నిర్మల్: నిర్మల్‌జిల్లా ఖానాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ప్రియురాలని హత్య చేశాడో యువకుడు. తనతో పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలని హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు.
వివరాలు.. ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ముగ్గురుపై అదే కాలనీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో షెట్పల్లి అలేఖ్య(23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందారు. అలేఖ్య వదిన షెట్పల్లి జయా (25) , కొడుకు షెట్పల్లి రియన్స్ (3)కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆలేఖ్య, జయా, రియాజ్.. ఖానాపూర్ మార్కెట్‌కు వచ్చి పెళ్లి సామాను కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శివాజీ నగర్ శివారులో శ్రీకాంత్ అనే యువకుడు కాపు కాసి దాడి చేశాడు.
అయితే అలేఖ్యకు మరో యువకుడితో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. దీనిని తట్టుకోలేక అలేఖ్యపై ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తనను కాదని మరో వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోవడంతో గొడ్డలితో ఆమెపైకి దాడికి చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment