన్‌పై సూపర్ హిట్ అనిపించే జోడీలు కొన్ని ఉంటాయి. విజయ్ - త్రిష కూడా ఈ జాబితాలోకే వస్తారు. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా వీరు జంటగానే ఉంటారంటూ ఎప్పటినుంచో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ ఓ ప్రైవేట్ జెట్‌లో కలిసి ప్రయాణించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవగా జస్టిస్ ఫర్ సంగీత అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.భార్యకు దూరంగా విజయ్?సంగీత మరెవరో కాదు, విజయ్ భార్య. వీరిద్దరూ 1999లో పెళ్లి చేసుకోగా జేసన్ సంజయ్, దివ్య సాష అని ఇద్దరు సంతానం. గతేడాది విజయ్- సంగీత మధ్య పొరపచ్చాలు వచ్చాయని ప్రచారం జరిగింది. విజయ్ సినిమా ఈవెంట్లలోనూ కనిపించకపోవడంతో దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. అయితే సంగీత వెకేషన్లో ఉండటం వల్లే విజయ్ మూవీ ఈవెంట్లకు హాజరు కాలేదన్నది మరో వాదన.ట్రెండింగ్‌లో విజయ్ -త్రిషఇప్పుడేకంగా వీరు కలిసి ట్రావెల్ చేస్తుండటంతో నెటిజన్లు విజయ్-త్రిష వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఏదైనా సినిమా కోసం కలిసి వెళ్తున్నారనుకోవచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.Co-stars or power couple? Vijay and Trisha spotted boarding a private jet together. The industry is talking!#JusticeforSangeetha#AlluArjun #Delhi #AlluArjunArrest pic.twitter.com/q0NT6DQMB3— Roshan meena (@1f8be1a6f3fe4ad) December 13, 2024Exclusive footage of Vijay and Trisha sparks buzz! 🛩️👀 Work or something more? 🔥 #JusticeforSangeetha #TrishaKrishnan #ThalapathyVijay𓃵 pic.twitter.com/no2kkMUzuH— Rahul Kumar Pandey (@raaahulpandey) December 13, 2024చదవండి: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ -
హీరో సూర్య 45వ చిత్రం ప్రారంభం..హీరోయిన్గా త్రిష (ఫొటోలు)
-
20 ఏళ్ల తర్వాత సూర్యతో మరోసారి ఛాన్స్ కొట్టేసిన గోల్డెన్ బ్యూటీ
సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ భాగం కానుంది. ఈమేరకు నెట్టింట వార్తలు భారీగానే ట్రెండ్ అవుతున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిదే. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రానున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సుమారు 20 ఏళ్ల తర్వాత సూర్యతో త్రిష మళ్లీ కనిపించనున్నారు.కోలీవుడ్‌లో త్రిష,సూర్య ఇద్దరూ కలిసి 3 చిత్రాల్లో నటించారు. మౌనం పెసియాధే (2002),యువ (2004),ఆరు (2005) వంటి చిత్రాల్లో వారు కలిసి నటించారు. పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి త్రిష స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సూర్యతో కలిసి నటించేందుకు 20 ఏళ్ల తర్వాత మరోసారి ఛాన్స్ రావడంతో ఆమె ఓకే చెప్పేశారట. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఇప్పటికే ఆమె డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. త్రిష ఇప్పటికే ఒప్పుకున్న సినిమా షెడ్యూల్స్ ఉండటంతో ఆమె బిజీగా ఉన్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సూర్య 45' అనే వర్కింగ్ టైటిల్‌ను ప్రస్తుతానికి ప్రకటించారు. కంగువా సినిమా భారీ డిజాస్టర్ కావడంతో దర్శకుడు ఆర్జే బాలాజీపై తీవ్రమైన ఒత్తడి పెరగనుంది. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. -
అడ్డు గడులలో నెం. 52
పేపర్లో మన ఊరి పేరు కనిపిస్తేనే ఆసక్తిగా చూస్తాం కదా, అలాంటిది ఏకంగా మన పేరే పేపర్లో వస్తే? ఊరంతా తిరిగి ఆ సంతోషాన్ని తలా ఇంత పంచి పెడతాం. త్రిష కూడా మొన్న ఆదివారం (3 నవంబర్) అటువంటి సంతోషంలోనే తేలియాడారు. పైగా ఆమె పేరు వచ్చింది ఇంటర్నేషనల్ పేపర్లో. అది కూడా ప్రసిద్ధ ‘న్యూయార్క్ టైమ్స్’ మేగజీన్ లో! ఫిల్మ్ న్యూస్ కేటగిరీలో ఆమె పేరు వచ్చుంటే.. సినీ స్టార్ కనుక రాసి ఉంటారని అనుకోవచ్చు. కానీ త్రిష పేరు ప్రస్తావనకు వచ్చింది న్యూయార్క్ టైమ్స్ 1942 నుంచీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న ‘క్రాస్‌వర్డ్ పజిల్’లో! పజిల్లో నిలువు గడులు, అడ్డు గడులు ఉంటాయి కదా, అడ్డు గడులలోని 52 వ ‘క్లూ’గా ‘యాక్ట్రెస్ కృష్ణన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా’ ఎవరు అని అడిగారు. ఇంకెవరు? త్రిషనే! ఆమె పూర్తి పేరు త్రిషా కృష్ణన్ . ఇకనేం.. 52 అడ్డులోని ఆరు గడులను టి.ఆర్.ఐ.ఎస్.హెచ్.ఎ. అని తన పేరుతో నింపి, ఆ పజిల్ స్క్రీన్ షాట్‌ను ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు త్రిష. ‘‘నా పేరు న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిందహో’’.. అంటూ ‘‘ఒకే బై, షోయింగ్ పూర్తయింది’’ అని ఓ సరదా కామెంట్ కూడా ఆ పోస్ట్‌కి జత చేశారు. ఈ సంతోషం అక్కడితో ఆగలేదు. సమంతా కూడా షేర్ చేసుకున్నారు. ‘‘నువ్వు క్వీన్ త్రిషా’’ అన్నారు. అందుకు త్రిషా ‘‘ఆ.. సామ్.. మనిద్దరం ఒకటే’’ అని రిప్లయ్ ఇచ్చారు. అవును, వీళ్లిద్దరూ ఒకటే. చిన్న చిన్న సంతోషాలకు కేరింతలు కొట్టే చిన్న పిల్లల మనసున్న సెలబ్రిటీలు. -
నేను మనుషులను పట్టించుకోను: త్రిష
అందాల భామ నటి త్రిష. నాలుగు పదుల పరువాల సంచలన నటి ఇప్పటికీ అవివాహితనే అన్నది తెలిసిందే. కథానాయకిగా సెంచరీలు కొట్టినా పెళ్లికి మాత్రం దూరంగా ఉంటూ సోలో లైఫే సో బెటర్ అనేలా నడుపుతున్నారు. అయితే చాలా కాలం క్రితమే చైన్నె బ్యూటీ పెళ్లికి సిద్ధమయ్యారు. ఒక నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అది కారణాలు ఏమైనా పెళ్లి పీటలు ఎక్కలేదు అప్పటినుంచి త్రిష నటనపైనే దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమే అంటూ అందుకు సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటానని చెబుతూ వస్తున్నారు. అదే విధంగా ఈ అమ్మాయి గురించి ప్రేమ వదంతులు చాలానే దొర్లాయి. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష తాజాగా అసలు మనుషులతో పనిఏంటి అనే విధంగా తన ఎక్స్ మీడియాలో ఓ టీట్ చేశారు. అందులో తాను మనుషులను దూరంగా పెడతానని, శునకాలను ప్రేమిస్తానని అయితే నా శునకాలు మాత్రం ఇతర శునకాలను పక్కన పెడుతూ మనుషులను ప్రేమిస్తాయన్నారు. కాబట్టి మనమంతా కలిసి ప్రేమైక సమాజాన్ని స్థాపిద్దాం అని త్రిష పేర్కొన్నారు. ఈమె ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా త్రిష గురించి మరో విషయం కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈమె తన అభిమాన నటుడు విజయ్ అని చాలాసార్లు పేర్కొన్నారు. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో త్రిష ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా నటుడు విజయ్ ఆదివారం ఆయన తొలిసారిగా మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమంలో నటి త్రిష పాల్గొంటారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆమె మహానాడులో పాల్గొనక పోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
25 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
కళామతల్లిని నమ్మినవారిని ఎన్నటికీ చేయి విడువదు. ఇందుకు ఉదాహరణ నటి త్రిష. సుమారు 25 ఏళ్లుగా ఈ బ్యూటీ చెక్కు చెదరని అందాలతో కథానాయకిగా రాణిస్తున్నారు. మధ్యలో చిన్న ఆటుపోటులకు గురైనా త్రిష సినిమా కెరీర్ అధికంగా ఉన్నత స్థాయిలోనే కొనసాగుతోంది. తొలుత తమిళంలో నాయకిగా రాణించినా, ఆ తరువాత ఆమె క్రేజ్ తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల వరకూ చేరింది. అలా ఈ ఐదు భాషల్లోనూ ప్రముఖ స్టార్స్‌తో జత కట్టి అగ్రకథానాయకిగా వెలిగి పోతున్నారు. ఇదీ చదవండి: అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్నిజం చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో దర్శకుడు మణిరత్నం త్రిషకు మంచి రీఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఈ నాలుగు పదుల పరువాల భామ ఇప్పుడు నటుడు అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో పాటు కమలహాసన్‌తో కలిసి థగ్‌లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక చిత్రం, మలయాళంలో మోహన్‌లాల్, టోవినో థామస్‌తో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. త్రిష మొదట్లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ చెన్నై కిరీటాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆ కిరీటాన్ని 1999లో గెలుచుకున్నారు. అది జరిగి 25 ఏళ్ల గడిచిన సందర్భంగా ఆ మధురమైన స్మృతులను తలచుకుంటూ తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఆ ఫొటోలను పోస్ట్ చేశారు. అందులో తన జీవితాన్ని మార్చిన రోజు అది అని పేర్కొన్నారు. -
విజయ్ చివరి సినిమా! థియేటర్లో త్రిష
స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే అభిమానులు థియేటర్లకు క్యూ కడతారు. అలాంటిది దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు చేసిన చివరి చిత్రం 'గోట్' నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో అటు సోషల్ మీడియాలో ఇటు థియేటర్ల వద్ద సందడి నెలకొంది. హీరోయిన్ త్రిష సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసింది. నిర్మాత అర్చన కలపతితో కలిసి చెన్నైలోని ఓ థియేటర్లో గోట్ వీక్షించింది.గెస్ట్ రోల్ఇకపోతే గోట్ సినిమాలో త్రిష అతిథి పాత్రలో మెరిసింది. ఓ పాటలో విజయ్‌తో కలిసి స్టెప్పులేసింది. కాగా వీరి జంటకు పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. 2004లో గిల్లి మూవీలో విజయ్- త్రిష జంటగా నటించారు. ఈ జోడీ అభిమానులకు తెగ నచ్చేసింది. తిరుపాచి, ఆతి, కురువి చిత్రాల్లోనూ ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. ఇటీవల వచ్చిన లియో మూవీలోనూ విజయ్‌తో కలిసి యాక్ట్ చేసింది. ఇప్పుడు గోట్లో ఓ పాటలో మెరిసింది. Engada Andha Yellow SareeBTS of #Trisha From #Matta Song#TheGreatestAllTime #TheGOAT pic.twitter.com/iUUxJ52xAq— RINKU (@RinkuRv03012001) September 5, 2024చదవండి: గోట్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
భారీ బడ్జెట్ సినిమా నుంచి 'త్రిష' ఫస్ట్ లుక్ రిలీజ్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటి స్తున్న తాజా చిత్రం 'విడాముయర్చి'. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మి స్తోంది. తరచూ వార్తల్లో ఉంటున్న చిత్రం నుంచి తాజాగా త్రిష ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.మొదట ఈ చిత్రానికి విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, దర్శకుడు మగిళ్ తిరుమే ణి చెప్పిన కథ నచ్చడంతో అజిత్ ఆయన దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విడాముయర్చి చిత్రంపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి. తాజాగా విడుదలైన త్రిష ఫస్ట్ లుక్‌లో చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. ఓ రెస్టారెంట్లో త్రిషతో పాటు అజిత్ ఉన్న ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. ఇందులో అజిత్‌కు సతీమణిగా ఆమె కనిపించనుంది.కాగా చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నారు. ఇంతకుముందు దీపావళికి విడుదలైన ఈయన చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను వారు కొనసాగిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న దీని వ్యాపారం హాట్ హాట్‌గా జరుగుతున్నట్లు ప్రచారం. కర్ణాటకలో విడాముయర్చి చిత్రం వ్యాపారం రజనీకాంత్, విజయ్‌ల చిత్రాలను మించి పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. #VidaaMuyarchi 🌟🧿#EffortsNeverFail pic.twitter.com/mTvEtUHuEN— Trish (@trishtrashers) July 19, 2024 -
అందానికే అసూయ పుట్టించే బ్యూటీ క్వీన్ (ఫోటోలు)
-
'అమ్మోరు తల్లి'గా వచ్చేస్తున్న త్రిష
నయనతార 'అమ్మోరు తల్లి'గా ప్రేక్షకులను మెప్పించింది. ఆర్.జె.బాలాజీ, శరవణన్ డైరక్టర్స్‌గా తొలి సినిమాగా 'అమ్మోరు తల్లి'ని తెరకెక్కించారు. తమిళంలో 'మూకుత్తి అమ్మన్'గా తెరకెక్కిన సినిమాకు ఇది డబ్బింగ్. 2020లో డిస్నీ+హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదల అయింది. ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు మరో సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి. ఇందులో ముక్కుపుడక అమ్మోరుగా నయన్ మెప్పించింది. అయితే, సీక్వెల్‌గా తెరకెక్కబోతున్న చిత్రంలో త్రిషకు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నాయి. త్రిష ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకు ఇలాంటి సినిమా ఇదే మొదటిది అవుతుంది. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. విశ్వంభర,థగ్‌లైఫ్, రామ్ వంటి చిత్రాల షూటింగ్ పనుల్లో ఆమె ఉంది. -
15 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ అడుగుపెడుతున్న త్రిష
సౌత్ ఇండియాలో ప్రస్తుతం అగ్ర కథానాయకిగా రాణిస్తున్న త్రిష. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ ఏక కాలంలో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే, తాజాగా మరోసారి బాలీవుడ్లో రీఎంట్రీకి సిద్ధ అయినట్లు తెలుస్తోంది. త్రిష 2010లో కట్టా మీఠా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌కు జంటగా త్రిష నటించింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో త్రిష కూడా ఇక అటు వైపు దృష్టి సారించలేదు. అలాంటిది సుమారు 15 ఏళ్ల తరువాత మరోసారి ఈ భామకు బాలీవుడ్ అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు సల్మాన్‌ఖాన్ సరసన న టించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కాగా 40 ఏళ్లను పూర్తి చేసుకుని 41వ సంతంలోకి అడుగు పెట్టిన త్రిష ఇప్పటికీ అవివాహితే. కాగా ఇటీవల ఈమె ఆధ్యాత్మికంపై దృష్టి మళ్లించినట్లు స్పష్టం అవుతోంది. ఇందుకు కారణం గత ఏడాది త్రిష తన పుట్టిన రోజును షిరిడీలో జరుపుకున్నా రు. కాగా ఈ ఏడాది నటుడు విజయ్ చెన్నైలో నిర్మించిన సాయిబాబా మందిరంలో చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా త్రిష సాయిబాబా భక్తురాలిగా మారినట్లు తెలుస్తోంది. ఇకపోతే తనకు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఎక్స్ మీడియా ద్వారా ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. సుమారు 25ఎళ్లుగా లైమ్‌లైట్‌లో ఒక హీరోయిన్ కొనసాగడమంటే అంత సులభం కాదు. నేడు కొందరు హీరోయిన్లు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతున్నారు. తమలో ఎంతో అందంతో పాటు టాలెంట్ దాగి ఉన్నా కూడా సరైనా అవకాశాలు లేక తమ సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నాటి నుంచి నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ ఏమాత్రం తగ్గకుండా రెండు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తమిళం తెలుగు హిందీ కన్నడం భాషల్లో ఇప్పటికీ తిరుగులేని హీరోయిన్గా రాణిస్తున్న త్రిష నేడు (మే4న) 41వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించిన త్రిష. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చదువుకున్నారు. తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా 1999 మిస్ చెన్నై పోటీలో విన్నర్‌గా తనేంటో చాటిచెప్పింది. అలా అదే ఏడాదిలో 'జోడి' (తమిళ్) సినిమాతో తెరంగేట్రం చేశారు. అందులో హీరోయిన్ సిమ్రన్‌కు స్నేహితురాలిగా నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో త్రిషకు కూడా సరైన గుర్తింపు వచ్చింది. అలా సౌత్ ఇండియాలోని అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. ఈ క్రేజ్‌తో సూర్యతో హీరోయిన్గా నటించే ఛాన్స్ ఆమెకు 'మౌనం పెసియదే' తొలిసారిగా వరించింది. అక్కడి నుంచి 'నీ మనసు నాకు తెలుసు' తో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఇందులోని ఒక సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు త్రిష బాగా కనెక్ట్ అయ్యారు.వర్షంతో మార్పు2004లో ప్రభాస్‌తో 'వర్షం' సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్‌నే మార్చేసింది. శైలజ అలియాస్ శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులను మాయ చేశారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ,బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో త్రిష చేరిపోయారు.త్రిషకు బాగా నచ్చే హీరోలుతెలుగులో సీనియర్ హీరోల నుంచి కొత్త హీరోల వరకు అందరితోనూ నటించే అవకాశం ఆమె దక్కింది. స్టార్‌డమ్‌ని పట్టించుకోను అని చెబుతున్న త్రిష కొత్త హీరోలతో కూడా కలిసి నటించారు. నటిగా కెరీర్ ఆరంభించి ఇన్నేళ్లవుతున్నా అవకాశాలు అందుకోవడంలో త్రిష ముందు వరుసలోనే ఉంటున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్గా లియో సినిమాలో మెప్పించిన త్రిష, ప్రస్తుతం చిరంజీవి, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా బిజీగా ఉంటున్నారు. త్రిషకు బాగా నచ్చే హీరోలు కమల్ హాసన్, వెంకటేశ్, ఆమీర్ ఖాన్. ఇదే విషయం ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోయిన్స్‌లలో సిమ్రన్, ఏంజలినా జోలి అంటే ఆమెకు చాలా ఇష్టం.త్రిషపై ఉన్న వివాదాలుఇన్నేళ్ల పాటు త్రిష హీరోయిన్గా ఉన్నా కూడా ఆమెపై పెద్దగా వివాదాలు చుట్టముట్టలేదు. రూమర్స్ విషయంలో కూడా కాస్త తక్కువేనని చెప్పవచ్చు.2016లో ఒకసారి తమిళుల సంప్రదాయమైన జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఫైనల్‌గా కమల్‌హాసన్ ఎంట్రీ ఇచ్చి ఆ గొడవకు ఫుల్స్టాప్ పెట్టేశారు. ఆమెను బాధపెట్టొద్దని ఆయన తమిళ ప్రజలను కోరారు. త్రిష వ్యక్తిగతం గురించి కూడా ప్రచారం జరిగింది.ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిందని గతంలో త్రిష గురించి ప్రచారం జరిగింది. కానీ, ఆమె కుంగిపోలేదు. అది నా వ్యక్తిగత విషయమని చెప్పిన త్రిష వాటన్నింటినీ అధిగమించి సినిమాలపైనే తన దారిని మార్చుకుంది. అయితే, తన వివాహం గురించి ఇప్పటికీ కూడా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 41 ఏళ్ల ఈ బ్యూటీగా ఆ ఘడియలు ఎప్పుడు వస్తాయో చూడాలి.కోట్ల రూపాయల ఆస్తులుహీరోయిన్గానే కాకుండా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా త్రిష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఒక్కొ సినిమాకు సుమారు. రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం త్రిషకు చెన్నైలో రూ. 15 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. హైదరాబాద్‌లో కూడా త్రిషకు రూ. 8 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో కొన్నిప్లాట్స్ కూడా త్రిషకు ఉన్నాయని సమాచారం. రూ. 5 కోట్ల వరకు విలువ చేసే పలు లగ్జరీ కార్లు ఆమె వద్ద ఉన్నాయట. ఇలా తన 25 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటి వరకు సుమారుగా రూ. 120 కోట్లకు పైగానే ఆస్తులు కూడాబెట్టినట్లు తెలుస్తోంది. -
Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
-
స్టార్ హీరోలతో జోడి కడుతున్న త్రిష
-
చిరుతో 'విశ్వంభర'.. త్రిష డబుల్ ధమాకా?
హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకు లకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. 2006లో విడుదలైన ‘స్టాలిన్’ సినిమా తర్వాత రెండోసారి ‘విశ్వంభర’ కోసం జోడీ కట్టారు చిరంజీవి–త్రిష. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ చిత్రమిది. ఇందులోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని టాక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో త్రిష ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఆమెపాత్రకు కథలో చాలాప్రాధాన్యం ఉందట.. అందుకే డబుల్ రోల్ చేస్తున్నారని భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. -
త్రిష,చిరంజీవి కేసు విషయంలో మన్సూర్ అలీఖాన్‌కు ఊరట
కోలీవుడ్ నటుడు,రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా ఖండించారు. అయితే నటి త్రిషకు మహిళా కమిషన్ సభ్యులు అండగా నిలిచి, చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటుడు మన్సూర్ అలీఖాన్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే త్రిషకు టాలీవుడ్ నటుడు చిరంజీవి మద్దతు పలికారు. వారిద్దరూ మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నటి త్రిష, కుష్బూ, చిరంజీవి ప్రవర్తించారంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్ విచారించిన న్యాయస్థానం నిజానికి నటి త్రిషనే మీపై పిటీషన్ దాఖలు చేయాలని మందలించడంతోపాటు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను నటుడు మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని చైన్నె, అడయార్ క్యాన్సర్ ఆస్పత్రికి అందించాలని ఆదేశించింది. అయితే తనపై విధించిన జరిమానాలు రద్దు చేయాలంటూ నటుడు మన్సూర్ చైన్నె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయనపై విధించిన రూ.లక్ష జరిమానాను రద్దు చేస్తూ, ఈ కేసును కూడా కొట్టివేయాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది. -
ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
త్రిష జీవితంలో సమస్యలు అనేవి కొత్తేమీ కాదు. ఈమె ఒక్కో స్టేజ్‌లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని ఎదురొడ్డి ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య వరుస ఫ్లాప్‌లతో కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ చైన్నె సుందరి ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ తరువాత లియో చిత్రంలో విజయ్‌తో జతకట్టి కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రం, కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్ వంటి భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (ఇదీ చదవండి: జయలలిత ఆస్తుల వేలం.. కోర్టుకు చెల్లించాల్సిన డబ్బు ఎంత..?) తాజాగా టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తి గత ఆరోపణలకు గురవుతున్నారు. అన్నాడీఎంకే బహిష్కరణ కార్యనిర్వాహకుడు ఏవీ రాజు త్రిషను అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది త్రిషను మానసిక క్షోభకు గురి చేసిన విషయం తెలిసిందే. కూవత్తూర్ సంఘటన సమయంలో నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్, నటి త్రిషతో పాటు మరికొందరిని గెస్ట్ హౌస్‌కి పంపారన్నదే ఏవీ.రాజు వేసిన నింద. దీన్ని తీవ్రంగా ఖండించిన త్రిష అతనిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్, సముద్రఖని, నాజర్ త్రిషపై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దీనికి స్పందించిన త్రిష తనకు సపోర్ట్‌గా నిలిచిన ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు. -
త్రిషపై మరోసారి అలాంటి కామెంట్స్.. ఇంతటి నీచానికి దిగుజారుతారా?
గతేడాది లియోతో సూపర్ హిట్ కొట్టిన భామ త్రిష. విజయ్ సరసన హీరోయిన్గా నటించి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదస్పదమయ్యాయి. ఏకంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. అయితే తాజాగా అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు చేసిన అసభ్యకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్రిషపై ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ అతనిపై మండిపడుతున్నారు. తక్షణమే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో త్రిషకు పలువురు అండగా నిలుస్తున్నారు. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలవుతోంది. (ఇది చదవండి: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!) తాజాగా ఈ విషయంపై హీరోయిన్ త్రిష స్పందించింది. ఫేమస్ కావడం కోసం ఏంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు అవీ.. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ తదుపరి చర్యలు తీసుకుంటుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏవీ రాజు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై అసభ్యంగా మాట్లాడిన ఏవీ రాజును అరెస్ట్ చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై నటీనటుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బహిరంగంగా సినీ పరిశ్రమలోని సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. WTF this Trisha should file legal action against him,nowdays these guys are behaving very cheaply #Trisha | #TrishaKrishnan pic.twitter.com/Ip1ZClB8xS — Sekar 𝕏 (@itzSekar) February 20, 2024 It's disgusting to repeatedly see low lives and despicable human beings who will stoop down to any level to gain https://t.co/dcxBo5K7vL assured,necessary and severe action will be taken.Anything that needs to be said and done henceforth will be from my legal department. — Trish (@trishtrashers) February 20, 2024 வன்மையாக கண்டிக்கிறேன்.. எந்த ஆதரமுமின்றி பொது வெளியில் திரைத்துறையினர் பற்றி பெயர் சொல்லி அவதூறு கிளப்பிய இவரை சட்டமும் காவல்துறையும் உரிய நடவடிக்கை எடுக்க வேண்டும்... @VishalKOfficial @Karthi_Offl நடிகர் சங்கம் இதற்கு தகுந்த பதிலும் நடவடிக்கையும் எடுக்கும் என நம்புகிறேன் https://t.co/fRNYxH5DAV — Cheran (@directorcheran) February 20, 2024 Shocked & disgusted by the behaviour of Ex AIADMK functionary A. V. Raju for making unwarranted , baseless, loose and completely false allegations about Trisha. It is 2024; we talk about women empowerment & equality - why drag an unrelated person into personal mud slinging. There… — Aditi Ravindranath (@aditi1231) February 20, 2024 -
'విశ్వంభర'లో అడుగు పెట్టిన టాప్ హీరోయిన్.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. తాజాగా ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు. చాలా రోజుల నుంచి విశ్వంభర చిత్రంలో త్రిష నటించబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసింది. తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ నుంచి ఇలా అధికారికంగా ప్రకటన రావడం జరిగింది. గతంలో వీరిద్దరూ స్టాలిన్ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ వస్తుంది. ఇందులో అనుష్క, హనీ రోజ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా త్రిష కూడా తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. '18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదీ నాకు ఎంతో గొప్ప గౌరవం. చిరు సార్ నాకు హృదయపూర్వక స్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు.' అని తెలిపింది. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్ కీరవాణి అందిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానుంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) What an honour it is to reunite with the one and only MEGASTAR after 18 years.Thank you so much for the warmest welcome Chiru sir❤️@KChiruTweets https://t.co/PSrJ4O7LEW — Trish (@trishtrashers) February 5, 2024 -
అజిత్‌తో ఇబ్బంది పడుతున్న త్రిష
అతివృష్టి, అనావృష్టి అన్నచందంగా ఉంది నటి త్రిష పరిస్థితి. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ చైన్నె బ్యూటీ. మొదట సహాయనటిగా సినీ రంగప్రవేశం చేసి ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా సత్తా చాటుకుంటున్నారు. ఒకానొక సమయంలో లేడీ ఓరియెంట్ కథా చిత్రాల్లో నటించిన ఈమెకు ఆ తరహా చిత్రాలు అచ్చి రాలేదు. అంతేకాదు అలాంటి చిత్రాలు అపజయాలను చవిచూడడంతో త్రిష కెరీర్ డౌన్ అయిపోయింది. అలా అవకాశాలే లేక ఇంట్లో కూర్చున్న ఈ బ్యూటీకి నాలుగు పదుల వయసు మీద పడ్డ తర్వాత ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో దర్శకుడు మణిరత్నం నటిగా పునర్ జన్మను ఇచ్చారనే చెప్పాలి. అలా త్రిష మళ్లీ పీక్‌లోకి వచ్చారు. ఆ తర్వాత విజయ్‌తో జతకట్టిన లియో చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్‌కు జంటగా థక్స్‌లైఫ్ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించే అవకాశం వచ్చినదన్నది తాజా సమాచారం. ఈమె ఇంతకుముందు స్టాలిన్ చిత్రంలో చిరంజీవితో జత కట్టారన్నది గమనార్హం. ఇలా వరుసగా అవకాశాలు వెల్లువెత్తడంతో త్రిష పరిస్థితి అతివృష్టిగా మారింది. ఎందుకు ప్రధాన కారణం అజిత్ సరసన నటిస్తున్న విడాముయర్చి చిత్రం అని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో త్రిషకు తలనొప్పిగా మారిందట. ఇతర చిత్రాలకు కేటాయించిన కాల్షీట్స్కు ఆటంకం కలుగుతోందని త్రిష వాపోతున్నారట. ఏమిట్రా బాబు ఇలాంటి పరిస్థితి బాగున్న సమస్యే, బాగా లేకపోయినా సమస్యేనా అంటూ త్రిష టెన్షన్ అవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.