
సినీ ఇండస్ట్రీలో హీరోలకు క్రేజే వేరు. హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ వీరికే ఉంటుంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూడా ఒకరు. ఆయనకు వరల్డ్ వైడ్‌గా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.
తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలవడం కోసం చేసిన సాహసం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను షారూఖ్ ఖాన్‌ను కలిసేందుకు దాదాపు 95 రోజుల పాటు ఆయన నివాసమైన మన్నత్ బయటే ఉన్నాడట. జార్ఖండ్‌కు చెందిన వీరాభిమాని షారూఖ్‌ను కలవాలన్న ఆశతో ఇంటి బయటే వేచి చూశాడు. చివరికీ షారూఖ్‌ను కలిసి తన కోరిక నెరవేర్చుకున్నాడు. అభిమాన హీరోతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నవంబర్ 2న షారూక్ ఖాన్ తన 59వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు.
గతేడాది బ్యాక్-టు-బ్యాక్ పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్ కింగ్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయన కుమార్తె సుహానా ఖాన్ నటించనున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment