బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరికి యత్నించిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 30 ఏళ్ల బంగ్లాదేశీయునిగా(Bangladesh) పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్. భారత్ వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు.
అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు.
తాను ఆటోలో వెళ్తండగా ఓ మహిళ ఆగండి అంటూ గట్టిగా అరిచిందని.. దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చానని తెలిపాడు. అక్కడి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.. అప్పుడు సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలవుతోందని అతను వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో.. బాంద్రా వెస్ట్ నుంచి టర్నర్ రోడ్, హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్‌కు చేరుకున్నాం. వారివెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు.. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి (సైఫ్) కూర్చున్నాడు.. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయాను.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడమే లక్ష్యంగా ఆటోను నడిపినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment