
సాక్షి, సంగారెడ్డి: నారాయణ్ ఖేడ్ మున్సిపల్ అధికారుల నిర్వాకం ఓ మహిళ మృతికి కారణమైంది. ఇంటిపన్ను కట్టలేదని ఓ ఇంటి ముందు నారాయణ్ ఖేడ్ పురపాలక సంఘం అధికారులు నాలుగు రోజుల క్రితం చెత్త వేశారు. దీంతో ఇంటి యజమానురాలు భూమవ్వ (58) తీవ్ర మనస్తాపం చెందారు. ఈరోజు (ఆదివారం) ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జోగిపేట్ వద్దకు చేరుకోగానే ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచింది. అధికారుల మితిమీరిన చర్యల వల్లే భూమవ్వ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, స్థానికుల కథనం మాత్రం భిన్నంగా ఉంది. ఈనెల 15 న భూమవ్వ ఇంటి ముందు చెత్త వేసిన మున్సిపల్ అధికారులు 17న తొలగించారని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment