సాక్షి, మహబూబాబాద్: భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రామ నామస్మరణ జరుగుతోంది.
మరోవైపు.. తెలంగాణలోని మహబూబాబాద్ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట గడియల కోసం కొందరు గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వారు ప్రసవించాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో తమ బిడ్డలకు జన్మనివ్వాలని అనుకుంటున్నారు.
వివరాల ప్రకారం.. అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రసవల కోసం గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో శుభ గడియ కోసం గర్భిణీల వేచిచూస్తున్నారు. ఈ సమయంలో ప్రసవంలో పుత్రుడు జన్మిస్తే రాముడిగా.. ఆడపిల్ల జన్మిస్తే సీతమ్మగా పేరుగా పేరు పెట్టుకుంటామని చెబుతున్నారు.
కాగా, దేశమంతా ఎదురు చూస్తున్న శుభ ముహూర్తాన సీతారాములకు జన్మనివ్వాలని గర్భిణీలు ఆరాటపడుతున్నారు. ఇక, పురిటి నొప్పులు వస్తున్నప్పటికీ నేడు శుభ ముహూర్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment