demolition drive
-
సీఎం యోగి ‘ఆపరేషన్ బుల్డోజర్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయంటూ పరోక్షంగా సీఎం యోగి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. యూపీలో బుల్దోజర్ చర్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకూ ఎలాంటి కూల్చివేతలకు ఉపక్రమించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, వాటిని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. ‘‘వారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని అతిక్రమించి రిస్క్ చేయాలనుకుంటున్నారా?’’అని ఘాటుగా స్పందించింది.ఉత్తరప్రదేశ్ బహ్రైచ్‌లో ‘ఆపరేషన్ బుల్డోజర్’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం(అక్టోబర్22న) విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా బహ్రైచ్ బాధితుల తరుఫున సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదించారు. స్థానిక అధికారులు అక్టోబర్ 13న బహ్రైచ్‌లో ఆపరేషన్ బుల్డోజర్పై నోటీసులు జారీ చేశారు. అనంతరం జరిగిన బుల్డోజర్ చర్యల కారణంగా మత ఘర్షణలు జరిగాయని, ఓ వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ విన్నవించారు.అనంతరం,జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ చర్యను పరోక్షంగా హెచ్చరించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించాలనుకుంటే అది ప్రభుత్వ నిర్ణయం.అయితే, కూల్చివేతలను ఎదుర్కొంటున్న నిర్మాణాలు చట్ట విరుద్ధమైతే, తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది.బహ్రైచ్‌లో ప్రభుత్వ బుల్డోజర్ చర్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టనుంది. విచారణ నేపథ్యంలో ఎలాంటి బుల్డోజర్ చర్యలరకు ఉపక్రమించొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి ఆ విభాగం పని తీరుపై స్పష్టత ఇచ్చారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదన్న ఆయన.. ప్రజలతో పాటు సామాజిక మాధ్యమాలు కూడా వాస్తవాలను తెలుసుకోవాలని కోరుతున్నారు.‘‘మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు. దీనిని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది’’ అని ఎక్స్ వేదిక ద్వారా తెలియజేశారు. అలాగే..HYDRAA has nothing to do with surveys on either side of the Musi River.HYDRAA is not evacuating the residents there.HYDRAA is not undertaking any demolitions there.No markings have been made on the houses in the Musi catchment area by HYDRAA authorities.The Musi…— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024‘‘హైడ్రా అంటే కూల్చివేతలే కాదు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదు. అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చదు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావు. ప్రజలు, సామాజిక మాధ్యమాలు ఈ విషయాన్ని గుర్తించాలి.HYDRAA is not just about demolitions.HYDRAA's jurisdiction extends only up to the Outer Ring Road.Not only in the city, but across the state, and even in other states, demolitions are being attributed to HYDRAA on social media, creating unnecessary fear among people.HYDRAA…— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024.. హైడ్రా ప్రధాన విధి ప్రకృతి వనరుల పరిరక్షణ. చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం’’ అని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. చేశారు.సంబంధిత వార్త: ఎవరిని మెప్పించడం కోసం ఈ దూకుడు?.. తెలంగాణ హైకోర్టు సీరియస్ -
హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్ విధ్వంస ప్రక్రియ
చండీగఢ్: నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. హర్యానాలో మతపరమైన అల్లర్లకు కారణమైన వారికి సంబంధించిన ఇళ్లను బుల్డోజర్తో కూలదోసేందుకు ఉపక్రమించింది హర్యానా పోలీసు శాఖ. ఇప్పటికే మూడు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆదివారం ఈ కార్యక్రమం నాలుగోరోజుకి చేరుకుంది. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. ఇందులో భాగంగా అల్లర్లకు ప్రధాన కారణమైన సహారా హోటల్‌ను కూడా కూల్చివేశారు అధికారులు. జులై 31న విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపుపై కొంతమంది సహారా హోటల్ పైభాగం నుండి రాళ్లు రువ్వడంతో ఈ వివాదం పురుడు పోసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో దగ్గర్లోని దేవాలయంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. అదేరోజు రాత్రి ఆ ప్రాంతంలోని మసీదు దగ్ధం కాగా అక్కడి నుండి గురుగ్రామ్ వరకు వందల కొద్దీ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అల్లర్లలో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారితో సహా ఆరుగురు మరణించగా వందల సంఖ్యలో సామన్యులు గాయపడ్డారు. అల్లర్లకు పాల్పడిన వారిలో చాలామంది అరెస్టులకు భయపడి వేరే ప్రాంతాలకు పారిపోయారు. దీంతో పోలీసులు నిందితులకు సంబంధించిన ఆస్తులను లక్ష్యం చేసుకుని అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. #WATCH | Haryana | A hotel-cum-restaurant being demolished in Nuh. District administration says that it was built illegally and hooligans had pelted stones from here during the recent violence. pic.twitter.com/rVhJG4ruTm — ANI (@ANI) August 6, 2023 ఇది కూడా చదవండి: అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్ -
Supreme Court: వాళ్లంతా మనుషులు.. రాత్రికి రాత్రే ఖాళీ చేయించటమేంటి?
న్యూఢిల్లీ: ఉత్తరఖాండ్‌లోని హల్ద్వానీలో రైల్వే భూమిలో నిర్మించిన 4వేల ఇళ్లు, స్కూళ్లు, ప్రార్థనా స్థలాల కూల్చివేతకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. వేలాది మందిని రాత్రికి రాత్రే నిరాశ్రయులను చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ కూల్చివేతలతో ప్రభావితమయ్యే ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం ఆలోచించాలని అభిప్రాయపడింది. కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘వారు ఉంటున్న ప్రాంతంలో రైల్వేకు చెందిన భూమి, ప్రభుత్వానికి చెందిన భూమిపై ఎంత అనేది స్పష్టత రావాల్సి ఉంది. 50వేల మందిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించలేరు. ఇక్కడ మానవతా కోణం దాగి ఉంది. వారంతా మనుషులు. ఏదో ఒకటి జరగాలి. వారికి ఏదో విధంగా న్యాయం అందాలి.’అని పేర్కొంది ధర్మాసనం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, రైల్వే శాఖలకు నోటీసులు జారీ చేసింది. నిరాశ్రయులవుతున్న వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. హల్ద్వానీలోని 29 ఎకరాల భూమిలో ఆక్రమణలను కూల్చివేయాలని డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. జనవరి 9లోగా రైల్వే స్థలంలో ఉన్న బంభుల్‌పురా, గఫూర్ బస్తీ, ధోలక్ బస్తీ, ఇందిరా నగర్ ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. తొలగింపులను ఆపాలని నివాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. క్యాండిల్ మార్చ్‌లు, ధర్నాలు చేశారు. ఇదీ చదవండి: అంజలి సింగ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా! -
ఇప్పటం అక్రమ నిర్మాణాల తొలగింపు కేసు: పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి: ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చినా తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వాస్తవాలు తొక్కిపెట్టి స్టే ఉత్తర్వులు పొందినందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ పిటిషనర్లకు చురకలు అంటించింది. కాగా, ఇప్పటం రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు(మంగళవారం) హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చారని కోర్టు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాస్తవాలు తొక్కిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. -
అలాంటి మదర్సాలను కూల్చేయడం పక్కా: అస్సాం సీఎం వార్నింగ్
గౌహతి: అస్సాంలో మదరసాల కూల్చివేత వ్యవహారం ఇటు రాజకీయంగా, అటు మతపరంగా పెను దుమారం రేపుతోంది. అయినా సరే ‘తగ్గేదేలే’ అంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నెలవైన ఏ ఒక్క మదరసాను కూల్చేయకుండా వదిలే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారాయన. మదరసాలను కూల్చేయాలన్నది మా అభిమతం, ఉద్దేశం కాదు. జిహాదీ శక్తులు వాటిని ఉపయోగిస్తున్నాయా? లేదా? అని పరిశీలించడమే మా పని. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాటిని ఉపయోగిస్తున్నారని, సంబంధాలు ఉన్నాయని తేలితే చాలూ.. వాటిని కూల్చివేసి తీరతాం. ఈ విషయంలో బుల్డోజర్లు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అని ఆయన గురువారం మరోసారి సీఎం హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అనుమానిత, ఉగ్రసంస్థలతో సంబంధాలున్న మదర్సాలపై అస్సాం సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేక డ్రైవ్‌లతో వాటిని కూల్చేస్తోంది. తాజాగా బొంగైగావ్ జిల్లా కబితరీ గ్రామంలోని మార్క్‌జుల్ మా-ఆరిఫ్ క్వారియానా మదర్సాను బుధవారం కూల్చివేసింది. అల్ ఖైదాతో సంబంధాలున్న కారణంగానే ఈ కూల్చివేత జరిగినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కట్టినందుకే కూల్చినట్లు.. ముందస్తు నోటీసుల తర్వాతే కూల్చివేసినట్లు ప్రకటించారు. 🚨 3rd Madrassa demolished by @himantabiswa govt in Assam for having alleged links with Al Qaeda Video courtesy - ANI pic.twitter.com/vt8x9se3sQ — Kreately.in (@KreatelyMedia) August 31, 2022 ఇక ఈ వారంలో ఇది రెండో మదర్సా కూల్చివేత. నెల వ్యవధిలో మూడో కూల్చివేత. అంతకు ముందు బార్పేటలో ఇద్దరు బంగ్లాదేశీ ఉగ్రవాదులకు నాలుగేళ్లుగా ఆశ్రయం ఇచ్చారని సోమవారం ఓ మదర్సాను కూల్చేశారు. ఢక్లియాపరా ప్రాంతంలోని ఉన్నషేఖుల్ హింద్ మహ్మదుల్ హసన్ జామియుల్ హుదా అనే మదర్సాను బుల్డోజర్తో నేలమట్టం చేశారు. అంతకు ముందు మదర్సాలో తనిఖీలు చేపట్టగా.. నిషేధిత రాడికల్ గ్రూపులకు సంబంధించిన పలు పత్రాలు, ప్రచార ప్రతులు దొరికాయి. ఈ నేపథ్యంలో కట్టడానికి అనుమతులు లేవంటూ కూల్చేశారు. అలాగే.. అల్ ఖైదాతో సంబంధం ఉన్న ఇమామ్‌లు. మదర్సా ఉపాధ్యాయులతో సహా 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మదర్సా కూల్చివేతకు ముందు.. అందులోని నుంచి విద్యార్థులను ఖాళీ చేయించి.. ఇతర విద్యాసంస్థలకు పంపించారు. అల్-ఖైదా, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్ బంగ్లా టీమ్ (ABT) సభ్యులు మదర్సాలలో తలదాచుకుంటున్న ఘటనలు ఇప్పుడు పెరిగిపోతున్నాయ్. జిహాదీ కార్యకలాపాలకు అస్సాం హాట్‌బెడ్‌గా మారిందంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలే చేశారు సీఎం హిమంత బిస్వా శర్మ. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటిదాకా 40 మంది బంగ్లాదేశీ ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ముస్లిం మతపెద్దలు, మదర్సాల నిర్వాహకులు సీఎం హిమంతను ‘బుల్డోజర్ రాజా’గా అభివర్ణిస్తూ.. చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆరెస్సెస్‌కు సపోర్టుగా దీదీ కామెంట్లు -
యూపీలో బుల్డోజర్ల చర్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. కట్టడాల కూల్చివేతలకు ముందు నిర్ణీత విధానాన్ని అనుసరించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతా చట్టం ప్రకారం జరగాలని పేర్కొంది. బుల్డోజర్ల చర్యపై మూడు రోజుల్లో అఫిడవిట్‌ను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా నూపుర్ శర్మవ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన హింసాకాండ అల్లర్ల కేసుల్లో నిందితుల ఇళ్ళను కూల్చేయడాన్ని ఆపాలంటూ జమియత్ ఉలమా-ఇ-హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో హింసాత్మక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను ఇకపై కూల్చివేయకుండా ఉండేలా ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఓ మత వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని యోగీ సర్కార్ వ్యవహరిస్తున్నట్టు పిటిషనర్ ఆరోపణలు చేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు ప్రారంభించారని ఆరోపించారు. ఏ మత వర్గాన్ని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని యోగి ఆదిత్యనాథ్ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది. కూల్చివేత సమయంలో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. అలాగే బుల్డోజర్ల చర్యకు ముందు నోటీసులు అందించలేదనే ఆరోపణను కొట్టిపారేస్తూ.. ప్రయాగ్ రాజ్, కాన్పూర్‌లో కూల్చివేతలకు ముందు నిబంధనల మేరకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పింది. ఈ మేరకు యూపీ సర్కారు తరఫున అడ్వొకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వానికి తన అభ్యంతరాలను దాఖలు చేయడానికి సమయం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అదే సమయంలో పిటిషనర్లకు భద్రత కల్పించాల్సిన భాద్యత తమపై ఉందని, వారు కూడా సమాజంలో భాగమేనని తెలిపింది. చట్టం ప్రకారం మాత్రమే కూల్చివేతలు జరగాలని, ప్రతికారాత్మకంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. చదవండి: చిన్న వయసుసులోనే గుండెపోటు మరణాలు.. ఎందుకు? -
‘షాహీన్ బాగ్’ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: షాహీన్ బాగ్ కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన అత్యవసర పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కూల్చివేత అంశంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవడం మేలని పిటిషనర్లకు సూచించింది. ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ అధికారులు షాహీన్ బాగ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత కోసం బుల్డోజర్లతో చేరుకున్నారు. పెద్ద ఎత్తున్న చేరుకున్న స్థానికులు అధికారుల్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు మహిళలు బుల్డోజర్కు అడ్డుగా వెళ్లడంతో.. అధికారులు కూల్చివేతలకు పాల్పడకుండానే వెనుదిగారని సమాచారం. ఇక ఈ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ సీపీఎం, సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. అయితే.. పిటిషన్‌ను బాధితులు కాకుండా.. ఒక రాజకీయ పార్టీ వేయడమేంటని? సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయాలకు అత్యున్నత న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దని తీవ్రంగా మందలించింది. ఆపై పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. గతంలో జహంగీర్‌పురి కూల్చివేతల ఘటన సమయంలోనూ ఇదే తరహాలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. తక్షణమే స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కూల్చివేతపై స్టే విధించిన సంగతి తెలిసిందే. షాహీన్ బాగ్.. సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక నిరసనలకు వేదికగా నిలిచింది. అయితే.. కరోనా టైంలో ఆ వేదికను ఖాళీ చేయించారు పోలీసులు. చదవండి: షాహీన్ బాగ్‌లో బుల్డోజర్లు.. స్థానికుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత -
షాహీన్ బాగ్‌లో బుల్డోజర్లు.. స్థానికుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మళ్లీ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా భారీగా ఆందోళనలు నిర్వహించి వార్తల్లో నిలిచిన షాహీన్ బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం బుల్డోజర్లు, జేసీబీలను అధికారులు షాహీన్బాగ్కు తరలించారు. అయితే ఈ కూల్చివేత డ్రైవ్‌ను అడ్డుకొని స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో షాహిన్ బాగ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక నివాసితులతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకున్నారు. బుల్డోజర్లను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆందోళన కారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి వెనక్కి పంపారు. చదవండి: ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్ #WATCH | Delhi: AAP MLA Amanatullah Khan join the protest at Shaheen Bagh amid the anti-encroachment drive here. pic.twitter.com/4MJVGoku39 — ANI (@ANI) May 9, 2022 ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను ఇప్పటికే తొలగించామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగాశాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే బుల్డోజర్ల చర్య తీసుకున్నారని బీజేపీపై మండిపడ్డారు. కాగా కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జహంగిర్‌పురిలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. Delhi | Locals sit on roads and stop bulldozers that have been brought for the anti-encroachment drive in the Shaheen Bagh area. pic.twitter.com/EQJOWBzAxS — ANI (@ANI) May 9, 2022 -
‘చంద్రబాబు ఖాళీ చేయాల్సిందే’
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూమిని లాక్కుని ప్రజావేదిక నిర్మించిందని, చంద్రబాబు అండతో కరకట్టపై అక్రమ కట్టడాలు చేపట్టారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చట్టానికి తూట్లు పొడిచారని విమర్శించారు. అక్రమ కట్టడాలతో నదీ గర్భం కలుషితమవుతోందని, కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలపై ముందునుంచి న్యాయపోరాటం చేస్తున్నామని, కరకట్టపై 60పైగా అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా అందాయన్నారు. కేసు కోర్టు ముందుకు రాకుండా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని ఆరోపించారు. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేని, ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా చంద్రబాబు ఖాళీ చేయడం మంచిదన్నారు. మిగిలిన వాళ్లు కూడా తమకు తాముగా ఖాళీ చేయాలని సూచించారు. ప్రజా ధనంతో హైదరాబాద్‌లోనూ ఇళ్లు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. (చదవండి: ప్రజావేదిక కూల్చివేత) -
తీవ్ర విమర్శలు.. దూకుడు చూపిస్తున్న బీఎంసీ
సాక్షి, ముంబై : 14 మంది ప్రాణాలు బలితీసుకున్న ఘోర అగ్ని ప్రమాదం తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో కదలిక వచ్చింది. అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడే కూల్చేయటం ప్రారంభించింది. శనివారం ఉదయం లోవర్ పరెల్‌లోని రఘువంశీ మిల్ కాంపౌండ్‌లోని కట్టడాలను సిబ్బంది కూల్చేస్తున్నారు. కమలా మిల్స్ కాంపౌండ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఈ డ్రైవ్ కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ కట్టడాన్ని వదిలే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. 11 మంది మహిళలతోసహా మొత్తం 14 మంది ప్రాణాలు బలితీసుకున్న కమలా మిల్స్ కాంపౌండ్ ఘటన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం. బీఎంసీపై తీవ్ర విమర్శలు వినిపించాయి. దీంతో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఐదుగురు బీఎంసీ అధికారులపై వేటు వేశారు. అంతేకాదు పబ్ యజమానితోపాటు వారిపైనా కేసు నమోదైనట్లు ప్రకటించారు. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్న అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కమలా మిల్స్ కాంపౌండ్ యాజమాని మరో చోట కూడా ఇదే రీతిలో భవనం నిర్మించినట్లు తేలింది. దక్షిణ ముంబై జావేరీ బజార్లో ధన్జీ వీధిలోని 67వ నంబర్ భవనం కూడా అక్రమ నిర్మాణం అని ఓ జాతీయ మీడియా సంస్థ పరిశోధనలో వెల్లడైంది. దీంతో ఆ భవనాన్ని కూడా కూల్చేందుకు బీఎంసీ రెడీ అయిపోయింది. బతుకులు బుగ్గిపాలు -
చెప్పేదొకటి.. చేసేదొకటా..?
మార్కింగ్ ప్రకారం ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పి మాట మారుస్తారా కమిషనర్‌పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం జేసీబీకి అడ్డుపడి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నెల్లూరు సిటీ / మినీబైపాస్: పంటకాలువలపై ఆక్రమణల తొలగింపులో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వచ్ఛందంగా ఆక్రమణల తొలగింపునకు పీటర్స్ కాలువను ఆనుకొని ఉన్న నీలగిరి సంఘ వాసులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో 13 ఇళ్ల ఆక్రమణలను తొలగించేందుకు బుధవారం ఉదయం టౌన్‌ప్లానింగ్ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేశారు. జేసీబీ సాయంతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని స్థానికులకు అండగా ఉంటానని, హౌస్ ఫర్ ఆల్లో ఇళ్లు అందేలా చూస్తానని, అప్పటి వరకు బాడుగలు అందేలా అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే ఆక్రమణల తొలగింపునకు సంబంధించి అధికారులు ఎమ్మెల్యేకు ఉదయం ఓ ప్లాన్ చూపారు. సాయంత్రానికి అధికారులు మరో ప్లాన్‌ను తీసుకొని ఆక్రమణల తొలగింపును చేపట్టారు. 13 ఇళ్ల తొలగింపులో ఓ ఇంటికి సంబంధించిన బాత్రూమ్ను తొలగిస్తామని ఉదయం చెప్పిన అధికారులు సాయంత్రానికి సదరు ఇంటి బాత్రూమ్తో పాటు ఇంటిని కూడా తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో స్థానికులు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో కోటంరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొని కమిషనర్ వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. ఉదయం తనకు చూపించిన ప్లాన్ ఏమిటని.. ఇప్పుడు చేస్తోందని ఏమిటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీకి ఎమ్మెల్యే అడ్డుపడి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ ముత్యాలరాజుకు ఫోన్ చేసి అధికారులు వ్యవహరించిన తీరును తెలిపారు. స్థానికులకు అండగా నిలవడంతో ఆక్రమణల తొలగింపును నిలిపేశారు. మహిళకు గాయాలు నీలగిరి సంఘంలో యాకసిరి శ్రీనివాసులు, కీర్తి కొన్నేళ్లుగా పీటర్స్ కాలువ పక్కన ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఆక్రమణల తొలగింపులో తన ఇళ్లు ఎక్కడ కూలిపోతుందోననే ఆందోళనతో కీర్తి మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడటంతో ఎడమ చేయి విరిగింది. దీంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్లాన్‌ను పునఃపరిశీలిస్తాం నీలగిరి సంఘంలో పీటర్స్ కాలువపై ఆక్రమణల ప్లాన్‌ను పునఃపరిశీలిస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసనతో మేయర్ అక్కడికి చేరుకొని మాట్లాడారు. ప్లాన్‌ను మార్చాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్లాన్ ప్రకారం ఆక్రమణలను తొలగించి, బాధితులకు ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు ఇళ్ల ఏర్పాటు, అప్పటి వరకు బాడుగ రూపంలో రూ.రెండు వేలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ అజీజ్, కమిషనర్లకు ఎమ్మెల్యే సూచించారు. దీనికి మేయర్ హామీ ఇచ్చారు. ఆక్రమణల తొలగింపును తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
ఆక్రమణల తొలగింపునకు మళ్లీ రంగం సిద్ధం
నేటి నుంచి ఆక్రమణల తొలగింపు కసరత్తు ప్రారంభించిన మున్సిపల్ అధికారులు భారీగా పోలీసులు మొహరించే అవకాశం నెల్లూరు, సిటీ: నగరంలోని పంట కాలువలపై ఆక్రమణలు తొలగించేందుకు నగర పాలక సంస్థ అధికారులు మళ్లీ రంగం సిద్ధం చేశారు. నగరంలోని రామిరెడ్డి కాలువ, గచ్చుకాలువ, సాహెబ్ కాలువలపై నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు.ఇప్పటికే కాలువలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, దుకాణాలకు నోటీసులు జారీ చేసి ఉన్నారు. గత నెల 8న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. అయితే ఒక్క రోజు మాత్రం భారీ భవనాలను పాక్షికంగా తొలగించి, పేద ఇళ్లు కూల్చివేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉమామహేశ్వర ఆలయం సమీపంలో నివసించే పేదల ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ అడ్డుకున్నారు. పునరావాసం చూపకపోవడంపై కోర్టును ఆశ్రయించగా ఆక్రమణల తొలగింపును నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆక్రమణల తొలగింపును నిలిపివేసిన మున్సిపల్ అధికారులు మళ్లీ తొలగింపునకు కసరత్తు ప్రారంభించారు. భారీ పోలీసు బందోబస్తు ఆక్రమణల తొలగింపునకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఆక్రమణలు తొలగించే ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో ఉమామహేశ్వరి ఆలయం వద్దే ఆక్రమణలు తొలగింపు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఏ ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు చేపడుతారనేది గోప్యంగా ఉంచుతున్నారు. -
ఆక్రమణల తొలగింపును న్యాయబద్ధంగా చేపట్టాలి
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు రూరల్ : నగరంలోని కాలువలపై ఆక్రమణల తొలగింపును న్యాయబద్ధంగా చేపట్టాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. స్థానిక మద్రాసు బస్టాండ్ సమీపంలో శనివారం చేపట్టిన ఆక్రమణ తొలగింపు చర్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. బాధితులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలపై ఆక్రమణలను తొలగించే ముందుగా నిర్వాసిత పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. కాలువల గట్లపై 50 ఏళ్లుగా ఉంటున్న పేదలకు కరెంటు మీటర్, కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. పన్నులు వసూలు చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించారన్నారు. నీటి పారుదలకు ఇబ్బంది లేకుండా కాలువగట్లపై ఉన్న వారిని తొలగించవద్దని సూచించారు. కాలువల్లో పూడికతీత చేపడితే వరద, ముంపు సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆదిశగా అధికారులు ఆలోచన చేయాలని కోరారు. బాధిత పేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది చంద్ర, పట్రంగి అజయ్, చెక్కసాయి సునీల్, తదితరులు ఉన్నారు. -
ఆక్రమణల తొలగింపు
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థకు చెందిన రెండు రిజర్వ్డ్ స్థలాలను స్టోన్‌హౌస్‌పేటలో వాణిజ్య వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి గదులను నిర్మించారు. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదు మేరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆక్రమణల తొలగింపును చేపట్టారు. ఆదిత్యనగర్‌లో ఎల్పీ నంబర్ 94 / 92 స్థలంలోని 96 అంకణలు కలిగిన రెండు పార్క్ స్థలాలను ఆక్రమించి ప్రహరీ, రెండు గదులను నిర్మించారు. ఈ క్రమంలో 16వ డివిజన్ అభివృద్ధి కమిటీ గతేడాది నుంచి స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం కూడా కబ్జా పర్వాన్ని కమిషనర్‌కు వివరించారు. ఈ క్రమంలో శుక్రవారం ఏసీపీ రంగరాజు ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసుల సాయంతో జేసీబీతో ఆక్రమణలను కూల్చేశారు. కానరాని కబ్జాదారులు కబ్జా చేసిన స్టోన్‌హౌస్‌పేటలోని వాణిజ్య వ్యాపారి, అధికార పార్టీ నేత ఆక్రమణల తొలగింపు సమయంలో కానరాలేదు. ఓ మాజీ ఎమ్మెల్యే సాయంతో కబ్జా చేశారు. ప్రస్తుతం కబ్జాను అడ్డుకుంటే తనకు చెడ్డ పేరొస్తుందనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి చేరుకోలేదని సమాచారం. టీపీఓ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎఫ్ డిపో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది
గుర్గావ్: భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) ఆయుధ డిపోకి సమీపంలో బుధవారం రాత్రి జిల్లా అధికార యంత్రాంగం అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు గురువారం తెలియజేశారు. ఈ డిపోకి సమీపంలోని ఓంవిహార్ ప్రాంతంలో దాదాపు 12కు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్నారు. వాస్తవానికి ఈ పరిసరాల్లో నిర్మాణాలు నిషిద్ధమని, అయితే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కొందరు నిర్మాణ పనులను చేపట్టారన్నారు. ఉపగ్రహ అధ్యయనంతో ఈ విషయం వెలుగుచూసిందన్నారు. ఇదిలాఉంచితే ఈ ప్రాంతంలో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలను స్థానికులు నిరసించారు. నివాసాలను ఖాళీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం తమకు తగినంత సమయమివ్వలేదని ఆరోపించారు. కాగా ఆక్రమణల కూల్చివేత కార్యక్రమంలో నగర పాలక సంస్థ (ఎంసీజీ)కి చెందిన నాలుగు వందల మంది సిబ్బంది పాల్గొన్నారు. 400 మంది పోలీసు సిబ్బంది వీరికి అండగా నిలిచారు. రాత్రి ఏడు గంటల సమయంలో ప్రారంభమైన కూల్చివేతల పర్వం గురువారం ఉదయం వరకూ కొనసాగింది.