Municipality
-
ఇవాళ మూడు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ ఎన్నిక
-
‘పచ్చ’ తాలిబన్లు.. కూటమి గూండాల విధ్వంసకాండ
Updates:మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలు.. మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యం⇒కాకినాడ జిల్లా: తునిలో మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలలో మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యానికి దిగారు. నిన్నటిలాగే ఇవాళ కూడా మున్సిపల్ కౌన్సిల్లోకి టీడీపీ రౌడీలు దౌర్జన్యంగా ప్రవేశించారు. మద్యం మత్తులో నిన్న మహిళ కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గుండాలు.. ఈ రోజు కూడా కౌన్సిల్ హల్ లోకి చొచ్చుకు వచ్చారు. కౌన్సిల్ హల్లో వెళ్లే అవకాశం లేకపోవడంతో మున్సిపల్ ఛైర్మన్ సుధాబాలు,కౌన్సిలర్లు బయటే బైఠాయించారు. యనమల డైరక్షన్లో ప్రేక్షక పాత్రకు పోలీసులు పరిమితమయ్యారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరావు పత్తాలేకుండా పోయారు. ⇒మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో కూటమి నేతలు అరాచక పర్వానికి తెరలేపారు. బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు పన్నుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు.⇒టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది.⇒కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు.⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు. -
శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు సమాచారం.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే క్రమంలో హైడ్రా సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. -
గుర్రం విజయలక్ష్మి అరెస్ట్..
దుండిగల్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక, వినియోగదారులను మోసం చేసి రూ.కోట్లు సంపాదించింది. పోలీసు కేసులు నమోదు కావడంతో దేశం విడిచి పారిపోయేందుకు యత్నించిన ఓ నిర్మాణ సంస్థ యజమానురాలిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేటలోని సర్వే నెంబర్ 170/3, 170/4, 170/5లోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత సదరు భూమి పలువురి చేతులు మారి చివరికి కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం 3.20 ఎకరాల్లో 65 విల్లాల నిర్మాణం కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత సదరు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న కత్వ చెరువుకు సంబంధించిన 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్‌ను ఆక్రమించి ఏకంగా 300కు పైగా విల్లాలను నిరి్మంచింది. దీనిపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని 11 అక్రమ విల్లాలను గత సెప్టెంబరులో అధికారులు కూల్చివేశారు. అంతేగాక ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తమకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని, రిజి్రస్టేషన్లు సైతం చేసుకుని బ్యాంకుల్లో రుణాల్లో తీసుకుని రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లను కొనుగోలు చేశామని, చివరికి తమ విల్లాలను కూల్చివేశారని, సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని బాధితులు దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. విజయలక్ష్మిపై ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా గురువారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
‘చెత్త’ పన్ను..చంద్రన్న ఘనతే
సాక్షి, అమరావతి: నిజం చెబితే తల వెయ్యి ముక్కలైపోతుందని చంద్రబాబుకు ముని శాపం ఉందంటారు! అందుకే ఆయన ఎప్పుడూ నిజం చెప్పరు. పైగా తాను చేసిన తప్పులను ఇతరులపై నెట్టేసి మంచిని మాత్రం తన ఖాతాలో వేసుకుంటారు. గత ప్రభుత్వం పురపాలక సంఘాల్లో చెత్త పన్ను విధించి ప్రజలను ఇబ్బంది పెట్టిందని డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీసిన సీఎం చంద్రబాబు అసలు విషయాన్ని దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు యూజర్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు ప్రారంభించిందే తానేననే విషయాన్ని కప్పిపుచ్చి మభ్యపెడుతున్నారు.⇒ 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమాజాన్ని సమూలంగా మార్చేస్తామని, వీధుల్లో చెత్త అనేది లేకుండా చేస్తానని గొప్పగా ప్రకటించారు. తీరా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి వీధుల్లో చెత్తను తీసుకెళ్లి నగరం నడి»ొడ్డున గుట్టలుగా వేశారు. దాంతో అవి కొండల్లా పెరిగిపోయి ప్రజలకు రోగాలను తెచ్చిపెట్టాయి. ఈ పని చేసినందుకు ప్రతి ఇంటి నుంచి చెత్త పన్ను వసూలును ఆయన ఆనాడే ప్రారంభించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ప్రజల నుంచి చార్జీల వసూలుకు ఆయా పాలక మండళ్లలో తీర్మానాలు చేయించారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే చెత్త సేకరణ చార్జీలు చెల్లించాలని నాడు చంద్రబాబే ప్రచారం చేశారు. 2016లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోను చెత్త సేకరణకు ఫీజు (చెత్త పన్ను) విధించి అమలు చేశారు. ⇒ గుంటూరులో దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లు, సూపర్ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి చెత్త తరలించేందుకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని నాటి టీడీపీ సర్కారు ఉత్తర్వుల మేరకు నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్‌లో తీర్మానించింది. విస్తీర్ణం, జనాభాను బట్టి గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. అదే ఏడాది మే నెలలో చెత్తను రోడ్లపై వేసినా, తగులబెట్టినా భారీగా జరిమానా విధిస్తూ నిర్ణయించారు. ఈమేరకు 2016 జూన్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.⇒ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో 2018 డిసెంబర్ నుంచి మున్సిపల్ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ రూల్స్–2016 ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్‌కు అనుబంధంగా ఘన వ్యర్థాల నిర్వహణను పటిష్టంగా అమలు చేసేందుకు యూజర్ చార్జీలు వసూలు చేయాలని చట్టం చేశారు. ప్రతి ఇంటికీ నెలకు రూ.50 చొప్పున, వాణిజ్య సముదాయాలైన సినిమాహాళ్లు, హోటళ్ల నుంచి రూ.5 వేలు, ఇతర సంస్థల నుంచి రూ.1,500 వసూలు చేశారు. ‘క్లాప్’తో మార్పు తెచ్చిన జగన్ ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు స్వచ్ఛ భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు 2021 అక్టోబర్ 2న వైఎస్ జగన్ ప్రభుత్వం ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని సుమారు 43 లక్షల గృహాల్లో ప్రతి ఇంటికీ రెండు చొప్పున 1.20 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేసింది.చెత్తను ఇంటివద్దే సేకరించి గార్బేజ్ స్టేషన్లకు తరలించేందుకు పీపీపీ విధానంలో 3,097 డీజిల్ ఆటో టిప్పర్లను, మరో 1,123 ఎలక్ట్రిక్ ఆటోలను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను శుద్ధి చేసేందుకు మున్సిపాలిటీల్లో 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను(జీటీఎస్) రూ.227.89 కోట్లతో నిర్మాణం చేపట్టింది. మురుగు శుద్ధికి ఎస్టీపీల నిర్మాణం, ఎప్పటి నుంచో పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త డంపింగ్ యార్డ్ల్లోని లెగస్సీని తరలించే ప్రక్రియను సైతం చేపట్టింది. ఏడాది కాలంలోనే సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి పట్టణాలు, నగరాలకు కొత్త రూపు తీసుకొచ్చింది. బాబు తప్పును సరిదిద్దిన జగన్⇒ టీడీపీ హయాంలో పన్ను విధించి మరీ వసూలు చేసిన చెత్తను జనావాసాల మధ్యే డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి పారేయడంతో 123 మున్సిపాలిటీల్లో దాదాపు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. దుర్వాసనతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించడంతో గత ప్రభుత్వ హయాంలో తరలింపునకు చర్యలు చేపట్టడంతో పాటు 243 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను(జీటీఎస్) ఏర్పాటు చేసింది. వివిధ రకాల చెత్తను వేరుచేసి ఎరువు, విద్యుత్ కోసం వినియోగించారు. గుంటూరు, విశాఖపట్నం వద్ద చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ⇒ జగన్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. గతంలో కొండల్లా పేరుకుపోయిన చెత్తలో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులను వివిధ రూపాల్లో కరిగించారు. పట్టణాల్లో మధ్యలో ఉన్న డంపింగ్ యార్డులను పూర్తిగా తొలగించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ తిరుపతి, విశాఖపట్నంతో పాటు పుంగనూరు, నెల్లూరు బెస్ట్ అవార్డులు అందుకున్నాయి. 2022లో కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో టాప్–10 నగరాల్లో ఆరు రాష్ట్రానికే దక్కాయి. 2023లోనూ రాష్ట్రంలోని పలు నగరాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన ఎన్జీటీ బృందం ఉత్తమ పారిశుధ్య విధానాలు, చెత్త నిర్వహణను అభినందించింది. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించని రాష్ట్రాలకు భారీస్థాయిలో జరిమానా విధించింది. -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈటల భేటీ
ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కరోనా సమయంలో పనిచేస్తూ దాదాపు 100 మందికి పైన పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకాలు చేపట్టాని కోరారు.కారుణ్య నియామకాలు ఐదు శాతం మించకూడదన్న నిబంధనను సడలించి , ఈ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం
హైదరాబాద్, సాక్షి: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని పలు గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణణం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఉత్తర్వులు అమలులోకి రావాలని పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు విలీనం అయ్యాయి. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో కుత్బుల్లాపూర్, తారామతిపేట పంచాయతీలుదమ్మాయిగూడ మున్సిపాలిటీల్లోకి కీసర, యాద్గిర్ పల్లి, అంకిరెడ్డిపల్లి ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి ఎదుతాబాద్, ఘనపూర్, మణిప్యాల్, అంకుశపూర్, ఔశాపూర్మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూరు, రాయలపూర్ గ్రామాలుపోచారం మున్సిపాలిటీలోకి కొర్రెముల, కాచనవానిసింగారం, చౌదరిగూడ, బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి దయరా, వెంకటాపూర్, ప్రతాప సింగారం తుంకుంట మున్సిపాలిటీలోకి బోంరాస్‌పేట, శామీర్‌పేట, బాబాగూడ -
పిఠాపురంలో కొత్త లొల్లి..
-
అనంతపురం నగరపాలక సంస్థలో సత్తా చాటిన YSRCP
-
లీడర్ల గుండెల్లో.. విలీన గుబులు
జీహెచ్ఎంసీ పరిధిలోకి తెల్లాపూర్ మున్సిపాలిటీ? ● కలవరపడుతున్న రాజకీయ నాయకులు ● పదవులు కోల్పోతామని ఆవేదన రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం స్థానిక నేతలు, ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. కౌన్సిలర్లు తమ పదవులు ఎక్కడ కోల్పోతామోనని గుబులు పడుతున్నారు. అలాగే అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి దూరమవుతామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.రామచంద్రాపురం మండలంలో తెల్లాపూర్ గ్రామపంచాయతీగా ఉండేది. ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ప్రకటించింది. 17 వార్డులను కూడా ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులందరూ కౌన్సిలర్లుగా పోటీ చేశారు. ఇదంతా జరిగి సుమారు ఐదేళ్లవుతోంది. ప్రజాప్రతినిధులకు మరో మూడు నాలుగు నెలల పదవీకాలం ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు కొందరు లీడర్లు సిద్ధమవుతున్నారు. అయితే తెల్లాపూర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారనే వార్త నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జీహెచ్ఎంసీ విలీనమైతే రాజకీయ పదవులు పొందలేమన్న భావనలో కార్యకర్తలున్నారు.10 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలుతెల్లాపూర్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని పదేళ్ల క్రితమే ప్రతిపాదించారు. నాటి కలెక్టర్ స్థాయి అధికారులు తెల్లాపూర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయొచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ఆ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అందుకు నిరాకరించారు. దాంతో కొంత కాలం తరువాత పంచాయతీ కాస్త మున్సిపాలిటీగా ఏర్పడింది.తెల్లాపూర్ మున్సిపాలిటీగా..రామచంద్రాపురం మండలంలోని ఐదు గ్రామాలను కలిపి తెల్లాపూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామపంచాయతీలను కలిపారు. అయినా గానీ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న తెల్లాపూర్‌ను సెమీ అర్బన్‌గా చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంటుంది. ఇక ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు.ఆశ.. నిరాశఐదేళ్లుగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ముందు చూపుతో వారి పార్టీల కోసం కష్టపడుతూ వస్తున్నారు. భవిష్యత్‌లో తాము కూడా కౌన్సిలర్లుగా పోటీ చేస్తామనే ధీమాలో ఉన్నారు. ప్రధానంగా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండటం కూడా ఇందుకు కారణం. తెల్లాపూర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం వార్తలు వెలువడటంతో వారు నిరాశకు లోనవుతున్నారు. తాము రాజకీయ పదవులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. నేరుగా కలిసి వారి సమస్యలను నివేదించేవారు. అవసరమైతే కౌన్సిలర్లను నిలదీసే అవకాశం ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీలో విలీనమైతే సమస్యలు చెప్పుకోవడం కష్టం అవుతుందనే అభిప్రాయం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
వేలు చూపించి అయ్యన్న భార్య బెదిరింపులు
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా సాగింది. వైఎస్సార్సీపీ సభ్యులపైకి టీడీపీ సభ్యులు దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సభ్యులపై అయ్యన్న సతీమణి పద్మావతి, కుమారుడు రాజేష్ బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల పొడియం వైపు వెళ్లి టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యం చేశారు. వేలు చూపిస్తూ.. అయ్యన్న సతీమణి పద్మావతి బెదిరించారు. వైఎస్సార్సీపీ సభ్యులపైకి కుమారుడు రాజేష్ దూసుకెళ్లాడు. దౌర్జన్యంగా కౌన్సిల్ సమావేశంలోకి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రవేశించారు. -
ప్రజలను వంచనజేసి
తాడిపత్రి, రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి నవరసాలు పండించారు. అవకాశం ఇస్తే అలా చేస్తా, ఇలా చేస్తా అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. బొటాబొటి ఆధిక్యతతో ఎలాగోలా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మాత్రం గాలికొదిలేశారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతూ ఉంటే, ఎక్కడ అధికార పార్టీకి పేరు వస్తుందనే అక్కసుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై చర్చించడానికి, పరిష్కార మార్గం చూపడానికి వేదికై న కౌన్సిల్ సమావేశాన్ని కూడా 6 నెలలుగా నిర్వహించకుండా అడ్డు పడుతున్నారు. కమిషనర్ సహకరించడం లేదంటూ ప్రజల చెవిలో పూలు పెట్టే యత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి.. తాను మాత్రం గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఒక్క మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి చేతకాని ఆయన.. నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తానంటూ కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మాటున పల్లెల్లో కక్షలు రాజేస్తున్నారు. రచ్చ చేయడమే పని.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డు తగులుతున్నారు. ‘నేను చేయను.. మీరు చేయొద్దు..’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగిన సమయంలో పట్టణంలో పేరుకుపోయిన చెత్తను ఎమ్మెల్యే తన సొంత నిధులతో తొలగించే ప్రయత్నం చేస్తే అడ్డుకుని నానా యాగీ చేశారు. వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా బోర్ల మరమ్మతులు చేయిస్తుంటే టీడీపీ శ్రేణులతో కలిసి అడ్డుకుని రచ్చ చేశారు. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యే ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అడ్డు తగలడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదంటూ మళ్లీ తనే ఎల్లో మీడియాతో కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆది నుంచి అంతే.. చైర్మన్‌గా ఎన్నికై నప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. గత టీడీపీ హయాంలో చేసిన అరాచకాన్ని కొనసాగించారు. మున్సిపాలిటీ ప్రతిష్టను బజారు కీడ్చారు. కొన్నాళ్ల పాటు చైర్మన్ చాంబర్ కోసం కౌన్సిలర్లతో కలిసి నానా రభస చేశారు. తనకు కేటాయించిన చాంబర్ కాదని కమిషనర్ కార్యాలయాన్ని కేటాయించాలని పట్టుబట్టారు. కొన్ని రోజుల పాటు కమిషనర్ చాంబర్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు చాంబర్ కేటాయించే విషయంపైనా రచ్చ చేశారు. తన మాట వినడం లేదంటూ గతంలో ఉద్యోగులపై రెచ్చిపోయారు. దీంతో కొందరు ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడానికి ప్రయత్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాక ఏ కమిషనర్ కూడా ఎక్కువ రోజులు పనిచేయలేదు. అసలు మున్సిపాలిటీ అభివృద్ధినే ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు. కౌన్సిల్ మీట్ జరుగుతున్న సమయంలో తాను చాంబర్లోనే ఉన్నా, వైస్ చైర్మన్లతో సమావేశాలను జరిపించారంటేనే ఆయనకు ప్రజలపై ఏ మాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను జేసీ సోదరులు పిచ్చోళ్లనుకుంటున్నారు మున్సిపాలిటీ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్‌రెడ్డి అనర్హుడు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. అలాంటి వ్యక్తి బస్సుయాత్రల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తుండడం హాస్యాస్పదం. నమ్మి ఓట్లేసిని ప్రజలను జేసీ సోదరులు పిచ్చివారు అనుకుంటున్నారు. ఇలాంటి వారికి జనమే గుణపాఠం చెప్పాలి. – పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే -
విద్యా శాఖలోకి ‘పురపాలక’ టీచర్లు
సాక్షి, అమరావతి: ఎంతోకాలంగా నలుగుతున్న పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు బదలాయింపు ఎట్టకేలకు పూర్తయింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖలో విలీనం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.7, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.8, జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నం.9, విజయవాడ నగరపాలక సంస్థ ఉపాద్యాయులకు జీవో నం.10 జారీ చేశారు. దీంతో పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యా శాఖకు అప్పగించినట్టయింది. గతంలో నగర, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీసు నిబంధనలు ఉండేవి. దాంతో వారు ఆ సంస్థ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే బదిలీ అయ్యేవారు. ఇకపై జిల్లా యూనిట్‌గా వారి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ ప్రక్రియను కూడా పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది. -
నల్గొండ మున్సిపాలిటీని కోల్పోయిన బీఆర్ ఎస్
-
రసవత్తరంగా నల్గొండ మున్సిపాలిటీ రాజకీయాలు
-
ఆస్తి ఆడపడుచులకు.. మరి నాకు, ముగ్గురు పిల్లలకు మిగిలేదేంటి?
హైదరాబాద్: మమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకునే భర్త అనారోగ్యంతో చనిపోయాడు... మాకు రావలసిన ఆస్తిని తన పిల్లలకు కాకుండా ఆడపడుచులకు ఇచ్చి అత్త అన్యాయం చేస్తుందని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఓ మహిళ మౌన దీక్షకు దిగింది. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెలితే... మణికొండ గ్రామ పంచాయతీకి వార్డు సభ్యునిగా పనిచేసిన ధన్‌రాజ్ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మరణించాడు. దాంతో ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుని భారం భార్య సుధారాణిపై పడింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ వారిని చదివిస్తుంది. తన భర్త సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు చెందనివ్వకుండా అత్త యాదమ్మ ఇటీవల ఆడపడుచులు సావిత్రి, రేణుకల పేరుపైకి మార్చింది. అది తెలిసి తనకు న్యాయం చేయాలని కాలనీ, గ్రామ పెద్దలకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోయింది.దీంతో పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలని శివాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మౌన దీక్షకు దిగింది. వారంలో న్యాయం చేస్తాం... ఆమె పరిస్థితిని తెలుసుకుని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్, వార్డు కౌన్సిలర్ యాలాల లావణ్య నరేష్, రాయదుర్గం పోలీసులు స్పందించి వారం రోజుల్లో చర్చించి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. దాంతో ఆమె ఆందోళనను విరమించింది. -
213 మందికి ఇద్దరు ఎమ్మెల్యేలు.. చిన్న తండాకు పెద్ద తంటాలు!
హన్మకొండ: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 71 ఇళ్లు, 213 మంది ఓటర్లు కలిగిన ఓ చిన్న తండాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐదవ వార్డు పరిధి లచ్చాతండా మధ్యలో సీసీ రోడ్డు ఉంటుంది. తండాలోకి వెళ్తుండగా కుడివైపున డోర్నకల్ మున్సిపాలిటీ ఐదవ వార్డు పరిధిలో 40 ఇళ్లు ఉండగా, 140 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. రోడ్డుకు ఎడమ వైపున లచ్చాతండా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, బర్లగూడెం పరిధిలోని 10వ వార్డులో ఉండగా ఇక్కడ 31 ఇళ్లు, 73 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి ఓటర్లంతా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. తండాలో ఒకే కుటుంబానికి చెందిన వారు విడిపోయి రోడ్డుకు ఇరు పక్కల ఇళ్లు నిర్మించుకోవడంతో తండ్రి కుటుంబం ఓ నియోజకవర్గంలో, కుమారుడి కుటుంబం మరో నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఈ తండాకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి డీఎస్ రెడ్యానాయక్, ఇల్లెందు నుంచి హరిప్రియ ప్రాతినిథ్యం వహించారు. ఎర్రమట్టితండా.. డోర్నకల్ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని ఎర్రమట్టి తండా, గార్ల మండలం రాజుతండా గ్రా మపంచాయతీలు కలిసి ఉన్నాయి. రోడ్డుకు ఓ వైపు ఎర్రమట్టితండా, మరో వైపు రాజుతండా ఉండగా రెండు తండాలను విడదీస్తూ మధ్యలో రోడ్డు ఉంది. అయితే తండాలు కలిసి ఉన్నా డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో ఉండడం గమనార్హం. -
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్‌ప్లాన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి పట్టణానికి ప్రతిపాదించిన మాస్టర్‌ప్లాన్‌ను వెంటనే రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కామారెడ్డి రైతు జేఏసీ నాయకులు శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతమున్న పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ పాలకమండలి తీర్మానించిందని, రైతులకు నష్టం జరగకుండా అండగా ఉంటామని చెప్పారు. మాస్టర్‌ప్లాన్ రద్దు కోసం జరిగిన ఆందోళనలలో రైతులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కేసుల గురించి కామారెడ్డి జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ చేసిన ప్రకటనపై కామారెడ్డి రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం..
సాక్షి, రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2200 డబుల్ బెడ్రూం ఇళ్లల్లోనూ స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇవ్వడంతో ఆందోళనకు దిగారు స్థానిక ప్రజలు. కాగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంకాల, తుక్కుగూడ, రావిరాల్, సర్దార్ నగర్ , ఇమామ్ గూడ గ్రామ ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇళ్లు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తమకు కాకుండా.. పాతబస్తీ మలక్‌పేట్, చార్మినార్, చాంద్రాయణ్‌గుట్ట , యాకత్‌పురకు చెందిన వారికి ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులందరూ కలిసికట్టుగా జేఏసీగా ఏర్పడి మున్సిపాలిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. జేఏసీ పిలుపు మేరకు ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల ప్రజలు భారీ నిరసన ర్యాలీ ప్రారంభించారు... -
కేరళ మున్సిపల్ మహిళా కార్మికులకు జాక్‌పాట్
మలప్పురం: లాటరీ టికెట్ కొనేందుకు నానా హైరానా పడిన ఈ మహిళలు ఎన్నడూ ఊహించని విధంగా జాక్‌పాట్ కొట్టేశారు. కేరళ లాటరీ విభాగం ప్రకటించిన వర్షాకాల ఫలితాల్లో వీరు కొనుగోలు చేసిన టికెట్ ఒకటీ రెండూ కాదు..ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకుంది. కేరళలోని పరప్పనంగడి మున్సిపల్ కొర్పొరేషన్లో ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్త నుంచి ‘హరిత కర్మ సేన’కు చెందిన 11 మంది మహిళా సభ్యులు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తుంటారు. వీరు తలా రూ.25 కంటే తక్కువగా పోగేయగా జమయిన రూ.250 పెట్టి ఇటీవల కేరళ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో హరిత కర్మ సేన కొనుగోలు చేసిన టికెట్ రూ.10 కోట్ల జాక్‌పాట్ వరించింది. దీంతో, వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత ఏడాది కూడా ఓనమ్ పండుగ సందర్భంగా తలాకొంత పోగేసి కొన్న టికెట్‌కు రూ.7,500 రాగా అందరం సమానంగా పంచుకున్నామని చెప్పారు. అదే ధైర్యంతో ఈసారి కొన్న టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్లు వస్తాయని ఊహించలేదన్నారు. ఈ డబ్బును అందరం సమంగా పంచుకుంటామని తెలిపారు. అప్పులు తీర్చుకుని, పిల్లల పెళ్లిళ్లు చేస్తామని, కుటుంబసభ్యులకు అవసరమైన వైద్యం చేయించుకుంటామని చెబుతున్నారు. వీరి నెలవారీ వేతనం రూ.7,500–రూ.14,000 వరకు ఉంది. -
ఆస్తిపన్ను గడువులోపు చెల్లించకుంటే భారమే
వికారాబాద్ అర్బన్: మున్సిపాలిటీల్లో గడువులోగా ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆలస్య రుసుం పేరుతో 2శాతం వడ్డీ వేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 30లోపు సగం ఆస్తి పన్ను చెల్లించని వారికి ఈ వడ్డీ భారం తప్పదు. నిబంధనల ప్రకారం మున్సిపాల్టీలో భవన యజమానులు ప్రతి ఏటా రెండుసార్లు (ఆరు నెలలకు ఒక సారి) ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్ధ సంవత్సరానికి చెందిన ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే యజమానులు ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలైన ఫిబ్రవరి, మార్చిలోనే ఎక్కువగా పన్ను చెల్లిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఏటా వడ్డీ చెల్లించక తప్పడంలేదు. ఈ ఏడాది తప్పకుండా అర్ధవార్షిక పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. యజమానులకు నోటీసులు ఆస్తి పన్నును ముందస్తుగా వసూళ్లు చేసేందుకు మున్సిపల్ అధికారులు సంబంధిత యజమానులకు డిమాండ్ నోటీసులు పంపిస్తున్నారు. మున్సిపల్ బిల్ కలెక్టర్లను ఇంటింటికి ఒకటి రెండు సార్లు పంపి అర్ధ సంవత్సరం పన్ను చెల్లించాలని లేకుంటే అస్సలు పన్నుపై 2శాతం వడ్డీ పడుతుందని చెప్పిస్తున్నారు. అయితే ఆస్తిపన్ను చెల్లింపునకు అర్ధ వార్షిక సంవత్సరం ఈ నెలతో ముగుస్తుంది. ఇప్పుడు చెల్లించకుంటే వచ్చేనెల నుంచి అదనంగా రెండు శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. యజమానులు వెంటనే మున్సిపల్ బిల్ కలెక్టర్లకు లేక ఆన్లైన్లో పన్ను చెల్లించుకోవడం మంచిదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఐదుశాతం మినహాయింపు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభం కాగా ఆస్తపన్ను చెల్లింపుపై పురపాలక శాఖ ఐదు శాతం రాయితీ అవకాశాన్ని కల్పించింది. అంటే ఈ ఏడాదికి సంబంధించిన పన్నును ఒకేసారి చెల్లిస్తే మొత్తం పన్నులో ఈ ఐదు శాతం రాయితీ వర్థిస్తుంది. దీంతో కొంత మంది యజమానులు ఆసక్తి చూపి పన్ను చెల్లించడంతో మున్సిపాల్టీలకు కొంత నిధులు సమకూరాయి. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించినవారిని మినహాయిస్తే మిగిలిన వారంతా గడువులోగా పన్ను చెల్లింపకపోతే వడ్డీ భారం భరించాల్సిందే. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఆస్తిపన్ను చెల్లిస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించడం కూడా భారమే. అందుకే అర్ధవార్షిక సంవత్సరంలో చెల్లిస్తే ఇంటి యజమానులకు భారం తగ్గుతుంది. – శరత్ చంద్ర, వికారాబాద్, మున్సిపల్ కమిషనర్ -
మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపై దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్..
ముంబయి: ముంబయిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన.. కందివాలి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. A manual scavenger was mowed to death by a vehiclein Kandivali, Mumbai. An FIR has been registered in this case at Kandivali police station under sections 304 (A), 336 and 279. Two people - driver and the contractor - have been arrested. pic.twitter.com/86pwBaW5AM — TIMES NOW (@TimesNow) June 26, 2023 ఈశాన్య రుతుపవనాలతో ముంబయిలో వర్షాలు కుండపోతగా కురిశాయి. దీంతో డ్రైనేజీల్లో వర్షపు నీరు పొంగి పారుతోంది. దీంతో చాలాచోట్ల డ్రైనేజీల్లో సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత తీసి కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో దిగి చెత్తను అందిస్తుండగా.. మరో వ్యక్తి దానిని దూరంగా పారబోస్తున్నాడు. ఇదే సమయంలో మ్యాన్‌హోల్‌లో ఉన్న వ్యక్తి కిందికి వంగాడు. అది గమనించని కారు డ్రైవర్.. కార్మికుని మీదుగానే వాహనాన్ని పోనిచ్చాడు. ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికున్ని మ్యాన్‌హోల్ నుంచి బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ అతను మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కార్మికున్ని గమనించని కారు డ్రైవర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మరమ్మతులు చేసేప్పుడు కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలను కామెంట్ చేశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు.. -
తాగునీటి సమస్యకు చెక్
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకానికి జడ్చర్ల మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.47కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మరో 20ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా పనులు చేపట్టనున్నారు. మున్సిపాలిటీలోని కావేరమ్మపేట, జడ్చర్ల, బూరెడ్డిపల్లి, నాగసాల, నక్కలబండతండ, శంకరాయపల్లి తండాలు విలీనమయ్యాయి. విలీన గ్రామాల్లో కొంత నీటి సమస్య ఉంది. అమృత్ 2.0 పథకంలో మంజూరైన రూ.47కోట్ల ద్వారా అన్ని గ్రామాల్లోనూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. మున్సిపాలిటీలో లక్షా 10వేలకుపైగా జనాభా ఉండగా, 17వేలకుపైగా ఇళ్లున్నాయి. ప్రస్తుతం 9వేలకుపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో ప్రస్తుతం 20ట్యాంకులు ఉండగా, 200 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్తకు సమాచారం.. పట్టణంలోని సామాజిక కార్యకర్త కంచుకోట ఆనంద్ పలు సమస్యలపై ఉన్నతాధికారులకు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాయటం పరిపాటిగా మారింది. ఆ లేఖల్లో నీటి ప్రాజెక్టు అమృత్ 2.0 ఒకటి. అయితే ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ సెక్రెటరి పి.ఏ.లతిక సామాజిక కార్యకర్తకు లేఖను పంపించటం గమనార్హం. రియల్ వెంచర్లతో పెరుగుతున్న సమస్య మున్సిపాలిటీ పరిధిలో కొంతకాలంగా వెలుస్తున్న రియల్ వెంచర్ల వల్ల నీటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవానికి వెంచరు దారులే ప్రతి ఇంటికి నీటి సౌకర్యం వసతి కల్పించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవటంతో మున్సిపాలిటీపై భారం పడుతుంది. కొత్తకాలనీలకు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వల్లే మిషన్ భగీరథ పథకం అమలు చేస్తున్నప్పటికీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. అమృత్ 2.0లోఇవీ ప్రతిపాదనలు.. అమృత్ 2.0 పథకం ద్వారా మంజూరైన నిధులతో మున్సిపాలిటీలో కింది పనులు చేపట్టనున్నారు. నూతనంగా 53 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల 6 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 30వేల లీటర్ల సామర్థ్యం కల 1స్లంప్ నిర్మించనున్నారు. 2.5కి.మీటర్ల మేర ఫీడర్ పైప్‌లైన్ వేయనున్నారు. ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు గానూ 62.5 కి.మీటర్ల మేర పైప్‌లైన్ వేయనున్నారు. అదేవిధంగా 7,954 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయటంతోపాటు టెండర్లు పిలిచారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలు పెట్టనున్నారు. -
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రామచంద్రాపురం: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం వివిధ శాఖల అధికారులు కొల్లూరుకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 22న ఉదయం 10గంటలకు ఇళ్ల ప్రాంగణానికి చేరుకొని పైలాన్ ప్రారంభించి, ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. అనంతరం 98వ బ్లాక్ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్లను లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే బ్లాక్‌లోని మొద టి అంతస్తులో సుమారు 6నుంచి 12 మంది లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేస్తారు. నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కొల్లూరు వద్ద ఆసియాలోనే అతిపెద్ద టౌన్‌షిప్‌ను నిర్మించింది. 15 వేలకు పైగా డబుల్బెడ్రూం గృహాలను నిర్మించింది. సుమారు 60 వేల మంది నివసించేలా అక్కడ అన్ని మౌళిక సదుపాయాలను కల్పించింది. దీన్ని నిర్మించి దాదాపు ఐదేళ్లు దాటుతున్నప్పటికీ.. లబ్దిదారులకు అందించలేదు. గతంలో పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ వాయిదా పడింది. తాజాగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ గృహాలను గురువారం లబ్ధిదారులకు అందించనున్నారు. సీఎం పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ డాక్టర్ శరత్ సీఎం కేసీఆర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారుల సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎస్పీ రమణ కుమార్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నెల 22న పాల్గొననున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. పారిశుధ్య నిర్వహణ లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగినచర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీఎంహెచ్ఓ గాయత్రి, జిల్లా పంచయతీ అధికారి సురేశ్ మోహన్, డీఎండబ్ల్యూఓ అరుణ్ కుమార్, గీత, డీఎస్పీ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిధుల్లేవు.. పనుల్లో జాప్యం
మంచిర్యాలటౌన్: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రోజుకో శాఖకు సంబంధించిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. శుక్రవారం మున్సిపాలిటీల్లో ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’ నిర్వహణకు ఆదేశించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రగతి నివేదిక రూపంలో వివరించి, ఉత్తమ సేవలను అందిస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందించి, సన్మానించేలా ఏర్పాట్లు చేశారు. బల్దియాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేలా 2020 ఫిబ్రవరి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ప్రతీ నెల మున్సిపాలిటీ జనాభా, వార్డుల ఆధారంగా నిధులు విడుదల చేస్తోంది. మొదటి రెండేళ్లపాటు ప్రతీ నెల నిధులు విడుదల చేసినా ఆ తర్వాత జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ నిధులతో పట్టణంలోని రోడ్లు, డ్రెయినేజీలు, అత్యవసరంగా చేపట్టే పనులతోపాటు సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ఇతరత్రా పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఏటా వర్షాకాలం ప్రారంభంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 15 రోజులపాటు వార్డుల్లో నిర్వహించి, చెత్తాచెదారాన్ని తొలగించడం, డ్రెయినేజీల్లోని పూడికతీత పనులు చేసి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు మూడేళ్లుగా చేపడుతున్నారు. ఈ ఏడాది పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టకుండానే వర్షాకాలంలోకి అడుగు పెడుతుండగా, దశాబ్ది ఉత్సవాల పేరిట పట్టణ ప్రగతి వేడుకలను నిర్వహించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏడాదిగా... జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ కొంత మేర సమస్యలు లేకుండా చేస్తున్నారు. గత ఏడాది నుంచి నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఈ ఏడాది జనవరి నెల వరకే నిధులు విడుదల చేయగా ఫిబ్రవరి నెల నుంచి మే నెల వరకు నిధులు విడుదల కాలేదు. కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నా నిధులు రాక చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో కాంట్రాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో చేపడుతున్న పనులను మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రగతి నిధుల్లో కేంద్ర ప్రభుత్వానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కలిపి ప్రతీ నెల ఆయా మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన అందించాల్సి ఉంటుంది. ఏడాదిన్నరపాటు సక్రమంగా నిధులు ఇవ్వగా.. 2021 ఆగస్టులో 25 శాతం కోత విధించింది. మిగతా 75 శాతం నిధులు ప్రతి నెలా అందించడంలోనూ జాప్యం జరుగుతోంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో మంచిర్యాలకు అత్యధికంగా రూ. 23.36 కోట్లు విడుదల కాగా, అందులో పెద్ద మొత్తంలో రూ.4.5 కోట్లు పార్కుల అభివృద్ధికి, రూ.4.5 కోట్లతో రోడ్లు, రూ.4 కోట్లతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో జంక్షన్ల నిర్మాణం కోసం కేటాయించారు. నిధుల జాప్యంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీలు, వార్డులు, పట్టణ ప్రగతి నిధుల వివరాలు మున్సిపాలిటీ వార్డులు ఇప్పటికి విడుదలైన ఈ ఏడాది జనవరిలో పట్టణ ప్రగతి నిధులు(రూ.కోట్లలో) విడుదలైన నిధులు(రూ.లక్షల్లో) మంచిర్యాల 36 23.36 57 బెల్లంపల్లి 34 14.53 36 మందమర్రి 24 14.72 36 క్యాతన్‌పల్లి 22 10.42 25 లక్సెట్టిపేట 15 6.47 17 నస్పూర్ 25 20.58 51 చెన్నూరు 18 6.94 17 -
సీఎం కేసీఆర్ ఇలాకాలో అవిశ్వాసం లొల్లి.. షాకిచ్చిన కౌన్సిలర్స్
గజ్వేల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని గజ్వేల్ –ప్రజ్ఞాపూర్ మున్సి పాలిటీలో అవిశ్వాసం లొల్లి మొదలైంది. ఒంటెత్తు పోకడలను ప్రదర్శిస్తు న్నాడని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లలో 14 మంది మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళిపై తిరుగుబాటు జెండాను ఎగరేశారు. ఈ క్రమంలోనే వారంతా స్వయంగా సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌కు అందజేశారు. అనంతరం కౌన్సిలర్లు సంయుక్తంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ పాలనకు మచ్చ తెస్తున్నాడని ఆరోపించారు. -
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గిన పాలక వర్గం
-
Jhalda: విశ్వాస పరీక్షలో ఓడిన టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార పక్షానికి ఎదురు దెబ్బ తగిలింది. విశ్వాస పరీక్షలో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. అయితే అది బెంగాల్ శాసన సభలో కాదు!.. బెంగాల్ రాజకీయాలకు 2023 పంచాయితీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అంతకంటే ముందే అధికార టీఎంసీకి ఝలక్ తగిలింది. పురూలియా జిల్లా ఝల్దా మున్సిపాలిటీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో తృణమూల్ పార్టీ ఓడింది. అంతకు ముందు.. ఇక్కడ విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ అధికార పక్షానికి మొట్టికాయలు వేసింది కోల్‌కతా హైకోర్టు. దీంతో 12 వార్డులు ఉన్న ఝల్దా మున్సిపాలిటీలో సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించారు. మొత్తం 12 వార్డుల్లో ఐదు తృణమూల్, మరో ఐదు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. ఇంకో రెండు చోట్ల ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన ఓటింగ్‌లో స్వతంత్రులు, కాంగ్రెస్ సభ్యులు పాల్గొనడంతో.. సంఖ్యా బలం ఆధారంగా టీఎంసీ ఓటమి పాలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థులిద్దరూ కాంగ్రెస్‌కే మద్ధతు ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఝల్దా మున్సిపాలిటీ చైర్మన్ సురేష్ అగర్వాల్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్ష కౌన్సిలర్లు. ఇందుకు సంబంధించి కేసు నమోదు కావడంతో.. హైకోర్టు సైతం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఝల్దా బోర్డును ఆదేశించింది కూడా. మద్ధతు వెనక్కి.. ఝల్దా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ తపన్ కండు మరణంతో ఉప ఎన్నిక జరిగింది. మార్చి 13వ తేదీన తపన్ హత్యకు గురికాగా.. ఆ ప్లేసులో ఆయన మేనల్లుడు మిథున్ విజయం సాధించారు. ఈలోపే స్వతంత్ర అభ్యర్థి షీలా ఛటోపాధ్యాయ మద్దతుతో మున్సిపల్ బోర్డును ఏర్పాటు చేసింది టీఎంసీ. దీనిపై ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే.. దుర్గా పూజ తర్వాత షీలా తన మద్ధతు ఉపసంహరించుకోవడంతో ఝుల్దా మున్సిపాలిటీ అధికారం ఊగిసలాటకు చేరుకుంది. అభివృద్ధి కొరవడిందని కారణంతో షీలా తన మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాతే బోర్డుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 102 స్థానాలకు సొంతం చేసుకుంది టీఎంసీ. సీపీఐ(ఎం) ఒక్కస్థానంలో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. నాలుగు స్థానాల్లో హంగ్ ఫలితం వచ్చింది. ఇక ఇప్పుడు 101లో ఝల్దా విశ్వాస పరీక్షలో ఓటమి ద్వారా ఒక స్థానం కోల్పోయింది టీఎంసీ. ఓడింది ఒక్క స్థానమే అయినా.. అదీ మున్సిపాలిటీ అయినా.. దాని వెనుక జరిగిన రాజకీయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రముఖ నేతలంతా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. అయితే హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతో పాటు ఆపై విశ్వాస పరీక్షలో ఓడి ఝల్దాను చేజార్చుకుంది టీఎంసీ. -
పోలీస్టేషన్ ముందే కొట్లాట...బీజేపీ కార్పోరేటర్ భర్తను చితకబాదిన పారిశుద్ధ్య కార్మికులు
ఇండోర్: పారిశుద్ధ్య కార్మికుల బృందం బీజేపీ కార్పోరేటర్ భర్తను పోలీస్టేషన్ ముందే చితకబాదేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని రౌ పోలీస్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సందీప్ చౌహన్‌పై ఫిర్యాదు చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున సముహంగా పోలీస్ స్టేషన్‌వద్దకు వచ్చారు. సదరు వ్యక్తి ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని ఫోన్లో దుర్భాషలాడటంతో.... ఆమె బంధువులు, తోటి కార్మికులు ఆగ్రహావేశాలతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కి వచ్చారు. దీంతో పోలీసులు సందీప్ చౌహన్‌ని పోలీస్టేషన్‌కి పిలపించి ఇద్దరి మధ్య సమస్య రాజీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తలెత్తి చౌహన్‌పై దాడి చేసేందుకు యత్నించారు పారిశుద్ధ్య కార్మికులు. అంతేగాదు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరి దాడి చేసుకుని, బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఐతే చౌహన్ భార్య 13వ వార్డు రౌ మున్సిపాలటి బీజేపీ కార్పోరేటర్. (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
Kuppam: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన
కులం లేదు.. మతం లేదు.. పార్టీలతో సంబంధం లేదు.. అర్హులైతే చాలు, పథకం తలుపు తడుతోంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి విసిగిపోయిన ప్రజలకు.. ఇళ్ల మధ్యనున్న సచివాలయం సాదర స్వాగతం పలుకుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ‘నవ’రత్న పథకాలతో ప్రతి కుటుంబం వేల నుంచి లక్షల రూపాయల లబ్ధి పొందుతోంది. ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ఇంటి వద్దకే వస్తున్న వలంటీర్లు.. లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘గడప గడప’కు వెళ్తున్న నేతలు.. సంక్షేమ పాలనలో ఊరూవాడా అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. చిత్తూరు కలెక్టరేట్/కుప్పం: సంక్షేమ పాలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ప్రతి ఇంట్లో ఆనందం నింపుతోంది. నాయకులు, అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా అర్హులైన వారందరికీ ఇళ్ల వద్దకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. ఈ విషయంలో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అయినా సరే.. సీఎం సొంత నియోజకవర్గానికి ఏమాత్రం తీసిపోకుండా పాలనలో పారదర్శకత కనిపిస్తుంది. కుప్పం వాసుల చిరకాల కోరికలైన మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాము ప్రజల పక్షమని నిరూపించింది. చంద్రబాబు తన నియోజకవర్గంలో సర్కారు బడులను మూసివేసి ఓ కార్పొరేట్ పాఠశాలకు అనుమతిచ్చి విద్యను వ్యాపారం చేశారు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి నాడు–నేడు మొదటి దశలో 121 సర్కారు పాఠశాలల రూపురేఖల మార్పునకు రూ. 31.23 కోట్లు, రెండవ దశలో 267 పాఠశాలలకు రూ.101.48 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇళ్లు లేని పేదలకు టీడీపీ పాలనలో 3,800 మందికి పట్టాలు ఇవ్వగా.. 4,691 మందికి ఇళ్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 15,908 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పక్కా గృహాలను నిర్మిస్తోంది. కుప్పం ప్రజలను చంద్రబాబు తన రాజకీయ లబ్ధికి వాడుకోగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతుండడం గమనార్హం. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చెందిన ఈమె పేరు అమ్ములు. భర్త మంజునాథ్ వ్యవసాయ కూలీ. టీడీపీ కార్యకర్త. వీరికి ఇద్దరు పిల్లలు హృతిక్(4), దివ్య(3). కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఉన్న ఒక్క ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని జీవించేవారు. టీడీపీ పాలనలో ఈ కుటుంబానికి ఎలాంటి లబ్ధి కలగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ కుటుంబం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రూ.18,400, వెలుగులో రూ.50 వేల రుణం పొందింది. ప్రభుత్వ పథకాల సహాయంతో రామకుప్పం మండలంలో మురుకుల తయారీ కేంద్రం ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాపారం సజావుగా సాగుతుండంతో నెలకు అన్ని ఖర్చులు పోను రూ.8 వేల నుంచి రూ.10 వేల ఆదాయం వస్తోంది. వీరి జీవనం సాఫీగా సాగుతోంది. కుప్పం పట్టణంలోని పాత పోస్టాపీసు వీధికి చెందిన ఈమె పేరు ధనలక్ష్మీ. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. భర్త మురుగన్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ప్రియదర్శిని, భూమిక. వీరిని చదివించేందుకు ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా అమ్మ ఒడి ఇస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలను చదివిస్తోంది. రామకుప్పం మండలం విజలాపునికి చెందిన సాగరాభి(65) కుటుంబంలో ఆరుగురు ఉన్నారు. సాగరాభి వృద్ధాప్యం, హనీష్(45) దివ్యాంగుడు కావడంతో నిత్యం నరకమే. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూలీలుగా మారారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వం వచ్చాక, సాగరాబీకి రూ.2,500, దివ్యాంగుడు హనీష్కు రూ.3వేల పింఛను ప్రతి నెలా వస్తోంది. ఈ మూడేళ్లలో ఆ కుటుంబానికి రూ.1.92 లక్షలు అందింది. గుడుపల్లె మండలం సంగనపల్లెకు చెందిన ఈయన పేరు నారాయణప్ప. 2.5 ఎకరాల పొలం ఉంది. అటవీ సరిహద్దు పొలాలు కావడంతో వ్యవసాయం చాలా కష్టం. విత్తనాల కొనుగోలుకు, ఎరువులు.. పెట్టుబడికి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఆయన్ను ఆదుకుంది. మూడేళ్లలో ప్రభుత్వం రూ.41 వేలు ఆయన ఖాతాలో జమచేయడంతో సాగు సాఫీగా సాగుతోంది. కుప్పం మండలం జరుగు పంచాయతీ పోరకుంట్లపల్లెకు చెందిన మళ్లికమ్మ, భర్త గోవిందప్ప టీడీపీలో క్రియాశీల కార్యకర్తలు. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. గత ప్రభుత్వంలో పక్కా గృహం కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వలంటీర్ స్వయంగా ఇంటి పట్టాను తెచ్చివ్వడంతో ఆ దంపతుల కళ్లలో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకొని జగనన్న కాలనీలోనే నిసిస్తుండడం విశేషం. గుడుపల్లె మండలం అత్తినత్తం గ్రామానికి చెందిన ఈయన పేరు వెంకటాచలం. సాగునీరు లేక వ్యవసాయం వదిలి బెంగళూరులో కూలీ పనులకు వెళ్లేవాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బిసానత్తం వద్ద ఉన్న కల్లివంక కాలువ పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంతంలోని పొలాలు సస్యశ్యామలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటాచలం తిరిగి తమ గ్రామానికి చేరుకొని వ్యవసాయ పనులతో ఉపాధి పొందుతున్నాడు. నీటి చెరువుల అనుసంధానంతో కుప్పం రైతుల సమస్యకు పరిష్కారం లభించింది. -
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు 12 నుంచి గ్రామసభలు
తాడికొండ: రాజధానిలో 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గతంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని పూలింగ్‌కు భూములిచ్చిన 29 గ్రామాలతో అమరావతి మెట్రోపాలిటన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటూ రాజధాని అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని నాన్ పూలింగ్ గ్రామాల ప్రజలు తమను కూడా మున్సిపాలిటీలో చేర్చాలని కోరిన నేపథ్యంలో ఆయా గ్రామాలను కూడా మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా తుళ్ళూరు మండలంలోని పూలింగ్‌కు భూములిచ్చిన 16 గ్రామాలతో పాటు నాన్ పూలింగ్ గ్రామాలైన పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను కలుపుతూ 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా శుక్రవారం గ్రామసభల షెడ్యూల్ ప్రకటించారు. ఈ గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, వివరణలు సేకరించి తీర్మానం చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. తుళ్ళూరు ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం ఈవోఆర్డీ సత్యకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తేదీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. గ్రామసభల షెడ్యూల్ 12వ తేదీ లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం, 13వ తేదీ దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, 14వ తేదీ వెంకటపాలెం, మందడం, ఐనవోలు, 15వ తేదీ నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, రాయపూడి, 16వ తేదీ మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి, 17వ తేదీ శాఖమూరు, నేలపాడు, తుళ్ళూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల ప్రజలు గ్రామసభలకు హాజరై వారి అభిప్రాయాలను తెలపాలని ఎంపీడీవో కోరారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం 712వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 712వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహర దీక్షల్లో శుక్రవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతులను మోసగించి మూడుపంటలు పండే 33 వేల ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్న చంద్రబాబు వారికి ఏం న్యాయం చేశాడో చెప్పాలన్నారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేత అనితకు బ్యాంకు నోటీసులు) రాష్ట్రంలోని 5 కోట్లమంది ప్రజల సంపదను ఒక ప్రాంతంలోనే కుమ్మరిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహా నగరాల సరసన అమరావతిని చేరుస్తానంటూ మోసపూరిత హామీలతో చంద్రబాబు 29 గ్రామాల రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను నమ్మించి భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు వడివడిగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ: గుడ్‌న్యూస్.. OHA ఉత్తర్వులు జారీ
సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీలో పని చేసే పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఏ(ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్సు)కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రూ. 6 వేలు చెల్లింపులపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను చెల్లించనునుంది ఏపీ ప్రభుత్వం. దీంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్లు అయ్యింది. తాజా ఉత్తర్వులతో 43 వేలమందికి పైగా కార్మికులకు మేలు జరగనుంది. పలు డిమాండ్లతో పాటు ఆరోగ్య భృతిని ప్రస్తావిస్తూ.. సమ్మెకు దిఆరు పట్టణ పారిశుద్ధ్య, ఒప్పంద కార్మికులు. ఈ తరుణంలో సీఎం జగన్ సమస్యలను తెల్చుకుని వెంటనే పరిష్కరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆదేశించడం.. కేబినెట్ కమిటీ ద్వారా సమస్య పరిష్కారం త్వరగతిన పరిష్కారం అయ్యాయి. అంతేకాదు.. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్. చదవండి: టీడీపీ హయాంలో తక్కువ.. సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం -
మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు
కనిగిరి పట్టణ అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. రెవెన్యూ డివిజన్ కేంద్రం హోదాతో వివిధ ప్రభుత్వ శాఖల సేవలు మరింత చేరువ కాగా.. మూడేళ్లుగా నగర పంచాయతీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరగడంతో తాజాగా నగర పంచాయతీ నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ఫలితంగా మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో అభివృద్ధి నిధుల లభ్యత పెరగనుంది. కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా) : కనకగిరి.. పేరు సార్ధకం చేసుకునేలా కనిగిరి అభివృద్ధికి మార్గం సుగమం అవుతోంది. నియోజకవర్గ కేంద్రమైన కనిగిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో నిన్న రెవెన్యూ డివిజన్ సాధించగా.. తాజాగా కనిగిరిని నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రెవెన్యూ డివిజన్‌తో అభివృద్ధికి ఊపు: కనిగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారడంతో అనేక ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు ప్రజల చెంతకు చేరాయి.. చేరుతున్నాయి. సుమారు 4 నుంచి 5 కి.మీల దూరం వరకు విస్తరించి ఉన్న కనిగిరిలో కనుచూపు మేరలో భూముల ధరలు పెరిగాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మిగతా మండలాల ప్రజల రాకపోకలు సాగుతుండటంతో వ్యాపారాలు, పెరిగి ఆయా వర్గాల వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పనులకు కందుకూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా కనిగిరిలోనే పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో వ్యయ ప్రయాసలు తగ్గాయి. రెవెన్యూ, వైద్య, విద్య, పోలీస్, మండల పరిషత్ తదితర అంశాల సమస్యలను ఇక్కడే త్వరితగతిన పరిష్కారం అవుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నగర పంచాయతీ–నేడు గ్రేడ్ 2 మున్సిపాలిటీ కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వ శాఖ నుంచి జీఓ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పట్టుబట్టి మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రాష్ట్రంలో కనిగిరి నగర పంచాయతీ ఒక్కటి మాత్రమే గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కనిగిరి పట్టణం అభివృద్ధిలో మరింత ముందడుగు వేయనుంది. ఈమేరకు మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో పాటు, ప్రత్యేక నిధులు వచ్చే అవకాశాలున్నాయి. మారనున్న కనిగిరి రూపు రేఖలు: గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో కనిగిరి రూపు రేఖలు పూర్తి స్థాయిలో మారనున్నాయి. చాలా కాలం పంచాయతీగా ఉన్న కనిగిరి.. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయింది. అనంతరం కనిగిరి, శంఖవరం, కాశీపురం, మాచవరం పంచాయతీలను కలిపి కనిగిరి నగర పంచాయతీగా చేశారు. నగర పంచాయతీగా హోదా ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈసారి గ్రేడ్ 2 మున్సిపాలిటీ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. మూడేళ్లుగా మున్సిపాలిటీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరిగినట్లు నగర పంచాయతీ కౌన్సిల్ మున్సిపల్ శాఖకు వెల్లడించడంతో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. పెరిగిన కౌన్సిల్ హోదా... ఇప్పటి వరకు నగర పంచాయతీ చైర్మన్..మున్సిపల్ చైర్మన్‌గా, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా హోదా పొందుతారు. ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న పోస్టులు పెరుగుతాయి. అమృత్ సరోవర్ వంటి భారీ నిధుల ప్రాజెక్టులు, ఆర్థిక సంఘ నిధులు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 25 వార్డులుగా మార్చుకొనే అవకాశాలు ఉన్నాయి. (క్లిక్: నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్) సీఎం సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి చేస్తా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా. బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో, సీఎం వద్దకు వెళ్లి కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసుకున్నా. మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, సీడీఎంఏ, సీఎస్ల సహకారంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా హోదా సాధించుకున్నా. పేదలకు మంచి ఆరోగ్యం, విద్య, సాగు, తాగునీరు అందించడమే నాధ్యేయం. – బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు కనిగిరి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారడంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ చేసిన కృషి ప్రశంసనీయం. ఎమ్మెల్యే ఆదేశానుసారం కనిగిరి పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పనిచేస్తా. చైర్మన్‌గా తాను, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులంతా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – అబ్దుల్ గఫార్, చైర్మన్, కనిగిరి మున్సిపాలిటీ -
ఎలుగుబంటి.. అధికారులు కనిపించరేంటి?
తిరుమలగిరి (తుంగతుర్తి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలహిల్స్ సమీపంలోని మామిడి తోటలో మంగళవారం ఉదయం ఎలుగుబంటి హడలెత్తించింది. తోటలో ఎలుగుబంటిని గమనించిన స్థానికులు ఆందోళనతో పోలీసులు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ఖదీర్, బీట్ ఆఫీసర్ అచ్చయ్యలు తోట వద్దకు వచ్చి ఎలుగుబంటి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దాన్ని తరలించేందుకు జూపార్కు నుంచి సిబ్బంది వస్తున్నట్లు తెలిపినా.. సాయంత్రం వరకు ఎవరూ రాలేదు. మరోవైపు ఎలుగుబంటి తోటలో దూరంగా వెళ్లిపోయింది. జూపార్కు నుంచి ఎవరూ రాకపోవడంతో.. అటవీ శాఖ అధికారులు కూడా వెనుదిరిగారు. దీంతో ఎలుగుబంటి ఎప్పుడు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. -
రూ.1,445 కోట్లతో వ్యర్థాల శుద్ధి
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పర్యావరణానికి హానికరంగా మారిన మానవవ్యర్థాలు, మురుగునీటి శుద్ధికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయా వ్యర్థాలను వదిలించుకునేందుకు ఇప్పటిదాకా అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలతో నేల, నీరు, గాలి కలుషితమవుతుండడంతో.. ఇకపై ఆయా వ్యర్థాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రీట్మెంట్ చేసి సాధ్యమైనంత మేరకు ఎరువులుగా, పునర్ వినియోగానికి అవసరమయ్యే రీతిలో మార్చనున్నారు. దాదాపు రూ.1,445.07 కోట్లతో రాష్ట్రంలోని 74 పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభత్వం నుంచి అనుమతి రావడంతోపాటు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఇటీవల సంబంధిత ఫైలుపై సంతకం కూడా చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమవుతోంది. స్వచ్ఛభారత్ మిషన్ రెండోదశ ప్రాజెక్టులో చేపడుతున్న ఈ యూనిట్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గడమేగాక కొన్నేళ్లపాటు నిర్వహణను ఆయా సంస్థలే చేపట్టడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 74 పట్టణ స్థానిక సంస్థలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా ఆయా ప్రాంతాల్లో రెండు విభాగాలుగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. మొదటి విభాగంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)కి అనుసంధానం చేస్తారు. అంటే ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చే వ్యర్థజలాలు ఎస్టీపీకి చేరతాయి. ఇక్కడ ఆ నీటిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం వివిధ పద్ధతుల్లో శుద్ధిచేసి మలినాలను వేరుచేసి బయో ఎరువుల తయారీకి తరలిస్తారు. జలాలను తాగడానికి మినహా ఇతర అవసరాలైన గార్డెనింగ్, పరిశ్రమల్లో వినియోగిస్తారు. రెండో విభాగంలో ప్రతి స్థానిక పట్టణ సంస్థలో ఒక ఫెకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) నిర్మించి, సెప్టిక్ ట్యాంకుల్లోని మలాన్ని ఆ ప్లాంట్‌లో శుద్ధిచేసి ఘనవ్యర్థాన్ని బయో ఎరువుగా మారుస్తారు. నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించి శుద్ధిచేసి పరిశ్రమలకు వినియోగిస్తారు. ఈ రెండు విభాగాలు అనుసంధానమై ఉంటాయి. రెండు విభాగాలను ఏకకాలంలో చేపట్టి, వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం రావడంతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా అడుగులు ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను స్థానికంగా ఉండే చెరువులు, నదులకు అనుసంధానించేవారు. ఇక మానవవ్యర్థాలను సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించి సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో పారబోయడం లేదా అండర్‌గ్రౌండ్ వ్యవస్థలు ఉన్నచోట నదులకు అనుసంధానం చేయడం వంటి విధానాలు అనుసరించేవారు. దీనివల్ల నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతున్నాయని, ప్రజారోగ్య సమస్య ఉత్పన్నమవుతోందని గుర్తించిన ప్రభుత్వం మురుగును రీసైక్లింగ్ చేయడమే ప్రత్యామ్నాయంగా భావించి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. పట్టణాలకు తాగునీటి వనరుగా ఉన్న నదులు, చెరువులను కాలుష్యం నుంచి పూర్తిగా ప్రక్షాళన చేసేదిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లలో రసాయనాలను ఉపయోగించి 95 శాతం పర్యావరణానికి అనుకూలంగా, వినియోగానికి అనువుగా మార్చడంతోపాటు అడుగున ఉన్న బయోసాలిడ్ (బురద)ను వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే ఎరువుగా మారుస్తారు. -
ఆ కమిషనర్ రూటే సెపరేటు?
స్థానిక మున్సిపాలిటీలో పాలకవర్గానికి, అధికారులకు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ మ్యాకల శిరీష అధ్యక్షతన ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోపాటు అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం బహిష్కరించడంతో వివాదం మరోమారు బహిర్గతమైంది. కోస్గి: ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లకే సమాచారం లేకుండా అధికారులు అజెండాలు తయారు చేయడం, కౌన్సిల్ ఆమోదించిన పనులు చేపట్టకపోవడం, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కమిషనర్‌పై పాలక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి పనితీరుపై కౌన్సిలర్లు పలుమార్లు జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ పేరుతో జిల్లా అధికారులు రావడం, కమిషనర్ బదిలీ అంటూ కౌన్సిలర్లు సంబరపడటం తప్పా నేటికీ కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ వసూళ్లకు పాల్పడిన పలువురు సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్న అధికారులు కమిషనర్‌ను మాత్రం పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన పలువురు వ్యక్తుల నుంచి పనులు చేయడానికి కమిషనర్ డబ్బులు వసూ లు చేశారనే విషయమై గతంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి బాధితుల సమక్షంలోనే విచారణ చేశారు. కార్యాలయ ఖర్చుల నిమిత్తం తీసుకున్నట్లు కమిషనర్ సమాధానం ఇవ్వడం బాధితులతోపాటు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులను విస్మయానికి గురి చేసింది. అన్నీ అక్రమాలే.. పట్టించుకునేవారు కరువు స్థానిక మున్సిపల్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారింది. కొత్తగా ఏర్పడిన మున్సిపల్లో ఇంటి పేర్లు మార్చుకునేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక అనుమతులు ఇచ్చిన నేటికీ అమలు చేయకుండా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే మారుస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న వేతనాల కంటే తక్కువ వేతనం అందిస్తు కార్మికులను వేధిస్తున్నారనేది బహిరంగ సత్యం. కార్మికుల వేతనాలు, నియామకాల్లో అక్రమాలకు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో గతంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి విచారణ జరిపారు. అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. అనుమతులు లేకుండా భవన నిర్మాణాల కు అనాధికారిక అనుమతులు ఇస్తూ మున్సిపల్ అధికారులు అందినంత దండుకుంటున్నారు. ఇలా ఒక్కటి కాదు టెండర్ నిర్వహించిన నర్సరీల్లో మున్సిపల్ కార్మికులతో పనులు చేయించడం, చేయని పనులకు బిల్లులు చేయడం, చేసిన బిల్లులకు కమీషన్ వసూలు చేయడం, ఆన్లైన్ విధానాన్ని పక్కన పెట్టి సగానికి పైగా పనులు నేటికీ కాగితాలపైనే చేయడం వంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. -
మేయర్ వర్సెస్ మాజీ మేయర్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం మేయర్ సునీల్‌రావు అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశం రసాభాసగా జరిగింది. అధికార పార్టీ కార్పొరేటర్లే మంచినీటి సరఫరాపై నిరసన తెలిపారు. మాజీ మేయర్ రవీందర్‌సింగ్, మేయర్ మధ్య నీటి మోటార్ల విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. అలాగే పాలకవర్గ సభ్యులు ఆయా డివిజన్లలో సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా.. అన్నింటినీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశంలో నగర అభివృద్ధికి సంబందించి రూపొందించిన 15 ఎజెండా అంశాలపై పాలకవర్గ సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. బీజేపీ కార్పొరేటర్ జితేందర్ మాట్లాడుతూ, నల్లా ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని, ఇంటినంబర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరారు. కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, మంచినీటి పైప్ లైన్ పనులు వేగంగా పూర్తి చేసి తాగునీరందించాలన్నారు. వేసవికాలంలో కావడంతో మంచినీటి సమస్యను కార్పొరేటర్లు సభా దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరిస్తాం: మేయర్ దేశంలోనే ప్రతిరోజూ నిరంతరంగా మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక నగరం కరీంనగర్ అని మేయర్ సునీల్‌రావు అన్నారు. కొద్దిరోజులుగా సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తిందని, సమస్య పరిష్కారానికి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మిడ్‌మానేరు నుంచి లోయర్ మానేరు డ్యాంకు నీటి విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. మిడ్ మానేరు గేట్లకు చిన్న మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నీరు విడుదల చేయక నగరంలో సమస్య తలెత్తిందని వివరించారు. వేసవిలో ప్రజలకు మంచినీరు ప్రధానం కాబట్టి నీటిసరఫరాలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. – నగరంలో మంచినీటి సరఫరా విషయంలో ప్రస్తుతం ఉన్న మోటార్లు పని చేస్తున్నా.. అనవసరంగా కొత్తవి కొంటున్నారు. కమీషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారు. – రవీందర్‌సింగ్, మాజీ మేయర్ మీ పాలనలో మంచినీటి సరఫరాకు నాసిరకం మోటార్లు కొనుగోలు చేశారు. అవి పనిచేయకపోవడంతో ఇప్పుడు కొత్త మోటార్లు కొంటున్నాం. – సునీల్‌రావు, మేయర్ -
పట్టణాల్లో ఫిర్యాదులపై ప్రత్యేక వ్యవస్థ!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ప్రజలకు సకాలంలో సేవలు అందించడంపై రాష్ట్ర మునిసిపల్ పాలనా విభాగం దృష్టి సారించింది. ఏ స్థాయిలోనూ ‘పెండింగ్’ అనేది లేకుండా నిబంధనల ప్రకారం వెంటనే సమస్యలను పరిష్కరించనుంది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 123 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందించాల్సిన సేవలపై పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి మంగళ లేదా బుధవారాల్లో మునిసిపల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే ప్రతినెలా మూడు లేదా నాలుగు మున్సిపాలిటీల్లో సీడీఎంఏ స్వయంగా పర్యటించనున్నారు. ఏ లోపం ఉన్నా కమిషనర్లదే బాధ్యత ప్రభుత్వ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయా? లేదా అనే అంశంపై మునిసిపల్ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో సిబ్బంది, కమిషనర్లపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఒక బృందాన్ని కూడా నియమిస్తోంది. మునిసిపాలిటీలో ఏ స్థాయిలో అవినీతి జరిగినా, ప్రజలకు అందించాల్సిన సేవల్లో లోపం కనిపించినా అందుకు స్థానిక కమిషనర్లనే బాధ్యులను చేయనుంది. 4,136 వార్డులపై ప్రత్యేక దృష్టి వార్డు సచివాలయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని మునిసిపల్ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అన్ని మునిసిపాలిటీల్లో ఉన్న 4,136 వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి ఎప్పుడు ఏం ప్రశ్న వస్తుందోనని మునిసిపల్ కమిషనర్లు జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తుల దుమ్ముదులిపే పనిలో నిమగ్నమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి మునిసిపాలిటీలో ఇటీవల పర్యటించిన సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ కొత్తపేట–2 సచివాలయంలో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారు యూనిఫామ్ ధరించకపోవడాన్ని గుర్తించారు. వార్డు కార్యాలయాల్లో సిబ్బంది పేర్లు, వారు అందించే సేవల బోర్డులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో సిబ్బంది పనితీరుని మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ పర్యటనలో ఆయన గుర్తించిన లోపాలను అన్ని మునిసిపాలిటీలు సరిచేసుకోవాలని 123 మంది కమిషనర్లకు నోటీసులు పంపించారు. కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే.. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో సకాలంలో సేవలు అందలేదని ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. కిందిస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలి. కమిషనర్లు పట్టణంలో పర్యటిస్తుంటే సమస్యలు తెలుస్తాయి. ఫిర్యాదులు, పెండింగ్ సమస్యలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలి. మునిసిపాలిటీల్లో 4,136 వార్డులు ఉన్నాయి. వాటిలో 317 సేవలు అందించాలి. ఎవరు ఎలాంటి సేవలు అందిస్తారనేది వార్డు సచివాలయాల్లో బోర్డులు పెట్టాలి. కొన్ని వార్డుల్లో ఇప్పటిదాకా బోర్డులు పెట్టనిచోట చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చేలా ప్రవర్తించినా, ప్రభుత్వ సేవలు, పథకాలు సకాలంలో ప్రజలకు అందకున్నా బాధ్యులపై చర్యలు తప్పవు. – ప్రవీణ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ -
బుల్డోజర్ రాజ్యం!
భారత రాజకీయ నిఘంటువులో కొత్తగా చేరిన పదం బుల్డోజర్. పరిహాసంగా మొదలైన బుల్ డోజర్ అనే మాట ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాస్త్రమై, చివరకు దేశమంతటా ఊడలు దిగుతోంది. మతఘర్షణలకు కారకులైన వారి ఇళ్ళనూ, ఆస్తులనూ బుల్డోజర్లతో కూల్చివేయడం మొదలుపెట్టి ‘బుల్డోజర్ బాబా’ అనిపించుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడది అనేక బీజేపీ పాలిత ప్రాంతాలకు ఆదర్శమైంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్ళు రువ్వారని ఆరోపణలొచ్చిన చోట అక్కడి సీఎం శివరాజ్ చౌహాన్ ఇళ్ళ కూల్చివేతల మంత్రం ప్రయోగించి, ‘బుల్డోజర్ మామ’ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఏకంగా 9 జేసీబీ బుల్డోజర్లతో అదే సీన్. కర్ణాటకలోని హుబ్బలి హింసాకాండలోనూ తక్షణ బుల్డోజర్ న్యాయం ప్రస్తావనే. మహారాష్ట్రలో నవనిర్మాణ సేన నేత రాజ్‌థాకరే ఏకంగా మసీదుల నుంచి ప్రార్థన పిలుపు (‘అజాన్)ను వినిపించే లౌడ్స్పీకర్లను మే 3 కల్లా తొలగించాలంటున్నారు. లేదంటే పోటీగా మరింత గట్టిగా హనుమాన్ చాలీసా వినిపిస్తామనీ తొడ కొడుతున్నారు. వెరసి, మనుషుల మధ్య మత విద్వేషాన్ని రగిలిస్తున్న తాజా ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. దేశరాజధాని ఘటనకొస్తే – పేరుకు ఢిల్లీ ఒకటే అయినా, సామాజిక, ఆర్థిక కోణాలలో అది అనేకానేక ఢిల్లీల సముదాయం. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారు సైతం పలువురున్న జహంగీర్‌పురిలోని కుశల్చౌక్ ప్రాంతం కేవలం కొద్ది గజాల తేడాలోనే మందిరం, మసీదు – రెండూ ఉన్న శాంతియుత సహజీవన ప్రతీక. కానీ, పోలీసుల అనుమతి లేకనే, చేతులో కత్తులు, తుపాకులతో ఏప్రిల్ 16న సాగిన హనుమాన్ జయంతి యాత్ర రేపిన ఘర్షణతో తంటా వచ్చింది. కొద్దిరోజులుగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా, ఉద్విగ్నంగా మారిపోయింది. దోషులు ఎవరైనా శిక్షించాల్సిందే. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా, అవి ఏ వర్గానికి చెందినవైనా సరే చర్య చేపట్టాల్సిందే. కానీ, రోహింగ్యాలు, బంగ్లాదేశీల పేరుతో అమాయకులైన శ్రామికులకు, అదీ ఒకే వర్గానికి చెందినవారి షాపులనే కూల్చివేశారని ప్రత్యక్ష సాక్షుల కథనం. 1970ల నుంచి ఉన్న షాపుపై, అదీ అధికారిక కాగితాలన్నీ పక్కాగా ఉన్న దానిపై బుల్డోజర్ ప్రయోగం పరాకాష్ఠ. ఏళ్ళ తరబడిగా ఈ నిర్మాణాలున్నా, తాము అధికారంలోకి వచ్చి ఏళ్ళు గడిచినా... నిన్నటి దాకా గుర్తు లేని జహంగీర్‌పురి అక్రమ కట్టడాలు ఉన్నట్టుండి ఇప్పుడే తెరపైకి రావడమే విచిత్రం. పైపెచ్చు, కేవలం ఒక ధార్మిక స్థలం ముంగిట దుకాణాలనే కూల్చివేసి, ఆ పక్కనే ఉన్న మరో ధార్మిక స్థలం చుట్టూ నిర్మాణాల ఊసే ఎత్తకపోవడం మరీ విడ్డూరం. ముందస్తు నోటీసుల లాంటివేమీ లేకుండా, తెల్లవారుతూనే బుల్డోజర్లతో విరుచుకుపడడం అసాధారణం. యథాతథ స్థితి కొనసాగించాల్సిందిగా దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా సరే, ఆ తర్వాత కనీసం గంటన్నర సేపు కూల్చివేత సాగడం కోర్టు ధిక్కారం కాదా? అధికారిక ఉత్తర్వులు అందలేదనే మిషతో అధికారులు న్యాయస్థానం ఆదేశాన్ని సైతం పెడచెవిన పెట్టవచ్చా? నాలాపై అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయన్నా, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందన్నా ఇన్నేళ్ళు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? తాజా శోభాయాత్ర ఘటనకు ప్రతిగానో, ప్రతీకారంగానో ఈ చర్య చేపట్టారంటే ఏం జవాబిస్తారు? యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ – అన్నిటా ఒకటే వర్గాన్ని లక్ష్యంగా చేసుకొన్న కూల్చివేతల్ని చూస్తే, మనుషుల్ని మరింతగా విడదీస్తున్నారని అనుమానాలు రేగడం సహజం. నిజానికి, ఈ నిరంకుశ రాజ్యాధికారానికి కూలిపోతున్నది ఇళ్ళు, షాపులు కాదు... న్యాయపాలన, రాజ్యాంగం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారి నుంచి నష్టపరిహారం వసూలు ఆదేశాలతో మొదలుపెట్టిన యూపీ సర్కార్ రెండేళ్ళ క్రితం దాన్ని ఏకంగా చట్టం చేసింది. బుల్డోజర్లతో భయపెట్టడం యూపీ నుంచి ఢిల్లీ దాకా పాకింది. ఘర్షణలకు పాల్పడ్డారనే ఆరోపణతో ఇళ్ళ కూల్చివేత సామూహిక శిక్ష విధింపు కిందే లెక్క. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం కింద సామాన్యుడికి సంక్రమించిన గృహ నివాస హక్కును కాలరాయడమే అని నిపుణుల మాట. కొద్ది నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం మతవిద్వేష ప్రయత్నాలు, ఘర్షణలు సాగుతున్నాయి. అయితే ముందే పసిగట్టి, ఘర్షణల్ని నివారించడంలో వ్యవస్థాగత వైఫల్యం వెక్కిరిస్తోంది. మరో పక్క చట్టబద్ధంగా పని చేయాల్సిన పోలీసులను, పాలకుల ఆదేశా లను మాత్రమే పాటించే గులాములుగా మారుస్తుండడం ఇంకో సమస్య. సమాజంలోని సాంస్కృతిక, ధార్మిక భేదాలను గుర్తించి, అంగీకరించే పెద్ద మనసు ప్రజలకున్నా, పాలకులు ఉండనిచ్చేలా లేరు. జేసీబీ అంటే ‘జిహాద్ కంట్రోల్ బోర్డ్’ లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఏం చెప్పదలుకున్నారు? భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతిని ఏం చేయదలుచుకున్నారు? భావోద్వేగాలు పెంచి, పరమత సహనాన్ని హననం చేసినందు వల్ల ఎవరికి లాభం? ‘తొక్కుకుంటూ పోవాలె... ఎదురొచ్చినవాణ్ణి ఏసుకుంటూ పోవాలె’ లాంటి డైలాగులు సినిమాల్లో బాగుంటాయేమో కానీ, ప్రజాస్వామ్యంలో సరిపడవని పాలకులు మర్చిపోతే కష్టం. కూల్చివేస్తున్నది కట్టడాలను కాదు... శతాబ్దాల సహజీవన పునాదిపై నిర్మాణమైన సామరస్యాన్ని అని గ్రహించకపోతే సమాజానికే తీరని నష్టం. పాలకుడనే వాడు ఎప్పటికైనా గెలవాల్సింది – తాత్కాలికమైన ఎన్నికలను కాదు... విభిన్న వర్గాల ప్రజల మనసుల్ని! -
అక్రమాలకు ‘ప్లానింగ్’
సాక్షి,అనంతపురం: నగరంలో ఇలాంటి అక్రమ భవనాలు దాదాపు 200 వరకు ఉండగా భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించిన టౌన్ ప్లానింగ్ అధికారులు చార్జిషీట్ ఫైల్ చేస్తున్నారు. కోర్టుల ద్వారా నగరపాలకసంస్థకు జరిమానాలు విధించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే అక్రమ భవనాల లెక్క తేల్చిన అధికారులు వాటిపై జరిమానా విధించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అస్మదీయులను ఒకలా... తస్మదీయులను మరోలా చూస్తున్నారు. నెలల క్రితమే అక్రమ భవనాల లెక్క తేలినా ఇప్పటి వరకూ కేవలం 30 భవనాల వరకే జరిమానాలు విధించారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. కేవలం బిల్డర్లలో భయం పుట్టించడానికే హæడావుడి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా గుట్టుగానే... నగరపాలకసంస్థలో టౌన్‌ప్లానింగ్ విభాగం కార్యకలాపాలు మొత్తం గుట్టుగానే సాగుతున్నాయి. దాదాపు ఏడాది కాలంలో ఈ విభాగంపై ఒక్క సమీక్ష కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కీలకమైన విభాగాన్ని గాలికి వదిలేస్తుండడంతో అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో అక్రమ భవనాల నిర్మాణాలపై దాడులు కూడా తగ్గిపోయాయి. కొంతమంది అధికారులు లైసెన్స్ సర్వేయర్లతో కుమ్మక్కై అక్రమ భవనాల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్నది కమలానగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనం. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మించడంతో పాటు అదనపు ఫ్లోర్ నిర్మాణం కూడా మొదలు పెడుతున్నట్లు తెలిసింది. సెట్ బ్యాక్ వదలాలనే నిబంధనను విస్మరించారు. టౌన్‌ప్లానింగ్‌లో కొత్తగా వచ్చిన కిందిస్థాయి అధికారి అండదండలతో ఈ అక్రమ భవన నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసింది. ఇందుకు భారీగానే ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకుంటాం కమలానగర్లో నిర్మిస్తున్న ఈ భవనంపై గతంలోనే దాడులు జరిపాం. అక్రమంగా నిరిస్తున్న ఫ్లోర్‌ను తొలగించాం. అయినప్పటికీ స్విమింగ్ పూల్ నిర్మించినట్లు మా దృష్టికి వచ్చింది. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. సిబ్బంది ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదు. – శాస్త్రి, అసిస్టెంట్ సిటీ ప్లానర్, నగరపాలకసంస్థ -
20 రోజులు.. 22 లక్షలు వృధా.. ఇలా కూడా పని చేస్తారా!
గత ఆరేళ్లుగా వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడి చివరకు వారి సమస్యలను హైదరాబాద్ ఎంపీకి విన్నవించగా ఆయన చొరవతో డ్రైనేజీ పైప్‌లైన్‌ను నిర్మించారు. కానీ పూర్తయిన 20 రోజులకే దాన్ని తొలగించి నూతనంగా బాక్స్ టైప్ డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపంతో 20 రోజుల కోసం లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి,రాజేంద్రనగర్(హైదరాబాద్): ఫోర్ట్‌వ్యూ కాలనీ గూండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు, డ్రైనేజీ నీటి కోసం జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులు రూ.7.40కోట్లతో బాక్స్ టైప్ డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరద, డ్రైనేజీ నీటి కారణంగా కాలనీలోని దాదాపు 350 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ చొరవతో.. ► గత ఆరేళ్లుగా సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళనలు, ప్రజాప్రతినిధులు, అధికారుల చూట్టూ తిరిగారు. వర్షం కురిసిన ప్రతి సారి ఈ కాలనీలో డ్రైనేజీ, వరద నీరు చొచ్చుకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత మూడు నెలల క్రితం ఈ సమస్యపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కలిసిన ఫోర్ట్‌వ్యూ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తమ సమస్యను వివరించారు. స్పందించిన ఆయన రూ. 22 లక్షలతో డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించగా 20 రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. ఎగువ నీటితోనే ఇబ్బంది.. ► కాలనీకి సంబంధించిన నీరు కాకుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురుగు నీరే ఈ బస్తీకి ప్రధాన సమస్యగా మారింది. ఈ పైపులైన్ నిర్మించి 20 రోజులు పూర్తి కావస్తున్న సమయంలో ప్రాజెక్టు అధికారులు పైపులైన్‌ను తొలగించి డ్రైయిన్ బాక్స్ కాలువను నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాలోచిత నిర్ణయంతో.. ► ఫోర్ట్‌వ్యూ కాలనీ రహదారులు 40 అడుగుల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం ఓ పక్క నుంచి డ్రైనేజీ పైపులైన్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ డ్రైనేజీ పైపులైన్ ఓ వైపు నుంచే బాక్స్ టైప్ డ్రైనేజీ బాక్స్‌ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 5 అడుగుల డ్రైయిన్ బాక్స్ కోసం స్థలం ఉందని అధికారుల అనాలోచిత నిర్ణయంతో ప్రజాధనం వృధా అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ పైపులైన్ పక్కనుంచే బాక్స్ టైప్ డ్రైనేజీని నిర్మించాలని వారు కోరుతున్నారు. సమస్య తిరిగి పునరావృతం.. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఎస్ఈ పంత్‌తో పాటు అధికారులందరిని కలిసి సమస్యను వివరిస్తున్నాం. ప్రస్తుతం నిర్మించిన డ్రైనేజీ పైపులై¯Œ ను తొలగించకుండా బాక్స్ టైప్ నాలాను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మా వినతిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ పైపులైన్‌ను తొలగిస్తే సమస్య తిరిగి పునరావృతం అవుతుంది. – ఫోర్ట్‌వ్యూ కాలనీ అధ్యక్షుడు షాహేద్ పీర్ రూ.22 లక్షల ప్రజాధనం వృధా.. కాలనీలను ఇబ్బందులకు గురి చేసే విధంగా జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. దక్షిణ మండల జోనల్ కమిషనర్‌తో పాటు స్థానిక జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించకుండానే పనులు చేపడుతున్నారు. దీంతో రూ. 22 లక్షల ప్రజాధనం వృధా అవుతుంది. ఉన్నతాధి కారులు ఈ విషయంలో వెంటనే స్పందించాలి. – సుజాత్‌ఖాన్, ఫోర్ట్‌వ్యూ కాలనీ -
డిసెంబర్లో ప్రభుత్వం రద్దు.. మార్చిలో ఎన్నికలు
పోచారం: ‘వచ్చే డిసెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు, మార్చిలో ఎన్నికలు, ఆపై కేసీఆర్ ఆత్మహత్య ఖాయం. తొందర్లోనే కేసీఆర్ మెడకు తాడు కట్టుకుంటాడు’అంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దేశదిమ్మరిలా.. కాలు కాలిన పిల్లిలా.. చెట్టు మీద కోతిలా దేశమంతా తిరుగుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు’అని మండిపడ్డారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో తుపాకుల కాల్పులు, మహబూబ్‌నగర్‌లో మంత్రులను చంపాలనే కుట్ర వంటి ప్రతి సంఘటనలో టీఆర్ఎస్ నాయకుల పాత్రే ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్లో పంపకాల లొల్లితో ఒకరినొకరు చంపుకోవాలని చూస్తున్నారని, కేసీఆర్ ఇంట్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం అప్పనంగా గుంజుకుం టోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ భూములకు యజమానులను చేస్తామని చెప్పారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ విద్యా కేంద్రంగా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారులో సభ్యులకే తొలి ప్రాధాన్యం లక్షా 30 వేల కాంగ్రెస్ సభ్యత్వాల నమోదుతో మం చిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం మొదటి స్థానం లో, 92 వేలతో మేడ్చల్ రెండో స్థానంలో నిలిచాయని రేవంత్ చెప్పారు. 30 లక్షల సభ్యత్వాలను డిజిటల్ పద్ధతిలో చేస్తామని సోనియాగాంధీకి చెప్పి 40 లక్షలు చేయగలిగామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయించగలిగితే 90 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయని, మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కార్యకర్తలే కథానాయకులవుతారని,చెప్పారు. చివర్లో స్థానిక నాయకులను సత్కరించకుండానే ఆయన సభాస్థలి నుంచి నిష్క్రమించడంతో కొందరు కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతికి పట్టణం కడదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి లక్ష్యాలను పూర్తి చేస్తే తెలంగాణలోని ప్రతి పట్టణానికీ జాతీయస్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతినెలా స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమ లక్ష్యాలను అందుకునే దిశగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సూచించారు. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, వాటిని అమలు చేసిన పురపాలికలకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల పురోగతి కోసం ప్రత్యేకంగా టీయూఎఫ్‌ఐసీడీ అనే సంస్థను ఏర్పా టు చేసిందని తెలిపారు. పట్టణ ప్రగతికి అదనంగా నిధులు సమకూరుస్తున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక నిధులతో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, అయితే స్థానిక సంస్థల పరిధిలో ఉన్న పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు, గ్రీనరీ నిర్వహణ వంటి కార్యక్రమాల పైన ఎక్కువ దృష్టి సారించాలని ఆదేశించారు. అభివృద్ధిలో పట్టణాల్లోని పౌరులను కూడా భాగస్వాములు చేసేలా వారితో మమేకమై పనిచేయాలని కోరారు. రానున్న ఆరు నెలల్లో సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, వాటితోపాటు ఇతర పెండింగ్ పనులపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదు.. స్థానిక సంస్థల వ్యవహారాల కోసం ప్రత్యేకంగా ఒక కలెక్టర్ స్థాయి అధికారిని నియమించడం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకుని అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. స్థానిక సంస్థలను పర్యవేక్షిస్తున్న అదనపు కలెక్టర్లు పట్టణాల ఆకస్మిక తనిఖీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇతర పట్టణాలతో పోటీపడి అభివృద్ధి దిశగా ముందుకు కదలాలన్నారు. పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పురపాలనలో కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు ఇల్లందు వంటి పురపాలికలు వినూత్నంగా ముందుకు దూసుకుపోతున్నాయన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కొండపల్లిలో దేవినేని ఉమా ఓవరాక్షన్..
Updates ►కొండపల్లిలో చైర్మన్, ఇద్దరి వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తయ్యింది. సీల్డ్ కవర్లో ఎన్నిక వివరాలను ప్రిసైడింగ్ అధికారి హైకోర్టుకి నివేదించనున్నారు. ఎన్నికలపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ ఎంపీ కేశినేని ఓటుపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలిపింది. అన్నీ పరిశీలించి ఫలితాన్ని ప్రకటిస్తామని హైకోర్టు పేర్కొంది. ►కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. కొండపల్లిలో దేవినేని ఉమా ఓవరాక్షన్ చేశారు. ఓటు హక్కులేకపోయినా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అసిస్టెంట్ ఎన్నికల అధికారికి అనుమతినివ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను ఆదేశించింది. అయితే ఎన్నిక ఫలితాన్ని మాత్రం వెల్లడించవద్దని న్యాయస్థానం నిర్దేశించింది. ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో విజయవాడ ఎంపీ వినియోగించుకునే ఓటు ఈ వ్యవహారంలో కోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఎన్నిక ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేసి పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. టీడీపీ వార్డు సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసు కమిషనర్ (ఇన్చార్జ్) జి.పాలరాజుకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నిక నిర్వహణకు ఆదేశాలు ఇవ్వండి... కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి తదుపరి ఎలాంటి వాయిదాలకు ఆస్కారం లేకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీ వార్డు సభ్యులు, ఎంపీ కేశినేని నాని, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కె.శ్రీలక్ష్మి అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ ‘కోరం’ ఉన్నప్పటికీ దురుద్దేశపూర్వకంగా ఎన్నికను వాయిదా వేస్తున్నారని నివేదించారు. సభ్యులందరికీ ముందస్తు నోటీసు తప్పనిసరి విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించరా? అంటూ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుంటే పోలీసుల సాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు విజయవాడ ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్ పాలరాజు, అసిస్టెంట్ ఎన్నికల అధికారి శివనారాయణరెడ్డి మధ్యాహ్నం స్వయంగా కోర్టు ఎదుట హాజరయ్యారు. ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేనందున వాయిదా వేసినట్లు శివనారాయణరెడ్డి తెలిపారు. సమస్యను స్థానిక పోలీసుల దృష్టికి తెచ్చామన్నారు. ‘ఇలా ఎంత కాలం? రేపు కూడా అడ్డుకుంటే మళ్లీ వాయిదా వేస్తారా? అడ్డుకున్న వారిపై ఏ చర్యలు తీసుకున్నారు?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీ కేశినేని నానికి అనుమతినిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఉండేందుకే ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘పోలీసుల సాయంతో ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4.30 గంటలకు ఎన్నిక నిర్వహించండి. అడ్డొచ్చిన వారిని అరెస్ట్ చేయండి. బుధవారం ఉదయం కల్లా పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి’ అని తొలుత న్యాయమూర్తి మౌఖికంగా స్పష్టం చేశారు. ఈ సమయంలో అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ సభ్యులందరికీ ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరని, ఇందుకు కొంత సమయం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో బుధవారం ఎన్నిక నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎంపీ కేశినేని నాని వినియోగించుకునే ఓటు హక్కు ఈ వ్యాజ్యాల్లో కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని సుధాకర్‌రెడ్డి పట్టుబట్టడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ విషయాన్ని ఆదేశాల్లో ప్రస్తావించారు. ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం కొండపల్లి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
కుప్పంలో కొనసాగుతున్న టీడీపీ అరాచకం
-
kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు
సాక్షి, చిత్తూరు: నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కుప్పంలో టీడీపీ అరాచకం కొనసాగుతోంది. ఓటర్లను నేరుగా చంద్రబాబు ప్రలోభపెడుతున్నారు. ఆడియో కాన్ఫరెన్స్ పేరుతో చంద్రబాబు ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. చాలామందికి చంద్రబాబు మాట్లాడిన ఆడియోను టీడీపీ నేతలు పంపిస్తున్నారు. టీడీపీ నాయకులంతా ఆందోళనకు దిగాలంటూ పరోక్షంగా చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. టీడీపీ నేతలు కుప్పం పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. ఆదివారం నుంచి కుప్పం ఓటర్లను టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను టీడీపీ గూండాలు చెక్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి ఓటు వేస్తారంటూ అడుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. టీడీపీ అరాచకాలతో కుప్పం ఓటర్లు భయపడిపోతున్నారు. అక్కడితో ఆగకుండా టీడీపీ నేతలు దొంగ ఓటర్లంటూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. -
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు పోలింగ్
-
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు పోలింగ్ కొనసాగుతోంది
-
నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్
Live Updates Time: 5.15 PM నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 5 గంటల వరుకూ క్యూలో ఉన్నవారికి ఓటువేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 50.1 శాతం, బుచ్చిరెడ్డిపాలెం 61.6 శాతం, కుప్పం-76.49 శాతం, జగ్గయ్యపేట 78.45 శాతం, దాచేపల్లి-71.88 శాతం, గురజాల-71.8 శాతం, పెనుకొండ-82.63 శాతం, కమలాపురం-76.16 శాతం, కొండపల్లి-66.79 శాతం, రాజంపేటలో 67.27 శాతం పోలింగ్ నమోదైంది. దర్శి 13వ వార్డులో టీడీపీ నేతల ఓవరాక్షన్ ప్రకాశం జిల్లా దర్శి 13వ వార్డులో టీడీపీ నేతల ఓవరాక్షన్ చేశారు. ఓట్లు వేయడానికి వచ్చిన స్థానికులపై టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. ఓడిపోతామనే భయంతో అలజడి సృష్టించారు. రాజంపేటలో ఉద్రిక్తత వైఎస్సార్ జిల్లా: రాజంపేట 15వ వార్డు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద అల్లరి మూకలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులపై రౌడీమూకలు రాళ్ల దాడి చేశారు. Time: 4.45 PM సాయంత్రం 4 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 42.71 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 58.66 శాతం, ఆకివీడులో 72.03 శాతం, కమలాపురంలో 74.81 శాతం, రాజంపేటలో 64.83 శాతం పోలింగ్ నమోదైంది. Time: 3.30 PM మధ్యాహ్నం 3 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 38.9 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 55.48 శాతం, బేతంచర్లలో 67.99 శాతం, దాచేపల్లిలో 67.97. శాతం, కమలాపురంలో 71.84 శాతం, రాజంపేటలో 60.47 శాతం, పెనుకొండలో 75.99 శాతం పోలింగ్ నమోదైంది. Time: 2.30 PM మధ్యాహ్నం ఒంటి గంట వరకు నెల్లూరు కార్పొరేషన్లో 30.13 శాతం పోలింగ్ నమోదైంది. బుచ్చిపాలెంలో 50.9 శాతం, కుప్పంలో 68 శాతం, రాజంపేటలో 50.35 శాతం, గురజాలలో 53.72, జగ్గయ్యపేటలో 57 శాతం, పెనుకొండలో 55.91 శాతం పోలింగ్ నమోదైంది. Time: 1.30 PM పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో భారీ వర్షం కురుస్తోంది. వర్షం లోనూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారు. ఆకివీడులో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. ఓటర్లు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని కలెక్టర్ అన్నారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలిస్తున్నామని తెలిపారు.మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆకివీడులో 55.18 శాతం, బేతంచర్లలో 61.91 శాతం, దాచేపల్లిలో 59.01 శాతం, దర్శిలో 57 శాతం, కమలాపురంలో 64.57 శాతం, రాజంపేటలో 50.35 శాతం పోలింగ్ నమోదైంది. Time: 12.05 PM ►అనంతపురం జిల్లా పెనుకొండ నగరపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటల వరకు 36.5 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓట్లు వేసేందుకు పెద్దసంఖ్యలో మహిళలు తరలి వస్తున్నారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్లో 20 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు నెల్లూరు కార్పొరేషన్లో 15.9 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 37.31 శాతం, కుప్పంలో 37.75 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు బెతంచర్లలో 43.56 శాతం, ఆకివీడులో 37.52 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు దర్శిలో 35.16 శాతం, జగ్గయ్యపేటలో 27 శాతం, కమలాపురంలో 42.45 శాతం, రాజంపేటలో 34.38 శాతం, దాచేపల్లిలో 39.39 శాతం, గురజాలలో 35.55 శాతం పోలింగ్ నమోదైంది. ►కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 11.20 AM ►నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 37.68 శాతం పోలింగ్ నమోదైంది. ఆకివీడు నగర పంచాయితీ పోలింగ్ ప్రక్రియని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మస్వయంగా పర్యవేక్షించారు. పలు పోలింగ్ బూత్‌లను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ.. ఆకివీడు నగర పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం 11 గంటల వరకు దాదాపు 40 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్సై స్ధాయి అధికారులని బందోబస్తుకి వినియోగించామని పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాపర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. Time: 10.20 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నెల్లూరు 16వ డివిజన్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► అనంతపుం: పెనుకొండ జీఐసీ కాలనీలో మంత్రి శంకర్ నారాయణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► దర్శి నగర పంచాయతీలో 19 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ►గురుజాల నగర పంచాయతీలో 14 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ►దాచేపల్లి నగర పంచాయతీలో 19 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. Time: 9.20 AM ► బేతంచర్ల నగర పంచాయతీలో 20 వార్డులకు ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 18.73 శాతం పోలింగ్ నమోదైంది. ►ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 13.68 శాతం పోలింగ్ నమోదైంది. Time: 8.30 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్‌లో 6 వార్డులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 7.30 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ► బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ కోనసాగుతోంది. ► కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 31 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► కొండపల్లి మున్పిపాలిటీలో 29 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెనుకొండలో 20 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ► రాజంపేటలో 29 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ► కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కమలాపురం నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ► ఆకివీడు నగర పంచాయతీలో 20 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. Time: 7.15 AM నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 1206 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ సమయంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. Time: 7.00 AM ► నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్ ప్రారంభమైంది. ► నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు గానూ వైఎస్సార్సీపీ 8 డివిజన్లలో ఏకగ్రీవం అయింది. 45 డివిజన్లకు పోలింగ్ జరుగుతోంది. బరిలో 206 మంది అభ్యర్థులు ఉన్నారు. 4.47 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 384 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 4 వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ► బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 79 మంది అభ్యర్థులు ఉన్నారు. 38 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 400 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 45,463 మంది ఓట హక్కు వినియోగించుకోనున్నారు. ► కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. 39, 261 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: నెల్లూరు నగరపాలక సంస్థ సహా పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులు/డివిజన్లలో సోమవారం నిర్వహించే పురపోరుకు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. 325 డివిజన్లు/వార్డులు రాష్ట్ర వ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్/వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. వీటిలో 28 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 325 స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగనుంది. ఆయా స్థానాలకు వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ సహా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి మొత్తం 1,206 మంది పోటీ పడుతున్నారు. 908 పోలింగ్ కేంద్రాల్లో 8,62,066 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 349 సమస్యాత్మక, 239 అత్యంత సమస్యాత్మక, 38 సాధారణమైనవిగా గుర్తించారు. 2,038 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరించడంతో పాటు, వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు. 4 వేల మందికి పైగా సిబ్బంది ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి 4 వేల మందికిపైగా పోలింగ్ విధుల్లో ఉన్నారు. 556 సూక్ష్మ పరిశీలన, 81 రూట్ ఆఫీసర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ను చూసేలా వీడియో లింకులివ్వండి కుప్పం నగర పంచాయతీ పరిధిలో సోమవారం జరిగే ఎన్నికల్లో అన్ని బూత్‌లలో పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా తమకు లేదా తమ పార్టీ ప్రతినిధులకు వీడియా లింకు సౌకర్యం కల్పించాలంటూ అక్కడ 24 వార్డుల్లో పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు వేర్వేరుగా వినతిపత్రాలిచ్చారు. ఎన్నడూ ఎరుగని రీతిలో వచ్చిన ఈ వినతుల్ని చూసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు మన ఎన్నికల వ్యవస్థలో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డు చేయడం వంటిది సాధారణమే అయినప్పటికీ.. గోప్యంగా పోలింగ్ బూత్‌లో జరిగే ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరడంపై అధికారులు విస్తుపోతున్నారు. ఈ తరహా వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్ నిర్ణీత కీలక ఎన్నికల అధికారుల పర్యవేక్షణకు, లేదంటే ఎన్నికల అనంతరం వివాద సమయంలో అవసరమైతే సాక్ష్యాల కోసం ఉపయోగపడుతుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. కుప్పంలోని అన్ని పోలింగ్ బూత్‌ల ఎన్నికలను ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా వీడియో లింకులు కోరడంతోపాటు అనేక అంశాలపై టీడీపీ అభ్యర్థుల వినతులను జతచేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు తదుపరి చర్యల కోసం చిత్తూరు జిల్లా కలెక్టరు, ఎస్పీలకు లేఖ రాశారు. ఆయా వినతులలో పేర్కొన్న అంశాలపై అవసరమైనమేర చర్యలు తీసుకుని, ఆ వివరాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని సూచించారు. -
చంద్రబాబు కుప్పం ప్రజలకు చేసిందేం లేదు
-
కుప్పంలో టీడీపీ గూండాగిరి
సాక్షి ప్రతినిధి, తిరుపతి/కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ గూండాగిరి చేస్తూ దాడులకు తెగబడుతోంది. మరో ఐదురోజుల్లో ఇక్కడి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు దశాబ్దాలకుపైగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఓటమి టెన్షన్‌తో విధ్వంసకర రాజకీయాలకు తెరలేపారు. ఇన్నేళ్లుగా ఆ ప్రాంతాన్ని కనీసంగా కూడా అభివృద్ధి చేయని ఆయన నిర్వాకాన్ని గుర్తించిన అక్కడి ప్రజలు ఇటీవల వరుసగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఛీకొడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ఇటీవల కుప్పంలో రెండ్రోజులపాటు పర్యటించి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తన పరువు నిలబెట్టాలని స్థానికులను అభ్యర్థించారు. ఇందుకోసం ఆయన ఎప్పుడూలేని విధంగా ఒంగి ఒంగి దండాలు పెట్టారు. అయినాసరే పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో రూటు మార్చి దాడులకు తెరలేపారు. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ నేతల మకాం కుప్పం పట్టణానికి జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు ప్రచారానికి వెళ్తే.. బయట నేతలు వచ్చేశారని నానాయాగీ చేస్తున్న చంద్రబాబు.. మరోవైపు, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ నేతలను పెద్ద సంఖ్యలో కుప్పానికి తరలించారు. అది కూడా గొడవలకు, ఘర్షణలకు బాగా పేరున్న టీడీపీ నేతలను ఎంపిక చేసి మరీ రంగంలోకి దించారు. ఇందులో భాగంగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, బండబూతుల నేతగా పేరున్న విశాఖకు చెందిన బండారు సత్యనారాయణమూర్తి, తరచూ వివాదాలకెక్కే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రత్తిపాడు ఇన్చార్జ్ వరుపుల రాజా, విశాఖకు చెందిన ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తదితరులు గత కొద్దిరోజులుగా ఇక్కడే తిష్టవేసి ఉద్రిక్తతలు సృష్టిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నారు. ఇక ఆయా నేతలకు చంద్రబాబు గంటగంటకూ ఫోన్‌చేసి కుప్పం పరిస్థితులను ఆరా తీస్తున్నట్లు టీడీపీ వర్గాల కథనం. కుప్పం కమిషనర్ చాంబర్ ఎదుట టీడీపీ నేతలు. చిత్రంలో ధ్వంసం చేసిన చాంబర్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా బాబు ఇక.. కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరిగ్గా వారం కిందట చంద్రబాబు ఇక్కడి పురపాలక సంఘంలో ఓటును రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ‘‘ఏమో.. ఏదైనా జరగొచ్చేమో.. తన ఒక్క ఓటు అవసరమైతే...’’ అని ఆలోచించిన బాబు ఇటీవల కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తొలిసారిగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే.. బాబుకు ఆ అవసరం రానివ్వబోమని.. ఇక్కడ వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. -
కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంపై టీడీపీ నేతల దాడి
సాక్షి, చిత్తూరు: కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, చంద్రబాబు పీఏ మనోహర్ దాడికి దిగారు. అద్ధాలు ధ్వంసం చేసి, ఫర్నిచర్‌ను టీడీపీ నేతలు విసిరేశారు. 14వ వార్డు అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణపై మండపడ్డ టీడీపీ నేతలు.. దాడికి దిగారు. మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నా టీడీపీ నేతలు ఆగలేదు. కార్యాలయంపై దాడి చేసి మరీ, టీడీపీ నేతలు ధర్నాకు కూర్చున్నారు. -
Municipal Elections: బాబులో కుప్పం టెన్షన్
సాక్షి, తిరుపతి: 2019 సార్వత్రిక ఎన్నికలు మొదలు నిన్న మొన్నటి స్థానిక సంస్థలు, తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వరకు వరుస ఓటములతో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల రూపంలో మరో టెన్షన్ వెంటాడుతోంది. కుప్పం ఎన్నికల్లో ఇప్పుడు ఓటమి పాలైతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మరోసారి పరాభవం ఖాయమని ఆయన బెంబేలెత్తిపోతున్నారు. అందుకే కుప్పంపై ఆయన ‘ప్రత్యేక’ దృష్టిపెట్టి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చదవండి: Andhra Pradesh: ‘కోవిడ్’లోనూ కొలువులు కుట్రలు, కుతంత్రాలకు పన్నాగం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు ఒత్తిడి తట్టుకోలేక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. వాటిని పక్కాగా అమలుచేసేందుకు ఆయన, లోకేశ్.. టీడీపీ నేతలు, ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మాజీమంత్రి అమరనాథ్‌రెడ్డి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానితో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నారు. టీడీపీ శ్రేణులు ఏం చేయాలో ఏ రోజుకా రోజు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంతైనా ఖర్చు చేయండి నిజానికి.. కుప్పం మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీంతో ఎన్నికలను అధిగమించేందుకు భారీగా డబ్బులు, మద్యం, బహుమతులు పంపిణీ చేసేందుకు వెనుకాడొద్దని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బు ఎంతైనా ఖర్చుచేయాలని.. అవసరమైన మొత్తం తాను పంపుతానని ఇన్‌చార్జ్‌లకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఖర్చు బాధ్యతలను చంద్రబాబు తన పీఎస్ దొరస్వామినాయుడుకు అప్పగించినట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. రోజువారీ ప్రచారం నిమిత్తం ఎప్పటికప్పుడు కూలీలకు డబ్బులు, మద్యం, బిర్యాని పంపిణీ కూడా చేయమని ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఏపీలో మద్యం కొనుగోలు చేయవద్దని, పక్కనే ఉన్న కర్ణాటక మద్యంతోపాటు నాటుసారా తెప్పించుకోమని సూచించినట్లు సమాచారం. మద్యం కోసమే ప్రత్యేకంగా ఓ టీంని నియమించారు. ఇక ఓటర్లకు ఎంత ఇవ్వాలో తాను తరువాత చెబుతానని బాబు చెప్పినట్లు తెలిసింది. దాడి చేయండి.. ఎదురు కేసులు పెట్టండి ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం కలిగేలా వైఎస్సార్సీపీ శ్రేణులే టార్గెట్‌గా దాడులు చేయమని కూడా చంద్రబాబు సూచనలు చేసినట్లు కుప్పం టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టి.. వారిపైనే తిరిగి కేసు పెట్టాలని ఇన్‌చార్జ్‌లకు సూచనలు అందాయి. ఇందులో భాగంగానే శుక్రవారం వీ కోట టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ రంగనాథ్ తన అనుచరులతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు తప్ప మిగిలిన వారికి ఇక్కడ ఏం పని అని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గణపతి ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రంగనాథ్ అనుచరులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అదే విధంగా ఎన్ఎఫ్సీ కళాశాల వద్ద కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి మునస్వామి, బంధువు వెంకటేష్‌పై స్థానికేతరులైన టీడీపీ శ్రేణులు దాడిచేశారు. దాడిచేసిన వారే బాధితులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం బాబు ఆదేశాలకు అద్దంపడుతున్నాయి. కుప్పానికి పరిటాల, జేసీ వర్గీయులు కుప్పంలో అలజడులు సృష్టించి తద్వారా ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల, జేసీ వర్గీయులను దింపనున్నారు. అల్లర్లలో ఆరితేరిన వారిని కుప్పం ఎన్నికలకు వాడుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. వారంతా ఒకట్రెండు రోజుల్లో కుప్పానికి చేరుకోనున్నారు. వీరి కోసం కుప్పం శివారుల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. వీరు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుని టీడీపీ ప్రచారాల్లో రచ్చచేయాలని.. వీలైతే దాడులు చేయాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనల ద్వారా తన అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు కూడా చంద్రబాబు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిసింది. వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడం ఈ బృందం బాధ్యత. -
ఏపీ: ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ►గ్రామపంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ. ►మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు: 8వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ►పరిషత్ ఎన్నికలు: ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 16న పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్ జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ఇల్లే కదా.. ‘సేంద్రియ’ సీమ
సాక్షి, సిద్దిపేట: చెత్తే కదా.. అని తీసిపారేయకండి. అది సేంద్రియ ఎరువుగా మారి సత్తా చాటుతోంది. మిద్దెతోటలకు జవం అవుతోంది. మొక్కలకు జీవం పోస్తోంది. ఒకటి, రెండు కాదు, ఏకంగా 1,450 ఇళ్ల ల్లో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. వీటి ని ఇంటి మేడపైన సాగవుతున్న మిద్దెతోటలకు విని యోగిస్తున్నారు. చెత్తరహిత సమాజం దిశగా కృషి చేస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. ఇంట్లోనే సేంద్రియ ఎరువులను తయారు చేసే విధానాన్ని వివరిస్తున్నారు.చెత్తను ఎరువుగా తయారు చేసి సాగుకు ప్రయోజకనకరంగా మలచడంతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తోంది. పట్ణణవాసులందరూ ఈ విధానాన్ని అవలంబిస్తే చెత్త, డంపింగ్ యార్డుల సమ స్యలు తీరుతాయని అధికారులు అంటున్నారు. హానికరమైన చెత్తనే ప్రతిరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్తబండ్లు పట్టణంలోని గృహాలకు తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నాయి. పట్టణంలో 26,045 నివాస గృహాలుండగా, 1,450 ఇళ్లలో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ గృహాలవారు కేవలం హానికరమైన చెత్తనే చెత్తబండికి అందజేస్తారు. తడి, పొడి చెత్తతో వేర్వేరుగా సేంద్రియ ఎరువును తయారు చేసి మిద్దెతోటల్లోని మొక్కలకు చల్లుతున్నారు. ఇలా ఇంట్లోనే తయారు చేసే సేంద్రియ ఎరువుతో కూరగాయల బాగా కాస్తుండటంతో పట్టణంలో సేంద్రియ ఎరువుల తయారీ సత్ఫలితాలిస్తోంది. రోజూ తరగతులు: సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. బెంగుళూరు తరహాలో సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. అక్కడే సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే విధమైన స్వచ్ఛబడిని తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఇతర మున్సిపాలిటీలు ముందుకొస్తున్నాయి. హానికరమైన చెత్తనే బయటకు.. మా ఇంటిలోని తడి, పొడి చెత్తను చెత్తబండికి ఇవ్వం. గతేడాది నుంచి ఇంట్లోనే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. ఇంట్లో తయారు చేసిన ఎరువునే మిద్దెతోటలోని కూరగాయల మొక్కలకు చల్లుతున్నాం. ఇంటికి సరిపడా కూరగాయలు మిద్దె తోటలో పండుతున్నాయి. - డాక్టర్ డీఎన్.స్వామి, సిద్దిపేట మన చెత్త.. మన ఎరువు మా ఇంట్లో తడి, పొడి చెత్తతోనే ఎరువు తయారు చేస్తున్నాం. మిద్దెతోట కోసం ఎరువులను ఇదివరకు బయట నుంచి కొనుగోలు చేశాం. గతేడాది నుంచి ఇంట్లోనే ఎరువు తయారు చేసి మిద్దెతోటలో వినియోగిస్తున్నాం. మా ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులందరికి వారికి సరిపడా కూరగాయలను అందిస్తున్నా. -నాగరాజు, సిద్దిపేట ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన పెంచు తున్నాం. మంత్రి హరీశ్‌రావు చొరవతో స్వచ్ఛ బడి ఏర్పాటు చేశాం. సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాం. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 1,450 నివాసాల్లో సేంద్రియ ఎరువులు సొంతంగా తయారు చేస్తున్నారు. -రమణాచారి, కమిషనర్, పురపాలక సంఘం, సిద్దిపేట -
11 ఏళ్ల రాజం పేట మున్సిపాలిటీ ఎన్నికలు
-
కుప్పం కుతకుత.. మున్సిపాలిటీ హోదాలో తొలిసారి ఎన్నికలు
కుప్పంలో ఎన్నికల వేడి రాజుకుంది.. నోటిఫికేషన్ విడుదల కావడంతో నేతల్లో కాక మొదలైంది.. స్థానిక సంస్థల విజయంతో వైఎస్సార్సీపీలో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది.. మున్సిపల్ పోరులోనూ జోరు కొనసాగించేందుకు సమాయత్తమవుతోంది.. వరుస ఓటములతో డీలా పడిన టీడీపీలో నైరాశ్యం ఆవరించింది.. అధినేత చంద్రబాబు పర్యటన సైతం కార్యకర్తల్లో ఉత్సాహం నింపలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుప్పంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాలెట్ పద్ధతిలో పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కేటగిరీల వారీగా వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేసింది. 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు సన్నాహాలు చేస్తోంది. 8వ తేదీన బరిలో మిగిలే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనుంది. అనంతరం 15న పోలింగ్.. 17వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఈక్రమంలోనే జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. చిత్తూరు అర్బన్: జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల్లో కదలిక మొదలైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి ఎదురైంది. ఎన్నో ఏళ్లుగా చిత్తూరు ఎంపీ స్థానం గెలుపులో కీలకంగా ఉన్న కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డెప్పకు జైకొట్టారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేసి టీడీపీ అధినేతకు ఝలక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుని సత్తా చాటాలని వైఎస్సార్సీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. పెండింగ్ స్థానాల్లోనూ ఎన్నికలు కుప్పం పురపాలక సంఘంతో పాటు జిల్లాలో పెండింగ్‌లోని నగరి మున్సిపాలిటీ 16వ వార్డుకు, ఇతర నియోజకవర్గాల్లోని 2 జెడ్పీటీసీ, 39 ఎంపీటీసీ , 6 సర్పంచ్, 44 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో వార్డు మెంబర్, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే చోట పంచాయతీకి మాత్రమే కోడ్ వర్తిస్తుంది. జెడ్పీటీసీ ఎన్నిక నిర్వహించే ప్రాంతలో మొత్తం రెవెన్యూ డివిజన్లో కోడ్ అమల్లోకి వస్తుంది. ఎంపీటీసీ ఎన్నికైతే మండలానికి, పురపాలక వార్డుకు మొత్తం మున్సిపాలిటీకి ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎస్ఈసీ పేర్కొంది. ఎన్నికల షెడ్యుల్ ఇలా.. ►3వ తేదీన వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం ►5వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ►6వ తేదీ ఉదయం 11 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు అవకాశం ►8వ తేదీ సాయంత్రం పోటీలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ ►15వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్ర 5గంటల వరకు పోలింగ్ ►16వ తేదీ అవసరమైన బూత్‌లలో రీపోలింగ్ ►17వ తేదీ ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం -
ఎంత పనిచేశావ్.. వెంకట్రావ్..! నమ్మించి..
సాక్షి, కందుకూరు: నమ్మినవాళ్లను నిలువునా ముంచాడు ఓ మున్సిపల్ ఉద్యోగి. అందినకాడికి అప్పు తీసుకొని అడ్రస్ లేకుండా పోయాడు. ఈ ప్రబుద్ధుడికి అప్పులిచ్చిన వాళ్లలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. గత నాలుగు నెలలుగా అతని ఆచూకీ లేకపోవడంతో అప్పు ఇచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. విధులకు ఎగనామం పెట్టిన ఉద్యోగిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చీరాలకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో గత ఆరేళ్లుగా హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలో పరిచయాలు పెంచుకున్నాడు. సొంత అవసరాలు ఉన్నాయంటూ తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. కందుకూరు పట్టణంలో పలువురు ఉద్యోగులు, ఇతర వ్యక్తుల వద్ద సుమారు రూ.25 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని అడిగిన వారికి సాకులు చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే 4 నెలల నుంచి వెంకట్రావ్ అడ్రస్ లేకుండా పోయాడు. వెంకట్రావు కుటుంబం తూర్పుకమ్మపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండు రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు కందుకూరు వచ్చి ఇంట్లో సామాగ్రిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పులిచ్చినవాళ్లు అడ్డుకున్నారు. వివాదం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకుని అప్పులవాళ్లకి సర్దిచెప్పి పంపారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో సామాగ్రి తీసుకుని వెళ్లిపోయారు. వెంకట్రావ్ ఆచూకీ తెలియదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అతనిపై చీటింగ్ కేసు పెట్టేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వెంకట్రావ్‌పై ఇదే విధమైన కేసులు ఒంగోలులోనూ ఉన్నాయని, కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు చెబుతున్నారు. చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం) నాలుగు నెలలుగా విధులకు డుమ్మా మున్సిపాలిటీ హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకట్రావ్ గత నాలుగు నెలల నుంచి విధులకు హాజరుకావడం లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. జూన్ 23వ తేదీన రెండు రోజులు సీఎల్ పెట్టి వెళ్లారని, అప్పటి నుంచి విధులకు రావడం లేదని చెప్పారు. ఇప్పటికే ఆయన అద్దెకు ఉంటున్న ఇంటి అడ్రస్‌కు పలుమార్లు నోటీసులు పంపామని, కానీ ఇల్లు లాక్ చేసి ఉండటంతో తిరిగి మున్సిపాలిటీకి వచ్చాయని వెల్లడించారు. ఈ విషయంపై మున్సిపల్ ఆర్డీకి ఫిర్యాదు చేసినట్లు మేనేజర్ శ్రీనివాసన్ తెలిపారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
‘డబ్బు’ల్ ధమాకా!
మణికొండ(హైదరాబాద్): హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అక్రమాలకు అంతులేకుండాపోతోంది. మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డుగా చూపిన స్థలంలో బహుళ అంతస్తు భవనానికి అనుమతి ఇచ్చిన ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఒక లేఔట్‌కు అనుమతి జారీ చేసిన హెచ్ఎండీఏ.. అందులోని ప్రజావసరాలకు వదిలిన స్థలాన్ని కలుపుకొని మరో లేఔట్‌కు పర్మిషన్ ఇచ్చింది. రెండో లేఔట్ జారీ చేసేనాటికే.. ఈ ఖాళీ స్థలం స్థానిక గ్రామ పంచాయతీకి గిఫ్డ్‌డీడ్ కింద రిజిస్ట్రేషన్ కూడా కావడం గమనార్హం. హెచ్ఎండీఏ చేసిన తప్పును ఎత్తిచూపాల్సిన స్థానిక పురపాలక సంఘం.. లేఔట్ కాపీని పట్టించుకోకుండా తమ పేరిట రిజిష్టర్ అయిన ఖాళీ స్థలంలో వేరొకరికి బిల్డింగ్ పర్మిషన్ను జారీ చేసింది. భవన నిర్మాణ అనుమతి సమయంలో స్థల యజమాని ఎవరనేది కూడా చూడకుండా మున్సిపాలిటీ గుడ్డిగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అవినీతి భాగోతం ఐటీ హబ్ సమీపంలోని మణికొండ పురపాలిక పరిధిలో జరిగింది. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమికి స్కెచ్ వేసిన రియల్టర్లకు కొందరు పెద్దలు, అధికారులు కూడా తోడు కావడంతో భవన నిర్మాణానికి పునాది పడింది. పంచాయతీ పేర రిజిస్ట్రేషన్ 17.36 ఎకరాల విస్తీర్ణంలో వేసిన తిరుమలహిల్స్ లేఔట్లో 8,633 గజాలను పార్కు స్థలాలుగా నిర్దేశించారు. ఈ మేరకు ఈ విస్తీర్ణాన్ని స్థానిక పంచాయతీకి 1993లో గిఫ్ట్‌డీడ్ కూడా చేశారు. మూడేళ్ల క్రితం ఈ పంచాయతీ మణికొండ మున్సిపాలిటీలో విలీనం కావడంతో డాక్యుమెంట్లను ఇక్కడకు బదలాయించారు. విలువైన ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సిన మున్సిపల్ యంత్రాంగం.. కనీసం కంచె కూడా వేయకుండా వదిలేసింది. అంతేగాకుండా.. ఈ స్థలాన్ని చూపుతూ మరో లేఔట్ వెలిసినా చోద్యం చూస్తూ ఉండిపోయింది. దీంతో బిల్డర్ల ఆటలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వేసిన రెండో లేఔట్లో ఇళ్ల నిర్మాణాలకు టౌన్‌ప్లానింగ్ విభాగం పర్మిషన్లు జారీ చేస్తుండటం విశేషం. స్కెచ్ వేశారు.. చెక్కేశారు పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 87, 119లో 17.36 ఎకరాలలో తిరుమల్హిల్స్ పేరిట 1990లో హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హుడా) 10132/ఎంపీ2/హుడా/1990 పేరిట లేఔట్‌కు అనుమతి ఇచ్చింది. హుడా అనుమతి ఇచ్చిన వెంచర్ కావడం.. నగరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడి ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. క్రమేణా ఈ వెంచర్ కాస్తా సంపన్నుల కాలనీగా మారింది. దీంతో ఖాళీ స్థలాలపై పాత రియల్టర్ల కన్ను పడింది. పాత వెంచర్‌లోని ఖాళీ స్థలాలకు పక్కనే మరికొంత స్థలాన్ని (వేరే యజమాని) కలుపుకొని రెండో లేఔట్‌కు ప్రణాళిక రచించారు. హెచ్ఎండీఏ అధికారులతో కుమ్మక్కై 6 వేల గజాల పార్కు స్థలాన్ని (మొదటి లేఔట్లో చూపిన) కాజేసే ఎత్తుగడకు తెర లేపారు. రెండో లేఔట్ ప్రకారం స్థలాలను అమ్మేసి రియల్టర్లు చెక్కేశారు. తాజాగా ఈ ప్లాట్లను కొన్నవారు ఇళ్ల నిర్మాణాలకు రావడం.. మొదటి లేఔట్లో కొనుగోలు చేసినవారు వీరిని అడ్డుకోవడంలో అసలు కథ బయటపడింది. మరో విచిత్రమేమిటంటే.. రెండో లేఔట్లో నిబంధనలకు అనుగుణంగా కేటాయించాల్సిన పార్కు స్థలాన్ని పక్కనే ఉన్న అజయ్హిల్స్ కాలనీ పార్కును చూపడం. అధికారుల వైఫల్యం హుడా అనుమతులతో వచ్చిన లేఔట్లో పార్కు స్థలాలను అప్పటి పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినా వాటిని పరిరక్షించడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలోనే ప్రహరీ నిర్మాణం చేస్తే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – డాక్టర్ పి.అవినాష్, తిరుమలహిల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసు ఉండగా అనుమతులా..? తమ కాలనీ పార్కు స్థలాలుగా చూపిన దాన్నే తిరిగి హెచ్ఎండీఏ అధికారులు లేఔట్‌కు అనుమతి ఇవ్వటం దారుణం. దాన్ని రద్దుచేశామని ఒకవైపు చెబుతునే మరోవైపు మున్సిపాలిటీ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వటం మరింత దారుణం. సదరు భూమి విషయం కోర్టులో ఉన్నా ఇలాంటి చర్యలు జరగటాన్ని ప్రభుత్వం సమర్ది్థస్తుందా..? లేదంటే అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వం, శాఖలపై నమ్మకం పెరుగుతుంది. – రంగాచారి, తిరుమలహిల్స్ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి నిబంధనల ప్రకారమే అనుమతులు హెచ్ఎండీఏ జారీ చేసిన లేఔట్ కావడంతోనే భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేశాం. సదరు లేఔట్ రద్దు అయిన విషయం తెలియదు. కాలనీవాసులు పేర్కొంటున్న పార్కు భూమి కోర్టు వివాదంలో ఉండటంతో దాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. గతంలో గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచే దానిపై వివాదాలు కోర్టులో ఉన్నాయి. – ఎస్.జయంత్, కమిషనర్, మణికొండ మున్సిపాలిటీ -
నల్గొండ మున్సిపాలిటీలో భారీ అవినీతి కేసు
-
నల్గొండ మున్సిపాలిటీలో రూ.5 కోట్ల అవినీతి
-
నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: కదులుతున్నడొంక..
నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా, మరో ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ చార్జ్ బిల్ కలెక్టర్ పృథ్వీరాజ్, పీహెచ్ వర్కర్ కొండయ్య, రిటైర్డ్ పీహెచ్ వర్కర్ వెంకులును అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అరెస్టు అయిన వారిలో పీహెచ్ వెంకులు ఇప్పటికే రిటైర్ అయినట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన వారిలో రషీదులుపై మనీ వాల్యూయేషన్ పుస్తకాలను ఆడిట్ అధికారుల కంటపడకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, 2015లో బయటకొచ్చిన ఈ ఉదంతంలో రూ. 5.04 కోట్ల అవినీతికి సంబంధించి ఇప్పటి వరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొంత మంది అధికారులు ఇప్పటికే సెలవుల్లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు తమ సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్ -
నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసులో మరో ముగ్గురు అరెస్ట్
-
నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: మరో ముగ్గురు అరెస్టు
నల్లగొండ: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: మరో ముగ్గురు అరెస్టు జిల్లాలోని మున్సిపాలిటీలో నిధులు స్వాహా చేసిన ఉదంతంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కాగా,ఈ ఘటనలో తాజాగా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 2015లో వెలుగు చూసిన 5.04 కోట్ల అవినీతి బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా, బిల్ కలెక్టర్ బిక్షం, ఎన్ఆరఎం, భానుకుమార్ రెడ్డి, కార్యాలయ సబార్డినేటర్ ముంత మల్లేషాన్ని అరెస్టు చేశారు. విడతల వారిగా అరెస్టులు చేయడంతో తప్పించకునేందుకు బెయిల్ కోసం మిగతా ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది అధికారులు తమ ఫోన్లను స్విచ్‌ఆఫ్‌చేసుకుని సెలవుల్లో వెళ్లిపోయారు. మొత్తం 29 మంది ఉద్యోగులపై కేసు నమోదుకాగా వారిలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం 26 మందిపై విచారణ కొసాగుతోంది. వీరిలో ఆరుగురు అరెస్టు కాగా, ఇంకా 20 మంది అరెస్టు కావాల్సి ఉంది. కాగా, మరికొంత మంది ఉన్నతాధికారుల పలుకుబడి ఉపయోగించుకుని అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్ -
Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలో నిధులు స్వాహా చేసిన ఉదంతంలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఆరేళ్ల క్రితం నకిలీ బిల్లు పుస్తకాలను ముద్రించి అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ-2 రేఖల అరుణకారి, ఏ-12 సత్యనారాయణ, ఏ-16 ఈశ్వరయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 2010-2014 మధ్యలో నల్లా బిల్లు, ఇంటి నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్నును మున్సిపాలిటీ ఖాతాలో జమచేయని ఉద్యోగులు, మొత్తం రూ. 5.04 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 29 మంది ఉద్యోగులు, 18 మంది పర్యవేక్షణా అధికారులపై 2015లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మిగతా ఉద్యోగుల అరెస్ట్‌కు రంగం సిద్ధం అయింది. అవినీతి ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్ మొదలైంది. మిగతా ఉద్యోగులు సెలవు పెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఇప్పటికే నలుగురి మృతి చెందారు. మిగతావారిని నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
వ్యర్థం.. ప్రయోజనమే
సిద్దిపేట జోన్: జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛతలో గుర్తింపు పొందిన సిద్దిపేట మున్సిపాలిటీలో చేపట్టిన వినూత్న ప్రయోగం విజయమవంతమైంది. ఆరు నెలల క్రితం ప్రారంభమైన మానవ విసర్జితాల యూనిట్ నుంచి తొలి ఫలితం వచ్చింది. పట్టణంలో నివాస గృహాల సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధీకరణ చేసి ఎరువు తయారు చేశారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా గత ఫిబ్రవరిలో సుమారు రూ.2 కోట్లతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు పట్టణ శివారులో ఎకరం స్థలంలో మానవ విసర్జితాల శుద్ధీకరణ యూనిట్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని 35 వేల నివాస గృహాల నుంచి సెప్టిక్ ట్యాంక్‌లోని మానవ విసర్జితాల ఎఫ్ఎస్టీపీ (ఫికెల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)కు తరలిస్తారు. అక్కడ అనారోబిక్ సేఫ్టీలైజేషన్ రియాక్టర్లో విసర్జితాలను మెథనైజేషన్ పద్ధతిలో శుద్ధి చేసి విసర్జితం, నీటిని వేరు చేస్తారు. నీటిని పాలిషింగ్ ఫండ్‌లో పాస్పరేట్, సల్ఫర్ ద్వారా శుద్ధిచేసి ప్యూరిఫైడ్ వాటర్‌గా మార్చుతారు. 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది. ఈ ప్రక్రియ మొత్తం సాంకేతికతతో జరుగుతుంది. తొలి ఫలితం సిద్ధం: ఆరు నెలల క్రితం మొదలైన యూనిట్ తొలి ఫలితం నేడు సిద్ధమైంది. లక్షా 20 వేల లీటర్ల సామర్ధ్యం గల శుద్ధీకరణ ప్లాంట్‌లో ప్రతిరోజూ 20 వేల లీటర్ల విసర్జితాలు శుద్ధిచేసే అవకాశం ఉంది. గత ఆరు నెలల్లో 100కు పైగా వాహనాల ద్వారా లక్షా 60 వేల లీటర్ల మానవ విసర్జితాలను సేకరించారు. దాని నుంచి 4వేల కిలోల ఎరు వు, 16 వేల లీటర్ల శుద్ధిచేసిన నీటిని తయారు చేశా రు. నీటిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. రూ.5కు కిలో చొప్పున.. సిద్దిపేట పట్టణంలో సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన విసర్జితాలను శుద్ధీకరణ చేసి 4 వేల కిలోల ఎరువు తయారు చేశాం. దాన్ని మున్సిపాలిటీకి రూ. 5కు కిలో చొప్పున విక్రయించే ఆలోచనలో ఉన్నాం. భవిష్యత్‌లో శుద్ధీకరణ లక్ష్యం మరింతగా పెంచుతాం. – రవికుమార్, యూనిట్ ఇన్చార్జ్ -
వైరా మున్సిపాలిటీలో ఏడాదికి ముగ్గురు కమిషనర్లు బదిలీ
-
Photo Feature: ఐడియా అదిరింది సారు...
ఇవి నిర్మల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పశువులు. రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించే పశువులపై మున్సిపల్ సిబ్బంది ఎంసీఎన్ అని రాస్తారు. దీంతో వాటిని సదరు పశువుల యజమానులు మళ్లీ రోడ్లపైకి వదలకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ అవే పశువులు మళ్లీ రోడ్డుపై కనిపిస్తే వాటిని కార్పొరేషన్ సిబ్బంది పట్టుకుని గోశాలకు తరలిస్తారు లేదా అడవిలో వదిలేస్తారు. గేదెలు, మేకల వంటివి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రయాణికులకు ఆటంకం కలిగించడంతోపాటు ప్రమాదాలకు కూడా కారణమవుతున్న నేపథ్యంలో వీటికి చెక్ చెప్పేందుకు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఇలా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్. అవ్వకెంత కష్టం.. చేతితో చిల్లిగవ్వలేదు.. ఉన్న ఒక్క కొడుకు బతుకుతెరువు కోసం వెళ్లి వేరే ఊరిలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కాసిపేట మండలంలోని లక్ష్మీపూర్‌లో ఉంటున్న కన్న కూతురును చూడాలనిపించింది ఈ అవ్వకు. అయితే, ప్రయాణానికి డబ్బులు లేవు.. కానీ కూతురును చూడాలనే కోరిక ముందు ఇదేమీ కష్టం అనిపించలేదు. దీంతో ఇలా కాలినడకన నెత్తిన బట్టలమూటతో బయలుదేరి వెళ్తూ సాక్షి కెమెరాకు కనిపించింది. – సాక్షి ఫోటోగ్రాఫర్, మంచిర్యాల వినూత్న యంత్రం.. పనిలో వేగం జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన రైతు ముత్తినేని సత్యం పవర్ వీడర్ యంత్రానికి మార్పులు చేర్పులు చేసి మరింత సులభంగా సాగు పనులు చేస్తుండడం ఇతర రైతులను ఆకట్టుకుంటోంది. పత్తి, మిరప పంటల సాగు చేసే సత్యం రూ.55 వేలతో పవర్ వీడర్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. స్వతహాగా మెకానిక్ అయిన ఆయన యంత్రానికి కొన్ని మార్పులు చేశాడు. నడుస్తూ పనిచేయాల్సిన పవర్ వీడర్‌ను బైక్‌లా మార్చేందుకు ముందు భాగంలో మూడో చక్రాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి తోడు వెనుక భాగంలో ట్రాక్టర్ మాదిరి గొర్రు పైకి.. కిందకు లేపేలా బిగించాడు. దీంతో ఎన్ని ఎకరాలైనా సరే.. కూర్చుని మరీ పత్తి, మిరప తోటలో గుంటుక తీయడం, కలుపు తీయడం సులభమవుతోందని తెలిపాడు. పత్తి, మిరప, కూరగాయల సాగు చేసే రైతులకు ఈ యంత్రం ఉపయోగకరంగా ఉంటుందని సత్యం వెల్లడించాడు. ఉప్పొంగిన ‘భగీరథ’ మహబూబ్‌నగర్ మండలంలోని మన్యం కొండ స్టేజీకి సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ వాల్వ్ నుంచి గురువారం నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ ఎత్తున నీరు లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. దీనిపై మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణను వివరణ కోరగా.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి, మహబూబ్‌నగర్ మండలం రాంరెడ్డి గూడెంలోని వాల్వులు కొంత కాలంగా లీక్ అవుతున్నాయని, వాటికి మరమ్మతు చేయడానికి వీలుగా మన్యంకొండ వద్ద నీరు విడిచామని తెలిపారు. నీరు మొత్తం ఖాళీ అయితేనే వాల్వు మరమ్మతు చేయడానికి వీలవుతుందని, నీరు ఖాళీ అయ్యాక తాను వాల్వ్‌లను పరిశీలించి లీకేజీలను సరిచేయించానని ఆయన వివరించారు. – జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) -
ఆటోవాలా.. నేడు నిడదవోలు వైస్ చైర్మన్‌గా
నిడదవోలు: ఆయన ఆటో డ్రైవర్.. ఇప్పుడు నిడదవోలు పురపాలక సంఘం రెండో వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆటోడ్రైవర్ యలగాడ బాలరాజును వైస్ చైర్మన్‌గా ఎంపికచేయడంపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పురపాలక సంఘాల్లో ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉండాలనే నూతన ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడంతో నిడదవోలు పట్టణంలో బాలరాజును పదవి వరించింది. యలగాడ వెంకన్న, రాములమ్మ ఆరుగురు సంతానంలో మూడో కుమారుడు బాలరాజు. చిన్నతనం కష్టాలు ఎదుర్కొంటూ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. చిన్నతనంలో సైకిల్ మెకానిక్‌గా పని చేసి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుక్కొని డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆపదలో తోటివారికి సాయం చేస్తూ అందరి మన్ననలు పొందేవారు. 2008 నుంచి 2014 వరకు హరిజన యువజన సేవా సంఘం అధ్యక్షుడిగా.. 2015లో మదర్ థెరిస్సా ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. మొదట కాంగ్రెస్ పార్టీలో తిరిగిన అతను 2014లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌గా పోటీ చేసి 350 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి వార్డులో ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుండేవారు. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూనే మరోపక్క ప్రజాప్రతినిధినిగా తన బాధ్యతల్ని సమర్ధవంతంగా పోషించారు. బాలరాజు పార్టీకి చేస్తున్న సేవలు గుర్తించి రెండోసారి కౌన్సిలర్ సీటు ఇచ్చారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 13 వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి 385 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే
సాక్షి, అమరావతి: రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కనీస వేతనం చెల్లించాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. సమాన పనికి కనీస వేతనం కూడా చెల్లించకపోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, రాజ్యాంగంలోని అధికరణ 14 ప్రకారం వివక్ష చూపడమేనని పేర్కొంది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం చెల్లించాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. అయితే తమ సర్వీసులను క్రమబద్ధీకరించేలా ఆదేశాలివ్వాలన్న బాల్వాడీ టీచర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న తాము రెగ్యులర్ టీచర్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా తమకు కనీస వేతనాలు చెల్లించడంగానీ, తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంగానీ చేయడం లేదంటూ జానపరెడ్డి సూర్యనారాయణ, మరో 49 మంది హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. మొదట్లో నెలకు రూ.375 వేతనం ఇచ్చేవారని, తరువాత దాన్ని రూ.1,300కు, 2016లో రూ.3,700కు పెంచారని పిటిషనర్ల న్యాయవాది తెలిపారు. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారికి కనీస వేతనం రూ.6,700గా నిర్ణయిస్తూ ప్రభుత్వం 2011లో జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ జీవో ప్రకారం కనీస వేతనం చెల్లించాలని మునిసిపల్ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసినా, జీవీఎంసీ అమలు చేయలేదని తెలిపారు. పిటిషనర్లు ఔట్‌సోర్స్ పద్ధతిలో ఓ ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారని, అందువల్ల వారు సర్వీసు క్రమబద్ధీకరణకు అర్హులు కాదని జీవీఎంసీ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి.. పిటిషనర్లు రెగ్యులర్ ఉద్యోగుల్లాగే 8 గంటలు పనిచేస్తున్నప్పుడు వారితో సమానంగా వేతనం పొందేందుకు అర్హులని తీర్పు చెప్పారు. వారికి కనీస వేతనాన్ని వర్తింపజేయాలని పురపాలకశాఖను ఆదేశించారు. పిటిషనర్లు ఎన్‌ఎంఆర్‌లుగా, రోజూవారీ వేతనాలు పొందేవారిగా నియమితులు కాలేదని, ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్స్ పద్ధతిలో నియమితులయ్యారని, సర్వీసు క్రమబద్ధీకరణ కోరజాలరని తీర్పులో పేర్కొన్నారు. -
కరోనా విజృంభిస్తోంది.. ఇకనైనా మారండి సారు
బంజారాహిల్స్: కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం మైక్రో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ జీహెచ్ఎంసీ సర్కిళ్ల పరిధిలో వీర్‌నగర్, ప్రేమ్‌నగర్, బాపునగర్, ఎల్లారెడ్డిగూడ. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ తదితర ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ జోన్లలో జీహెచ్ఎంసీ అధికారులు తగిన జాగ్రత్తలు, పారిశుద్ధ్య సమస్యలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. రోజువారి పర్యవేక్షణ కూడా అవసరం. ►పర్యవేక్షణ కరువు.. మేయర్ ►దృష్టిసారిస్తేనే ముందుకు.. ►మైక్రో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం గత వారం రోజుల నుంచి సంబంధిత సిబ్బంది, అధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. కనీసం అటువైపు తొంగిచూడటం లేదు. ►తాజాగా బుధవారం గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్ జోన్లో క్రిమి సంహారక స్ప్రే (ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని)ను చేయించారు. ఇదంతా రోజువారి కార్యక్రమం కాగా మేయర్ దృష్టిసారిస్తేనే సంబంధిత సిబ్బంది ఒక రోజుకు కదిలారు. మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ►శానిటైజేషన్ చేపట్టేందుకు ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ►ఇటీవల నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య డ్రైవ్ లు మాత్రం నిర్వహించారు. ►మైక్రో కంటైన్మెంట్ ఏర్పాటు చేసినట్లు కొంత మంది అధికారులకు సమాచారమే లేదని తెలుస్తుంది. ►మైక్రో డిపార్ట్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ నుంచి కానీ, ఉన్నతాధికారుల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు, సూచనలు జారీ కాలేదని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఒకరు స్పష్టం చేశారు. ►ఈ విషయంపై ఖైరతాబాద్ జోన్ జీహెచ్ఎంసీ అధికారులు కూడా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. ►మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రతిరోజూ పారిశుద్ధ్య సిబ్బంది పర్యటించి చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ►ప్రజలు ఇష్టారాజ్యంగా బయట తిరగకుండా నిబంధనలు ఉండాలి. ►ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించిన తర్వాతనే రోడ్లపై తిరగాల్సి ఉంటుంది. ►నిత్యం హైడ్రో క్లోరైట్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ►ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉందని బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా స్థానికులను అప్రమత్తం కూడా చేయాల్సి ఉంటుంది. ►ఇలాంటి ప్రోటోకాల్స్ ఏవీ మైక్రో ఈ జోన్లలో అమలు చేయడం లేదు. ►తమ నివాసిత ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉందనే విషయమే అక్కడ ప్రజలకు తెలియదంటూ కోవిడ్–19పై అధికారులు ఎంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ►మాకు ఎలాంటి సూచన లేదు.. మేమేం చేయాలి.. ►సరైన సూచనలు, జాగ్రత్తలు లేకపోతే తాము మాత్రం ఏం చేయాలంటూ జీహెచ్ఎంసీ కింది స్థాయి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ►మేయర్ కదిలింది కాబట్టి ఒక రోజు స్ప్రే చేశారు. ►మరి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది అధికారులకే తెలియాలి. ►మైక్రో కంటైన్మెంట్ జోన్ అన్నది కాగితం మీదనే కనబడుతున్నదని క్షేత్రస్థాయిలో దాని జాడే లేదని స్థానికులు దుయ్యబడతున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో అసలు కర్ఫ్యూ ఉందా? ఓ యువతి ట్వీట్ ) -
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, రేపు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి ఈనెల 15న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయను న్నారు. ఫలితాలు వెలువడిన తరువాత మేయర్/ చైర్పర్సన్ల ఎన్నిక కోసం విడిగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈనెల 29 లేదా 30న పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం. ఈ మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారంతో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓట్లగణన పూర్తిచేసి తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. తుది ఓటర్ల జాబితా రాగానే కార్పొరేషన్లలో డివిజన్లకు, మునిసి పాలిటీల్లో వార్డులకు రిజర్వేషన్లను ప్రభుత్వం గురువారం ప్రకటించనున్నట్లు మునిసిపల్ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘా నికి సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. కరోనా నిబంధనలను అనుసరించి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుకు అనూహ్య స్పందన
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అన్ని వసతులతో లేఅవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా ప్లాట్లు విక్రయించే ఈ ప్రాజెక్టు పట్ల మధ్యతరగతి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న డిమాండ్ సర్వేనే అందుకు నిదర్శనం. ఈ నెల 1 నుంచి 10 వరకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన డిమాండ్ సర్వేలో ఏకంగా 2,32,369 ప్లాట్లకు ఆసక్తి కనబరచడం విశేషం. వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఈ డిమాండ్ సర్వే నిర్వహించారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చొప్పున మాత్రమే సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఊహించిన దానికంటే అధికంగా డిమాండ్ స్మార్ట్టౌన్ల పట్ల రాష్ట్రంలో పట్టణ ప్రాంత ప్రజల నుంచి ఊహించిన దానికంటే భారీ డిమాండ్ వ్యక్తమవుతోంది. డిమాండ్ సర్వేకు చివరి రోజు అని ముందుగా ప్రకటించిన ఒక్క ఆదివారమే ఏకంగా 74 వేల ప్లాట్లకు ప్రజల నుంచి సుముఖత వ్యక్తం కావడం విశేషం. ► ఒక్కోటి 150 చ.గజాల విస్తీర్ణం ఉండే 76,018 ప్లాట్ల కోసం ఆసక్తి వ్యక్తమైంది. ► ఒక్కోటి 200 చ.గజాల విస్తీర్ణం ఉండే 77,247 పాట్ల కోసం సానుకూలత చూపారు. ► 240 చ.గజాల విస్తీర్ణం ఉండే 79,104 ప్లాట్ల కోసం ఆసక్తి చూపారు. డిమాండ్ సర్వే పొడిగింపు వరుస సెలవులు రావడంతో డిమాండ్ సర్వేను పొడిగించాలని పలువురు పురపాలక శాఖను కోరారు. దీంతో సర్వేను ఈ నెల 20 వరకు పొడిగించినట్టు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ వి.రాముడు తెలిపారు. డిమాండ్ సర్వే అనంతరం తదుపరి కార్యాచరణ డిమాండ్ సర్వే పూర్తి చేశాక స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుపై పురపాలక శాఖ తుది అంచనాకు వస్తుంది. దాని ప్రకారం భూసేకరణ నిర్వహిస్తారు. అనంతరం నోటిఫికేషన్ జారీ చేసి ప్లాట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, నిబంధనలు, ప్లాట్ల కేటాయింపు విధివిధానాలను ఆ నోటిఫికేషన్లో ప్రకటిస్తారు. -
మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్
తిరుపతి తుడా: మునెయ్య.. ఆరేళ్లక్రితం వరకు తిరుపతి మునిసిపాలిటీలో అటెండర్‌గా పనిచేశారు. కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. మునెయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ముప్పై ఏళ్లు సేవలందించిన ఆయన రెవెన్యూ విభాగంలో దఫేదార్(అటెండర్)గా ఆరేళ్లక్రితం రిటైరయ్యారు. అటెండరుగా తాను పనిచేసిన సంస్థకు తన కోడలు మేయరుగా ఎంపిక కావడంపై మునెయ్య, ఆయన కుటుంబీకుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. మునెయ్యకు ఇద్దరు కుమారులు. వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రి అధినేత డాక్టర్ మునిశేఖర్ పెద్దకుమారుడు. ఈయన భార్యే డాక్టర్ శిరీష. చిన్న కుమారుడు తులసీయాదవ్ టౌన్‌బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన శిరీష 1980లో జన్మించారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలనుంచి 2011లో డీజీవో పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం తిరుపతిలోని ఆశాలత టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో గైనకాలజిస్ట్‌గా పనిచేశారు. మునిశేఖర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనతోపాటు వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. చదవండి: రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి రాష్ట్ర ప్రాజెక్టులు భేష్: నాబార్డు చైర్మన్ -
మహిళ ప్రాణం తీసిన ‘చెత్త’ పనులు..!
సాక్షి, సంగారెడ్డి: నారాయణ్ ఖేడ్ మున్సిపల్ అధికారుల నిర్వాకం ఓ మహిళ మృతికి కారణమైంది. ఇంటిపన్ను కట్టలేదని ఓ ఇంటి ముందు నారాయణ్ ఖేడ్ పురపాలక సంఘం అధికారులు నాలుగు రోజుల క్రితం చెత్త వేశారు. దీంతో ఇంటి యజమానురాలు భూమవ్వ (58) తీవ్ర మనస్తాపం చెందారు. ఈరోజు (ఆదివారం) ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జోగిపేట్ వద్దకు చేరుకోగానే ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచింది. అధికారుల మితిమీరిన చర్యల వల్లే భూమవ్వ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, స్థానికుల కథనం మాత్రం భిన్నంగా ఉంది. ఈనెల 15 న భూమవ్వ ఇంటి ముందు చెత్త వేసిన మున్సిపల్ అధికారులు 17న తొలగించారని వారు తెలిపారు. -
వాయిదాల్లో చెల్లించొచ్చు
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, చార్జీల చెల్లింపులో ప్రభుత్వం రాష్ట్రమంతటికీ వెసులుబాటు కల్పించింది. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ ఫీజులను 4 సమ వాయిదాల్లో (6 నెలలకు ఒకటి... మొత్తం రెండేళ్ల వ్యవధి ఇస్తారు) చెల్లించడానికి వీలు కల్పిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. స్థిరాస్తి రం గాన్ని ప్రోత్సహించడానికి బిల్డింగ్ పర్మిట్ ఫీజు, బెటర్మెంట్, డెవలప్మెంట్, క్యాపిటలైజేషన్ చార్జీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏల పరిధిలో వాయిదాల్లో చెల్లించడానికి అనుమతిస్తూ ఈ ఏడాది జులై 8న రాష్ట్ర ప్రభుత్వం జీవో 108ను జారీచేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు దీన్ని వర్తింపజేస్తూ అరవింద్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ♦ అన్ని రకాల చార్జీలను నాలుగు సమ అర్ధ వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. ♦ ఫీజు ఇంటిమేషన్ లేఖ అందిన 30 రోజుల్లోగా తొలి వాయిదా చెల్లించాలి. ♦ ఎవరైనా బిల్డర్, డెవలపర్ బిల్డింగ్/ లే అవుట్ అనుమతుల సమయంలోనే మొత్తం ఫీజులు, చార్జీలు చెల్లించేందుకు ముందుకు వస్తే ఎర్లీబర్డ్ పథకం కింద మొత్తం ఫీజుల్లో 5 శాతం రాయితీ లభిస్తుంది. ♦ పోస్ట్‌డేటెడ్ చెక్కుల్లో పేర్కొన్న తేదీల్లోగా వాయిదాలను చెల్లించడంలో విఫలమైతే జాప్యం జరిగిన కాలానికి 12% వడ్డీతో కలిపి చెల్లించాలి. ♦ 2021 మార్చి 31 లోగా వచ్చే కొత్త దరఖాస్తులతో పాటు అన్ని పెండింగ్ దరఖాస్తులకు ఈ వెసులుబాటు వర్తించనుంది. -
నాలుగు స్థానాలు గులాబీ ఖాతాలోకే..!
సాక్షి, పెద్దపల్లి: రామగుండం నగరపాలకసంస్థ కో ఆప్షన్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం లాంఛనమే కానుంది. కోర్టు కేసుల కారణంగా ఇటీవల వాయిదా పడ్డ ఎన్నికను మంగళవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్నారు. మొత్తం ఐదు స్థానాలకు గాను ఒక్క మైనార్టీ జనరల్ స్థానానికి మాత్రమే పోటీ ఏర్పడడంతో ఎన్నిక అనివార్యమైంది. కాని బల్దియాలో ప్రస్తుతం పార్టీల బలాబలాలు చూస్తే టీఆర్ఎస్ ఖాతాలోకి ఐదు కో ఆప్షన్ స్థానాలు వెళ్లడం లాంఛనమే. నేడు ఎన్నిక కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డ రామగుండం నగరపాలకసంస్థ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగే ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్లు ప్రత్యక్ష పద్ధతిన హాజరై సభ్యులను ఎన్నుకుంటారు. కాగా మొత్తం ఐదు స్థానాలకు గాను నాలుగింటికి కేవలం టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మైనార్టీ జనరల్ స్థానానికి టీఆర్ఎస్తో పాటు, కాంగ్రెస్, మరో అభ్యర్థి పోటీ ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. కరోనా కారణంగా ఈ నెల 1న టెలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నిక నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కాని ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ మహాంకాళి స్వామి, మైనార్టీ కో ఆప్షన్ పదవికి పోటీ చేస్తున్న సైమన్‌రాజ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో అప్పట్లో ఎన్నిక నిలిచిపోయింది. తిరిగి ప్రత్యక్ష పద్ధతిలోనే కోఆప్షన్ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో మంగళవారం ప్రత్యక్ష పద్ధతిలో (చేతులెత్తే) ఎన్నికను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీదే హవా నగరపాలక సంస్థలో ఈ ఏడాది జనవరి 22న ఎన్నికలు జరుగగా అదే నెల 25న ఫలితాలు వెలువడ్డాయి. 50 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 18, కాంగ్రెస్ 11, బీజేపీ 6, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 9, ఆరు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. అనంతర రాజకీయ పరిణామాలతో ఫార్వర్డ్‌బ్లాక్‌కు చెందిన తొమ్మిది మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్లు ఆరుగురు టీఆర్ఎస్కు మద్దతు పలికారు. దీంతో టీఆర్ఎస్ బలం 35కి చేరింది. ఈక్రమంలో టీఆర్ఎస్ ఖాతాలోకే కో ఆప్షన్ కూడా వెళ్లనుంది. మైనార్టీ జనరల్‌కు పోటీ ఐదు కో ఆప్షన్ స్థానాల్లో కేవలం మైనార్టీ జనరల్ స్థానానికే పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి మహ్మ ద్ రఫీ, కాంగ్రెస్ నుంచి ఫజల్ బేగ్, బొల్లెద్దుల సైమన్‌రాజు పోటీలో ఉన్నారు. 35 మంది కార్పొరేటర్లు చేజారకుండా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్ ఇప్పటికే మంతనాలు పూర్తి చేశారు. అ ద్భుతం జ రిగితే తప్ప ఐదవ స్థానం కూడా టీఆర్ఎస్ ఖాతా లోకి వెళ్లడం ఖాయంగా మారింది. ఇక కాంగ్రెస్ మద్ద తు పలికిన బేగ్‌కు, అదనంగా ఓట్లు పడుతా యా అ నే ఆసక్తి ఏర్పడింది. కాగా ఎవరికి మద్దతు ఇ వ్వాలో ఇంకా బీజేపీ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. -
పన్ను బకాయిలుంటే నో రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్నులు/ఖాళీ స్థలాలపై విధించే పన్నులు, కులాయి బిల్లులు, విద్యుత్ బిల్లుల బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రం లేదా ఇప్పటివరకు వీటిని చెల్లించిన రశీదులను సమర్పిస్తేనే ఇకపై స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌తో పాటు యాజమాన్య హక్కుల బదిలీ(మ్యుటేషన్)ను జరపనున్నారు. అవి లేకుంటే వారసత్వంగా గానీ, అమ్మకం ద్వారా గానీ ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగదు. రిజిస్ట్రేషన్ సమయంలోనే తక్షణంగా మ్యుటేషన్ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలికల చట్టం, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చట్టాలను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది. అమ్మకం, దానం, తనఖా, విభజన, వినిమయం అవసరాలకు స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే ధరణి పోర్టల్‌లో ఆన్లైన్ ద్వారా మ్యుటేషన్లు చేసే అధికారాన్ని సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం అప్పగించింది. మ్యుటేషన్ చేసేందుకు ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్) లేదా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ నంబర్(వీఎల్టీఎన్) సైతం కొత్త యజమాని పేరుకు బదిలీ కానుంది. మ్యుటేషన్ ఫీజును సబ్ రిజిస్ట్రార్లు వసూలు చేసి ఆస్తి యజమానికి మ్యుటేషన్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఆన్లైన్ ద్వారా పురపాలక శాఖకు మ్యుటేషన్ దరఖాస్తు వెళ్లనుంది. -
నేడు మున్సిపల్ సర్వసభ్య సమావేశం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ రెండో సర్వసభ్య సమావేశానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించిన తర్వాత జరుగుతున్న మొదటి సాధారణ సర్వసభ్య శనివారం నిర్వహించనున్నారు. గతంలో రెండు సార్లు సమావేశం జరిగినా వాటిలో ఒకటి మొదటి బడ్జెట్ అమోదం కోసం నిర్వహించగా, రెండోది కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నిర్వహించారు. కోవిడ్–19 నేపథ్యంలో గత కొద్ది నెలలుగా సమావేశం నిర్వహించలేదు. కోవిడ్ నిబంధనల ప్రకారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు మేయర్ సునీల్‌రావు అధ్యక్షతన సభ్యులు సమావేశం కానున్నారు. అభివృద్ధిపైనే ప్రధాన చర్చ.. నగరపాలక సంస్థ సమావేశంలో 60 డివిజన్లలో జరుగుతున్న, కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే సమావేశానికి సంబంధించిన అజెండా కాపీలను అధికారులు కార్పొరేటర్లు అందించారు. నగరంలో సుమారు రూ.70 కోట్ల విలువచేజే పనులకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపేందుకు అజెండాలో చేర్చారు. వీటిలో చాలా వరకు ఆమోదం పొందనున్నాయి. హరితహారం, పట్టణప్రగతి కోసం సీఎం ప్రత్యేక నిధులు ఖర్చు చేసేందుకు సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. ఇంటిగ్రెటేడ్ కూరగాయాల మార్కెట్ కోసం రూ.14 కోట్లు, 35 ఓపెన్ జిమ్‌ల కోసం రూ.4 కోట్లు, శ్మశానవాటికల కోసం రూ.కోటి, మిగిలిపోయిన పార్క్‌ల అభివృద్ధికి రూ.4 కోట్లు, ఆధునిక టాయిలెట్ల నిర్మాణానిక రూ.2 కోట్లు, శివారు ప్రాంతాల తాగునీరు, డ్రెయినేజీ పనులకు రూ.5 కోట్లు, వివిధ డివిజన్లలో రూ.36 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, మున్సిపల్ భవనం ఆధునికీకరణ పనుల కోసం రూ.2 కోట్లతోపాటు అభివృద్ధి పనుల కోసం అయా డివిజన్ల కార్పొరేటర్లు ఇచ్చిన నివేదిక అధారంగా పలు పనులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు.. మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తమ అజెండాతో సమావేశానికి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటీవల కార్పొరేషన్ అధి కారులపై వచ్చిన ఆరోపణలు, అవినీతిపై నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ఆరోపణలు తిప్పికొట్టేందుకు అధికార పక్షం కూడా పూర్తి వివరాలు సిద్ధం చేసుకుంది. అయితే అధికారులపై అవినీతి ఆరోపణలపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. -
ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలపై అధ్యయనం
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై కేంద్ర మార్గదర్శకాల అమలు తీరు తెన్నులను ఇతర రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని కేంద్రం మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలు, రాష్ట్రంలో ఆస్తి పన్ను విధానాలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ► ఆయా రాష్ట్రాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్న అంశాన్ని అధికారులు వివరించారు. ఆయా రాష్ట్రాల్లో ఆస్తి విలువలు, దాన్ని నిర్ధారించే విధానాలు, ఆ మేరకు విధిస్తున్న పన్ను తదితర అంశాలపై చర్చించారు. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► ఈ సమీక్షలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్!
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ప్రణాళికాబద్ధ్దమైన పట్టణాలను తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీల్లో ‘వార్డు ఆఫీసర్ల’ను నియమిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం కేటీఆర్ అధ్యక్షతన పురపాలక శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. పురపాలక శాఖ పరిధిలో 2,298 ఖాళీలను భర్తీ చేసేందుకు తుది నిర్ణయం తీసుకోవడంతో పాటు పోస్టుల భర్తీకి ముందు సంబంధిత పోస్టులు, ఉద్యోగులను రేషనలైజ్ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీ ద్వారా పౌర సేవలతోపాటు పట్టణ ప్రగతి కూడా మరింత వేగవంతం అవుతుందన్నారు. ‘ప్రతీ వార్డుకు ఒక అధికారిని నియమించడం దేశంలోనే తొలిసారి. పురపాలక చట్టం నిర్దేశించిన పారిశుద్ధ్యం, హరితహారంతో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడం వార్డు ఆఫీసర్ల నియామకంతో సాధ్యమవుతుంది’అని మంత్రి చెప్పారు. పురపాలక శాఖ, ప్రజలకు మధ్య వారధిలా వార్డు అధికారులు పనిచేస్తారని తెలిపారు. ఇక ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు.. పురపాలక శాఖ ఇంజనీరింగ్ పనుల్లో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. వీరికి సహాయకులుగా ఇద్దరు లేదా ముగ్గురు ఎస్ఈలు కూడా ఉండాలనే ప్రతిపాదనను ఆమోదించామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పారదర్శక విధానంలో భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే పౌర సేవలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లేందుకు మున్సిపల్ పోస్టులతో పాటు, కేబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీ అంశంపై గతంలో ఆరు పర్యాయాలు అంతర్గత సమావేశాలు నిర్వహించగా, శుక్రవారం జరిగిన సుదీర్ఘ బేటీలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. -
కుప్పం దూకుడు!
కుప్పం తలరాత మారుతోంది. అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతోంది. ఆగిపోయిన అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. జిల్లాలో మున్సిపాలిటీ గ్రేడింగ్ సంపాదించుకున్న ఏకైక పంచాయతీ కుప్పం కావడం గమనార్హం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కుప్పంను మున్సిపాలిటీగా చేసి.. నిధులు సమకూర్చి.. అభివృద్ధిని పరుగులు పెట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కుప్పం: కుప్పం నియోజకవర్గం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు కంచుకోట. ఇక్కడ ఆయన 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1996 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ తన నియోజకవర్గాన్ని కనీసం మున్సిపాలిటీగా కూడా మార్పు చేయలేకపోయాడు. నూతనంగా అధికారం చేపట్టిన వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో 52 నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. అందులో కుప్పం ఒకటి. మున్సిపాలిటీగా మారడంతో అభివృద్ధిలో వేగం పుంజుకుంది. రూరల్ అర్బన్ మిషన్‌కు మోక్షం గత ప్రభుత్వ హయాంలో విడుదలైన రూ.30 కోట్ల రూరల్ అర్బన్ మిషన్ నిధులు వృథా అయ్యాయి. ఇప్పటికీ రూ.18 కోట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. దీనిపై అధికార పార్టీ నేతలు, స్థానిక అధికారులు స్పందించి ఆ నిధులతో పట్టణంలో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. నాలుగు ప్రాంతాల్లో రూరల్ అర్బన్ మిషన్ కింద పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఈ నిధులను రెండేళ్లు బ్యాంకు ఖాతాల్లోనే ఉంచింది. మౌలిక వసతులు మెరుగు మున్సిపాలిటీ పరిధిలోని 8 పంచాయతీలతో పాటు పట్టణంలో పారిశుధ్య పనులు పుంజుకున్నాయి. 25 వార్డులకు గాను 10 వార్డుల్లో ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం చేపడుతున్నారు. 8 పంచాయతీల్లో ప్రత్యేకంగా పది మంది పారిశుధ్య కార్మికులతో టీమ్‌గా ఏర్పాటు చేసి, రోజు మార్చి రోజు పనులు చేపడుతున్నారు. డ్రైనేజీల శుభ్రతతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రతి వీధిలోనూ బ్లీచింగ్, సోడియం హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేస్తున్నారు. 15 కంటైన్మెంట్ జోన్లలో పూర్తిస్థాయి శానిటేషన్ జరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ 130 నుంచి 140 వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారు. ఆరు నూతన బోర్లు వేశారు. వాటర్ సమస్య పరిష్కారం కోసం ప్రతినెలా రూ.10 నుంచి 15 లక్షలు వెచ్చిస్తున్నారు. సోషియల్ మీడియా ద్వారా సమస్య తెలిపిన వెంటనే సిబ్బంది స్పందించి తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నారు. భవన నిర్మాణ అనుతులకు ఆన్లైన్ విధానం గతంలో పంచాయతీ పరిధిలో భవన నిర్మాణాలకు కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వ్యాపారులకు దుకాణ నిర్వహణ అనుమతులు, వాటర్ కనెక్షన్ కోసం బైలాన్ సిద్ధం చేశారు. విద్యుత్ స్తంభాల నిర్వహణకు ప్రత్యేక బైలాన్ ద్వారా మున్సిపాలిటీ నిబంధనలు పాటిస్తున్నారు. ప్రతి ఇంటికీ డోర్ నంబర్లు ఇచ్చి జనాభా లెక్కలు తీసేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. వర్కర్లకు చేయూత మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఆక్యూపేషన్ హెల్త్ అలవెన్స్ ద్వారా శానిటేషన్ వర్కర్లు 70 మందికి ప్రతినెలా ఆరు వేల రూపాయల జీతంలో పాటు అదనంగా వచ్చే విధంగా చేపట్టారు. గతంలో ఈ స్కీమ్ ఉన్నా వర్కర్లకు అందేది కాదు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న వర్కర్లకు అందిస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి నూతనంగా ఏర్పడిన కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే శాఖల వారీగా విభజించి పనులు వేగవంతం చేశారు. ప్రధానంగా తాగునీటి సమస్యపై వాట్సప్ గ్రూపులో సమాచారం అందించినా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నీటి పన్ను, ఇంటి పన్నులు చెల్లించి సహకరించాలి. – చిట్టిబాబు, కమిషనర్ కుప్పం మున్సిపాలిటీ -
‘అమృత్’ పనులు వేగవంతం చేయండి
సాక్షి, అమరావతి: ‘అమృత్’ పథకం కింద రూ.3,762 కోట్లతో రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పురపాలక శాఖను ఆదేశించారు. ఆర్థికంగా బలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను తొలగించాలని.. అందుకు రూ.800 కోట్ల లోటును భర్తీ చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. పురపాలక శాఖలో అభివృద్ధి పనులపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► విజయవాడ, గుంటూరులలో చేపట్టిన డ్రైనేజీ పనులను సత్వరం పూర్తిచేయాలి. ► విశాఖపట్నానికి నిరంతరం తాగునీటి సరఫరా కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. ► స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద విశాఖ, కాకినాడ, తిరుపతిలో రూ.4,578 కోట్లతో చేపడుతున్న పనులను సత్వరం పూర్తి చేయాలి. ► ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ఆర్థిక సహాయంతో లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న 50 పట్టణాల్లో తాగునీటి సరఫరాకు రూ.5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టి సారించాలి. ఈ పట్టణాలకు వెళ్లే దారిలోని 111 గ్రామాలకూ తాగునీరు అందించాలి. ► ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి జూలై 8న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేసేందుకు సిద్ధంకావాలి. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరగా సిద్ధంచేయాలి. ► లక్ష జనాభా దాటిన పట్టణాల్లో రూ.10,666 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు సన్నద్ధం కావాలి. మోడల్ మున్సిపాలిటీలుగా తాడేపల్లి, మంగళగిరి గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను మోడల్ మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై కూడా సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్షించారు. ఆయన ఏమన్నారంటే.. ► రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు రూపొందించాలి. ► 100 శాతం తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించండి. ► పాఠశాలల అభివృద్ధి కోసం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో చేపట్టిన పనుల కన్నా మరింత ఆధునిక వసతులు సమకూర్చేలా ప్రతిపాదనలు తయారుచేయండి. ► జనాభా ప్రాతిపదికన నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలి. ► పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలి. ► మంగళగిరిలో చేనేతలకు కాంప్లెక్స్, ప్రభుత్వ కార్యాలయాలకు సమగ్ర కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధించి జూన్ నాటికి పరిపాలనా అనుమతులివ్వాలి. ► మంగళగిరి ఆలయ అభివృద్ధి పనులు, మాడ వీధుల పునర్నిర్మాణం.. బకింగ్‌హామ్ కాలువ అభివృద్ధి, కాల్వల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధిపై కూడా సీఎం చర్చించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. మే 31 వరకు ప్రకటించిన నాలుగో విడత లాక్డౌన్లో జిల్లా కలెక్టర్లు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర పట్టణాల్లో ఎంపిక చేసిన దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో పరిస్థితిని సమీక్షించి దుకాణాలు తెరిచేందుకు కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. వాటిని పురపాలక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పరిశ్రమలు, మార్కెటింగ్, మత్స్య, రవాణా శాఖలు పాటించాలని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో అనుమతించిన దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవొచ్చు. మందుల దుకాణాలకు మరింత సమయం అనుమతిస్తారు. దుకాణ యజమానులదే బాధ్యత ► దుకాణాల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆ బాధ్యత దుకాణ యజమానులదే. అందుకోసం దుకాణాల లోపల, బయట వృత్తాకార మార్కింగులు వేయాలి. దుకాణాల లోపల గరిష్టంగా ఐదు మందికి మించి అనుమతి లేదు. అక్కడ పనిచేసేవారు, కొనుగోలుదారులు కచ్చితంగా మాస్కులు ధరించాలి. ► దుకాణాలను రోజు తెరిచే ముందు ప్రవేశ ద్వారాలు, బయటకు వేళ్లే ద్వారాలు, పార్కింగ్ ప్రదేశాలు, లిఫ్టులలో శానిటేషన్ చేయాలి. తలుపుల హ్యాండిళ్లు, రైలింగులు, లిఫ్ట్ బటన్లు మొదలైనవి ఎర్ర రంగుతో మార్కింగ్ చేసి తరచూ శానిటేషన్ చేయాలి. టాయిలెట్లలో శానిటైజేషన్‌పై శ్రద్ధ చూపించాలి. ► అన్ని దుకాణాలు 50% సిబ్బందితోనే పనిచేయాలి. ► దుకాణాల్లో పనిచేసే సిబ్బంది అందరూ తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలను వీలైనంతవరకూ దుకాణాల్లోకి అనుమతించకూడదు. ► ఉన్నంత వరకు దుకాణాల్లోకి ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు ద్వారాలు వేర్వేరుగా ఉండాలి. ► ఎక్కువ బిల్లింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. వీలైనంతవరకు నగదు రహిత లావాదేవీలకే ప్రాధాన్యమివ్వాలి. అనంతపురం పాతవూరులో షాపులు తెరవడంతో మొదలైన సందడి వీటికి ప్రత్యేక అనుమతి ► స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టేడియంలు తెరిచేందుకు అనుమతిచ్చారు. క్రీడాకారులు, శిక్షకులకు మాత్రమే ప్రవేశం ఉంది. సందర్శకులను అనుమతించరు. ► ఆహార పదార్థాలను డోర్ డెలివరీ చేసే, టేక్ అవే సదుపాయం ఉన్న రెస్టారెంట్లకు అనుమతి. అలాగే వైద్య, ఆరోగ్య, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం, వలస కార్మికులు, విదేశీ టూరిస్టులు, క్వారంటైన్ కేంద్రాల్లో వారికి ఆహార పదార్థాలు అందించేందుకు ఉద్దేశించిన హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి. ► బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో ఉన్న క్యాంటీన్లకు అనుమతి ఉంది. తెరిచేందుకు అనుమతిలేనివి ► సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎస్లాబ్లిష్మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, బంగారు ఆభరణాలు, బట్టలు, చెప్పుల దుకాణాలు. ప్రత్యేక చర్యలతో సెలూన్లకు అనుమతి ► స్పాలు, మసాజ్ సెంటర్ల నిర్వహణకు అనుమతి లేదు. కానీ సెలూన్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. అందుకోసం వారు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు, తక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం వేర్వేరుగా నిర్దేశించింది. ఎక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు ► సెలూన్లలో పనిచేసే సిబ్బంది, వినియోగదారులకు తప్పనిసరిగా టచ్‌లెస్ థర్మోమీటర్లతో టెంపరేచర్ పరీక్షించాలి. 99 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే ఎక్కువ ఉన్న వారిని వెంటనే ఇళ్లకు పంపించేయాలి. ► ప్రతి కస్టమర్ పేరు, ఫోన్ నంబరుతోపాటు ఏమైనా అనారోగ్య లక్షణాలు ఉంటే నమోదు చేయాలి. ► ముందు అపాయింట్మెంట్ తీసుకుని ఈ సెలూన్లను నిర్వహించాలి. తద్వారా సెలూన్లోగానీ బయటగానీ ఎక్కువ మంది నిరీక్షించకుండా నివారించవచ్చును. ► సెలూన్ లోపల కస్టమర్ల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలి. ► సిబ్బంది ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలి. డిస్పోజబుల్ గ్లౌజులు ధరించాలి. కస్టమర్ మారే ప్రతి సారి గ్లౌజులు మార్చాలి. వీలైతే కళ్లద్దాలు, ఫేస్ షీల్డు ధరించాలి. ► సెలూన్‌కు వచ్చే కస్టమర్లు కూడా క్షవరం చేయించుకునే సమయంలో తప్ప నిరీక్షించే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ► సెలూన్లలో వాడే అన్ని పరికరాలు, ఉపకరణాలు డిస్ ఇన్ఫెక్షన్ చేయించి శుభ్రంగా ఉండాలి. ప్రతి కస్టమర్‌కు ప్రత్యేకంగా మెడ చుట్టూ వేసే వస్త్రం, టవల్, హెయిర్ క్యాప్ మొదలైనవి ప్రతి కస్టమర్‌కు ప్రత్యేకంగా వాడాలి. ఒకరికి వాడిన రేజర్లను మళ్లీ వాడకూడదు. ► సెలూన్లలోని కుర్చీలు, ఇతర ఫర్నిచర్, అద్దాలతోపాటు టాయిలెట్లు, బాత్రూంలు, సింకులను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. సెలూన్‌ను రోజూ తెరిచే ముందు, మూసివేసిన తరువాత మెట్లతోసహా సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేయాలి. తక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు.. ► అనారోగ్య లక్షణాలు ఉన్న వారిని అనుమతించకూడదు. ► సెలూన్లో పనిచేసేవారు తప్పనిసరిగా మాస్కు, గ్లౌజులు ధరించాలి. ► కస్టమర్లు ఎవరికి వారు టవల్, అవసరమైన ఇతర వస్త్రాలు తెచ్చుకోవాలి. ► ప్రతి కస్టమర్‌కు క్షవరం చేసిన తరువాత కుర్చీ, ఇతర ఫర్నిచర్‌ను తప్పనిసరిగా డిస్ ఇన్ఫెక్షన్ చేయాలి. రేజర్లను ఒకసారే వాడాలి. ► సెలూన్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ► కస్టమర్ల వివరాలను నమోదు చేసేందుకు ఓ రిజిస్టర్‌ను నిర్వహించాలి. -
పారిశుధ్య కార్మికులకు మంత్రి పాదాభివందనం
సాక్షి, విశాఖపట్నం: కరోనా కష్ట కాలంలో పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారన్నారు. పద్మనాభం మండలం విలాస్‌ఖాన్ గ్రామంలో పారిశుధ్య కార్మికులకు మంత్రి అవంతి శ్రీనివాస్ పాదాభివందనం చేశారు.అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న నేపథ్యంలో.. వైద్యులు, పోలీసులతో పాటు పారిశుధ్య కార్మికులు కూడా సైనికుల్లా పనిచేస్తూ ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని మంత్రి ప్రశంసించారు. -
ఒమాన్ ప్రభుత్వం షాక్.. ఉద్యోగాలకు కోత
ఎన్.చంద్రశేఖర్,మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): బల్దియా(మున్సిపాలిటీ)ల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులకు ఒమాన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేరుగా నియమించుకున్న కార్మికులను క్రమంగా తొలగిస్తోంది. వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులు ఇప్పటికే ఇళ్లకు చేరుకోగా.. దశల వారీగా ఈ ఏడాది చివరి వరకు మరికొందరు ఇంటిముఖం పట్టనున్నారు. బల్దియా ఆధ్వర్యంలో చేపట్టే పనులను కాంట్రాక్టు కంపెనీలకు అప్పగించాలని ఒమాన్ ప్రభుత్వం మూడేళ్ల కిందనే నిర్ణయించింది. ఇటీవల ఒమాన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన స్థానంలో హైతమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం బల్దియా ప్రైవేటీకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. బల్దియా పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించగా.. ఆ ఏజెన్సీలు తక్కువ వేతనంపై పనిచేసేవారిని నియమించుకుంటున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన కార్మికులు తక్కువ వేతనానికి పని చేసేందుకు ముందుకు రావడంతో వారినే పనుల్లోకి తీసుకుంటున్నారు. బల్దియాలో ఇది వరకు పనిచేసిన మన కార్మికులు కాంట్రాక్టు ఏజెన్సీలను ఆశ్రయిస్తే.. తాము ఇచ్చే వేతనానికి అంగీకరిస్తేనే పనిలో చేర్చుకుంటామని చెబుతున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీల కింద పనిచేస్తే శ్రమ దోపిడీకి గురికావాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. ఒమాన్ దేశంలోని వివిధ మున్సిపాలిటీల్లో పని చేసే విదేశీ కార్మికుల్లో 60 శాతం మంది కార్మికులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉండటం విశేషం. బల్దియాల ప్రైవేటీకరణతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. ఒమాన్‌లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల సంఖ్య దాదాపు లక్షకు మించి ఉంటుందని అంచనా. ఇందులో బల్దియాల్లో పని చేసే కార్మికులు వేలల్లో ఉన్నారు. ఇప్పుడు వారి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. ఒమాన్ బల్దియాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం.. వేతనం కూడా ఆశించిన విధంగా ఉండటంతో మన రాష్ట్రానికి చెందిన ఎంతో మంది ఈ ఉద్యోగాలను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. సుమారు 40 ఏళ్ల నుంచి బల్దియా ఉద్యోగాలకు వలసలు కొనసాగుతున్నాయి. కార్మికులు చేసే పనులు ఇవే... మస్కట్‌తో పాటు ఇతర పట్టణాల్లోని మున్సిపాలిటీల్లో మన కార్మికులు గార్డెనింగ్, క్లీనింగ్, విద్యుదీM్దý రణ, రోడ్ల పక్కన ఉన్న చెత్తా చెదారం ఏరివేయడం తదితర పనులను చేసేవారు. అలాగే కార్మికులను వారి నివాసం నుంచి మున్సిపాలిటీల్లోని వివిధ ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేసిన వాహనాలను నడిపే డ్రైవర్లు కూడా మనవారే ఉన్నారు. నిర్ణీత పనివేళలు ఉండటంతో పాటు నెలకు మన కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వరకు వేతనం లభించడంతో ఒమాన్ బల్దియాల్లో పనులకు డిమాండ్ ఏర్పడింది. ఒమాన్ ప్రభుత్వంలోని మున్సిపల్ వ్యవహారాల శాఖనే నేరుగా రిక్రూట్మెంట్ చేయడంతో.. కార్మికులు ఉద్యోగం మానివేస్తే గ్రాట్యూటీ కూడా ఎక్కువగా లభించేది. అలాగే ఏడాదికి నెల రోజులు వేతనంతో కూడిన సెలవులు లభించేవి. ఈ సమయంలో కార్మికులు ఇంటికి వచ్చి వారి కుటుంబాలతో గడిపి వెళ్లేవారు. కొందరు కార్మికులు తమ పనివేళలు ముగిసిన తరువాత ఇతర పనులు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం దక్కేది. ఒమాన్ బల్దియాల్లో వివిధ పనులు చేసే కార్మికులను ఎన్నో ఏళ్ల నుంచి నేరుగా నియమించుకుంటున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికిన అక్కడి ప్రభుత్వం అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించి ప్రైవేటీకరణను ముమ్మరం చేసింది. పెరిగిన పనివేళలు బల్దియాల్లో ప్రభుత్వం ద్వారా నియమించబడిన కార్మికులు రోజుకు 8 గంటల పాటు పనిచేసేవారు. కాంట్రాక్టు ఏజెన్సీలు ఇప్పుడు పనివేళలను పెంచాయి. ఒక్కో కార్మికుడు రోజుకు 12 గంటల పాటు పనిచేయాలని నిబంధన విధించాయి. గతంలో ఒక్కో కార్మికునికి భారత కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వేతనం లభించగా ఇప్పుడు రూ.20వేలకు మించి చెల్లించడం లేదు. పని వేళలు పెరగడంతో పాటు వేతనం తగ్గడం వల్ల కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. స్వరాష్ట్రంలో ఉపాధి చూపాలంటున్న కార్మికులు ఒమాన్ బల్దియాల్లో ఉద్యోగాలను కోల్పోయి ఇంటి బాట పట్టిన తెలంగాణ వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలోనే ఉపాధి మార్గాలను చూపాలని పలువురు కోరుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి బల్దియా వీసాలపై ఉపాధి పొందిన కార్మికులు ఒమాన్ ప్రభుత్వ నిర్ణయంతో ఇంటికి చేరుకుంటుండగా వారికి పునరావాసం కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. మూడు రకాల వీసాలు రద్దు.. మున్సిపాలిటీల్లో మన కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒమాన్ ప్రభుత్వం గతంలో జారీచేసిన మూడు రకాల వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా, సెవెన్ బల్దియా వీసా, దివాన్ బల్దియా వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా అంటే పట్టణం పరిధిలోనే పని చేయడం. సెవెన్ బల్దియా అంటే పట్టణ ప్రాంతానికి శివారుల్లో పనిచేయడం. దివాన్ బల్దియా వీసాలు ఉన్నవారు రాజు, మంత్రుల నివాసాల వద్ద పనిచేసేవారు. ఈ మూడు రకాల వీసాలను రద్దు చేసి.. అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంతో కార్మికులకు ఉపాధి దక్కకుండా పోతోంది. ఎనిమిదేళ్లు పనిచేశాను.. మస్కట్ బల్దియాలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశాను. గార్డెనింగ్ పనులను కాంట్రాక్టు ఏజెన్సీకి అప్పగించడంతో మా వీసాలను రద్దుచేశారు. ఇప్పుడు ఇంటికి చేరుకున్నాం. ఉపాధి కోసం మరో గల్ఫ్ దేశానికి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఒమాన్‌లో బల్దియా ప్రైవేటీకరణ కంటే ముందుగానే పరిస్థితి బాగుంది. కాంట్రాక్టు ఏజెన్సీలకు పనులు అప్పగించిన తరువాత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.– డి.శ్రీకాంత్, మెండోరా,భీమ్‌గల్ మండలం (నిజామాబాద్ జిల్లా) ఉపాధి కోల్పోవడంబాధగా ఉంది.. ఒమాన్ బల్దియాలో పనిచేస్తున్న మాకు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడం బాధగా ఉంది. ఎనిమిది సంవత్సరాలు బల్దియాలో పనిచేశాను. ఇప్పుడు వీసా రద్దుచేసి ఇంటికిపంపించారు. ఇక్కడ ఉపాధి లేకనే గల్ఫ్‌కు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు ఏం పని చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలి.– రాజేష్, వేంపేట్, మెట్పల్లిమండలం(జగిత్యాల జిల్లా) ప్రభుత్వాలు స్పందించాలి.. ఒమాన్‌లో బల్దియాలో పనిచేసిన కార్మికులు వందల సంఖ్యలో ఇంటికి చేరుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ కార్మికులే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ స్పందించి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణించడంతో కొత్త రాజు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దేశంలో ప్రైవేటీకరణ ఊపందుకుంది.– జి.కృష్ణ, తిప్పాపూర్, వేములవాడమండలం(రాజన్న సిరిసిల్ల జిల్లా) ఏం చేయాలోఅర్థంకావడం లేదు.. స్థానికంగా పని లేకపోవడంతోనే మేము గల్ఫ్ దేశానికి వలస వెళ్లాం. అక్కడ కూడా ప్రైవేటీకరణ వల్ల ఉపాధి కోల్పోయి ఇంటికి చేరుకున్నాం. ఇక్కడ ఏమి చేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వం స్పందించి మా పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఏదైనా ఉపాధి చూపాలి. లేకుంటే మరో గల్ఫ్ దేశానికి వెళ్లక తప్పని పరిస్థితి.– ప్రశాంత్, మెండోరా, భీమ్‌గల్ మండలం (నిజామాబాద్ జిల్లా) -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూరల్ మండలంలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావురు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతురు గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఈ మేరకు ఎనిమిది గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్ శాఖ డీనోటిఫై చేసింది. (సీఆర్డీఏ చట్టంలో ఎక్కడుంది?) -
‘పుర’ పోరుకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలలో ఓటర్ల జాబితాలను ఇప్పటికే దాదాపుగా ఖరారు చేశారు. రాష్ట్రంలోని 16 నగర పాలక సంస్థలకుగానూ కాకినాడకు 2017లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సిన మిగతా 15 నగర పాలక సంస్థల్లో ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. 88 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. మరో 6 మున్సిపాలిటీలలో ఓటర్ల జాబితాను మంగళవారం విడుదల చేస్తారు. దీంతో అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా తయారీ పూర్తి కానుంది. ఓటర్ల జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే రిటర్నింగ్ అధికారులుగా ఉన్న ఆర్డీవోల దృష్టికి తేవచ్చు. అనంతరం ఓటర్ల జాబితాలను అధికారులు ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. ఇక కొత్తగా ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన 12 మున్సిపాలిటీలలో కూడా ఓటర్ల జాబితా తయారీ దాదాపుగా పూర్తైంది. వీటిని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రకటన విడుదలైన వెంటనే ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించాలని అధికారులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు దిశగా... నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఓటర్ల సర్వే తుది అంకానికి చేరుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీలవారీగా ఓటర్ల సర్వే పూర్తి చేశారు. తదనుగుణంగా నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లు, మున్సిపాలిటీలలో కౌన్సిలర్ల రిజర్వేషన్లకు ప్రాథమిక కసరత్తు చేపట్టారు. రాష్ట్రం యూనిట్‌గా మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. నిబంధనల మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అనంతరం ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు రూ.60 కోట్లు విడుదల చేసింది. నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. కొత్తగా ఏర్పాటు చేసే మున్సిపాలిటీల వార్డుల పునర్విభజన, ఎన్నికల అధికారుల నియామకం దాదాపు ఓ కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నిర్వహణ దిశగా పురపాలక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకుసన్నద్ధం: విజయ్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ ‘నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితాలను పూర్తి చేశాం. ఓటర్ల సర్వే చేసి తదనుగుణంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు మేయర్లు, చైర్పర్సన్ల రిజర్వేషన్లు నిర్ణయించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నాం’ -
కేసీఆర్ ముస్లిం నమ్మక ద్రోహి: డీకే అరుణ
సాక్షి, నారాయణపేట: మక్తల్, నారాయణపేటలో బీజేపీకి గట్టి పట్టు ఉందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అందుకే మక్తల్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని సోమవారం బీజేపీ కైవసం చేసుకుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడం సహజమన్నారు. సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల ముందు బీజేపీ గెలిచే స్థానాల్లో ముస్లింల ఓట్లు రాబట్టుకునేందుకు.. ఎన్ఆర్సీ, సీఏఏల పేరు తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. (బీజేపీ నైతికంగా విజయం సాధించింది) సీఎం కేసీఆర్‌కు దేశం గురించి గాని, దేశ భద్రత గురించి అవసరం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఎన్ఆర్సీ చట్టం తీసుకుచ్చిన తర్వాత ముస్లింల గురించి మాట్లాడున్నాడంటే కేసీఆర్ ఎంత నమ్మక ద్రోహి అనేది ముస్లింలు గమనించాలి. బైంసా సంఘటన జరిగినప్పుడు సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని అరుణ ప్రశ్నించారు. ప్రజలు తలలు పగలగొట్టుకున్నా, చచ్చినా తనకు సంబంధం లేనట్లు వ్యవహరించారని ఆమె ధ్వజమెత్తారు. అప్పుడు నోరుమెదపని కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఎందుకు మాట్లాడారని అరుణ సూటిగా ప్రశ్నించారు. -
అలా.. మున్సి‘పోరు’ లో
సాక్షి, ఆదిలాబాద్: బల్దియా ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా పార్టీల్లోనూ... ఇటు అధికారుల్లోనూ వేగం పెరిగింది. అయితే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ప్రజలు ఓటువేసి అభివృద్ధి బాటలో నడిచేందుకు సంసిద్ధయ్యారు. నగర పంచాయతీల నుంచి మున్సిపాలిటీగా మారడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. యువత ఎక్కువగా ఓటుహక్కును పొందడంతో ఈసారి వారి ప్రభావం ఫలితాలపై చూపనుంది. ఆదిలాబాద్‌లో యువచైతన్యం మున్సిపల్ ఎన్నికలకు పట్టణ ఓటర్లే కీలకం. ఆదిలాబాద్ బల్దియా పరిధిలో గతంలో 36 వార్డులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 49కి చేరింది. శివారు గ్రామాల విలీనంతో వార్డుల సంఖ్యతో పాటు పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలోని ఓటర్లు పెరిగారని చెప్పవచ్చు. 2014 ఎన్నికల సమయంలో ఐదెంకెల సంఖ్యతో ఉన్న ఓటర్ల జాబితా ప్రస్తుతం ఆరంకెలకు చేరింది. అయితే పెరిగిన ఓటర్లు ఎవరికి లాభం చేకూరుస్తారనేది వేచిచూడాల్సిందే. ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 37,429.. ఆదిలాబాద్ బల్దియా పరిధిలో గడిచిన ఐదేళ్లలో భారీగా ఓటర్లు పెరిగారు. గ్రామాల విలీనంతో పాటు ఐదేళ్లుగా చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాలు ఫలితాలు ఇచ్చారు. గత నెల 30న విడుదలైన ఓటర్ల జాబితా ప్రకారం 1,27,801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 63,057 మంది, మహిళలు 64,738 మంది ఉన్నారు. ఇతరులు ఆరుగురు ఉన్నారు. బల్దియాకు 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మున్సిపల్లోని పాత 36 వార్డుల పరిధిలో 90,372 మంది ఓటర్లు ఉన్నారు. అంటే గడిచిన ఐదేళ్లలో 37,429 మంది ఓటర్లు పెరిగారు. మున్సిపల్ పరిధిలో పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. యువ ఓటర్లు 30,429.. మున్సిపల్ ప్రస్తుతం 49 వార్డుల్లో యువ ఓటర్ల సంఖ్య భారీగానే ఉంది. 18 నుంచి 29 ఏళ్లలోపు యువత 30,429 మంది ఉన్నట్లు సంబంధిత అధికారులు లెక్కతేల్చారు. ఇందులో 18,19 వయస్సుల వారు కేవలం 2వేలలోపే ఉండగా, 20 నుంచి 29ఏళ్లున్న వారు 28వేల మందికిపైగా ఉన్నారు. గ్రామాల విలీనంతో వయసుల వారీగా లెక్కింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఓటరు నమోదు కార్యక్రమాలతోనే పట్టణ ఓటర్ల సంఖ్య పెరిగిందనుకుంటే గ్రామాల విలీనంతో మరింత రెట్టింపైంది. ఒక్కో వార్డులో భారీగా ఓటర్లు.. ఓటర్ల జాబితా ప్రకారం ఆదిలాబాద్ బల్దియా పరిధిలోని ఒక్కో వార్డులో భారీగా ఓటర్లు ఉన్నారు. వార్డుల విభజనతో పాత వార్డు పరిధిలోని ఓటర్లు మరో వార్డులోకి కలిసిపోగా, సదరు వార్డులోకి శివారు గ్రామాల ఓటర్లు వచ్చి చేరారు. అయితే ఒక్కో వార్డులో 2300 నుంచి 3 వేలకుపైగా మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 49 వార్డులు ఉండగా, 33 వార్డుల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉండగా, మిగతా 16 వార్డులో పురుషులు ఎక్కువగా ఉన్నారు. నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా భైంసా: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భైంసా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోయాక 1953లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అంతకుముందు నగర పంచాయతీగా ఉండేది. అప్పట్లో 21 వార్డులు ఉండేవి. మొదటిసారి మున్సిపాలిటీగా ఏర్పడిన సమయంలో బాబురావు మైసేకర్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెరిగిన వార్డులు... రానురాను మున్సిపాలిటీలో వార్డులు పెరిగాయి. 1953లో 21 వార్డులు ఉన్న భైంసా మున్సిపాలిటీలో గత పదేళ్ల క్రితం రెండు వార్డులు పెరిగాయి. తాజాగా మళ్లీ వార్డులు విభజించడంతో ఈ సంఖ్య 26కి పెరిగింది. ప్రస్తుతం భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. తాజా నోటిఫికేషన్‌తో ఈ 26 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 26వార్డుల్లో 41,728 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 20,874 పురుష ఓటర్లు ఉండగా 20,844 మహిళ ఓటర్లు ఉన్నారు. పంచాయతీ నుంచి బల్దియా దాకా రామకృష్ణాపూర్: క్యాతనపల్లి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర పుటల్లో ఒక ప్రత్యేక గుర్తింపును కలిగిన గ్రామపంచాయతీ. 1964లో ఏర్పడ్డ ఈ పంచాయతీ అభివృద్ధి పథంలో ఎన్నో పుంతలు తొక్కుతూ మున్ముందుకు పయనించింది. పంచాయతీ నుంచి మేజర్ గ్రామపంచాయతీగా.. నేడు మున్సిపాలిటీగా తన ప్రస్థానాన్ని కొనసాగించి మరోసారి చరిత్ర పుటల్లోకెక్కింది. సహజంగానే ఇక్కడ బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉండటంతో ఈ పంచాయతీ ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. పురఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్న తరుణంలో క్యాతనపల్లి మున్సిపాలిటీపై ప్రత్యేక కథనం. మేజర్ గ్రామపంచాయతీగా... గ్రామపంచాయతీగా 24ఏళ్ల పాటు కొనసాగిన క్యాతనపల్లిని 1988లో అధికారులు అప్‌గ్రేడ్ చేశారు. మేజర్ గ్రామపంచాయతీగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి నుంచి మొన్నటి వరకూ ఈ మేజర్ గ్రామపంచాయతీకి 9సార్లు ఎన్నికలు జరిగాయి. గ్రామానికి ఆనుకునే బొగ్గు గనులు ఉండటంతో ఇక్కడి కార్మికుల ఓట్లు కూడా కీలకంగా మారాయి. చిన్నపాటి పంచాయతీ నుంచి మేజర్ గ్రామపంచాయతీగా విస్తరించడంతో పలు చిన్న గ్రామాలు ఇందులో విలీనమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో మేజర్ గ్రామపంచాయతీగా క్యాతనపల్లి నిలువటం గమనార్హం. నేడు బల్దియాగా సేవలు.. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించిన క్యాతన పల్లి నేడు ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ముందుకు వస్తోంది. మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం గ్రామపంచాయతీగా ఉన్న తిమ్మాపూర్‌ను క్యాతనపల్లిలో విలీనం చేశారు. దీంతో పాత తిమ్మాపూర్, కొత్త తిమ్మాపూర్ గ్రామాలు క్యాతనపల్లిలో కలిశాయి. 3వేల పైచిలుకు జనాభ విలీనమాయ్యారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మున్సిపాలిటీ నేడు మరింత అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మున్సిపాలిటీగా ప్రకటించడంతో ఎన్నికల సమరానికి క్యాతనపల్లి సన్నదం కానున్నది. 22 వార్డులు..25 వేల ఓటర్లు.. నూతనంగా ఏర్పడిన క్యాతనపల్లి మున్సిపాలిటీని మొత్తం 22 వార్డులుగా విభజించారు. ఇందులో 25,441 ఓటర్లుండగా 12,982 మంది పురుషులు, 12,458 మంది మహిళా ఓటర్లున్నారు. ఒకరు ట్రాన్స్‌జెండర్ ఓటర్ ఉన్నారు. 1952లోనే మున్సిపాలిటీగా... నిర్మల్‌టౌన్: సుమారు 400ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన నిర్మల్ పట్టణం 1952లోనే మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఆ సమయంలో కేవలం 12వార్డులతో మున్సిపాలిటీ ఆవిర్భవించింది. తదనంతరం పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామాలను విలీనం చేయడంతో ఆ సంఖ్య ప్రస్తుతం 42కి చేరింది. నిర్మల్ మున్సిపాలిటీకి సమీపంలోని గొల్లపేట్, గాజులపేట్, సిద్దాపూర్ను విలీనం చేసిన తర్వాత వార్డుల సంఖ్య 28కి చేరింది. అనంతరం వార్డుల విభజనతో ఈ సంఖ్య 36కు చేరింది. తాజాగా 2019 సంవత్సరంలో వెంకటాపూర్, మంజులాపూర్ గ్రామాలు సైతం పట్టణంలో విలీనం చేశారు. దీంతో మళ్లీ జరిగిన వార్డుల విభజనతో ప్రస్తుతం నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఏర్పాటయ్యాయి. 1600 శతాబ్దంలో భద్రాచలం తహశీల్దార్‌గా ఉన్న కంచర్ల గోపన్న(రామదాసు) భద్రాచలంలో రామాలయం నిర్మించడంతో కుతుబ్షాహి పాలకులు ఆయనను చెరసాలలో వేశారు. అతనికి సన్నిహితుడైన వెలమ దళవాయి నిమ్మనాయుడు అక్కడ నుంచి వచ్చి నిర్మల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు. అతనిపేరిటే ఈ ప్రాంతానికి నిమ్మలగా నామకరణం చేశారు. కాలక్రమంలో నిర్మల్‌గా రూపాంతరం చెందింది. ఇలా చారిత్రకంగా విశేష ప్రాశస్త్యం ఉన్న నిర్మల్ నగరం తొలుత సమితిగా ఉండేది. అనంతర కాలంలో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో... ఖానాపూర్: పాత తాలుకాగా ఉండే నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ పట్టణంలో తొలి అధ్యక్ష పీఠం ఏ పార్టీని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2018 ఫిబ్రవరికి ముందు వరకు ఖానాపూర్ మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగింది. రాష్ట్రంలో 15వేల పైచిలుకు ఓటర్లు ఉన్న పంచాయతీని ప్రభుత్వం మున్సిపాలిటీగా చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 70 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కాగా నిర్మల్ జిల్లా నుంచి ఖానాపూర్ మున్సిపల్‌గా అవతరించింది. రెండోసారి... ఇది వరకు 1958లోనే ఖానాపూర్ మున్సిపల్‌గా ఏర్పాటైంది. అప్పట్లోనే స్వర్గీయ అబ్దుల్ హమీద్ ఏకగ్రీవంగా తొలి చైర్మన్‌గా ఎన్నికై 1958 నుంచి 61 వరకు కొనసాగారు. నాటి నుంచి ఖానాపూర్‌ను పంచాయతీగా మార్చారు. 1961లో స్వర్గీయ దేశ్‌పాండే తొలిసర్పంచ్గా ఎన్నికయ్యారు. తదనంతరం 1963లో జరిగిన ఎన్నికల్లో జబ్బర్‌ఖాన్ సర్పంచ్‌గా ఎన్నికై 1981 వరకు 18 ఏళ్లపాటు సర్పంచ్‌గా కొనసాగాడు. 1981–87 వరకు నర్సింహరావు జోషి, 1987 నుండి 94 వరకు బక్కశెట్టి రాములు సర్పంచ్‌గా ఉన్నారు. 1994 నుండి 97 వరకు విలాస్‌రావు దేశ్‌పాండే సర్పంచ్ ఉన్నారు. తదనంతరం విలాస్‌రావు సతీమణి శోభారాణి సర్పంచ్ చేసి ఉద్యోగం రావడంతో మద్యలో వెల్లిపోవడంతో వారి స్తానంలో శికారి లక్షి్మనారాయణ, బక్కశెట్టి లక్ష్మణ్‌లు సర్పంచ్‌గా కొనసాగారు. 2001 తర్వాత నుండి జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల రత్నకుమారి, మైలారపు గంగాదర్, ఆకుల శ్రీనివాస్, నేరెళ్ల సత్యనారాయణలు వరుసగా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 15604 ఓటర్లతో పాటు 8020 మహిళలు, 7584 పురుషులు ఉన్నారు. 50ఏళ్ల క్రితమే... చెన్నూర్: చెన్నూర్ 1957లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అనాటి నుంచి 1963 వరకు తహసీల్దార్లే మున్సిపాల్ కమిషనర్‌గా వ్యవహరించారు. 1963లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో పట్టణానికి చెందిన బేరంబాగ్స్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1968 వరకు బేరంబాగ్స్ చైర్మన్‌గా ఉన్నారు. రెండ సారి 1968లో జరిగిన ఎన్నికల్లో చిల్లప్ప రాంచందర్‌రావు, 1970వరకు చైర్మన్‌గా కొనసాగారు. 1970లో మేజర్ గ్రామ పంచాయతీగా... 1970లో చెన్నూర్‌ను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 1970లో చెన్నూర్ గామ పంచాయతీకి ఎన్నికలు జరుగగా చెన్నూర్‌కు తొలి సర్పంచ్‌గా శ్రీరాంభట్ల (కాంగ్రెస్) రామన్న ఎన్నికయ్యారు. 1995 వరకు 30 ఏళ్లు పాటు రామన్న సర్పంచ్‌గా పని చేశారు. 1995–2000 వరకు రేగళ్ల మధుసూధన్, 2000–05 వరకు మైదం కళావతి, 2006 –12 రేగళ్ల విజేత, 2012 – 18 వరకు సాధనబోయిన కృష్ణ సర్పంచ్‌లుగా కొనసాగారు. 2018లో మున్సిపాలిటీగా 2 ఆగష్టు 2018లో చెన్నూర్‌ను మళ్లీ మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి జరిగే ఎన్నికల్లో తొలి చైర్మన్ పదవి ఎవరిని వరిస్తొందోనని పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పట్టణంలో ఎన్నికల హడావుడి మొదలైంది. నస్పూర్‌లో మొదటిసారిగా శ్రీరాంపూర్: మొదటి దఫా మున్సిపల్ ఎన్నికలకు నస్పూర్ మున్సిపాలిటీ సిద్ధమైంది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం నస్పూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. కొత్త మున్సిపాలిటీలో మొత్తం 62670 మంది ఓటర్లు ఉన్నారు. అంతకు ముందు 62431 మంది ఓటర్లు ఉంటే కొత్తగా 239 మంది ఓటర్లుగా చేరారు. మొత్తం ఓటర్లలో పురుషులు 32476 మంది, మహిళల ఓట్లు 30182 ఉన్నాయి. థార్డ్ జెండరు ఓట్లు కూడా 12 నమోదయ్యాయి. మేజర్ పంచాయతీ నుంచి... మున్సిపాలిటీ జూన్ 2, 2018లో ఏర్పడింది. మున్సిపాలిటీ ఏర్పడక ముందు నస్పూర్ మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. సింగరేణి కోల్‌బెల్ట్ గ్రామాలైన నస్పూర్, సింగపూర్, తాళ్లపల్లి, తీగల్‌పహడ్ గ్రామాలు గ్రామ పంచాయతీలుగా ఉండేవి. చాలా ఏళ్లుగా ఇవి గ్రామ పంచాయతీలుగా కొనసాగాయి. ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీను ఏర్పాటు చేయడంలో భాగంగా నాలుగు గ్రామాలను కలిసి నస్పూర్ మున్సిపాలిటీని చేశారు. కార్యాలయం ప్రస్తుతం మునుపటి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే సాగుతోంది. కమిషనర్‌గా రాధాకిషన్, ప్రత్యేక అ«ధికారిగా శ్యామల దేవి వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటికీ పూర్తిస్థాయి సిబ్బందిని నియమించలేదు. అంతకు ముందు గ్రామ పంచాయతీలోని సిబ్బందిని మున్సిపల్ శాఖకు మార్పు చేసినా ఇంకా టౌన్‌ప్లానింగ్ వంటి ముఖ్య విభాగాలను మంచిర్యాల చెందిన వారే ఇక్కడ ఇన్చార్జిగా ఉన్నారు. మొదటి సారి నస్పూర్ మున్సిపాలిటీలో ఎవరు అడుగుపెడుతారో అన్నది చర్చనీయాంశంగా మారింది. లక్సెట్టిపేట మున్సిపాలిటీ లక్సెట్టిపేట(మంచిర్యాల): లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఆగష్టు 2వ తేదీ 2018వ కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటైంది. అంతకుముందు గ్రామ పంచాయతీగా ఉండేది. మొత్తం ఓటర్లు 16439 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 8065, మహిళలు 8372 ఉండగా ఇతరులు 02 ఉన్నారు. మున్సిపాలిటిలో ఊత్కూరు, మోదెల, ఇటిక్యాల మూడు గ్రామాలు లక్సెట్టిపేటలో విలీనమయ్యాయి. మొత్తం వార్డులు 15గా కేటాయించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ కాగజ్‌నగర్: కుమురంభీం జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ కాగజ్‌నగర్. దీనిని 1958లో ఏర్పాటు చేశారు. 1967లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ పరిధిలో 45,156 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుçషులు 22,425, మహిళలు 22,731 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 306 మంది ఎక్కువగా ఉన్నారు. ఎస్సీలు 7375, ఎస్టీలు 205, బీసీలు 28595, ఇతరులు 8981 మంది ఓటర్లు ఉన్నారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో 70.56 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో 43,633 మంది ఓటర్లు ఉండగా అందులో 30,786 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 15527, మహిళలు 15259 మంది ఓటు వేశారు. ఈ సారి వంద శాతం పోలింగ్ జరిగేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓటర్ల గల్లంతుపై ఆందోళన కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితా ముసాయిదాపై ఆయా పార్టీల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి రూపొందించిన ఓటరు జాబిత సైతం తప్పులతడకగా ఉందని ఆరోపనలు ఉన్నాయి. అభ్యంతరాలు సక్రమంగా సవరించకపోవడంతో శుక్రవారం మాజీ కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. స్వయంగా ఓటర్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పరిష్కరించడం లేదని ఆరోపించారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నూతనంగా 30 వార్డులు ఏర్పాటు చేశారు. వార్డుల పునర్విభజన హద్దులు, ఓటరు జాబిత తయారు సక్రమంగా జరుగలేదని వాపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు రెండు వార్డుల్లో చేర్చారని, మృతి చెందిన ఓటర్లను తొలగించకుండా ఓటరు జాబితా రూపొందించడంతో అసహనం వ్యక్తం చేశారు. గల్లంతైన ఓట్లు సైతం జాబితలో చేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఓటరుకు 5చోట్ల ఓటు కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడంతోనే తప్పిదాలు జరిగాయని ఆరోపించారు. జరిగిన తప్పిదాలను సవరిస్తామని చెప్పడంతో నాయకులు ఆందోళన విరమించారు. నేడు తుది ఓటరు జాబితా విడుదల కానుంది. ముగిసిన పరిశీలన.. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటరు జాబితాలో దొర్లిన తప్పులను సవరించాలని 77మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఫలాన వార్డు నుంచి ఫలాన వార్డులోకి ఓట్లు మార్చాలని, ఓట్లు గల్లంతయ్యాయని, తదితర సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. ఇన్చార్జి కమిషనర్ సతీష్, టీపీబీవో సాయిక్రిష్ణ, ఆర్ఐ క్రాంతి, తదితరులు దరఖాస్తులను పరిశీలించారు. శుక్రవారం జేసీ రాంబాబు, తహసీల్దార్ యుగేందర్లు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండ, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
బోధన్ బల్దియాలో ఇష్టారాజ్యం
బోధన్ పట్టణానికి చెందిన యువకుడు కడిగె శివకుమార్ పట్టణంలోని 23 వార్డులో ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయో వివరాలు ఇవ్వాలని 2017 నవంబర్ 20న బల్దియా అధికారులకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. బల్దియాకు చెందిన అప్పిలేట్ అధికారులు కోరిన సమాచారం అందించకుండా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. ఆ యువకుడు రాష్ట్ర కమిషన్‌ను అశ్రయించగా, పూర్తి వివరాలతో హాజరు కావాలని నోటీసులు జారి చేసింది. సాక్షి, బోధన్(నిజామాబాద్) : సమాచార హక్కు చట్టం అంటే.. బోధన్ బల్దియా అధికారులకు బేఖాతరైంది. ఇక్కడ ఈ చట్టం అభాసు పాలవుతోంది. స్థానికులు పట్టణ అభివృద్ధి వివరాలు కోరితే స్పందించక పోవడంతో పాటు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. దీంతో సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషన్ ఎదుట బల్దియా అధికారులు హాజరు కావాల్సివస్తోంది. బోధన్ పురపాలక సంఘానికి 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు సమాచార హక్కుచట్టం కింద 111 దరఖాస్తులు అందాయి. వీటిలో అధికారులు 82 దరఖాస్తులకు సమాచారాన్ని అందించారు. ఇంకా 29 దరఖాస్తులకు సమాచారం అందించాల్సి ఉంది. అయితే అధికారుల తీరులో మార్పు రావడం లేదు. మచ్చుకు కొన్ని దరఖాస్తులను పరిశీలిస్తే.. బోధన్ పట్టణానికి చెందిన కిరణ్ అనే యువకుడు బోధన్ బల్దియా పరిధిలోని వార్డుల్లో ఉన్న ఇండ్లకు సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లు, కుళాయి పన్ను వసూళ్ల వివరాలు అందించాలని 2018 డిసెంబర్ 14న న దరఖాస్తు చేశాడు. అయితే అధికారులు తప్పుడు సమాచారాన్ని అందించారు. బోధన్ బల్దియాకు కేంద్రం నిధులు ఎన్ని మంజూరు అయ్యాయి, ఎన్ని నిధులు వెచ్చించారు. ఈ నిధులతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి ఏడాది అవుతున్నా సంబందిత దరఖాస్తు దారుకు ఇంకా బల్దియా అధికారులు సమాచారం అందించలేక పోయారు. బోధన్ బల్దియాలో 2017 సంవత్సరంలో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు వార్డుకు రూ.లక్ష చొప్పున వెచ్చించి తాగునీటి అవసరాలు తీర్చారు. వాటి వివరాలు ఇవ్వాలని కోరిన వ్యక్తికి ఇప్పటి వరకు సమాచార హక్కు చట్టం అప్పిలేట్ అధికారి సమాచారం అందివ్వలేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వివరాలకు సమాచారం అందించాలని చట్టం చెబుతున్నా బల్దియా అధికారులు మాత్రం స్పందించకుండా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బల్దియాకు మూడు నోటీసులు సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వారికి తప్పుడు సమాచారం అందించినందుకు, సమాచారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్న కారణంగా ఇప్పటి వరకు బల్దియా కమిషనర్‌కు 3 నోటీసులు అందాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలతో కమిషనర్ ఎదుట హాజరు కావాలని అందిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా బల్దియా అధికారులు మాత్రం అవేవి తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బల్దియా కౌన్సెల్ ఉన్నప్పుడు ప్రతి పక్ష కౌన్సిలర్లతో పాటు అధికార పార్టీ కౌన్సిలర్లు అభివృద్ధి పనులకు సంబంధించి, బల్దియాకు మంజూరు అయిన నిధుల వివరాలు ఇవ్వాలని సహ చట్టం కింద దరఖాస్తు చేస్తే అధికారులు నెలల తరబడి సమాచారం అందించని ఘటనలు ఉన్నాయి. దీంతో కౌన్సిలర్లు కౌన్సెల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. మా పరిధిలో ఉన్న సమాచారం ఇస్తున్నాం.. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దారులు అడిగిన సమాచారాన్ని మా పరిధిలో ఉన్నంత వరకు అందిస్తున్నాము. పరిధిలో లేని అంశాల రికార్డులు లేక పోవడంతో సమాచారం అందించడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు మాకు వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం వరకు సమాచారాన్ని అందించాము. – స్వామినాయక్, మున్సిపల్ కమిషనర్ -
ఆదర్శ మున్సిపాలిటీలో అక్రమాలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్..!
సాక్షి, తాడిపత్రి: ‘పేరుకే తాడిపత్రి ఆదర్శ మున్సిపాలిటీ. జరిగేదంతా దోపిడీ, అక్రమాలే. షాపింగ్ కాంప్లెక్స్ లీజు, అద్దె బకాయిలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు స్వాహా చేయడమేంటి?’ అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ అధికారుల తీరుపైనా అసహనం ప్రదర్శించారు. షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు, లీజుదారులతో శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించారు. మున్సిపాలిటీకి గుడ్‌విల్, అద్దెల రూపంలో చెల్లించిన లక్షలాది రూపాయల్లో సగానికే రసీదులు ఇచ్చి.. మిగతా సొమ్మును సంస్థకు జమ చేయకుండా స్వాహా చేశారని తేలింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి శీనాకు అద్దె మొత్తాలు ఇస్తే తమకు రసీదులు కూడా ఇవ్వలేదని పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ► షాప్ అద్దెకు సంబంధించి రూ.13 లక్షలను క్యాషియర్ రాజేష్‌కు చెల్లిస్తే రూ.8.50 లక్షలకు మాత్రమే రసీదు ఇచ్చాడని జి.రవీంద్రారెడ్డి తెలిపాడు. ► గుడ్‌విల్ కింద తనవద్ద నుంచి రూ.11లక్షలు అవుట్సోర్సింగ్ ఉద్యోగి శీనా తీసుకుని, రూ.8.50 లక్షలకు మాత్రమే రసీదు ఇచ్చాడని, మిగతా మొత్తం గురించి అడిగితే పెన్నానది ఒడ్డున ఏర్పాటు చేసే పార్కు అభివృద్ధి కోసం వినియోగించుకుంటామని చెప్పాడని రంగస్వామి చెప్పాడు. ► పార్కు నిర్మిస్తున్నామంటే మున్సిపాలిటీకి రూ.11లక్షలు చెల్లించానని, అయితే తనకు రూ.8.50 లక్షలు మాత్రమే షాపు అద్దె చెల్లించినట్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగి రసీదు ఇచ్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే అన్న(మాజీ ఎమ్మెల్యే జేసీపీఆర్)ను వచ్చి అడగాలని చెప్పడంతో చేసేదిలేక మిన్నకుండిపోయామని ఖాజామొహిద్దీన్ ఆరోపించాడు. మున్సిపాలిటికీ చెల్లించాల్సిన అద్దె, లీజు, గుడ్‌విల్ మొత్తాన్ని నవంబర్ మొదటి వారం లోపు చెల్లించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. చెల్లించలేని పక్షంలో వెంటనే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వేలం డబ్బు చెల్లించకనే షాపులు ఎలా కేటాయిస్తారు? వేలంలో షాపులు దక్కించుకున్న వారి నుంచి డబ్బు వసూలు చేయకుండానే షాపులు కేటాయించడమేంటని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీ రోడ్డులో జేసీఎన్ఆర్ఎం కాంప్లెక్స్‌లో జేసీ దివాకర్ పేరుతో ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. వేలం పాటలో షాపు దక్కించుకున్నారు. వేలం మొత్తాన్ని చెల్లించకుండా అధికార బలంతో షాపును స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. ఇప్పటి వరకు ఆ షాప్‌కు సంబంధించి రూ.లక్షకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంది. వెంటనే నోటీసులు జారీ చేసి అద్దె డబ్బు వసూలు చేయాలని, లేనిపక్షంలో దివాకర్ ట్రావెల్స్‌ను సీజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. పార్కు ఏర్పాటు పేరుతో మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉంటున్న దుకాణాల యజమానుల నుంచి భారీగా రూ.లక్షల్లో వసూలు చేసి కొంత మాత్రమే మున్సిపాలిటీకి చెల్లించారని, మిగిలిన మొత్తాన్ని జేసి సోదరులు స్వాహా చేశారని మండిపడ్డారు. జేసీ సోదరులు మున్సిపాలిటీని అడ్డుపెట్టుకొని దోచుకున్నదంతా నయా పైసాతో సహా వసూలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్వాహా చేసిన వారిపై ఫిర్యాదు షాపుల అద్దెల మొత్తాన్ని మున్సిపాలిటీకి చెల్లించకుండా స్వాహా చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి శీనా, క్యాషియర్ రాజేష్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దె డబ్బు స్వాహాలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో విచారణ జరపాలని కోరారు. -
మున్సిపాలిటీగా పాయకరావుపేట!
విశాఖపట్నం ,నక్కపల్లి: జిల్లాలో కొత్తగా ఒక మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. పాయకరావుపేటను మున్సిపాలిటీగా, నక్కపల్లి, ఆనందపురంలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఇంతవరకు మేజర్ పంచాయతీలుగా ఉన్న ఈ పంచాయతీలను మున్సిపాలిటీ, నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మళ్లీ వీటిపై కదలిక వచ్చింది. గత నెలలో మరోసారి ప్రతిపాదనలు కోరారు. నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వీటి వ్యవహారం ఏదో ఒకకొలిక్కి తీసుకువచ్చే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా పెండింగ్‌లో.. నక్కపల్లి, పాయకరావుపేట, ఆనందపురం మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున ఈ ప్రతిపాదన మళ్లీ తెరమీదకు వచ్చింది. నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఆగస్టునెలాఖరులోగా పంపించాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. దీంతో అధికారులు మళ్లీ నగర పంచాయతీల ఏర్పాటుపై కసరత్తు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నక్కపల్లికి సంబంధించి ఉపమాక, న్యాయంపూడి, సీహెచ్‌బీ అగ్రహారం, పెదబోదిగల్లం పంచాయతీలను కలిపి నగర పంచాయతీగా చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయాలంటే జనాభా 20 వేలు దాటి, ఆదాయం రూ.30 లక్షలు ఉండాలి. నక్కపల్లి పంచాయతీ ఆదాయం ఏటా రూ.60 లక్షలు ఉంది జనాభా 7500 ఉంది. ఉపమాక జనాభా 5500 ఆదాయం రూ.25 లక్షల వరకు ఉంది. న్యాయంపూడి జనాభా 1500 ఆదాయం రూ.5 లక్షలు, సీహెచ్‌బీ అగ్రహారం పంచాయతీ జనాభా1400 ఆదాయం రూ.5 లక్షలుగా ఉంది. బోదిగల్లం పంచాయతీ జనాభా కూడా 1500, ఆదాయం రూ. నాలుగు లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఈ ఐదు పంచాయతీలను కలిపి నగర పంచాయతీ చేసే అవకాశం ఉంది. ఇక పాయకరావుపేట విషయానికి వస్తే పట్టణ జనాభా సుమారు 30 వేలకుపైబడే ఉంటుంది. ఆదాయం కూడా దాదాపు రూ.రెండు కోట్ల వరకు ఉంటుంది. ఈ పంచాయతీలో పీఎల్‌పురం, సీతారామపురం పంచాయతీలను కూడా విలీనం చేసి మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఆదాయం, ఆర్థిక వనరులు, సరిపడా జనాభా ఇతర మౌలిక సదుపాయాలు ఉండటంతో పాయకరావుపేటను మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో ప్రభుత్వం ఆమోద ముద్రవేసి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. -
మంగళగిరి, తాడేపల్లికి మహర్దశ
సాక్షి, తాడేపల్లి(గుంటూరు) : నియోజకవర్గంలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. తాడేపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్ఎన్ దినేష్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను వేర్వేరుగా చూడొద్దని రెండింటినీ కలిపి చుట్టుపక్కల గ్రామాలతో భవిష్యత్ తరాలకు మంచి సౌకర్యాలతో ఉండే విధంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి మహానగరంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇప్పటినుంచే అభివృద్ధి చేసే పనులు కొన్ని రెండింటికీ కలిపి నిర్వహిస్తే ప్రభుత్వానికి ఎంతో భారం తగ్గుతుందన్నారు. ముఖ్యంగా తాగునీరు రెండు మున్సిపాలిటీలకు అవసరమని దానికి సంబంధించి కృష్ణానదినుంచి రా వాటర్ తీసుకుని ఫిల్టర్ చేయించి గ్రావిటీ ద్వారా రెండు మున్సిపాలిటీలకు అందించడం, డంపింగ్ యార్డును ఒకేచోట ఏర్పాటుచేయడం లాంటి పనులను గుర్తించి ఉమ్మడిగా చేస్తే ప్రభుత్వానికి చాలా ఖర్చు తగ్గుతుంది. విజయవాడ తరువాత రైల్వేలైన్లు అభివృద్ధి చెందేది తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలోనేనని దానికి సంబంధించి కూడా రైల్వే వారితో చర్చించి ఎక్కడెక్కడ బ్రిడ్జిలు కావాలి, ఎంత ఖర్చుపెట్టాలి అనే ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. బకింగ్‌హామ్ కెనాల్‌పై కొత్త బ్రిడ్జి నిర్మాణం, కొత్త రోడ్ల నిర్మాణం వాటి వలన కలిగే లాభనష్టాలు అన్నీ ముందుగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఎవరి నివాసం తొలగించినా ముందస్తుగా వారికి నివాసాలు కేటాయించి మాత్రమే అభివృద్ధి పనులు చేసే విధంగా చూడాలని అధికారులను ఆయన కోరారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలో రెయిన్ ఫాల్స్‌తో నిండే చెరువులున్నాయని, వాటిని రెయిన్ఫాల్స్తో నింపి భూగర్భ జలా లను పెంచే విధంగా కృషి చేయాలని సూచిం చారు. కొండ ప్రాంతాల్లో అటవీ భూములను వినియోగించుకోకుండా ప్రత్యామ్నాయ స్థలాలను ఎన్నుకునేలా చూడాలన్నారు. వీలైనంత వరకు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలకు ఉమ్మడిగా ప్రణాళిక రూపొందిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. సమీక్ష సమావేశంలో తాడేపల్లి మున్సిపల్ కమీషనర్ రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రేడ్–1 మున్సిపాలిటీగా రాయచోటి
-
రాయచోటికి మహర్దశ
సాక్షి, రాయచోటి : కరవు కాటకాలకు కేరాఫ్‌గా ఉంటున్న రాయచోటి నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిం చింది. ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఈవిషయంలో చొరవ తీసుకుని తన నియోజకవర్గంలో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. కరవును శాశ్వతంగా దూరం చేసేందుకు రూ.800 కోట్లతో గండికోట నుంచి రాయచోటికి కృష్ణా జలాలను అందించేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ఈ దిశగా అనుమతులు కూడా వచ్చాయి. ఇదే సందర్భంలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రాయచోటి వాసుల రెండు కలలు నెరవేరుతున్నాయి. రాయచోటి గ్రేడ్–3 మున్సిపాలిటిని గ్రేడ్–1గా అప్గ్రేడు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతూ మరో జీఓ కూడా విడుదల అయింది. ఇప్పటివరకూ ఈ ఆస్పత్రి 50పడకల స్థాయిగా కొనసాగుతోంది. పడకలు పెంచాలనేది చాలా కాలంగా ప్రజల ఆకాంక్ష. ఈ రెండు జీఓలు ఒకేసారి విడుదల కావడంతో రాయచోటి ప్రజానీకం హర్షం వ్యక్తంచేస్తోంది. పోరాటాలు లేకుండానే.... నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా తొమ్మిది మండలాల ప్రజలకు వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. పడకలు సరిపడేవి కావు. వంద పడకల ఆసుపత్రిగా మార్చాలంటూ 10 సంవత్సరాలుగా పోరాటాలు నడిచాయి. అయినా గత ప్రభుత్వాలు స్పందించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం కంటి తుడుపుగా పడకలు పెంచుతున్నట్లు తప్పుడు ఉత్తర్వు జారీ చేసి అభాసుపాలైంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా వంద పడకల ఆసుపత్రిగాను, గ్రేడ్–1 మున్సిపాలిటీగా మారుస్తామన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మూడు నెలల్లోనే ఈ హామీ కార్యరూపం దాల్చుతుండటంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది. గ్రేడ్ –1గా మున్సిపాలిటీ ఉన్నతీకరణ 2005లో పంచాయతీగా ఉన్న రాయచోటిని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రేడ్–3 మున్సిపాలిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేడ్ –3 మున్సిపాలిటీలో 97మంది ఉద్యోగులుండాలి. కానీ 36 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తుండగా మిగిలిన పోస్టులు ఖాళీగా వున్నాయి. ఉద్యోగుల కొరతతో పాటు జనాభా అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చగలిగేలా నిధులు విడుదల కావడంలేదు. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి గ్రేడ్–1గా పెంచేందుకు కృషి చేశారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. మున్సిపల్‌మంత్రి బొత్ససత్యనారాయణతో పలుమార్లు మాట్లాడారు. ఫలితంగా గురువారం మున్సిపాలిటి అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. మున్సిపాలిటీ స్థాయి పెరగడం వల్ల కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల నుండి వివిధరకాల పథకాల పేరిట నిధుల విడుదల పెరుగుతుంది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. లక్షరూపాయల వరకు అత్యవసర పనులను కమిషనరు నామినేషన్ పద్ధతిలో చేపట్టవచ్చు. రాయచోటి రూపురేఖలే మారతాయి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన ప్రేమాభిమానాల వల్ల రాయచోటి నియోజకవర్గ రూపురేఖలు మారుతాయి. రాయచోటి ఆసుపత్రిని వంద పడకల స్థాయిగా పెంచడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే మున్సిపాలిటీ కూడా గ్రేడ్–1గా మార్చేందుకు వీలు కల్పించారు. ఆసుపత్రికి అదనంగా 12 మంది వైద్యులతో పాటు 25 మంది సిబ్బంది సంఖ్య పెరగుతుంది. వైద్య సేవలూ విస్తృతమవుతాయి. రాయచోటిని విద్యా హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాం. సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. – ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి -
అనుమతిలేని ఇళ్లకు అదనపు పన్ను
సాక్షి, మిర్యాలగూడ: మున్సిపాలిటీలలో అనుమతి లేని నివాసాలపై ప్రభుత్వం కొరడా ఝులిపించనుంది. మున్సిపల్ అనుమతులు లేకుండా నివాసాలు నిర్మించుకున్న వారికి అదనపు పన్ను రూపంలో ఆస్తిపన్ను పెంచారు. అనుమతి ఉన్న భవనాలలో అనుమతికి మించి అదనపు గదులు గానీ, అంతస్తులు గానీ నిర్మించినా అదనపు పన్ను చెల్లించాల్సిందే. 2019–20వ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ అదనపు పన్నును అమలు చేయనున్నారు. నివాసాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించిన సంవత్సరాల ఆధారంగా ఆస్తి పన్నులో 10 శాతం నుంచి వందశాతం వరకు పెంచారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి రూపాయల ఆస్తిపన్ను చెల్లించే వారికి ఇకనుంచి రెండు వేల రూపాయల బిల్లు వస్తుంది. అంతా ఆన్లైన్లోనే జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ పాత మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా చిట్యాల, చండూరు, హాలియా, నందికొండను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలలో నివాసాలు, కమర్షియల్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర నివాస సముదాయాలను గత ఏడాది ఆన్లైన్లో జియో ట్యాగింగ్ చేశారు. నిర్మాణాల విస్తీర్ణం, భవన అంతస్తులు, ఇతర నిర్మాణాలు పూర్తిగా ఆన్లైన్లో నమోదయ్యాయి. దీంతో అనుమతి తీసుకున్న సమయంలో ఇంటి నిర్మాణం ఎన్ని అంతస్తులు, ప్రస్తుతం ఎన్ని అంతస్తులు ఉందనే విషయంతో పాటు నిర్మాణానికి అనుమతి ఉందా? లేదా? అనేది కూడా గూగుల్‌లో అధికారులు చూసే అవకాశం ఉంది. దాని ఆధారంగా ఆన్లైన్లోనే ఆస్తిపన్ను ఎంత చెల్లించాలనే వివరాలు కూడా వస్తాయి. ఆన్లైన్లో వచ్చిన ఆస్తి పన్నును ఇంటి యజమాని పూర్తిగా చెల్లించాల్సిందే. ఇంటి నిర్మాణం, విస్తీర్ణం, అంతస్తుల ఆధారంగా ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తిపన్నుపై అదనంగా 10 నుంచి వందశాతం వరకు పెంచారు. మిర్యాలగూడలో ఇదీ పరిస్థితి: మిర్యాలగూడ మున్సిపాలిటీలో నివాసాలు 19,318 ఉన్నాయి. కమర్షియల్ భవనాలు 1941, కమర్షియల్‌తో పాటు నివాసాలు ఉన్నవి 452 మొత్తం 21,711 భవనాలు ఉన్నాయి. వాటికి గాను 6.82 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉంది. దీంతోపాటు పాత బకాయిలు 8.26 లక్షల రూపాయలు ఉండగా మొత్తం 6.90 కోట్ల రూపాయల ఆస్తి పన్నును వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 1.88 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ఇంకా 5.02 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలకు సంబంధించి పాత బకాయిలతో పాటు 1.51 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ఆన్లైన్లోనే బిల్లు వస్తుంది.. చెల్లించాల్సిందే.. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గతంలో అనుమతి లేకుండా నిర్మించుకున్న భవనాలకు అదనంగా పన్ను చెల్లించాల్సిందే. ఆన్లైన్లో ఇంటి నిర్మాణానికి అనుమతి ఉందా? లేదా? అనే విషయం కూడా ఉంది. 10 శాతం నుంచి వంద శాతం వరకు అదనపు పన్ను వస్తుంది. అనుమతి ఉండి కూడా అదనపు పన్ను వస్తే పత్రాలతో మున్సిపాలిటీకి వస్తే పరిశీలిస్తాం. ఆన్లైన్లోనే బిల్లులు వస్తున్నందున చెల్లించాల్సిందే. – కళ్యాణి, రెవెన్యూ అధికారి, మిర్యాలగూడ మున్సిపాలిటీ -
‘నగర’ దరహాసం
సాక్షి, మేడ్చల్‌జిల్లా: గ్రేటర్ హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నగరీకరణ దిశగా దూసుకెళుతోంది. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలతో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సగ భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంది. దీనికి తొడు కొత్తగా నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు (నగరపాలక సంస్థలు), తొమ్మిది మున్సిపాలిటీలు ఏర్పడటంతో జిల్లా పూర్తిగా నగరీకరణను సంతరించుకోనుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి గ్రామ పంచాయతీలను వీలినం చేస్తూ నిజాంపేట్ మున్సిపాలిటిగా ప్రకటించిన ప్రభుత్వం.. ఈ మున్సిపాలిటీని మళ్లీ ‘కార్పొరేషన్’గా ప్రకటించింది. ఇదే నియోజకవర్గంలోని దుండిగల్, మల్లంపేట్, డీపీపల్లి, గాగిల్లాపూర్, బౌరంపేట్, బహుదూర్‌పల్లి గ్రామాలతో దుండిగల్ మున్సిపాలిటీ, కొంపల్లి, దూలపల్లి గ్రామ పంచాయతీలను కలిపి కొంపల్లి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జవహార్‌నగర్ గ్రామ పంచాయతీని మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చింది. చెంగిచెర్ల, బోడుప్పల్ గ్రామ పంచాయతీలను కలిపి బోడుప్పల్ కలిపి మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసింది. పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వాతాపూర్ పంచాయతీలను కలుపుతూ ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఇదే మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్,అత్వేల్లి గ్రామ పంచాయతీలను కలుపుతూ మేడ్చల్ మున్సిపాలిటీగా, ఘట్కేసర్, కొండాపూర్, ఎన్‌ఎఫ్‌సీనగర్ గ్రామాలను ఘట్కేసర్ మున్సిపాలిటీగా, పోచారం, ఇస్మాయిల్ఖాన్ గూడ, నారపల్లి, యన్నంపేట్ గ్రామాలను కలిపి పోచారం మున్సిపాలిటీగా ఏర్పడ్డాయి. దమ్మాయిగూడ, అహ్మద్‌గూడ, కుందనపల్లి గ్రామాలను దమ్మాయిగూడ మున్సిపాలిటీగా, నాగారం, రాంపల్లి గ్రామాలను నాగారం మున్సిపాలిటీగా, గండ్లపోచంపల్లి, కండ్లకోయ, బాసిరేగడి, గౌరవెళ్లి, అర్కలగూడ గ్రామాలను కలిసి గండ్లపోచంపల్లి మున్సిపాలిటీగా, దేవరయాంజల్, ఉప్పరపల్లి గ్రామాలను తూముకుంట మున్సిపాలిటీగా ఆవిర్భవించాయి. అభివృద్ధికి వడివడిగా అడుగులు జిల్లాలో కొత్తగా నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు ఏర్పడటంతో ఈ పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ పెరుగుదల ఉండగలదని భావిస్తున్నారు. అనుబంధ సేవా రంగం అభివృద్ధితో పాటు అనువుగా ఉన్న జాతీయ రహదారి, దాని సమీంపలోని ఔటర్ రింగ్ రోడ్, ఆర్అండ్బీ, పీఆర్ రోడ్ల విస్తరణతో నిర్మాణ రంగం దూసుకెళుతుందని ఇక్కడి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం జిల్లాలో ఇప్పటికే 63 భారీ పరిశ్రమలు, 23,961 సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న 3,30,055 మంది ఉద్యోగులు, కార్మికుల కుటుంబాల్లో 40 శాతం ఈ నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనే నివాసముంటున్నారని తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా 783 వివిధ తరహా పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు ఉండటంతో కొత్తగా 46,356 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 360 ఎకరాల్లో ఐటీఐఆర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. -
లెక్క తేలలేదు..
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓటర్ల లెక్క పూర్తిగా తేలలేదు. ఓటర్ల తుది జాబితా వెల్లడించినప్పటికీ కులాల వారీగా, మహిళా ఓటర్ల సంఖ్య ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోని మిగతా మున్సిపాల్టీల్లో ఓటర్ల తుది జాబితాను కులాల వారీగా, మహిళా ఓటర్ల సంఖ్య ప్రకటించినా నగరపాలక సంస్థలో బుధవారం నాటికి వాయిదా పడింది. కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం 60 డివిజన్లకు చెందిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. విడుదల చేసిన తుది ఓటర్ జాబితాను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. నగరంలో ఉన్న వివిధ పార్టీల కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులకు నగరపాలకసంస్థ తరఫున 60 డివిజన్ల ఓటర్ల జాబితాను అందజేశారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి న్యాయబద్ధమైనవి పరిష్కరించినట్లు వెల్లడించారు. తుది జాబితాలో పెరిగిన ఓటర్లు 18,941 కరీంనగర్ నగరపాలక సంస్థలో పునర్విభజన తర్వాత చేపట్టిన ఓటర్ల సర్వే ఆధారంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,56,845 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,29,273 మంది కాగా, మహిళలు 1,27,572 మంది ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. తుదిజాబితా ప్రకారం ఓటర్లు 2,75,786 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితా కంటే ప్రస్తుత జాబితాలో 18,941 ఓటర్లు పెరిగారు. ముసాయిదా జాబితా తయారీ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఎక్కడ గల్లంతయ్యాయో... సర్వే చేపట్టిన వారికే తెలియాలి. వెల్లడించని కుల, మహిళా ఓటర్ల సంఖ్య.. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓటర్ల తుది జాబితాను వెల్లడించినప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన సంఖ్యను ప్రకటించలేకపోయారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కుల, మహిళా ఓటర్ల సంఖ్యను ప్రకటించినా కరీంనగర్లో ప్రకటించికపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు, ఈ నెల 14 తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సంఘం మరో రెండు రోజుల గడువు పెంచి 16న తుది జాబితా ప్రకటించాలని సమయం ఇచ్చినప్పటికీ అధికారులు గణన పూర్తి చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కులాల వారీగా ఓటర్ల జాబితాల్లో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా... అంటూ విపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా కులాల గుర్తింపు... నగరపాలక సంస్థలో పలు డివిజన్లలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుల గణన సమయంలో ఇష్టం వచ్చినట్లు ఒక కులం వారికి మరో కులంగా గుర్తించారు. నగరంలోని 3–7–188/1 ఇంటిలో రెడ్డి కులానికి చెందిన రాజిరెడ్డి కుటుంబంలోని ఓటర్లను ఎస్సీలుగా లెక్కించారు. ఇది ఒక్క ప్రాంతంలోనే కాదు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ.. ఓటర్ల జాబితాలో కుల గణనను వెల్లడించికపోవడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడడం లేదు. కుల గణనను ప్రకటిస్తే ఆ లెక్క ప్రకారం రిజర్వేషన్లను లెక్కించుకునే అవకాశం ఉండేది. అధికారులు కుల గణనను ప్రకటించకపోవడంతో రిజర్వేషన్లపై సందిగ్ధం నెలకొంది. ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఏ డివిజన్ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనే ఎవరూ తేల్చలేని పరిస్థితి నెలకొంది. కుల గణన ప్రకటిస్తే తప్ప రిజర్వేషన్లపై ఉత్కంఠత వీడే అవకాశం లేదు. మున్సిపాల్టీల వారీగా.. ► చొప్పదండి మున్సిపాల్టీలో మొత్తం 12,554 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,253, మహిళలు 6,301 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 48 మంది అధికంగా ఉండడం గమనార్హం. కొత్త మున్సిపల్ చట్టంపై చట్టసభల్లో ఆమోదం పొందాకే రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ► కొత్తపల్లి మున్సిపాల్టీ తుది ఓటరు జాబితాను మంగళవారం విడుదల చేశారు. కమిషనర్ గాలిపల్లి స్వరూపారాణి, టీపీఓ శ్రీహరి తదితరులు తుది ఓటరు జాబితాను ప్రదర్శించారు. 12 వార్డులకు గాను 9,421 మంది ఫొటోలతో కూడిన ఓటరు జాబితా విడుదల చేశారు. 117 ఓట్లు డబుల్‌గా నమోదైనట్లు వచ్చిన అభ్యర్థనలను తదుపరి చర్యల నిమిత్తం ఆర్డీఓకు నివేదించారు. ► జమ్మికుంట పురపాలక సంఘం ఓటర్ల తుది జాబితా వెలువడింది. కమిషనర్ అనిసూర్ రషీద్ ఓటర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మొత్తం 29,087 ఓటర్లుండగా.. ఇందులో 14,596 మంది మహిళలు, 14,491 పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. బీసీలు 18,920, ఎస్సీలు 5,704, ఎస్టీలు 210, ఓసీలు 4,253 ఉన్నట్లు వివరించారు. ► హుజూరాబాద్ పట్టణంలోని 30 వార్డులకు సంబంధించిన ఓటరు తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ ఈసంపల్లి జోనా విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 25,406 మంది ఉండగా.. పురుషులు 12,659, మహిళా ఓటర్లు 12,747 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 234, ఎస్సీలు 4,583, బీసీలు 16,305, ఓసీ ఓటర్లు 4,284 మంది ఉన్నారు. -
అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...
షాద్‌నగర్‌టౌన్: అధికారుల నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకలా తయారైంది. మున్సిపాలిటీ పరిధిలోని వెంకట రమణ కాలనీలో ఇంటి నంబర్ 18–211/6లో ఓటరు పేరు డ డ అని, తండ్రి పేరు హ హ.. అని నమోదు చేశారు. ఇంటి నంబర్ 18–403/5లో ఓటరు రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి పేరు బదులుగా ఆయన భార్య పేరును నమోదు చేశారు. ఓటరు జాబితాలో తమ పేరుందో లేదోనని పరిశీలిస్తోన్న ప్రజలు ఈ తప్పుల తడకలా తయారైన ఓటర్ల జాబితాను చూసి అవాక్కవుతున్నారు. -
కలెక్టర్లకు ‘పుర’పవర్స్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లు పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి సారిస్తూ వస్తున్నారు. మున్సిపాలిటీల్లో సమస్యలను ఆయా పాలకవర్గాలు, అధికారులే పరిష్కరించేవారు. ఒకవేళ అందులో విఫలమైనా కలెక్టర్లు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ప్రజలు బయటకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేసినా అది పట్టణానికే పరిమితమయ్యేది. దీంతో తీవ్రమైన సమస్య ఉత్పన్నమైతే తప్ప ప్రభుత్వం రంగంలోకి దిగేది కాదు. ఈ పరిస్థితి కొత్త చట్టంతో మారిపోనుంది. పురపాలికల్లో ఏ సమస్య తలెత్తినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు తప్పనిసరి కానుంది. దీంతో మున్సిపాలిటీల్లో అడ్డగోలు వ్యవహారాలకు కళ్లెం పడనుంది. పాలనలో పారదర్శకత, పాలకవర్గాల్లో జవాబుదారీతనం పెంపొందించేలా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరిని బాధ్యులను చేసేలా కొత్త పురపాలక చట్టంలో నిబంధనలను రూపొందిస్తున్నారు. ఈ చట్టం అమలు బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించనున్నారు. పట్టణ స్థానిక సంస్థలపై కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేయడమే కాకుండా పురపాలనను గాడిలో పెట్టే బాధ్యతను కూడా వారికే అప్పగించింది. మున్సిపాలిటీలను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా చేపట్టనుంది. తద్వారా పురపాలక సంఘాలపై ప్రభుత్వ అజమాయిషీ కొనసాగనుంది. ఇందులో భాగంగా పన్నుల వసూళ్లు, హరితహారం, ప్రభుత్వ పథకాల అమలులో పాలకవర్గాలను బాధ్యులను చేయనుంది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టనుంది. ఇప్పటివరకు పాలకవర్గాల తీర్మానాలను మాత్రమే సమీక్షించే అధికారం కలెక్టర్లకు ఉండేది. కొత్త చట్టంలో అవసరమైతే ప్రజాప్రతినిధులపై వేటు వేసే విచక్షణాధికారం కూడా కలెక్టర్లకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి 15 రోజులకోసారి మున్సిపాలిటీలను తనిఖీ చేసేలా, పనితీరు సమీక్షించేలా జాబ్‌చార్ట్‌ను రూపొందిస్తోంది. అప్పిలేట్ ట్రిబ్యునల్..! ప్రజాప్రతినిధులపై తీసుకునే చర్యలను సమీక్షించేందుకు ప్రత్యేక అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉండేది. తాజాగా దీన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ.. సమీక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి జిల్లా జడ్జి స్థాయి అధికారి అప్పిలేట్ అధికారిగా వ్యవహరించే అవకాశముంది. ప్రజాప్రతినిధులపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు ఇటీవల జరిగిన ఓ మున్సిపల్ సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు మున్సిపల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టౌన్ ప్లానింగ్ అంతా అవినీతిమయం అయిపోయిందని, ఈ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడట్లేదని సీఎం అభిప్రాయపడ్డట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్‌తో పాటు ప్రజాప్రతినిధులపై కూడా ఆయన చేసిన కీలక వ్యాఖ్యల ఆధారంగానే కొత్త చట్టంలో కలెక్టర్లకు కీలక అధికారాలిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తాము ఇటీవలే హైదరాబాద్‌లో సర్వే నిర్వహించామని, ఇందులో 90 శాతం మంది కార్పొరేటర్లు అవినీతిపరులనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, వీరి వల్ల స్థానికంగా ఎలాంటి ఉపయోగం లేదని, వీరి కంటే ప్రత్యేకాధికారుల పాలనే మేలనే ఉద్దేశంతో ప్రజలున్నారని చెప్పిన కేసీఆర్ అవినీతి చేసినా, అంకిత భావంతో పనిచేయకపోయినా చైర్మన్లు, కౌన్సిలర్లను కూడా సస్పెండ్ చేసే అధికారాలుండాలని చెప్పారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
టీడీపీ పాలన అవినీతిమయం
సాక్షి, సూళ్లూరుపేట: గడిచిన ఐదేళ్లలో సూళ్లూరుపేట మున్సిపాలిటీ పాలన అవినీతిమయంగా మారింది. టీడీపీ పాలకవర్గం దెబ్బకు ఎనిమిది మంది కమిషనర్లు మారారు. అవినీతి కారణంగా వచ్చిన కమిషనర్లు వచ్చినట్టే వెళ్లిపోయారు. మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 11 వార్డులు, టీడీపీ 8 వార్డులు, కాంగ్రెస్ 3 వార్డులు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డును గెలుచుకున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి చక్రం తిప్పి స్వతంత్ర అభ్యర్థిని తీసుకోవడంతో టీడీపీ కౌన్సిలర్ నూలేటి విజయలక్ష్మి చైర్‌పర్సన్‌గా, గరిక ఈశ్వరమ్మ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఒకటో వార్డు, 17వ వార్డులకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను చేర్చుకుని మరింత బలపడ్డారు. దీంతో కౌన్సిల్ సమావేశాలు దాదాపుగా రచ్చ..రచ్చగానే సాగాయి. మున్సిపాలిటీ అభివృద్ధిని పక్కనబెట్టి మంజూరైన నిధులను వచ్చినవి వచ్చినట్టుగా స్వాహా చేయడం ఎక్కువైపోయింది. పాలకవర్గానికి ఎదురు చెప్పే కమిషనర్లను ఇంటికి సాగనంపడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఓ కమిషనర్‌పై ఏకంగా అతని ఛాంబర్‌లోనే దాడికి పాల్పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సూళ్లూరుపేట మేజర్ పంచాయతీ నుంచి గ్రేడ్–3 మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఏడాదికి సుమారు రూ.5 నుంచి రూ.7కోట్ల వార్షికాదాయం కలిగిఉంది. టీడీపీ పాలకవర్గం పన్నులు విపరీతంగా పెంచేసి ప్రజలపై భారం మోపింది. పన్నుల వసూళ్లలోనూ చేతివాటం చూపారు. పాలకవర్గానికి అనుకూలంగా ఉన్న వారికి, అధికార టీడీపీ వారికి భారీగా తగ్గించి కమిషన్లు దండుకున్న సంఘటనలు ఉన్నాయి. కనిపించని అభివృద్ధి గడిచిన ఐదేళ్ల కాలంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ కోట్లకు కోట్లు మంజూరు చేసినా అభివృద్ధి మాత్రం కనిపించలేదు. షార్ నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను పాలకపక్షం తన ఖాతాలో వేసుకుంది. ఆర్థిక సంఘం, సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించిన సిమెంట్‌రోడ్లు, మురుగునీటి కాలువల పనుల్లోనూ నాణ్యత లోపించింది. ఈ నిధుల్లోనూ కొంత భాగం పనులు చేయక వెనక్కి వెళ్లిపోయాయి. సాధారణ నిధులు భారీగా స్వాహా మున్సిపాలిటీకి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సాధారణ నిధులతో పాలకపక్షం నామమాత్రంగా పనులు చేపట్టి కోట్లాది రూపాయల స్వాహా చేసింది. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత సుమారు 10 మంది కమిషనర్లు మారగా మూడుసార్లు ఇన్చార్జి కమిషనర్లు పనిచేశారు. యాదగిరి శ్రీనివాసరావు కమిషనర్‌గా ఉన్న సమయంలో రూ.11 లక్షలు స్వాహా చేసిన మేనేజర్ సలోమిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. ఆ నిధులు ఎవరు స్వాహా చేశారనే విషయం తేల్చకుండానే ఫైల్ మూసేశారు. సాధారణ నిధులను అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగించాల్సి ఉంగా నరేంద్రనాథ్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సాధారణ నిధులను ఇష్టానుసారంగా వాడేసుకుని స్వాహా చేశారని టీడీపీ పక్ష సభ్యులే అరోపిస్తుండడం విశేషం. ఏడాదికి మున్సిపాలిటీకి సుమారు రూ.7 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇందులో జీతాలు, ఇతర అవసరాలకు కలిపితే సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయి. మిగిలిన నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ ఏడాది సుమారు రూ.3కోట్ల సా«ధారణ నిధులను కమిషనర్ నరేంద్రకుమార్ హయాంలో పై అధికారుల అనుమతులు లేకుండా, కౌన్సిల్ తీర్మానం లేకుండా ఇష్టానుసారంగా వ్యయం చేసి లెక్కలు చూపిస్తున్నారు. వాస్తవంగా సాధారణ నిధులను అత్యసర సమయాల్లో కౌన్సిల్ తీర్మానం మేరకు ఖర్చు చేయాలి. కానీ నామినేటెడ్ వర్కుల కింద గ్రావెల్‌రోడ్లు, సిమెంట్‌రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లుగా సుమారు రూ.1.50 కోట్లు డ్రా చేసేశారు. కార్యాలయ ఖర్చుల కింద మరో రూ.25 లక్షలు డ్రా చేశారు. వట్రపాళెంలో వీపీఆర్ ఇన్ప్రా పేరుతో రూ.25 లక్షలతో కంకరడస్ట్తో రోడ్లు వేసి రూ.85లక్షలుగా చూపించి కౌన్సిల్ సమావేశంలో ఆమోదించుకోవాలని ప్రయత్నాలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏటి పండగ నిర్వహణకు రూ.లక్ష ఖర్చు చేసి రూ.5లక్షలుగా చూపించారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఇచ్చిన నిధులు చాలవని, మరో రూ.లక్షలు ఆమోదించుకునే ప్రయత్నాలు చేయడం విశేషం. అలాగే అవుట్ సోర్సింగ్ సిబ్బంది పేరుతో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. ఇలా ఇష్టానుసారంగా కౌన్సిల్ ఆమోదం సైతం లేకుండానే నిధులను బొక్కేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు కలిసి స్వాహా చేసిన సాధారణ నిధులపై విచారణ జరిపించాలని డీసెంట్ రాసి కమిషనర్‌కు ఇచ్చారు. కమిషనర్ పూర్తిస్తాయి విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగు చూస్తాయి. -
పురపాలకులెవరో?
సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ స్థానిక సంస్థల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అందులోనూ మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనంటూ ఉవ్విళ్లూరుతున్నారు. అంతకంటే ముందు అసలు ఏ మునిసిపాలిటీ ఏ సామాజికవర్గానికి రిజర్వు అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాలో ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు ఉండగా.. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు న్యాయ చిక్కులు వచ్చిపడడంతో దశాబ్దకాలం పైగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన చోట్ల ఎన్నికలకు ఎలాంటి అవాంతరం రాలేదు. అయితే 2014లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్లు, మేయర్ రిజర్వేషన్లు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు జరిగింది. రాష్ట్ర విభజన తరువాత కూడా పాత రిజర్వేషన్ల ప్రకారమే సామాజిక వర్గాల ఆధారంగా చైర్మన్, మేయర్ స్థానాలు రిజర్వు అయ్యాయి. చిత్తూరు అర్బన్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలను ఓ యూనిట్‌గా, 16 కార్పొరేషన్లను ఓ యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఫలితంగా జిల్లాలో సైతం పలు స్థానాల రిజర్వేషన్లు మారే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో రిజర్వేషన్లకు 50 శాతానికి కుదించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలోని స్థానిక సంస్థల రాజకీయాల్లో ప్రస్తుతం 78 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. మిగిలిన 22 శాతం మాత్రం ఓపెన్ కేటగిరిలో ఉంచారు. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలకు వెళ్లాలంటే ఇప్పుడున్న 78 శాతాన్ని 50 శాతానికికుదించాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానంచేసి ఆర్డినెన్స్ జారీచేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం, మైనారిటీ, మహిళలకు కేటాయించిన రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేసి.. మిగిలిన దాన్ని ఓపెన్ కేటగిరికి ఉంచనున్నారు. పూర్తయిన గణన.. ప్రస్తుతం జిల్లాలోని మునిసిపాలిటీలతో పాటు చిత్తూరు కార్పొరేషన్లో ఉన్న పాలకవర్గానికి జూలై 2వ తేదీతో గడువు ముగుస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 269 వార్డుల్లో ఓటర్ల జాబితాను సైతం ప్రచురించారు. దానితరువాత రాష్ట్ర మున్సిపల్ పరిపాలన విభాగం నుంచి వచ్చిన ఆదేశాలతో మునిసిపాలిటీల్లో వార్డుల్లో ఉన్న ఓటర్లను సామాజిక వర్గాల ఆధారంగా గుర్తించారు. ఈనెల 4వ తేదీన వార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను జిల్లా వ్యాప్తంగా ప్రచురిస్తారు. అనంతరం రెండు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించి ఈనెల 17న తుదిగా కులాల వారీగా ఓటర్ల జాబితా వార్డుల్లో ప్రచురించి, 18వ తేదీ జాబితాను కమిషనర్లు.. రాష్ట్ర మునిసిపల్ శాఖకు అందచేస్తారు. తగ్గనున్న వార్డుల రిజర్వేషన్ చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో ప్రస్తుతం 269 వార్డులున్నాయి. వీటిల్లో తిరుపతి మినహా మిగిలిన చోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 2014లో వార్డుల రిజర్వేషన్ జరిగింది. వీటిలో 78 శాతం రిజర్వేషన్ ఉంది. అయితే ప్రస్తుతం రిజర్వేషన్‌ను 50 శాతానికి కుదించాల్సి ఉండడంతో సగం వార్డులు ఓపెన్ కేటగిరికీ ఉంచుతారు. వార్డుల రిజర్వేషన్లో మాత్రం తప్పనిసరిగా ఈసారి రొటేషన్ పద్ధతిలో గతంలో వచ్చిన రిజర్వేషన్ కేటగిరీలను మార్చనున్నారు. చైర్మన్, మేయర్ స్థానాలకు తొలిసారిగా రాష్ట్ర యూనిట్ తీసుకుంటున్న వైనంలో జిల్లాలో ఇప్పుడున్న రిజర్వు స్థానాల్లో కొన్ని అదే వర్గాలకు కేటాయించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరో మూడు నెలల్లో మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
పట్టణ ప్రణాళికలు రెడీ!
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రణాళికలను రెడీ చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగడానికి దోహదపడే మాస్టర్ప్లాన్లకు తుదిరూపునిస్తోంది. నూతనంగా ఏర్పడ్డ 68 పురపాలికల్లో.. 23 మున్సిపాలిటీలకు మాస్టర్ప్లాన్లను తయారు చేస్తోంది. ఇందులో ఇప్పటికే పెద్దపల్లి పురపాలిక ముసాయిదా మాస్టర్ ప్లాన్‌కు సర్కారు ఆమోదముద్ర వేసింది. మరో ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదాలను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పురపాలక శాఖ పంపింది. పట్టణీకరణ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఈ మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగంపై స్పష్టతనిస్తోంది. రహదారులకు పెద్దపీట! పట్టణాభివృద్ధికి దిక్సూచిగా చెప్పుకునే మాస్టర్‌ప్లాన్‌లో జోనల్ రెగ్యులైజేషన్‌ను విధిగా పాటించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టకుండా బ్రేక్ పడనుంది. నిర్దేశిత జోన్లో మాత్రమే నివాస భవనాలకు అనుమతులు జారీ చేయనున్నారు. రెసిడెన్షియల్ జోన్లో మాత్రమే ఈ కట్టడాలను అనుమతిస్తారు. అలాగే కమర్షియల్ జోన్లో వాణిజ్య కార్యకలాపాలను, రిక్రియేషన్/కన్జర్వేషన్ జోన్‌ను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వీటితోపాటు మాస్టర్‌ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్‌తోపాటు ప్రజావసరాలు, మౌలిక వసతులు, రహదారుల విస్తరణపై కూడా స్పష్టత నివ్వనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే ఆయా మున్సిపాలిటీల్లో అనుమతులు జారీ చేయనున్నారు. ప్రభుత్వ పరిశీలనకు ఎనిమిది ఇప్పటికే పెద్దపల్లి మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఓకే చెప్పగా.. మహబూబాబాద్, భూపాలపల్లి, అందోల్–జోగిపేట్, దేవరకొండ, కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట పురపాలికల ముసాయిదా మాస్టర్ప్లాన్లు ప్రభుత్వ పరిశీలనకు వెళ్లాయి. ఇవిగాకుండా.. బాదేపల్లి, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, కల్వకుర్తి, కోదాడ, హుజూర్నగర్, ఐజ, నర్సంపేట, పరకాల, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లెందు, బెల్లంపల్లి, మణుగూరు మున్సిపాలిటీల మాస్టర్ప్లాన్లను డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ) చకచకా రూపొందిస్తోంది. వీటన్నింటికి త్వరితగతిన ఆమోదముద్ర వేయించడం ద్వారా ఆగస్టు నుంచి మనుగడలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇదిలావుండగా, ఇప్పటికే వివిధ నగరాభివృద్ధి సంస్థలు మాస్టర్ప్లాన్లను అమలు చేస్తున్నాయి. తాజాగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అధికశాతం వీటి పరిధిలోకి వస్తున్నందున అమలులో ఉన్న మాస్టర్ప్లాన్లే వీటికి వర్తించనున్నాయి. -
బోధన్‌లో మున్సిపల్ కాంట్రాక్టర్ల ఆందోళన
-
విజయనగరానికి కొత్త హోదా..
విజయనగరం మున్సిపాలిటీ: చారిత్రాత్మక నగరం కొత్త హోదా దక్కించుకునే ప్రక్రియ జోరందుకుంది. మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం జూలై 3 నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందనుండగా... అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. 40 వార్డులతో ఇప్పటివరకు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరాన్ని 50 డివిజన్లుగా విభజించాలంటూ ఆదేశాలు వచ్చాయి. రానున్న 32 రోజుల్లో వార్డులను డివిజన్లుగా మార్చాలంటూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కె.కన్నబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రత్యేక షెడ్యుల్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీ నుంచి 17వ తేదీలోగా టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రస్తుమున్న 40 వార్డులను 50 డివిజన్లుగా విభజించాలి. 18వ తేదీ నుంచి 27 లోగా డివిజన్లపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ పత్రికల్లో పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు స్థానికుల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలి. 28వ తేదీన పూర్తి చేసిన 50 డివిజన్ల విభజన ప్రతిపాదనలను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేయాలి. 29, 30 తేదీల్లో డీఎంఏ పరిశీలన అనంతరం 31 నుంచి జూలై 3వ తేదీలోగా ఆ ప్రతిపాదలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. 3,4,5,6 తేదీల్లో ప్రభుత్వ పరిశీలన అనంతరం డివిజన్ల ఏర్పాటుపై ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. మరల 7, 8 తేదీల్లో ఆమోదముద్ర వార్డు డివిజన్లను మరల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ దినపత్రికల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పబ్లికేషన్ చేయాలి. మొత్తం అన్ని పనులనూ 32 రోజుల్లోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈశాన్యం నుంచి విభజన ప్రక్రియ ప్రారంభం విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నాటికి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2, 44, 598 మంది జనాభా ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ హోదా దక్కించుకోనున్న విజయనగరంలో డివిజన్ల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు నార్త్ ఈస్ట్ (ఈశాన్యం)నుంచి విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుత విజయనగరం భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే విజయనగరం– నెల్లిమర్ల ప్రధాన రహదారిలో గల వేణుగోపాలపురం నుంచి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ సవ్యదిశ (క్లాక్‌వైజ్)లో భౌగోళికంగా చేపట్టాల్సి ఉంటుంది. 2011 జనాభా ఆధారంగానే... జూలై 3 నుంచి కార్పొరేషన్ హోదా దక్కించుకోనున్న విజయనగరంలో డివిజన్ల విభజన 2011 జనాభా ఆధారంగానే జరగనుంది. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్న విజయనగరంలో 40 వార్డులుండగా.. వాటిని 50 డివిజన్లుగా విభజించాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2, 44, 598 మంది జనాభా పట్టణ పరిధిలో నివసిస్తున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు 50 డివిజన్లను ఒక్కో డివిజన్‌కు 5 వేల మంది జనాభా ఉండేలా విభజన చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో డీఎంఏ ఆదేశాలు జారీ చేయగా.. అన్ని డివిజన్లలో 10 శాతం హెచ్చుతగ్గుల్లో సరాసరి జనాభా ఉండేలా నిబంధన పాటించాలని సూచించింది. అమోదం సాధ్యమేనా...? ప్రస్తుతం మున్సిపాలిటీలో ఉన్న వార్డులను డివిజన్లుగా మార్పు చేసి ప్రభుత్వ ఆమోద్ర వేసే విషయంలో సా«ధ్యా అసాధ్యాలపై చర్చ సాగుతోంది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం అధికారులు తయారు చేసే డివిజన్ల విభజన ప్రక్రియను కార్పొరేషన్ పాలకవర్గం కానీ కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిగా ఉన్న అధికారి ఆమోద్ర ముద్ర వేయాల్సి ఉంటుంది. అయితే జూలై 2వ తేదీ వరకు ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గానికి గడువు ఉండడంతో ఎవరు ఆమోద ముద్ర వేసి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదేశాలు వచ్చాయి.. మున్సిపాలిటీగా ఉన్నవిజయనగరానికి త్వరలో కార్పొరేషన్ హోదా రానుంది. ఈ నేపథ్యం లో డీఎంఏ ఆదేశాల మేర కు 40 వార్డులను 50 డివిజన్లుగా మార్పు చేయాల్సి ఉంది. 2011 జనాభా ఆధారంగా నార్త్–ఈస్ట్ నుంచి గడియారం దశలో ఈ విభజన ప్రక్రియ చేపడతాం. ఈ ప్రక్రియను మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు చేపట్టనున్నారు. షెడ్యూల్ మేరకు 32 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. – ఎస్ఎస్ వర్మ, కమిషనర్, విజయనగరం -
ఆంధ్రుల అనర్ఘరత్నం
‘ఇది చాలా విచిత్రమైన యుద్ధం. ఆంధ్రరత్న ప్రజలందరినీ కూడగట్టుకొని, చీరాల ప్రాంతాన్ని మునిసిపాలిటీగా రూపొందిస్తే ఆ గ్రామాన్ని పూర్తిగా విసర్జించి, వేరే తావులకు వలసగా వెడలి పోతామని తెలియచేశాడు. ఇది నిజంగా చాలా బ్రహ్మాండమైన ప్రయత్నం. చీరాల–పేరాల ప్రజలు పదిహేడువేల మందికి పైగా ఉన్నారు. వారందరినీ ఒక త్రాటి మీద నిలబెట్టి, వారి చేత తరతరాలుగా వారు వుంటూ వున్న ఇళ్లనీ, వాకిళ్లనీ విడిచి పెట్టించి వారిని రామనగరు పరిసర ప్రాంతాలకు తీసుకుని పోవడం అంటే మాటలా?’టంగుటూరి ప్రకాశం ఆత్మకథ ‘నా జీవితయాత్ర’లో కనిపించే మాటలివి. అది విచిత్ర యుద్ధమే. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు గ్రామాల ప్రజలని ఊరి బయట కాపురం పెట్టించడం చరిత్రలో ఎక్కడోగాని కనిపించదేమో! పాతిక మందో ముప్పయ్ మందో కాదు. వందో రెండు వందల మందో కూడా కాదు. దాదాపు 17 వేల మంది. పదకొండు మాసాలు ఊరి బయట వేసుకున్న పందిళ్లలో, గుడిసెలలో నివాసం ఉన్నారు. ఆ సంవత్సరమే దారుణంగా ఎండలు కాశాయి. కక్ష కట్టినట్టు కుంభవృష్టులు కురిపించడానికి వానదేవుడు కూడా ఆ సంవత్సరాన్నే ఎంచుకున్నాడు. వృద్ధులు, పసివారు, బాలలు, మహిళలు, వారిలో గర్భిణులు – అంతా ఒక దీక్షతో ఆ ఇక్కట్లను ప్రేమించారు. ఊరి చివరి ఇసుక పర్రలలో పాములు, మండ్రగబ్బలు, జెర్రులతో సహజీవనం చేశారు. అన్ని వేలమందిలో ఉద్యమ స్పూర్తిని నిలబెట్టడం ఎంత కష్టం! ఆ పని చేసినవారే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన బిరుదు ‘ఆంధ్రరత్న’. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (జూన్ 2,1889–జూన్ 10, 1928) కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో పుట్టారు. తండ్రి కోదండరామస్వామి ఉపాధ్యాయుడు. తల్లి సీతమ్మ. కొడుకును కన్న మూడో రోజునే ఆమె కన్నుమూశారు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన కూడా రెండేళ్లు తిరక్కుండానే చనిపోయారు. అప్పుడు పినతండ్రి, నానమ్మలు గోపాలకృష్ణయ్యను పెంచి పెద్ద చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆ వెంటనే బాపట్ల తాలూకా కార్యాలయంలో గుమాస్తాగా చేరారు. గోపాలకృష్ణయ్య గొప్ప స్వేచ్ఛాప్రియుడు. ఆ స్వేచ్ఛాప్రియత్వం ఆయన ఉద్యోగ జీవితం తొలి నాళ్లలోనే బయటపడింది. ‘ఈ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయడం కంటే వీధుల్లో ముష్టెత్తుకు బతికితే బావుంటుంది. ఇదంతా గానుగెద్దు జీవితం. ఏ రోజూ ఉత్సాహమన్నది కనిపించదు. స్వేచ్ఛ లేదు. చొరవ తీసుకునే స్వాతంత్య్రం అంతకంటే లేదు. నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను. పై చదువులు చదవాలని అనుకుంటున్నాను. దయచేసి ఇందుకు అనుమతించవలసింది అంటూ ఆయన పినతండ్రికి ఒక ఉత్తరం రాశారు. అందుకు పినతండ్రి ఒప్పుకున్నారు. అలా గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివారు. తరువాత తన మిత్రుడు నడింపల్లి నరసింహారావు చేయూతతో స్కాట్లండ్‌లోని ఎడిన్» రో వెళ్లి చరిత్ర, అర్థశాస్త్రాలలో ఎంఎ చదువుకుని, ఐదేళ్ల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చేశారు. రాజమండ్రి ఉపాధ్యాయ కళాశాలలో ఆచార్యునిగా నియమితులయ్యారు. అప్పుడు అక్కడ ఆర్ డబ్లు్య రాస్ ప్రిన్సిపాల్. అతడి నిరంకుశత్వానికి ఎదురు తిరిగి, ఉద్యోగానికి రాజీనామా చేసి, మచిలీపట్నం జాతీయ కళాశాలలో చేరారు. అప్పుడే అనీబిసెంట్ నాయకత్వంలో హోంరూల్ ఉద్యమం ఆరంభమైంది. 1903లోనే గోపాలకృష్ణయ్యకు, దుర్గాభవానికి వివాహం జరిగింది. బందరులో ఉండగానే ఆమెకు ఆరోగ్యం పాడయింది. దీనితో ఆమె కోలుకోవడం కోసం ఎంచుకున్న ప్రదేశమే చీరాల. ఆయన కుటుంబంతో చీరాలలో అడుగు పెట్టే సమయానికి భార్యకు వైద్యం చేస్తున్న వైద్యుడు తప్ప మరొకరు తెలియదు. కానీ కొద్దికాలానికే చీరాల వాసులే కాక, పక్కనే ఉన్న పేరాల ప్రజలు కూడా ఆయన మాట చెబితే ఏం చేయడానికైనా సిద్ధమయ్యారు. గోపాలకృష్ణయ్య బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలలో అభినివేశం ఉండేది. పాఠశాలలో ఉండగానే జాతీయ నాట్యమండలి పేరుతో ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించారు. ఆంధ్ర విద్యాపీuŠ‡ గోష్టి పేరుతో ఒక సాహిత్య సంస్థను కూడా స్థాపించారు. ఇవన్నీ జాతీయోద్యమ వేడిలో ఆయన జీవితం నుంచి మెల్లగా తప్పుకున్నాయి. ఎడిన్‌బరోలో ఆయన సహాధ్యాయుడు ఆనందకుమారస్వామి. నందికేశ్వరుడు రచించిన ‘అభినయ దర్పణం’ సంస్కృత గ్రంథాన్ని ఆనందకుమారస్వామి వంటి కళామర్మజ్ఞుడి ప్రోత్సాహంతో గోపాలకృష్ణయ్య ఆంగ్లంలోకి (మిర్రర్ ఆఫ్ గెస్చర్స్) అనువదించారు. దీనిని 1917లో కేంబ్రిడ్జ్–హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది కూడా. వీటన్నిటికీ తోడు సంగీతం తెలుసు. పాటలకు, పద్యాలకు బాణీలు కట్టడంతో పాటు, కమ్మగా పాడడం కూడా వచ్చు. వీటన్నిటి సమ్మేళనమనిపించే రీతిలో ఉండే ఆయన ఉపన్యాసాలు ప్రజలను ఉర్రూతలూగించేవి. ‘సాధన’ పేరుతో ఒక సాహిత్య పత్రికను కూడా ఆయన వెలువరించేవారు. వీటికి తోడు గోపాలకృష్ణయ్యకు గొప్ప హాస్యచతురత ఉండేది. ఆయన విసిరిన చెణుకులు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. అందుకే ఆయన ప్రజలను అలవోకగా ఆకర్షిస్తూ ఉండేవారు. గాంధీజీ రాజకీయ సిద్ధాంతాలు, పంథా భారత స్వాతంత్య్రోద్యమంలోని ఒక దశను విశేషంగా కదిలించాయి. అనేకమంది ఆ పంథా వైపు మళ్లారు. అది 1920 ప్రాంతం. అహింసతో ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకోవడం గాంధీజీ సిద్ధాంతంలో ప్రధానమైనది. గాంధీజీ ప్రవేశించిన తరువాత వేసిన తొలి రాజకీయ అడుగు సహాయ నిరాకరణోద్యమం. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం ఇందులో ఒకటి. గోపాలకృష్ణయ్య కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ఇదంతా 1920 నాగ్‌పూర్ కాంగ్రెస్ సమావేశాలలో గాంధీజీ రూపొందించారు. ఈ అంశం గురించే తెలుగు ప్రాంతమంతా తిరుగుతూ ప్రచారం చేసి, ఒక సంవత్సరం పాటు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి గోపాలకృష్ణయ్య. ఖద్దరు పంచె, కండువా, తలపాగాతో, మెడలో రుద్రాక్షమాలతో సదా కనిపించేవారాయన. ఇలాంటి నేపథ్యంలోనే సరిగ్గా పన్నులకు సంబంధించిన సమస్యే ఆనాడు చీరాలకు ఎదురయింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలలో ఉన్న చీరాల–పేరాల గ్రామాలను (ఆనాడు గుంటూరు జిల్లా) కలిపి మునిసిపాలిటీగా రూపొందించాలని బ్రిటిష్ కనుసన్నలలో నడిచే జస్టిస్ పార్టీ ప్రభుత్వం 1920లో నిర్ణయించింది.పానగల్లు రాజా రామరాయణం నాయకత్వంలో ఈ ఆలోచన రూపుదిద్దుకుంది. ఇందుకు ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. మునిసిపాలిటీ హోదా లేని కాలంలో అక్కడ వచ్చే పన్ను మొత్తం రూ. 4,000. కానీ మునిసిపాలిటీగా మారిస్తే పన్నుల రూపంలో రూ. 40,000 వసూలు చేయవచ్చు. కానీ సౌకర్యాలేమీ అదనంగా చేకూరవు. అయితే అక్కడ ఉన్నవారంతా చేనేత కార్మికులు, సాధారణ రైతులే. అందుకే వ్యతిరేకించారు. అయినా మునిసిపాలిటీ ఏర్పాటయింది. ప్రజలు కౌన్సిలర్లుగా ఎంపికై కూడా పదవులుకు రాజీనామాలు ఇచ్చారు. పెరిగిన పన్నులకు వ్యతిరేకంగా పురుషులతో పాటు ఆనాడే మహిళలు కూడా ఉద్యమంలోకి దిగారు. ఒక మహిళ అరెస్టయ్యారు కూడా. ఆమె జైలుకు కూడా వెళ్లివచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. అప్పుడే బెజవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాలకు వచ్చిన గాంధీజీ చీరాలను సందర్శించారు. ఈ అంశం గురించే గోపాలకృష్ణయ్య గాంధీజీ దృష్టికి తీసుకువెళ్లారు. గాంధీజీ రెండు మార్గాలను సూచించారు. ఒకటి– అహింసా మార్గంలోనే పన్నుల చెల్లింపు నిరాకరణోద్యమం నడిపించడం. రెండు అసలు ప్రజలంతా సామూహికంగా ఆ రెండు ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్లిపోవడం. గోపాలకృష్ణయ్య రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలంతా ఆయన మాటను తుచ తప్పకుండా మన్నించిన తీరు కూడా అద్భుతమనిపిస్తుంది. ‘చీరాల–పేరాల ఉదంతం ఆ ప్రాంతానికి చెందిన సమస్య అయినా, దాని చండ ప్రభావం వల్ల అది ముఖ్యమయిన రాష్ట్ర సమస్యగానూ, తర్వాత సాటిలేని మేటి ఉదంతంగానూ రూపొందడం చేత, అది యావత్తు భారతావని దృష్టినీ ఆకర్షించింది. ‘ఆ పోరాటం ముమ్మరంగా సాగుతూన్న రోజులలో నేను చీరాల ప్రాంతానికి వెళ్లాను. అచ్చట∙ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఆ గ్రామాలకు చెందిన యావత్తు బీదాసాదా, ముసలీ ముక్కీ, బ్రాహ్మణ, అబ్రాహ్మణాది విభేదాలు యీషణ్మాత్రమూ లేకుండా ఏకగ్రీవంగా ఆ గ్రామాన్ని వదలి ఇతర ప్రాంతాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆనందంగా బయల్దేరారు’ అని ప్రకాశం గారు ‘నా జీవితయాత్ర’లో రాశారు.అంతమంది చీరాల ఊరి బయట ఇసుక తిన్నెల మీద తాత్కాలిక నివాసాలలో ఉన్నారు. వీటిని నిర్మించడానికి సహకరించవలసిందిగా గోపాలకృష్ణయ్య ఇచ్చిన పిలుపును అనుసరించి ఎందరో దాతలు విరాళాలు ఇచ్చారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మూడు వేల రూపాయలు ఇచ్చింది. దీనికే రామనగరం అని గోపాలకృష్ణయ్య పేరు పెట్టారు. ప్రజలకు సేవ చేయడానికి ఆయనే ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవకుల బృందమే రామదండు. అక్కడ చీరాల, పేరాల గ్రామాలలోని తమ సొంత ఇళ్లు నక్కలకు, కుక్కలకు, పాములకు నిలయాలైపోయాయి. వీధులన్నీ అడవుల్లా తయారయ్యాయి. ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి నడిపించడమే గోపాలకృష్ణయ్య ఉద్దేశం. ఇందుకు ప్రతి కులం నుంచి ఒక వ్యక్తిని ఎంపిక చేయించారు. పదకొండు మాసాలు గడచిపోయాయి. ప్రభుత్వం దిగి రాలేదు. కానీ ప్రజలు అలాగే కొన్ని వారాలు ఓపిక పట్టి ఉంటే జస్టిస్ పార్టీ సర్కారు దిగి వచ్చేది. కానీ ఇన్ని మాసాల తరువాత సహనం ^è చ్చిపోయింది.ఇంతలోనే ఇంకొక పరిణామం కూడా జరిగింది. 1921లో బరంపురంలో ఏర్పాటయిన జాతీయ కాంగ్రెస్ సభలకు గోపాలకృష్ణయ్య వెళ్లారు. రామనగరం నిర్వహణకు నిధుల సమస్య తీవ్రమైంది. ఇందుకోసం విజ్ఞప్తి చేయడానికే గోపాలకృష్ణయ్య బరంపురం బయలుదేరారు. కానీ రెచ్చ గొట్టే ఉపన్యాసాలు చేస్తున్నట్టు ఆరోపిస్తూ ఆయనను దేశద్రోహ నేరం మీద అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో కలెక్టర్ ముందు హాజరు పరిచారు. మీరు ఎంపరర్‌ను రావణుడు, బలి, హిరణ్యకశిపుడు వంటి పాత్రలతో పోల్చి చెప్పారట. నేరం కాదా! అని కలెక్టర్ అడిగితే. గోపాలకృష్ణయ్య తాను అలాగే మాట్లాడినట్టు ఒప్పుకున్నారు. పైగా అలాంటి పోలికలతో చెబితేనే భారతీయులకు బాగా అర్థమవుతుందని కూడా చెణుకు విసిరారు. ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించి తిరుచునాపల్లి తీసుకుపోయారు. ఆయన కారాగారానికి వెళ్లిపోవడంతోనే చీరాల–పేరాల ప్రజలలో విశ్వాసం సన్నగిల్లింది. తమ సొంత ఇళ్లకు తరలిపోయారు. ఇంతలోనే మరొక పరిణామం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. దీనితో గోపాలకృష్ణయ్య కూడా నిరాశ చెందారు. గాంధీజీ మీద ఒకింత నమ్మకం కోల్పోయారనే అనిపిస్తుంది. అప్పుడు ఎందరో చేసినట్టే ఆయన కూడా స్వరాజ్య పార్టీలో చేరారు. 1926లో గోపాలకృష్ణయ్యకు క్షయ వ్యాధి సోకింది. దానిని చాలా ఆలస్యంగా గుర్తించారు. పైగా అప్పటికి ఆయన ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయారు. ఆ లేమి కష్టాలలోనే గడుపుతూ తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 38 సంవత్సరాలు. భారతీయ చరిత్రకారుల ఆత్మసాక్షిగా అంగీకరించవలసిన విషయం ఒకటి ఉంది. అదే – ఈ రత్నం కూడా నిర్లక్ష్యం అనే మసిగుడ్డలోనే ఉండిపోయింది. డా. గోపరాజు నారాయణరావు -
ఆస్పత్రి వ్యర్థాలతో డేంజర్ బెల్స్!
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో మురుగు కాల్వల ద్వారా వెళ్లాల్సిన నీటిలో ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థ విష జలాలు కలిసి భయంకర వ్యాధులకు కారణమవుతుండటం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజారోగ్యానికి ఏమాత్రం క్షేమం కాదని.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) హెచ్చరిస్తున్నా ఫలితం ఉండటం లేదు. చిన్న చిన్న ఆస్పత్రులే కాకుండా చివరకు వేయి పడకలు ఉన్న ఆస్పత్రుల్లోనూ సీవరేజీ ట్రీట్మెంటు ప్లాంట్లు లేవు. దీంతో ఆస్పత్రులు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా మురుగు కాల్వల్లోకి పంపిస్తున్న తీరు భయాందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఒకవైపు ఘన వ్యర్థాలను నిర్వీర్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చేష్టలుడిగి దిక్కులు చూస్తోంది. మరోవైపు ఆస్పత్రుల్లో రోజూ వందల లీటర్లలో రోగుల నుంచి రకరకాల జల వ్యర్థాలు వస్తుంటాయి. మున్సిపాలిటీలలో ఇలాంటి వ్యర్థాలన్నిటినీ నేరుగా మురుగు కాల్వల్లోకి వదులుతుండటం వల్ల జబ్బులు తగ్గకపోగా కొత్త జబ్బులు వెంటాడుతున్నాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్, కాలుష్య నియంత్రణ మండలి వంటి వాటి ఆదేశాలను ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి.. ప్రతి పెద్దాస్పత్రిలో నిబంధనల ప్రకారం.. విధిగా సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి. రోగులకు శస్త్రచికిత్సలు చేసినప్పుడు, మహిళలు ప్రసవించినప్పుడు ఎక్కువగా ద్రవ వ్యర్థాలు విడుదలవుతాయి. ఈ వ్యర్థాలను నేరుగా మురుగు కాల్వల్లోకి వదలకూడదు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ తర్వాతే నీటిని మురుగు కాల్వల్లోకి వదలాలి. అయితే పెద్ద పెద్ద ఆస్పత్రుల్లోనే సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు లేవు. ఉదాహరణకు.. రాజధాని అమరావతిలో సచివాలయానికి సమీపంలో ఉండే గుంటూరు పెద్దాస్పత్రిలోనే సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. రాజధాని నగరంగా భావించే విజయవాడలోనూ ఇదే దుస్థితి. కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, కాకినాడ వంటి కార్పొరేషన్ల పరిధిలో ఉన్న ఏ పెద్దాస్పత్రిలోనూ ఈ ప్లాంట్లు లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వం.. జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు చెబుతూనే ఉన్నా ఎక్కడా నిర్మాణాలు పూర్తికాలేదు. దీంతో ఆ వ్యర్థాలతో జబ్బులను కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు చెబుతున్నారు. ఇలా రోగుల నుంచి వెలువడే జల వ్యర్థాలు అత్యంత ప్రమాదకర జబ్బులకు కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటు ఇతర సంస్ధలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
మిగిలింది తొమ్మిది రోజులే..
సిద్దిపేటజోన్: సరిగ్గా కేవలం తొమ్మిదిరోజుల గడువు.. కానీ మున్సిపాలిటీల ముందు కొండంత లక్ష్యం పేరుకుని ఉంది. నిర్దేశిత మార్చి 31నాటికి జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో 4కోట్ల పైచీలుకు బకాయిలు వసూలు చేయాల్సిన లక్ష్యం ముందుంది. జిల్లా రికార్డుల ప్రకారం సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటిల్లో మార్చి 31వరకు 15కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా నేటి వరకు 11కోట్లు వసూలు కావడం విశేషం. స్వల్ప సమయం ఉండడం రూ.4కోట్ల వసూళు చేయాల్సిన బాధ్యత బల్దియా అధికారులపై ఉందనే చెప్పాలి. మరోవైపు సిద్దిపేట మినహా మిగతా మున్సిపాలిటీల్లో నల్లా పన్నుల వసూలు నిరాశాజనకంగానే ఉన్నాయి. 2018–19 వార్షిక లక్ష్యానికి అనుగుణంగా బల్దియా అధికారులు పన్నుల వసూళ్ల ప్రక్రియను చేపట్టినప్పటికి మరో 9రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో లక్ష్యం సాధించడానికి స్పెషల్ డ్రైవ్ పేరిట ప్రణాళిక రూపకల్పనకు రంగం సిద్ధం చేయడం విశేషం. వివరాల్లోకి వెళ్తే జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపల్ రికార్డుల ప్రకారం ప్రతి యేటా ఆర్థిక, వార్షిక ప్రణాళికకు అనుగుణంగా ఆస్తి, నల్లా పన్నుల వసూళ్లను రెవెన్యూ విభాగం చేపడుతుంది. ఈ క్రమంలోనే జిల్లాలోని ఆయా మున్సిపాలిటిల్లో 2018–19 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనుంది. ఆయా మున్సిపల్ రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 25వేల పైచీలుకు అసెస్మెంట్లకు సంబంధించి రూ.9.61కోట్ల నిర్దేశిత వసూలు లక్ష్యానికి అనుగుణంగా నేటి వరకు 7.86కోట్ల రూపాయలను బల్దియా అధికారులు వసూలు చేశారు. మిగిలిన 1.75 కోట్ల రూపాయల్లో అత్యధికం జిల్లా కేంద్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆస్తి పన్ను పేరుకుని ఉంది. ఇప్పటి వరకు 82శాతం వసూలుతో జిల్లాలో సిద్దిపేట అత్యధికంగా పన్నులను వసూలు చేసినప్పటికి మరో తొమ్మిది రోజుల్లో భారీ లక్ష్యం ముందుందనే చెప్పాలి. దీనికి తోడు దుబ్బాక మున్సిపాలిటిలో రూ.90లక్షలకు గాను ఇప్పటి వరకు కేవలం రూ.32 లక్షలు వసూలు కావడం, అదే విధంగా చేర్యాల మున్సిపాలిటిలో రూ.74లక్షల ఆస్తి పన్ను వసూలుకు గాను కేవలం రూ.14లక్షలే నిరాశజనకంగా ఫలితాలతో ఉందనే చెప్పాలి. మరోవైపు హుస్నాబాద్ మున్సిపాలిటీలో రూ.1.02కోట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటి వరకు రూ.65లక్షలను మాత్రమే అధికారులు పన్నురూపంలో వసూలు చేయడం గమనార్హం. మరోవైపు గజ్వేల్ మున్సిపాలిటీలో రూ.2.83కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.2.19కోట్ల ఆస్తి పన్నును అధికారులు వసూలు చేశారు. ఇంకా రూ.64లక్షలు గజ్వేల్‌లో వసూలు చేయాల్సి ఉండగా ఇదే సమయంలో సిద్దిపేటలో రూ.1.75కోట్లు, దుబ్బాకలో రూ.32లక్షలు, హుస్నాబాద్‌లో రూ.18లక్షలు, చేర్యాలలో రూ.60లక్షలు మొత్తంగా ఈ నెలాఖరి నాటికి రూ.4కోట్ల రూపాయలను జిల్లాలోని ఆయా మున్సిపాలిటిల్లో ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. -
మున్సిపాలిటీలో వార్డులను పెంచాలని నిరసన
సాక్షి, చింతలపాలెం (హుజూర్నగర్) : హుజూర్నగర్ మున్సిపాలిటీలో వార్డులను పెంచాలని కోరుతూ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్క్ర్ వ్రిగహానికి పూలమాలలు వేసి, విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మేజర్‌గ్రామ పంచాయతీని నగరపంచాయతీగా, ఆ తర్వాత గ్రేడ్3 మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ 20 వార్డులుగానే ఉండటం శోఛనీయమన్నారు. నూతన ఓటర్లతో కలుపుకుని సుమారు 29వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం ఉన్న వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయని, వాటిని సరిచేసి వార్డులు సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేశారు. గతంలో డీలిమిటేషన్లో వార్డుల పునర్విభజన చేయలేదన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం కొత్తగా మరో 6 వార్డులను పెంచేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ అజీజ్ పాషా, వార్డు కౌన్సిలర్ మన్నీరు మల్లిఖార్జున్‌రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ, నాయకులు చిట్యాల అమర్నాధ్రెడ్డి, యరగాని గురవయ్య, ఎంఏ మజీద్, బాచిమంచి గిరిబాబు, పులిచింతల వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, బిక్కన్సాబ్, కోలమట్టయ్య, రామిశెట్టి మురళిప్రసాద్, మహేష్ గౌడ్, పెద్దబ్బాయి, ముత్తయ్య, రాములు, జగన్, నర్సింహారావు, మల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘విలీనం’పై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీల్లో పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ పంచాయతీల జాబితా నుంచి రామన్నగూడెం తండాతోపాటు మరో ఎనిమిది తండాలను తొలగించడాన్ని సవాలు చేస్తూ రమావత్ ప్రదాస్ నాయక్, రమావత్ నాగేశ్వర నాయక్‌లు గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. పంచాయతీరాజ్, మునిసిపాలిటీ చట్ట నిబంధనలను సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాదాపు 100 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రజాభిప్రాయాలను తెలుసుకోలేదు పంచాయతీల విలీనంపై చట్టం నిర్దేశించిన విధి విధానాలకు అధికారులు తిలోదకాలు ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. విలీనంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తేలుసుకోవాల్సి ఉండగా, అధికారులు ఆ పని చేయకుండా ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. పంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అధికారుల తీరు వల్ల పెద్ద సంఖ్యలో గ్రామీణులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద లభిస్తున్న ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ అన్ని విషయాలపై అధ్యయనం చేసిన తరువాతనే విలీన నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు పంచాయతీలు మునిసిపాలిటీల్లో కలిసిపోయి ఉన్నాయని, ఆ గ్రామాలకు కరెంటు, తాగనీరు ఆ మునిసిపాలిటీల ద్వారానే అందుతోందని తెలిపారు. పంచాయతీల విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
‘సిద్దిపేటను గెలిపిద్దాం..’
సిద్దిపేటజోన్: ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో సిద్దిపేట మున్సిపాలిటీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో టాప్ –10లో ఉంది. పట్టణంలో పరిశుభ్రత, చెత్త సేకరణ, ఓడీఎఫ్, తదితర అంశాల్లో మీ అభిప్రాయాలను ఫీడ్‌బ్యాక్ రూపంలో అందించి సిద్దిపేటను మరింత ఆశీర్వదించండి. మీ అభిప్రాయంతో సిద్దిపేట మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నంబర్ 1గా నిలవాలి. అందుకు మీ చైతన్యం ఎంతో అవసరం. జనవరి 31లోగా ప్రతి పౌరుడు ఫీడ్‌బ్యాక్ అందించి మద్దతు తెలపాలి’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పట్టణ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ యేడు స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో సిద్దిపేట మున్సిపాలిటీ పాల్గొంటోందని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామై పట్టణాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి మన గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలని సూచించారు. -
‘స్వచ్ఛ’ ర్యాంకు మెరుగయ్యేనా..?
మంచిర్యాలటౌన్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధనపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎన్నికల విధులతో మున్సిపల్ అధికారులు బిజీగా ఉండడంతో ‘స్వచ్ఛ’తలో అడుగు ముందుకు పడడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఏ మేరకు కొనసాగుతుందో తెలుసుకునేందుకు 2017 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ను ప్రారంభించింది. ఏటా జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బృందం సభ్యులు పరిశుభ్రతను పరిశీలించి స్వచ్ఛతపై వివరాలు సేకరించిన అనంతరం మార్కులను బట్టి ర్యాంకు కేటాయిస్తారు. ఈ బృందం కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాల సేకరణతోపాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేంద్రానికి పంపిస్తారు. ఆ వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంక్‌లను ప్రకటిస్తుంది. ఈ ఏడాది జనవరిలో ఆశించిన ర్యాంకుల సాధనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు వెనుకబడ్డాయి. ఈ ఏడాది ఆగస్టులో కొత్తగా మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా అవి స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో లేవు. వచ్చే జనవరిలో పాత ఏడు మున్సిపాలిటీల్లోనే మరోసారి సర్వేకు బృందాలు రానున్నాయి. దీంతో మున్సిపల్ కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్ధేశం చేశారు. 2018లో సౌత్జోన్లో ఉమ్మడి జిల్లాలోని భైంసా, నిర్మల్, మంచిర్యాల కొంత మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఈసారి ఎన్నికల హడావుడిలో అధికారులు నిమగ్నం కావడంతో స్వచ్ఛతపై పెద్దగా పట్టించుకోలేదు. 2019 జనవరిలో ప్రకటించే ర్యాంకులు ఏవిధంగా ఉండబోతాయోనని అధికారుల్లో కొంత ఆందోళన నెలకొంది వారం రోజులే.. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పోటీల్లో 4,231 నగరాలు, పట్టణాలు పోటీపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని పట్టణాలు మెరుగైన ర్యాంకుల సాధనకు గత రెండు నెలలుగా పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై దృష్టి సారించినా.. ఎన్నికల విధులతో ఆశించిన మేర సమయం కేటాయించలేకపోయారు. జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4వరకు మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షన్ థర్డ్‌పార్టీ క్యూసీఐ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయి. స్వయంగా స్వచ్ఛతను పరిశీలించి ప్రజల అభిప్రాయాలను నమోదు చేసుకుంటారు. ప్రజల అభిప్రాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్లు, పరిశుభ్రత, దేవాలయాలు, మసీదు, చర్చిలు, ఆర్టీసీ బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, చెత్త సేకరించే విధానం, అందుకు వినియోగిస్తున్న పారిశుధ్య సిబ్బంది, సేకరించిన చెత్త నిల్వ కేంద్రాలు, చెత్త ప్రాసెసింగ్ వంటి వివరాలను మదింపు చేస్తారు. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజల నుంచి వివరాలు రాబడుతారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందంలోని అధికారులు ప్రతి మున్సిపాలిటీని నాలుగు విభాగాలుగా విభజించి మార్కులు కేటాయిస్తారు. సర్వీస్ లెవల్ బెంచ్ మార్కుకు 1,250 మార్కులు, థర్డ్ పార్టీ అసెసర్ల పరిశీలన ద్వారా 1,250 మార్కులు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా 1,250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్, గ్యార్బేజీ, ఫ్రీసిటి, కెపాసిటీ బిల్డింగ్ ద్వారా 1,250 మార్కులు కేటాయించి, ర్యాంకులను ప్రకటిస్తారు. గతంలో ర్యాంకులు అంతంతే.. సౌత్జోన్లో ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు గాను మూడింటిలోనే కొంత మెరుగైన ర్యాంకులు వచ్చాయి. భైంసాకు 2,329 మార్కులు రాగా 18వ ర్యాంకు వచ్చింది. మంచిర్యాలకు 2,286 మార్కులకు గాను 23వ ర్యాంకు, నిర్మల్‌కు 2,199 మార్కులకు గాను 34వ ర్యాంకు వచ్చింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 2,423 మార్కులు రాగా 133వ ర్యాంకు వచ్చింది. ఇక మందమర్రికి 1,647 మార్కులు రాగా, 284వ ర్యాంకు పొందింది. కాగజ్‌నగర్‌కు 1,542 మార్కులు రాగా, 394వ ర్యాంకు పొందింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి 1,450మార్కులు రాగా, 516 ర్యాంకు వచ్చింది. ప్రజల్లో చైతన్యం తేవాలి సౌత్‌జోన్‌తోపాటు జాతీయ స్థాయిలో పలు మున్సిపాలిటీలతో పోటీ పడి మంచి మార్కులు, ర్యాంకు సాధించుకోవాలంటే ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తేవాలి. పారిశుధ్య సిబ్బంది మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి, పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను వందశాతం నిషేధించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా చూడడంతోపాటు పారిశుధ్య కార్మికులు బాధ్యతగా తీసుకుని చెత్తను ప్రతిరోజు తీసుకెళ్లేలా చూడాలి. మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త సేకరణకు రెండు చెత్త బుట్టలను ప్రజలకు అందించారు. వాటిని ప్రజలు సక్రమంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి. చెత్తను తరలించి శివారు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా వేస్తున్నారు. ఇలాంటి వాటిపై మున్సిపల్ సానిటరీ విభాగం పూర్తిగా దృష్టిసారించి చెత్తను డంపింగ్ యార్డులకు తరలించి రీసైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉన్నా ప్రజలు బట్ట సంచులను వినియోగించడం లేదు. మున్సిపల్ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో స్వచ్ఛతపై ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించలేదు. పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం ఆదిలాబాద్‌రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం కింద మంచి మార్కులు, ర్యాంకు సాధించేందుకు పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మంచి మార్కులు సాధించాలంటే ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్లాస్టిక్ వాడకం నిషేధించడంతోపాటు బహిరంగా ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు. మరుగుదొడ్లు నిర్మించుకున్నారు కానీ వాడడం లేదు. తప్పనిసరిగా వాటిని వినియోగించుకోవాలి. అంతేకాకుండా వ్యర్థ పదార్థాల నుంచి వర్మీ కంపోస్టు వంటి ఎరువులు తయారు చేస్తున్నాం. – మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
గులాబీ.. గుబాళింపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో (జనవరి) మొదలైన ఏడాది, శాసన సభకు జరిగిన ముందస్తు ఎన్నికలతో (డిసెంబరు) ముగిసింది. ఈ ఏడాది కాలంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శాసన సభ ఎన్నికలు, ఆ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు ఉనికి కోల్పోవడం, తొలి సారి వామపక్ష పార్టీలకు చెందిన ఒక్క అభ్యర్థీ శాసన సభకు వెళ్లకపోవడం, రెండు దశాబ్దాలపాటు జిల్లాలో తిరుగులేని రాజకీయాలు నడిపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన టీడీపీ ఈ సారి కనీసం పోటీ చేయక పోవడం వంటి అంశాలు మాత్రమే.. టీఆర్ఎస్ జోష్ గతంలో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిన టీఆర్ఎస్ 2014 ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలను గెలిచినా, నల్లగొండ జిల్లాలో కేవలం నకిరేకల్, మునుగోడు స్థానాలకే పరిమితమైంది. కానీ, ఈసారి ఎన్నికల్లో (2018) ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాలకు ఏకంగా తొమ్మిది స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. ఇక, నల్లగొండ జిల్లా విషయానికి వచ్చే సరికి రెండు స్థానాల సంఖ్యను నాలుగుకు పెంచుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన మునుగోడు, నకిరేకల్‌ను కోల్పోయి, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండల్లో విజయం సాధించి, తమ పూర్తి స్థాయి పట్టును నిరూపించుకుంది. ఇక, ఈ ఏడాదిలో ఆ పార్టీ చివరి మూడు నెలల కాలాన్ని పూర్తిగా ఎన్నికల కోసమే కేటాయించింది. సెప్టెంబరు 6వ తేదీన ప్రభుత్వం రద్దు కావడం, ఆ రోజే అభ్యర్థులను ప్రకటించుకుంది. దీంతో జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ ఏకంగా పదిమంది అభ్యర్థులను ప్రకటించి హుజూర్నగర్, కోదాడ స్థానాలను పెండింగ్‌లో పెట్టి ఆ తర్వాత ప్రకటించుకుంది. తమను నమ్మి కాంగ్రెస్, సీపీఐల నుంచి ఎమ్మెల్యే హోదాలో వచ్చిన భాస్కర్‌రావు, రవీంద్ర కుమార్‌లకు తిరిగి టికెట్లు ఇచ్చి గెలిపించుకుంది. ఎప్పటి నుంచో తమను ఊరిస్తున్న నల్లగొండ జిల్లా కేంద్రాన్ని ఈ సారి కైవసం చేసుకుంది. పార్టీ సంస్థాగతంగా చేపట్టిన కార్యక్రమాలు ఏమీ లేవు. కేవలం ఎన్నికల వ్యూహంతోనే ఆ పార్టీ ప్రభుత్వం తరపున వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చింది. పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు లక్ష్యంగా పనిచేసి వారి ఓట్లను కొల్లగొట్టి విజయాలు సాధించింది. గట్టెక్కని కాంగ్రెస్ సీనియర్లు ఒక విధంగా నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఉనికి నామమాత్రమైంది. ఆ పార్టీ సీనియర్లు ఈ సారి గట్టెక్కలేక పోయారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సారి ఓటమి పాలయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా పదవిలో ఉండి కాంగ్రెస్ తరపున దేవరకొండలో పోటీ చేసిన బాలూనాయక్ గెలుపు గట్టును చేరుకోలేక పోయారు. ఎమ్మెల్సీగా ఉండి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో, చిరుమర్తి లింగయ్య నకిరేకల్‌లో విజయం సాధించారు. జనవరిలో నల్లగొండలో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా జిల్లాకు వచ్చింది. కాంగ్రెస్ కూడా సంస్థాగతంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ముందస్తు ఎన్నికల సమాచారం ముందే ఉండడంతో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఎన్నికల కోణంలోనే పనిచేసింది. నల్లగొండ ఎమ్మెల్యేగా ఉండి, సీఎల్పీ ఉప నేతగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో కొన్నాళ్ల పాటు ఆ అంశంపై ఆందోళనలు చేసింది. దాదాపు ఏడాది కాలం పాటు కోమటిరెడ్డి ఎమ్మెల్యే హోదాకు దూరమయ్యారు. ఇక, ముందస్తు ఎన్నికల్లో మిర్యాలగూడెం స్థానం విషయంలో తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో చర్చనీయాంశం అ య్యింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను ఇక్కడి నుంచి పోటీకి పెట్టి చేతులు కాల్చుకుంది. టీడీపీ తెరమరుగు.. జిల్లాలో తిరుగులేని రాజకీయం నడిపిన తెలుగుదేశం పార్టీ చివరకు జిల్లాలో తెరమరుగు అయినట్లే కనిపించింది. ఈ ఏడాది కాలంలో చెప్పుకోదగిని కార్యక్రమాలు ఏవీ చేపట్టకపోయినా, వరస వలసతో చిక్కి శల్యమైంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ కనీసం ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేకపోయింది. అత్యంత ప్రధానంగా భావించే శాసన సభ ఎన్నికల్లోనూ ఆపార్టీ అభ్యర్థులు ఎవరూ రంగంలో లేకపోవడంతో కేడర్ అంతా ఎవరి దారి వారు చూసుకుని ఆయా పార్టీల్లో చేరిపోయారు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ గుర్తుపై పోటీ చేస్తుందా లేదా అన్న అనుమానాలకు తావిచ్చింది. మొత్తంగా ఈ ఏడాదిలో టీడీపీ తెరుమరుగు కావడం ఒక్కటే కీలకమైన పరిణామం. నెరవేరని వామపక్షాల లక్ష్యం బహుజన లెఫ్ట్ ప్రంట్ ద్వారా కొత్త రాజకీయాలకు తెరతీయాలని భావించిన సీపీఎం లక్ష్యం నెరవేరలేదు. పార్టీ జెండా కింద చేపట్టే వివిధ ఆందోళన కార్యక్రమాలు, అనుబంధ సంఘాల కార్యక్రమాలు మినహా, సీపీఎం ఈ సారి ఎన్నికల్లో బొక్కాబోర్లా పడింది. గతంలో మాదిరిగానే, జిల్లాలో ఒక్క చోటా గెలవలేకపోయింది. తిరుగులేని విజయాలు సాధించిన నకిరేకల్ కానీ, అత్యధిక సంఖ్యలో విజయాలున్న మిర్యాలగూడెంలో కానీ ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఇక, సీపీఎం తరపున కాకుండా, బీఎల్ఎఫ్ పేర పోటీ చేసిన నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగానే కనిపించింది. మరో వామపక్ష పార్టీ సీపీఐ ఉన్నొక్క స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీ కనీసం ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేక పోయింది. దీంతో మునుగోడు, దేవరకొండలో పార్టీకి పట్టున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో దేవరకొండలో గెలిచిన సీపీఐ ఈ సారి పోటీకూడా చేయలేదు. గతంలో దాదాపు ప్రతీ శాసన సభలో సీపీఎం, సీపీఐల నుంచి కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా ఉండే వారు. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేకుండా పోయింది. సీపీఎం కొన్ని స్థానాల్లో పోటీ చేసినా గెలవకపోగా, సీపీఐ కనీసం పోటీ కూడా చేయలేక పోయింది. దీంతో వామపక్షాలు తమ గత ప్రాభవాన్ని కోల్పోయినట్లు అయ్యింది. ఉనికి చాటని బీజేపీ జిల్లాలో బీజేపీని బలమైన పార్టీగా నిలబట్టే ప్రయత్నాలేవీ నాయకత్వం నుంచి పెద్దగా జరగలేదు. సంస్థాగత కార్యక్రమాలను మినహాయిస్తే... ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అన్ని స్థానాల్లో నిలబడినా, ఎక్కడా డిపాజిట్ రాలేదు. మునుగోడు స్థానంపై ఆశపెట్టుకున్న పార్టీ నాయకత్వం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో బహిరంగ సభ పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. నాగార్జున సాగర్‌లో కేంద్ర హోం మంత్రి రాజ్నా«థ్ సింఘ్ పర్యటించారు. ఎన్నికల సందర్భంగా జాతీయ నాయకత్వం జిల్లాలో పర్యటించి వెళ్లినా, ఆ పార్టీ ఎన్నికల్లో పెద్దగా ఉనికిని చాటలేక పోయింది. -
పురపాలికల్లో రిజర్వేషన్ల సందడి
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇది కొనసాగుతుండగానే మున్సిపాలిటీల్లో జరగబోయే ఎన్నికల కోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు జూన్ వరకు సమయం ఉన్నా అప్పటిలోగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల గణన ప్రారంభించారు. నల్లగొండ : జిల్లాలో కొత్త వాటితో కలుపుకొని 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీలు పాతవి కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటిని నగర పంచాయతీలనుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. నకిరేకల్ మున్సి పాలిటీలో అప్పట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా జరిగినందున 2020 వరకు అక్కడ పంచాయతీ పాలన కొనసాగనుంది. మిగిలిన మున్సిపాలిటీలకు పాలక వర్గాల కాల పరిమితి జూన్ వరకు ఉంది. మిగతా వాటిలో ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఆలోగా వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ,మహిళా ఓటర్లను గుర్తించాలనేది ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే ఓటర్ల గణన ప్రారంభించింది. 29వ తేదీ వరకు గణన ఈనెల 23న వార్డుల వారీగా ప్రారంభమైన ఓటర్ల గణన 29వ తేదీ వరకు కొనసాగనుంది. 29, 30న ఓటర్ల జాబితా తయారీ, జనవరి 1వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటన, 2 నుంచి 4 తేదీల మధ్య ఆ జాబితాపై ఫిర్యాదులను స్వీకరించనున్నారు. 5, 6 తేదీల్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు మహిళా ఓటర్లను గుర్తిస్తారు. 7,8 తేదీల్లో తుది జాబితా తయారు చేస్తారు. 9వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా ప్రకటన, జనవరి 10వ తేదీన తుది జాబితాను సమర్పించనున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా, మిర్యాలగూడలో 36, హాలియా, నందికొండలో 9 వార్డుల చొప్పున ఉన్నాయి. అదే విధంగా దేవరకొండలో 20 వార్డులుండగా, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలలో 7 చొప్పున వార్డులున్నాయి. ప్రారంభమైన ఓటర్ల గణన అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల గణన ప్రారంభమైంది. ఒక్కో వార్డుకు మున్సిపల్ బిల్ కలెక్టర్ ఇన్చార్జ్గా, వారికి సహాయకులుగా బీఎల్ఓ లేదా అంగన్వాడీ టీచర్‌ను ఉంచుతున్నా రు. పూర్తిస్థాయిలో బిల్ కలెక్టర్ లేని చోట ము న్సిపల్ ఉద్యోగులను ఇన్‌చార్జ్‌లుగా ఉంచి ప్రతి వార్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్లను విభజించి ఆయా వార్డుల్లో గణన ప్రారంభించారు. ఓటర్ల గుర్తింపు ఇలా.... బీసీ,ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన జరిపే సందర్భంలో ఆ ఇంటికి సంబంధించిన వారు బీసీ అయితే బ్లాక్ పెన్‌తో మార్క్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీ అయితే గ్రీన్ పెన్‌తో, ఎస్సీ అయితే రెడ్ పెన్‌తో మార్క్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో అధికారి మూడు పెన్నులతో వెళ్లి కేటగిరీల వారీగా గణన చేయాల్సి ఉంది. మహిళలు ఉంటే మహిళలు ఉన్నచోట ఆ అంకెకు రౌండ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఎవరెవరు ఎంతెంత మంది అనేది సులభంగా తెలిసిపోతుంది. ఏ రోజుది అదే రోజు అప్పగింత ఓటర్ల గుర్తింపుకు సంబంధించి ఆయా మున్సిపల్ ఉద్యోగి ఏ రోజు చేసిన గణన అదే రోజు మున్సిపల్ కమిషనర్, సహాయ కమిషనర్‌కు అప్పగించాలి. సాయంత్రం 5గంటలకు ఆ రోజు వార్డుల్లో ఎంత వరకు ఓటర్ల గణన జరిగిందో లెక్క తేల్చాలి. గణన ఆధారంగానే రిజర్వేషన్లు మున్సిపల్ ఉద్యోగులు నిర్వహించే వార్డుల వారీగా ఓటర్ల గణన ఆధారంగానే ఆ వార్డు రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా కేటగిరీలో ఉంటారో దానిని బట్టి రిజర్వేషన్‌ను నిర్ణయిస్తారు. గణన ప్రారంభం కావడంతో తాజా మాజీ కౌన్సిరల్లతో పాటు పోటీ చేయాలనుకునే వారు తమ వార్డులో ఏ కేటగిరీలో వారు ఎక్కువగా ఉన్నారనేది అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు జూన్ వరకు గడువు ఉన్నా మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల సందడి నెలకొన్నట్లుగా ఉంది. ఏ వార్డు ఏ వర్గానికి రిజర్వేషన్ అవుతుందోననే ఉత్కంఠతతో ఆశావహులు ఉన్నారు. -
‘పుర’లో కుల గణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. వచ్చే జూలైతో పాలకవర్గాల గడువు ముగియనున్న మునిసిపాలిటీలతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలు ప్రారంభించింది. కొత్తగా ఏర్పడిన 71 మునిసిపాలిటీలతో సహా మొత్తం 142 పురపాలక సంఘాలకు వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన వాటిలో వార్డుల పునర్విభజన చేపట్టిన పురపాలక శాఖ..తాజాగా పురపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందుకు షెడ్యూల్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో బీసీ ఓటర్ల గుర్తింపునకు పురపాలక శాఖ ఆదేశించగా, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లను మాత్రం 76 మునిసిపాలిటీల్లో గుర్తించాలంది. వాటిల్లో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాలు జనవరి 9న ప్రకటించనున్నారు. అన్నీ జనవరి 10న కులాల వారీగా ఓటర్ల జాబితాలను పురపాలక శాఖకు సమర్పించాల్సి ఉండనుంది. 19 రోజుల షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించి ఓటర్ల గణన పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. మునిసిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయడంలో కులాల వారీగా ఓటర్ల గుర్తింపు కీలకం కానుంది. 2011 జనాభా గణాంకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల దామాషా లెక్కలను పరిగణనలోకి తీసుకుని మునిసిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్/మేయర్, కౌన్సిలర్/కార్పొరేటర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. -
చండూరు: ఎట్టకేలకు మూడోకన్ను
సాక్షి, చండూరు : చండూరు మున్సిపాలిటీ కేంద్రం ఎట్టకేలకు మూడో కన్ను తెరిచింది. దొంగతనాలకు, అరాచకాలకు ఇక చెక్ పడనుంది. ప్రతి చిన్న సంఘటనను సైతం ఇట్టే గుర్తుపట్టే అవకాశం ఉంది. గతంలో సీసీ కెమెరాలు లేక పోవడంతో పట్టణంలో అనేక చోరీలు చోటు చేసుకున్నాయి. పోలీసుల చొరవతో సీసీ కెమెరాలను పట్టణంలో ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేశారు. దీంతో ఇక ముందు చోరీలు ఉండవని, ఒక వేళ జరిగినా ఇట్టే గుర్తించే అవకాశం ఉందని పోలీసులు చెపుతున్నారు. పట్టణంలో... బోడంగిపర్తి గ్రామానికి చెందిన మంచికంటి ట్రస్ట్ అందించిన 12 కెమెరాలను బిగించారు. పట్టణంలో ముఖ్య కూడలి సెంటర్లో నాలుగు, ఎస్బీఐ ఏరియాలో రెండు, మరో ఆరు కెమెరాలను జనం రద్దీగా ఉండే స్థలాలో బిగించారు. కెమెరాలతో పట్టణ ప్రజలు నిర్భయంగా ఉండే అవకాశం ఉంది. గతంలో ... చండూరు పట్టణంలో గతంలో అనేక చోరీలు చోటుచేసుకున్నాయి. ప్రతి శుక్రవారం సంత రోజు ఒక్కటి, రెండు గొలుసు చోరీలు జరుగుతునే ఉండేవి. అనేక మంది మహిళలు సంతకు రావడానికి జంకే వారు. కొంత మంది రాత్రి సమయాలలో బయట తిరుగుతూ అలజడులు సృష్టించే వారు. దీంతో ప్రజలు రాత్రి అయ్యిందో బయటకు రావడానికి జంకే వారు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆ భయం లేకుండా పోయింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.. పట్టణంలో మంచికంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇక చోరీలకు చెక్ పడనుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. సీసీ కెమెరాలతో ఇబ్బందులు తప్పనున్నాయి. – సైదులు, ఎస్ఐ -
కల్వకుర్తిలో అభివృద్ధి అంతంతే!
సాక్షి, కల్వకుర్తి టౌన్: పట్టణంలో సమస్యలు తిష్టవేశాయి. కనీస వసతులు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులకు రూ.కోట్లు వెచ్చించామని చెబుతున్నా కనీస సదుపాయాలు పట్టణవాసులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. కల్వకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా 2013 మార్చి 23న ప్రభుత్వ ఉత్తర్వులతో కల్వకుర్తి నగరపంచాయితీగా రూపాంతరం చెందింది. తదనంతరం మున్సిపాలిటీగా మారింది. నగరపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో 2014 జూలై 3న పాలకవర్గం కొలువుతీరింది. పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పట్టణంలో అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే జరిగాయి. అభివృద్ధి పనులకు రూ.12.94కోట్లు పట్టణంలో ఇప్పటివరకు రూ.12.94కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనుల కోసం నిధులు ఖర్చుచేశారు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పట్టణంలో అభివృద్ధి పనులను చేపట్టినా కనీస సదుపాయాల కల్పన జరగలేదు. మున్సిపాలిటీ అయినా అందుకు అభివృద్ధి పనులు చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లుల, భవన నిర్మాణాలకు అనుమతులు తదితర వాటిని పెంచారు. అయితే అందుకు తగిన వసతులు కల్పించడం లేదన్నారు. వివిధ పనుల కోసం.. పట్టణంలో పలు అభివృద్ధి, నిర్మాణ పనుల కోసం నగరపంచాయతీ జనరల్ నిధుల ద్వారా రూ.5.18 కోట్లు వెచ్చించారు. నగర పంచాయితీ నూతన భవన నిర్మాణానికి రూ.1.65కోట్లు, 14 ఆర్ధిక సంఘం నిధులతో పట్టణంలో శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.1.37కోట్లు, స్టాటప్ గ్రాంట్స్ 2012–13 ద్వారా రూ.1.36 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.91.40లక్షలు, 2013–14, 2014–15లో రోడ్డు గ్రాంటుల ద్వారా రూ.64.85లక్షలు, 2016–16 టీఎస్పీ గ్రాంట్ ద్వారా రూ.50.20లక్షలు, 13వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 71.63లక్షలు, 2013–14, 2015–16 ఏఎస్సీ గ్రాంట్స్ ద్వారా రూ.42.20లక్షలు, 2015–16 ఎస్సీ ఎస్టీ గ్రాంట్స్ రూ.16లక్షలు, నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ.32.5 లక్షలు పట్టణ అభివృద్ధి పనుల కోసం వెచ్చించారు. ఖర్చు సరే.. అభివృద్ధి ఏది? పట్టణంలో రూ.కోట్లు ఖర్చుల చేశామని పాలకులు, అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లపై చెత్త దర్శనమిస్తున్న పట్టించుకునే వారు కరువయ్యారు. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. ఐదు రోజులకోసారి తాగునీరు వస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో చేపట్టిన పనులు తూతూ మంత్రంగా చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. టీఎస్ఎఫ్యూఐడీసీ నిధుల ద్వారా రూ.15 కోట్లు వచ్చినా ఎన్నికల కోడ్ ఆటంకంతో అది జరగలేదు. పాలక వర్గం సమయం గడువు ముగుస్తున్నా పాలకులు, అధికారులు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కోడ్ రావడంతో పనులకు ఆటంకం కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు చాలా వరకు నిధులు ఖర్చుచేశాం. అయితే ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. రూ.15కోట్లు ప్రత్యేక నిధులు వచ్చాయి. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆ నిధుల ద్వారా పనులు ప్రారంభించలేదు. పట్టణంలో అభివృద్ధి పనులు చేపడతాం. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. – ప్రవీణ్‌కుమార్ రెడ్డి, కమిషనర్, మున్సిపల్, కల్వకుర్తి -
మున్సిపల్ ఆస్తుల తాకట్టుతో భారీ అప్పు
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములను తాకట్టు పెట్టి వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు అప్పు చేసేందుకు ఇప్పటికే అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మునిసిపల్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి భారీగా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. బడ్జెట్లో అప్పులు చేసేందుకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలు అంగీకరించకపోవడంతో బడ్జెట్ బయట వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సర్కారే గ్యారెంటీ ఇస్తూ భారీ అప్పులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. బడ్జెట్ బయట అప్పులకు ముగిసిన గ్యారెంటీ పరిమితి మున్సిపాలిటీల్లో నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, అంతర్గత రహదారులు, పార్కులు, శ్మశానవాటికలు తదితర మౌలిక సదుపాయాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.11,340 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే బడ్జెట్ బయట అప్పులకు సర్కారు గ్యారెంటీ పరిమితి ఇప్పటికే పూర్తి కావటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.3.000 కోట్ల అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. మిగతా మొత్తం అప్పులకు తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో గ్యారెంటీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్ సోమవారం జీవో జారీ చేశారు. మునిసిపాలిటీల ఆస్తులు తాకట్టు.. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నప్పటికీ మున్సిపాలిటీలే అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. మున్సిపాల్టీల ఆస్తులను తాకట్టు పెట్టుకుని వాణిజ్య బ్యాంకులు అప్పు ఇవ్వనున్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో మున్సిపాల్టీలు భారీ అప్పుల పాలు కానున్నాయి. దీంతో ఈ అప్పులు తీర్చడానికి పౌర సేవలపై భారీగా చార్జీలను వసూలు చేయనున్నాయి. దీనివల్ల మున్సిపాలిటీల్లో అన్నిరకాల చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారానే లక్షన్నర కోట్ల రూపాయల మేర అప్పులు చేసింది. ఇప్పుడు బడ్జెట్ బయట వివిధ సంస్థల పేరుతో సర్కారు గ్యారెంటీ ఇస్తూ భారీగా అప్పులు చేయడాన్ని అధికార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ గ్యారెంటీలు కూడా ప్రభుత్వ అప్పు కిందకే వస్తాయని, ఆ సంస్థలు తీర్చకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అసలు కంటే వడ్డీ భారమే అధికం.. మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు వ్యయం రూ.12,600 కోట్లు కాగా ఇందులో 90 శాతం అంటే రూ.11,340 కోట్లను వాణిజ్య బ్యాంకుల నుంచి 8.23 శాతం వడ్డీపై అప్పు చేయనున్నారు. మిగతా పది శాతం అంటే రూ.1,260 కోట్లను ఈక్విటీ కింద ప్రభుత్వం సమకూర్చుతుంది. జీవోలో పేర్కొన్న మేరకు తీసుకునే రూ.11,340 కోట్ల అప్పును తొలి రెండు సంవత్సరాల్లో చెల్లించనవసరం లేదు. ఆ తరువాత నుంచి 13 ఏళ్లలో అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 8.23 శాతం వడ్డీ అంటే 13 ఏళ్లలో వడ్డీ కిందే రూ.12,265 కోట్లు కట్టాల్సి ఉంటుంది. అంటే అప్పు కన్నా వడ్డీ భారం ఎక్కువగా అవుతుండటం గమనార్హం. -
వానదేవుడు ఆకాశవాణి
అతనికి సెలవనేదే లేదు. అతని ఉద్యోగమే అలాంటిది. నిజానికి నగర వీధులు పరిశుభ్రంగా ఉండాలంటే సెలవు రోజుల్లోనే బాగా నీళ్లు చల్లాలి. అందుకోసమే మున్సిపాలిటీ వాళ్లు చాలా వాహనాలు పెట్టారు.వాటిలో ఒకదానికి ఆయన డ్రైవర్.ఒక్కోసారి నెలల తరబడి వానచుక్క నేలరాలదు. అలాంటి రోజుల్లో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా తన వ్యాన్‌లోని నీళ్ల ట్యాంకును ఖాళీ చేస్తూ, పొడవైన దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లమీద నీళ్లు చల్లుతూ ఉండవలసి వస్తుంది. వేసవి కాలంలో మధ్యాహ్న వేళల్లో కొంచెం నయం. బాగా కాగిన నేలలోంచి మట్టి వాసన వస్తుంది. అది అతనికి తల్లిపాలకోసం నోటితో తడిమే పిల్లవాడికి తల్లి వెచ్చని శరీరం నుంచి వచ్చే కస్తూరి వాసన లాగా అనిపిస్తుంది. చలికాలంలో అలా ఉండదు. నేల మీది మంచుగడ్డను పగలగొట్టాలి. రక్తం గడ్డకట్టే చలి అయినా నిర్జనమైన రోడ్లను శుభ్రం చేయాల్సిందే. ఈ రొడ్డకొట్టుడు జీవితానికి విరుగుడు వాన. వాన అంటే అతనికి సెలవు అని అర్థం. అప్పుడు అతను చెయ్యవలసిన పనిని వానదేవుడు చేస్తాడు. అతను విశ్రాంతి తీసుకుంటాడు.అప్పుడప్పుడు పడుకుంటూ అతను, ‘‘ఓ భగవంతుడా! రేపు వాన కురిపించు. నేను సాయంకాలం దాకా నిద్రపోతాను.’’ అని ప్రార్థన చేస్తాడు. కొన్నిసార్లు భగవంతుడు ఆయన మొర ఆలకిస్తాడు. రాత్రిపూట వాన కురుస్తుంది. అతను పొద్దున్నే నిద్రలేస్తాడు. వానపడి ఉండటం చూసి మళ్లీ పడుకుంటాడు. శరీరంలోని ప్రతి అణువూ విశ్రాంతి పొందే దాకా అలా పక్కమీద పడుకుంటాడు. పూర్తిగా విశ్రాంతి తీసుకుని విసుగొచ్చే దాకా పడుకుంటాడు. అతను పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య వీరో. ఆమె చాలా సాదాసీదాగా ఉంటుంది. పెళ్లి చేసుకున్న తరువాత కూడా అతను తన పద్ధతిని మార్చుకోలేదు. ఉదయం ఆమె లేవకముందే ఇల్లు వదిలిపోయేవాడు. సాయంత్రం ఇరుగు పొరుగు ఆడవాళ్లు బజారుకు పోయి తమ మగవాళ్లతో తిరిగి ఇళ్లకు చేరిన చాలాసేపటికి అతను తిరిగి ఇల్లు చేరుకుంటాడు. బహుశా ఒక బిడ్డ పుడితే అతని పరిస్థితిలో మార్పు రావచ్చని వీరో ఆశించింది. పాపతో ఆడుకోవడానికి ఉబలాటపడతాడని, ఆ రకంగా ఇంటి దగ్గర ఎక్కవసేపు ఉంటాడని అనుకుంది.వీరోకు కొడుకు పుట్టాడు. కానీ అతని విధానంలో మార్పు రాలేదు.ఏమీ పనిలేనప్పుడు కూడా అతను ఇంట్లో ఉండకుండా ఇరుగు పొరుగు వాళ్లతో పిచ్చాపాటి మాట్లాడటానికో, చెట్టు కింద పేకాట ఆడటానికో వెళ్లిపోయేవాడు. పొద్దున్నే పిల్లవాడింకా లేవకముందే, పక్క వీధిలో ఉన్నావిడ భర్తలాగా తన భర్త తనను అలా మున్సిపల్ పార్క్ వైపు తీసుకుపోతే బాగుండునని వీరో ఆదేశించింది. సాయంత్రం కొడుకు కళ్లకు కాటుక దిద్ది అందమైన బట్టలు వేస్తుంది. కానీ ఆ పిల్లవాని తండ్రి అతడు చలాకీగా ఆడుకుంటూ చిలిపి చేష్టలు చేస్తుండగా చూడటానికి రాడు. ఒకరోజు సాయంకాలం. అది పున్నమికి ముందటి రోజు. ఇరుగుపొరుగు ఆడవాళ్లు గుడికి పోవడానికి తయారవుతున్నారు. వీరో వాళ్లను చూసింది. ఆ రాత్రి తాము కూడా మర్నాడు ఉదయం గురుద్వారాకు ఎందుకు వెళ్లకూడదని భర్తనడిగింది. ‘‘వాన దేవుణ్ని వాన కురిపించమని అడుగు. మనం కూడా గురుద్వారాకు వెళ్లవచ్చు’’ అని గొణుగుతూ నిద్రలోకి జారుకున్నాడతను. చుక్కలు నిండిన వినీలాకాశం వైపు చూస్తూ వీరో ప్రార్థన చేసింది – ‘‘భగవంతుడా! ఈ రాత్రి వాన కురిపించు. రేపు గురుద్వారాకు పోవాలనుకుంటున్నాను. నాతో కూడా నా కొడుకు నా భర్త రావాలని నా కోరిక’’.ఆ రాత్రి వాన పడింది. మర్నాడు ఉదయం ఆ కుటుంబం గురుద్వారాకు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తూ దారిలో దండిగా మిఠాయి కొనుక్కున్నారు. మున్సిపల్ పార్కుకు కూడా వెళ్లారు. సాయంకాలం కొడుకు నాన్న పొట్టమీద కూర్చుని ఆడుకుంటున్నాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. నవ్వుకున్నారు. ఆ రాత్రి వీరో ఎంతో సంతోషించింది. తెల్లవారుతున్నా దీపం మండుతూనే ఉంది. వత్తి కాలిపోయి దానంతట అది ఆరిపోయేదాకా కిటికీలో దీపం వెలుగుతూనే ఉంది.ఒకసారి ఆమె ప్రార్థనను మన్నించిన వానదేవుడు మళ్లీ వాన విషయం మరిచిపోయినట్టున్నాడు. వీరో కొన్నాళ్లు తాము గడిపిన ఆ సెలవు దినాన్ని స్మరించుకుంటూ గడిపేసింది. కానీ జీవితం మళ్లీ నిస్సారమనిపిస్తోంది. ఇంటి మీద అయిష్టత, ఇరుగుపొరుగు ఆడవాళ్ల మీద అపారమైన అసూయపెరిగాయి. వర్షం కోసం ప్రార్థించింది. కానీ లాభం లేదు. నెలరోజులు గడిచిపోయాయి. పున్నమి రోజు వచ్చింది. చుట్టుపక్కల వాళ్లు పరమానందంగా ఉన్నారు. స్త్రీలు చీరలకు మిరుమిట్లు గొలిపే రంగులు అద్దుకున్నారు. పురుషులు గడ్డాలు సవరించుకుని మీసాలు చక్కగా మెలేసుకున్నారు. వాళ్లు ఆరోజు బజారులో, గురుద్వారాలో కాలక్షేపం చేస్తున్నట్లు వీరో తెలుసుకుంది. ఆరాత్రి అలిసిపోయి తూగుతున్న భర్తకు పున్నమిని గుర్తుచేసి అతనితో వాదనకు దిగింది. అతను పాత సమాధానమే చెప్పాడు – ‘‘వరుణదేవుణ్ని వర్షం కోసం ప్రార్థించు. మనం కూడా గురుద్వారాకు పోదాం’’. ఆ తర్వాత నిద్రపోయాడు. వీరో పక్కమీద కూర్చొని పెదవులు కదిలిస్తూ ప్రార్థించింది – ‘‘ఓ భగవంతుడా! వాన కురిపించు. ఓ స్వామీ! వాన కురిపించు’’. ప్రార్థన చేస్తూ చేతులు అలా జోడించుకునే నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి పిడుగు పడిన శబ్దం ఆమెను నిద్రలేపింది. మెరుపు మెరిసింది. వర్షం మొదలైంది. మర్నాడు ఉదయమే కుటుంబమంతా గురుద్వారాకు వెళ్లారు. తిరిగివస్తూ బజారు మీదుగా, మున్సిపల్ పార్క్ మీదుగా వస్తూ నగరంలోని బంధువుల్ని పలకరించారు. ఆ రోజు పరమానందంగా గడిచిపోయింది. వీరో తన చీరకు అంచు కొనుక్కోవాలనుకుంది. ఆ విషయం ఇంటికి వచ్చేసినాక గుర్తుకొచ్చింది. బజారు చాలా దూరం. పైగా పిల్లవాడు బాగా అలిసిపోయి నీరసంగా ఉన్నాడు. మళ్లీ బయటికి వెళ్లడానికి బాగా ఆలస్యమైంది. కానీ చీరకు అంచు కొనుక్కోవాలనే కోరిక మనసులో మిగిలిపోయింది. రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేసింది. ‘‘స్వామీ! వాన కురిపించు. దయచేసి ఒక్కసారి..’’ అందుకు లోలోపలే సిగ్గు పడింది. అది గుడిలో పూజారిని రెండోసారి ప్రసాదం అడిగినట్లనిపించింది. ఆ రాత్రంతా ఆమె అదే ఆలోచనతో పక్కమీద పొర్లుతూనే గడిపింది. ఎడారిలో దప్పికతో వరపుతో తిరుగుతున్నట్టు, అడవిలో దారితప్పి తిరుగుతున్నట్టు, అగాధంలో పడిపోతున్నట్టూ కలలు వచ్చాయి. ఉదయ కాంతులు చీకటిని పారదోలుతున్న సమయంలో పిల్లవాని ఏడుపు విని వీరో మేల్కొంది. కళ్లు గట్టిగా నులుముకుంది. చూస్తే వర్షం కురుస్తోంది. వీరో ఉలిక్కిపడింది. భయంతో వణికిపోతూ వర్షం వైపు చూస్తూ కిటికీ దగ్గర నిలబడింది. భయాన్ని, ఉలికిపాటును వదిలించుకొని గురుద్వారాకు వెళ్లడానికి ఉపక్రమించింది. అవీ ఇవీ కొనుక్కోవడానికి ఇంకో పదిరూపాయలు ఖర్చు పెట్టింది. ఆ మధ్యాహ్నం ఆమె చెల్లెలు, మరిది వచ్చారు. కుండపోతగా వర్షం కురుస్తున్నందువల్ల వాళ్లు ఆ రోజు తర్వాత రెండు రోజులూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. మరిది చికాకు పడ్డాడు. వాళ్ల ఊరెళ్లే రైలును అందుకోవాలనుకున్నాడు. కానీ వాన కుండపోతగా కురుస్తూనే ఉంది. తను ఆగిపొమ్మంటే వాన ఆగిపోతుందనే భావన ఉంది వీరోకి. ఆగమంటే చాలు ఆకాశంలో మేఘాలు ఖాళీ చేస్తాయి. చుట్టాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత నమ్మకం కలుగుతూంది ఆమెకు తనమీద. వాళ్లు పదకొండు గంటల రైలందుకోవాలి. అప్పుడే తొమ్మిది దాటింది. వాళ్ల ఇబ్బందికి కారణం లేకపోలేదు.‘‘వాన పది గంటలకు ఆగిపోతుంది. మీరు అప్పుడు వెళ్లవచ్చు’’ అంది వీరో.సరిగ్గా పది గంటలకు వర్షం ఆగిపోయింది. ఆమె చెల్లెలూ మరిది చాలా సంతోషించారుగాని వీరో భర్త మాత్రం దానిని గుర్తించలేదు. వీరో మనసులోంచి ఆ విషయాన్ని తొలగించుకోలేకపోయింది. భర్త బట్టలు ఉతుకుతూ వాకిలి ఊడుస్తూ, ఇంకా ఇతర ఇంటి పనులు చేసుకుంటూ, తాను కోరినప్పుడు వాన రావడం, ఆగిపోతుందన్నప్పుడు ఆగిపోవడం ఎలా జరుగుతుందో మధ్యమధ్యలో ఆమె జ్ఞాపకం తెచ్చుకుంటోంది. తనలో తానే ఉప్పొంగిపోతోంది. కిటికీ దగ్గర నిలబడి ఆకాశంవైపు చూస్తూ నవ్వుతూ గంటలు గడిపేస్తోంది. అక్కడ ఎవరో నిలబడి తనవైపు చూసి నవ్వుతున్నట్లు భావిస్తుంది. జీవితం చాలా హాయిగా ఉన్నట్లుంటుంది. ఆకాశంలో గంటల తరబడి కొనసాగుతున్న నిశ్శబ్ద బంధుత్వానికి భంగం కలిగించిందొకటి. అది పక్కింటి రేడియో. అది ఉదయం మధ్యాహ్నం సాయంకాలం విశ్రాంతి లేకుండా శబ్దం చేస్తూనే ఉంది. చెవుల్లో వేళ్లు పెట్టి మూసుకుంది. దూది పెట్టుకుంది. కానీ రేడియో శబ్దం వినిపించకుండా అరికట్టలేకపోయింది. ఆ రేడియో శబ్దం చెవులు చిల్లులు పడేట్టుండటమే కాదు, మనసు పొరల్ని కూడా చీల్చేస్తోంది. అంతే కాక ఆమె సర్వస్వాన్ని ఆక్రమించేస్తోంది. కొంతకాలం తర్వాత గాలిలోంచి వస్తున్న సంగీతాన్ని వింటూ ఆనందిస్తున్నట్లు అనిపించింది వీరోకు. చాలా పాటలు నోటికి వచ్చాయి. తనలో తానే పాడుకుంటోంది.ఆమె కొడుకు కూడా పిల్లల పద్ధతిలో రాగాలు తీస్తున్నాడు. పాలవాడు, కూరగాయలవాడు, పాకీ ఆవిడ వంటి వాళ్లంతా తమ పనులు తాము చేసుకుంటూ రేడియో సంగీతం పాడుతున్నారు. ఒకరోజు సాయంత్రం వీరో రేడియో వింటూ పక్కింట్లో ఉంది. సంగీతం పూర్తికాగానే, కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటన వెలువడింది. ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను కూడారావొచ్చని ఆ ప్రకటన చెప్పింది. ఆ వాతావరణ సూచన వీరో మొహం మీద కొట్టినట్లయింది. వర్షం కురుస్తుందని, లేదని రేడియో ఎలా చెప్పగలుగుతుంది? అసాధ్యం. ఆ రాత్రి పిడుగుపడిన శబ్దం విని ఆమె మేల్కొంది. వర్షం బోరున కురుస్తోంది. వర్షం వెంట తుఫాను. ఆ తర్వాత వీరోకు నిద్ర రాలేదు. మళ్లీ పున్నమి వచ్చింది. వీరో వర్షం కోసం ప్రార్థన చేసింది. రాత్రంతా చేతులు జోడించి ప్రార్థన చేసింది. అలాగే ఆకాశం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. చుక్కలు స్పష్టంగా వెలుగుతున్నాయి. చందమామ ఆమెను చూసి నవ్వాడు. మబ్బులూ లేవు. వానా లేదు. వాతావారణం పొడిగా ఉంటుందని రేడియో చెప్పింది. మరో నెల గడిచింది. మళ్లీ పున్నమి వచ్చింది. వీరో దేవుని తలుచుకుంది. కళ్లనీళ్లు పెట్టుకొని ప్రార్థించింది. మొక్కులు మొక్కుకుంది. వినీలాకాశంలోంచి చుక్క వాన కూడా రాలలేదు. చుక్కలు ప్రకాశించాయి. నిండు చంద్రుడు నవ్వాడు. పొడి వాతావరణమే కొనసాగుతుందని రేడియో ప్రకటించింది. ప్రతిరోజూ రేడియో అలాగే చెబుతోంది. మళ్లీ ఒక పున్నమి రాత్రి వచ్చింది. ఈసారి ఆమె ఉపవాసం ఉంటూ మరింత భక్తిశ్రద్ధలతో ప్రార్థించింది. ఫలితం శూన్యం. చుట్టుపక్కల వాళ్లు నవ్వుకుంటూ సంతోషంగా గురుద్వారాకు వెళ్లారు. ఆమె భర్త తూర్పుపటం ఎగరక ముందే పనిలోకి వెళ్లిపోయాడు. ఆమె చుక్కలు మెరిసే ఆకాశం వైపు చూసి వేదనగా అడిగింది – ‘‘నీకేం పోయేకాలం వచ్చింది?’’. (‘పున్నమిరాత్రి – ఇతర కథానికలు’ సౌజన్యంతో) పంజాబీ మూలం : కర్తార్‌సింగ్ దుగ్గల్ అనువాదం: రాచపాళెం చంద్రశేఖరరెడ్డి -
వామ్మో పే...ద్ద పాము !
సాక్షి, భూపాపలల్లి రూరల్: భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని పుల్లూరి రామయ్యపల్లి శివారులోని గండ్రపల్లి ప్రాథమిక పాఠశాలలో పొడవైన నాగుపాము దూరింది. సోమవారం పాఠశాల తెరిచేసరికి బీరువా కింద పాము ఉందనే విషయాన్ని విద్యావలంటీర్ గమనించింది. గ్రామస్తులకు సమాచారమివ్వడంతో పాములు పట్టే వ్యక్తి అందుబాటులో లేడని పాఠశాలను మూసివేశారు. మంగళవారం గ్రామానికి చెందిన పాములు పట్టే ఉప్పలయ్యకు సమాచారమివ్వడంతో ఆయన పామును పట్టి సురక్షిత ప్రదేశంలో వదిలాడు. -
బస్తీలో జబర్దస్త్
జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీడీపీ నాయకుల తీరుశ్రుతిమించుతోంది. టెండర్లు, వెంచర్లు మొదలు లే అవుట్ల వరకూ అన్నీవారే అయిన నడిపిస్తున్నారు. పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రజల కోసంపనిచేయాల్సిన అధికారులు టీడీపీ నాయకులకు తొత్తులుగా మారుతున్నారు.ఈ పంచాయతీలు సీఎం దృష్టికి వెళుతున్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఖజానాకు భారీగా గండిపడుతోంది. అభివృద్ధికుంటుపడుతోంది. చిత్తూరు, సాక్షి: జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉన్నాయి. నగరి, పుంగనూరు మున్సిపాలిటీలు మినహా అన్నీ అధికార టీడీపీ చేతిలోనే ఉన్నాయి. తిరుపతి కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. టెండర్ల నుంచి లే అవుట్ల అనుమతుల వరకు అన్నీ టీడీపీ వారే నడిపిస్తున్నారు. తమకు ఎదురేలేనట్లు వ్యవహరిస్తున్నారు. అవసరమైతే కార్యాలయాలకు వచ్చి నిమిషాల్లో పనులు చేసుకుని వెళుతున్నారు. టీడీపీ నాయకులు అడిగిందే తడవుగా నిబంధనలను సైతం పక్కన పెడుతున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులకు పనులు దక్కకపోతే.. టెండర్లను సైతం పక్కన పెడుతున్నారు. జిల్లాలో కార్పొరేషన్ల తీరును కాగ్ ఇప్పటికే పలుసార్లు తప్పు పట్టింది. అభివృద్ధి పనుల చెల్లింపులు తప్పుల తడకగా ఉన్నాయని అక్షింతలు వేసింది. చేస్తావా? చేయవా?.. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వెలుస్తున్న అక్రమ లే అవుట్లు, నిర్మాణాలను అడ్డుకునేందుకు టౌన్‌ప్లానింగ్ అధికారులు జంకుతున్నారు. నేరుగా టీడీపీ నాయకులే మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతుం డటంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. తిరుపతిలో పరిస్థితి దారుణంగా ఉంది. నగరం శరవేగంగా అభివృద్ధి అవుతోంది. అక్కడ రియల్ఎస్టేట్ వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అక్కడ టీడీపీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతోంది. వారు ఎక్కడ చెబితే అక్కడ సంతకాలు పెట్టేందుకే అధికారులు ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సిన అధికారులు టీడీపీ నాయకులు ఏం చెబితే అది చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ల పరిధిలో లే అవుట్ అనుమతి పేరుతో పెద్ద ఎత్తున చేతులుమారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుం డటంతో ఇప్పుడు దందా మరింత జోరుగా సోగుతోంది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఏ చిన్న అభివృద్ధి పనిలో అయినా షాడో మేయర్‌కు 8 శాతం పన్ను చెల్లించాల్సిందే. సీఎం దృష్టికి వెళ్లినా... మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోని టీడీపీ నా యకుల తీరు సీఎం చంద్రబాబు దృష్టికి ఇది వరకే వెళ్లింది. నిఘా వర్గాలు కూడా ఆయనకు సమాచారం అందించాయి. లైట్ తీసుకోవడంతో ఆగడాలు మరింత పెరిగాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఖర్చులు ఉంటాయ ని సీఎం వ్యాఖ్యానించారని మదనపల్లి టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎక్కువగా టీడీపీ నాయకులే అభివృద్ధి పనులు చేస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలో చేపడుతున్న పనులపై కాగ్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్నారు. -
అక్కడ సాదా బైనామాకు నో
సాక్షి, హైదరాబాద్: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. 2011, 2012లో సమీప నగరాలు, పట్టణాల్లో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెర దించుతూ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెల్ల కాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాకు చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రైట్స్ ఇన్ ల్యాండ్, పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టంలోని 22(2) సెక్షన్ మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ 2016 జూన్ 3న ఉత్తర్వులిచ్చింది. 2014లోపు రాసుకున్న సాదా బైనామాలను క్రమబద్ధీకరిచేందుకు అనుమతించింది. దరఖాస్తుల ఆమోదం అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఐదెకరాలలోపు భూమికి సంబంధించి సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీనీ మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని భూములకు వర్తించదని స్పష్టం చేసింది. సాదా బైనామా ఉత్తర్వుల సమయంలో రాష్ట్రంలో ఆరు నగరపాలక సంస్థలు, 58 మున్సిపాలిటీలు ఉండేవి. అయితే 2011లో పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సమీపంలోని వందల గ్రామాలను వాటిలో విలీనం చేశారు. వరంగల్ మహానగరపాలక సంస్థలో ఏకంగా 42 గ్రామాలు విలీనమయ్యాయి. ఇలాంటి గ్రామాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అనుమతించాలని డిమాండ్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ దశలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది కానీ తర్వాత పక్కనబెట్టింది. ఇటీవల పలు వర్గాల నుంచి దీనిపై విజ్ఞప్తులు వచ్చాయి. ఇటీవల సీఎం కేసీఆర్ వద్ద జరిగిన రెవెన్యూ శాఖ సమావేశంలోనూ విలీన గ్రామాల్లో సాదా బైనామా అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే విలీన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణకు అనుమతిస్తే భూముల విషయంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రభుత్వానికి ఆదాయ పరంగా నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయపరంగా నష్టం జరుగుతుందని అధికారులు సూచించడంతో విలీన గ్రామాల్లో సాదా బైనామా క్రమబద్ధీకరణ ఉండదని స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటిదాకా 6 లక్షలు పూర్తి సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా 11.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 15.68 లక్షల సర్వే నంబర్లకు సంబంధించిన భూములున్నాయి. రెవెన్యూ శాఖ ఒక సర్వే నంబర్‌ను ఒక కేసుగా పరిగణించి ఈ ప్రక్రియను నిర్వహించింది. 6.18 లక్షల సర్వే నంబర్ల పరిధిలో దరఖాస్తులను ఆమోదించారు. 9.49 లక్షలకుపైగా దరఖాస్తులను తిరస్కరించారు. కబ్జాలో లేకపోవడం, విక్రయ లావాదేవీ జరిగినా వారసులు అంగీకరించకపోవడం, కొన్ని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు ఉండటం, కోర్టుల్లో కేసుల పెండింగ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులను తిరస్కరించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు లేని దరఖాస్తులను ఆమోదించామని చెప్పారు. -
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కౌన్సిలర్లు
సాక్షి, కృష్ణా: గుడివాడ పురపాలక సంఘం వైస్ చైర్మన్ అడపా బాబ్జీపై టీడీపీ కౌన్పిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల్లో పురపాలక సంఘంలో మొత్తం 36 మంది కౌన్సిల్ సభ్యులలో వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 16 మంది సభ్యులు గెలుపొందారు. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్ వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. రెండేళ్ల కిందట చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావుతో పాటు 11 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి ఫిరాయింపు అయ్యారు. దీంతో టీడీపీ బలం 28కి పెరిగింది. కౌన్సిలర్లు 28 సభ్యులతో సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీలను కలెక్టర్ లక్ష్మికాంతంకు పంపించారు. కలెక్టర్ దీనిపై ప్రత్యేక సమావేశం కోసం సభ్యలకు నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓ చక్రపాణిని ఆదేశించారు. -
వెంకటగిరి మున్సిపాలిటీలో తెలుగుతమ్ముళ్ల చేతివాటం
-
గ్రామ పంచాయతీల విలీనం.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీలో కలపడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఐయూరిపల్లి గ్రామ పంచాయతీని వేములవాడ మున్సిపాలిటీలో, తాడుకోలు గ్రామ పంచాయతీని భాన్సవాడ మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా కలిపారని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై హైకోర్టు విచారించింది. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలపొద్దని హైకోర్టు తెలిపింది. అంతేకాక యధావిధిగా ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
విలీనం.. అగమ్యగోచరం
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా పంచాయతీరాజ్ విభాగం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఓటరు జాబితా మొదలుకుని, బ్యాలెట్ పత్రాల ముద్రణ వరకు కీలక ఘట్టాలన్నీ ఒక్కటొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. జిల్లా స్థాయిలో రిజర్వేషన్ల మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఇదిలా ఉంటే గతంలో మేజర్ పంచాయతీలుగా వెలుగొందిన గ్రామ పంచాయతీలు త్వరలో మున్సిపాలిటీలుగా మారనున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల సందడి కనిపించడం లేదు. మరోవైపు మేజర్ పంచాయతీలు కేంద్రంగా చక్రం తిప్పిన నాయకులు, కొత్తగా మున్సిపాలిటీల్లో తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలుగా, గజ్వేల్– ప్రజ్ఞాపూర్, అందోలు–జోగిపేట నగర పంచాయతీలుగా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నగర పంచాయతీ కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చి చేరింది. దుబ్బాకను 2013లో నగర పంచాయతీగా ఏర్పాటు చేసినా, కోర్టు కేసుల మూలంగా పాలక మండలి ఎన్నిక జరగలేదు. చేగుంటను నగర పంచాయతీగా ఏర్పాటు చేసినా స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో ఆరేళ్లుగా విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న మున్సిపాలిటీల పరిధిని విస్తరించడంతో పాటు నగర పంచాయతీలకు కూడా మున్సిపాలిటీ హోదా కల్పించింది. మరోవైపు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. మెదక్ జిల్లా పరిధిలో కొత్తగా రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్, సిద్దిపేట జిల్లాలో చేర్యాలకు మున్సిపల్ హోదా దక్కింది. జనాభా, ఆదాయం పరంగా మేజర్ పంచాయతీలుగా ఉన్న గ్రామాలన్నీ దాదాపు మున్సిపాలిటీగా రూపాంతరం చెందాయి. మేజర్ పంచాయతీలకు సమీపంలో ఉన్న 30కి పైగా పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. అంతటా ఎన్నికల సందడి కనిపిస్తున్నా, మున్సిపాలిటీలో విలీనమై, కొత్తగా మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన పంచాయతీల్లో స్తబ్ధత నెలకొంది. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో రామాయంపేట, నర్సాపూర్, నారాయణఖేడ్, చేర్యాల నియోజకవర్గ, తాలూకా, మండల కేంద్రాలుగా జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ మండలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా, జిల్లాల పునర్విభజనలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. వీటితో పాటు రాజధాని హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న మేజర్ పంచాయతీలు అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ గ్రామ పంచాయతీలు వేగంగా పట్టణీకరణ చెందడంతో.. ఇక్కడ సర్పంచ్ పదవికి ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది. గతంలో మేజర్ పంచాయతీలుగా వెలుగొందిన ఉస్మాన్‌నగర్, వెలిమెల, కొల్లూరు తదితర గ్రామ పంచాయతీలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అంతర్భాగంగా మారాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో అంతర్భాగంగా మారిన పోతిరెడ్డిపల్లి ప్రస్తుతం పన్నుల రాబడిలో జిల్లాలో అగ్రస్థానంలో ఉంది. పత్యేకత కలిగిన మేజర్ పంచాయతీలన్నీ మున్సిపాలిటీలుగా అవతరించడంతో పంచాయతీ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు తమ రాజకీయ భవితవ్యంపై కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. భవితవ్యంపై కొత్త లెక్కలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు శివారులో ఉన్న అమీన్పూర్ పంచాయతీ ఎన్నికల తంతు అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో సాగేది. అమీన్పూర్ సర్పంచ్‌లుగా పనిచేసిన నాయకులు ప్రస్తుతం పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవులను ఆశించడం పరిస్థితికి అద్దం పడుతోంది. మాజీ సర్పంచ్ శశికళ యాదవరెడ్డి, ప్రస్తుత సర్పంచ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. తెల్లాపూర్ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బొల్లారం కేంద్రంగా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొలన్ బాల్‌రెడ్డి భార్య సర్పంచ్‌గా, సోదరుడు రవీందర్‌రెడ్డి జిన్నారం ఎంపీపీగా ఉన్నారు. నర్సాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా టీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీ యాదవ్ తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో విలీన ప్రతిపాదిత గ్రామాలకు చెందిన నాయకులు తమ రాజకీయ భవితవ్యంపై లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నేతలు వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా అవతారం ఎత్తేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో అంతర్భాగంగా మారిన తమ ప్రాంతంపై పట్టు నిలుపుకొంటూనే రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతో ఉన్నారు. గ్రామ పంచాయతీ రాజకీయాలపై ఆశ చావని ఔత్సాహికులు కొందరు.. తమకు అనుకూలమున్న పంచాయతీల్లో ఓటర్లుగా నమోదు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
అమానుషం: చెత్త రిక్షాలో శవం తరలింపు
బాలాసోర్ : ఒడిశాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అంతిమ యాత్రకు నోచుకోలేని ఓ శవాన్ని చెత్త రిక్షాలో ఈడ్చుకెళ్లారు. దీన్ని ఓ ఫోటోగ్రాఫర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాసోర్‌లోని ఓ రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే ప్రాణాలు వదిలారు. మరణించి 72 గంటలైనా మృతదేహన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో పోలీసులు శవాన్ని మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించారు. మున్సిపాలిటీకి చెందిన ఓ శాఖకు శవాన్ని దహనం చేసే పనిని అప్పగించారు. వారు చెత్తను తరలించే ట్రాలీలో శవాన్ని తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోరో మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి తెలిపారు. -
పురపాలికల్లో ఆన్లైన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో ఇకపై ఆన్లైన్ ద్వారానే అన్ని రకాల సేవలందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పురపాలికలకు పన్నులు, పన్నేతర ఆదాయాన్ని తెచ్చి పెట్టే సేవలకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణను తప్పనిసరి చేసింది. అన్ని దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది. మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. మ్యూటేషన్లు, ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ, నల్లా కనెక్షన్, ప్రకటనలు, ఆస్తి పన్నుల గణన, ఖాళీ స్థలంపై పన్నుల గణన, భవన నిర్మాణ అనుమతులు తదితర సేవల కోసం ఆన్లైన్లో మాత్రమే దర ఖాస్తులు స్వీకరించాలని పురపాలక శాఖ ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని మునిసిపాలిటీల్లో ఆన్లైన్లో కాకుండా మాన్యువల్‌గా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తేలడంతో పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించలేదని, ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొంటూ ప్రతి నెలా చివరిలో నివేదికలు సమర్పించాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. కొన్ని మునిసిపాలిటీలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణను ఇంకా ప్రారంభించలేదు. -
గేటు దాటితే ఖబడ్దార్!
పిఠాపురం: అది సెంట్రల్ జైలు కాదు, అలాగని నిషేధిత ప్రాంతం అసలే కాదు. హై సెక్యూరిటీ జోన్ కూడా కాదు. పోనీ కనీసం రోగులకు ఇబ్బంది కలుగుతుందనుకోవడానికి అది ఆసుపత్రి కానే కాదు. కానీ అక్కడెక్కడా లేని నిబంధనలు మాత్రం ఇక్కడ రాజ్యమేలుతున్నాయి. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య తప్ప ఉదయం ఎవ్వరూ అటువైపు వెళ్లరాదు. ఒకవేళ వెళదామన్నా వెళ్లనివ్వరు. అదేదో శ్రీహరికోటలోని ఉపగ్రహ తయారీ కేంద్రం అనుకుంటే పొరపాటే. అది పిఠాపురంలోని మున్సిపల్ కార్యాలయం. అక్కడకు వెళ్లాలంటే అర్జీదారులతోపాటు పురపాలక సంఘ సభ్యులు సహితం సమయ పాలన పాటించక తప్పదు. ఇందుకోసం ఉదయం నుంచీ మున్సిపల్ కార్యాలయం గేటు మూసివేసి, నిరంతరం సెక్యూరిటీ గార్డులతో కాపలా ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయంలో గేటు దాటి లోపల అడుగు పెట్టాలన్నా కూడా.. గేటు వద్ద ఉన్న సిబ్బందికి ఏ పనిమీద, ఎవరికోసం వచ్చారు? ఏ సమయంలో లోపలకు అడుగుపెట్టారనే వివరాలను కచ్చితంగా ఇచ్చి వెళ్లాలని నిబంధనలు విధించారు. ఇటీవల రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఓ బిల్లు కలెక్టర్ పట్టుబడిన సంఘటన జరిగిన నాటి నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నారు. గతంలో నిధుల దుర్వినియోగం కేసులో మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకున్న సమయంలోనూ ఇటువంటి నిబంధనలే అమలు చేయగా.. సర్వత్రా నిరసనలు వ్యక్తమవడంతో వాటిని సడలించారు. నిత్యం వివిధ పనుల కోసం వచ్చే అనేకమంది ఈ నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీల్డ్ వర్క్ అంటూ మూడు దాటితే సిబ్బందిలో అనేకమంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోతుంటారని, అలాంటి సమయంలో ఏ అధికారిని కలిసి ఏ పని చేయించుకోవాలని అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇలాంటి నిబంధన పెట్టిన స్థానిక మున్సిపల్ అధికారుల తీరును వారు దుయ్యబడుతున్నారు. ప్రజలకు నిత్యం సేవలందించే మున్సిపాలిటీలో.. అందునా సుమారు 70 వేల జనాభా ఉన్న పిఠాపురంలో ప్రజాసేవకు కేవలం రెండు గంటల వ్యవధి మాత్రమే ఇవ్వడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కమిషనర్‌ను కలవడానికి మాత్రమే సమయ పాలన ఏర్పాటు చేయాలి తప్ప, ఇలా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించేలా నిబంధనలు ఏర్పాటు చేయడం ప్రజల హక్కులను కాలరాయడమేనని విమర్శిస్తున్నారు. ప్రజలతో ఎన్నికైన కౌన్సిలర్లకు సహితం ఈ నిబంధన విధించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. సత్వర సేవల కోసమే.. ప్రజలకు సత్వరం సేవలందించడానికే ఈ నిబంధనలు పెట్టాం. కొందరు ఏ పనీ లేకపోయినా కార్యాలయంలో గంటల తరబడి ఉండి అధికారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దళారుల బెడద ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలకు నిర్ణీత సమయంలో అన్ని సమస్యలకూ పరిష్కారం చూపించడానికి ప్రయత్నిస్తాం. – ఎం.రామ్మోహన్,కమిషనర్, పిఠాపురం మున్సిపాలిటీ -
స్థిరాస్తుల కొనుగోళ్లకు ‘రెరా’ రక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్లాట్లు, భవనాలు, అపార్ట్మెంట్ల వంటి స్థిరాస్తుల కొనుగోలుదారులకు రక్షణ కల్పించేందుకు త్వరలోనే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఏర్పాటు కానుంది. కొత్త రియల్ ఎస్టేట్ చట్టంలోని మార్గదర్శకాల అమలుపై పర్యవేక్షణతోపాటు కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల బృందం ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లో రెరా అథారిటీల పనితీరును అధ్యయనం చేసిన నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. మహారాష్ట్రలో అమలు చేస్తున్న మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ సంస్థను ఏర్పా టు చేయాలని, రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంతో అది పనిచేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే రాష్ట్రంలో రెరా అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. కొనుగోలుదారుల ప్రయోజనాల కోసం.. ప్లాట్లు, భవనాలు, అపార్ట్మెంట్లు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తుల కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో కొత్త రియల్ ఎస్టేట్ చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో కీలకమైన స్థిరాస్తి నియంత్రణ సంస్థ (రెరా)ను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. తాజాగా రెరా ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ‘రెరా’లో రిజిస్ట్రేషన్ తర్వాతే.. ప్లాట్లు, భవనాలు, అపార్ట్మెంట్లు తదితర అన్ని స్థిరాస్తి ప్రాజెక్టులను రియల్టర్లు తప్పనిసరిగా ‘రెరా’వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సంబంధిత స్థిరాస్తుల విక్రయానికి సంబంధించిన వ్యాపార ప్రకటనలు జారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు పురోగతి వివరాలను రెరాకు సమర్పించాలి. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయకపోతే.. సరైన కారణాలు చూపి రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపును కోరాల్సి ఉంటుంది. రెరా కింద ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి.. కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతారు. అదే విధంగా ఏజెంట్లు, కొనుగోలుదారులతో బిల్డర్లు, డెవలపర్లకు సమస్యలు ఏర్పడినా ఈ సంస్థకు ఫిర్యాదు చేసుకోవచ్చు. కొనుగోలుదారులు గడువులోగా చెల్లింపులు జరపని పక్షంలో.. జరిగిన ఆలస్యానికి సంబంధించిన వడ్డీని రాబట్టుకునేందుకు డెవలపర్లు నియంత్రణ సంస్థను ఆశ్రయించవచ్చు. కొనుగోలుదారులకు భద్రత - గడువులోగా స్థిరాస్తిని అప్పగించడంలో డెవలపర్ విఫలమైనా, ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనా కొనుగోలుదారులకు డబ్బులు తిరిగి ఇప్పించడంలో నియంత్రణ సంస్థ సహకరిస్తుంది. - ఈ చట్టం ప్రకారం డెవలపర్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయబడినా, సస్పెన్షన్‌కు గురైనా, ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేసినా.. కొనుగోలుదారులు చెల్లించిన సొమ్మును రెరా తిరిగి ఇప్పించనుంది. - స్థిరాస్తి ప్రాజెక్టుకు సంబంధిత శాఖలు జారీ చేసిన అనుమతులు (అప్రూవ్డ్ ప్లాన్), ఇతర వివరాలను నియంత్రణ సంస్థ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతుంది. - విక్రయ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో దశల వారీగా పూర్తి చేయాల్సిన నిర్మాణ పనుల వివరాలను అందుబాటులో ఉంచుతుంది. - డెవలపర్ ప్రాజెక్టు నిర్మాణంలో రియల్ ఎస్టేట్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయటపడితే కొనుగోలుదారులకు పరిహారం అందేలా చర్యలు చేపడతారు. ఏజెంట్ల రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంటు కూడా తప్పనిసరిగా రెరా వద్ద తమ పేరును నమోదు చేసుకోవాలి. ఆ తర్వాతే స్థిరాస్తి లావాదేవీల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్లకు సంబంధించిన ఫీజులను కూడా నియంత్రణ సంస్థే ఖరారు చేస్తుంది. ఏజెంట్లు జరిపే లావాదేవీల్లో తప్పనిసరిగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందుపర్చాల్సి ఉండనుంది. -
పట్టణ 'హోదా'తో 'ఉపాధి' హుష్
సాక్షి, హైదరాబాద్ : అది జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ గ్రామ పంచాయతీ.. సుమారు 6,357 కుటుంబాలకు ఉపాధి హామీ పథకమే దిక్కు.. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉపాధి కూలీలుగా ఉన్నారు.. జూలై తర్వాత ఈ గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 12 వేల మంది కూలీలు ఉపాధికి దూరమవనున్నారు! అలంపూర్‌కు మున్సిపాలిటీ హోదా కల్పించనుండటమే ఇందుకు కారణం!! ఇలా ఒక్క అలంపూరే కాదు.. రాష్ట్రం లోని 309 గ్రామ పంచాయతీలు/గ్రామాల పరిధిలో ఆగస్టు నుంచి ఉపాధి హామీ పథకం అమలు నిలిచిపోనుంది. ఫలితంగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది పేద కూలీలు జీవనోపాధిని కోల్పోనున్నారు. అనధికార అంచనాల ప్రకారం వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండనుంది. 8,755 గ్రామాలు.. 50 లక్షల కుటుంబాలు.. రాష్ట్రంలోని 173 గ్రామ పంచాయతీలు/గ్రామాల విలీనంతో ప్రభుత్వం కొత్తగా 71 మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తోంది. వీటితోడు ఇప్పటికే ఉన్న 41 మున్సిపాలిటీల్లో మరో 136 గ్రామాలను విలీనం చేసింది. అంటే మొత్తం 309 గ్రామ పంచాయతీలు/గ్రామాలు మున్సిలిటీల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించారు. జూలైతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఆ వెంటనే అంటే.. ఆగస్టు 1 నుంచి ఈ 309 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోనుంది. దీంతో ఈ గ్రామాల్లో కనీసం 5 లక్షల మంది కూలీలు అకస్మాత్తుగా జీవనోపాధికి దూరం కానున్నారు. ఇందులో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. రాష్ట్రంలోని 8,755 గ్రామ పంచాయతీల పరిధిలో 50,82,970 కుటుంబాలు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు కలిగి ఉన్నాయి. పురుషులు, మహిళలు కలిపి 1,12,11,923 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పించేందుకు కేంద్రం 2017–18లో రూ.2,930 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో కూలీకి గరిష్టంగా రూ.205 వేతనం అందిస్తున్నారు. సగటున ఒక్కో వ్యక్తి రోజుకు రూ.140 వేతనాన్ని అందుకుంటున్నాడు. వ్యవసాయేతర ఉపాధి లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఏడాదిలో కనీసం 100 రోజుల పనికి హామీ కల్పిస్తూ 2006 ఫిబ్రవరి 2న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉన్న ఊరిలోనే పని లభిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు 309 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ పథకం నిలిచిపోనుండటంతో కూలీలకు పని లేకుండా పోతుంది. వాస్తవానికి రాష్ట్ర పురపాలికల చట్టంలోని నిబంధనల ప్రకారం 20 వేల కనీస జనాభా ఉండి, జనాభాలో సగానికి పైగా వ్యవసాయేతర పనులపై ఆధారపడి ఉన్న గ్రామాన్ని మాత్రమే మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలి. అయితే పేరుకు పట్టణ హోదా వస్తున్నా ఈ 309 గ్రామాల్లో ఎక్కడా వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు, పట్టణ ప్రాంత ఛాయలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే వ్యాపార, వాణిజ్య సదుపాయాల్లేవు. వ్యవసాయం, ఉపాధి హామీ పథకాలు తప్ప ప్రజలకు మరే ఇతర ఉపాధి అవకాశాలు లేవు. నిబంధనల ప్రకారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ప్రభుత్వం.. చట్ట సవరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. జీహెచ్ఎంసీతోసహా రాష్ట్రంలో 73 పురపాలికలు ఉండగా కొత్తగా ఏర్పాటు చేయనున్న 71 మున్సిపాలిటీలతో వాటి సంఖ్య 144కి పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో పట్టణ ప్రాంత జనాభా 1.24 కోట్లు కాగా.. కొత్త పురపాలికల ఏర్పాటు తర్వాత ఈ సంఖ్య 1.50 కోట్లకు పెరగనుంది. రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 41 నుంచి 45 శాతానికి పెరగనుంది. దాదాపు 25 లక్షల మంది గ్రామీణ జనాభా పట్టణ జనాభా పరిధిలోకి రానున్నారు. అందులో కనీసం 5 లక్షల మంది ఉపాధి హామీకి అనర్హులుగా మారనున్నారు. -
ఆస్తిపన్నుపై 5% రాయితీ
సాక్షి, హైదరాబాద్ : ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30 లోపు పన్ను చెల్లించే వారికి ఈ రిబేట్ వర్తింపజేస్తామని వెల్లడించింది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే రిబేట్‌ను అమలు చేస్తుం డగా.. ఇకపై రాష్ట్రంలోని 73 మున్సిపల్ కార్పొ రేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆస్తి పన్నుల వసూళ్లతో ఆదాయం పెరిగితే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిబేట్‌పై విస్తృత ప్రచారం కల్పించి వసూళ్లు ప్రోత్సహించాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. గడువులోగా చెల్లించని ఆస్తి పన్నుల బకాయిలపై పెనాల్టీలు విధించడం.. తర్వాత మిగిలిన బకాయిలను రాబట్టుకోడానికి మళ్లీ కొత్త గడువు విధించి ఆలోపు చెల్లిస్తే పెనాల్టీలు మాఫీ చేయడం కొన్నేళ్లుగా అనవాయితీగా వస్తోంది. దీంతో సకాలంలో పన్ను చెల్లింపులు ప్రోత్సహించేందుకు 2016–17 నుంచి పెనాల్టీల మాఫీకి పురపాలిక శాఖ స్వస్తి పలికింది. ‘నేమ్ అండ్ షేమ్’పద్ధతిలో.. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 73 పురపాలికల్లో ఆస్తి పన్ను ఎగవేసిన టాప్–100 మంది జాబితాను పురపాలక శాఖ తన వెబ్సైట్లో పొందుపరిచింది. కమర్షియల్ ఆస్తులకు సంబంధించి ఏళ్లుగా చెల్లించని మొండి బకాయిలు రూ.కోట్లకు ఎగబాకడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వసూళ్ల కోసం పలు మార్లు నోటిసులిచ్చినా లాభం లేకపోవడంతో ‘నేమ్ అండ్ షేమ్’పద్ధతిలో ఎగవేతదారుల పేర్లు బహిర్గతం చేసేందుకు ఆ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దీంతో ఎగవేతదారులు పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తారని ఈ నిర్ణయం తీసుకున్నామని పురపాలక శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఆస్తి పన్నులు ఎగవేస్తే సంబంధిత వ్యక్తుల ఆస్తులు జప్తు చేసే అధికారం పురపాలికలకు ఉందని ఓ అధికారి తెలిపారు. రూ.294 కోట్లు వసూలు.. 2017–18లో 73 పురపాలికల ద్వారా రూ.294 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. 2016–17లో వసూలైన రూ.232.77 కోట్లతో పోల్చితే గతేడాది 26 శాతానికి పైగా అధిక రాబడి వచ్చింది. సిరిసిల్ల, మెట్పల్లి, కొత్తగూడెం, పీర్జాదిగూడ పురపాలికల్లో 100 శాతం.. మీర్పేట్, దుబ్బాక, కోరుట్ల, బోడుప్పల్, హుజూరాబాద్ పురపాలికల్లో 98 శాతానికి పైగా పన్ను వసూలైంది. నల్లగొండ, ఐజా, నారాయణ్‌పేట్, భూపాలపల్లి పురపాలికల్లో వసూళ్లు 50 శాతానికి మించలేదు. -
సాగర్ ప్రక్షాళనకు గ్లోబల్ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. 2017 సెప్టెంబర్‌లో ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదుట పైప్‌లైన్ పగిలిపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో మురుగు నీటిని సాగర్‌లోకి మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. ‘సాగర్ ప్రక్షాళన కోసం అప్పటికే రూ.350 కోట్లు ఖర్చు చేశాం. అక్కడి నీటిలో కాలుష్యం బాగా తగ్గిందని నమూనా పరీక్షలు తేల్చాయి. అయితే అనుకోకుండా మురుగు నీటిని మళ్లించడం వల్ల నీటి కాలు ష్యం మళ్లీ తీవ్రమైన మాట వాస్తవమే’అని చెప్పారు. పురపాలక శాఖ బడ్జెట్ పద్దులపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. చెన్నై కన్నా మన మెట్రోనే బెటర్ ‘హైదరాబాద్ మెట్రో రైలు నష్టాల్లో నడుస్తోందని పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే ప్రారంభమైన నాగోల్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో రోజూ 50 వేల నుంచి 60 వేల మంది ప్రయాణిస్తున్నారు. చెన్నై మెట్రో రైలుతో పోల్చితే హైదరాబాద్ మెట్రోకు మంచి స్పందన ఉంది. వచ్చే జూలైలోగా మియాపూర్–ఎల్బీ నగర్, సెప్టెంబర్‌లోగా నాగోల్–హైటెక్ సిటీ, డిసెంబర్‌లోగా జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఇమ్లీబన్ బస్‌స్టేషన్ మార్గాల్లో మెట్రో సేవలను ప్రారంభిస్తాం. హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ కోసం బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించాం’అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో మనుషులతో మురుగు నీటి కాల్వలు శుభ్రం చేయించడాన్ని పూర్తిగా నిషేధించామని, ప్రత్యామ్నాయంగా 75 మినీ జెట్టింగ్ యంత్రాలు వినియోగిస్తున్నామని చెప్పారు. త్వరలో మరో 75 మినీ జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 5 పట్టణాల్లోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, మిగిలిన 69 పట్టణాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. రూ.1000 కోట్లతో టీఎఫ్యూడీసీ ద్వారా రాష్ట్రంలోని 43 పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. జపాన్‌లోని టోక్యో క్లీన్ అథారిటీ అందించనున్న సాంకేతిక సహకారంతో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. జీవన ప్రమాణాల్లో నంబర్‌వన్ రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా జీహెచ్ఎంసీకి రూ.300 కోట్ల రుణం లభించిందని, ఇంకా రూ.800 కోట్ల కోసం త్వరలో మళ్లీ బాండ్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌ల తరహాలో హైదరాబాద్‌లోని మురికివాడల్లో బస్తీ క్లినిక్‌లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించనున్నామన్నారు. రూ.100 కోట్లతో గండిపేట జలాశయం చుట్టూ చేపట్టిన సుందరీకరణ పనులు మూడు నెలల్లో పూర్తి కానున్నాయని, దీంతో నగరానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. జీవన ప్రమాణాల రీత్యా దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ వరుసగా నాలుగో సారి నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. -
ప్రైవేటుకు పార్కింగ్!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో ప్రైవేటు వ్యక్తుల ప్లాట్లు, ఖాళీ స్థలాల్లో పెయిడ్ పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు ఔత్సాహిక స్థల యజమానుల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్థలాల లభ్యత కష్టమైన నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో పెయిడ్ పార్కింగ్ సదుపాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత జూలైలో ప్రకటించిన నూతన పార్కింగ్ విధానంలో ఈ అంశాన్ని పొందుపరిచింది. పెయిడ్ పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు ప్రైవేటు స్థల యజమానులకు జీహెచ్ఎంసీ లైసెన్స్‌లు జారీ చేయనుంది. జీహెచ్ఎంసీ నిర్ణయించిన పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడం ద్వారా ప్రైవేటు స్థల యజమానులు ఆదాయాన్ని పొందనున్నారు. రోడ్లు/మాల్స్/వాణిజ్య సంస్థల సమీపంలోని ఖాళీ స్థలాల్లో పార్కింగ్ స్లాట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుంది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ఎస్టేట్స్ అండ్ హౌసింగ్) జి.రమేశ్‌కు ప్రభుత్వం వీటి ఏర్పాటు బాధ్యతలు అప్పగించింది. ఆసక్తి ఉన్న యజమానులు సెల్‌నంబర్ 9949546622కు గానీ, acestatehousing @gmail.com మెయిల్ ద్వారా గానీ సంప్రదించవచ్చు. ప్రతిపాదనలు అందాక పార్కింగ్ స్లాట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలించి 3 నెలలు, లేదా 6 నెలల కాల వ్యవధితో లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. జీహెచ్ఎంసీ నిర్ణయించిన పార్కింగ్ ఫీజులను అమలు చేయడంతో పాటు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో హైదరాబాద్‌లో పార్కింగ్ స్థలాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రైవేటు పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు ప్రారంభించామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ బేజారు.. అధికారిక లెక్కల ప్రకారం రోజూ సుమారు 700 కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలు హైదరాబాద్ రోడ్లపైకి వస్తున్నాయి. ఇప్పటికే సరైన పార్కింగ్ సదుపాయాల్లేక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారుతోంది. మల్టీలెవల్ పార్కింగ్ సదుపా యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కార్యరూపం దాల్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. సరైన పార్కింగ్ సదుపాయాల్లేక రోడ్లపై వాహనాలను అస్తవ్యస్తంగా నిలిపేస్తుండటంతో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్థలాల లభ్యత లేకపోవడం, స్థలాలు విలువైనవి కావడంతో ప్రభుత్వం ప్రైవేటు పార్కింగ్ స్లాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. అత్యవసరంగా పార్కింగ్ సదుపాయాలను పెంచాల్సిన అవసరముందని, తక్షణమే కనీసం 10 మల్టీ లెవల్ కార్ పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. -
మళ్లీ మొదటికి..
గ్రామ పంచాయతీలకు ముందస్తు ఎన్నికల ప్రకటన నేపథ్యంలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపైనా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతమున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల విస్తరణకు సంబంధించి గతంలోనే టౌన్ ప్లానింగ్ విభాగం ప్రతిపాదనలు రూపొందించింది. తాజాగా దూరం ప్రాతిపదికన కాకుండా.. పట్టణీకరణ చెందుతున్న గ్రామాలను మాత్రమే మున్సిపాలిటీల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సంగారెడ్డి : జిల్లా కేంద్రంతో పాటు సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలు, అందోలు–జోగిపేట నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను విలీనం చేయాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఇటీవల ప్రతిపాదనలు రూపొందించింది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సంగారెడ్డి, సదాశివపేటలో ఏడేసి, జహీరాబాద్‌లో పది, అందోలు–జోగిపేట నగర పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ చొప్పున మొత్తం 25 పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రతిపాదిత విలీన గ్రామ పంచాయతీల తీర్మానం కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు 12 గ్రామ పంచాయతీలు తీర్మానం చేయగా.. అన్ని చోట్లా విలీనాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. మున్సిపాలిటీల్లో సమీప గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి.. మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేయాలని భావిస్తోంది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి దూరాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవద్దని తాజాగా ఆదేశించింది. మున్సిపాలిటీ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి.. వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామ పంచాయతీలను మాత్రమే విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించింది. కొత్తగా జనావాసాలు, వెంచర్ల ఏర్పాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉదాహరణకు గతంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో ఏడు గ్రామ పంచాయతీల విలీనాన్ని ప్రతిపాదించారు. తాజా ఆదేశాల ప్రకారం పట్టణీకరణ చెందుతున్న నాగాపూర్, మల్కాపూర్, పోతిరెడ్డిపల్లి, కందిగ్రామాలు మాత్రమే విలీనమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సమావేశం.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సరిహద్దుల విస్తరణ, కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది. ప్రత్యేక అధికారిగా నియమితులైన జాన్ ఎఫ్ కెన్నడీ శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల మున్సిపల్ అధికారులు, డీపీఓలతో సమావేశమయ్యారు. సోమవారం సిద్దిపేట జిల్లాకు చెందిన అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు, సరిహద్దు విస్తరణకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పనలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రత్యేక అధికారి సూచనలు చేస్తున్నారు. కాగా 20వేలకు పైబడిన జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో అమీన్పూర్, బొల్లారం, నారాయణఖేడ్, కోహిర్, తెల్లాపూర్ పంచాయతీలకు నగర పంచాయతీ హోదా కోసం ప్రతిపాదనలు రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెల్లాపూర్, కోహిర్ జనాభా 15వేలకు మించడం లేదు. సమీప గ్రామ పంచాయతీలను విలీనం చేస్తే తప్ప ఈ రెండు పంచాయతీలకు నగర పంచాయతీ హోదా దక్కేలా లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిని ఆనుకుని ఉండడంతో అమీన్పూర్ (జనాభా 36,452)ను కూడా ప్రస్తుతానికి నగర పంచాయతీ హోదా ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. బొల్లారం, నారాయణఖేడ్ గ్రామ పంచాయతీలు మాత్రమే నగర పంచాయతీలుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మళ్లీ మొదటికి! గ్రామ పంచాయతీ 2011 జనాభా సమీప గ్రామాలు కలిస్తే.. అమీన్పూర్ 36,452 44,132 బొల్లారం 34,667 36,480 నారాయణఖేడ్ 18,243 30,418 కోహిర్ 15,075 29,310 తెల్లాపూర్ 14,403 15,087 -
ఇన్చార్జిగానే మున్సిపల్ కమిషనర్!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : గతంలో పని చేసిన మున్సిపల్ కమిషనర్ భూక్యా దేవ్‌సింగ్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసిన అనంతరం ఆ స్థానంలో నియమించిన ఫారెస్టు సెటిల్మెంట్ డిప్యూటీ కలెక్టర్ బి.రాంచందర్ ఇన్చార్జిగా మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ముఖ్యమైన వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రజల పెండింగ్ ఫిర్యాదులు, వినతి పత్రాలపై సరై న నిర్ణయం తీసుకోవడం, వివిధ పద్దుల కింద బిల్లులు, ఇతర చెల్లింపులు చేసే అధికారం ఇన్చార్జి కమిషనర్‌కు లేకపోవడంతో పలుఇబ్బందులు ఏర్ప డుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో జనవరి వేతనాలు అందక పారిశు ద్ధ్య సిబ్బంది, కాంట్రాక్టు వర్కర్లు ఇబ్బందిపడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలురావడం తగ్గింది.కౌన్సిలర్లు సైతం రావడానికి నిరాసక్తిగా ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు రావడంలేదని పలువురు కాంట్రాక్టర్లు ఆం దోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే మున్సి పల్ కార్యాలయం బోసిపోయి దర్శనమిస్తున్నది. ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడని అధికారులు ఎప్పుడూ వివాదాలకు నెలవుగా ఉంటుందన్న భావనతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి కమిషనర్‌గా రావడానికి అధికారులు ఇష్టపడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ లేదా మున్సిపల్ ఇంజనీర్లకు కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇన్చార్జి కమిషనర్‌ను నియమించడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. -
గ్రేడ్–3 మున్సిపాలిటీగా బాన్సువాడ
బాన్సువాడ టౌన్(బాన్సువాడ): బాన్సువాడ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. పట్టణాన్ని గ్రేడ్–3 మున్సిపాలిటీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 వేలకు జనాభా ఉన్న పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చాలని సర్కారు నిర్ణయించిన సంగ తి తెలిసిందే. బాన్సువాడ గ్రేడ్–3 మున్సిపాలిటీగా మారనున్న నేపథ్యం లో పట్టణ రూపురేఖలు మారనున్నాయి. మౌలిక వసతులు మెరుగుపడడంతో ప్రణాళిక బద్దమైన అభివృద్ధి జరగనుంది. పట్టణ ప్రణాళిక ప్రకా రం రోడ్లు, భవనాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే, ఆదాయం పెరగడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు రానున్నాయి.బాన్సువాడలో 20 వార్డులు, 31వేల జనాభా ఉంది. తొలుత నగర పంచాయతీగా.. వాస్తవానికి బాన్సువాడను తొలుత నగర పంచాయతీగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు జీవో కూడా సిద్ధమైంది. అయితే, మంత్రి పోచారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. దీంతో ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడి గ్రేడ్–3 మున్సిపాలిటీగా ప్రకటించాలని ఆదేశించారు. మంత్రికి ఘన స్వాగతం.. బాన్సువాడను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుక్రవారం బాన్సువాడలో ఘన స్వాగతం లభించింది. బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వచ్చిన మంత్రికి కొయ్యగుట్ట వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చిరకాల స్వప్నం ఫలించింది: మంత్రి పోచారం బాన్సువాడ పట్టణాన్ని గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో బాన్సువాడ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. బాన్సువాడలో రూ.17కోట్లతో వంద పడకల మెటర్నిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో కల్కి చెరువును మినీ ట్యాంకుబండ్‌గా, ఎల్లయ్య చెరువును వారంతపు సంతగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. మినీస్టేడియం, పట్టణంలో సీసీ రోడ్డు నిర్మాణం కొనసాగుతుందన్నారు. మత్య్సకారులు చేపలు విక్రయించేందుకు భవనంను నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. సహకార సంఘాల ఎన్నికలపై సీఎంతో చర్చించామని, త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. రైతు సమన్వయ కమిటీలపై నివేదికలు అందించామన్నారు. ఆర్డీవో రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు, వ్యాపారులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
‘జలం జీవం’పై కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖ చేపట్టనున్న ‘జలం జీవం’ పై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల్లోకి తీసుకుపోవాలని, ఎక్కువ మందిని భాగస్వాములను చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. శుక్రవారం మెట్రో భవన్లో పురపాలక శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, సీడీఎంఏ విభాగాల ఉన్నతాధికారులు పొల్గొన్నారు. మిషన్ భగీరథ అర్బన్‌పైనా మంత్రి సమీక్ష జరిపారు. ఈ పథకంలో చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ ఈఎన్సీకి ఆదేశాలు జారీ చేయాలన్నారు. రాష్ట్రంలోని పలు పురపాలికల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని తెలియజేయాలని మంత్రి కోరారు. ఉప్పల్ శిల్పారామం పనులు త్వర గా పూర్తి చేయాలని, పురపాలికల్లో భవన నిర్మాణ అనుమతులకు నిర్ణీత గడువు పెట్టుకోవాలన్నారు. ఈ గడువులోగా అనుమతులు ఇవ్వకుంటే టియస్ ఐపాస్ అనుమతుల మాదిరి ఆటోమేటిగ్గా అనుమతులు వచ్చినట్లు భావించి పనులు ప్రారంభించుకునేలా చూడాలన్నారు. భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియలో ఆలస్యానికి కారణమయ్యే అధికారులకు జరిమానాలు విధిం చాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైవేటు పార్కింగ్‌కు అవకాశాలపై ప్రచారం కల్పించాలని, మల్టీ లెవల్ పార్కింగ్‌కు టెండర్లు పిలవాలన్నారు. నగరంలో వంద ఫుట్ ఓవర్ బ్రిడ్జీల పనులను ప్రారంభించాలన్నారు. నగరంలో వచ్చే ఏడాదిపాటు రోడ్డు కటింగ్‌లకు అనుమతులు ఇవ్వవద్దన్నారు. ఇసుక రవాణా మరింత పారదర్శకం ఇసుక రవాణా మరింత పారదర్శకంగా సాగేందుకు రాష్ట్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఈ బృందాల్లో ఉంటారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మైట్రో రైలు కార్యాలయంలో కేటీఆర్ గనుల శాఖపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలు, వాటి సరఫరాలో మరింత పారదర్శకత ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. -
హోదా పెరిగింది.. రాత మారనుంది
కావలి: గత పదిహేనేళ్లుగా కావలిని ఊరిస్తున్న ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా అంశం సోమవారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాల్ జీఓ నంబర్ 383ను జారీచేయడం ద్వారా కొలిక్కి వచ్చింది. 2002 నుంచి సెంకడ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న కావలికి ఫస్ట్ గ్రేడ్ హోదా కల్పించాలని మున్సిపల్ అధికారులు అనేకసార్లు ప్రతిపాదనలు పంపారు. అయితే ఎప్పటికప్పుడు నిబంధనలు మారిపోవడంతో ఇది సాధ్యమవలేదు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ హోదా పెంపు అత్యవసరం కావడంతో విధిలేని పరిస్థితుల్లో ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద నిధులు కేటాయించడానికి కనీసం మొదటి శ్రేణి మున్సిపాలిటీ స్థాయి నుంచి ఆపై స్థాయి కార్పొరేషన్లు అయ్యి ఉండాలని నిబంధనలు పెట్టింది. దీంతో కావలిని ఈ పథకంలో చేర్చడానికి అర్హత లేకుండా పోయింది. అయినప్పటికీ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా హోదా పెంచే ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వానికి నచ్చ చెప్పి కావలిని అమృత్‌లో చేర్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుని కావలిని ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చుతూ ఆదేశాలు జారీచేసింది. 1967లో థర్డ్ గ్రేడ్‌గా కావలి పట్టణం 1967 ఏప్రిల్ 1న థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అవతరించింది. అంతకుముందు 20 వేల జనాభా 10 వార్డులతో గ్రామ పంచాయతీగా ఉండేది. చివరి సర్పంచ్‌గా బుర్లా రాఘవరెడ్డి వ్యవహరించారు. మున్సిపాలిటీ అయ్యాక 1968లో 14 వార్డులుగా ఏర్పడి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తొలి చైర్మెన్‌గా తోట రామమూర్తి ఎన్నికయ్యారు. అనంతరం చక్కా సత్యనారాయణ గుప్తా, ఏకుల వరప్రసాద్, మలెల్ల ఉదయభాస్కర్ చైర్మెన్లుగా వ్యవహరించారు. అనంతరం 1987లో 50 వేల జనాభాతో సెకెండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది. అప్పుడు 28 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో నీలయ్యగారి ప్రభాకర్‌నాయుడు చైర్మెన్ అయ్యారు. తర్వాత చలంచర్ల దేవసేన, గ్రంథి యానాదిశెట్టి ఆ పీఠాన్ని అధిరోహించారు. 2010లో 37 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో నగళ్ల శ్రీనివాస కిరణ్ చైర్మెన్ అయ్యారు. 2015లో 40 వార్డులు అయ్యాయి. రూ.కోట్లకు చేరిన ఆదాయం గ్రామ పంచాయతీగా ఉన్నప్పడు కావలి వార్షిక ఆదాయం రూ.20 లక్షలు మాత్రమే. మూడవ శ్రేణి మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత వార్షిక ఆదాయం రూ.50 లక్షలకు, రెండవ శ్రేణి మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత రూ.7.86 కోట్లుకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 97,053 మంది నివసిస్తున్నారు. కాగా పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా అందించే సేవలు, అభివృద్ధి పనులు పెరగాలంటే స్థానికంగా సమకూరే నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధులతో పాటు హడ్కో లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలు కూడా అవసరమకుతాయి. ఆర్థికంగా మున్సిపాలిటీకి ఉన్న జవసత్వాలను ప్రామాణికంగా తీసుకుని, పట్టణంలో నివసిస్తున్న జనాభాను కొలమానికంగా అందించాల్సి సేవలు, వాటిని మెరుగుపరచాల్సింన అంశాలపై ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపుతాయి. అలాగే ప్రభుత్వాలు నిధుల కేటాయింపు, వివిధ ప«థకాలను అమలు పరిచే విషయంలో గ్రేడ్–1 మున్సిపాలిటీలకు ప్రాధాన్యం ఇస్తాయి. అనధికారికంగా సుమారు 2 లక్షల జనాభా ఉన్న కావలి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ ద్వారా అందించడానికి గ్రేడ్–1 హోదా దోహదపడుతుంది. -
కుక్కల కు.ని.కి డబ్బుల్లేవ్!
రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి జనం మీద పడి వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. చిన్నపిల్లల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఇటీవల గుంటూరు నగరంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేసి ప్రాణాలు తీసిన ఘటన ఇంకా మనకళ్ల ముందు మెదులుతూనే ఉంది. వారం కిందట వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని ఓ స్కూలు నుంచి ఇంటికొస్తున్న ఏడుగురు చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. ఇలాంటి ఘటనలు నిత్యం రాష్ట్రంలో కోకొల్లలు. అయితే వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు కూడా డబ్బుల్లేని దుర్భరస్థితిలో మున్సిపాల్టీలున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో 1,76,675 కుక్కలున్నట్టు మున్సిపాలిటీ అధికారులు నివేదిక ఇచ్చారు. కానీ గడిచిన మూడేళ్లలో కేవలం 75 వేల కుక్కలకు మాత్రమే కుటుంబ నియంత్రణ చేయగలిగారు. ఇంకా లక్షకు పైచిలుకు కుక్కలకు కుటుంబ నియంత్రణ చెయ్యలేదు. ఒక్కో కుక్క ఏడాదికి రెండు ఈతలు ఈనుతుంది. ఒక్కో ఈతకు సగటున రెండు నుంచి మూడు పిల్లల్ని కంటుంది. దీంతో కుక్కల సంఖ్య రెట్టింపవుతోంది. ఫలితంగా ఏటా కుక్క కాటు బాధితుల సంఖ్య 4.50 లక్షలకు చేరుతోంది. వెయ్యి కుక్కలకు రూ.8 లక్షలు: రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మొత్తం కలిపి 110 ఉన్నాయి. వీటిలో చాలా మున్సిపాలిటీలు నష్టాల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుక్కకు కుటుంబ నియంత్రణ చేయాలంటే రూ.800 ఖర్చవుతుందని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ఉదాహరణకు ఒక మున్సిపాలిటీలో వెయ్యి కుక్కలుంటే వాటికి కుటుంబ నియంత్రణ చేయాలంటే రూ.8 లక్షలు వెచ్చించాలి. అంతపెద్ద మొత్తంలో తాము కుటుంబ నియంత్రణకు ఖర్చుచేసే పరిస్థితి లేదని ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు చెబుతున్నారు. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, నెల్లూరు వంటి పెద్ద పెద్ద కార్పొరేషన్లలోనే కుక్కల కుటుంబ నియంత్రణకు నిధుల్లేకపోవడం దారుణమైన విషయం. డాక్టర్లు.. ఆపరేషన్ థియేటర్లూ కరువే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు ఆపరేషన్ థియేటర్లు, డాక్టర్ల కొరత కూడా వేధిస్తోంది. ఆపరేషన్ థియేటర్ ఉంటే డాక్టరుండడు. డాక్టరుంటే ఆపరేషన్ థియేటర్ ఉండదు. పైగా కుక్కకు కుటుంబ నియంత్రణ చేశాక ఓరోజంతా ఆస్పత్రిలోనే పరిశీలనలోనే ఉంచి, దానికి తగినంత ఆహారం అందించి మరుసటి రోజు వదిలేస్తారు. ఇవన్నీ చేసేందుకు కావాల్సిన వనరులు లేవని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. లక్ష్యాలు బారెడు.. సాధించింది శూన్యం కొన్ని కార్పొరేషన్లలో కుక్కలు భారీగా ఉండగా, కు.ని ఆపరేషన్లు చేసిందిమాత్రం అతి తక్కువే. ఉదాహరణకు అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 20,746 కుక్కలున్నాయని అంచనా వేయగా, అందులో కేవలం 10,269 కుక్కలకే ఆపరేషన్లు నిర్వహించారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 19,822 కుక్కలున్నట్లు గుర్తించగా.. వాటిలో 15 వేల కుక్కలకే కు.ని ఆపరేషన్లు చేశారు. ఇక మున్సిపాల్టీల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపుకాదు. -
పనులు పరుగులు పెట్టాలి
మున్సిపల్ కార్పొరేషన్లపై సమీక్షలో మంత్రి కేటీఆర్ - అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులిస్తున్నాం.. - ఈ నెల 10వ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం - కొత్త ప్రతిపాదనలు పరిశీలించి మంజూరు చేస్తామని వెల్లడి - చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని.. అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముం దుకు తీసుకెళ్లాలని, టెండర్లు పిలిచి పనులు వేగంగా పూర్తిచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్ల ను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్‌లోని మెట్రోరైల్ భవన్లో కేటీఆర్ సమీ క్షించారు. వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పురోగతిపై మంత్రి సమాచారం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఆయా నగరాల అవసరాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందజేశా రు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ల మే యర్లు, కమిషనర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ నెల 10న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని కేటీఆర్ వెల్ల డించారు. మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల స్థితిగతులు, కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని ఆ సమావేశానికి రావాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు త్వరగా జారీ చేయాలని సీఎంవో అధికారులకు సూచించారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలసి మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపు పొందిన పట్టణాలు, నగరాల జాబితాను ఈ సందర్భంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. వ్యర్థ పదార్థాల విద్యుత్ ప్లాంట్లు చేపట్టండి రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో వ్యర్థ పదార్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టులను చేపట్టాలని పురపాలక శాఖ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. వారం లో ప్రాజెక్టు నిర్మాణ సంస్థలతో మాట్లాడాలని సూచించారు. వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టులపై సమీక్షించారు. అధి కారుల నుంచి పలు ప్రాజెక్టుల స్థితిగతుల ను తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని పట్టణాల్లో చేపట్టిన వ్యర్థ పదా ర్థాల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలు పలు కారణాలతో ఆగిపోయాయని అధికారులు మంత్రికి నివేదించారు. దీంతో ఆయా పనులను తక్షణమే పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఎట్టకేలకు పట్నంలో భగీరథ !
- 24 పట్టణాల్లో రూ.548 కోట్లతో పనులు - ఆన్యూటీ పద్ధతిలో పనులు దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ - త్వరలో మరో 19 నగర పంచాయతీల్లో కూడా.. సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలోని 24 పట్టణాల్లో ఇంటింటికి రక్షిత నీటి సరఫరా పనుల కోసం యాన్యూటీ ( Annuity) పద్ధతిలో రూ.548 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లను రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. యాన్యూటీ విధానంలో తొలిసారి నిర్వహించిన టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం పలు సడలింపులతో రెండో సారి టెండర్లు నిర్వహించగా, మెగా ఇంజనీరింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థలు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. నిబంధనల ప్రకారం అర్హత సాధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ప్రాజెక్టు పనులు అప్పగిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 నెలల కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేసేందుకు సదరు కంపెనీతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ శాఖ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పాల్వంచ, సత్తుపల్లి, ఎల్లెందు, బెల్లంపల్లి, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్, జనగాం, గద్వాల, నారాయణపేట, వనపర్తి, భువనగిరి, తాండూరు, వికారాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్, కామారెడ్డి పట్టణాల్లో నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ పనులను ఈ సంస్థ చేపట్టనుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ రూ.548 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఏడేళ్ల కాల వ్యవధిలో ఈ సంస్థకు ప్రభుత్వం వడ్డీతో సహా రూ.1,100 కోట్ల బిల్లులను తిరిగి చెల్లించనుంది. ఏడేళ్ల పాటు ఈ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను నిర్మాణ సంస్థే పర్యవేక్షించనుంది. ఏడేళ్ల గడువు ముగిసిన తర్వాత ప్రాజెక్టులను ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది. మరో 19 నగర పంచాయతీల్లో.. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని మరో 19 నగర పంచాయ తీల్లో నీటి సరఫరా పథకాల నిర్మాణం కోసం త్వరలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లను ఆహ్వానించనుంది. గత నాలుగేళ్ల కాలంలో గ్రామ పంచా యతీ నుంచి నగర పంచాయతీ స్థాయికి అప్‌గ్రేడ్ అయిన ఈ పురపాలికల్లో తాగునీటి సరఫరా పథకాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నగర పంచాయతీలకు రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు దాదాపు రూ.650 కోట్ల అంచనా వ్యయంతో ఆన్యూటీ విధానంలోనే టెండర్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో టెండర్లు ఆహ్వానిస్తామని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ పనులను సైతం 18 నెలల కాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
మున్సిపల్‌కు ‘పెళ్లి’ కళ
► ఇక బల్దియాల్లోనూ వివాహ నమోదు ► ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ► అమలుకు సిద్ధమవుతున్న యంత్రాంగం ► కల్యాణలక్ష్మి, షాదీముబారక్తోనే ఈ నిర్ణయం ► రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై తగ్గనున్న భారం ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలు 1. ఆదిలాబాద్ 2. నిర్మల్ 3. భైంసా 4. మంచిర్యాల 5. బెల్లంపల్లి 6. మందమర్రి 7. కాగజ్‌నగర్ నిర్మల్‌రూరల్: ఎప్పుడూ పన్నులు, పారిశుధ్యం, ప్రజా సమస్యలంటూ బిజీగా ఉండే మున్సిపల్‌కు ‘పెళ్లి’ కళ రానుంది. మున్సిపల్‌కు పెళ్లి కళ.. ఏంటీ అంటారా..! వివాహం తర్వాత అధికారికంగా దంపతులమన్నట్లు చెప్పుకోవడానికి ప్రతీ ఒక్కరు తమ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. ఈ ప్రక్రియను పూర్తిచేసి ఇచ్చేందుకు ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ కార్యాలయమే వేదికగా ఉండేది. ఇప్పుడు కల్యాణం తదుపరి ఘట్టమైన ఈ బాధ్యతను మున్సిపల్ సైతం పంచుకోనుంది. అంటే.. ఇక నుంచి వివా హ రిజిస్ట్రేషన్లను మున్సిపాలిటీల్లోనూ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిన్‌స్ట్రేషన్(డీఎంఏ) నుంచి బల్దియాలకు ఉత్తర్వులు వచ్చాయి. త్వరలోనే వివాహ నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు మున్సిపాలిటీలు సిద్ధమవుతున్నాయి. కల్యాణలక్ష్మి అమలుతోనే.. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం ఆర్థికంగా అండగా నిలుస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రూ.75,116లను అందజేస్తోంది. ఈ పథకాలు అమలు కావాలంటే అర్హులైన లబ్ధిదా రులు వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. షాదీముబారక్ అమలయ్యే ముస్లిం లతో పాటు క్రైస్తవులు తమ మత పద్ధతుల ప్రకారం వివాహాన్ని నమోదు చేసుకుంటారు. ఇక ప్రధానంగా హిందువులు మాత్రం అధికారికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. కల్యాణలక్ష్మి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బోసిపోయిన ఈ కార్యాలయాలు వివాహ రిజిస్ట్రేషన్లతో నిండిపోతున్నాయి. గతంలో నెల మొత్తంలో పది కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఒక్క రోజులోనే 40–50 అవుతున్నాయి. ఈ లెక్కన నెలకు వందకు పైగా వివాహ రిజిస్ట్రేషన్లు ఒక్కో కార్యాలయంలో నమోదవుతున్నాయి. భారం తగ్గించేందుకే.. భూముల రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు.. తదితర పనులతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బిజీగా ఉంటున్నాయి. గతంలో వివాహ రిజిస్ట్రేషన్లపై అవగాహన లేకపోవడం.. ఉన్నా ఆసక్తి చూపకపోవడంతో పెద్దగా జంటలు వచ్చేవి కావు. విదేశాలకు వెళ్లేవారు, ఇతరత్రా పనులు ఉన్నవారే తమ పెళ్లిళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. కానీ కల్యాణలక్ష్మి అమలులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో ఒక్కసారిగా కార్యాలయాలకు కొత్తజంటల తాకిడి పెరిగిపోయింది. రాష్ట్రంలోని చాలా కార్యాలయాలకు ఇబ్బందికరంగా మారింది. ఓవైపు భూముల రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల బిజీలో ఉండే అధికారులకు పెళ్లిళ్ల నమోదు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహ నమోదు భారాన్ని తగ్గించుకునేందుకు మున్సిపాలిటీలకు ఈ బాధ్యతను పంచినట్లు సమాచారం. సులువుగా వివాహ నమోదు పెళ్లయిన ప్రతీ జంటకు ప్రభుత్వం రూ.75,116 ఇస్తోంది. ఈ మేరకు ప్రతీ జంట తమ పెళ్లిని అధికారికంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుం ది. రూ.220 చెల్లించి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెళ్లిళ్లను నమోదు చేయించుకుంటున్నారు. డబ్బులు చెల్లించడంలో ఇబ్బంది లేదు కానీ.. కార్యాలయాల్లో పెరిగిన పనిభారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. కానీ మున్సిపల్లోనూ వివాహ నమోదు ప్రక్రియ ప్రారంభమైతే సులభంగా, వేగంగా పూర్తవుతాయి. ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీలు ఇప్పటికే డిజిటలైజేషన్ వైపు అడుగులు వే స్తున్నాయి. ప్రజలకు వేగవంతంగా సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల నమోదు ప్రక్రియ కూడా బల్దియాల్లో వెనువెంటనే పూర్తయ్యే ఆస్కారం ఉండనుంది. త్వరలోనే ప్రారంభం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను బల్దియాల్లోనూ చేపట్టాలంటూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిన్‌స్ట్రేషన్(డీఎంఏ) నుంచి ఇటీవలే ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు అందాయి. సబ్ రిజిస్ట్రార్లకూ సమాచారాన్ని అందించారు. మున్సిపాలిటీల్లో చేపట్టే నమోదు ప్రక్రియకు మున్సిపల్ కమిషనర్ మ్యారేజ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మున్సిపాలిటీ ఆ డివిజన్ మేరకు వివాహాల నమోదును చేపట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రస్తుతం రూ.220 చెల్లించాల్సి ఉండగా, మున్సిపల్లో ఎంతమేర చెల్లించాలనేది తేలలేదు. తమ బల్దియాల్లో త్వరలోనే వివాహ నమోదు ప్రక్రియను ప్రారంభించేందు కు కమిషనర్లు సిద్ధమవుతున్నారు. భారం తగ్గుతుంది.. వివాహ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు నాలుగైదు వచ్చే దరఖాస్తులు ప్రస్తుతం 40–50 వరకు వస్తున్నాయి. దీంతో పని భారం పెరుగుతోంది. మున్సిపాలిటీలు ఈ బాధ్యతను పంచుకుంటే మాపై భారం తగ్గుతుంది. – ఫణీందర్, సబ్‌రిజిస్ట్రార్, నిర్మల్ అమలుకు ఏర్పాట్లు.. మున్సిపల్లో పెళ్లిళ్ల నమోదు ప్రక్రియ చేపట్టాలంటూ డీఎంఏ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు త్వరలో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వివాహ నమోదు ప్రక్రియను చేపడతాం. – ఆర్.త్రియంబకేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
మున్సిపాలిటీల్లో ఆంక్షలను ఎత్తేయాలి
టీయూడబ్ల్యూజే డిమాండ్ సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశాల మీడియా కవరేజీపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) సలహాదారు, సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. జర్నలిస్టులను నియంత్రించాలనే భావన సరికాదన్నారు. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ జావెద్ హమద్ ఉర్దూ జర్నలిస్టులపై కేసులతో పాటు వేధింపులకు పాల్పడుతున్నారని దీనిపై ప్రభుత్వం, ఎంఐఎం నాయకత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూ ఉన్నందున ఈ జర్నలిస్టులకు, పత్రికలకు ఆయా అంశాల్లో తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంగళవారం ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, సంఘ నేతలు విరాహత్ అలీ, మాజిద్లతో కలసి ఆయన విలేకరులకు తెలియజేశారు. హెల్త్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం చేసిన అనేక వాగ్దానాలు ఆచరణలో అమలు కావడం లేదన్నారు. కొత్త అక్రెడిటేషన్లు ఇచ్చిన వారి కి, అక్రెడిటేషన్లు లేనివారికి, డెస్క్ జర్నలిస్టులకు ఇవి ఇంతవరకు అందలేదన్నారు. జిల్లాల విభజనకు అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థను విభజించనందున పాత జిల్లాల ప్రాతిపదికనే బస్సుపాస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. గత 3, 4 ఏళ్లలో వివిధస్థాయిల్లోని 330 మంది జర్నలిస్టులు చనిపోయారని, వారిలో ప్రభుత్వపరంగా 60 మందికే సహాయం అందిందన్నారు. మిగతా వారందరికీ సహాయం అందేలా చూడాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇలా అన్ని వ్యవస్థలను ప్రెస్ అకాడమీకి అప్పగించకుండా ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పనిచేసేలా ప్రభుత్వం చూడాలని ఐజేయూ నేత అమర్ సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య సుప్రీంకోర్టులో తేలినందున ప్రస్తుతం సమాచారశాఖ ఆధ్వర్యంలోని ఆయా స్థలాలను జవహర్లాల్ హౌసింగ్ సొసైటీకి అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
పురపాలికల్లో సంస్కరణలు..!
- క్షేత్ర స్థాయి అధికారులతో అధ్యయన కమిటీ - ఇక అభివృద్ధి పనుల బాధ్యత జిల్లా కలెక్టర్ల చేతికి - పురపాలక శాఖ తాజా నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో పాలన వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల కమిటీ ఏర్పాటు చేసింది. పురపాలనలో తీసుకురావాల్సిన కొత్త ఒరవడికలపై ఈ కమిటీ అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. పురపాలికల రోజువారీ పాలన వ్యవహారాల్లో అనుభవం కలిగిన క్షేత్ర స్థాయి అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. పురపాలక శాఖ డైరెక్టరేట్ కార్యా లయ అదనపు సంచాలకులు పి.అనురాధ, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు జయరాజ్ కెన్నడీ, ఎన్.రవికిరణ్, రామగుండం మునిసి పల్ కార్పొరేషన్ కమిషనర్ జాన్ శామ్సన్, బోడుప్పల్ మునిసిపల్ కమిషనర్ ఆర్.ఉపేందర్‌రెడ్డి, సిద్దిపేట మునిసిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, పురపాలక శాఖ సహాయ సంచాలకులు కె.ఫల్గుణి కుమార్, కోరుట్ల మునిసిపల్ కమిషనర్ ఎ.వాణిలతో ప్రభుత్వం ఈ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల కమిటీకి అభివృద్ధి పనులు రాష్ట్రంలోని పురపాలికల్లో చేపట్టాల్సిన అభి వృద్ధి పనులను గుర్తించి మంజూరు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కార్య నిర్వాహక కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. పురపాలికల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలను నిర్మూలించేం దుకు నేరుగా జిల్లా కలెక్టర్ల చేతికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పురపాలికల్లో పనుల నిర్వహణ, నాణ్యత పరిరక్షణ, పురోగతిపై సమీక్ష, పనుల కోసం ఇంజనీరింగ్ విభాగం ఎంపిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ఈ కమిటీ పని చేయనుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, స్థానిక ఎమ్మెల్యే, మేయర్/చైర్మన్, జిల్లా కేంద్రంలోని సీనియర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్, సంబంధిత మునిసిపాలిటీకి సంబంధించిన మునిసిపల్ ఇంజనీర్ సభ్యులుగా, మునిసిపల్ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిం చనున్నారు. ఈమేరకు శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆటో టిప్పర్లతో చెత్త సేకరణ రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో 4 చక్రాల టిప్పర్ ఆటోలతో చెత్త సేకరించేందుకు డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మిషన్ డైరెక్టర్ నేతృత్వంలో టెక్నికల్/ఫైనాన్షియల్ కమిటీని ఏర్పాటు చేసింది. 4 చక్రాల ఆటో టిప్పర్ల మోడళ్ల ఎంపిక, ధరల ఖరారుతో పాటు ఆటో టిప్పర్ల కోసం టెండర్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీలో సభ్యులుగా పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్‌చీఫ్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్, చీఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, టీయూఎఫ్ఐడీసీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ప్రభుత్వం నియమించింది. అదే విధంగా డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కోసం మునిసిపల్ కమిషనర్ల నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేసింది. మునిసిపల్ కార్పొరేషన్ల విషయంలో మాత్రం పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకుల నేతృత్వంలోని ఎంపిక కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. -
ఇకపై లే అవుట్ క్రమబద్ధీకరణ గుదిబండే!
- ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు చేసుకోని వారికి భారీ జరిమానాలతో మరో అవకాశం - 33% అదనపు ఎల్ఆర్ఎస్ చార్జీలు, 14% ప్రస్తుత మార్కెట్ ధర కలిపి చెల్లించాలి - పురపాలక శాఖ ఉత్తర్వులపై బిల్డర్ల అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ గుదిబండగా మారనుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకోని వారి భూములు/లే అవుట్ల క్రమబద్ధీకరణకు భారీ జరిమా నాతో మరో అవకాశం కల్పిస్తూ పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఇళ్ల నిర్మాణాలకు పెనుభారంగా మారాయి. 2015 నవంబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ గడువు ఇప్పటికే ముగిసింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల పరిధిలో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోని వారి లే అవుట్లు, ప్లాట్లు, భూముల్లో ఇళ్లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే సమయంలో భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేసి సంబంధిత లే అవుట్లు, ప్లాట్లు, భూములు క్రమబద్ధీకరించాలని రాష్ట్ర పురపాలక శాఖ గత నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. వీటినే రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తింపజేస్తూ గత నెల 28న మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఉత్తర్వుల ప్రకారం...ఇకపై లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2015 నాటి ఎల్ఆర్ఎస్ చార్జీలకు అదనంగా జరిమానాల రూపంలో మరో 33 శాతం ఎల్ఆర్ఎస్ చార్జీలను చెల్లించాలని, దీనికి తోడు భూమి ‘ప్రస్తుత మార్కెట్ విలువ’లో 14 శాతాన్ని ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీల రూపంలో చెల్లించాలి. బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థల ఆందోళన ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 14 శాతం ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలు చెల్లించాలని తీసుకున్న నిర్ణయం గుదిబండగా మారుతుందని బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఎప్పుడో ఏళ్ల కింద కొనుగోలు చేసిన భూముల మార్కెట్ ధరలు ప్రస్తుతం ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. గతంలో కొనుగోలు చేసిన భూముల మొత్తం ధరతో పోల్చితే ప్రస్తుత మార్కెట్ విలువలో 14 శాతమే అధికంగా ఉంటుందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. ఎల్ఆర్ఎస్ చార్జీలకు అదనంగా విధించిన 33 శాతం చార్జీలతో చెప్పుకోదగ్గ భారం పడకపోయినా, దీనికి అదనంగా 14 శాతం మార్కెట్ విలువను సైతం ఓపెస్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలుగా చెల్లించాలని ఆదేశించడం పట్లే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే లే అవుట్ల క్రమబద్ధీకరణకు జరిమానాలతో ఎల్ఆర్ఎస్ చార్జీలూ వసూలు చేయాలని పురపాలక శాఖ ఆదేశించడంతో భవన నిర్మాణ అనుమతులు పొందడం మరింత క్లిష్టంగా మారుతుందని పురపాలక శాఖ వర్గాలు పేర్కొం టున్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువకు బదులు భూమి కొన్ననాటి విలువ ప్రకారం ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలు వసూలు చేస్తే నిర్మాణ రంగానికి ఊరట లభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘పుర’లో నామినేషన్లకు రెక్కలు
⇔ గరిష్ట వ్యయ పరిమితి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు ⇔ ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో నామినే షన్ పనులకు రెక్కలొచ్చాయి. మరో ఏడాది రెండేళ్లలో మునిసిపల్, సార్వత్రిక ఎన్నికలు రానుండడంతో చోటామోటా నేతలకు చేతి నిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల్లో నామినేషన్ పనుల నిబంధనల ను సడలించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వ శాఖలోనైనా రూ.లక్ష, ఆపై అంచనా వ్యయంగల పనులను తప్పనిసరిగా ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారానే అప్పగించాలి. రూ.లక్ష, ఆలోపు పనులు నామినేషన్ విధానంలో అప్పగించే వీలుంది. మునిసిపల్ మేయర్లు, కార్పొరేట ర్లు, చైర్మన్లు, కౌన్సిలర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల్లో నామినే షన్ పనుల గరిష్ట వ్యయ పరిమతిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు వరకు పెంచింది. ఈ మేరకు గత నెల 25న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులిచ్చారు. రూ.5లక్షల లోపు అత్యవసర పనులను నామినేషన్ మీద గుర్తిం పు పొందిన కాంట్రాక్టర్లు, స్వయం సహాయక సంఘాలు, వార్డు స్థాయి కమిటీలు, రెసిడెన్షి యల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అప్పగించా లని పేర్కొన్నారు. వీరికి పనులు నామినేట్ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని మునిసిపల్ కమిషనర్, సీనియర్ మునిసిపల్ ఇంజనీర్ల కమిటీకి ప్రభుత్వం అప్పగిం చారు. జీహెచ్ఎంసీలో మాత్రం కమిషనర్, చీఫ్ఇంజనీర్, సంబంధిత జోనల్ కమిషనర్ తో కూడిన కమిటీకి నామినేషన్ పనుల అప్పగింత అధికారాన్ని కట్టబెట్టింది. నామి నేషన్ల అంచనా వ్యయంలో 5 శాతం తక్కువకు కాంట్రాక్టర్లకు పనులు నామినేట్ చేయాలని ప్రభుత్వం సూచించింది. -
బీపీఎస్ గడువు పెంపు
కర్నూలు (టౌన్): బీపీఎస్ (భవనాల క్రమబద్ధీకరణ పథకం)కు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఈ పథకం గడువు మార్చి నెలాఖరుకు ముగియనుంది. అయితే అనేక మున్సిపాల్టీల నుంచి అభ్యర్థనలు రావడంతో ఏప్రిల్ 30 వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా భవనాలు నిర్మించుకున్న భవన యజమానులు బీపీఎస్ కింద తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.