అడ్డు గడులలో నెం. 52 | Trisha’s name features on NY Times puzzle | Sakshi
Sakshi News home page

అడ్డు గడులలో నెం. 52

Published Tue, Nov 5 2024 10:54 AM | Last Updated on Tue, Nov 5 2024 10:54 AM

Trisha’s name features on NY Times puzzle

పేపర్‌లో మన ఊరి పేరు కనిపిస్తేనే ఆసక్తిగా చూస్తాం కదా, అలాంటిది ఏకంగా మన పేరే పేపర్‌లో వస్తే? ఊరంతా తిరిగి ఆ సంతోషాన్ని తలా ఇంత పంచి పెడతాం. త్రిష కూడా మొన్న ఆదివారం (3 నవంబర్‌) అటువంటి సంతోషంలోనే తేలియాడారు. పైగా ఆమె పేరు వచ్చింది ఇంటర్నేషనల్‌ పేపర్‌లో. అది కూడా ప్రసిద్ధ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ మేగజీన్‌ లో! ఫిల్మ్‌ న్యూస్‌ కేటగిరీలో ఆమె పేరు వచ్చుంటే.. సినీ స్టార్‌ కనుక రాసి ఉంటారని అనుకోవచ్చు. 

కానీ త్రిష పేరు ప్రస్తావనకు వచ్చింది న్యూయార్క్‌ టైమ్స్‌ 1942 నుంచీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న ‘క్రాస్‌వర్డ్‌ పజిల్‌’లో! పజిల్‌లో నిలువు గడులు, అడ్డు గడులు ఉంటాయి కదా, అడ్డు గడులలోని 52 వ ‘క్లూ’గా ‘యాక్ట్రెస్‌ కృష్ణన్‌  ఆఫ్‌ సౌత్‌ ఇండియన్‌  సినిమా’ ఎవరు అని అడిగారు. ఇంకెవరు? త్రిషనే! ఆమె పూర్తి పేరు త్రిషా కృష్ణన్‌ . ఇకనేం.. 52 అడ్డులోని ఆరు గడులను టి.ఆర్‌.ఐ.ఎస్‌.హెచ్‌.ఎ. అని తన పేరుతో నింపి, ఆ పజిల్‌ స్క్రీన్‌  షాట్‌ను ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు త్రిష. 

‘‘నా పేరు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిందహో’’.. అంటూ ‘‘ఒకే బై, షోయింగ్‌ పూర్తయింది’’ అని ఓ సరదా కామెంట్‌ కూడా ఆ పోస్ట్‌కి జత చేశారు. ఈ సంతోషం అక్కడితో ఆగలేదు. సమంతా కూడా షేర్‌ చేసుకున్నారు. ‘‘నువ్వు క్వీన్‌  త్రిషా’’ అన్నారు. అందుకు త్రిషా ‘‘ఆ.. సామ్‌.. మనిద్దరం ఒకటే’’ అని రిప్లయ్‌ ఇచ్చారు. అవును, వీళ్లిద్దరూ ఒకటే. చిన్న చిన్న సంతోషాలకు కేరింతలు కొట్టే చిన్న పిల్లల మనసున్న సెలబ్రిటీలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement