ఐపీఎల్‌ ప్రారంభ వేడుక.. కింగ్ ఖాన్‌తో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ | Shah Rukh Khan And Virat Kohli Dance For Pathaan Movie Jhoome Jo Pathaan Song At IPL 2025 Opening Ceremony, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: కింగ్ ఖాన్‌తో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!

Published Sun, Mar 23 2025 4:21 PM | Last Updated on Sun, Mar 23 2025 5:36 PM

Shah Rukh Khan and Virat Kohli Pathaan steps at IPL 2025 opening

వేసవి క్రీడా సంబురం ఐపీఎస్‌ సందడి అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్‌కతాలోని  ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఈ ఏడాది మెగా సీజన్‌ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభ వేడుకల్లో పలువురు సినీతారలు కూడా సందడి చేశారు. ముఖ్యంగా కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ భామ దిశాపటానీ తన డ్యాన్స్‌తో అభిమానులను మెప్పించింది.

అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్‌ కింగ్‌ షారూక్ ఖాన్ క్రికెటర్లను కాసేపు నటులుగా మార్చేశారు. తనతో పాటు విరాట్ కోహ్లీ, రింకూ సింగ్‌ను డ్యాన్స్ చేయించారు. పఠాన్ మూవీలోని ఓ సాంగ్‌కు కింగ్ కోహ్లీ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఐపీఎల్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతేకాకుండా ఈ వేడుకలో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన పాటలతో అభిమానులను అలరించారు. పుష్ప-2 సాంగ్ పాడి ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం షారూక్ ఖాన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. చివరిసారిగా జవాన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ ‍అట్లీ దర్శకత్వం వహించారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement