Brihanmumbai Municipal Corporation
-
తీవ్ర వాయుకాలుష్యం : 1,200 బేకరీలకు బీఎంసీ నోటీసులు
దాదర్: పరిశ్రమలు, బేకరీలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బేకరీ బట్టీలలో ఇంధనం, ఎలక్ట్రిక్ లేదా గ్యాస్‌కు బదులుగా కలపను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడటంతో 1,200పైగా బేకరీ యజమానులకు నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ముంబైలో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. దీంతో ముంబైకర్లు వివిధ శ్వాససంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సైట్లు భవన నిర్మాణ కాంట్రాక్టర్లకు బీఎంసీ అధికారులు 18 రకాల సూచనలతో కూడిన నియమావళిని జారీచేసింది. వాటిని కచి్చతంగా పాటించాల్సిందేనని నిర్ధేశించింది. కానీ బేకరీల నిర్వాహకులు నియమాలను బేఖాతరు చేస్తున్నట్లు వెలుగులోకి రావడంతో బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రాణీ (అడ్మిన్) ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన అనేక మంది బిల్డర్లు, కాంట్రాక్టర్లకు నోటీసులు కూడా జారీచేసింది. అదేవిధంగా బేకరీలలో బ్రెడ్లు, కేక్‌లు, బిస్కెట్లు, ఇతర తినుబండారాల తయారీకి కలప వాడుతున్నట్లు తేలడంతో వీటిపై చర్యలు తీసుకుంది. పదిహేను రోజుల క్రితమే హెచ్చరిక... ముంబైలో రెండువేలకుపైగా బేకరీలున్నాయి. వీటిలో రోజుకు దాదాపు 130 కేజీల కలపను వినియోగిస్తున్నారు. వీటినుంచి వెలువడే దట్టమైన పొగవల్ల గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కలప వాడకాన్ని నిలిపివేయాలంటూ బేకరీ యజమానులను గత పదిహేను రోజుల కింద బీఎంసీ హెచ్చరించింది. దీనికి బదులుగా గ్యాస్, ఇంధనం, కరెంటును వినియోగించాలని సూచించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ 1,200పైగా బేకరీల్లో నియమోల్లంఘన జరుగుతున్నట్లు తనిఖీల్లో బయటపడడంతో నోటీసులు జారీచేశారు. నోటీసులకు మాత్రమే పరిమితం... బేకరీల్లో కలపను వినియోగించకూడదని బీఎంసీ 2007లోనే ఆదేశాలు జారీచేసింది. బట్టీలలో కలపకు బదులుగా సీఎన్జీని వినియోగించాలని సూచించింది. ప్రభుత్వాలు మారడంతో బీఎంసీ కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం మానేసింది. ఇదేకాకుండా ముంబైలో ఉన్న అన్ని బేకరీల వివరాలు బీఎంసీ వద్ద లేవు. లైసెన్స్డ్ బేకరీల కన్నా అక్రమంగా నడుపుతున్న బేకరీలే అధికమని తేలింది. ఈ నేపథ్యంలో బీఎంసీ కేవలం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమైందని ఆరోపణలొస్తున్నాయి. దట్టమైన పొగను వెలువరించే బేకరీలతోపాటు జవేరీ బజార్, కాల్బాదేవి, గిర్గావ్ ప్రాంతాల్లో వెండి, బంగారు, గిల్టు నగలు తయారుచేసే ఫ్యాక్టరీలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తారు. నగలు తయారీలో బొగ్గు, రసాయనాల వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో స్ధానికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ అధికారులు బంగారు, వెండి నగలు తయారుచేసే ఫ్యాక్టరీ యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. గాలి నాణ్యత మెరుగు పడేవరకు ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు. -
మహిళ ప్రాణం తీసిన మ్యాన్‌హోల్ గ్రిల్స్ దొంగతనం
మ్యాన్‌హోల్ గ్రిల్స్ (మెటల్స్) దొంగతనం 45 ఏళ్ల విమల్ అనిల్ గైక్వాడ్ ప్రాణం తీసింది. భారీ వర్షాలకు గైక్వాడ్ మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వర్షాల కారణంగా ఏర్పడే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండేలా అధికారులు మ్యాన్‌హోల్స్‌ను మెటల్స్ను అమర్చారు. ఆ మెటల్స్ను అగంతకులు దొంగతనం చేశారు. ముంబైలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు విమల్ అనిల్ గైక్వాడ్ ప్రమాదవ శాత్తూ డ్రైనేజీలో పడి మరణించారు. ఈ ఘటనలో కుటుంబానికి ఆధారమైన తన భార్య మరణానికి కారణమైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి భర్త పోలీసుల్ని ఆశ్రయించారు‘నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నన్ను, నా ఇంటి బాధ్యతల్ని తన చూసుకునేది. ఇంటి బాధ్యతల్ని నా భార్యనే చూసుకునేది. ఆమె మరణంతో మేం సర్వం కోల్పోయాం ’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా తప్పు ఎవరిదైనా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అనిల్ గౌక్వాడ్ ఫిర్యాదుతో పోలీసులు..ఈ దర్ఘుటనలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ శాఖ.. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, మూడు రోజుల్లో నివేదికను కోరింది. నిన్న కురిసిన భారీ వర్షం వల్ల ఆర్థిక రాజధానిలో రైలు పట్టాలు, రోడ్లు నీట మునిగాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది .14 విమానాలు దారి మళ్లించాయి. అయితే వర్షం బీభత్సం సమయంలో గైక్వాడ్ అంధేరీ ఈస్ట్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనం గేట్ నంబర్ 8 సమీపంలో పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు,అగ్నిమాపక దళ సిబ్బంది ఆమెను కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.కాగా, ఈ ఏడాది ముంబైలో వేర్వేరు మ్యాన్‌హోల్‌లో పడిన ఘటనల్లో కనీసం ఏడుగురు మరణించారు. నగరంలో మ్యాన్‌హోల్ మెటల్ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయని, గతేడాది ముంబైలో 791 మ్యాన్‌హోల్ కవర్ దొంగతనాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మరో షాక్.. నోటీసులు జారీ
మహారాష్ట్రలో శివసేన, మాజీ నటి, ఎంపీ నవనీత్ రాణా దంపతుల మధ్య పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శనివారం ఎంపీ నవనీత్ రాణా, మహారాష్ట్రలో ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రాణాకు నోటీసులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఖార్ ప్రాంతంలో నవనీత్ రాణా దంపతులు తమ ఇంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు బీఎంసీ గుర్తించారు. ఈ క్రమంలో వారి ఫ్లాట్ వద్ద అక్రమ నిర్మాణాన్ని ఏడు రోజుల్లో తొలగించాలని బీఎంసీలు అధికారులు నోటీసులు పంపించారు. లేనిపక్షంలో బీఎంసీ చర్యలు తీసుకొని కూల్చివేస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే MMC చట్టంలోని సెక్షన్ 475-A ప్రకారం ఫ్లాట్ యజమానికి జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, మాజీ నటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలు హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరుచగా.. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్‌ను ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. ఇది కూడా చదవండి: ఒమిక్రాన్ కలవరం.. తమిళనాడులో సబ్‌వేరియంట్ బీఏ.4 రెండో కేసు -
దీపావళి తర్వాత శివసేన ప్రక్షాళన
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దీపావళి పండుగ తరువాత పార్టీలో ప్రక్షాళన చేపట్టాలని శివసేన అధిష్టానం భావిస్తోంది. అయితే, మంత్రి పదవుల జోలికి వెళ్లకుండా విభాగ్ ప్రముఖ్, శాఖ ప్రముఖ్, వార్డు ప్రముఖ్‌లను మార్చే అవకాశముంది. ఇదే జరిగితే పాత ముఖాల్లో ఎంతమందికి మళ్లీ అవకాశం లభిస్తుంది, కొత్తగా ఎంతమందికి అవకాశం దక్కనుందనేది తేలాల్సి ఉంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే కనీసం వంద మందికిపైగా కార్పొరేటర్లను గెలిపించుకోవాల్సి ఉంటుంది. దీంతో పార్టీ అభివృద్ధి, ప్రగతి కోసం కృషి చేసే సమర్థులైన పదాధికారులు, కార్యకర్తలకు కీలక పదవీ బాధ్యతలు అప్పగించాలని శివసేన భావిస్తోంది. చదవండి: (ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు) ముంబైలో శివసేనకు 10 మంది విభాగ్ ప్రముఖ్‌లు ఉన్నారు. ఆ తరువాత ఉప విభాగ్ ప్రముఖ్‌లు, శాఖ ప్రముఖ్‌లతో శివసేన పార్టీ కొనసాగుతుంది. ముఖ్యంగా శాఖ ప్రముఖ్‌లే పార్టీకి పునాదిగా ఉంటారు. వీరే ప్రజలకు దగ్గరగా మెలుగుతూ నేరుగా సంప్రదింపులు జరుపుతారు. కానీ విభాగ్ ప్రముఖ్, శాఖ ప్రముఖ్‌ల వ్యవహార శైలి, పనితీరుపై స్థానిక కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో దీపావళి తరువాత విభాగ్ ప్రముఖ్, శాఖ ప్రముఖ్‌లను మార్చాలని శివసేన ఆలోచిస్తోంది. ప్రస్తుతం బీఎంసీలో శివసేనకు 97 మంది కార్పొరేటర్లున్నారు. వారిలో ఆరుగురు కార్పొరేటర్లు ఎమ్మెన్నెస్‌తో తెగతెంపులు చేసుకుని శివసేనలోకి వచ్చారు. ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచి ఆ తరువాత శివసేనలో చేరిన వారు మరో ఇద్దరు కార్పొరేటర్లున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 2019 అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న విభేదాలతో బీజేపీతో శివసేన తెగతెంపులు చేసుకుంది. ఆ తరువాత ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి మహావికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ, కాంగ్రెస్ మాత్రం ఒంటరిపోరుకే మొగ్గు చూపుతోంది. చదవండి: (ధైర్యముంటే ఎదురునిల్చి పోరాడండి: సీఎం ఉద్ధవ్ ఠాక్రే) ఒంటరిగా పోటీచేసి తమ బలమేంటో నిరూపించుకుంటామని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దీంతో బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే శివసేనకు మెజార్టీ రావాలి. అందుకోసం పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. పార్టీకి పునాదిలా ఉంటూ పటిష్టం చేయాల్సింది విభాగ్ ప్రముఖ్, శాఖ ప్రముఖ్‌లే కాబట్టి దమ్మున్న వారినే ఆ పదవుల్లో నియమించాలని శివసేన భావిస్తోంది. ఈ మేరకు దీపావళి తరువాత పార్టీలో ప్రక్షాళన చేయాలని శివసేన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవుల్లో ఇతర పార్టీల నుంచి శివసేనలో చేరిన వారికి అవకాశమివ్వకూడదని నిర్ణయం శివసేన అధినాయకత్వం నిర్ణయించింది. ఏళ్ల తరబడి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన సీనియర్ కార్యకర్తలనే నియమించాలని శివసేన నాయకత్వం భావిస్తోంది. -
స్త్రీలోక సంచారం
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ‘బాంబే మున్సిపల్ కార్పొరేషన్’ (బి.ఎం.సి.)నోటీసులు పంపింది. పశ్చిమ అంధేరి, ఓషివరా ప్రాంతంలోని ఒక వాణిజ్య సముదాయంలో ప్రియాంక పేరు మీద ఉన్న భవనం అక్రమ నిర్మాణమని పేర్కొంటూ వెంటనే దానిని ఖాళీ చేయాలని అందులో అద్దెకు ఉంటున్న వారికి, ప్రియాంకకు కలిపి రెండు వేర్వేరు నోటీసులను బి.ఎం.సి. జారీ చేసింది ::: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వుడు స్థానానికి షెడ్యూల్డ్ తెగకు చెందిన ఒక గోండు మహిళ వేసిన నామినేషన్‌ను బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచి తోసిపుచ్చింది. పంచాయతీ సమితి ఎన్నికల్లో గచ్చిరోలి సబ్ డివిజన్లోని కుర్ఖేదా ఎస్టీ రిజర్వుడు స్థానానికి షహేదా తబుస్సుమ్ అనే అభ్యర్థి పోటీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ఒక పిటిషన్‌పై కోర్టు తీర్పు చెబుతూ, ఆ మహిళ ఒక ముస్లింను వివాహమానందున ఎస్టీ రిజర్వుడు స్థానానికి పోటీ చేసే అర్హతను కోల్పోయారని తీర్పు చెప్పింది. బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సీఎంగా తన పదవిని కోల్పోయి రెండువారాలైనా కాకముందే ఆమె నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) లో తిరుగుబాటు మొదలైంది. పార్టీలో మెహబూబా బంధువుల జోక్యం ఎక్కువయిందని ఆరోపిస్తూ, ఆమె అసమర్థతకు, బంధుప్రీతికి విసుగుచెంది తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన రాజా అన్సారీ, అబిద్ అన్సారీ, మొహ్మద్ అబ్బాస్.. పార్టీ అధ్యక్షస్థానం నుంచి మెహబూబా తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు ::: ట్విట్టర్లో తనను బెదిరించి, అసభ్యంగా దూషించిన వ్యక్తిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నీ పదేళ్ల కూతుర్ని రేప్ చేస్తాను’ అంటూ వచ్చిన ఆ ట్వీట్‌కు ప్రియాంక స్పందిస్తూ.. ‘దేవుడి పేరు మీద ట్విట్టర్ హ్యాండిల్‌ను నడుపుతూ, ఏ మాత్రం సంబంధం లేకుండా నన్ను కోట్ చేస్తూ, నా కూతురిపై అసభ్యకరమైన కామెంట్ చేసిన నిన్ను ఆ శ్రీరాముడు కూడా క్షమించడు’ అని రీట్వీట్ చేశారు ::: యాసిడ్ దాడి కేసులో యావజ్జీవ కారాగారవాసం అనుభవిస్తున్న అనిల్ పాటిల్ అనే నేరస్తుడిని ఎనిమిదేళ్ల ఖైదు అనంతరం బాంబే హైకోర్టు విడుదల చేసింది. కేసు నడుస్తుండగా బాధితురాలిని వివాహం చేసుకున్న అనిల్, తామిద్దరం సామరస్యంగా ఉంటున్నామని, తన చర్మంతో ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తానని, అందుకు అయ్యే ఖర్చును కూడా తనే భరిస్తానని హామీ ఇవ్వడంతో, ఇప్పటివరకు అనుభవించిన శిక్ష చాలునని భావించిన కోర్టు, బాధితురాలి వైపు నుంచి కూడా ఆలోచించి అతడిని విడుదల చేసింది ::: బాలీవుడ్ పూర్వపు నటుడు మిథున్చక్రవర్తి కొడుకు మహాక్షయ్ చక్రవర్తిపైన, మహాక్షయ్ తల్లి యోగితా బాలీ మీద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చెయ్యాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. మహాక్షయ్ తనను బెదిరించి, తనపై అత్యాచారం చేశాడని, అతడి తల్లి కూడా అందుకు సహకరించిందని ఒక వర్ధమాన నటి వేసిన కేసును పరిగణనలోకి తీసుకున్న కోర్టు పోలీసులకు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది ::: తొంభై రెండేళ్ల వయసులోనూ రాచకార్యాలలో, కుటుంబ వేడుకల్లో చురుకుగా పాల్గొంటున్న బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్.. తనను అమితంగా బాధిస్తున్న మోకాళ్ల నొప్పులకు సర్జరీ చేయించుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నారు! ఈ ఏడాది ఆరంభంలో కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని, ఆ విషయం బయటపడకుండా కళ్లద్దాలను ధరిస్తున్న మహారాణి.. ఇప్పుడీ మోకాళ్ల సర్జరీవల్ల తప్పనిసరి అయ్యే విరామంలో రాజప్రాసాదంలో జరిగే ఏ చిన్న శుభకార్యాన్నీ కోల్పోవడానికి సిద్ధంగా లేరని ‘మిర్రర్’ పత్రిక వెల్లడించింది. వలసలకు ఉదారంగా ఆశ్రయం ఇస్తున్న జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ విధానాలకు వ్యతిరేకంగా మంత్రివర్గంలోని సభ్యులు కొందరు రాజీనామా చేయడానికి సిద్ధపడడంతో మెర్కెల్ ప్రభుత్వం దిగివచ్చింది. వలసల్ని సరిహద్దుల్లోనే ఉంచేందుకు శిబిరాలను ఏర్పాటు చేయడానికి అంగీకరించడం ద్వారా మెర్కెల్ ఇప్పటికైతే తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోగలిగారు ::: -
ప్రియాంక చోప్రాకు నోటీసులు
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ నోటీసులు జారీ చేసింది. ప్రియాంకకు సంబంధించిన వాణిజ్య సముదాయంలో అనధికారిక నిర్మాణాలు చేసినందుకు గాను బీఎంసీ రెండు వేరు వేరు నోటీసులు పంపింది. పశ్చిమ అంథేరిలోని ఒషివారా ప్రాంతంలో ప్రియాంక చోప్రాకు ఓ కమర్షియల్ బిల్డింగ్ ఉంది. వాస్తు కోసం ఈ బిల్డింగ్‌కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేసినందుకుగాను ఈ నోటీసులు పంపారు. అదే బిల్డింగ్ లోని బ్యూటీ స్పాకు వచ్చిన వారి ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు, 2013లో ముంబై మున్సిపల్ అధికారుల మంజూరు చేసిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్టుగా గుర్తించారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో చర్చలు తీసుకుంటామని తెలిపారు. -
ప్లాస్టిక్‌పై బ్యాన్‌కు వ్యతిరేకంగా సమ్మె!
సాక్షి, ముంబై : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శనివారం(జూన్ 23) నుంచి ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై కొరడా ఝలిపించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 87 షాపుల నుంచి 3.5 లక్షల రూపాయలు జరిమానా రూపంలో ఖజానాకు జమ అయింది. అయితే బీఎంసీ తీరుతో తమకు నష్టాలు వస్తున్నాయంటూ రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు సిద్ధమైంది. రీటైలర్ వ్యాపారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వీరేశ్ షా మాట్లాడుతూ... ‘ప్లాస్టిక్ నిషేధం వల్ల కూరగాయల వ్యాపారులకు, స్వీట్ షాపు ఓనర్లకు నష్టాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. కూరగాయలు, స్వీట్లు నిల్వ చేయాలన్నా, కస్టమర్లకు అందించాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇలాంటి సీజన్ టైమ్‌లో బీఎంసీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి సీజన్(వర్షాకాలం) అయిపోయేంత వరకైనా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామ’ని వ్యాఖ్యానించారు. పాల వ్యాపారులకు ఉన్నవిధంగానే కూరగాయల వ్యాపారులకు కూడా ప్యాకేజింగ్ విధానానికి అనుమతినివ్వాలని బీఎంసీకి విఙ్ఞప్తి చేశామన్నారు. తమ సమస్యలను వివరిస్తూ బీఎంసీకి లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి హామీ రాలేదని.. అందుకే బుధవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రాండెడ్ వస్తువుల కోసం ఉపయోగించే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే మీరు.. రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడేందుకు చిరు వ్యాపారులకు అనుమతి నిరాకరించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. -
ప్లాస్టిక్‌పై బ్యాన్.. ఒక్కరోజే 3.5 లక్షల రూపాయలు
సాక్షి, ముంబై : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శనివారం(జూన్ 23) నుంచి ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై కొరడా ఝలిపించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 87 షాపుల నుంచి 3.5 లక్షల రూపాయలు జరిమానా రూపంలో ఖజానాకు జమ అయింది. అయితే బీఎంసీ తీరుతో తమకు నష్టాలు వస్తున్నాయంటూ రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు సిద్ధమైంది. రీటైలర్ వ్యాపారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వీరేశ్ షా మాట్లాడుతూ... ‘ప్లాస్టిక్ నిషేధం వల్ల కూరగాయల వ్యాపారులకు, స్వీట్ షాపు ఓనర్లకు నష్టాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. కూరగాయలు, స్వీట్లు నిల్వ చేయాలన్నా, కస్టమర్లకు అందించాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇలాంటి సీజన్ టైమ్‌లో బీఎంసీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి సీజన్(వర్షాకాలం) అయిపోయేంత వరకైనా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామ’ని వ్యాఖ్యానించారు. పాల వ్యాపారులకు ఉన్నవిధంగానే కూరగాయల వ్యాపారులకు కూడా ప్యాకేజింగ్ విధానానికి అనుమతినివ్వాలని బీఎంసీకి విఙ్ఞప్తి చేశామన్నారు. తమ సమస్యలను వివరిస్తూ బీఎంసీకి లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి హామీ రాలేదని.. అందుకే బుధవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రాండెడ్ వస్తువుల కోసం ఉపయోగించే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే మీరు.. రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడేందుకు చిరు వ్యాపారులకు అనుమతి నిరాకరించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. -
భారీ వర్షాలు : శని, ఆదివారాలు సెలవులు రద్దు
ముంబై : ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గురువారం ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం కూడా స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని నగరవాసులను వాతావరణ శాఖ హెచ్చరించింది. పుణేలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. ఈ హెచ్చరికతో బొంబై మున్సిపల్ కార్పొరేషన్ తన ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు రద్దు చేసింది. ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు పడే ప్రజలకు సేవలందించాలని ఆదేశాలు జారీచేసింది. అంతేకాక అత్యవసర సమయంలో తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానిక వాతావరణ కేంద్ర ఇచ్చే వెదర్ అప్డేట్లను ఎప్పడికప్పుడూ తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు అరేబియా సముద్రంలోని పలుచోట్ల వేటకు వెళ్లవద్దని చెప్పింది. కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మరోవైపు కుండపోతగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ముంబైకి ఎయిర్‌లైన్ సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. లండన్ నుంచి ముంబై వచ్చే జెట్‌ఎయిర్‌వేస్ విమానాన్ని కూడా అహ్మదాబాద్ విమానశ్రయానికి తరలించారు. ముందస్తుగా వచ్చిన ఈ రుతుపవనాలతో థానే, పాల్గఢ్, రాయ్‌ఘడ్, రత్నగిరి ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో, భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. అత్యవసర సమయంలో ముంబైవాసులు 1916కు, ముంబై బయటివారు 1077కు ఫోన్ చేయవచ్చని బీఎంసీ తెలిపింది. సెంట్రల్ అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలు, గోవా, మరిన్ని కర్ణాటక, రాయమలసీమ ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి. -
అక్రమకట్టడాలపై బీఎంసీ ఉక్కుపాదం
ముంబై : భారీ అగ్ని ప్రమాదం జరిగిన అనంతరం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ముంబైలోని లోయర్‌పరేల్ ప్రాంతంలోని కమలామిల్స్ కాంపౌండ్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలపై దృష్టిసారించింది. బీఎంసీ అధికారులు శనివారం ఉదయం నుంచి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించారు. రెండు రెస్టారెంట్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశామని బీఎంసీ ఉన్నతాధికారులు తెలిపారు. రైలు బోగీలా కనిపించేలా నిర్మించిన ప్రముఖ రెస్టారెంట్ ప్రవాస్లోని కొన్ని కట్టడాలను కూల్చివేశారు. అంధేరీలోని మరికొన్ని రెస్టారెంట్లపైన కూడా చర్యలకు ఆదేశించినట్టు అధికారులు చెప్పారు. లోయర్ పరేల్‌లోని కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ఓ భవనం పై అంతస్తు రూఫ్‌టాప్‌లో 1 అబవ్ అనే పబ్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఖుష్బూ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భవనం మొత్తంమీద సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, మంటలను ఆర్పే పరికరాలు లేకపోవటంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగినట్టు తెలుస్తోంది. దీనికి తోడు.. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న పబ్బుల నిర్వాహకులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. కిందకు వెళ్లే అత్యవసరమార్గాలన్నీ మూసే ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మరో మార్గంలో కొందరిని తరలించి ఉండకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. అటు ఇలాంటి పబ్బులపై కఠినమైన చర్యలు తీసుకోవటంలో బీఎంసీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 1 అబవ్ పబ్‌కు మూడుసార్లు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. అధికారులకు మామూళ్లు ముడుతున్నందునే వీరిపై చర్యలు తీసుకోలేదని ముంబై వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తీవ్ర విమర్శలు.. దూకుడు చూపిస్తున్న బీఎంసీ
సాక్షి, ముంబై : 14 మంది ప్రాణాలు బలితీసుకున్న ఘోర అగ్ని ప్రమాదం తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో కదలిక వచ్చింది. అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడే కూల్చేయటం ప్రారంభించింది. శనివారం ఉదయం లోవర్ పరెల్‌లోని రఘువంశీ మిల్ కాంపౌండ్‌లోని కట్టడాలను సిబ్బంది కూల్చేస్తున్నారు. కమలా మిల్స్ కాంపౌండ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఈ డ్రైవ్ కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ కట్టడాన్ని వదిలే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. 11 మంది మహిళలతోసహా మొత్తం 14 మంది ప్రాణాలు బలితీసుకున్న కమలా మిల్స్ కాంపౌండ్ ఘటన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం. బీఎంసీపై తీవ్ర విమర్శలు వినిపించాయి. దీంతో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఐదుగురు బీఎంసీ అధికారులపై వేటు వేశారు. అంతేకాదు పబ్ యజమానితోపాటు వారిపైనా కేసు నమోదైనట్లు ప్రకటించారు. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్న అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కమలా మిల్స్ కాంపౌండ్ యాజమాని మరో చోట కూడా ఇదే రీతిలో భవనం నిర్మించినట్లు తేలింది. దక్షిణ ముంబై జావేరీ బజార్లో ధన్జీ వీధిలోని 67వ నంబర్ భవనం కూడా అక్రమ నిర్మాణం అని ఓ జాతీయ మీడియా సంస్థ పరిశోధనలో వెల్లడైంది. దీంతో ఆ భవనాన్ని కూడా కూల్చేందుకు బీఎంసీ రెడీ అయిపోయింది. బతుకులు బుగ్గిపాలు -
మెగాస్టార్‌కు షాక్..
సాక్షి, ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాల విషయంలో ఆయనతోపాటు ఏడుగురికి నోటీసులు జారీచేసింది. తూర్పు గోరేగావ్‌లోని ఫిలింసిటీకి సమీపంలో అమితాబ్ బచ్చన్‌తోపాటు పలువురు బాలీవుడ్ నిర్మాతలకు విలావసంతమైన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలకు సంబంధించి పలు అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏమేరకు వచ్చిందో తెలుపాలంటూ సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గోలి బీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్‌తోపాటు రాజ్‌కుమార్ హిరానీ, ఒబేరాయ్ రియాల్టీ, పంజజ్ బాలాజీ, సంజయ్ వ్యాస్, హరేశ్ ఖండెల్వాల్, హరేశ్ జగ్తాని తదితరులకు బీఎంసీ నోటీసులు జారీచేసింది. గోరేగావ్‌లో తమ విలాసవంతమైన భవనాల కోసం బీఎంసీకి సమర్పించిన ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇలా అక్రమ నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం కావడంతో బిగ్ బీతోపాటు ఇతర బాలీవుడ్ పెద్దలకు నోటీసులు అందాయని హక్కుల కార్యకర్త అనిల్ తెలిపారు. -
చారిత్రక కట్టడంపై బాత్రూం నిర్మాణం.. నోటీసులు
సాక్షి, ముంబై: అనుమతులు లేకుండా కట్టడం నిర్మిస్తుండటంతో విల్సన్ కళాశాలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. సరైన వివరణ ఇవ్వని పక్షంలో ఆ కట్టడంను కూల్చివేస్తామని ప్రకటించింది. సుమారు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న విల్సన్ కళాశాలపై అక్రమ నిర్మాణం నిర్మిస్తుండటం ఆర్టీఐ ఉద్యమకారుడు సంతోష్ దౌండ్కర్ దృష్టికి చేరింది. దీంతో ఆయన బీఎంసీకి ఫిర్యాదు చేయగా, కార్పొరేషన్ కళాశాల యాజమాన్యానికి నోటీసులు పంపించింది. కాలేజీలోని మక్కిచాన్ హాల్ పైన బాత్ రూమ్ నిర్మించేందుకే నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై 24 గంటల్లో నివేదిక కోసం ఆదేశించినప్పటికీ.. కళాశాల నుంచి ఎటువంటి స్పందన లేదని సమాచారం. అనుమతికి సంబంధించిన పేపర్లు చూపించకపోతే తక్షణం ఆ నిర్మాణాన్ని కూల్చేస్తామని బీఎంసీ తెలియజేసింది. 1832 లో గిర్గామ్లో ఆంగ్లేయుల పాలనలో ఈ కళాశాలను స్థాపించారు. 1889 లో భవన నిర్మాణాన్ని జాన్ అడమ్స్ అనే ఇంజనీర్ రీ డిజైన్ చేయించారు. 2011 లో వారసత్వ కట్టడం గా గ్రేడ్ 3 కేటగిరీలో విల్సన్ కళాశాలను చేర్చారు. -
'నేను బతికే ఉన్నా.. వచ్చి కాపాడండి..!'
సాక్షి, ముంబై: ముంబై మహా నగరంలో 117ఏళ్ల పాత భవనం కూలి 34 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఓ హృదయ విదాకర సంఘటన చోటుచేసుకుంది. శిథిలాల్లో చిక్కుకున్న ఓవ్యక్తి సహాయం కోసం ఆర్తనాదం చేశాడు. చివరి ఆ ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. వివరాల్లోకి వెళ్తే జాఫర్ రజ్వీ అనే వ్యక్తి కుప్పకూలిన భవనం శిథిలాల్లో చిక్కుకుపోయాడు. సహాయం కోసం ఆర్తనాదం చేశాడు. తన దగ్గర ఉన్న ఫోన్లో అత్యవసర సేవ ద్వారా బంధువులకు సందేశం అందించాడు. తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానని వచ్చి కాపాడాలని వేడుకున్నాడు. సమాచారం అందుకున్న బంధువులు శిథిలాల నుంచి స్పృహ తప్పి పడిపోయి ఉన్న జఫ్ఫార్ రజ్వీని బయటకు తీసి దగ్గరలోని జేజే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రజ్వీ మృతి చెందాడని డాక్టర్లు ప్రకటించారు. రజ్వీ ఒక్కడే కాదు తనభార్య రేష్మాన్, ఇద్దరు పిల్లలతో సహా కుటుంబం మొత్తం ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. జఫ్పార్ బంధువు సయ్యద్ సల్మాన్ రజ్వీ మాట్లాడుతూ, తనను కలవడానికి వస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పాడని అంతలోనే ప్రమాదం జరిగిందని సమాచారం అందిన్నాడు. జఫ్ఫార్ నుంచి మెస్సేజ్ వచ్చింది. బదులిద్దామంటే జాఫర్ నుండి ఆ తరువాత కమ్యూనికేషన్ లేడన్నాడు. శిథిలాల నుండి వెలికితీసే సమయానికి జాఫర్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, దురదృష్టవశాత్తూ జాఫర్‌ను కాపాడుకోలేకపోయం అని సల్మాన్ ఆవేదన చెందాడు. -
ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం.
-
ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం
సాక్షి, ముంబై : ముంబైలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. జేజే నగర్ సమీపంలోని పక్‌మెడియా వీధిలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ పదిమంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. కాగా శిథిలాల కింద మరో 20మంది వరకూ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. భవనం కూలిన సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం, అగ్నిమాపక సిబ్బందితో పాటు రెస్క్యూ టీమ్ కూడా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ 29మందిని శిథిలాల నుంచి వెలికి తీసి, చికిత్స నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని డీసీపీ మనోజ్ శర్మ తెలిపారు. కాగా వర్షాకాల సీజన్ ప్రారంభం అయిన దృష్ట్యా నగరంలో 971 భవనాలు ఏ క్షణంలో అయినా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎంసీ (బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్) గుర్తించింది. మహారాష్ట్రలో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాలతో పాటు వరదలతో పదిమంది మరణించారు. కుండపోత వర్షాలతో కుదేలైన ముంబై ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు బాంబే ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు దీపక్ ఆమ్రపుర్కర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఎల్పైన్స్టోన్ రోడ్డు సమీపంలో ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. ఆయన మృతదేహం ఈరోజు ఉదయం లభ్యమైంది. -
ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం
-
ముంబై వరదలు ఎందుకు వచ్చాయి?
-
ముంబై వరదలు ఎందుకు వచ్చాయి?
సాక్షి, ముంబై: భారీగా వర్షం పడితే నగర వీధులు కుంటలు, చెరవులు అవడం, పౌర జీవితం అస్తవ్యస్తం అవడం అందరికి అనుభవమే. ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడల్లా నెపాన్ని ప్రకతిపైకి నెట్టేయడం పాలకుల పని. అది హైదరాబాదైనా, ముంబై అయినా పెద్ద తేడా ఉండదు. కాకపోతే చిన్న చినుకుకే హైదరాబాద్ వీధులు కోనేరు అవుతాయి. కుండపోత వర్షాలకు ముంబై వీధులు చెరువులవుతాయి. ముంబై నగరంలో మంగళవారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 288 మిల్లీమీటర్ల వర్షం కురియడంతో ప్రాణ నష్టం పెద్దగా జరుగకపోయినా నగరంలోని పౌర జీవితం అస్తవ్యస్తం అయింది. ఇందుకు బాధ్యత పూర్తిగా స్థానిక మున్సిపాలిటీ, పాలకులదే. 2005, జూలై 26వ తేదీన 24 గంటల్లో 944 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవడంతో ముంబై నగరం చిగురుటాకులా వణికిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. పక్కనే సముద్రం, నైసర్గిక స్వరూపం కారణంగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని పాలకులకు తెల్సిందే. అందుకనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 1985లో బ్రిటిష్ ప్రముఖ కన్సల్టెంట్ వాట్సన్ హాక్షీని పిలిపించి గంటకు 50 మిల్లీ మీటర్ల వర్షం పడినా తట్టుకునేలా పటిష్టమైన నాలా వ్యవస్థకు ప్రణాళికను రూపొందించాలని కోరింది. దాన్ని అప్పుడు 'బృహముంబై స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ రిపోర్ట్' గా వ్యవహరించారు. 'బృమ్స్టావాడ్' అని ముద్దుగా షార్ట్ ఫామ్‌లో కూడా పిలుచుకున్నారు. అయితే అధికారులు సకాలంలో పని జరిగేలా చూడకపోవడంతో ఆ కన్సల్టెంట్ తన ప్రణాళికను రూపొందించి ఇవ్వడానికి ఎనిమిది ఏళ్లు పట్టింది. దాన్ని అరకొరగా అమలు చేయడానికి మున్సిపల్ పాలకులను 12 ఏళ్లు పట్టింది. ఫలితంగా 2005లో నగరాన్ని వరదలు మళ్లీ ముంచెత్తాయి. 2005 వరదల అనుభవంతో మున్సిపల్ రిటైర్డ్ ఇంజనీర్లతో స్థానిక మున్సిపాలిటీ 'ముంబై వికాస్ సమితి'ని ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటర్ డ్రైనేజీ వ్యవస్థను మెరగుపర్చేందుకు మరో ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆదేశించింది. ఆ సమితి నగరంలో వర్షాలు పడే 121 ప్రాంతాలను గుర్తించింది. అందుకనుగుణంగా ఓ ప్రణాళికను రూపొందించింది. దాన్ని అమలు చేసేందుకు 616 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసింది. వాటిలో 260 కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించి చిన్న చిన్న పనులనే స్థానిక మున్సిపాలిటీ పాలకులు అమలు చేశారు. వాటర్ పింపింగ్ స్టేషన్లను నిర్మించడం, రైల్వే కల్పర్ట్లను ఏర్పాటు చేయడం, కొత్తగా ఫ్లడ్ గేట్లను ఏర్పాటు చేయడం, పాత నల్లాలను మరింత లోతుగా, వెడల్పుగా పునరుద్ధరించడం లాంటి పనుల జోలికి వెళ్లలేదు. మీథి నది ఆక్రమణల తొలగింపునకు ప్రయత్నించలేదు. ముంబైకి సహజ సిద్ధమైన పలు నదులు, కాల్వలు ఉండడం వల్ల వరదల నుంచి త్వరగా కోలుకోగలుగుతుంది. లేకపోతే ప్రాణ, ఆస్తి నష్టాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఏటా 30వేల కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్ ఉండే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వరద సహాయక చర్యల కింద 200, 300 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది గానీ, వరదలను నివారించేందుకు ముందుగా ఖర్చు పెట్టడానికి మాత్రం ముందుకు రాదు. -
ముంబయిలో కుప్పకూలిన భవనం
-
ముంబయిలో విషాదం.. కుప్పకూలిన భవనం
ముంబయి: ఐదు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఏడుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో్ 40 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన ముంబయి సబర్బన్ లోని ఘట్కోపర్లో మంగళవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు వ్యక్తులను ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భవనం కుప్పకూలిన ఘటనపై విచారణకు ముంబయి మునిసిపల్ కమిషనర్ అజయ్ మెహతా అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సూచించారు. ఘట్కోపర్ లోని దామోదర్ పార్క్ ఏరియాలో అకస్మాత్తుగా భవనం కూలినట్లు తమకు సమాచారం అందిందని ఓ అధికారి పీఎస్ రహంగ్‌దాలే చెప్పారు. ఎనిమిది ఫైరింజన్లు, అంబులెన్స్ తో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు బీఎంసీ అధికారులు సహయాక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాత్రి 9 గంటల సమయంలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
గేయం రేపిన దుమారం
విశ్లేషణ బీఎంసీ సొంత నివేదికలే దాని నిర్వహణపై ఏ ప్రభావమూ చూపనప్పుడు.. మాలిష్కా అధికార వ్యవస్థను చికాకుపరచడం ఎందుకు? అనేది ఆసక్తికరంగా మారింది. సామాజిక మాధ్యమాలకే ఎక్కువ విశ్వసనీయత ఉండటమే కారణమా? ముంబై గతుకుల రోడ్లు ఇప్పటికే అప్రతిష్టాకరంగా ప్రసిద్ధి చెందాయి. వాటి వార్తలు ఏటేటా, ప్రతి వానాకాలం వార్తాపత్రికలను, టెలి విజన్ తెరలను ముంచెత్తుతున్నాయి. వానలు పడటానికి ముందే రోడ్ల పరిస్థితిని చక్కదిద్దేస్తామని నగర పాలక సంస్థ వాగ్దానాలు చేస్తూనే ఉంటుంది. అది ఆ పని చేయగలగడం మాత్రం అరుదు. తొలి వానలు పడీ పడటంతోనే రోడ్లు చంద్ర బిలాలను తలపింపజేస్తుం టాయి. రోడ్ల మీది గుంతలన్నిటినీ సక్రమంగా పూడ్చి వేయాలంటూ హైకోర్టు గతంలో కొన్ని సందర్భాల్లో నగర పాలక సంస్థకు మొట్టికాయలు వేసి, అందుకు గడువును కూడా విధించింది. కనీసం ఒక ఏడాదైనా మనగలిగేపాటి నాణ్యతగల రోడ్లకు హామీని కల్పిం చేలా అది సైతం నగర ప్రభుత్వాన్ని మేల్కొలపలేకపోయింది. ప్రతి ఏటా రోడ్ల మీద బిలాలు తిరిగి ప్రత్యక్షమౌతూనే ఉంటాయి. రోడ్ల పనులను చేపట్టడంలో జరుగుతున్న దగానే ఈ దుస్థితికి అసలు కారణమనేది స్పష్టమే. గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఒక స్విస్ కంపెనీని కన్సల్టెంటుగా పెట్టుకుని జరిపించిన దానితో సహా అంతర్గత దర్యాప్తులన్నీ... రోడ్లు వేయడానికి వాడిన వస్తు సామగ్రి నాణ్యత అధ్వానమైనదని, రోడ్లు వేసే పని అధ్వానంగా జరిగిందని తేల్చి చెప్పాయి. కాబట్టి ఇందులో అవినీతి చోటుచేసుకున్నదంటే పౌరులు ఆశ్చ ర్యపోరు. పైగా, దగాకోరుతనం నేడు సర్వసాధారణమేనని చెబుతారు. అయినాగానీ, గతవారం మాలిష్కా మెండోన్సా ఆలపించిన ఓ ర్యాప్ గీతం ముంబై నగర ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న పార్టీ నాయకులకు మంట పుట్టించగలిగింది. దాదాపు పన్నెం డేళ్లుగా రేడియో జాకీ(ఆర్జే)గా పనిచేస్తున్న మాలిష్కా విడుదల చేసిన ఆ మరాఠీ వెక్కిరింత ర్యాప్ వెంటనే విస్తృతమైన ప్రాచుర్యాన్ని పొందింది. శివసేన యువ విభాగం ఆ ఆర్జేకు వ్యతిరేకంగా రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేయాలని నగర కమిషనర్‌ను కోరింది. దానిపై ఆయన ఇంకా ప్రతిస్పందించలేదుగానీ, ఆ మరుసటి రోజునే నగర పాలక సంస్థ ఇన్స్పెక్టర్లు ఆమె ఇంట్లోని కొన్ని చోట్ల ఏడెస్ దోమలు పుట్టిపెరిగే స్థానాలున్నాయని కనిపెట్టారు. అది డెంగ్యూను వ్యాపి ంపజేసే జాతి దోమ. నగర పాలక సంస్థ ఆమెకు నోటీసును జారీచేసింది. ఇది, ప్రజల భాగస్వామ్యానికి వ్యతి రేకంగా దాఖలు చేసిన దావా ( ఔఅ్క్క) (చెంబదెబ్బ) అని పౌర సమాజం భావిస్తోంది. పౌర పాలక సంస్థ అంటున్నట్టుగా ఇది యాదృచ్ఛికమే అనుకున్నా, ఈ నోటీసును జారీ చేసిన సమయం నిజంగానే అనుమానాన్ని రేకెత్తించేది. అయినా ఆమె ఒక్కరిపైనా ఎందు కు? నగర శివార్లకే రాణిగా ఒకప్పుడు వెలుగొందిన సంపన్న ప్రాంతం బాంద్రాలోని ఆమె నివాసంలో అలాంటి దోమలు పుట్టిపెరిగే స్థావరాలుండవచ్చనే నిర్ధారణకు అసలు వారు ఎలా వచ్చారు? ఫిర్యాదులేమైనా వచ్చాయా? నగర పాలక సంస్థ ప్రదర్శించిన ఈ జాగరూకతకు–ఇదే గనుక జాగరూకత అయితే–దాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ, సదరు ఆర్జే నగరపాలక సంస్థ ప్రతిష్టకు భంగం కలుగజేశారని, అహోరాత్రాలు పనిచేస్తున్న ఆ సంస్థ కార్మికులను అవమానించిందని శివసేన ఆరోపిస్తోంది. అది నిజం కూడా కావచ్చు. కానీ ముంబైలోని ఏ పౌరుడినైనా అడగండి, అది సమర్థవంతంగా కృషి చేస్తున్నదని మాత్రం అనరు. మాలిష్కా మెండోన్సా ర్యాప్ మొదట ఒక ఎఫ్ఎమ్ రేడియోలో ప్రసారమైంది, ఆ తర్వాత ఆ వీడియో యూట్యూబ్‌కు చేరింది. ఒకటిన్నర నిమిషం కూడా లేని అది ఎంత గొప్ప ప్రభావాన్ని కలిగించింది! ‘‘నమ్మకం లేదా బీఎంసీపై మీకు?’’ అంటూ మొదలయ్యే ఆ ర్యాప్, గుంతలు పడ్డ రోడ్లు, తత్పర్యవసానమైన ట్రాఫిక్ సమస్యలు, నగర పాలక సంస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోవడాన్ని ఏకరువు పెడుతుంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలన్నీ శివసేన వైఖరిని వాక్స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలంటూ విరుచుకుపడ్డ మాట నిజమే. శివసేన నేత ఒకరు టీవీ తెరపై నుంచి అదే బాణీలో ‘‘నోరు ముయ్యకపోతే నువ్వు అయిపోతుంది రభస’’ అని ఆలపించారు. దీనికి జంకని మాలిష్కా, తన బుర్రలో మరో ఆరు ర్యాప్‌లు ఉన్నాయన్నారు. ముంబై పౌర పాలనా సంస్థ స్వయంగా జరి పించిన లోతైన పరిశోధనల నివేదికలే దాని నిర్వహణా తీరుపై ఎలాంటి ప్రభావమూ చూపనప్పుడు.. ఈ ర్యాప్ గాయని అధికార రాజకీయ వ్యవస్థను చికాకుపరచడం ఎందుకు? అనేది ప్రధాన వార్తా పత్రికలకు, చానళ్లకు ఆసక్తికరమైన అంశంగా మారింది. పక్షపాతంతో వక్రీకరించడానికి అవకాశమున్న సామాజిక మాధ్యమాలకే పౌరుల్లో ఎక్కువ విశ్వసనీయత ఉండటం వల్లనా? ఇప్పటికే మరో రెండు వీడియోలు వెలుగుచూశాయి. వాటిలో ఒకటి అదే బాణీలో ‘‘ఆర్జేపై నమ్మకం లేదా మీకు?’’ అంటూ మొదలై పౌర పాలక సంస్థను పట్టి పీడిస్తున్న మరింత తీవ్ర రుగ్మతలను... ఇక్కడి వాటిని గురించే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలన్నిటి గురించి ప్రస్తావిస్తుంది. ఇçప్పుడే ఒక పౌరుడు ‘‘టీ సముద్రం లాంటి’’ ముదురు గోధుమరంగు నీళ్లతో ఉన్న గుంతలను చూపిస్తూ ‘‘వచ్చి కాస్త తీనుకుపోండి. దోమల్ని చంపేస్తుంది’’ అంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
బాలీవుడ్ నటుడి బంగ్లా కూల్చివేత
ముంబయి: బాలీవుడ్ నటుడికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) భారీ షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణ ఆరోపణలతో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' ఫేం అర్షద్ వార్సీ బంగ్లాను కూల్చి వేసింది. అక్రమంగా అదనపు నిర్మాణాలను చేపట్టినందుకుగాను బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్పొరేషన్ నోటీసులు స్పందించకపోవడంతో వెర్సోవాలోని ఆయన ఇంటిలోని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసింది. సుమారు నాలుగు సంవత్సరాల క్రితమే ఈ కేసు బీఎంసీ దృష్టిలో ఉంది. కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకూ వాయిదాపడింది. ఇటీవల అర్షద్ వార్సీ తెచ్చుకున్న స్టే ఆర్డర్‌ను కోర్టు ఎత్తివేసింది. దీంతో ఎయిర్ ఇండియా కో-ఆపరేటివ్ సొసైటీ (శాంతినికేతన్) లో బంగళా నెంబరు 10 ను కూల్చి వేస్తామంటూ కార్పొరేషన్ శనివారంనోటీసులు జారీ చేసింది. రెండవ అంతస్తులో (1,300 చదరపు అడుగుల) అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలని లేదంటే తొలగిస్తామని హెచ్చరించింది. దీనికి వార్సీకి 24 గంటల సమయం కూడా ఇచ్చింది. అయితే నటుడు నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం, ఇంటికి తాళం వేసివుండటంతో సోమవారం పాక్షిక కూల్చివేతను చేపట్టినట్టు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. దీనిపై అర్షద్‌కు, ఆయన భార్యకు మరోసారి నోటీసులు ఇస్తామన్నారు. మున్సిపల్ అధికారుల అనుమతికి సంబంధించిన పత్రాలకోసం తిరిగి నోటీసులు పంపిన అనంతరం అక్రమ అంతస్తును తొలగిస్తామని వార్డ్ అధికారి ప్రశాంత్ గైక్వాడ్ తెలిపారు. అటు ఈ పరిణామాలను నటుడు అర్షద్ దృవీకరించారు. కాగా 2012లో ఎయిర్ ఇండియా మాజీ ఉద్యోగినుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేశారు అర్షద్. అక్రమ నిర్మాణాలు చేపట్టాడని ఆరోపిస్తూ సొసైటీ సభ్యులు బీఎంసీకి ఫిర్యాదు చేయడంతో వివాదం రేగింది. దీంతో 2013లో బీఎంసీ ఈనిర్మాణాన్ని తొలగించాలని భావించినప్పటికీ కోర్టు స్టే ఇవ్వడంతో నిలిపివేశారు. ఇటీవల స్టే ఎత్తివేయడంతో రంగంలోకి దిగిన బీఎంసీ ఈ చర్య చేపట్టింది. ఇతరులు అనేకమంది ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారన్న ఆరోపణ నేపథ్యంలో ఇతర బంగళాలను కూడా బీఎంసీ పరిశీలించింది. -
అనుష్కకు నోటీసులు..‘తప్పు చేయలేదు’
ముంబయి: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మకు బృహణ్ ముంబయి కార్పొరేషన్ నోటీసులు పంపించింది. నలుగురు నడిచే దారిలో తన ఇంటికోసం ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ ఏర్పాటుచేయడం, అది కూడా ముందస్తు అనుమతి లేకుండా దానిని పెట్టడంతో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే, అనుష్క శర్మ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. సుబర్బన్ వార్సోవా ప్రాంతంలో బద్రినాథ్ టవర్ హౌసింగ్ సొసైటీలోని 20వ అంతస్తులో అనుష్క శర్మ ఉంటోంది. అయితే, తన ఫ్లాట్కోసం నలుగురు నడిచే మార్గంలో ఎలక్ట్రిక్ బాక్స్ ఏర్పాటుచేసినట్లు అదే హౌసింగ్ సొసైటీలో ఉంటున్న వ్యక్తి బీఎంసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు ఈ విషయం ముందుగా తమకు ఎందుకు తెలియజేయలేదో వివరణ ఇవ్వాలని, ఉన్నపలంగా ఎలక్ట్రిక్ బాక్స్ అక్కడి నుంచి తొలగించాలని, లేదంటే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని బీఎంసీ హెచ్చరించింది. అయితే, నోటీసులను అనుష్క శర్మ పేరిట పంపించకుండా ఫ్లాట్ నెంబర్ 2001, 2002 అని పేర్కొంటూ పంపించారంట. దీనికి సంబంధించి నటి తరుపున అధికార ప్రతినిధి స్పందిస్తూ తమ చట్ట విరుద్ధంగా ఏదీ చేయలేదని, అనుష్కకు మొత్తం మూడు ఫ్లాట్లు ఉన్నాయని, 2013 నుంచి అన్ని అనుమతులను తీసుకొని అందులో ఉంటున్నారని, ఏ ఒక్కరికీ హానీ చేసే కుటుంబం వారిది కాదని, చట్టానికి నిబద్ధులై ఉంటారని చెప్పాడు. -
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో...సగం శాఖలు మూత
⇒ మూడు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు కూడా ⇒ విలీనమయ్యే అనుబంధ బ్యాంకులపై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం ⇒ ఏప్రిల్ 24 నుంచి ప్రక్రియ ప్రారంభం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో విలీనం అనంతరం అనుబంధ బ్యాంకుల్లో సుమారు 47 శాతం శాఖలు మూతబడనున్నాయి. అలాగే మూడు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను కూడా మూసివేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఏప్రిల్ 24 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ‘అనుబంధ బ్యాంకులకు సంబంధించి అయిదు ప్రధాన కార్యాలయాల్లో రెండు మాత్రమే కొనసాగుతాయి. మిగతా మూడు అనుబంధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలతో పాటు 27 జోనల్ ఆఫీసులు, 81 ప్రాంతీయ కార్యాలయాలు, 11 నెట్వర్క్ ఆఫీసులను మూసివేయడం జరుగుతుంది. ఏప్రిల్ 24 దాకా మాత్రమే ప్రస్తుత వ్యవస్థ కొనసాగుతుంది‘ అని ఎస్బీఐ ఎండీ దినేశ్ కుమార్ ఖరా తెలిపారు. దీని వల్ల ఒకే చోట తమ గ్రూప్ బ్యాంకుల శాఖలు అనేకం ఉండకుండా చూసుకోవడానికి వీలవుతుందని ఆయన వివరించారు. ఏప్రిల్ ఒకటి తర్వాత నుంచి అయిదు అనుబంధ బ్యాంకులు చట్టబద్ధంగా రద్దైపోయినా.. విలీన ప్రక్రియ మాత్రం ఆడిటింగ్ మొదలైనవి పూర్తయ్యాక ఏప్రిల్ 24 తర్వాత ప్రారంభమవుతుందని దినేశ్ కుమార్ చెప్పారు. ‘విలీన తేదీకన్నా ఒక రోజు ముందు.. అంటే మార్చ్ 31న అనుబంధ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కలన్నీ పూర్తవడానికి 15–20 రోజులు పడుతుంది. ఆడిట్ పూర్తయిన తర్వాత శాఖలన్నీ కూడా ఎస్బీఐలో పూర్తిగా విలీనం అవుతాయి‘ అని ఆయన వివరించారు. డేటా అనుసంధానం మొదలైనవి మే ఆఖరు నాటికి పూర్తి కాగలవని పేర్కొన్నారు. మొత్తం మీద విలీనం సంబంధిత ప్రక్రియలన్నీ ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని బ్యాంకు నిర్దేశించుకున్నట్లు వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) అయిదు అనుబంధ బ్యాంకులు.. సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీటీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్బీపీ) ఏప్రిల్ 1న ఎస్బీఐలో విలీనం కానున్న సంగతి తెలిసిందే. 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ .. ఎస్బీఐలో విలీనమయ్యాయి. ఇటీవలే భారతీయ మహిళా బ్యాంక్ విలీన ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. టాప్ 50లో ఒకటిగా ఎస్బీఐ.. దాదాపు రూ. 30.72 లక్షల కోట్ల అసెట్స్‌తో ఎస్బీఐ దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా ఉంది. అంతర్జాతీయంగా బ్యాంకుల జాబితాలో 64వ స్థానంలో (2015 డిసెంబర్ నాటి గణాంకాల ప్రకారం) ఉంది. అనుబంధ బ్యాంకుల విలీనం అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్స్ దాదాపు రూ. 40 లక్షల కోట్లకు పెరగనున్నాయి. తద్వారా ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో చోటు దక్కించుకోనున్నట్లు, 45వ స్థానంలో నిలవనున్నట్లు ఎస్బీఐ చీఫ్ ఎకానమిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్బీఐకి 550 కార్యాలయాలు ఉండగా, అనుబంధ బ్యాంకులకు 259 ఉన్నాయి. విలీనం అనంతరం మొత్తం కార్యాలయాల సంఖ్యను 687కి పరిమితం చేయాలని.. (122 ఆఫీస్‌ల తగ్గింపు) ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. కార్యాలయాల మూసివేత వల్ల ప్రభావితమయ్యే 1,107 మంది ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి.. ప్రధానంగా కస్టమర్ ఇంటర్ఫేస్ ఆపరేషన్స్‌లోకి బదలాయించనున్నట్లు దినేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రతి ప్రాంతీయ కార్యాలయంలో 5–7 మంది, జోనల్ ఆఫీస్‌ల్లో సుమారు 20 మంది చొప్పున ఉద్యోగులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో ప్రాంతీయ కార్యాలయం 30–40 శాఖలను పర్యవేక్షిస్తుండగా, 4–5 ప్రాంతీయ కార్యాలయాలు ఒక జోనల్ ఆఫీస్ పర్యవేక్షణలో ఉంటున్నాయని దినేశ్ కుమార్ తెలిపారు. వేరే విభాగాల్లోకి మారడానికి ఇష్టపడని ఉద్యోగులకు అనుబంధ బ్యాంకులు స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమ్ (వీఆర్ఎస్) ఆప్షన్ కూడా ఇస్తున్నాయి. బీఎంబీ విలీనం కూడా ఏప్రిల్ 1నే న్యూఢిల్లీ: భారతీయ మహిళా బ్యాంకు (బీఎంబీ) సైతం ఏప్రిల్ 1 నుంచే ఎస్బీఐలో విలీనం అవుతోంది. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు కూడా ఇదే తేదీ నుంచి విలీనం అయిపోతున్న విషయం తెలిసిందే. బీఎంబీ విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం గజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. తాజా ఆదేశాల నేపథ్యంలో ఎస్బీఐ ఈ నెల 24న సెంట్రల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తీసుకోనుంది. బీఎంబీకి దేశవ్యాప్తంగా 103 శాఖలు ఉన్నాయి. వ్యాపారం రూ.1,600 కోట్లుగా ఉంది. -
ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకు విలీనం
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ) సైతం కలసిపోనుంది. ఈ దిశగా కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ బ్యాంకు సేవలను మరింత మంది మహిళలకు వేగంగా అందించేందుకు వీలుగా బీఎంబీని ఎస్బీఐలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఎస్బీఐకి ఉన్న భారీ నెట్వర్క్ తదితర అనుకూలతలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు సైతం ఏప్రిల్ 1న విలీనం అవుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు బీఎంబీని కూడా విలీనం చేయాలని గతంలో ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనంపైనే అధికారికంగా నిర్ణయం తీసుకుని, బీఎంబీపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. తాజాగా బీఎంబీ విలీనానికి కూడా లైన్ క్లియర్ చేసింది. ఎక్కువ మంది మహిళలకు బ్యాంకు సేవలు ఎస్బీఐలో బీఎంబీ వీలీనానికి కారణాలను సైతం కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేసింది. ‘‘ఎస్బీఐ గ్రూపు పరిధిలో ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళల కోసమే 126 శాఖలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో బీఎంబీకి కేవలం ఏడు శాఖలే ఉన్నాయి. పరిపాలన, నిర్వహణ వ్యయాలు ఎస్బీఐ నిర్వహిస్తున్న మహిళా శాఖలతో పోల్చి చూస్తే బీఎంబీకి అధికంగా ఉన్నాయి. అంటే ఒకే ఖర్చుతో మహిళలకు అధిక సంఖ్యలో ఎస్బీఐ ద్వారా రుణాలను అందించవచ్చు’’ అని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే, మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, మహిళల కోసం ప్రత్యేకించిన పథకాలను వేగంగా విస్తృతమైన నెట్వర్క్ ద్వారా అమలు చేయాల్సిన అవసరం ఉందని తన ప్రకటనలో తెలిపింది. బీఎంబీ 2013లో ఏర్పాటైంది. తన శాఖల ద్వారా రూ.192 కోట్ల రుణాలను మహిళలకు పంపిణీ చేసింది. అదే విధంగా ఎస్బీఐ గ్రూపు పరిధిలో మహిళలకు ఇచ్చిన రుణాలు రూ.46,000 కోట్లుగా ఉన్నట్టు ఈ ప్రకటన తెలియజేస్తోంది. ఎస్బీఐకి 2 లక్షల మంది ఉద్యోగులు ఉండగా అందులో 22 శాతం మంది మహిళలే. అనుబంధ బ్యాంకులు ఇకపై ఎస్బీఐ శాఖలే: ఆర్బీఐ ముంబై: ఎస్బీఐలో విలీనం అవుతున్న ఐదు అనుబంధ బ్యాంకుల శాఖల పేర్లు అంతర్థానం కానున్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్ కస్టమర్లు, డిపాజిటర్లను ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులుగా పరిగణించనున్నట్టు ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా బ్యాంకు శాఖలు ఎస్బీఐ శాఖలుగా పనిచేస్తాయని పేర్కొంది. -
పెరిగిపోయిన పావురాలతో కొత్త సమస్యలు
-
కబూతర్ జా..జా..జా
భారీగా పెరిగిపోయిన పావురాలతో కొత్త సమస్యలు ⇒ జంట నగరాల్లో జయశంకర్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి ⇒ ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణం ⇒ పలు రకాల వైరస్‌లూ విస్తరించే ప్రమాదం ⇒ చర్మ సంబంధిత వ్యాధులూ వచ్చే అవకాశం ⇒ వాటి రెట్టల కారణంగా అపరిశుభ్రత, దుర్వాసన ⇒ జంట నగరాల్లో సుమారు 5 లక్షల కపోతాలు ⇒ పావురాల సంతతి బాగా పెరగడంతో ఇతర పక్షులకు ప్రమాదం ఒహోహో.. పావురమా.. అంటూ ఒకప్పుడు పాటలు పాడుకునేవారు.. వాటితో ప్రేమ లేఖలూ పంపుకొనేవారు.. తెల్లని పావురాలను శాంతికి చిహ్నంగానూ భావిస్తారు. వాటికి దాణా పెడితే చనిపోయిన మన పెద్దల ఆత్మలు సంతృప్తి చెందుతాయనేదీ కొందరి నమ్మకం. కానీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం పావురాలు అశాంతి రేపుతున్నాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు, కొన్ని రకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. పెద్ద సంఖ్యలో పెరిగిపోయిన పావురాలు వేసే రెట్టతో అపరిశుభ్రత, దుర్వాసన నెలకొని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ రామారావు విశ్రాంత ఉన్నతాధికారి.. ఆయన మనవరాలు కొంత కాలంగా ఆస్తమాతో ఇబ్బంది పడుతోంది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించలేదు. ఓరోజు వారి ఇంటికి వచ్చిన స్నేహితుడైన వైద్యుడు ఆ అమ్మాయి బెడ్రూమ్ పరిసరాలు గమనించి.. ఆ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో పావురాలు ఉండటమే ఆస్తమాకు కారణమని తేల్చారు. పావురాలు అక్కడ ఉండకుండా చేయాలని సూచించారు. అలా చేయడంతో మూడు నెలల్లోనే ఆ అమ్మాయి కోలుకుంది. దుమ్ము, కాలుష్యం వంటివి ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పావురాలూ ఈ సమస్యకు కారణమవుతున్నాయి. సాధారణంగా పావురాల రెట్టల వల్ల ఇంటి గోడలు, పైకప్పు పాడవుతున్నాయన్న ఫిర్యాదులేగాని.. వాటి వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదముందన్న సంగతి చాలామందికి తెలియడం లేదు. జంట నగరాల్లో భారీ సంఖ్యలో పెరిగిపోయిన పావురాలు అపార్ట్మెంట్లు, ఇతర భవనాలను ఆవాసాలుగా మార్చుకుని.. జనానికి అతి దగ్గరగా మసులుతున్నాయి. దాంతో పావురాల రెక్కల నుంచి వచ్చే ధూళి, రెట్టల్లోని అవశేషాలు ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. కిటికీలు, వెంటిలేటర్లలో మసలే పావురాల నుంచి వ్యాధికారక పదార్థాలు ఇళ్ల గదుల్లోకి చేరుతున్నాయి. ఇటీవల మాజీ క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీకి కూడా వైద్యులు ఇదే తరహా సూచనలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారిన పడటానికి పావురాలే కారణమని తేలింది. లక్షల సంఖ్యలో పావురాలు కబూతర్ ఖానా.. కుతుబ్‌షాహీల కాలంలో పాత నగరంలో ఏర్పాటైన పావురాల కేంద్రం. 300 గూళ్లతో ఉండే ఆ నిర్మాణంలో వందల సంఖ్యలో కపోతాలు ఉంటాయి. జనం వాటికి తిండి గింజలు వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అలాంటి పావురాల కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, మొత్తంగా ఎన్ని పావురాలు ఉంటాయనే విషయాన్ని తేల్చేందుకు జయశంకర్ విశ్వవిద్యాలయంలోని పక్షి శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ వి.వాసుదేవరావు ఆధ్వర్యంలో కొంత కాలంగా అధ్యయనం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం జంట నగరాల్లో 490 చోట్ల పావురాలకు తిండి గింజలు వేసే కేంద్రాలు వెలిశాయి. వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒక్కో చోట 200 నుంచి 15 వేల వరకు పావురాలు ఉంటున్నాయి. మొత్తంగా జంట నగరాల్లో దాదాపు 5 లక్షల వరకు పావురాలు ఉన్నట్లు అంచనా. వైరస్, పురుగులు విస్తరించే ప్రమాదం ‘‘పావురాలకు తిండి గింజలు వేసి ఆనందించటం సహజం. కానీ అవి మనకు దగ్గరగా మసలుతుండటంతో వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది ప్రమాదకరమే..’అని వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి విభాగాధిపతి వాసుదేవరావు తెలిపారు. పావురాలను ఓ రకమైన నల్లుల వంటి పురుగులు ఆశ్రయిస్తు న్నట్టు తేలింది. పావురాలు ఇళ్ల కిటికీలు, వెంటిలేటర్ల వద్ద ఉన్నప్పుడు అక్కడ పడే పురుగులు.. తర్వాత ఇళ్లలోకి చేరుతున్నాయి. దీంతో పావురాల నుంచి ప్రమాదకర వైరస్ మనుషుల్లోకి చేరే ప్రమాదం ఉందని వాసుదేవరావు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది వ్యాధులు విస్తరించేందుకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఇక చర్మ సంబంధిత వ్యాధులకూ పావురాలు కారణమవుతున్నాయని పలు వురు వైద్యులు చెబుతున్నారు. విమానాలకూ తప్పని ముప్పు... ఎగురుతున్న విమానాలను పక్షులు ఢీకొంటే విమానాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్న సంగతి తెలిసిం దే. ఆ ప్రమాదమే కాదు శంషాబాద్ విమానాశ్రయంలో కొత్త సమస్య కూడా వచ్చిపడింది. విమానాలు నిలిపేందుకు, మరమ్మతులు చేసేందుకు విమానాశ్రయంలో భారీ హ్యాంగ ర్స్ (షెడ్లు లాంటివి) ఉంటాయి. వంద అడుగుల వరకు ఎత్తుండే ఆ హ్యాంగర్స్పై పావురాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడి నుంచి పావురాలు వేసిన రెట్టలు విమానాలపై పడి కొత్త సమస్యకు కారణమైంది. వాటి రెట్టల్లో ఆమ్ల అవశేషాలుంటాయి. రెట్ట ఎక్కువసేపు విమా నంపై ఉంటే ఆ ప్రాంతంలో మచ్చలేర్పడతాయి. అవి చిన్నపాటి రంధ్రాలకు కారణమై విమానాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయం హ్యాంగర్స్లో పావురాల నిరోధాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. నాణ్యతలేని గింజలతో.. కొందరు పురుగుపట్టిన, ముక్కిన, తడిసి బూజుపట్టిన, పాడైన గింజలను తక్కువ ధరకు సేకరించి పావురాల కేంద్రాల వద్ద అమ్ముతున్నారు. ప్రజలు వాటిని కొని వేస్తుండడంతో పావురాలకు రోగాలు వస్తున్నాయి. అలా కొన్ని సందర్భాల్లో ఇళ్లలోని కిటికీ సందులు, పైకప్పుల్లో చనిపోతున్నాయి. ఇది కూడా అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులకు కారణమవుతోంది. గింజలు వేయటం మానుకోవాలి పక్షులను ఆదరించటం జీవవైవిధ్యానికి ఎంతో అవసరమేనని, పక్షులకు గింజలు వేసినంత మాత్రాన వాటిని ఆదరించినట్టు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇళ్ల పైకప్పులపై పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేస్తే సరిపోతుందని, గింజలు వేయవద్దని సూచిస్తున్నారు. గింజలు దొరకకుంటే పక్షులు వాటికి సహజమైన వేటకు వెళ్లిపోతాయని.. అది పక్షులకు, ప్రజల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. ఇతర పక్షులకూ ప్రమాదం తిండి గింజలకు అలవాటు పడిన పావురాలు వాటి సహజ గుణాలను వదిలేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉదయమే వేటకు వెళ్లడం పక్షుల లక్షణం. కానీ ప్రజలే తిండి గింజలు వేస్తుండడంతో పావురాలు ఆహారం కోసం వెళ్లకుండా.. ఒకే చోట ఉంటున్నాయి. ఈ క్రమంలో తమ తిండికి పోటీ రాకుండా ఇతర రకాల పక్షులను తరిమేస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఇక లక్షల సంఖ్యలో పావురాలు పెరిగిపోతుండడంతో.. నగర శివారు ప్రాంతాలకు, గ్రామాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిచ్చుకలు, కాకులు, చిలుకలు ఇతర పక్షులను తరిమివేస్తున్నాయి. దాణా కోసం రూ.50 కోట్లు! సగటున ఒక్కో పావురం రోజుకు 22 గ్రాముల వరకు గింజలు తింటాయని అంచనా. పావురాల కోసం ఏర్పాటు చేసే కేంద్రాల వద్ద రూ.10, రూ.20 చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లలో గింజలు అమ్ముతున్నారు. జనం, సందర్శకులు వాటిని కొని పావురాలకు వేస్తున్నారు. దాంతో పావురాల సంఖ్య బాగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఉన్న పావురాలకు పెడుతున్న గింజల కోసం ఏడాదికి సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చుపెడుతున్నట్లు అధ్యయన బృందం అంచనా వేసింది. పావురాలకు ఫ్యామిలీ ప్లానింగ్! సంతానోత్పత్తి నియంత్రణకు బీఎంసీ యోచన భాగ్యనగరంలోనే కాదు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ పావురాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ పావురాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో వాటి రెట్టలు, ఇతర అవశేషాల వల్ల ఆస్తమా.. క్షయా తదితర వ్యాధుల బారి న ప్రజలు పడుతున్నారు. ముంబైలోని ప్రతి పది ఆస్తమా కేసుల్లో ఒకటి పావురాల వల్ల వచ్చిందే. ముఖ్యంగా చిన్నారుల్లో ఈసమస్య అధికంగా ఉంది. ముంబై అనేకాదు.. పుణే, థానే తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) రంగంలోకి దిగాల్సి వచ్చింది. పావురాల సంఖ్యను నియంత్రణకు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేందుకు సిద్ధమవుతోం ది. దశాబ్దం క్రితం వీధి కుక్కలకు సంతా నోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన మాదిరిగానే ఇప్పుడు పావురాలకు కూడా చేయాలని యోచిస్తోంది. తొలుత ఈ ప్రతి పాదనను ఓ ముంబై కార్పొరేటర్ తెరపైకి తెచ్చారు. ఓవిస్టాప్ అనే సంతానోత్పత్తి నియంత్రణ ఔషధం సహాయంతో బీఎంసీ పావురాల విస్ఫోటనాన్ని అరికట్టవచ్చని ఆయన చెపుతున్నారు. ఈ పద్ధతి ప్రకారం.. పక్షుల్లో సంతానోత్పత్తిని నియంత్రించే నికర్ బాజిన్‌తో మిళితమై మొక్కజొన్న విత్తనాల తో కూడిన ఓవిస్టాప్ ఔషధాన్ని పావురాలకు ఆహారంగా వేస్తారు. ఈ పిల్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్పెయిన్‌లో ని ఒక పట్టణంలో ఇలాగే పావురాల సంతా నోత్పత్తిని నియంత్రించారని, ఈ పిల్ వినియోగంతో వాటి సంఖ్య 80 శాతం తగ్గిందని సదరు కార్పొరేటర్ చెపుతున్నారు. కేంద్రానికి ప్రతిపాదన.. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే బీఎంసీ ఆరోగ్య కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి అను మతి కోసం మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఈ ప్రతిపాదనను పంపించింది. ఇది తమ పరిధిలో లేదని, రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఫుడ్, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) డైరెక్టర్ చేతిలో ఉందని, దీని అమలుకు అంగీకరించాలని తాము ఎఫ్డీఏని కోరినట్టు ఒక బీఎంసీ అధికారి వెల్లడించారు. దీన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అనుబంధంగా ఉన్న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు పంపింది. ఈ పిల్ స్వదేశంలో లభించదు. దిగుమతికి డీసీజీఐ అనుమతి తప్పనిసరి. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
మహారాష్ట్ర సీఎం సరికొత్త ఎత్తుగడ!
ముంబై: బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు శివసేన కోసం కొత్త ఎత్తుగడ వేసింది. ముంబై మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులకు పోటీ చేయకూడదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఈ పదవులకు కాంగ్రెస్, ఎన్సీపీలను శివసేనకు దూరంగా ఉంచేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. మార్చి 8వ తేదీన ముంబై మేయర్ పదవికి ఎన్నిక జరగనుంది. శివసేన పార్టీ ఇదివరకే మేయర్, డిప్యూటీ మేయర్ల అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. శివసేన ప్రకటించిన మేయర్ అభ్యర్థికి మద్దతిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ శనివారం మీడియాకు వెల్లడించారు. ముంబై మేయర్ పదవికి శివసేన అభ్యర్థిగా మహేందేశ్వర్ బరిలో ఉన్నారు. 'ముంబై ప్రజలు పారదర్శకతను కోరుకుంటున్నారు. అందుకే శివసేన, బీజేపీలలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. అలాగని మేం శివసేనకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రసక్తే లేదని' ఫడ్నవీస్ అన్నారు. ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో శివసేన మద్దతు అవసరమైనందున ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 227 వార్డులున్న ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82, కాంగ్రెస్ 31 సీట్లతో తొలి మూడు స్థానాల్లో నిలవడం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన మరో ముగ్గురు శివసేన తిరుగుబాటు అభ్యర్థులు కూడా తిరిగి పార్టీ గూటికి చేరటంతో శివసేన బలం 87కు పెరిగింది. మేయర్ పీఠం దక్కించుకోవడానికి శివసేన, ఏ ఇతర పార్టీకైనా 114 కార్పొరేటర్ల మద్దతు ఉండాలి. -
శివసేనకు ఆర్ఎస్ఎస్ ఆఫర్?
ముంబై : బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు అయినా ఇప్పటికీ మేయర్ పదవిపై ఉత్కంఠ వీడలేదు. బీఎంసీ ఫలితాల్లో బీజేపీ, శివసేన పోటాపోటీగా సీట్లు గెలుపొందిన విషయం విదితమే. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కలిసేలా కనిపిస్తున్నారు. ఈ మేరకు రెండు పార్టీల మధ్య డీల్ కుదిరిందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. అంతేకాకుండా శివసేన-బీజేపీ పార్టీలు మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయని ఆర్ఎస్ఎస్ నేత ఎంజీ వైద్య ఓ సూచన కూడా చేయడం గమనార్హం. మరోవైపు శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీనే ముందుగా మేయర్ పదవి చేపట్టవచ్చని ఆయన ఆదివారంనాడు ఇక్కడ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎంజీ వైద్య వ్యాఖ్యలపై రెండు పార్టీలు ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా బీఎంసీలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినప్పటికీ అధికారం ఏర్పాటు చేసేందుకు శివసేన-బీజేపీలకు సమాన అవకాశాలున్నాయి. దీంతో ఇరుపార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. మరోవైపు 31మంది కార్పొరేటర్లను గెలుచుకున్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఇటు బీజేపీ, అటు శివసేనే కానీ సిద్ధంగా లేవు. అలాగే ఇండిపెండెంట్ల మద్దతు, గెలిచిన తిరుగుబాటుదారులు సొంతగూటికే చేరడంతో శివసేనకు 89మంది కార్పొరేటర్ల బలం ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇప్పటికే పొత్తు కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే కలిసి కూర్చుని చర్చించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. -
బీజేపీని ఇరకాటంలో పెడుతుందా?
ముంబై: బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ పదవి శివసేనకు దక్కేలా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలనుకోవడంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి ఇది మంచి అవకాశమని కొందరు అంటుంటే.. ఎన్నికల్లో బీజేపీ, శివసేన రెండింటిపై కాంగ్రెస్ పోటీ చేసిందనీ, ఎన్నికల అనంతరం శివసేనకు మద్దతు ఇవ్వడం నైతికత కాదని మరి కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గురుదాస్ కామత్ మాట్లాడుతూ ‘శివసేనకు పరోక్ష మద్దతు లేదా ఎలాంటి సాయాన్నైనా చేసేందుకు నేను పూర్తి వ్యతిరేకం. దీని గురించి నా అభిప్రాయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెబుతాను’అని అన్నారు. పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ మాత్రం బీజేపీ ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకుంటే తర్వాత ఆలోచిస్తామని శుక్రవారం సంకేతాలిచ్చారు. ఏది ఏమైనా నిర్ణయం మాత్రం తమ పార్టీ అధిష్టానానిదే అని, రాష్ట్ర స్థాయిలో దీనిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మొత్తం 227 వార్డులున్న ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82, కాంగ్రెస్ 31 సీట్లతో తొలి మూడు స్థానాల్లో నిలవడం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన మరో ముగ్గురు శివసేన తిరుగుబాటు అభ్యర్థులు కూడా తిరిగి పార్టీ గూటికి చేరటంతో శివసేన బలం 87కు పెరిగింది. కానీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కనీసం 114 మంది కార్పొరేటర్లు అవసరమైనందున, శివసేకు మద్దతిచ్చి రాష్ట్రంలో బీజీపీని ఇబ్బందుల్లోకి నెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
శివసేనకు కాంగ్రెస్ దూరం.. మరెలా?
ప్రతిష్ఠాత్మకమైన ముంబై మేయర్ పదవి దక్కించుకోవాలంటే కనీసం 114 మంది కార్పొరేటర్లు అవసరం. కానీ శివసేన గెలుచుకున్నది 84 మాత్రమే. ఎలాగోలా నలుగురు స్వతంత్ర సభ్యులు మద్దతు తెలపడమో, పార్టీలో చేరిపోవడమో అయ్యి.. ఆ బలం 88కి చేరింది. మరోవైపు మతతత్వ పార్టీలకు తాము మద్దతిచ్చేది లేదని, ఇప్పటికే శివసేన నుంచి కొంతమంది తమను సంప్రదించారు గానీ తాము మాత్రం వాళ్లకు అండగా నిలబడబోమని కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజయ్ నిరుపమ్ చెప్పారు. తమవాళ్లెవరూ కాంగ్రెస్ వాళ్ల వద్దకు వెళ్లలేదని, మేయర్ మాత్రం తమవాడే అవుతాడని.. ఎలా అవుతాడో తెలుసుకోవాలంటే మార్చి 9వ తేదీ వరకు ఆగాలని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరి ఇటు కాంగ్రెస్ మద్దతివ్వకుండా.. అటు బీజేపీ వైపు మొగ్గకుండా అధికారాన్ని శివసేన ఎలా చేపడుతుందన్నది అనుమానంగానే కనపడుతోంది. మొత్తం 227 మంది కార్పొరేటర్లున్న ముంబై కార్పొరేషన్లో అధికారం చేపట్టాలంటే శివసేనకు ఇంకా 26 మంది మద్దతు అవసరం. ఇది ఎక్కడినుంచి వస్తుందన్నది అనుమానంగానే కనిపిస్తోంది. మరి శివసైనికులు ఏం చేస్తారో.. మేయర్ పదవిని ఎలా చేపడతారో చూడాల్సి ఉంది. -
బీజేపీతో జట్టు కట్టేది లేదు: శివసేన
ముంబై: శివసేన బలం మరి కాస్త పెరిగింది. గురువారం ప్రకటించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఫలితాల్లో బీజేపీ, శివసేన పోటాపోటీగా సీట్లు గెలుపొందిన విషయం విదితమే. శివసేన 84, బీజేపీ 82 సీట్లు గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులకు డిమాండ్ పెరిగింది. విఖ్రోలీ, డిండోషి స్థానాల నుంచి విజయం సాధించిన ఇండిపెండెంట్లు స్నేహల్ మోరే, తులసీరాం షిండే శుక్రవారం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేను కలిసి మద్దతు ప్రకటించారు. దీంతో శివసేన బలం 86 కు పెరిగింది. ఇదిలా ఉండగా, ఇండిపెండెంట్‌గా గెలిచిన రహ్‌బార్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరు తమ పక్షానికి మద్దతు ప్రకటించనున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నేత మనోహర్ జోషి మాట్లాడుతూ.. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కమలనాథులతో జట్టు కట్టబోదని స్పష్టం చేశారు. తమదే ముంబై పీఠమని దీమా ప్రకటించారు. అలాగే, 31 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ కూడా తాము బీజేపీ, శివసేనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్టు ఇవ్వలేమని ప్రకటించింది. సైద్ధాంతిక పరంగా తీవ్రంగా విబేధాలున్న ఆ పార్టీలకు తాము దూరంగా ఉంటామని ఆ పార్టీ ముంబై నగర అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండాలనే ప్రజల తీర్పును గౌరవిస్తామని తెలిపారు. -
మళ్లీ పొత్తు దిశగా శివసేన - బీజేపీ?
బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కలిసేలా కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అధికార కూటమిగా ఉన్న శివసేన - బీజేపీ మళ్లీ కలవొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రకే చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ఆ దిశగా వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే కలిసి కూర్చుని చర్చించుకోవాలని ఆయన సూచించారు. శివసేనకు ఈ ఎన్నికల్లో 84 డివిజన్లు వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 227 స్థానాలున్న బీఎంసీలో అధికారం చేపట్టాలంటే కనీసం 114 మంది మద్దతు అవసరం. అంటే మరో 30 మంది మద్దతు శివసేనకు కావాలి. మరోవైపు రెండో పెద్ద పార్టీగా వచ్చిన బీజేపీ.. సొంతంగా పోటీ చేసి 82 స్థానాలు గెలుచుకుంది. దాంతో ఇద్దరిలో ఎవరికీ మేయర్ పదవి నేరుగా దక్కే అవకాశం లేదు. ప్రస్తుతానికి తాను మేయర్ పదవి గురించి ఏమీ ఆలోచించలేదని, అతిపెద్ద పార్టీగా నిలిచినందుకు సంబరాలు చేసుకుంటున్నామని ఉద్ధవ్ ఠాక్రే తన నివాసమైన మాతోశ్రీ వద్ద చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని అన్నారు గానీ.. ఎవరితో అనే విషయం చెప్పలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ - శివసేన కూటమి బీఎంసీని పాలిస్తోంది. ఈసారి తాము ఈ పొత్తు నుంచి విడిపోయి వేరుగా పోటీ చేస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పూర్తిస్థాయిలో బయటపడ్డాయి. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోవడం, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ శాశ్వత మిత్రులు గానీ ఉండరని చెప్పడంతో ఇప్పుడు మరోసారి ఇరు పార్టీల మధ్య పొత్తు పొడవచ్చన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. మహారాష్ట్రలో జరిగిన మొత్తం 10 మునిసిపాలిటీల ఎన్నికల్లో ఎనిమిది బీజేపీకే దక్కడంతో ఇప్పుడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఆసియాలోనే అత్యంత ధనవంతమైన పురపాలక సంస్థ అయిన బీఎంసీకి వార్షిక బడ్జెట్ దాదాపు రూ. 37వేల కోట్లు ఉంటుంది. ఇప్పుడు దీని పగ్గాలు ఎవరు చేపడతారన్న విషయమై మరో రెండు మూడు రోజులు ఆగితే తప్ప స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ పరిస్థితి కూడా ఈసారి ఏమీ ఆషామాషీగా లేదు. 82 స్థానాలు గెలుచుకోవడంతో బలమైన పార్టీగా ఉన్న కమలం సైతం అధికారం చేపట్టేందుకు పూర్తి అవకాశాలున్నాయి. ఇంతకుముందు మాత్రం శివసేనకు బయటి నుంచి మద్దతు ఇచ్చింది. ఈసారి బీఎంసీ పగ్గాలను ఎవరు చేపడతారో చూడాలి మరి!! -
బీఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన ఎంబీఏ విద్యార్థి
ముంబై: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో తొలి సారి యువకులు గెలిపొందారు. సంప్రదాయ రాజకీయాలను వెనక్కునెట్టి యువకులు ముందంజలో నిలిచారు. దీంతో బీఎంసీ పాలనలో మార్పు చోటుచేసుకోనుంది. 23 ఏళ్ల హర్షాల్ కక్కర్ 6వ వార్డు నుంచి శివసేన అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో అత్యంత పిన్న వయస్కుడిగా కక్కార్ బీఎంసీలో అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం కక్కార్ ఎంబీఏ చదువుతుండటం విశేషం. కక్కార్ బీజేపీ అభ్యర్థి నీలా రాథోడ్‌పై 11,365 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. వయసు దృష్ట్యా పోటిచేయాలంటే భయపడ్డానని, కానీ, ప్రజలు యువత వైపే మొగ్గు చూపారని కక్కార్ తెలిపారు. యువకుడిగా కొత్త ఆలోచనలతో ప్రజలకు మేలు చేస్తానన్నారు. బీజేపీ నుంచి ఏంపీ కిరిత్ సోమాయియా కొడుకు 26 ఏళ్ల నీల్ సోమాయియా వార్డు నెం 108 నుంచి గెలుపొందారు. ప్రజలు ఇంటి పేరు చూసి ఓటెయ్యలేదని, యువకుడిని కావడం వల్లే తనకు ఓటేశారని తెలిపారు. సీనియర్ నాయకులు హామీలు నెరవేర్చకపోవడంతో, ప్రజలు యువతరాన్ని కోరుకున్నారని నీల్ పేర్కొన్నారు. -
విడిగా పోటీ.. సీఎం హీరో అయ్యారు!
ముంబై: మహారాష్ట్రలో జరిగిన 10 మునిసిపల్ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిష్ట మరో స్థాయికి చేరింది. ఈ స్థానిక ఎన్నికల ఫలితాలతో బీజేపీలో ఫడ్నవీస్ మార్క్ రాజకీయంతో హీరో అయ్యారు. కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) లో బీజేపీ తన స్థానాలను ఘననీయంగా పెంచుకోవడంతో పాటు శివసేనకు కంచుకోటగా ఉన్న కార్పొరేషన్లో వారి జోరుకు బ్రేకులు వేయగలిగింది. బీఎంసీలో మొత్తం 227 స్థానాలకుగానూ శివసేన 84 సీట్లు, బీజేపీ 82 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ 31, ఎన్సీపీ 9 సీట్లు, ఎంఎన్ఎస్ 7, మజ్లిస్ పార్టీ 3 స్థానాలు దక్కించుకోగా, ఇండిపెండెంట్లు 11 స్థానాలు దక్కించుకున్నారు. గతంలో 31 స్థానాలున్న బీజేపీ ఈసారి శివసేనతో పొత్తులేకుండా విడిగా బరిలో నిలిచి మరో 51 స్థానాలు అదనంగా సాధించుకుంది. రాష్ట్రంలో ఎలాంటి వివాదాలలో చిక్కుకోకుండా క్లీన్ ఇమేజ్ తో ఉన్న ఫడ్నవీస్ ముందుండి పార్టీని నడిపించడంతో బీజేపీ అధిష్టానంతో మంచి మార్కులు కొట్టేశారు. కార్పొనేషన్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టి రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు తీసుకురావాలని భావించిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు ఈ ఫలితాలు మింగుడు పడటం లేదు. బీజేపీ నోటిస్ పిరియడ్ లో ఉందని, శివసేన మద్ధతు లేకపోతే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండదని వ్యాఖ్యానించిన ఉద్ధవ్ ఈ ఫలితాలతో కాస్త వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ కూలిపోదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తానే సీఎం పీఠంలో కొనసాగుతానని చెప్పిన ఫడ్నవీస్ ధైర్యంగా శివసేన ఎత్తులకు పై ఎత్తులు వేసి బీజేపీకి విజయాన్ని చేకూర్చారు. బీఎంసీ సహా 8 కార్పొరేషన్లలో కమలం పార్టీ సత్తా చాటింది. బీఎంసీలో శివసేన, బీజేపీలకు మ్యాజిక్ ఫిజిక్ 114 స్థానాలు రాలేదు. అయితే వలసలపై ఆ పార్టీలు దృష్టిపెడతాయా లేక కూటమిగా కొనసాగుతాయా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఎంసీ ఎన్నికల్లో విఖ్ రోలీ కార్పొరేటర్ స్నెహల్ మోరె, దిండోషి నుంచి గెలిచిన తలసీదాస్ షిండేలు శివసేనలో చేరిపోయారు. -
అత్యంత ధనికుడైన కార్పొరేటర్ ఎవరో తెలుసా?
-
కృష్ణవేణి.. తెలుగోడి వాణి..
► ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా కృష్ణవేణిరెడ్డి గెలుపు ► తొలిసారి తెలుగువారికి ప్రాతినిథ్యం.. ► ‘సాక్షి’లో ఒకప్పుడు ఆపరేటర్.. ఇప్పుడు కార్పొరేటర్ సాక్షి ముంబై: తెలుగు వారికి అందని ద్రాక్షగా మిగిలిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి ప్రాతినిథ్యం దక్కింది. బీఎంసీలో వార్డు నంబర్ 174 నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన కందిగ కృష్ణవేణి రెడ్డి విజయం సాధించారు. ‘సాక్షి’ దినపత్రిక ముంబై కార్యాలయంలో ఒకప్పుడు ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన ఆమె ఇప్పుడు బీఎంసీ కార్పొరేటర్‌గా విజయం సాధిం చారు. ప్రతిక్షనగర్‌లో నివసించే ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 2014 ఫిబ్రవరిలో సాక్షి ముంబై కార్యాలయంలో ఆపరేటర్‌గా చేరారు. 2015 మేలో పదవీ విరమణ చేసి.. సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఆమెను బరిలోకి దింపింది. ఎన్నికల్లో గెలిచి, బీఎంసీలో తెలుగువారికి తొలిసారిగా ప్రాతినిథ్యాన్ని కల్పించారు. కడప నుంచి ముంబై వయా చిత్తూరు కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో జన్మించిన కృష్ణవేణి రెడ్డి వివాహం చిత్తూరు జిల్లా కొత్త ఆరూరుకు చెందిన వినోద్ రెడ్డితో జరిగింది. ఆమె భర్త ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయన ఫార్మా రంగంలో ఉండగా ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. కాగా, 2012లో జరిగిన ఎన్నికల్లో శివసేన టికెట్‌పై 176వార్డు (ధారావి–ట్రాన్సిస్ట్ క్యాంప్)నుంచి పోటీ చేసిన వరంగల్ జిల్లాకు చెందిన అనూషా వల్పదాసి విజయం సాధించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఆమె పదవి రద్దు అయిన సంగతి తెలిసిందే. మార్పు కోరుకున్నారు.. ‘‘రాజకీయ అనుభవంలేని నేను రాజకీయాల్లోకి రావడం, విజయం సాధించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రాజకీయ అనుభవం లేని మీరు రాజకీయ బురదలోకి ఎందుకొస్తున్నారు.. వచ్చినా.. ఎలా నెగ్గుకొస్తారని పలువురు ప్రశ్నించారు. అయితే నేను వారికి చెప్పే సమాధానమొక్కటే రాజకీయ బురదని అందరూ తప్పించుకుంటే ఎలా? మహిళలతోపాటు యువత రాజకీయాల్లోకొస్తే కొత్త ఆలోచనలతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే నాకు అవకాశం కల్పించారు’’ -
ఎన్నికల లాటరీలో అదృష్టలక్ష్మి వరించింది!
బీఎంసీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రధానంగా బీజేపీ - శివసేనల మధ్య పలు డివిజన్లలో గెలుపు దోబూచులాడింది. 220వ డివిజన్లో కూడా అలాగే జరిగింది. బీజేపీ తరఫున పోటీ చేసిన పార్టీ అధికార ప్రతినిధి అతుల్ షా, ఆయన ప్రత్యర్థి.. శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర బాగల్కర్ ఇద్దరికీ ఓట్లు సమానంగా వచ్చాయి. దాంతో రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా కూడా ఓట్లు సమానంగానే వచ్చాయి. దాంతో మునిసిపల్ కమిషనర్ సమక్షంలో లాటరీ నిర్వహించగా, ఆ లాటరీ బీజేపీ అభ్యర్థి అతుల్ షాను వరించింది. దాంతో అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటంలో బీజేపీ అభ్యర్థిని అదృష్టలక్ష్మి వరించినట్లయింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 227 డివిజన్లకు గాను శివసేన 84, బీజేపీ 82 డివిజన్లలో విజయం సాధించాయి. -
అత్యంత ధనికుడైన కార్పొరేటర్ ఎవరో తెలుసా?
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగర పాలక సంస్థ.. బీఎంసీ దేశంలోనే అత్యంత ధనికమైన కార్పొరేషన్. అక్కడ పోటీ చేసిన అభ్యర్థులలో బీజేపీకి చెందిన పరాగ్ షా తనకు ఏకంగా రూ. 690 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. దాంతో ఈసారి పోటీ చేసిన అభ్యర్థులందరిలోకీ ఆయనే బాగా ధనవంతుడిగా తేలారు. బీఎంసీ ఎన్నికల్లో ఆయన 132వ నెంబరు వార్డులో గెలిచారు కూడా. ఆయన ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రవీణ్ ఛద్దాను ఓడించి మరీ ఆయన కార్పొరేటర్ అయ్యారు. సాధారణంగా ఘట్కోపర్, ములుంద్ ప్రాంతాల్లో గుజరాతీలు, జైన్ల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి చోట పరాగ్ గెలవడం పెద్ద విశేషమే అంటున్నారు. మన్ కన్స్ట్రక్షన్స్, మన్ డెవలపర్స్ పేరుతో సొంత సంస్థలున్న ఆయన.. ముంబైతో పాటు గుజరాత్లో కూడా పలు ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. ఇక పరాగ్ చేతిలో ఓడిన ప్రవీణ్ ఛద్దా కూడా సామాన్యుడు ఏమీ కాదు. ప్రస్తుత బీఎంసీలో ప్రతిపక్ష నేత. అలాంటి వ్యక్తిని ఓడించడం బీజేపీకి మంచి ప్రతిష్ఠాత్మక విజయం అయ్యింది. పరాగ్ లాంటి బలమైన అభ్యర్థి అయితేనే విజయవకాశాలు ఉంటాయని భావించిన బీజేపీ.. ఆయనను బరిలోకి దించింది. అఫిడవిట్ ప్రకారం ముంబై, థానేలలో పరాగ్ షాకు 9 ఆస్తులున్నాయి. థానెలో ఒక ఫ్లాట్ విలువే 8 కోట్లు. -
ముంబై కార్పొరేటర్‌గా తెలుగు మహిళ
నగరి(చిత్తూరు): ముంబై కార్పొరేషన్ ఎన్నికల బరిలో తెలుగు మహిళ ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కొత్త ఆరూరు గ్రామానికి చెందిన కండ్రిగ వినోద్‌రెడ్డి ఉద్యోగరీత్యా 30 ఏళ్ల క్రితం ముంబైలోనే స్థిరపడ్డారు. ఆయన అక్కడే వైఎస్సార్ జిల్లా కోడూరు ప్రాంతం అనంతరాజువారిపేటకు చెందిన కృష్ణవేణి(45)ని వివాహమాడారు. ముంబైలోని దారాభి ప్రాంతంలో నివసిస్తున్న ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల జరిగిన ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో 174వ వార్డు హిందూ కాలనీలో బీజేపీ తరపున కృష్ణవేణిరెడ్డి పోటీ చేశారు. గురువారం ప్రకటించిన ఫలితాల్లో శివసేన, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన ఏడుగురు అభ్యర్థులపై కృష్ణవేణి రెడ్డి గెలుపొందారు. -
బీఎంసీ ఎన్నికలు: శ్రద్ధా జాదవ్ రికార్డు విజయం
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల కౌటింగ్లో శివసేన దూకుడు కొనసాగిస్తోంది. బీఎంసీ మాజీ మేయర్, శివసేన నాయకురాలు శ్రద్ధా జాదవ్ ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో వరుసగా ఆరోసారి విజయం సాధించారు. వార్డ్ నెం.202 నుంచి ఆమె గెలుపొందారు. బీజేపీ ఎంపీ కిరిట్ సోమాలియా కుమారుడు నియిల్ వార్డు నెం.108 నుంచి విజయం సాధించగా, ముంబై బీజేపీ విభాగం చీఫ్ అశిష్ షెలార్ సోదరుడు వినోద్ షెలార్ వార్డ్ నెం.51లో ఓటమి పాలయ్యారు. మరోవైపు 227 వార్డులున్న బీఎంసీలో కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ శివసేన హవా కొనసాగుతోంది. వందకు పైగా వార్డుల్లో శివసేన ఆధిక్యంలో ఉండగా, బీజేపీ మాత్రం 50 వార్డుల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు అధిక స్థానాలు గెలుచుకునేలా కనిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ నేటి (గురువారం) ఉదయం ప్రారంభమై ఇంకా కొనసాగుతోంది. ఫలితాలు రాకముందే శివసేన పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తుండటం గమనార్హం. -
ముంబైలో దూసుకుపోతున్న శివసేన
-
నేను ఖచ్ఛితంగా ఓటు వేసేదాన్ని...
లాస్ఏంజిల్స్: ఓటు వేయడం అందరి బాధ్యత అని తాను ఇండియాలో ఉండి వుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్ఛితంగా ఓటు వేసే దానిని అని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్విట్టర్లో తెలిపింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో క్వాంటికో టీవీ సీరియల్ షూటింగ్లో ఉన్నారు. ఇప్పటికే నటీనటులు రేఖ, గుల్జార్, రణవీర్ సింగ్, అనుష్క శర్మ, జోయా అక్తర్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ప్రముఖ నటుడు యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్సీ) ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన వరుణ్ని ఓటు లేదంటూ ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. -
శివసేన విజయానికి బ్రేకులు!
దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ అయిన బీఎంసీ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. మొత్తం 227 వార్డులకు గాను 2275 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చాలా కాలంగా బీజేపీ - శివసేన కూటమి పాలనలో ఉన్న బీఎంసీలో ఈసారి ఈ రెండు పార్టీలు ఎదురెదురుగా తలపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన నాయకులు ఇప్పుడు కత్తులు దూశారు. అయితే, ఈసారి శివసేన విజయాన్ని అడ్డుకునేది బీజేపీ కాకపోవచ్చని.. ఠాక్రేల కుటుంబం నుంచే వచ్చిన మరో పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలావరకు వార్డులలో శివసేన ఓట్లను రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ చీల్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సొంతంగా గెలిచేంత బలం ఎంఎన్ఎస్కు లేకపోయినా.. మరాఠా సెంటిమెంటుతో శివసేన పొందాలనుకున్న ఓట్లను మాత్రం చాలావరకు అది చీల్చే అవకాశం ఉందని, దానివల్ల అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఫలితాలు వెలువడేవరకు ఇది అంచనా మాత్రమే అవుతుంది. ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. మొత్తం 227 వార్డులకు గాను ముంబైలో 7034 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 91,80,491 మంది ఓటర్లుండగా, వారిలో 50,30,361 మంది పురుషులు, 49,49,749 మంది మహిళలు, 381 మంది 'ఇతరులు' ఉన్నారు. -
శివసేనకు ఠాక్రేల కోడలి ఝలక్!
బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి... సరిగ్గా ఇలాంటి సమయంలోనే శివసేన నాయకులకు ఝలక్ ఇచ్చేలా ఠాక్రేల కోడలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలా ఠాక్రే నుంచి విడిపోయిన కొడుకు జైదేవ్ ఠాక్రే మాజీ భార్య అయిన స్మితా ఠాక్రే.. బీఎంసీలో అవినీతి గురించి తీవ్రంగా మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా బీఎంసీలో బీజేపీ - శివసేన సంకీర్ణ పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీలో ఉన్నాయి. ముంబైలో చాలావరకు రోడ్ల నిండా గుంతలు ఉన్నాయని, బీఎంసీలో అవినీతి ఎప్పటికీ పరిష్కారం కాకుండానే ఉండిపోయిందని ఆమె అన్నారు. 2004లో జైదేవ్ ఠాక్రే నుంచి విడాకులు తీసుకునేవరకు ఆమె కూడా బాలా ఠాక్రే సొంత ఇల్లయిన 'మాతోశ్రీ'లోనే ఉండేవారు. బీఎంసీలో పనులు ఏమాత్రం జరగవని, ఫైళ్లు కదదలవని స్మితా ఠాక్రే విమర్శించారు. తాను ఠాక్రే కుటుంబం నుంచి వచ్చిన మహిళను అయినా.. తాను కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నానన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనల మధ్య గట్టి పోటీగా ఈసారి బీఎంసీ ఎన్నికలు ఉంటున్నాయి. ముంబైతో పాటు మహారాష్ట్రలోని మరో తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక చాలా కాలంగా ఓట్లు వేస్తూ వచ్చిన చాలామంది ఈసారి ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓట్లు వేయలేకపోతున్నారని.. దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) పలు కీలకమైన అంశాలను లేవనెత్తుతోందని, ఈసారి ఎన్నికల్లో వాళ్లకు తగినన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందని కూడా స్మితా ఠాక్రే అన్నారు. -
యంగ్ హీరోకు చేదు అనుభవం!
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎమ్సీ) ఎన్నికల పోలింగ్ లో ఓటేయడానికి వచ్చిన తనను ఎన్నికల అధికారులు అడ్డుకున్నారని వరుణ్ చెప్పాడు. ఓటర్ల జాబితాలో తన పేరు గల్లంతైనందున తనను పోలింగ్ బూత్ లోకి అనుమతించలేదన్నాడు. గత ఎన్నికల్లో తాను ఓటేశానని, విచిత్రంగా ఇప్పుడు మాత్రం తన ఓటు లేకపోవడం ఆశ్చర్యానికి లోనైనట్లు తెలిపాడు. తన ఓటు గల్లంతైనప్పటికీ.. స్థానిక ప్రజలందరూ బీఎంసీ ఎన్నికల్లో ఓటేయడానికి రావాలని సూచించాడు. ఓటు వేయడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని చెప్పాడు. వరుణ్, అలియా భట్ ల కాంభినేషన్లో లెటెస్ట్ మూవీ 'బద్రినాథ్ కి దుల్హానియా' ప్రమోషన్లలో బిజీగా ఉన్నా.. ఓటేయడానికి వచ్చిన వరుణ్ నిరాశకు వెనుదిరిగాడు. ముంబై మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్, టీనా అంబాని, సినీనటి రేఖ, అనుష్క శర్మ, టీనా అంబానీ, రణబీర్ కపూర్, తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
బీఎమ్సీ ఎన్నికల్లో ప్రముఖుల ఓటు
ముంబై: బృహన్ ముంబై ముంన్సిపల్ కార్పొరేషన్(బీఎమ్సీ) ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగుతోంది. దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్‌గా పేరున్న బీఎమ్సీలో విజయానికి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్‌లో శరద్ పవార్, ముంబై మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్, టీనా అంబాని, సినీనటి రేఖ, అనుష్క శర్మ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాలు ఫిబ్రవరి 23న వెలువడనున్నాయి. Mumbai: Sharad Pawar casts his vote at polling booth no. 214(11) located in Mahalaxmi (West) #BMCelection pic.twitter.com/iMWNnIdBdl — ANI (@ANI_news) 21 February 2017 Municipal Commissioner of Mumbai Ajoy Mehta casts his vote at polling booth number 214 (18), located at Mumbai's Pedder Road #BMCelection pic.twitter.com/FXpifBYp15 — ANI (@ANI_news) 21 February 2017 Mumbai: Deepak Parekh,Chairman HDFC casts his vote,says, #DeMonetisation has nothing to do with these polls&we need to move on #BMCelection pic.twitter.com/ROFUP8sZA3 — ANI (@ANI_news) 21 February 2017 Mumbai: Tina Ambani casts her vote at a polling booth in Colaba, says she voted for good work in Mumbai city #BMCelection pic.twitter.com/o2xj9IPhiO — ANI (@ANI_news) 21 February 2017 Started my morning by casting my https://t.co/Z817hxXwb7 is our duty towards our country & its progress.Pls go out&vote #VoteKarMaharashtra pic.twitter.com/fgXGxjkEcV — Anushka Sharma (@AnushkaSharma) 21 February 2017 -
ఈ అభ్యర్థికి రూ.690కోట్ల కళ్లు చెదిరే ఆస్తులు
ముంబయి: త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు. అతడు నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు అతడు తెలిపిన తన ఆస్తుల విలువ అక్షరాల రూ.690కోట్లు. దీంతో ఈ ఏడాది జరుగుతున్న ఈ ఎన్నికల్లో అతడే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలవనున్నాడు. వివరాల్లోకి వెళితే.. పరాగ్ షా అనే వ్యక్తి ఘట్కోపార్ ప్రాంతం నుంచి బీఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగాడు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్నాడు. ఇతడు మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతాకు అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. ఇప్పటి వరకు రాజకీయ ముఖచిత్రంలో కనిపించకపోయినా.. ఒక్కసారిగా తన అనూహ్య ఆస్తులు ప్రకటించి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. సొంతంగా మేన్ కన్స్ట్రక్షన్స్, మేన్ డెవలపర్స్ పేరిట ముంబయితోపాటు గుజరాత్, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో ప్రాజెక్టు పనులు చేస్తుంటారు. ఈయన ఒక పెద్ద రియల్టర్ కూడా. రూ.670 కోట్లు చరాస్తులుగా, రూ.20 కోట్లు స్థిరాస్తులుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిల్లో కొన్ని తన భార్య పేరిట ఉన్నట్లు చెప్పాడు. -
నాయకుల కట్టడికి 13వేల సీసీటీవీలు
ముంబయి: బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో నాయకులను కట్టడి చేయనుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయనుంది. ఇందుకోసం ఎన్నికలు జరిగే ప్రాంతాల నిండా నిఘా నేత్రాలు(సీసీటీవీ కెమెరాలు) ఏర్పాటు చేస్తుంది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13,000 సీసీటీవీ కెమెరాలు. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకుల హడావుడి అంతా ఇంతా కాదు. ఆ సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు, కానుకలు ఇవ్వడం, బోగస్ ఓటింగ్‌కు పాల్పడే ప్రయత్నాలు చేయడం వారికి పరిపాటి. సమస్యాత్మక నియోజకవర్గాల్లో మత ఘర్షణలకు కూడా వారు పరోక్షంగా కారణం అవుతుంటారు. వీటికి తాజాగా బీఎంసీ పరిపాలనా విభాగం చెక్ పెట్టనుంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులపై దృష్టి సారించేందుకు నిఘా నేత్రాలను ఏర్పాటు చేయనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఫలితాల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ముంబైతో పాటు పశ్చిమ, తూర్పు ఉప నగరాల్లో 13,020 సీసీటీవీ కెమారాలు అద్దెకు తీసుకుంది. దానికోసం రూ.6.37 కోట్లు అద్దె చెల్లించనుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, రాజకీయ బహిరంగ సభల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నట్లు బీఎంసీ తెలిపింది. గత బీఎంసీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు 50శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ సారి మరో 10శాతం పెంచాలని బీఎంసీ ప్రయత్నాలకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా సహకరిస్తుందని భావిస్తోంది. అందులో భాగంగా ప్రజలు ఓటు వేసేలా జనజాగృతి కార్యక్రమాలు చేపట్టాలని భావించింది. అందుకు ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) నిర్మించిన స్కై వాక్‌లపై సుమారు రూ.3.45 లక్షలతో ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయనుంది. బస్సుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు రూ.11.38 లక్షలు, లోకల్ రైళ్లలో ప్రకటనల కోసం రూ.8.73 లక్షలు ఖర్చు చేయనుంది. -
తెరచుకోనున్న బీఎంసీలు..!
పులివెందుల రూరల్ : జిల్లా వ్యాప్తంగా మూతపడిన బీఎంసీ(బల్క్ మిల్క్ కూలింగ్) కేంద్రాలను తెరిపిం చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్ షిప్‌్ట(పీపీపీ) పద్ధతిలో వీటిని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. వైఎస్ హయాంలో ఓ వెలుగు.. జిల్లాలో ఏపీ డెయిరీ ద్వారా పాల సేకరణ చేసి పాడి రైతులను ఆదుకోవాలనే లక్ష్యం తో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బీఎంసీలను ఏర్పాటు చేశారు. దీంతో అ ప్పట్లో జిల్లా లో ఉన్న 18 బీఎంసీల నుంచి దాదాపు 55 వే ల లీటర్ల పాల సేకరణ జరిగేది. పాడిని ప్రో త్సహించేందుకు రైతులకు పశుక్రాంతితో పా టు ఇతర పథకాల కింద రాయితీతో పశువులను అందజేశా రు. ఈ చర్యలు ఫలితానివ్వడంతో జిల్లాలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 8 బీఎంసీల మూత ప్రస్తుత ప్రభుత్వం పాడి రైతులను పట్టిం చుకోకపోవడంతో జిల్లాలో 8 బీఎంసీలు మూతపడ్డాయి. రాష్ట్ర విభజన, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీ డెయిరీ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ రైతులకు పాల బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తూ వస్తోంది. ఫలితంగా పాడి రైతులు ప్రైవేట్ డెయిరీల వైపు మొగ్గు చూపడంతో విజయా డెయిరీకి పాల లభ్యత గణనీయంగా తగ్గింది. 55 వేల లీటర్ల నుంచి 15 వేల లీటర్లకు పడిన సేకరణ జిల్లాలోని పులివెందుల, తొండూరు, లింగాల, చక్రాయపేట, తిమ్మంపల్లె, రాయచోటి, సుండుపల్లె, భాకరాపేట, బద్వేలు, ప్రొద్దుటూరు బీఎంసీల నుంచి ప్రస్తుతం ప్రతి రోజు 15 వేల లీటర్ల పాలను మాత్రమే అధికారులు సేకరిస్తున్నారు. కొండాపురం, రాజుపాలెం, మైదుకూరు, పోరుమామిళ్ల, పెనగలూరు, సింహాద్రిపురం, వేంపల్లె, వేముల బీఎంసీలకు పాడి రైతులు పాలు పోయకపోవడంతో అవి మూతపడ్డాయి. వీటిని పీపీపీ పద్ధతిలో తెరిపించేందుకు అధికారులు, ప్ర భుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఐసీడీఎస్‌కు విక్రయాలతో పెరిగిన అమ్మకాలు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు వి జయ టెట్రా పాల ప్యాకెట్లు విక్రయించేందుకు అనుమతి రావడంతో పాల విక్రయాలు పెరి గాయి. జిల్లాలోని మొత్తం కేంద్రాలకు నెలకు సుమారు 90 వేల లీటర్ల పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు బయట మార్కెట్లో విక్రయాలు పెరగడంతో పాలకు డిమాం డ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మూతపడిన బీఎంసీలు తెరిపించి పాల సేకరణ పెం చాలనే లక్ష్యంతో డెయిరీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
సుస్మితాసేన్‌కు బీఎంసీ నోటీసులు
ముంబై: మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్‌కు బ్రిమన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. దోమలు పెరగడానికి అనువైన ప్రదేశాలను సుస్మిత ఇంట్లో బీఎంసీ అధికారులు గుర్తించడంతో నోటీసులు జారీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, దోమల వ్యాప్తిని అడ్డుకోవాలని బీఎంసీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు అంటు వ్యాదులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని ముంబై వాసులను కోరింది. -
'కపిల్ మంచోడు.. క్రిమినల్ కాదు'
కమెడియన్ కపిల్ శర్మకు నటుడు వివేక్ ఒబెరాయ్ మద్దతు పలికాడు. బీఎంసీలో అవినీతి జరుగుతోందంటూ ప్రధానమంత్రిని ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేసినప్పటినుంచి కపిల్‌ను కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అయితే.. కపిల్ క్రిమినల్ కాదని, అతడు మంచి మనిషని వివేక్ ఒబెరాయ్ చెబుతున్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసేందుకు సాయం చేయాల్సిందిగా వివేక్ ఒబెరాయ్‌ని కపిల్ శర్మ కోరినట్లు తెలుస్తోంది. తాను గత ఐదేళ్లుగా ఏడాదికి రూ. 15 కోట్ల ఆదాయపన్ను కడుతున్నానని, అయినా తనను 5 లక్షల లంచం అడిగారని కపిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకుడు జీవరాజ్ ఆల్వా కుమార్తెను పెళ్లి చేసుకున్న కపిల్.. ఇప్పుడు సమస్య నుంచి బయటపడేందుకు అవసరమైతే మామగారి వైపు నుంచి రాజకీయ పరిచయాలను కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. ఎవరికైనా సమస్యలు తీర్చగలిగే పరిస్థితిలో మనం ఉంటే ఆమాత్రం సాయం చేయాలని ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ తెలిపాడు. కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లల కోసం తాను నిధులు సేకరిస్తుంటానని, ఇందులో భాగం పంచుకుంటానని కపిల్ శర్మ స్వయంగా తనకు చెప్పాడని కూడా వివేక్ అన్నాడు. -
ఇంతకీ కమెడియనా.. విలనా?
కమెడియన్ కపిల్ శర్మ వ్యవహారం రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతోంది. అంధేరీలోని తన బంగ్లా వద్ద మడ అడవులను కపిల్ నరికేస్తున్నాడని, అక్రమంగా కొత్త అంతస్తులు నిర్మిస్తున్నాడని మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) ప్రధాన కార్యదర్శి షాలిని ఠాక్రే ఆరోపించారు. కపిల్‌కు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మద్దతు పలకకూడదని, అబద్ధాల కోరు అయిన శర్మ మునిసిపల్ చట్టాలను ఎలా ఉల్లంఘించాడో తాము సాక్ష్యాలు కూడా చూపిస్తామని అన్నారు. ఇప్పటికే ఉన్న జి ప్లస్ వన్ అంతస్తుకు అదనంగా మరో నిర్మాణం చేస్తుండటంతో కపిల్ శర్మకు జూలై 16న ఒక నోటీసు ఇచ్చారు. దానికి 24 గంటల్లోగా సమాధానం చెప్పాలన్నారు. ఆగస్టు నాలుగోతేదీ వరకు కూడా అతడి నుంచి సమాధానం రాకపోవడంతో వార్డు అధికారులు అదనంగా చేసిన నిర్మాణాలను కూల్చేశారని అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ పరాగ్ మాసుర్కర్ చెప్పారు. అయితే.. కొన్ని నెలల్లోనే బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ఉండటంతో పార్టీలన్నీ ఈ వివాదాన్ని భుజానికి ఎత్తుకున్నాయి. కపిల్ శర్మ పాల్గొనే షూటింగులను తాము అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ సినిమా విభాగం చీఫ్ అమేయ ఖోప్కర్ హెచ్చరించారు. ఎప్పుడో ఆగస్టు నాలుగో తేదీన కూల్చేస్తే.. బీఎంసీ మీద ఆరోపణలు చేయడానికి కపిల్‌కు నెల రోజులు పట్టిందా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఎంసీని భ్రష్టాచార్ మునిసిపల్ కార్పొరేషన్ అని అభివర్ణించింది. -
ఎస్బీఐ గ్రూప్ విలీనానికి రెడీ
♦ అనుబంధ బ్యాంకులతో పాటు బీఎంబీ విలీనానికీ ఎస్బీఐ ప్రతిపాదన ♦ ప్రభుత్వ అనుమతి కోరుతూ బోర్డు తీర్మానం ♦ ప్రతిపాదనకు అనుబంధ బ్యాంక్ బోర్డులూ అంగీకారం ♦ కేంద్రం అనుమతిస్తే... వెంటనే చర్చల ప్రక్రియ ♦ నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది: అరుంధతీ భట్టాచార్య న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంగళవారం కీలక ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. తన ఐదు అనుబంధ బ్యాంకులు అలాగే భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)ని విలీనం చేసుకోడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్బీఐ బోర్డు తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే (2016-17) ఈ ప్రక్రియ పూర్తవ్వాలన్నది తన ఉద్దేశంగా తెలిపింది. తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన దిశలో ఒక అడుగు ముందుకువేసింది. ఎస్బీఐ తన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపడానికి ముందు మంగళవారం ఉదయం ఎస్బీఐ ఐదు అనుబంధ బ్యాంకు బోర్డులు సైతం విలీనానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ ప్రతిపాదనను చేయడం గమనార్హం. దీనిప్రకారం ప్రభుత్వం నుంచి విలీనానికి సూత్రప్రాయ ఆమోదముద్ర పడితే- ఆయా బ్యాంకులు ఇందుకు సంబంధించి చర్చల ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇప్పటికి ప్రతిపాదనే.. కీలక అంశం ప్రస్తుతం ప్రతిపాదన స్థాయిలోనే ఉందని బ్యాంక్ ప్రకటన తెలిపింది. విలీనాల ప్రక్రియ ఎప్పుడు... ఎలా పూర్తవుతుందన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదనీ వివరించింది. చక్కటి కార్పొరేట్ గవర్నెన్స్, పూర్తి పారదర్శకతను నెలకొల్పడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు వివరించింది. ఒకవేళ ప్రభుత్వం కొన్ని బ్యాంకుల విలీనానికే అనుమతి ఇస్తే... ఏమి చేయాలన్న అంశం సైతం ఇప్పుడు పరిశీలనలో లేదని, ఒకవేళ ఇదే జరిగితే బ్యాంక్ బోర్డ్ ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. సత్వర చర్యనే కోరుకుంటున్నాం అరుంధతీ భట్టాచార్య తాజా పరిణామంపై ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ, ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంక్ బ్యాలెన్స్‌షీట్ పరిమాణం రూ.28 లక్షల కోట్లని తెలిపారు. ఈ విలీనాలు పూర్తయితే ఈ పరిమాణం రూ.37 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. విలీన ప్రక్రియ సత్వరమే పూర్తవ్వాలని తాము కోరుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, వాటాదారుల ఆమోదంసహా సుదీర్ఘ ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంటుందని అన్నారు. విలీనం జరిగితే నిధుల సమీకరణ వ్యయం ఒక శాతం మేర తగ్గుతుందనీ ఆమె అభిప్రాయపడ్డారు. 2008లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను తొలిసారిగా విలీనం చేసుకుంది. రెండేళ్ల తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనమైంది. 2016-17లోనే బీఎంబీ విలీనం! భారతీయ మహిళా బ్యాంక్ 2013 సెప్టెంబర్ 25న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెసైన్స్ పొందింది. దాదాపు 100 బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మహిళా ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటు జరిగింది. ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారుల కథనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే ఎస్బీఐలో బీఎంబీ విలీనం జరిగే వీలుంది. 20న అనుబంధ బ్యాంకుల సమ్మె.. కాగా ఈ అనూహ్య పరిణామంపై కొన్ని ఉద్యోగ సంఘాలూ సత్వరం స్పందించాయి. ఈ విలీన ప్రతిపాదనకు నిరసనగా ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులూ మే 20వ తేదీన సమ్మె చేయాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటన చేశారు. పేరెంట్ బ్యాంక్ అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని ఉద్యోగ సంఘం విమర్శించింది. ఈ ప్రతిపాదనను వర్క్‌మన్ డెరైక్టర్లు, స్వతంత్ర డెరైక్టర్లు కూడా వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 23, ఏప్రిల్ 25వ తేదీల్లో సంఘం ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ, అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో కాకుండా, తమలో తాము ఒకటిగా విలీనం కావాలని పేర్కొన్నారని ప్రకటన తెలిపింది. అయితే తాజా ప్రతిపాదన ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఆర్థికమంత్రి అభిప్రాయాలను సైతం పట్టించుకోకుండా తనలో విలీనమయ్యేలా ఐదు అనుబంధ బ్యాంకులపై ఎస్బీఐ ఒత్తిడి తెచ్చినట్లు కనబడుతోందని విమర్శించింది. ఇది అసలు సాధ్యమవుతుందని ప్రశ్నించింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో కూడా ఇదే ధోరణి (ఏకపక్ష విలీనాలు) కొనసాగే అవకాశం కనబడుతోందని పేర్కొన్న సంఘం... దీనికి వ్యతిరేకంగా మరిన్ని ఆందోళనలు జరుపుతామని హెచ్చరించింది. షేర్ల కదలికలు ఇలా... ♦ తాజా పరిణామం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఆయా బ్యాంకుల షేర్ల ధరలు చూస్తే.. ♦ ఎస్బీఐ: 0.17% నష్టపోయి 177.10 వద్ద ముగిసింది. ♦ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్: 13 శాతం ఎగబాకి రూ.426 వద్ద ముగిసింది. ♦ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్: 10 శాతం పెరుగుదలతో రూ.402.50 వద్దకు చేరింది. ♦ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్: 3 శాతం వృద్ధితో 505 వద్ద ముగిసింది. బ్యాంకులు ఇవీ... విలీన ప్రతిపాదనలో ఉన్న బ్యాంకుల్లో భారతీయ మహిళా బ్యాంక్ కూడా ఉంది. దీనితోపాటు ఎస్బీఐకి చెందిన ఐదు అనుబంధ బ్యాంకులు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ఖ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లు ఎన్‌బీఐ ప్రతిపాదనా పత్రంలో ఉన్నాయి. ఆయా బ్యాంకుల వ్యాపారం, అప్పులు-ఆస్తులు అన్నీ విలీనపర్చుకోవడమే ఈ ప్రతిపాదన ఉద్దేశం అని ఒక ప్రకటన తెలిపింది. విలీన ప్రతిపాదనలో ఉన్న బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లు స్టాక్మార్కెట్లో లిస్టయ్యాయి. వ్యాపార విలీన ప్రక్రియపై చర్చలకు తమ బోర్డులు సూత్రప్రాయ ఆమోదముద్ర వేసినట్లు ఈ మూడు బ్యాంకులూ వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నాయి. -
మున్సిపల్ స్వీపర్‌కు ఎంఫిల్‌లో ర్యాంక్
నగర మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల సునీల్ యాదవ్ ఇటీవల ప్రతిష్టాకరమైన 'టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్' నుంచి ఎంఫిల్ పట్టా పుచ్చుకున్నారు. ఏకంగా ఇనిస్టిట్యూట్‌లో ఏడో ర్యాంక్ సాధించారు. ప్రపంచీకరణ- కార్మికుడు' అన్న అంశంపై ఎంఫిల్ చేసిన యాదవ్ సమాజంలో స్వీపర్ల స్థితిగతులపై పీహెచ్డీ చేయాలనుకుంటున్నారు. తనకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేయాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని, ఇదే ఉద్యోగంలో చివరివరకు కొనసాగుతానని చెప్పారు. సమాజంలో వివక్షకు గురవుతున్న స్వీపర్ల లాంటి నిమ్నవర్గాల వారికి అండగా నిలబడాలని, వారికి తగిన గుర్తింపు కోసం పోరాడాలని నిర్ణయించుకున్నానని యాదవ్ మీడియాకు తెలిపారు. ఇరుగుపొరుగు వారి ఈసడింపులు, చిన్నచూపును భరిస్తూనే తాను ఎంఫిల్ వరకు చదవగలిగానని ఆయన తెలిపారు. తన తండ్రి మొదట ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేశారని, అనారోగ్య కారణంతో ఆయన మంచం పట్టడంతో పదో తరగతి ఫెయిలైన తాను కారుణ్య నియామకం కింద ఈ ఉద్యోగంలో చేరానని చెప్పారు. సమాజంలో స్వీపర్ ఉద్యోగాన్ని ఎంత చిన్నచూపు చూస్తారో అనుభవ పూర్వకంగా తెలిసి రావడంతో చదువుపై శ్రద్ధ పెట్టానని, ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తయ్యాక, బీకాం, జర్నలిజంలో బీఏ చేశానని తెలిపారు. ఆ తర్వాత సోషల్ వర్క్ పీజీ, ఇప్పుడు ఎంఫిల్ పూర్తి చేశానని ఆయన వివరించారు. ఎంఫిల్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలనే ఆలోచన ఏ కోశానా లేదని చెప్పారు. సమాజంలో అన్ని రకాల వివక్షతను ఎదుర్కొంటున్న తన జాతి జనుల పోరాటానికి గళం కావాలన్నదే తన లక్ష్యం, మార్గమని సునీల్ యాదవ్ కృతనిశ్చయంతో చెప్పారు. -
షారుఖ్ కు భారీ ఫైన్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కన్నెర్ర జేసింది. బంద్రాలోని తన కలల నివాసం 'మన్నత్' బయట అక్రమ నిర్మాణం చేపట్టడంతో మున్సిపాలిటీ ఆయనపై దాదాపు రూ. రెండు లక్షల జరిమానా విధించింది. వ్యక్తిగత అవసరాల కోసం బహిరంగ స్థలాన్ని ఆక్రమించి.. షారుఖ్ ఈ అక్రమ నిర్మాణాన్ని కట్టారని, దీనిని కూల్చివేయాలని స్వచ్ఛంద కార్యకర్తలు ఉద్యమించారు. వారి నిరసనతో ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ స్పందించి గత ఏడాది ఫిబ్రవరి 6న ఆయనకు నోటీసులు పంపారు. ఈ నోటీసు గడువు అదే ఏడాది ఫిబ్రవరి 15తో ముగిసింది. అయినా షారుఖ్ స్పందించకపోవడంతో బీఎంసీ ఈ నిర్మాణాన్ని కూల్చివేసింది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాన్ని కట్టినందుకు రూ. 1,93,784 జరిమానా చెల్లించాలని షారుఖ్‌కు బీఎంసీ డిమాండ్ నోటీసు పంపింది. ఈ జరిమానా కట్టకపోతే చట్టబద్ధ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
ఎలుకల వేట... ఔట్ సోర్సింగ్!
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఇప్పుడో పెద్దచిక్కు వచ్చిపడింది. శివారు కాలనీల్లో ఎలుకలు విజృభిస్తున్నాయట. కార్పొరేటర్లు, జనం నుంచి ఒకటే ఫిర్యాదులు. ప్రధాన నగరంలో ఎలుకలు పట్టడానికి... చంపడానికి దాదాపు 154 మంది సిబ్బంది బీఎంసీకి ఉన్నారు. ఫుల్‌టైమ్ కార్మికుడికి నెలకు 5,000 రూపాయలు బీఎంసీ చెల్లిస్తోంది. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 30 ఎలుకలు చంపాలనేది టార్గెట్. 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి కాలంలో వీరు మొత్తం 2.6 లక్షల ఎలుకలు చంపారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే శివార్లలో ఇలాంటి యంత్రాగం లేకపోవడంతో ఎలుకలను చంపేపనిని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు అదనపు మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి ఏజెన్సీలకు ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే సాధారణ జనంలో ఎవరైనా స్వచ్ఛందంగా ఎలుకల వేటకు ముందుకు వస్తే వారికి వారం రోజుల పాటు ఎలుకలను పట్టి చంపడంలో శిక్షణ ఇస్తామని కూడా ఆయన వెల్లడించారు. -
బీఫ్ నిషేధంపై బీఎంసీ వెనక్కి
ముంబై: పవిత్ర పర్యుషాన్ వారంలో రెండు రోజులపాటు బీఫ్ నిషేధం, దియోనార్ జంతువధ శాలను మూసేయడాన్ని బీఎంసీ విరమించుకుంది. శుక్రవారం జరిగిన బీఎంసీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయమై జరిగిన ఓటింగ్‌లో ఎక్కువ మంది కార్పొరేటర్లు బీఫ్ నిషేధం ఎత్తివేయలాని ఓటేశారు. ఓటింగ్‌లో శివసేన, బీజేపీలు ప్రతిపక్షం వైపు నిలిచాయి. 1964, 1994లోని పౌర చట్టాలను తిరిగి అమలులోకి తీసుకురావాలని, జైనుల పండుగ పర్యుషాన్ వారంలో రెండురోజులపాటు దియోనార్ జంతువధ శాలను తెరిచే ఉంచాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ కోరింది. బీఫ్ నిషేధాన్ని ఎత్తివేయాలని 111 మంది ఓటు వేయగా, ఇందుకు వ్యతిరేకంగా 24 మంది ఓట్లు వేశారు. మొదట ఒక్కరోజే.. మొదట జంతువధ శాల ఒక్కరోజు మాత్రమే మూసి ఉండేదని ఎస్పీ నేత రైస్ షైక్ అన్నారు. 1994 లో దాన్ని రెండు రోజులకు పెంచారన్నారు. అయితే అయినప్పటికీ బీజేపీ సంతృప్తి చెందలేదని, బీఫ్‌ను కూడా నిషేధించాలనుకుందని అందుకే వారం రోజులపాటు నిషేధం విధించారని పేర్కొన్నారు. తర్వాత దాన్ని 4 రోజులకు తగ్గించారని, అయితే దీన్ని ప్రజలు సహించలేకపోయారని అన్నారు. తర్వాత పోలింగ్ ద్వారా నిర్ణయించారని చెప్పారు. ఎనిమిది రోజులు విధించండి: బీజేపీ వివాదం కోర్టులో ఉండగా ఏవిధంగా ఓటింగ్ నిర్వహిస్తారని, నిర్ణయం ఎలా తీసుకుంటారని బీఎంసీ న్యాయవిభాగానికి సోలిసిక్ లెక్స్ న్యాయవాద సంస్థ లేఖ రాసింది. వివాదం కోర్టులో ఉన్నప్పుడు మళ్లీ తెరపైకి తీసుకువచ్చి చర్చించడం ఎంత వరకు సమంజసమని లేఖలో ప్రశ్నించింది. బీఫ్ నిషేధంపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ముంబైలోని మటన్ డీలర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
హీరో, హీరోయిన్లకు కార్పొరేషన్ నోటీసులు
దేశంలో డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతుండటం, రాజధాని ఢిల్లీలో కూడా పలువురు దీనిబారిన పడి మరణించడంతో మునిసిపల్ కార్పొరేషన్లు అప్రమత్తం అయ్యాయి. నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ, అపరిశుభ్రంగా ఉన్న ఇళ్లకు నోటీసులు ఇస్తున్నాయి. తాజాగా ముంబై మహానగరంలో ఇలా పలు ప్రాంతాలను తనిఖీ చేసిన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు.. ప్రముఖ నటీ నటులు జూహీ చావ్లా, అనిల్ కపూర్, జితేంద్రలకు నోటీసులు ఇచ్చారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో దోమలు పెరిగేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలా లేకుండా చూసుకోవాలని ఇప్పటికే కార్పొరేషన్లు ప్రచారం చేస్తున్నాయి. అయినా తమ బంగ్లా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లే వీళ్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
దోచేస్తున్నారు..
♦ వినియోగదారులను అడ్డంగా దోచేస్తున్న నీటి మాఫియా ♦ ఇష్టారాజ్యంగా ట్యాంకర్ల ధరలు ♦ నీటి మాఫియాతో కుమ్మక్కైన బీఎంసీ ప్లంబర్లు ♦ చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ముంబై : జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటి పోతుండటంతో ఓ వైపు బీఎంసీ నీటి కోతలు విధిస్తుంటే, మరోవైపు నీటి మాఫియా దొరికిన కాడికి దోచుకుంటోంది. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతూ వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తోంది. గృహాలకు 20 శాతం నీటి కోత విధిస్తూ బీఎంసీ ఆదేశాలు జారీ చేసిన వెంటనే నీటి విక్రయ వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. దీంతో మురికివాడలు, నగర శివారుప్రాంతాల ప్రజలు పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో 20 నుంచి 50 లీటర్ల క్యాన్లను రూ. 40 నుంచి రూ. 200 కి అమ్మేవారని, ప్రస్తుతం నీటి కొరత ఉండటం, బీఎంసీ నీటి కోత విధించడంతో వాటి ధరలను దాదాపుగా రెట్టింపు చేశారని ఓ స్థానికుడు వాపోయాడు. ట్యాంకర్లకు రూ. 1800-2000 వరకు చెల్లించాల్సి వస్తోందని, అప్పడప్పుడు రూ.5 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ భారమూ మాపైనే.. ‘అంబుజ్వాడి, అజ్మీ నగర్, రాథోడ్ గ్రామం, మాల్వణీ చర్చ్, చికువాడి గ్రామాల్లో వర్షాలు కురిసినా, కురవకపోయినా నీటి కోత మాత్రం తప్పడం లేదు. నీటి మాఫియాకు ప్లంబర్లు అక్రమ కనెక్షన్లు ఇవ్వడంతో నీటి కొరత మరింతగా పెరిగిపోతోంది. మోటార్ పంపులతో నీటిని తోడేస్తున్నారు. దీంతో భారమంతా మాపై పడుతోంది.’ అని మాల్వణీలోని మలాడ్‌కు చెందిన సామాజిక కార్యకర్త నోయెల్ల వారెల చెప్పారు. అవసరం అలాంటిది.. సమాజ్‌వాది పార్టీ నేత రైస్ షాయిక్ మాట్లాడుతూ.. ‘గోవండీ, మాన్‌కుర్ద్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ దందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. 2005 తర్వాత మురికివాడలకు నీటి కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో ధరలను నీటి మాఫియా ఎంత పెంచినా అవసరం దృష్ట్యా కొనక తప్పడం లేదు’ అని చెప్పారు. సాధారణంగా నీటి కనెక్షన్లకు రూ.8000-9000 వరకు తీసుకుంటారని, ప్లంబర్లు నీటి సరఫరా శాఖకు సంబంధించిన అధికారులతో కుమ్మక్కై రూ. 25000 వేల వరకు ప్రజలనుంచి వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు, కొలబా మాజీ కార్పొరేటర్ వినోద్ శేఖర్ మాట్లాడుతూ.. నీటి సమస్యలను బీఎంసీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. నగరంలో నీటి సంరక్షణపై బీఎంసీకి తాను పలుమార్లు సూచించానని, కానీ ఇతర మార్గాలను బీఎంసీ అన్వేషించలేదని విమర్శించారు. గీతా నగర్, అంబేడ్కర్ నగర్ ప్రజలు నీటి కొరత వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. బకెట్ నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు. బీఎంసీ ఆధ్వర్యంలో 500 ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయని, నగరంలోని అన్ని ప్రాంతాలకు వీటిని పంపించలేమని, ఈ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని నగర పాలక సంస్థ అధికారులు చెప్పారు. నీటి కొరత ఎక్కువగా ఉన్నందున నగరంలో నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపేయాలని స్టాండింగ్ కమిటీ చైర్మన్ యషోదర్ పన్సే డిమాండ్ చేశారు. ఈ విషయమై అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సంజయ్ ముఖర్జీకి ఆయన లేఖ రాశారు. నిర్మాణ రంగాలకు నీటి సరఫరా నిలిపివేత వర్షాల ప్రభావం ముంబైలోని నిర్మాణ రంగంపైనా పడింది. కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్థాయి సమితి అధ్యక్షుడు యశోదర్ ఫన్సే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని బీఎంసీ అదనపు కమిషనర్ సంజయ్ ముఖర్జీని ఆదేశించారు. నగరానికి నీరు సరఫరా చేసే జలాశయాల్లో నిల్వలు కనిష్ట స్థాయికన్నా కిందికి దిగజారి పోవడంతో ముందు జాగ్రత్త చర్యగా నివాస గృహాలకు 20 శాతం, వాణిజ్య, వ్యాపార, హోటల్, మాల్స్‌కు 50 శాతం నీటి కోత విధించిన సంగతి విదితమే. ముంబైకర్లు నీటి కోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే బిల్డర్లు మాత్రం తాగు నీటిని వినియోగిస్తున్నారు. దీనిపై మండిపడ్డ పన్సే.. భవన నిర్మాణ రంగాలకు సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు. బీఎంసీ పరిధిలో 2,741 చోట్ల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులకు నీటి సరఫరా నిలిపివేయాలని, కేవలం అక్కడ పనిచేసే కూలీలు తాగేందుకు మాత్రమే సరఫరా చేయాలని ఫన్సే పేర్కొన్నారు. నిర్మాణ పనులకు ట్యాంకర్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని బిల్డర్లకు ఆయన సూచించారు. -
గణేశ్ ఉత్సవాలపై సందిగ్ధత
- నియమావళిని విడుదల చేయని బీఎంసీ - ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉత్సవ మండళ్లు - 30 రోజుల్లో మొదలుకానున్న ఉత్సవాలు సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాలు దగ్గర పడుతున్నా మండపాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనలపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఉత్సవ మండళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మండపాల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మండళ్ల పదాధికారులు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆంక్షలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో అనుమతులిచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. గణేశ్ ఉత్సవాలకు నెల రోజుల సమయమే ఉందని, అనుమతులిస్తే మండపాల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. భారీ గణేశ్ విగ్రహాలు ప్రతిష్టిం చే సార్వజనిక ఉత్సవ మండళ్లలో ఎక్కువగా ఫూట్పాత్లు, రహదారుల పక్కన మండపాలు ఏర్పాటు చేస్తాయి. దీంతో వాహనాల రాకపోకలకు, బాటసారులకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయని బాంబే హైకోర్టులో ప్ర జా ప్రయోజన వ్యాజ్యం గతంలో దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తుల బెంచి, మండపాలకు అనుమతిచ్చే ముందు వాహనాలకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని బీఎంసీని ఆదేశించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన బృ హన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ మం డళ్లు నిబంధనల్లో మార్పులు చేయాలని కోరు తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు వినతి పత్రం అందజేశాయి. సానుకూలంగా స్పందిం చిన సీఎం, తుది నిర్ణయం తీసుకోవాలని బీ ఎంసీ అధికారులకు సూచించారు. కాని గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన అనుమతుల ని యమావళి ఇంకా విడుదల చేయకపోవడంతో మండళ్ల పదాధికారులు గందరగోళంలో పడ్డా రు. పుణ్యకాలం కాస్తా గడచిపోయాక ప నులు ఎప్పుడు పూర్తి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడెట్లా..?: ప్రతి ఏడాది ఉత్సవాలకు 45 రోజుల ముందు బీఎంసీ అనుమతివ్వగానే ట్రాఫిక్ శాఖ, స్థానిక పోలీసు స్టేషన్, అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తారు. కాని ఈసారి 30 రోజులే మిగిలి ఉండడంతో వివిధ శాఖల నుంచి అనుమతులు ఎప్పుడు తీసుకోవాలి, పనులు ఎప్పుడు ప్రారంభించాలో తెలియక నిర్వాహకులు సందిగ్ధంలో పడిపోయారు. -
బస్ పాస్ చార్జీల తగ్గింపు
సాక్షి, ముంబై : విద్యార్థుల సీజన్ పాస్ చార్జీలు తగ్గించాలని బెస్ట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మాస, త్రైమాసిక, ఆర్ధవార్షిక సీజన్ పాస్ పొందే విద్యార్థులకు రూ.25 నుంచి రూ.100 వరకు తగ్గించనున్నట్లు బెస్ట్ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు భారీగా రాయితీ కల్పించింది. మొన్నటి వరకు విద్యార్థులు రూ.200 చెల్లిస్తుండగా, ఇకనుంచి బీఎంసీ పాఠశాలల విద్యార్థులు రూ.150, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే త్రైమాసిక పాస్ పొందే విద్యార్థులు రూ.550 చెల్లిస్తుండగా ఇక నుంచి బీఎంసీ పాఠశాల విద్యార్థులు రూ.450, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఆరు నెలల పాస్ పొందే విద్యార్థులు రూ.1000 చెల్లించేవారు. ఇక నుంచి బీఎంసీ విద్యార్థులు రూ.750, ప్రైవేటు విద్యార్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి రెండు రెట్లు పెంపు రెండేళ్ల కిందట నెల పాస్‌కు రూ.90 వసూలు చేసేవారు. అయితే గత విద్యా సంవత్సరంలో దాన్ని రూ.135, తరువాత కొద్ది రోజులకు రూ.165 పెంచారు. ఇప్పుడేమో రూ.200 పెంచేశారు. దీంతో బెస్ట్ పరిపాలన విభాగం తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్తో భేటీ అయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులపై పడుతున్న చార్జీల భారం గురించి వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన సుధీర్, బెస్ట్ జనరల్ మేనేజరు జగ దీశ్ పాటిల్‌తో మంత్రాలయలో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గిస్తారో, లేక రవాణా పన్ను చెల్లిస్తారో ఆలోచించుకోవాలని జగదీశ్‌కు సూచించారు. బెస్ట్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం చార్జీలు తగ్గించాలనే నిర్ణయానికొచ్చినట్లు మునగంటివార్‌కు జగదీశ్ తెలిపారు. అనంతరం చార్జీల తగ్గింపు ప్రతిపాదన రూపొందించి బెస్ట్ స్థాయి సమితి ముందుంచి ఆమోదం పొందేలా చేసినట్లు చెప్పారు. దీంతో విద్యార్థులకు చార్జీల భారం నుంచి ఊరట లభించినట్లయింది. -
‘ఆర్‌హెచ్‌పీ’ చేపట్టే సొసైటీలకు రాయితీ
♦ ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వనున్న బీఎంసీ ♦ నీటి నిల్వలు పడిపోతున్న నేపథ్యంలో నిర్ణయం ♦ త్వరలో స్థాయీసమితి ముందుకు ప్రతిపాదన సాక్షి, ముంబై : నగరంలో ‘రెయిన్ హార్వెస్టింగ్ ప్రాజెక్టు’ (ఆర్‌హెచ్‌పీ) ఏర్పాటు చేసుకునే సొసైటీలకు ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వాలని బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పరిపాలన విభాగం యోచిస్తోంది. రెయిన్ హార్వెస్టింగ్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీఎంసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒక పక్క ముంబైలో కొత్తగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బహుళ అంతస్తుల భవనాల వల్ల నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మరోపక్క తారు రోడ్లన్నీ సిమెంట్, కాంక్రీట్ (సీసీ) రోడ్లుగా మారడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ముంబైలో నీటి కొరత సమస్య ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని గ్రహించిన బీఎంసీ పరిపాలన విభాగం, కొత్తగా నిర్మించే భవనాల్లో రెయిన్ హార్వెస్టింగ్ ప్రాజెక్టు తప్పనిసరిగా చేపట్టాలని నిబంధనలు విధించింది. తొలుత విముఖత ఆర్‌హెచ్‌పీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో బిల్డర్లు తొలుత విముఖత చూపించారు. ఈ ప్రాజెక్టు చేపట్టే సొసైటీలకు ఆస్తి పన్నులో రాయితీ ఇస్తామని బీఎంసీ చివరకు ప్రకటించింది. అయినా స్థలం కొరత వల్ల ప్రాజెక్టు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొత్తగా నిర్మించే భవనాల టై, కాంపౌండ్‌లో 300 చదరపు మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వైశాల్యంలో చేపట్టే సొసైటీలకు ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వాలని యోచిస్తోంది. నగరంలోఉన్న భవనాలు, చాల్స్, మురికివాడల్లో పొగైన చెత్తను తరలించేందుకు అవసరమైన ప్లాస్టిక్ కుండీలను బీఎంసీ త్వరలో కొనుగోలు చేయనుంది. -
మొరాయించిన డాప్లర్ రాడార్
నెల రోజులుగా పనిచేయని వైనం మరమ్మతులు చేపట్టండి: వాతావరణ శాఖకు బీఎంసీ లేఖ సాక్షి, ముంబై : వాతావరణ వివరాలు తెలిపేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఏర్పాటుచేసిన ‘వెదర్ డాప్లర్ రాడార్’ నెల రోజులుగా మొరాయిచింది. దీంతో నగరానికి సంబంధించిన వాతావరణ వివరాలు తెలియక బీఎంసీ ఇబ్బందిపడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముందుస్తు సమాచారం లేకపోవడంతో బీఎంసీ అత్యవసర విభాగం ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చింది. దీంతో వెంటనే రాడార్‌కు మరమ్మతులు చేయాలని వాతావరణ శాఖకు బీఎంసీ లేఖ రాసింది. డాప్లర్ రాడార్ ద్వారా 500 కి.మీ. పరిధిలోని తుఫాను, వర్షాలు, ఇతర వాతావరణ వివరాలు అందిస్తుంది. అయితే నెల రోజుల నుంచి రాడార్ పనిచేయకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బీఎంసీ అత్యవసర విభాగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయింది. 2005 జూలై 26న నగరంలో భారీ వరదలు రావడంతో 200 మంది ప్రజలు చనిపోయారు. రూ. కోట్లల్లో ఆస్తి నష్టం వాటిళ్లింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని ముంబైలో రెండు ప్రాంతాల్లో వెదర్ డాప్లర్ రాడర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2010లో నేవీ నగర్లో అర్చన భవనంపై రూ. 12 కోట్లతో రాడార్ ఏర్పాటు చేసింది. మరో రాడార్ ఏర్పాటుకు ఇంత వరకు అనువైన స్థలం లభించకపోవడంతో అది అలాగే ఉండిపోయింది. అయితే నెల రోజులుగా రాడార్ పని చేయకపోవడంతో వాతావరణ శాఖ వెల్లడించే సమాచారంపైనే ఆధారపడాల్సి వస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. -
శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ‘చెరువు’ జగడం
సాక్షి, ముంబై : ఓపెన్ ఎయిర్ జిమ్‌పై కాంగ్రెస్, శివసేన యువ నాయకుల మధ్య వాగ్వివాదం మరువకముందే తాజాగా మరో వివాదం తెరమీదకు వచ్చింది. భాండూప్ ప్రాంతంలో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చేపట్టిన చెరువు సుందరీకరణ పనులపై శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మధ్య వివాదం ముదురుతోంది. చెరువు సుందరీకరణ తమ ప్రయత్నం వల్లే జరిగిందని ఇరు పార్టీలు వాదించుకుంటున్నాయి. రెండు పార్టీల మధ్య వివాదం ఎక్కువవుతుండటంతో చెరువు ప్రారంభోత్సవం ఎవరి చేతులమీదుగా జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. పశ్చిమ భాండూప్‌లోని 108 వార్డులోని శివాజీ (కొలను)లో 25 ఏళ్లుగా బురద, చెత్త పేరుకుపోవడంతో కొలను పరిస్థితి దారుణంగా తయారైంది.దీంతో చెరువును సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెన్నెస్ మాజీ ఎమ్మెల్యే శిశీర్ షిండే, ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లు రూపేశ్ వాయంగన్కర్, వైష్ణవి సర్ఫరే, అనిషా మాజ్గావ్కర్ పలుమార్లు డిమాండ్ చేశారు. తర్వాత బీఎంసీ రూ.రెండు కోట్లతో కొలను సుందరీకరణ పనులు చేపట్టింది. దీంతో తమ వల్లే చెరువు సుందరీకరణ సాధ్యమైందని ఎమ్మెన్నెస్ నాయకులు వాదిస్తున్నారు. సేన ప్రమేయంతోనే..: కార్పొరేటర్ రమేశ్ దీనిపై భాండూప్ ప్రాంతానికి చెందిన శివసేన సీనియర్ కార్పొరేటర్ రమేశ్ కోర్గావ్కర్ మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణ పనులకోసం శివసేన బడ్జెట్లో నిధులు కేటాయించిందని చెప్పారు. పార్టీ అభివృద్ధి నిధి నుంచి అదనంగా రూ. 50 లక్షలు అందించినట్లు కూడా పేర్కొన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా తరచూ బీఎంసీ కమిషనర్, మేయర్‌తో సేన సంప్రదింపులు జరిపిందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు అనేక సమావేశాలు నిర్వహించామని చెప్పారు. చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో చెరువు సుందరీకరణ పనుల కీర్తి దక్కించుకునేందుకు ఎమ్మెన్నెస్ ఈవిధమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు. కాగా, చెరువు సుందరీకరణ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేతులు మీదుగా జరగాలని ఎమ్మెన్నెస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరగాలని బీఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. దీంతో ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరుగుతుందని స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. -
‘కోస్టల్’తో మత్స్యకారులకు ముప్పే
మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందంటున్న నిపుణులు {పాజెక్టు మొదలైతే అందరూ ఖాళీ చేయాల్సిందే.. {పపంచస్థాయి నిపుణులతో పనులు చేపడతాం: బీఎంసీ సాక్షి, ముంబై : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కోస్టల్ రోడ్డు ప్రాజెక్టు వల్ల మత్స్యకారుల జీవితం పడనుందా, అంటే అవునునే అంటున్నారు నిపుణులు. సముద్రంలో భారీ ఎత్తున మట్టి పోయడం వల్ల నీరు మత్స్యకారుల వాడల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, వారు మరొక చోటికి తరలిపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. సుమారు 15 కి.మీ. పొడవైన నారిమన్ పాయింట్-కాందివలీ కోస్టల్ రోడ్డు నిర్మాణం మెరైన్ డ్రైవ్, ప్రియదర్శిని గార్డెన్ నుంచి మహాలక్ష్మి వరకు, వర్లీ సీ ఫేస్‌లో సముద్ర మార్గం గుండా వర్సోవా నుంచి కాందివలీ వరకు ఖాడీలో ఉంటుంది. ఈ మార్గంలో మత్స్యకారులకు ఆటంకం కలగకుండా అక్కడక్కడ వంతెనలు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అయితే చేపల వేటకు సౌకర్యవంతంగా ఉంటుందని నగరంలోని సముద్ర తీరప్రాంతాల వెంబడి అనేక కోళి వాడలు (మత్స్యకారుల బస్తీలు) వెలిశాయి. లాంచీల్లో చేపల వేటకు వెళ్లడానికి, తిరిగి రావడానికి ఈ తీర ప్రాంతాలు వారికి ఎంతో దోహదపడతాయి. కాని సముద్రంలో భారీ స్థాయిలో మట్టి వేసి నిర్మించే రోడ్డు కారణంగా జుహు, మోరాగావ్, తారాగావ్, ఖార్దాండ, బాంద్రాలోని చింబయ్ గావ్, నారిమన్ పాయింట్‌లోని బద్వార్ పార్క్ ప్రాంతాల్లోని మత్స్యకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుందని తెలుస్తోంది. నిపుణులేమంటున్నారంటే.. బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఇంతవరకు ఏ పని సక్రమంగా చేపట్టలేదని, బాంద్రా-వర్లీ సీ లింకు వంతెన పిల్లర్ల కారణంగా దాదర్ చౌపాటి కనుమరుగైపొతోందని పర్యావరణ నిపుణుడు డేబీ గోయంకా అన్నారు. సముద్రపు ఆలల తాకిడి వల్ల 300 ఏళ్ల చరిత్ర ఉన్న మహీం కిల్లా గోడలకు బీటలు వారాయి. కేవలం పిల్లర్లకే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే ఇక సముద్రంలో మట్టివేసి రోడ్డు నిర్మిస్తే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సముద్రంలో మట్టి వేస్తే నీరు చుట్టుపక్కలున్న బస్తీల్లోకి చొచ్చుకుపోతుందని సముద్ర జీవాల అధ్యయనకారుడు సాగర్ కులకర్ణి అన్నారు. మట్టివేసే ముందు భారీ అలల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అక్కడ 30 శాతం ఇలానే.. సింగాపూర్ దేశం 30 శాతం సముద్రంలో భారీ స్థాయిలో మట్టి వేసి నిర్మించినదే. కోస్టల్ రోడ్డు నిర్మాణం కోసం పనులు ప్రారంభించే ముందు ప్రపంచ స్థాయి నిపుణులను నియమిస్తాం. కనీసం రెండు దేశాల్లో ఇలాంటి పనుల్లో అనుభవం ఉన్నవారినే నియమిస్తాం’ అని బీఎంసీ కమిషనర్ అజేయ్ మెహతా తెలిపారు. -
‘క్లీన్ ఆఫ్ మార్షల్స్’ పునఃప్రారంభం
♦ నిర్ణయం తీసుకున్న బీఎంసీ ♦ టెండర్ల ప్రక్రియ ప్రారంభం సాక్షి, ముంబై : కొన్ని నెలల కిందట రదు ్ద చేసిన ‘క్లీన్ ఆఫ్ మార్షల్స్’ పథకాన్ని పునఃప్రారంభించాలృ బహన్‌ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందుకోసం టెండర్లు ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభించింది. అయితే ముందు జాగ్రత+్త చర్యగా క్లీన్ ఆఫ్ మార్షల్స్‌కు అప్పగించిన కొన్ని అధికారాలను తగ్గించాలని నిర్ణయించింది. రోడ్లు, ఫూట్పాత్లు, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు విసర్జించడం, బట్టలు ఉతకడం, వాహనాలు శుభ్రం చేయడం, ఉమ్మివేయడం, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం వంటి పరిసరాలను అశుభ్రపరిచే చర్యలకు పాల్పడే వారికి శిక్ష విధించేందుకు 2007లో క్లీన్ ఆఫ్ మార్షల్స్ పథకాన్ని బీఎంసీ ప్రారంభించింది. ఇందుకోసం ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఒక్కో వార్డుకు 11 మంది చొప్పున మార్షల్స్‌ను నియమించింది. ప్రారంభంలో అంతా సవ్యంగానే సాగినా, రానురాను ఈ అధికారాలను కొందరు దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. షాపులు, క్లినిక్‌లు, హాకర్స్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడడం, జరిమానా పేరుతో ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో బీఎంసీ ఈ పథకాన్ని రెండేళ్లకే అటకెక్కించింది. తరువాత రెండుసార్లు పునఃప్రారంభించినా మళ్లీ రద్దు చేసింది. కాని ఈ సారి పకడ్బంధీగా మార్షల్స్ నియామక ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు కొత్త కంపెనీకి కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది. -
పాఠశాలకు వెళ్లని చిన్నారులు 8000
బీఎంసీ సర్వేలో వెల్లడి సాక్షి, ముంబై : నగరంలో దాదాపు 8,126 మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లడంలేదని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వీరిలో 4,480 మంది బాలురు, 3,646 మంది బాలికలు ఉన్నారని తేలింది. సర్వే కోసం 14,124 కార్పొరేషన్ సిబ్బందిని బీఎంసీ నియమించింది. వీరితోపాటు 11,587 టీచర్లు కూడా సర్వేలో పాల్గొన్నారు. విద్యను అభ్యసించని చిన్నారలను గుర్తించడానికి సర్వే చేపట్టినట్లు బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా హన్స్‌రాజ్ మోరార్జీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయుడు మోహన్‌దాస్ పూజారి మాట్లాడుతూ.. జూహూలో జూహూ వీధి, దంగర్‌వాడి లోని దాదాపు 40కి పైగా కుటుంబాలను సందర్శించామని, అక్కడ పాఠశాలకు వెళ్లని 10 మంది పిల్లలను గుర్తించామని తెలిపారు. వీరి వివరాలు అధికారులకు అందజేశామన్నారు. మురికి వాడలను, ఇటుక బట్టీలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఫూట్ పాత్లపై తిరుగుతూ పాఠశాలలకు వెళ్లని చిన్నారులను టీచర్లు గుర్తించాల్సిందిగా అన్ ఎయిడెడ్ స్కూల్స్ ఫారమ్ సభ్యులకు పుణే మున్సిపల్ కార్పోరేషన్, ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. -
ముంబై ఎన్సీపీ అధ్యక్షుడిగా సచిన్ అహిర్
♦ వెల్లడించిన రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే ♦ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నవాబ్ మలిక్ నియామకం ♦ బీఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న అహిర్ సాక్షి, ముంబై : బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న తరుణంలో ఎన్సీపీ ముంబై అధ్యక్షునిగా మాజీ మంత్రి సచిన్ అహిర్‌ను ఎంపిక చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని పదవితోపాటు ముఖ్య అధికార ప్రతినిధిగా, ముంబై యూనిట్ ఇన్చార్జిగా నవాబ్ మలిక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరితోపాటు జిల్లాలవారి అధ్యక్షులను కూడా ప్రకటించారు. ముంబై ఎన్సీపీ అధ్యక్షుని రేసులో సచిన్ అహిర్తోపాటు కిరణ్ పావస్కర్, నవాబ్ మలిక్, సంజయ్ దీనా పాటిల్‌ల పేర్లను చర్చించారు. కాగా ఎన్సీపీ అహిర్‌ను ముంబై అధ్యక్షునిగా ఎంపిక చేసింది. గతంలో సచిన్ అహిర్ గృహనిర్మాణ శాఖ సహాయక మంత్రులుగా, ముంబైలో ఉట్టి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరపపి తనదైన ముద్రవేసుకున్నారు. మిల్లు కార్మికుల సమస్యలపై ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ యూనియన్‌లో విధులు నిర్వహించారు. మరోవైపు ‘ఇంటక్ కామ్‌గార్ యూనియన్’ అధ్యక్షుని పదవి కూడా చేపట్టారు. స్వతంత్రంగా పోటీ చేస్తాం : అహిర్ రాబోయే ఎన్నికల్లో పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని అహిర్ తెలిపారు. గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడం వల్ల తమ పార్టీ ప్రజల్లో గుర్తింపు పొందలేకపోయిందన్నారు. ఓటు బ్యాంకును పెంపొందించకోలేక పోయామన్నారు. బూత్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి మొత్తం 227 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. దహీహందీ, నవరాత్రి, గణేశ్ ఉత్సవాలు, పండుగల సమయంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై మందిరాల ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. దహీ హందీ విషయమై గతంలో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, అప్పుడు కోర్టు స్టే ఇచ్చిందన్నారు. పండుగలకు అంతరాయం కలిగించకూడదనీ, పండుగలు నగరాలు ఏర్పడకముందే మొదలయ్యాయని చెప్పారు. ముంబై ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీని త్వరలో వెల్లడిస్తామని తట్కరే అన్నారు. 100 మందిని బలిగొన్న కల్తీసారా కేసు, రైతుల సమస్యలు, బీజేపీ మంత్రులపై అవినీతి ఆరోపణలను త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని ఆయన అన్నారు. -
ప్రైవేటు విద్యాసంస్థలపై ‘అద్దె’ భారం
- 10 శాతం పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్న బీఎంసీ - గడిచిన రెండేళ్ల నుంచే అమల్లోకి అని వెల్లడి - తాజా నిర్ణయంతో పాఠశాలలు మూత పడే అవకాశం! సాక్షి, ముంబై: బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాఠశాలల భవనాలను అద్దెకు తీసుకుని నడుపుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఆర్థిక భారం పడనుంది. ఆ భవనాల అద్దెను పది శాతం పెంచుతున్నట్లు బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు గడిచిన రెండేళ్ల నుంచి వర్తిస్తుందని చెప్పి మరో పిడుగు వేసింది. ఈ మేరకు రెండేళ్లకు ఒక్కో విద్యా సంస్థ రూ. మూడు లక్షల నుంచి రూ. నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు మరాఠీ పాఠశాలలు మూతపడ్డాయి. ఇక అంతంత మాత్రంగా నడుస్తున్న స్కూళ్లపై భారం మోపేందుకు బీఎంసీ సిద్ధపడటంతో చాలా పాఠశాలలు మూత పడే అవకాశం కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి (నైట్ స్కూల్స్) నడిచే ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ముంబైలో ఉన్న సుమారు 289 పాఠశాలల్లో 70 శాతం బీఎంసీ ఆధ్వరంలో నడుస్తుండగా, మిగతా 30 శాతం పాఠశాలల భవనాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. ఇందుకు 2013 నుంచి ప్రతి తరగతి గదికి రూ. వెయ్యి చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. పాత బకాయిలు చెల్లించడానికే విద్యా సంస్థలు నానాతంటాలు పడుతుంటే ఈ పెంపు మరింత భారం కానుంది. ప్రభుత్వం ఇదివరకే వేతనేతర పాఠశాలలకు గ్రాంట్లు మంజూరు చేయడం కూడా నిలిపివేయడంతో.. తాజా నిర్ణయం మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మారింది. అద్దె పెంపును రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, బీఎంసీ స్థలాల్లో అనేక స్వయం సేవా సంస్థలు తమ కార్యకలాపాలు, తరగతులు జరుగుతున్నాయి. ఇందుకు బీఎం సీ నుంచి ఆర్థిక మద్దతు, రాయితీ లభిస్తోంది. -
‘ప్రిన్సెస్’ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులు ప్రారంభం
- రూ. 68 లక్షలు కేటాయించిన బీఎంసీ - రెండు దశల్లో ఈ నెల 18 నుంచి 24 వరకు మరమ్మతు పనులు - పనులు పూర్తయ్యే వరకు భారీ వాహనాల ప్రవేశం నిషేధం సాక్షి, ముంబై: మెరిన్లైన్స్ స్టేషన్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లై ఓవర్ మరమ్మతు పనులను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోమవారం నుంచి ప్రారంభించనుంది. ఈ బ్రిడ్జిలోని దాదాపు 36 జాయింట్లకు మరమ్మతు చేపట్టనున్నారు. 50 ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ మరమ్మతులకు రూ.68 లక్షలు వెచ్చించనున్నట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ పనులను రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశ పనులను ఈ నెల 18 నుంచి 24 వరకు, రెండో దశ పనులు 24 నుంచి 31వ తేదీ వరకు చేపట్టనున్నారు. బ్రిడ్జిల విభాగ చీఫ్ ఇంజనీర్ ఎస్.ఓ.కోరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరమ్మతు పనులకు సంబంధించిన అన్ని అనుమతులను ఇదివరకే తీసుకున్నామని, రెండు దశల్లో ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన పనులు కూడా ఇదివరకే నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మొదటి దశ పనుల్లో ఎన్.ఎస్.రోడ్, శ్యామల్‌దాస్ గాంధీ మార్గ్ నుంచి ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లై ఓవర్‌కు వచ్చే భారీ వాహనాలకు ఎంట్రీని నిషేధించామని తెలిపారు. శ్యామల్‌దాస్ గాంధీ మార్గ్ నుంచి వచ్చే వాహనాలు ఈ ఫ్లైఓవర్ ఎడమ వైపు నుంచి వెళ్లాలని, లేదా నేరుగా ఎం.కె.రోడ్‌కు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. 18వ తేదీ నుంచి బ్రిడ్జి మరమ్మత్తు పనులు పూర్తయ్యేవరకు శ్యామల్ దాస్ గాంధీ మార్గ్ రోడ్డు ఇరు వైపులా వాహనాలు పార్క్ చేయకూడదని అన్నారు. మార్గ్ నుంచి శ్రీ పటన్ జైన్ మండల్‌కు వచ్చే వాహనాలు ఈ ఫ్లై ఓవర్‌పై నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎన్.ఎస్.రోడ్లో ప్రవేశించి తర్వాత మఫత్‌లాల్ బత్ సిగ్నల్ నుంచి యూ టర్న్ తీసుకొని నేరుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బ్రిడ్జిల మరమ్మతులు చేయాల్సిందిగా బీఎంసీకి చెందిన స్టాండింగ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (ఎస్టీఏసీ) సిఫార్సు చేసింది. 2009-10 నుంచి బ్రిడ్జిల స్థితి గతులపై అధ్యయనం నిర్వహించింది. 57 బ్రిడ్జిల్లో 34 అపాయకరంగా ఉన్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి మరమ్మత్తులు నిర్వహించడం ఇదే తొలిసారి. -
అన్ని విధాల ఆదుకుంటాం
- కాల్బాదేవి మృతుల కుటుంబాలకు చేయూత - కుటుంబంలో ఒకరికి ఉద్యోగం - గాయపడ్డవారికి బీఎంసీ సొంత ఖర్చుతో వైద్యం - వెల్లడించిన కమిషనర్ అజయ్ మెహతా సాక్షి, ముంబై: కాల్బాదేవిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ముంబై అగ్నిమాపక దళం రీజియన్ అధికారి సంజయ్ రాణే కొడుకు రాజ్, అగ్నిమాపక కేంద్రం అధికారి మహేంద్ర దేశాయి సతీమణి మానసీకి బీఎంసీలో ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కమిషనర్ అజయ్ మెహతా వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన జవాన్ల వైద్యానికయ్యే ఖర్చు కూడా బీఎంసీ భరిస్తుందని చెప్పారు. ఇద్దరు అధికారుల పిల్లల చదువులకయ్యే ఖర్చు, శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయాలని పరిపాలన విభాగానికి ఆయన ఆదేశించారు. విధి నిర్వహణలో ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలను ఆదుకోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఇందుకోసం అన్ని విధాల సాయం చేస్తామని మెహతా వెల్లడించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ నియమించామని అన్నారు. మూడు వారాల్లో కమిటీ నివేదిక అందజేస్తుందని చెప్పారు. రాజ్ ఠాక్రే పరామర్శ కాల్బాదేవిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న అగ్నిమాపక అధికారులు, జవాన్లను మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పరామర్శించారు. మంగళవారం ఉదయం నవీముంబై ఐరోలిలోని బర్న్ ఆస్పత్రికిలో గాయపడిన సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను కలిశారు. మృతి చెందిన ఇద్దరు అధికారుల కుటుంబ సభ్యులతో ఠాక్రే భేటీ అయ్యారు. ప్రభుత్వంతో చర్చించి బీమా పాలసీ, ఇల్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాల్బాదేవిలోని వందేళ్ల పురాతన గోకుల్ భవనానికి శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటలార్పే ప్రయత్నంలో ఇద్దరు వృుతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిలో 50 శాతం గాయాలైన సునీల్ నేస్రికర్, 90 శాతం కాలిన సుధీర్ అమిన్ ఆరోగ్యం విషమంగా ఉందని, వీరిన 24 గంటలు ప్రత్యేక వైద్యులృబందం పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్న డాక్టర్ సునీల్ కస్వాణి చెప్పారు. ఆడిట్‌పై అధికారుల నిర్లక్ష్యం సాధారణంగా 15 ఏళ్ల కంటే పురాతన, ప్రమాదకర భవనాలను స్ట్రక్చరల్ ఆడిట్ చేయించుకోవాలని బీఎంసీ నోటీసులు జారీ చేస్తుంది. ఆడిట్ నివేదికను సొసైటీ యాజమాన్యాలు బీఎంసీకి అందజేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నివేదిక సమర్పించని వారిపై బీఎంసీ కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆడిట్ నామమాత్రంగా జరుగుతోంది. దీంతో స్ట్రక్చరల్ ఆడిట్ నివేదిక సమర్పించే బాధ్యతలను ఐఐటీలో శిక్షణ పొందిన ఇంజినీర్ల ద్వారా సేకరించాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కూడా పాత భవనాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాత భవనాలకు స్ట్రక్చరల్ ఆడిట్ కాల్బాదేవిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కళ్లు తెరిచింది. నగరంలోని పాత, శిథిలావస్థకు చేరుకున్న భవనాలను ‘స్ట్రక్చరల్ అండ్ ఫైర్ ఆడిట్’ చేయాలని నిర్ణయం తీసుకుంది. రహదారులపై మూసుకుపోయిన ‘హైడ్రంట్’ పరికరాలను మళ్లీ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ ముంబైలోని కాల్బాదేవిలో వందేళ్లనాటి గోకుల్ నివాస్ భవనంలో శనివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ రీజినల్ అధికారి సంజయ్ వామన్, భాయ్కళా అగ్నిమాపక కేంద్రం చీఫ్ మహేంద్ర దేశాయి మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీఎం ఫడ్నవీస్ బీఎంసీని ఆదేశించారు. దీంతో ఇలాంటి సంఘటనలు పునరాృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. అందుకు స్ట్రక్చరల్ అండ్ ఫైర్ ఆడిట్ చేపట్టాలని నిర్ణయించింది. ఐఐటీలో శిక్షణ పొందిన ఇంజినీర్ల ద్వారా బీఎంసీ ఆడిట్ జరిపించనుంది. ఇందులో భాగంగా గోడలు, భవన నిర్మాణాలకు వాడిన ఇనుప చువ్వలను పరీక్షించనున్నారు. మరోవైపు నగరంలోని ప్రమాదాలు నివారించడానికి నీటి సరఫరా చేసే ‘హైడ్రంట్’ పరికరాలను తిరిగి ప్రారంభించాలని చూస్తోంది. -
రాష్ట్రంలో నీటి కటకట
- గతేడాదితో పోల్చితే గణనీయంగా తగ్గిన నిల్వలు - ఆందోళన చెందుతున్న ముంబై ప్రజలు - జూలై 31 వరకు సరిపడే నిల్వలున్నాయి: బీఎంసీ సాక్షి ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 30 శాతం కంటే తక్కువ నీటి నిల్వలు ఉన్నట్లు స్పష్టమైంది. జూన్ మొదటి వారంలో వర్షాలు మొదలవకపోతే పరిస్థితి తీవ్ర రూపం దాల్చనుంది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం నీటి నిల్వలు ఘననీయంగా తగ్గాయి. రాష్ట్రంలోని మరాఠ్వాడా, విదర్భలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలు దాటిపోతుండటంతో నిల్వలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయమై బీఎంసీ నీటి సరాఫరాల శాఖ చీఫ్ ఇంజినీర్ రమేశ్ బాంబ్లే మాట్లాడుతూ.. ముంబై నగరానికి నీటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. నగరానికి నీరు సరాఫరా చేసే జలాశయాల్లో జూలై 31 వరకు సరిపడే నిల్వలు ఉన్నాయని అన్నారు. ఈ విషయమై నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరం లేదని చెప్పారు. ప్రస్తుతం బీఎంసీ వద్ద నాలుగు లక్షల మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉందన్నారు. ముంబైకర్లకు ప్రతిరోజు 3,750 ఎమ్మెల్డీల (మిలియన్ లీటర్స పర్ డే) నీరు అవసరమని, దీన్ని బట్టి నీటి సరఫరాపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని బీఎంసీ అధికారులు తెలిపారు. గతంలో జూన్ చివరి తేదీని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాపై అధికారులు ప్రణాళికలు రూపొందించేవారు. కాని సమయానికి వర్షాలు కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటం వల్ల ప్రస్తుతం జులై 31 వ తేదీ వరకు నీటిని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నగరానికి నీటి సరఫరాచేసే బాత్సా, మోడక్‌సాగర్, మధ్య వైతర్ణ, విహార్, తులసీ, తాన్సా తదితర జలాశయాల్లో ప్రస్తుతం జూలై 31 వరకు సరిపోయే విధంగా నిల్వలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నెల రోజుల ముందు వాతావరణ శాఖ నుంచి వర్షానికి సంబంధించిన వివరాలు లభిస్తాయి. కాగా, ఈ సారి అనుకున్న సమయానికన్నా ముందే వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. అయితే ఒకవేళ వర్షాలు ఆలస్యమైతే నగరంలో ఎంత శాతం మేర నీటి కోత అమలు చేయాలనే విషయంపై బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. -
పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదు
- నాలాలు శుభ్రం చేసే పనులు మందకోడిగా సాగుతున్నాయి - ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎంసీ కార్పొరేటర్లు - 40 శాతం పనులు పూర్తయ్యాయన్న కార్పొరేషన్ సాక్షి, ముంబై: నగరంలో మురికి కాల్వలు, నాలాలు శుభ్రపరిచే పనులు 20 శాతం కూడా పూర్తికాలేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా మే మాసం వచ్చే సరికి 50 శాతం మురికి కాల్వలు, నాలాల పనులు పూర్తవుతాయని, కానీ ఈ ఏడాది ఇప్పటి వ రకు పనులు అనుకున్న మేర జరగలేదని కార్పొరేటర్లు ఆరోపించారు. వర్షాకాలానికి ఇంకా నెల రోజులు కూడా సమయం లేదని హెచ్చరించారు. నగరంలో 1.75 లక్షల మురికి కాల్వలు 45 పెద్ద నాలాలు, 38 చిన్న నాలాలు ఉన్నాయి. వీటిలో పేరుకుపోయిన చెత్త, బురద వెలికితీసే పనులు 40 శాతం పూర్తయ్యాయని బీఎంసీ పరిపాలన విభాగం వెల్లడించింది. కాని వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో నాలాల నుంచి బయటకు తీసిన బురద, చెత్త అలాగే పడి ఉందని, దీంతో దుర్గంధం వ్యాపించడంతో ప్రజలనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు మందకోడిగా సాగుతున్నాయన్నారు. ఇచ్చిన సమయానికల్లా కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాలని నిబంధనలు ఉన్నాయని, అయితే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా నాలాలు శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. -
‘కాల్బదేవీ’ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించండి
- బీఎంసీని ఆదేశించి సీఎం ఫడ్నవీస్ - మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ - గాయపడ్డ సిబ్బంది వైద్యం ఖర్చు భరిస్తామన్న బీఎంసీ - ప్రభుత్వ సాయాన్ని వారంలోగా అందిస్తామని స్పష్టం సాక్షి, ముంబై: కాల్బాదేవిలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్‌ను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. దక్షిణ ముంబైలోని కాల్బాదేవి ప్రాంతంలో వందేళ్ల గోకుల్ నివాస్ భవనంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మంటలను అదుపుచేసే ప్రయత్నంలో ఇద్దరు జవాన్లు మర ణించగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని అగ్నిమాపక దళం అసిస్టెంట్ ఆఫీసర్ సంజయ్ రాణే, బైకల్లా కేంద్రం అధికారి మహేంద్ర దేసాయిగా గుర్తించారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన జవాన్లకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. బైకల్లాలోని అగ్నిమాపక ప్రధాన కేంద్రంలో సందర్శనార్థం ఉంచిన జవాన్ల భౌతిక కాయాలకు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శ్రద్ధాంజలి ఘటించారు. గాయపడిన జవాన్ల వైద్యం ఖర్చు భరిస్తామని బీఎంసీ ప్రకటించింది. జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన చెల్లింపులు వారం రోజుల్లో అందజేస్తామని బీఎంసీ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. శర్మిలా ఠాక్రే పరామర్శ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే భార్య శర్మిలా ఠాక్రే, తనయుడు అమిత్ ఠాక్రే అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. హిట్ అండ్ రన్ కేసులో ముద్దాయి సల్మాన్‌ఖాన్‌తో భేటీ అయ్యేందుకు వెళ్లిన రాజ్ ఠాక్రే, నితేశ్ రాణేలకు.. విధి నిర్వాహణలో ప్రాణాలు పొగొట్టుకున్న జవాన్ల కుటుంబాలను పరామర్శించేందుకు సమయం లేదా అనే విమర్శలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో శర్మిలా, అమిత్ ఠాక్రేలు జవాన్ల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లడం విశేషం. ఫైర్ అధికారులు చనిపోవడం బాధాకరం: గవర్నర్ కాల్బదేవి ఘటనలో ఇద్దరు సీనియర్ అధికారులు మృతి చెందడంపై రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు విచారం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో అధికారులు చనిపోవడం బాధాకరమైన విషయం అని ఆయన అన్నారు. అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన చీఫ్ ఫైర్ అధికారి, ఇతర సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆశించారు. -
‘ప్రచారానికి’ గ్రీన్ సిగ్నల్..?
సాక్షి, ముంబై: వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే బ్యానర్లు, ఫ్లెక్సీల ద్వారా అదనపు ఆదాయం పొందేందుకు బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కార్పొరేటర్ల సూచనలతో మెట్రో, మోనో రైలు మార్గం పిల్లర్లపై బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తే బీఎంసీ ఖజానాకి అదనపు ఆదాయం వస్తుందని వారు భావిస్తున్నట్లు తెలిసింది. బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా ఏర్పాటు చేసే వాణిజ్య ప్రకటనలు, నాయకుల పుట్టిన రోజు వేడుకల ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులను బీఎంసీ నిషేధించింది. దీంతో వాణిజ్య, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు మెట్రో, మోనో రైల్వే మార్గం లోని పిల్లర్లపై దృష్టి సారించాయి. ఇప్పటికే అక్రమంగా పిల్లర్లపై హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో బీఎంసీకి రావల్సిన అదనపు ఆదాయానికి గండిపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్పొరేటర్లు బ్యానర్లకు అధికారికంగా అనుమతినిచ్చి ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని బీఎంసీ పరిపాలన విభాగానికి సూచించారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, హోర్డింగులే.. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల వల్ల నగరం విృతంగా మారిపోయింది. దీంతో చేసేది లేక బ్యానర్ల ఏర్పాటును బీఎంసీ నిషేధించింది. అనుమతి పొందిన వారు రుసుం చెల్లించి, నియమాలకు లోబడి పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించాల్సి వస్తుందని అనేక వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు మెట్రో రైల్వే పిల్లర్లను ఆశ్రయించడం మొదలు పెట్టాయి. అధికారికంగా బ్యానర్లు హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటు సంబంధించిన ప్రక్రియను ఏదైనా సంస్థకు కాంట్రాక్టుకు ఇవ్వాలని కార్పొరేటర్లు బీఎంసీ పరిపాలనా విభాగానికి సూచించారు. ఈ ప్రతిపాదనకు బీఎంసీ సభలో మంజూరు లభించగానే అమలు చేయనున్నట్లు సమాచారం. -
‘తెలుగు’ కనుమరుగు..?
- గణనీయంగా పడిపోయిన తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య - చాలా పాఠశాలల్లో - రెండంకెలకు తగ్గుదల - పది వరకు ఉన్న స్కూల్ ఒక్కటే..! సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో తెలుగు విద్యార్థులతో కళకళలాడిన అనేక పాఠశాలల్లో నేడు విద్యార్థులు కరవయ్యారు. విద్యార్థులు తగ్గుతుండటంతో ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. తెలుగు విద్యార్థులకోసం ‘బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్’ (బీఎంసీ) అనేక సదుపాయాలు కల్పిస్తోంది. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, ఇలా 27 రకాల వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. గతంలో బీఎంసీ తెలుగు పాఠశాలల్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం రెండు పాఠశాల్లో మినహా మిగతా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. గతంలో పాఠశాల్లో తెలుగు ఉపాధ్యాయుల సంఖ్య 350కి పైగా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 90కి చేరుకుంది. దీన్ని బట్టి తెలుగు పాఠశాలల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకటి రెండు ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే తెలుగు మీడియంలో బోధిస్తున్నాయి. ముంబై వడాలాలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఎస్) హైస్కూల్, తూర్పు బోరివలిలోని చైతన్య తెలుగు హైస్కూల్ ఉన్నాయి. ఆంధ్ర ఎడ్యుకేషన్ సోసైటీ హైస్కూల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంది. చైతన్య తెలుగు హైస్కూల్లో పూర్తిగా తెలుగులోనే బోధిస్తున్నారు. చైతన్య స్కూల్లో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉంది. మూతపడుతున్న పాఠశాలలు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటంతో తెలుగు పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. గతంలో బీఎంసీ పాఠశాలలు 60 నుంచి 45కు పడిపోయింది. ప్రభాదేవి, గోఖలే రోడ్డు తెలుగు మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులు కరువయ్యారు. గతంలో విద్యార్థులతో కళకళలాడిన వర్లీ అంబేద్కర్, లోయర్ పరేల్ జీకే మార్గ్, నాయిగావ్, గోరేగావ్ సిద్దార్థ్నగర్, సైన్ కోలివాడా కేడీ గైక్వాడ్, ఘాట్కోపర్ పంత్నగర్, కామాటిపూర సీవీబీ మార్గ్, ములూండ్ మున్సిపల్ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య 2 అంకెలకు చేరుకుంది. తెలుగు మీడియం హైస్కూల్ ఒకే ఒక్కటి: నాయిని ఆదినారాయణ బీఎంసీకి చెందిన పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉన్న పాఠశాల ఒకటే ఉందని ములూండ్ తెలుగు మున్సిపల్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు నాయిని ఆదినారాయణ పేర్కొన్నా రు. తాను పాఠశాలలో ఆరేళ్ల కింద చేరినపుడు ఏడో తరగతి వరకే ఉండేదన్నారు. ఇక్బాల్ అనే సీనియర్ ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి ప్రారంభించి పదవీ విరమణ పొందారని చెప్పారు. పాఠశాలలో పదవ తరగతి వరకు తెలుగు మీడియంలో బోధించాలన్న లక్ష్యంతో సహచరులతో కలసి ప్రయత్నించానని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలో పదవ తరగతి వరకు తెలుగు మీడియం లోనే బోధిస్తున్నారని, బీఎంసీ పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధించే ఒకే పాఠశాలగా గౌరవాన్ని పొం దామన్నారు. ప్రస్తుతం స్కూళ్లో ఎనిమిది నుంచి పది వరకు సెకండరీ సెక్షన్లో 90 మంది, 1 నుంచి 7 తరగతి వరకు 80 మంది విద్యార్థులున్నారని చెప్పారు. ప్రైమరీ సెక్షన్లో విద్యార్థుల సం ఖ్య పెరగలేదని, సెకండరీ సెక్షన్ స్కూల్ ఒక్కటే ఉండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందరు ప్రయత్నించాలి: బడుగు విశ్వనాథ్ తెలుగు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలున్నప్పటికీ సంఖ్య పెంచేందుకు అందరూ ప్రయత్నించాల్సిన అవసరం ఉందని శివ్డీ-వడాలా ఇస్టేట్లోని మున్సిపల్ పాఠశాల ఇన్చార్జ్ బడుగు విశ్వనాథ్ అన్నారు. మున్సిపల్ స్కూళ్లలో పిల్లలకు అన్ని సదుపాయాలున్నాయని, 27 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ కూడా ఉచితంగా ఇస్తున్నారు. -
ముంబైని మెరిపిస్తా..!
- బీఎంసీ కమిషనర్ అజయ్ మెహతా వ్యాఖ్య - సోమవారం బాధ్యతల స్వీకారం సాక్షి, ముంబై: ముంబైని సుందర నగరంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (బీఎంసీ) అజయ్ మెహతా అన్నారు. కార్పొరేషన్ కమిషనర్ గా సోమవారం ఆయన పదవీ బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎంసీ పరిధిలో అనేక ఆస్పత్రులతో పాటు మెడికల్ కాలేజీలు ఉన్నాయని, వీటిని మరింత సమర్థంగా వాడుకుంటామని చెప్పారు. ముంబై అభివృద్ధి ప్రణాళికకు మద్దతు పలికి వివాదాల్లో చిక్కుకున్న కమిషనర్ సీతారామ్ కుంటేను ఆదివారం బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఐఎఎస్ అధికారి అజయ్ మెహతాను నియమించారు. 1984 బ్యాచ్‌కి చెందిన అజయ్ మెహతా 1990లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అహ్మద్‌నగర్ జిల్లా అధికారిగా, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 2017 ఎన్నికల కోసమే? 2017లో జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఈ మార్పు చేసినట్టు భావిస్తున్నారు. బీఎంసీ కమిషనర్‌గా కుంటే మూడేళ్ల పదవి కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. అయితే ఇజ్రాయిల్ పర్యటనకు ముందే కుంటేను సీఎం ఫడ్నవీస్ బదిలీ చేసినట్టు సమాచారం. శివసేన సహా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న ముంబై అభివృద్ధి ప్రణాళిక అంశంపై గత కొన్ని రోజులుగా దుమారం లేచిన సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికకు కుంటే మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ హయాంలో నియమితులైన కుంటేను బదిలీ చేయడం ఖాయమని ఊహాగానాలు వచ్చాయి. -
ఎన్సీపీ ప్రక్షాళన ప్రారంభం
- రాష్ట్ర, నగర అధ్యక్షులను మార్చాలని నిర్ణయం - మైనార్టీ నేత నవాబ్ మాలిక్‌కు ముంబై పగ్గాలు - బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో కీలక మార్పులు సాక్షి, ముంబై: పార్టీ ప్రక్షాళన దిశగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధిష్టానం అడుగులేస్తోంది. రాష్ట్ర, ముంబై రీజియన్ అధ్యక్షులను మార్చాలని సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ముంబై రీజియన్ అధ్యక్ష పదవిలో ప్రస్తుత పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్‌ను నియమించాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్ష పదవి కోసం దిలీప్ వల్సే పాటిల్, మరికొందరి పేర్లు తెరమీదకు వచ్చాయి. నగరంలో బుధవారం జరగనున్న సమావేశంలో ఎన్సీపీ కార్యవర్గ విస్తరణ జరగనుంది. ఇందులో ముంబై రీజియన్ అధ్యక్షుడిగా మలిక్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు 25 స్థానాల్లో విజయ ఢంకా మోగించారు. దీంతోృబహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతామని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఒవైసీ ప్రకటనతో అప్రమత్తమైన ఎన్సీపీ.. భవిష్యత్ సమస్యల పరిష్కారానికి ఇప్పుడే పార్టీ ప్రక్షాళన చేయాలని భావించింది. ఈ నేపథ్యంలో ముంబైలోని మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు నగర పార్టీ పగ్గాలను నవాబ్ మలిక్ కట్టబెట్టాలని ఎన్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ దెబ్బకు డీలా.. గత వారం జరిగిన ఔరంగాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం కారణంగా ఎన్సీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఎన్సీపీ 70 స్థానాల్లో పోటీచేయగా కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే చోట ఎంఐఎం 53 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 25 స్థానాలు గెలుచుకుని ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ముంబైలో ఎన్సీపీ బలం అంతంత మాత్రమే ఉంది. ఇటువైపు ఉత్తరాది ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంజయ్ నిరుపంకు ముంబై రీజియన్ పగ్గాలు కట్టబెట్టింది. ఇదే తరహాలో మైనార్టీలను ఆకర్షించేందుకు ఎన్సీపీ ముంబై రీజియన్ అధ్యక్ష పదవి బాధ్యతలు నవాబ్ మాలిక్‌కు అప్పగించనుంది. నవాబ్కు ఉత్తరాది, మైనార్టీలతో మంచి సంబంధాలున్నాయి. ఈ నెల 11న బాంద్రా తూర్పు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రాణేకు ముస్లిం ఓట్లు పోలవడానికి నవాబ్ మలిక్ కారణమని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. అలాగే ఎన్సీపీ మహిళ ప్రదేశ్ అధ్యక్ష పదవిలో చిత్రా వాఘ్ ను నియమించే అవకాశాలు ఉన్నాయి. దీనికి బుధవారం ఆమోద ముద్ర వేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
‘ఆందోళన వద్దు’
సాక్షి, ముంబై: నీటి నిల్వలపై ముంబైకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎంసీ తెలిపింది. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో జూలై 31 వరకు సరిపడే నిల్వలున్నాయని స్పష్టం చేసింది. వర్షాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయనే దాని గురించి వాతావరణశాఖ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదని, సమాచారం అందగానే ప్రణాళిక ప్రకారం నీటి సరఫరా చేస్తామని బీఎంసీ నీటి సరాఫరా శాఖ చీఫ్ ఇంజినీరు రమేశ్ బాంబ్లే అన్నారు. ప్రస్తుతం నగరానికి నీటి సరఫరాచేసే బాత్సా, మోడక్‌సాగర్, మధ్య వైతర్ణ, విహార్, తులసీ, తాన్సా జలాశయాల్లో 4,06,973 మిలియన్ లీటర్ల నిల్వ ఉందని, దీన్ని పరిగణలోకి తీసుకుంటే జులై 31 వరకు నీటికి ఢోకా లేదని బాంబ్లే అన్నారు. ముంబైకర్లకు ప్రతి రోజు 3,750 మిలియన్ లీటర్ల నీరు అవసరముంటుందని ఆయన అన్నారు. కాగా, కొన్నేళ్లుగా సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో నీటి నిల్వలు కాపాడుకోడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏటా నెల రోజుల ముందే వాతావరణ శాఖ నుంచి వర్షానికి సంబంధించిన వివరాలు వస్తాయని, దీన్ని బట్టి వర్షాలు ఆలస్యమైతే ఎంత శాతం నీటి కోత అమలు చేయాలో ముందుగానే ప్రణాళిక రూపొందిస్తారని ఆయన చె ప్పారు. -
నైట్ షెల్టర్ల సంఖ్య పెంచాలి
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 150 నైట్ షెల్టర్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా సామాజిక సంఘాలు మాత్రం మరో 575 అవసరమని చెబుతున్నాయి. వీధుల్లోనే నివసిస్తున్న 57 వేల మంది ప్రజల కోసం 150 నైట్ షెల్టర్లను నిర్మించాలని బీఎంసీ తాజాగా ప్రణాళిక రూపొందించింది. ఒక్కో షెల్టర్‌లో వంద మంది వరకు తల దాచుకోవచ్చు. ఇటీవల బీఎంసీ డ్రాఫ్ట్ డవలప్మెంట్ ప్లాన్ (డీపీ)లో ఇల్లు లేని వారికి తక్కువ సంఖ్యలో ప్రొవిజన్స్ సమకూర్చింది. ఇదే విషయాన్ని ఓ ఎన్జీవో సంస్థ బీఎంసీ దృష్టికి తీసుకువచ్చింది. కార్పొరేషన్ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. కేవలం 150 నైట్ షెల్టర్లను మాత్రమే అందజేస్తోందని, నగరంలో ప్రస్తుతానికి తొమ్మిది షెల్టర్లు మాత్రమే ఉన్నాయని, ప్రజల అవసరాలతో పోల్చితే అవి చాలా తక్కువ అని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. హోం లెస్ కలెక్టివిటీ అనే సామాజిక సంస్థ సభ్యుడు బ్రిజేష్ ఆర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘2011 గణాంకాల ప్రకారం నగరంలో 57,416 ఇళ్లులేని వారు ఉన్నారు. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు ప్రతి లక్ష మందికి ఒక నైట్ షెల్టర్ ఉండాలి. అందులో వంద మందికి సరిపడా మౌళిక సదుపాయాలు కల్పించే వీలు ఉండాలి. సుప్రీం ఆదేశాల ప్రకారం 575 నైట్ షెల్టర్లను నగరం కలిగి ఉండాలి’ అని అన్నారు. ‘వార్డు స్థాయిలో చాలా వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశాం. అయినా బీఎంసీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ సమస్యను మున్సిపల్ కమీషనర్ సీతారాం కుంటే, రాజకీయ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తాం’ అని అన్నారు. నగరంలో టాటా, కేం లాంటి ఎన్నో ఆస్పత్రులు ఉన్నాయని, రోగుల బంధువులు భారీ అద్దెలు చెల్లించలేక ఆస్పత్రుల బయటే ఉంటున్నారని ఆర్య చెప్పారు. ఈ అంశమై బీఎంసీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందనీ తాము కూడా మరిన్ని షెల్టర్లు అవసరం ఉంటాయని సూచిస్తామని ఆర్య తెలిపారు.అయితే సమస్యకు సంబంధించి నిజానిజాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డీపీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
బెస్ట్‌పై ‘ఎల్ఈడీ’ భారం
సాక్షి, ముంబై: నగర రహదారులకు ఏర్పాటు చేయనున్న ఎల్ఈడీ విద్యుత్ దీపాల వల్ల బెస్ట్ సంస్థ ఆదాయంపై గండి పడే ప్రమాదం ఏర్పడింది. నగర పరిధిలో బెస్ట్ సంస్థ నుంచి సుమారు 25.24 లక్షల యూనిట్ల విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇందుకు 283 కోట్లను మహానగర పాలక సంస్థ (బీఎంసీ) బెస్ట్‌కు చెల్లిస్తుంది. అయితే ఎల్ఈడీ బల్బులు అమర్చడం ద్వారా విద్యుత్ వినియోగం దాదాపు 50 శాతం తగ్గుతుంది. దీంతో బీఎంసీ ద్వారా బెస్ట్‌కు వచ్చే రెవెన్యూ కూడా 50 శాతం మేర తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని వీధిదీపాల ద్వారా బెస్ట్‌కు వచ్చే ఆదాయం లెక్కలు పూర్తిగా తలకిందులు కానున్నాయి. ప్రస్తుతం నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మెరైన్ డ్రైవ్ (క్వీన్ నెక్లెస్)లో వాటిని అమర్చే పనులు పూర్తయ్యాయి. త్వరలోనే నగ ర రహదారులపై అమర్చే పనులు అధికారులు ప్రారంభించనున్నారు. బెస్ట్ నుంచి ముంబైలోని కోలాబా నుంచి సైన్, మహీం వరకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ దారి పొడవునా సుమారు 40 వేల విద్యుత్ దీపాలతో పాటు, నగర శివార్లలోని లక్షకు పైగా విద్యుత్ దీపాలకు బెస్ట్ విద్యుత్ సరఫరా చేస్తుంది. ఇందుకోసం యూనిట్‌కు రూ.8.90 చొప్పున బెస్ట్‌కు బీఎంసీ చెల్లిస్తుంది. రవాణా శాఖ ద్వారా యూనిట్‌కు రూ.1.52 అదనంగా లభిస్తాయి. అయితే ఇప్పుడు ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు వల్ల బెస్ట్ ఖజానాకు భారీగా గండి పడుతుంది. ప్రస్తుతం బెస్ట్ ఆధీనంలో ఉన్న రవాణా శాఖ తీవ్ర నష్టాల్లో ఉండగా... విద్యుత్ శాఖ మాత్రమే లాభాల్లో ఉంది. -
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన బీఎంసీ
ముంబై: యాంటిబయాటిక్ డ్రగ్స్ స్కాంకు సంబంధించి బాంబే హైకోర్టులోృబహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అఫిడవిట్ దాఖలు చేసింది. గతేడాది ప్రభుత్వాస్పత్రులలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు ఇచ్చిన యాంటిబయాటిక్స్ వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ పిల్‌కు స్పందనగానే బీఎంసీ అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిపుణులతో కూడినృబందం నవీముంబై, హిమాచల్‌ప్రదేశ్ లోని ఔషధ కంపెనీలను తనిఖీ చేసిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ బ్ల్యూహెచ్ఓ) నిబంధనల ప్రకారమే ఆ కంపెనీలు ముందులు తయారీ చేస్తున్నాయని బీఎంసీ కోర్టుకు తెలిపింది. ‘2014 ఆగస్టు 18న బాబా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు కాఫ్ట్రియాక్సోన్, నెఫొటాక్సిమ్ సూదులు వేయడం వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. 45 రోగులకు ఇన్జక్షన్స్ వేయగా 28 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సైరా షేక్ అనే మహిళను కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ అస్పత్రికి(కేఈఎం), సియోన్ ఆస్పత్రికి తర లించారు. 24 గంటల తరువాత ఆమె మరణించింది. ఆహార, ఔషధ శాఖ అధికారులు కేఈఎం అస్పత్రిలో ఆమె రికార్డులను, ఏడు శాంపుల్స్‌ను సీజ్ చేశారు’ అని కోర్టులో పిల్ దాఖలైంది. ‘2014 అక్టోబర్ 18-19న నిపుణులతో కూడినృబందం నవీముంబై, హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ ఔషధ ఫ్యాక్టరీలను తనిఖీ చేసింది. కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు పాటించలేదని తనిఖీల్లో తేలింది. అయితే హెచ్చరిక లేఖలు పంపడంతో వారు నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారు’ అని అఫిడవిట్లో బీఎంసీ పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రలోని కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలపై ఎఫ్‌డీఏకు సమాచారం అందింది. ఎఫ్‌డీఏ కూడా వారిపై ఓ కన్నేసి ఉంచింది’ అని కోర్టుకు తెలిపింది. డ్రగ్ రియాక్షన్స్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడిందని బీఎంసీపై ఆరోపణలు రావడంతో ఈ విషయంపై సీఐడీ విచారణ కూడా జరిగింది. -
బీఎంసీ బడ్జెట్ రూ. 33,514 కోట్లు
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థ (బీఎంసీ) 2015-2016 ఆర్థిక బడ్జెట్ ను బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే స్థాయి సమితి అధ్యక్షుడు యశోధర్ ఫణసేకు సమర్పించారు. మొత్తం రూ. 33,514 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా అందులో రూ. 500 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు స్థాయి సమితి మంజూరునిచ్చింది. స్థాయి సమితి సభ్యులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, వివిధ రాజకీయ పార్టీలకు రూ. 2.50 కోట్ల నుంచి రూ. ఏడు కోట్ల వరకు నిధులు కేటాయించింది. అధికారంలో ఉన్న శివసేన దాదాపు రూ.140 కోట్ల నిధులు తమ వాటాలో వేసుకుంది. వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకోసం 227 మంది కార్పొరేటర్లకు రూ. 1.60 కోట్లు చొప్పున, మేయర్‌కు రూ. 100 కోట్లు, రేస్‌కోర్స్‌లో థీమ్ పార్క్ నిర్మాణం కోసం రూ.ఐదు కోట్లు మంజూరయ్యాయి. డబ్బావాలా భవనానికి రూ. రెండు కోట్లు, కస్తూర్బా ఆస్పత్రిలో అంటు వ్యాధుల పరీక్షల ఆధునిక ల్యాబ్‌కు, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో ఒక్కో ల్యాబ్ ఏర్పాటుకు, కళ, సాంృ్కతిక భవనం కోసం రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. అలాగే మాథాడి కార్మికుల భవనానికి రూ. రెండు కోట్లు, ఆరే కాలనీలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికిగానూ కృత్రిమ చెరువు ఆధునీకీకరణ, ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో ఉన్న చౌక్ల అలంకరణ పనులకు రూ. ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేశారు. -
కొత్తబస్సుల కొనుగోలులో బెస్ట్‌కు సాయం చేస్తాం: బీఎంసీ
గతంలోనూ రూ. 1,600 కోట్లు అందజేత సాక్షి, ముంబై: కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వెల్లడించింది. అయితే ఈ నిధులు అప్పు రూపంలో ఇవ్వనుండటంతో ఈ మొత్తాన్ని బెస్ట్ సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా బెస్ట్ నష్టాల్లో నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో నష్టాల బాటలో నడుస్తున్న సంస్థకు రుణాలు ఇచ్చేందుకు ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం బీఎంసీ రూ.1,600 కోట్లు బెస్ట్‌కు అప్పుగా ఇచ్చింది. అంతేగాకుండా చార్జీలు పెంచకుండా అందులో రూ.150 కోట్లు మినహాయింపు ఇచ్చింది. కాగా, ప్రస్తుతం బెస్ట్ సంస్థ ఆదీనంలో నడుస్తున్న 3,500 పైగా బస్సుల్లో సుమారు 300 బస్సులు పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని బెస్ట్ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం బెస్ట్ సంస్థ రూ.700 కోట్లకుపైగా నష్టాల్లో నడుస్తోంది. చార్జీలు పెంచినప్పటికీ ఈ లోటును పూడ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 300 కొత్త బస్సులు కొనుగోలు చేయడం పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆదుకునేందుకు బీఎంసీ ముందుకు రావడంతో బెస్ట్‌కు ఊరట లభించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై స్థాయి సమితి అధ్యక్షుడు శైలేష్ ఫణసే ఆమోద ముద్రవేశారు. కాగా, ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) మాదిరిగా బెస్ట్ బస్సులపై బీఎంసీ లోగో అమర్చాలని బీఎంసీ శరతులు విధించనుంది. ప్రస్తుతం నగరంలో సేవలు అందిస్తున్న బెస్ట్ బస్సుల్లో కొన్నింటిని ఎంయూటీపీ నిధులతో కొనుగోలు చేయడంతో వాటిపై ఎంయూటీపీ లోగో ఉంది. దీంతో బీఎంసీ అందజేసిన నిధులతో కొనుగోలు చేసిన బస్సులపై ఆ సంస్థ లోగో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. -
నీటి లీకేజీపై బీఎంసీ దృష్టి
సాక్షి, ముంబై: నగర వాసులకు నీటి సరఫరా చేస్తున్న పైపుల లీకేజీ అరికట్టేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నడుం బిగించింది. ఈ పనులను మూడు దశల్లో పూర్తిచేయాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయించింది. అందులో భాగంగా సుమారు రూ.40 కోట్ల వ్యయంతో మొదటి దశ పనులు పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు ముంబైకి సరఫరా అవుతున్న 3,750 ఎమ్మెల్డీల నీటిలో రోజుకు కనీసం 20 శాతం నీరు చోరీకి గురవుతోంది. అలాగే దాదాపు 600 లీటర్లకు పైగా నీరు లీకేజీ వల్ల వృథా అవుతోంది. ప్రస్తుతం నీటి సరఫరా చేస్తున్న పైపులు పురాతనమైనవి కావడంతో అవి తుప్పుపట్టాయి. దీంతో పైపులు పలు చోట్ల పగిలిపోయి నీరు లీకేజీ అవుతోంది. వీటిని మార్చాలని బీఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశ బాంద్రా, ఖార్ రోడ్, శాంతాక్రూజ్ (తూర్పు, పశ్చిమ), తూర్పు విలేపార్లే, తూర్పు అంధేరి, తూర్పు జోగేశ్వరి, చార్కోప్, బోరివలి, కాందివలి, గోరాయి, దహిసర్, చెంబూర్, గోవండీ, మాన్‌ఖుర్ద్ తదితరా ప్రాంతాల్లో పైపులకు మరమ్మతు పనులు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదిత పనులు ఒకట్రెండు రోజుల్లో స్థాయి సమితీ ముందుకు తీసుకురానున్నారు. అనుమతి లభించగానే త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. -
జనారణ్యంగా మారుతున్న ముంబై
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై రోజురోజుకు జనారణ్యంగా మారుతోంది. ఇటీవలి కాలంలో ముంబైకి భారీగా వలసలు పెరిగిపోవడంతో ఖాళీ స్థలాలు కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం నగరంలో ప్రతీ మనిషికి సగటున రెండు చదరపు మీటర్ల స్థలం ఉంది. కానీ వలసలు ఇదే రీతిలో కొనసాగితే 1.24 చ.మీ.కు చేరుకోనుంది. ఖాళీ స్థలాలు తగ్గిపోయి, జనసాంద్రత పెరిగిపోతే దాని దుష్ర్పభావం ముంబైకర్ల ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబై జనాభా, ఖాళీ స్థలాలపై గట్ నాయకులు తాత్కాలికంగా రూపొందించిన అభివృద్థి మ్యాప్ సీడీని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్ సీతారాం కుంటే తిలకించారు. నగరానికి నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది వస్తుంటారు. వీరిలో కొందరు ఉపాధి నిమిత్తం, మరికొందరు ఉద్యోగ రీత్యా వచ్చిపోతుంటారు. ఉపాధి కోసం వచ్చిన వారు ఇక్కడే స్థిరపడతారు. నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణ పనులు, ఫ్లైఓవర్లు, మెట్రో, మోనో లాంటి అనేక కీలక ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. దీంతో క్కడ ఉపాధికి కరువు ఉండదని భావించిన పేదలు, నిరుద్యోగులు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారు. వీరి కారణంగా నగర పరిసర ప్రాంతాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. మురికివాడలే కాకుండా ఫుట్‌పాత్‌లు, ఖాళీ మైదానాలు కూడా సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణలు, మురికి వాడలు దర్శనమిస్తున్నాయి. వీరికి కొన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవడంతో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేకపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముంబైలో ఎక్కడ చూసిన జనం, రద్దీ కనిపించడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. -
మెట్రో-3 పూర్తయ్యేనా?
అడ్డంకిగా మారిన స్థల సేకరణ సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రరూపం దాల్చిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కొలాబా-బాంద్రా-సిబ్జ్ ప్రాంతాల మధ్య చేపట్టిన మెట్రో-3 ప్రాజె క్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుకు సంబంధించిన రైలు మార్గం జనావాసాల మధ్యనుంచి వెళ్తుండటంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టు కోసం బీఎంసీ కార్యాలయాలు, గోదాములు, రిజర్వుడు స్థలాలు, క్రీడా మైదానాలు, ఉద్యానవనాలు, రాజకీయ పార్టీ కార్యాలయాల స్థలాలు సేకరించాల్సి ఉంటుంది. వీటికోసం ఆయా శాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. బాధితుల ప్రత్యామ్నాయాలకు ఇబ్బంది ట్రాఫిక్ సమస్యను చెక్ పెట్టడానికి మెట్రో-3 నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రాజెక్టు పనులకు ‘పబ్లిక్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు’కు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో స్థల సేకరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజె క్టుకు సంబంధించి మెట్రో రైలు పిల్లర్లకు, రైల్వే స్టేషన్ల నిర్మాణాలకు, మెట్లు, ఎస్కలేటర్ల నిర్మాణానికి భారీగా స్థలం సేకరించాల్సి ఉంటుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి స్థానికులనుంచి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించినా, స్థలాలు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఇబ్బందులు ఎదురవనుండటంతో ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు సఫలీకతమైతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అడ్డంకులు ఎదురయ్యే ప్రాంతాలు ⇒ వర్లీ-ఇంజినీరింగ్ హబ్ భవనం ఎదురుగా బీఎంసీకి చెందిన భద్రత శాఖ భవనం ఉంది. ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చేవరకు భవనం కూల్చివేసేందుకు బీఎంసీ అనుమతివ్వదు. ⇒ వర్లీ-సస్మీరా ఇన్స్టిట్యూట్ పరిసరాల్లో ఉన్న బీఎంసీ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు బిల్డర్‌కు అప్పగించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదన న్యాయ శాఖ వద్ద పెండింగులో ఉంది. ఇది క్లియర్ అయితే తప్ప మెట్రోకు స్థలం లభించదు. ⇒ ప్రభాదేవి-సిద్ధివినాయక్ మందిరం స్టేషన్ నిర్మాణం కోసం 15,254 చ.మీ. స్థలం కావాలి. అందుకు మందిరం పక్కనే ఉన్న నర్దుల్లా ట్యాంక్ మైదానం స్థలాన్ని సేకరించాల్సి ఉంటుంది. ⇒ లోయర్‌పరేల్-సైన్స్ మ్యూజియం స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఆదీనంలో ఉండడంతో దాన్ని స్వాధీనం చేసుకునే ప్రతిపాదన పెండింగులో ఉంది. ⇒ ముంబెసైంట్రల్-నాయర్ ఆస్పత్రి విస్తరణ, ఆస్పత్రిలో ఎల్పీజీ గ్యాస్ చాంబర్ స్థలాన్ని మెట్రో-3 కి ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతున్నారు. ⇒ చర్చిగేట్-హుతాత్మ చౌక్ వద్ద ఉన్న పే అండ్ పార్కింగ్ స్థలాన్ని ఇచ్చేందుకు సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ⇒ రాజకీయ పార్టీ కార్యాలయాలు-అసెంబ్లీ హాలు, మంత్రాలయ పరిసరాల్లో అనేక రాజకీయ పార్టీల కార్యాలయాలున్నాయి. మెట్రో-3 నిర్మాణానికి ఆ స్థలాలని ఖాళీ చేయించాలి. -
సేన, కాంగ్రెస్ డిష్యూం డిష్యూం
* ఉద్ధవ్‌ఠాక్రే సమక్షంలోనే జరిగిన వివాదం * ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ఇరుపక్షాల వాగ్వాదం సాక్షి, ముంబై: ఓ భూమి పూజ కార్యక్రమంలో శివసేన, కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు. దాదర్‌లోని నాయ్‌గావ్‌లో ఆదివారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్ సమక్షంలో ఇరుపార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. వివరాల్లోకె ళితే.. బాంబే డయింగ్కు చెందిన 8.15 ఎకరాల స్థలంలో భారీ థీం పార్క్ ఏర్పాటు చేయాలని మహానగ ర పాలక సంస్థ(బీఎంసీ) నిర్ణయించింది. అందులో సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మించాలని ఏర్పాట్లు చేస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరిగిన పార్క్ శంకు స్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళిదాస్ మాట్లాడుతూ..బాంబే డయింగ్ స్ప్రింగ్ మిల్లు కార్మికుల ఇళ్ల కోసం గత 22 సంవత్సరాలుగా పోరాడుతున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆగ్రహించిన శివసైనికులు కోలంబ్కర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అంతరాయం క లిగించారు. దీంతో ఆయన మద్దతుదారులు ఉద్ధవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. నినాదాలు కాస్తా గొడవకు దారితీసాయి. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితి సద్దుమనగలేదు. ఉద్ధవ్, కోలంబ్కర్లు కలగజేసుకుని ఇరుపక్షాల వారిని శాంతపరిచారు. కొద్ది రోజుల కింద కూడా మాటుంగాలోని ఫైవ్ గార్డెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శివసేన, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇలాగే వాగ్వాదం జరిగింది. -
ఇక బీఎంసీ ఆస్పత్రుల్లో పోస్ట్‌మార్టం
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకవేళ రోగీ చనిపోతే పోస్టుమార్టం కోసం ఇతర ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పని లేదు. అదే ఆస్పత్రిలో పోస్టుమార్టం పనులు పూర్తి చేసి శవాన్ని బంధువులకు అప్పగించనున్నారు. దీంతో ఇటు మృతుని బంధువులు, అటు విధినిర్వహణలో ఉన్న పోలీసుల శ్రమ పూర్తిగా తగ్గనుంది. బీఎంసీతోపాటు ఇతర కార్పొరేషన్లు, అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం చేసే సౌకర్యం లేదు. కొన్ని అస్పత్రుల్లో ఈ సౌకర్యం ఉన్నప్పటికీ అనేక సందర్భాలలో సమయాభావం, సిబ్బంది కొరత వల్ల అక్కడ శవాలు క్యూలో ఉంటాయి. దీంతో వైద్యులకు పని భారం ఎక్కువై మరసటి రోజు శవ పరీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా వరకు ఆస్పత్రుల్లో శవ పరీక్ష పనులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే జరుగుతాయి. దీంతో మృతుల బంధువులు గంటలకొద్దీ ఆస్పత్రుల్లో పడిగాపులు పడాల్సి ఉంటుంది. హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇదే పరిస్థితి పోలీసులకు కూడా ఎదురైతుంది. బీఎంసీ ఆస్పత్రుల్లో శవ పరీక్ష నిర్వహించేందుకు సంబంధించిన సర్క్యులర్ రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. -
ముంబైకర్లు ఎన్సీపీ ఎందుకు ఆదరించడం లేదు?
కార్యకర్తలను, నేతలను ప్రశ్నించిన శరద్‌పవార్ సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విస్తరిస్తున్నా, ముంబైలో మాత్రం ఎందుకు విస్తరించడం లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్ నాయకులను, పదాధికారులను నిలదీశారు. నగరంలో పార్టీ, అనుబంధంగా సంఘాల స్థితిగతులపై సమీక్షించేందుకు మంగళవారం సాయంత్రం శరద్ పవార్ ఓ సమావేశం నిర్వహించారు. ఇందులో నాయకులు, పదాధికారులు మొదలు బ్లాక్ అధ్య క్షులు, కీలకమైన కార్యకర్తలు కొందరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్సీపీ విస్తరించింది. అందుకు నిదర్శనం జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎన్సీపీకి అనుకూలంగా రావటమేనని ఉదహరించారు. ముంబైలో మాత్రం పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. వచ్చే మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంతకుముందు బీఎంసీ ఎన్నికల్లో ఎన్సీపీకి నామమాత్రంగానైనా కొన్ని సీట్లు వచ్చాయి. కానీ ఇటీవలి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ముంబైలో ఎన్సీపీ పూర్తిగా చతకిలబడిపోయింది. దీంతో పార్టీకి పునరుజ్జీవం తేవాలని పవార్ తన దిగువ శ్రేణి నేతలను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎన్సీపీ నాయకులు సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, అజీత్ పవార్, జయంత్ పాటిల్, సచిన్ ఆహిర్, నరేంద్ర వర్మ, సంజయ్ పాటిల్ తదితర నాయకులు పాల్గొన్నారు. -
ధ్వని కాలుష్య నియంత్రణకు బీఎంసీ చర్యలు
సాక్షి, ముంబై: నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ధ్వని కాలుష్య పరిమాణాన్ని అంచనా వేయాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. ఇందుకు గాను నగరంలో 1,200 చోట్ల ధ్వని కాలుష్య స్థాయిని నిర్ధారించే యంత్రాలను అమర్చనుంది. యంత్రాల ద్వారా లభించే గణాంకాలను బట్టి ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని బీఎంసీ భావిస్తోంది. దీనికోసం బీఎంసీ పరిపాలన విభాగం దాదాపు రూ.77 లక్షలు ఖర్చు చేయనుంది. నగరంలో ధ్వని కాలుష్యం అంశం ఇటీవల బీఎంసీ స్థాయి సమితిలో చర్చకు వచ్చింది. అయితే నగరంలో ధ్వని కాలుష్యం ఏయే ప్రాంతాల్లో, ఏ మేరకు దాని తీవ్రత ఉందన్న విషయమై బీఎంసీ వద్ద వివరాలు లేవు. దీంతో ముందుగా ధ్వని కాలుష్య స్థాయిని అంచనా వేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. -
బస్సెక్కితే ఏడు రూపాయలు
సాక్షి, ముంబై: బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైకర్లపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి (ఆదివారం) నుంచి చార్జీల భారం మోపనుంది. బెస్ట్ పరిపాలన విభాగం రూపొందించిన ప్రతిపాదనకు బీఎంసీ స్టాండింగ్ కమిటీ మంజూరు లభించింది. దీంతో మొదటి స్టేజీకి కనీస చార్జీ రూపాయి పెరగనుంది. ప్రస్తుతం బెస్ట్ బస్సులో కనీస చార్జీ ఆరు రూపాయలు చేస్తున్నారు. కాగా ఆదివారం నుంచి ఏడు రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ చార్జీల పెంపు సాధారణ బస్సులతోపాటు ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్, ఏసీ బస్సులకు కూడా వర్తించనుంది. చార్జీల పెంపు ప్రభావం వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు ఇస్తున్న రాయితీలపై కూడా పడనుంది. ఆర్థికంగా నష్టాల బాటలో నడుస్తున్న బెస్ట్ సంస్థను కొంతమేరకైనా గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెస్ట్ పరిపాలన విభాగం 2014లోనే చార్జీల పెంపు ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. కానీ బీఎంసీలో అధికారంలో ఉన్న శివసేన-బీజేపీ కూటమి రూ.150 కోట్లు ఆర్థిక సాయం అందజేయడంతో చార్జీలు పెంపు వాయిదా పడింది. ఆ తరువాత ఆగస్టులో మరోసారి చార్జీల పెంపు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే శాసనసభ ఎన్నికలు సమీపించడం మళ్లీ వాయిదా వేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎట్టకేలకు చార్జీల పెంపు ప్రతిపాదనకు బీఎంసీ ఆమోదం తెలిపింది. అయితే చార్జీలను రెండు విడతలుగా పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఒక రూపాయి, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మరో రూపాయి మేరకు చార్జీలు పెంచాలని నిర్ణయించింది. తొలి విడత భారం ఈ ఆదివారం ఉంచి అమలులోకి రానుంది. రెండో విడత చార్జీల పెంపు కూడా అమలులోకి వస్తే నగరంలో బెస్ట్ బస్సు కనీస చార్జీ రూ.8కి చేరుకుంటుంది. కాగా సాధారణ ప్రజలు పొందే సీజన్ పాస్‌తోపాటు వివిధ రాయితీలు పొందే సీజన్ పాస్‌లకు కూడా ఇది వర్తిస్తుందని బెస్ట్ యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా బీఎంసీ పరిధి దాటి వెళ్లే ప్రయాణికులు అదనంగా మరో రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. టోల్‌నాకా, ఇతర పన్నులను దృష్టిలో ఉంచుకుని ఈ చార్జీలు నిర్ణయించారు. ఏసీ బస్సు ప్రయాణికులపై అదనంగా రూ.5 భారం పడనుంది. ఇదిలాఉండగా ఉద్యోగుల సౌకర్యార్థం నగరంలోని కొన్ని ప్రముఖ రైల్వే స్టేషన్ల నుంచి కార్పొరేట్ కార్యాలయాల వరకు ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులకు కనీస చార్జీలు రూ.ఆరు మాత్రమే వసూలు చేసేవారు. కాని ఆదివారం నుంచి దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేయనున్నారు. అదేవిధంగా ఇదివరకు 3, 5, 7, 8, 15, 25, 35 కి.మీ.లకు ఒక స్టేజీ చొప్పున నిర్ధారించారు. ఆదివారం నుంచి 2, 4, 6, 10, 14, 20 కి.మీ.లకు ఒక స్టేజీగా నిర్ణయించారు. దీనివల్ల కొందరు ప్రయాణికులకు లాభం, మరికొందరికి నష్టం జరగనుంది. -
రక్తదానంలో నం.1
పదేళ్లుగా మహారాష్ట్రదే రికార్డు సాక్షి, ముంబై: రక్తదానం చేయడంలో మహారాష్ట్రవాసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. గత పదేళ్లుగా రక్త దానం చేయడంలో వారే అగ్రస్థానంలో ఉన్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల ద్వారా 15,59,669 రక్తపు సంచులను పోగు చేశారు. గత సంవత్సరం వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో, ప్రార్థన స్థలాల్లో ‘స్టేట్ బ్లడ్ ట్రాన్సిషన్ కాన్ఫరెన్స్’ ఏకంగా 24,647 రక్తదాన శిబిరాలు నిర్వహించి 15.59 లక్షలకుపైగా బ్లడ్ బ్యాగులు పోగు చేసింది. ఇలా పోగుచేసిన రక్తాన్ని ఆర్బీసీ, ప్లేట్లెట్స్, ప్లాజ్మా రూపంలో విడదీసి ఏ రాష్ట్రానికైనా అవసరాన్ని బట్టి సరఫరాచేసే సామర్థ్యం మహారాష్ట్రకు ఉందని స్టేట్ బ్లడ్ ట్రాన్సిషన్ కాన్ఫరెన్స్ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ సంజయ్‌కుమార్ జాదవ్ చెప్పారు. రాష్ట్రంలో 310 బ్లడ్ బ్యాంకులు ఉండగా ఇందులో 75 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు చెందినవి ఉన్నాయి. గత సంవత్సర కాలంలో ప్రభుత్వ, మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మూడున్నర లక్షల మంది రోగులకు ఆపరేషన్ల కోసం ఉచితంగా రక్తం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తాన్ని గ్రూపులుగా విడదీసే సౌకర్యం 244 చోట్ల ఉంది. దీంతో రక్తాన్ని విడ దీయడం యావత్ దేశంతో పోలిస్తే మహారాష్ట్రలో 65 శాతం ఉంది. -
బీచ్‌ల వద్ద ఇక ప్రైవేటు లైఫ్‌గార్డులు!
సాక్షి, ముంబై : నగర వ్యాప్తంగా బీచ్‌లలో తక్కువ సంఖ్యలో లైఫ్‌గార్డులు ఉండడంతో చాలా మంది ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రైవేట్ ఏజెన్సీలకు లైఫ్‌గార్డుల బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. ఈ కంపెనీలు వివిధ బీచ్‌లలో వంద మంది లైఫ్‌గార్డులను మోహరించే బాధ్యతను తీసుకుంటాయి. సెలవులు, ఆదివారాలలో బీచ్‌ల వద్ద సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. ముఖ్యమైన బీచ్‌ల వద్ద సందర్శకులను హెచ్చరించే లైఫ్‌గార్డులు లేక చాలా మంది ప్రమాదవశత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఒక్కో బీచ్‌లో ఎంతమంది లైఫ్‌గార్డులను నియమించాలో తర్వాత నిర్ణయిస్తామని బీఎంసీ అధికారి తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఏడు బీచ్‌లకు గాను 36 మంది లైఫ్‌గార్డులు ఉన్నారు. అయితే మత్సకారులను లైఫ్‌గార్డులుగా నియమించాలని ఇటీవల అగ్ని మాపక అధికారులు సూచించారు. కానీ ఈ ప్లాన్ ఫలించలేదు. ఈతలో మంచి నైపుణ్యం ప్రదర్శించేవారు కరువు అవడంతో ఈ ప్లాన్‌కు ఆదరణ తగ్గింది. కొన్ని ఏళ్ల క్రితం మహిళా లైఫ్‌గార్డులను నియమించగా ఇది కూడా పలు కారణాల వల్ల విఫలమైంది. ఓ సీనియర్ అగ్ని మాపక అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ప్రైవేట్ కంపెనీల నుంచి లైఫ్ గార్డులను ఎంపిక చేస్తున్నామన్నారు. కంపెనీ కోసం నిబంధనలు చివరిదశలో ఉన్నాయన్నారు. ఇవి సిద్దంకాగానే టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారి తెలిపారు. నియమించిన ఏజెన్సీలు లైఫ్ గార్డులకు శిక్షణ ఇవ్వనున్నారు. మహారాష్ట్ర, గోవాకు లైఫ్ గార్డులను అందజేసే చాలా ఏజెన్సీలు ఉన్నాయన్నారు. దీంతో టెండర్లను ఆహ్వానించగానే ఈ ఏజెన్సీలు కూడా శ్రద్ద వహిస్తాయని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా ప్రస్తుతం నగర బీచుల్లో 36 మంది లైఫ్‌గార్డులు మోహరించి ఉండగా 23 మంది పర్మినెంట్ లైఫ్‌గార్డులుగా ఉన్నారు. -
త్వరలో జూ ప్రవేశ రుసుం పెంపు
యోచనలో బీఎంసీ నిర్వహణ ఖర్చు పెరిగినందునే.. సాక్షి,ముంబై: బైకలాలోని రాణీభాగ్ జూ ప్రవేశ రుసుం పెంచాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) యోచిస్తోంది. కొద్ది నెలలుగా జూ లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు తుది దశకు వచ్చాయి. అందుకు బీఎంసీ పరిపాలన విభాగం రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్త జంతువులను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీంతో నిర్వాహణ భారం పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పర్యాటకుల నుంచి నామమాత్రంగా వసూలు చేస్తున్న ప్రవేశ రుసుంను కొంత శాతం పెంచాలని యోచిస్తోంది. బైకలా తూర్పు ప్రాంతంలో 52 ఎకరాల స్థలంలో ఉన్న ఈ జూ ను 1862లో నిర్మించారు. దీనికి వీరమాత జీజీబాయి భోంస్లే ఉద్యాన్‌గా నామకరణం చేశారు. అయినప్పటికీ ఇది రాణిభాగ్ పేరుతోనే ప్రఖ్యాతి చెందింది. నిత్యం వందలాది మంది ముంబైకర్లు, పర్యాటకులు ఈ జూను సందర్శిస్తారు. ఇందులో 16 రకాల 140 జంతువులు, 30 రకాల పక్షులు, ఆరు రకాల పాములు ఉన్నాయి. పెద్దలకు ఐదు, పిల్లలకు రెండు, విదేశీ పర్యాటకులకు రూ.10 చొప్పున నామమాత్రంగా ప్రవేశ రుసుం వసూలుచేస్తున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తం జంతువులకు, పక్షుల మేత, ఆహారం, జూ సిబ్బంది వేతనాలు, నిర్వహణ తదితరాలకు ఎటూ సరిపోవడం లేదు. దీనికి తోడు ఆధునీకీకరణ పనులు జరిగాయి. జూలోకి విదేశాల నుంచి కొత్త ప్రాణులు, పక్షులు, సర్పాలతోపాటు పెంగ్విన్లు రాబోతున్నాయి. వీటికి రెయిన్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పెంగ్విన్లకు ప్రత్యేక వాతావరణం కల్పించాల్సి ఉంటుంది. వాటి ఆహారం, ఆరోగ్యం తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే అవి మరణించే ప్రమాదం ఉంది. దీంతో జూ నిర్వహణ వ్యయం నాలుగు రెట్లు పెరగనుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రవేశ రుసుం పెంచాలని యోచిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో జూ ప్రవేశ రుసుం రూ.40-50 వరకు, విదేశీయులకు రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. ఇదే తరహాలో ముంబైలో కూడా అమలు చేయాలని బీఎంసీ పరిపాలన విభాగం యోచిస్తోంది. -
బీఎంసీలో అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలి
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరుగుతున్న అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఎంసీ పరిపాలనా విభాగంలో అవినీతిని అరికట్టగలిగితే నగరంలోని భూముల ధరలు చదరపు అడుగుకు రూ.500 తగ్గే అవకాశముందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ ప్రవీణ్ దీక్షిత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, బాధ్యత గల ఉన్నతోద్యోగి వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీఎంసీలో జరుగుతున్న అవినీతిపై వెంటనే న్యాయవిచారణ జరిపించాలని రెండుపార్టీల నాయకులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే, తనకు ఒక కాంట్రాక్టర్ రూ.100 కోట్ల లంచం ఇస్తానని ఆశచూపించాడని రాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ చేసిన వ్యాఖ్యలపై కూడా వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఒకవేళ మంత్రి వ్యాఖ్యలు నిజమైతే.. సదరు కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారో లేదో తెలుసుకుని దానిపై కూడా విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అసెంబ్లీ విపక్షనేత రాధాకృష్ణవిఖే పాటిల్, ముంబై కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు జనార్ధన్ చందూర్కర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాయ్ జగ్తప్, అమిన్ పాటిల్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు జితేంద్ర అవ్హాడ్,విద్యాచవాన్ తదితరులు ఉన్నారు. -
కేటాయింపులతో సరి
సాక్షి, ముంబై: ‘అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని..’ అన్నట్లు కావాల్సినన్ని నిధులు అందుబాటులో ఉన్నా ఖర్చు పెట్టే విధానం లోపభూయిష్టంగా ఉండటంతో ముంబైకర్ల కష్టాలు తీరడం లేదు. వివిధ అభివృద్ధి పనుల కోసం మహానగర పాలక సంస్థ (బీఎంసీ) యేటా వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేస్తోంది. అయితే పరిపాలనా విభాగంగా ఆ నిధులను సకాలంలో వినియోగించకపోవడంతో ఖజానాలోనే మురిగిపోతున్నాయి. కొత్త ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేవలం మూడు నెలల సమయమే ఉండగా, ఈ ఆర్థిక బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో కనీసం 25 శాతం కూడా ఖర్చు కాకపోవడం గమనార్హం. మిగిలిన 75 శాతం నిధులను ఈ మూడు నెలల్లో ఎలా ఖర్చు పెడతారనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిపాలనా విభాగం యేటా బీఏంసీ రూ. 30 వేల కోట్ల ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతోంది. కాని అందులో మంజూరు చేసిన నిధుల్లో కేవలం 25 శాతమే ఖర్చు చేస్తుండటం గమనార్హం. బీఎంసీ గత ఆర్థిక బడ్జెట్లో రోడ్లు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఉద్యానవనాలు, అగ్నిమాపకం ఇలా వివిధ శాఖలకు వేలాది కోట్ల రూపాయలు కేటాయించింది. కాని ఖర్చు మాత్రం అనుకున్నంత చేయలేదు. రోడ్లు, రవాణ శాఖకు రూ.2,309 కోట్లు మంజూరు చేయగా అందులో కేవలం రూ.838 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయి. మిగతా నిధులన్నీ అలాగే మురుగుతున్నాయి. ఆస్పత్రులకు, ఆరోగ్యం కోసం ఏకంగా రూ.ఏడు వేల కోట్లు మంజూరు చేసినప్పటికీ ఇందులో కేవలం 20 శాతం మాత్రమే ఖర్చయ్యాయి. అదేవిధంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ పనులకు కేటాయించిన నిధుల్లో 10-15 శాతం నిధులు మాత్రమే ఖర్చుపెట్టారు. ముంబైలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం మంజూరు చేసిన రూ.ఆరున్నర కోట్లలో ఒకపైసా అయినా ఖర్చు కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, వివిధ ప్రాజెక్టు పనుల కోసం, పథకాల కోసం బీఏంసీ యేటా వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. కాని అందులో 50 శాతం నిధులు కూడా ఖర్చు కావడం లేదు. ఆర్థిక బడ్జెట్లో కేవలం సంఖ్య భారీగా చూపించడానికి పరిపాలన విభాగం ఆరాటపడుతోందే తప్ప ముంబైకర్లకు ఒరిగిందేమి లేదని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబ్రేకర్ ఆరోపించారు. ఈ మొత్తాన్ని సద్వినియోగం చేస్తే ముంబైకర్లకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. కాని కార్పొరేటర్ల నిర్లక్ష్యం వల్ల ఇలా రూ.వేలాది కోట్ల నిధులు వృథా అవుతున్నాయని ఆంబ్రేకర్ ఆరోపించారు. -
ఎన్నికల తర్వాతే బెటర్..!
సాక్షి, ముంబై: రాజకీయ లబ్ధి కోసం ఇటీవల శివసేన, బీజేపీ కూటమిగా ఏర్పడినప్పటికీ వచ్చే మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయడమే ఉత్తమమని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఎవరి ప్రాబల్యం ఎంతుందో ఇటీవల జరిగిన శాసన ఎన్నికలతో తేటతెల్లమైనప్పటికీ శివసేన కార్యకర్తలు 2017లో జరిగే బీఎంసీ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే శివసేన కంటే బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వివిధ పార్టీలకు చెందిన 70-80 మంది సిట్టింగ్, మాజీ కార్పొరేటర్ల జాబితా ఇప్పుడే రూపొందించి సిద్ధం చేసుకుంది. విజయావకాశాలు ఎక్కువ ఉన్న వార్డులపై ఇప్పటి నుంచే ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇదిలా ఉండగా అన్ని ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసే పోటీచేస్తాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాని ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో పాతికేళ్ల బంధాన్ని తెంచుకుని ఇరు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. తెగిపోయిన బంధం పూర్వం లాగా అతుక్కోవాలంటే వెంటనే సాధ్యమయ్యే పని కాదని కార్యకర్తలు అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఇరు పార్టీలు కలిసి కొనసాగుతున్నప్పటికీ శాసన సభ ఎన్నికల్లో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాయకులతో కలిసి ప్రచారం చేయడం సాధ్యం కాదేమోనని కొందరు శివసేన నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా బరిలో దిగడమే ఉత్తమమని అనుకుంటున్నారు. ఒకవేళ అవసరమైతే ఇప్పుడెలా ఇరు పార్టీలు ఒక్కటయ్యాయో ఇదే తరహాలో బీఎంసీ ఎన్నికల తర్వాత కూడా పొత్తు కుదుర్చుకోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీఎంసీలో శివసేన, బీజేపీ, ఆర్పీఐ మహాకూటమి అధికారంలో ఉంది. గత బీఎంసీ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులుండగా 139 వార్డుల్లో శివసేన, 63 వార్డుల్లో బీజేపీ, 25 వార్డుల్లో ఆర్పీఐ పోటీ చేశాయి. ఈసారి మాత్రం పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ముంబైలో శివసేన కంటే బీజేపీ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంది. శివసేన 14 సీట్లు రాగా, బీజేపీ 15 స్థానాలు గెలుచుకుంది. దీన్ని బట్టి వచ్చే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా ఎక్కువ స్థానాలు డిమాండ్ చేయడం ఖాయమని తేలిపోయింది. దీంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఫార్ములాలకు బీజేపీ ఇప్పుడు ఒప్పుకోదు. అదేవిధంగా శివసేన కూడా 50ః50 ఫార్ములాలకూ అంగీకరించదు. దీంతో ఇరు పార్టీల మధ్య పేచీ మళ్లీ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీచేయడం ఉత్తమమని ఇరు పార్టీల కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలను అధిష్టానానికి వెల్లడిస్తున్నారు. -
ప్రాణాలు పణంగా ‘పారిశుద్ధ్యం’!
మురికికాల్వలు, చెత్తకుప్పల పక్కన ఒక ఐదు నిమిషాలు నిలబడటానికే అల్లాడిపోతాం.. అటువంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నగరాన్ని రోగాల బారినుంచి రక్షణ కల్పిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం పలు రోగాలతో అర్ధంతరంగా తనువు చాలించాల్సి వస్తోంది... గత ఐదేళ్లలో సుమారు 14 వందల మంది పారిశుద్ధ్య సిబ్బంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో ఊహించుకోవచ్చు.. సాక్షి, ముంబై: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న బీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. కార్పొరేషన్ ద్వారా అందుతున్న అరకొర మందులు, ఇతర రక్షణ సామగ్రి కొరత కారణంగా వారు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా అర్థాంతరంగా వారి ప్రాణాలు హరీ మంటున్నాయి. చెత్త తొలగించడం, మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయడానికి బీఎంసీలో సుమారు 35 వేల కార్మికులు ఉన్నారు. ఇందులో కొందరు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. నిత్యం వీరు చెత్త తొలగించడం, మురికి కాల్వల్లో పనిచేయడంవల్ల విధుల్లో చేరిన 15-20 సంవత్సరాల్లోనే ఆనారోగ్యం పాలవుతున్నారు. చెత్త, మ్యాన్ హోల్స్‌లో దిగడం, మురికి నీరు నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక అనేక మంది కార్మికులు గుట్కా, పాన్, పొగాకు, మద్యం లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వీరు చేస్తున్న పనివిధానాన్ని బట్టి చూస్తే బీఎంసీ పరిపాలన విభాగం తగిన రక్షణ సదుపాయాలు కల్పించడం లేదని స్పష్టమవుతోందని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ అన్నారు. అత్యధిక శాతం పారిశుద్ధ్య కార్మికులు 50-55 ఏళ్ల వయసులోనే మృత్యువాత పడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో ఏకంగా 1,356 మంది సఫాయి కార్మికులు మృతి చెందారు. ‘మ్యాన్ హోల్స్‌లో దిగి పనిచేసేందుకు కార్మికులకు తగిన రక్షణ కవచాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. వీరు అందులో దిగినప్పుడు తప్పనిసరిగా ఆక్సిజన్ మాస్కులు వాడాల్సి ఉంటుంది. అయితే అవి అందుబాటులో ఉండకపోవడంతో మామూలుగానే మ్యాన్‌హోల్స్‌లో దిగుతూ.. వాటిలో ఉత్పతయ్యే విషవాయువులను పీల్చుకుని అందులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు కోకొల్లలు...అయినప్పటికీ బీఎంసీ తగిన పరికరాలు వారికి అందజేయడం లేద’ని ఆంబేకర్ ఆరోపించారు. సాధారణంగా ఈ పనులు చేయడానికి ఎవరూ ముందుకురారు. మత్తులో ఉంటే తప్ప మ్యాన్ హోల్స్‌లో దిగడం, చెత్తను తరలించే సాహసం చేయరు. అందుకే వీరంతా చెడు వ్యాసనాలకు బానిసలవుతున్నారు. మృతుల సంఖ్య తగ్గించాలంటే నెలకు ఒకసారి వారి ఆరోగ్యాన్ని పరిక్షించాల్సిన అవసరం ఎంతైన ఉందని అంబేకర్ స్పష్టం చేశారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం బిళ్లలు, టానిక్‌లు ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన సూచించారు. -
అదనపు ఆదాయంపై ‘బెస్ట్’ దృష్టి
నగరవాసులపై ‘ట్రాన్స్‌పోర్టు ట్యాక్స్’ భారం మోపే యోచన సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ఆదాయం పెంపు వేటలో పడింది. ఇందులోభాగంగా ముంబైకర్లపై ‘ట్రాన్స్‌పోర్టు ట్యాక్స్’ భారం మోపాలని యోచిస్తోంది. దీన్ని అమలు చేసేందుకు కార్పొరేషన్ చట్టంలో మార్పునకు సంబంధించిన ప్రతిపాదనను ఆ సంస్థ పరిపాలనా విభాగం సిద్ధం చేసింది. ట్రాన్స్‌పోర్టు ట్యాక్స్ వసూలు విధానాన్ని అమలు చేస్తే బెస్ట్ సంస్థకు అదనపు ఆదాయం వస్తుంది. అదే జరిగితే ముంబైకర్ల జేబులకు చిల్లులు పడడం మాత్రం ఖాయం. నగరంలో సేవలందిస్తున్న బెస్ట్ సంస్థకు అనేక రూట్లలో కనీస ఆదాయం కూడా రావడం లేదు. దీంతో ప్రతి ఏడాదీ నష్టాలవుతోంది. చేసిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ కారణంగా బెస్ట్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పటికే ఈ సంస్థ రూ.మూడున్నర వేల కోట్ల మేర నష్టాల్లో నడుస్తోంది. పైగా అప్పులు కూడా ఉన్నాయి. ఇలా సంస్థపై మొత్తం రూ. ఏడు వేల కోట్ల వరకూ భారం ఉంది. గతంలో విద్యుత్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రవాణా విభాగానికి మళ్లిస్తూ కాలం గడుపుతోంది. అయితే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ విధించిన ఆంక్షల కారణంగా దానికీ గండిపడింది. దీనిపై కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోర్టు సూచించింది. దీంతో తమకు రూ.160 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేయాలంటూ బీఎంసీకి బెస్ట్ సంస్థ విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి కనీస చార్జీల్లో రెండు రూపాయలు, ఒకవేళ సహాయం అందిస్తే రూపాయి పెంచుతామని స్పష్టం చేసింది. దీనిపై కూడా ఎటువంటి స్పష్టత రాకపోవడంతో చేసేది లేక ప్రయాణికులపై ట్రాన్స్‌పోర్టు ట్యాక్సు విధించాలని యోచిస్తోంది. -
కార్ షెడ్‌ను తరలించాల్సిందే!
నిర్మాణ పనులను వ్యతిరేకిస్తున్న సేవ్ గ్రూప్ సుమారు 2,300 చెట్లు కూల్చివేయనున్న ఎమ్మెమ్మార్డీయే పర్యావరణానికి ముప్పు అని ఆందోళన మెట్రో-3 ప్రాజెక్టు పనులపై వివాదం సాక్షి, ముంబై: కొలాబా-బాంద్రా-సీఫ్జ్(సీబీఎస్) మెట్రోలైన్-3 ప్రాజెక్టు పనులపై స్వచ్ఛంద సేవా సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నగరంలో సుమారు 2,300 చెట్లను నరికివేయాల్సి ఉంటుం దని, దానివల్ల పర్యావరణానికి త్రీవముప్పు తప్పదని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. చెట్ల నరికివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెమ్మార్డీయే, బీఎంసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా ఎవరూ స్పందిం చడం లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, మెట్రో-3 పనుల్లో భాగంగా చెట్ల నరికివేతను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ప్రాజెక్టు నిధులను అందజేస్తున్న జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ)కే నేరు లేఖ రాయనున్నట్లు ప్రకృతి ప్రేమికుడు రిషీ అగర్వాల్ తెలిపారు. ఇదిలా ఉండగా, మెట్రో-3 కార్ షెడ్‌ను ఆరే కాలనీలో 30 హెక్టార్లలో నిర్మాణం చేపట్టారు. కాగా,ఈ నిర్మాణ పనులను ద సేవ్ ఏఎంసీ గ్రూప్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ షెడ్‌ను ముంబై పోర్ట్ ట్రస్ట్ (ఎంబీపీటీ)లోని బహిరంగప్రదేశంలోకి మార్చాల్సిందిగా ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూపీఎస్ మదన్‌తో వారు ఈ నెల నాలుగున కలిసి విన్నవించారు. కాకుంటే మహాలక్ష్మీ, సీఎస్టీకి అనుసంధానం చేస్తూ భూగర్భ టన్నెల్ నిర్మించాలని సూచించారు. కాగా, తమ సూచనలకు ఎలాంటి స్పందన లభించలేదని సేవ్ గ్రూప్ పేర్కొంది. ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్ డిపోను మార్చడం సాధ్యం కాదని తెలిపారు. ఆరే కాలనీలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. అలాగే ఎంబీటీపీకి కార్ షెడ్‌ను మార్చడం కోసం వివిధ రకాల అనుమతులు, ఆమోదాలు అవసరమని తెలిపామన్నారు. ఇందుకు గాను కొన్ని నెలలు లేదా యేళ్లు పట్టవచ్చని అధికారి అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను మెట్రో 3 పనుల్లో తీవ్ర జాప్యం జరిగి, అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోయే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈ విషయమై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాసినట్లు సేవ్ గ్రూప్‌సభ్యులు తెలిపారు. మెట్రో-3 ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తాము కోరడంలేదని, కేవలం కార్‌షెడ్‌ను మాత్రం మార్చాలని కోరుతున్నామన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో అనుమతులకు జాప్యం జరగదని భావిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. -
అంబేద్కర్ వర్ధంతికి సర్వం సిద్ధం
షామియానాలు, టెంట్లు, అంబులెన్సులను అందుబాటులో ఉంచిన బీఎంసీ సాక్షి, ముంబై: భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చైత్యభూమివద్ద సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి అంబేద్కర్‌కు నివాళులర్పిం చేందుకు వచ్చే లక్షలాది మంది అభిమానులకు బీఎంసీ పరిపాలనా విభాగం మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇందులోభాగంగా శివాజీపార్క్ మైదానంలో లక్షా చదరపు టడుగుల విస్తీర్ణంలో భారీ టెంట్లు, షామియానాలు తదితరాలను సిద్ధం చేసింది. ఈ నెల ఆరో తేదీన అంబేద్కర్ వర్ధంతి కావడంతో మూడు రోజుల ముందు నుంచేఆయన అనుయాయులు నగరానికి చేరుకోవడం మొదలైంది. వారు బస చే యడం మొదలుకుని స్నానాల గదులు, తాగునీరు, సంచార మరుగుదొడ్లు, అక్కడక్కడా తాత్కాలిక కుళాయిలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. బెస్ట్ సంస్థ కూడా తనవంతుగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొబైల్ ఫోన్ల చార్జింగ్ వసతితోపాటు, భారీ విద్యుత్ దీపాలు, ఫ్లడ్ లైట్లు తదితర సౌకర్యాలు కల్పించింది. అదేవిధంగా పోలీసు శాఖ కంట్రోల్ రూంలు, భారీ పోలీసు బలగాలను సమకూర్చి సిద్ధంగా ఉంచింది. చలి కారణంగా ఎవరైనా అనారోగ్యం బారినపడితే వారికి అక్కడే వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచింది. శివాజీపార్కు మైదానంతోపాటు చైత్యభూమికి సమీపంలో ఉన్న ఇందు మిల్లు ఖాళీ స్థలాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు. అక్కడ తాత్కాలిక మరుగుదొడ్లు, తాగు నీటితోపాటు విద్యుత్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ శాఖ ఏర్పాట్లు మహాపరినిర్వాణ్ పురస్కరించుకుని శుక్ర, శని, ఆది వారాలు దాదర్, శివాజీపార్క్, చైత్యభూమి పరిసరా ప్రాంతాలన్నీ అంబేద్కర్ అభిమానులతో కిటకిటలాడుతుంటాయి. దీంతో ఇటు అంబేద్కర్ అనుయాయులతోపాటు అటు వాహన చోదకులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ శాఖ తగు చర్యలు తీసుకుంది. శివాజీపార్క్, దాదర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించనున్నారు. మరికొన్నింటిని వన్‌వేగా, నో పార్కింగ్ జోన్లు ప్రకటించనున్నారు. ఐదు, ఆరు, ఏడో తేదీల్లో వాహనాల్లో రాకపోకలు సాగించేవారు దాదర్, శివాజీపార్కు మీదుగా కాకుండా ఇతర మార్గాల మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ శాఖ సూచించింది. చైత్యభూమికి చుట్టుపక్కల నివసించేవారు తమ వాహనాలను దూరంగా ఎక్కడైనా నిలిపిఉంచి కాలిబాటన రావాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. చైత్యభూమి దర్శనానికి ఏర్పాట్లు అంబేద్కర్ సమాధిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారు. అందువల్ల ఈ క్యూ నాలుైగైదు కిలోమీటర్ల మేర ఉంటుంది. ఎస్వీ రోడ్డుపై చైత్యభూమికి ఇటు మాహిం అటు సెంచురీ బజార్ ఇలా రెండు దిశల్లో క్యూలో నిలబడేందుకు ఏర్పాట్లు చేశారు తోపులాటలు జరగకుండా ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక బారికేడ్లను నిర్మించారు. దాదర్‌లో రైలు దిగిన వారికి మార్గదర్శనం చేసేందుకు అక్కడ కార్యకర్తలను నియమించారు. దారి పొడవునా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు అంబేద్కర్ అభిమానులకు రైల్వే పరిపాలనా విభాగం కూడా తనవంతుగా ఏర్పాట్లు చేసింది. ప్రతి ఆదివారం నిర్వహించనున్న మెగాబ్లాక్‌ను ఈ ఆదివారం రద్దు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్, కొంకణ్ మార్గంలో పది ప్రత్యేక రైళ్లు నడపనుంది. రాకపోకలు సాగించేందుకు పశ్చిమ, సెంట్రల్, హార్బర్ మార్గంలో అర్థరాత్రి ప్రత్యేకంగా కొన్ని లోకల్ ట్రిప్పులు నడపనున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఆరు, ఏడు, ఎనిమిది తేదీల్లో సాయంత్రం, రాత్రి తరువాత దాదర్, సీఎస్టీనుంచి రోజూ రెండు చొప్పున నాగపూర్, నాందేడ్, ఔరంగాబాద్, బుసావల్, చాలీస్‌గావ్ తదితర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ అనుయాయులకు రైల్వే అధికారులు సూచించారు. -
ఆరంభ శూరత్వమే..
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నెల కిందట ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్వచ్ఛ్ ముంబై ప్రభోదన్ అభియాన్’ను ప్రస్తుతం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. బైకల్లా హోల్‌సేల్ మార్కెట్‌గా పిలువబడే సంత్ గాడ్గే మహారాజ్ మార్కెట్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత కొన్ని రోజులకే తిరిగి ఈ మార్కెట్లో యధాస్థితి నెలకొంది. ఇక్కడ కూరగాయలు, పండ్లకు సంబంధించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం ప్రారంభించారు. గత నెల 18వ తేదీన గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ డ్రైవ్‌ను మార్కెట్లో ఆర్భాటంగా ప్రారంభించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ సీతారామ్ కుంటే, ఇతర వీవీఐపీలు పాల్గొన్నారు. అంతే.. ఆ తర్వాత రోజు నుంచి అక్కడ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. మార్కెట్లో డ్రైవ్ ప్రారంభించిన పెద్దలు ఆ తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయారు. దాంతో మార్కెట్ పరిసరాల్లో చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోతోంది. మొదటి రెండుమూడు రోజులు హడావుడి చేశారని, తర్వాత ఎవరూ ఇటువైపు రాలేదని, ప్రవేశ ద్వారం వద్ద పరిశుభ్రతకు సంబంధించిన బ్యానర్ తప్ప మరేమీ మిగలలేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక స్టాల్ యజమాని మాట్లాడుతూ.. పరిశుభ్రతకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించిన మూడు నాలుగు రోజుల పాటు స్థానికులు బాగానే పాటించారన్నారు. తర్వాత మళ్లీ పాత కథే కొనసాగుతోందని తెలిపారు. ఏడాది కిందటివరకు కార్పొరేషన్ సిబ్బంది ఈ మార్కెట్‌ను రోజుకు రెండు సార్లు శుభ్రపరిచేవారన్నారు. కాని ఇప్పుడు కేవలం ఉదయం మాత్రమే శుభ్రపరుస్తున్నారని తెలిపారు. సంత్ గాడ్గే మార్కెట్ అధ్యక్షుడు యాసిమ్ క్యూరేషి మాట్లాడుతూ మార్కెట్లో దాదాపు 500 స్టాల్స్ ఉన్నాయని చెప్పారు. స్వచ్ఛ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి కార్పోరేషన్ చేతులు దులుపుకుందని.. తర్వాత పట్టించుకోవడమే మానేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్కెట్లోని వ్యాపారులు కూడా ఈ మార్కెట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ‘ఈ’వార్టు అధికారి మాట్లాడుతూ.. సిబ్బంది కొరత వల్ల ఈ డ్రైవ్ అర్ధాంతరంగా ముగిసిపోయిందన్నారు. ఒక్క ఇన్స్పెక్టర్ 8 నుంచి 10 మార్కట్లను సందర్శించాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. కాగా, బీఎంసీకి చెందిన లెసైన్స్ విభాగం అన్ని మార్కెట్లు, దుకాణా దారులకు తమ ఆవరణలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని నోటీసులను జారీ చేసింది. చెత్త కుండీలను ఏర్పాటు చేయని వ్యాపారుల లెసైన్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది. -
‘తేడా’ చూపిస్తే అనుమతి కట్..
శాకాహారులకే ఫ్లాట్లు అమ్ముతామనే బిల్లర్డపై ఎమ్మెన్నెస్ ఆగ్రహం సాక్షి, ముంబై: కేవలం శాకాహారులకే ఫ్లాట్లు విక్రయిస్తామని పెత్తనం చలాయించే బిల్డర్ల ఆగడాలకు ముకుతాడు వేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) డిమాండ్ చేసింది. మాంసాహారులకు ఫ్లాట్లు విక్రయింంచేందుకు నిరాకరించే బిల్డర్లు కొత్తగా నిర్మించే భవనాలకు అనుమతి ఇవ్వకూడదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సభాగృహంలో జరిగిన సమావేశంలో ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లు ప్రతిపాదించారు. దీంతో శాకాహారులకు ప్రాధాన్యత ఇచ్చే బిల్డర్ల గుండెల్లో దడ మొదలైంది. నగరంలో గత కొంతకాలంగా శాకాహారులకే ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గుజరాతీ, మార్వాడి తదితర కులాల ప్రజలుంటున్న సొసైటీలలో, బహుళ అంతస్తుల భవనాల్లో మాంసాహారులకు చోటు దొరకడం లేదు. అందులో ఫ్లాటు అద్దెకు ఇవ్వాలన్నా, విక్రయించాలన్నా శాకాహారులకే ఇస్తున్నారు. ఇలా కొన్ని ప్రత్యేక కులాలు బృందాలుగా ఏర్పడి కొత్తగా నిర్మించే భవనాల్లో ఫ్లాట్లు బుకింగ్ చేసుకుంటారు. ఇందులో మాంసాహారులకు అవకాశమివ్వరు. వారు విధించే షరతులకు బిల్డర్లు కూడా తలొగ్గి మాంసాహారులకు ఫ్లాట్లు విక్రయించడం లేదు. దీంతో కుల, మత, భాషలతోపాటు భోజనం అలవాట్లపై ఆరాతీసి బిల్డర్లు ఇల్లు, ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. దీని కారణంగా మాంసాహారులు ఫ్లాట్లు కొనుగోలు చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి బిల్డర్లపై ఫిర్యాదులు నమోదుచేసినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇలా కుల, మతాలను విభజించే బిల్డర్లకు నూతన భవనాల అనుమతి ఇవ్వకూడదని ఎమ్మెన్నెస్‌కు చెందిన గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే ప్రతిపాధించారు. దేశ్‌పాండే చేసిన ప్రతిపాదన ఈ నెలాఖరులో జరిగే స్థాయీ సమితి సమావేశంలో చర్చకు రానుంది. ఒకవేళ సమావేశంలో ఈ ప్రతిపాదనకు మంజూరు లభిస్తే అభిప్రాయ సేకరణ జరగనుంది. ఆ తర్వాత బీఎంసీ పరిపాలన విభాగం తుది నిర్ణయం తీసుకుంటుంది. కొత్త భవనాలకు అనుమతి ఇచ్చేముందు అన్ని వర్గాల ప్రజలకు ఇళ్లు, ఫ్లాట్లు విక్రయించాలని బిల్డర్లకు షరతులు విధిస్తారు. భవన నిర్మాణ పనులు ప్రారంభించాలంటే బీఎంసీ నుంచి ‘ఐఓడీ’ జారీ అవుతుంది. ఈ ఐఓడీలో కొత్త నియమాలు పొందుపరిస్తే బిల్డర్ నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు బిల్డరు కొనుగోలుదారులకు ఫ్లాట్లు విక్రయించేందుకు నిరాకరిస్తే నియమ, నిబంధనల ప్రకారం అతడిపై చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుంది. -
కల్తీ నూనె అని తెలిసినా..
* ‘డెంగీ’ దోమల నివారణకు ఉపయోగించే నూనెలో నాణ్యత డొల్ల * ఇప్పటికే రూ.26 కోట్లు చెల్లించిన బీఎంసీ * పనిచేయడం లేదని తెలిసినా వాడుతున్న వైనం * బీఎంసీ తీరుపై విమర్శల వెల్లువ సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దోమల నివారణకు ఉపయోగించే నూనెలో నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో దోమల నివారణ జరగక రోజురోజుకు నగరంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు కెమికల్స్‌ను సరఫరా చేస్తున్న సదరు కంపెనీపై గత ఏడాది కూడా తక్కువ నాణ్యత కెమికల్స్‌ను సరఫరా చేసినందుకు గాను జరిమానా విధించారు. అయినా కార్పొరేషన్‌కు ఆ కంపెనీ ఇప్పటికీ అదే నూనెను సరఫరా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2013 మార్చిలో కార్పొరేషన్ 2.57 లక్షల లీటర్ల ఆయిల్‌ను సరఫరా చేసేందుకు ‘యూనివర్సల్ ఆర్గానిక్స్’ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. రెండేళ్లకు గాను రూ.26 కోట్లను చెల్లించింది. కాగా ఈ కంపెనీ సరఫరా చేస్తున్న ఆయిల్లో కల్తీ ఉందని తేలడంతో సదరు కంపెనీకి అదే ఏడాది జూన్‌లో కార్పొరేషన్ జరిమానా విధించింది. రూ.65 లక్షల జరిమానాను డిపాజిట్ చేయాలని కార్పోరేషన్ సదరు కంపెనీని ఆదేశించింది. అయితే, ఇప్పటికీ అదే కంపెనీ సరఫరా చేస్తున్న ఆయిల్‌నే ఉపయోగించడం గమనార్హం. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేత మనోజ్ కోటక్ మాట్లాడుతూ.. గతంలో కల్తీ మందును సరఫరా చేయడంతో 2011లో పుణే మున్సిపల్ కార్పొరేషన్, సూరత్ ఈ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాయన్నారు. ఈ కంపెనీకి శక్తి వంతమైన మందును సరఫరా చేసే సామర్ధ్యం లేదని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా తేల్చి చెప్పిందన్నారు. నగరంలో రోజురోజు డెంగీ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూఉంటే మరో పక్క బీఎంసీ దోమల నివారణకు కల్తీ ఆయిల్‌తో కూడిన పొగను విడుదల చేసేందుకు విస్తృతంగా డ్రైవ్‌ను ప్రారంభించిందని మనోజ్ కోటక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఎంసీ నిర్లక్ష్యం వల్లే దోమల వృద్ది జరిగి నగరంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆయిల్ అంత ప్రభావం చూపదని తెలిసినా ఇంకా దానిపై ప్రజాధనాన్ని వెచ్చించడంపై ఆయన ఆవేదన వ్యక్తం తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని, నూనె నమూనాను పరీక్షలకు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే, కల్తీ నూనె వాడకానికి బాధ్యులైన వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
‘సీఈవో’ అవసరం లేదు !
ముంబై: నగరానికి ప్రత్యేకంగా ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో)ను నియమించాలని చూడటం సబబు కాదని శివసేన విమర్శించింది. ముంబై అభివృద్ధికి సీఈవోను నియమించాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆలోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో శివసేన పైవిధంగా స్పందించింది. నగరానికి సీఈవోను ఏర్పాటుచేయడమంటే రాష్ట్రం నుంచి దాన్ని వేరుచేసినట్లే లెక్క.. అని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ ఎంపీ రాహుల్ షావలే తెలిపారు. నగరాభివృద్ధి శాఖ ద్వారా ముంబైని అభివృద్ధి చేసే విషయంలో సీఎంకు విశ్వాసం లేకనే ఈ విధంగా ఆలోచిస్తున్నారని ఆయన విమర్శించారు. నగరానికి రాష్ట్ర ముఖ్య కార్యదర్శితో సమాన హోదా ఉన్న మున్సిపల్ కమిషనర్ ఉన్నారని, ఆయనతో నగరాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించుకోవచ్చని సూచించారు. కాగా, శివసేన వ్యాఖ్యలను నగర బీజేపీ అధ్యక్షుడు అశిష్ శేలర్ ఖండించారు. ‘ శివసేన నగరానికి సీఈవో ఏర్పాటును అడ్డుకుంటే నగరాభివృద్ధిని అడ్డుకుంటున్నట్లేనని తాము భావించాల్సి ఉంటుందన్నారు. కాగా, నగరంలో పలు సంస్థల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను సమన్వయపరిచేందుకు అదనపు చీఫ్ సెక్రటరీతో సమాన హోదా కలిగిన సీఈవోను నియమించేందుకు యోచిస్తున్నట్లు సీఎం ఫడ్నవిస్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇకపై ‘ఆన్లైన్’లో రోడ్ల పరిశీలన
సాక్షి,ముంబై: ఇక నుంచి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కాంట్రాక్టర్లకు అప్పగించిన వివిధ ప్రాజెక్టుల పని తీరును ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పరిశీలించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించాలని యోచించారు. కాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీనిని ప్రారంభించలేకపోయారు. ఈ నెలలో ఈ విధానంలో పనులు ప్రారంభించనున్నట్లు బీఎంసీ ఇంజినీర్ (రోడ్ల విభాగం) అశోక్ పవార్ తెలిపారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బీఎంసీ ఇంజినీర్లు త్వరలోనే నగర రోడ్ల మరమ్మతుల నిర్వహణ, నిర్మాణ పనులను సమయానుసారంగా తమ తమ కార్యాలయాలనుంచే పర్యవేక్షించనున్నారు. కాగా, ఈ వ్యవస్థ నిర్వహణ నిమిత్తం కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.9 కోట్ల ఖర్చు అవుతుందని పవార్ చెప్పారు. ఈ విధానంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్లపై కార్పొరేషన్ నిఘా ఉంచవచ్చు. పనిలో నాణ్యతను అప్పటికప్పుడే నిర్థారించవచ్చు. కాగా రోడ్డు పనుల నిమిత్తం తరలిస్తున్న సామాగ్రిపై జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)ను అమర్చడం ద్వారా వాహనాల కదలికలను కూడా గమనించవచ్చు. ఈ వ్యవస్థను ప్రస్తుతం పింప్రి చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉపయోగిస్తోంది. దీంతో ఈ ట్రాకింగ్ చిప్‌లను తమ వాహనాలకు తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందిగా కాంట్రాక్టర్లందరికీ బీఎంసీ ఆదేశించింది. -
బ్యానర్లు తొలగిస్తున్న బీఎంసీ
సాక్షి, ముంబై : నగరంలో రాజకీయ బ్యానర్లు, హోర్డింగ్‌లను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తొలగించే పనులు చేపట్టింది. నూతన ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలుపుతూ నగరంలోని చాలా ప్రాంతాల్లో వేలాది బ్యానర్లు, పోస్టర్లను అక్రమంగా ఏర్పాటు చేశారు. దీంతో వీటి తొలగింపునకు బీఎంసీ ఉపక్రమించింది. బీఎంసీ అధికారుల కథనం ప్రకారం.. వ్యక్తిగత, రాజకీయ పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేయడానికి 2013 సెప్టెంబర్‌లో బీఎంసీ ఓ విధానాన్ని రూపొందించింది. ఈ మేరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, స్వాగత హోర్డింగ్‌లు, రాజకీయ, వ్యక్తిగత పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుకు బీఎంసీ అనుమతించింది. అయితే వాటి పరిమాణం కేవలం 10 గీ 10 అడుగులు మాత్రమే ఉండాలనే నిబంధన విధించింది. అలాగే వాటిని ఒక్కరోజు మాత్రమే ఉంచేందుకు అనుమతించింది. ఆ తర్వాత కూడా సదరు బ్యానర్లు, హోర్డింగ్‌లను అలాగే వదిలేస్తే బాధ్యులపై బీఎంసీ చర్యలు తీసుకోవచ్చు. వారికి రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష విధించేందుకు అవకాశముంది. -
‘చెత్త’ యజమానిపై చర్యలు..!
సాక్షి, ముంబై: ఏ ఇంటి సమీపంలోనైనా చెత్త,కుళ్లిపోయిన కూరగాయలు, ఇతర వస్తువులు పేరుకుపోయినట్లు కనిపిస్తే సదరు ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్థాయీ సమితి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, సొసైటీలు, చాల్స్, మురికివాడలు ఇలా ఎక్కడైన సరే ఇంటి యజమానులను వదిలే ప్రసక్తేలేదని స్థాయీ సమితిలో నిర్ణయించారు. దోమల సంతతికి ఊతమిచ్చే చెత్త కనిపించినా, దీని కారణంగా ఇరుగు పొరుగువారికి డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు సోకితే సంబంధిత ఇంటి యజమానిని అరెస్టు చేయాలని కమిషనర్లు ఆదేశాలు జారీచేసినట్లు బీఎంసీ ఆస్పత్రుల డెరైక్టర్ డాక్టర్ సుహాసిని నాగ్దా చెప్పారు. ఈ ఆదేశాల కారణంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇంటి యజమానుల్లో దడపుట్టింది. కొద్ది రోజులుగా నగరంలో డెంగీ, మలేరియా లాంటి ప్రాణాంతక జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ వ్యాధులు ముఖ్యంగా పరేల్ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టమైంది. పరేల్, లాల్బాగ్, ఎల్ఫిన్స్టన్ రోడ్, లోయర్‌పరేల్ ప్రాంతాల్లో మూతపడిన మిల్లు స్థలాల్లో అనేక భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. అక్కడ గుట్టల్లా పేరుకుపోయిన శిథిలాలు, చెత్తచెదారం, రోజుల తరబడి నిల్వ చేసిన నీరు, పనిచేసే కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి అంటువ్యాధులతో రావడం ఇలా అనేక కారణాలవల్ల డెంగీ పడగ విప్పిందని వైద్యులు అంటున్నారు. దీనికి తోడు చాల్స్, భవనాల పరిసరాల్లో కుళ్లిపోయిన ఆహారం, కూరగాయలు పారేయడం వల్ల దోమల బెడద ఎక్కువవుతోందని నాగ్దా అన్నారు. ఫలితంగా డెంగీ, మలేరియా, లెఫ్టో లాంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని, దీంతో బాధ్యులైన ఇంటి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. -
రోడ్లను మాకు వదిలేయండి..ప్లీజ్!
రాష్ట్ర ప్రభుత్వానికి బీఎంసీ లేఖ * అనుమతి కోసం నిరీక్షణ * ప్రస్తుతం ఎమ్మెమ్మార్డీయే, పీడబ్ల్యూడీ, ఎమ్మెస్సార్డీసీలూ భాగస్వాములే * ఒకే గొడుగుకింద అయితే నిర్వహణ బాగుంటుందని బీఎంసీ వాదన * ఆదాయం పోతుందని మిగతా సంస్థల ఆందోళన సాక్షి, ముంబై : నగరంలోని అన్ని రోడ్ల నిర్వహణను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బృహన్ ముంబై మున్పిపల్ కార్పొరేషన్ కోరుతోంది. ఈ మేరకు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం బీఎంసీ పంపించింది. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, బ్రిడ్జీల నిర్వహణను చూసుకుంటామని బీఎంసీ ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఒకే గొడుగు కింద వీటన్నింటిని నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని బీఎంసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ), ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఈ రోడ్ల నిర్వహణలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సందర్భంగా అడిషినల్ మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఎంసీ గొడుగు కింద అన్ని బ్రిడ్జీల నిర్వహణ బాధ్యతను చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఒక్క సంస్థ ఆధ్వర్యంలో బ్రిడ్జిల నిర్వహణ చేపడితే సక్రమంగా నిర్వహించగలుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఫ్రీవే, శాంతాకృజ్-చెంబూర్ లింక్‌రోడ్డు ప్రస్తుతం ఎమ్మెమ్మార్డీఏ ఆధీనంలో ఉన్నాయి. శాంతాకృజ్‌లో ఉన్న ఫ్లై ఓవర్, వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న అంధేరి ఫ్లై ఓవర్ కాకుండా ఎన్నో నిర్మాణాలను ప్రస్తుతం పీడబ్ల్యూడి, ఎమ్మెస్సార్డీసీ నిర్వహిస్తున్నాయి. కాగా, ఆగస్ట్‌లో అన్ని రోడ్లకు సంబంధించిన నిర్వహణ తామే చూసుకుంటామని బీఎంసీ ఓ ప్రతిపాదనను పంపించింది. మంచి ఫలితాలు ఇచ్చే విధంగా వీటి నిర్వహణ బాధ్యతను చూస్తామని బీఎంసీ పేర్కొంది. ఇదిలా ఉండగా, రోడ్ల నిర్వహణ నేపథ్యంలో ప్రకటనల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చని చాలా ఏజెన్సీలు వీటిని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నాయని, అవి ఏవీ తమ భాగస్వామ్యాలను వదులుకోవడానికి సిద్ధంగా లేవని బీఎంసీ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. -
కరెంట్ ‘కట్’.. చీకట్లోనే దీపావళి..
* విద్యుత్ నిలిపివేసిన బీఎంసీ * జనరేటర్లతో నెట్టుకువస్తున్న కుటుంబాలు సాక్షి, ముంబై : నగరంలోని అక్రమ ఫ్లాట్లకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విద్యుత్‌ను నిలిపి వేయడంతో ఆయా ప్రాంతాల వారు అంధకారంలోనే దీపావళిని జరుపుకోవాల్సి వచ్చింది. గత ఏడాది కూడా వీరు పండుగను జరుపుకోలేదు. వీరు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికి వారు ఖాళీ చేయకపోవడంతో బీఎంసీ వీరికి విద్యుత్ సరఫరాను నిలిపి వేసింది. దీంతో వీరు బ్లాక్ దీపావళిని జరుపుకున్నారు. జీ/సౌత్ వార్డ్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి నివాసముంటున్న వారికి బీఎంసీ విద్యుత్‌ను నిలిపివేసింది. అయితే వీరు రాత్రి వేళ్లలో జనరేటర్లు, ఎమర్జెన్సీ లైట్లను ఉపయోగిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా మిడ్డౌన్ అపార్ట్మెంట్లో ఉంటున్న విద్యా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సారి తాము దీపావళిని ఎమర్జెన్సీ లైట్లు ఉపయోగించి జరుపుకున్నామని విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా తాము దీపావళిని ఆనందంగా జరుపుకోలేదన్నారు. తమ ఇళ్లను కూల్చివేస్తామని అధికారులు చెప్పడంతో తాము నిరుత్సాహానికి గురై ఆ రోజు ఆందోళనకు కూడా దిగామన్నారు. దీంతో దీపావళిని జరుపుకోలేదన్నారు. కాగా, తాము చివరి అంతస్తులో ఉండడంతో వేడితాపం అంతగా తెలియడం లేదనీ, కానీ కింది అంతస్తులలో ఉంటున్నవారు మాత్రం వేడివల్ల ఉక్కపోతను భరించలేక పోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బీఎంసీ జీ/సౌత్ వార్డ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వీరు తమ ఇళ్లను అప్పగించే వరకు పరిస్థితి ఇలానే కొనసాగుతుందని స్పష్టంచేశారు. కాగా, అక్రమంగా నిర్మాణం చేపట్టిన దాదాపు 140 కుటుంబాలకు ఖాళీ చేయాల్సిందిగా బీఎంసీ గత ఏడాదే నోటీసులు జారీ చేసింది. -
బీఎంసీ వాహనాలకు జీపీఎస్
సాక్షి, ముంబై: ముంబై నగరపాలక సంస్థ (బీఎంసీ) తమ వాహనాలన్నింటినీ ట్రాక్ చేయడానికి జీపీఎస్‌ను అమర్చాలని నిర్ణయించింది. కార్పొరేషన్‌కు సొంతంగా 2 వేల వాహనాలు ఉన్నప్పటికీ వీటిలో 8 వందల వాహనాలకు ఈ వ్యవస్థను అమర్చి పర్యవేక్షిస్తున్నారు. ఇకపై ఐటీ విభాగం అభివృద్ధి చేసిన వెహికిల్ ట్రాకింగ్ సిస్టిమ్ (వీటీఎస్)ను కార్పొరేషన్‌కు చెందిన అన్ని విభాగాల వాహనాలకు అమర్చనున్నారు. దీంతో కార్పొరేషన్‌కు చెందిన అన్ని వాహనాలు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయంపై అధికారులు నిఘాపెట్టనున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు చెత్త, మట్టిని తరలించేందుకు వాహనాలను ఉపయోగించడం లేదు. తద్వారా రవాణ ఖర్చు పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు సదరు వాహనాలపై నిఘా పెట్టేందుకు జీపీఎస్ అనుసంధానిత వీటీఎస్‌ను వాహనాలలో ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీని ద్వారా పనిలో పారదర్శకత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌కు చెందిన సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ విభాగంలో చాలా వాహనాలు ఉన్నాయి. స్టార్మ్ వాటర్ డ్రెయిన్ విభాగం, ఇతర విభాగంలో చాలా వాహనాలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా ఈ వ్యవస్థను అమర్చనున్నారు. ఈ ప్రాజెక్టుకు గాను రూ.23 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రతిపాదనను ఇటీవలె స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా వాహనాలకు సెన్సార్లను అటాచ్ చేస్తారు. వీటిని జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారని అధికారి తెలిపారు. ఈ వ్యవస్థతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిన కాంట్రాక్టు పనులను కూడా పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు చెత్తను సక్రమంగా తరలించడం లేదనే ఫిర్యాదులు గతంలో వెల్లువెత్తాయి. ప్రయోగాత్మకంగా ఎఫ్-సౌత్, పీ-నార్త్ వార్డులలో జీపీఎస్ వెహికిల్-ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రారంభించనున్నారు. వాహనాలలో ఈ వ్యస్థను ఏర్పాటు చేయడంతో వాహనాల కదలికలతోపాటు కేటాయించినమార్గాలను కూడా పర్యవేక్షించనున్నారు. -
మిఠీనది పరిరక్షణకు బీఎంసీ కసరత్తు
- జలశుద్ధీకరణ కేంద్రం నిర్మాణానికి ఆమోదం - నదిపై అక్రమంగా వెలసిన కట్టడాలు, పరిశ్రమలపై చర్యలు సాక్షి, ముంబై: మిఠీనది పరిరక్షణ, జలాల శుద్ధికి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) శ్రీకారం చుట్టింది. నదిలో పెరిగిపోయిన కాలుష్యకారకాలను తక్షణమే తొలగించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నదిపై జల శుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మీఠీనది పరిరక్షణ చర్యలు చేపట్టాలని, కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బీఎంసీకి ఆర్నెళ్ల కిందటే మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోటీసు జారీ చేసింది. ఇందుకు స్పందించిన బీఎంసీ పరిపాలన విభాగం ఈ మేరకు జలశుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. మిఠీనదిలోకి ఎక్కడెక్కడి నుంచి మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తున్నాయో, జల శుద్ధీకరణ కేంద్రం ఎక్కడ నిర్మించాలనే విషయాలను అధ్యయనం చేయడానికి ఐటీఐకి చెందిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బీఎంసీ పరిపాలన విభాగానికి సూచనలు చేయనుంది. కుచించుకుపోయిన నది మీఠీనదిలోకి నగరం, శివారు ప్రాంతాల్లోని అనేక మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తాయి. నగర ప్రజలు దైనందిన పనులకు వాడే నీటితోపాటు పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు కూడా ఇందులోనే కలువడంతో నది కాలుష్యకాసారంగా మారింది. ఫలితంగా 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలకు నగరంతోపాటు శివారు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అప్పట్లో వచ్చిన వరదలకు 200పైగా మంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. ఈ ఘటనతో కళ్లు తెరిచిన ప్రభుత్వం వరదలకు ప్రధాన కారణాలను అధ్యయనం చేసేందుకు చితలే కమిటీని నియమించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఈ కమిటీ మిఠీనది కుచించుకుపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లడం లేదని, దీంతోపాటు నదికి ఇరువైపులా మట్టిపోసి అందులో వెలసిన అక్రమ కట్టడాలే వరదముప్పునకు ప్రధాన కారణంగా తేల్చి చెప్పింది. అప్పటి నుంచి మిఠీనది అభివృద్ధి అంశం తెరమీదకు వచ్చింది. సుమారు 500 పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు ఈ నదిలో సుమారు 500పైగా పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు వచ్చి చేరుతున్నాయని కాలుష్యనియంత్రణ మండలి విడుదల చేసిన జాబితాలో స్పష్టం చేసింది. ఇందులో నుంచి ఏ పరిశ్రమ నుంచి ఎంతమేర కలుషిత నీరు చేరుతుందనేది పరిశీలించాల్సి ఉంది. ఆ తరువాత ఆయా యజమానులపై చర్యలు తీసుకుంటామని బీఎంసీ డిప్యూటీ కమిషనర్ అశోక్ ఖైరే వెల్లడించారు. అదే విధంగా మిఠీనదిని ఆక్రమించుకొని రెండు వైపులా వెలసిన అక్రమ కట్టాడాలు, పరిశ్రమలపై చర్యలు తీసుకొనున్నట్లు చెప్పారు. మీఠినది పరిరక్షణకు అవసరమైన అన్నిచర్యలను తీసుకొంటామని ఆయన చెప్పారు. -
‘పొత్తు’ చెడితే..!?
బీఎంసీలో ‘మహా’ సంశయం.. - ‘సీట్ల సర్దుబాటు’ వ్యవహారంతో ఆందోళనలో మహాకూటమి కార్పొరేటర్లు - కూటమి విడిపోతే ‘బీఎంసీ’ పరిస్థితిపై మల్లగుల్లాలు సాక్షి, ముంబై: ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం..’ అనే సామెత చందంగా తయారైంది బీఎంసీలోని అధికార కూటమి పరిస్థితి.. సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమిలో ఇంతవరకు సయోధ్య కుదరకపోవడంతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో ‘మహాకూటమి’ కార్పొరేటర్లు ఆందోళనకు గురవుతున్నారు. గత 15 రోజులుగా ఇరు పార్టీల నాయకుల మధ్య చర్చలు ప్రత్యక్షంగా జరగకపోయినా మీడియా లేదా లేఖల ద్వారా ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ సమస్య ఎటూ పరిష్కారం కావడంలేదు. కాగా, దీని ప్రభావం బీఎంసీ పరిపాలన విభాగం పడే ఆస్కారముంది. బీఎంసీలో మహాకూటమి అధికారంలో ఉంది. పొత్తు ఉంటుందా..? ఊడుతుందా..? ఒకవేళ పొత్తు ఊడిపోతే బీఎంసీలో అధికారం శివసేన, బీజేపీ వద్ద ఉంటుందా...? లేక ఇక్కడ కూడా తెగతెంపులు చేసుకుని ఎవరి దారివారు చూసుకుంటారా...? అప్పుడు తమ పరిస్థితి ఏంటి..? ఇలా అనేక సందేహాలతో కొర్పొరేటర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. బీఎంసీలో మొత్తం 227 వార్డులున్నాయి. అధికారం చేజిక్కించుకోవాలంటే 114 మంది కార్పొరేటర్లు తప్పనిసరి కావాలి. కాని గత బీఎంసీ ఎన్నికల్లో ఏ కూటమికీ పూర్తి మెజార్టీ రాలేదు. బీఎంసీలో ప్రస్తుతం శివసేన-75, బీజేపీ-31, కాంగ్రెస్-52, ఎన్సీపీ-13, ఎమ్మెన్నెస్-28, సమాజ్‌వాది పార్టీ-9, అఖిల భారతీయ సేన-2, బీఆర్పీ-1, ఆర్పీఐ-1, ఇండిపెండెంట్లు-15 మంది సభ్యులున్నారు. ఇందులో శివసేన, బీజేపీ, ఆర్పీఐ కూటమి ఇద్దరు అఖిల భారతీయ సేన, 15 మంది ఇండిపెండెంట్లను కలుపుకొని అధికారంలోకి వచ్చింది. కాని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఒకవేళ పొత్తు కుదరక మహాకూటమి చీలిపోతే బీఎంసీలో బలాబలాలను బట్టి చూస్తే బీజేపీ లేకుండా శివసేనకు 114 మేజిక్ ఫిగర్‌కు చేరుకోవడం ఒక సవాలుగా మారనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెన్నెస్, కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టడం సాధ్యం కాని పని. దీంతో మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం తమ సీట్ల కిందకు నీళ్లు తెచ్చేలా ఉందని కార్పొరేటర్లు ఆందోళనలో చెందుతున్నారు. -
ఎర్రబుగ్గపై ఎంత మోజో!
సాక్షి, ముంబై: మేయర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన స్నేహల్ అంబేకర్‌కు విధినిర్వహణ కంటే ఎర్రబుగ్గ వాహనం, తన కార్యాలయ అలంకరణపై మోజు ఎక్కువంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిరోజు ఆమె తన చాంబర్లోకి వచ్చారు. తన పదవీ బాధ్యతలేంటో తెలుసుకోవాల్సి ఉండగా, అదేం పట్టించుకోకుండా తన చాంబర్ అలంకరణపై దృష్టి పెట్టారు. క్యాబిన్‌ను ఎలా అలంకరించాలో కిందిస్థాయి అధికారులకు సూచనలిస్తూ చాలా సేపు గడిపారు. అంతేగాక ప్రభుత్వం అందజేసిన కారుపై ఎర్రబుగ్గ (బీకన్) తొలగించకుండా అలాగే ఉంచాలని పట్టుబట్టారు. తదనంతరం ఉద్యోగులతో మాటామంతి అయ్యాక, కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు ఆదరబాదరగా వెళ్లిపోయారు. తన కారుపై ఎర్రబుగ్గా కచ్చితంగా ఉండాల్సిందేనని పట్టుబట్టడంతో అంతా విస్తుపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాన కార్యదర్శులు మినహా ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పదవుల్లో ఉన్న వాళ్లు వాహనాలపై ఎర్రబుగ్గ అమర్చుకోకూడదు. దీన్ని కచ్చితంగా పాటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మేయర్లందరికీ లిఖితపూర్వక ఆదేశాలు జారీచేసింది. ఇదివరకు మేయర్ పదవిలో కొనసాగిన సునీల్ ప్రభు ‘మేయర్ పదవి’ ఒక ప్రతిష్టాత్మకమైనదని, తాను నగర ప్రథమ పౌరుడినని పేర్కొంటూ ఎర్రబుగ్గ తొలగించలేదు. ఇదే వాహనాన్ని నూతన మేయర్ స్నేహల్ ఆంబేకర్కు అప్పగించాక, పాత పద్ధతే కొనసాగించాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అక్కడున్న కొందరు విలేకరులు గుర్తు చేశారు. నగర ప్రథమ పౌరురాలిని కాబట్టి అధికారిక వాహనంపై ఎర్రబుగ్గ ఉండాల్సిందేనని అన్నారు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, స్నేహల్ వంటి వారిని చూసి ఇతరులు కూడా తమ వాహనాలపై బుగ్గ అమర్చుకుంటారని మున్సిపల్ అధికారులు విమర్శిస్తున్నారు. -
బీఎంసీ కొత్త మేయర్ స్నేహల్
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 73వ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ స్నేహల్ అంబేకర్ మంగళవారం ఎన్నికయ్యారు. ఇక బీజేపీకి చెందిన అల్కా కేర్కర్ ను ఉప మేయర్ పదవి వరించింది. భారతీయ జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) మాజీ ఉద్యోగి అయిన స్నేహల్ నగరంలోని జీ-సౌత్ (పరేల్) వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత మేయర్ సునీల్ ప్రభు పదవీకాలం ముగియడంతో మంగళవారం ఉదయం బీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరిపారు. బీఎంసీలో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 226 కాగా స్నేహల్‌కు అనుకూలంగా 121 మంది ఓటు వేశారు. ఈ పదవికోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీపడిన డాక్టర్ ప్రియతమకు కేవలం 64 ఓట్లే పడ్డాయి. ఇక డిప్యూటీ మేయర్‌గా అల్కా కేర్కర్ ఎన్నికయ్యారు. -
బీఎంసీ కార్లపై అనాసక్తి
ముంబై: వివిధ పదవుల్లో కొనసాగుతున్న కార్పొరేటర్ల కోసం బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రూ.70 లక్షలు వెచ్చించిన కొనుగోలు చేసి కార్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇందులో సదుపాయాలు తక్కువగా ఉన్నాయనే సాకుతో కార్పొరేటర్లు వీటిని ఉపయోగించడం లేదు. ఖర్చు తగ్గించుకుందామనే ఉద్దేశంతో పవర్ స్టీరింగ్, మ్యూజిక్ సిస్టమ్, ఆటోమాటిక్ డోర్ లాకింగ్ వంటి సదుపాయాలు లేని కార్లను బీఎంసీ కొనుగోలు చేసింది. అందుకే కార్పొరేటర్లు వీటిని ఆదరించడం లేదని తెలుస్తోంది. బీఎంసీ మూడు నెలల క్రితం రూ.5.25 లక్షల చొప్పున 14 కార్లను కొనుగోలు చేసింది. వీటిలో ఏడింటిని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు కేటాయించారు. మిగతా వాటిని బీఎంసీ కమిటీల అధిపతులకు కేటాయించాల్సి ఉంది. ఈ కార్లలో సదుపాయాలు బాగా లేవంటూ ముగ్గురు కార్పొరేటర్లు ఇది వరకే కార్లను వాపసు పంపించారు. విపక్ష నాయకుడు దేవేంద్ర అంబేద్కర్, సభాపక్ష నాయకుడు తృష్ణా విశ్వాస్‌రావు, ప్రజారోగ్య కమిటీ చైర్పర్సన్ గీతాగావ్లీకి బీఎంసీ కేటాయించిన కార్లను కొన్ని రోజులు వాడి వెనక్కి పంపించారు. బీఎంసీలో నిరంకుశ పాలన కొనసాగుతుందని చెప్పడానికి నాసిరకం కార్ల కేటాయింపే నిదర్శమని ఈ కార్పొరేటర్లు అంటున్నారు. మిగతా వాళ్లు కూడా కార్ల నాణ్యతపై బీఎంసీ రవాణా విభాగానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి తమ సొంత కార్లనే వినియోగించుకుంటున్నామని తెలిపారు. ‘ఎలాంటి సదుపాయాలూ లేని కార్లను బీఎంసీ కమిషనర్ వినియోగిస్తారా ? వ్యయనియంత్రణ చర్యలు కేవలం కార్పొరేటర్ల కోసమేనా ? ఇలాంటి పిసినారితనం వల్ల సంస్థకు ప్రజల్లో చెడ్డపేరు వస్తుంది’ అని ఒక కార్పొరేటర్ అన్నారు. ఇదిలా ఉంటే ఇవే కార్లను వాడాల్సిందిగా బీఎంసీ అధికారులు నచ్చజెప్పినప్పటికీ కార్పొరేటర్లు ససేమిరా అనడంతో వాహనాలన్నీ వృథాగానే పడి ఉంటున్నాయి. గతంలో ఉన్న కార్లు తరచూ మొరాయిస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో వీటిని కొనుగోలు చేశారు. తన పాత కారు తరచూ ఆగిపోతోందని పేర్కొంటూ అంబేద్కర్ ఇటీవలే వాహనాన్ని బీఎంసీకి వాపసు చేశారు. కార్యాలయానికి రావడానికి సొంత వాహనం లేదనా ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటున్నానని తెలిపారు. అయితే కార్పొరేషన్ అంబేద్కర్‌కు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం కల్పించింది. అధికారిక వినియోగం కోసం మరో వాహనం కేటాయించింది. కార్పొరేటర్లు బీఎంసీ వాహనాలను విచ్చలవిడిగా వాడుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నట్టు గతంలో పలుసార్లు వార్తలు వచ్చాయి. మేయర్ సునీల్ ప్రభు కూడా రెండేళ్లలో మూడు కార్లు మార్చడం గమనార్హం. -
సెల్ ఉంటే చాలు..
సాక్షి, ముంబై: మీ దగ్గర మొబైల్ ఉందా.. అయితే ఇంకేం.. మీకు ఇకపై కార్పొరేషన్ వరకు వెళ్లి నీటిపన్ను.. ఇంటిపన్ను.. ఆస్తిపన్ను.. ఇలా అన్ని రకాల పన్నులు కట్టేందుకు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ముంబైకర్లకు ఇకపై కార్పొరేషన్ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. వివిధ పన్నులు చెల్లించేందుకు కార్యాలయాల్లోని కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూల్లో నిలబడి విలువైన సమయం, వ్యయప్రయాసలను పూర్తిగా తగ్గించేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారా వివిధ రకాల పన్నులు చెల్లించేందుకు ప్రజలకు అవకాశం కల్పించింది. అందుకు బీఎంసీకి చెందిన మొబైల్ అప్లికేషన్ వచ్చే వారం నుంచి ముంబైకర్లకు అందుబాటులోకి రానుంది. ప్రారంభంలో నీటి పన్ను చెల్లించేందుకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఆ తరువాత ఆస్తి, ఆదాయ పన్నులతోపాటు అనుమతి ఇచ్చే శాఖలకు చెల్లించాల్సిన రుసుం కూడా చెల్లించేందుకు అప్లికేషన్లు ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదులు నమోదుచేసే సౌకర్యం కూడా నవంబర్‌లో ప్రవేశపెట్టనుంది. ‘ఎంసీజీఎం 24/7’ అనే అప్లికేషన్ అండ్రాయిడ్ మొబైల్‌పై డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీఎన్ఎన్ నంబర్ చేర్చగానే చెల్లింపు దారుడికి వివరాలు అందులో వస్తాయి. ఆ తర్వాత క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అలాగే ఐఎంపీఎస్ లాంటి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చు. పన్ను చెల్లించడానికి ఈ సేవలు అందిస్తున్న సంబంధిత కంపెనీకి దాదాపు ఒక శాతం అదనపు పన్ను విధిస్తారు. రుసుం చెల్లించగానే ఎస్ఎంఎస్ ద్వారా మనకు మెసేజ్ వస్తుంది. దీన్ని రసీదుగా భావించాల్సి ఉంటుందని మేయర్ సునీల్ ప్రభు స్పష్టం చేశారు. ఇదివరకే బీఎంసీ పరిపాలన విభాగం ముంబైకర్లకు కన్జ్యూమర్ కన్వీనియెన్స్ సెంటర్ (గ్రాహక్ సువిధ కేంద్రం) తోపాటు సైబర్ కన్వీనియెన్స్ సెంటర్లో పేమెంట్ గెట్ వే, బీఎంసీకి చెందిన ఆధీకృత వెబ్‌సైట్‌పై డబ్బులు చెల్లించడం, ఫిర్యాదు నమోదు చేయడం లాంటి సౌకర్యాలు కల్పించింది. నేటి ఆధునిక కాలంలో ప్రస్తుతం అందరి వద్ద మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు, పరుగులతో జీవనం సాగించే ముంబైకర్లకు గంటల తరబడి క్యూలో నిలబడి పన్నులు చెల్లించే ఓపిక ఉండదు. దీంతో తమ చేతిలో అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా వివిధ రకాల పన్నులు చెల్లించేందుకు బీఎంసీ సౌకర్యాలు కల్పిస్తోందని మేయర్ అన్నారు. -
రిస్క్ చేసినా నో ‘పే’!
సాక్షి, ముంబై : ‘ అగ్నిప్రమాదం జరిగినప్పుడు మాతోపాటు అధికారులు రిస్క్ పనుల్లో పాల్గొంటారు.. కానీ మాకు రూ.500, అధికారులకు రూ.5000 లోపు చెల్లిస్తున్నారు.. ఎందుకీ వివక్ష’ అని జవాన్లు బీఎంసీని నిలదీస్తున్నారు. అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న జవాన్లకు చెల్లించే ‘రిస్క్ పే’ విషయంలో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చిన్న చూపు చూస్తోంది. జవాన్లతో పనిచేస్తున్న అధికారులు ఎలాంటి రిస్క్ పనుల్లో పాల్గొనకున్నప్పటికీ రిస్క్ పే తోపాటు ఇతర భత్యాలను బీఎంసీ పెద్ద మొత్తంలో చెల్లిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను ఫణంగాపెట్టి పనిచేస్తున్న జవాన్లకు మాత్రం రిస్క్పేగా కేవలం రూ.500 చెల్లిస్తోంది. అదే అధికారులకు రూ. 2,000-5,000 వరకు రిస్క్ పే, ఇతర భత్యాలు అందజేస్తోంది. నగరంలో ఎక్కడ, ఎలాంటి ప్రమాదం జరిగినా ముందుగా అక్కడికి చేరుకునేది అగ్నిమాపక శాఖ వాహనాలే. జవాన్లు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సాధ్యమైనంత త్వరలో మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తారు. వీరిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రిస్క్ పే అందజేస్తున్నారు. గతంలో ఇది రూ.50 మాత్రమే ఉండేది. కొద్ది సంవత్సరాల కిందట దీన్ని రూ.500 పెంచారు.కానీ, అధికారులు, జవాన్ల మధ్య రిస్క్‌పేలో వివక్ష వల్ల జవాన్లు, అధికారుల మధ్య చిచ్చు రగులుతోంది. రిస్క్ మాది..భత్యం ఉన్నతాధికారులకా? ‘2008 నవంబరు 26న ఉగ్రవాదులు ముంబైలో దాడులు చేసినప్పుడు అధికారులతో మేమూ పాల్గొన్నాం. సమానంగా విధులు నిర్వహించి పరిస్థితులను చక్కదిద్దాం. అందుకు అధికారులు ప్రత్యేక భత్యం మంజూరు చేయించుకున్నారు. యూనిఫార్మ్ విషయంలో ఆందోళన చేపట్టినప్పటికీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. విధి నిర్వహణలో గాయపడితే మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాలంటే ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచిచూడాల్సి వస్తోంది. ఏదైనా నిర్లక్ష్యం జరిగితే అధికారులే దర్యాప్తుచేస్తారు. వారే తెర దించుతారు. వాస్తవానికి దర్యాప్తు పనులు బీఎంసీకి చెందిన విజిలెన్స్ డిపార్టుమెంట్ అధికారులు చేయాలి. అనేక సందర్భాలలో వారి ఇళ్లల్లో కూడా పనులు చేయాల్సి వస్తోంది. ఫిర్యాదు చేయాలంటే మళ్లీ ఈ అధికారుల వద్దకే వెళ్లాలి. మంటలను అరికట్టేందుకు ప్రత్యేకంగా అందజేసిన పీపీఎస్ సెట్టును ధరించాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నామని’ జవాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిస్క్‌పేలో వివక్ష చూపుతున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘లోతట్టు’ రక్షణకు శ్రీకారం
సాక్షి, ముంబై : నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందు జాగ్రత్తలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వర్షాల వల్ల నిల్వచేరిన వరద నీటిని తొలగించడానికి మరో మూడు మినీ పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ పూనుకుంది. నగరంలో రెండు పంపింగ్ స్టేషన్లు, మరొక పంపింగ్ స్టేషన్‌ను శివారు ప్రాంతంలో నిర్మించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దాదర్, చర్నీరోడ్, మాన్కుర్ధ్ తదితర ప్రాంతాల్లో నిలువ ఉన్న వర్షపు నీటిని తొలగించేందుకు ఈ మినీ పంపింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు. వీటి ద్వారా వరదనీటి నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించ డానికి బీఎంసీ చర్యలు తీసుకొంటోంది. 2005 ఘటనతో తేరుకున్న బీఎంసీ జూలై 26, 2005లో వరద నీరు నగరాన్ని ముంచెత్తింది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు నగరంలో ఎనిమిది పంపింగ్ స్టేషన్లను నిర్మించాలని అప్పుడే బీఎంసీ నిర్ణయించింది. ఇందులో రెండు పంపింగ్ స్టేషన్లు ఇర్లా, హజీ అలీలో ఏర్పాటు చేశారు. అవి ప్రస్తుతం పని చేస్తున్నాయి. క్లీవేలాండ్, లవ్‌గ్రోవ్ అనే రెండు పంపింగ్ స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. గజ్దార్ బాంద్, బ్రిటానియా స్టేషన్లలో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభించారు. మోంగ్ర, మేహల్ పంపింగ్ స్టేషన్లు ఇంకా పేపర్ల వరకే పరిమితమై ఉన్నాయి. చిన్న పంపింగ్ స్టేషన్లకు ప్రాధాన్యం హిందుమాత, హిందు, దాదర్‌లోని పార్సీ కాలనీలలో నిలువ ఉన్న వరద నీటిని రే రోడ్లో ఉన్న బ్రిటానియా స్టేషన్ ద్వారా తొలగిస్తున్నారు. బ్రిటానియా పంపింగ్ స్టేషన్, అదేవిధంగా హిందు మాతకు మధ్య దూరం ఆరు కి.మీ. ఉంది. కానీ ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా వరద నీటిని సక్రమంగా తొలగించడం కష్టంగా మారింది. దీంతో చిన్న పంపింగ్ స్టేషన్ల వల్లనే ఈ సమస్య తీరనుందని, అందుకే వీటికి ప్రాధాన్యమిస్తున్నామని సర్వీస్, ప్రాజెక్ట్స్ డెరైక్టర్ లక్ష్మణ్ వాట్కర్ అభిప్రాయపడ్డారు. ముఖ్య స్టేషన్లలో ఆరు నుంచి 10 పంపింగ్‌లను అమర్చగా చిన్న స్టేషన్లలో నాలుగు పంపింగ్‌లను అమర్చనున్నామని చెప్పారు. -
భయపెడుతున్న భవనాలు
సాక్షి, ముంబై: గత వారం రోజులుగా వర్షాలు జోరందుకోవడంతో నగరంలో పాత భవనాలు కూలిపోవడం ప్రారంభమయ్యాయి. ఈ రెండుమూడు రోజుల్లో పాత భవనాలు కూలడం, ప్రహరి గోడ కూలి పలువురు మరణించడం, గాయపడడం వంటి ఘటనలు పెరిగిపోయాయి. దీంతో మరింత ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిరోధించేందుకు నగర పాలక సంస్థ (బీఎంసీ) నడుం బిగించింది. ముందు జాగ్రత్తల్లో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న పాత, ప్రమాదకర భవనాలను ఖాళీ చేయించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఖాళీ చేయాలని అందులో నివాసముంటున్న కుటుంబాలకు ఇది వరకే బీఎంసీ నోటీసులు జారీ చేసింది. అయినా ఖాళీ చేయకుండా అందులోనే నివాసం ఉంటున్నారు. దీంతో వారిని ఎలాగైనా ఖాళీ చేయించేందుకు స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలని బీఎంసీ అధికారులు యోచిస్తున్నారు. తాడ్దేవ్లో శిథిలావస్థకు చెందిన ఓ భవనం గోడ ఆదివారం కూలడంతో ఇద్దరు మరణించగా మరొకరికి గాయలయాయ్యాయి. పశ్చిమ ముంబై సెంట్రల్ (తాడ్‌దేవ్) ప్రాంతంలో వైట్‌హౌస్ బార్ వెనుకాల శనివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొలాబా, శివ్డీ తదితర ప్రాంతాల్లో శనివారం రెండు భవనాలు కూలి ముగ్గురు మరణించడం తెలిసిందే. భయందర్ నవఘర్ పోలీసు స్టేషన్ పరిదిలోని కాశినాథ్ సృ్మతి భవనం కూడా పాక్షికంగా కూలింది. శిథిలావస్థకు చేరిన భవనం కావడంతో అందులోని వారందరినీ ముందుగానే ఖాళీ చేయించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో రెండు అటోలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భవనం శిథిలాలు పెద్ద శబ్దంతో కిందికి కూలాయి. ఆ సమయంలో రోడ్డుపై నుంచి వెళ్లే అనేక మంది భయాందోళనలకు గురయ్యారు. గతంలోనూ ముంబైలోని పలు ప్రాంతాల్లో భవనాలు కూలడంతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించడం తెలిసిందే. ముంబైలో శిథిలావస్థకు చేరిన 391 భవనాలు నగరంలో దాదాపు 391 భవనాలు అత్యంత ప్రమాదకర స్ధితిలో ఉన్నట్టు నిర్ధారించారు. వీటిలో బీఎంసీ సిబ్బంది క్వార్టర్లు కూడా ఉన్నాయి. వీటిని వర్షాకాలానికి ముందే ఖాళీ చేయించేందుకు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే ప్రయత్నించారు. కొన్ని భవనాలు మాత్రమే ఖాళీ అయినా, ఇప్పటికీ సుమారు 300 భవనాల్లో సిబ్బంది, ఇతరులు ఉంటున్నారు. ఇటీవల వర్షాలు మరింత జోరందుకోవడంతో ఎలాగైనా ఆ ప్రమాదకర భవనాలను ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని ప్రమాదకర భవనాలపై హైకోర్టులోనూ విచారణ జరిగింది. భవనాలను ఖాళీ చేయించే బీఎంసీ అధికారులకు ముంబై పోలీసులు సాయం చేయాలని కోర్టు ఆదేశించింది. పోలీసు రక్షణ లభించగానే పాత భవనాలను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తామని సీతారాం కుంటే స్పష్టం చేశారు. ఏటా వర్షా కాలంలో పాత భవనాలు కూలడం, ప్రాణ, ఆస్తినష్టం జరగడం పరిపాటిగా మారింది. వర్షాకాలానికి ముందు పాత భవనాల పటిష్టతను బీఎంసీ అధికారులు అధ్యయనం చేస్తారు. ఆ తరువాత వాటి జాబితా రూపొందిస్తారు. అత్యంత ప్రమాదకర భవనాల్లో ఉంటున్న వారు ఖాళీ చేయాలని ముందుగా నోటీసులు జారీచేస్తారు. బీఎంసీ పునరావసం కల్పించిన చోట తగిన సదుపాయాలు లేవనే వంకతో ఈ భవనాల వాసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పాత ఇళ్లలోనే ఉంటున్నారు. బీఎంసీ వద్ద తగినంత మందిమార్బలం, పోలీసు భద్రత లేకపోవడంతో ఇలాంటి వారిని ఖాళీ చేయించడం సాధ్యపడడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఇక నుంచి బీఎంసీ అధికారులకు పోలీసులు సాయం లభించనుంది. -
బీఎంసీ అప్రమత్తం
సాక్షి, ముంబై : సీజనల్ వ్యాధుల నివారణ కోసం బీఎంసీ కృషి చేస్తోంది. వర్షా కాలంలో మలేరియా విజృంభిస్తుండడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హౌసింగ్ సొసైటీలకు తమ ఇంటి టెరస్ ఇతర చోట్ల నీరు నిలువ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసింది. ఒకవేళ నీటిని తొలగించనట్లయితే జరిమానా వసూలు చేయనున్నట్లు హెచ్చరించింది. కార్పొరేషన్ వెల్లడించిన గణాంకాల మేరకు.. జూన్‌లో కె-వెస్ట్ వార్డ్ (అంధేరి తూర్పు) 234 నోటీసులు, ఎం-వెస్ట్ వార్డ్ (చెంబూర్) 199 నోటీసులు, ఈ-వెస్ట్ వార్డు (బైకల్లా)కు 171 నోటీసులు అందుకున్నాయి. దోమల వృద్ధి ప్రాంతాల గుర్తింపు వర్షాకాలంలో నగర వాసులు డెంగీ, మలేరియా లాంటి జబ్బుల బారిన పడకుండా దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతున్న ప్రాంతాలను బీఎంసీ ఇటీవలె గుర్తించింది. డెంగీ వ్యాపింపజేసే దోమలు ఎక్కువగా మొక్కలు, ఫ్లవర్ పాట్స్, ఫిష్ ట్యాంక్‌ల ద్వారా వృద్ధి చెందుతున్నాయని అధికారులు గుర్తిం చారు. మలేరియా దోమల వృద్ధికి సంబంధించి నగర వ్యాప్తంగా 593 ప్రదేశాలు, డెంగీ దోమలకు సంబంధించి 388 స్థలాలను బీఎంసీ క్రిమి సం హారక విభాగం సిబ్బంది గుర్తించారు. మలేరియా, డెంగీ వ్యాధులను వ్యాపింపజేసే దోమల వృద్ధి స్థలాలు సొసైటీకి చెందినవైతే వారికి నోటీసులు జారీ చేశారు. వీటి నివారణ చర్యలు తీసుకోవాలని ఆ సొసైటీలను కార్పొరేషన్ సూచిం చింది. నివారణ చర్యలు తీసుకోని సొసైటీలకు జరిమానా విధిస్తుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1888 ప్రకారం రూ.రెండు వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఈ ఏడాది జూన్ చివరి వరకు కార్పొరేషన్ దాదాపు 8,246 సొసైటీలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో 351 సొసైటీలకు జరిమానా విధించింది. కార్పొరేషన్‌కు జరి మానా రూపంలో రూ.11.91 లక్షల ఆదాయం చేకూరింది.జూన్‌లో కార్పొరేషన్.. హౌసింగ్ సొసైటీలు, కార్యాలయాలు, ఇనిస్టిట్యూట్స్, నిర్మాణంలో ఉన్న భవనాలకు 2,284 నోటీసులను జారీ చేసింది. 2013లో 13,889 నోటీసులను జారీ చేయగా రూ.27.60 లక్షలను జరిమానా రూపంలో కార్పొరేషన్ వసూలు చేసింది. వ్యాధుల నివారణే ధ్యేయం నోటీసులు జారీ చేసి జరిమానా విధించడం తమ లక్ష్యం కాదనీ, మలేరియా, డెంగీ నివారణే తమ ముఖ్య ఉద్దేశమని కార్పొరేషన్ క్రిమి సంహారక విభాగం అధికారి డాక్టర్ రాజన్ నైరన్గేకర్ తెలి పారు బీఎంసీ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మజా కేస్కర్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ సొసైటీలకు చేరుకొని వివిధ కార్యక్రమా ల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. ఈ సారి కూడా మలేరియా, డెంగీ నివారణకు కొత్త విధానాలను అవలంభిస్తున్నామని తెలిపారు. -
నీటి వెతలు షరామామూలే
- రెండు రోజులుగా అడపాదడపా వర్షాలు - నీటికోతలు తగ్గించలేమంటున్న అధికారులు -వారం, పదిరోజులు భారీవర్షాలు పడితే తప్ప పరిస్థితి మారదని స్పష్టీకరణ సాక్షి, ముంబై: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరంలో అమలవుతున్న నీటికోతపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం కనిపించడంలేదు. రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలవల్ల నగరానికి నీటి సరఫరాచేసే కొన్ని జలాశయాల్లో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ఇది ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ ఈ వర్షంవల్ల నగర ప్రజలకు ఒరిగేదిమి లేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్పష్టం చేసింది. మరో వారం, పది రోజులు తె రిపిలేకుండా భారీ వర్షాలు పడితే తప్ప పరిస్థితి గాడిన పడే సూచనలు లేవని బీఎంసీ నీటిసరఫరా శాఖ అధికారులు తేల్చి చెప్పారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నప్పటికీ వానలు పత్తాలేకుండా పోయాయి. మరోపక్క జలాశయాలు అడుగంటసాగాయి. దీంతో గత్యంతరం లేక నగర ప్రజలకు నీటి కోత విధించాలని అధికారులు నిర్ణయించారు. కాని ఎప్పటి నుంచి, ఎంతమేర విధించాలనే దానిపై కొద్దిరోజులుగా తర్జనభర్జన పడసాగారు. ఎట్టకేలకు బుధవారం నుంచి 20 శాతం నీటి కోత అమలుచేస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందే అనధికారికంగా ఐదు శాతం నీటి కోత విధిస్తున్నారు. దీంతో మొత్తం 25 శాతం నీటి కోత అమలులో ఉంది. కాని బుధవారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ గురువారం భారీ వర్షమేమీ పడలేదు. నగర, శివారు ప్రాంత పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. కాని జలాశయాల పరిసరా ప్రాంతాల్లో స్వల్పంగా పడింది. జలాశయాల్లో తగినంత నీటి మట్టం పెరిగేంత వరకు కోత తప్పదని అంటున్నారు. 2013 జూలై మూడో తేదీన 4,51,793 మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉండగా, ఈ ఏడాది జూలై మూడో తేదీన 1,09,241 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీన్ని బట్టి జలాశయాల్లో ఈ ఏడాది నీటిమట్టం ఏ స్థాయికి పడిపోయిందో తెలుస్తోంది. నగరానికి నీటి సరఫరాచేసే ఆరు జలాశయాల పరిసరాల్లో గురువారం సాయంత్రం వరకు తులసీ డ్యాంవద్ద అధికంగా 191 మి.మీ. వర్షం కురిసింది. విహార్ పరిసరాల్లో 176, భాత్సా-16, మోడక్‌సాగర్-4.60, తాన్సా-4, అప్పర్ వైతర్ణ-0.80 మి.మీ. వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. కాని ఎక్కడా భారీవర్షం నమోదు కాలేదు. రెండు రోజులుగా వాతావరణం కొంత చల్లబడడంతో ప్రజలు ఊపిరీపీల్చుకున్నారు. కాని శుక్రవారం పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఉక్కపోత ప్రజలను తిరిగి విసిగించింది. -
‘క్యాంపాకోలా’ వ్యవహారం..
అక్రమ కనెక్షన్ల తొలగింపు పూర్తి సాక్షి, ముంబై: క్యాంపాకోలా కాంపౌండ్‌లో అక్రమంగా నిర్మించిన ఫ్లాట్ల వంట గ్యాస్, నీటి, విద్యుత్ కనెక్షన్లు తొలగించే పనులు మహానగర పాలక సంస్థ(బీఎంసీ) ఎట్టకేలకు పూర్తిచేసింది. అక్రమ ఫ్లాట్లను ఎప్పుడు కూలుస్తారనే దానిపై అందరూ దృష్టిసారించారు. అనుమతి లేకుండా నిర్మించిన సుమారు 102 ఫ్లాట్లను కూల్చివేయాలని కోర్టు ఇచ్చిన తీర్పును నివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆందోళనలు నిర్వహించారు. చివరకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల ఇచ్చిన హామీతో ఆందోళన విరమించుకున్న విషయం తెలిసిందే. దీంతో వాటిని కూల్చేందుకు బీఎంసీ అధికారులకు మార్గం సుగమమైంది. వాటిని కూల్చేముందు వంద ఫ్లాట్లకు ఇచ్చిన నీటి కనెక్షన్లు, 51 ఇళ్లకు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు, 90 ఇళ్లకు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లను తొలగించాల్సి వచ్చింది. కాని నీటి కనెక్షన్లకు సంబంధించిన మ్యాప్ బీఎంసీ వద్ద లేకపోవడంతో ఏ కనెక్షన్ ఎటు వెళ్లిందో అర్థంకాక సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చివరకు వారం రోజులపాటు నానా తంటాలుపడి కనెక్షన్లు తొలగింపు పనులు పూర్తి చేశారు. అందుకు సంబంధించిన నివేదిక అక్రమ కట్టడాల నిరోధక శాఖ అధికారులు సోమవారం బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేకు సమర్పించనున్నారు. ఆ తర్వాత కూల్చివేత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెప్పారు. -
పోలీసులపై మరో భారం
శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించే బాధ్యత ఇక ఖాకీలతే - స్పష్టం చేసిన బాంబే హైకోర్టు - బీఎంసీ పిటిషన్‌పై ఆదేశాలు - మరిన్ని ఇబ్బందులో నగర ఖాకీలు సాక్షి, ముంబై: ఇప్పటికే తలకుమించిన భారాన్ని మోస్తున్న పోలీసులకు బాంబే హైకోర్టు కొత్త బాధ్యతలు అప్పగించింది. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించే బాధ్యత ఇకపై పోలీసులే తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో నగర పోలీసులపై అదనపు భారం పడనుంది. నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు అనేకం ఉన్నాయి. ప్రాణాలను ఫణంగా పెట్టి అందులో వేలాది కుటుంబాలు నివాసముంటున్నాయి. ఏటా వర్షా కాలానికి ముందు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పాత భవనాలపై స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహిస్తుంది. ప్రమాదకర, అత్యంత ప్రమాదకర భవనాల జాబితా రూపొందిస్తుంది. ముందుగా అత్యంత ప్రమాదక భవనాల్లో ఉంటున్నవారికి ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తుంది. అయితే చాలామంది ఈ నోటీసులను బేఖాతరు చేస్తున్నారు. పునరావాసం కల్పించిన చోట మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు లేకపోవడం, లోకల్ రైల్వే స్టేషన్లు దూరంగా ఉండడం, పిల్లలకు పాఠశాలలు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలవల్ల ఖాళీ చేయడంలేదు. ప్రమాదమని తెలిసి కూడా శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే ఉండే సాహసం చేస్తున్నారు. దీంతో ఈ విషయమై బీఎంసీ పరిపాలన విభాగం హైకోర్టును ఆశ్రయించింది. వారిని ఎలా ఖాళీ చేయించాలో న్యాయస్థానమే తెలపాలని కోరింది. దీనిపై స్పందించిన కోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.బీఎంసీ నోటీసులు జారీచేసినప్పటికీ భవనాల్లో బలవంతంగా ఉంటున్న వారిని ఖాళీ చేయించే బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేసింది. అయితే నివాసుల సామగ్రికి ఎలాంటి హానీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ ఖాళీ చేసేందుకు నిరాకరిస్తే అందుకు ప్రత్యేకంగా ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించాలని, ఆ తరువాత విద్యుత్, నీటి సరఫరాను తొలగించాలని, అయినప్పటికీ వారు ఖాళీ చేసేందుకు మొండికేస్తే అప్పుడు పోలీసులను రంగంలోకి దించి బలవంతంగా ఖాళీ చేయించాలని సూచించింది. అవసరమైతే బలప్రయోగం ద్వారానైనా ఖాళీ చేయించాలని పోలీసులకు సూచించింది. -
పొదుపే గతి..!
- జూలై మొదటివారం నుంచి నగరంలో 10 శాతం నీటి కోత - రెండో వారం కూడా వరుణుడు కరుణించకుంటే 20 శాతానికి పెంపు సాక్షి, ముంబై: నగరవాసులు పొదుపు మంత్రం జపించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఇది పెరిగిన నిత్యావసరాల భారాన్ని తగ్గించుకునేందుకు మాత్రం కాదు. వరుణుడు కరుణించనందుకు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల కావస్తోంది. అయినా ఇప్పటిదాకా చినుకు జాడే లేదు. ఇక నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మరో పక్షం రోజులు ఇలాగే గడిస్తే చుక్క నీటిని కూడా వృథా చేయకుండా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే జూలై మొదటి వారం నుంచే నగరవాసులకు సరఫరా చేసే నీటిలో 10 శాతం కోత విధించాలని బీఎంసీ నిర్ణయిం చింది. రెండో వారం కూడా వర్షాలు పడకపోతే ఈ కోతను 20 శాతానికి పెంచాలని భావిస్తోంది. ఇలా కోతలు పెరిగితే ముంబైకర్లకు నీటిని పొదుపుగా వాడుకోవడం మినహాయించి మరో గత్యంతరం ఉండదు. నగరానికి నీటిని సరఫరా చేసేఏడు జలాశయాల్లో నీటి మట్టం తగ్గిపోయినందునే కోతలు విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అధికారి చెప్పారు. ముఖ్యంగా మిడిల్, అప్పర్ వైతర్ణాలో నీటి నిల్వలు కనిష్టస్థాయికి చేరాయన్నారు. ఈ ఏడు జలాశయాలన్నింటిలో కలిపి మంగళవారంనాటికి 1.43 లక్షల మిలియన్ లీటర్ల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది జూన్ 24వ తేదీ వరకు ఈ జలాశయాల్లో మూడు లక్షల మిలియన్ లీటర్ల నీటి నిల్వలుండగా ప్రస్తుతం అందులో సగం కంటే తక్కువగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న నీటి నిల్వలు జూలై మాసాంతం వరకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. అయితే నగరానికి ఏడాది నీటి కోతలు విధించకుండా ఉండాలంటే 12 నుంచి 13 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతోంది. రోజుకు 4,200 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉన్నప్పటికీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 3,450 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తుంది. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే ముఖం చాటేస్తే నీటి కోత మరింత పెంచాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో నగరవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్పొరేషన్ కూడా త్వరలో ‘సేవ్ వాటర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుందని చెప్పారు. ప్రతికా ప్రకటనలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా నగరవాసుల్లో నీటి పొదుపుపై అవగాహన కల్పించనున్నారు. -
చినుకు జాడేది?
- ఆవిరవుతున్న రైతన్న ఆశలు - నిండుకుంటున్న జలాశయాలు - తాగునీటికీ తప్పని కటకట - కృత్రిమ వర్షాలపై బీఎంసీ దృష్టి - జూలై రెండోవారంలోనే వర్షాలు - కోతలకు సిద్ధమవుతున్న సర్కార్ పింప్రి, న్యూస్‌లైన్: వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా చినుకు జాడ లేకపోవడంతో అటు రైతుల్లోనూ, ఇటు నగరవాసుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికంటే ఈ ఏడాది వర్షం తక్కువగా కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు ముందుగానే వెల్లడించిన తక్కువ మాట అటుంచి అసలు చినుకు జాడే లేదని, మరో పక్షం రోజులు ఇలాగే గడిస్తే ఈ సీజన్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ఆలస్యంగా విత్తినా దిగుబడి ఆశించిన స్థాయిలో రావడం అసాధ్యమంటున్నారు. రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ఇలా ఏ ప్రాంతమైనా వర్షం కురిసిన జాడే లేదని, దీంతో ఈసారి కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనంటున్నారు. మరో పక్షంరోజులు ఇంతే... పుణే వాతావరణ పరిశోధన విభాగం తెలిపిన వివరాల మేరకు.. జూలై మొదటి వారం తర్వాత వర్షాలు కురిసే అవకాశముంది. ఒకవేళ అప్పటికీ వర్షం కురవకపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రస్తుతం ముంబై, పుణే వంటి పెద్ద నగరాలకు నీటిని సరఫరా చేసే జలాశయాల్లో కొంతమేర నీటి నిల్వలున్నా అవి అవసరాలకు సరిపడా లేవని, జూన్ రెండో వారంలో వర్షాలు కురిసే వరకు సరిపోతాయనే భరోసాతో ఉన్న అధికారులకు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. నగరవాసులకు నీటి సరఫరాలో 20 శాతం కోత విధించే అంశమై ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ తెలిపారు. అడుగంటుతున్న జలాశయాలు... పుణే, ముంబై వంటి మహానగరాలకు సరఫరా చేసే మంచి నీటి రిజర్వాయర్లు, డ్యాంలలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. రాబోయే రోజులను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికలపై అధికారులు దృష్టి సారించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వీటికితోడు అకాాల వర్షాలు, వడగండ్లతో రాష్ట్ర రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వీరిని ఆదుకోవడానికి రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు రెండు సంవత్సరాలలో 9 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాయి. అయితే ఈ ప్యాకేజీలు ఏమూలకు సరిపోవడం లేదు. ఇప్పుడు వరుణుడు ముఖం చాటేయడంతో వరుసగా ఈ ఏడాది కూడా కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 నుంచి 30 శాతం వ్యవసాయ పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా కేవలం 1.5 శాతం మాత్రమే పూర్తయినట్లు చెబుతున్నా వర్షాలు కురవకపోతే అవి కూడా నిష్ర్పయోజనంగా మారే అవకాశముంది. రాష్ర్టంలో ప్రధాన రిజర్వాయర్లలో కేవలం 20 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆయా నగరాలలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి నీటి నిల్వలు ఏమూలకూ సరిపోక పోవడంతో అధికారులలో కూడా ఆందోళన మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు విభాగాల పరిధిని గమనిస్తే నాగ్‌పూర్‌లో 46 శాతం, మరాఠ్వాడాలో 20 శాతం, నాసిక్‌లో 14 శాతం, పుణే విభాగంలో 13 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మొత్తం ఇప్పుటి వరకు 1,464 గ్రామాలకు, 3,687 వీధులకు 1,454 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. కృత్రిమ వర్షాలతో ప్రయోజనముండదు: పాటిల్ రాష్ర్టంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కృత్రిమ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందా? అన్న ప్రశ్నకు.. గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్ పాటిల్.. ‘అలాంటి ఆలోచన లేదు. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండద’ని సమాధానమిచ్చారు. దీని వల్ల పంటలకు ప్రయోజనంగా ఉంటుందేమో కానీ తాగు నీటి సమస్య తీరదన్నారు. పుణేలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మంత్రి జయంత్ పాటిల్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృత్రిమ వర్షాల వల్ల కేవలం రెండు నుంచి మూడు మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే కురుస్తుందన్నారు. కృత్రిమ వర్షాలపై దృష్టిసారించిన బీఎంసీ వర్షాలు పత్తాలేకుండా పోవడంతో మహానగర పాలక సంస్థ(బీఎంసీ) కృత్రిమ వర్షాలవైపు దృష్టి సారించింది. అందుకు టెండర్లను ఆహ్వానించేందుకు ఈ నెల 17న ప్రకటన జారీచేసింది. టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువు ఇచ్చారు. ఆ తరువాత 27 నుంచి ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేయడానికి అవకాశముంటుందని బీఎంసీ అదనపు కమిషనర్ రాజీవ్ జలోటా చెప్పారు. కృత్రిమ వర్షం కోసం రూ.15.75 లక్షలు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నాసిక్, ఠాణే పరిసరాల్లోని కార్పొరేషన్ పరిధిలోని జలాశయాలున్న ప్రాంతాల్లో కృత్రిమ వర్షం కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు జలోటా చెప్పారు. గతంలో ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ అనుకున్నంతమేర ఫలితాలు ఇవ్వలేదు. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఈ ప్రయోగం సఫలీకృతం కాకపోవడంతో నిరాశే మిగిలింది. -
సరే.. సహకరిస్తాం!
ముంబై: తమ నివాసాలను కాపాడుకునేందుకు దశాబ్దకాలానికిపైగా పోరాటం చేసిన క్యాంపాకోలావాసులు గత్యంతరంలేక ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసిన తర్వాత మున్సిపల్ అధికారులకు సహకరిస్తామని స్పష్టం చేశారు. దీంతో క్యాంపాకోలా కాంపౌండ్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బందికి మార్గం సుగమమైంది. నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలని, చట్టానికి అంతా సహకరించాలని చవాన్ క్యాంపాకోలా వాసులతో చెప్పడంతోనే వారు వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అయితే ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ విషయంలో క్యాంపాకోలా వాసుల డిమాండ్‌ను సీఎం సూచనప్రాయంగా అంగీకరించడంతోనే వీరంతా వెనక్కు తగ్గినట్లు సమాచారం.క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీలో 96 ఫ్ల్లాట్లు అక్రమంగా నిర్మించారంటూ అత్యన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో బీఎంసీ అధికారులు కూల్చివేయాలని నిర్ణయించారు. గతంలో అనేక పర్యాయాలు బీఎంసీ సిబ్బంది వాటిని కూల్చివేసేందుకు వెళ్లారు. కాని తీవ్ర వ్యతిరేకత రావడంతో ఖాళీ చేతులతో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అప్పటికే కొందరు నివాసులు కోర్టు తీర్పును గౌరవిస్తూ ఫ్లాట్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగతావారు మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు, వివిధ రంగాల అండదండల మొండిగా అక్కడే ఉంటూ వచ్చారు. చివరకు నీటి, గ్యాస్ సరఫరా నిలిపివేస్తామని బీఎంసీ ప్రకటించింది. అక్కడికి వెళ్లిన అధికారులను అడ్డుకోవడం, గేట్లు మూసివేసి లోపలికి రాకుండా చేయడం వంటి ఘటనలు గత నాలుగైదు రోజులుగా జరుగుతున్నవిషయం తెలిసిందే. సీఎం చవాన్ జోక్యంతో ఎట్టకేలకు సంవత్సరన్నర నుంచి జరుగుతున్న ఆందోళనకు తెరపడింది. దీంతో సోమవారం నుంచి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి బీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. అసలేం జరిగింది... మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఎమ్మెల్యే బాలా నాంద్‌గావ్కర్ ఆదివారం నివాసులతో కలిసి సీఎం చవాన్‌తో భేటీ అయ్యారు. సోసైటీలో అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)ని వినియోగించి నివాసులకు ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందుకు చవాన్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని చట్టపరంగా పరిశీలించాలని బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటేను ఆదేశించారు. అంతేకాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, మీరు కూడా సహకరించాలని కోరడంతో అందుకు నివాసులు అంగీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే కూల్చివేత పనులను తప్పనిసరిగా చేపట్టాల్సి వస్తోందని, మానవతా దృక్పథంతోనే క్యాంపాకోలా వాసులు డిమాండ్ చేసినట్లుగా 67,000 చదరపు గజాలా ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్‌ను ఉపయోగించుకునే విషయాన్ని పరిశీలించాలని చెప్పినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి వద్దకు.. క్యాంపాకోలా వివాదం చివరకు రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్లినట్లు తెలిసింది. స్థానిక ప్రతినిథుల బృందం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిందని సమాచారం. ఈ విషయమై క్యాంపాకోలా వాసి అంకిత్గార్గ్ మాట్లాడుతూ... ‘సమస్యను పరిష్కరించాలని రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీకి లేఖ రాశాం. తమ విషయంలో కరుణ చూపాలని కోరాం. నివాసాలను కూల్చివేస్తే వందలాదిమంది రోడ్డున పడతారని, వారిలో పిల్లలు, వృద్ధులు ఉన్నారని, వారందరికి కొత్తగా నివాసాలు దొరకడం ముంబై మహానగరంలో అంత త్వరగా సాధ్యం కాదని, జోక్యం చేసుకొని క్యాంపాకోలా వాసులకు ఊరటనివ్వాలని కోరామ’న్నారు. దీనిపై డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఆనంద్ వాఘ్రాల్కర్ మాట్లాడుతూ... ‘రాష్ట్రపతికి లేఖ రాసినా అక్కడి నుంచి ఎటువంటి సమాచారమైతే మాకు అందలేదు. దీంతో మా విధులు మేం నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకోసం పోలీసు బలగాలను కూడా రంగంలోకి దింపాలని యోచిస్తున్నాం. సోమవారం కూల్చివేత పనులను కొనసాగిస్తామ’న్నారు. -
‘క్యాంపాకోలా’కు పెరుగుతున్న మద్దతు
సాక్షి, ముంబై: క్యాంపాకోలా వాసులకు మద్దతు పలుకుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక్కడ అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లలో ఉంటున్నవారిని ఖాళీ చేయించేందుకు, వారికి నీరు, విద్యుత్, గ్యాస్ సరఫరాను నిలిపివేసేందుకు బీఎంసీ అధికారులు శుక్రవారం క్యాంపాకోలా కాంపౌండ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. వీరిని అడ్డుకునేందుకు ఆర్పీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శనివారం కూడా బీఎంసీ అధికారులు కాస్త హడావుడి చేసినా రాజకీయ నాయకులతోపాటు సామాజిక కార్యకర్తలు కూడా వచ్చి మద్దతు పలకడంతో అధికారులు రెండో రోజు కూడా వెనుదిరగాల్సి వచ్చింది. స్థానికులకు కొంత ఊరట లభించినట్లయింది. అయితే క్యాంపాకోలాపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన బీఎంసీ అధికారులను అడ్డుకున్నందుకుగాను పలువురిపై వర్లీ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకే బీఎంసీ అధికారులు వ్యవహరించినా, కోర్టు ఆదేశాలు అమలు కాకుండా అడ్డుకోవడమంటే కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ముందునుంచి పక్కా ప్రణాళికతో ఉన్న క్యాంపాకోలావాసులు బీఎంసి అధికారులు లోపలికి చొరబడకుండా గేట్బయటే అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇలా విధులను అడ్డుకున్నందుకుగాను పలువురిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 143, సెక్షన్ 353ల ప్రకారం వర్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందునుంచే స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించిన బీఎంసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో శుక్రవారం ఇక్కడ ఉధ్రిక్త వాతావరణం కనిపించింది. అయితే శనివారం పోలీసు బందోబస్తును ఉపసంహరించడంతో బీఎంసీ అధికారులు వెనక్కు తగ్గారని భావించారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం తమ ఆందోళనను కొనసాగించారు. వీరికి మద్దతు పలికేందుకు ముంబై మాజీ కమిషనర్ ఖైర్నార్తోపాటు ప్రముఖ సామాజిక కార్యకర్త సైనా ఎన్సీ కూడా వచ్చారు. దీంతో ఆందోళనకారుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. సోమవారం వరకు నో టెన్షన్...? ఆదివారం సెలవుదినం కావడంతో బీఎంసీ అధికారులు వచ్చే అవకాశం లేదని, అయితే సోమవారం మాత్రం ఎలాగైనా ఖాళీ చేయించాలనే వ్యూహంతో అధికారులు రావొచ్చనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేశారు. దీంతో తామంతా పట్టుసడలించకుండా నివాసాలను కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉంటామని క్యాంపాకోలా వాసులు శనివారం ప్రతిజ్ఞ చేశారు. -
ఎడతెగని క్యాంపా..గోల..!
సాక్షి, ముంబై: క్యాంపాకోలా భవన సముదాయంలో అక్రమంగా నిర్మించిన 140 ఫ్లాట్లకు మంచినీరు, గ్యాస్ కనెక్షన్లను నిలిపివేసేందుకు శుక్రవారం వచ్చిన అధికారులను క్యాంపాకోలా వాసులు గేటు బయటే నిలువరించారు. మూడు గంటల పాటు హైడ్రామా అనంతరం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండానే వెనుదిరిగారు. దీంతో క్యాంపాకోలా వాసులు తాత్కాలికంగా ఊరట పొందగలిగారు. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన వర్లీలోని క్యాంపాకోలా భవన సముదాయంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు పూర్తికావడంతో క్యాంపాకోలా అక్రమ కట్టడాలను తొలగించనున్నట్టు నోటీసులు బీఎంసీ జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తాము మంగళవారమే చర్యలు తీసుకుంటామని బీఎంసీ పేర్కొన్నప్పటికీ క్యాంపాకోలా నివాసి ఒకరు మరణించడంతో చర్యలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇలా ముందునుంచీ ప్రకటిస్తూ వచ్చిన ప్రకారం శుక్రవారం బీఎంసీ సిబ్బంది పోలీసు బలగాలతో గ్యాస్, విద్యుత్ కనెక్షన్లను తొలగించేందుకు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో క్యాంపాకోలా సొసైటీ వద్దకి చేరుకున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు క్యాంపాకోలా వాసులతోపాటు మీడియా, ఇతర ప్రజలతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రద్దీ కన్పించింది. అధికారులు వచ్చేసరికి క్యాంపాకోలా వాసులు కాంపౌండ్ గేటును మూసేసి అక్కడే బైఠాయించారు. దేవుళ్ల ఫొటోలు ఉంచి గేటు ముందు హోమాలు, యాగాలు చేశారు. ఇలా క్యాంపాకోలా వాసులనుంచి బీఎంసీ అధికారులకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బాధితుల నినాదాలతో పరిసరాాలు మారుమోగాయి. సుమారు మూడు గంటలపాటు ఆ ప్రాంతంలో హైడ్రామా నడిచింది. బీఎంసీ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లేంతవరకు కాంపౌండ్ నివాసులు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. క్యాంపాకోలా వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో బీఎంసీ అధికారులు చివరికి వెనుదిరిగారు. మహాకూటమి మద్దతు... క్యాంపాకోలా నివాసులకు మహాకూటమి మద్దతుగా నిలిచింది. శివసేన, బీజేపీ, ఆర్‌పిఐకి చెందిన పలువురు కార్యకర్తలు ఘటన స్థలానికి చేరుకున్నారు. బీఎంసీ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వీరిలో 12 మంది ఆర్పిఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం... క్యాంపాకోలా వాసులపై చర్యలు నిలిపివేయలేదని బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఘటన స్థలంలో చర్యలు చేపట్టేందుకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశామని కాని వారు విన్పించుకోలేదని చెప్పారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చర్యలు తీసుకోకతప్పదన్నారు. ఈ విషయం కాలనీవాసులకూ తెలుసని అయినప్పటికీ వ్యతిరేకిస్తున్నారని బీఎంసీ సిబ్బంది పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి మళ్లీ చర్యలు ఎప్పుడు చేపట్టనున్నదనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నామన్నారు. 1986లో వెలుగులోకి... 1980 ప్రాంతంలో క్యాంపాకోలా భవన సముదాయాన్ని నిర్మించారు. అందులో అక్రమ అంతస్తులను నిర్మించినట్టు తెలుసుకున్న బిఎంసీ 1986లో బిల్డర్‌కు రూ. 6.60 లక్షల జరిమానా విధించింది. బిల్డర్ ఆ సొమ్ము చెల్లించిన అనంతరం మళ్లీ రూ. 11.20 లక్షలు జరిమానా చెల్లించాలని బీఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇది జరిగిన 15 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే 2000 సంవత్సరంలో ఇక్కడ ఉండేందుకు వచ్చినవారు అధికారికంగా నీటి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మరోసారి బీఎంసీ ఈ విషయంపై దృష్టి సారించింది. అక్రమ ఫ్లాట్లపై చర్యలు తీసుకోనున్నట్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై క్యాంపాకోలా నివాసులు కోర్టును ఆశ్రయించారు. ముంబై హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టులో కూడా క్యాంపాకోలా వాసులకు ఊరట లభించలేదు. వారికి వ్యతిరేకంగానే తీర్పువచ్చింది. 140 ఫ్లాట్లు అక్రమం..? క్యాంపాకోలా భవన సముదాయంలో మొత్తం ఏడు భవనాలున్నాయి. వీటిలో మొత్తం 35 అంతస్తులు అక్రమంగా నిర్మించారు. వీటిలోని 140 ఫ్లాట్లను కూల్చేసేందుకు గత ఏడాది 2013 నవంబర్‌లో బీఎంసీ యత్నించింది. అయితే అన్ని పార్టీలు ఈ విషయంపై వీరికి మద్దతుకు ముందుకువచ్చాయి. మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు కూడా వీరికి ఏడు నెలల గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు మే 31వ తేదీతో ముగిసింది. దీంతో మళ్లీ క్యాంపాకోలాపై చర్యలు తీసుకునే ప్రక్రియను బీఎంిసీ ప్రారంభించింది. -
యమపురికి రహదారులా?
రోడ్లు, డ్రైనేజీలు, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.. ఈ మూడు సమస్యల పరిష్కారానికి ముంబైకర్లు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. బీఎంసీకి రోడ్ల గురించి 42,287 ఫిర్యాదులు రాగా, డ్రైనేజీలపై 12,708, వ్యర్థాలపై 5,519 ఫిర్యాదులు అందాయి. నగర రోడ్ల దుస్థితిపై ప్రజాగ్రహం ముంబై: రాజధాని రోడ్ల దుస్థితిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తేలింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికం రోడ్లపైనే ఉన్నాయి. రోడ్ల పేర్లు మార్చడంపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా మంది కార్పొరేటర్లు ఫిర్యాదులు సంధించారు. ప్రజా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. బీఎంసీ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ఏటా వేలాది మంది మరణిస్తున్ననట్టు ముంబై ట్రాఫిక్‌శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అన్ని రోడ్లు గుంతలమయంగా మారుతుండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణానికి నాణ్యమైన సామగ్రి వాడకపోవడం, పర్యవేక్షణ కొరవడడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముంబైకర్లలో అత్యధికులు రోడ్ల దుస్థితిపై ఆందోళనగా ఉన్నారని ఈ సంస్థ వెల్లడించింది. వీటి తర్వాత డ్రైనేజీలు, ఘనవ్యర్థాల నిర్వహణపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. 2013లో బీఎంసీకి రోడ్ల గురించే 42,287 ఫిర్యాదులు రాగా, డ్రైనేజీలపై 12,708, వ్యర్థాలపై 5,519 ఫిర్యాదులు అందాయి. నగరవాసుల్లో ఎక్కువ మందికి ఈ మూడు అంశాలపైనే అభ్యంతరాలు ఉన్నాయని ప్రజా ఫౌండేషన్ ప్రాజెక్టు డెరైక్టర్ మిలింద్ మాస్కే అన్నారు. ఈ సంస్థ గణాంకాల ప్రకారం 2013లో బీఎంసీకి మొత్తం 1,02,829 ఫిర్యాదులు వచ్చాయి. 2012తో పోలిస్తే ఇవి 10.3 శాతం అధికం. ఇక రోడ్ల పరిస్థితిపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య ఏకంగా 41.1 శాతం పెరిగింది. డ్రైనేజీల ఫిర్యాదుల సంఖ్య 21.4 శాతం అధికమయింది. నీటి సరఫరాపై ఫిర్యాదులు కూడా 2.3 శాతం పెరిగాయి. కేంద్రీకృత ఫిర్యాదుల నమోదు వ్యవస్థ (సీసీఆర్ఎస్) గణాంకాలను విశ్లేషించడం ద్వారా ఫౌండేషన్ పైవిషయాలను తెలియజేసింది. రోడ్లు, డ్రైనేజీలు, వ్యర్థాలపై వచ్చిన 65,913 ఫిర్యాదుల్లో బీఎంసీ 44 శాతం ఫిర్యాదులను మాత్రమే పరిష్కరించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ప్రవేశపెట్టిన పాట్‌హోల్-ట్రాకింగ్ సిస్టమ్ ఆధారిత అండ్రాయిడ్ అప్లికేషన్‌తో ఫిర్యాదులు చేయడం సులువుగా మారిందని మిలింద్ చెప్పారు. ‘పాత పద్ధతిలో ఫిర్యాదు చేస్తే.. దాని ప్రస్తుత స్థితితో కూడిన నివేదిక వచ్చేది. ఇప్పుడున్న అండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ప్రస్తుతం స్థితి (ట్రాకింగ్) తెలియజేయడం లేదు. కాబట్టి ఫిర్యాదులకు సంబంధించిన అన్ని పోర్టళ్లను సీసీఆర్ఎస్తో అనుసంధానించాలి. దీనివల్ల ట్రాకింగ్ సులువుగా మారడమే గాక, సమస్యలు తెలియజేసేందుకు మరింత మంది ముందుకు వస్తారు’ అని మిలింద్ వివరించారు. బీఎంసీకి చెందిన 227 వార్డుల కార్పొరేటర్లు గత ఏడాది నిర్వహించిన వార్డు సమావేశాల్లో రోడ్ల దుస్థితి గురించి 141 ప్రశ్నలను మాత్రమే అడిగారు. వీటిలో అత్యధికంగా రోడ్లపైనే ఉన్నాయి. సమస్యలు పట్టించుకోని కార్పొరేటర్లు.. గత ఏడాది ఎంసీఎంజీ నిర్వహించిన వార్డు సమావేశాల్లో 19 కార్పొరేటర్లు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. మరో ఏడుగురు కార్పొరేటర్లు అయితే తమ రెండేళ్ల పదవీ కాలంలో ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం గమనార్హం. వీరిలో అత్యధికులు, స్థానిక సమస్యల పరిష్కారం కంటే రోడ్ల పేర్ల మార్పిడిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ప్రజా ఫౌండేషన్ ట్రస్టీ నీతాయి మెహతా అన్నారు. కార్పొరేటర్లు నిత్యం తమ ప్రాంతాల సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారం కోసం బీఎంసీ అధికారులను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఫలితంగా వార్డు సమావేశాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషించారు. ఇదిలా ఉంటే కార్పొరేటర్లు అడిగిన వాటిలో 34 శాతం ప్రశ్నలకు బీఎంసీ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని మిలింద్ మాస్కే ఈ సందర్భంగా వివరించారు. -
బాధితులకు ‘జాక్’ బాసట
అంబేద్కర్ కాలనీ క్రమబద్ధీకరణకు డిమాండ్ సాక్షి, ముంబై: ఎంతో మంది పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తూ బీఎంసీ అధికారులు తూర్పు ములుండ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌నగర్‌లో 130 గుడిసెలను కూలగొట్టడంపై ముంబై తెలంగాణ జాక్ (ఎంటీ జాక్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా నోటీసులు ఇవ్వకుండానే డెవలపర్లు ఈ నెల 21న ఈ గుడిసెలను నేలమట్టం చేశారు. మురికివాడల సంరక్షణ చట్టానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2000 సంవత్సరం కంటే ముందు వేసుకున్న గుడిసెలను క్రమబద్ధీకరించి సదుపాయాలు కల్పిస్తారు. ఈ చట్టం ముంబైలోని మూడు లక్షల గుడిసెలను రక్షిస్తుందన్న అంచనా. అంబేద్కర్‌నగర్ కాలనీవాసులకుకూడా ఈ చట్టం ఎందుకు వర్తింపజేయడం లేదని జాక్ ప్రశ్నించింది. ఇక్కడున్న ప్రతి గుడిసెను 2000 కంటే ముందే నిర్మించారని స్పష్టం చేసింది. వీళ్లంతా 1985 నుంచే ఇక్కడ నివసిస్తున్నట్టు నిరూపించగల పత్రాలూ ఉన్నందున, కూల్చివేతలు చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. తమకు అదే స్థలంలోనే తిరిగి ఇళ్లు కట్టించాలి లేదా ప్రత్యామ్నాయం చూపెట్టాలనే డిమాండ్‌తో బాధితులు గత నెల 21 నుంచి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. వీరిలో ఇరవై శాతం తెలుగు ప్రజలు. అంబేద్కర్‌నగర్ వాసుల న్యాయపరమైన పోరాటానికి ‘ఘర్ బచావ్-ఘర్ బనావ్ ఆందోళన్’ సంస్ధ నాయకురాళ్లు మేథా పాట్కర్, పూనం కనోడియా నాయక త్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంటీ జాక్ సభ్యులు శుక్రవారం సాయంత్రం ఘటనాస్థలానికి వెళ్లి నిర్వాసితులకు మద్దతు ప్రకటించారు. ములుండ్, భాండుప్ ప్రాంతాల్లోని తెలుగువారితోపాటు త్వరలోనే దీక్షలో పాల్గొంటామని ‘జాక్’ కన్వీనర్ బి. ద్రవిడ్ మాదిగ, గాది లక్ష్మణ్ తెలిపారు. ముంబైలోని ఇతర తెలుగు సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
హెలికాప్టర్లు వద్దు
శివసేన ప్రతిపాదనలు పక్కకు పెట్టిన బీఎమ్సీ వాటితో ప్రమాదం తీవ్రమవుతుందన్న పరిపాలనా విభాగం సాక్షి, ముంబై: నగర అగ్నిమాపక శాఖ కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను నగర పాలక సంస్థ(బీఎమ్సీ) తిరస్కరించింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు హెలికాప్టర్లను వినియోగించడంవల్ల మంటలు మరింత తీవ్రమవుతాయనే సాకుతో బీఎమ్సీ పరిపాలనా విభాగం వాటి కొనుగోలు ప్రతిపాదనను పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఒక్కప్పుడు నగరం, శివారు ప్రాంతాల్లో 10-15 అంతస్తులకే పరిమితమైన భవనాలు నేడు అందనంత ఎత్తులో నిర్మిస్తున్నారు. దీనికితోడు నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో ప్రమాదస్థలికి వెంటనే ఫైరింజన్లు చేరుకోవడం కష్టమవుతోంది. దీంతో అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతుంది. ఈ నష్టాన్ని నివారించేందుకు ముంబై అగ్నిమాపక శాఖకు హెలికాప్టర్లు కొనుగోలు చేసి ఇవ్వాలని శివసేనకు చెందిన యామిని జాధవ్ ప్రతిపాదించారు. కాని బీఎమ్సీ పరిపాలనా విభాగం దీన్ని తిరస్కరించింది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ పరిధిలో ఫైరింజన్ల వాహనాలపై 22 అంతస్తుల ఎత్తుకు సరిపడే నిచ్చెనలు ఉన్నాయి. భాయ్కళలోని అగ్నిమాపకశాఖ ప్రధాన కార్యాలయంలో సుమారు 28 అంతస్తులకు సరిపడే ఫైరింజన్ ఒకేఒకటి ఉంది. ఈ భారీ వాహనం ఇక్కడి నుంచి ట్రాఫిక్ జామ్‌లో సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాగా నగరంలో మూతపడిన మిల్లుల స్థలాల్లో ఎక్కడ చూసినా టవర్లు, ఆకాశహర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేయాలంటే అగ్నిమాపక జవాన్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇప్పటికే నగర విస్తరణ, పెరిగిన జనాభాతో పోలిస్తే అగ్నిమాపక కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో కేవలం 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటి సంఖ్య రెట్టింపు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కాని అది కార్యరూపం దాల్చలేకపోయింది. దీంతో హెలికాప్టర్ల ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అయితే అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పివేసేందుకు వెళ్లిన హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చే వేగమైన గాలివల్ల మంటలు విస్తరించడంతోపాటు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. అంతేగాక హెలికాప్టర్ నీటిని నిల్వ చేసుకుని గాలిలో ఎగురుతుండగా మంటలపై పిచికారి చేయడం సాధ్యమయ్యే పని కాదు. అంతేగాక వాటి నిర్వహణ, మెకానిక్‌లు, హెలిప్యాడ్లు అందుబాటులో ఉంచడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా విభాగం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. -
అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు
కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగిన రాహుల్ శెవాలే సాక్షి. ముంబై: బీఎంసీ కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాహుల్ శెవాలే అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్జోషీనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే టికెట్ కేటాయించారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గెలుపుకోసం కృషి చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నాయకుడైన ఏక్నాథ్ గైక్వాడ్‌పై ఘనవిజయం సాధించారు. దీంతో స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన నేరుగా పార్లమెంట్‌కు వెళ్లేందుకు ఆస్కారం లభించింది. దక్షిణ మధ్య ముంబై లోకసభ నియోజకవర్గం శివసేనకు పెట్టనికోట. కానీ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పరాజయం పాలైంది. ఇక్కడ గెలుపును సవాలుగా తీసుకున్న శివసేన ఈసారి లోకసభ ఎన్నికల్లో సీనియర్ నాయకుడు మనోహర్ జోషీని కాదని రాహుల్ శెవాలేను బరిలోకి దింపింది. శివసేన అభ్యర్థిగా తాను మళ్లీ ఇక్కడ కాషాయ జెండాను ఎగరవేయడం చాలా ఆనందం కలిగించిందని రాహుల్ శెవాలే అన్నారు. శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే కలను సాకారం చేశాననే తృప్తి ఉందన్నారు. రాహుల్ శెవాలే తల్లి జయశ్రీ శెవాలే ఎమ్టీఎన్ఎల్ ఉద్యోగి కాగా, తండ్రి రమేష్ శెవాలే నౌకాదళం అధికారి. సివిల్ ఇంజనీర్ అయిన రాహుల్ శివసేనలో చేరి 2002లో కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత 2004లో అతనికి ప్రభాగ్ సమితి అధ్యక్షుని పదవి లభించింది. ఇలా ఒక్కో మెట్టుపైకి ఎదిగిన ఆయన 2005లో అణుశక్తినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఆయన మంచి పట్టు సాధించారు. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
రోగులకు మంచిరోజులు
సాక్షి, ముంబై: బీఎంసీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు నాణ్యమైన భోజనం అందజేయాలని పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. రోగులకు భోజనం సరఫరా చేసే బాధ్యతలు విలేపార్లేలోని ఇస్కాన్ సంస్థకు అప్పగించింది. ఇప్పటిదాకా బీఎంసీ ఆస్పత్రుల్లోని రోగులకు పరిపాలన విభాగమే భోజనం పంపిణీ చేస్తోంది. ఇక నుంచి ఈ బాధ్యతను ‘ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్’ నిర్వహించనుంది. ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలా? అనే విషయమై మొదట టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్)కు చెందిన గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే కూడా ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు. కాని అధికారంలో ఉన్న నాయకులు వారి డిమాండ్‌ను పట్టించుకోకుండానే ఇస్కాన్ వైపు మొగ్గు చూపారు. అయితే భోజనం పంపిణీచేసే ఈ పథకాన్ని ముందుగా విలేపార్లేలోని కూపర్ ఆస్పత్రి నుంచి ప్రారంభించనున్నారు. అందుకు రూ.1.97 కోట్లు ఖర్చుకానుంది. ఈ మొత్తంతో ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్.. రోగులకు రెండు పూటల భోజనంతోపాటు టీ, అల్పాహారం అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. పెరిగిన రోగుల సంఖ్య... కూపర్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ 636 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గతంలో రోగులకు భోజనం సరఫరా చేయాలంటే బీఎంసీ పరిపాలన విభాగానికి రూ.1.99 కోట్లు ఖర్చయ్యేది. రోగుల సంఖ్య పెరగడంతో వంటశాల సిబ్బంది, వార్డుబాయ్‌ల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది. దీని కారణంగా వ్యయం పెరిగే అవకాశముంది. కాని ఇస్కాన్ సంస్థ మాత్రం రూ.1.97 కోట్లకే రెండు పూటల భోజనం, టీ, అల్పాహారం అందజేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇస్కాన్ సంస్థకే కాంట్రాక్టు ఇవ్వాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు మంగళవారం జరిగిన స్థాయి సమితి సమావేశంలో ఆమోదం లభించింది. బీఎంసీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గతంలో మహిళా పొదుపు సంఘాల ద్వారా కిచిడీ పంపిణీ జరిగేది. ప్రస్తుతం దీన్ని కూడా నిలిపివేసి ఇస్కాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తానీ చెప్పారు. -
క్షయ వ్యాధి నివారణపై బీఎంసీ దృష్టి
సాక్షి, ముంబై: క్షయ(టీబీ) వ్యాధి నియంత్రణకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) చర్యలు తీసుకుంటోంది. నేషనల్ అర్బన్ మిషన్ పథకంలో భాగంగా ఈ వ్యాధి రోగులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందజేయాలని నిర్ణయించింది. ఏడాదిపాటు ఈ పథకాన్ని అమలుచేసేందుకు కార్పొరేషన్‌కు రూ.35 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చాయని సీనియర్ అధికారి ఒక రు పేర్కొన్నారు. అయితే రోగుల చికిత్సకు అనుగుణంగా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందజేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని నగర వైద్యాధికారి మిన్ని ఖేట్రపాల్ అభిప్రాయపడ్డారు . ప్రస్తుతం రెండు వేల మంది రోగులు క్షయ వ్యాధితో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని తెలి పారు. బీఎంసీ అమలు చేసిన నేషనల్ టీబీ కంట్రో ల్ ప్రోగ్రామ్‌లో ఈ విషయం వెల్లడైందన్నారు. పోషక విలువలున్న ఆహారాన్ని అల్పాహారం రూపంలో, లేకుంటే వండిన వంటకాల రూపంలోనైనా అందజేస్తారన్నారు. ఇందుకోసం కార్పొరేషన్ ఆస్పత్రులకు చెందిన న్యూట్రిషనిస్టులు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని బీఎంసీ సీనియర్ వైద్యు డు ఒకరు తెలిపారు. ‘చాలా మంది క్షయ రోగులకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది. వీరికి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇస్తే అదనపు శక్తి చేకూరి త్వరగా కోలుకునేందుకు దోహదపడుతుంద’ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం శివ్డీలోని జీటీబీ ఆస్పత్రిలో అధిక పోషక విలువలు ఉన్న పాలు, గుడ్లను క్షయ వ్యాధి గ్రస్తులకు అందజేస్తున్నామన్నారు. నగరంలో 2013లో 2,394 ఎండీఆర్ టీబీ కేసులు, 2014లో ఇప్పటివరకు 453 టీబీ కేసు లు నమోదయ్యాయి. అయితే 2013లో 90 ఎక్స్‌డీఆర్ టీబీ కేసులు, 2014లో ఫిబ్రవరి వరకు 24 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. -
నర్సు పోస్టులు భర్తీ ప్రక్రియలో స్వల్పమార్పులు
సాక్షి, ముంబై: బీఎంసీ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియలో పరిపాలనా విభాగం స్వల్ప మార్పులు చేసింది. ఈ ఉద్యోగాల్లో ఇక నుంచి బీఎంసీకి చెందిన ‘నర్సింగ్ స్కూల్’ లో శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించింది. 90 శాతం ఉద్యోగాలు నర్సింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి, 10 శాతం బయట శిక్షణ పొందిన వారికి కేటాయించనున్నారు. నర్సింగ్ సేవలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో బీఎంసీ... ఓ నర్సింగ్ పాఠశాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ శిక్షణ పొందిన వారికి అనేక సంవత్సరాలుగా భర్తీ ప్రక్రియలో ప్రాధాన్యమిస్తోంది. అయితే రిజర్వేషన్ కోటా కింద కొన్ని కులాలకు చెందిన నర్సులు దొరక్కపోవడంతో బయట శిక్షణ పొందిన వారిని భర్తీ చేయాల్సి వస్తోంది. గత సంవత్సరం 334 మంది నర్సులను భర్తీ చేయాలంటే ఇంటర్వ్యూకి ఆహ్వానించాల్సి వచ్చింది. 2005, జూలై 26న నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు సేవలందించేందుకు నర్సుల కొరత సమస్య ఎదురైంది. ఆ సమయంలో బీఎంసీకి చెందిన నర్సులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చిన సుమారు 50 మంది న ర్సులు వైద్యసేవలు అందించారు. వారి సేవలను రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రశంసించింది. దీంతో గత సంవత్సరం జరిగిన భర్తీ ప్రక్రియలో వారికి ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది. అయితే ఇలా భర్తీ చేయడాన్ని బీఎంసీ నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పొందిన నర్సులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరితోపాటు పలు కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే సంవత్సరం నుంచి నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పొందినవారిని ఈ ఉద్యోగాల్లో నియమిస్తామని హామీ ఇచ్చికూడా పరిపాలనావిభాగం అన్యాయం చే స్తోందంటూ కార్మిక సంఘాలు ఆరోపించాయి. అయితే ఈ ఏడాది భర్తీ ప్రక్రియ జరగనుందని తెలియడంతో సంఘాల నాయకులు ఇటీవల బీఎంసీ అదనపు కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్‌ను కలిశారు. బీఎంసీ నర్సింగ్ పాఠశాలలో శిక్షణ పొందిన నర్సులకే ప్రాధాన్యమివ్వాలని పట్టుబట్టారు. వీరి డిమాండ్ సమంజసంగా ఉండడంతో అందుకు అంగీకరించారు. ఆ ప్రకారం 90 శాతం మందిని పాఠశాలనుంచి, మిగతా పది శాతం మంది బయట నుంచి భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. -
బీఎంసీకి ‘బల్క్’ భారం
సాక్షి, ముంబై: బల్క్ ద్వారా ఇంధనం కొనుగోలు గిట్టుబాటు కాకపోవడంతో బీఎంసీ బయట పెట్రోల్ బంకుల నుంచి కొనుగోలు ప్రారంభించింది. బల్క్ పద్ధతిలో ఇంధనం కొనుగోలుపై ఇటీవల ప్రభుత్వంపై లీటరుకు రూ.10 అదనపు భారం మోపింది. దీని ప్రభావం బీఎంసీపై పడింది. ఈ భారాన్ని భరించే స్తోమతలేక బయట పెట్రోల్ బంకుల నుంచి బీఎంసీ డీజిల్ కొనుగోలు చేస్తోంది. బల్క్ ద్వారా ఇంధనం కొనుగోలుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలపై పడింది. దీంతో బస్సులకు అవసరమైన డీజిల్‌ను బయట పెట్రోల్ బంకుల నుంచి ఎమ్మెస్సార్టీసీ కొనుగోలు చేస్తోంది. బీఎంసీ కూడా ఇదే బాట పట్టినట్లు అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని తెలిపారు. బీఎంసీకి వర్లీ, ఎల్ఫిన్స్టన్ రోడ్, ఘాట్కోపర్లో గ్యారేజీలు ఉన్నాయి. బీఎంసీ చేతిలో 1,140 వాహనాలున్నాయి. 280 కార్లు, జీపులు, స్కార్పి యో, చిన్నాచితకా వాహనాలతోపాటు చెత్తను తరలించే ట్రక్కులు ఉన్నాయి. ప్రస్తుతం బయట పెట్రోల్ బంకుల్లో డీజిల్ ధర లీటరుకు రూ.63.83 ఉంది. అదే బల్క్‌లో కొనుగోలు చేస్తే రూ.10 అదనంగా చెల్లించాలి. ఇలా బీఎంసీకి ప్రతీరోజు 17,500 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. ప్రస్తు తం ఆరు వేల లీటర్ల డీజిల్‌ను బయట బంకుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల బీఎంసీకి రోజుకు రూ.60 వేలు ఆదా అవుతున్నాయి. త్వరలో మిగతా డీజిల్‌ను కూడా బయటి బంకుల నుంచి కొనుగోలు చేస్తామని అడ్తాని చెప్పారు. -
నిర్మించి ఏడాది వసతి కల్పించేదెన్నడో?
సాక్షి, ముంబై: బిచ్చగాళ్ల వెసులుబాటుకోసం నగర పాలక సంస్థ (బీఎంసీ) ఏడాది క్రితం నగరంలో నిర్మించిన వసతి గృహం ఇప్పటికీ వారికి అందుబాటులోకి రాలేదు. దాదాపు 850 మంది బిచ్చగాళ్లు ఉండేవిధంగా ఈ వసతిగృహాన్ని నిర్మించారు. దీని వైశాల్యం 6,700 చదరపు మీటర్లు.వంట గది కూడా చాలా విశాలంగా ఉంటుంది. అంతేకాకుండా అత్యవసర సమయంలో బిచ్చగాళ్లకు ప్రాథమిక పరీక్షలు జరిపేందుకు చిన్నపాటి ఆస్పత్రిని కూడా అక్కడే నిర్మించారు. ఇందులో 40 పడకలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అనేక సదుపాయాలు కల్పించారు. అందులోని భారీ హాలులో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు వినోదం కోసం ఓ టీవీని కూడా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా వివిధ అవసరాలతో కూడిన అతి పెద్ద వంట గది, ప్రత్యేక స్నానాల గదులు, వికలాంగులకు ప్రత్యేక ర్యాంప్‌లు కూడా ఏర్పాటు చేశారు. బంధువులు వచ్చినప్పుడు కూర్చోవడానికి పచ్చికలో సీట్లు, అంతేకాకుండా వాకింగ్ చేయడానికి అతిపెద్ద గార్డెన్ వసతి కూడా ఉంది. ఈ భవన నిర్మాణానికి 2008లో అనుమతి లభించింది. 2011లో పనులను ప్రారంభించారు. గత ఏడాది పనులు పూర్తయ్యాయి. అయినప్పటికీ అప్పటి నుంచీ ఈ భవనం నిరుపయోగంగానే పడి ఉంది. ఇదిలాఉంచితే బిచ్చగత్తెల కోసం దీని పక్కనే రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ భవన నిర్మాణం చివరి దశలో ఉంది. వచ్చే నెలాఖరుకు పనులు పూర్తయ్యే అవకాశముందని బీఎంసీ అధికారి గౌతమ్ అగర్వాల్ తెలిపారు. ఈ భవనం ప్రస్తుతం ప్రజాపనుల శాఖ అధీనంలో ఉందని, తమ అధీనంలోకి రాగానే బిచ్చగాళ్లను అనుమతిస్తామన్నారు. -
బకాయిలు చెల్లించండి
సాక్షి, ముంబై: గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పడిన బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడ ంతో నోటీసు జారీ చేయాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంతవరకు బకాయిలు చెల్లించే విషయంపై ఈసీ నోరు విప్పడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే వాటిని చెల్లించాలని నోటీస్‌లో హెచ్చరించనున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని స్పష్టం చేశారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎంసీకి చెందిన 63 వాహనాలు, స్థలాలు, కార్యాలయాలు, సుమారు ఐదు వేల మంది సిబ్బందిని ఎన్నికల కమిషన్ వినియోగించుకుంది. ప్రతీ వాహనానికి రోజుకు రూ.2,000 అద్దె, స్థలాలు, కార్యాలయాలు, సిబ్బంది వేతనాలకు.. ఇలా కోట్ల రూపాయల బకాయిలు పడింది. వీటిని చెల్లించేంతవరకు బీఎంసీ వాహనాలు, స్థలాలు, సిబ్బందిని ఈసీకి మరోసారి ఇవ్వబోమని అడ్తాని స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పనులకు 8,000 మంది సిబ్బంది కావాలని బీఎంసీ పరిపాలన విభాగాన్ని ఈసీ కోరింది. అయితే 6,500 మంది సిబ్బందిని ఇచ్చేందుకు బీఎంసీ అంగీకరించింది. మిగతా సిబ్బందిని ఈసీ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకుంది. వీరంతా గురువారం ఎన్నికల పనుల్లో నిమగ్నమవుతారని అడ్తాని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం నగరంలో మొత్తం 10,600 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద అధికారులను నియమిస్తారు. ఎన్నికల విధుల్లో ముంబైలోని బీఎంసీ, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మొత్తం 75 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. -
‘ఓషివారా-జేవీఎల్ఆర్’కు మోక్షమెన్నడో..
ఐదేళ్లైన ముందుకు కదలని ప్రాజెక్టు సాక్షి, ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓషివారా- జేవీఎల్ఆర్ (జోగేశ్వరి-విక్రోలి లింక్ రోడ్) బ్రిడ్జి ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఐదేళ్ల కిందట బీఎంసీ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి రెండు విడతల్లో పనులు పూర్తిచేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో ఓషివారా లింక్ రోడ్డును వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేకు (డబ్ల్యూఈహెచ్)కు అనుసంధానం చేయాల్సి ఉండగా, రెండవ విడతలో హైవే ను జేవీఎల్ఆర్తో అనుసంధానం చేయాల్సి ఉం టుంది. 2009లో రూ.198 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని బీఎంసీ తలచింది. అయితే మొదటి విడత పనులను తిరిగి రెండు భాగాలుగా విభజించారు. దీంతో దీని అంచనా వ్యయం మరో రూ.99.87 కోట్లు పెరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటివరకు 60 శాతం పను లు పూర్తయ్యాయని అధికారి ఒకరు తెలిపారు. ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించి మొదటి విడత పనులను మిలత్ హైస్కూల్ నుంచి ఎస్వీ రోడ్ వరకు చేపట్టగా కేవలం 10శాతం పనులే పూర్తయ్యాయి. కాగా, రెండో విడత పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా బ్రిడ్జిపై కేబుల్ వైర్లు అడ్డురావడంతో మిగతా పనులు ఆగిపోయాయని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా అడిషినల్ మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మెట్రో బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కేబుల్ వైర్లను పగటి పూట కూడా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తొలగించడంలో ఎంఎంఆర్డీఏ అధికారులు విజయం సాధించారన్నారు. అయితే ఇదే తరహాలో ఇక్కడ వైర్లను తొలగించేందుకు అదనంగా మరో రూ.99.87 కోట్లు అవసరం ఉంటుందన్నారు. బ్రిడ్జి డిపార్ట్మెంట్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ సమ స్య చాలా క్లిష్టంగా ఉండడంతో పనులను కొనసాగించేందుకు తాజాగా టెండర్లను ఆహ్వానించి, కొత్త కాంట్రాక్టర్లచే పనులు ప్రారంభిస్తామన్నారు. -
వరదనీటి సమస్యకు చెక్!
సాక్షి, ముంబై: తొమ్మిదేళ్ల తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రే రోడ్లో ఎట్టకేలకు ‘బ్రిటానియా పంపింగ్ స్టేషన్’ నిర్మాణాన్ని మంగళవారం చేపట్టింది. ఈ పంపింగ్ స్టేషన్ నిర్మాణంతో వర్షాకాలంలో ఎదురయ్యే వరద నీటి సమస్యను పరిష్కరించవచ్చని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా వర్షాకాలంలో హిందూ మాతా, ఇతర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతుంటారు. ఈ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి రూ.138 కోట్లను వెచ్చించనున్నట్లు అధికారి తెలిపారు. 2005 జూలైలో నగరంలో భారీవర్షాలు కురవడంతో నగరం వరద ముంపునకు గురైంది. దీంతో ఎనిమిది పంపింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు బీఎంసీ ప్రకటించింది. ప్రస్తుతం రెండు పంపింగ్ స్టేషన్లు మాత్రమే వినియోగంలోకి రానున్నట్లు అధికారి తెలిపారు. ఈ సందర్భంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఈ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అవసరమైన అనుమతులను పొందేందుకు చాలా సమయం వృథా అయిందన్నారు. ఇప్పుడు ఈ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. మరో 18 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. ఇదిలా వుండగా, వర్లీలో మరో రెండు పంపింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారి వివరించారు. వీటిలో ‘లవ్‌గ్రోవ్’ స్టేషన్‌కు గాను రూ.102 కోట్లు, ‘క్లైవ్ల్యాండ్ బందర్’ పంపింగ్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 116 కోట్ల వ్యయం కానుంది. 2013 అక్టోబర్‌లో ఇవి పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ వర్షాకాలంలో వీటిని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని వర్షపు వరద నీరు చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్ వట్కర్ తెలిపారు. నగర శివారు ప్రాంతాల్లో మూడు పంపింగ్ స్టేషన్లను నిర్మించే విషయమై ప్రతిపాదించినప్పటికీ అవి కాగితాల వరకే పరిమితమై ఉన్నాయి. వీటిలో ఖార్ పంపింగ్ స్టేషన్‌కు గాను ప్రభుత్వం స్థలం కేటాయించాల్సి ఉండగా, మహుల్, శాంతాక్రజ్‌లలో ఏర్పాటు చేయనున్న పంపింగ్ స్టేషన్లను వివిధ కారణాల వల్ల ‘మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ తిరస్కరించిందని లక్ష్మణ్ తెలిపారు. -
సీఎన్జీకి బీఎంసీ ఓకే..
అంత్యక్రియలకు గ్యాస్ వినియోగించాలని నిర్ణయం సగం ఖర్చుతో కార్యక్రమం పూర్తి పైపులైన్లకు దగ్గరగా ఉన్న శ్మశాన వాటికలకు అనుసంధానం ఆర్థిక బడ్జెట్లో నిధులు మంజూరు సాక్షి, ముంబై: శ్మశాన వాటికలో అంత్యక్రియలకు గ్యాస్ ద్వారా నిర్వహించాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. విడతలవారీగా అన్ని హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేయాలని, అందుకు ఆర్థిక బడ్జెట్లో నిధులు కూడా మంజూరు చేసింది. కట్టెల ద్వారా దహనకాండ చేయడంవల్ల పర్యావరణానికి హాని, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో గ్యాస్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. ముంబైలో దాదాపు 35 శ్మశాన వాటికలు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో శవానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే సుమారు 300 కేజీల కట్టెలు అవసరమవుతాయి. అందుకు బీఎంసీ శ్మశాన వాటికలో రూ.1,890 ఖర్చవుతాయి. అదే ప్రైవేటు శ్మశాన వాటిలో రూ.2,090 చెల్లించాల్సి ఉంటుంది. కాగా శవం తాలూకు కుటుంబం ఆర్థిక పరిస్థితిని బట్టి ఇందులో కొంత శాతం రుసుం వారి నుంచి వసూలు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు మాత్రం ఉచితంగానే అంత్యక్రియలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ భారాన్ని బీఎంసీ స్వయంగా భరిస్తోంది. అదేవిధంగా ఒక్కో శవానికి విద్యుత్ ద్వారా దహనకాండకు రూ.700 ఖర్చుకాగా సీఎన్జీ ద్వారా రూ.630 ఖర్చవుతోంది. కట్టెలతో పోలిస్తే గ్యాస్ ద్వారా దహన క్రియలు పూర్తిచేయడం బీఎంసీకి ఎంతో గిట్టుబాటు అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్యాస్ ద్వారా అంత్యక్రియలు పూర్తిచేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో మహానగర్ గ్యాస్ పైపులైన్లు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో ఆ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలను గ్యాస్‌తో అనుసంధానించాలని యోచిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ పైపులైన్లకు వంద మీటర్ల లోపు ఉన్న తొమ్మిది, వంద మీటర్ల తర్వాత ఉన్న 11 శ్మశాన వాటికలను గ్యాస్‌తో అనుసంధించాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయించింది. -
రెండు ఫుట్‌బాల్ మైదానాల అభివృద్ధి
సాక్షి, ముంబై: నగరవాసుల కోసం రెండు ఫుట్‌బాల్ మైదానాలను అభివృద్ధి చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘జాన్ క్రేఫ్ ఫౌండేషన్’ వారి భాగస్వామ్యంతో ఈ రెండు చిన్న ఫుట్‌బాల్ మైదానాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల జెఫర్వోన్తో జరిగిన సమావేశంలో నగర మేయర్ సునీల్ ప్రభు ఈ మైదానాలను అభివృద్ధి చేసే అంశాన్ని చర్చించారు. ‘ఈ ఫౌండేషన్ ప్రపంచంలోనే వివిధ నగరాలలో చాలా మైదానాలను అభివృద్ది చేసింది. నిరుపేదలైన ఏడు నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు అన్ని వసతులతో కూడిన ఆట మైదానాలను అందుబాటులో ఉంచుతాం. వారు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమ’ని మేయర్ సునీల్ ప్రభు పేర్కొన్నారు. ఈ మైదానాలు అభివృద్ధి అయిన తర్వాత ఫౌండేషన్ ద్వారా ఈ మైదానాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల పేద పిల్లలకు ఉచితంగా కోచింగ్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. కాగా, బీఎంసీ పరేల్‌లో ఉన్న సెయింట్ జేవియర్స్ మైదానం, పశ్చిమ బాంద్రాలోని పీ సెవెన్ మైదానాలను ఫుట్‌బాల్ మైదానాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మైదానాలకు క్రేఫ్ కోర్టులుగా నామకరణం చేస్తామని బీఎంసీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఆట మైదానాలను అభివృద్ధి చేసి, వీటి నిర్వహణ బాధ్యతను కూడా ఆ ఫౌండేషన్‌కు కార్పొరేషన్ అప్పగించనుందని తెలిపారు.ఈ తరహా మరిన్ని మైదానాలను నగర శివారు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయనుందని ఆయన వివరించారు. -
ముంబైలోనూ విద్యుత్ చార్జీలు తగ్గించాల్సిందే
ముంబై: నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్ శుక్రవారం నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. ఉత్తర ముంబైలోని కాండివలిలో ఉన్న రిలయన్స్ ఎనర్జీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఆయన దీక్షకు కూర్చున్నారు. ముంబై మినహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలను 20 శాతం తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ముంబై వాసులకు సైతం ఈ తగ్గింపు వర్తించాలని ఉత్తర ముంబై నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు. నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించినంతవరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వాడుతున్న వినియోగదారులకే ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ముంబై నగరంలో ప్రైవేట్ రంగానికి చెందిన టాటా పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ పంపిణీ కంపెనీలు విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విద్యుత్ ధర తగ్గింపు నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షపార్టీ అయిన బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. అయితే దీనికి స్పందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గత నవంబర్‌లో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే విద్యుత్ చార్జీలను తగ్గించామే తప్ప రాజకీయ కారణాలేవీ లేవన్నారు. ఈ తగ్గింపు వల్ల వచ్చే రూ.7,200 కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన అన్నారు. కాగా, నగరంలోనూ విద్యుత్ చార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ ప్రియాదత్‌తో పాటు నిరుపమ్ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం పృథ్వీరాజ్ చవాన్‌కు నిరుపమ్ లేఖ కూడా రాశారు.‘జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 50 శాతం విద్యుత్ చార్జీలను తగ్గించింది. ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో, రాష్ట్రంలో మనం ఎందుకు విద్యుత్ చార్జీలను తగ్గించలేం?..’ అంటూ ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. ప్రభుత్వం తన లేఖపై స్పందించకపోవడంతో తాను నిరాహారదీక్షకు దిగాల్సి వచ్చిందని నిరుపమ్ తెలిపారు. దీక్ష తప్పు కాదు కాని.. నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఎంపీ సంజయ్ నిరుపమ్ నిరవధిక నిరాహారదీక్షకు దిగడం అప్రస్తుత చర్యగా ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం విద్యుత్ చార్జీలను తగ్గించిన ప్రభుత్వం, ముంబై విషయంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించిందన్నారు. విద్యుత్ చార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం లేదా ఎంఈఆర్సీ తప్ప రిలయన్స్ ఎనర్జీ కాదని ఆయన నొక్కిచెప్పారు. ‘నిరుపమ్ పోరాటం చేయడంలో తప్పు లేదు కానీ అతడు దీక్ష చేస్తున్న స్థలం మాత్రం కరెక్ట్ కాదు..’ అని ఆయన అన్నారు. ఫ్లైఓవర్లపై సుంకం ఎత్తివేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు బీఎంసీ స్థాయీ కమిటీ అధ్యక్షుడు రాహుల్ షెవాలే లేఖ రాయడంపై నవాబ్ మాలిక్ స్పందిస్తూ..‘ ఒకప్పుడు సేనా-బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుంకం వసూలు పద్ధతినే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది తప్ప కొత్తగా చేపట్టిన విధానం కాదు..’ అని అన్నారు. ‘శివసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఫ్లైఓవర్ల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. నిర్మాణ వ్యయాన్ని సదరు ప్రైవేట్ కంపెనీలు వసూలు చేసుకునేందుకు సుంకం విధానాన్ని ప్రవేశపె ట్టింది..’అని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా నగరంలో విద్యుత్ ధరలను 50 శాతం తగ్గించాలని శివసేన డిమాండ్ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు.‘బీఎంసీలో మీరే అధికారంలో ఉన్నారు.. నగరంలో బెస్ట్ వసూలుచేస్తున్న విద్యుత్ చార్జీలను ముందు తగ్గించండి.. తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడండి..’ అంటూ ఆయన సవాల్ విసిరారు. -
పైప్లైన్లపై మరోసారి అధ్యయనం
సాక్షి, ముంబై: నగర భూగర్భంలోని నీటిపైప్‌లైన్లపై మరోసారి అధ్యయనం చేపట్టాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. వలసలు పెరగడంతో నగరం నానాటికీ విస్తరిస్తోంది. ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో అనేక కట్టడాలు, వంతెనలు, మెట్రో, మోనో రైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. తవ్వకాల కారణంగా భూగరంలోని పైపులు తరచూ పగిలిపోతుండడంతో బీఎంసీకి తీవ్రనష్టం వాటిల్లుతోంది. గడ చిన దశాబ్దకాలంలో నగరంలో అనేక మార్పులు జరిగాయి. మూతపడిన మిల్లుస్థలాల్లో అనేక కట్టడాలు వెలుస్తున్నాయి. రహదారులపై ఫ్లైఓవర్లు, సబ్‌వేలను నిర్మిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఓ మ్యాపును రూపొందించకపోవడంతో భూగర్భంలో నీటి పైపుల జాడ తెలియడం లేదు. దీంతో మరోసారి అధ్యయనం చేయాలని బీఎంసీ యోచిస్తోంది. ప్రస్తుతం బీఎంసీ వద్ద ఉన్న భూగర్భ మ్యాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటిది. ఆ తరువాత నగరం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. వాస్తవానికి ఈపాటికే మరోసారి అధ్యయనం జరిపి ఉండాల్సింది. అయితే అలా జరగలేదు. దీనికితోడు బీఎంసీలో అనుభవం కలిగిన సిబ్బంది సంఖ్య కూడా అంతంత మాత్రమే. లీకేజీల గుర్తింపు విభాగంలో కేవలం 27 మంది మాత్రమే పనిచేస్తున్నారు. గతంలో 300 నీటి కనెక్షన్లను ఓ జోన్‌గా పరిగణించేవారు. వలసలు పెరగడం, నగరంతోపాటు శివారు ప్రాంతాలు విస్తరించడంతో రెండు వేల కనెక్షన్లను ఒక జోన్‌గా నిర్ణయించారు. దీంతో సిబ్బందిపై పనిభారం కూడా పెరిగింది. -
అక్రమ ‘మొబైల్’ టవర్లపై కొరడా
సాక్షి, ముంబై: నగరంలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ మొబైల్ టవర్ల ఆగడాలను నియంత్రించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎట్టకేలకు నడుం బిగించింది. ఇన్నాళ్లు చూసీచూడనట్టు వ్యవహరించిన కార్పొరేషన్...స్థానికులు, సామాజిక కార్యకర్తల ఆందోళనలు ఉధృతమవడంతో మొబైల్ టవర్లపై నిఘా ఉంచాలనే ప్రతిపాదనకు రూపకల్పన చేసింది. ఆమోదం, సలహాలు, సూచనల కోసం పట్టణ అభివృద్ధి విభాగానికి పంపింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నామని, ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారే నిర్ణయిస్తారని డెవలప్మెంట్ ప్లానింగ్ చీఫ్ ఇంజనీర్ రాజీవ్ కుక్నూర్ తెలిపారు. అక్రమ మొబైల్ టవర్లపై కార్పొరేషన్ ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాఠశాలలు, ఆస్పత్రులు, నివాస భవనాలపైన అమర్చిన మొబైల్ టవర్లపై దృష్టి సారించలేదు. వీటివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. వీరికి స్థానికులు కూడా తోడవడంతో విషయ తీవ్రతను గమనించిన కార్పొరేషన్ ఆగమేఘాలపై గత వారంలో మొబైల్ టవర్ల జాబితాను విడుదల చేసింది. నగరంలో ఉన్న 4,776 మొబైల్ టవర్లలో 1,158 మాత్రమే చట్టపర అనుమతులను కలిగి ఉన్నాయని తెలిపింది. వీటిలో 3,618 అక్రమమైనవని వెల్లడించింది. దీంతో 75 శాతం మొబైల్ టవర్లు అక్రమంగా ఏర్పాటు చేశారన్న విషయం స్పష్టమవుతోంది. అయితే అక్రమంగా ఏర్పాటుచేసిన టవర్లకు బీఎంసీ అనుమతినివ్వలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఈ టవర్లను నిర్మూలించనున్నారు. దీనివల్ల నగరంలో నెట్వర్క్ కవరేజ్ చాలా తక్కువగా ఉంటుందని టవర్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇప్పటికే వివిధ మొబైల్ నెట్‌వర్క్‌ల నుంచి కాల్ డ్రాప్, నెట్వర్క్ సమస్యలు చాలా ఎదురవుతున్నాయన్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే నెట్వర్క్ సమస్య మరింత జటిలమవుతుందన్నారు. బీఎంసీ నియమాల ప్రకారం...ఆస్పత్రులు, విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరం వరకు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడాన్ని నిషేధించారు. భవనాలపై ఈ టవర్లను ఏర్పాటు చేయాలనుకుంటే ఆ సొసైటీ అనుమతి తీసుకోవాలి. -
పాతరోడ్లన్నింటికీ పూతలు
సాక్షి, ముంబై: తన పరిధిలోని పాత తారురోడ్లన్నింటికీ పూతవేయాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రతిపాదన ఒకట్రెండు రోజుల్లో స్థాయిసమితి ముందుకు రానుంది. ప్రతిపాదనకు ఆమోదం లభించగానే టెండర్లు ఆహ్వానిస్తారు. ప్రస్తుతం గుంతలమయంగా కనిపిస్తున్న రోడ్లన్నీ పూతల తరువాత అందంగా దర్శనమివ్వనున్నాయి. ముంబైలోని అనేక చిన్న, పెద్ద రోడ్లను చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. తవ్వకాలు, నీళ్లు చేరడం వల్ల రోడ్లన్నీ బీటలు వారడమేకాకుండా గుంతలు పడ్డాయి. భూగర్భంలో డ్రైనేజీ, తాగునీటి పైపులు పగిలిపోయి నీరంతా రోడ్లపైకి రావడంతో తారు కొట్టుకుపోయింది. ఇలా పాతబడ్డ రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఎంసీ భావించింది. ఈ ప్రతిపాదనకు మంజూరు లభించే అవకాశాలున్నాయని స్థాయిసమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే ధీమా వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతుల పనులు చేపట్టే సమయంలో రోడ్లతోపాటు భూగర్భంలో ఉన్న డ్రైనేజీ, తాగునీటి పైపులనూ మార్చుతారు. ఇందుకోసం నియమించిన సలహాదారుల సమితి మార్గదర్శకాల ప్రకారం వార్డుల వారీగా ఊహాచిత్రాలు రూపొందించారు. పర్యాటకులకు ఆకర్శణగా నిలిచిన మెరైన్‌డ్రైవ్ రోడ్డునూ ఆధునీకరిస్తారు. ఇక్కడి రహదారిని 1940లో నిర్మించారు. మెరైన్‌డ్రైవ్ ప్రాంత రోడ్డు సముద్రానికి ఆనుకుని ఉంది. సముద్రం నుంచి వచ్చే ఉప్పుగాలులతో ఈ రహదారి బాగా దెబ్బతింది. అందుకే దీనిని పూర్తిగా త వ్వి కొత్తగా రోడ్డు వేయనున్నారు. ఇందుకోసం మెకనైజ్ మాస్టిక్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని శేవాలే చెప్పారు. పప్పుబెల్లాలపై పట్టింపేది ? బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో బెల్లం, పల్లిచిక్కీ అందజేసే పథకం అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. బీఎంసీ పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలు పూర్తికావస్తున్నాయి. మరో మూడు నెలల్లో వార్షిక పరీక్షలూ పూర్తవుతాయి. మధ్యాహ్న భోజనంలో చిక్కీలు, బెల్లం మాత్రం ఇంతవరకు ఇవ్వడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఇంత పెద్ద మొత్తంలో చిక్కీలు సరఫరా చేసేందుకు ఇంత వరకు ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రాకపోవడమే. బీఎంసీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం అనివార్యమే అయినా, చిక్కీ, సుగంధ పాలు కచ్చితంగా ఇవ్వాలనే నియమాలు ఏమీ లేవని బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని స్పష్టం చేశారు. ఆయన మాటలను బట్టి చూస్తే ఇక నుంచి విద్యార్థులకు చిక్కీలు, బెల్లం దూరమయినట్టేనని చెబుతున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం కింద సుగంధ పాలు పంపిణీ చేసే పథకాన్ని బీఎంసీ రెండేళ్ల కిందట మొదలుపెట్టింది. అవి అజీర్తి చేయడంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇలా పలుమార్లు జరగడంతో చివరకు సుగంధ పాల పథకాన్ని నిలిపివేశారు. వీటిస్థానంలో పండ్లు లేదా చిక్కీ పంపిణీచేయాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకుంది. పండ్లు త్వరలో పాడయ్యే అవకాశాలుంటాయి కాబట్టి చిక్కీ పంపిణీ తెర మీదకు తెచ్చింది. బీఎంసీ పాఠశాలల్లో సుమారు 4.50 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతీరోజు 16 మెట్రిక్ టన్నుల చిక్కీలు అవసరముంటాయి. ఇంత భారీ పరిమాణంలో సరఫరా చేసే టెండరును ఏ ఒక్క కంపెనీ కూడా స్వీకరించలేదు. రెండుసార్లు ఆహ్వానించినా టెండర్లకు ఏ ఒక్క కంపెనీ కూడా స్పందించలేదు. భారీగా చిక్కీలు తయారు చేసే బాధ్యతలు ఒకే కంపెనీకి అప్పగించకుండా నగరం, పశ్చిమ, తూర్పు శివారు ఇలా ప్రాంతాలుగా విభజించి మూడు వేర్వేరు సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించాలని విద్యాశాఖ సమితి అధ్యక్షుడు మనోజ్ కొటక్ సూచించారు. ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేశాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి పాఠశాలలు పనిచేసేది కేవలం మూడు నెలలు మాత్రమే. టెండర్లను ఆహ్వానించడం, ఆ తర్వాత బాధ్యతలు అప్పగించే ప్రక్రియ పూర్తిచేయాలంటే కొంత సమయం తప్పనిసరి. ఆపాటికి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. కాబట్టి ఈ ఏడాది విద్యార్థులు చిక్కీ, బెల్లానికి దూరమయినట్టేనని బీఎంసీ వర్గాలు తెలిపాయి.