హీరో, హీరోయిన్లకు కార్పొరేషన్ నోటీసులు
దేశంలో డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతుండటం, రాజధాని ఢిల్లీలో కూడా పలువురు దీనిబారిన పడి మరణించడంతో మునిసిపల్ కార్పొరేషన్లు అప్రమత్తం అయ్యాయి. నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ, అపరిశుభ్రంగా ఉన్న ఇళ్లకు నోటీసులు ఇస్తున్నాయి. తాజాగా ముంబై మహానగరంలో ఇలా పలు ప్రాంతాలను తనిఖీ చేసిన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు.. ప్రముఖ నటీ నటులు జూహీ చావ్లా, అనిల్ కపూర్, జితేంద్రలకు నోటీసులు ఇచ్చారు.
నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో దోమలు పెరిగేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలా లేకుండా చూసుకోవాలని ఇప్పటికే కార్పొరేషన్లు ప్రచారం చేస్తున్నాయి. అయినా తమ బంగ్లా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లే వీళ్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.