Mannat
-
ఇదేం పిచ్చి సామీ.. హీరో కోసం 95 రోజులుగా!
సినీ ఇండస్ట్రీలో హీరోలకు క్రేజే వేరు. హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ వీరికే ఉంటుంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా ఒకరు. ఆయనకు వరల్డ్ వైడ్‌గా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలవడం కోసం చేసిన సాహసం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను షారూఖ్ ఖాన్‌ను కలిసేందుకు దాదాపు 95 రోజుల పాటు ఆయన నివాసమైన మన్నత్ బయటే ఉన్నాడట. జార్ఖండ్‌కు చెందిన వీరాభిమాని షారూఖ్‌ను కలవాలన్న ఆశతో ఇంటి బయటే వేచి చూశాడు. చివరికీ షారూఖ్‌ను కలిసి తన కోరిక నెరవేర్చుకున్నాడు. అభిమాన హీరోతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నవంబర్ 2న షారూక్ ఖాన్ తన 59వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు.గతేడాది బ్యాక్-టు-బ్యాక్ పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్ కింగ్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయన కుమార్తె సుహానా ఖాన్ నటించనున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
షారుక్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. కేసు నమోదు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంట్లోకి దుండగలు చొరబడ్డారు. ముంబైలోని షారుక్ నివాసం మన్నత్‌లోకి గురువారం ఇద్దరు వ్యక్తులు అక్రమంగా చొరబడ్డారు. అయితే వారిని గుర్తించిన భద్రతా సిబ్బంది దుండగులను పోలీసులకు అప్పగించారు. విచారణలో వారు గుజరాత్‌కి చెందిన వ్యక్తులని తేలింది. కేవలం తమ అభిమాన నటుడు షారుక్ ఖాన్‌ను దగ్గర్నుంచి చూసేందుకే ఇలా ఇంట్లోకి వచ్చామని, వేరే దురాలోచనలు ఏమీ లేవని వారు వారు పోలీసులతో పేర్కొన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులపై ఏమైనా నేరచరిత్ర ఉందేమో అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. యువకులిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
షారుక్ ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్, మెరిసిపోతున్న మన్నత్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలో ఒకరు. ఇక ముంబైలోని ఆయన నివాసం ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. అక్కడ చూడదగిన ప్లేస్‌లో షారుఖ్ నివాసం మన్నత్ ఒకటి. సుమారు రూ. 200 కోట్లతో అన్ని హంగులతో షారుక్ తనకు నచ్చినట్టుగా మన్నత్నని నిర్మించుకున్నాడు. ఇందులో షారుక్ ఇంటి నెంబర్ ప్లేటు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మన్నత్‌కు మరింత మెరుపు తీసుకువచ్చేందుకు గతంలో వజ్రాలతో ఉన్న నెంబర్ ప్లేట్‌ని చేపించాడు షారుక్. పూర్తిగా వజ్రాలతో పొదిగిన ఈ ప్లేట్‌పై మన్నత్ అని నల్లటి అక్షరాలతో రాసి ఉంటుంది. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? అయితే భద్రత దృష్ట్యా ఈ నేమ్ ప్లేట్ తీసేశారు. తాజాగా మరోసారి షారుఖ్ తన ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్ పెట్టించాడు. దాదాపు 35 లక్షలతో ఈ వజ్రాల నేమ్ ప్లేట్ తయారు చేయించినట్లు తెలుస్తోంది. రాత్రిపూట ఆ వజ్రాలు మెరుస్తూ ఆ ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. దీంతో ఈ వజ్రాల నేమ్ ప్లేట్‌ని చూసేందుకు మరోసారి ప్రజలు షారుఖ్ ఇంటికి క్యూ కడుతున్నారు. మన్నత్‌ను సందర్శించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో షారుఖ్ ఇంటి డైమండ్ నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. After 2 months #Mannat new gate design is unveiled and it's super awesome. What do you think guys? 😍#GauriKhan #ShahRukhKhan pic.twitter.com/w2VcF2AEl9 — Team Shah Rukh Khan Fan Club (@teamsrkfc) November 19, 2022 -
వందల కోట్ల భవంతిలో షారుఖ్.. ట్రెండింగ్‌లో ఇంటి నేమ్ ప్లేట్
Shahrukh Khan Luxurious Bungalow Mannat Name Plate Trending: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన అభిమాన గళం ఉంది. వెండితెరపై ఆయన సినిమా వస్తుందంటే వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. షారుఖ్ చేస్తున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి ఫొటో వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఇందుకు కారణం షారుఖ్ ఖాన్ తన ఇంటి నేమ్ ప్లేట్ మార్చడమే. షారుఖ్ ఖాన్‌కు ముంబైలోని బాంద్రాలో భవంతి ఉన్న విషయం తెలిసిందే. తన అభిరుచికి తగినట్లుగా ఈ ఇల్లును మలుచుకున్నాడు. ఈ ఇంటి ఖరీదు సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది. ఈ ఇంటికి ఆయన 'మన్నత్' అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పటివరకూ ఈ ఇంటి నేమ్ ప్లేట్‌ను చాలా సార్లు మార్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కొత్త డిజైన్‌తో మన్నత్ నేమ్ ప్లేట్‌ను మార్చాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై షారుఖ్ అభిమానులు తమదైన శైలీలో కామెంట్లు పెడుతున్నారు. 'ఈ డిజైన్ ఎప్పటికీ ఐకానిక్‌గా ఉంటుంది', 'మన్నత్ స్టార్డమ్, ప్రేమ, భావోద్వేగం, అభిరుచి, కృషి, ఇంకా అంకితభావానికి చిహ్నం', 'దేవుడి స్వర్గం. షారుఖ్ ఖాన్ ఇంటి నేమ్ ప్లేట్ కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది.' అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ ఇంటిలో 2001 నుంచి షారుఖ్ ఖాన్, అతని కుటుంబం నివాసం ఉంటున్నారు. చదవండి: హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు This design will be forever iconic. Simple, unassuming and classy, just like you @iamsrk. Not a fan of the new one to be honest. #Mannat pic.twitter.com/Nbq8Nnrah6 — Samina ✨ (@SRKsSamina_) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
షారుక్ ఖాన్ బర్త్‌డే.. వెలిగిపోతున్న 'మన్నత్'
Shah Rukh Khan Birthday Mannat Decorated With Lights: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇల్లు మన్నత్ దీపాల కాంతులతో వెలిగిపోతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మన్నత్‌కు బహుమతులు పంపారు. ప్రతీ ఏటా దీపావళి సహా పండగలు, బర్త్‌డే వంటి స్పెషల్ అకేషన్స్ నాడు మన్నత్‌ను మరింత సుందరంగా ముస్తాబు చేస్తారు. అయితే కొడుకు ఆర్యన్ ఖాన్ జైళ్లో ఉండటంతోషారుక్ భార్య గౌరీ ఖాన్ పుట్టినరోజు సహా దసరా వేడుకలు కూడా జరుపుకోలేదు. అయితే ఇటీవల ఆర్యన్‌కు బెయిల్ రావడంతో బాద్షా కుటుంబంలో సంతోషం రెట్టింపయ్యింది. దీంతో షారుక్ 56వ బర్త్‌డేతో పాటు దీపావళి కూడా వస్తున్న నేపథ్యంలో మన్నత్‌ను అందంగా అలంకరించారు. అయితే ఈసారి తన పుట్టినరోజును కేవలం కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని షారుక్ ఖాన్ నిర్ణయించుకున్నారట. దీంతో సెలబ్రిటీలు ఎవరూ ఇప్పుడప్పుడే ఇంటికి రావొద్దని, ఆర్యన్ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని షారుక్ వారితో చెప్పినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల
-
ఆర్యన్ ఖాన్ విడుదల.. ఇప్పటివరకు ఏం జరిగిందంటే?
Aryan Khan Released from Arthur Road Jail: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే ఆర్థర్ రోడ్ జైలు వద్దకు చేరుకున్న షారుక్ ఖాన్ కొడుకును ఇంటికి తీసుకురానున్నారు. దీంతో మన్నత్‌లో సందడి వాతావరణం నెలకొంది. 28రోజుల జైలు జీవితం అనంతరం ఆర్యన్ బయటకు వచ్చారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు షారుక్ అభిమానులు భారీగా మన్నత్‌కు చేరుకున్నారు. 'వెల్కం ఆర్యన్' అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. కాగా ఈ నెల అక్టోబర్ 2వ తేదీన క్రూయిజ్ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్యన్ దేశం వదిలి వెళ్లకూడదని కూడా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏం జరిగిందంటే.. ► అక్టోబర్ 2: ముంబై తీరంలోని గోవాకు చెందిన కొర్డెలియా క్రూయిజ్‌లో రేవ్‌పార్టీపై ఎన్సీబీ దాడులు చేసి షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌తో సహా 14 మందిని అదుపులోనికి తీసుకుంది. ► అక్టోబర్ 4: ఆ 14 మందిలో ఆర్యన్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ ప్రకటించింది. అక్టోబర్ 7 వరకు నిందితులు ఎన్సీబీ కస్టడీలోనే ఉన్నారు ► అక్టోబర్ 7: ఎన్సీబీ ఇక కస్టడీ అవసరం లేదని చెప్పడంతో కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ► అక్టోబర్ 8: ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకి ఆర్యన్‌ని తరలించారు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది ► అక్టోబర్ 11: ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఏర్పాటైన ముంబై ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ సమర్పించారు ► అక్టోబర్ 13–20: ఆ కోర్టులోనూ బెయిల్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరికి 20వ తేదీన ఆర్యన్‌కు బెయిల్ తిరస్కరించింది. ► అక్టోబర్ 21: ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్‌ను షారూక్‌ఖాన్ కలుసుకున్నారు. ఆర్యన్ జ్యుడీషియల్ కస్టడీని అక్టోబరు 30 వరకు పొడిగించారు ►అక్టోబర్ 26–28: బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ► అక్టోబర్ 28: ఆర్యన్‌ఖాన్, ఇద్దరు సహ నిందితులకు బెయిల్ మంజూరు చదవండి: ఆర్యన్ బెయిల్ కోసం చట్టపరమైన బాధ్యత తీసుకున్న ప్రముఖ నటి -
నా కొడుక్కి బెయిల్ వచ్చేవరకు స్వీట్లు వండొద్దు! : గౌరీ ఖాన్
Gauri Khan Says No kheer in Mannat till Aryan Gets Bail : డ్రగ్స్ కేసులో కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవడంతో బాలీవుడ్ బాద్షా షారుక్, గౌరీ ఖాన్ తీవ్ర మనోవేధనకు గురవతున్నట్లు తెలుస్తుంది. తిండి, నిద్ర లేకుండా ఆర్యన్ కోసమే ఎదురుచూస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. షారుక్ భార్య గౌరీ ఖాన్ అయితే ప్రతిరోజూ దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు తన స్నేహితులను కూడా భగవంతుడ్ని ప్రార్థించాలంటూ వేడుకుంటుందట. నవరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి కొడుకు బెయిల్ కోసం గౌరీ ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. మప్రతీ పండుగకి షారుక్ నివాసం ఎంతో అందంగా ముస్తాబయ్యేది. కానీ ప్రస్తుతం ఆర్యన్ జైలులో ఉండటంతో పండుగ సెలబ్రేట్ చేసుకునే ఆసక్తి లేదని, ఆర్యన్ ఇంటికి వచ్చేవరకు మన్నత్‌లో ఖీర్, స్వీట్లు ఏవీ చేయకూడదని గౌరీ ఖాన్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. ఆర్యన్ బెయిల్ నుంచి వచ్చేవరకు ఎలాంటి స్వీట్లు వండొద్దని స్టాఫ్‌కు తెలిపింది. కాగా ఇప్పటికే ఆర్యన్‌కు ముంబై కోర్టు మూడుసార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టనుంది. చదవండి: ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్ ఖాన్ -
షారుఖ్ ‘మన్నత్’ను అమ్మేస్తున్నాడా?!
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు అభిమానులతో ముచ్చటించడమంటే మహా సరదా. ఇక అభిమానుల చిలిపి ప్రశ్నలకు షారుఖ్ ఇచ్చే సమాధానాలు కూడా అంతే చిలిపిగా, చమత్కారంగా ఉంటాయి. తాజాగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు కింగ్ ఖాన్. ‘ఆస్క్ ఎస్ఆర్కే’ పేరిట మంగళవారం ఫ్యాన్స్‌తో చాటింగ్ చేస్తున్న సందర్భంగా ఓ నెటిజన్.. షారుఖ్ నివాసం ‘మన్నత్’గురించి ఓ ప్రశ్న అడిగాడు. ‘‘భాయ్ మన్నత్‌ను అమ్మేస్తున్నారా ఏంటి?’’ అంటూ సందేహం వ్యక్తం చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘మన్నత్‌ను ఎప్పుడూ ఎవరూ అమ్మలేరు.. ఇస్తారు.. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే జీవితంలో అనుకున్నవని సాధిచంగలుగుతావు’’అని చమత్కరించాడు. కాగా మన్నత్ అంటే వాగ్దానం(మాట ఇవ్వడం) అనే అర్థంలో ఈ విధంగా స్పందించాడు. ఇక షారుఖ్ సమయస్ఫూర్తికి నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. షారుఖ్ సన్నిహితుడు, దర్శక నిర్మాత కరణ్ జోహార్.. హార్ట్ ఎమోజీలతో స్పందన తెలియజేశాడు. కాగా షారూఖ్ ఖాన్‌కు ఉన్న స్థిరాస్తుల్లో అత్యంత విలువైనది అతడి ఇల్లే. ‘మన్నత్’గా పేరొందిన విలాసవంతమైన ఆ బంగ్లా ఖరీదు దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా.(చదవండి: స్టోరీ: 25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే) గౌరీ, నేను చిన్న ఇంట్లో ఉండేవాళ్లం ముంబైలో, సముద్ర తీరాన ఎంతో ఆహ్లాద వాతావరణాన్ని కలిగి ఉండే ఈ బంగ్లాలో షారుఖ్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇక మన్నత్‌ను కొనుక్కోవడం గురించి షారూఖ్ గతంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘‘ నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఢిల్లీ వాళ్లకు బంగ్లాలో ఉండటమే ఇష్టం. కానీ ముంబైలో అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది. అందుకే సొంత ఇల్లు కొనాలని భావించాను. మొదట నా భార్య గౌరీతో కలిసి చిన్న ఇంట్లో ఉండేవాడిని. కొన్నేళ్ల తర్వాత మన్నత్ గురించి తెలుసుకుని.. దానిని సొంతం చేసుకున్నాను. నా జీవితంలో నేను కొన్న అత్యంత ఖరీదైన భవనం అదే’’ అని చెప్పుకొచ్చాడు. Bhai Mannat bikti nahi sar jhuka kar maangi jaati hai....yaad rakhoge toh life mein kuch paa sakogay. https://t.co/dh3gJTVnOu — Shah Rukh Khan (@iamsrk) October 27, 2020 -
కరోనా రాకుండా బంగ్లాను కప్పేసిన హీరో?
ముంబై: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఆది నుంచీ ముందు వరుసలోనే ఉంది. ముఖ్యంగా ముంబైలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఈ క్రమంలో అక్కడే సెటిలైన కొందరు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తన మన్నత్ బంగ్లాను ప్లాస్టిక్‌తో కప్పేశారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పైగా కరోనా గాలి ద్వారా కూడా వస్తుందంటున్నారు కాబట్టి ముందు జాగ్రత్త తీసుకున్నారేమోనని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. (కరోనా : మరోసారి ఉదారత చాటుకున్న షారుక్) నిజంగానే ఆ ఫొటోలో కనిపిస్తుంది షారుక్ నివాసమే.. అయితే ఇది కరోనా వ్యాప్తి కట్టడి కోసం తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. ముంబైలో కుండపోతగా కురిసే వర్షాల నుంచి రక్షించుకునేందుకు ఆయన తన ఇంటిని ప్లాస్టిక్ కవర్స్‌తో కప్పివేసినప్పటి చిత్రాలు. ఆయన ప్రతి ఏడాది తన బంగ్లాను ఇలా వర్షాకాలంలో కప్పివేస్తుంటారు. కాగా లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి షారుక్ తన భార్య గౌరీ ఖాన్, పిల్లలు అబ్రామ్, సుహానా, ఆర్యన్లతో కలిసి మన్నత్ బంగ్లాలోనే నివసిస్తున్నారు. 2018లో వచ్చిన "జీరో" సినిమాలో ఆయన చివరిసారిగా కనిపించారు. (ప్రేమే ముఖ్యం) -
ఆ బంగ్లా నేను కొనాల్సింది : సల్మాన్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌కు ఉన్న స్థిరాస్తుల్లో అత్యంత విలువైనది అతడి ఇల్లే. ‘మన్నత్’గా పేరొందిన విలాసవంతమైన ఆ బంగ్లా ఖరీదు దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. సముద్ర తీరాన ఎంతో ఆహ్లాద వాతావరణాన్ని కలిగి ఉండే ఈ బంగ్లాను తొలుత సల్మాన్ ఖాన్ సొంత చేసుకోవాలని భావించాడట. అయితే తన తండ్రి వద్దని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నాడట. ఈ విషయం గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..‘ మన్నత్‌ను కొనుక్కోవాలనుకున్నాను. కానీ అంతపెద్ద ఇంటిని నువ్వు ఏం చేసుకుంటావు అని నాన్న గారు అనేసరికి వదిలేశాను. ఆ తర్వాత దానిని షారూఖ్ దక్కించుకున్నాడు. ఎప్పటి నుంచో నాకూ ఒక సందేహం ఉంది. షారూఖ్ అంతపెద్ద ఇంటిని ఏం చేసుకుంటాడా అని. ఈ విషయం గురించి తనను అడిగి డౌట్ క్లారిఫై చేసుకోవాల్సిందే’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా విలాసవంతమైన ఇంటిని కొనుక్కోవడం గురించి షారూఖ్ మాట్లాడుతూ..‘ నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఢిల్లీ వాళ్లకు బంగ్లాలో ఉండటమే ఇష్టం. కానీ ముంబైలో అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది. అందుకే సొంత ఇల్లు కొనాలని భావించాను. మొదట నా భార్య గౌరీతో కలిసి చిన్న ఇంట్లో ఉండేవాడిని. కొన్నేళ్ల తర్వాత మన్నత్ గురించి తెలుసుకుని.. దానిని సొంతం చేసుకున్నాను. నా జీవితంలో నేను కొన్న అత్యంత ఖరీదైన భవనం అదే అని చెప్పుకొచ్చాడు. కాగా ముంబైలో ఉన్న భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇల్లు ‘అంటిల్లా’ ప్రపంచంలోనే రెండో ఖరీదైన ఇల్లుగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ‘అంటిల్లా’నిర్మాణ వ్యయం దాదాపు 14 వేల కోట్లు. -
కొత్త జంట ముచ్చట తీర్చిన హీరో
అభిమాన నటున్ని చూడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అభిమానం ఎక్కువైన కొందురు మాత్రం ఏకంగా సదరు హీరో ఇంటి ముందు పడిగాపులు కాసి మరీ దర్శనం భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ల అదృష్టం బాగుంటే దర్శనం లభిస్తుంది.. లేదంటే లేదు. అభిమానం ఎక్కువైన ఓ ముంబై జంట ఇలాంటి ప్రయోగమే చేసింది. చివరకూ విజయం సాధించింది కూడా. వివరాలు.. ముంబైకి చెందిన ఓ జంటకు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అంటే విపరీతమైన అభిమానం. ఎంత పిచ్చి అంటే వివాహం అయిన వెంటనే అందురూ దైవ దర్శనం నిమిత్తం గుడికి వెళ్లడం సాధరణం. కానీ వీరు మాత్రం పెళ్లయిన వెంటనే తమ అభిమాన హీరో షారుక్ నివాసం అయిన మన్నత్ వద్దకు చేరుకున్నారు. అక్కడ షారుక్ ఖాన్ సిగ్నేచర్ మూవ్మెంట్ పోజ్‌లో భార్యభర్తలిద్దరూ నిల్చూని.. షారుక్ దర్శనం కోసం ఎదురు చూడసాగారు. షాకింగ్.. వారిని షారుక్ ఖాన్ చూడటమే కాక హాయ్ కూడా చెప్పడంట. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే షారుక్ ట్విట్టర్ ద్వారా సదరు దంపతులకు ఆశీర్వాదాలు కూడా తెలిపారు. ఇంకేముంది ఆనందంలో ఉక్కిరి బిక్కిరవుతున్నారు కొత్త జంట. God Bless you. https://t.co/A0a7CQ2PXQ — Shah Rukh Khan (@iamsrk) December 14, 2018 అయితే వీరు ఈ ఏడాది జూన్‌లోనే సదరు జంట ‘డిసెంబరులో మా వివాహం.. మీ ఆశీర్వాదం కావాలం’టూ షారుక్ ఖాన్‌కు ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. అయితే షారుక్ ఆ ట్వీట్ చూశాడో, లేదో కానీ.. కొత్త జంట ముచ్చట తీర్చి.. వారికి మరింత సంతోషాన్ని కలిగించారు. #AskSRK@iamsrk #AskSRK getting married this december, just need your blessings @iamsrk and love you!!!!! Your reply will equate to your presece in our marriage pic.twitter.com/kvPz7Vjmbc — dhruvp2894 (@dhruvp2894) June 6, 2018 -
షారూఖ్.. ఏందయ్యా ఇది?
సాక్షి, సినిమా : నవంబర్ 2 వచ్చిందంటే చాలూ.. ముంబై బాంద్రాలోని మన్నత్ వద్ద ప్రజలు భారీగా కనిపిస్తుంటారు. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ విల్లా అది. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు జబ్ర ఫ్యాన్స్(వీరాభిమానులు) దేశం నలుమూలల నుంచి వచ్చి అర్ధరాత్రి అక్కడ బారులు తీరుతుంటారు. ఇక తనను చూసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారికి తనదైన ఫోజులతో బదులివ్వటం ఈ సీనియర్ హీరోకు అలవాటే. ఈ ఏడాది 52వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం కూడా అలాంటి పరిస్థితులే అక్కడ కనిపించాయి. కానీ, ఈసారి అభిమానులు నిరాశగా అక్కడి నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి. అందుకు కారణం వారి సెల్ ఫోన్లు చోరీకి గురికావటమే. తమ ఫోన్లు, పర్సులు పోయాయంటూ దాదాపు 30 మంది బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారంట. అయితే అంత మంది గుంపులో దొంగలను పట్టుకోవటం చాలా కష్టమేనని పోలీసులు తేల్చేయటంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. షరా మాములే... షారూఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఇంటి వద్ద ప్రతీ ఏడూ భద్రతను కట్టుదిట్టం చేస్తుంటారు. అయితే షారూఖ్ పైన నిల్చున్న సమయంలో ఆయన్ని దగ్గరి నుంచి చూసేందుకు జనాలు ఒక్కసారిగా ఎగబడుతుంటారు. ఆ సమయంలో తొక్కిసలాట, లాఠీఛార్జ్ సర్వసాధారణంగా మారిపోయాయంట. ఆ అలజడినే అదనుగా చేసుకుని కొందరు దొంగతనాలు చేస్తుంటారంట. ఈ నేపథ్యంలో నిన్న కూడా కొందరు తమ చేతి వాటం ప్రదర్శించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సంగతి పెద్దగా పట్టించుకోని షారూఖ్ ఎప్పటిలాగే అలీబాగ్ బంగ్లాలో స్నేహితుల మధ్య పుట్టినరోజు పార్టీ చేసుకున్నారు. షారూఖ్ అత్యంత సన్నిహితుడు కరణ్ జోహర్, దీపికా పదుకునే, అలియా భట్, సిదార్థ్ మల్హోత్రా, ఫరా ఖాన్ కుందర్, శ్వేతా బచ్చన్, ఇంకా షారూఖ్ కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. -
నేనే షారూక్ ఫ్యాన్‌ని! : షారూక్ ఖాన్
షారూక్‌ఖాన్ బంగ్లా ‘మన్నత్’లో షారూక్‌ఖాన్ పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. బయట ఏడెనిమిదొందల మంది ఫ్యాన్స్.... పోలీసులు... ట్రాఫిక్... అంతా గోలగోలగా ఉంది. ఒక్క క్షణం పాటైనా షారూక్‌ని చూడాలనే అందరికీ ఆత్రుత. వాళ్లలో ఒకడు అందరి కంటే ఎక్కువగా హైరానా పడుతున్నాడు. మన్నత్‌లోకి దూసుకెళ్లైనా షారూక్‌ని చూడాలని పోలీసులతో గొడవ పడుతున్నాడు. అయితే అతడు కూడా అచ్చు షారూక్ ఖాన్‌లానే ఉన్నాడు.... ఇది ‘ఫ్యాన్’ సినిమా కోసం ఇటీవల తీసిన సన్నివేశం. అయితే ఇందుకు వాడింది షారూక్‌ఖాన్ అసలు బంగ్లాను కాదు. సెక్యురిటీ సమస్యలు తలెత్తుతాయని యథాతధంగా అలాంటి బంగ్లానే ఫిల్మ్ సిటీ స్టూడియోలో సెట్ వేసి తీశారు. యశ్‌రాజ్ సంస్థ నిర్మాణంలో ‘జబ్ తక్ హై జాన్’ హిట్ తర్వాత షారూక్‌తో రాబోతున్న సినిమా ఇది. ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘దమ్ లగాకె హైసా’ వంటి పెద్ద హిట్స్‌ను తీసిన మనీష్ శర్మ దీనికి దర్శకుడు. స్థానికతనీ, హాస్యాన్ని కలిపి తీయడంలో పేరుగడించిన మనీష్ ఇప్పుడు షారూక్‌తో కూడా ఆ వరుసలోనే వినోదాన్ని పంచనున్నాడు. అయితే ఈ సినిమాలో పాటలు ఉండవనేది అభిమానులను కలవరపెడుతున్న వార్త. ఈ కథాగమనానికి పాటలు నప్పవనీ అందుకే సినిమాలో వాటిని పెట్టడం లేదనీ యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది కూడా. అదే నిజమైతే పాటలు లేని షారూక్ తొలి సినిమా ఇదే అవుతుంది. బహుశా ఆ వెలితిని అతడు వేస్తున్న రెండు పాత్రలూ దూరం చేస్తాయనే భరోసా నిర్మాత, దర్శకులకు ఉండవచ్చు. డ్యూయల్ రోల్ సినిమాలు షారూక్‌కు కొత్త కాదు. గతంలో ‘బాజిగర్’, ‘కరణ్ అర్జున్’, ‘బాద్షా’, ‘డూప్లికేట్’, ‘ఓం శాంతి ఓం’, ‘డాన్’... వంటి హిట్స్‌ను డ్యూయల్ రోల్స్‌తోనే ఇచ్చాడు. ఇప్పుడు కూడా స్టార్‌గా, ఫ్యాన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కథలో అసలు సూపర్‌స్టార్‌ని, ఫ్యాన్‌ని... అతడు ఇతడనుకుని పొరపాటు పడి కథలో చాలా గందరగోళమూ హాస్యమూ ఉద్విగ్నత చోటు చేసుకుంటుందని భోగట్టా. షారూక్ కూడా ఆ పాత్రలను తేలిగ్గా తీసుకోకుండా గ్రెగ్ కానమ్ వంటి హాలీవుడ్ మేకప్‌మేన్ సహాయాన్ని తీసుకుని ఆహార్యంలో జాగ్రత్త పడుతున్నాడు. ఈ సినిమా కోసం ఇలియానా, వాణి కపూర్లను హీరోయిన్లుగా అనుకున్నారు. చివరకు ప్రఖ్యాత మోడల్ వలుశ్చా డిసౌజా, మరో హీరోయిన్గా నాటి బాలీవుడ్ హీరో సచిన్ కుమార్తె శ్రీయా పిల్గౌంకర్ ఎంపికయ్యారు. షారూక్ గత సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆశించినంత జనాదరణ పొందలేదు. ‘ఇంత చెత్త సినిమాను నేను చూడలేదు’ అని సాక్షాత్తు జయబాధురి నేరుగా తిట్టేంత చెడ్డ పేరును సంపాదించుకుంది. ఆ సినిమా ప్రభావం వల్ల కూడా కావచ్చు ఈ సినిమా కోసం షారూక్ ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇంతకాలం ఎడముఖం పెడముఖంగా ఉన్న షారూక్, సల్మాన్ ఖాన్ల మధ్య పాత స్నేహం మళ్లీ చిగురిస్తున్న దరిమిలా ఇతని ఫ్యాన్స్ అతనికీ అతని ఫ్యాన్స్ ఇతనికీ మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆ మేరకు రేపు రంజాన్ పండగ నాడు విడుదల కాబోతున్న సల్మాన్ సినిమా ‘బజ్రంగి భాయ్‌జాన్’కు ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ కృతజ్ఞతతో షారూక్ ఫ్యాన్స్‌తో పాటు సల్మాన్ ఫ్యాన్స్ కూడా ఒక కన్నేస్తే ‘ఫ్యాన్’ కలెక్షన్లు ఆకాశంలో గిర్రున తిరుగుతూనే ఉంటాయి. -
షారుఖ్ ర్యాంప్ కూల్చివేత
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తన నివాసం ‘మన్నత్’ బంగ్లా వెలుపల రోడ్డును ఆక్రమించి నిర్మించిన ర్యాంప్‌ను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసి) ఎట్టకేలకు కూల్చివేసింది. ఈ అక్రమ నిర్మాణంపై బీఎంసీ ఇటీవలే షారుఖ్ ఖాన్‌కు ఓ నోటీసు జారీ చేసింది. సదరు నోటీసుకు షారుఖ్ ఖాన్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో శనివారం ఉదయం బీఎంసీ సిబ్బంది బుల్డోజర్ సహాయంతో ఆ ర్యాంప్‌ను కూల్చివేశారు. మన్నత్ బంగ్లా బయట తన ‘వానిటీ వాన్’ పార్కింగ్ కోసం షారుఖ్ ఖాన్ ఈ ర్యాంప్ నిర్మించారు. దీని కారణంగా 9.5 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు కాస్తా 6.15 మీటర్లకు కుదించుకుపోయింది. దీంతో ఈ రోడ్డుపై వచ్చేపోయే వారికి, వాహనాలకు ఇబ్బందిగా మారింది. చారిత్రాత్మకమైన మౌంట్ మేరి చర్చివైపు వెళ్లే ఈ రోడ్డుపై తరచుగా వాహనాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక మౌంట్ మేరీ జాతర సమయంలో ప్రజలు భారీగా తరలి రావడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు ఈ ర్యాంప్‌ను తొలగించాలని బీఎంసీకి ఫిర్యాదు చేశారు. అది పట్టించుకోకపోవడంతో వారు స్థానిక పార్లమెంటు సభ్యురాలు పూనం మహాజన్‌కు తమగోడును చెప్పుకున్నారు. దీంతో పూనం షారుక్ పేరును ప్రస్తావించకుండానే, రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ర్యాంప్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఎంసీకి ఒకలేఖ రాశారు. మున్సిల్ కమిషనర్ సీతారామ్ కుంటేకు పూనమ్ రాసిన ఈ లేఖ మీడియాలో రావడంతో ఆ అంశం అంతటా చర్చనీయం అయింది. దీంతో ఈ వివాదం మరింత ముదరకముందే, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సీతారామ్ కుంటే ఆదేశాల మేరకు బీఎంసీ సిబ్బంది ర్యాంప్‌ను కూల్చివేశారు. -
షారుక్ ఖాన్ బంగ్లా ముందు ర్యాంప్ కూల్చివేత!
ముంబై: సబర్బన్ బాంద్రా ప్రాంతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా 'మన్నత్'ముందు ఉన్న వివాదాస్పద ర్యాంప్‌ను ముంబై మహానగర పాలక సంస్థ అధికారులు శనివారం కూల్చివేశారు. తన ప్రై వేట్ వాహనాన్ని పార్కింగ్ చేసుకొనేందుకు షారుక్ ఈ ర్యాంపును నిర్మించారు. అయితే దాని వల్ల ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక ఎంపీ పూనమ్ మహజన్ ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్‌కు జనవరి 29న లేఖ రాశారు. ర్యాంప్‌ను వారం రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు షారుక్‌కు ఇది వరకే నోటీసులు పంపారు. అయినా షారుక్ పట్టించుకోకపోవడంతో ర్యాంప్‌ను కూల్చివేశామని అధికారులు తెలిపారు. తమ నోటీస్‌కు స్పందించనందుకు షారుక్‌కు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పారు. -
షారుక్ ఖాన్ పై కేసు నమోదు!
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పై ముంబైలో బాంద్రా కోర్టులో కేసు నమోదు చేశారు. షారుక్ నివాసం మన్నత్ పక్కన అక్రమ ర్యాంప్ నిర్మాణంపై గత కొద్దిరోజులుగా వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. షారుక్ నివాసం వద్ద నిర్మించిన అక్రమ కట్టడంపై కోర్టుకు ఫిర్యాదు చేశామని, వచ్చె నెల విచారణకు రానుందని న్యాయవాది వివియన్ డిసౌజా వెల్లడించారు. ఈ వివాదంపై సామాజిక కార్యకర్త నికోలాస్ అల్మీదా కేసు నమోదు చేశారు. ఈ కేసులో బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్, మరో ముగ్గురు అధికారులను ప్రతివాదులగా చేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన కట్టడాన్ని తొలగించడానికి పలువురు అధికారులను కలిశానని, అయితే వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించానని అల్మీదా వెల్లడించారు. -
షారుక్ భాయ్.. ఇదేం పని
ముంబై: సెలబ్రిటీ హోదాలో ఏది చేసినా నడిచిపోద్దేనే అపోహ ప్రముఖుల్లో ఉంటుందేమో. ఆ ప్రముఖుల జాబితా తానేమి తక్కువ కాదని షారుక్ ఖాన్ నిరూపించారు. షారుక్ వ్యవహార తీరుపై ముంబైలో స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. షారుక్ నివాసం 'మన్నత్' సమీపంలో తన వ్యానిటీ వ్యాన్ ను పార్క్ చేసేందుకు ర్యాంప్ నిర్మించారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆయన నివాసం లోపల నిర్మించుకుంటే పెద్ద వివాదంగా మారకుండేది. కాని షారుక్ మాత్రం రోడ్డుకు అడ్డంగా ర్యాంప్ నిర్మించడాన్ని ముంబైలోని సామాజిక సంస్థ 'వాచ్ డాగ్ ఫౌండేషన్' బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కు గత సెప్టెంబర్ లో ఫిర్యాదు చేసింది. షారుక్ నిర్మించిన ర్యాంప్.. బ్యాండ్ స్టాండ్ నుంచి మౌంట్ మేరి చర్చ్ కు వెళ్లే పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారిందని వాచ్ డాగ్ ఫౌండేషన్ ఫిర్యాదుపై బీఎంసీ స్పందించకపోవడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారని ముంబైకి చెందిన ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. తాజాగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్ ల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బీఎంసీ ఈ వివాదాన్ని సీరియస్ తీసుకుని తనిఖీ చేసేందుకు ఇంజనీర్లను పంపేందుకు సిద్దం చేస్తోంది. ముంబై మహానగరంలో షారుక్ నివాసం మన్నత్ ప్రముఖ సందర్శక స్థలాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. మన్నత్ ముందు ర్యాంప్ నిర్మాణం మరోసారి షారుక్ ను వివాదంలోకి నెట్టింది. -
షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం
బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ నివాసంలో గురువారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. బాంద్రాలోని షారుఖ్‌కు చెందిన మన్నత్ బిల్డింగ్ బాత్రూంలో ఉన్న ఎక్జాస్ట్ ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి. భవనంలో దట్టమైన పొగ వ్యాపించడంతో ఫైర్ అలారం మోగింది. దీంతో భద్రతా సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని భద్రతా సిబ్బంది వెల్లడించారు. భారీ నష్టం కలుగకుండా వెంటనే స్పందించిన సిబ్బందికి షారుఖ్ ట్విటర్ లో కృతజ్క్షతలు తెలిపారు. -
షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం
-
షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు. ముంబై బాంద్రాలోని మన్నత్ నాలుగో ఫ్లోర్లో ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల బాత్రూంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి మంటలు వచ్చాయని షారూఖ్ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేశాయి. తమ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. బంగ్లాలోని అలారం మోగటంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై తమకు సమాచారం అందించారని చెప్పారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో షారూఖ్ ఇంట్లో లేరు. -
రండి...తాగండి...ముచ్చటించండి: షారుక్
తన జన్మదినాన్ని అభిమానులు జరుపుకోవడాన్ని అద్భుతంగా భావిస్తాను అని బాలీవుడ్ షారుక్ ఖాన్ అన్నారు. నా జన్మదినం సందర్భంగా మీడియాను ఆహ్వానిస్తున్నాను. బాంద్రాలోని బ్యాండ్ స్టాండ్ సమీపంలోని మన్నత్ నివాసానికి వచ్చి.. కూల్ డ్రింక్ లు తాగండి.. ఆతర్వాత నాతో ముచ్చటించండి అని లిస్టా జువెల్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షారుక్ తెలిపారు. శనివారం రోజున షారుక్ తన జన్మదినం జరుపుకోనున్నారు. నవంబర్ 2న షారుక్ 48 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు. ఇక షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్ నటించిన దిల్ తో పాగల్ హై చిత్రం అక్టోబర్ 31 తేదికి 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. 16 పూర్తి చేసుకుందనే విషయం గురించి ఆలోచించినపుడు తాను ఒక్కసారిగా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లానని షారుక్ ట్విటర్ లో పేర్కోన్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన యష్ జీ(యష్ చోప్రా) టీమ్ కు, మాధురీ, కరిష్మా కపూర్ లకు నా కృతజ్క్షతలు అని ట్విటర్ లో తెలిపాడు.