bb Patel
-
కేసీఆర్ సన్నిహితుడికి షాక్
జహీరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుండటమే కాకుండా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన బీబీ పాటిల్ కోటకు బీటలు వారాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీఆర్ఎస్ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్ స్థానాలను కోల్పోయింది. జహీరాబాద్, బాన్సువాడ స్థానాలను మాత్రమే నిలుపుకొంది. పాటిల్ కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉండటంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభల నిర్వహణ బాధ్యతలు సైతం చూశారు. అలాగే సొంత పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ స్థానాలను సైతం నిలుపుకోలేక పోయారు. అంతే కాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో కేసీఆర్ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఈ స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇదిలా ఉంటే పాటిల్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం అయిన జుక్కల్‌లో సైతం బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండేపై గెలుపొందారు. ఎల్లారెడ్డిలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అందోల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ సైతం కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో 28 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నారాయణఖేడ్ స్థానం సైతం బీఆర్ఎస్ అభ్యర్థి అయిన భూపాల్‌రెడ్డి 6,547 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి చేతిలో ఓటమి చెందారు. బాన్సువాడ, జహీరాబాద్ సిట్టింగ్ స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ నిలుపుకొంది. గత ఎన్నికల్లో జహీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి 35 వేల ఓట్ల మెజారిటీ రాగా అది 13 వేలకు పడిపోయింది. ఇక్కడే ప్రచారానికి పరిమితం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్లమెంట్ పరిధిలో అంతంత మాత్రంగానే ప్రచారం చేశారు. ప్రధానంగా తన సొంత నియోజకవర్గం అయిన జుక్కల్‌తోపాటు కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు. అయినా వారిని ఓటమి నుంచి తప్పించలేక పోయారు. కేసీఆర్, హరీశ్‌రావు జహీరాబాద్‌కు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే పాటిల్ జహీరాబాద్ సభల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రచారానికి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోలైన ఓట్లు బీఆర్ఎస్ : 5,30,194 కాంగ్రెస్ : 5,48,348 బీజేపీ : 1,72,575 -
ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
బాన్సువాడ/కామారెడ్డి : ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించడానికి ముఖ్య మంత్రి కేసీఆర్ అన్ని విధాలా చర్యలు తీసుకొంటున్నారని, కేంద్రంలో కీలకపాత్ర పోషి స్తే రిజర్వేషన్ సాధిస్తామని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గార్డెన్లో, బాన్సువాడలోని భారత్ గార్డెన్ ఫంక్షన్ హాల్లలో టీఆర్ఎస్ నిర్వహించిన ముస్లింల సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. ఆయా సభల లో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఏనా డూ బీజేపీతో కలవలేదన్నారు. స్వాతం త్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు కాం గ్రెస్, బీజేపీలు దేశానికి చేసిందేమీ లేదన్నా రు. తెలంగాణలో 17 స్థానాల్లో గెలిపిస్తే 170 స్థానాలతో సమానంగా పోరాటం చేస్తామన్నారు. ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వైపు దేశం మొత్తం చూస్తోందని, ఆయన ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో అభివృద్ధి చెంది బంగారు భారతదేశంగా మారుతుంద ని యావత్ దేశ ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే కశ్మీర్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ వారు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల ఒరిగిందేమీ లేదని మహమూద్ అలీ పేర్కొన్నారు. సచార్ కమిటీ నివేదికను పక్కన పెట్టారన్నారు. రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం అమ్మాయిల వివాహానికి కేవలం రూ. 25 వేలు ఇచ్చి ప్రచారానికి ఫొటోలు దిగేవారని, తాము రూ. 1,00,116 ఇస్తున్నా ప్రచారం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ. 634 కోట్లు షాదీ ముబారక్‌లో లబ్ధిదారులకు అందించామన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. మరోసారి ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రాజేశ్వర్, సుభాష్‌రెడ్డి, టీఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబొద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మ, వైస్ చైర్మన్ మసూద్‌అలీ, నాయకులు ముస్తాక్ హుస్సేన్, జహీరుద్దీన్, అసద్, నేరెళ్ల ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఎంపీ టికెట్టు సిట్టింగ్‌కేనా?
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీల్లో అభ్యర్థిత్వాలపై కసరత్తు సాగుతోంది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థాయి సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది. ఈనెల 13న జహీరాబాద్ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థి ఎవరన్న దానిపై క్యాడర్లో జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలోలాగే సిట్టింగ్ ఎంపీలకే తిరిగి టికెట్లు ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి, కామారెడ్డి: పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. లోక్‌సభ నియోజక వర్గాల వారీగా సన్నాహక సభలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న జహీరాబాద్ నియోజక వర్గ సభను నిజాంసాగర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే ఎంపీ టికెట్టు ఎవరికి అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బీబీ పాటిల్ విజయం సాధించారు. తిరిగి పోటీ చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నారు. అయి తే బీబీ పాటిల్‌ను వ్యతిరేఖిస్తున్న కొందరు నేతలు తెరపైకి పలువురి పేర్లను తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న పాటిల్‌కే టికెట్టు వస్తుందని ఆయన అనుచరులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే టికెట్టు ఖరారు అయ్యిందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీం దర్‌రెడ్డి ఎంపీ టికెట్టు కోసం ప్రయత్నాలు చేశారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరిగింది. ఎంపీ పాటిల్‌కు ఒకరిద్దరు తప్ప మిగతా వారితో అంతగా సత్సంబంధాలు లేవన్న విషయం ప్రచారంలో ఉంది. దీంతో అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. సన్నాహక సభతో స్పష్టత! జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఈనెల 13న నిజాంసాగర్ ప్రాజెక్టుకు సమీపంలోని మాగి వద్ద టీఆర్ఎస్ సన్నాహక సభ నిర్వహించనున్నారు. ఈ సభతో ఎంపీ అభ్యర్థిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నా రు. పార్లమెంట్ ఎన్నికల టీం లీడర్‌గా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు ఎలా ముందుకు సాగాలన్నదానిపై ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిత్వంపై ఆయన స్పష్టత ఇస్తా రని పార్టీ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్‌ను కలిసన పాటిల్ సీఎం కేసీఆర్‌ను ఇటీవల ఎంపీ బీబీ పాటిల్ కలిశారని, ఈ సందర్భంగా ఎంపీ టికెట్టుపై సీఎంనుంచి భరోసా లభించిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఎల్లారెడ్డిలో మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఎమ్మె ల్యే ఓటమి చెందినప్పటికీ అక్కడ టీఆర్ఎస్ బలం గానే ఉంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆంధోల్ నియోజక వర్గాల్లో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ గెలుపు సులువవుతుందని ఎంపీ పాటి ల్ అనుచరులు చెబుతున్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, ఆయన విజయం సాధిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు -
టీఆర్ఎస్ గెలుపును ఆపలేరు
సాక్షి,నిజాంసాగర్(జుక్కల్): కాంగ్రెస్, టీడీపీల అరవై ఏళ్ల పాలనలో చేపట్టని అభివృద్ధిని నాలుగేళ్లలో చేశామని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. జుక్కల్ టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ సింధే బీఫారం తీసుకొని సోమవారం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాయని, ఆయా పథకాలకు ఆకర్షితులైన ప్రజలు టీఆర్ఎస్కు జైకొడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కూటములు కట్టినా టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఖాయమని, ఎత్తిపోతల ద్వారా గోదావరి జాలాలతో నిజాంసాగర్ ఆయకట్టుకు మహర్దశ రానుందని ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలు దుర్గారెడ్డి, విఠల్, మోహిజ్, గంగారెడ్డి, సత్యనారాయణ, వాజిద్ అలీ, నర్సింహులు, సాయాగౌడ్, సురేందర్, కాశయ్య, జీవన్, రమేశ్‌యాదవ్, ఇఫ్తాకర్, రాజేశ్వర్‌గౌడ్, సంఘమేశ్వర్‌గౌడ్, బేగరి రాజు, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీను, రమేశ్‌గౌడ్, ఆనంద్‌కుమార్, విజయకుమార్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు నామినేషన్ వేయనున్న సింధే నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే మంగళవా రం ఎన్నికల నామినేషన్ వేయనున్నారు. మద్నూ ర్ మండల కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్ హాజరు కానున్నారని పార్టీ నేతలు తెలిపారు. -
'ఖేడ్‌లో డిపాజిట్లు గల్లంతు ఖాయం'
మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలోని తిరుమలాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 13న నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. -
'గ్రేటర్ ఎన్నికల్లో విజయం మాదే'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం మాదేనని జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు గ్రేటర్లో టీఆర్ఎస్ను గెలిపిస్తాయని చెప్పారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధిని చూసి.. ఇతర పార్టీలవారు భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎంపీ బి.బి. పాటిల్ పేర్కొన్నారు. -
తెలంగాణ పునర్నిర్మాణానికి కృషి
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ పునర్నిర్మాణానికి పాటు పడుతూ అభివృద్ధి పనుల కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తామని జహీరాబాద్ లోక్‌సభ సభ్యుడు బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. సోమవారం పిట్లం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్, జుక్కల్ టీఆర్ఎస్ ఎ మ్మెల్యేగా గెలుపొందిన హన్మంత్‌సింధేలతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలను నిర్వహించాయి. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో పాటు అసెంబ్లీ,లోక్‌సభ స్థానాల కు టీఆర్ఎస్ పార్టీని గెలిపించినందుకు వారు ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజల కోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, వ్యాపార పరంగా వెనుకబడి ఉన్న జుక్కల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక నా యకులు పిట్లం జడ్పీటీ సీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, నాయకులు రజనీకాంత్ రెడ్డి, నర్సాగౌడ్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దేవెందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.