Shah Rukh Khan is the only Indian in Empire Magazine's 50 Greatest Actors - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: కింగ్‌ ఖాన్‌కు మరో అరుదైన ఘనత.. ఆ జాబితాలో భారత్‌ నుంచి షారుక్‌ మాత్రమే చోటు

Published Wed, Dec 21 2022 11:31 AM | Last Updated on Wed, Dec 21 2022 11:58 AM

Shah Rukh Khan is The Only Indian Actor In Empire Magazine 50 Greatest Actors - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత ప్రతిభావంతులైన 50 మంది నటీనటుల జాబితాలో షారుక్‌ ఖాన్‌కు చోటు దక్కింది. బ్రిటిష్‌కు చెందిన ప్రముఖ ఎంపైర్‌ మ్యాగజైన్‌ ‘ఎంపైర్‌ మ్యాగజైన్‌ 50 గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ లిస్ట్‌’ పేరుతో మంగళవారం తమ మ్యాగజైన్‌లో ప్రచురించింది. ఈ జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్క నటుడిగా షారుక్‌ ఖాన్‌ పేరు ఉండటం విశేషం. ప్రముఖ హాలీవుడ్‌ నటులు డెంజల్‌ వాషింగ్టన్‌, టామ్‌ హ్యాంక్స్‌, ఆంథోని మార్లన్‌ బ్రాండో వంటి దిగ్గజాల సరసన షారుక్‌ నిలిచాడు. ఈ సందర్భంగా ఎంపైర్‌ మ్యాగజిన్‌ తన ఆర్టికల్‌లో షారుక్‌ చేసిన పాపులర్‌ రోల్స్‌, సినిమాలను పేర్కొంది.

నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న ఈ ‘కింగ్‌ఖాన్‌’ విజయాల పరంపర, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు షారుక్‌ నటించిన ఓ చిత్రంలో చెప్పిన ‘జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది’ అన్న డైలాగ్‌ని ఆర్టికల్‌లో పేర్కొంటూ అతడి కెరియర్‌లోనే ఇది ఉత్తమైన డైలాగ్‌గా కొనియాడింది. దేవదాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, కుఛ్ కుఛ్ హోతా హై వంటి సినిమాల్లో అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు కురిపించింది. కాగా ‘ఎంపైర్’ మ్యాగజైన్ కథనాన్ని షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

చదవండి: 
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌? ఆమెతోనే ఏడడుగులు!
ఒకే ఫ్రేంలో రామ్‌ చరణ్‌-అల్లు అర్జున్‌.. మురిసిపోతున్న ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement