
ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కొత్త ఏడాదిలో కొత్త బంధంలోకి పలువురు సినీతారలు అడుగుపెడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. బాలీవుడ్ గేయ రచయిత, సింగర్ అనుప్ జైన్ ఓ ఇంటివాడయ్యారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబతున్నారు.
ప్రముఖ సింగర్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో నూతన వధూవరులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న 2025న ఢిల్లీలో జరిగింది. కాగా.. అనువ్ జైన్ తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలైన హృది నారంగ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అనువ్ తన భార్య పేరును మాత్రం ఫోటోల్లో వెల్లడించలేదు. అయితే ఓ అభిమాని మాత్రం ఆమె పేరును కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేశాడు. ఇక నుంచి అనుప్ జైన్ వివాహం చేసుకున్నందున బ్రేకప్ సాంగ్స్ పాడటం ఆపేస్తాడని కొందరు నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేశారు.
కాగా.. సెప్టెంబర్ 2022లో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనువ్ జైన్.. తాను రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అనువ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి చాలా దూరంగా ఉంటరు. బాలీవుడ్ పలు చిత్రాలు పాటలు ఆలపించిన అనువ్.. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా బారిషేన్, గుల్, అలాగ్ ఆస్మాన్ వంటి పాటలు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment