Illegal construction
-
Hydra: జగద్గిరిగుట్టలో హైడ్రా కూల్చివేతలు
-
HYD: అయ్యప్ప సొసైటీపై ‘హైడ్రా’ ఫుల్ ఫోకస్.. మరిన్ని కూల్చివేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. తాజాగా మాదాపూర్‌లోని ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది. ఇదే సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు.మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల్లో హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. తాజా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్లపైనే డ్రైనేజీలు పారుతుండటాన్ని గుర్తించారు. దీంతో, అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు రంగనాథ్ తెలిపారు.హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
HYD: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా హైడ్రా.. నగరంలోని మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(HYDRA) ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేస్తోంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అయితే, అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. ఆదివారం నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. ఇక, అంతకుముందు.. ఈ భవన నిర్మాణంపై స్థానికులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, హైడ్రా రంగనాథ్ మాదాపూర్(Madhapur)లో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ భవన నిర్మాణానికి అనుమతులు లేవని తేలడంతో రంగనాథ్ కూల్చివేతకు ఆదేశించారు. దీంతో, నేడు భవనాన్ని కూల్చివేశారు. -
సినీ నటుడు అలీకి నోటీసులు
-
అమీన్పూర్లో హైడ్రా.. పలు భవనాలు కూల్చివేత
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. మరోసారి అమీన్పూర్పై ఫోకస్ పెట్టిన హైడ్రా పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది.వివరాల ప్రకారం.. అమీన్పూర్ మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సోమవారం తెల్లవారుజామునే అమీన్పూర్ చేరుకున్న హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను మార్క్ చేసి కూల్చివేస్తున్నారు. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చివేస్తున్నారు. భారీ యంత్రాలతో అక్కడి వెళ్లిన అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు.ఇదిలా ఉండగా.. నగరం పరిధిలో ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువులను, రోడ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఫోకస్ చేసి హైడ్రా కూల్చివేస్తోంది. -
మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని శబ్దాలయ వెనుక సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తికి కేటాయించిన స్థలంలో నిరి్మంచిన అక్రమ నిర్మాణాలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. చక్రవర్తికి మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో నిరి్మంచుకునేందుకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లో 20 గుంటల స్థలాన్ని కేటాయించింది. అయితే కేటాయించిన స్థలంలో ఏడాది లోపు ఆ ఉద్దేశాన్ని బహిర్గతపరుస్తూ నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి మాత్రం తనకు కేటాయించిన స్థలంలో పదేళ్లు దాటినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ తర్వాత ఆయన మృతి చెందారు. ఆయన తనయుడు కూడా సదరు స్థలంలో రికార్డింగ్ స్టూడియో నిర్మించకపోగా తాను కూడా తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాండ్ బ్యాంక్‌లో నమోదు చేసింది. గత కొన్నేళ్లుగా ఈ స్థలం ప్రభుత్వ ఆ«దీనంలోనే ఉంది. ఖాళీగా ఉన్న ఈ స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 25 వేలు వసూలు చేస్తూ డబ్బాలు ఏర్పాటు చేశారని, కొన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు షేక్‌పేట మండల తహశీల్దార్ అనితారెడ్డి తెలిపారు.ఈ స్థలం ప్రభుత్వానిదేనని, ఎవరైనా నిర్మాణాలు చేపట్టినా, ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ విభాగాలకు కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు నకిలీ డాక్యుమెంట్లతో తమదేనంటూ అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెలు తీసుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచి్చందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్
-
సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
మూసీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్ధమవుతున్న సర్కార్
-
కావూరి హిల్స్‌లో కబ్జాలు.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సాక్షి, మాదాపూర్: హైదరాబాద్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా.. తాజాగా కావూరి హిల్స్‌లో నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది.హైడ్రా అధికారులు, పోలీసులు.. సోమవారం ఉదయమే కావూరి హిల్స్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కావూరి హిల్స్‌లో పార్క్‌ను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణంపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరిహిల్స్ పార్కు పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. అయితే, పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.ఈ క్రమంలో ఇప్పటికే నిర్వాహకులకు తాము నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అధికారుల నోటీసులను జిమ్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తాజాగా కూల్చివేతలు ప్రారంభించినట్టు చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. శనివారం కూకట్పలిల్లోని నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో దాదాపు 45 మంది స్థానికులకు పట్టా భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఈ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. దీనికి విరుద్ధంగా కొందురు యజమానులు తమ భూమిని లీజుకు ఇచ్చారు. దీన్ని లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో 17 షెడ్లను తమ సొంత ఖర్చులతో నిర్మించుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతి దఫా చెల్లించే లీజు మొత్తం నుంచి కొంత షెడ్ల నిమిత్తం మినహాయించుకుంటున్నారు.ఇక, ఈ నిర్మాణాలు అక్రమమని గుర్తించిన ఇరిగేషన్, హైడ్రా అధికారులు 15 రోజు క్రితం నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అనుసరించిన పట్టాదారులకే వీటిని ఇచ్చారు. అయితే నోటీసులు వచ్చిన విషయం దాచిన యజమానులు లీజు దారులను తప్పుదోవ పట్టించారు. ఆదివారం ఇరిగేషన్, హైడ్రా అధికారులు అక్కడి అక్రమ నిర్మాణాల్లో 16 కూల్చివేశారు. నోటీసుల విషయం తెలియని లీజు దారులు తమ యంత్రాలను, ఇతర వస్తువులను కూడా పూర్తిస్థాయిలో బయటకు తీసుకోలేకపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు తమకు సమాచారం ఇస్తే తామే సామాగ్రిని తీసుకొని వెళ్లిపోయేవారమని బాధితులు బోరున విలపించారు. కనీసం గంట సమయాన్ని కూడా ఇవ్వకుండా షెడ్లను నేలమట్టం చేయటం ఏమిటని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: సిట్టింగ్ జడ్జితో విచారణ: కేటీఆర్ -
యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి!
కూకట్పల్లి: కూకట్పల్లి పాత గ్రామంలోని నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో భూమి ఉన్న పట్టాదారులు చేసిన తప్పులకు సామాన్యులు బలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ భూముల్ని లీజుకు ఇవ్వడంతో పలువురు నిర్మాణాలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు ఇచి్చన నోటీసుల విషయాన్నీ యజమానులు తమ లీజుదారులకు చెప్పలేదు. దీంతో ఆదివారం హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేయడంతో సామాన్యులు నష్టపోయారు. ఇన్నాళ్లు లీజు తీసుకుంటున్న యజమానులు మాత్రం సేఫ్‌గా ఉండిపోయారు. నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో దాదాపు 45 మంది స్థానికులకు పట్టా భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఈ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. దీనికి విరుద్ధంగా కొందురు యజమానులు తమ భూమిని లీజుకు ఇచ్చారు. దీన్ని లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో 17 షెడ్లను తమ సొంత ఖర్చులతో నిరి్మంచుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతి దఫా చెల్లించే లీజు మొత్తం నుంచి కొంత షెడ్ల నిమిత్తం మినహాయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా... ఈ నిర్మాణాలు అక్రమమని గుర్తించిన ఇరిగేషన్, హైడ్రా అధికారులు 15 రోజు క్రితం నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అనుసరించిన పట్టాదారులకే వీటిని ఇచ్చారు. అయితే నోటీసులు వచి్చన విషయం దాచిన యజమానులు లీజు దారులను తప్పుదోవ పట్టించారు. ఆదివారం ఇరిగేషన్, హైడ్రా అధికారులు అక్కడి అక్రమ నిర్మాణాల్లో 16 కూల్చివేశారు. అయితే నోటీసులు విషయం తెలియని లీజు దారులు తమ యంత్రాలను, ఇతర వస్తువులను కూడా పూర్తిస్థాయిలో బయటకు తీసుకోలేకపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు తమకు సమాచారం ఇస్తే తామే సామాగ్రిని తీసుకొని వెళ్లిపోయేవారమని క్యాంటీన్ నడుపుతున్న రమేష్, అతని తల్లిదండ్రులు భోరున విలపించారు. కనీసం గంట సమయాన్ని కూడా ఇవ్వకుండా షెడ్లను నేలమట్టం చేయటం ఏమిటని మండిపడ్డారు. భూ యజమానులు సైతం ఇది ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోకి రాదంటూ చెప్పటంతోనే తాము లీజుకు తీసుకున్నామంటూ రవి అనే బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. గతంలో హైడ్రా అధికారులు వ్యాపార సముదాయాలకు నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఈ భూమిలో అనేక మంది లీజుదారులు అప్పులు చేసి నిర్మాణాలు చేసుకోవడంతో పాటు వ్యాపారాలు ప్రారంభించారు. కొందరు క్యాంటీన్లు, హోటళ్లు, క్యాటరింగ్ చేస్తుండగా.. మరికొందరు డెకరేషన్ సామాను, జిరాక్స్ మెషిన్లు ఏర్పాటు చేసుకున్నారు. భూ యజమానులు చేసిన తప్పుకు తాము నష్టపోతున్నామంటూ బాధితులు బోరున విలపించినా హైడ్రా అధికారులు కూలి్చవేతలు కొనసాగించారు. అధికారులు నేరుగా తమకు నోటీసులు ఇచ్చానా, తమ నిర్మాణాలకు అంటించినా ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు. -
కూకట్‌పల్లిలో హైడ్రా.. బీఆర్ఎస్ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సాక్షి, కూకట్పల్లి: హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. నల్లచెరువుపై సర్వే చేశారు. ఇందులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. కూల్చివేతల సందర్భంగా బాధితుల ఆవేదన.. కన్నీటిపర్యంతం నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు, పోలీసులు కూకట్పల్లి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం జరుగుతోంది. అలాగే, అమీన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈ నిర్మాణాలు ప్రముఖ బీఆర్ఎస్ నేత, బిల్డర్ చంద్రశేఖర్ నిర్మించారని గుర్తింపు. ఈ సందర్బంగా ఆయనను లోపలికి అనుమతించని అధికారులు. ఈ క్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కోర్టు నోటీసులు ఉన్నా పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. కనీసం మా సామాగ్రిని అయినా తెచ్చుకోనివ్వండి అంటూ కొనుగోలుదారులు ప్రాధేయపడుతున్నారు. మరోవైపు.. కూల్చివేతల సందర్భంగా అధికారులు మీడియాను అనుమతించలేదు. ఇది కూడా చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ -
హైడ్రా బుల్డోజర్ల దూకుడు.. నష్టం ఎవరికి ?
-
చెరువులు మింగేశారు.. హైడ్రా చేస్తున్నది సరైనదేనా?
-
అలా నిర్మించిన ఇళ్లను కూల్చివేయం: హైడ్రా కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తోంది. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని చెప్పారు.ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. ‘ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే అలాంటి నివాసాలను కూల్చివేయం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రమే నిర్మాణాలను కూల్చేస్తాం. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు.సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారు. గతంలో కూడా వాటిని కూల్చేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నాం. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలు, ఇళ్లు మాత్రం కొనుగోలు చేయకండి అని ప్రజలకు సూచించారు.మరోవైపు.. హైడ్రా ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో కూల్చివేతలు చేపట్టింది. అలాగే, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని హెచ్ఎంటీ కాలనీ, వాణీనగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. -
శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాలపై హైడ్రా పంజా..
-
హైడ్రా దూకుడుతో ఆందోళనలో ప్రజలు
-
తెలంగాణలో చెరువుల ఆక్రమణ ఉదంతంలో అధికారులపై హైడ్రా ఫోకస్. అక్రమ అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
TG: ఇక జిల్లాల వంతు.. అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్ పరిధిలో ‘హైడ్రా’ రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండగా అటు జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.మహబూబ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు రెవెన్యూ అధికారులు. క్రిష్టియన్పల్లిలో సర్వే నెంబర్ 523లోని అక్రమ కట్టడాలను రెవెన్యూ, పోలీసులు కలిసి కూల్చివేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఘటనా స్థలంలోనే అధికారులు ఉండి.. కూల్చివేతలు కొనసాగించారు.ఇక, హైదరాబాద్ పరిధిలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సహా పలువురి అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. చెరువును ఆక్రమించి కాలేజీల నిర్మాణాలు జరిగినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఈ అంశం ఆసక్తికరంగా మారింది. -
హుస్సేన్ సాగర్ లో వెయ్యి ఎకరాలు మింగేసి అక్రమ కట్టడాలు
-
అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా కూల్చడమే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తామని కామెంట్స్ చేశారు.కాగా, సీఎం రేవంత్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘హైదరాబాద్ లేక్ సిటీ. గండిపేట, ఉస్మాన్ సాగర్.. హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. డ్రైనేజీలను చెరువుల్లో కలుపుతున్నారు. ఆ ఫాం హౌస్‌ల నాలాలు గండిపేటలో కలిపారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం.అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తాం. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండొచ్చు. కానీ, నేను ఎవరినీ పట్టించుకోను. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. భవిష్యత్ తరాలకు ప్రకృతిని అందించాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’.. కబ్జాదారులే టార్గెట్‌గా...!
‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చర్యలతో రాజధాని హైదరాబాద్‌లోని చెరువుల్లో ఆక్రమణలు చేసిన వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఈ స్వయంప్రతిపత్తి సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్న అధికారులు ఇప్పటివరకు నగరంలోని అనేక భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు. అయితే చాలా మందికి హైడ్రా మీద అనేక అనుమానాలు ఉన్నాయి.. వీటిపై హైడ్రా కమిషనర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..చదవండి: ఆక్రమణదారులకు సింహస్వప్నం!అసలు హైడ్రా అంటే ఏంటి?హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) వరకు ఉంటుంది.హైడ్రా ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్ఎంసీ మేయర్ సభ్యులుగా ఉంటారు.హైడ్రా ఏం చేస్తుంది. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదు. సిటీని పకృతి విపత్తుల నుంచి రక్షించడానికి కృషి చేయడం, విపత్తుల సమయంలో వేగంగా స్పందించి ప్రజలను కాపాడే సంస్థ ప్రభుత్వ భూములను స్థానికులతో కలిసి కాపాడుకోవడానికి కృషి చేస్తాం. ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, పార్కులు, నాలాలు, స్మశాన వాటికలు వంటి వాటిని కబ్జా కాకుండా చూస్తుంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడున్న చెరువులను కాపాడుతూ గతంలో కబ్జాకు గురైన చెరువులను నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటాం. నగరంలోని చెరువుల్లో ఇప్పటి వరకు దాదాపు 66 శాతం కబ్జాకు గురయ్యాయి. ఇలాగే వదిలేస్తే ఒకటి రెండేళ్లలో సిటీ పరిధిలో చెరువనేదే కనిపించకుండా పోతుంది. వీటి రక్షణ కోసమే హైడ్రా. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలంటే భయం పుట్టాలి. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టించాలి.జీహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే, విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే వారి మీద విజిలెన్స్ రిపోర్టు తయారు చేసి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అందజేస్తాం. వర్షాలు వచ్చిన సమయంలో రోడ్లపై నీరు నిలిచిపోతే స్పందించి వాటిని క్లియర్ చేయడం. కూడా హైడ్రా విధినే.ఇప్పటికే హైడ్రా అధికారులు ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు.చదవండి: ట్రిపుల్‌వన్ అడ్రస్ తెలుసా హైడ్రా? నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. -
రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
-
విద్యార్థుల జలసమాధిపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల జలసమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. ఘటనకు కారణాలను తెల్సుకోవడంతోపాటు బాధ్యులెవరో తేల్చనుంది. ఘటనలు పునరావృతంకాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫార్సుచేయనుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఢిల్లీ ప్రభుత్వ(హోంశాఖ) ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీస్, ఫైర్ స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీకి కనీ్వనర్‌గా ఉంటారు. 30 రోజుల్లోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుందని హోం శాఖ అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు మరో ఐదుగురి అరెస్ట్ ఈ ఘటనలో బేస్మెంట్ యజమానులపాటు మొత్తం ఐదుగురిని సోమవారం పోలీసులు అ రెస్ట్చేశారు. డ్రైనీజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలెట్టారు.20 బేస్మెంట్లకు సీలుకోచింగ్ కేంద్రాలకు నిలయమైన పాత రాజీందర్ నగర్ ప్రాంతంలో సోమవారం అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 20 బేస్మెంట్లకు సీల్‌వేశారు. అధిక కోచింగ్ సెంటర్లు ఉండే మరో ప్రాంతం ముఖర్జీ నగర్లోనూ ఆకస్మిక పర్యటనలు చేయించండి. అభ్యర్థులను శాంతింపజేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం
-
రాజకోటల్లా టీడీపీ కార్యాలయాలు
-
‘డెక్కన్’లో ధిక్కరణ.. అడ్డగోలు నిర్మాణాలే అధికం..
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్ భవనంలో డెక్కన్ కార్పొరేట్ భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఇందులో అడుగడునా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే గురువారం అగ్ని ప్రమాదంలో మంటల్ని అదుపు చేయడానికి పది గంటలకు పైగా శ్రమించాల్సి వచి్చంది. ముగ్గురు వ్యక్తులు గల్లంతు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఉల్లంఘనలు ఇలా... ► ఈ భవనం సబ్–సెల్లార్, సెల్లార్, గ్రౌండ్ ప్లస్ సిక్స్ ఫోర్లుగా నిర్మించారు. దీని విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాల్సి ఉన్నా కనిపించలేదు. ► భవనం చుట్టూ ఫైరింజిన్ తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో దక్షిణం వైపు ప్రధాన రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ఈ వాణిజ్య భవనం వెనుక, పక్కన నివాస సముదాయాలు ఉన్నాయి. ► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్ కేస్ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్ స్టెయిర్ కేస్ కూడా అవసరమైన స్థాయిలో లేదు. ► ఇలాంటి వాణిజ్య భవనాలకు అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్ తప్పనిసరి. ‘డెక్కన్’లో వెతికినా ఇవి కనిపించలేదు. అగ్ని ప్రమాదం జరిగితే బయటపడటానికి ప్రత్యేక ఎగ్జిట్ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. ► మండలార్పేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్స్టింగి్వషర్లు, వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్ రైజర్ తప్పనిసరి. ఈ భవనంలో ఇవి ఉన్న దాఖలాలు లేవు. ► విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఈ రెండూ మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ ఉండాలి. ఇలాంటింది ఎక్కడా కనిపించలేదని అగి్నమాక శాఖ అధికారులు చెబుతున్నారు. ► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తప్పనిసరి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారు. ► అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. కానీ.. ‘డెక్కన్’లో ఎంత వెతికినా కనిపించవు. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
డ్రైన్ ఉంటే మాకేంటి...ఆక్రమించి మరీ భవన నిర్మాణం!
ఒంగోలు సబర్బన్: నగరంలో అక్రమ కట్టడాలు యథేచ్చగా సాగుతున్నాయి. నగర పాలక సంస్థ అధికారుల అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కళ్ల ముందే పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నా నగర పాలక సంస్థ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో ఒకచోట కాదు అనేక ప్రాంతాల్లో అనుమతుల్లేని నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తనిఖీలకు వెళ్లిన సమయంలో తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకుని వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లో అక్రమంగా నిర్మిస్తున్న భారీ భవనం. దక్షిణ బైపాస్ ప్రగతి భవన్‌కు వెళ్లే ప్రధాన గేటుకు ఆనుకొని దానిని నిర్మిస్తున్నారు. వారం రోజులుగా పనులు జరుగుతున్నాయని తెలిసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఒకటికి నాలుగు సార్లు అక్కడికి వెళ్లి వచ్చారే తప్ప నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే.. దాని మతలబు ఏమై ఉంటుందో స్పష్టమవుతోంది. దీనికి తోడు దక్షిణ బైపాçస్లో ఉత్తరం వైపున ఆనుకొని ఒంగోలు నగరానికి చెందిన ప్రధాన డ్రైనేజీ కాలువ ఉంది. మామిడిపాలెం, హౌసింగ్ బోర్డు, ఎస్ఎస్ ట్యాంకు–1 పరిసర ప్రాంతాల నుంచి మురుగు నీరు, వర్షపు నీరు ఈ డ్రైనేజి నుంచే ప్రవహించాల్సి ఉంది. అయితే దాదాపు 10 అడుగుల వెడల్పు ఉండే దీనికి రెండు సిమెంట్ పైపులు వేసి తాత్కాలికంగా మట్టితో కప్పేసి మరీ నిర్మాణం చేస్తున్నారు. పెద్ద వరద వస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలు లేక ప్రభుత్వ భవనాల సముదాయం, నాగార్జున యూనివర్శిటీ స్టడీ సెంటర్, నవోదయ కళాశాలల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా నగరంలో అక్రమ నిర్మాణాలకు కట్టడి వేయాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్‌లో ఉన్నతాధికారి స్పందించకపోవడం గమనార్హం. నగర పాలక సంస్థ ఆదాయానికి గండి: అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటూ పోతే నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఫ్లింత్ ఏరియాను బట్టి, అంతస్తుల భవనాల లెక్కన కార్పొరేషన్‌కు ఫీజులు చెల్లించాలి. నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా తూట్లు పడుతున్నా తమ జేబులు నిండితే చాలు అన్న చందంగా ఉంది టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు. నోటీసులు ఇచ్చి ఆపుతాం.. అక్రమంగా జరుగుతున్న భవన నిర్మాణాలను ఆపేస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం. దక్షిణ బైపాస్‌లో ప్రగతి భవన్ ముందు జరుగుతున్న భవన నిర్మాణం విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే నోటీసులు ఇవ్వమని టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పా. నోటీసు ఇవ్వటంతో పాటు అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తాను. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన విషయం నా దృష్టికి రాలేదు. ఆ విషయంపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. – ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ -
నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో..
బెంగళూరులో భార్యభర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుగుపొరుగు వారు, పోలీసులు అప్రమత్తతో వ్యవహరించి వాళ్లను నిప్పంటించుకోకుండా ఆపగలిగారు. మహిళ చేతిలోనుంచి అగ్గిపెట్టె లాక్కుని బకెట్లతో నీళ్లు పోశారు. భర్తను కూడా పోలీసులు పట్టుకుని ఆపారు. అనంతరం భార్యాభర్తలపై ట్యాంకర్‌తో నీళ్లు పోశారు. క్షణం ఆలస్యమైన వారు అగ్నికి ఆహుతయ్యుండేవారు. VIDEO : #Bengaluru में घर तोड़ने पर खुद को आग लगाने लगे पति-पत्नि pic.twitter.com/Tp3L2QJDIh — NDTV India (@ndtvindia) October 12, 2022 ఏం జరిగిందంటే? బెంగళూరులో డ్రైనేజీని బ్లాక్ చేసేలా ఉన్న అక్రమ నిర్మాణాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ పురంలోని ఎస్ఆర్ లేఅవుట్లో మురికి కాలువ పక్కనే నిర్మించిన అక్రమ నివాసాన్ని కూల్చేందుకు బుల్డోజర్తో వెళ్లారు. అయితే ఈ ఇంటి యజమానులపైన భార్యాభర్తలు దీన్ని అడ్డుకున్నారు. బుల్డోజర్కు ఎదురుగా నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమది అక్రమ నిర్మాణం కాదని, అన్ని పత్రాలు ఉన్నాయని భార్యాభర్తలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఇది కచ్చితంగే అక్రమంగా కట్టిందే అని పేర్కొన్నారు. మురుగు, వర్షం నీరును బ్లాక్ చేసేలా డ్రైనేజీ కాలువపై దీన్ని నిర్మించారని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
యూపీలో అనూహ్య పరిణామం.. బీజేపీ కార్యకర్త ఇంటిపైకి బుల్డోజర్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాని బుల్డోజర్లతో కూల్చివేశారు అధికారులు. నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఈ ఇంటికి సోమవారం ఉదయం పోలీసు బృందాలతో వెళ్లారు. అనంతరం త్యాగి ఇంటి ముందు భాగాన్ని కూలగొట్టారు. #WATCH | Uttar Pradesh: Illegal construction at the residence of #ShrikantTyagi, at Grand Omaxe in Noida's Sector 93, demolished by the Noida administration. Tyagi, in a viral video, was seen abusing and assaulting a woman here in the residential society. pic.twitter.com/xThZ2wF3gS — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022 శ్రీకాంత్ త్యాగి ఇదే హౌసింగ్ సొసైటిలోని ఓ మహిళపై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పొరుగింటి మహిళను కొట్టడమే గాక దుర్భాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. శ్రీకాంత్ త్యాగి ఇంటిముందు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హౌసింగ్ సొసైటీ సంఘం 2019లోనే ఫిర్యాదు చేసింది. నోయిడా అధికారులు 2020లోనే త్యాగికి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు నేరుగా బుల్డోజర్లతో వెళ్లి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. అయితే యూపీలో ఇప్పటివరకు విపక్షాలకు చెందినవారినే లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్లతో ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపణలొచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీ కార్యకర్త ఇంటిపైకే అధికారులు బుల్డోజర్ తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. చదవండి: ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళా భక్తులు మృతి.. -
ఆధారాలతో బయటప పెట్టిన ఇరిగేషన్ శాఖ
-
Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
-
మాజీ మంత్రి అయ్యన్న కుటుంబం అక్రమ నిర్మాణం గుర్తించాం : ఎమ్మార్వో జయ
-
Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చి వేశారు. అయ్యన్న ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. రోజు నీతులు చెప్పే అయ్యన్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మార్వో జయ మాట్లాడుతూ.. మాజీ మంత్రి అయ్యన్న కుటంబం అక్రమ నిర్మాణాన్ని గుర్తించాము. అక్రమ నిర్మాణంపై నోటిసులు జారీ చేశాము. నిబంధనలు ప్రకారం అక్రమ నిర్మాణాన్ని తొలగించామని అన్నారు. చెరువు కాలువకు చెందిన రెండు సెంట్లు స్థలాన్ని ఆక్రమించి అయ్యన్నపాత్రుడు అక్రమ నిర్మాణం చేపట్టారని నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు అన్నారు. రెండు సెంట్లు స్థలంలో నిర్మించిన ఆక్రమణ నిర్మాణాన్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే అయ్యన్నపాత్రుడు ఇంటిని తొలగించలేదని అన్నారు. అక్రమ నిర్మాణంపై ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. చదవండి: (పారిశ్రామిక విప్లవంలో మరో ముందడుగు) -
కౌంటర్ వేయండి.. లేదంటే వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయనే ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయని పక్షంలో ఆగస్టు 23న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వా లని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్ల ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీతో కూడిన ధర్మా సనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. హుస్సేన్ సాగ ర్లోని ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త లుబ్నాసార్వత్ 2020, ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్‌కు ఈ–మెయిల్ చేశారు. గోడల నిర్మాణాలు కూడా జరిగాయం టూ ఆమె గూగుల్ ఎర్త్ నుంచి తీసిన జియో ట్యాగ్ చిత్రాన్ని కూడా హైకోర్టుకు పంపారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న ఆమె ఈ–మెయిల్ ఫిర్యాదును హైకోర్టు సుమో టో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. -
అక్రమాలకు ‘ప్లానింగ్’
సాక్షి,అనంతపురం: నగరంలో ఇలాంటి అక్రమ భవనాలు దాదాపు 200 వరకు ఉండగా భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించిన టౌన్ ప్లానింగ్ అధికారులు చార్జిషీట్ ఫైల్ చేస్తున్నారు. కోర్టుల ద్వారా నగరపాలకసంస్థకు జరిమానాలు విధించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే అక్రమ భవనాల లెక్క తేల్చిన అధికారులు వాటిపై జరిమానా విధించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అస్మదీయులను ఒకలా... తస్మదీయులను మరోలా చూస్తున్నారు. నెలల క్రితమే అక్రమ భవనాల లెక్క తేలినా ఇప్పటి వరకూ కేవలం 30 భవనాల వరకే జరిమానాలు విధించారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. కేవలం బిల్డర్లలో భయం పుట్టించడానికే హæడావుడి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా గుట్టుగానే... నగరపాలకసంస్థలో టౌన్‌ప్లానింగ్ విభాగం కార్యకలాపాలు మొత్తం గుట్టుగానే సాగుతున్నాయి. దాదాపు ఏడాది కాలంలో ఈ విభాగంపై ఒక్క సమీక్ష కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కీలకమైన విభాగాన్ని గాలికి వదిలేస్తుండడంతో అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో అక్రమ భవనాల నిర్మాణాలపై దాడులు కూడా తగ్గిపోయాయి. కొంతమంది అధికారులు లైసెన్స్ సర్వేయర్లతో కుమ్మక్కై అక్రమ భవనాల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్నది కమలానగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనం. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మించడంతో పాటు అదనపు ఫ్లోర్ నిర్మాణం కూడా మొదలు పెడుతున్నట్లు తెలిసింది. సెట్ బ్యాక్ వదలాలనే నిబంధనను విస్మరించారు. టౌన్‌ప్లానింగ్‌లో కొత్తగా వచ్చిన కిందిస్థాయి అధికారి అండదండలతో ఈ అక్రమ భవన నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసింది. ఇందుకు భారీగానే ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకుంటాం కమలానగర్లో నిర్మిస్తున్న ఈ భవనంపై గతంలోనే దాడులు జరిపాం. అక్రమంగా నిరిస్తున్న ఫ్లోర్‌ను తొలగించాం. అయినప్పటికీ స్విమింగ్ పూల్ నిర్మించినట్లు మా దృష్టికి వచ్చింది. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. సిబ్బంది ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదు. – శాస్త్రి, అసిస్టెంట్ సిటీ ప్లానర్, నగరపాలకసంస్థ -
ఫుట్ పాత్ ఆక్రమించిన ఎంపీ సీఎం రమేష్
-
హైదరాబాద్‌లో బరితెగించిన సీఎం రమేష్ అనుచరులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులు బరితెగించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 66లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ నిర్మాణానికి పాల్పడ్డాడు. అక్రమంగా నిర్మించిన ఇంటిని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని సీఎం రమేష్ అనుచరులు అడ్డుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే సీఎం రమేష్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఇప్పటికే కొంత భాగాన్ని కూల్చిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సాయంతో మిగిలిన అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చదవండి: (Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం) -
అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ నజర్.. బీపాస్’తప్పనిసరి.. బైపాస్ లేదు!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట హైదరాబాద్ శివార్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీ అనుమతి పేరుతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త నిర్మాణాలన్నింటికీ ‘టీఎస్–బీపాస్’ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల అనుమతితో రెండు అంతస్తులకన్నా ఎక్కువ ఫ్లోర్లు ఉన్న కట్టడాలన్నీ అక్రమమేనని ప్రకటించింది. 2020 నవంబర్లోనే టీఎస్–బీపాస్ విధానం అమలులోకి వచ్చినప్పటికీ కొత్త పురపాలికల్లో గ్రామ పంచాయతీల అనుమతితోనే నిర్మాణాలు జరుగుతున్నట్లు మున్సిపల్ శాఖ గుర్తించింది. దీంతో అన్ని నిర్మాణాలకు కొత్త మున్సిపల్ చట్టం కింద అనుమతులు పొందాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు (మెమో నంబర్ 420) జారీ చేశారు. దీంతో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అలాంటి భవనాలు నిర్మించిన వారంతా టీఎస్–బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్దేశిత రుసుము చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి దుర్మరణం గ్రామ పంచాయతీల అనుమతితో బహుళ అంతస్తులు.. గ్రామ పంచాయతీ అనుమతితో జీ+2కు మించి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ రెండంతస్తులకు మించి భవనాలు నిర్మించాలంటే హెచ్ఎండీఏ లేదా ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తప్పనిసరి. అయినా హైదరాబాద్ శివార్లు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల సమీప గ్రామాల్లో పంచాయతీల అనుమతితో రియల్టర్లు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. కళాశాలలు, అపార్ట్మెంట్లు, హోటళ్లు తదితర నిర్మాణాలన్నీ గ్రామ పంచాయతీల అనుమతితోనే సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం 2018లో కొత్తగా 61 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వాటితోపాటు 131 గ్రామ పంచాయతీలను ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రామ పంచాయతీల అనుమతుల పేరుతో కొత్త మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారుల అండతో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు సాగినట్లు దుండిగల్‌లోని ఓ రియాల్టీ సంస్థ మోసంతో వెలుగులోకి వచ్చింది. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం..భార్యను పట్టించుకోకపోవడంతో.. దీంతో అన్ని కొత్త మున్సిపాలిటీల్లో నిర్మించిన కట్టడాల వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని కూల్చేసే పనిలో కూడా ఉన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అరికట్టకుండా ప్రోత్సహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నిర్మించిన కట్టడాలకు కూడా టీఎస్–బీపాస్ ద్వారా అనుమతి పొందాలని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ అనుమతి కోసం ఫీజు చెల్లించినప్పటికీ కొత్తగా అనుమతి రుసుము కట్టాలని, గ్రామ పంచాయతీకి చెల్లించిన మొత్తాన్ని తరువాత సర్దుబాటు చేస్తామని పురపాలక శాఖ డైరెక్టర్ తెలిపారు. అక్రమ కట్టడాలపై చర్యలకు అదనపు కలెక్టర్లకు ఆదేశాలు.. నూతన మున్సిపల్ చట్టం కింద అనుమతి పొందని నిర్మాణాలను గుర్తించి ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా జీ+2కన్నా ఎక్కువ అంతస్తుల్లో జరుగుతున్న నిర్మాణాలపై తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. -
తెలంగాణ మున్సిపల్‌శాఖ కీలక ఉత్తర్వులు
సాక్షి హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా ఝుళిపించింది. హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరుతో హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా అక్రమంగా భారీ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలు కూల్చివేతలను ఆదేశించింది. సాధారణంగా హెచ్ఎండీఏ పరిధిలో గ్రామ పంచాయతీలు జీ ప్లస్ 2 వరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. - అంతకు మించి భారీ నిర్మాణాలు, అనుమతి లేని విల్లాలను కూల్చి వేయాలని ఆదేశించింది. కాగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాలాలపై ఆక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం నాళాల అభివృద్ధి పై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి క్షేత్ర స్థాయిలో నాలలను పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. నాళాలపై నిర్మణాల కూల్చివేతల బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్ -
ఆఫీస్‌కు వచ్చి కొడతాను: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట
సాక్షి, అనంతపురం: కదిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బరి తెగింపు చర్యలకు పాల్పడ్డాడు. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను అడ్డుకుని కొడతానంటూ బెదిరించడమే కాక అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ వివరాలు.. మున్సిపల్ అధికారులు సోమవారం కదిరిలో కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు వరకు గల ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ చేశారు. విషయం తెలుసుకున్న కందికుంట వెంటకప్రసాద్ అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారులను అడ్డుకున్నాడు. అంతటితో ఊరుకోక... ఆఫీస్‌కు వచ్చి కొడతానంటూ అధికారులను బెదిరించాడు. అధికారులపై అసభ్య పదజాలం వాడుతూ రెచ్చిపోయాడు. కందికుంట రౌడీయిజంపై స్థానికులు మండి పడుతున్నారు. -
సచివాలయ సిబ్బంది పై హత్యాయత్నం..
సాక్షి,విజయవాడ: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పైఅంతస్తును కూల్చేందుకు వెళ్లిన వార్డు సచివాలయ ఉద్యోగులపై నిర్మాణదారులు పెట్రోలు పోసి హత్యాయత్నం చేశారు. ఘటనపై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయవాడ రామకృష్ణాపురానికి చెందిన గంజి పావని కృష్ణలంక 16వ డివిజన్లోని 74వ వార్డు సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయం పరిధి కళానగర్‌పాకలు ప్రాంతంలో ఎలాంటి అనుమతులూ పొందకుండా డేరంగుల రాములమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టింది. ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు పావని.. ముగ్గురు ప్లానింగ్ సెక్రటరీలు వి.మౌనిక, పాలేటి తీర్థ, ఎం.రాణితో పాటు చైన్మన్ రాజు తదితరులు వెళ్లారు. పైఅంతస్తుకు వెళ్లి నిర్మాణాన్ని కూల్చబోయారు. రాములమ్మ,ఆమె కుమార్తె గోవిందమ్మ పెట్రోల్ బాటిల్‌తో పైఅంతస్తుకొచ్చి ఆమె మీద పోసుకోవడమే కాకుండా నగర పాలక సంస్థ సిబ్బందిపై కూడా పోసింది. పెట్రోలు వారి కళ్లల్లో, నోట్లో పడటంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆమె చేతిలో అగ్గిపెట్టె కూడా ఉండడంతో వారంతా భయభ్రాంతులకు లోనై పరుగులుతీశారు. పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాములమ్మ, గోవిందమ్మను అదుపులోకి తీసుకున్నారు. -
అక్రమ కట్టడాలను పూర్తిగా ఎందుకు కూల్చడం లేదు?
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలను పూర్తిగా ఎందుకు కూల్చట్లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచే వసూలు చేయాలని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న తీరు పై దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం మరో సారి విచారించింది. నగరవ్యాప్తంగా 145 అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. అయితే కూల్చివేత అంటే భవనాలకు రంధ్రాలు పెట్టడం కాదని, పూర్తిగా కూల్చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘జీహెచ్ఎంసీలో ఉన్న సర్కిళ్లలో ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు? ఎన్ని భవనాలపై కేసులు నమోదు చేశారు? ఎంత మందికి నోటీసులు జారీ చేశారు.. తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టారా.. ఎన్ని కేసుల్లో కింది కోర్టులు కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాయి? కూల్చివేతలపై స్టే ఎత్తివేతకు ఏం చర్యలు తీసుకున్నారు? నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు’ తదితర వివరాలను సర్కిళ్ల వారీగా సమర్పించాలని ధర్మాసనం జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది. ( చదవండి: ఢిల్లీ బస్సు వచ్చింది.. వంద కోట్లు మింగింది! ) -
పిటిషన్ వెనక్కు తీసుకున్న సోనూసూద్
న్యూఢిల్లీ: ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇంటికి సంబంధించిన వ్యవహారంలో తనపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చూడాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ ఈ విషయాన్ని జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఎదుట శుక్రవారం వివరించారు. (సోనూసూద్‌కు నిరాశ.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు) దీంతో పిటిషన్‌ను వెనక్కు తీసుకోవడానికి కోర్టు ఆనుమతిస్తూనే, క్రమబద్దీకరణ కోసం సోనూసూద్ పెట్టుకున్న దరఖాస్తుపై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకునే వరకూ ఎలాంటి చర్యలూ అతనిపై తీసుకోవద్దని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు (బీఎంసీ) ఆదేశాలు ఇచ్చింది. జుహులోని ఆరు అంతస్తుల ‘శక్తి సాగర్’ భవనాన్ని వలస కార్మికుల కోసం హోటల్‌గా మార్చడంపై మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ కింద బీఎంసీ జనవరి 4న జుహు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. (రిషికపూర్ నా ప్రాణదాత) -
నిర్మల్ కలెక్టర్ పై హైకోర్టు సీరియస్
సాక్షి, నిర్మల్: జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ పై హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మల్ పట్టణంలో ఉన్న చెరువుల్లో చేపడుతున్న అక్రమాల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు కలెక్టర్‌ను ప్రశ్నించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశింది. కంచరోలి, ఇబ్రహీం ట్యాంక్ చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణలను ఎందుకు అడ్డుకోవడం లేదో తెలపాలని కోర్టు కోరింది. కోర్టు చెప్పేది నాలుగవ తరగతి ఉద్యోగికి కూడా అర్థం అవుతుంది కానీ నిర్మల్ జిల్లా కలెక్టరుకు అర్థం కావడంలేదని హైకోర్టు న్యాయమూర్తులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే సోమవారం అనగా అక్టోబర్ 12వ తేదీన వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరు కావాలని కోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు న్యాయమూర్తులు సోమవారంకు వాయిదా వేశారు. చదవండి: గో కార్టింగ్ ప్రమాదంపై కేసు నమోదు -
‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’
సాక్షి, విశాఖపట్నం : అనుమతులకు విరుద్ధంగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి నిర్మాణం చేపట్టారని విశాఖ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సబ్బంహరి అక్రమ నిర్మాణానికి సంబంధించి విశాఖ కమిషనర్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఇందులో పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని సెప్టెంబర్ 5న ఏపీఎస్ఈబీ కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నెం.7లో ఏపీఎస్ఈబీ పార్కు ఉందన్నారు. 2012లో ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి తీసుకున్న సబ్బం హరి 592.93చ.మీ విస్తీర్ణంలో జీ+1 కోసం అనుమతి తీసుకున్నారని తెలిపారు. ()సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత) ఇంటి ముఖం 58 ఫీట్లకు అనుమతి తీసుకుని 70 ఫీట్లు కట్టినట్లు వెల్లడించారు. మొత్తం మీద పార్క్‌లోని 212 గజాలను ఆక్రమించిన సబ్బం హరికి ఆక్రమణలకు సంబంధించి 406 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు తీసుకోవడానికి ఆయన నిరాకరించడంతో నోటీసులను సబ్బం హరి భవనానికి కమిషనరేట్ సిబ్బంది అతికించారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోకపవంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. కాగా సీతమ్మధారలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద పార్కు స్థలం కబ్జాకు గురైందని వైజాగ్ జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాన్ని తొలగించామని వెల్లడించారు. ముందుగా సబ్బం హరికి ఆక్రమణ నోటీసు ఇచ్చాము కానీ ఆయన తీసుకోలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
‘క్వీన్’ ఆఫీస్‌లో కూల్చివేతలు
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చెందిన బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ(ముంబై మున్సిపాలిటీ) అధికారులు బుధవారం కూల్చివేతకు దిగారు. ఈ ఘటనపై కంగన తీవ్రంగా మండిపడ్డారు. నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌నుద్దేశించి సంభోదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఉద్ధవ్‌ఠాక్రే, నువ్వేమనుకుంటున్నావు? మూవీ మాఫియాతో జతకట్టి నా ఇల్లు కూల్చడం ద్వారా కక్ష తీర్చుకున్నటు భావిస్తున్నావు! కానీ గుర్తుంచుకో, కాలచక్రం ఎవరికోసం ఆగదు, ఈ రోజు నా ఇల్లు కూల్చారు, రేపు నీ అహంకారం కుప్పకూలుతుంది!’ అని వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. 2017లో కంగన ఈ బిల్డింగ్‌ను రూ.20కోట్లకు కొనుగోలు చేశారు. కంగన బిల్డింగ్‌లో నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడాన్ని నిలిపివేస్తూ ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. బీఎంసీ దురుద్దేశంతో చేసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యజమాని లేనప్పుడు కూల్చివేతలు ఎలా ఆరంభించారని, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే ఎందుకు సమయం ఇచ్చారని బీఎంసీని కోర్టు ప్రశ్నించింది. తన బిల్డింగ్‌లో చేపట్టిన కూల్చివేతలను నిలిపివేయాలన్న కంగన పిటీషన్‌ను విచారించిన కోర్టు తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేసింది. కంగన, శివసేన వివాదం క్రమంగా బీజేపీ వర్సెస్ శివసేన వివాదంగా రూపుదిద్దుకుంటోంది. కంగన కార్యాలయంలో కొన్ని నిర్మాణాల కూల్చివేతపై బీజేపీ స్పందిస్తూ శివసేన కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని విమర్శించింది. ముంబైకి కంగన హిమాచల్ ప్రదేశ్ నుంచి కంగన బుధవారం ముంబైకి వచ్చారు. ఆమెరాకను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్టు నుంచి బందోబస్తు నడుమ ఆమె ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆర్పీఐ(ఏ) కార్యకర్తలు, కర్ణిసేన కార్యకర్తలు కంగనకు మద్దతుగా గుమిగూడారు. ఇటీవలే కంగనకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది. కంగన బిల్డింగ్‌లో కూల్చివేతలను హిమాచల్ ముఖ్యమంత్రి ఖండించారు.కంగన వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఎన్సీపీ లీడర్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అలా మొదలైంది! బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేస్తున్న కంగనకు శివసేన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని గతంలో బీజేపీ నేత రామ్ కదమ్ కోరారు. దీనిపై కంగన స్పందిస్తూ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని ట్వీట్ చేశారు. ముంబై పోలీసులకు బదులుగా హిమాచల్ ప్రదేశ్ లేదా కేంద్ర బలగాలు తనకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందిస్తూ ఆమెను ముంబైకి రావద్దని, ముంబై పోలీసులను ఆమె అవమానించారని మండిపడ్డారు. దీనికి బదులుగా ముంబై ఏమైనా పీఓకేనా? అని కంగన ప్రశ్నించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రౌత్ ముంబై ప్రభుత్వాన్ని కోరారు. పీఓకేలో పరిస్థితులు చూసివచ్చి మాట్లాడాలని కంగనకు సలహా ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ తాను 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని కంగన సవాల్ విసిరారు. తనపై చేసిన వ్యాఖ్యలకు సంజయ్ క్షమాపణ చెప్పాలన్నారు. బుధవారం సంజయ్ స్పందిస్తూ తానెప్పుడూ కంగనను బెదిరించలేదని, ముంబైని పీఓకేతో పోల్చడంపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. కంగన బిల్డింగ్‌లో నిర్మాణాల కూల్చివేతకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చండీగఢ్‌లో ఎయిర్‌పోర్టులో వై–ప్లస్ కేటగిరీ భద్రత మధ్య కంగనా -
నాలాల ఆక్రమణపై కేటీఆర్ సీరియస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో మహానగరం అతలాకుతలమైంది. ముంపునకు నాలాల ఆక్రమణే కారణమంటూ ‘సాక్షి’లో ఈనెల 17న ‘ఈ పాపం ఎవరిది..!?’ శీర్షిక ప్రచురితమైన కథనం కలకలం రేపింది. వరంగల్ మహానగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో కథనం ద్వారా సవివరంగా వెల్లడైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం వరంగల్‌లో పర్యటించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్... మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ముంపు కాలనీల్లో పరిశీలించారు. ఆ తర్వాత నిట్‌లో సమీక్ష చేసిన సందర్భంగా నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించడం దసరా లోపు పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ కథనంతో 435 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు అధికారులు కేటీఆర్‌కు వివరించగా.. వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం హన్మకొండ నయీంనగర్‌లోని నాలా వెంట నిర్మించిన వాగ్దేవి కళాశాల నుంచి నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. -
ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై స్పందించని ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ హాస్టల్ భవన నిర్మాణం కోసం 1975లో కేటాయిం చిన స్థలంలో ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా మున్సిపల్ కమిషనర్ చర్య లు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన గొట్టిముక్క ల వీఆర్‌ఆర్‌జీ రాజు వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు విచారించింది. ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాల ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
హిందూపురంలో విచ్చలవిడి నిర్మాణాలు
హిందూపురం: ‘మా వార్డులో రోడ్లు వేయండి.. డ్రెయినేజీ మరమ్మతులు చేపట్టండి. తాగునీటి పైపులు వేయించండి’ అంటూ వేడుకుంటున్న ప్రజలకు హిందూపురం మున్సిపాలిటీ అధికారులు నుంచి ఒకేఒక్క సమాధానం ఎదురవుతోంది. అదే మున్సిపాలిటీలో నిధులు లేవు! జిల్లా కేంద్రం తర్వాత అదేస్థాయిలో గుర్తింపు పొందిన హిందూపురం మున్సిపాలిటీకి స్థానిక ఆదాయ వనరులు భారీగా ఉన్నా.. వాటి పరిరక్షణలో అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. ఫలితంగా ప్రభుత్వం అందించే నిధులపైనే ఆధారపడి మున్సిపాలిటీ అభివృద్ధిని తిరోగమన దిశలో నడిపిస్తూ వచ్చారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు.. మాముళ్ల మత్తులో మరికొందరు అధికారులు హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధిని తుంగలో తొక్కారు. మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం ఈ విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. కంటి ముందే అడ్డగోలు నిర్మాణాలు పట్టణ పురపాలక కార్యాలయం పక్కనే రోడ్డుకు ఇరువైపులా వరుసగా ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వేసిన షెడ్లు మున్సిపల్ అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. ఈ షెడ్లులో ఒక్కొక్కటి రూ. 6 వేలు చొప్పున అద్దెకు ఇచ్చారు. పట్టణ నడిబొడ్డున రద్దీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. రైల్వే రోడ్డు లోని పల్లా రెసిడెన్షీ ప్రాంతం, వీడీ రోడ్డులోనూ వరుసగా పూర్తిగా వాణిజ్య సముదాయాల షెడ్లు వెలిశాయి. ఈ ప్రాంతాల్లో రోజూ రూ. లక్షల్లో వ్యాపారాలు సాగుతుంటాయి. లక్ష్మీ థియేటర్, ఆర్టీసీ బస్టాండ్, పట్టుగూళ్ల మార్కెట్ రోడ్డు, రహమత్‌పురం రోడ్డు, బెంగళూరు రోడ్డు, ఆర్పీజీటీ రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణం మొత్తం ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన షెడ్లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు పోరంబోకు స్థలాలను ఆక్రమించుకుని షెడ్లు వేసిన ప్రైవేట్ వ్యక్తులు మున్సిపాలిటీకి ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. ఈ అక్రమాలపై మున్సిపల్ అధికారులు దృష్టిసారించలేకపోతున్నారు. వాణిజ్య సముదాయాల నిర్మాణాలతో ఆదాయానికి గండి గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో పురం పరిస్థితులు పూర్తిగా క్షీణించిపోయాయి. పట్టణ టౌన్ ప్లానింగ్ విభాగంపై రాజకీయ నాయకులు పెత్తనం సాగిస్తూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పోరంబోకు స్థలాలను సైతం ఆక్రమించుకుని విచ్ఛలవిడిగా వాణిజ్య సముదాయాల షెడ్లు వేసేశారు. నాలుగు వైపులా ఇనుప పట్టీలు ఏర్పాటు చేసి చుట్టూ రేకులు కప్పేసి గదులు గదులుగా దుకాణాలు సిద్ధం చేశారు. ఒక్కొదానికి నెలకు రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకూ అద్దెతో పాటు అడ్వాన్స్ కింద రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ వసూలు చేశారు. పట్టణం మొత్తం ఇలాంటి షెడ్లు కోకొల్లలుగా వెలిసాయి. వీటిలో ఏ ఒక్కదానికి టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకపోవడం గమనార్హం. విచారణ అనంతరం చర్యలు చేపడతాం పట్టణంలో నిర్మించిన షెడ్లకు సంబంధించి కొన్నింటిపై పన్నులు వసూలు చేస్తున్నాం. మా దృష్టికి రాకుండా నిర్మాణమైన వాటిపై విచారణ చేపట్టి మున్సిపాల్టీకి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి నుంచి వసూలు చేస్తాం. పన్నులు చెల్లించని వాటిని తొలగింజేందుకు చర్యలు తీసుకుంటాం.– భవానీ ప్రసాద్,మున్సిపల్ కమిషనర్, హిందూపురం -
అక్రమ నిర్మాణాలపై బల్దియా కొరడా
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. యథేచ్ఛగా అక్రమ, అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకునేందుకు అధికారులు మూడుసార్లు నోటీసులు జారీ చేయాల్సి ఉండడంతో కూల్చివేతల్లో జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా తమకు సకాలంలో నోటీసులు అందలేదంటూ కొందరు.. అసలు నోటీసులే రాలేదంటూ మరికొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారు. మరోవైపు అధికారులు అక్రమార్కులకు సహకరిస్తూ నోటీసుల జారీలో జాప్యం చేస్తున్నారు. ఈ మేరకు సమయం లభిస్తుండడంతో అక్రమార్కులు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ, కోర్టు వివాదాలకు తావు లేకుండా ఇక నుంచి ఆన్లైన్లో కూల్చివేతల నోటీసులు జారీ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఒకవేళ అనుమతి పొందినప్పటికీ డీవియేషన్లతో, అదనపు అంతస్తులతో అక్రమాలకు పాల్పడే వారికి ఈ విధానంలో ప్రస్తుతమున్న డీపీఎంఎస్ సిస్టమ్ ద్వారా నోటీసు జారీ అవుతుంది. ఆన్లైన్ ద్వారా నోటీసులిస్తే ఏ రోజున అది జారీ అయిందనే విషయం తెలుస్తుంది. తద్వారా కోర్టుల్లో వివాదాలకు తావుండదు. నోటీసుల విషయంలో అక్రమార్కులు అబద్ధాలు ఆడేందుకు వీలుండదు. అంతేకాకుండా అక్రమ నిర్మాణానికి సంబంధించి ఎంతమేర అక్రమాలు జరిగాయి? ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై ఫొటోలతో సహా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వీలుంది. ఇలా చేస్తే అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు నిలువరించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అధికారులపైనా చర్యలు... జీహెచ్ఎంసీలో ప్రతిఏటా ఎన్నో అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నప్పటికీ.. ఆ తర్వాత చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. అక్రమార్కులతో సిబ్బంది జట్టుకట్టి ముడుపులు తీసుకొని కూల్చివేతలు చేపట్టడం లేదు. కేవలం నోటీసుల జారీ మినహా చర్యలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ని నోటీసులు జారీ అయ్యాయి? ఎన్ని కూల్చివేతలు చేపట్టారు? అనేది ఉన్నతాధికారులకు తెలియడం లేదు. అదే ఆన్లైన్ ద్వారా నోటీసులు జారీ చేస్తే చర్యలు తీసుకున్నది లేనిది తెలుస్తుంది. నిర్ణీత వ్యవధుల్లో నోటీసుల జారీ అనంతరం చర్యలు తీసుకోని పక్షంలో అధికారులపై యాక్షన్ ఉంటుంది. తద్వారా అక్రమ నిర్మాణాలకు ఎప్పటికప్పుడు కళ్లెం వేయవచ్చునని భావిస్తున్నారు. ఈ విధానాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నోటీసుల వివరాలతో పాటు కోర్టు కేసులు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే తదితర సమా చారం కూడా ఆన్లైన్లో ఉంచాలని ఆలోచిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం సంస్కరణల్లో భాగంగా ఆన్లైన్లో అక్రమ నిర్మాణాల నోటీసులతో పాటు ఓసీ, ఆస్తిపన్ను నోటీసు, టీడీఆర్ బ్యాంక్ వివరాలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. మూడు నోటీసులు జీహెచ్ఎంసీ చట్టం టౌన్‌ప్లానింగ్ నిబంధనల మేరకు అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలంటే సెక్షన్ 452(1) మేరకు షోకాజ్ నోటీసు, సెక్షన్ 452(2) మేరకు రెండో నోటీసు, ఆ తర్వాత సెక్షన్ 636 మేరకు తుది నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. రికార్డుల్లేవ్... గ్రేటర్లో అక్రమ నిర్మాణాలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం దాదాపు నాలుగేళ్ల క్రితం బీఆర్ఎస్ను తెచ్చింది. ఈ పథకం ద్వారా క్రమబద్ధీకరించుకునేందుకు 1.27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ గడువు ముగిశాక సైతం అక్రమ నిర్మాణాలు ఆగలేదు. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిల్లో ఎన్నింటికి నోటీసులిచ్చి? ఎన్నింటిని కూల్చింది? మిగిలిన వాటిని ఎందుకు కూల్చలేదో? అధికారుల వద్ద వివరాల్లేవు. వాటి రికార్డులే లేవు. ఆన్లైన్లో నోటీసుల జారీతో ఈ వివరాలు తెలుస్తాయి. అక్రమాలెన్నో... నాలుగు నెలల క్రితం తనిఖీలు చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు దాదాపు 500 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వాటితో పాటు దాదాపు 3,700 ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు, రోడ్లు తదితర ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి నిర్మాణాలు జరుపుతున్నట్లు గుర్తించారు. అంటే నగరంలో అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో వెలుస్తున్నాయో అంచనా వేసుకోవచ్చు. -
టీడీపీ కార్యాలయానికి నోటీసులు
సాక్షి, మంగళగిరి(గుంటూరు) : ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి, ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి మండలంలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారి వెంట టీడీపీ కార్యాలయ భవనం నిర్మిస్తుంది. దీనిపై ఈ నెల 3వ తేదీన ‘అక్రమంగా టీడీపీ కార్యాలయ నిర్మాణం’ అనే శిర్షీకతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కి వాగు పోరంబోకు స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణానికి లీజుకు కేటాయించారు. మూడు ఎకరాల 65 సెంట్లు ప్రభుత్వం కేటాయించగా, నిర్మాణం చేపట్టిన నిర్మాణ సంస్థ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ 392/2 సర్వే నంబర్లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. ఈ విషయాలను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిని పరిశీలించారు. ఆక్రమించి నిర్మాణం చేపట్టారని నిర్ధారించారు. గత శుక్రవారం నిర్మాణదారులకు ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్ రామ్‌ప్రసాద్ నోటీసులు జారీ చేసిన ఏడు రోజులలోపు ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. -
కోడెల అక్రమ నిర్మాణంపై చర్యలు
సాక్షి, గుంటూరు: అధికారం అండతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. శివరామ్ తన షోరూమ్‌లో టీఆర్ లేకుండా బైక్‌ల విక్రయించి ప్రభుత్వానికి రూ.లక్షల్లో టోకరా వేశాడు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను షోరూమ్‌లో ఉపయోగించుకున్నాడు. కే–ట్యాక్స్‌లు, ఉద్యోగాల పేరుతో అనేక మంది నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారాలన్నింటిలో ఇప్పటికే శివరామ్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఈయనగారి అక్రమాలు నరసరావుపేట, సత్తెనపల్లిలోనే కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరించిన విషయం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుంటూరు నగరంలో అక్రమంగా జీ ప్లస్–2 భవంతి నిర్మాణం చేపట్టారు. ఈ భవన నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఈ నెల 20న ‘సాక్షి’ దినపత్రికలో ‘యథేచ్ఛగా అక్రమ నిర్మాణం!’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కోడెల శివరామ్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలకు దిగారు. గుంటూరు నగరంలోని భాగ్యనగర్ కాలనీ ఎనిమిదో లైన్‌కు శివారులోని ఎక్స్టెన్షన్ ఏరియాలో సర్వే నెంబర్ 281/ఏ, 296/ఏ లలో 997 గజాలు, 291/ఏ, 296/డీ లలో 1019 గజాల స్థలం కోడెల శివరామ్‌కు ఉంది. ఈ స్థలంలో సుమారు ఎనిమిది నెలల క్రితం శివరామ్ జీ ప్లస్–2 భవనం నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో తన తండ్రి స్పీకర్ కావడంతో భవనం నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. స్పీకర్ తనయుడి భవంతి కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలేశారు. నోటీసు జారీ... అక్రమ కట్టడం వ్యవహారంపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. కోడెల కుమారుడి అక్రమ నిర్మాణానికి నోటీసు జారీ చేశారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 452(1), 428, 461(1), ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టం 2014 115(1)(2), 116(1) కింద అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్టడంపై వివరణ ఇవ్వాలని కోరారు. బీపీఎస్ దరఖాస్తు తిరస్కరణ.. అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించేందుకు కోడెల శివరామ్ ప్రయత్నించారు. ఏ విధంగా ఆ భవనం బీపీఎస్ కిందకు వస్తుందో సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బీపీఎస్ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు తిరస్కరించారు. కోడెల శివరామ్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం 2018 సెప్టెంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసేందుకు సర్వే చేయడం కోసం కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సిబ్బంది అంతకు ముందు వరకూ ఆ స్థలం వ్యవసాయ భూమి కింద ఉండేది. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయడానికి ఆ స్థలం పరిశీలించేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో వెళ్లగా అక్కడ భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. కోడెల శివరామ్ మాత్రం గత ఏడాది ఆగస్టు నెలకు ముందే భవన నిర్మాణం ప్రారంభం అయిందని ఆగస్టు నెలాఖరికి శ్లాబ్ పూర్తయిందని బీపీఎస్‌కు దరఖాస్తు చేశారు. అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తారనే భయంతో భవనాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్‌లోని కొందరు అధికారులు సైతం ఆయనకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడంతో టౌన్ ప్లానింగ్ అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు సమాచారం. కోడెల కుమారుడితో అంటకాగి అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం కోసం ఏ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. -
రహదారి మాయం..!
మెదక్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్–92కే ఎసరు పెట్టారు.. రహ‘దారులు’ మాయం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్న ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో యథేచ్ఛగా అక్రమ భవనాలు నిర్మించారు. ముడుపుల వల.. ప్రజాప్రతినిధుల అండతో మాస్టర్‌ప్లాన్ మార్పు, భవనాల క్రమబద్ధీకరణకు యత్నిస్తున్నారు. రూ.లక్షల మేర చేతులు మారిన ఈ వ్యవహారంలో బల్దియా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, మెదక్ : రానున్న కాలంలో ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మాస్టర్ ప్లాన్ రూపొందించి.. అందుకనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రతిపాదించిన రోడ్ల స్థలాలు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనం వెరసి అక్రమ నిర్మాణాలకు నెలవుగా మారాయి. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. ప్రధానంగా పట్టణం నడిబొడ్డున ఉన్న గంగినేని థియేటర్ పక్కన కెనాల్ మీదుగా పంప్‌హౌస్‌కు వెళ్లే దారితోపాటు అజాంపూర్‌లో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలంలో అక్రమ కట్టడాలు వెలిశాయి. వీటి నిర్మాణాలు ప్రారంభమైన సమయంలోనే పలువురు స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సుమారు రెండేళ్లవుతున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో అజాంపూర్‌లో మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డుకు అడ్డంగా ఒక భవన నిర్మాణం పూర్తి అయింది. దీన్నే ఓ ప్రభుత్వ శాఖ అద్దెకు తీసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తుండడం గమనార్హం. ఇక పంప్‌హౌస్ దారిలో మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలంలో సైతం రెండంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది. రెండేళ్లుగా చోద్యం.. మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అజాంపూర్‌లో ఓ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌ను మార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. గతంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో అజెండాలో పెట్టారు. అయితే.. అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు వ్యతిరేకించగా దుమారం చెలరేగింది. దీంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది. మరోవైపు మెదక్ ప్రధాన రహదారి సమీపంలోని గంగినేని థియేటర్ నుంచి పంప్ హౌస్‌కు వెళ్లే రూట్లో కెనాల్‌ను ఆనుకుని 50 అడుగుల దారిని నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. ఇందులో కెనాల్ నుంచి బండ్ 20 మీటర్లు ఉండగా.. మిగతా స్థలాన్ని మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కెనాల్‌ను ఆనుకుని ఉన్న స్థలంలో ఒకరు గతంలోనే రెండంతస్తుల భవన నిర్మాణం మొదలుపెట్టారు. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయింది. అయితే సదరు భవన యజమాని గతంలో భవన క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా.. అధికారులు తిరస్కరించారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు సాగినా.. రెండేళ్లుగా అధికారులెవ్వరూ పట్టించుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్యామ్యాలు రూ.10 లక్షలపైనే ? మెదక్ పట్టణం నడిబొడ్డున మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో అక్రమ కట్టడాల తతంగంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. థియేటర్ సమీపంలోని భవనానికి సంబంధించి మున్సిపాలిటీ పాలకవర్గంలోని పలువురు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, బల్దియాలోని కింది స్థాయి సిబ్బందికి కలిసి సుమారు రూ.10 లక్షలు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లర్ల నిర్మాణ సమయంలోనే ఫిర్యాదులు రాగా.. నిర్మాణాన్ని నిలిపేసినట్లు అధికారులు చెప్పారు. కానీ.. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయింది. అంటే ఇన్నాళ్లుగా చాటుమాటుగా పనులు కొనసాగినట్లు చెప్పవచ్చు. ప్రజాప్రతినిధుల అండతో మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. అజాంపూర్‌కు సంబంధించి మాస్టర్ ప్లాన్ మార్చేందుకు జరిగి న యత్నంలో సైతం పెద్ద ఎత్తున డబ్బులు చేతు లు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దృష్టి సారించాలి.. ఇవే కాకుండా.. మున్సిపల్ మాస్టర్‌ప్లాన్–92లో ప్రతిపాదించిన పట్టణ పరిధిలోని పలు రోడ్డు స్థలాలను పలువురు కబ్జా చేయగా.. కొందరు అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి.. అక్రమ కట్టడాలకు కళ్లెం వేయాలి. భవిష్యత్ అవసరాలను గుర్తెరిగి అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటీసులు జారీ చేస్తాం.. మాస్టర్ ప్లాన్ రహదారిలో కట్టడాలు నిర్మాణం నిషేధం. ఎవరైనా ఉల్లంఘిస్తేకఠిన చర్యలు తీసుకుంటాం. అజాంపూర్, పంప్‌హౌస్ దారికి సంబంధించి అక్రమ ని ర్మాణదారులకు నోటీసులు రెడీ చేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించా. – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ -
మాజీ ఎమ్మెల్యేకు చెందిన భవనం కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు చెందిన ఐదంతస్తుల భవనాన్ని శనివారం జీవిఎంసీ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలను విరుద్ధంగా నిర్మాణం చేపట్టినందునే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జీవిఎంసీ పరిధిలో జీ ప్లస్ మూడు అంతస్తుల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉందని, కానీ అందుకు విరుద్దంగా పీలా గోవిందు ఐదు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడంతో దానిని కూల్చివేయాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. -
కొట్టేశారు.. కట్టేశారు..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పాత శ్రీకాకుళం పరిధిలోని 80 అడుగుల రోడ్డులో ఎన్టీఆర్ భవన్ పేరుతో కొనసాగుతున్న టీడీపీ కార్యాలయమిది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో సుందరంగా నిర్మించారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రెండెకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. స్థలాన్ని కొనుగోలు చేసి కార్యాలయం నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఖాళీగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన స్థలమిది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన పార్టీ కార్యాలయం కోసం ఎంతో విలువైన భూమిని 99 సంవత్సరాలకు లీజు కింద కట్టబెట్టేశారు. ఈ భూమిని కేటాయించిన 2015 నాటికి రిజిస్ట్రేషన్ల ప్రకారం ఇక్కడ ఎకరా విలువ సుమారు రూ.4.01 కోట్లు. అనధికారికంగానైతే రూ.6 కోట్ల వరకు పలికేది. మార్కెట్ రేటు ప్రకారం టీడీపీ కార్యాలయం కోసం కేటాయించిన రెండెకరాల భూమి విలువ రూ.12 కోట్లు దాటే ఉంటుంది. ఇంతటి విలువైన భూమిని సంవత్సరానికి కేవలం రూ.25 వేల ఫీజుతో 99 సంవత్సరాల లీజుకింద ధారాదత్తం చేశారు. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో... కోట్లాది రూపాయల విలువైన భూమిని ఎలా అప్పనంగా దక్కించుకున్నారో.. ఈ కథనం చదివితే అర్థమవుతుంది. రైతుల నుంచి సేకరించిన భూమిపై టీడీపీ కన్ను.. పాత శ్రీకాకుళం పరిధిలోని 80 అడుగుల రోడ్డులో షెడ్యూల్ కులాల ఇళ్ల స్థలాలు, ఇతరత్రా అవసరాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ కొన్నేళ్ల క్రితం భూమిని రైతుల నుంచి సేకరించింది. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది. అందులో వివిధ అవసరాలకు వినియోగించగా రెండెకరాల భూమి మిగిలి ఉంది. కొన్నాళ్లుగా ఖాళీగా ఉంది. ఇంతలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో టీడీపీ నేతల కన్ను ఖాళీ భూమిపై పడింది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పథక రచన చేశారు. ఇంకేముంది చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ భూమిని కొట్టేసేందుకు పావులు కదిపారు. కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులు వత్తాసు పలికారు. చకచకా పైలు కదిపి 2015 సెప్టెంబర్ 4వ తేదీన టీడీపీ కార్యాలయం కోసం కేటాయించేశారు. టౌన్ సర్వే నెంబర్ 700–1లో 1.29 ఎకరాలు, టౌన్ సర్వే నెంబర్ 701–1లో 71 సెంట్ల భూమిని టీడీపీకి అప్పగించేశారు. జీవోలు మార్చి రెండెకరాల కేటాయింపు.. పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందుకోసం తగు నిబంధనలు కూడా ఉన్నా యి. గుర్తింపు కలిగిన పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల కోసం ఒక ఎకరా భూమిని 30 సంవత్సరాల నామినల్ లీజు కింద కేటాయించొచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ జీవోను కాదని కొన్ని షరతుల పెట్టి మరో జీవో కింద ఏకంగా రెండెకరాలు కేటాయించింది. వాస్తవానికి తొలుత ఎకరా భూమి కోసమే జిల్లా పార్టీ తరపున దరఖాస్తు చేశారు. అక్కడున్న మొత్తం భూమిని తీసేసుకుంటే భవి ష్యత్‌లో ఎవరూ రారని, ఎలాంటి ఇబ్బందులుండవని కొందరు అధికారులు, మరికొంద రు పార్టీ నేతలు సూచించడంతో రెండో దరఖాస్తుచేశారు. ఖాళీగా ఉన్న రెండెకరాల భూమి ని తమకే ఇవ్వాలని దరఖాస్తు చేయడం, దాని కి అధికారులు వత్తాసు పలికుతూ చకాచకా ఫైలు కదపడం జరిగింది. తమ ప్రభుత్వమే ఉండటంతో రాజధాని స్థాయిలో ఆమోద ముద్ర వేయించారు. పేదలకు సెంటు స్థలం ఇవ్వకపోయినా.. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పేదవాళ్లకు సెంటు స్థలం కూడా టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. అక్కడక్కడా ప్రభుత్వ స్థలంలో తమకు లాభసాటిగా ఉండేలా అపార్ట్మెంట్ల నిర్మాణం ద్వారా ప్లాట్లు కేటాయించే కార్యక్రమం మాత్ర మే చేపట్టింది. ఇది కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. కాంట్రాక్టర్లకు ఇచ్చి, వాటిలో కమిషన్లు తీసుకునే కార్యక్రమాన్నే ఎక్కువగా చేపట్టింది. ఇలా... ఏ ఒక్కరికీ సెంటు స్థలమివ్వని టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయం కోసం మాత్రం నగరంలో ఎంతో విలువైన రెండు ఎకరాల భూమిని కేటాయించింది. మూడింతల దోపిడీ.. టీడీపీకి కేటాయించిన భూమి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. పార్టీ కార్యాలయానికి కేటాయించిన నాటికి 2015లో చుట్టుపక్కల జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రకారం ఎకరా రూ.4.01 కోట్లు. అనధికారికంగా దాని విలువ రూ.6 కోట్లు పైబడి ఉండేది. ఈ లెక్కన రెండెకరాల భూమి విలువ రిజిస్ట్రేషన్ల ప్రకారం రూ.8 కోట్ల మేర పలికగా మార్కెట్ రేటు ప్రకారం రూ.12 కోట్ల పైబడి ఉండేది. ఇప్పుడైతే దాని విలువ రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర ఉంది. దాదాపు రూ.12 కోట్ల విలువైన భూమిని సంవత్సరానికి రూ.25 వేల లీజు చొప్పున 99 సంవత్సరాలకు కట్టబెట్టారు. సాధారణంగా 30 సంవత్సరాల లీజుకు కేటాయిస్తుంటారు. కానీ అధికారం చేతిలో ఉండటంతో తమ పార్టీ కార్యాలయం కోసం ఏకంగా 99 సంవత్సరాల లీజుకిచ్చేశారు. అంటే ఆ స్థలం టీడీపీ చేతిలోకి వెళ్లిపోయినట్టే. దీన్నిబట్టి టీడీపీ ఘరానా దోపిడీ ఏ స్థాయిలో ఉందో, పార్టీ ఎలా లాభపడిందో అర్థం చేసుకోవచ్చు. -
వంశధార స్థలం ఆక్రమణ వాస్తవమే..
టెక్కలి: మండలంలో వీఆర్కే పురం గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్ (మద్యం నిల్వ కేంద్రం) గొడౌన్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. శనివారం రెవెన్యూ, వంశధార అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఈ ఆక్రమణలను గుర్తించారు. ఇక్కడ కాలువలు నిర్మించకుండా గొడౌన్ ఏర్పాటుతో పొలాలకు ముంపు ప్రమాదం ఉందని, అలాగే వంశధార గట్టుపై అక్రమ తవ్వకాలు చేశారంటూ వీఆర్కే పురం, సీతాపురం గ్రామస్తులు ఇటీవల స్పందనలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఐ హరి, సర్వేయర్లు సుభాష్, రమణమూర్తి, వంశధార ఏఈ యామిని తదితరులు ఫిర్యాదుదారులు, గ్రామస్తుల సమక్షంలో బెవరేజ్‌కు ఆనుకున్న వంశధార స్థలంలో కొలతలు వేశారు. చివరగా వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్ నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స
సాక్షి, అమరావతి: అక్రమ కట్టడాలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాసనసభలో గురువారం ఆయన మాట్లాడుతూ.. అక్రమ నివాసంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీసులిచ్చినట్టు వెల్లడించారు. టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..కరకట్టపై అక్రమ కట్టడాలన్నింటికి నోటీసులు ఇచ్చామని మంత్రి వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. నదీ పరివాహక చట్టప్రకారం కరకట్టకు, నదికి మధ్య చిన్న మొక్క కూడా నాటడానికి వీల్లేదన్నారు. ఇప్పటికైనా అక్రమ నివాసం నుంచి చంద్రబాబు బయటకు రావాలని డిమాండ్ చేశారు. హైకోర్టు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదని, ప్రజావేదిక నిర్మాణం పేరుతో కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
-
ప్రశాసన్‌నగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
ఏపీ డీజీపీ అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72 ప్రశాసన్‌నగర్‌లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ (ప్లాట్ నం.149) జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను మంగళవారం జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ప్లాట్ నం–149ను ఆనుకుని ఉన్న పార్కును సదరు ఐపీఎస్ అధికారి రెండు వైపులా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అంతే కాకుండా పార్కులోని ఇనుప దిమ్మెలతో అనధికారిక స్ట్రక్చర్ కూడా నిర్మించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించకపోగా నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు అంతస్తులు నిర్మించారు. జీ ప్లస్–1 నిర్మాణానికి అనుమతి తీసుకున్న ఠాకూర్ ఇటీవల ఇంటి చుట్టూ సెట్‌బ్యాక్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అక్రమంగా ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో నిర్మించారు. పార్కు స్థలంలో కబ్జాలను కూల్చివేసిన అధికారులు.. అక్రమంగా నిర్మించిన అంతస్తులను కూడా తొలగించాలంటూ మంగళవారం తుది నోటీసులు జారీ చేశారు. 2017, జూన్ 4న ప్రశాసన్‌నగర్ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ ఠాగూర్ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసిందని, దీంతో అదే సంవత్సరం జూన్ 5న ఒకసారి, జూన్ 17న రెండోసారి నోటీసులు జారీ చేశామని అధికారులు చెప్పారు. స్పందన రాకపోవడంతో మంగళవారం మూడో నోటీసు జారీచేసినట్లు తెలిపారు. -
అక్రమ నిర్మాణాలకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా జీహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం ఎన్నికల విధుల్లో ఉండటం..అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకునే సమయం లేకపోవడంతో నగరంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. అసలు అనుమతులే లేకుండా Ððవెలుస్తున్న భవనాలతోపాటు రెండంతస్తులున్న భవనాలపైన మరో రెండు మూడు అంతస్తులు, నాలుగంతస్తుల భవనాలపైన అదనపు అంతస్తులు ఇటీవలి కాలంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. అనుమతుల్లేకుండానే ఇష్టానుసారం నిర్మించారు. ఎన్నికల ముందు ఎలాగూ చర్యలు తీసుకోరనే నమ్మకంతో కొందరు..వారిని చూసి ఇంకొందరు ఎక్కడపడితే అక్కడ తామరతంపరగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. అక్రమ నిర్మాణాలపై వారం వారం జరిగే ‘ప్రజావాణి’లోనూ ఫిర్యాదులందుతున్నాయి. ఎన్నికల తరుణంలో అక్రమ నిర్మాణాలపై ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన కథనంలో అప్పట్లో చర్యలకు సిద్ధమైన అధికారులు ఎన్నికలు రావడంతో వాటిపై దృష్టి సారించలేదు. రోజురోజుకూ అక్రమ నిర్మాణాలు తీవ్రం అవుతుండటంతో కమిషనర్ దానకిశోర్ అధికారులను చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు వెలిసేంతదాకా చోద్యం చూస్తూ..ఆ తర్వాత చర్యలకు దిగుతుండటంతో పలుసందర్భాల్లో జీహెచ్ఎంసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టకపోవడాన్ని కోర్టు కూడా గతంలో తప్పుపట్టింది. దీంతో ఓవైపు భవన నిర్మాణ నిబంధనల గురించి ప్రజలకుఅర్థమయ్యేలా వివరించే కార్యక్రమాలు, అనుమతుల సరళీకరణకు సిద్ధమైన అధికారులు.. అదే తరుణంలో మరోవైపు అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని కూడా నిర్ణయించారు. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని పలు అక్రమాలను గుర్తించి తొలిదశలో 63 మందికి నోటీసులు జారీ చేయడంతో పాటు 21 నిర్మాణాలను మంగళవారం కూల్చివేశారు. స్టిల్ట్ ప్లస్ రెండంతస్తులకు మాత్రం అనుమతి పొంది .. అంతకంటే ఎక్కువ అంతస్తులు వేసినవి, పార్కింగ్ ప్రదేశంలో ఇతర నిర్మాణాలు జరిపి పార్కింగ్ లేకుండా చేసినవి, తదితరమైనవి వీటిల్లో ఉన్నాయి. వీటితోపాటు ఎలాంటి అనుమతుల్లేకుండానే చేసిన నిర్మాణాలను కూడా కూల్చివేశారు. కూల్చివేతల స్పెషల్ డ్రైవ్ మరికొన్ని రోజులు కొనసాగుతుందని డైరెక్టర్(ప్లానింగ్) కె. శ్రీనివాసరావు తెలిపారు. తిరిగి నిర్మాణాలు చేయడానికి వీల్లేకుండా ఆధునిక మెషిన్లు, సాంకేతికతతో కూల్చివేతలు జరిపినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత ఎదురైనా అధికారులు వెనుకాడకుండా కూల్చివేతలు కొనసాగించారు. అధికారులు కూల్చిన వాటిల్లో.. ♦ ఉప్పల్ శ్రీనగర్‌కాలనీలో అనుమతిలేని గ్రౌండ్‌ఫ్లోర్. ♦ హయత్‌నగర్ సర్కిల్లోని భాగ్యలతనగర్లో అనుమతి లేకుండా నిర్మించిన 2, 3 అంతస్తుల శ్లాబ్‌లు. ♦ హస్తినాపురం క్రాస్లేకుండా అనుమతి లేకుండా నిర్మించిన రెండో అంతస్తు. ♦ చైతన్యపురి ఫనిగిరి కాలనీలో అన ధికార మూడో అంతస్తు సెంట్రింగ్. ♦ ముషీరాబాద్ ఎల్ఐసీ కాలనీలో అనుమతి లేని మూడో అంతస్తు సెంట్రింగ్, పిల్లర్లు. ♦ టోలిచౌకి ప్రైడ్ఇండియా సీ–7లో అక్రమ నిర్మాణం. ♦ రాయదుర్గం పక్వాన్ హోటల్ ఎదురుగా అనధికార నిర్మాణం. ♦ చందానగర్ శంకర్‌నగర్‌లో అక్రమ నిర్మాణం. ♦ వీటితోపాటు ఖానమెట్, రామచంద్రాపురం, పటాన్చెరు, కేపీహెచ్‌బీ, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో అక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తులు తదితరమైన వాటిని కూల్చివేశారు. -
అక్రమ కట్టడంలో ఐటీ కంపెనీ!
సాక్షి, గుంటూరు: నివాస గృహాల సముదాయం కోసం అనుమతులు తీసుకున్నారు. కానీ, వాణిజ్య సముదాయాలకు వీలుగా ఉండేలా కట్టారు. అలాగే, ప్లానులో ఐదంతస్తులు అని చూపెట్టారు.. అడ్డగోలుగా ఆరో అంతస్తును కట్టేశారు. ఇదేదో చాటుమాటుగా జరిగిన వ్యవహారం కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శుక్రవారం గుంటూరు నగరంలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఓ ఐటీ కంపెనీ భవన నిర్మాణంలో అడుగడుగునా చోటుచేసుకున్న అక్రమాల పర్వం ఇది. కంచె చేను మేసిన చందంగా అనధికారిక నిర్మాణాలను, అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికారులు, ప్రభుత్వ పెద్దలే ఈ అక్రమానికి సహకరిస్తున్న విచిత్ర పరిస్థితి గుంటూరు నగరంలో నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలోని విద్యానగర్ ఒకటో లైనులో గల ఓ భవనంలో నూతనంగా ఇన్ వెకాస్ అండ్ వేదా ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఏర్పాటుచేసిన ఐటీ కంపెనీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల చేతుల మీదుగా శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే భవనానికి పక్కాగా అన్నీ అనుమతులు ఉండాలనే కనీస ధర్మాన్ని గాలికొదిలేశారు. ఎటు చూసినా అక్రమ పద్ధతిలో నిర్మించిన పరిస్థితి. 618.39 చదరపు గజాల స్థలంలో 31.97 చదరపు గజాల స్థలం రోడ్డుకు వదిలేసి 586.42 చదరపు గజాల్లో సిల్ట్‌తో పాటు గ్రౌండ్ ఫ్లోర్, మరో నాలుగు అంతస్తుల నివాస యోగ్యమైన భవనం నిర్మించుకునేలా గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల నుంచి అనుమతులు పొందారు. అయితే, వాణిజ్య సముదాయాలకు వీలుగా ఉండేలా భవనాన్ని నిర్మించడంతో పాటు, ఆరో అంతస్తు నిర్మాణాన్నీ చేపట్టారు. ఇదంతా నగరపాలక సంస్థ అధికారులకు తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రారంభోత్సవానికి వస్తుండటంతో ఏం చేయలేక మిన్నకుండిపోయారు. అనధికార నిర్మాణమని తెలిసినా నోటీసులు ఇచ్చేందుకు కూడా సాహసించలేదు. అడుగడుగునా అతిక్రమణలు - నివాస ప్రాంతాల్లో ఐటీ కంపెనీ ఏర్పాటుచేయాలంటే కనీసం వెయ్యి చదరపు గజాల స్థలంలో భవనం నిర్మించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్న భవనం కేవలం 586.42 చదరపు గజాల స్థలంలో మాత్రమే ఉంది. - నివాస గృహాలకు ప్లాన్ అనుమతులు తీసుకుని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. కానీ, బిల్డర్, ఐటీ కంపెనీ నిర్వాహకులకు ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఈ అక్రమాలేవీ ఎవరికీ కనిపించలేదు. పైగా ఐటీ కంపెనీ నిర్మించేందుకు వీలుగా మినహాయింపులు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. - అలాగే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చారో లేదో తెలియని పరిస్థితి. - సదరు స్థలంలో గతంలో ఉన్న చిన్న ఇంటికి సుమారు రూ.2 వేలు పన్ను ఉండేది. ప్రస్తుతం ఆరు అంతస్తుల భవనానికి లక్షల్లో పన్ను వేయాల్సి ఉన్నా రెవెన్యూ అధికారులు పాత పన్నునే కొనసాగిస్తున్నారు. అక్రమార్కులకు అండాదండా ఇదంతా ఒక ఎత్తయితే.. రాజధాని నగరంలో అనధికారిక, అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు భవన యజమానికి కొమ్ముకాస్తున్నారు. అనధికారిక కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకే అక్రమ కట్టడంలో ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే ప్రభుత్వమే అక్రమాలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి చూసిన తరువాత నగరంలో ఇక అక్రమ కట్టడాలను అడ్డుకునే పరిస్థితి నగరపాలక సంస్థ అధికారులకు ఉంటుందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. నా దృష్టికి రాలేదు విద్యానగర్ ఒకటో లైనులో ఇన్ వెకాస్ అండ్ వేద ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభోత్సవం జరుగుతున్న భవనంలో అనధికారిక నిర్మాణం చేసినట్లు నా దృష్టికి రాలేదు. పరిశీలించి అలాంటివి ఏమైనా ఉంటే తొలగిస్తాం. – శ్రీకేష్ లఠ్కర్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ -
పల్లె కట్టుకోమన్నారు!
నల్లమాడ: మండల కేంద్రమైన నల్లమాడలో ఓ టీడీపీ నాయకుడి ఇంటికి రక్షణగా రూ.6.70 లక్షల ప్రభుత్వ నిధులతో సేఫ్టీవాల్ (రక్షణ గోడ) నిర్మించడం చర్చనీయాంశమైంది. పైగా వంకను ఆక్రమించి ఈ రక్షణ గోడ నిర్మిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోగా చిన్ననీటి పారుదల శాఖ ఏఈఈ అనీల దగ్గరుండి పనులను చేయిస్తుండటం విశేషం. వివరాల్లోకెళితే... నల్లమాడ బస్టాండ్ కూడలి దిగువన ఉన్న వంకకు ఆనుకొని చిల్లగోర్లపల్లికి వెళ్లే రహదారి పక్కన టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజేంద్ర నివాస గృహం ఉంది. ప్రస్తుతం ఆయన ఇంటికి రక్షణగా వంకలో సేఫ్టీవాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.6.70 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో 33 మీటర్లు పొడవునా రక్షణ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వంకను ఆనుకొనే టీడీపీ నాయకుడి ఇల్లు ఉండటతో వర్షపు నీటికి ఇల్లు కోతకు గురికాకుండా ఉండేందుకు సేఫ్టీవాల్ నిర్మిస్తున్నారని, ఈ రక్షణ గోడ వల్ల ఆయనకు తప్ప మరెవరికీ ఉపయోగం లేదని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వంక పొడవునా రక్షణ గోడ నిర్మించాల్సి పోయి టీడీపీ నాయకుడి ఇంటి వద్దే నిర్మించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఐదారు అడుగులు వంకను కబ్జాచేసి రక్షణ గోడ నిర్మిస్తున్నారని, దీంతో వంక కుంచించుకుపోయి భారీ వర్షాలు వస్తే నీరు ముందుకు వెళ్లకపోగా ఇబ్బందులు తప్పేలా లేవని ఇరుగుపొరుగు వారు ఆందోళన చెందున్నారు. దీనిపై సదు టీడీపీ నాయకుడిని ప్రశ్నిస్తే సేఫ్టీవాల్ నిర్మించుకోమని తనకు ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి చెప్పారంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లు వారు వాపోయారు. సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి వంక ఆక్రమణకు గురికాకుండా కొలతలు వేయించాలని, అంతవరకు రక్షణ గోడ నిర్మాణ పనులు ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మైనర్ ఇరిగేషన్ ఏఈఈ అనీలను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పనులు చేయిస్తున్నానని తెలిపారు. -
కదిరిలో రోడ్ల విస్తరణలో వివాదం
-
అక్రమ కట్టడాలపై అధికారుల పంజా
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టాడాలపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ శివారులో ఉన్న 345 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి భూ పోరాటంలో భాగంగా నిరుపేదలు తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నారు. మరి కొంత మంది రియల్మాఫియాకు చెందిన వారు పక్కాగా నివాస గృహాలు నిర్మించారు. జిల్లాలో జరుగుతున్న భూ పోరాటం ముఖ్యమంత్రి వరకు చేరుకోవడంతో అధికారుల్లో కదలిక మొదలైంది. అక్రమ కట్టాడాలు నిర్మించుకున్న వారితో, వారిని ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులతో అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు, ప్రభుత్వ స్థలాలను ఖాళీ చేయాల్సిందేనని హెచ్చరించారు. శుక్రవారం సుమారు 5వందల మంది పోలీస్ బలగాలతో రెవెన్యూ అధికారులు దగ్గరుండి అక్రమ కట్టాడాలను కూల్చి వేశారు. ఉదయం3 గంటల నుంచి.. డీసీపీ వేణుగోపాల్‌రావు, జేసీ సురేందర్‌రావులు పోలీసుల బలాగాలు, ఫారెస్టు, ఎక్సైజ్, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటి, ఫైర్ సిబ్బందితో ఉదయం 3 గంటల నుంచే గుడిసెల కూల్చివేతకు ఆపరేషన్ ప్రారంభించారు. ఆక్రమితదారులను ప్రోత్సహిస్తున్నారన్న సమాచారం మేరకు అనుమానితులను 20 మందిని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారు రెండు గంటల్లో ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు. అనంతరం అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన ఇళ్లను నాలుగు జేసీబీలతో కూల్చి వేశారు. ఈక్రమంలో అడ్డుపడిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠినచర్యలు 345 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి 330.09 ఎకరాలు ఉండగా 120 ఎకరాలు జంగు సిపాయినకు, మరో 20 ఎకరాలు ఎక్స్ సర్వీస్‌మెన్‌కు, లొంగిపోయిన మావోయిస్టులకు, 12 ఎకరాలు డబుల్ బెడ్రూం, సుమారు 90 ఎకరాల భూమి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ నివాస గృహాలకు వివిధ దశలలో కేటాయించాం. జంగు సిపాయికి చెందిన భూమిలో 60 ఎకరాల భూమికి సబ్‌డివిజన్ కలదని, దీనిని ఆసరాగా చేసుకుని పలువురు భూఆక్రమణ దారులు మిగిలిన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. వీటిలో నివాస స్థలాలు, నివాస గృహాలకు అర్హులైన వారిని గుర్తించి డబుల్ బెడ్రూం పథకంలో ఇల్లు కేటాయిస్తాం. – సురేందర్‌రావు, జేసీ, మంచిర్యాల -
అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఉదాసీనంగా వ్యవహరించి.. ఆ తర్వాత కూల్చివేత నోటీసులతో చేతులు దులుపుకుంటున్నారని జీహెచ్ఎంసీ అధికారులపై ఉమ్మడి హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అక్రమ నిర్మాణదారులు కింది కోర్టును ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందేందుకు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరు వల్లే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని ఆక్షేపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంతమంది అక్రమ నిర్మాణదారులు కింది కోర్టులను ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందారో జాబితా తమ ముందుంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏం ప్రణాళికలు సిద్ధం చేశారో కూడా వివరించాలని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఓ అక్రమ నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
నీళ్లు నమిలిన దేవినేని ఉమా
-
చారిత్రక కట్టడంపై బాత్రూం నిర్మాణం.. నోటీసులు
సాక్షి, ముంబై: అనుమతులు లేకుండా కట్టడం నిర్మిస్తుండటంతో విల్సన్ కళాశాలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. సరైన వివరణ ఇవ్వని పక్షంలో ఆ కట్టడంను కూల్చివేస్తామని ప్రకటించింది. సుమారు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న విల్సన్ కళాశాలపై అక్రమ నిర్మాణం నిర్మిస్తుండటం ఆర్టీఐ ఉద్యమకారుడు సంతోష్ దౌండ్కర్ దృష్టికి చేరింది. దీంతో ఆయన బీఎంసీకి ఫిర్యాదు చేయగా, కార్పొరేషన్ కళాశాల యాజమాన్యానికి నోటీసులు పంపించింది. కాలేజీలోని మక్కిచాన్ హాల్ పైన బాత్ రూమ్ నిర్మించేందుకే నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై 24 గంటల్లో నివేదిక కోసం ఆదేశించినప్పటికీ.. కళాశాల నుంచి ఎటువంటి స్పందన లేదని సమాచారం. అనుమతికి సంబంధించిన పేపర్లు చూపించకపోతే తక్షణం ఆ నిర్మాణాన్ని కూల్చేస్తామని బీఎంసీ తెలియజేసింది. 1832 లో గిర్గామ్లో ఆంగ్లేయుల పాలనలో ఈ కళాశాలను స్థాపించారు. 1889 లో భవన నిర్మాణాన్ని జాన్ అడమ్స్ అనే ఇంజనీర్ రీ డిజైన్ చేయించారు. 2011 లో వారసత్వ కట్టడం గా గ్రేడ్ 3 కేటగిరీలో విల్సన్ కళాశాలను చేర్చారు. -
సీఎం సాక్షిగా అడ్డగోలు కట్టడం
-
చెదిరిన వ్యాపారాలు.. ప్రతీకారమా..?
-
గోవిందా... గోవిందా
మరో టీడీపీ ఎమ్మెల్యే అతిక్రమణ దందా వాసుపల్లి మాదిరే నగరంలో అనకాపల్లి ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం గెడ్డకు ఆనుకునే జీ ప్లస్ 4 భవనం జీ ప్లస్ 2 నిర్మాణానికే అనుమతులు గెడ్డ, మెయిన్‌రోడ్డు నుంచి కనీస దూరం పాటించని వైనం పీలా గోవిందు దగ్గరుండి మరీ పనుల పర్యవేక్షణ నోటీసులతో సరిపెట్టి.. నిద్ర నటిస్తున్న అధికారులు పక్కనే పెద్ద గెడ్డ ఉంది.. దాన్ని అనుకొని ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలూ ఉన్నాయి.. అవేవీ ఆయనగారిని అడ్డుకోలేకపోయాయి.. పైగా జీ ప్లస్ 2కి అనుమతి తీసుకొని.. జీ ప్లస్ 4 నిర్మించేస్తున్నా అధికారులు మౌనం వహిస్తున్నారు.. ఎందుకని ఆరా తీస్తే.. అది అధికార టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన నిర్మాణమని తేలింది..! ఒక వాసుపల్లి.. ఒక పీలా గోవిందు.. ఇలా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే.. చట్టాలను చట్టుబండలు చేస్తూ ఇష్టారాజ్యంగా భారీ భవంతులు నిర్మించేస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నట్లు?.. ఇదే ప్రశ్న జీవీఎంసీ అధికారులకు వేస్తే వచ్చిన సమాధానమేంటంటే.. ‘మా దృష్టికి వచ్చింది.. నోటీసులిచ్చాం’.. ఎప్పుడడిగినా ఇదే సమాధానం రెడీగా పెట్టుకునే అధికారులు.. సదరు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే చర్యలు మాత్రం చేపట్టరు.. విశాఖపట్నం: సామాన్యుడు చిన్నపాటి ఇల్లు కట్టుకునే క్రమంలో పొరపాటున ఏదైనా అతిక్రమణ జరిగితే చాలు.. వెంటనే జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించేస్తారు. నిర్మాణాలను అడ్డుకుని అక్కడున్న సామాగ్రిని సైతం తీసుకుపోతారు. వేలకు వేల జరిమానాలు విధిస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రమాదకరమైన గెడ్డ పక్కనే నిబంధనలను పాటించకుండా.. ఐదంతస్తుల భవనం కట్టేస్తున్నా కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసేసుకున్నారు. అక్కడేమీ జరగనట్టే వ్యవహరిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. నోటీసులిచ్చాం.. ఆపేస్తామని షరా మామూలుగానే బీరాలు పోతున్నారు. వాసుపల్లి బాటలోనే పీలా.. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాదిరే టీడీపీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా నగరంలో అక్రమాల అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే గోవింద్ భార్య పి.విజయలక్ష్మి పేరిట నగరంలోని ద్వారకానగర్ బీవీకే కళాశాల రోడ్డులోని సర్వే నెంబర్ 32లో 300 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. నిబంధనల మేరకు నిర్మాణం జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ సదరు ఎమ్మెల్యే నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా నిర్మాణం చేసేస్తున్నారు. ఆ స్థలానికి అనుకొని దక్షిణ భాగంలో భారీ గెడ్డ ఉంది. వాస్తవానికి 168 జీవో ప్రకారం.. బఫర్ జోన్ కింద గెడ్డ నుంచి పది అడుగులు, భవనం కాంపౌండ్ నుంచి మరో పది అడుగులు.. మొత్తంగా 20 అడుగులు వదిలి నిర్మాణం చేపట్టాలి. గెడ్డ పక్కన సామాన్యుడు పూరిల్లు వేసుకున్నా ఈ నిబంధన పాటించాల్సిందే. కానీ ఎమ్మెల్యే ఈ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టేశారు. గెడ్డను ఆనుకునే బహుళ అంతస్తుల భవన నిర్మాణం కానిచ్చేస్తున్నారు. భారీ వర్షాల సమయంలో గెడ్డలు పొంగి పొర్లి చుట్టుపక్కల స్థలాలు కోతకు గురయ్యే ప్రమాదముంది. హైదరాబాద్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు ఇటువంటి విపత్తులే చోటుచేసుకున్నాయి. కానీ ఇక్కడ బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధి అయిన గోవిందు గెడ్డను ఆనుకునే భారీ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమవుతోంది. -
గ్రేటర్లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ
- నివాస ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా చేస్తున్నారు - అయినా గ్రేటర్ అధికారులు పట్టించుకోవడం లేదు - హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం.. నేడు విచారణ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాస భవన సముదాయాలను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలుగా మారుస్తున్నారని, నివాస ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా మార్చేస్తున్నారని, దీనిపై అధికారులు స్పందించడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నా, రోడ్లను కూరగాయల మార్కెట్లుగా మార్చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ సికింద్రాబాద్, శాంతినగర్‌కు చెందిన పి.సంతోష్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యాన్ని విచారణ జరపనుంది. నగరంలోని బాగ్‌లింగంపల్లి కాలనీలో హౌసింగ్ బోర్డ్ నిర్మించిన గృహ సముదాయాలను పలువురు ఇటీవల కాలంలో అనుమతుల్లేకుండా వాణిజ్య సముదాయాలుగా మార్చేస్తున్నారని పిటిషనర్ తెలిపారు. అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారని వివరించారు. దీనిపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదన్నారు. నల్లకుంటలోని ఇన్నర్ రోడ్డును కూరగాయల మార్కెట్‌గా మార్చేశారని, కుళ్లిన కూరగాయలను రోడ్లపై పడేస్తున్నారని, దీంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా తయారవుతోందని తెలిపారు. అలాగే శివం రోడ్డులోనూ నిబంధనలకు విరుద్ధంగా పలు అక్రమ నిర్మాణాలు వెలిశాయన్నారు. వీటి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తగిన గాలి, వెలుతురు లేక అరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని తెలి పారు. 80 చదరపు గజాల స్థలంలో 4 అంతస్తులతో పాటు పెంట్ హౌస్‌లను నిర్మిస్తున్నారని, గ్రేటర్ పరిధిలోని ప్రతీ కాలనీలోనూ పరిస్థితి ఇలానే ఉందన్నారు. -
ఎమ్మెల్యే జోక్యంతో కూల్చివేత ఆపేశారు
-
ఆస్పత్రినే కబ్జా చేశాడు
15 ఏళ్లుగా అందులోనే నివాసం నెలన్నర క్రితమే కబ్జా ఆస్పత్రి గోడ కూల్చి.. ఇంటి నిర్మాణం బరితెగించిన పశుసంవర్ధక శాఖ అటెండర్ కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గావ్‌లో అక్రమం వైద్యులు మెమోలిచ్చినా పట్టించుకోని వైనం ఉన్నతాధికారుల అండదండలతోనే..? సాక్షి, మంచిర్యాల : అతనో సాధారణ ఉద్యోగి. పశుసంవర్ధక శాఖలో అటెండర్. అదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం ఈజ్గావ్లోని సబ్సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. చెప్పుకోవడానికి అతని పోస్టింగ్ చిన్నదే.. అయినా పెద్ద ఘనకార్యమే చేశాడు. అందరు ఖాళీ స్థలాలు కబ్జా చేస్తే.. అతను ఏకంగా తను విధులు నిర్వర్తించే ఆస్పత్రినే కబ్జా చేసేశాడు. అధికారులేమంటారోనన్న భయం లేకుండానే బరితెగించాడు. 1998లో ఆ ప్రాంతానికి బదిలీపై వచ్చిన అతను పదిహేనేళ్ల నుంచి ఈజ్‌గావ్ సబ్సెంటర్లోనే నివాసముంటున్నాడు. మధ్యలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా.. ఈజ్గావ్లోనే ఉంటూ రాకపోకలు సాగించేవాడు. ఏళ్ల నుంచీ సబ్సెంటర్లోని రెండు గదుల్లో ఉంటున్న అతను ఏకంగా ఆస్పత్రిపైనే కన్నేశాడు. నెలన్నర క్రితమే.. గోడను కూల్చి మరీ ఆస్పత్రిని కుదించాడు. మిగిలిన సగ భాగంలో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇంటి చుట్టూ తడకలు కట్టుకుని.. సున్నం వేసుకున్నాడు. సకల సౌకర్యాలు ఏర్పర్చుకుని దర్జాగా నివాసముంటున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన పైస్థాయి అధికారుల మాటలు బేఖాతర్ చేస్తూ వచ్చాడు. చివరకు కాగజ్‌నగర్ వైద్యుడు విజయ్‌కుమార్ ఇచ్చిన మెమోకూ విలువ లేకుండా చేశాడు. ‘ఎవరి అనుమతితో ఆస్పత్రి గోడను కూల్చావు..? మిగిలిన సబ్సెంటర్లో ఇల్లు నిర్మించుకునే అధికారం నీకెవరిచ్చారు..?’ అని ప్రశ్నించినా పట్టించుకోలేదంటూ ఆ సబ్సెంటర్లో విధులు నిర్వర్తించే జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ మధునమ్మ, కాగజ్‌నగర్ వైద్యుడు విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అటెండర్ చేపట్టిన అక్రమ నిర్మాణంపై గత నెల 12న మధునమ్మ డాక్టర్ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సదరు వైద్యుడు అదే నెల 16న మంచిర్యాల డివిజన్ అసిస్టెంట్ డెరైక్టర్ కుమారస్వామికి ఫిర్యాదు చేశారు. ఏడీ ఆదేశాల మేరకు.. డాక్టర్ విజయ్‌కుమార్ మళ్లీ పూర్తి విచారణ చేపట్టి.. అదే రోజు సదరు అటెండర్‌కు మెమో జారీ చేశారు. గత నెల 18న ఏడీ కుమారస్వామికి విచారణ నివేదిక అందజేశారు. అదే రోజు ఏడీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డెరైక్టర్ ప్రేమ్‌దాస్‌కు పూర్తి వివరాలతో కూడిన నివేదిక చేరింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. మళ్లీ సమగ్ర విచారణ చేపట్టి.. వివరాలతో నివేదిక ఇవ్వాలని జేడీ కార్యాలయం నుంచి ఏడీ కుమారస్వామికి సమాచారం అందింది. ఏడీ కుమారస్వామి.. స్వయంగా ఈజ్‌గావ్ వెళ్లి విచారణ చేపట్టారు. ఆగస్టు 2న జేడీ కార్యాలయానికి సమగ్ర విచారణ నివేదిక అందజేశారు. విచారణ నివేదిక చేరి ఇరవై రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు అక్రమార్క అటెండర్‌పై చర్యలు తీసుకోకపోవడం అదే శాఖలో అనుమానాలకు తావిస్తోంది. పశుసంవర్ధక శాఖ జిల్లా కార్యాలయంలో అతనికి పలుకుబడి ఉండడంతోనే అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పదిహేనేళ్ల నుంచీ ఇక్కడే మకాం.. 1975లో ఈజ్‌గావ్‌లో పశుసంవర్ధక శాఖ సబ్‌సెంటర్ నిర్మాణానికి 2 గుంటల స్థలం అక్కడి గ్రామ పంచాయతీ ఇచ్చింది. ఆ స్థలంలో మొత్తం నాలుగు గదుల నిర్మాణం చేపట్టి.. పశుసంవర్ధక శాఖ సబ్‌సెంటర్ కొనసాగిస్తున్నారు. అయితే.. సబ్సెంటర్కు అప్పట్లో రెండు గదులే ఎక్కువవ డంతో.. మిగిలిన రెండు గదులు కార్యాలయ అటెండర్‌కు కేటాయించారు. ఇదే క్రమంలో 1998 నుంచి సదరు అటెండర్ అందులో ఉంటున్నాడు. మధ్యలో బదిలీ అయినప్పుడు ఈజ్‌గావ్ నుంచి రాకపోకలు సాగించేవాడు. ఆరేళ్ల క్రితం ఈజ్‌గావ్‌లో బాధ్యతలు చేపట్టిన అతను అప్పట్నుంచీ క్రమంగా ఇంట్లో వసతులు సమకూర్చుకున్నాడు. చివరకు నెలన్నర క్రితమే ఆస్పత్రి గోడను కూల్చి మధ్యలో మరో గోడను నిర్మించే శాడు. తర్వాత మిగిలిన సగం భాగంలో ఇంటి ప్రహరిని నిర్మించుకున్నాడు. చర్యలు తీసుకుంటాం.. ఈజ్‌గావ్ సబ్సెంటర్లో కొంత భాగాన్ని అందులో పనిచేసే అటెండరే కబ్జా చేశాడ ని నాకు ఫిర్యాదు అందింది. మంచిర్యాల జేడీతో విచారణ చేపట్టాం. నాకు నివేదిక అందింది. అటెండర్‌పై చర్యలు తీసుకునే విషయంలో ఇంకా సమయం ఉంది. ఆలస్యమైనా చర్యలు తీసుకుంటాం. - ప్రేమ్‌దాస్, జాయింట్ డెరైక్టర్, పశుసంవర్ధక శాఖ -
ఎమ్మెల్యే వివేకానంద్ భవనాలు సీజ్..
కుత్బుల్లాపూర్: హైకోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో ఎట్టకేలకు ఎమ్మెల్యే వివేకానంద్ అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్ఎంసీ నార్త్ జోన్ అధికారులు శనివారం సీజ్ చేశారు. భవన నిర్మాణంపై ఎమ్మెల్యే సమీప బంధువు ప్రతాప్ రెండేళ్ల క్రితం కోర్టును ఆశ్రయించగా, సదరు నిర్మాణాన్ని కూల్చి వేయాలని తీర్పునిచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివేకానంద్ గడువు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. దీంతో తిరిగి హైకోర్టులో వాదనల అనంతరం అక్రమంగా నిర్మించిన భవనంలో కొనసాగుతున్న కళాశాల, స్కూళ్లను ఖాళీ చేయాలని, నిర్మాణాలను కూల్చి వేసి ఫోటోలు అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో శనివారం ఉదయం నార్త్ జోన్ సిటీ ప్లానర్ సుజాత, ఏసీపీ సతీష్‌చంద్ర, డిప్యూటీ డిఈఓ ఉషారాణి తదితరులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య భవనాలను సీజ్ చేశారు. గత నెల రోజులుగా స్కూల్, కళాశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నా స్పందించకపోవడంతో సీజ్ చేసినట్లు ఉప కమిషనర్ మమత ‘సాక్షి’కి తెలిపారు. ఎమ్మెల్యే వివేకానంద్ నిర్మించిన అక్రమ భవనం.. కళాశాలను సీజ్ చేసిన అధికారులు.. -
కూలిన అక్రమ నిర్మాణం
ఇద్దరి మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు వివాదాస్పద స్థలంలో అర్ధరాత్రి హడావుడిగా నిర్మాణం హైదరాబాద్: అర్ధరాత్రి అక్రమ నిర్మాణ పనులు చేస్తుండటం.. హడావుడి పనుల కారణంగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని హుస్సేనీఆలం ఖబూతర్‌ఖానాలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. రెండంతస్తుల ఎత్తులో నామమాత్రపు ఆధారంతో అక్రమంగా నిర్మిస్తున్న స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో నందు (26), వెంకటయ్య (40) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పోలీసులు, ఇతర కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ మండలంలోని దావస్‌పల్లి గ్రామానికి చెందిన ఆనంద్ ఆలియాస్ నందు(26)కు భార్య, ఓ బాబు ఉన్నారు. అదే జిల్లా వనపర్తికి చెందిన వెంకటయ్య(40) సైదాబాద్‌లో ఉంటున్నాడు. ఈయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. వీరిద్దరు రెండు నెలలుగా ఖబూతర్‌ఖానాలోని మహేశ్వరి సేవా ట్రస్టు విద్యాలయ భవనం నిర్మాణ పనులకు వెళ్తున్నారు. శుక్రవారం రాత్రి రెండో అంతస్తులో స్లాబ్ వేసేందుకు అంతా పని ప్రారంభించారు. కింది నుంచి 30 అడుగుల ఎత్తులో ఉన్న స్లాబ్‌కు గోవాలు, కట్టెలు, రాడ్లను ఆధారంగా పెట్టి పనులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇనుప చువ్వలు గుచ్చుకొని వెంకటయ్య, నందు అక్కడికక్కడే మృతి చెందారు. జయప్రకాశ్, శివకుమార్ తీవ్రంగా గాయపడగా, మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హుస్సేనీఆలం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంకటయ్య, నందు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. వెంకటయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు: నిర్లక్ష్యంతో స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టిన మహేశ్వరి విద్యాలయ సేవా ట్రస్టు నిర్వాహకుడు శివ కుమార్ బంగ్, బిల్డర్ అమీనుద్దీన్, సైట్ ఇంజనీర్ శివకుమార్, సెంట్రింగ్ వర్కర్ అనంత్ రెడ్డిలపై పోలీసులు 334ఏ, 337 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఇద్దరు అమాయకుల మృతికి కారణమైన మహేశ్వరి సేవా ట్రస్టు ప్రతినిధులపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ దక్షిణ మండలం టౌన్ ప్లానింగ్ అధికారులు హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
షారుఖ్ కు భారీ ఫైన్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కన్నెర్ర జేసింది. బంద్రాలోని తన కలల నివాసం 'మన్నత్' బయట అక్రమ నిర్మాణం చేపట్టడంతో మున్సిపాలిటీ ఆయనపై దాదాపు రూ. రెండు లక్షల జరిమానా విధించింది. వ్యక్తిగత అవసరాల కోసం బహిరంగ స్థలాన్ని ఆక్రమించి.. షారుఖ్ ఈ అక్రమ నిర్మాణాన్ని కట్టారని, దీనిని కూల్చివేయాలని స్వచ్ఛంద కార్యకర్తలు ఉద్యమించారు. వారి నిరసనతో ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ స్పందించి గత ఏడాది ఫిబ్రవరి 6న ఆయనకు నోటీసులు పంపారు. ఈ నోటీసు గడువు అదే ఏడాది ఫిబ్రవరి 15తో ముగిసింది. అయినా షారుఖ్ స్పందించకపోవడంతో బీఎంసీ ఈ నిర్మాణాన్ని కూల్చివేసింది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాన్ని కట్టినందుకు రూ. 1,93,784 జరిమానా చెల్లించాలని షారుఖ్‌కు బీఎంసీ డిమాండ్ నోటీసు పంపింది. ఈ జరిమానా కట్టకపోతే చట్టబద్ధ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
తమిళనాడు తరహాలో చర్యలు
అక్రమ నిర్మాణాలను రిజిస్టర్ చేయకుండా అక్కడ చట్టం ఉంది ♦ ట్రిబ్యునల్ ఏర్పాటునూ పరిశీలిస్తున్నాం ♦ అక్రమ నిర్మాణాలను అణచివేస్తాం ♦ హైకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తమిళనాడు తరహాలో చర్యలు తీసుకునే విషయంపై అధ్యయనం చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అక్రమ నిర్మాణాలను రిజిస్టర్ చేయకుండా తమిళనాడులో చట్టం ఉందని, దానిని ఇక్కడ అమలు చేసేందుకు అవసరమైన చట్ట సవరణను తెచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నామని తెలిపింది. అలాగే అక్రమ నిర్మాణాల విషయంలో దాఖలయ్యే కేసులను విచారించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే విషయాన్నీ పరిశీలిస్తున్నామంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను అణచివేసేందుకు చర్యలు ప్రారంభించామని, నిబంధనలకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలను కూల్చివేస్తున్నామని పేర్కొంది. తమ పొరుగువారు సెట్బ్యాక్లు విడిచిపెట్టకుండా అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో చర్యలు తీసుకునేలా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన జాన్ మహమ్మద్ అలియాస్ షాహాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే తుంచి వేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈమేరకు మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.జి.గోపాల్ కౌంటర్ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ గతంలోనే చట్ట సవరణ తెచ్చామని, దాని కింద ఇప్పటికే 31 కేసులు కూడా నమోదు చేశామన్నారు. అక్రమ లేఔట్లలో జరిగిన నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణాలను రిజిస్టర్ చేయకుండా తమిళనాడులో చట్టం ఉందని, ఆ చట్టాన్ని ఇక్కడ అమలు చేసే విషయమై అధ్యయనం చేస్తున్నామన్నారు. అలాగే పురపాలకశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని గోపాల్ వివరించారు. ఉన్నతస్థాయి పోస్టుల భర్తీ ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, తగిన విధంగా స్పందించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులతో టీమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. -
వెల్లువలా...
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్/బీఆర్ ఎస్‌లకు మహా నగర పరిధిలో అనూహ్య స్పందన లభించింది. క్రమబద్ధీకరణ కు శనివారం వరకు మొత్తం 2.82 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక రుసుంగా రూ.234 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇందులో జీహెచ్ఎంసీకి రూ.118.28 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.116 కోట్లకు పైగా ఆదాయం అందినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. దరఖాస్తులన్నిటినీ పరిష్కరిస్తే జీహెచ్ఎంసీకి సుమారు రూ.1000 కోట్లకు పైగా.. హెచ్ఎండీఏకు రూ.500 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వం 2015 నవంబర్ 2న ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్లను ప్రకటించి.. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 60 రోజులు గడువు ఇచ్చింది. తుది గడువు 2015 డిసెంబర్ 31తో ముగిసింది. ప్రజల అభ్యర్థన మేరకు మరో నెల రోజులు అంటే జనవరి 31వరకు పొడిగించింది. ఆ గడువు కూడా ఆదివారంతో ముగిసిపోతుండటంతో ఆన్లైన్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో 2007-08లో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్/బీపీఎస్‌లను ప్రకటించి... తుది గడువును మూడుసార్లు పొడిగించినా ఇంత స్పందన కనిపించలేదు. అప్పట్లో జీహెచ్ఎంసీకి ఎల్ఆర్ఎస్/బీపీఎస్‌ల కింద 2.5 లక్షలు, హెచ్ఎండీఏకు కేవలం 63 వేల దరఖాస్తులే అందాయి. జీహెచ్ఎంసీకి రూ.868కోట్లు, హెచ్ ఎండీఏకు రూ.200 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు రావడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు అదనపు ఆదాయాన్ని అందిపుచ్చుకొనేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. నేడు పని చేయనున్న సేవా కేంద్రాలు అక్రమ భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఆదివారంతో ముగుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీసు సెంటర్లు, హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలోని ఫెసిలిటేషన్ సెంటర్లు ఆదివారం పని చేస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం7గంటల వరకు ఈ సేవా కేంద్రాలు తెరిచే ఉంటాయన్నారు. దరఖాస్తుదారులు డిమాండ్ డ్రాఫ్టులను వాటిలో అందజేయాలని సూచించారు. 1న స్వీకరిస్తాం: క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు ఆదివారం చివరి రోజైనా ... ఆ రోజులోగా తీసుకొన్న డిమాండ్ డ్రాఫ్టులను ఫిబ్రవరి 1న కూడా స్వీకరిస్తాం. దరఖాస్తుదారులు ఆందోళనకు గురవ్వాల్సిన పనిలేదు. ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఆన్లైన్ ద్వారా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇంట్లో ఉండే మీరు మీ దరఖాస్తు స్టాటస్‌ను ఆన్లైన్ ద్వారా చూసుకోవచ్చు. మా సిబ్బంది ఇన్స్పెక్షన్కు వచ్చే ముందు మీ ఫోన్‌కు రింగ్ చేస్తారు. మీ సమక్షంలోనే కొలతలు తీసుకొని ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తారు. దాంతో ఎంత ఫీజు చెల్లించాలో ఆటోమేటిక్‌గా మీకు సమాచారం వస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లిస్తే అనుమతి పత్రం మీ చేతిలో ఉంటుంది. ఈ విషయంలో ఎవరి ప్రలోభాలకు గురవ్వాల్సిన పనిలేదు. ఆన్లైన్లోనే ప్రాసెస్ అయ్యేలా ఏర్పాట్లు చేశాం. నిర్ణీత వ్యవధిలోగా క్రమబద్ధీకరణ చేసి ఆన్లైన్లోనే ధ్రువపత్రం అందజేస్తాం. క్రమబద్ధీకరణ కోసం హెచ్ఎండీఏకు సుమారు 1.25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిష్కరిస్తే రూ.500 కోట్ల ఆదాయం వస్తుంది. రాబోయే 6 నెలల్లో వీటిని పరిష్కరించేందుకు సిబ్బందిని కార్యోన్ముఖులను చేస్తున్నా. ఫిబ్రవరి 16 నుంచి దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనికోసం అదనంగా సుమారు 70-75మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోబోతున్నాం. - టి.చిరంజీవులు, హెచ్ఎండీఏ కమిషనర్