హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన బీఎంసీ | Post ban, HC directs BMC & police to take action against illegal slaughter | Sakshi
Sakshi News home page

హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన బీఎంసీ

Published Thu, Mar 5 2015 2:05 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM

Post ban, HC directs BMC & police to take action against illegal slaughter

ముంబై: యాంటిబయాటిక్ డ్రగ్స్ స్కాంకు సంబంధించి బాంబే హైకోర్టులోృబహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అఫిడవిట్ దాఖలు చేసింది. గతేడాది ప్రభుత్వాస్పత్రులలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు ఇచ్చిన యాంటిబయాటిక్స్ వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ పిల్‌కు స్పందనగానే బీఎంసీ అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిపుణులతో కూడినృబందం నవీముంబై, హిమాచల్‌ప్రదేశ్ లోని ఔషధ కంపెనీలను తనిఖీ చేసిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ బ్ల్యూహెచ్‌ఓ) నిబంధనల ప్రకారమే ఆ కంపెనీలు ముందులు తయారీ చేస్తున్నాయని బీఎంసీ కోర్టుకు తెలిపింది.

‘2014 ఆగస్టు 18న బాబా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు కాఫ్ట్రియాక్సోన్, నెఫొటాక్సిమ్ సూదులు వేయడం వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. 45 రోగులకు ఇన్జక్షన్స్ వేయగా 28 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సైరా షేక్ అనే మహిళను కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ అస్పత్రికి(కేఈఎం), సియోన్ ఆస్పత్రికి తర లించారు. 24 గంటల తరువాత ఆమె మరణించింది. ఆహార, ఔషధ శాఖ అధికారులు కేఈఎం అస్పత్రిలో ఆమె రికార్డులను, ఏడు శాంపుల్స్‌ను సీజ్ చేశారు’ అని కోర్టులో పిల్ దాఖలైంది. ‘2014 అక్టోబర్ 18-19న నిపుణులతో కూడినృబందం నవీముంబై, హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ ఔషధ ఫ్యాక్టరీలను తనిఖీ చేసింది. కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు పాటించలేదని తనిఖీల్లో తేలింది.
 
అయితే హెచ్చరిక లేఖలు పంపడంతో వారు నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారు’ అని అఫిడవిట్‌లో బీఎంసీ పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రలోని కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలపై ఎఫ్‌డీఏకు సమాచారం అందింది. ఎఫ్‌డీఏ కూడా వారిపై ఓ కన్నేసి ఉంచింది’ అని కోర్టుకు తెలిపింది. డ్రగ్ రియాక్షన్స్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడిందని బీఎంసీపై ఆరోపణలు రావడంతో ఈ విషయంపై  సీఐడీ విచారణ కూడా జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement