Telangana Special News
-
పంట చేనులో అయ్యప్ప మాలధారుడి మృతి
భైంసాటౌన్(నిర్మల్): పంట చేనులో పనిచేస్తుండగా ఓ అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి అనుకోకుండా అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా కుప్పకూలాడు. అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. సాయినాథ్ (38) అనే వ్యక్తి ఇటీవల అయ్యప్ప మాల వేయగా, శనివారం గ్రామంలోని పంట చేనులో పనిచేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా చేనులోనే కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పుష్ప రాజ్ మేనియా.. టీచర్కి షాక్!
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఎక్కడ చూసిన "పుష్ప" మేనియా ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర జనం బారులు తీరుతున్నారు. ఇక స్కూళ్లలోనూ కూడా ‘పుష్ప’ హవా నడుస్తోంది.. అందులో ఒక స్కూల్లో అయితే, ఒక విద్యార్థి రాసిన లీవ్ లెటర్ వైరల్గా మారింది. ఎందుకో తెలుసా...?. ఆ స్టూడెంట్కి "పుష్ప: ది రూల్" సినిమా అంటే పిచ్చి! అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా! సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని "తపన" పట్టుకుంది. కానీ స్కూల్ కి వెళ్ళాలి! ఏం చేయాలి? ఆలోచించి ఆలోచించి, ఒక "ధైర్యమైన" నిర్ణయం తీసుకున్నాడు. మాష్టారు గారికి ఒక లెటర్ రాశాడు.అందులో ఏముందో తెలుసా..?.. "సార్, నేను పుష్ప సినిమాకు వెళ్తున్నాను. ఎందుకంటే ఆ హీరో నా ఫేవరెట్. దయచేసి నాకు లీవ్ ఇవ్వండి." అంతే! నిజాయితీగా లీవు అడిగేశాడు. లెటర్ చదివిన టీచర్ కి మొదట షాక్..! తర్వాత ఆనందం! "ఇంత నిజాయితీగా లీవు అడిగే విద్యార్థిని ఇంతవరకు చూడలేదు" అనుకున్నారు. తన శిష్యుడు నిజం చెప్పాడు అని గర్వంగా ఫీల్ అయి..,ఏం చేశారంటే, ఆ లెటర్ ని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేశారు!. "పుష్ప" సినిమా కన్నా ఆ లెటర్ వైరల్ అయిపోయింది.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా? -
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో జీహెచ్ఐఏఎల్ ఒప్పందం
తెలంగాణ యువతకు ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ను పెంచేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ విమానయాన శిక్షణా కార్యక్రమాలతో పాటు.. సర్టిఫికేషన్లను అందిస్తుంది. ఇది శ్రామిక నైపుణ్యాలను బలోపేతం చేయడానికి.. విమానయాన రంగంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించినట్లు జీహెచ్ ఐఎఎల్ వెల్లడించిందిఈ సందర్భంగా జిహెచ్ ఐఎఎల్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. "విమానయాన పరిశ్రమకు నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం చాలా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా యువత ఉద్యోగావకాశాలు పొందుతారు. విమానయాన రంగానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఈ కార్యక్రమం నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుందని, రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలకు దారితీసే ప్రతిభా అంతరాలను పరిష్కరిస్తుందన్నారు. ప్రొఫెషనల్ క్యూరేటెడ్ కోర్సుల ద్వారా విమానయాన రంగంలో ఉన్నత శ్రేణి నైపుణ్యాలను అందించేందుకు జీఎంఆర్, వైఐఎస్యూల సంయుక్త కృషి రాష్ట్ర విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.అకడమిక్ క్రెడిట్లతో కూడిన సాంకేతిక నైపుణ్యాలు విద్యార్థులకు నిలువు మార్గాలు కల్పించడంతో పాటు అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో తక్షణ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ వైస్ ఛాన్సలర్ విఎల్ విఎస్ ఎస్ సుబ్బారావు అన్నారు. ఈ భాగస్వామ్యం రాష్ట్రం.. దేశం కోసం విమానయాన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేయడానికి జిహెచ్ఐఎఎల్ యొక్క నిబద్ధతకు నిదర్శనం.