
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన సొంతిల్లు మన్నత్‌ను వీడనున్నాడు. మన్నత్ (Mannat)ను వదిలేసి అద్దె ఇంట్లోకి షిఫ్ట్ కానున్నాడు. 25 ఏళ్లుగా కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. మన్నత్ బంగ్లాను రెనోవేషన్ చేయనున్నారట. ఆ పనులు పూర్తయ్యేవరకు షారూఖ్ అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉండనున్నారట!
అద్దెకు నాలుగంతస్తులు
తన కుటుంబంతోపాటు సిబ్బంది, సెక్యురిటీ.. ఇలా అందరికోసం బాంద్రాకు సమీపంలోని పూజా కాసా అపార్ట్‌మెంట్‌లో నాలుగంతస్తులను రెంట్‌కు మాట్లాడుకున్నారట! దీనికిగానూ నెలకు రూ.24లక్షలు అద్దె చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మన్నత్ బంగ్లా పునరుద్ధరణ పనులు మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఆ బంగ్లా మళ్లీ కొత్తగా తయారవ్వడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.

మూడేళ్లపాటు లీజుకు
ఇక షారూఖ్‌కు అపార్ట్‌మెంట్ అద్దెకిస్తోంది మరెవరో కాదు నిర్మాత వాసు భగ్నానీ. వాసు తనయుడు జాకీ భగ్నానీ (రకుల్ ప్రీత్ సింగ్ భర్త), కూతురు దీప్శిక దేశ్‌ముఖ్‌లు.. నాలుగు అంతస్తులను షారూఖ్‌కు మూడేళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేయించుకున్నారట! అయితే అంతకాలంపాటు షారూఖ్ అక్కడే ఉంటారా? అన్నది ప్రశ్నార్థకమే! షారూఖ్ చివరగా 2023లో 'పఠాన్', 'జవాన్', 'డంకీ' సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రలో మెరిశాడు.
Comments
Please login to add a commentAdd a comment