నిజాంసాగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ పునర్నిర్మాణానికి పాటు పడుతూ అభివృద్ధి పనుల కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తామని జహీరాబాద్ లోక్‌సభ సభ్యుడు బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. సోమవారం పిట్లం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్, జుక్కల్ టీఆర్‌ఎస్ ఎ మ్మెల్యేగా గెలుపొందిన హన్మంత్‌సింధేలతో కలిసి టీఆర్‌ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలను నిర్వహించాయి.
స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో పాటు అసెంబ్లీ,లోక్‌సభ స్థానాల కు టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించినందుకు వారు ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజల కోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, వ్యాపార పరంగా వెనుకబడి ఉన్న జుక్కల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక నా యకులు పిట్లం జడ్పీటీ సీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, నాయకులు రజనీకాంత్ రెడ్డి, నర్సాగౌడ్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దేవెందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణానికి కృషి
Published Tue, May 20 2014 2:46 AM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM
Advertisement
Advertisement