సాక్షి, ముంబై : 14 మంది ప్రాణాలు బలితీసుకున్న ఘోర అగ్ని ప్రమాదం తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో కదలిక వచ్చింది. అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడే కూల్చేయటం ప్రారంభించింది.
శనివారం ఉదయం లోవర్ పరెల్‌లోని రఘువంశీ మిల్ కాంపౌండ్‌లోని కట్టడాలను సిబ్బంది కూల్చేస్తున్నారు. కమలా మిల్స్ కాంపౌండ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఈ డ్రైవ్ కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ కట్టడాన్ని వదిలే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. 11 మంది మహిళలతోసహా మొత్తం 14 మంది ప్రాణాలు బలితీసుకున్న కమలా మిల్స్ కాంపౌండ్ ఘటన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం. బీఎంసీపై తీవ్ర విమర్శలు వినిపించాయి.
దీంతో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఐదుగురు బీఎంసీ అధికారులపై వేటు వేశారు. అంతేకాదు పబ్ యజమానితోపాటు వారిపైనా కేసు నమోదైనట్లు ప్రకటించారు. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్న అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కమలా మిల్స్ కాంపౌండ్ యాజమాని మరో చోట కూడా ఇదే రీతిలో భవనం నిర్మించినట్లు తేలింది. దక్షిణ ముంబై జావేరీ బజార్‌లో ధన్‌జీ వీధిలోని 67వ నంబర్ భవనం కూడా అక్రమ నిర్మాణం అని ఓ జాతీయ మీడియా సంస్థ పరిశోధనలో వెల్లడైంది. దీంతో ఆ భవనాన్ని కూడా కూల్చేందుకు బీఎంసీ రెడీ అయిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment