హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు సమాచారం.
సంపత్ నగర్‌లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే క్రమంలో హైడ్రా సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment