వాట్సాప్ స్టేటస్‌లో లీవ్ లెటర్!
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఎక్కడ చూసిన "పుష్ప" మేనియా ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర జనం బారులు తీరుతున్నారు. ఇక స్కూళ్లలోనూ కూడా ‘పుష్ప’ హవా నడుస్తోంది.. అందులో ఒక స్కూల్లో అయితే, ఒక విద్యార్థి రాసిన లీవ్ లెటర్ వైరల్‌గా మారింది. ఎందుకో తెలుసా...?. ఆ స్టూడెంట్‌కి "పుష్ప: ది రూల్" సినిమా అంటే పిచ్చి! అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా! సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని "తపన" పట్టుకుంది. కానీ స్కూల్ కి వెళ్ళాలి! ఏం చేయాలి? ఆలోచించి ఆలోచించి, ఒక "ధైర్యమైన" నిర్ణయం తీసుకున్నాడు. మాష్టారు గారికి ఒక లెటర్ రాశాడు.
అందులో ఏముందో తెలుసా..?.. "సార్, నేను పుష్ప సినిమాకు వెళ్తున్నాను. ఎందుకంటే ఆ హీరో నా ఫేవరెట్. దయచేసి నాకు లీవ్ ఇవ్వండి." అంతే! నిజాయితీగా లీవు అడిగేశాడు. లెటర్ చదివిన టీచర్ కి మొదట షాక్..! తర్వాత ఆనందం! "ఇంత నిజాయితీగా లీవు అడిగే విద్యార్థిని ఇంతవరకు చూడలేదు" అనుకున్నారు. తన శిష్యుడు నిజం చెప్పాడు అని గర్వంగా ఫీల్ అయి..,ఏం చేశారంటే, ఆ లెటర్ ని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేశారు!. "పుష్ప" సినిమా కన్నా ఆ లెటర్ వైరల్ అయిపోయింది.
ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?
Comments
Please login to add a commentAdd a comment