చారిత్రక కట్టడంపై బాత్‌రూం నిర్మాణం.. నోటీసులు
చారిత్రక కట్టడంపై బాత్‌రూం నిర్మాణం .. నోటీసులు
Published Thu, Sep 14 2017 2:24 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
సాక్షి, ముంబై: అనుమతులు లేకుండా కట్టడం నిర్మిస్తుండటంతో విల్సన్ కళాశాలకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. సరైన వివరణ ఇవ్వని పక్షంలో ఆ కట్టడంను కూల్చివేస్తామని ప్రకటించింది.
సుమారు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న విల్సన్ కళాశాలపై అక్రమ నిర్మాణం నిర్మిస్తుండటం ఆర్టీఐ ఉద్యమకారుడు సంతోష్ దౌండ్కర్ దృష్టికి చేరింది. దీంతో ఆయన బీఎంసీకి ఫిర్యాదు చేయగా, కార్పొరేషన్ కళాశాల యాజమాన్యానికి నోటీసులు పంపించింది. కాలేజీలోని మక్కిచాన్ హాల్ పైన బాత్ రూమ్ నిర్మించేందుకే నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై 24 గంటల్లో నివేదిక కోసం ఆదేశించినప్పటికీ.. కళాశాల నుంచి ఎటువంటి స్పందన లేదని సమాచారం. అనుమతికి సంబంధించిన పేపర్లు చూపించకపోతే తక్షణం ఆ నిర్మాణాన్ని కూల్చేస్తామని బీఎంసీ తెలియజేసింది.
1832 లో గిర్‌గామ్‌లో ఆంగ్లేయుల పాలనలో ఈ కళాశాలను స్థాపించారు. 1889 లో భవన నిర్మాణాన్ని జాన్ అడమ్స్ అనే ఇంజనీర్ రీ డిజైన్ చేయించారు. 2011 లో వారసత్వ కట్టడం గా గ్రేడ్ 3 కేటగిరీలో విల్సన్ కళాశాలను చేర్చారు.
Advertisement
Advertisement