భైంసాటౌన్(నిర్మల్): పంట చేనులో పనిచేస్తుండగా ఓ అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి అనుకోకుండా అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా కుప్పకూలాడు. అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. సాయినాథ్ (38) అనే వ్యక్తి ఇటీవల అయ్యప్ప మాల వేయగా, శనివారం గ్రామంలోని పంట చేనులో పనిచేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా చేనులోనే కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment