జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీడీపీ నాయకుల తీరుశ్రుతిమించుతోంది. టెండర్లు, వెంచర్లు మొదలు లే అవుట్ల వరకూ అన్నీవారే అయిన నడిపిస్తున్నారు. పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రజల కోసంపనిచేయాల్సిన అధికారులు టీడీపీ నాయకులకు తొత్తులుగా మారుతున్నారు.ఈ పంచాయతీలు సీఎం దృష్టికి వెళుతున్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఖజానాకు భారీగా గండిపడుతోంది. అభివృద్ధికుంటుపడుతోంది.
చిత్తూరు, సాక్షి: జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉన్నాయి. నగరి, పుంగనూరు మున్సిపాలిటీలు మినహా అన్నీ అధికార టీడీపీ చేతిలోనే ఉన్నాయి. తిరుపతి కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. టెండర్ల నుంచి లే అవుట్ల అనుమతుల వరకు అన్నీ టీడీపీ వారే నడిపిస్తున్నారు. తమకు ఎదురేలేనట్లు వ్యవహరిస్తున్నారు. అవసరమైతే కార్యాలయాలకు వచ్చి నిమిషాల్లో పనులు చేసుకుని వెళుతున్నారు. టీడీపీ నాయకులు అడిగిందే తడవుగా నిబంధనలను సైతం పక్కన పెడుతున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులకు పనులు దక్కకపోతే.. టెండర్లను సైతం పక్కన పెడుతున్నారు. జిల్లాలో కార్పొరేషన్‌ల తీరును కాగ్ ఇప్పటికే పలుసార్లు తప్పు పట్టింది. అభివృద్ధి పనుల చెల్లింపులు తప్పుల తడకగా ఉన్నాయని అక్షింతలు వేసింది.
చేస్తావా? చేయవా?..
మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వెలుస్తున్న అక్రమ లే అవుట్‌లు, నిర్మాణాలను అడ్డుకునేందుకు టౌన్‌ప్లానింగ్ అధికారులు జంకుతున్నారు. నేరుగా టీడీపీ నాయకులే మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతుం డటంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. తిరుపతిలో పరిస్థితి దారుణంగా ఉంది. నగరం శరవేగంగా అభివృద్ధి అవుతోంది. అక్కడ రియల్‌ఎస్టేట్ వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అక్కడ టీడీపీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతోంది. వారు ఎక్కడ చెబితే అక్కడ సంతకాలు పెట్టేందుకే అధికారులు ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సిన అధికారులు టీడీపీ నాయకులు ఏం చెబితే అది చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్‌ల పరిధిలో లే అవుట్ అనుమతి పేరుతో పెద్ద ఎత్తున చేతులుమారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుం డటంతో ఇప్పుడు దందా మరింత జోరుగా సోగుతోంది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఏ చిన్న అభివృద్ధి పనిలో అయినా షాడో మేయర్‌కు 8 శాతం పన్ను చెల్లించాల్సిందే.
సీఎం దృష్టికి వెళ్లినా...
మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోని టీడీపీ నా యకుల తీరు సీఎం చంద్రబాబు దృష్టికి ఇది వరకే వెళ్లింది. నిఘా వర్గాలు కూడా ఆయనకు సమాచారం అందించాయి. లైట్ తీసుకోవడంతో ఆగడాలు మరింత పెరిగాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఖర్చులు ఉంటాయ ని సీఎం వ్యాఖ్యానించారని మదనపల్లి టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎక్కువగా టీడీపీ నాయకులే అభివృద్ధి పనులు చేస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల పరిధిలో చేపడుతున్న పనులపై కాగ్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment