'ఖేడ్‌లో డిపాజిట్లు గల్లంతు ఖాయం' | Trs MP patel speaks over narayankhed by elections | Sakshi
Sakshi News home page

'ఖేడ్‌లో డిపాజిట్లు గల్లంతు ఖాయం'

Published Mon, Feb 8 2016 7:15 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

Trs MP patel speaks over narayankhed by elections

మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలోని తిరుమలాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.  ఈ నెల 13న నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement