Magazine
-
‘పెన్షన్’ పత్రిక
ఆ జ్ఞానము అచట ఉన్నది. పండిన అనుభవాల రాశి పోగుబడి ఉన్నది. వేళ్లకు వయసు వచ్చినది కాని కలానికి కాదు సుమా. విశాలమైన తలపులు చెప్పవలసిన సంగతులు ఒకటా రెండా? మేము విశ్రాంతిలో లేము. అక్షరాల ఆలోచనల్లో ఉన్నాం. గత యాత్రకు కొనసాగింపులో ఉన్నాం. మేము నడవవలసిన దారి తెరిచిన పుటల మీదుగా సాగుతుంది. పాఠకుల మనోరథాల మీదుగా విహరిస్తుంది. ఊహలకు ఊపిరి పోస్తే మాకు ఆయువు. పాత్రలతో సంభాషిస్తే మాకు ఉత్సాహం. మేమెవరమో మీకు తెలుసా? మా లోపల ఏముందో మీకు ఎరుకేనా?‘మా నాన్న అదృష్టవంతుడు. చనిపోయే వరకూ రాస్తూనే ఉన్నాడు. రాసిన దాని కోసం పత్రికలు ఎదురు చూశాయి. ప్రచురించి మర్యాద చేశాయి. ఆయన రచయితగా జీవించి రచయితగా మరణించాడు. నేనూ ఉన్నాను. కథ రాస్తే ఎక్కడ ఇవ్వను. రాయకుండా ఎలా బతకను?’ పెన్షనర్ వయసున్న ఒక రచయిత అన్న మాటలు ఇవి. నేటి తెలుగు రాష్ట్రాల్లో యాభైలు దాటి, రచనాశక్తితో ఉన్న వారి ఆవేదనంతటికీ ఈ మాటలు శోచనీయమైన ఆనవాలు.ఒక రచయిత పరిణతి యాభైల తర్వాతే రచనల్లో వ్యక్తమవుతుంది. అనుభవాల సారము, వాటి బేరీజు, వాటిపై వ్యాఖ్యానం, వాటితో నేటి తరానికి చెప్పవలసిన జాగరూకత, వాటి నమోదు, తద్వారా బలపడే సారస్వత సంపద... ఏ జాతికైనా పెను పెన్నిధి. దురదృష్టం, కాలమహిమ తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు కనుమరుగైపోయాయి. సాహిత్య పత్రికలు, చిన్న పత్రికలు, వీక్లీలు.... ఎంత రాసినా వేసే మంత్లీలు... బైమంత్లీలు... క్వార్టర్లీలు.... ఏ బస్టాండ్ బడ్డీకొట్టులోనో అందుకునే అపరిచిత పాఠకుడికై వాటి అందుబాటు... ఎక్కడ... ఎక్కడా? ‘మీ రచనను ప్రచురణకు స్వీకరించాం’ కార్డు ముక్క, దానికి ఫలానా చిత్రకారుడు వేసే గొప్ప బొమ్మ, పోస్టులో పత్రిక అందడం, మరికొన్ని రోజులకు సంబరంగా సంతకం చేసి తీసుకునే పారితోషికపు మనీఆర్డర్... ఎక్కడ... ఎక్కడా? కంప్యూటర్ స్క్రీన్ కో, సెల్‌ఫోన్ కురచదనానికో సంతృప్తి పడే నేటి పాఠకులు ఉండుగాక. కాని పెద్దలు ఉన్నారు. కాగితపు వాసనను పీల్చి, అక్షరాలను వేళ్లతో తడిమిగాని సంతృప్తి పడని ప్రాణాలున్నాయి. కట్టె కొట్టె తెచ్చేలా కాకుండా, అరచేత్తో లోడేదే లోతు అనుకునే రచయితల్లా కాకుండా, తమ రచనలతో చెరువులనూ, కడలి కెరటాల సంచలనాత్మలనూ సృష్టించిన చేతులు ఉన్నాయి. వారి సంగతి ఏమిటి? వారికేదైనా పెన్షన్ కావాలని ఎవరైనా ఆలోచించారా?1970–90ల మధ్య కాలంలో కథ అంటే కనీసం ఐదారు పేజీలు ఉండేది. పెద్దకథలు ఉండేవి. నవలికలు, సీరియల్ నవలలు, గల్పికలు, ప్రహసనాలు, ఆత్మకథలు, జ్ఞాపకాలు, సంవాదాలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు... ఇవన్నీ రాసినవారు, ఇచ్చినవారు ఇంకా ఉన్నారు. జనాభా లెక్కల్లో గల్లంతై పోలేదు. వీరు రాయగా చదివి అభిమానులు అయినవారు ఉన్నారు. బండలై పోలేదు. ఈ రాసే వారు రాయడానికీ... ఈ చదివేవారు అనుసంధానమై చదవడానికీ... అవసరమైన వేదికలే తెలుగునాట లేవు. ఈ రచయితలకు, పాఠకులకు ఒక పెన్షన్ స్కీమ్ కావాలి. వీరి అనుభవాన్ని, ఆత్మగౌరవాన్ని మన్నిస్తూ వీరి రచనలకు చోటు కల్పించడం కోసం ఒక పథకం కావాలి. కొత్త తరాలతో పోటీ పడుతూ డిజిటల్ క్యూలలో దూరి బుకింగ్ కోసం వీరు చేయి దూర్చరని గ్రహించడం అత్యవసరం. అదొక్కటేనా? పునఃపఠనం సంగతో? ఎంతో రాసి, ఎన్నో క్లాసిక్స్ ఇచ్చిన రచయితలను రీవిజిట్ చేయడానికి ఒక్క కాగితపు పుట ఇంత పెద్ద జాతికి లేకపోవడం విషాదమా, కాదా?‘ఏజ్‌లెస్ ఆథర్స్’... 65 ఏళ్లు ఆపైన వయసున్న వారి రచనలనే క్రమం తప్పకుండా వెలువరించే సంకలనాల వరుస ఇది. ‘క్రోన్ : విమెన్ కమింగ్ ఆఫ్ ఏజ్’... ఇది అరవైలు దాటిన స్త్రీల రచనలు ప్రచురించే పత్రిక. ‘పాసేజర్’... యాభై ఏళ్ల తర్వాత రాసిన వారివే ఈ పత్రిక వేస్తుంది. ‘ఎనభై ఏళ్లు పైబడిన వారు రాయట్లేదే అని చింతించాం. కాని ఇప్పుడు ఆ వయసు వారూ వచ్చి రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘రీ ఇన్వెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్’... స్లోగన్‌తో యాభైలు దాటిన రచయితల రచనలు మాత్రమే వేసే పత్రికలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. వారి మానసిక ఆనందానికి అవి అవసరం అని ఆ యా దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఇతర భాషల్లో పత్రికలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వారికి ఈ బెడద తెలియదు. తెలుగు సీనియర్స్కే సమస్య అంతా! వీరు చదివిన వందల పుస్తకాల నుంచి విలువైన మాటలు చెప్పాలా, వద్దా? వేయిదీపాల మనుషులు వీరు అనే సోయి మనకు ఉందా?‘రాయాలంటే ఎక్కడ రాయాలి’ అనుకునే కవులు, రచయితలు, ఆలోచనాపరులు, విమర్శకులు, నాటకకర్తలు, వ్యంగ్య విన్యాసకులు నేడు ఎందరో నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలి వెలితితో ఉన్నారు. వీరి సృజన సన్నగిల్లలేదు. మరింత విస్తరణను కోరుకుంటోంది. వీరిని నిర్లిప్తంగా ఉంచడమంటే కనబడని గోడల జైలులో పెట్టడమే! సాంస్కృతిక ఆస్తిపత్రాలు గల్లంతు చేసుకోవడమే. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు సంపాదక సిబ్బందితో ఏ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ బాధ్యత గల్ల సంస్థైనా ప్రతి నెలా ‘పెన్షన్ పత్రిక’ నడపవచ్చు. పెన్షన్లు వ్యక్తిగత హితానికైతే ఇది సామాజిక హితానికి! అమరావతి, మూసీల ఖర్చులో దీనికై వెచ్చించవలసింది 0.0000001 పైసా. ఈ కొత్త పెన్షన్ కోసం డిమాండ్ చేద్దాం! -
యువ కథ: సిల్లు పడ్డ సీర
‘వురెయ్ బామ్మర్ది ఇయ్యాలేటో వొల్లంత పచ్చి పుండు నాగుందిరా’ అప్పుడే నిద్రలేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య ‘ఆ.. నిన్నంతా పనుల్తోటి అలిసిపోయినావు కద బావా. మరామాతరం సలుపులుంటాయినే’ అన్నాడు. ‘ఆ.. అంతేలాగుందిరా బాబూ. ఒలే! బూలచ్చిమి.. బూలచ్చిమీ..’ ఆమె పలికే వరకూ పిలుస్తూనే వున్నాడు ఆదిబాబు. ‘ఆ’ అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ‘యేడి నీలెట్టే సానం సేత్తాను’ అని ఒక కేక పెట్టాడు. ‘నానంత కాలీగేటి నేను. నువ్వేల్లెట్టుకో’ లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ‘ఆ.. యేటి దీని తల పొగరూ’అనుకుంటూ పక్కనే వున్న వీరయ్య వైపు చూసి ‘అదేట్రా మీయప్ప తెల్లారికే అలాగరత్తంది. లెగిసాకా కూడా సుసేను.. యేటో సెత్రువుని సూసినట్టు సూసింది. యేతంతావు కారనవు?’ అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ ‘యేటి బావ నిన్న వొచ్చినోలు దెగ్గర యెతేన నాగేవేటి పేకాట్ల’ అని రహస్యంగా అడిగాడు. అడ్డంగా తలాడిస్తూ ‘మీయప్ప వల్ల సుకం నేదు నాకు. ఆగు ఇప్పుడే వత్తాను’ అంటూ లుంగీ ఎత్తి పట్టి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందు వైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్ బకెట్‌లోని నీళ్లని మొహం మీద జల్లుకుని, పుక్కిలించి ఉమ్మి, గూట్లో వున్న వేపపుల్లని నమిలి పిప్పిచేసి వదిలాడు. దండెం మీద తువ్వాలు కోసం వెదుకుతూ ఆ దండెం మీదే ఆరేసున్న చీరని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు. ‘బావా.. ఇగో తువ్వాలు’ పిల్చాడు వీరయ్య. ఆ పిలుపు వినబడనట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అతని బుర్రలో వేల ప్రశ్నలు. ‘యేటలగ కొయ్యలాగ కదలడు’ అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. ‘అలగ వుండిపోనవు యేటైంది బావ’ అడిగాడు. ‘యేటి నేదురా.. ఈ సీరేటి ఇక్కడుందని సూత్తన్ను. ఇది మాయమ్మ సిర.. దీన్ని ఇక్కడెవులు యేసేరూ?’ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్టు మొహం పెట్టి ‘నిన్నే కదేటి బావా! మీయమ్మ సవస్రికవైంది. యేదో అవస్రానికి తీసుంతారు’ అన్నాడు. ‘ఎంత అవసరం వుంతే మాత్రం పెట్టెలున్న అడుగు సీరే తియ్యల? ఇగో సూడు ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఒలే బూలచ్చిమీ.. బూలచ్చిమీ’ భార్యని ఏకధాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా ‘ఇప్పుడు దాన్నేల పిలత్తన్నవు బావా పల్లకో’ అన్నాడు. ‘మాయమ్మకి ఇట్టవైన సీరరా ఇది. దాని గేపకంగా దాసుకున్నాను. దాన్నిప్పుడు బైటకి నాగే అవసరం యేటొచ్చింది. దానిక్తోడు ఈ సిల్లోటి. ఇంత నిర్లక్సం యేటి దానికి’ అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు ‘ఓలి బూలచ్చిమీ! ఇనబడట్నేదేటే’ ఈసారి అతని కఠం ఖంగుమంది.ఆ అరుపులని ఆదిబాబు గోలని గమనిస్తున్న భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళలో. అలా తనని చూడగానే అడగడానికి లక్ష ప్రశ్నలున్నా వాటన్నింటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపార చూసి, నిదానంగా అడిగింది ‘యేటి నీ కాకి గోల?’ ఆ మాటకి ఆదిబాబు కోపం నషాలానికెక్కింది.‘ఈ సీర బైటకెలగొచ్చింది?’ భూలక్ష్మి మొఖం చిట్లిస్తూ ‘ఏమో నాకేటి తెలుసు?’ అంది. ‘ఏటే ఆ సమాదానము.. ఈ ఇంట్ల యెంతమంది వున్నారు వచ్చి తీసీడానికి. వున్నదే మనిద్దరం. తీత్తే నువ్వు తియ్యాలి లేదంటే నాను తియ్యాలి. సక్కగ సెప్పు యెలా తీసేవో’‘ఏటి యకసెక్కాల గుందా? నాకు తెలీదని సెప్తున్ను కదా! నిన్న ఇల్లంతా సుట్టాలే! ఎవులు తీసేరో? యానికి తీసేరో?’ అంది. ‘యెంత నిర్లక్సమే నీకు. మాయమ్మ సీర, దానికి ఇట్టవైన సీర.. దాని గేపకార్దం నాను దాసుకుంటే దాన్ని బైటికి నాగిందే కాకంట దానికి సిల్లు కూడ యెట్టారు. ఇది ఎవులు ఎందుకోసం సేసేరో నాకు తెలిసీవరకు నేనొగ్గను’ తెగించినట్టే అన్నాడు ఆదిబాబు.భూలక్ష్మి చీర కొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బైటకొచ్చింది. ‘యేటేటి.. మల్లి సెప్పు. ఈ సీరంటే నీకిట్టవా.. దీన్ని మీయమ్మ గేపకంగా దాసుకున్నవా.. ఓలమ్మొ ఓలమ్మో నాను ఎంత గుడ్డిదాన్ని.. నా మొగిడి గొప్ప హుదయం సూడలేకపోన్ను. ఎప్పుడూ తాగుబోతు నా కొడుకని తిట్టుకునీదాన్ని గానీ ఇంత గొప్పోడని తెలిత్తే దండేసి దండవెట్టీకపోనా’ అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు ‘నంగనాసిదానా నాటకాలాపే నీయమ్మ.. ఒల్లెలగుందే’ అన్నాడు ఆమె పైపై కెళ్తూ.‘నేకపోతే ఏట్రా సెత్తనాకొడకా... పెపంచకంలో నీదే గొప్ప పేమ అన్నట్టు హెచ్చులు పోతన్నవు. నువ్వడిగేవి దిక్కుమాలిన పెస్నలు. మల్లీ దానికో సమధానం కూడా సెప్పాలా..థూ’ ఆవేశంతో వూగిపోయింది. ‘అవునే సెప్పాలి. నువ్వు మగా ఇల్లాలివని నీ పీలింగ్ కదా.. ఇందల సూపించే నీ ఇల్లాలితనం. ఇంట్ల యేటి జరుగుతందో ఎవరేటి తీస్తన్రో తెలీకుండా బతకతంది.. ఇదొక ఇల్లాలు... దీనికో సపోర్టు’ఆ మాటకి భూలక్ష్మి నవ్వీ ‘పోనీ నానైతే మగా ఇల్లాలిని కానులే. నువ్వయితే గొప్ప ఈరుడివి కదా.. మరి నువ్వు కానుకోలేకపోనవా ఆ సీర ఎవులు తీసేరని. నీకు ఈ సీర మీదున్న ఇట్టానికి అలగ దాని ముందే కూకోలేకపోనవా? దాన్ని నీ బుర్రమీదెట్టుకొని వూరేగలేకపోనవా?’ అంది భూలక్ష్మి. ఆదిబాబుకి రోషం పొడుచుకొచ్చింది. ‘ఒలే నన్ను రెచ్చగొడితే మనిసిని కాను..’ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ‘నువ్వెలగు మనిసివి కాదన్న ఇసయం నాకు తెలుసులే ఇంక పల్లకో. మీయమ్మ బతికున్నప్పుడు సక్కగ సూసుకోడం సేతగానేదు గనీ ఇప్పుడేదో పేమ కారిపోతన్నట్టు గుండైపోతండు’ అందామె గుమ్మంలో వున్న అరగుపైన కూర్చుంటూ. ‘మగాడి పేమలన్నీ బైటికి అగుపిత్తాయేటే.. మనసులుంటయి గనీ’ ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ‘ఆ.. పేమొకటే దాసుకున్నవా.. యేరే రగస్యాలు కుడా దాసినావా ఆ మనసలా’ ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబూ ఆవేశంగా ముందుకు ఊరికాడు. ‘లక్స తొంబై దాసుకుంతానే నీకెందుకు? ముందీ సీర ఇసయం తేల్సు’ అంటూ ఆమె దగ్గరకి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ‘యేట్రా నీ గోల. ఆడోలు సీర్లు ఎందుకు తీత్తారు కట్టుకోడానికి తీత్తరు. అదెంత పాత సీరో కట్టుకోబోతే పుసుక్కున సిరిగుంటది. ఇంత సిన్న ఇసియానికా యానికలగ రంకె లేత్తన్నవు’ చిరాకుగా మొఖం పెడుతూ అంది.ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె భగ్గున మండింది. ఏం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా వున్నాడు. కాసేపటి తర్వాత ‘యేవి ఈ ఆడోలికి సీర్లే కరువైపోనాయా. మాయమ్మ సీరే కావల్సొస్సిందా?’ అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ‘యేటి రా నాయన. మీ యమ్మ సీరలోనున్న మగత్యవు. ఏటి దాసిస్సేవేటి ఈ సీరల ఇలగ గింజీసికుంతన్నవు’ భూలక్ష్మీ తగ్గలేదు. ఆదిబాబు నీళ్ళు నమిలాడు. అతనేం చెప్తాడా అన్నట్టు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ ‘యేటాది బాబు.. పలకవు సెప్పు..’ రెట్టించింది.ఆదిబాబు తెగించాడు. ‘యేటి సెప్పాలే. నిజం తెలిసిపోనాక ఇంకేటి సెప్పాలి. నువ్వే ఆ సీర తీసేవ్. యానికో కూడా నాకు తెలుసు’ అని ఆగి, ‘దీనికి ఇసయం తెలుసని అరదమైపోనాది. మరి నేనెలా సెప్పాలి? దాన్నె ఇరకాటంల యెట్టి సెప్పిత్తాను’ అనుకుని, ‘మా యమ్మ మీద కోపంతో నువ్వే ఆ సీర సింపీసినావు. యేరు దాటాక తెప్ప తగలేసే రకవే నువ్వు. అది తెలక ఆ ముసిల్ది నీకు సపోర్టు సేసింది’ కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి, తన వ్యూహాన్ని రచించింది. ‘మీయమ్మతో ఏ నాడైన పేమగ మాటాడేవా నువు? అదే సేసుంటే నాకెలా సపోర్టు సేస్తది మీ యమ్మ?’ ‘ఎదో మందెట్టుంటావు’ టక్కున అన్నాడు. ‘ఓలమ్మ నాను మందెట్టీసినానట. ఈలమ్మని పొట్టనెట్టుకుంది ఈడు.. సుట్టు తిరిగి నన్నంతండు’ అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బకొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవలా ఇంకెంతమాత్రం అనిపించలేదు వీరయ్యకి. చుట్టూ జనం గుమిగూడారు. పొద్దున్నే భార్యభర్తల గొడవ భలే రంజుగా వుంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు ‘ఇదో బూలచ్చిమి.. పోన్లే కదని వూరుకంటంటే పెట్రేగిపోతనవు. మాయమ్మని నేను పొట్టనెట్టుకోడవేటే?’ అన్నాడు. ‘సిక్కింది సేప’ అనుకుంది భూలక్ష్మి. ‘నేనండవేటి వూరు వూరే అంతంతే.. కాలంటే ఇలందరి నుండి సాచ్చకం తీసుకొత్తాను’ అంది. ‘నీ సాచ్చకాలేటి నాకక్కర్నేదు. అది నా తల్లే. నేనేటైన సేసుకుంతాను నా ఇట్టం. నీకేటి మజ్జిల’ ఆవేశంతో అతని గొంతు వణికింది. ‘ఇంత తెగించీసినోడివి మరి నీకేల ఈ సీర ఇసయం. అది సిరిగిపోతే నీకేవి అరిగిపోతే నీకేవి’ మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. ‘నీయమ్మ ఎంత పొగరే నీకు’ అంటూ పైపై కొచ్చాడు ఆదిబాబు. ‘యేటి కొడతావా? కొట్టు. నువ్వేనేటి నేనూ సెయ్యగలనా పని’ అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకలి తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి ‘సుకంగుండడం సేతకాదేటి మీకు? సిన్న సీరముక్క కోసం గొడవలు పడుతన్రు’ అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. ‘ఇసయం సీర కాదురా ఈరీ.. ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు. ఆ సీరలో దాసిపెట్టిన ఆత్తి పత్రాలేవి అని అడగలేక ఈ బాద’ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఏటవుతుంది బావా ఇక్కడా.. ఆత్తి పత్రాలేటి దాన్ని దాసిపెడ్డం యేటి.. ఈ గోలేటి?’ అడిగాడు వీరి. దానికి సమాధానం ఎం చెప్పాలో తెలియక ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి వురికాడు ఆదిబాబు. ‘ఇద ఈ పాపిట్టిదాన్వల్లే నా బతుకిలగ అయ్యింది. నా ఆత్తి మీద నాకు అక్కు లేకుండ సేస్సేవు కదే దొంగ ముండా’ అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ వున్న వాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గరకు వెళ్ళకుండా శక్తి కొలది పట్టుకున్నారు. భూలక్ష్మి వాచిన చెంపలను తడుముకోకుండా రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ వుంది. ‘అప్ప ఇద.. ఈ నీలు తాగు’ అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతడి చేతిలో వున్న గ్లాసుని విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. ‘నా మీద నీ పెతాపం సుపిత్తే యేడుసుకొని మూల కూకున్న రోజులు పోనాయి. నువ్వేటో వూడబొడుత్తవని లక్సలు పోసి కట్టబెట్టారు మాయమ్మోల్లు. నువ్వా పైసాకి పనికి రానోడివి. నా కట్టం తిని నన్నే తన్నెవోడివి. మీయమ్మ సచ్చిపోయాక కనీసం దాని సావుకి కారనం కూడ అడక్కండా డవిరెక్టుగ ఆత్తి ఇవరాలు అడిగినోడివి. తూ నీ బతుకు! ఇదో అందరినండి. యేదో ఆలమ్మ మీద పేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరి పడతన్డు గనీ ఆయమ్మ బతికున్నపుడు ఒక్కరోజు కూడా ఈడు పేమగా సూసింది లేదు. దాని ఆస్పెత్రి కర్సులకి దాసుకున్న డబ్బులు కూడా తీస్కెలి తాగిన తాగుబోతోడీడు. దాని శవం కాడికి కూడ తాగేసొచ్చిన యదవ. ఇంత కాత్ర లేనోడికి ఆయమ్మ ఆత్తెలా రాత్తది? అందికే పోయే ముందే పెద్దోల్నెట్టి ఆయమ్మ కూతురు పేర్న నా పేర్న దానికున్నదంతా ఇచ్చీమని యీలునామా రాయింసింది. ఆ యీలునామాని సింపిసినాడీ బాడుకోవు. ఇప్పుడీ ఆత్తి పత్రాలు దాసీసి ఆత్తికి అక్కుదారుడైపోదమని ఈడి ఆలోసన. ఆడముండలం మాకు ఆత్తంత వచ్చీసినాదని ఈడీ యేడుపు. ఇప్పుడు సెప్పండర్రా ఆ పత్రాలని ఈడికి తెలకుండా తీసీడం తప్పా’ అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. ఎటు పోయి ఎటొస్తుందోనని జనం మెల్లగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడూ పెళ్లాలను చూస్తూ నిలుచున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతుండగా ఆదిబాబు ‘మీకు సాచ్చకాలే లేవు. సింపీసిన ఈలునామ వొట్టుకొని యే కోరుటుకెల్తారు. ఒకేల యెల్లినా గెలిసేది నాయవేనే. అది నా కాడుంది గుర్తెట్టుకో’ అన్నాడు. ‘ఏటా నాయం.. తాగీసొచ్చి ఒల్లు పై తెలీకండా తల్లిని, ఆలిని సితకబాదడవా? ఆడోల కట్టం మీద తిని తొంగోడవా?’ సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి.‘ఇయ్యనిటి కన్న పెద్ద అర్గత.. నాను మగాడ్నవ్వడవేనే..’ ఆదిబాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి ‘తూ! మగాడివైపోతేటిరా ఆరతట్టాలా? నువ్వు మాలాటి మడిసివే గుర్తెట్టుకో. అయినా పుట్టకలో మగాడివైపోతే సరిపొద్దేటి. గునంలో నవ్వక్కర్నేదా?’ అందామె. బుసలు కొడుతూ ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతో వీరయ్య అక్క దగ్గరకొచ్చి ‘ఓలే బావా యెలిపోతున్నాడే’ అన్నాడు కంగారుగా. ‘యెల్లని ఆడేటి సెయ్యినేడు.. తాగి తొంగుంటే ఆడి ముడ్డి, మూతి కడిగి పెతిరోజు జెబ్బలరిగిపోయినట్టు పనిసేసేది నానైతే యేటి సెయ్యనోడికి ఆత్తేటి. మల్లి ఇదే నాయవని ఆడు ఇర్రీగడవేటి. ఆడాలికి ఆత్తి ఎందుకొద్దు. అది ఆల్ల అక్కు కాదా? అక్కులు ఎవరియ్యరట. మావే పోరాడి లాక్కోలట. ఇప్పుడు అదే కదా సేశాను. ఇక పైన కూడ అదే సెయ్యాలి. సేత్తను..’ అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడ్డట్టు కళ్ళు విశాలమయ్యాయి. -
జగన్ ఈజ్ ఏ ఫైటర్..
-
అమెరికాలో భారత విద్యార్థి కెరియర్ నాశనం.. ఆ ఫొటో కారణమా?
వాషింగ్టన్ : పాలస్తీనాకు మద్దతుగా రాసిన ఓ వ్యాసం అమెరికాలో భారత విద్యార్థి భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పీహెచ్డీ చేస్తున్న ప్లహాద్ అయ్యంగార్‌పై నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది.ప్రహ్లాద్ ఎంఐటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎంఐటీ నిర్వహిస్తున్న మల్టీ డిసిప్లినరీ స్టూడెండ్ మ్యాగజైన్లో పాలస్తీనాకు మద్దతుగా ఓ వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ‘వివాదాల్ని పరిష్కరించేందుకు యుద్ధం లేదంటే హింసకు పాల్పడాలి ’ అని అర్ధం వచ్చేలా రాసినట్లు తాము గుర్తించామని అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు తెలిపారు. ప్రహ్లాద్ వ్యాసం ఎంఐటీలో హింసకు, నిరసనలకు ప్రేరేపించేలా ఉందని స్టూడెంట్ లైఫ్ డీన్ డేవిడ్ వారెన్ రాండాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.వివాదం సృష్టించేలా వ్యాసం రాసినందుకు ప్రహ్లాద్‌పై ఎంఐటీ కఠిన చర్యలు తీసుకుంది. ఐదు సంవత్సరాల నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్‌ను రద్దు చేసింది. క్యాంపస్‌లోకి అడుగు పెట్టకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి రాసిన వ్యాసాన్ని సైతం స్టూడెండ్ మ్యాగజైన్ నుంచి తొలగించింది.🚨🚨 MIT is effectively expelling PhD student Prahlad Iyengar for Palestine activism on campus. 🚨🚨EMERGENCY RALLY: Cambridge City Hall, Monday, 12/9 at 5:30pm. Org sign-on to letter: https://t.co/tCOrOLTeNy pic.twitter.com/7cAYrvn5ad— MIT Coalition Against Apartheid (@mit_caa) December 8, 2024ఎంఐటీ ఫిర్యాదుతో అమెరికా ప్రభుత్వం సైతం విచారణ చేపట్టింది. భారత విద్యార్థి రాసిన వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా అనే ఉగ్రవాద సంస్థ లోగో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. .కాగా, ఎంఐటీ తీసుకున్న నిర్ణయంపై ప్రహ్లాద్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం తాను అందించిన వ్యాసంలోని ఫొటోలే కారణమని చెప్పారు. ఎంఐటీ అడ్మినిస్ట్రేషన్ నన్ను 'ఉగ్రవాదానికి' మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించింది. ఎందుకంటే నా వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఫొటోలు ఉన్నాయి ’ అని అతని తరుఫు న్యాయవాది ఎరిక్ లీ తెలిపారు. గతంలోనూ సస్పెండ్ ప్రహ్లాద్‌పై ఎంఐటీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు చేయడంతో సస్పెండ్ అయ్యారు. ఆ సస్పెండ్‌పై అమెరికా క్యాంపస్‌లలో మాట్లాడే స్వేచ్ఛలేదని ఆరోపణలు గుప్పించారు. అడ్మినిస్ట్రేషన్ విభాగం తీసుకున్న చర్యలు ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తున్నాయి. నేను రాసిన వ్యాసాన్ని మ్యాగజైన్ నుంచి తొలగించడం, బ్యాన్ విధించడం విద్యార్థి సంఘాలు, లెక్చరర్ల హక్కుల్ని భంగం కలిగించేలా ఉన్నాయని అన్నారు. కాగా, ప్రహ్లాద్ ఎంఐటీ తీసుకున్న చర్యలు పలు అమెరికన్ కాలేజీల్లో విద్యార్థులు మద్దతు పలికారు. డిసెంబర్ 9న కేంబ్రిడ్జ్ సిటీ హాల్లో అయ్యంగార్‌కు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. -
యువ కథ : అబార్షన్
‘మరోసారి ఆలోచించుకోండి. మళ్లీ కావాలనుకుంటే కుదరక పోవచ్చు.. నేను చెప్పాల్సింది చెప్పా.. తర్వాత మీ ఇష్టం’ అంది డాక్టర్ పద్మ. ఐదు నిమిషాల భయంకర నిశ్శబ్దం. పెద్ద శబ్దం విని ఉలిక్కిపడ్డ చిన్నపిల్లలా ఉంది సంధ్య. ఆమె మాట్లాడేలా లేదని అర్థమైంది డాక్టర్‌కు.‘రెండు రోజుల తర్వాత మీరు రావచ్చు’ అంటూ అసహనంగా టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కింది. తనకెందుకో డాక్టర్ తన ముఖంపైనే గెటవుట్ అని చెప్పినట్లనిపించింది సంధ్యకు. ‘సరే’ అన్నట్లుగా తల ఊపుతూ పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ‘ఏం ఫరవాలేదు నా నిర్ణయం సరైనదే’ అన్నట్లు చూశాడు నరేంద్ర. ఇద్దరూ పైకి లేచి డాక్టర్ గారికి నమస్కరించి బయటికి వచ్చి ఇంటికి వెళ్లడానికి హాస్పిటల్ బయట పార్క్ చేసిన వారి బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడే ఒక కుక్క వాళ్ళ బైక్ వెనుక టైర్ మీద చేయాల్సిన పని చేసి వెళ్లిపోయింది. మరో చిన్న కుక్కపిల్ల బైక్ ముందు చక్రం దగ్గర పడుకొని వుంది. నరేంద్రని చూసి తోక ఊపుతూ అతని చెప్పులు నాక బోయింది. విసురుగా కాలితో ఒక్క తోపు తోశాడు నరేంద్ర. కుయ్‌కుయ్ మంటూ అరవ సాగింది ఆ కుక్కపిల్ల. ఇంతలో దాని తల్లి ఒక్కసారిగా నరేంద్రని చూస్తూ భౌ భౌమని అరుస్తూ వెళ్లి తన బిడ్డను ఆప్యాయంగా నాకుతూ సముదాయిస్తూ వుంది.ఆ కుక్కపిల్లనూ దాని తల్లినీ చూస్తూ ఉంది సంధ్య. కాలు విరిగిన తన తల్లి బాగోగులు చూడడానికి భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అడ్డమని తేల్చి అబార్షన్స్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకు వచ్చిన భర్త వైపు కూడా చూసింది. భర్త మాటకు తాను కనీసం ఎదురు కూడా చెప్పలేకపోయానని, ఆ మూగ జీవానికున్న ధైర్యం కూడా లేనందుకు తన మీద తనే జాలి పడుతూ భర్త బైక్ వెనుక సీటు పైకి ఎక్కి కూర్చుంది. అయితే ప్రతిసారిలాగా భర్త భుజంపై చేయి వేయలేదు. బైకు వెనుక మాత్రమే పట్టుకుని కూర్చుంది.బైక్ బయలుదేరింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం తిష్ట వేసుకుని కూర్చుంది. ఎక్కుపెట్టిన బాణంలా స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా నిదానంగా వెళ్ళకుండా వేగంగా వెళుతోంది బైక్. వెనుక మరింత గట్టిగా పట్టుకుని కూర్చుంది సంధ్య. మెల్లగా పొమ్మని చెబితే ‘అమ్మ బెడ్ మీద ఉందని తెలుసుగా. మనం వచ్చి ఒక గంట పైన అయింది. త్వరగా వెళ్ళవలసిందే’ అని తన భర్త ఎలాగూ అంటాడు. అందుకే మౌనంగా ఉండిపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు పట్టింది. సంధ్యను ఇంటి గుమ్మం దగ్గర వదిలి ఆఫీసుకి వెళ్ళిపోయాడు నరేంద్ర.ఇంటి బయట చెప్పులు వదిలి మెయిన్స్ డోర్ తలుపు తీసింది సంధ్య.‘రామ్మా.. రా.. కొంచెం కాఫీ కలిపి ఇవ్వమ్మా... తల పగిలిపోతోంది’ అంది సరోజినమ్మ.‘సరే అత్తయ్య..’ అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ గిన్నెలో కొన్ని పాలు పోసి, స్టవ్ మీద పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుందామని బెడ్రూమ్లోని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళింది. వార్డ్రోబ్ అద్దంలో తన పొత్తికడుపు వైపు చూసుకుంది. ఒక చేయి పొట్ట మీద ఉంచుకొని మరొక చేత్తో నైటీతో కన్నీళ్లు తుడుచుకుంటూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో ‘నాలుగు నెలల నిన్ను చంపుకుంటున్నాను. నన్ను క్షమించరా..’ అంటూ వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్ళు ఆగటం లేదు. ‘సంధ్యా .. ఒసేయ్ సంధ్యా.. పాలు మరిగిపోతున్నాయి. సోకులు చేసుకోవడం ఆపి బయటికిరా..’ అంటూ సరోజినమ్మ అరుస్తూ తన చేతి కర్రతో మంచాన్ని గట్టిగా కొట్టేసరికి ఈలోకంలోకి వచ్చి, గబగబా నైటీని దూర్చుకొని హడావిడిగా వంటింట్లోకి పరుగు పెట్టింది. దారిలో టీపాయ్ అంచు రోజు మాదిరిగానే మోకాలిని ముద్దాడింది.‘అబ్బా’ అని గట్టిగా అరిస్తే ‘ఇంకా కళ్ళు కూడా పోయాయా? చూసుకొని నడవలేవా?’ అనడానికి అత్తయ్య రెడీగా ఉంది. అందుకే బాధనంతా పంటిబిగువున పట్టి, వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి అత్తయ్య చేతిలో పెట్టింది.తన మొహం కూడా చూడకుండా కాఫీ అందుకుని దానిని తాగే పనిలో పడిపోయిందామె.‘అత్తయ్యా.. మీతో విషయం చెప్పాలి’ అంది సంధ్య లోగొంతుతో.‘ఏంటి?’ అంది అత్తయ్య గొంతు కరుగ్గా.‘అదీ .. అదీ.. అత్తయ్యా .. నాకు ఇప్పుడు నాలుగో నెల..’ అని సంధ్య అంటుండగానే..‘తీయించే కడుపు నాలుగో నెల అయితే ఏమి? ఐదో నెల అయితే ఏమి?’ అంది సరోజినమ్మ. సంధ్య నోట మాట రాలేదు. తాను విన్నది నిజమేనా అన్నట్లు సరోజినమ్మ ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పటివరకు అబార్షన్స్ చేయించాలనుకున్న నిర్ణయం కేవలం భర్తది మాత్రమే అనుకుంది.అత్తయ్యకు కూడా ఈ విషయం తెలిసుంటుందని ఊహించలేకపోయింది. కనురెప్పలు కంటిని మూయడం మరిచిపోయాయి సరోజమ్మ మాటలకు. మొదటిసారి తన ఇల్లే తనకి భయాన్ని పరిచయం చేసింది. అమ్మా కొడుకులు కలిసి తన బిడ్డను, తన అమ్మతనాన్ని, తన నుంచి దూరం చేయాలనే నిర్ణయం తీసేసుకున్నారని, మొద్దుబారిన ఆమె మెదడుకు అర్థమయ్యేసరికి కన్నీళ్ళు చెంపల నుంచి గుండెల వైపుకి చేరసాగాయి.నెమ్మదిగా గొంతులోకి ధైర్యాన్ని నింపుకొని ‘అత్తయ్యా .. నేను బిడ్డను ఉంచుకుంటాను అత్తయ్యా.. వారికి మీరే ఎలాగైనా చెప్పి ఒప్పించండి.. ప్లీజ్’ అంది.‘చూడమ్మాయ్.. నేను కాలు విరగ్గొట్టుకొని మంచాన పడున్నాను. ఆరు నెలలు లేవడానికి లేదు.నీవు కడుపని పుట్టింటికి వెళితే నన్నెవరు చూసుకుంటారు? అందుకే తీయించేసేయమన్నాను. కడుపుదేముంది ఎన్నిసార్లైనా తెచ్చుకోవచ్చులే. అయినా నేను మీ సంబంధం ఖాయం చేసేటప్పుడే మీ నాన్నతో చెప్పా.. మాకు మీరు కట్నం ఎలాగూ ఇవ్వలేరు. ఇంటి పనులు చేసే పిల్లయి ఉంటే చాలు అని.తల్లి లేని పిల్ల కదా అని పెళ్ళి కూడా తేరగా చేసుకుంటే ఇప్పుడు మేము మీకు సేవలు చేస్తూ కూర్చోవాలా?’ అంటూ ఇంకా ఏవేవో నా¯Œ స్టాపుగా మాట్లాడుతోంది సరోజినమ్మ.సంధ్యకు అంతవరకు మాత్రమే ఆ మాటలు వినపడ్డాయి. ఇక తర్వాత తనకు ఏమీ వినపడలేదు. కాసేపటి తర్వాత ‘నీ మొగుడు వచ్చినట్టున్నాడు వెళ్ళి తెలుపు తియ్..’ అన్న సరోజినమ్మ మాటలతో ఉలిక్కిపడింది. కంటిన్యూగా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దం తను వెళ్ళి తలుపు తీయగానే ఆగిపోయింది.‘ఎక్కడ చచ్చావ్? ఇంతసేపు?’ అంటూ విసురుగా లోపలికి వచ్చి ఆఫీస్ బ్యాగు సోఫాలో విసిరేసి ‘కాఫీ తీసుకురా’ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు నరేంద్ర.కాఫీ కలిపి తెచ్చి భర్త చేతికందిçస్తూ.. ‘అబార్షన్స్ విషయం మరొకసారి ఆలోచించకూడదా?’ అని అడగబోయే లోపలే.. ‘రేపు ఉదయం నేను ఆఫీస్‌కి లీవ్ పెట్టాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా?’ అంటూ కాఫీ తాగడంలో నిమగ్నమైపోయాడు నరేంద్ర.నిస్సహాయత కమ్ముకుంది సంధ్యను.ఉదయం చూసిన తల్లి కుక్క గుర్తొచ్చింది. అది కనీసం మొరగనైనా మొరిగింది. తనకు నోరు లేదా? దేని గురించి తాను భయపడుతున్నట్టు?సంధ్యను తండ్రి మగరాయుడిలా పెంచాడు. తల్లి లేకపోవడంతో ఇంట్లోని ప్రతి పనీ సంధ్యకు బాగా వచ్చు. తండ్రికి సేద్యంలో సాయానికి వెళ్ళి పొలంలో దిగిందంటే మట్టిని గింజను కాపాడుకొని పంట ఇంటికి తెచ్చుకోవడం తెలుసు. పాడి పొదుగు పాలు తెలుసు. తండ్రి రూపాయి తెస్తే పావలా దాచి మిగిలిన డబ్బుతో ఇల్లు నడపడం తెలుసు. తండ్రి తనని టౌన్స్ లో ఇచ్చి చేసింది ఈ పనులకు దూరంగా కూతురు కాస్తంతైనా సుఖపడాలని. జీతగాడైన భర్త తెచ్చే జీతంతో హాయిగా ఉండాలని. కాని జీతం తెచ్చే వాడంటే జీవితంలోని ప్రతి నిర్ణయానికి అధిపతి అని ఆమె అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకుంది. అయితే ఏంటి? ఇంటి నుంచి తరిమేస్తారు. లేదా విడాకులు ఇవ్వొచ్చు. చిన్నప్పుడే కలుపు కూలీల బిడ్డల్ని సరదాగా వీపుకు కట్టుకుని పని చేసేది సంధ్య. ఇప్పుడు సొంత బిడ్డను గుండెకు అదుముకుని ఎలా బతకాలో తెలియదా!సంధ్య మౌనంగా ఇంట్లోకెళ్ళి ఒక చిన్న సంచిలో కొన్ని బట్టలు పెట్టుకొని బయటికొచ్చి నిలబడేసరికి అత్త, భర్త నోరు తెరిచారు. ‘మా ఇంటికి వెళుతున్నాను. అక్కడ ఉంటానో లేదో తెలియదు. మా నాన్న ఇక్కడకు తిరిగి వెళ్ళమని అంటే వేరే ఎక్కడికో వెళ్ళి నా బిడ్డను క్షేమంగా కంటాను. ఆ తర్వాత కష్టం చేసి పెంచుకోవడం నాకు వచ్చు. మీ అమ్మ అంటే నాకు గౌరవమే. ఆమె కాలు విరిగితే ఎలా సేవ చేయాలో ఈ క్షణం వరకూ ఆలోచిస్తూనే ఉన్నాను. కాని మీ సౌకర్యం కోసం నా బిడ్డ ప్రాణాలు తీయడంలో కనీసం నా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకోలేదు మీరిద్దరూ. అంటే నన్ను మీలో ఒకరు అని అనుకోలేదన్న మాట. నేను కూలిదాన్ని కాదు.. కోడల్ని. భార్యని. ఇప్పుడు కేవలం కాబోయే తల్లిని. నాకై నేను వద్దనుకుంటే తప్ప నా కడుపులోని బిడ్డను ఎవరూ తాకలేరు. ఇప్పుడు వెళుతున్నాను. అత్తయ్యా.. మీ అబ్బాయి వచ్చి క్షమాపణలు చెప్పి మీరూ క్షమాపణలు చెప్పాక నా కడుపులోని బిడ్డతో పాటు నలుగురం కూచుని మన ఇంట్లో ఎవరూ ఏ ఇబ్బంది పడకుండా ఎలా ఈ సందర్భాన్ని దాటొచ్చో ఆలోచిద్దాం.మరో విషయం. మీరు కాలు విరిగి మాత్రమే మంచం మీద పడ్డారు. నేను గనక ఇప్పుడు ఇల్లు దాటితే మీ అబ్బాయి నడుమే విరుగుతుంది జాగ్రత్త’ అంది సంధ్య.ఒక చేతిలో సంచి పట్టుకుని, మరో చేతిని కడుపులో ఉన్న బిడ్డకు చేరువ చేస్తూ నిలబడి ఉన్న సంధ్యను సరోజినమ్మ, నరేంద్ర భీతిల్లి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళ ఆధిపత్యం ఏ క్షణమైనా అబార్షన్స్ టేబుల్ ఎక్కేలా ఉందనిపించింది సంధ్యకు.ఆమె ధైర్యంగా అలాగే నిలుచుంది. -
యువ కథ: నీలం కారు
‘ఏమిటీ ఈ డొక్కు కారు ఇక్కడా!! ఎవరిది ఇది?’ అనే మాట వినిపించే సరికి చురుక్కున చూశాను.ఇస్త్రీ చేసిన చొక్కా, గాలి వీస్తున్నా వడలిపోని జరీ అంచు కుచ్చిళ్ళు, ఎండకి మెరుస్తున్న పంచె, నున్నగా గీసిన గడ్డం, నల్ల కళ్ళజోడు, ఇతగాడికి ఎండ తాకకుండా వెనుక గొడుగు పట్టుకొని మా రాముడు. అర్థం అయింది కొత్త పెళ్ళికొడుకు అని. రెండేళ్ళ నుండి మూలన పడి వున్నా ఇన్నేళ్ళుగా నన్ను ఎవరూ కదిలించింది లేదు పట్టించుకోనూ లేదు. ఇలా ఈసడించిన వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఉన్నట్టుండి డొక్కు కారు అని వినేసరికి కుంభకర్ణుడికి నిద్రాభంగం అయినట్టు లేచాను. ‘ఇది మా షావుకారుగారి మొదటి కారు అయ్యగారూ.. మా షావుకారు అనే కాదు, ఇది ఈ ఊర్లోనే మొదటి కారు’ నన్ను నాకు గుర్తుచేస్తూ, నా గత వైభోగం గురించి గొప్పగా చెప్పాడు రాముడు.‘అయితే?’ అన్నాడు కొత్త పెళ్ళికొడుకు.నేను అక్కడ ఉండటం, అలా ఉండటం అతగాడికి బొత్తిగా నచ్చనట్టు ఉంది. అతనికి నచ్చకపోయేసరికి రాముడు చిన్నబుచ్చుకుంటూ నన్ను చూశాడు.పాపం నన్ను ఇంటికి మొదటిసారి తీసుకొని వచ్చినప్పుడు నాకు దిష్టి తీసింది రాముడే. అలా తీసినందుకు షావుకారు రాముడికి, అతని భార్యకి, కొడుకుకి కలిపి ఒక రూపాయి నోటు ఇచ్చారు. నన్ను చాలా ఆప్యాయంగా, సొంత బిడ్డలా చూస్తూ తాకిన మా షావుకారి చేతి స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది. నన్ను ఒక కారులా కాకుండా ఇంట్లో ఒకరు అన్నట్టు చూసుకునే వాళ్ళు. డ్రైవర్ పేరుతో బయట మనిషి కూడా నన్ను తాకకుండా షావుకారు అన్నీ తానే అన్నట్టు అల్లారుముద్దుగా చూసుకునే రోజులవి.మొదటిసారి నేను ఊరిలోకి వచ్చిన క్షణం నాకు ఇంకా గుర్తుంది. అది ఒక జాతర అనే చెప్పాలి. లేదా నేను ఒక గ్రహాంతరవాసిని అయినా అయ్యుండాలి.మా షావుకారుగారు నన్ను తోలుకుంటూ ఊరిలోకి వస్తుంటే, ఏదో తెలియని అమాయకపు హోదాని ఇస్తూ గడపల దగ్గర, అరుగుల మీద కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి చూడటం; మా షావుకారి గారినో, నన్నో చూసి చూసి మురిసిపోవటం, బుడత గాళ్ళందరూ నా వెనుకనే పరిగెత్తుకుంటూ రావటం, కొందరు సైకిల్ టైరుని కొట్టుకుంటూ నా వెనుక పరిగెత్తటం, రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళందరూ నన్ను చూస్తూ అలా ఆగిపోవటం... ఆహా!! ఇంటికి వచ్చాక వాహన పూజ అన్నట్టు అయ్యగార్లు మంత్రాలని వల్లిస్తుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. కొత్త ముతైదువుని అలకరించినట్టు పసుపు కుంకుమలతో నన్ను సింగారించి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, చిన్న పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇలాంటి మధుర స్మృతులన్నీ నెమరు వేసుకొంటుండగా టపీమని ఒక చేతి అచ్చు పడింది బోనెట్ మీద. ఒక్కసారిగా కలలో నుండి ఇలలోకి వచ్చినట్టు అయ్యింది. ఎవరా అని చూస్తే ఇంకెవరు కొత్త పెళ్ళికొడుకే!‘ఎందుకూ పనికి రాని ఇనుము ఇంట ఉంచరాదు అని తెలియదా రాముడూ’ అంటున్నాడు.‘నిజమే నయ్యా!! కానీ ఈ కారుని ఇనుము అని ఇంటిల్లిపాది ఎప్పుడూ అనుకున్నదే లేదు. ఈ కారు వచ్చాకనే ఇంటికే కాదు, ఊరికి కూడా చాలా విషయాలు కలిసొచ్చాయి.’తన మాటకు ఎదురు పలుకుతున్నందుకు రాముణ్ణి కొత్త పెళ్ళికొడుకు గురాయించి చూస్తుంటే నా ఒళ్ళు వుడికిపోతోంది. అయ్యగారి చూపులని గమనించిన రాముడు తనని తాను తమాయించుకున్నాడు. దూరంగా చూస్తే చిన్నమ్మాయి గారు. నన్ను పరిచయం చేయటానికే ఏమో ఇటుకేసి వస్తున్నారు. నేను ఇంటికి వచ్చిన కొత్తల్లోనే పెద్దమ్మాయి గారికి పెళ్ళయింది. పెళ్ళి పిలుపుల దగ్గర నుండి అప్పగింతల వరకు తిరిగింది నేనే, తిప్పింది నన్నే. ఎంత హడావిడి వున్నా కారు తీయాలంటే షావుకారు గారే వచ్చే వాళ్ళు కానీ పొరపాటున కూడా నన్ను ఇంకొకరి చేతిలో పెట్టలేదు. పెద్దమ్మాయికి నేనంటే చాలా సెంటిమెంట్. అందుకే అత్తారింటికి వెళ్ళే ముందు నాకు నమస్కారాలు పెట్టి తృప్తిగా తడిమి మరీ వెళ్ళిందా బంగారుతల్లి.ఇక మా చిన్నమ్మాయి గారు నేను ఫ్రెండ్స్. తన కాలేజీ చదువులకు, పరీక్షలకు, టైపింగ్ నేర్చుకునేందుకు, పట్టణంలో షాపింగ్‌కి, స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి అన్నిటికీ నేనే... అంటే అదే నా తోడునే.ఒకసారేమో ఊరి అవతల వైపు ఉండే అమ్మాయి గారి స్నేహితురాలు లలితకి పురిటినొప్పులు మొదలు అయ్యాయి. మంత్రసాని ఊరిలో లేదాయె. సమయానికి షావుకారు కూడా ఊరిలో లేరు. చిన్నమ్మాయి గారే ధైర్యం చేసి తోలారు నన్ను. చాలా జాగ్రత్తగా లలితను తీసుకొని పక్క ఊరిలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. పసికందు పుట్టాక ఇంటికి తీసుకొని వచ్చింది కూడా నాతోనే. డ్రైవ్ చేయటానికి కొంచెం దడ ఉన్నా దాన్ని బయటకు చూపించకుండా బాగానే తోలారు. ఆ ఒక్క సంఘటనతో అమ్మాయి గారికే కాదు వాళ్ళ స్నేహితురాళ్లందరికీ కూడా నేనంటే మక్కువ. ఒక్కోసారి పూలతో, మరోసారి బొట్లతో, ఇంకోసారి ఓణీలతో రకరకాలుగా ముస్తాబు చేసే వాళ్ళు నన్ను. అలా నన్ను చూసి ఎవరైనా ఏమైనా అంటే మా కారు మా ఇష్టం అని నన్ను హత్తుకునే వాళ్ళు. ఈ రకంగా నేను వాళ్ళల్లో ఒకరిలా కలిసిపోయాను. షావుకారు గారు ఎటైనా ఏదైనా పని మీద వెళ్ళడం మా అమ్మాయి గారు నన్ను తీసుకొని షికారుకి వెళ్ళటం. ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు మా అమ్మాయి గార్ని సతాయించాలనుకుంటే స్పీడ్ పెంచి మేము వాళ్ళని బెదరకొట్టటం. భలే ఉండేదిలే మా సావాసం. పై చదువులు అని అమ్మాయి గారిని పట్టణం పంపేశాక ఇదే మళ్ళీ చూడటం. చాలా మారిపోయారు అప్పటికీ ఇప్పటికీ. ఈ రెండేళ్ళలో ఇంటికి మరో కారు వచ్చింది. కానీ నాకు ఇచ్చిన స్వాగతం, హోదా ఆ కారుకి లేదు. ఊరు చిన్నదే అయినా ఇప్పుడు మరో నాలుగైదు కార్లు వచ్చాయి. ఇదంతా ఎపుడు జరిగిందో కూడా తెలియలేదు. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గర వాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. ఆ ఫొటోలన్నీ హాల్లో గోడలకి వేలాడుతుండేవి. ఇపుడు కట్నం పేరిట కొత్త పెళ్ళికొడుక్కు ఒక కొత్త మోడల్ కారు వెళ్తుందంట! మా అమ్మాయి గారు దగ్గరికి వచ్చేశారు.‘ఓరి కొత్త పెళ్ళికొడకా... ఇప్పుడు చూడు ఆమె నీకెలా గడ్డి పెడుతుందో’ అనుకున్నాను.చిన్నమ్మాయి గారు వచ్చి రాగానే ‘ఈ కారు ఇంకా ఇక్కడనే ఉందా?!’ అన్నారు. ’రాముడూ! నాన్నకంటే చాదస్తం ఎక్కువ. నీకేమైంది. ఇదుగో ఈ కారు తాళం. తీసుకొని వెళ్ళో, తోసుకొని వెళ్ళో డంపింగ్ యార్డ్‌లో పడేయ్’. రాముడు ఆ మాటలకి నివ్వెరపోయాడు. ‘ఏంటి రాముడు అలా చూస్తున్నావ్? ఇదుగో తాళం. తీసుకొని త్వరగా ఇక్కడ నుండి బయలుదేరు’. ఏదో ఆలోచిస్తూ రాముడు తాళం తీసుకున్నాడు. నాకు గుండెల్లో కవ్వం పెట్టి చిలికేస్తున్నట్టు ఉంది. రాముడు ఎన్నడూ నన్ను నడిపించింది లేదు. అలాంటిది మొదటిసారి ఎక్కి కీ ఆ¯Œ చేశాడు. ఇంజి¯Œ లో వణుకు పుట్టింది. నేను అమ్మాయి గారి వైపు చూశాను. ఒకప్పుడు అన్నీ తన ఇష్టంగా జరిపించుకున్న అమ్మాయి గారు. తన మాటే నెగ్గాలనుకునే అమ్మాయిగారు. బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని అంటే షావుకారు గారు హడలిపోయి వద్దన్నా ‘చేస్తాను. నా ఇష్టం. అందులో తప్పేముంది’ అని మాట చలాయించుకున్న అమ్మాయిగారు, పెద్దమ్మాయిగారు ఉన్నప్పుడు ఇద్దరం రోజూ ఒకే రంగు బట్టలేసుకుందాం అనంటే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది... ఏంటి నీ కోరిక యూనిఫారంలాగా అని పడీపడీ నవ్విన అమ్మాయి గారు, పుస్తకాలు తెగ చదివే అమ్మాయి గారు, పెళ్ళి అయిన నాలుగు రోజులకే...రాముడు మెల్లగా నన్ను కదిల్చాడు.‘సాయంత్రం షికారుకెళ్దామా’ కొత్తపెళ్లికొడుకు అడుగుతున్నాడు.‘మీ ఇష్టం’ అంటోంది అమ్మాయిగారు.‘ఆ ఫ్యాష ఎందుకు... తాళిబొట్టు బయటకు కనిపించేలా వేసుకో’‘అలాగే. మీ ఇష్టం’‘నాకు చెప్పకుండా ఎప్పుడూ డ్రైవింగ్ చేయకు’‘సరే’...రాముడు నన్ను బంగ్లా బయటకు తోలుకెళ్తున్నాడు.నేను అమ్మాయిగారినే చూస్తూ ఉన్నాను.ఆమె అక్కడే ఉండిపోగా నేను గేటు దాటి, మలుపు తిరిగిపోయాను. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గరవాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. -
యువ కథ: ది ప్రపోజల్
డియర్ రియా! ఆఫ్టర్ మచ్ థాట్ ఐ హావ్ కమ్ టు ద కంక్లూజన్ దట్ ఐ కెన్ నాట్ సస్టెయిన్ దిస్ ఫీలింగ్ వెరీ లాంగ్. ఐ జస్ట్ వాంట్ టు బి యువర్ పార్టనర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇప్పటికే రెండు రోజులయింది ఇన్‌స్టాలో మేసేజ్ చేసి. కనీసం రిప్లయి కూడా లేదు తన నుండి. ఒక చిన్న మేసేజ్కే ‘యస్’ చెపుతుందని కాదు. కానీ ఒక చిన్న ‘నో’కి కూడా నోచుకోలేకపోయాననే బాధ. ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియలేదు కానీ చేసేశాను. ఎలాగైతేనేం తనకి విషయం అర్థం అయితే చాలు. అసలు ఈ మెసేజెస్, కాల్స్‌లో ప్రపోజ్ చేయడం ఏంటి? డైరెక్ట్‌గా చెప్పేస్తే ఏదోఒక సమాధానం వచ్చేది కదా! ఆ ధైర్యమే ఉంటే ఇన్నిరోజులు ఎందుకు ఆలోచిస్తా. ఎప్పుడో చెప్పేసే వాడిని కదా! నన్ను నేను తిట్టుకుంటూ తనని ఆఫీస్‌లో ఎలా ఫేస్ చేయాలో అని భయపడుతూ ఆఫీస్ బాట పట్టాను. బెంగళూరులోని మా ఆఫీస్‌లో రియా నా కొలీగ్. కన్నడ కంటెంట్ రైటర్. నేను తెలుగులో పని చేస్తున్నాను. తనది బళ్ళారి కావడం వలన తెలుగు బాగా మాట్లాడుతుంది. నాకు తనతో పరిచయం తక్కువే. ఆఫీస్‌లో తను మాట్లాడని, తనతో మాట్లాడనివారు ఎవ్వరూ ఉండరు ఒక్క నేను తప్ప. నేను మాట్లాడకపోవడానికి కారణం లేకపోలేదు. తనతో మాట్లాడే ప్రతి ఒక్కరినీ బ్రో అని సంబోధిస్తుంది. తన నుండి ఆ పిలుపుకి నోచుకోకపోవడమే ఉత్తమమని ఆల్మోస్ట్ దూరంగానే ఉంటాను. ఎంత దూరంగా అంటే నా ఎదురు క్యాబిన్ తనదే అయ్యి ప్రతీ అయిదు నిమిషాలకొకసారి గత్యంతరం లేక ఒకరి ముఖం ఒకరు చూసుకునేంత. అయినా సరే నేను మాట్లాడకపోగా తనకి మాట్లాడే అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. గడుస్తుంది కాలం తనని చూస్తూ, తన పలుకులను వింటూ, తన ఊహలతో జీవనం గడుపుతూ. ఆ గ్రిల్డ్ చికెన్ తింటూ నేను వేసిన ‘స్నాప్’ చూసి మరుసటి రోజు రెస్టరెంట్ చిరునామా వాకబు చేసింది. నేను లోకేషన్‌తో పాటు టేస్ట్ కూడా షేర్ చేశాను. నోట్లో లాలాజలపాతాలు పొంగాయో ఏమో కానీ ఉన్నపాటున లేచి ‘వెళదాం పదా’ అంటూ నిలబడింది. నన్ను మించిన భోజన ప్రియురాలు కాబోలు అనుకుంటూ వెళదాం అన్నట్టుగా లేచాను. ఈ తంతంతా తెలుగు రాకపోయినా వింటున్న రాజ్దీప్కి ఎంత అర్థం అయ్యిందో గాని ‘నేనూ వస్తా’ అంటూ కదిలాడు. అలా ముగ్గురం నడుచుకుంటూ రెస్టరెంట్‌కి వెళ్ళి ఆర్డర్‌కి ముందు ముచ్చట్లు తిన్నాం. ఆ తర్వాత తనని పీజీ దగ్గర డ్రాప్ చేయడానికి నేను, రాజ్‌దీప్ తీసుకెళుతూ ఉంటే తను మరిన్ని ముచ్చట్లు తినిపించింది. ఎంత బాగా మాట్లాడుతుందో.. ఒక్కోపదాన్ని పేర్చినట్టు, ఆ పదాలు తన నోటి నుండి రావడానికి పోటీ పడుతున్నట్టు.. భాషే కాదు, వ్యక్తీకరణ కూడా సరళంగానే ఉంది. మాటల మధ్యలో రాజ్‌దీప్ ‘అర్జున్ కుక్స్ వెల్’ అని చెప్తే ‘నిజమా విచ్ ఐటెమ్స్ డు యు కుక్ వెల్’ అని అడిగింది. ‘అదీ ఇదీ అని ఏం లేదు అన్నీ చేస్తా’నని బదులిచ్చాను. ‘నీ వైఫ్ చాలా లక్కీ’ అంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అన్నాను. ‘సారీ, ఫ్యూచర్’ అని జోడించింది. ఆ లక్ నీకు ఇస్తున్నానని మనసులో అనుకోబోయి బయటకు అనేశాను ఏమరపాటుగా. నడుస్తున్నది కాస్త ఆగి ఒక్క క్షణం నా వైపు చూసి ‘ముఖద్ మేలే హొడిత్తిని నన్మగ్నే’ అంది కన్నడాలో. నాకు అర్థం కాకపోలేదు. తను ఆ మాట అంటున్నప్పుడు తన ముఖంలో ముసిముసిగా తొణుకుతున్న నవ్వుని గమనించాను. మా మధ్య పెద్దగా మాట పరిచయం లేకపోయినప్పటికీ ఉన్న ముఖ పరిచయంతోనే ఏదో తెలియని బంధం ఏర్పడిందేమోనన్న భావన నాలో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ భావనే లేకపోతే ఈరోజు ఈ క్షణం తనతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేవాడినే కాదేమో! తనతో వేసిన ఆ కొన్ని అడుగులలో నాకు అవసరమైన ఏడు అడుగులను తన అడుగుల్లోనే జాగ్రత్తగా వేస్తూ తన పీజీ దగ్గరకు చేరాము. తనకి ఒక బై చెప్పి, సీ యూ టుమారో అంటూ నేనూ, రాజ్‌దీప్ మా ఫ్లాట్‌కి మేము బయలుదేరాము. ఫ్లాట్‌కి వచ్చి స్నానం చేసి బెడ్ మీద వాలగానే గుండెల్లో ఏదో అలజడి. ఆమెతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా మదిని పదేపదే ఢీకొడుతున్నాయి. మా పరిచయం కాస్త స్నేహంగా మారుతుందేమోననే ఆలోచన నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అలా జరిగితే ఆమెకున్న స్నేహితుల్లో నేను ఒకడిగా మిగిలిపోవడం ఖాయం. ఒక స్నేహితుడిగా ప్రేమను తెలియజేయడం కన్నా ప్రేమికుడిగా ప్రేమను వ్యక్తపరచడం మేలనిపించింది. ఎన్ని కోణాల్లో ఆలోచించినా ఆ క్షణాన నా మస్తిష్కానికి అంతకన్నా ఉన్నతమైన ఆలోచన తట్టలేదు. ఏదో తట్టినట్టుగా తటాలున టెర్రస్ పైకి వెళ్ళాను. అప్పటికే టైమ్ అర్ధరాత్రి. ఒకటీ యాభై అవుతోంది. కొద్దిసేపు భూగోళాన్ని విడిచి ఆకాశానికేసి చూస్తూ నక్షత్రాల సోయగాల్ని ఆస్వాదిస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి టైమ్ ట్రావెలింగ్ చేసినట్లు అనిపించింది. దాదాపు రెండు దశబ్దాల కాలం ఒక్కసారిగా కళ్లముందు కదలాడింది. ఆరవ తరగతిలో అనుకుంటా ఊరికి దూరంగా హాస్టల్లో చేర్పించారు. అప్పుడు మొదలైన జీవనపోరాటం ఇప్పుడు ఈరోజు ఈ మహానగరంలో జాబ్ చేస్తూ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి, ట్రాఫిక్ ని జయించి ఫ్లాట్‌కి వచ్చేసరికి రాత్రి అవుతుంది. అప్పుడప్పుడూ టెర్రస్ మీదకు వచ్చినా.. ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ తిరగడం మినహాయించి అంత నిశితంగా ఆకాశానికేసి చూసింది లేదు. ఇప్పుడు ఇలా పరికించి చూస్తుంటే చిన్నప్పుడు ఆరుబయట మంచం మీద పడుకుని ఒక్కో నక్షత్రాన్ని జాగ్రత్తగా లెక్కపెట్టిన క్షణాలు గుర్తొచ్చాయి. అదేంటో ఎన్ని అంకెలు జత చేసినా లెక్క తేలేదికాదు. అలసిపోయి ఆదమరిచి నిద్రపోవడం తప్ప ఏనాడూ లెక్క పూర్తి చేసింది లేదు. చుక్క రాలిపడుతున్నప్పుడు మనసులో కోరుకున్నది నిజమైపోతుందని నాయనమ్మ చెప్పిన కథలు మనసులోనే నాటుకుపోయాయి. రియా పట్ల నా ప్రేమ సత్యమైతే, తన ప్రేమను పొందగలను అనేది నా నమ్మకం. ఆ వేళ ఆకాశంలో చుక్కలేవీ రాలి పడటం లేదు. నిలిచి ఉన్న చుక్కలే నా ప్రేమను నిలబడతాయని అనుకున్నాను. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమీ తెలియకపోయినా పెట్టని ఆ సుముహూర్తాన రెండోపొద్దు జామున రెండుగంటల ముప్ఫై ఆరు నిమిషాలకు మేసేజ్ చేశాను. ఏంటో ఈ భావన! భయమో, ఆత్రమో తెలియడం లేదు. రెండుగటలయింది ఆఫీస్‌కి వచ్చి. కానీ తనవైపు తలెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కారే చెమటని ఏసీ కూడా నియంత్రించలేకపోతోంది. ఇదంతా గమనించింది కాబోలు వచ్చి పక్కన కూర్చుంది. గుండె వేగం కాంతితో పాటు పయనిస్తున్నట్లు ఉంది. ఏమీ మాట్లాడకపోయినా నా వైపే చూస్తుందన్న విషయం నాకు అర్థమవుతోంది. మెల్లిగా తన అరచేతిని నా చేతిమీద పెట్టింది. ఎన్ని హిమపాతాలను తోడు తెచ్చుకుందో కానీ ఆ స్పర్శ నా శరీరాన్నే కాదు నా హృదయాన్ని కూడా చల్లబరిచింది. మెల్లిగా తనవైపు తిరిగాను. ‘డు యు థింక్ ఇట్ వాజ్ ఎ ప్రపోజల్?’ అన్నది సున్నితంగా. నాకు నోట మాట రాలేదు. బలవంతంగా గొంతు పెకల్చి ‘ఐ యామ్ సారీ ఫర్ దట్’ అని చెప్పాను. ‘ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు’ అదే సున్నితమైన స్వరంతో. నేను మౌనం దాల్చాను. ‘చూడూ.. ఈ ఫీలింగ్స్, ప్రేమ, వ్యక్తీకరణ ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమేనని నేను నమ్ముతాను. వాటి కొరకే జీవించాలి, ఆ భావాలే జీవితాన్ని నడిపిస్తాయి అంటే నమ్మను. నీ ప్రేమను గౌరవిస్తాను. నా మీద నీకున్న ప్రేమకి నా మనసు అంగీకారం తెలిపితే నిన్ను నమ్మి ఎంత దూరమైనా వస్తాను. కానీ ఆ ప్రయాణంలో నా వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి ఎంత మాత్రం ఇష్టపడను. నిన్న పుట్టి ఈరోజు మరణించే ప్రేమలను నేను నమ్మను. నీకు ప్రేమ పుట్టినంత సులభంగా నాకూ పుట్టాలనుకోకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను. నేను ప్రేమను ప్లాన్ చేయలేను దానంతట అది జరిగిపోవాలి. ముందు మనిద్దరికిద్దరం అర్థమవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అర్థంలేని భావోద్వేగాలతో అనుక్షణం నేను చస్తూ నిన్ను చంపుతూ బతకడం నాకిష్టం లేదు. మనమింకా అర్థం చేసుకునేంత దూరం ప్రయాణించలేదు. ఓపికతో ఉండు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతుంది!’‘నాది ప్రశ్న కాదు ప్రేమ’ అనాలోచితంగా అనేశాను. ‘నాకు ప్రేమ అనేదే పెద్ద ప్రశ్న! దానికి సమాధానం అన్వేషించడానికి నేనిప్పుడు సిద్ధమవ్వాలేమో!’ అంటూ కుర్చీలో నుంచి లేచి తన క్యాబిన్ వైపు అడుగులు వేసింది. ఈ అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి సంపూర్ణంగా అర్థం చేసుకోగలరా? ఒకవేళ ప్రయత్నించినా దానికేమన్నా గడువు ఉంటుందా. ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావజాలాలు.. ఇవన్నీ నిరంతరం మారేవే కదా. వీటన్నిటి సమాహారమే కదా మనిషి అంటే. కాలానుగుణ మార్పుల వల్ల కోతకు గురవ్వని మనిషి ఎవరైనా ఉంటారా! మనం మన గతాన్ని తవ్వి చూసుకున్న ప్రతిసారీ మనకు మనమే ఒక నూతన వ్యక్తిగా పరిచయమవుతాం. అలాంటిది ఈ రోజు ఉన్న నన్ను తన భవిష్యత్ మొత్తానికి ఆపాదించుకుని చూసుకోవడం, దానినే అర్థం చేసుకున్నానని భ్రమపడటం హాస్యాస్పదం కాదా? మనిషి మస్తిష్కంలో పొరలు పొరలుగా దాగున్న స్వభావాన్ని, అవే లక్షణాలు కలిగిన మరొకరు తెలుసుకోగలరా. ఒకవేళ ప్రయత్నించినా అది అంత సులభమా. ఇవన్నీ తనతో మాట్లాడలేను. తన కోసం ‘ఎన్సెఫలాటోస్ వూడి’ అనే చెట్టులాగా ఎదురుచూడటం తప్ప నాకు మరొక ప్రత్యామ్నాయం లేదు. మేము జంటగా కోల్పోతున్న ఈ క్షణం గురించి బాధ తప్ప మరో ఆలోచన లేదు. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమి తెలియకపోయినా.. -
అడ్డు గడులలో నెం. 52
పేపర్లో మన ఊరి పేరు కనిపిస్తేనే ఆసక్తిగా చూస్తాం కదా, అలాంటిది ఏకంగా మన పేరే పేపర్లో వస్తే? ఊరంతా తిరిగి ఆ సంతోషాన్ని తలా ఇంత పంచి పెడతాం. త్రిష కూడా మొన్న ఆదివారం (3 నవంబర్) అటువంటి సంతోషంలోనే తేలియాడారు. పైగా ఆమె పేరు వచ్చింది ఇంటర్నేషనల్ పేపర్లో. అది కూడా ప్రసిద్ధ ‘న్యూయార్క్ టైమ్స్’ మేగజీన్ లో! ఫిల్మ్ న్యూస్ కేటగిరీలో ఆమె పేరు వచ్చుంటే.. సినీ స్టార్ కనుక రాసి ఉంటారని అనుకోవచ్చు. కానీ త్రిష పేరు ప్రస్తావనకు వచ్చింది న్యూయార్క్ టైమ్స్ 1942 నుంచీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న ‘క్రాస్‌వర్డ్ పజిల్’లో! పజిల్లో నిలువు గడులు, అడ్డు గడులు ఉంటాయి కదా, అడ్డు గడులలోని 52 వ ‘క్లూ’గా ‘యాక్ట్రెస్ కృష్ణన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా’ ఎవరు అని అడిగారు. ఇంకెవరు? త్రిషనే! ఆమె పూర్తి పేరు త్రిషా కృష్ణన్ . ఇకనేం.. 52 అడ్డులోని ఆరు గడులను టి.ఆర్.ఐ.ఎస్.హెచ్.ఎ. అని తన పేరుతో నింపి, ఆ పజిల్ స్క్రీన్ షాట్‌ను ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు త్రిష. ‘‘నా పేరు న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిందహో’’.. అంటూ ‘‘ఒకే బై, షోయింగ్ పూర్తయింది’’ అని ఓ సరదా కామెంట్ కూడా ఆ పోస్ట్‌కి జత చేశారు. ఈ సంతోషం అక్కడితో ఆగలేదు. సమంతా కూడా షేర్ చేసుకున్నారు. ‘‘నువ్వు క్వీన్ త్రిషా’’ అన్నారు. అందుకు త్రిషా ‘‘ఆ.. సామ్.. మనిద్దరం ఒకటే’’ అని రిప్లయ్ ఇచ్చారు. అవును, వీళ్లిద్దరూ ఒకటే. చిన్న చిన్న సంతోషాలకు కేరింతలు కొట్టే చిన్న పిల్లల మనసున్న సెలబ్రిటీలు. -
యువ కథ.. లాయర్ నోటీస్
పేషంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డంతా హడావిడిగా ఉంది. ఒక్కొక్కరి మొహంలో ఒక్కో భావం. కూతురి వైపు చూశాడు లాయర్ బ్రహ్మారెడ్డి. తల గోడకు ఆన్చి, నిద్ర పోతున్నట్టుగా ఉంది. ఆమెకిప్పుడు ఆరో నెల. తాత కాబోతున్న సంతోషం తొలి రెండు నెలలు మాత్రమే. మాటా మాటా పెరిగి, అల్లుడు చెయ్యి చేసుకున్నాడంట. నేరుగా ఇంటికి వచ్చింది కూతురు. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్థలు మామూలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ అర్థమైంది సర్దుకునేంత చిన్నది కాదని.చూస్తుండగానే మూడు దాటి, నాలుగో నెల వచ్చింది. వీళ్లు చూస్తే పంతంబట్టినట్టు ఎవరి లోకంలో వాళ్లున్నారు. రేపేదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుందని ఎన్నో కేసులు వాదించిన అనుభవం మెదడు తడుతోంది.బిడ్డ పుడితే కలవకపోతారా అనే దింపుడు కల్లం ఆశ కూడా లేకపోలేదు. తీరా బిడ్డ పుట్టేక వాళ్లు రాకుంటే? కూతురు ఇంకో పెళ్లి వద్దంటే? కూతురు ఒప్పుకున్నా బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? చేసుకున్నా కూడా కూతురు జీవితం సంతోషంగా ఉంటుందా? ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డకు ఏదో ఒక అవయవ లోపముంది అని డాక్టరే అబార్షన్ సూచిస్తే మేలనిపిస్తోంది. వాళ్లు చెప్పకుండా మనమే ఆ మాట అడిగితే బాగుండదేమో.పొంతనలేని ఆలోచనలు ఎటెటో తరుముతున్నాయి. చుట్టూ చూశాడు. ఎంతకూ తరగడం లేదు జనాలు. తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. న్యూస్, వీడియోలు, కోర్టు కేసులు దేని మీదా ధ్యాస కుదరక బయటికి నడిచాడు. లోపల స్థలం సరిపోనోళ్లంతా మెట్ల మీద, గేటు దగ్గర ఎక్కడపడితే అక్కడ కూర్చున్నారు.ఇంతలో గలగలా మాట్లాడుతూ బయటికొచ్చింది ఒక గుంపు. నడి వయస్కురాలి చేతిలో బెడ్, మధ్యలో చిన్న ఆకారం. పాపో బాబో గానీ అందరి మొహాల్లోనూ మురిపెం తెలుస్తోంది. చూస్తేనే చెప్పొచ్చు అబ్బాయి తరపు వాళ్లని. ఇలాంటివి చూసినప్పుడే అల్లుడి నుంచి గానీ, వాళ్ల తల్లిదండ్రుల నుంచి గానీ కనీసం ఇందులో పది శాతం కూడా అమ్మాయి మీద ఆపేక్ష లేదే అని బాధపడిపోతాడు బ్రహ్మారెడ్డి. వీటన్నింటి మధ్యన మరింత కుంగదీసేది కూతురి మౌనం. జీవితమంతా అయిపోయిన దానిలా ఎప్పుడూ దిగాలేసుకుని ఉంటుంది. ఇప్పుడు దిగులుపడితే మాత్రం చెయ్యగలిగేదేముందీ..!ఏదో పెళ్లిలో అమ్మాయిని చూశారంట. బాగా నచ్చింది, రూపాయి కట్నం వద్దు అని తెలిసిన మనిషిని పంపించారు. ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలిగా చేసుకుంటాం అని ఇంటికొస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అబ్బాయి ఏ ఉద్యోగం చెయ్యకున్నా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉంది. కూతురు భవిష్యత్తే కాదు, కలెక్టర్ వియ్యంకుడిగా సమాజంలో తనకెంత గౌరవం, పరపతి! అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా..! కూతురి పేరు అనౌన్స్మెంట్లో రావడంతో ఆలోచనలు ఆపి, లోపలికి నడిచాడు. ‘బేబీ గ్రోత్ బాగుంది. మదర్ కొంచెం వీక్‌గా ఉంది. హెల్దీ డైట్ మెయింటెయిన్ చెయ్యండి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది డాక్టర్.రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అల్లుడు రాలేదు.‘డెలివరీ అయ్యాకైనా వస్తాడా రాడా?’ అంటూ బెదిరిపోతున్నాడు బ్రహ్మారెడ్డి. అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరక, సీరియస్ అయ్యి, సిజేరియన్ చేసినారని తెలిసినా కూడా రాలేదు. అల్లుడే కాదు, వాళ్ల తరపునుంచి ఒక్కరూ రాలేదు. తెలిసిన వాళ్ల చేత మాట్లాడించాడు. పెద్దవాళ్లు అదీ ఇదని ఏదో చెప్పబోయారంట గానీ ‘నాకే పుట్టిందని గ్యారెంటీ ఏముందీ’ అన్నట్టు అన్నాడంట అబ్బాయి. ఇదే మాట ఎదురుగా అని ఉండుంటే తల పగలగొట్టాలి అనేంత కోపం వచ్చింది. కూతురితో చెప్పలేదు. భార్యతో అంటే ‘వానికి లేని చెడ్డలవాట్లు లేవంట. ఆ విషయం వాళ్లమ్మా నాయనకు ముందే తెలిసినా పెళ్లి చేస్తే అయినా దారికొస్తాడని చేశారంట. కొత్తవాళ్లతో సంబంధం మంచిది గాదని చెప్తున్నా వినకుండా పెద్ద వాళ్ల సంబంధం అని దాని గొంతు కోశావు’ అన్నాళ్లూ లోపల దాచుకున్న ఆక్రోశమంతా బయటికి వెళ్లగక్కింది.ఏదో ఫంక్షన్లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు.‘ఇలాంటి కేసులు నీ సర్వీసులో ఎన్ని చూసుంటావు! అయినా ఈ కాలంలో ఎవర్రా విడాకులకు భయపడేది?’ అన్నాడు.నిజమే. లాయర్ బ్రహ్మారెడ్డి అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకున్నాడంటే అబ్బాయి వాళ్లు, అబ్బాయి తరపునైతే అమ్మాయి వాళ్లు తలలు పట్టుకుంటారు. కానీ ఇది స్వంత కూతురి విషయం. మధ్యవర్తిత్వం ద్వారా కొంత ప్రయత్నం చేశాడు. కుదరలేదు.‘అందరికీ విడాకులు ఇప్పించి ఇప్పించి వాళ్ల ఉసురు కొట్టుకుని కూతురి జీవితం ఇలా చేసుకున్నాడని తలా ఒక మాట అంటారని ఇన్నాళ్లూ రాజీ కోసం చూశాను. అది నా అసమర్థత అనుకుంటున్నారు’ అనుకుంటూ ఆఫీసుకెళ్లి గృహహింస కేసు, వారం తర్వాత మెయింటెనె¯Œ ్స కేసు ఫైల్ చేశాడు. ఈ రెండింట్లో వీలైనంత వరకూ విసిగించి, వాళ్లే విడాకులకు అప్లై చేసేలా చేస్తే భరణం అడగొచ్చు అనుకుంటే ఎన్నాళ్లు చూసినా కేసు హియరింగ్‌కి రాలేదు. పంపించిన నోటీసులు వెనక్కి వచ్చాయి. ఏమైందని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్‌లో వాళ్లు లేరన్నారంట. క్లైంట్ల కోసం తను వాడే పోస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్‌ను తిరిగి తన మీదకే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ బ్రహ్మారెడ్డికి.మరో నెల చూసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. అయితే అనుకున్నట్టుగా సాగడంలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాయిదాలు అడుగుతున్న అవతలి లాయర్‌ను చొక్కా పట్టుకుని కొట్టాలన్నంత కసి. లాయర్ అంటే పోనీ చంటి బిడ్డను తీసుకుని కోర్టుకు వచ్చే నా కూతురి గురించి ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదా ఆ జడ్జికి..! ఆమె కూడా మహిళే కదా. తీర్పు దగ్గరకొస్తోంది అనంగా పై కోర్టుకు అప్లై చేశారు. అక్కడా అదే సాగతీత. చేసేదేం లేదు చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్లూ క్లైంట్ తరపున ఇవన్నీ చూస్తుంటే తనేదో విజయం సాధిస్తున్నట్టుగా అనిపించేది గానీ ఇప్పుడు తనే ఒక పిటిషనర్‌గా అవి అనుభవిస్తుంటే ఆక్రోశంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు. కానీ ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. కేసును అంత సులభంగా వదలనని బ్రహ్మారెడ్డికీ తెలుసు గానీ, వాళ్లకున్న పలుకుబడి, డబ్బుతో తీర్పును ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటారోనని చిన్న సంశయం.అదే జరిగితే శ్రమ, సంపాదన, జీవితం గురించి కనీసం ఆలోచన కూడా చెయ్యని కూతురి భవిష్యత్ ఏంటో అర్థం కాలేదు అతనికి. ఆరోజు కోర్టు కేసులు ఏమీ లేకపోవడంతో టీవీ పెట్టుకుని, సోఫాలో పడుకున్నాడు.‘పాప బర్త్‌డేకి లంగా జాకెట్ కుట్టించమని చెప్పొస్తాం. చూస్తూ ఉండు నాన్నా’ అంటూ కూతురు, భార్య బయటికి వెళ్లారు.మనమరాలి వైపు చూశాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ నేల మీదనే నిద్రపోయినట్టుంది. ‘కేసు గెలుస్తామో, ఓడిపోతామో? భరణం వస్తుందో, రాదో? విడాకులైతే తీసుకోవాలి. తీసుకుంటుంది సరే, కానీ కూతురి భవిష్యత్..! పాపను వదిలెయ్యి అంటే కూతురు ఒప్పుకుంటుందా? ఎక్కడెక్కడి ఆలోచనలన్నీ పాప దగ్గరే ఆగుతున్నాయి. అసలు ఆ పాపే పుట్టకుండా ఉండుంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు కదా! ఆరోజే అబార్షన్ చేయించాల్సింది.. తప్పు చేశాను’ అనుకుంటూ నిద్రకు, మెలకువకు కాని స్థితిలో కళ్లు మూసుకున్నాడు.మెలకువ వచ్చి చూసేసరికి పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టుకింద రాలిపడిన పూలతో ఆడుకుంటోంది. పక్కనే వాటర్ సంప్ ఉంది. కొంచెం కదిలినా అందులో పడిపోతుంది.పక్కకు తీసుకొద్దామా, వద్దా..! చుట్టూ చూశాడు. తనను ఎవరూ గమనించలేదు అని అర్థమైంది. ఇదే అవకాశం. డోరు చాటుకు నక్కి, కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తోంది.‘పాప పడిందా, రెండే రెండు నిమిషాలు చాలు. గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది, వారం పది రోజులు మహా అయితే ఓ నెల రోజులు బాధపడుతుంది. పడనీ తర్వాత మెల్లిగా మరిచిపోతుంది. నిదానంగా పెళ్లి చెయ్యొచ్చు. ఒకవేళ పాప నీళ్లల్లో పడిన శబ్దం పక్కింటోళ్లో, దారిలో పొయ్యే వాళ్లో ఎవరైనా గమనించారా మన దరిద్రం’ రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక్కసారిగా.గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్లంతా చెమటలు. పది నిమిషాలకు కదిలింది. చెయ్యి తీసి మరో చెయ్యి మారిస్తే చాలు పడబోతుంది అనంగా గేటు తీసిన శబ్దం. గట్టిగా కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది కూతురు. మొహానికి పట్టిన చెమట తుడుచుకుని, ఏం తెలియనట్టు వెళ్లి సోఫాలో పడుకున్నాడు.‘ఒక్క అడుగు ఆలస్యమైనింటే..!’ కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. ఆ అరుపులకు మెలకువొచ్చినట్టు లేచి ‘ఏమైందీ’ అడిగాడు అమాయకంగా.మనమరాలి ప్రాణాపాయం నుంచి మొదలు కోర్టు కేసు, విడాకులు, అత్తగారింట్లో కూతురి కష్టాలు, పెళ్లి మొదలు మొగుడి చేతగానితనం వరకూ అన్నీ చదువుతూనే ఉంది సాయంత్రం వరకూ. ఎలా తప్పించుకోవాలి అనుకుంటుండగా ‘స్టేషన్‌కి కొత్త ఎస్సై వచ్చిందంట. వెళ్లి ఫార్మాలిటీగా కలిసొద్దాంరా’ అని లాయర్ ఫోన్ చెయ్యడంతో వెళ్లాడు.యంగ్ ఆఫీసర్. ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగ్. అందరూ పరిచయం చేసుకున్నారు. అవీ ఇవీ మాట్లాడి, కదలబోతుండగా నేమ్ ప్లేట్ చూశాడు. ఈ పేరు ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ మొహం చూశాడు. గుర్తుకొచ్చింది. నాలుగేళ్ల కిందట తాను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఆ అమ్మాయి రెస్పాండెంట్.లాయర్ బ్రహ్మారెడ్డి మనసులోని భావం గ్రహించినట్టు నవ్విందామె. ఇంటికొచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతోంది. నిద్రపట్టలేదు. ఆ అమ్మాయి కేసు కళ్ల ముందు మెదిలింది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురిదీ అదే పరిస్థితి. మనసులో ఎంత సంఘర్షణ అనుభవించేదో గానీ బయటికి మాత్రం నిండు కుండలా ఉండేది. అంత బాధనూ దిగమింగుకుని, పడిలేచిన కెరటంలా ఇప్పుడు ఎస్సైగా రావడం చూసి తల తీసేసినట్టుగా ఉంది. ఏదో అపరాధభావం.నెల రోజులు గడిచాయి. ఒకట్రెండు సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురి కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకొచ్చి, టైమ్ ఉండడంతో జీప్‌లో కూర్చుని ఉంది ఎస్సై.‘నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆరోజు అలా చెయ్యాల్సింది కాదు’ అంటూ బాధపడ్డాడు. అతని మాటల్లో తేడా తెలుస్తోంది.అంతా విని, ‘ఇన్నాళ్లకు తెలిసిందా లాయర్ బ్రహ్మారెడ్డి గారూ. నేను మగాన్ని ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి పడాలి అన్నట్టు బిహేవ్ చేసేవాడు. నా వల్ల కాలేదు. విడిపోదాం అనుకునేంతలో కడుపులో బిడ్డ. తెలిసో తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి పుట్టబోయే బిడ్డనెందుకు ఒంటరి చెయ్యడం అని సర్దుకుపోదామనుకున్న ప్రతిసారీ వాళ్లమ్మొక మాట, నాన్నొక మాట, అక్కొక మాట. ఎంతకాలం పడాలి? అసలెందుకు పడాలి? విడిపోతాం. ఎవరి బతుకు వారిది. మరి పాప పరిస్థితి? పాప భవిష్యత్ కోసం మెయింటెనె¯Œ ్స, భరణం అడిగితే చట్ట పరంగా ఒకపక్క, నా క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మరోపక్క ఎంతలా వేధించారు. నీకూ ఒక కూతురుండి, తనకు ఇలా జరిగినా కూడా ఇలాగే చేస్తావా అని అడుగుదామని ఆరోజు మీ దగ్గరికి రాబోతుంటే అద్దాల చాటున మీరు చూసిన చూపు గుర్తుందా?’ అతని వైపు చూసింది.ఆమె కళ్లల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు.‘ఏదోకరోజు కాళ్ల బేరానికి రాకపోదా అని మీరనుకున్నారు. నేను నాలా బతుకుతున్నా’ జీప్ దిగి, క్యాప్ సర్దుకుంటూ కదిలిపోయింది.ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్కొక్కమాట ఒక్కో సూదిలా గుచ్చుతున్నాయి. నిజమే. ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాలు చేసి గెలిచింది. మరి నేను..? పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపొయ్యాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీళ్లు తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇంతకుముందు క్లైంట్లు, రెస్పాండెంట్లు కనపడేవాళ్లు. ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు. -
భారత్‌లో బెస్ట్ బ్యాంక్‌గా ఎస్బీఐ
ప్రభుత్వ రంగ బ్యాంక్ 'ఎస్బీఐ' (SBI) 'భారతదేశంలో అత్యుత్తమ బ్యాంక్'గా గుర్తింపు పొందింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 'బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా'గా ఎంపిక చేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ సమావేశంలో భాగంగా.. వాషింగ్టన్ డీసీలో జరిగిన 31వ యానివెర్సరీ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. ఈ సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్.. సీఎస్ సెట్టి ఈ అవార్డును స్వీకరించారు.22,500 పైగా శాఖలు.. 62,000 కంటే ఎక్కువ ఏటీఎంలతో విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న ఎస్బీఐ.. యోనో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా భారతీయ బ్యాంకింగ్ రంగంలో తన వృద్ధిని బలోపేతం చేస్తోంది. 2024-25 మొదటి త్రైమాసికంలో 63 శాతం సేవింగ్స్ ఖాతాలు డిజిటల్ విధానంలో ఓపెన్ అయ్యాయి. అంతే కాకుండా యోనో ద్వారా మొత్తం రూ. 1,399 కోట్ల వ్యక్తిగత రుణాల చెల్లింపులు జరిగినట్లు సమాచారం.ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలుభారతదేశంలో చాలామంది.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎస్బీఐ బ్యాంకులో ఖాతాలో ఓపెన్ చేయడానికి లేదా లావాదేవీలను జరపడానికి ఆసక్తి చూపుతారు. ఎస్బీఐ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువవుతూనే ఉంది. ఇలా మొత్తం మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకుగా అవతరించింది. ఈ కొత్త అవార్డు సాధించినందుకు స్టమర్లకు, ఉద్యోగులకు, ఇతర వాటాదారులందరికీ ఎస్బీఐ ధన్యవాదాలు తెలిపింది.SBI was recognised as the Best Bank in India for the year 2024 by Global Finance Magazine at its 31st Annual Best Bank Awards event, which took place during the sidelines of International Monetary Fund (IMF)/ World Bank (WB) Annual Meetings 2024 at Washington, D.C., United… pic.twitter.com/ZEz94Hn0QN— State Bank of India (@TheOfficialSBI) October 26, 2024 -
'ఋతధ్వజుడు మదాలసల గాథ'
ఋతధ్వజుడి తండ్రి శత్రుజిత్తు మహారాజు. ఒకనాడు శత్రుజిత్తు కొలువుదీరి ఉండగా, గాలవుడు అనే బ్రాహ్మణుడు ఒక అశ్వాన్ని తీసుకుని వచ్చాడు. ‘‘మహారాజా! ఒక రాక్షసుడు నా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాడు. మాయావి అయిన ఆ రాక్షసుడు ఏనుగు, సింహం వంటి జంతువుల రూపాలు ధరించి, అడవినంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడిని శపించడానికి నా శక్తి చాలదు. ఒకవేళ శపించినా, నా తపస్సంతా వ్యర్థమైపోతుంది. వాడిని ఏమీ చేయలేకపోతున్నానే అనే నిస్సహాయతతో ఆకాశంవైపు చూసి నిట్టూర్చాను. అప్పుడు ఆకాశం నుంచి ఈ దివ్యాశ్వం భూమి మీదకు వచ్చింది. అదే సమయంలో అశరీరవాణి ఇలా పలికింది: ‘ఈ దివ్యాశ్వం భూమి మీదనే కాదు, ఆకాశ మార్గంలోను, పాతాళంలోనూ సంచరించగలడు. గిరులను, సాగరాలను అధిగమించగలదు. సమస్త భూమండలాన్నీ శరవేగంగా చుట్టేయగలదు. అందువల్ల దీనిపేరు కువలయం. శత్రుజిత్తు మహారాజు కొడుకు ఋతధ్వజుడు దీనిని అధిరోహించి, నీ తపస్సుకు ఆటంకం కలిగిస్తున్న అసురాధముణ్ణి సంహరించగలదు’ అని చెప్పింది’ అని పలికాడు. గాలవుడి మాటలు విన్న శత్రుజిత్తు తన కుమారుడు ఋతధ్వజుణ్ణి పిలిచి, ఆ అశ్వాన్ని అప్పగించి, గాలవుడి ఆశ్రమానికి రక్షణగా పంపాడు. ఋతధ్వజుడు గాలవుడి ఆశ్రమానికి వెళ్లి, ఆశ్రమవాసులందరికీ రక్షణగా ఉండసాగాడు. ఋతధ్వజుడు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియని రాక్షసుడు యథాప్రకారం అడవిపంది రూపం ధరించి వచ్చి, నానా బీభత్సం మొదలుపెట్టాడు. ఆశ్రమంలోని గాలవుడి శిష్యులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీయసాగారు. ఋతధ్వజుడు వారి ఆర్తనాదాలు విని, కువలయాశ్వాన్ని అధిరోహించి, ఆగడం సాగిస్తున్న అడవిపంది వెంట పడ్డాడు. దాని మీదకు పదునైన బాణాలను సంధించి వదిలాడు. బాణాల దెబ్బలు తాళలేక అడవిపంది రూపంలో వచ్చిన రాక్షసుడు అడవిలోకి పరుగు తీశాడు. రాక్షసుడి అంతు చూద్దామనే పట్టుదలతో ఋతధ్వజుడు వెంటాడసాగాడు. అడవి నలువైపులా పరుగులు తీసి అలసిపోయిన రాక్షసుడు ఒక పెద్ద గోతిలోకి దూకి మాయమయ్యాడు. ఋతధ్వజుడు కూడా తన కువలయాశ్వంతో పాటు ఆ గోతిలోకి దూకాడు. ఆ గోతిలోంచి అతడు పాతాళలోకానికి చేరుకున్నాడు. పాతాళలోకం దేదీప్యమానంగా వెలిగి పోతోంది. ఎటు చూసినా బంగారు ప్రాకారాల ధగధగలు కనిపించాయి. ఇంద్రలోకంలాంటి పట్టణం కనిపించింది. ఋతధ్వజుడు ఆ పట్టణంలోకి వెళ్లాడు. వీథుల్లో ఎవరూ కనిపించలేదు. కాసేపటికి ఒక యువతి హడావుడిగా వెళుతూ కనిపించింది. ‘ఎవరు నువ్వు? ఎక్కడకు పోతున్నావు?’ అని ప్రశ్నించాడు. ఆమె బదులివ్వకుండా దగ్గర్లోనే ఉన్న ఒక మేడ మీదకు వెళ్లింది. ఋతధ్వజుడు ఆమెనే అనుసరిస్తూ మేడ మీదకు వెళ్లాడు. మేడపైన గదిలో ఒక సౌందర్యరాశి కనిపించింది. అపరిచితుడైన రాకుమారుడు అకస్మాత్తుగా తన గదిలోకి వచ్చేసరికి ఆమె చకితురాలైంది. వెంటనే మూర్ఛపోయింది. ఋతధ్వజుడు వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని, భయపడవద్దంటూ సముదాయించాడు. ఇంతలోనే ఆమె చెలికత్తె వచ్చి ఆ సౌందర్యరాశికి పరిచర్యలు చేయసాగింది. ‘ఆమె ఎందుకిలా మూర్ఛపోయింది’ అని చెలికత్తెను ప్రశ్నించాడు ఋతధ్వజుడు. ‘ఈమె గంధర్వరాజు విశ్వావసుడి కుమార్తె మదాలస. నేను ఈమె చెలికత్తెను. నా పేరు కుండల. మదాలస వనంలో ఆటలాడుకుంటుండగా, పాతాళకేతువు అనే రాక్షసుడు ఆమెను అపహరించుకు వచ్చాడు. వచ్చే త్రయోదశినాడు ఈమెను వివాహం చేసుకోబోతున్నాడు. అధముడైన రాక్షసుణ్ణి పెళ్లిచేసుకోవడం ఇష్టంలేక ఈమె నిన్ననే ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు ఒక గోమాత వచ్చి, భూలోకం నుంచి ఒక రాకుమారుడు వస్తాడని, రాక్షసుడిని చంపి మదాలసను వివాహమాడతాడని చెప్పింది. మిమ్మల్ని చూసిన మోహావేశంలో మా రాకుమారి మూర్ఛపోయింది. మీరు దైవాంశ సంభూతుల్లా ఉన్నారు. మామూలు మానవులు ఇక్కడ అడుగుపెట్టలేరు. మీ వృత్తాంతం చెప్పండి’ అంది కుండల. ఋతధ్వజుడు తనను తాను పరిచయం చేసుకుని, ఏ పరిస్థితుల్లో అక్కడకు వచ్చాడో వివరించాడు. ఇంతలో మూర్ఛనుంచి తేరుకున్న మదాలస తన ఎదుట ఉన్న రాకుమారుణ్ణి చూసి సిగ్గుపడింది. ‘రాకుమారా! ఈమె మీ మీద మనసుపడింది. గోమాత చెప్పిన రాకుమారుడు మీరే! గోవు అసత్యం చెప్పదు. అందువల్ల మీరు ఈమెను వివాహం చేసుకోండి’ అని కోరింది కుండల. ‘ఈమెను వివాహమాడటం నాకూ ఇష్టమే గాని, తండ్రి అనుమతి లేకుండా ఇప్పటికిప్పుడు ఎలా వివాహం చేసుకోగలను?’ అన్నాడు ఋతధ్వజుడు. ‘రాకుమారా! ఈమె దేవకన్య. ఇది ముందే జరిగిన దైవనిర్ణయం. మీరు అభ్యంతరం చెప్పకుండా ఈమెను వివాహం చేసుకోండి’ అంది కుండల. ‘సరే’నన్నాడు ఋతధ్వజుడు. కుండల వెంటనే తమ కులగురువైన తుంబురుణ్ణి స్మరించింది. తుంబురుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడికక్కడే అగ్నిహోత్రాన్ని వెలిగించి, మదాలసతో ఋతధ్వజుడికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుండల కూడా సెలవు తీసుకుని, గంధర్వలోకానికి వెళ్లిపోయింది. ఋతధ్వజుడు మదాలసను తీసుకుని, అక్కడి నుంచి బయలుదేరడానికి కువలయాశ్వాన్ని అధిరోహించాడు. మదాలసతో అతడు అశ్వంపై వెళుతుండగా గమనించిన రాక్షసులు అతడి మీద దాడి చేశారు. వరుసగా ఆయుధాలను రువ్వారు. ఋతధ్వజుడు వారందరినీ ఎదుర్కొన్నాడు. తన బాణాలతో వారి ఆయుధాలను తుత్తునియలు చేశాడు. రాక్షసుల ద్వారా సంగతి తెలుసుకున్న పాతాళకేతువు స్వయంగా రంగప్రవేశం చేశాడు. ఋతధ్వజుడిపై అస్త్రాలను సంధించాడు. ఋతధ్వజుడు అతడి అస్త్రాలన్నింటినీ తన దివ్యాస్త్రాలతో నిర్వీర్యం చేశాడు. చివరగా త్వాష్ట్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం పాతాళకేతువు సహా రాక్షసులందరినీ మట్టుబెట్టింది. ఋతధ్వజుడు మదాలసతో కలసి క్షేమంగా తన రాజ్యానికి చేరుకున్నాడు. తండ్రికి జరిగినదంతా చెప్పాడు. శత్రుజిత్తు కుమారుణ్ణి ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. కోడలిని చూసి అభినందించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: వద్దమ్మా.. తప్పూ! -
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్న అమెరికా పత్రికలు!
'ఉదయం పూట టీ త్రాగగానే దినపత్రిక తిరగేసిన అలవాటు, అది కూడా తెలుగు పత్రిక అయితేనే తృప్తి. లాప్టాప్ ముందుపెట్టి మీకు కావలసిన పత్రిక చదువుకొండి! అంటున్నారు అమెరికాలో పిల్లలు. నిజమే నెట్లో వార్తలు తెలుసుకోవడం చాలా సులభం అయిపోయింది. అయినాసరే పేపర్‌ను చదవడమంటే వాలుకుర్చీలో ఒరిగి భౌతికంగా పేజీలను తిప్పుతూ శ్రీమతి విసుక్కున్నా ఆ వార్తలను గురించి ఆమెతో ప్రస్తావించడంలో లభించే ఆనందమే వేరు. అమెరికాలో న్యూస్‌పేపర్ తెప్పించుకొని చదివేవారు రోజురోజుకు తగ్గిపోతున్నారట. అంతదాకా ఎందుకు ఇప్పుడు మన దేశంలోనే ఆ పరిస్థితి వస్తుంది. వర్క్ చేసుకుంటూనే నెట్లో తాజావార్తలు చూసేస్తున్నారు. టీవీ న్యూస్ ఉండనే ఉన్నాయి, ఎటుపోయినా కారులో రేడియోలు మొగుతూనే ఉంటాయి. అంతదానికి ప్రత్యేకంగా న్యూస్ పేపర్ తెప్పించుకోవడం దేనికి అనుకుంటున్నది కొత్త తరం.' అమెరికాలో పత్రికలవాళ్ళు అమ్మకుండా మిగిలిన న్యూస్ పేపర్లను పాలితిన్ కవర్లలో చుట్టి మరీ ఇండ్ల ముందు పడేస్తుంటారు. అలా ప్రచారం కోసం వస్తున్న పత్రికలు ఎప్పటికప్పుడు తీయకపోతే చెత్తకుప్పలా తయారవుతాయి సుమా! ఇండియాలోనైతే వాటిని పాత వేస్ట్ కిందా అమ్ముకొని సొమ్ము చేసుకునే అవకాశమైనా ఉండేది ఇంట్లో మన ఆడవాళ్లకు. యూఎస్‌లో పేపర్ రద్దీకి ఒక ప్రత్యేక బాక్స్ ఉంచుతారు. అందులో వేస్తే అవి రీ సైక్లింగ్‌కు వెళ్లి పోతాయి. అమెరికాలో న్యూస్ పేపర్ ఖరీదు మనదేశంతో పోల్చుకుంటే తక్కువే అనవచ్చు. 50 సెంట్లకు అంతకు మించిన పేజీల పత్రిక, ప్రకటనల బ్రోచుర్లు కలుపుకొని వస్తుంది. ఆదివారం పేపర్ పేజీలు లెక్కించడం కాదు తూచి చూడాల్సిందే. అడ్వర్టైజ్మెంట్ కల్చర్ అంతగా పెరిగిపోయింది ఆ దేశంలో. వ్యాపార ప్రకటనలు చదువరులకు చేరవేయడానికి న్యూస్ పేపర్ల వాళ్లకు కవర్లలాగా ఉపయోగపడుతున్నాయనిపిస్తుంది. పేపర్ బాయ్స్ కారులో బయలుదేరి ఇంటింటికి పేపర్లు వేస్తూ వెళ్తుంటే మనకది చూడముచ్చట, కానీ అక్కడి వాళ్లకు మామూలే. ఒక దినపత్రికలో వార్తలు కాకుండా స్పోర్ట్స్, హెల్త్, ట్రావెల్, ఫ్లేవర్ అంటూ బోలెడు సప్లమెంట్లు, పిల్లల కోసం, పెద్దల కోసం పేజీలకు పేజీలు కార్టూన్లు, సినిమాలు, దుస్తులు, ఫర్నిచర్ ప్రకటనలు, స్పెషల్ ఆఫర్లు ఎన్నో.. ప్రత్యేక ఆసక్తి ఉంటే తప్ప పేపర్ మొత్తం చదవడం మాత్రం అయ్యే పనికాదు. ఇక రియల్ ఎస్టేట్ వారి కలర్ ఫుల్ ప్రకటనల గురించి చెప్పాల్సిన పనిలేదు (ఈ కల్చర్ ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేస్తుంది). అసలు వాళ్ళే అక్కడ దినపత్రికలను నడుపుతున్నారేమో అనిపిస్తుంది. అమెరికావారి పత్రికల్లో మనదేశం గురించిన వార్తలు ఎప్పుడో కాని కనబడవు. వాళ్ళ దృష్టంతా ఇస్లామిక్ దేశాల మీదనే, 9/11 దాడి తర్వాత వచ్చిన మార్పు ఇది. మన దినపత్రికల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, ప్రకటనలే ఎక్కువగా కనబడుతాయి, అమెరికా ఇందుకు భిన్నం అనిపిస్తుంది. అక్కడ దేశాధ్యక్షుడు కూడా ఎప్పుడో గానీ చిరునవ్వులు చిందిస్తూ పత్రికల్లో కనబడడు. వారి పత్రికల్లో స్థానిక సమస్యలకు, చదువులకు, కుటుంబ విషయాలకు, ఆరోగ్యానికి, రుచికరమైన ఆహార పానీయాలకు ప్రాధాన్యత ఎక్కువ. ఏమి తింటున్నామో అనే కాదు.., ఎలా తినాలో తెలిపే టేబుల్ మ్యానర్స్ కూడా వారికి ముఖ్యం. మరో విశేషం.. అమెరికా పత్రికల్లో ఎంగేజ్మెంట్లు, బర్త్‌డేలు, పట్టభద్రులకు అభినందనలు ఎక్కువ కనబడుతుంటాయి. ఆత్మీయులు చనిపోయినప్పుడు మొక్కుబడిగా ఫోటో వేసి నివాళులు అర్పించడం కాదు, సంక్షిప్తంగా గతించిన వారి జీవిత విశేషాలను పేర్కొనడం అక్కడి ఆనవాయితీ. క్లాసిఫైడ్స్ ప్రకటనల్లో ఎన్నెన్నో వింతలు పెంపుడు జంతువుల గురించి ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కపిల్ల తప్పిపోయిందని, పిల్లి మాయమైందని బెంగపెట్టుకొని వాటి రూపురేఖా విలాసాలు వర్ణిస్తూ ప్రకటనలు ఇస్తారు. దొరికినట్లయితే మరో ప్రకటన ద్వారా కృతజ్ఞతలు కూడా చెబుతారు. ఇక సేవల ప్రకటనలకు లెక్కే లేదు. అవసరమైన వారికి అందమైన వారిని పంపడం కూడా వారి దృష్టిలో సేవే, ఎవరి పిచ్చి వారికి ఆనందం. పత్రికల సర్క్యూలేషన్ విషయానికి వస్తే అమెరికాలో జాతీయ స్థాయిలో వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి ముందు వరుసలో ఉంటాయి. అయితే స్థానిక పత్రికల డిమాండ్ కూడా తక్కువేం లేదు, ప్రతి సిటీ పేరు మీద ఏదో పత్రిక ఉండనే ఉంటుంది. ముఖ్యమైన సెంటర్లలో, మాల్స్‌లలో వెండింగ్ మెషిన్ల ద్వారా పత్రికలు పొందవచ్చు, కాకపోతే మన వద్ద సరిపడా కాయిన్స్ ఉండాలి. చాలామంది ప్రకటనల కోసం వీకెండ్ పేపర్ లు కొంటుంటారు. మత, కమ్యూనిటీ పరమైన, విదేశీయుల పత్రికలకు కూడా అమెరికాలో కొరత లేదు. జర్నలిజం అమెరికాలో ఎంతో గౌరవ ప్రదమైన వృత్తి. ఎన్నెన్నో కుంభకోణాలను బయట పెట్టినవి వాళ్ళ పత్రికలు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పత్రికలది ప్రముఖ పాత్ర. 'విద్యార్థి దశలో నేను పాఠ్య పుస్తకాల కన్నా ఎక్కువగా చదివినవి పత్రికలే, గురువులకన్నా కూడా నన్ను ఎక్కువ ప్రభావితం చేసినవి పత్రికలు, సాహితీ పుస్తకాలే. ఇక్కడున్నా బయటి దేశాలకు వెళ్లినా సినిమాలు, షికార్ల కన్నా కూడా నా ప్రధాన కాలక్షేపం అవే. నేను ఎప్పుడైనా ఇంటినుండి బయటికి వెళ్తుంటే ‘జేబులో పర్సు పెట్టుకోవడం మరిచిపోయినా మా అయన పత్రికో పుస్తకమో పట్టుకోవడం మాత్రం మరిచి పోడని’ జోక్ చేసేది శ్రీమతి చంద్రభాగ!' — వేముల ప్రభాకర్ -
దిమ్మతిరిగే ఫొటోస్ వదిలిన హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
ఓ తెనాలి – తత్ దిన పత్రిక
ఆ పత్రిక కార్యాలయం అంతా సందడి సందడిగా ఉంది. ఇన్చార్జి క్యాబిన్లో నుంచి పొగలు సెగలు వస్తున్నాయి.బయట డెస్క్‌లో జర్నలిస్టు ధర్మారావు దిగాలుగా కూర్చుని ఉన్నాడు. అతని సహచరుడు లోకనాథం అతని దగ్గరకు వచ్చి, ‘ఏం బ్రదర్ డల్‌గా ఉన్నావ్? క్యాబిన్ నుంచి పొగలు సెగలు వస్తున్నాయి. బాస్ ఏమైనా తిట్టాడా?’ అని అడిగాడు.‘అంతేగా?’ అన్నాడు.‘ఎందుకయ్యా! రోజూ ఇలా. ఒకప్పుడు నువ్వు రాసే ఐటమ్స్ అంటే ఇటు పత్రికలోను అటు జనంలోనూ ఎంత హాట్ హాట్‌గా ఉండేవి? అంత చేయి తిరిగిన జర్నలిస్టువి, కాస్త మనసు కూడా చంపుకొని మసాలా వార్తలు రాశా వనుకో! నీ అనుభవానికి ఆ మసాలా తోడైతే వేడి వేడి మిరపకాయ బజ్జీల్లా ఉండవా నీ ఐటమ్స్? ఎందుకయ్యా! జర్నలిజం విలువలు, తొక్కా అంటూ నిన్ను నువ్వే పనిష్ చేసుకుంటావు? మనకు కావలసింది జీతం, ప్రశాంతంగా ఉండటం. సమాజం, నైతికత, బాధ్యత అంటూ పనికి మాలిన బిల్డప్పులు ఎందుకు? నేను రోజూ ఇలా చెబుతూనే ఉంటాను, నువ్వు మాత్రం మనసు మార్చుకోక తిట్లుతింటూనే ఉంటావు. ఇంతకీ అసలు ఏం జరిగింది?’ అడిగాడు లోకనాథం. ‘గాంధీనగర్‌లో ఒక మానవీయ కోణానికి సంబంధించి మంచి స్టోరీ రాశాను. అది తీసుకెళ్లి ఇస్తే నా మొహం మీద విసిరేసి, ఇప్పుడు ఈ స్టోరీలు ఎవడికి కావాలి? ఆ రోజులు పోయాయని ఎన్నిసార్లు చెప్పను? ఇప్పుడు కావాల్సిందంతా స్పైసీ... ‘సాగర సంగమం’ సినిమాలో స్టెప్పులు కావాలి... ఆవృతాలు, ఆవులు, గేదెలు ఎవడికి కావాలి అన్నట్టుగా, నామీద ఇంత ఎత్తున ఎగిరేడు’ గద్గద స్వరంతో చెప్పాడు ధర్మారావు. ‘మరి నేను చెప్పేది అదే. తెలివితేటలు ఉండ గానే సరిపోదు. కాస్తంత లౌక్యం కూడా కావాలి బతకాలంటే. సరే సరే నాకు టైం అయిపోతుంది’ అంటూ లోకనాథం కేబిన్ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. పొగలు సెగలు కక్కుతున్న ఇన్చార్జి చింపిరి జుత్తుతో సిగ రెట్ల మీద సిగరెట్లు తాగుతూ కనిపించాడు. ‘రావయ్యా రా! నీ కోసమే చూస్తున్నా. బ్యానర్ స్టోరీ రెడీ అయిపోయింది. సెకండ్ ఐటమ్ ఏం వేద్దామా అని చూస్తున్నాను. టైం అయిపోతూ ఉంది. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. నువ్వే మైనా వండుకొచ్చావా?’ ఆత్రంగా అడిగాడు ఇన్చార్జి. ‘మీరేం కంగారు పడకండి సార్! నేను ఉన్నాగా? చిల్లీస్ చికెన్, చికెన్ 65, చైనీస్ నూడుల్స్... ఏమైనా సరే అరగంటలో వండి వార్చేస్తా? ఇప్పుడు మన పత్రికతో ఏ డ్రైనేజీ గానీ, మూసీ నది గానీ పోటీ పడలేవు. మీకెందుకుకంగారు? ఇదిగోండి ఇది చూడండి. ఇది నా వంటకం కాదు గాని ఒక తెనాలి అవాకులు చవాకులు. భలే గమ్మత్తుగా ఉన్నాయి ఆరోపణలు’ అంటూ చేతిలో ఉన్న ప్రింట్ అవుట్ అందించాడు.సీరియస్‌గా ఐటెం చదవడం మొదలు పెట్టాడుఇన్చార్జి. హెడ్డింగ్ చూశాడు: ‘సజ్జలకే 140 కోట్లు.’ ♦ ‘ప్రభుత్వ సలహాదారులకు 680 కోట్లు వ్యయం. ♦ 89 మంది సలహాదారులకు అంత ప్రజాధనం వెచ్చించడం అవసరమా? ♦ నాదెండ్ల మనోహర్ ధ్వజం ఇన్చార్జి ముఖంలో టెన్షన్ చెరిగిపోయి పెదాల మీద చిరునవ్వు మొదలైంది.‘ఇదీ ఐటమ్ అంటే.. ధర్మారావు గాంధీనగర్‌లో పేదల బతుకులు అది ఇది అంటూ చెత్త ఐటమ్ తెచ్చాడయ్యా! దాంతో నా మూడంతా పాడైపోయింది. ఇదీ మసాలాఅంటే. అవును గానీ మనలో మాట, ఒక్క సజ్జలకే 140 కోట్లు అంటాడు ఏంటయ్యా? సలహాదారులకి 680 కోట్లా? అసలు అంత బడ్జెట్టే లేదు కదయ్యా!ఈ తెనాలి బుర్రేమైనా చెడిపోయిందా? లేదంటే లోకేష్‌కి పోటీగా తయారవుదాం అనుకుంటున్నాడా?’ అడిగాడు ఇన్చార్జి.‘‘అదేం కాదు సార్! తెనాలి నుంచి పోటీ చేయా లనుకుంటున్నాడు. తెనాలిలో తనకు టిక్కెట్ వస్తుందో రాదో అనేది ఒక టెన్షన్. తీరా టికెట్ దక్కించుకున్నా అసమ్మతి సెగతో మళ్ళీ ఓడిపోతానేమో అని భయం పట్టు కుంది. దాంతో పూర్తిగా ‘తెనాలి’ అయిపోయాడు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.’’ ‘నిజమేనయ్యా! కానీ ఐదేళ్లకి కోటీ నలభై లక్షలు కాబోలు. దాన్ని అర్థం చేసుకోలేక 140 కోట్లనేసినట్టున్నాడు. బడ్జెట్లో లేని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా సలహా దారులు ఉన్నది 46 మందేగా 89 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే... నువ్వే చెప్పావుగా? అతగాడు మైండ్చెడి తెనాలి అయిపోయాడని. సరే ఏదైతే అదవుతుంది? ఈరోజు మనకి చికెన్ 65 లాంటి మసాలా స్టోరీ దొరికింది. పాఠకులు ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటారు? మన పత్రికకు ఇంగువ కట్టిన గుడ్డ లాంటి ఇమేజ్ ఉండనే ఉందిగా! బాస్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు. తిట్టుకుంటే జనాలు ‘తెనాలి’ని తిట్టుకుంటారు. సరే సరే నువ్వు మాత్రం ఈ మూడు నెలలు మూసీ నది మన పేపర్ని చూసి కుళ్లుకునేంత మురుగు స్టోరీలు ఇవ్వాలి సుమా!’ అంటూ స్టోరీకిరంగులు హంగులు అద్దే పనిలో పడ్డాడు ఇన్చార్జి. ‘తప్పకుండా సార్! ఇక నేను వస్తా’ అంటూ లోకనాథం క్యాబిన్ తలుపు తీసుకొని చిద్విలాసంగా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. ఒక మూల దీనంగా కూర్చున్న సిసలైన జర్నలిస్టు ధర్మారావు వైపు జాలిచూపు విసిరేసి, ‘బాబుని చూసైనా నేర్చుకోడు జాబు నిలబెట్టుకోవాలని ఆలోచించడు’ అని తనలో తను సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. - వ్యాసకర్త సీనియర్ సంపాదకులు - పి. విజయ బాబు -
బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. -
పరువునష్టం కేసులో డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన కోర్టు
వాషింగ్టన్: అమెరికా మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ. జీన్ కరోల్పై డోనాల్డ్ ట్రంప్ వేసిన పరువు నష్టం దావాను న్యూయార్క్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చాలా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. వరుసగా తనపై నమోదవుతున్న కేసులతో పాటు అంతకుముందు నమోదైన కేసుల్లో తీర్పులు ఆయనకు ఊపిరి ఆడనివ్వడంలేదు. ఒకపక్క తాను వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేయాలని చూస్తుండగా మరోపక్క కేసుల వలయం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో అమెరికా మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ. జీన్ కరోల్పై లైంగిక వేధింపుల కేసులో డోనాల్డ్ ట్రంప్ ను నేరస్తుడిగా పరిగణిస్తూ ఆమెకు నష్టపరిహారంగా 5 మిలియన్ డాలర్ల చెల్లించాల్సిందిగా సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ కేసులో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరానికి మాత్రమే శిక్ష విధించినట్లు అత్యాచార నేరానికి కాదని కోర్టు మే నెలలో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. అయినా కూడా జీన్ కరోల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తాను లైంగిక వేధింపుల తోపాటు అత్యాచారం కూడా జరిపినట్లు ప్రతి సందర్భంలోనూ మీడియాతో చెబుతుండడంతో డోనాల్డ్ ట్రంప్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. సోమవారం ఈ కేసుపై జిల్లా కోర్టు న్యాయమూర్తి లూయిస్ కప్లాన్ స్పందిస్తూ కరోల్‌ను డోనాల్డ్ ట్రంప్ అత్యాచారం చేశారన్నది వాస్తవమేనని అందుకే కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో దారుణం.. తండ్రిని చంపినట్టే కుమారుడిని కూడా.. -
ప్రధాని మోదీకి జైకొడుతున్న చైనా నెటిజన్లు.. అమెరికా మ్యాగజైన్ వెల్లడి
బీజింగ్: భారత్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ప్రధాని మోదీకి మాత్రం చైనాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు! ముఖ్యంగా నెటిజన్లయితే మోదీ పట్ల ఫిదా అవుతున్నారు. ‘మోదీ లావోగ్జియన్’ (మోదీ చిరంజీవి) అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ఒక విదేశీ నేత పట్ల చైనీయులు ఇంతటి గౌరవాదరాలు చూపడం అరుదు. ‘మోదీ అద్భుతమైన నాయకుడు. విభిన్నంగా ఆలోచిస్తారు. భారత్‌ను చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు’ అంటూ చైనా సోషల్ సైట్ సినావెబోలో నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారని అమెరికా మ్యాగజైన్ ది డిప్లొమేట్ పేర్కొంది. సినా వెబోకు 58 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లున్నారు. -
భారత్ నుంచి ఒకే ఒక్కడు ‘కింగ్ ఖాన్’.. గొప్ప నటుడిగా ఆ జాబితాలో చోటు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత ప్రతిభావంతులైన 50 మంది నటీనటుల జాబితాలో షారుక్ ఖాన్‌కు చోటు దక్కింది. బ్రిటిష్‌కు చెందిన ప్రముఖ ఎంపైర్ మ్యాగజైన్ ‘ఎంపైర్ మ్యాగజైన్ 50 గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ లిస్ట్’ పేరుతో మంగళవారం తమ మ్యాగజైన్లో ప్రచురించింది. ఈ జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్క నటుడిగా షారుక్ ఖాన్ పేరు ఉండటం విశేషం. ప్రముఖ హాలీవుడ్ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హ్యాంక్స్, ఆంథోని మార్లన్ బ్రాండో వంటి దిగ్గజాల సరసన షారుక్ నిలిచాడు. ఈ సందర్భంగా ఎంపైర్ మ్యాగజిన్ తన ఆర్టికల్‌లో షారుక్ చేసిన పాపులర్ రోల్స్, సినిమాలను పేర్కొంది. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న ఈ ‘కింగ్‌ఖాన్’ విజయాల పరంపర, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు షారుక్ నటించిన ఓ చిత్రంలో చెప్పిన ‘జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది’ అన్న డైలాగ్‌ని ఆర్టికల్‌లో పేర్కొంటూ అతడి కెరియర్లోనే ఇది ఉత్తమైన డైలాగ్‌గా కొనియాడింది. దేవదాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, కుఛ్ కుఛ్ హోతా హై వంటి సినిమాల్లో అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు కురిపించింది. కాగా ‘ఎంపైర్’ మ్యాగజైన్ కథనాన్ని షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్ -
జైహింద్ స్పెషల్: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు
స్వాతంత్య్రోద్యమంలో గోడ పత్రికలు ఉద్యమకారులకు ఏమాత్రం తక్కువకాని పాత్రను పోషించాయి. బ్రిటిషర్ల దురహంకారాన్ని వేలెత్తి చూపించాయి. గోడల వైపు తలెత్తి చూడటానికే బ్రిటిష్ అధికారులు సంశయించేంతగా మన తెలుగువాళ్లు గోడ పత్రికలపై నిజాలను నిర్భయంగా రాశారు. నాటి గోడపత్రికల ఆనవాళ్లు నేడు లేవు కానీ, ఆనాటి స్వాతంత్య్ర స్ఫూర్తి నేటి అమృతోత్సవాలలో మహా నగరాల గోడలపై వర్ణ చిత్రాలుగా ప్రతిఫలిస్తూ ఉంది. చదవండి: పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు! యూరప్‌లో జరిగిన ఫ్యూడల్ వ్యతిరేకోద్యమంలో ఆయుధాలుగా ఆవిర్భవించిన పత్రికలు, ఆ సమాజాన్ని ఆధునీకరించడంలో అమోఘమైన పాత్రను నిర్వహించాయి. అలాగే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా పత్రికలు అక్షరాయుధాలుగా కీలక భూమికను పోషించాయి. వాటిల్లో గోడ పత్రికలు, కరపత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఉద్యమజ్వాలల్ని రగిలించాయి. తొలి గోడపత్రిక ‘నగరజ్యోతి’ దేశంలోనే తొలి గోడ పత్రికగా నెల్లూరులో ‘నగర జ్యోతి’ నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజలలో స్వాతంత్రేచ్ఛతోపాటు విజ్ఞానాన్ని వెలిగించింది. నెల్లూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తూములూరి పద్మనాభయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి, వలస పాలనకు వ్యతిరేకంగా ఒక రహస్య సైక్లోస్టైల్ పత్రికను నడిపారు. అది బైటపడడంతో బ్రిటిష్ పోలీసులు ఆయనను ఆరెస్టు చేసి, జైల్లో పెట్టి హింసించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక 1932లో నెల్లూరు ట్రంకు రోడ్డులోని తిప్పరాజువారి సత్రం గోడలపై ‘నగరజ్యోతి’ని వెలిగించారు. కాగితాలపై పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాసి సత్రం గోడలకు అంటించేవారు. ఆ కాగితాలను పశువులు తినేయడంతో, ఆ గోడలను బ్లాక్ బోర్డుగా చేసి చాక్‌పీసులతో వార్తలు రాయడం మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించేవారు. స్వాతంత్య్రం రాకముందే తూములూరి పద్మనాభయ్య క్షయ వ్యాధితో మృతి చెందారు. ఓకే పత్రిక... రెండు గోడలు! పద్మనాభయ్యకు సహాయకులుగా పనిచేస్తున్న ముత్తరాజు గోపాలరావు, ఇంద్రగంటి సుబ్రమణ్యం చెరొక గోడపై ‘నగరజ్యోతి’ కొనసాగించారు. వారిద్దరూ గాంధేయ వాదులు. ముత్తరాజు గోపాలరావు వార్తలలో ఆవేశం పాళ్లు ఎక్కువ. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు నాయకుడు కొండయ్యకు ఆశ్రయం కల్పించారని ముత్తరాజు గోపాలరావును పోలీసులు ఆరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇంద్రగంటితో పోటీ పడలేక, ముత్తరాజు గోపాలరావు తన గోడను కూడా ఆయనకు అప్పగించేశారు. ఇంద్రగంటి తాను వాస్తవమని నమ్మినవే వార్తలుగా రాసేవారు. ఇటు విజయవాడ, అటు మద్రాసు నుంచి వచ్చే రైళ్ల కోసం అర్ధరాత్రి అయినా వేచి చూసి, వేరే వారి కోసం వచ్చిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఫ్రీ ప్రెస్, పేట్రియాట్ వంటి పత్రికలను చూసి గబగబా వార్తలు రాసుకునే వారు. ఆ పత్రికలలో వచ్చిన కార్టూన్లను కూడా వేసేవారు. బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ఇంద్రగంటి సుబ్రమణ్యం ‘నగర జ్యోతి’ ద్వారా బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనను అరెస్టు చేసి వేలూరు జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక చివరి వరకు ఖద్దరునే ధరించారు. స్వాతంత్య్రమే తప్ప కుటుంబాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. వార్తలు రాయడానికి చాక్‌పీసుల కోసం తప్ప, తన కోసం ఏనాడూ చేయిచాచలేదు. తాజా వార్తలను అందించడం తప్ప, ఇంద్రగంటికి వేరే వ్యాపకమే లేదు. నయాపైసా ఆదాయం లేకపోయినా, నాలుగు దశాబ్దాలపాటు ‘నగర జ్యోతి’ని ఆరిపోకుండా కాపాడారు. ఇంద్రగంటి 1976 సెప్టెంబర్ 16వ తేదీన తుదిశ్వాస విడిచేవరకు వార్తలను విడవలేదు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వం రెండున్నర ఎకరాలను ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో శాలువాతో సరిపెట్టుకుంది. విద్వాన్ విశ్వంకి జైలు! కవి, రచయిత, పండిత పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు విద్వాన్ విశ్వం బ్రిటిష్ పాలనలో ‘యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ఫలితాలు’ అన్న కరపత్రం వేసినందుకు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఖాసా సుబ్బారావు టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ‘స్వరాజ్య’ పత్రికలో ఎడిటర్‌గా 12 ఏళ్లు పనిచేశారు. మరెందరో చరిత్రకందని పాత్రికేయులు స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్నారు. – రాఘవ శర్మ -
ప్రపంచంలోనే గొప్ప ప్రాంతాల జాబితాలో కేరళ, అహ్మదాబాద్
న్యూయార్క్: భారత్‌లోని రెండు ప్రాంతాలకు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు-2022 జాబితాలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం, కేరళ రాష్ట్రాలకు చోటు దక్కింది. 50 అత్యుత్తమ పర్యటక గమ్యస్థానాల్లో భారత్‌లోని ఈ రెండు ప్రాంతాలు స్థానం సంపాదించాయి. ‘ప్రయాణాల ద్వారా మానవ సంబంధాల విలువ తెలుసుకునేందుకు 2022లో ఎదురైన సవాళ్లు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం రోడ్డు, ఆకాశ మార్గాల్లో ప్రయాణాలు పుంజుకున్నాయి. ఆతిథ్య పరిశ్రమ మళ్లీ ప్రారంభమైంది. యాత్రికులను ఆహ్వానించేందుకు సిద్ధమైంది.’ అని పేర్కొంది టైమ్ మ్యాగజైన్. భారత్‌లోని తొలి యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ నగరం అహ్మదాబాద్‌లో ఎన్నో కలగలిసి ఉన్నాయని పేర్కొంది. 'సంప్రదాయ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఇక్కడ పురాతన స్థలాలతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు ఉన్నాయి. అందులో సబర్మతి నది సమీపంలో 36 ఎకరాలతో ఉన్న గాంధీ ఆశ్రమం నుంచి ప్రపంచంలోనే సుదీర్ఘ నృత్య పండుగ నవరాత్రి ఉత్సవాల వరకు చాలా ఉన్నాయి.' అని పేర్కొంది. అహ్మదాబాద్ అంటే ఒక సైన్స్ సిటీగా పేర్కొంది. మరోవైపు.. భారత్‌లోని ఆగ్నేయ తీర ప్రాంతంలో కేరళ ఒక అందమైన రాష్ట్రంగా అభివర్ణించింది టైమ్. అందమైన బీచ్‌లు, ఆలయాలు, ప్రాంతాలు ఉన్నాయని, దేవతలు నివసించే దేశంగా మారిందని పేర్కొంది. ఈ ఏడాది భారత్‌లో పర్యాటక రంగాన్ని కేరళ మరింత ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాను సిద్ధం చేయడానికి ఈ సంవత్సరం టైమ్ మ్యాగజైన్ దాని అంతర్జాతీయ నెట్వర్క్ కరస్పాండెంట్లు, కంట్రిబ్యూటర్ల ద్వారా తమ అనుభవాలను అందించే వారి వైపు దృష్టి సారించి స్థలాల నామినేషన్లను స్వీకరించినట్లు పేర్కొంది. జాబితాలోని మరికొన్ని ప్రాంతాలు.. వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రాంతాల్లో యూఏఈలోని రాస్ అల్ ఖైమా, ఉతాహ్‌లోని పార్క్ సిటీ, సియోల్, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్, ద ఆర్కిటిక్, స్పెయిన్‌లోని వలెన్సియా, భూటాన్‌లోని ట్రాన్స్ భూటాన్ ట్రైల్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్, బోగోటా, జాంబియాలోని లోవర్ జాంబేజి నేషనల్ పార్క్, ఇస్తాన్‌బుల్, కిగాలీ, ర్వాండాలు ఉన్నాయి. ఇదీ చూడండి: అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి! -
ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12 విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా కీర్తి సురేష్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఇదిలా ఉండగా రీసెంట్గా మహేశ్ పీకాక్ మ్యాగజైన్ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్‌లో ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను తరచుగా బ్యూటిఫుల్ అనే పదం వాడుతానని తెలిపారు. హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ చూసి ఏడ్చినట్లు పేర్కొన్నారు. ఒకవేళ తాను డైరెక్టర్ అయితే 'ఒక్కడు' మూవీని రీక్రియేట్ చేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన మహేశ్ అల్లూరి సీతారామరాజు సినిమా తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ అని చెప్పుకొచ్చారు. -
పాఠశాల మ్యాగజైన్‌తో సృజనాత్మక శక్తి వృద్ధి
సాక్షి, హైదరాబాద్: పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి పాఠశాల మ్యాగజైన్ ఉపయోగపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. మంగళవారం రాజ్‌భవన్ పాఠశాల మ్యాగజైన్ ఆవిష్కరించి మాట్లాడారు. రొటీన్‌గా చదవడం, రాయడమే కాకుండా స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాల గురించి చదవాలి, రాయాలి అని ఆమె విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే 100 మంది పిల్లలకు ట్యాబ్‌లు అందించామని, దాతలు ముందుకు వస్తే మరికొందరికి అందజేస్తామని గవర్నర్ పేర్కొన్నారు. -
ఈ రోజే బతుకుతాను.. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు
భవిష్యత్తు గురించి ఆలోచించనివారుండరు. రాబోయే రోజులు, వచ్చే ఏడాది, ఇంకో పదేళ్లపాటు.. రేపటి ఆనందకర జీవనం కోసం ఆశపడుతూనే ఉంటారు. కానీ, హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఐలా మమతను కలిస్తే ఈ రోజుకున్న విలువ ఏంటో తెలుస్తుంది. రెండు కిడ్నీలు చెడిపోయి, 22 ఏళ్లుగా డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు మమత. కష్టాలను అధిగమిస్తూ సొంతంగా మ్యాగజీన్ నడుపుతూ, కిడ్నీ రోగులకు మానసిక స్థైర్యం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘మీ నవ్వు చాలా బాగుందండి’ అని పలకరిస్తే.. రేపటి నవ్వు కూడా ఈ రోజే నవ్వేస్తాను. ఈ రోజును ఆనందంగా బతకడానికి ప్రయత్నిస్తాను’ అన్నారు. ‘ఇన్నేళ్లు కష్టాలన్నీ ఒక్కోటి అధిగమిస్తూ వచ్చాను. కానీ, ఇప్పుడు డయాలసిస్ చేయించుకోవడానికి కూడా ఆర్థికంగా లేక.. ఈ రోజు బతికితే చాలు అనుకుంటున్నాను’ అంటూ నవ్వు వెనకాల దాచుకున్న ఒక్కో వాస్తవాన్ని ఇలా కళ్లకు కట్టారు మమత. ‘‘నన్ను చూసి ఎవరు పలకరించినా ముందు నవ్వేస్తాను. ‘ఇంతబాధలోనూ నవ్వుతూ ఉంటావు’ అంటారు. కష్టం మరింత పరీక్ష పెట్టడానికే వస్తుందేమో అనిపిస్తుంటుంది. 22 ఏళ్ల క్రితం బాబు పుట్టినప్పుడు డెలివరీ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ పాకి, రెండు కిడ్నీలూ చెడిపోయాయి. దీంతో రెండు కిడ్నీలను తొలగించారు. అప్పటినుంచి డయాలసిస్ తప్పనిసరైంది. మా వారికి ఉద్యోగం లేదు. ఊళ్లో ఉన్న తన తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇటు నా ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అమ్మ వెన్నుదన్నుగా ఉండటంతో బిడ్డ పెంపకం భారంగా అనిపించలేదు. రాత మార్చుకున్నాను.. ఆర్థికంగా ఏమీ లేదు. ఆరోగ్యమూ లేదు. నా స్థితిని అప్పటి కలెక్టర్‌కు చెప్పాను. నా మాటతీరు చూసి, పుస్తకాలు రాయమన్నాడు. అలా ‘భారతీయ సంస్కృతి’ పేరుతో మ్యాగజీన్ పెట్టుకొని, ప్రకటనలు తెచ్చుకొని నాకంటూ ఓ చిన్న లోకాన్ని ఏర్పరుచుకున్నాను. పత్రిక ద్వారా నలుగురికి సాయం చేయగలిగాను. వారంలో మూడు రోజులు డయాలసిస్. నెలకు సరిపడా చేతినిండా పని. ఈ సమయంలోనే నాలాంటి డయాలసిస్ పేషెంట్ల కోసం ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశాను. కిడ్నీ రోగులకు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుతో పాటు, కౌన్సిలింగ్ ఇచ్చాను. ప్రభుత్వంతో పోరాడి, వేలాది మందికి ఉచిత డయాలసిస్ అవకాశం వచ్చేలా చేశాను. మారిన రాత.. కరోనా టైమ్‌లో శారీరకంగా చాలా దెబ్బతిన్నాను. అసలే డయాలసిస్ పేషెంట్‌ను. దీనికితోడు కరోనా సోకింది. మ్యాగజీన్ ఆగిపోయింది. ఎన్జీవోలోని సభ్యులు కరోనా బారినపడి చాలామంది చనిపోయారు. సపోర్ట్‌గా ఉందనుకున్న అమ్మ మరణం... మానసికంగా బాగా కుంగిపోయాను. దీంతో చాలా ఒంటరిగా అనిపించింది. దాని నుంచి కోలుకుంటానన్న నమ్మకం కూడా కొన్నిరోజులపాటు లేదు. మా అబ్బాయి ‘ఎంతోమందికి కౌన్సెలింగ్ ఇచ్చావు. నువ్వు ఇలా ఉంటే ఎలా..’ అని ధైర్యం ఇచ్చాడు. మా అబ్బాయి ఫిల్మ్‌మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇంకా వాడి జీవితం సెట్ అవ్వాల్సి ఉంది. ప్రాణం నిలబడాలంటే.. మ్యాగజీన్ నడిపించాలన్నా, చేపట్టిన ఆర్గనైజేషన్‌ను ముందుకుతీసుకువెళ్లాలన్నా మళ్లీ సున్నా నుంచి జీవితం మొదలుపెట్టాను. ఈ ఉగాదికి మ్యాగజీన్‌ను మళ్లీ ప్రారంభించాను. కానీ, ఆర్థిక లేమి కారణంగా నడపలేకపోతున్నాను. అంతకుముందున్న శక్తి ఇప్పుడు ఉండటం లేదు. హిమోగ్లోబిన్ సడెన్‌గా పడిపోతోంది. ఇన్నేళ్లుగా డయాలసిస్ వల్ల శరీరంలో అకస్మాత్తు గా మార్పులు వస్తుంటాయి. డయాలసిస్‌కు డబ్బుల్లేక ఎప్పుడు మానేస్తానో, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో.. తెలియదు. నా కొడుకు జీవితం ఏం అవుతుందో అని మనసులో ఆందోళనగా ఉంటుంది. ఎవరైనా సాయం అందిస్తే, ఇంకొంతమందికి నా పని ద్వారా సాయం అందించగలను’’ అని వివరించారు మమత. నిన్నటి వరకు రేపటి గురించిన ఆలోచన లేకున్నా గుండెధైర్యంతో నిలదొక్కుకున్న మమత నేటి జీవనం కోసం చిరునవ్వు వెనుక దాగున్న విషాదాన్ని పరిచయం చేశారు. సాయమందించే మనసులు ఆమె చిరునవ్వును కాపాడతాయని ఆశిద్దాం. – నిర్మలారెడ్డి -
‘ద పీకాక్’ మ్యాగజైన్‌పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్
Mahesh Babu Stuns On The Peacock Magazine: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ వరుస ఇంటర్య్వూలు, ప్రెస్మీట్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించి తన ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు ఆయన. ద పీకాక్ మేగజీన్ కవర్ పేజీ కోసం ఆయన ఇటీవల ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని మహేశ్ స్వయంగా తెలిపారు. చదవండి: మహేశ్-రాజమౌళి మూవీపై అప్డేట్ ఇచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించిన తన ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ ద పీకాక్ మ్యాగజైన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ మ్యాగజైన్ కోసం జరిగిన ఫొటోషూట్ మొత్తం చాలా సరదాగా, ఉల్లాసంగా జరిగిందని ఈ సందర్భంగా మహేశ్ పేర్కొన్నారు. ఆ షూట్ కోసం కష్టపడ్డ ద పీకాక్ మ్యాగజైన్ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్లకు మహేశ్ స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పారు. కాగా ద పీకాక్ మ్యాగజైన్‌పై మహేశ్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇందుకోసం ఇచ్చిన ఫొటోషూట్‌ను ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. Humbled and honoured to be starring on the cover of #ThePeacockMagazine. The shoot and the overall experience was so much fun! Thank you @falgunipeacock and @shanepeacock. Here’s to many more! 🤗 pic.twitter.com/pbaoVkcc4f — Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2022 -
అప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడు ఏమైనా చేయగలను : సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తుంది. తాజాగా సమంత ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం నెమలి మాదిరిగా స్టన్నింగ్ ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'నా స్కిన్‌టోన్‌తో నేను కంఫర్టబుల్‌గా ఉండేందుకు నాకు కొంత సమయం అయితే పట్టింది..కానీ చాలా సినిమాలు చేసిన అనంతరం ఇప్పుడు ఏదైనా సెక్సీ సాంగ్ కానీ హార్డ్ కోర్ యాక్షన్ సహా ఢిపరెంట్ రోల్స్ చేయడానికి నాపై నాకు నమ్మకం వచ్చింది. ఇంతకుముందు నాలో ఈ ధైర్యం లేదు. కానీ ఇప్పడు నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వచ్చింది. వయసుతో పాటు ఇచ్చిన మెచ్యురిటీ ఇది' అంటూ సమంత పేర్కొంది. ఇక సామ్ లేటెస్ట్ సమంత ఫోటోపై రియాక్ట్ అయిన హీరోయిన్ తమన్నా బ్యూటీ అంటూ కామెంట్ చేసింది. కాగా హరి, హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన యశోద సినిమాకు విడుదలకు రెడీ అవుతుంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కతున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
స్త్రీలు పుస్తక ప్రియులు
‘మేగజీన్ వచ్చిందా’ నుంచి ‘సీరియల్ వస్తోంది టీవీ ఆన్ చెయ్యి’ వరకూ కాలం ప్రవహించింది. ఫేస్బుక్, వాట్సప్ చెక్ చేసుకుంటే తప్ప రోజు గడవని రోజూ వచ్చింది. ఒకప్పుడు పాఠకుల కంటే పాఠకురాళ్లే ఎక్కువ. వారి కోసమే మేగజైన్లు, ప్రత్యేక సీరియళ్లు నడిచేవి. కాని ఇప్పుడు తమ పుస్తక పఠనాన్ని కాపాడుకోవడం కోసం స్త్రీలు కూడా ప్రయాస పడాల్సి వస్తోంది. నేటి నుంచి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ జనవరి 1 నుంచి విజయవాడలో. స్త్రీలు ఏం చదువుతున్నారు... ఎటువంటి పుస్తకాలు ఆశిస్తున్నారు... అసలు చదివే సమయం మిగిలిందా? చూద్దాం. మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలు చదివి ఉండాలి ఇంట్లో పుస్తకాలు ఉండే వాతావరణం వల్ల పుస్తకాలు చదివే అలవాటైంది. అయితే కాలక్షేపం పుస్తకాలు కాదు. హైస్కూల్లోనే ‘ఏడుతరాలు’ చదివేశా. ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉద్యోగం, కుటుంబం రెంటి మధ్య సమయం వెతుక్కుని పుస్తకాలు చదవాల్సి వస్తోంది. నేనైతే ప్రయాణాల్లోనే ఇప్పుడు ఎక్కువగా చదువుతున్నాను. ‘అంటరాని వసంతం’ వంటి గొప్ప పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. కనీసం మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలను కొన్నైనా ప్రతి ఒక్కరూ చదివి ఉండాలి. ఇటీవల నేను కొత్త జనరేషన్ ఏం రాస్తున్నారా అని ఆసక్తిగా చూస్తున్నాను. పుస్తక పఠనం నా పిల్లలకు అలవాటు చేశాను. వాళ్లు నాకంటే ఎక్కువ చదువుతారు. కాకపోతే ఇంగ్లిష్‌లో. ఒక ప్రిన్సిపాల్‌గా విద్యార్థులకు పుస్తకాలు అలవాటు చేయడానికి లైబ్రరీలో కనీసం గంట కూచోవాలని చెబుతున్నా. – ఎం. ప్రగతి, ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, హిందూపురం చదివేవాళ్లు సాకులు చెప్పరు పుస్తకాలు చదవడం మా నాన్నగారు, అమ్మగారు అలవాటు చేశారు. చిన్నప్పటి నుంచి నా బెస్ట్‌ఫ్రెండ్ పుస్తకాలే. నా ఎమోషన్ వాటితోనే షేర్ చేసుకునేదాన్ని. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు మొదట పుస్తకమే గుర్తుకు వస్తుంది. నేను మనుషులను డైరెక్ట్‌గా అర్థం చేసుకోవడం కంటే పుస్తకాల ద్వారానే అర్థం చేసుకున్నా. కాబట్టి నా మంచిచెడ్డలు రెంటికీ పుస్తకాలే బాధ్యులు. ‘ఏడుతరాలు’ వంటి పుస్తకాలు చిన్నప్పుడే చదివి పనిమనుషులతో ఎంత మర్యాదగా వ్యవహరించాలో నేర్చుకున్నాను. రావిశాస్త్రి ‘రత్తాలు– రాంబాబు’ చదివి టీనేజ్‌లో కంగారు పడ్డాను. పుస్తకం చదివే అలవాటు ఉన్నవాళ్లు వాటిని చదవలేకపోతే గిల్ట్ ఫీలవుతారు. పుస్తకాలు చదవడానికి టైం లేకపోవడాన్ని నేను నమ్మను. టైమ్ దొరుకుతుంది. కొంతమంది ఈ కాలం పిల్లల్ని గమనిస్తే ఇవాళ్టి జనరేషన్ కూడా పుస్తకాలు చదువుతున్నారన్న ఆశ ఉంది. – అరుణ ప్రసాద్, గృహిణి, నిజాంపేట, హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదవాలి నేను కాలేజీలో ఉండగా పుస్తకాలు చదవడం మొదలెట్టా. సీరియస్ సాహిత్యానికి నాన్ సీరియస్ సాహిత్యానికి తేడా సీరియస్ సాహిత్యంలో కూరుకుపోయా. సెంట్రల్ యూనివర్సిటీలో చదివేప్పుడు పుస్తకాలంటే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. నామిని పుస్తకం ‘పచ్చనాకు సాక్షిగా’ అక్కడే చదివా. చలం పుస్తకాలు, తిలక్ అమృతం కురిసిన రాత్రి, మహా ప్రస్థానం, జాషువా గబ్బిలం, శివసాగర్... ఇలా ఎన్ని పుస్తకాలో. అవన్నీ ఏ జనరేషన్ అయినా చదువుతూ ఉండాల్సిందే. టెక్నాలజీ వచ్చింది. కొంతమంది యూట్యూబ్‌లో కథలు వింటున్నారు. ఆడియో లిటరేచర్ వింటున్నారు. కాని నాకు పుస్తకం చదవడమే బాగుంటుంది. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదువుతూ ఉంటే ఆ ఆనందం వేరు. పుస్తకం ఇచ్చే ఆలోచన వేరు. –చల్లపల్లి స్వరూపరాణి, ప్రొఫెసర్, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు ఇవాళ కావాల్సింది ఆలోచన రేపే పుస్తకాలు నేను ఆర్ట్ స్టూడెంట్‌ని. మా నాన్నగారు ఆర్ట్ స్టూడెంట్స్ సాహిత్యం కూడా చదవాలని‘కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్’ చదివించేవారు. ఆ రోజుల్లో నాకు ప్రకృతి అంటే ఇష్టం ఉండేది. వర్డ్స్‌వర్త్, షెల్లీ... ఇష్టపడ్డాను. ఆ తర్వాత ఓ హెన్రీ కథలు చాలా నచ్చాయి. మెల్లగా లెఫ్ట్ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. మనం టీవీ చూడకపోతే చాలా పుస్తకాలు చదవొచ్చు. టీవీ ఐదు నిమిషాలైనా చూడగలమా? ఎప్పటికైనా సరే పుస్తకమే ముఖ్యమైనది. మనల్ని జంతువుల నుంచి వేరు చేసేది ఆలోచన. ఆ ఆలోచన పుస్తకం నుంచే వస్తుంది. ఈ రోజు సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. వాటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి. వివక్ష, సామాజిక సమస్యలు, మతతత్వం... వీటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి. –కె.ఉషారాణి, ప్రజాశక్తి బుక్ హౌస్ మాజీ ఎడిటర్, విజయవాడ పుస్తకాల షెల్ఫ్‌లు లేని ఇళ్లు తయారయ్యాయి! మా ఇంట్లో మా నాన్న, మేనత్తలు పుస్తకాలు చదివేవారు. కనుక మాకు పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇంట్లో అందుబాటులో పుస్తకాలు ఉంటే పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు వాటిని చదువుతారు. మేము కొన్ని కారణాల రీత్యా ఇల్లు, ఊరు మారాం. కాని ఇంత పెద్ద ఫ్లాట్‌లో పుస్తకాలు పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్స్ లేవు. ఇలాంటి ఇళ్లు తయారైతే ఎలా? మా చిన్నప్పుడు ఇంట్లో పుస్తకాలు లేకపోతే పక్కింటివాళ్లైనా ఇచ్చేవారు. ఇవాళ ఆ వాతావరణం మళ్లీ రావాలి. చలం ‘స్త్రీ’ వంటి పుస్తకం చదవకపోతే ఎలా? ఓటిటిలు, షాపింగులు స్త్రీల సమయాన్ని తీసుకున్నా ఆ ఆకర్షణకు మించిన పుస్తకాలు కూడా బోలెడు వచ్చి పడుతున్నాయి. వాటిలో చదవదగ్గది ఉంటే పఠనాభిలాష ఎక్కడికీ పోదు. మంచి పుస్తకాన్ని ఎవరు వదిలిపెడతారు? చదవడానికి ట్యూన్ కావాలి. అది ముఖ్యం. – వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, రచయిత, కాకినాడ ట్రాఫిక్‌లోనే చదవాల్సి వస్తోంది నేను చదివిన సెయింట్ ఫిలోమినా స్కూల్లో లైబ్రరీ ఉండేది. రోజూ ఒక గంట అందులో కూచుని చదవాలి. అలా నాకు పుస్తకాలు అలవాటయ్యాయి. మా చర్చిలో ఒక తాతకు చదువురాదు. ఆయన నా చేత పుస్తకాలు చదివించుకుని వాటి ఆధారంగా మాట్లాడేవాడు. అలా కూడా నేను పుస్తకాలు చదివాను. సీరియస్ సాహిత్యం అంటే 2002లో విశాలాంధ్ర వారు పెట్టిన వ్యాసరచన పోటీలో బహుమతి వస్తే వాళ్లు 3000 రూపాయల పుస్తకాలు గిఫ్ట్ చేశారు. వాటిలో విశ్వంభర, మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి ఉండటంతో పొయెట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత ఫేస్బుక్ వల్ల చాలా పుస్తకాలు తెలిశాయి. ముఖ్యంగా జయకాంతన్ కథలు నాకు నచ్చాయి. ఇప్పుడు ట్రాఫిక్‌లో మాత్రమే పుస్తకాలు చదివే వీలు దొరుకుతోంది. నాకే కాదు.. చాలామందికి. టెక్నాలజీ పెరిగాక ఆఫీస్ కాల్స్ 24 గంటలు అవుతున్నాయి. పుస్తకం చదవాలంటే టైమ్ చూసుకోవాల్సిందే. – మెర్సీ మార్గరెట్, గురుకుల స్పెషల్ స్కూల్ ఇన్చార్జ్, ఘట్కేసర్. -
నా సూపర్ ఉమెన్‌తో ఇలా, చాలా ఆనందంగా ఉంది: మహేశ్
టాలీవుడ్ కపుల్ మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్‌లకు సంబంధించిన ఒక మ్యాగజైన్ ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇవి హలో అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు అని తెలిసిందే. ఈ విషయాన్ని మహేశ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుగా చాలా ఆనందంగా ఉంది. నా సూపర్ ఉమెన్‌తో కలిసి హలో మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోలు ఇవి. తనతో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నందుగా చాలా సంతోషంగా ఉంది’ హలో మ్యాగజైన్ కోసం వారు పలు ఫొటోలకు ఫొజులు ఇచ్చారు. ఇందులో ఫార్మల్ షూట్ ఈ జంట ఇచ్చిన ఫొటోలు నెటిజన్లను, సూపర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేగాక హలో మ్యాగజైన్ కవర్ పేజీకి ఫొటోషూట్ ఇచ్చిన తొలి సెలబ్రెటీ కపుల్‌గా మహేశ్-నమ్రతల దంపతులు నిలిచారు. An absolute pleasure speaking to @HELLOmagIndia.. with my superwoman!! @NayareAli1 #AmberTikari @jatinkampani #PattabhiRamarao #SalmanAli #AnishaJain pic.twitter.com/yWjN35a7SN — Mahesh Babu (@urstrulyMahesh) October 4, 2021 Age ante entamma ani adigithe… Alanti pedda pedda prasnalu na lanti chinna pillalni adakkudadu annaranta!!!!🤧🤭⭐️🤍🔥 #justmaheshbabuthings #samb #dhfm @urstrulyMahesh @urstrulyMGFC pic.twitter.com/RQ0793ZVqt — Sruthiranjani (@SruthiSings) October 4, 2021 -
హాలో మ్యాగజైన్ కోసం తన ‘సూపర్ ఉమెన్’తో సూపర్ స్టార్ ఫొటోలు వైరల్
-
ప్రతిపక్షాలది దగాకోరు రాజకీయం
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ప్రతిపక్షాలు బూటకపు మేధోతనాన్ని, దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. దశాబ్దాల క్రితమే అనేక ప్రయోజనాలు పొందాల్సిన ప్రజలకు ఇంతవరకు ఎలాంటి ఫలాలు అందలేదని, అలాంటివారికి సరైన ఫలితాలు అందించాలంటే భారీ, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓపెన్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. నూతన సాగు చట్టాలు, జీఎస్టీ అమలు, ఆధార్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణం తదితర అనేక అంశాలపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన దుయ్యబట్టారు. ఈ అంశాలన్నింటిపై తొలుత ఏకీభవించిన తర్వాత రాజకీయ కారణాలతో విపక్షాలు యూటర్న్ తీసుకొని ద్వేషపూరిత ప్రచారం ఆరంభించాయని ఆరోపించారు. ప్రస్తుతం సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నవారిని చూస్తే ప్రజలకు బూటకపు మేధోతనం, దగాకోరుతనమంటే ఏమిటో తెలుస్తోందన్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక వాగ్దానమిచ్చి తర్వాత నెరవేర్చలేకపోవడం వేరని, కానీ సంస్కరణలపై ముందు ఏకీభవించి తర్వాత యూటర్న్ తీసుకొని దు్రష్పచారం చేయడం సహించరానిదని ఆరోపించారు. ఇప్పుడు తమ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారే వారివారి మేనిఫెస్టోల్లో ఇవే అంశాలను పొందుపరిచారని, అయితే ప్రజామోదం పొందిన తమ పార్టీ వీటిని అమలు చేయడంతో సహించలేక అనైతికంగా వ్యవహిస్తున్నారని విమర్శించారు. రైతులకు ఏది ప్రయోజనం అని ఆలోచించకుండా తమ రాజకీయాలకు ఏది ప్రయోజనమని విపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. కరోనా కట్టడిలో భేష్ అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా కరోనాను కట్టడి చేయడంలో భారత్ ఎంతో మెరుగ్గా వ్యవహరించిందని మోదీ చెప్పారు. కోవిడ్ విషయంలో తమ ప్రభుత్వ చర్యలను విమర్శించిన వారిపై ఆయన విరుచుకుపడ్డారు. వీరి లక్ష్యం అంతర్జాతీయంగా భారత్ పేరును నాశనం చేయడమేనని నిప్పులు చెరిగారు. కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడ్డాయని, మనం మాత్రం నెగిటివ్ ప్రచారాలను తట్టుకొని కరోనా కట్టడిలో మెరుగ్గా వ్యవహరించామని చెప్పారు. అవసరం వచి్చనప్పుడు ఇండియా ఐక్యంగా నిలబడుతుందనే పాఠాన్ని కోవిడ్ తెలియజేసిందన్నారు. ‘‘భారత్ టీకాను రూపొందించకపోతే ఏమయ్యేదో ఆలోచించండి. పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కోవిడ్ టీకా లభించడం లేదు. కానీ మనం వ్యాక్సినేషన్లో విజయవంతం అయ్యాము.’’అని చెప్పారు. స్వాలంబంన(ఆత్మనిర్భరత) ఇందుకు కారణమన్నారు. విమర్శలను తాను స్వాగతిస్తానని, ఆరోగ్యవంతమైన పురోగతికి ఇవి అవసరమని ఆయన చెప్పారు. కానీ అలాంటి నిజమైన విమర్శలు చాలా స్వల్పమని, అసంబద్ధ ఆరోపణలే అధికమని విచారం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మీరే అవహేళన చేసుకుంటున్నారు నూతన పార్లమెంటు ఆవశ్యకతపై గొంతెత్తిన పారీ్టలే నేడు తాము నిర్మిస్తున్న నూతన భవన సముదాయాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఇది వారిని వారు అవహేళన చేసుకోవడమేనని మోదీ ఎద్దేవా చేశారు. గతంలో ఈ పార్టీల నేతలు కొత్త భవనం కావాలని కోరలేదా? అని ప్రశ్నించారు. దాన్ని సాకారం చేయాలని యతి్నస్తుంటే ఏవో కుంటిసాకులతో వ్యతిరేకించడం ఎంతవరకు సబబన్నారు. నిజానికి దేశ ప్రజలకు అనేక ప్రయోజనాలు దశాబ్దాల క్రితమే అందాల్సిఉందని, కానీ ఇంతవరకు వీరికి సరైన ఫలాలు అందలేదని వివరించారు. అలాంటివారికి సత్ఫలితాలివ్వడానికి పనిచేస్తున్నామని, ఇందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తే తీసుకుంటామని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలకు సిద్ధమని తమ ప్రభుత్వం తొలినుంచి చెబుతోందని గుర్తు చేశారు. ఇప్పటికి అనేక మార్లు వారితో చర్చలు జరిపామని, కానీ నిజానికి చట్టాల్లో ఏం మార్చాలో వారికే స్పష్టత లేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలన్నీ కాం గ్రెస్ గోత్రీకుల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యేవని ఎద్దేవా చేశారు. అందుకే గత ప్రభుత్వాలన్నీ ఒకేవిధమైన రాజకీయ, ఆర్థిక ఆలోచనతో వ్యవహరించాయని, కానీ తొలిసారి వాజ్‌పేయికి ప్రజలు ప్రత్యామ్నాయ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తన హయాంలో తొలిసారి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారన్నారు. ప్రజలు సంపూర్ణ మార్పు కోరారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. -
స్టైలిష్ లుక్‌లో మహేశ్-నమ్రతల జంట, వైరల్ అవుతున్న మ్యాగజైన్ ఫొటో
టాలీవుడ్ కపుల్ మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్లు జంటగా మరోసారి కెమెరా ముందుకు వచ్చారు. 20 ఏళ్ల క్రితం ‘వంశీ’ సినిమాలో అలరించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయిదేళ్ల పాటు ప్రేమించుకున్న మహేశ్-నమ్రతలు 2005లో పెళ్లి చేసుకుని వైవాహికి బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటికే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నమ్రత పెళ్లి అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి ఇంటి వ్యవహరాలతో పాటు మహేశ్‌కు సంబంధించిన సినిమా వ్యవహరాలను చూసుకుంటోంది. ప్రస్తుతం ఈ జంటకు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార ఘట్టమనేని ఉన్నారు. చదవండి: Republic Review:‘రిపబ్లిక్’మూవీ రివ్యూ ఎంతోకాలంగా తెర వెనక ఉంటూ సినిమాల పరంగా మహేశ్ సక్సెస్‌లో భాగమవుతున్న నమత్ర మరోసారి భర్తతో కలిసి ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చింది. అయితే ఇది ఏ సినిమా కోసమో కాదు. ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫొటోలకు ఫొజులు ఇచ్చారు ఈ లవ్వింగ్ కపుల్. నమ్రత వైట్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌తో ఫార్మల్ లుక్‌తో ఉండగా మహేశ్ బ్రెజర్ షూట్‌తో హాలో అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం వీరిద్దరూ జంటగా ఫొజులు ఇచ్చారు. చదవండి: ‘మా’ ఎన్నికలు: పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్ ఈ ఫొటోలో మహేశ్-నమత్రలు నెటిజన్లకు కనులవిందు కలిగించారు. ఇన్నాళ్లకు మరోసారి కెమెరా ముందు వీరిని జంటగా చూసి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. ఇటీవల నమత్ర మహేశ్, పిల్లలతో కలిసి ఓ యాడ్ షూట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మహేశ్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి ఆమె నటించారు. కాగా ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కీర్తి సూరేశ్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే: శేఖర్ కమ్ముల -
టాప్‌లెస్‌గా ఫోజులిచ్చిన స్టార్ హీరో సోదరి
బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ.. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎమ్ఎమ్ఏ పేరుతో ట్రైనింగ్ సెంటర్‌ను రన్ చేస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే తన శరీర సౌష్టవంతో కుర్రకారును మతిపొగొట్టేస్తుంది. తన అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన బోల్డ్ ఫోటోషూట్‌తో తను ఏ హీరోయిన్‌కు తక్కువ కాదని నిరూపించింది. ‘ఆల్ ఐస్ ఆన్ కృష్ణ అనే పేరుతో ప్రచురించిన మ్యాగజైన్‌కు ఈ ముద్దుగుమ్మ ఏకంగా టాప్‌లెస్‌గా ఫోజులిచ్చింది. ఒంటిపై కేవలం బ్లాక్ కలర్ లెదర్ ప్యాంట్, చేతులకు గ్లోవ్స్ ధరించి బ్రేక్ ద రూల్స్ అంటూ అర్థనగ్నంగా మ్యాగజైన్‌కు ఫోజులిచ్చింది. ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను కృష్ణ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఓ స్టార్ హీరో కూతురు ఇలా అర్ధనగ్నంగా మ్యాగజైన్ కోసం పోజులివ్వడం ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిగా మారింది. దిశాపటాని, అతియా శెట్టి వంటి స్టార్లందరూ కృష్ణ ఫోజుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ మైగాడ్, హాట్ బ్యూటీ అంటూ హార్ట్ ఎమోజీలను జత చేశారు. అదే విధంగా ‘బాలీవుడ్లో కృష్ణ మంటలు రేపగలదు. ఆమె ఫుల్ ఫైర్ మీద ఉంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఇబాన్ హయమ్స్తో ప్రేమలో మునిగిన కృష్ణ గతేడాది చివర్లో తాము విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Krishna Jackie Shroff (@kishushroff) -
‘అక్షర దీపిక’ జూన్ ఎడిషన్ విడుదల
టెంపాబే : ప్రవాత భారతీయులకు అండగా ఉంటూ వస్తోన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) 2021 జూన్‌కి సంబంధించి అక్షర దీపికను విడుదల చేసింది. ఈ పుస్తకంలో ఇటీవల కాలంలో నాట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను క్రోడీకరించారు. ముఖ్యంగా టెంపాబే నాట్స్ విభాగం ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో నిర్వహించిన కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ చాలా మందికి ఉపయోగపడిందని అక్షర దీపికలో పేర్కొన్నారు. పాస్‌పోర్టు పునరుద్ధరణ, కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తు, ఐసీఐ దరఖాస్తు, పునరుద్ధరణలు, పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికేషన్, ధ్రువీకరణ వంటి సేవలు ఈ కాన్సులర్ ద్వారా అందించారు. సుమారు 400ల మందికి పైగా భారతీయులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. నాట్స్ ఆధ్వర్యంలో కాన్సులర్ సర్వీసెస్‌తో పాటు విద్యార్థుల కోసం వెబినార్స్ నిర్వహించారు. న్యూజెర్సీలో బాల సుబ్రహ్మణ్యం స్వర నీరాజనం కార్యక్రమం, యోగా, తులసీ దళంలతో పాటు తెలుగు ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలను నిర్వహించినట్టు నాట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. జులై, ఆగష్టులలో సూపర్ బ్రెయిన్ వర్క్‌షాప్‌లను నిర్వహించబోతునట్టు తెలిపారు. -
ట్రాన్స్... అప్డేట్ వెర్షన్
చలం స్త్రీవాద రచయిత. ఇప్పుడు లేరు. ఆయన రచనలు, కోట్స్ ఉన్నాయి. ‘‘స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి..’’ అనేది చలంగారి పాపులర్ కోట్. శరీరం, మెదడు, హృదయం ఈ మూడూ ట్రాన్స్జెండర్లకు కూడా ఉన్నాయని ప్రియా బాబు అంటున్నారు! తమిళనాడు మదురైలో ఉండే ఆయన.. చలం రచనల్ని చదివి ఉండకపోవచ్చు. అయితే తనూ ఒక ట్రాన్స్‌జెండర్ కావడంతో తనలాంటి వారి మనసును చదవగలిగారు. ట్రాన్స్ జెండర్లకు అవసరమైన వ్యాయామం, జ్ఞానం, అనుభవం ఇచ్చే ఒక పత్రికను నడుపుతున్నారు. ఆ పత్రిక పేరు.. ‘టాన్స్ న్యూస్’. ‘ట్రాన్స్ న్యూస్’ పక్షపత్రిక. ప్రింట్లో రాదు. డిజిటల్లో వస్తుంది. గత ఏడాది నవంబర్‌లో పత్రిక ప్రారంభమైంది. ఇప్పుడా పత్రికకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ పత్రికను పెట్టిన ప్రియ కన్నా ఎక్కువగా! అందులో అప్డేట్ న్యూస్ ఉంటాయి. బ్యూటీ టిప్స్ ఉంటాయి. స్కిన్ కేర్ గురించి ఉంటుంది. ఇంకా ఆరోగ్యం, గృహాలంకరణ.. ఇలాంటివన్నీ. స్త్రీల కోసం పత్రికలు ఏవైతే ఇస్తుంటాయో ట్రాన్స్ మహిళల కోసం ‘ట్రాన్స్ న్యూస్’ అవన్నీ ఇస్తుంటుంది. ఇంకా.. ట్రాన్స్ ఉమెన్ తయారు చేసిన ఉత్పత్తులకు ఈ పత్రిక మార్కెటింగ్ కల్పిస్తుంది. ఉద్యోగావకాశాల సమాచారాన్ని కూడా అందజేస్తుంది. ‘టాన్స్ న్యూస్’ పత్రికను ఒక మనిషి అనుకుంటే ఆ మనిషి ఆత్మ ప్రియా బాబు. ఆమెకు 50 ఏళ్లుంటాయి. ఎవరైనా తనని ‘ఆమె’ అని పిలవడానికే అతడు ఇష్టపడతారు. కనుక మనమూ ప్రియ అనే చెప్పుకుందాం. ∙∙ ప్రియ ‘ట్రాన్స్ ఉమన్’. యాక్టివిస్ట్, కౌన్సెలర్.. ఇప్పుడిక మ్యాగజీన్ ఎడిటర్. ఆరేళ్ల క్రితం ప్రియ, ముగ్గురు స్నేహితులు కలిసి ముదురైలో ‘ట్రాన్స్ జెండర్ రిసోర్స్ సెంటర్’ స్థాపించారు! 2017లో లాభార్జన ధ్యేయం లేని సంస్థగా ఆ సెంటర్ రిజిస్టర్ అయింది. అందులో ట్రాన్స్ జెండర్ల న్యూస్ పేపర్ క్లిప్పింగులు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్ములు, ప్రభుత్వ విధానాలు, జీవోలు ఉంటాయి. ట్రాన్స్ జెండర్లు ఈ రిసోర్స్నంతటికీ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. రిసోర్స్ సెంటర్‌కు చక్కటి ఆదరణ లభించడంతో గత నవంబర్ 1న ‘ట్రాన్స్ న్యూస్’ అన్లైన్ పత్రిక కూడా మొదలైంది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జనం తమనెంత చిన్నచూపు చూస్తుంటారో ఎవరైనా అడిగినప్పుడు చెప్పడం తప్పితే అదే పనిగా చెప్పరు ప్రియ.ఆమె బిజీలో ఆమె ఉంటారు. ప్రియ చదువు ఇంటర్ మధ్యలోనే ఆగిపోయింది. తోటి విద్యార్థుల మాటలు, చూపులు పడలేక ఆమె కాలేజ్‌కి వెళ్లడం మానేశారు. ఆ సమయంలోనే తమిళ రచయిత సూ.సమిథిరం ఓ ట్రాన్స్ఉమన్ యాక్టివిస్టుపై రాసిన ‘వాడమల్లి’ అనే పుస్తకం చదివారు. అది చదివాక, తనూ ట్రాన్స్ ఉమెన్ కోసం ఏదైనా చేయాలని బలంగా అనుకున్నారు. ఫలితమే రిసోర్స్ సెంటర్, పత్రిక. మనసులో మాట చెప్పుకోడానికి కూడా ట్రాన్స్ ఉమెన్‌కు రిసోర్స్ సెంటర్ తోడ్పడింది. పాఠశాలలో సెమినార్లు నిర్వహించింది. మంచి మంచి వక్తల చేత మాట్లాడించింది. అవన్నీ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పత్రికలోనైతే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ మోడలింగ్ ఫొటోలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సంచికల్లో 13 మంది ట్రాన్స్ ఉమెన్, ఇద్దరు ట్రాన్స్మెన్ ఫొటోలు వేశారు. తాజాసంచికలో మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన భుజారియా ట్రాన్స్‌జెండర్ ఉత్సవాలను గురించి ప్రముఖంగా వేశారు. ఇండియాలో తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ రీడర్ పద్మినీప్రకాశ్ గురించి రాశారు. ట్రాన్స్ ఆంట్రప్రెన్యూర్ జీవా రెంగరాజ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే జుట్టు రాలకుండా కొన్ని టిప్స్ కూడా. ప్రియ తమిళ్ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించగలరు. ఆ విద్య ఆమెకు చాలావరకు పత్రికను అప్డేట్ చెయ్యడంతో తోడ్పడుతోంది. తమిళ్, ఇంగ్లీషు.. రెండో భాషల్లో వస్తున్న ఈ డిజిటల్ మ్యాగజీన్‌కు వీక్షకుల సంఖ్య కూడా బాగానే ఉంది. ∙∙ ప్రియ ఎడిటర్ అయితే ఆమె కింద ఐదుగురు రిపోర్టర్లు, ఐదుగురు ఇంటెర్న్‌లు ఉన్నారు. వాళ్లంతా ట్రాన్స్ ఉమనే. పత్రిక నడపడానికి అవసరమైన ఫండింగ్‌ను ఇచ్చేందుకు ‘హై–టెక్ అరై’ అనే ఆయిల్ సీల్‌ను ఉత్పత్తి చేసే సంస్థ ముందుకు వచ్చింది. అది దీర్ఘకాల హామీ. ఎన్నాళ్లు ‘ట్రాన్స్ న్యూస్’ వస్తే అన్నాళ్లూ ఫండ్స్ వస్తుంటాయి. ఫండ్స్ అంటే పెద్దగా ఏం అవసరం లేదు. జీతాలు, ఆఫీస్ అద్దె. వ్యాపార ప్రకటనలైతే ఇంకా రావడం మొదలు పెట్టలేదు. అవొస్తే తమకు ఆర్థికంగా బాగుంటుందని ప్రియ ఆశిస్తున్నారు. పత్రిక చందా ఉచితం. త్వరలోనే హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా ‘ట్రాన్స్ న్యూస్’ తీసుకురానున్నామని చెబుతున్న ప్రియ బాబు తన గురించి చెప్పుకోడానికి మాత్రం ఆసక్తి చూపరు. ‘మా జీవితాలన్నీ ఒకేలా ప్రారంభం అవుతాయి. వాటి గురించి చెప్పవలసింది ఏముంటుంది?’ అని నవ్వేస్తారు. -
గ్లామరస్ ఫోటోలు.. ట్రోలింగ్‌కు గురైన నటి
ముంబై : తండ్రి మరణించిన వారం రోజుల్లోనే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు షేర్ చేసిన టీవీ నటి దివ్య అగర్వాల్ ట్రోల్స్‌కు గురయ్యారు. ఇటీవల దివ్య తండ్రి కరోనా కారణంగా కన్నుమూశారు. అయితే ఇది జరిగి వారం రోజులు కూడా గడవక ముందే నటి దివ్య ఓ మ్యాగజైన్ కవర్‌ఫోటో షూట్ చేసింది. హాట్ హాట్ అందాలతో ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఇక అప్పటినుంచి నెటిజన్లు దివ్య తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తండ్రి చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నారంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై దివ్య అగర్వాల్ సైతం ఘాటుగానే స్పందించారు. ప్రస్తుత సమాజం కేవలం ఎదుటివాళ్ల బాధనే కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. జీవితంలో మూవ్ ఆన్ అయ్యి మళ్లీ సాధారణ జీవితం గడిపితే జనాలు చూడలేకపోతున్నారమో అంటూ ట్రోల్స్‌కు గట్టిగానే బదులిచ్చింది. (డ్రగ్స్ వాడొద్దని రియా చెప్పింది. అయినా: లాయర్ ) View this post on Instagram Not an ordinary heart ! Posted @withregram • @glmagazine_india Nothing more! Just slowing down with Divya Agarwal in our new issue 🌟💫 Magazine: Grandeur Lifestyle @glmagazine_india On the cover: @divyaagarwal_official Edition: October, 2020 Manging editor: @inndresh_official Editor: @editor_glmagazine Magazine’s Creative Director: @vjvasundhara Chief content manager: @ccm_glmagazine Content writer: @tanishka.juneja Photographer: @ikshitpatel Styling: @esha_bhuchar & @mehnaazazad Outfit: @tenassi.in & @jeetkhatri PR: @sinhavantika & @soapboxprelations Produced by: @brandcorpsmedianetwork #divyaagarwal #magazine #october #cover #editorial #magazinecover #bollywood #actress #bollywoodstyle #video #fashion #style #fashionstyle #stylist #grandeurlifestyle #glmagazineindia #instafashion #instagram #videooftheday #instadaily #instamood #instapic #instavideo #photography #video #photoshoot #grandeurlifestylemagazine #divyaagarwal_official A post shared by Divya Sanjay Agarwal (@divyaagarwal_official) on Nov 4, 2020 at 4:41am PST -
టీటీడీ సప్తగిరి మాసపత్రిక విషయంలో కుట్ర
-
తొలి ముఖ చిత్రం
చిన్నప్పుడు ఇష్టంగా వాడిన వస్తువులు, దిగిన ఫొటోలు వంటివన్నీ అపురూపంగా దాచుకుంటాం. పెద్దయ్యాక చూసుకుని మురిసిపోతాం. ఇప్పుడు రష్మికా మందన్నా ఒక ఫొటోను బయటపెట్టి, తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిగో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి ఉంది కదా. ఈ ఫొటోనే రష్మిక షేర్ చేశారు. ఒక పత్రిక కవర్‌పేజీ మీద ఉన్న చిన్నారి రష్మిక చాలా ముద్దుగా ఉంది కదూ. 2001లో ప్రింట్ అయిన తమిళ పత్రిక ‘గోకులం’ ముఖచిత్రం కోసమే రష్మిక ఇలా రెండు చేతులకు వాచీలు పెట్టుకుని పోజిచ్చారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలానే రెండు చేతులకు వాచీలు పెట్టుకుని సరదాగా ఫొటో దిగారు. ‘‘నా ఫస్ట్ కవర్ పేజీ ఇది. అప్పుడు జరిగిన ఫొటోషూట్ నాకింకా గుర్తుంది. మా అమ్మగారు ఆ పత్రికను భద్రంగా దాచారు. ఇప్పటికీ నా గురించి ఏ పత్రికలో వచ్చినా దాస్తుంటారు. ఇవాళ నటిగా మీ (ప్రేక్షకులు) ప్రేమను దక్కించుకోవడానికే ఇంతదాకా వచ్చానా? అనిపిస్తోంది. నా ఈ ఎదుగుదలకు కారణం నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు. అలాగే నేను వర్క్ చేసిన, చేస్తున్నవారు కూడా ఓ కారణం. ఒక మైల్స్టోన్ చేరుకునే క్రమంలో చేసిన యుద్ధాలు... సారీ.. ఎక్కువ చెబుతున్నాను కదూ’’ అని పేర్కొన్నారు రష్మికా. -
అంబేడ్కర్ పత్రికకు వందేళ్లు
భారత సామాజిక వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వాలకు నోచుకోక, అంటరానితనానికి గురవుతున్న నిమ్నకులాల కోసం తొలిసారిగా కలం పట్టిన అక్షరయోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన గ్రంథకర్తగానే గాక ప్రజాహిత పాత్రికేయునిగా ముద్రవేసుకున్న మేధావి. ఆంగ్లేయ పాలనలో నిమ్నకులాలకు అంచలంచెలుగా రక్షణలు సాధించేం దుకు కృషి చేశారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎస్.కె.బోలే, ఘొలప్ వంటి సంస్కర్తలతో కలిసి 1924లో బహిష్కృత హితకారిణి సభను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా నిమ్నకులాల విద్యార్థులకు పాఠశాలలు, హాస్టళ్ళ ఏర్పాటుతో పాటు ‘సరస్వతి విలాస్’ పత్రికను ఏర్పాటు చేశారు. నిమ్నకులాల ఉద్యమంలో భాగంగా పత్రికారచనకు పూనుకున్నారు. స్వయంగా పత్రికలను నిర్వహించారు. సామాజిక పునర్నిర్మాణం కోసం ఆయన పత్రికలు కీలకపాత్ర పోషించాయి. డాక్టర్ అంబేడ్కర్ నిర్వహించిన ‘మూక్‌నాయక్’, ‘బహిష్కృత్ భారత్’, ‘సమత’, ‘జనత’ పత్రికలు నిమ్నకులాల ఆత్మగౌరవ, హక్కుల ఉద్యమానికి వాహికగా నిలిచాయి. కొల్హాపూర్ మహారాజా ఆర్థిక సహకారంతో 31, జనవరి, 1920లో డాక్టర్ అంబేడ్కర్ ‘మూక్‌నాయక్’ పక్ష పత్రికను ప్రారంభించారు. నిమ్నకులాల పోరాటాలు, అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు, రచనలు ఈ పత్రిక ప్రచురించేది. విషయం పట్ల అవగాహనతో, ఆధారాలతో, పాఠకులు వాస్తవాలను గ్రహించి, అంగీకరించే రీతిలో ‘మూక్‌నాయక్’’ పత్రికను ఆయన నిర్వహించారు. అంటరానితనం నిర్మూలన, సంఘసంస్కరణ మీద జరుగుతున్న చర్చలు, వాదప్రతివాదాలు ఈపత్రికలో ప్రచురించేవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎమ్మెస్సీ చదివే అవకాశం రావడంతో ఆయన తన మిత్రులకు ‘మూక్‌నాయక్’ పత్రిక నిర్వహణను అప్పగించారు. ఆర్థిక కారణాలతో పత్రిక ప్రచురణ ఆగిపోయింది. డాక్టర్ అంబేడ్కర్ 1927, ఏప్రిల్ 3న ‘బహిష్కృత భారత్’ మరాఠీ పక్ష పత్రికను బొంబాయి కేంద్రంగా ప్రారంభించారు. తాగునీటికోసం జరిగిన మహద్ పోరాటంలో సంఘసంస్కర్తలను తన రచనలతో సమన్వయ పరిచిన ఘనత ఆయనదే. నిమ్న కులాలను ఒకతాటిమీదకు తీసుకొచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపగలిగారు. ‘బహిష్కృత భారత్’ పత్రిక ద్వారా అంబేడ్కర్ నిమ్నకులాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగారు. ‘అంటరానితనం నిర్మూలన నా జన్మహక్కు’ అనే నినాదాన్ని 27 నవంబర్, 1927న ‘బహిష్కృత్ భారత్’ పత్రికలో ప్రచురిం చారు. ఈలోపు సైమన్ కమిషన్‌తో సంప్రదింపులు, అనంతరం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరు కావలసి రావడంవల్ల అంబేడ్కర్ ‘బహిష్కృత్ భారత్’ పత్రిక ప్రచురణ నిలిపివేశారు. అంబేడ్కర్ తన పత్రికల ద్వారా కోట్లాది మంది అంటరాని ప్రజానీకంలో కొంతమేర సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితి గతుల్లో మార్పు తీసుకొచ్చారు. నిమ్నకులాలకు పత్రికా రచన వారసత్వాన్ని తీసుకొచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో పత్రిక స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మాట్లాడే స్వేచ్ఛ లేని, దోపిడీకి గురవుతున్న కోట్లాదిమంది నిమ్నకులాల కోసం అంబేడ్కర్ పాత్రికేయునిగా అవతరించారు. అణగారిన వర్గాల దాస్యవిమోచకునిగా నాటి పత్రికారంగం ఆయన సేవలను కొనియాడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందుస్తాన్ టైమ్స్, ది ప్రి ప్రెస్ జర్నల్, ది అమృత్ బజార్ పత్రిక, ది న్యూయార్క్ టైమ్స్, ది టైమ్స్ (లండన్) మొదలైన పత్రికలు అంబేడ్కర్ స్వాతంత్య్ర ఉద్యమంలోను, భారత సామాజిక పునర్మిర్మాణంలోనూ పోషించిన పాత్రను కొనియాడుతూ సంపాదకీయాలను ప్రచురించాయి. నిర్మాణాత్మక తప్పిదాలపై ఉద్యమించి ఫలితాలు సాధించిన వ్యక్తిగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను ఈ దేశం సుదీర్ఘ కాలం గుర్తిం చుకోవలసి వుంటుందని ‘ది ప్రి ప్రెస్ జర్నల్’ పేర్కొంది. ‘ది అమృత బజార్ పత్రిక’ తాను అనుకున్న లక్ష్యాలను సాధించడంలో, దేశభక్తునిగా వ్యవహరించడంలో భారత ఉపఖండంలోనే ఉన్నతునిగా డాక్టర్ అంబేడ్కర్‌ను కీర్తించింది. మానవహక్కుల కోసం, ప్రజాహితం కోసం పోరాటం చేసిన మరుపురాని వ్యక్తిగా ఆయన్ని కొనియాడింది. (అంబేడ్కర్ 1920 జనవరి 31న స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా) డా. జి.కె.డి. ప్రసాద్ వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం, ఏయూ, విశాఖపట్నం మొబైల్ : 93931 11740 -
వారిలో సమాజ హితం లేదు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మేలు కోరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే రాష్ట్రంలోని కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. వారి రాతల్లో, ప్రసారాల్లో ఏమాత్రం సమాజ హితంలేదని, సొంత సామాజికవర్గ స్ఫూర్తి మాత్రమే కనిపిస్తోందని ఈనాడు, ఈటీవీపై రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 జనవరి 9న ఈనాడు పత్రిక ‘ఇవి మీకు తెలుసా?’ అనే శీర్షికన ప్రచురించిన ఫొటోలు, కథనాల్లో రామోజీరావు తాలూకు స్వార్థం, సామాజికవర్గ స్ఫూర్తి కనిపిస్తోందన్నారు. ఆ ఫొటోలను మంత్రి ఉటంకిస్తూ.. 2016 అక్టోబర్ నుంచి సచివాలయంలో పాలన సాగుతోందని.. 2017 మార్చి నుంచి శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయని రాశారన్నారు. అయితే, అవి జరుగుతున్నవి తాత్కాలిక భవనాల్లో అనే విషయం వాస్తవమా, కాదా? అని రామోజీరావును చెప్పమనండి? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో 2019 జూలై నుంచి రాజ్‌భవన్ పనిచేస్తోందని, జగన్ అధికారంలోకి వచ్చాక గతంలో మాజీ ముఖ్యమంత్రి వినియోగించిన ఈ భవనాన్ని ఆయనకు కేటాయించారన్నారు. అంతేకాదు.. విజయవాడ, గుంటూరులో అద్దె భవనాల్లో కొన్ని, సొంత భవనాల్లో కొన్ని ప్రభుత్వ శాఖలున్నాయనేది కూడా నిజమేననీ.. అయితే హంగులన్నీ ఉన్న అమరావతికి అదనంగా ఖర్చుచేయాల్సిన అవసరంలేదని మరో పెద్ద శీర్షికతో కథనం రాసిందని ఆయన ప్రస్తావించారు. అమరావతిలో అన్ని హంగులూ ఉంటే రాజధాని నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు అవుతుందని ఇదే ఈనాడు పత్రిక 2018 డిసెంబర్ 24న ‘నిలువెత్తు దగా’ అని వార్త ఎలా రాశారన్నారు. నిజంగా అంతా అయిపోయి ఉంటే మొన్నటి ఎన్నికలకు ముందు రూ.53 వేల కోట్ల మేరకు టెండర్లు ఎందుకు పిలిచారో చెప్పాలి? అన్నారు. అలాగే, గురువారం 2020 జనవరి 9 నాటి కథనంలో రూ.3 వేల కోట్లు ఖర్చుచేస్తే అంతా అయిపోతుందని రాశారని బొత్స అన్నారు. ఎన్నికలకు ముందేమో దగా అని రాసి ఇప్పుడేమో అద్భుతం అంటారా? అని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. శివరామకృష్ణన్ నివేదికను ప్రచురించాలి రాష్ట్ర విభజన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో ఈనాడులో ప్రచురించాలని బొత్స డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వంత పాడొద్దని రామోజీరావుకు ఆయన హితవు పలికారు. కాగా, విశాఖపట్నానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు దూరం, దగ్గరని రాస్తున్నారని.. మరి విశాఖపట్నం విజయవాడకు 400 కిలోమీటర్లు ఉన్నపుడు విజయవాడ నుంచి విశాఖ ఏమైనా 40 కిలోమీటర్లే ఉంటుందా? దూరం కాదా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న వారు మనుషులు కారా? వారికి అభివృద్ధి అవసరంలేదా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చి ఏం చేశారని రామోజీరావు ఏనాడూ తన పత్రికలో ఎందుకు అడగలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రాంతీయ అసమానతలను తగ్గించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ వార్తలకు తాము భయపడేదేలేదని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. పవన్‌కు కోపం వస్తే కవాతు అంటే ఎలా? కాగా, రాజధాని ప్రాంతంలో పవన్‌కళ్యాణ్ చేస్తానని చెబుతున్న నిరసన కవాతు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆయనకు కోపం వచ్చినపుడు కవాతు అంటే ఎలా? ఆయన మాదిరిగా మాకు కేకలు వేయడం, యాక్షన్ చేయడం రాదు’ అని బొత్స బదులిచ్చారు. అసలు ఆయనకు ఏ విషయంపై కూడా స్పష్టతలేదన్నారు. రైతులు చంద్రబాబు ఉచ్చులో పడొద్దని, గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టంచేశారు. ఎన్ని గొంతుకలో? ఈనాడు పత్రిక ఎన్నికలకు ముందు ఒక గొంతుక, ఎన్నికలయ్యాక మరో గొంతుకను వినిపిస్తోందని బొత్స ధ్వజమెత్తారు. రామోజీరావులో సమాజ స్పృహ కన్నా సామాజికవర్గ స్పృహ ఎక్కువగా ఉందని.. ఎందుకీ పాపపు మాటలని ప్రశ్నించారు. వయస్సు, అనుభవం పెరిగిన ఆయన ఇంకా ఏం సాధించడానికి ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. వీరి వ్యవహారం చూస్తుంటే.. వారి మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలా వార్తలు.. మరొకరు సీఎం అయితే ఇంకోలా రాస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులందరూ మీ అడుగులకు మడుగులు ఒత్తాలా? మీకు తొత్తులుగా ఉండాలా? అని ఆయన మండిపడ్డారు. -
పదండి ముందుకు పదండి చదువుకు
-
ఖజానా ఖాళీ
-
రైతు రాజ్యం
-
డ్రాగన్ పెత్తనమేంటి..?
-
కాంగ్రెస్ కకావికలం
-
బడ్జెట్ 2019-2020
-
మూడు ముక్కలాట
-
మహా నరకాలు
-
హస్త వ్యస్తం
-
జలగండం
-
కరకట్ట కబ్జా!
-
అపర చాణక్యుడికి అవమానం!
-
బాక్సైట్ బంద్!
-
నల్ల త్రాచులు
-
యుద్ధ మేఘాలు
-
దాహం..దాహం!
-
టార్గెట్ 2020
-
జమిలి
-
బాహుబలి
-
ఎండమావులు
-
పాక్ పరేషాన్..!
-
మానని గాయం
-
కటీఫ్..!
-
హిందీ వార్!
-
దటీజ్ షా
-
జనహితుడు
-
జగన్ అనే నేను..
-
రాహు కాలం
-
బాబోయ్ అప్పు!
-
రియల్ హీరో
-
బైబై బాబు..!
-
ఆశ నిరాశేనా..!
-
కౌంట్ డౌన్
-
వరల్డ్ వార్!
-
గరుడ పురాణం 2.0
-
బాబుకు భయమెందుకు?
-
రాజముద్ర
-
టార్గెట్ ఈసీ!
-
బాబుగారి డాబు!
-
కోడ్ Vs కేబినెట్!
-
దొందూ దొందే!
-
త్రిశంకు సభేనా?