షారుక్ ఖాన్ పై కేసు నమోదు! | Activist moves court over ramp built by Shah Rukh Khan near his bungalow | Sakshi
Sakshi News home page

షారుక్ ఖాన్ పై కేసు నమోదు!

Published Fri, Sep 12 2014 7:20 PM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

షారుక్ ఖాన్ పై కేసు నమోదు!

షారుక్ ఖాన్ పై కేసు నమోదు!

ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పై ముంబైలో బాంద్రా కోర్టులో కేసు నమోదు చేశారు. షారుక్ నివాసం మన్నత్ పక్కన అక్రమ ర్యాంప్ నిర్మాణంపై గత కొద్దిరోజులుగా వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. షారుక్ నివాసం వద్ద నిర్మించిన అక్రమ కట్టడంపై కోర్టుకు ఫిర్యాదు చేశామని, వచ్చె నెల విచారణకు రానుందని న్యాయవాది వివియన్ డిసౌజా వెల్లడించారు. ఈ వివాదంపై సామాజిక కార్యకర్త నికోలాస్ అల్మీదా కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్, మరో ముగ్గురు అధికారులను ప్రతివాదులగా చేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన కట్టడాన్ని తొలగించడానికి పలువురు అధికారులను కలిశానని, అయితే వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించానని అల్మీదా వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement