narayankhed
-
కంగ్టి గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థులతో చాకిరీ
కంగ్టి(నారాయణఖేడ్): విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించరాదన్న నిబంధనలున్నా సంబంధిత విద్యాసంస్థల సిబ్బంది యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కంగ్టి మండలం గిరిజన బాలుర రెసిడెన్షియల్ కళాశాల వసతిగృహంలో విద్యార్థులతో అల్పాహారాన్ని వండించిన విషయం గురువారం బయటకు వచ్చింది. దీనిపై ప్రిన్సిపాల్ విజయ్ను వివరణ కోరగా.. అల్పాహారం తయారీలో విద్యార్థుల సహా యం తీసుకొంటామని స్పష్టం చేశారు. ఈ విషయం మీడియా ద్వారా జిల్లా కలెక్టర్‌కు చేరడంతో.. నారాయణఖేడ్ ఆర్డీవో అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీవో కళాశాలను సందర్శించి విద్యార్థులు, సిబ్బందిని అడిగి విషయాలు తెలుసు కున్నారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ నజీమోద్దిన్, డీటీ జుబేర్ అహ్మద్, సీనియర్ అసిస్టెంట్ తాజోద్దిన్ ఉన్నారు. వడ వద్దన్నందుకు చితకబాదాడుకొందుర్గు: కడుపునొప్పిగా ఉందని, వడ తింటే పడటం లేదని చెప్పినా వినకుండా తినాల్సిందేనంటూ ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి వీపుపై వాతలు తేలేలా కొట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారంగా వడ వడ్డించారు. కడుపునొప్పితో బాధపడుతున్న 9వ తరగతి విద్యార్థి సందీప్ వడ తినడానికి ఇష్టపడలేదు. దీంతో వడ వద్దంటావా అంటూ ప్రిన్సిపల్ మహ్మద్ కుర్షీద్ విద్యార్థి వీపుపై వాతలు వచ్చేలా కర్రతో చితకబాదారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో డైనింగ్ హాల్లోకి వెళ్లిన ప్రిన్సిపాల్.. అక్కడ విద్యార్థులు కూరగాయల తొక్కలు కింద పడేయడాన్ని గమనించారు. వాటిని తిరిగి ప్లేట్లలో వేయించి విద్యార్థులతోనే తినిపించారు. కాగా, తమ అబ్బాయిని కొట్టిన విషయం తెలుసుకున్న సందీప్ తల్లిదండ్రులు మహేశ్వరి, యాదయ్య ప్రిన్సిపల్‌తో గొడవకు దిగారు. దీంతో తప్పయిందని ఆయన అంగీకరించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం ఈ విద్యాసంస్థను తనిఖీ చేసిన మర్నాడే ఈ ఘటన జరగడం గమనార్హం. ఏక్ నిరంజన్ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలంటూ ఉన్నతాధికారులు, ప్రభుత్వం పదేపదే ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అందుకు ఆదిలాబాద్ (Adilabad) రూరల్ మండలంలోని సాలేవాడ ప్రాథమిక పాఠశాలనే నిదర్శనం. ఈ బడిలో మొత్తం 13 మంది విద్యార్థులు ఉండగా ఉదయం 10 గంటలకు పాఠశాలను ‘సాక్షి’ సందర్శించిన సమయంలో కేవలం ఒకే ఒక విద్యార్థి ఉండగా టీచర్ ఆ విద్యార్థికి బోధిస్తుండటం గమనార్హం. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‘పీఎం ఇంటర్న్‌షిప్’ దరఖాస్తుకు మార్చి 10 గడువుసాక్షి, హైదరాబాద్: భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (Prime Minister Internship Scheme) కింద మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పరిశ్రమల శాఖ సంచాలకుడు జి.మల్సూర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు 12 నెలలకు రూ.6 వేలు ఒకేసారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేయనున్నట్లు వెల్లడించారు.దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని, ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీలలో ఏదైనా పూర్తి చేసి ఉండాలని, వారి కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ‘పీఎంఇంటర్న్షిప్.ఎంసీఏ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తును పూరించాలని సూచించారు. -
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో భారీ అగ్నిప్రమాదం
-
YSR మరణం తరువాత..!
-
కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయాం
నారాయణఖేడ్: తమ రాష్ట్రంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాలు అమలు కావడం లేదంటూ కర్ణాటకకు చెందిన రైతులు శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ర్యాలీ నిర్వహించారు. తాము మోసపోయామని, మీరు మోసపోవద్దని అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే.. వీరి ప్రదర్శనను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన 60 మంది వరకు రైతులు మంగల్‌పేట్ నుంచి నారాయణఖేడ్ రాజీవ్‌చౌక్ వైపు ర్యాలీగా బయలు దేరారు. కొద్దిదూరం రాగానే కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని ప్లకార్డులను లాక్కొని చించివేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం కర్ణాటక రైతులు రాజీవ్‌చౌక్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. హామీల అమలు లేదు: కర్ణాటక రైతులు దేవరాజ్‌గౌడ్, పెనినగౌడ, సోంనాథ్, సంజీవ్‌కుమా ర్ టోల్లె అనే రైతులు విలేకరులతో మాట్లాడుతూ, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు అమలు కావడం లేదని చెప్పారు. మహిళలకు రూ.2వేలు, 10 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి కేవలం ఐదు కిలోలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. గతంలో ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా ఉండగా, ప్రస్తుతం రెండు, మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. వారు పెయిడ్ ఆర్టిస్టులు: కాంగ్రెస్ కర్ణాటక నుంచి వచ్చినవారు రైతులు కాదని, బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులని పీసీసీ ఎస్టీసెల్ వైస్ చైర్మన్ భీంరావునాయక్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తదితరులు విమర్శించారు. బీఆర్ఎస్కు ఓట మి తప్పదనే భయంతో పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి తప్పుడు ప్రచారానికి తెరలేపారన్నారు. తమ వెంట వస్తే బీఆర్ఎస్ నాయకులను కర్ణాటక తీసుకెళ్లి పథకాల అమలు తీరును చూపిస్తామని అన్నారు. -
నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ ఎవరికీ?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇంకా ఎవరికీ ఖరారు కాకముందే అసంతృప్తి రాజుకుంటుందా?.. దీని కోసం ఇద్దరు ముఖ్యనేతలు ఎవరికి వారే ప్రయత్నాలు కొనసాగిస్తుండగానే అలకలు షురూ అయ్యాయా?.. పార్టీకి చెందిన మాజీ ఎంపీలంతా ఇటీవల హైదరాబాద్‌లో మధుయాష్కి నివాసంలో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని పరిశీలిస్తే అవుననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖేడ్ టికెట్ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్ పోటీ పడుతున్నారు. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలుస్తున్నారు. మరో వైపు పార్టీలోని ఇరు వర్గాలు కూడా తమ నాయకుడికే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నాయి. ఎలాగైనా ఈసారి తమ నాయకుడు పోటీలో ఉంటారని ఇరువర్గాల కార్యకర్తలు చెబుతున్నారు. తొలి జాబితాలో దక్కని చోటు కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రవ్యాప్తంగా 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ తొలి జాబితాలో ఖేడ్‌కు చోటు దక్కలేదు. రెండో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుండగా ఈసారైనా నియోజకవర్గం టికెట్ ప్రకటిస్తారా? అనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చాకే అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీలంతా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మధుయాష్కి నివాసంలో భేటీ అయ్యారు. అందులో నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్న సురేష్‌షెట్కార్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు, బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య తదితరులు ఉన్నారు. పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ రాని ఈ మాజీ ఎంపీలంతా సమావేశం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నారాయణఖేడ్‌లో పార్టీ కేడర్ చాలా ఏళ్లుగా రెండు వర్గాలుగా విడిపోయింది. ఇక్కడ ఈ ఇద్దరు నేతల మధ్య ఆదిపత్య పోరు కారణంగానే బీఆర్ఎస్ విజయం సాధిస్తూ వస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి ఎలాగైనా ఇరు వర్గాల మధ్య సమన్వయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం టికెట్ రెండో జాబితాలో ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
సయోధ్య సాధ్యమేనా..! వైఎస్సార్ ఫార్ములా ప్రయోగించేందుకు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ కాంగ్రెస్‌లో ఉప్పు, నిప్పు అన్నట్లుగా ఉన్న ఇద్దరు ముఖ్యనేతల మధ్య సయోధ్య కుదుర్చేందుకు రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డిల సమన్వయానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నేడో, రేపో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (టీపీఈసీ) సభ్యులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావుఠాక్రే పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇద్దరితో జహీరాబాద్‌కు చెందిన ఓ కీలక నాయకుడు చర్చలు జరిపారు. కాంగ్రెస్‌కు పట్టున్న నియోజకవర్గంలో కీచులాటలు తీవ్రనష్టాన్ని తెస్తోంది. ఒకరు పోటీలో ఉంటే మరొకరు ఇందుకు సహకరించకపోవడంతో ఇతర పార్టీలకు కలిసొస్తోంది. ఈ సమస్యను అధిగమించకపోతే వచ్చే ఎన్నికల్లో పరాజయం పునరావృతం అవుతుందని భావిస్తున్న అధినాయకత్వం.. ఇప్పటి నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. వైఎస్సార్ ఫార్ములా ప్రయోగించేందుకు.. ఈ నియోజకవర్గంలో గతంలో సంజీవరెడ్డి తండ్రి పట్లోళ్ల కిష్టారెడ్డికి, సురేష్‌షెట్కార్ మధ్య ఇదే పరిస్థితి ఉండేది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో వారిద్దరికి సయోధ్య కుదిర్చారు. షెట్కార్‌ను జహీరాబాద్ ఎంపీగా, కిష్టారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు కాంగ్రెస్ అనుసరించాలని భావిస్తోంది. ఒకరిని ఎంపీ అభ్యర్థిగా, మరొకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలనే యోచనలో ఉంది. వీలు కాని పక్షంలో ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెస్తోంది. ఆసక్తికరమైన పరిణామాలు ఖేడ్ కాంగ్రెస్‌లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజీవరెడ్డి.. సురేశ్ నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడగా, ఇటీవల జరిగిన కిష్టారెడ్డి వర్ధంతి కార్యక్రమానికి షెట్కార్ కూడా హాజరుకావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తార స్థాయిలో కీచులాటలు ఈ నియోజకవర్గంలో షెట్కార్, సంజీవరెడ్డిల మధ్య కీచులాటలు తార స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఇటీవల మండల, పట్టణ అధ్యక్షుల నియామక విషయమై కూడా వివాదానికి దారితీసింది. షెట్కార్ అనుచరులకే అధ్యక్ష పదవులన్నీ దక్కడంపై సంజీవరెడ్డి భగ్గుమన్నారు. దీనిపై పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఒకానొకదశలో గాంధీభవన్‌ను సైతం ముట్టడించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు సమన్వయం చేయకపోతే ఈ స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి తప్పదని అధినాయకత్వం భావిస్తోంది. వెంటనే సయోధ్య కుదుర్చేందుకు సన్నాహాలు చేస్తుండటం ఆసక్తి కరంగా మారింది. మద్దతు కూడగట్టే ప్రయత్నాలు.. పార్టీ అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న వీరు పార్టీ ముఖ్యనేతల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీ సీ చీఫ్ రేవంత్‌రెడ్డి షెట్కార్‌ను ప్రోత్సహిస్తుండగా, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితర ముఖ్యనేతలు సంజీవరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో ఉన్న పరిచయాలతో ఎలాగైనా అభ్యర్థిత్వం దక్కించుకునేందుకు సురేశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. ఇద్దరు కూడా అధినాయత్వం మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉండటం పార్టీ అంతర్గత వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఒకవేళ సయోధ్య కుదిరినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పని చేస్తారా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్ కంచుకోటలో ఆధిపత్య పోరు.. పార్టీని ముంచుతారా?
రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఆ నియోజకర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. రాష్ట్రంలో అధికారం లేకపోయినా.. ఎమ్మెల్యే సీటు ఓడినా హస్తం పార్టీలో కుమ్ములాటలు మాత్రం ఆగలేదు. ఆది నుంచి రెండు కుటుంబాల మధ్యే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నడుస్తోంది. ఎన్నికల సమయంలో మరోసారి ఆ ఇద్దరి మధ్యా పోరు తీవ్రమైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ రెండు కుటుంబాల కథేంటి? స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ తమదే అనే రీతిలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని షేట్కర్ వంశస్తులు వ్యవహరిస్తున్నారు. షేట్కర్ల శిష్యుడుగా రాజకీయ అరంగ్రేటం చేసిన పట్లోళ్ల కిష్టా రెడ్డి మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత శివరాజ్ షేట్కార్ కుమారుడు సురేష్ కుమార్ షేట్కార్ రాజకీయ ప్రవేశంతో పట్లోళ్ల కిష్టారెడ్డి, షేట్కార్ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇరు కుటుంబాలు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండటంతో రాజకీయ పలుకబడి కలిగిన శివరావు షేట్కార్ ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి తన కొడుకుకు సురేష్ షేట్కార్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. అప్పటి నుండి కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న తమకే టికెట్ వస్తుందన్న ధీమాలో షెట్కార్ కుటుంబ సభ్యులు ఉన్నారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పట్లోళ్ల కృష్ణారెడ్డి కుమారుడైన సంజీవరెడ్డి బీజేపీలో చేరి టికెట్ సాధించడంతో వారి మధ్య వైషమ్యాలు తీవ్రస్థాయికి చేరాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సంజీవరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. గత సంవత్సరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని సంజీవరెడ్డి, సురేష్ షేట్కార్ వేరు వేరుగా గ్రామస్థాయిల్లో నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గాల ప్రత్యక్ష పోరుకు రచ్చబండే వేదికైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటూ ఎవరి స్థాయిలో వారు జన సమీకరణ చేసి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ పిలుపు మేరకు జరుగుతున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాలను కూడా ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దుకు నిరసనగా చేసిన ధర్నా కార్యక్రమం కూడా వేరువేరు చోట్ల ఒకే రోజు నిర్వహించి వారి మధ్య విభేదాలను మరోసారి కేడర్‌కు చూపించారు. వీరిద్దరి మద్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో గ్రామస్థాయిలోని కేడర్ అయోమయానికి గురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలంతా సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలు బాహాటంగానే నాయకులకు సూచిస్తున్నారు. ఇద్దరు నాయకుల తీరు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరికి కాంగ్రెస్ టికెట్ వస్తే మరొకరు రెబల్ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణ ఖేడ్‌లో కాంగ్రెస్ జండా ఎగరేయడానికి కృషి చేస్తారో తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి పార్టీని బలిచేసుకుంటారో చూడాలనే కామెంట్స్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా? -
దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కామెంట్స్
-
LIVE: కేసీఆర్ బహిరంగ సభ @ నారాయణఖేడ్
-
ఐదు నెలల పసిబిడ్డకు కరోనా
సాక్షి, నారాయణఖేడ్: ఐదు నెలల పసికందుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం 28 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్ వచి్చనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ముగ్గురిలో అయిదు నెలల పాప సైతం ఉంది. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. -
నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం
సాక్షి, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ర్యాకల్ రోడ్డులో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు శుభ్రం చేస్తున్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యమ్మ, విట్టమ్మ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. నాలుగు దుకాణాలతో పాటు విద్యుత్ స్తంభాన్ని కూడా బొలేరో వాహనం ఢీ కొట్టింది. దుకాణాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ ఫుల్లుగా మద్యం మత్తులో వాహనం నడిపాడని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి పరిశీలించారు. చదవండి: ఆడపిల్లలు పుట్టారని రోజూ వేధింపులు.. భార్య ఆత్మహత్య ప్రేమ వేధింపులు: అల్లుడిని హత్య చేసిన మామ -
నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం
-
గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
నారాయణఖేడ్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుకు గురై ఆదివారం మృతి చెందాడు. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన మురళీ గోవింద్(35) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వారం క్రితం ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడటంతో నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. కోవిడ్ వార్డులో పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. అయినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో మృతి చెందాడు. కాగా మురళీ గోవింత్ 2014, 2018లో ఖేడ్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఏడాదిక్రితం ఆయన బీజేపీలో చేరారు. -
కొబ్బరికాయ కొడదామని గుడికి.. అంతలోనే బాబుతో
నారాయణఖేడ్: రెండున్నర నెలల బాబుతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నారాయణఖేడ్‌లో చోటు చేసుకుందని ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని డీఎన్టీ తండాకు చెందిన కర్ర ప్రకాశ్ (34)కు సిర్గాపూర్ మండలం జమ్లా తండాకు చెందిన సంగీత (26)తో తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లతోపాటు ఇంకా పేరు కూడా పెట్టని రెండున్నర నెలల బాబు సంతానం ఉన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కర్ర ప్రకాష్ భార్యా పిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. రెండు నెలల క్రితం సంగీత తల్లిగారి గ్రామమైన జెమ్లాతండాకు వెళ్లింది. అత్తగారి గ్రామమైన డీఎన్టీ తండాలో పూజ ఉన్నందున ఈనెల 1వ తేదీన ఇక్కడకు వచ్చింది. పూజ ముగిశాక వారం రోజులుగా ఖేడ్ పట్టణంలోని ప్రకాశ్ అక్క నిర్మల ఇంటికి వచ్చి ఉంటోంది. ఈ నెల 15న ఉదయం డీఎన్టీ తండాలోని ఒక గుడి వద్ద కొబ్బరికాయ కొడదామంటూ తన బాబును తీసుకొని సమీప బందువైన క్రిశాంక్‌తో కలిసి బైక్‌పై వెళ్లింది. కొబ్బరికాయ తీసుకురమ్మంటూ క్రిశాంక్‌ను పంపించి ఆ తర్వాత తనబాబుతో కలిసి సంగీత అదృశ్యమైంది. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త కర్ర ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. చదవండి: ప్రేయసికి నిశ్చితార్థం: అంతలోనే కిడ్నాప్ చేసిన లవర్ -
సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీరు అందని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు రిజర్వాయర్‌కు నీటి లభ్యతను పెంచేలా పనులు జరుగుతున్న దృష్ట్యా.. దీనికి కొనసాగింపుగా సింగూరు నీటిని ఆధారం చేసుకొని రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు డిజైన్ చేస్తోంది. పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సుమారు 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఈ రెండు పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇరిగేషన్ శాఖ సిద్ధ్దమవుతోంది. భారీగా ఎత్తిపోత... అంతే భారీ ఆయకట్టు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సింగూరుకు నీటి లభ్యత పెంచేలా కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులు పూర్తయితే సింగూరుకు నీటి కొరతరాదని చెబుతోంది. సింగూరుకు నీటి లభ్యత పెంచనున్న దృష్ట్యా, ఆ నీటిపై ఆధారపడి.. సాగునీటి వసతి కరువైన ప్రాంతాలకు గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం ఇప్పటినుంచే ఆలోచనలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారాయణఖేడ్ ప్రాంతానికి నీరందించేలా బసవేశ్వర ఎత్తిపోతలకు, జహీరాబాద్ నియోజకవర్గానికి నీరందించేలా సంగమేశ్వర ఎత్తిపోతలకు ప్రాణం పోస్తోంది. సింగూరులో 510 లెవల్ నుంచి సుమారు 8 టీఎంసీల నీటిని తీసుకుంటూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లందించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనికై 55 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసేలా ఒకటే లిఫ్టును ప్రతిపాదిస్తుండగా, ఈ ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.700– 800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వస్తున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో నీటి వసతి కల్పించేందుకు సింగూరులో అదే 510 లెవల్ నుంచి రెండు దశల్లో 125 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. దీనికి 15 టీఎంసీల మేర నీటి అవసరాలను లెక్కగట్టారు. ఈ పథకానికి రూ.1,300 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటిని తీసుకునేందుకు... అంచనా వ్యయం రూ.2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ అవసరాలతో పాటు కెనాల్ అలైన్మెంట్, పంప్‌హౌస్‌ల నిర్మాణ ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. అనంతరం విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయాలపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు డీపీఆర్ సిధ్దం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డీపీఆర్ తయారు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సూచనల మేరకు డీపీఆర్‌కి సిద్ధమవుతున్న ఇరిగేషన్ శాఖ బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్‌లో 80 వేల ఎకరాలు.. సంగమేశ్వరతో జహీరాబాద్‌లో 1.50 లక్షల ఎకరాలకు మొత్తంగా 2,30,000 ఎకరాలకు సాగునీరు రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటి అవసరం రెండు ప్రాజెక్టులకు కలిపి 2,000 కోట్ల వ్యయ అంచనా -
మహిళ ప్రాణం తీసిన ‘చెత్త’ పనులు..!
సాక్షి, సంగారెడ్డి: నారాయణ్ ఖేడ్ మున్సిపల్ అధికారుల నిర్వాకం ఓ మహిళ మృతికి కారణమైంది. ఇంటిపన్ను కట్టలేదని ఓ ఇంటి ముందు నారాయణ్ ఖేడ్ పురపాలక సంఘం అధికారులు నాలుగు రోజుల క్రితం చెత్త వేశారు. దీంతో ఇంటి యజమానురాలు భూమవ్వ (58) తీవ్ర మనస్తాపం చెందారు. ఈరోజు (ఆదివారం) ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జోగిపేట్ వద్దకు చేరుకోగానే ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు విడిచింది. అధికారుల మితిమీరిన చర్యల వల్లే భూమవ్వ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, స్థానికుల కథనం మాత్రం భిన్నంగా ఉంది. ఈనెల 15 న భూమవ్వ ఇంటి ముందు చెత్త వేసిన మున్సిపల్ అధికారులు 17న తొలగించారని వారు తెలిపారు. -
వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు
సాక్షి, సంగారెడ్డి : లాక్డౌన్ సమయంలో సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం వివాదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సురేష్ షెట్కార్, సంజీవరెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా, పోలీస్టేషన్‌ను పార్టీ కార్యాలయంగా మార్చారని మండిపడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నారాయణ్ ఖేడ్‌లో భూపాల్‌రెడ్డి ఘనంగా పుట్టిన రోజు వేడుకులను జరిపారని ఆరోపిస్తున్నారు. దీనికి వందల మంది అతిథులు హాజరయ్యారని, బర్త్ డేకు వచ్చిన వారంతా ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారని విమర్శించారు. దీనిపై వారు హైకోర్టును సైతం ఆశ్రయించారు. (దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి) మరోవైపు భూపాల్‌రెడ్డి పుట్టినరోజుకు సంబంధించి స్థానిక ఓ విలేఖరి వార్తను ప్రచురించినందుకు ఎమ్మెల్యే అనుచరులు అతనిపై దాడికి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని వార్తను రాసినందుకు ఆ విలేఖరి ఇళ్లును కూల్చివేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ఓ జాతీయ మీడియా సంస్థ వార్తను ప్రచురించడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ఇంటిని అక్రమ కట్టడంగా భావించి జర్నలిస్ట్‌పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆదేశాలతో ఇంటిని కూల్చి వేశారని ఆ పత్రిక పేర్కొంది. ఇక తాజా వివాదంపై నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్పందించారు. తన పుట్టిన రోజు నాడు అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించారని తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్నందున జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ‘ఆరోజు నా శ్రేయోభిలాషులు నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ , రక్త దానం చేశారు. అందులోనూ భౌతిక దూరం పాటించారు. కావాలనే కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకొని ప్రసారం చేయాలి. కాంగ్రెస్ నేతలు హైకోర్టులో వేసిన కేసు నిలువదు’ అని చెప్పుకొచ్చారు. -
మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
నారాయణఖేడ్: హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావద్దంటూ మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని సత్తెగామ ప్రజలు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెగామకు చెందిన కుమ్మరి కిష్టయ్య (52) కుటుంబంతో కలసి 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. ఆయన అనారోగ్యానికి గురవడంతో 4 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పరిస్థితి విషమించి మంగళవారం మరణించాడు. దీంతో బంధువులు కిష్టయ్య మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తెగామకు తీసుకు వచ్చి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్సలు చేస్తున్నందున అక్కడి నుంచి కిష్టయ్య మృతదేహాన్ని తీసుకువస్తే తమకు ప్రమాదమని, మృతదేహాన్ని తీసుకురావద్దంటూ గ్రామస్తులు ఊరి శివారులోని పాఠశాల వద్ద వాహనానికి అడ్డుగా రాళ్లువేసి అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతదేహాన్ని నేరుగా తీసుకెళ్లి వారి వ్యవసాయ భూమి వద్ద అంత్యక్రియలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేశారు. మా ఊరికి రావొద్దు..! రేగోడ్ (మెదక్): కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. ఎక్కడ.. ఎలా.. ఎవరి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఏకంగా అరవైమంది కొత్త వ్యక్తులు రావడంతో.. ఆ ఊరివారు తమ గ్రామానికి రావొద్దని.. అపరిచిత వ్యక్తులను అడ్డుకున్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని ఆర్.ఇటిక్యాలలో ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు అరవై మంది నాలుగు వాహనాల్లో ఆర్.ఇటిక్యాలకు వచ్చారు. దీంతో గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. వారంతా ఇటీవల సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో వివిధ పనుల నిమిత్తం వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో వారి సొంతూళ్లకు వెళ్లాలని వట్పల్లిలో ప్రజలు పంపిస్తే వారంతా ఆర్.ఇటిక్యాలకు చేరుకున్నారు. గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో వారిని ఊర్లో ఉండకూడదని, వారి స్వస్థలాలకు వెళ్లాలంటూ పంపించామని సర్పంచ్ సుంకె రమేశ్ తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ వారితో మాట్లాడి కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
కాంగ్రెస్ వాట్సాప్‌లో టీఆర్ఎస్, బీజేపీల ప్రచారం
నారాయణఖేడ్: మున్సిపోల్స్ ప్రచారానికి కాంగ్రెస్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల ప్రచారం ఆశ్చర్య పరుస్తుంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కోసం కాంగ్రెస్ ‘మున్సిపల్ కాంగ్రెస్ ఎన్‌కేడీ’అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఈ గ్రూప్‌నకు ‘ఇన్వైట్ లింక్’ ఇవ్వడంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు, నేతలు సైతం యాడ్ అయ్యారు. ఆపై తమ పార్టీకి ఓటేయాలనే ప్రచార చిత్రాలను పోస్ట్ చేశారు. టీఆర్ఎస్కు ఓటేయాలని వీడియోలు, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బీఫారాలు ఇచ్చే ఫొటోలు, టీఆర్ఎస్ అభ్యర్థి ఫొటోలు పోస్ట్ చేశారు. అలాగే బీజేపీకి ఓటేయాలంటూ ఆ పార్టీ అభిమాని సైతం వీడియోను పోస్ట్ చేశారు. -
నాడు నాన్న.. నేడు అమ్మ
సాక్షి, కల్హేర్(నారాయణఖేడ్): నాడు నాన్న చనిపోయాడు.. నేడు అనారోగ్యంతో తల్లడిల్లుతున్న తల్లి మరణించడంతో వారి కొడుకు నవీన్(17) అనాథగా మారాడు. మంగళవారం కల్హేర్ మండలం మార్డిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరుడి సాయిలు, నీరుడి విఠ్ఠమ్మ దంపతులకు.. ఇద్దరు సంతానం. కూతురు చిట్టమ్మ, కుమారుడు నవీన్ ఉన్నారు. సాయిలు 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. కూతురు చిట్టమ్మ వివాహం ఇటీవలే నారాయణఖేడ్ మండలం కొత్తపల్లికి చెందిన ఓ వ్యక్తితో జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భర్తతో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి చిట్టమ్మ పుట్టింట తల్లి విఠ్ఠమ్మ వద్ద ఉండేది. చిట్టమ్మ రెండు నెలల క్రితం పురిటి నొప్పులు తాళలేక మృతి చెందింది. దీంతో ఇంట్లో తల్లి నీరుడి విఠ్ఠమ్మ(45)కు కుమారుడు నవీన్ ఒక్కడే తోడుగా మిగిలాడు. అనారోగ్యంతోపాటు మానసిక క్షోభతో విఠ్ఠమ్మ మంగళవారం మృతిచెందింది. దీంతో నవీన్ అనాథగా మిగిలాడు. తల్లి అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో పడిపోయాడు. విఠ్ఠమ్మ దూరం కావడంతో గ్రామస్తులు చలించిపోయారు. వారు చందాలు వేసి విఠ్ఠమ్మ అంత్యక్రియల కోసం రూ. 11,500 నగదు సహాయం అందజేశారు. తల్లి విఠ్ఠమ్మ మృతదేహం వద్ద నవీన్ -
పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..
సాక్షి, నారాయణఖేడ్: నకిలీ ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని మంజూరు చేయించుకున్న కేసులో శుక్రవారం ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి శుక్రవారం నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో వవరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖేడ్ మండలం కొండాపూర్ తండాలో కల్యాణలక్ష్మి పథకంలో అవకతవకలు జరిగాయని తండాకు చెందిన రాంచందర్ ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఖేడ్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ విచారణ జరిపడంతో వాస్తవం బయటపడింది. ఈమేరకు తహసీల్దార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్‌లకు చాలా ఏళ్ల క్రితం వివాహాలు జరిగాయి. ఈ మధ్యనే వివాహాలు జరిగినట్లు ఫొటోలు, నకిలీ ఆధార్‌కార్డులు, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాలను సృష్టించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ విచారణ జరపకుండా ధ్రువీకరించడంతో ఇద్దరికి కల్యాణలక్ష్మి పథకం కింద చెరో రూ.1,00,116 మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల జాబితాను కొండాపూర్ తండాలో అతికించడంతో ఇద్దరు తమ తండావాసులే కాదని రాంచందర్ అనే వ్యక్తి గుర్తించి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్, వారి భార్యలు కవిత, తారాబాయి, నెహ్రూనాయక్ అత్త కొండాపూర్ తండాకు చెందిన దేవులీబాయితోపాటు తారాసింగ్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిలో దేవిదాస్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. సమావేశంలో ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. -
మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్
జోగిపేట (అందోల్): ‘ఆర్టీసీ సమ్మె ముగియకుంటే మా జీవితాలు ముగిసినట్లే. నా భర్త ఉద్యోగానికి వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. సీఎం సారూ.. కనికరిస్తే బాగుండు. సమ్మె కారణంగా ఆందోళనతో నా భర్త మతి స్థిమితితం కోల్పోయాడు. కడుపునిండా తిని 20 రోజులయ్యింది’అంటూ ఆర్టీసీ కండక్టర్ నాగేశ్వర్ (45) భార్య సుజాత కన్నీటి పర్యాంతమవుతూ తమ కష్టాలను వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ నాగేశ్వర్ జోగిపేటకు చెందిన సుజాతను 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ప్రతి రోజు సంగారెడ్డి డిపో వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇటీవల ప్రభుత్వం కార్మికులు విధుల్లో చేరాలని నిర్ణయించిన డెడ్‌లైన్‌ను టీవీలో చూసినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో సుజాత తన తల్లి నివాసం ఉండే జోగిపేటకు భర్తతో కలసి వచ్చింది. మూడు, నాలుగు రోజులనుంచి నాగేశ్వర్ టికెట్.. టికెట్.. బస్ ఆగింది దిగండి.. రైట్ రైట్ అంటూ అరవడం, అసందర్భంగా నవ్వుతుండటం, ఫోన్ రాకున్నా హాలో.. హాలో అనడం, ఎవరు చేశారని ఎవరైనా అడిగితే అశ్వత్థామ.. అని సమాధానం ఇస్తున్నాడు. ఒక్కోసారి ఉండండి.. డిపోలో కలెక్షన్ కట్టివస్తా .. అని కూడా అంటున్నాడని భార్య సుజాత ఆందోళన వ్యక్తం చేసింది. తనను, పిల్లలను కూడా గుర్తు పట్టడంలేదని తెలిపింది. తమకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, జీతం రాక ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో చదువులను మధ్యలోనే మాన్పించేసినట్లు ఆమె చెప్పింది. నాగేశ్వర్ రాత్రంతా నిద్రపోకుండా ఏదో ఒకటి మాట్లాడుతుండడంతో భర్త ప్రవర్తనను చూసి సుజాత కన్నీరు మున్నీరవుతూ జాగారం చేస్తుండగా, కొడుకులు కూడా తల్లిదండ్రుల బాధను చూసి వారు కూడా నిద్రకు దూరం అవుతున్నారు. చేతిలో డబ్బులు లేవని, తన భర్తకు చికిత్స అందించేందుకు దాతలు సాయం చేయాలని సుజాత వేడుకుంటోంది. ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే సమ్మెలో ఉన్న ఉన్నవారికి చికిత్స చేయమంటూ వెళ్లగొట్టారని తెలిపింది. వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో దేవుడి మీద భారం వేసి అలాగే ఉన్నట్లు తెలిపింది. కాగా, నాగేశ్వర్‌కు చికిత్స చేయించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. (చదవండి: చలో ట్యాంక్‌బండ్ మరో మిలియన్ మార్చ్) -
ధార లేని మంజీర
సాక్షి, నారాయణఖేడ్: జిల్లా జీవ నది మంజీర ఇంకా వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా నదిలో నీటి జాడలే లేవు. ఇప్పటికే నీటితో కళకళలాడాల్సిన నదిలోకి నీరు రాకపోవడంతో జిల్లావాసులు కలవర పడుతున్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా మంజీరా నదిలో ఆ జాడలు మాత్రం కానరావడం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నా దానికి ఉప నదిగా ఉన్న మంజీరలో మాత్రం నీరే లేదు. గత ఏడాది ఈ సమయం వరకే మంజీరా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఎండిపోయే కన్పిస్తోంది. కర్ణాటకలో నెల క్రితం కురిసిన భారీ వర్షంతో మంజీరా నదిలోకి వరద వచ్చింది. అప్పటికే వేసవి కాలంలో నది పూర్తిగా ఎండిపోయి ఉండడంతో వచ్చిన వరద నీరు కాస్త భూమిలోకి ఇంకిపోయింది. నది తిరిగి యథా పరిస్థితికి వచ్చి చేరింది. కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ప్రవహించే మంజీరా నది జిల్లాలోని నాగల్గిద్ద మండలం గౌడ్‌గాంజన్‌వాడ వద్ద ప్రవేశిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నది ప్రవేశ ప్రాంతం నుండి ఎక్కడా నీరు రాలేదు. కర్ణాటక రాష్ట్రంలో కురిసే భారీ వర్షాలు, వరదలతో నదిలోకి నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతంలో కూడా వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కర్ణాటకలో కురిసిన వర్షం వల్ల మంజీరాకు ఎగువన బీదర్ జిల్లా హుమ్నాబాద్ ప్రాంతంలో ఉన్న కరంజా ప్రాజెక్టులోకి కొంత నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నుండి నీటిని కిందకు వదలడం లేదు. కరంజా ప్రాజెక్టులోకి భారీగా వరదలు వచ్చి చేరినప్పుడే ఈ ప్రాజెక్టు నుండి దిగువకు వరద నీరు వదిలే అవకాశం ఉంది. అప్పుడే నదిలోకి నీరు వస్తుంది. మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.91టీఎంసీలు కాగా ఇప్పటివరకు ప్రాజెక్టులో ఉన్న నీరు 0.44 టీఎంసీలు మాత్రమే. తాగునీటికి కష్టకాలమే.. మంజీరాపై ఆధారపడి నారాయణఖేడ్‌తోపాటు జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల నీటి పథకాలు పని చేస్తున్నాయి. నదిలో నీరు లేని కారణంగా మూడు నెలలుగా నీటి పథకాలు వట్టిపోయాయి. రెండు నెలల క్రితం వరకు సింగూరు సమీపంలోని పెద్దారెడ్డిపేట్ నుండి నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, మెదక్ నియోజకవర్గాలకు కలిపి మిషన్ భగీరథ అధికారులు 953 గ్రామాలకు తాగునీటిని అందించారు. రెండు నెలలుగా ప్రాజెక్టులో చుక్కనీరు లేని కారణంగా నీటి పథకాలన్నీ వృథాగానే మారాయి. ఫలితంగా వందల గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. చాలా గ్రామాల్లో బోర్లను కిరాయికి తీసుకోవడం, ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు. ఈ నీరు కూడా గ్రామీణులకు అవసరమైన మేర సరిపోవడం లేదు. వృథాగా నీటి పథకాలు.. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీర నది నుండే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్ఏపీ పథకం ఫేజ్ 1 కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 40 గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లోని 66 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్‌టెక్ వెల్లు అన్నీ మంజీర నదిపైనే ఉన్నాయి. నది ఎండిపోవడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్ ఇస్తున్నాయి. జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్‌టెక్ వెల్లు కూడా మంజీర నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీరు ఎండిపోయింది. నది ఎండడంతో బోర్లు కూడా ఎండిపోయి గ్యాప్ ఇస్తున్నాయి. -
3 రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం జహీరాబాద్
రాష్ట్రంలోని ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి లేని విధంగా విభిన్న సంçస్కృతులు, ఆచారాలు, వ్యవహారాలు, భాషల సమ్మిళితం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సరిహద్దుగా కర్ణాటక, మహారాష్ట్ర ఉండడంతో ఆయా రాష్ట్రాల ఆచార వ్యవహారాలు ఈ ప్రాంతం పరిధిలో మిళితమై ఉన్నాయి. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాలకు కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గానికి మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల్లో కన్నడ భాష మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. పలు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. దీంతో జుక్కల్‌లో మరాఠీ భాషను మాట్లాడే వారు అధికంగా ఉన్నారు. సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మరాఠీ భాష పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక కామారెడ్డి నియోజకవర్గంలో కరీంనగర్ యాసతో కూడిన భాషను మాట్లాడతారు. బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడే కోస్తాంధ్రా వారూ ఉన్నారు. ఆచారాలు అనేకం.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, లింగాల మండలాల్లో గిరిజనులు అధికం. ఆయా మండలాల్లో లంబాడీ భాషను అధికంగా మాట్లాడతారు. గాంధారిలో మథురాల తెగ కూడా ఉంది. ఈ ప్రాంతాల్లో గిరిజన సంస్కృతి ఎక్కువ. అంతేకాక జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా లింగాయత్ సామాజిక వర్గం వారు ఉన్నారు. దీంతో బసవేశ్వరుడి ఆచార వ్యవహారాలు అధికంగా ఉంటాయి. ముస్లిం మైనార్టీలు సైతం జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో చెరకు, వరి, అల్లం, ఆలుగడ్డ, జొన్న, కంది, మినుము, పెసర, పత్తి, గోధుమ తదితర పంటలను ప్రధానంగా సాగు చేస్తారు. జీవన వైవిధ్యం.. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాల్లో తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఆచార వ్యవహారాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కట్టూబొట్టూ దగ్గరి నుంచి సంస్కృతీ సంప్రదాయాల వరకు అన్నింటా ఇక్కడ జీవన వైవిధ్యం కనిపిస్తుంది. జహీరాబాద్ లోక్‌సభ స్థానం 2008లో ఆవిర్భవించింది. దీనికి ముందు జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, అందోల్ నియోజకవర్గాలు మెదక్ లోక్‌సభ పరిధిలో ఉండేవి. జహీరాబాద్ లోక్‌సభ ఆవిర్భావంతో జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, అందోల్‌తో పాటుగా ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఈ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. జహీరాబాద్ ప్రాంతంపై బీదర్ ప్రభావమూ ఎక్కువ ఉంటుంది. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాల వారు ఎక్కువగా పనులపై కర్ణాటక, మహారాష్ట్రలోని పట్టణాలకే వెళ్లి వస్తుంటారు. నారాయణ్‌ఖేడ్‌లో మహారాష్ట్ర సంప్రదాయాలు అధికంగా కనిపిస్తాయి. ఇక్కడ గల పండరి భక్తులు వేల మంది ఏటా పండరినాథుని దర్శనానికి కాలినడకన ‘దండుయాత్ర’గా మహారాష్ట్రలో గల పండరి క్షేత్రానికి వెళ్తుంటారు. ఆధ్యాత్మిక పాలు కూడా ఈ ప్రాంతాల ప్రజల్లో ఎక్కువ. నిత్యం సప్తాహాలు, భజనలు వంటివి జరుగుతుంటాయి. ఇక్కడ కనిపించే ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు తలపై టోపీలతో మహారాష్ట్ర ఆచార వ్యవహారాలను తలపిస్తారు....::: దివాకర్ రెడ్డి కొలన్, సంగారెడ్డి -
పురాతన బావిలో మంటలు..
సాక్షి, నారాయణఖేడ్: ప్రమాదశాత్తు పురాతన బావిలో అగ్నిప్రమాదం సంభవించగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. ఈ ప్రమాదం పట్ల పట్టణవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన హనుమాన్ కాలనీలోని హనుమాన్ ఆలయం వద్ద పురాతన బావి ఉంది. చాలా కాలంగా బావిని ఉపయోగించకపోడంతో చెత్తా, చెదారం వేస్తుండడంతో బావిలో చెత్త నిండిపోయింది. గురువారం మధ్యాహ్నం బావిలో ఎవరూ మంటలు అంటించారో తెలీదు కానీ ఒక్కమారుగా మంటలు అంటుకున్నాయి. ఈ బావి పక్కనే ఓ ప్రధాన బ్యాంకు, హనుమాన్ ఆలయం, మరో వైపు పెట్రోల్‌బంక్, చుట్టూ నివాసగృహాలు ఉన్నాయి. ప్రమాదం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని స్థానికులు అగ్నిమాపకకేంద్రం అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
టీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/హైదరాబాద్: నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయింపు వ్యవహారంలో తలెత్తిన అసమ్మతికి టీఆర్ఎస్ చెక్ పెట్టింది. పార్టీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాములు నాయక్ ఖండించారు. ఓ దశలో కంటతడి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను గత నెల మొదటి వారంలో విడుదల చేసిన టీఆర్ఎస్... నారాయణఖేడ్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేరును మరోమారు ఖరారు చేసింది. అయితే భూపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని రాములు నాయక్ వ్యతిరేకించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని మార్చాలంటూ తన వర్గానికి చెందిన కొందరు నేతలతో కలసి ప్రత్యేక సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించారు. అలాగే నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాములు నాయక్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దాదాపు పక్షం రోజులుగా రాములు నాయక్‌తో పార్టీ అధిష్టానం మంతనాలు జరుపుతోందని, త్వరలో ఖేడ్‌లో తలెత్తిన అసమ్మతి సమసిపోతుందని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ రాములు నాయక్‌ను పార్టీ సస్పెండ్ చేయడంతో అయన అనుచరుల రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. కుంతియాతో భేటీయే కారణం? గతంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి రాములు నాయక్ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాములు నాయక్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన నారాయణఖేడ్ లేదా బోథ్ స్థానాల నుంచి టికెట్ ఆశించినట్లు సమచారం. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రాములు నాయక్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాములు నాయక్ కోరినట్లు ప్రచారం జరగ్గా దీన్ని ఆయన ఖండించారు. తన మిత్రుడిని కలవడానికే హోటల్‌కు వెళ్లినట్లు ఆదివారం రాత్రి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం రాములు నాయక్‌ను టీఆర్ఎస్ సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కొంతకాలంగా రాములు నాయక్ వర్గం పేరిట అసమ్మతి రాగం వినిపిస్తున్న కంగ్టి ఎంపీపీ రామారావు రాథోడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాములు నాయక్ వెంట నడుస్తూ వస్తున్న కంగ్టి జెడ్పీటీసీ సభ్యుడు రవి కుమార్, మల్శెట్టి యాదవ్ తదితరులు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. రాములు నాయక్ అనుచరుల్లో కొందరిని మంత్రి హరీశ్‌రావు ఇటీవల బుజ్జగించినట్లు సమాచారం. రాములు నాయక్ సస్పెన్షన్ వ్యవహారం నియోజకవర్గంలో కాస్త రాజకీయ వలసలకు దారితీస్తుందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ: రాములు నాయక్ టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని.. ఆ పార్టీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. టీఆర్ఎస్ తనపై సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేయడంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ నిర్మాణంలో ప్రతి రాయిపైనా తన పేరు ఉందన్నారు. తెలంగాణ ద్రోహి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరుతో తనను సస్పెండ్ చేయించడం చూసి బాధపడుతున్నానన్నారు. ‘టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ నన్ను సస్పెండ్ చేస్తే గర్వపడేవాడిని. 2004, 2009, 2014, 2018లో టికెట్ అడిగా. అధిష్టానం ఇవ్వకపోపోయినా పార్టీ మారలేదు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికయ్యా. గిరిజనుల రిజర్వేషన్లు అడిగినందుకే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీఆర్ఎస్కు సేవ చేసినందుకు, గిరిజన రిజర్వేషన్లు ఇవ్వాలని అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసారా? గిరిజన మేధావులతో త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. నా జాతి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నేను ఎన్నికల్లో పోటీ చేయను. నాలాగా బాధపడుతున్న వాళ్లు టీఆర్ఎస్లో చాలా మంది ఉన్నారు. వాళ్లంతా ఏదో ఒకరోజు బయటకు వస్తారు’అని రాములు నాయక్ చెప్పారు. కేసీఆర్ చెప్పిన గిరిజన పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అతీగతీ లేదని, గిరిజనులను టాటా బిర్లా చేస్తామని ఈ నాలుగేళ్లలో బికారీలను చేశారని మండిపడ్డారు. ఒక్కరోజూ తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్లో ఉన్నారని, ఉద్యమ సమయంలో విద్యార్థులు తరిమికొట్టిన వారిని మంత్రి కేటీఆర్ తన కారులో తిప్పుకుంటూ వాళ్ల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేస్తున్నారని విమర్శించారు. స్నేహితులను కలిసేందుకే గోల్కొండ హోటల్‌కు వెళ్లానని, కుంతియాను కలవలేదని, అక్కడ రేవంత్, మధు యాష్కీ తనకు యాదృఛికంగా తారసపడ్డారనని రాములు నాయక్ చెప్పారు. -
వానరానికి అంత్యక్రియలు
కల్హేర్(నారాయణఖేడ్) : మండలంలోని కృష్ణపూర్ శివారులోని పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన వానరానికి గ్రామానికి చెందిన యువకులు దత్తు, గోపాల్ మానవత్వంతో అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు చేపట్టిన యువలకులను గ్రామస్తులు అభినందించారు. -
ఎదురెదురుగా ఢీకొన్న మోటారు సైకిళ్లు
నారాయణఖేడ్: ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నారాయణఖేడ్ మండలంలోని అంత్వార్ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అంత్వార్ గ్రామానికి చెందిన సంగ్‌శెట్టి(41), మంజుల(16) ద్విచక్ర వాహనంపై నారాయణఖేడ్ వస్తున్నారు. రేగోడ్ మండలం దోసపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్(22) నారాయణఖేడ్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై అంత్వార్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అంత్వార్ సమీపంలో ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంగ్‌శెట్టి కాలు విరగగా మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు తగిలాయి. 108 అంబులెన్స్‌లో ఖేడ్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ నరేందర్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
ఆరు కిలోల ఎండు గంజాయి పట్టివేత
నారాయణఖేడ్: మండలంలోని అనంతసాగర్ గ్రామంలో కుమ్మరి పుండ్లిక్ ఇంటిపై దాడి చేసి ఆరు కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన కుమ్మరి పుండ్లిక్ ఇంటిపై దాడి చేసినట్లు తెలిపారు. అతడి ఇంటిలో ఆరు కిలోల 100 గ్రాముల ఎండుగంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు న మోదు చేసినట్లు చెప్పారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కేసును ఖేడ్ ఎక్సైజ్ సీఐ మహేష్, ఎస్ఐ కిరణ్‌కుమార్ గౌడ్లకు అప్పగించామని సీఐ వివరించా రు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుళ్లు అలీం, సిద్ధయ్య, జాకబ్, సోమయ్య పాల్గొన్నారు. -
దళారులకే ‘మద్దతు’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 52వేల ఎకరాల్లో కంది పంటను సాగు చేయగా, 15,277 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కంది దిగుబడులు మార్కెట్లకు పోటెత్తుతుండగా.. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.3,600 నుంచి రూ.4,500 వరకు చెల్లిస్తున్నారు. కంది రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించి.. ఇప్పటి వరకు 7,400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో తెల్లాపూర్, సదాశివపేట, జహీరాబాద్, ఇప్పపల్లి, న్యాలకల్, ఝరాసంగం, నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, వట్పల్లి, రాయికోడ్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కందుల కొనుగోలు జరుగుతోంది. రెవెన్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా నంబరు జిరాక్స్ కాపీతో వచ్చే రైతుల నుంచి మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో కందులు తీసుకుంటారు. కనీసం 12శాతం లోపు తేమ ఉన్న శాంపిళ్లను తెచ్చే రైతులకు మాత్ర మే తేదీల వారీగా టోకెన్లు జారీ చేస్తున్నా రు. టోకెన్లపై ఉన్న తేదీల్లో వచ్చే రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు కందులు సేకరించాల్సి ఉంటుంది. అక్రమాలకు సరి‘హద్దు’ లేవీ? నారాయణఖేడ్, కంగ్టి, మనూరు, నాగల్గిద్ద, జహీరాబాద్, న్యాల్కల్ తదితర మండలాలకు సరిహద్దులో ఉన్న కర్ణాటక నుంచి కందులు అక్రమ మార్గాల్లో జిల్లాలోకి తరలివస్తున్నాయి. గతంలో జిల్లాకు చెందిన సరిహద్దు ప్రాంత రైతులు బీదర్ ప్రాంతంలో శనగలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునేవారు. ప్రస్తుతం కర్ణాటకలో కంది కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, బీదర్ ప్రాంతంలో కంది ధర క్వింటాలుకు రూ.3,500కు మించి పలకడం లేదు. దీంతో దళారులు కొందరు కర్ణాటకలో పండించిన కందులను సరిహద్దు గ్రామాల్లోకి చేరవేస్తున్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా సాగు ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారు. మరోవైపు దళారులకు మార్క్‌ఫెడ్ యంత్రాంగం సహకరిస్తూ టోకెన్లు జారీ చేస్తోంది. కళ్లముందే పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న కందులు కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్ తీరుతో స్థానిక రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలో అంచనా వేసిన కంది దిగుబడిలో సగం మేర కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ లెక్కలు చెప్తోంది. రైతులు మాత్రం ఇంకా దిగుబడులు వస్తున్న దశలోనే.. దళారుల నుంచి కొనుగోలు చేస్తే .. కోటా ముగిసిందనే నెపంతో కేంద్రా లు మూసివేసే అవకాశం ఉందని ఆందో ళన చెందుతున్నారు. చెక్‌పోస్టులు కనిపించవెందుకని? కర్ణాటక నుంచి అక్రమంగా తరలివస్తున్న కందులను ఇటీవల కంగ్టి రెవెన్యూ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఇటీవల నారాయణఖేడ్ నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్‌రావు ఆదేశిం చారు. ఇప్పటి వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు కాక పోగా, రోడ్డు మార్గంపై నిఘా ఉంటుందనే ఉద్దేశంతో దళారులు రూటు మార్చారు. కారాముంగి, గౌడ్గావ్ జనవాడ, తోర్నాల్, ఎన్జీ హుక్రానా తదితర చోట్ల మంజీరా నదిలో పుట్టి మార్గంలో కందులు వస్తున్నాయి. కంగ్టిలో దళారులదే రాజ్యం కంగ్టిలో జనవరి 21న కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలివస్తున్నాయి. దళారీలకు సహకరించేలా మార్క్‌ఫెడ్ కృత్రిమంగా బార్దాన్ (గోనె సంచులు) కొరత సృష్టిస్తోంది. టోకెన్ల కోసం రైతులు పడిగాపులు పడుతున్నా.. దళారీలకు మాత్రం గంటల వ్యవధిలోనే టోకెన్ల జారీ, తూకం వేయడం జరుగుతోంది. రెవెన్యూ అధికారులు సాగు విస్తీర్ణంపై ఎలాంటి విచారణ జరపకుండానే టోకెన్లపై సంతకాలు చేస్తూ దళారీలకు సహకరిస్తున్నారు. గత ఏడాది దాదాపు 80 రోజులు కొనసాగిన కొనుగోలు కేంద్రంలో 37 వేల క్వింటాళ్లు సేకరించగా.. ప్రస్తుతం కేంద్రం ప్రారంభమైన పది రోజుల్లోనే 11 వేల క్వింటాళ్లు తూకం వేశారు. 50 బస్తాల కందులు పట్టివేత నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లోని కందుల కొనుగోలు కేంద్రానికి వ్యాపారులు తెచ్చిన 50 బస్తాల కందులను మార్క్‌ఫెడ్ అధికారులు సోమవారం పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్ డీఎం ఇంద్రసేన విలేకరులతో మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌లోని కొనుగోలు కేంద్రానికి గుర్తుతెలియని వ్యాపారులు రెండు రోజుల క్రితం 50 బస్తాల కందులు తెచ్చారని, తమకు అందిన సమాచారం మేరకు బస్తాలను సీజ్‌చేసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం రైతులు సాగుచేసిన పంటను మాత్రమే అధికారులు ధ్రువీకరణ ప్రకారం కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం విఠల్‌రెడ్డి, రాజారెడ్డి అనే వ్యక్తులు 85బస్తాల కందులను అమ్మారని, ఇవి కూడా రైతులవి కాదని తమకు ఫిర్యాదు అందిందన్నారు. కొనుగోలు చేసిన కందులకు సంబంధించి డబ్బులు వారి ఖాతాల్లో పడకుండా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కాకుండా వ్యాపారులు తీసుకువస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు తీసుకున్న టోకెన్ ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఎకరాకు 4క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చిందని వ్యవసాయ అధికారులు నివేదించారన్నారు. ఈ లెక్కన 4క్వింటాళ్ల కంటే ఎక్కువ తీసుకు వస్తే వీఆర్వో ధ్రువీకరణ కాకుండా వ్యవసాయ అధికారి ధ్రువీకరణ అవసరమని స్పష్టం చేశారు. దళారులకే ప్రాధాన్యం.. కందుల కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను తెచ్చి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అధికారులు ముందుగా వ్యాపారులు, దళారులు తెచ్చిన కందులు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. – రవి, రైతు, పైడిపల్లి పట్టించుకోవడం లేదు.. రెండు క్వింటాళ్ల కందులు మనూరు కొనుగోలు కేంద్రానికి తెచ్చి రెండు రోజులు అవుతోంది. అధికారులు టోకెన్ ఇచ్చినా కందులు కొనడంలేదు. బీదర్ నుంచి దళారులు, వ్యాపారుల కందులను మాత్రం కొంటున్నారు. రైతులను పట్టించుకోవడంలేదు. – సాలె నారాయణ, రైతు, మనూరు ధ్రువీకరణ పత్రాలు తెస్తేనే.. రైతులు తెచ్చే శాంపిళ్లలో 12 శాతం లోపు తేమ ఉంటేనే టోకెన్లు జారీ చేస్తున్నాం. రెవె న్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, పట్టాదారు పాసుపుస్తకం నకలు కాపీలు ఉంటేనే కొనుగోలు చేస్తున్నాం. కం దుల కొనుగోలులో అవకతవకల కు తావు లేకుండా పారదర్శకంగా కొనుగో లు చేస్తున్నాం. త్వరలో శనగ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు అనుమతి వచ్చింది. – ఇంద్రసేన్, డీఎం, మార్క్‌ఫెడ్ తనిఖీలు ముమ్మరం చేశాం పొరుగు రాష్ట్రం నుంచి కందులు అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు రెవెన్యూ, వ్యవసాయ మార్కెటింగ్ విభాగాలకు ఆదేశాలు జారీ చేశాం. కర్ణాటక సరిహద్దుల్లో మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశాం. కంగ్టిలో అక్రమంగా తరలిస్తున్న కందులను సీజ్ చేసి, కేసు నమోదు చేశాం. అక్రమాలకు పాల్పడే ప్రభుత్వ సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం. – డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జేసీ అధికారుల అండతోనే.. రెవెన్యూ అధికారుల అండతోనే అక్రమంగా వస్తున్న కందుల కొనుగోలును మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ, మార్క్‌ఫెడ్ సిబ్బంది కుమ్మక్కై స్థానిక రైతులకు అన్యాయం చేస్తున్నారు. మేము టోకెన్ల కోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా.. దళారీల సరుకు మాత్రం ఉదయం, సాయంత్రం విరామం లేకుండా తూకం వేస్తున్నారు. హమాలీల దోపిడీ కూడా భారీగానే ఉంది. రైతులు తెచ్చిన ధాన్యంలో తూకం పేరిట కింద పడేస్తూ.. రోజూ క్వింటాళ్ల కొద్దీ పోగు చేసి అమ్ముకుంటున్నారు. – సంగారెడ్డి, రైతు, మనూరు -
రైతుల ఆందోళన
నారాయణఖేడ్: కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆశయంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అధికారులు కుంటిసాకులతో కొనుగోలు చేయడంలేదని ఆరోపిస్తూ.. క్రవారం నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివారులోని మార్కెట్ యార్డు వద్ద ప్రధాన రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. నారాయణఖేడ్–హైదరాబాద్ రాహదారిపై రైతులు బైఠాయించారు. కొందరు రోడ్డుపైనే భోజనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మినుములు కొనుగోలు చేసేందుకు నారాయణఖేడ్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేదన్నారు. పెసర్లు, మినుములు కొనుగోళ్లకు ఒకే అధికారిని నియమించారన్నారు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆరోపించారు. నిబందనల ప్రకారం 12 శాతంలోపు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని తెలుపుతున్నప్పటికీ కొందరి రైతుల నుంచి అధిక శాతం తేమ ఉన్నా కొనుగోలు చేశారని కంగ్టికి చెందిన రైతు భూంరెడ్డి, ముబారక్‌పూర్‌కు చెందిన రైతు రాములు, చుక్కల్‌తీర్థ్‌కు చెందిన రైతు దిగంబర్‌రావు ఆరోపించారు. మార్కెట్ యార్డు వద్ద కనీస సౌకర్యాలు లేవన్నారు. టోకెన్ల ఆధారంగా అర్హులైన రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఆర్ఐ నారాయణ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. పెసర్లను తేమ శాతం అధికంగా ఉందని కొనుగోలు చేయకపోవడంతో మనూరు మండలం దుదగొండ గ్రామానికి చెందిన రైతు దావిద్ కంట తడిపెడుతూ ఆటోలో తీసుకెళ్లాడు. రైతుల ఆందోళనకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్యం సంఘీభావం తెలిపారు. -
ఆర్టీసీ డిపో మేనేజర్ ఆత్మహత్య
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ మంగళవారం ఉదయం రోడ్డుపై శవమై కనిపించారు. ఆయన పక్కనే పురుగుల మందు డబ్బా కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మహేందర్ రెండు రోజులుగా సెలవులో ఉన్నారు. కరీంనగర్-2 డిపోలో పనిచేసి పదోన్నతిపై మే నెలలో నారాయణ ఖేడ్ కు వచ్చారు. సోమవారం కరీంనగర్ నుంచి వచ్చిన ఆయన తన జీపు డ్రైవర్‌కు కొడుకు ఫోన్ నెంబరు ఇచ్చారని, మధ్యాహ్నం డిపో అసిస్టెంట్ మేనేజర్‌కు తన సెల్‌ఫోన్ అప్పగించాడని చెబుతున్నారు. ఈ ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మహేందర్ రోడ్డుపై పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డిపో అసిస్టెంట్ మేనేజర్ ద్వారా మహేందర్ గా గుర్తించారు. అతని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మహేందర్ స్వస్థలం కరీంనగర్. -
జూదం ఆడం, మద్యం అమ్మం
నారాయణఖేడ్ : గ్రామంలో జూదం ఆడమని మండలంలోని గంగాపూర్ వాసులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో ఎవ్వరం జూదం ఆడమని, జూదం కొనసాగకుండా చూస్తామని తెలిపారు. దీంతో పాటు గ్రామంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేదించారు. ఏ దుఖాణాల్లోనూ మద్యంను విక్రయించమని సూచించారు. గ్రామంలోని కిరాణ దుఖాణాలు, హోటళ్ళ యజమానులు సైతం హాజరై తమ తమ వ్యాపారాల్లో మద్యంను విక్రయించమని తెలిపారు. దీంతో పాటు గ్రామస్థులందరూ ఎస్ఐతో కలిసి మద్యం విక్రయించమని, జూదం ఆడమని తీర్మానం చేశారు. నారాయణఖేడ్ ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో సర్పంచ్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌తోపాటు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు అందరూ కలిసి పంచాయతీ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేందర్ మాట్లాడుతూ వ్యసనాల కారణంగా కుటుంబాలు గుల్ల అవుతాయన్నారు. ఎవ్వరూ జూదం ఆడడం కానీ, మద్యం విక్రయాలు కానీ చేపట్టకూడదని అన్నారు. గ్రామస్థులందరూ ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంపట్ల ఆయన అభినందించారు. వ్యసనాల కారణంగా గ్రామాల్లొ గొడవలకు ఆస్కారం ఉంటుందన్నారు. ఎలా వ్యసనాలకు దూరంగా ఉంటే గ్రామాలు సుభిక్షంగా విరాజిల్లుతాయని అన్నారు. గ్రామస్థులందరూ ఐక్యతతో ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. -
అంబేద్కర్‌కు నివాళి
నారాయణఖేడ్: అంబేద్కర్ వర్ధంతిని నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్వార్ గ్రామంలో దళితులతో కలిసి బీజేపీ నాయకులు సహపంక్తి భోజనాలు చేశారు. రాజీవ్‌చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని సూచించారు. అవినీతి రహిత సమాజం బీజేపీ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా నకిలీనోట్లు, నల్లధనం నివారణ కోసం పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులకు సహాయం అందకుండా పోయిందన్నారు. ఇందుకు ప్రజల ఆమోదం ఉందన్నారు. తాత్కాలింకగా ఇబ్బందులున్నా శాశ్వతంగా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ వెంకటేశం, నాయకులు అమర్‌సింగ్, కృష్ణ, సంగమేశ్వర్, సిద్దయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నారాయణఖేడ్ మండలంలో విషాదం
నారాయణఖేడ్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నం ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. నారాయణఖేడ్ మండలం చిన్ననర్సాపూర్ తండాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి, తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కస్తూర్బా విద్యార్థినికి తీవ్రగాయాలు
మెదక్: నారాయణ్‌ఖేడ్ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థిని గాయపడింది. మండలంలోని రాంచందర్ తండాకు చెందిన స్రవంతి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం ఆమె పాఠశాల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే నారాయణ్‌ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
‘బోరు’న మంజీర!
మంజీరమ్మ.. మరింత గోసకు గురిచే స్తోంది. ఎన్నడూ ఇంతటి దుస్థితికి గురిచేయని నదీమ తల్లి నేడు అగ్ని పరీక్ష పెడుతోంది. ఇప్పటికే నది పూర్తిగా ఎండిపోగా అందులో వేసిన బోర్లూ వట్టిపోతున్నాయి. మంచినీటి పథకాలకు నీరు అందడం గగనంగా మారింది. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే నడి వేసవిని తలుచుకుని జనాలు తల్లడిల్లుతున్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు మంజీర నదిపై ఆధారపడ్డారు. ఈ నియోజకవర్గాలకు నీటి పథకాలు నదిపై ఏర్పాటు చేశారు. నది ఎండిపోవడంతో అధికారులు పలుచోట్ల బోరుబావులను తవ్వించి మంచినీటి పథకాలకు అనుసంధానం చేశారు. బోరుబావులు సైతం వట్టిపోతుండటంతో నీటి గోస అంతా ఇంతా కాదు.. నారాయణఖేడ్: మనూరు మండలం గౌడ్గాం జన్వాడ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తున్న మంజీర నది జిల్లాలో అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్లమేర ప్రవహిస్తుంది. జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల పథకాలు, ఇన్‌టెక్‌వెల్‌లు సైతం ఈ నియోజకవర్గం సమీపంలోనే నిర్మించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాలకు మంజీర నీటిని సరఫరా చేసేందుకు పలు పథకాలు నదిపై నిర్మించారు. నాబార్డు ఆర్థిక సహాయంతో 13 ఏళ్ళ క్రితం రూ.14కోట్ల వ్యయంతో గూడూరు వద్ద 74 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని నిర్మించారు. ఎన్ఏపీ పథకం ద్వారా బోరంచ నుంచి 28 గ్రామాలకు, ఇదే ప్రాంతం నుంచి ఫేస్-1 కింద 32 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 24 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. పెద్దశంకరంపేట నియోజకవర్గానికి ఇటీవల పథకాన్ని ప్రారంభించారు. మంజీర నది ఎండిపోవడంతో పథకాల ద్వారా నీటిని సరఫరా చేయడం ఇబ్బందికరంగా పరిణమించింది. నవంబర్ మాసంలో ఇన్‌టెక్‌వెల్ వరకు కాల్వలు తీయడం, పైపులు వేసి తదితర ఏర్పాట్లతో నీటిని పంపింగ్ చేశారు. అనంతరం అవీ ఎండిపోయాయి. నదిలో బోర్లూ ఎండిపోయాయి... మంచినీటి పథకాల ఇన్‌టెక్‌వెల్‌లకు నీరు అందని పరిస్థితి ఉండండంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నదిలో బావుల తవ్వకం, బోర్లను ఢ్రిల్లింగ్ చేశారు. డిసెంబర్ మాసంలో శాపూర్ ఇన్‌టెక్‌వెల్ సమీపంలో 6 బోర్లను అధికారులు ఢ్రిల్లింగ్ చేశారు. ఇందులో రెండు బోర్లు ఫేయిల్ అవగా, నాలుగు బోర్లలో నీరుపడింది. గుడూరు ఇన్‌టెక్‌వెల్ సమీపంలో 6 బోర్లను తవ్వగా నాలుగు బోర్లలో నీరు పడగా రెండు బోర్లు ఫెయిల్ అయ్యాయి. ఇదే పథకం వద్ద పెద్ద బావిని అధికారులు తవ్వించారు. 9 ఫీట్ల లోతు, 30 మీటర్ల వెడుల్పుతో బావిని తవ్వారు. కాగా ప్రస్తుం నడుస్తున్న 8 బోర్లలో నాలుగు బోర్లు నీరు తగ్గిపోయి గ్యాప్ ఇస్తున్నాయి. ఇవీ నడవని పరిస్థితి నెలకొంది. అంటే శాపూర్‌లో రెండు, గూడూర్లో రెండు బోర్ల చొప్పునే నడుస్తున్నాయి. ఇవీ ముందు ముందు ఏం చేస్తాయోనన్న భయంలో అధికారులు ఆందోళనతో ఉన్నారు. నదిలో తవ్విని బావుల్లోనూ నీటి జాడలు కరువయ్యాయి. శాపూర్ వద్ద తవ్విని బావిమధ్యలో భారీ బండ రావడంతో అధికారులు మధ్యలోనే వదిలేశారు. నదిలోని ఫలింగా గూడూర్, ఎన్ఏపీ, బోరంచ పథకాల ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందించడం కష్టతరంగా మారింది. ఈ దుస్థితిని పరిశీలించిన అధికారులు నల్లవాగు ప్రాజెక్టు నీటిని పైప్లైన్ల ద్వారా సరఫరా చేయాలన్న ఆలోచనచేస్తూ జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. నదిలో బోర్లు ఫెయిల్ కావడం అధికారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. -
‘ఖేడ్’ అభివృద్ధి బాధ్యత నాదే
♦ నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటాం: మంత్రి హరీశ్ ♦ ప్రత్యేక ప్యాకేజీతో సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తా ♦ విపక్షాలు ఇకనైనా మారాలి.. అభివృద్ధికి కృషి చేయాలి ♦ మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ♦ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన భూపాల్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘‘నారాయణ ఖేడ్ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటాం. నియోజకవర్గం అభివృద్ధికి పూర్తిగా నాదే బాధ్యత. ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తా. సీఎం వద్ద ప్రత్యేక ప్యాకేజీ సాధించి సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటా...’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన భూపాల్‌రెడ్డి ఆదివారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి.. భూపాల్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు హజరయ్యారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం అందిస్తున్న సుపరిపాలన వల్లే ఖేడ్‌లో విజయం సాధ్యమైంద న్నారు. ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతిపక్షాలు ఎంత దివాలాకోరు ప్రచారం చేసినా ప్రజలు తిప్పికొట్టారని, అభివృద్ధి, సంక్షేమానికే జై కొట్టారని హరీశ్ అన్నారు. తెలంగాణ కోసం ఎలా కలిసి కొట్లాడామో, అభివృద్ధి కోసం కూడాఅలాగే కలిసి కృషి చేద్దామని విపక్షాలకు హితవు పలికారు. విపక్షాలు ఇకనైనా, ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన సీఎంగా కేసీఆర్ అని ‘ఇండియా టుడే’ ప్రకటించిందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆ పత్రికకు కనిపించినా, ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం కనిపించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాలే కరెంటు కష్టాల నుంచి బయటపడలేక పోతున్నాయని, తెలంగాణ ఇంత తక్కువ కాలంలో కరెంటు సమస్యను ఎలా అధిగమించిందో విపక్షాలు ఆలోచించాలని సూచించారు. మిషన్ భగీరథ తరహా పథకాన్ని తాము కూడా అమలు చేస్తామని యూపీ, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయని, మిషన్ కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. జల విధానంపై అర్థవంతమైన చర్చ జరగాలి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 2వ వారంలో నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సమావేశాలు వేదికగా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన సమగ్ర జల విధానాన్ని సీఎం సభలో చర్చకు పెడతారని చెప్పారు. ప్రభుత్వం అర్థవంతమైన చర్చ కోరుకుంటోందన్నారు. ఖేడ్ ప్రజల రుణం తీర్చుకుంటా: భూపాల్‌రెడ్డి నారాయణ ఖేడ్ నియోజకవర్గ ప్రజలకు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. -
‘ఖేడ్’ టీఆర్ఎస్ కైవసం
నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం ♦ 53,625 ఓట్ల మెజారిటీతో భూపాల్‌రెడ్డి గెలుపు ♦ రెండో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్.. టీడీపీ డిపాజిట్ గల్లంతు నారాయణఖేడ్: నారాయణఖేడ్ శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. టీడీపీ డిపాజిట్ గల్లంతయింది. ఈనెల 13న నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో మొత్తం 1,88,373 ఓట్లకుగాను 1,54,912 ఓట్లు పోలైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. నారాయణఖేడ్ మండలంలో జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తంగా 21 రౌండ్లలో ఓట్లు లెక్కించగా... చివరి రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 93,076 ఓట్లు పొంది విజయం సాధించారు. ఈ అసెంబ్లీ స్థానం చరిత్రలోనే ఓ అభ్యర్థి ఇన్ని ఓట్లు సాధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ళ సంజీవరెడ్డికి 39,451 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎం.విజయపాల్‌రెడ్డి కేవలం 14,787 ఓట్లను పొంది డిపాజిట్ కోల్పోయారు. స్వతంత్ర అభ్యర్థులు జాజుల భాస్కర్ 5,377 ఓట్లు, బోరంచ సంగారెడ్డి 509, ఐ.మాదప్ప 235, ముదిరాజ్ వెంకటేశం 291, మురళీ గోవింద్ 333 ఓట్ల పొందారు. నోటాకు 853 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం మంత్రి హరీశ్‌రావు చేసిన కృషి ఫలించింది. ఈ ఫలితాన్ని బుధవారం నాటి సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు కానుకగా ఇద్దామంటూ హరీశ్‌రావు ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సీఎంకు కానుక: భూపాల్‌రెడ్డి తన గెలుపును సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు కానుకగా అందజేస్తున్నట్టు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలిచిన ఎం.భూపాల్‌రెడ్డి అన్నా రు. మంగళవారం ఖేడ్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఈ అపూర్వ విజయం సాధ్యమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి నియోజకవర్గాన్ని బంగారు ఖేడ్గా మారుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. మాట నిలబెట్టుకుందాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపాల్‌రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. భూపాల్‌రెడ్డి మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్‌ను అధికారిక నివాసంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టాలని మెదక్ జిల్లా నాయకులకు సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలను తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. రౌండ్లవారీగా మూడు పార్టీలకు పోలైన ఓట్లు, ఆధిక్యత వివరాలు.. రౌండ్ నెంబర్ టీఆర్ఎస్ ఆధిక్యం కాంగ్రెస్ టీడీపీ 1 3,922 1,952 1,970 701 2 3990 2,003 1,987 832 3 4,730 3,347 1,383 1,608 4 4,635 2,360 2,275 712 5 4,387 1,903 2,484 1,043 6 4,024 2,590 1,434 664 7 4,529 3,211 1,318 1,110 8 4,429 2,606 1,823 793 9 4,863 2,558 2305 295 10 4,558 2,781 1,777 551 11 5,008 2,582 2,426 735 12 5,032 3,301 1,731 635 13 5,399 3,370 2,029 415 14 5,669 4,098 1,571 331 15 5,129 3,044 2085 580 16 3,774 2,393 1381 614 17 4,555 2,243 2,312 761 18 3,374 1,151 2,223 1,128 19 5,199 3,120 2,079 463 20 4,484 2,491 1,993 485 21 1384 519 865 105 మొత్తం 93,076 53,625 39,451 14,787 -
టీఆర్ఎస్కు అరుదైన విజయం
సాక్షి, హైదరాబాద్: సానుభూతి పవనాలతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిన నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది కూడా ఏకంగా 53 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం అరుదైన విజయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. తమ సిట్టింగ్ స్థానమైన ఇక్కడ కిష్టారెడ్డి కుమారుడినే బరిలోకి దింపితే సానుభూతి పవనాలతో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు మంత్రి హరీశ్‌రావు పన్నిన వ్యూహం విజయవంతమై.. గులాబీ జెండా ఎగిరింది. ఈ ఉప ఎన్నికలో 50 వేల మెజారిటీ సాధిస్తామని నామినేషన్ల రోజే చెప్పిన హరీశ్‌రావు... అదే రీతిన ప్రచారం నిర్వహించి అనుకున్నది సాధించారు. మధ్యలో రెండు రోజులు మినహా నారాయణఖేడ్‌లోనే బసచేసి ఊరూరా తిరిగారు. నారాయణఖేడ్‌ను అభివృద్ధి చేసి చూపిస్తానని మాటిచ్చి ప్రజల మద్దతు కూడగట్టారు. సానుభూతిని అధిగమించి.. ఇప్పటివరకు ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన దాదాపు అన్ని ఉప ఎన్నికల్లోనూ ఆయా పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. సానుభూతిని దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తుంటాయి. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ అదే పని చేసింది. కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డికి టికెట్ ఇచ్చింది. గత 30 ఏళ్లలో ఇలా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే విజయం సాధించారు. కానీ ఇప్పుడు నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అంతేకాదు కాంగ్రెస్‌పై భారీ ఆధిక్యం సాధించడాన్ని రాజకీయ పరిశీలకులు అరుదైన విజయంగా అభివర్ణిస్తున్నారు. -
ఖేడ్‌తో కొత్త సంప్రదాయానికి శ్రీకారం
మెదక్ జిల్లా: నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అకాల మరణం చెందితే అన్నిపార్టీలు వారి వారసులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం.. లేదా ప్రధాన పార్టీలు పోటీకి దిగకపోవడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణ ఎన్నికల్లో నారాయణ్‌ఖేడ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా అన్ని పార్టీలు బరిలోకి దిగాయి. ఏకగ్రీవం అనే మాటకు తావులేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి పేరును అన్నిపార్టీల కంటే ముందుగా ప్రకటించింది. సిట్టింగ్ స్థానం కావడంతో పాటు.. ఎమ్మెల్యే మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికలు కావడంతో సానుభూతి పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ధీమాగా ఉంది. కానీ, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నాయకులు ఓటమిని ముందుగానే అంగీకరించే పరిస్థితి నెలకొంది. దానికి తోడు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మెజార్టీ 50 వేలను దాటింది. గ్రేటర్లో పూర్తి బాధ్యతలను కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అన్నితానై చేపట్టగా.. ఖేడ్ బాధ్యతలను కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు తీసుకున్నాడు. ఇద్దరూ టీఆర్స్ పార్టీకి భారీ విజయాలు అందించారు. మంత్రి హరీశ్ రావు 20 రోజుల పాటు ఖేడ్లోనే ఉంటూ ప్రతి గ్రామాన్ని చుట్టేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సిద్దిపేట తరహాలోనే అభివృద్ధికి కృషి చేస్తామన్న హరీశ్ వాగ్దానాలకు ప్రజలు మెజార్టీ రూపంలో పట్టం కట్టారని చెప్పాలి. అన్ని పార్టీల కంటే ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోయింది. ఖేడ్‌లో టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందిస్తే కృష్ణాజలాలను తెస్తామని హరీశ్‌రావు చెప్పారు. నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక పోలింగ్ శాతం కూడా అనూహ్యంగా నమోదైంది. సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని మించి ఓటర్లు బారులు తీరారు. ఉప ఎన్నికల పోలింగ్ అంటే ప్రజల్లో కొంత ఆసక్తి తక్కువగా ఉండడంతో పాటు సిట్టింగ్ పార్టీలకే పట్టం కడతారన్న సంప్రదాయాన్ని ఖేడ్ ప్రజలు తిరగరాశారు. ఖేడ్‌లో ఎక్కువ మంది ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తారు. కానీ, అధికార పార్టీ ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు ఉప ఎన్నికల పోలింగ్‌తో పాటు భారీ మెజార్టీతో కొత్త రికార్డు సృష్టించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేగా గెలిచిన భూపాల్ రెడ్డి నారాయణ్‌ఖేడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు ఖేడ్‌లో 13 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 10 సార్లు గెలిచింది. మిగిలిన మూడుసార్లు ఎస్డబ్యూఏపీ, ఇందిరా కాంగ్రెస్, టీడీపీ గెలుపొందాయి. ఇప్పటివరకు టీడీపీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జరిగాయి. ఇక నారాయణ్‌ఖేడ్ ఘన విజయంతో కాంగ్రెస్ నుంచి భారీ వలసలు ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు కూడా త్వరలోనే కారెక్కడం ఖాయమని తెలుస్తుంది. ఇన్నాళ్లూ టీడీపీ వంతు కాగా.. ఇప్పుడు తమకు ఆ బాధ తప్పదేమోనని కాంగ్రెస్ నాయకులు మధనపడుతున్నారు. -
ఖేడ్ ప్రజలకు అభినందనలు : కేసీఆర్
ఖమ్మం : మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం స్పందించారు. ఖేడ్ ప్రజలు అపురూపమైన మెజార్టీ ఇచ్చారన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే సీజన్‌కల్లా ప్రాజెక్టును నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఓట్ల కోసం కాదని అన్నారు. రూ. 14 వేల కోట్లతో 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కటిస్తామని తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కల్యాణలక్ష్మి వర్తింపు చేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిఇంటికి మంచినీరు అందిస్తామని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. -
హరీష్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావుకు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ టీడీపీ డిపాజిట్ గల్లంతు అయింది. అయితే నారాయణఖేడ్ ఉప ఎన్నికకు మంత్రి హరీష్ రావు ఇంఛార్జ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ట్విట్టర్లో ట్విట్ చేశారు. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పటోళ్ల కిష్టారెడ్డి ఘన విజయం సాధించారు. కాగా ఆయన గతేడాది ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పటోళ్ల కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని నిలబెట్టింది. కాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా మహారెడ్డి భూపాల్‌రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపింది. పోటాపోటీగా ఈ ఎన్నికల ప్రచారం సాగింది. అయితే విజయం టీఆర్ఎస్ ఖాతాలో పడింది. దీంతో హరీష్‌కు ట్విటర్ ద్వారా కేటీఆర్ అభినందనలు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఇంఛార్జ్‌గా వ్యవహరించి.... 99 డివిజన్లలో గులాబీ కండువా వేసిన సంగతి తెలిసిందే. TRS juggernaut continues to roll unabated. Thumping majority of over 50K in Narayankhed😊. Congrats to @trsharish & Medak TRS leadership team — KTR (@KTRTRS) February 16, 2016 -
నేడు నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్
నారాయణఖేడ్ (మెదక్ జిల్లా): నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత రెండు, మూడు గంటల్లోనే ఫలితం వెల్లడవుతుందన్నారు. కౌంటింగ్‌కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశామని, మొత్తం 21 రౌండ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి 137 మంది ఉద్యోగులను నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతీ టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించామన్నారు. ఫలితాల సమాచారం ఎప్పటికప్పుడు మీడియాకు అందించేందుకు కౌంటింగ్ కేంద్రంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని వెంకటేశ్వర్లు వివరించారు. -
ముగిసిన నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్
మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయింది. గత సాధారణ ఎన్నికల్లో నమోదయిన పోలింగ్ శాతం కంటే ఎక్కువగా ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం నమోదయింది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వద్ద బారులు తీరారు. జరుగుతున్నది ఉప ఎన్నికే అయినా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్లు ఉత్సాహం చూపారు. దీంతో 81.72 శాతం పోలింగ్ నమోదయిందని కలెక్టర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. విధుల్లో మరణించిన కానిస్టేబుల్ వీరాసింగ్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందిస్తామని కలెక్టర్ చెప్పారు. మరోవైపు భారీగా ఓటింగ్ నమోదు కావడంతో టీఆర్ఎస్ తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎం.భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పట్లోళ్ళ సంజీవరెడ్డి, టీడీపీ నుంచి ఎం.విజయపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. కాగా గత సాధారణ ఎన్నికల్లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉండగా 1.58 లక్షల ఓట్లు అంటే 79.64 శాతం ఓట్లు పోలయ్యాయి. -
నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
మెదక్ : మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక శనివారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికల కోసం 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రోనార్డ్ రాస్ వెల్లడించారు. అలాగే 142 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రోనాల్డ్ రాస్ పరిశీలించారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఉప ఎన్నిక విధుల్లో 3 వేల మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో 1,88,857 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవరం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పటోళ్ల కిష్టారెడ్డి గెలుపొందారు. అయితే గతేడాది ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో నారాయణఖేడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి... టీఆర్ఎస్ అభ్యర్థిగా మహారెడ్డి భూపాల్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మహారెడ్డి విజయపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న లెక్కిస్తారు. -
ఖేడ్‌లో ముగిసిన ఉపఎన్నిక ప్రచారం
నారాయణఖేడ్ (మెదక్) : నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. బరిలో నిలిచిన పార్టీలన్నీ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రచారాలన్నీ గురువారం సాయంత్రం 5 గంటలతో ముగిశాయి. పోలింగ్ 13 వ తేదీన జరుగనుంది. ప్రస్తుతం ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖేడ్‌లో 1,87,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
ఫాంహౌస్‌లో రూ. కోట్లు దాచిన కేసీఆర్
మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి దామోదర రాజనర్సింహ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. పోలీసుల అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రికి పోలీసు రక్షణ కల్పిస్తూ కాన్వాయ్‌తో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని విమర్శించారు. అయితే ఉప ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఎస్పీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఓ డిక్టేటర్లా తయారయ్యారన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమా ? కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో రూ.కోట్లు దాచారని, వాటి గురించి మాత్రం పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. టీఆర్ఎస్ శాసనసభ్యులే డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడతారని రాజనర్సింహ అన్నారు. ఈ విషయాలను మీడియా ప్రజలకు తెలియజేయాలన్నారు. గంగాధర్ అనే రిటైర్డ్ ఉద్యోగి తనింట్లో సొంత డబ్బు దాచుకుంటే పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి ఇంట్లోకెళ్లి బీరువా ధ్వంసం చేసి డబ్బులు లాక్కొచ్చారని ఆరోపించారు. -
సుమతిపై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్
మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ సుమతి టీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఏకంగా పోలీసు వాహనాల్లోనే డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నిష్పాక్షికంగా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణఖేడ్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యత దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీపీసీసీ సిట్టింగ్ స్థానమైన నారాయణఖేడ్‌లో దివంగత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని బరిలోకి దించింది. ఫిబ్రవరి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. -
అభివృద్ధి-అణిచివేతకి మధ్య పోరు
మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నికలు అభివృద్ధి-అణిచివేతకి మధ్య జరుగుతున్న పోరాటమని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నారాయణఖేడ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ... బెదిరింపులకు పాల్పడుతున్న పార్టీలను సాగనంపాలని, ప్రజలకు అండగా తాముంటామన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ బండారం బయటపడుతుందని ఆగమాగమవుతున్నారని హరీష్ ఎద్దేవా చేశారు. -
'ఖేడ్‌లో డిపాజిట్లు గల్లంతు ఖాయం'
మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలోని తిరుమలాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 13న నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. -
'నారాయణఖేడ్ ఉపఎన్నికలను వాయిదా వేయాలి'
హైదరాబాద్ : నారాయణఖేడ్ ఉప ఎన్నికలను వాయిదా వేయాలని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌తో కలసి ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీని సోమవారం కలిశారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రింటర్ ఈవీఎంలను ప్రవేశ పెట్టాలని లేదంటే బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలని కోరారు. ఇప్పటికిప్పుడు ఈ రెండు సాధ్యం కాకుంటే ఉప ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేయాలని వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నిక సమయంలోనే తమకు అనుమానం వచ్చిందని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ అనుమానాలు నిజమయ్యాయని శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్కు కచ్చితంగా 100 స్థానాలు వస్తాయని కెటీఆర్ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. ఈవీఎంలను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాంపరింగ్ చేసిందని, ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని శ్రవణ్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్, టీడీపీలకు మైండ్ బ్లాక్: హరీష్‌రావు
నారాయణఖేడ్ (మెదక్) : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్, టీడీపీల మైండ్ బ్లాక్ అయ్యిందని, రెండు పార్టీలు చిత్తు చిత్తుగా పొట్టు పొట్టుగా అయ్యాయని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. నారాయణఖేడ్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఫలితాలతో ఆయా పార్టీల నాయకులు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వరంగల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను దెబ్బకొట్టిన ప్రజలు.. రేపు నారాయణఖేడ్‌లోనూ దెబ్బ మీద దెబ్బ కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. హైదరాబాద్‌లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తమకు వద్దని కరివేపాకు మాదిరిగా తీసిపారేశారన్నారు. ఏదో దిష్టి తగలకుండా ఉండేందుకు రెండు సీట్లు ఇచ్చారన్నారు. ఖేడ్‌లో మాత్రం కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు రావన్నారు. హైదరాబాద్‌లో చెల్లని రూపాయి ఖేడ్‌లో చెల్లుతుందా అంటూ మంత్రి ప్రశ్నించారు. -
తరగతి గదిలో కొండచిలువ కలకలం!
నారాయణఖేడ్(మెదక్): ఎక్కడో అడవుల్లో.. జనావాసాలకు దూరంగా కొండకోనల్లో సంచరించాల్సిన కొండచిలువ తరగతి గదిలో ప్రత్యక్షమైంది. కొండచిలువ కనిపించడంతో ఆ పాఠశాలలో కొద్దిసేపు కలకలం రేగింది. వివరాలిలా ఉన్నాయి... మెదక్ జిల్లా నారాయణఖేడ్ నెహ్రూ నగర్‌లోని ప్రభుత్వ స్కూల్లో కొండచిలువ ప్రవేశించింది. తరగతి గదిలో కొండచిలువ ప్రత్యక్షమవడంతో.. విద్యార్థులు, టీచర్లకు పైప్రాణాలు పైనే పోయాయి. భయాందోళనకు గురైన చిన్నారులు, ఉపాధ్యాయులు పరుగు లంకించుకున్నారు. స్కూలు యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. కొండ చిలువను పట్టుకోవడానికి అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసుల తనిఖీలు
మెదక్: నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్హేర్ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద సోమవారం తనిఖీలు చేపట్టారు. వాహనాలను క్షుణంగా సోదాలు చేస్తున్నారు. ఉప ఎన్నిక ముగిసేంత వరకు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఫిబ్రవరి 13న, ఫలితం 16న వెలువడనున్న విషయం తెలిసిందే. -
‘ఖేడ్’ కాంగ్రెస్ అభ్యర్థికి షోకాజ్ నోటీస్
నారాయణఖేడ్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి పి.సంజీవరెడ్డికి గురువారం పోలీసులు షోకాజ్ నోటీసును జారీచేశారు. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి పేరిట ముద్రించిన కరపత్రాలను వివిధ దినపత్రికల ద్వారా పంపిణీ చేశారు. వీటిపై ప్రింటర్ పేరు, ఎన్ని కరపత్రాలు ముద్రించారో వివరాలు లేనందున అభ్యర్థికి షోకాజ్ నోటీసును జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. మూడు నామినేషన్ల ఉపసంహరణ నారాయణఖేడ్ ఉప ఎన్నికలో దాఖలైన నామినేషన్లలో మూడు నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం నామినేషన్ల పరిశీలనలో టీడీపీ తరఫున డమ్మీగా నామినేషన్ వేసిన మారుతిరెడ్డి నామినేషన్‌ను తిరస్కరించారు. పార్టీ అసలు అభ్యర్థి నామినేషన్ స్వీకరించినందున ఈ నామినేషన్ తిరస్కరణకు గురైంది. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన వి.తుకారాం నాయక్, సుంకరి లింగయ్య నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 30 చివరి తేదీ. -
ఖేడ్ లో స్వతంత్ర అభ్యర్థిని నిలుపుతాం
బీసీ సంక్షేమ సంఘం వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక న్యాయానికి రాజకీయ పార్టీలు పాతర వేస్తున్నాయని, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో ఒక్క పార్టీ కూడా బీసీలకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. రెండురోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కలుపుకుని నారాయణ్‌ఖేడ్‌లో స్వతంత్ర అభ్యర్థిని బరిలో నిలుపుతామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీలకు జరిగిన అన్యాయంపై ఈ ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్విహ ంచి, అగ్రకుల పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చిన్నరాష్ట్రం ఏర్పడితే సామాజిక న్యాయం జరుగుతుందన్న పార్టీల మాటలు నీటిమూటలుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ర్టంలోని పార్టీలు మెజారిటీ ప్రజలకు రాజకీయ అధికారం దక్కకుండా పోటీపడుతున్నాయని, అందులో భాగంగానే ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్ ఇవ్వలేదన్నారు. -
ఉప పోరుకు 12 నామినేషన్లు
నారాయణఖేడ్(మెదక్ జిల్లా): నారాయణఖేడ్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 12 మంది అభ్యర్థులు 26 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్,కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల తరపున రెండు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. 28న స్ర్కూటిని, 30న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 13న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో నారాయణఖేడ్ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఈ నెల 20న నోటిఫికేషన్ జారీచేసింది. అదే రోజు నుంచి 27వ తేదీ మూడు గంటల వరకు గడువు విధించింది. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు బుధవారం టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన భూపాల్ రెడ్డి మళ్ళీ ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి దివంగత ఎమ్మెల్యే కుమారుడు, ప్రస్తుత నారాయణఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి నామినేషన్ వేశారు. ఇక టీడీపీ నుంచి విజయపాల్ రెడ్డి పోటీలో దిగారు. టీడీపీ, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న భూపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి స్వయానా సోదరులు. ఇద్దరు గత రెండు పర్యాయాలుగా ఎన్నికల బరిలో నిలివడం గమనార్హం. మరో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఫిబ్రవరి 11న ప్రచారానికి గడవు ముగియనుంది. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
'సిద్ధిపేట, నారాయణ్‌ఖేడ్ నాకు రెండు కళ్లు'
సంగారెడ్డి : మెదక్ జిల్లాలోని సిద్ధిపేట, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లు అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని పలు గ్రామాల్లో హరీష్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా టి.హరీష్‌రావు మాట్లాడుతూ... 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నారాయణ్‌ఖేడ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మూడేళ్లలో నారాయణ్‌ఖేడ్ అభివృద్ధి చేసి చూపిస్తామని హరీష్‌రావు వెల్లడించారు. ఈ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 13న ఈ ఉప ఎన్నిక జరగనుంది. అలాగే 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగింపు
మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవనున్న సంజీవరెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి పాల్గొనున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిష్టారెడ్డి విజయం సాధించారు. ఆయన గతేడాది గుండెపోటుతో మరణించారు. దీంతో నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక ఫిబ్రవరి 13వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు 16వ తేదీన జరుగుతుంది. -
ఖేడ్‌లో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
మెదక్ : మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఫిబ్రవరి 13న జరగనుంది. 16వ తేదీన ఈ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. నారాయణఖేడ్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని సహాయ ఎన్నికల అధికారి మహమ్మద్ అన్వర్ వెల్లడించారు. నామినేషన్ పత్రాలు కార్యాలయంలో పొందవచ్చు అని ఆయన అభ్యర్థులకు సూచించారు. -
గ్రేటర్లో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిటే
ఖేడ్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ గల్లంతే: మంత్రి హరీశ్ నారాయణఖేడ్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జోస్యం చెప్పారు. శనివారం ఆయన మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్లో దెబ్బతింటామన్న విషయాన్ని కాంగ్రెస్ వారే స్వయంగా ఒప్పుకొంటున్నారని తెలిపారు. ఏంచూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. వరంగల్ ఎంపీ స్థానానికి సాధారణ ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తాజా ఉప ఎన్నికల్లో డిపాజిట్‌ను సైతం కోల్పోయిందని హరీశ్‌రావు అన్నారు. తెలుగుదేశం పార్టీని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. అది ఆంధ్రా పార్టీగా అభివర్ణించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి రాజీనామాచేసి బయటకు వస్తున్నారన్నారు. టీడీపీకి ఓటువేస్తే మురికి కాలువలో వేసినట్లేనని హరీశ్‌రావు తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని మంత్రి అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్కు ఎంత భారీ మెజార్టీని కట్టబెడితే అంతమేర తలవంచి పనిచేస్తానన్నారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే.. ఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన తెలిపారు. -
గొడ్డలితో భార్య ముక్కు తెగ్గొట్టాడు..
నారాయణఖేడ్ (మెదక్) : తాగిన మైకంలో ఓ వ్యక్తి భార్యపై గొడ్డలితో దాడి చేయగా ఆమె ముక్కు తెగిపోవటంతోపాటు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణం దత్తాత్రేయకాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఉబ్ది పాండు, కేశమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా పాండు తరచూ తప్పతాగి వచ్చి భార్యను కొట్టేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయేది. ఇదే విధంగా ఇటీవల కేశమ్మ పుట్టింటికి వెళ్లిపోగా మద్యం తాగనని పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుని భార్యను తెచ్చుకున్నాడు. అయినప్పటికీ బుధవారం రాత్రి తల్లి పోచమ్మతో కలసి పూటుగా మద్యం తాగాడు. అనంతరం పాండు భార్య, తల్లితో గొడవకు దిగాడు. కోపంలో ఉన్న పాండు భార్య కేశమ్మపై గొడ్డలితో వేటువేయగా ఆమె ముక్కు తెగి, తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన కాలనీవాసులు తల్లి, కొడుకుకు దేహశుద్ధి చేశారు. అనంతరం గాయాలపాలైన ముగ్గురినీ చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. కేశమ్మ తండ్రి కేశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. -
నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ్‌రెడ్డి
మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ గురువారం ఖరారు చేసింది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆకస్మికంగా మృతి చెందిన కృష్టారెడ్డి కుమారుడు సంజీవ్‌రెడ్డిని అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల ఫిబ్రవరి 13వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు 16వ తేదీన జరుగుతుంది. ఈ ఉప ఎన్నికపై జనవరి 20వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 30వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కృష్టారెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుంది. -
చెరకు లారీ బోల్తా..
నారాయణఖేడ్ (మెదక్) : వేగంగా వెళ్తున్న చెరకు లారీ లోడు ఎక్కువవడంతో అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా కొట్టింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని మంగల్‌పేట్ గ్రామ హనుమాన్ మందిరం వద్ద 50వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మానూరు నుంచి నిజామాబాద్ వెళ్తున్న చెరకు లారీ మందిరం సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లారీ కింద ఎవరైనా ఇరుక్కున్నారేమో అనే విషయం తెలియాల్సి ఉంది. -
ఖేడ్‌లో పోటీ..సై
బరిలో నిలబడదాం.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టి పార్టీ సత్తా చాటుదామని కార్యకర్తలు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నారాయణఖేడ్ ప్రాంతంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే పార్టీకి అండ అని వారంతా తమ మనోగతాన్ని చాటారు. ఈ మేరకు పార్టీ నాయకుడు సంజీవరెడ్డి అధ్యక్షతన బుధవారం నారాయణఖేడ్‌లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర పాలక మండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి హాజరయ్యారు. ప్రధానంగా నారాయణఖేడ్ ఉప ఎన్నికపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కార్యకర్తలు తమ మనోభావాలను పార్టీ నేతల ముందుంచారు. అభ్యర్థిని నిలబెట్టాల్సిందే.. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని కా ర్యకర్తలు నేతలను కోరారు. వైఎస్సార్‌ను రాజకీయాలకతీతంగా అభిమానించే వారున్నారని, వారి అభిమానం ఓట్లు కురిపిస్తుందని కార్యకర్త లు తెలిపారు. వైఎస్.. రైతుల కోసం నల్లవాగు కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ని ధులు విడుదల చేశారని, నీళ్లువృథాగా పోకుం డా నల్లవాగు నీటిని పది చెరువులకు మళ్లించేం దుకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఖేడ్‌కు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, వసతి గృహా లు మంజూరు చేశారన్నారు. మౌలిక సదుపాయాలకు నోచుకోని గిరిజన తండాల అభివృద్ధికి పాటుపడ్డారని వివరించారు. ఇవన్నీ ఉప ఎన్నికల్లో పార్టీకి కలిసివస్తాయనే ఆశాభావాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. ఇద్దరు చంద్రులు వాగ్దాన శూరులు నల్లా సూర్యప్రకాశ్ ధ్వజం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర సీ ఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ వాగ్దానశూరులేనని పార్టీ రాష్ట్ర నేత నల్లా సూర్యప్రకా శ్ ఎద్దేవా చేశారు. ‘డబుల్ బెడ్రూం’ హామీ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు నియోజకవర్గానికి 400 ఇళ్లు మాత్రమే ఇస్తామని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రస్తుత అంచనా ప్రకారం నారాయణఖేడ్ ని యోజకవర్గానికి 25 వేల ఇళ్లు అవసరమని, 400 చొప్పున ఇస్తే కేసీఆర్ ముని మనవని కాలం వరకు వచ్చినా సరిపోవన్నారు. వైఎస్సా ర్ తన హయాంలో అడిగిన ప్రతి వాళ్లకు ఇళ్లు ఇచ్చారన్నారు. దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. వైఎస్సార్ ఒక్కరే 47 లక్షల ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ తన హయాంలో ప్రతి అవ్వాతాతకు పింఛన్ ఇచ్చారని గుర్తు చేశారు. కార్యకర్తల అభిప్రాయాన్ని పార్టీ గౌరవిస్తుందని, వారి సూచనను అధినాయకత్వం ముందుం చుతామన్నారు. పార్టీ టేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు నర్రా భిక్షపతి మాట్లాడుతూ రైతులపై కేసీఆర్‌కు ఏమాత్రం మమకారం లేదన్నారు. రాష్ట్రంలో 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు కనిపించడం లేదని, ఉప ఎన్నికల కోసం రూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు.సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి తడ్క జగదీశ్వర్‌గుప్త, జిల్లా కమిటీ సభ్యుడు ఇబ్రహీం, నారాయణఖేడ్ మండల పార్టీ అధ్యక్షుడు మానయ్య, సత్యనారాయణ (పెద్ద శంకరంపేట), శిరోమణి (కంగ్టి), విజయ్‌కుమార్ (కల్హేర్), సంజీవ్జాదవ్ (మనూర్), నేతలు అశోక్ పటేల్, సంగాగౌడ్, పాండు నాయక్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
సురేష్ షెట్కార్‌కు దిగ్విజయ్ బుజ్జగింపు
హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడ్డారు. దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు సూచించగా.. టికెట్ తనకే కావాలని మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సురేష్ షెట్కార్‌ను బుజ్జగించి.. ఉప ఎన్నిక బాధ్యతలను చేపట్టాలని సూచించారు. మంగళవారం గాంధీభవన్‌లో దిగ్విజయ్‌తో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక గురించి చర్చించారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 29న నారాయణ్‌ఖేడ్‌లో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ఇదిలావుండగా పీసీసీలో పని విభజన లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. పీసీసీ పాత కార్యవర్గం ఉందో లేదో స్పష్టత ఇవ్వాలని కోరారు. -
కేసీఆర్ నుంచి స్పందన రాలేదు
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కసరత్త చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ మంగళవారం హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా ఖరారు అవుతుందని ఆయన తెలిపారు. అయితే నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ లేఖ రాసిన సంగతి ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ అంశంపై కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గతేడాది జరిగిన వరంగల్ లోక్‌సభ స్థానానికి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అయితే ఆయన్ని కేసీఆర్ తన కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వివేక్, ఎం రాజయ్య, బలరాం నాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరు కూడా వినపడింది. కానీ ఎవరిని ఖరారు చేసేది మరో మూడు నాలుగు రోజుల్లో తెలనుంది. అలాగే మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి ఆగస్టు 25వ తేదీన గుండెపోటుతో ఆకస్మాత్తుగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. -
టీడీపీ..మునిగిన నావ : మంత్రి హరీశ్‌రావు
నారాయణఖేడ్ (మెదక్) : 'తెలుగుదేశం పార్టీ మునిగిన నావ, ఆ పార్టీకి ఓట్లేస్తే మురికి కాల్వలో వేసినట్టే..' అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కనుమరుగయిందన్నారు. ప్రజలు ఆ పార్టీ గురించి మర్చిపోవాలన్నారు. గాయత్రీ షుగర్స్ పరిధిలోని రైతులకు చెరకు బిల్లుల బకాయి రూ.11.30 కోట్లు ఈ నెల 17వ తేదీలోగా చెల్లించన్నుట్లు హరీశ్‌రావు తెలిపారు. ట్రాన్స్‌కో అధికారులు రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు ముడుపులు అడిగితే సస్పెండ్ చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. -
దసరా తర్వాతే పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీ
హైదరాబాద్ : నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ... మిషన్ కాకతీయ, సంక్షేమ కార్యక్రమాలపై రేపు సభలో చర్చిస్తామన్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే అని ఆయన తెలిపారు. దసరా పండగ తర్వాతే పార్టీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. అలాగే ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. -
నారాయణ్‌ఖేడ్ ఎన్నిక ఏకగ్రీవం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కిష్టారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. కిష్టారెడ్డి మృతి నేపథ్యంలో నిర్వహించే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని సభదృష్టికి తెచ్చారు. ఆయన కుటుంబం నుంచి ఒకరు ఏకగ్రీవంగా సభకు వచ్చేలా సీఎం కేసీఆర్‌తోపాటు అన్ని పక్షాల నేతలు సహకరించాలని కోరారు. ఇదే ఆయనకు సమర్పించే నివాళి అన్నారు. అయితే అంతకుముందు మాట్లాడిన సీఎల్పీ నేత జానారెడ్డి మాత్రం.. మాటమాత్రంగా కూడా ఈ విషయాన్ని పేర్కొనకపోవటం విశేషం. పార్టీ సభ్యులు చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, డీకే అరుణలు కూడా ఏకగ్రీవం అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనపై సీఎం ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దశాబ్దాల అనుబంధం: సీఎం మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తనకు కిష్టారెడ్డితో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంద ని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలున్న నేతగా కొనసాగారని, సభలో ఆవేశకావేశాలు ఏర్పడితే సర్దిచెప్పేం దుకు యత్నించే వారన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ.. తాను, కిష్టారెడ్డి ఒకేసారి సమితి అధ్యక్షులుగా ఎన్నికై, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని గుర్తుచేసుకున్నారు. ప్రతి విషయంలో పార్టీలకతీతంగా కిష్టారెడ్డి సూచనలు సలహాలు ఇచ్చేవారని టీడీఎల్పీ నేత దయాకరరావు అన్నారు. రాజకీయాల్లో షార్ట్‌కట్స్ ఉండవని, ప్రజల కోసం పనిచేస్తే ఎదుగుదల సాధ్యమని నిరూపించిన నేత కిష్టారెడ్టి అని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. వివాదరహితుడుగా రాజకీయ జీవితం గడిపారని వైఎస్సార్ కాంగ్రెస్ పక్షనేత పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మజ్లిస్, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు కిష్టారెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారు. కిష్టారెడ్డికి సంతాపం వ్యక్తం చేసే సమయంలో గీతారెడ్డి భావేద్వేగానికి లోనయ్యారు. ఒకదశలో కన్నీళ్లు పెట్టుకుని, కొన్ని క్షణాలపాటు మౌనంగా ఉండిపోయారు. -
కన్నీటి సంద్రమైన ఖేడ్
-
ఎమ్మెల్యే మృతితో నారాయణఖేడ్ బంద్
నారాయణఖేడ్ : ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మృతి చెందడంతో నారాయణఖేడ్‌లో వ్యాపారులు, పాఠశాలల యాజమాన్యాలు రెండురోజులపాటు స్వచ్ఛందంగా మూసివేశారు. ఎమ్మెల్యే మరణించారన్న సమాచారం తెలియడంతో వ్యాపారులు, పాఠశాలల యాజమాన్యాలు మంగళవారం, బుధవారం రెండురోజులు సెలవు ప్రకటించారు. బుధవారం నారాయణఖేడ్‌లో ఎలాంటి వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరచుకోలేదు. తమ నేత దూరమవడాన్ని జీర్ణించుకోలేక స్వచ్చందంగా బంద్‌ను నిర్వహించారు. మంగళవారం సంత రోజు అయినా వ్యాపారులు బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సైతం ఉద్యోగులు కన్పించలేదు. అందరూ కిష్టారెడ్డి భౌతికకాయానికి చూసేందుకు తరలి వెళ్ళారు. -
పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూత * కేసీఆర్, రాహుల్, ఉత్తమ్, జానా సంతాపం * నేడు మెదక్ జిల్లా పంచగామలో అంత్యక్రియలు * హాజరవనున్న సీఎం, కాంగ్రెస్ నేతలు సాక్షి, హైదరాబాద్/నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి (73) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం రాత్రి రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని నిద్రపోయిన ఆయన మంగళవారం ఉదయానికి నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. నిద్రలో తీవ్రమైన గుండెపోటు రావడమే మరణానికి కారణమని తేల్చారు. అభిమానుల సందర్శనార్థం కిష్టారెడ్డి భౌతిక కాయాన్ని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు తరలించారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్వగ్రామం పంచగామలోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొననున్నారు. కిష్టారెడ్డి మృతిపట్ల ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కిష్టారెడ్డి కుటుంబసభ్యులతో రాహుల్ ఫోనులో మాట్లాడారు. వారికి ధైర్యవచనాలు చెప్పారు. కిష్టారెడ్డి, తాను ఒకే జిల్లాకు చెందిన వారిమంటూ కేసీఆర్ తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిష్టారెడ్డి మరణవార్త తెలియగానే ప్రజాప్రతినిధులు, ఆయన అభిమానులు కిమ్స్‌కు చేరుకున్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు డి.శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తదితరులు పార్థివదేహానికి నివాళులర్పించారు. నేతల నివాళులు కిష్టారెడ్డి నిరంతరం ప్రజల కోసం పరితపించే మనిషని ఉత్తమ్ అన్నారు. ఆయన హఠాన్మరణం వ్యక్తిగతంగా తనకు, పార్టీకి తీరని లోటన్నారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారన్నారు. ఆయన 50 ఏళ్లుగా తనతో కలిసి పనిచేసిన మంచి మిత్రుడని జైపాల్‌రెడ్డి అన్నారు. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు జితేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, డీకే అరుణ, దామోదర్ రాజనరసింహ, రాంరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, విజయరామారావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మదన్మోహన్, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు కిష్టారెడ్డి పార్థివదేహానికి నిమ్స్‌లో నివాళులు అర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్ సంతాపం ప్రకటించారు. పంచాయతీ స్థాయి నుంచి... 1942 అక్టోబర్ 2న జన్మించిన కిష్టారెడ్డి ఉస్మానియా నుంచి న్యాయవిద్యలో డిగ్రీ పొందారు. సంగారెడ్డి కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. స్వాతంత్య్రయోధుడు చివురావు షెట్కార్ శిష్యుడైన ఆయన, తన బావ, కాంగ్రెస్ సీనియర్ నేత బాగారెడ్డి ప్రభావంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1970 నుంచి 1980 దాకా పంచగామ సర్పంచ్‌గా, 1981 నుంచి 1986 దాకా పంచాయతీ సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1989, 1999, 2009, 2014ల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999-2004 మధ్య రెండుసార్లు పీఏసీ చైర్మన్‌గా చేశారు. ఆర్నెల్ల క్రితమే మూడోసారి పీఏసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పీఏసీ భేటీలో పాల్గొనేందుకే సోమవారం హైదరాబాద్ వచ్చారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సంజీవరెడ్డి నారాయణఖేడ్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు. -
నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కన్నుమూత
-
నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కన్నుమూత
మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో నిద్రలో ఉన్న ఆయనకు తీవ్ర గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. కిష్టారెడ్డికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. నారాయణఖేడ్ మండలం పంచగావ్లో కిష్టారెడ్డి జన్మించారు. 1989, 1999, 2009, 2014లో కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ పీఏసీ ఛైర్మన్‌గా పటోళ్ల కిష్టారెడ్డి వ్యవహరిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యేగా ఎదిగారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. -
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
మెదక్ (నారాయణఖేడ్) : రేషన్ షాపులపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నారాయణఖేడ్‌లోని రెండు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. రెండు వారాల నుంచి రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తున్న అధికారులు ఓ డీలర్‌పై చర్యలు తీసుకున్నారు. తాజాగా డీఎస్ఓ రమేష్ ఆదేశాల మేరకు పటాన్చెరు డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకర్, సంగారెడ్డి డిప్యూటీ తహశీల్దార్ సురేష్‌కుమార్‌లు పట్టణంలోని 34, 49 నెంబరు రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లో సరుకుల పంపిణీ రికార్డులను, నిల్వ వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు కార్డుదారులతో సరుకుల పంపిణీ తీరుపై అడగి తెలుసుకున్నారు. ఏ ఏ సరుకులు ఎంతమేర ఇస్తున్నారు, కార్డులో ఉన్న సభ్యుల సంఖ్య, ఇచ్చే ధరలపై కార్డుదారులను వివరాలు అడగి నమోదు చేసుకున్నారు. పట్టణంలో సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదన్న ఫిర్యాదులపై డీఎస్ఓ ఆదేశాలమేరకు తనిఖీలు చేపట్టినట్లు డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకర్ తెలిపారు. కార్డుదారుల స్టేట్మెంట్ నమోదు చేస్తున్నామన్నారు. ఏవైనా తేడాలు వస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన ముగ్గురికి రిమాండ్
నారాయణఖేడ్: అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఖేడ్ సీఐ ముని తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని అబ్బెందలో ఉన్న అంబేద్కర్ విగ్రహం కుడి చేతి భాగాన్ని ఈ నెల 22న రాత్రి 2గంటలకు ధ్వంసం చేశారు. దీనిపై వీఆర్వో శ్యామ్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సర్పంచ్ భర్త అయిన గ్రామ మచ్కూరీ అనంత్ మరో ఇద్దరితో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వినియోగం, రికార్డులు అప్పగించని కారణంగా సర్పంచ్ పార్వతి చెక్ పవర్‌ను రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని అనంత్ గ్రామంలో గొడవలు సృష్టించేందుకు నాందేవ్, పండరితో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ నెపాన్ని ఇతరుల పైకి నెట్టేందుకు కుట్ర పన్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారు ముగ్గురూ దళితులేనని తెలిపారు. సంఘటనపై న్యాయ సలహా తీసుకొని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని సీఐ చెప్పారు. ఆయనతో పాటు ఎస్ఐ సునీల్, సిబ్బంది ఉన్నారు. -
చెరకు చేదే
నారాయణఖేడ్ రూరల్: చెరకు రైతులకు ప్రతీఏడు చేదు పరిస్థితులే మిగులుతున్నాయి. తాము పండించిన పంటకు సరైన గిట్టుబాటుకు విక్రయించుకొనే పరిస్థితి చెరుకు రైతుకు లేకుండా పోతుంది. యాజమాన్యాలు నిర్ణయించిన ధరకే రైతులు పంటను అమ్మాల్సిన పరిస్థితి. ప్రతీ ఏడు పంటసాగుకు తీవ్ర ఇబ్బందులు, పెట్టుబడులు పెరిగిపోవడం పరిపాటిగా మారుతున్నా పంట విక్రయించే సరికి మద్దతు ధర లభించడంలేదు. రెండు మూడేళ్ళుగా ఒకే ధర ఉండడం రైతులకు ఆశనీపాతంగా మారుతోంది. ఈ ఏడు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు తోడు విపరీతమైన కరెంటు కోతలు. ఫలితం సాగుచేసిన చెరకు పంటకు సరిపడా నీరందడం లేదు. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ చెరకుకు మాత్రం గత ఏడాది ఇచ్చిన ధరనే ఇస్తామని కర్మాగార యాజమాన్యం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈనెల 9న క్రషింగ్‌ను ప్రారంభించింది. రైతులు టన్నుకు రూ.3,500ల చొప్పున ధర చెల్లించాలని కోరుతున్నా యాజమాన్యం మాత్రం రూ.2,600లు చెల్లిస్తామని ప్రకటించింది. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి వద్ద ఉన్న గాయత్రి షుగర్స్ పరిధిలోకి వస్తారు. కష్టానికి దక్కని ఫలితం మాగి గాయత్రి షుగర్స్ కర్మాగారం పరిధిలో మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, కల్హేర్, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, కంగ్టి మండలాలు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, మద్నూర్, బిచ్కుందు మండలాల నుంచి చెరకు అగ్రిమెంట్ అయింది. ఈ కర్మాగారంలో కేవలం నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోనే 12వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకు కర్మాగారానికి వెళ్తుంది. అంటే సాగైన చెరకులో 90 శాతం ఈ కర్మాగారానికే అగ్రిమెంట్ అయింది. నిజామాబాద్ జిల్లాలో కేవలం 3,500ల ఎకరాలలోపే చెరకు కర్మాగారానికి తరలుతుంది. కర్మాగారం నిర్ణయించిన ధర ప్రకారం ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. అందునా పె ట్టుబడులు కూడా అధికమయ్యాయని అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో చెరకు సాగుకు రూ.60 వేల నుంచి రూ.80వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలిపారు. దిగుబడులు మాత్రం 20 నుంచి 30 టన్నుల లోపే వస్తుందని తెలిపారు. ఈ లెక్కన కర్మాగారం ద్వారా టన్నుకు రూ.2,600ల చొప్పున చెల్లిస్తే కనీస పెట్టుబడే దక్కుతుందని రైతులు అంటున్నారు. రూ.3,500లు చెల్లించిన పక్షంలో తమకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఇది ఏడాది పంట కావడంతో యాజమాన్యం చెల్లించే ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ పెట్టుబడులను కూడా అప్పులు చేసి సాగు చేసినట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతానికి.. నేటికీ భిన్నత్వం చెరకు సాగులో గతంలో లాభసాటిగా ఉండగా రాను రాను చెరకు సాగు రైతులకు గుదిబండలా మారుతుంది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం ఈ దుస్థితికి కారణమని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం రంగంలో చెరకు కర్మాగారాలు ఉన్నపుడు కేంద్ర ప్రభుత్వం ఎస్ఎంపీ ధర ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రోత్సాహకాలను అందించేదని రైతులు పేర్కొం టున్నారు. దీంతో ప్రైవేట్ కంపెనీలూ ఇదే ధరను చెల్లించేవి. ఫలితంగా రైతులకు గిట్టుబాటయ్యేది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం రైతులకు ఇబ్బందికరంగా తయారయింది. ఫలితంగా రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. ప్రతీఏటా చెరకు రైతులకు ధర విషయంలో ఇబ్బందులే ఏర్పడుతున్నాయి. క్రషింగ్ ప్రారంభ సమయం దగ్గర పడుతుండడం, రైతులు గిట్టుబాటు ధర చెల్లించాలని విన్నవించడం పరిపాటిగా మారుతోంది. పెట్టుబడుల్ని దృష్టిలో పెట్టుకోవాలి మెదక్ రూరల్: నిజాం దక్కన్ షుగర్(ఎన్డీఎస్ఎల్) ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరకు టన్ను ధర రూ. 3,500 చెల్లించాలి. రైతులు వరిని వదిలేసి చెరకు తోటలను కాపాడుకున్నారు. ప్రతి ఏడాది రసాయన ఎరువుల ధరలు పెరగడంతో పాటు కూలీల రేట్లు, రవాణా చార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. సాగుకు పె రుగుతున్న ఖర్చుల ను దృష్టిలో పెట్టుకొ ని గిట్టుబాటు ధర చెల్లించాలి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి రైతుల్ని ఆదుకోవాలి. క్రషింగ్‌ను సైతం సకాలంలో ప్రారంభించి రైతులు నష్టపోకుండా చొరవ చూపాలి. -టీపీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి -
షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు
నారాయణఖేడ్/ మెదక్ రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు పాక్షికంగా దగ్ధం కాగా, టెంట్ హాస్, మీసేవ కేంద్రంతోపాటు ఫొటో స్టూడియో పూర్తిగా తగలబడి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నారాయణ ఖేడ్ పట్టణంలోని మార్వాడిగల్లిలోని ఓ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమై పాక్షికంగా నష్టం జరిగింది. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మా ర్వాడిగల్లిలో నివాసం ఉంటున్న అవుసలి రవి కుటుంబ సభ్యులతో సోమవారం రాత్రి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గల్లీలోని దేవీ మండపం వద్ద పూజలు చేసేందుకు వెళ్లారు. కాగా రవి ఇంట్లోని టీవీకి ఉన్న విద్యుత్ తీగల వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు సంఘటనను రవి కుటుంబీకులకు సమాచారం అందిం చారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైరింజన్‌ను తరలించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ టీవీ, ఇంట్లోని ఇతర వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ షార్ట సర్క్యూట్ కారణంగా మెదక్ జిల్లా మండల పరిధిలోని భూర్గుపల్లి గ్రామంలో సోమవారం రాత్రి రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సం తోష్ ఓ గదిలో టెంట్ హౌస్‌తో పాటు ఫొటో స్టూడియో, మీ సేవ కేంద్రాన్ని నడుపు తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు లాగే రాత్రి 9 గంటల ప్రాంతంలో షాపులను మూసివేసి అదే గ్రామంలో నివాస గృహానికి వెళ్లాడు. ఈ క్రమంలో సుమారు పది గంటల ప్రాంతంలో షాపు ల నుంచి పొగలు వస్తుండడంతో గ్రామస్తులు షాపు యజమాని సంతోష్‌కు చె ప్పారు. దీంతో అతను గ్రామస్తుల సహకారంతో షాపును తెరవగా అందులో ఉన్న టెంట్ బట్టలు, ఫొటో స్టూడియోకు సంబంధించిన మూడు కెమెరాలు, మీ సేవకు సంబంధించిన కంప్యూటర్, 3 ప్రింటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యా యి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బం ది వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో రూ. 4 లక్షల ఆస్తి నష్టం జరగ్గా రెండు గదులు సైతం పూర్తిగా కాలి నెర్రెలు బారాయి. ఈ ప్ర మాదంలో మొత్తం రూ. 7.40 లక్షల భా రీ ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితు లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ ప్రసాద్, వీఆర్ఓ ఆనందంలు ఘ టనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కాగా తనను ప్రభుత్వం ఆ దుకోకుంటే ఆత్మహత్య తప్ప మరోమార్గం లేదని బాధితుడు తెలిపాడు.