lover attack
-
Andhra Pradesh: ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని దారుణ హత్య
నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది బాలికపై సోమవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించగా.. ఇదే ఘటనలో ప్రేమోన్మాదికి కూడా 40 శాతం గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలిక సామూహిత హత్యాచారం ఘటన మరకముందే నందికొట్కూరు పట్టణంలోని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యచేసిన సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.ఏం జరిగిందంటే..కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామానికి చెందిన రామకృష్ణ, లక్ష్మి దంపతుల కుమార్తె లహరి (17). చిన్నతనంలో లహరి తండ్రి చనిపోవడంతో బాలిక అవ్వాతాతలు ఆమెను తమవద్దే ఉంచుకుని ఉన్నత చదువులు చదివిస్తామని నందికొట్కూరుకు తీసుకొచ్చి నంది జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి లహరి అవ్వాతాత ఓ గదిలో పడుకోగా, చదువుకుంటానంటూ లహరి మరో గదిలో నిద్రించింది. ఏమైందో ఏమో ఆదివారం తెల్లవారుజామున లహరి ఉన్న గదిలోంచి ఒక్కసారిగా పొగలు, మంటలు వచ్చాయి. దీంతో లహరి అవ్వాతాత వెంటనే గట్టిగా కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి చూసేసరికి లహరి పూర్తిగా కాలిపోయి అక్కడే మృతిచెందింది. అదే గదిలో వెల్దుర్తి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన బోయ ఆకుల సుబ్బారాయుడు, గిరిజా దంపతుల కుమారుడు రాఘవేంద్ర 40 శాతం కాలిన గాయాలతో కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 108 వాహనంలో రాఘవేంద్రకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం అందించేందుకు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే మృతిచెందిన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.టెన్త్ వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు..ఇక లహరి, రాఘవేంద్ర ఇద్దరూ 10వ తరగతి వరకు రామళ్లకోటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్ర బాలికను ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన లహరి తల్లి తన కుమార్తెను తన తల్లిదండ్రుల వద్దకు పంపినట్లు సమాచారం. మరోవైపు.. పదో తరగతితో చదువు ఆపేసిన రాఘవేంద్ర ప్రస్తుతం పెళ్లిళ్లకు డెకరేషన్ పనులు పనిచేస్తున్నాడు. తరచూ నందికొట్కూరులోని బాలిక వద్దకు రాత్రి వేళ్లల్లో వచ్చిపోయేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండు మూడ్రోజుల క్రితం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి కూడా బాలిక వద్దకు వచ్చిన రాఘవేంద్ర తెల్లవారుజామున ఆమెపై పెట్రోల్ పోసి చంపేశాడని బంధువుల చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రామాంజునాయక్, సీఐలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, ఓబులేసు పరిశీలించారు. అలాగే, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా కూడా నందికొట్కూరులో లహరి ఉంటున్న ఇంటిని సందర్శించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు.వాడిని చంపేయండి..నా మనరాలిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసిన వాడిని పోలీసులే చంపేయాలి. మీతో కాకపోతే వాడిని మాకు అప్పగించండి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాల్సిన నా మనవరాలిని అన్యాయంగా చంపేశాడు. అమ్మాయిలపై దాడులు చేసేవారిని పోలీసులు వదలకుండా కాల్చియాలి. వాడి మరణం చూసి ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రాకూడదు. – పార్వతమ్మ, లహరి అవ్వ -
AP: ప్రేమోన్మాది దాడి.. యువతి పరిస్థితి విషమం
సాక్షి, తిరుపతి: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతిపై దాదాపు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.వివరాల ప్రకారం..‘వేముల మండలం కొత్తపల్లికి చెందిన షర్మిలపై శనివారం సాయంత్రం ప్రేమోన్మాది కులాయప్ప దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదని షర్మిలపై 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో, బాధితురాలు.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను శనివారం రాత్రి పులివెందుల నుంచి కడప రిమ్స్‌కు తరలించారు.అయితే, షర్మిల.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడప నుండి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి విషమంగానే ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో దాడికి పాల్పడిన కులాయప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి తర్వాత కులాయప్ప పరారీలో ఉన్నాడు. -
నన్నే కాదంటావా.. ఆసుపత్రిలో నర్సుపైకి దూసుకెళ్లి..
బెంగళూరు: ఇటీవలి కాలంలో తమ ప్రేమను నిరాకరించారన్న కారణంగా యువతులపై దాడి ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఓ నర్సు.. పెళ్లికి నిరాకరించిదనే కారణంగా ఆమెపై దాడి చేశాడు యువకుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బెళగావిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. ప్రసాద్ జాదవ్ అనే వ్యక్తి అక్టోబర్ 30వ తేదీన బెళగావిలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. తాను తీసుకెళ్లిన బ్యాగులో నుంచి ఓ రాడును తీసి అక్కడే ఉన్న నర్సుపై దాడి చేయబోయాడు. ఈ క్రమంలో దాడిని గమనించిన బాధితురాలు.. అతడిని ఎంతో ధైర్యంగా అడ్డుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి లోపల ఉన్న మిగతా సిబ్బంది కూడా అతడిని అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రసాద్ జాదవ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.అయితే, ప్రసాద్ జాదవ్ కొద్దిరోజులుగా సదరు నర్సును వేధింపులకు గురిచేశాడు. ఆసుపత్రికి దగ్గరలోనే ప్రసాద్ నివాసం ఉండటంతో తరచూ నర్సును ఫాలో చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలు తెలిపింది. ఇక, ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితులు.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు ప్రసాద్ జాదవ్ ను హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న ప్రసాద్.. నర్సుపై దాడి చేశాడు. One-sided love, attack on nurseAttacked with sickle for refusing to marry.The incident came to light from CCTV footage.The incident of a young man attacking a nurse with a sickle in Belgaum city of Karnataka has created a stir.#karnataka #love #hindi #belgaum #gulynews pic.twitter.com/H4OLr0mVl0— Guly News (@gulynews) November 28, 2024 -
గచ్చిబౌలిలో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గోపన్‌పల్లి తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్(25) నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి తండా సమీపంలో నివాసం ఉంటుంది. ఇక, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేష్ అనే యువకుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే, కొద్దిరోజులుగా రాకేష్.. దీపన వెంటపడుతూ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేశాడు. రాకేష్ ప్రపోజల్‌ను ఆమె నిరాకరించడంతో దీపనపై కోపం పెంచుకున్నాడు.ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్.. ఆవేశంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న దీపన స్నేహితులు.. రాకేష్‌ను అడ్డుకోబోతుండగా వారిపైనా దాడికి పాల్పడ్డాడు. రాకేష్ దాడిలో దీపన మృతిచెందగా.. ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత రాకేష్ అక్కడి నుంచి పారిపోయాడు. మొయినాబాద్ సమీపంలో విద్యుత్ స్థంభం ఎక్కి కరెంట్ తీగలు పట్టుకుని రాకేష్ ఆత్మహత్యకు పాల్పడగా.. స్థానికులు గుర్తించి అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కసు నమోదు చేసుకున్న పోలసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
అందుకే శ్రావ్యపై మణికంఠ దాడి: ఛత్రినాక ఇన్స్పెక్టర్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని.. మరొకరితో సన్నిహితంగా ఉంటోందని ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమెను వెంబడించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగింది. ఛత్రినాక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు శ్రావ్య స్వస్థలం వరంగల్. పదిహేనేళ్ల కిందట నగరానికి వచ్చిందామె. దాడికి పాల్పడ్డ నిందితుడు మణికంఠకు శ్రావ్యకు దూరపు బంధువు. ఇదిలా ఉంటే.. శ్రావ్యకు 2019లో వివాహమైంది. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఆ పిటిషన్ నడుస్తోంది. ఈ క్రమంలో.. మణికంఠ శ్రావ్యకు దగ్గరయ్యాడు. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. విడాకుల వ్యవహారం తేలేంత వరకు ఆగమని శ్రావ్య అతన్ని కోరింది. ఆపై తల్లితో కలిసి ఎస్ఆర్టి కాలనీకి నివాసం మార్చిందామె. ఈలోపు.. శ్రావ్య గత కొంతకాలం మణిని దూరం పెడుతూ వచ్చింది. అయితే మరొకరితో చనువుగా ఉంటోందని మణికంఠ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. దీంతో మణికంఠ కోపం పెంచుకున్నాడు. ఈ ఉదయం జిమ్‌కు వెళ్లి వస్తున్న శ్రావ్యను ఫాలో అయ్యాడు. శ్రావ్య ఇంట్లోకి వెళ్ళంగానే మణికంఠ గడియ పెట్టి ఆమెపై దాడి చేశాడు. అప్పటికే శ్రావ్య ఫోన్ కాల్లో ఉంది. దీంతో మరింత రెచ్చిపోయిన మణికంఠ స్క్రూ డ్రైవర్ తో ఆమెపై దాడి చేశాడు. దీంతో శ్రావ్య ఛాతి భాగం, మొహంపై గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే.. స్థానికులు నిందితుడు మణికంఠను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సకాలంలో వైద్యం అందడంతో శ్రావ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగింది అని ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి దారుణ హత్య
నిర్మల్: నిర్మల్‌జిల్లా ఖానాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ప్రియురాలని హత్య చేశాడో యువకుడు. తనతో పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలని హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు. వివరాలు.. ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ముగ్గురుపై అదే కాలనీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో షెట్పల్లి అలేఖ్య(23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందారు. అలేఖ్య వదిన షెట్పల్లి జయా (25) , కొడుకు షెట్పల్లి రియన్స్ (3)కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆలేఖ్య, జయా, రియాజ్.. ఖానాపూర్ మార్కెట్‌కు వచ్చి పెళ్లి సామాను కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శివాజీ నగర్ శివారులో శ్రీకాంత్ అనే యువకుడు కాపు కాసి దాడి చేశాడు. అయితే అలేఖ్యకు మరో యువకుడితో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. దీనిని తట్టుకోలేక అలేఖ్యపై ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తనను కాదని మరో వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోవడంతో గొడ్డలితో ఆమెపైకి దాడికి చేసినట్లు సమాచారం. -
హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం
-
తిరుపతిలో దారుణం.. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని..
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. వారి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని ప్రియురాలి తల్లిదండ్రులపై ప్రియుడు దాడి చేశాడు. వివరాల ప్రకారం.. డక్కిలి మండల కేంద్రంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తమ ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రియురాలి పేరెంట్స్‌పై ప్రియుడు గిరి దాడి చేశాడు. ఈ క్రమంలో అతడి దాడిలో ప్రియురాలి తండ్రి తులసి జగదీష్(45) తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వెంటనే జగదీష్‌ను స్థానిక స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగదీష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, నిందితుడు గిరిని శ్రీకాళహస్తి మండలానికి చెందిన వాగివేడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: కాకినాడ తునిలో దారుణం: మహిళా చిరు వ్యాపారిని డబ్బు కోసం బెదిరించి.. -
HYD: ఐటీ ఉద్యోగిపై జొమాటో డెలివరీ బాయ్ దాడి.. ప్రేమే కారణం?
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమై యువకుడు దాడి చేశాడు. ఆమె మెడపై, చేతులపై కత్తితో దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో, హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. వాసవిపై గణేశ్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటూ గణేశ్.. వాసవిని హోటల్ వద్దకు పిలిచాడు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చింది. వారిద్దరూ మాట్లాడుకున్న కాసేపటికే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, ఆవేశానికి లోనైన గణేశ్.. తన బ్యాగులో ఉన్న కత్తిలో ఒక్కసారిగి ఆమెపై దాడి చేశాడు. మెడ, చేతిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, తనను ప్రేమించలేదన్న కోపంతోనే గణేశ్ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, వాసవి, గణేశ్.. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, గణేశ్ జొమాటోలో పనిచేస్తున్నాడు. ఇక, వీరిద్దరూ గచ్చిబౌలి ఏరియాలోని ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రియురాలికి చీరను తీసుకెళ్లి శవమయ్యాడు! -
ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, తమిళనాడు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ ప్రియురాలు బలైంది. ఆమె గొంతు కోసి కిరాతకంగా ప్రియుడు హతమార్చాడు. విక్రవాండిలో ఈ ఘటన శుక్రవారం ఉదయం కలకలం రేపింది. విల్లుపురం జిల్లా విక్రవాండి రాధాపురానికి చెందిన సుదన్ కూలీ. ఆయన కుమార్తె ధారణి(19) విల్లుపురం కేకే రోడ్డులోని కళాశాలలో నర్సింగ్ డిప్లొమో చదువుతోంది. మరుదం బాక్కంకు చెందిన వరదరాజన్‌కుమారుడు గణేషన్(25) సంగీత కార్యక్రమాలలో డ్రమ్స్ కళాకారుడు. రాధాపురంలో జరిగిన ఓ సంగీత కార్యక్రమలో ధారణిని చూసి ప్రేమలో పడ్డాడు. ఇతడి ప్రేమను ధారణి అంగీకరించడంతో రెండేళ్లుగా ఇద్దరు చెట్టా పట్ట్టాల్ వేసుకుని తిరిగారు. దూరం పెట్టడంతో ఉన్మాదిగా... మూడు నెలలుగా గణేషన్‌ను ధారణి దూరం పెట్టింది. ఈ విషయంగా ఆమెను నిలదీశాడు. సంగీత బృందంలోని మరోయువతితో గణేషన్ సన్నిహితంగా ఉండడమే ఇందుకు కారణంగా తేలింది. ఆమె కేవలం తన బృందంలో ఓ సభ్యురాలు మాత్రమేనని నచ్చచెప్పినా ధారణి వినిపించుకోలేదు. దీంతో తరచూ ఈ ఇద్దరి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. తనను పూర్తిగా ధారణి దూరం పెట్టడంతో గణేషన్ ఉన్మాదిగా మారాడు. శుక్రవారం ఉదయాన్నే నేరుగా ఆమె ఇంటి వద్దకే వెళ్లాడు. ఇంట్లో ఎవరూలేకపోవడం అతడికి కలిసి వచ్చినట్టైంది. ఆమెతో గొడవ పడ్డాడు. నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. అదే సమయంలో ఆ యువతి బంధువు ఒకరు ఇంట్లోకి రావడం, ఈ దృశ్యాన్ని చూసి కేకలు పెట్టడంతో గణేషన్ ఉడాయించాడు. అతడిని పట్టుకునేందుకు గ్రామస్తులు వెంట బడ్డా ఫలితం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి గణేషన్ కోసం గాలించారు. అదేప్రాంతంలో ఓ చోట తలదాచుకుని ఉన్న అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
తమిళనాడులో దారుణం..
సాక్షి, చెన్నై: పెళ్లికి నిరాకరించిందనే ఆగ్రహంతో ప్రియురాలిపై పెట్రోల్ పోసి ఓ ప్రేమోన్మాది తగల బెట్టాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే ఆ యువతి కన్నుమూసింది. వివరాలు.. తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలోని పనపాళయం మార్గంలో మంటల్లో కాలుతూ బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ యువతి పరుగులు తీస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. మంటల్ని ఆర్పి ఆ యువతిని పల్లడం ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో మోటారు సైకిల్ నుంచి కిందపడి గాయాలతో ఉన్న ఓ యువకుడిని గుర్తించి అతడిని కూడా హాస్పిటల్లో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో వెలుగు చూసిన దుశ్చర్య.. పోలీసుల ప్రాథమిక విచారణలో ఒకే చోట వేర్వేరు ఘటనలు జరగడం, చివరకు ఆ ఇద్దరు ప్రేమికులుగా నిర్ధారణ అయ్యింది. ఆ యువతిని ఉత్తరాదికి చెందిన పూజ(19)గా గుర్తించారు. రాయర్ పాళయంలో బంధువులతో ఉంటూ ఓ బనియన్ ఫ్యాక్టరీలో ఆమె పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అదే ఫ్యాక్టరీలో రాయర్ పాళయంకు చెందిన గుణశేఖరన్ కుమారుడు లోకేష్ (22) కూడా పని చేస్తున్నాడు. ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తేలింది. పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి నిరాకరించడంతో పాటు తనను దూరం పెట్టడంతో లోకేష్ ఉన్మాదిగా మారాడు. బుధవారం సాయంత్రం మాట్లాడాలని పనపాళయంకు పిలిపించి, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి మోటారు సైకిల్‌పై తప్పించుకుని వెళ్లే సమయంలో లోకేష్ జారి కింద పడినట్లు విచారణలో తేలింది. ఇక స్థానికుల సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది పూజను మెరుగైన చికిత్స నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గురువారం ఉదయం చికిత్స ఫలించక ఆమె మరణించింది. ఈ సమాచారంతో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతోన్న బాధితురాలు ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు. ఇదీ చదవండి: ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం -
లవ్ యూ అంటూ వెంటపడ్డాడు.. నో చెప్పడంతో ఆమె నిద్రిస్తుండగా..
ఐ లవ్ యూ.. నిన్నే ప్రేమిస్తున్నా అంటూ ఆమె వెంటపడ్డాడు. ఆమె నువ్వుంటే నాకు ఇష్టం లేదని చెప్పినా.. వెనకాలే తిరుగుతూ వేధింపులకు గురిచేశాడు. చివరిసారిగా అడుగుతున్నా.. ప్రేమిస్తావా లేదా అని బెదిరించి.. ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీలోని నుంచి గదిలో పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో 90 శాతం శరీరం కాలిపోయి బాధితురాలు ప్రాణాల కోసం పోరాడి చివరకు చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధుమ్కా ప్రాంతానికి చెందిన బాధితురాలు(19).. 12వ తరగతి చదువుతోంది. కాగా, ఆమెను ప్రేమిస్తున్నానంటూ షారుఖ్ ఖాన్ అనే యువకుడు ఆమెను వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రేమను నిరాకరించిదన్న కోపంతో ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. బాధితురాలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె గదిలో పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. దీంతో మంటలు ఆమె.. 90 శాతం కాలిపోయిన గాయాలతో బయటపడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, మెరుగైన వైద్య సేవల కోసం బాధితురాలని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనలో పోలీసులు.. నిందితుడు షారుఖ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. కాగా, షారుఖ్ ఖాన్‌ను పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో తాను ఏ తప్పు చేయలేదన్నట్టుగా చిరునవ్వుతో పోలీసులతో కలిసి వెళ్లాడు. అతడి ముఖంతో ఆనందం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సీరియస్‌గా స్పందిస్తున్నారు. అతడికి కొంచెం కూడా పశ్చాతాపం లేదని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ ఫర్ అంకితా #JusticeForAnkita హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేస్తూ న్యాయం కావాలని కోరుతున్నారు. See the shameless #Smile of Shahrukh. He has no regrets after burning a Hindu girl to de@th, even after being arrested. #JusticeForAnkita pic.twitter.com/LQ1rJAMOy9 — Akhilesh Kant Jha (@AkhileshKant) August 28, 2022 -
ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం
నల్లగొండ క్రైం: తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఓ యువతిపై ప్రేమోన్మాది విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. మాట్లాడుదామని పిలిచి అందరూ చూస్తుండగానే కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. దగ్గరలోనే ఉన్న యువతి స్నేహితులు అది చూసి గట్టిగా అరవడంతో పారిపోయాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కత్తిపోట్లకు గురైన యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటోంది. స్నేహితులను కలిసేందుకు వెళ్లగా.. నల్లగొండ పట్టణ శివార్లలోని పానగల్‌కు చెందిన గుండెబోయిన నవ్య ఇక్కడి ఎన్జీ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. పట్టణంలోని దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన మీసాల రోహిత్ కూడా ఇదే కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. కొంతకాలం నుంచి తనను ప్రేమించాలంటూ నవ్య వెంట పడుతున్నాడు. ఆమె తిరస్కరించడంతో కోపం పెంచుకున్నాడు. మంగళవారం కాలేజీకి సెలవు ఉండటంతో నవ్య తన స్నేహితురాలు శ్రేష్ఠతో కలిసి మరో స్నేహితుడు తాయిని కలిసేందుకు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ బైక్‌పై అక్కడికి చేరుకున్నాడు. ఒకసారి మాట్లాడాలని నవ్యను దగ్గరికి పిలిచాడు. ఆమె దగ్గరికి రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో నవ్య గొంతు, పొట్ట, పెదవులు, చెయ్యి మణికట్టు, కాలుపై తీవ్ర గాయాలయ్యా యి. నవ్య స్పృహ తప్పింది. అప్పటికే స్నేహితులు తాయి, శ్రేష్ఠ గట్టిగా అరవడంతో.. రోహిత్ బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందిన వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన నవ్యను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. చంపుతానని ఇంతకుముందే బెదిరింపు తనను ప్రేమించకుంటే చంపేస్తానంటూ రోహిత్ గత నెల 27న నవ్య గొంతుపై పగిలిన బీరు సీసా పెట్టి బెదిరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాధితురాలి తండ్రి రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వన్ టౌన్ సీఐ రౌతు గోపి తెలిపారు. దాడి ఘటనపై ఎస్పీ రెమా రాజేశ్వరి ఆరా తీశారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసులు ముమ్మరంగా గాలించి ఫోన్ కాల్ డేటా ఆధారంగా రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
యువతిపై మాజీ ప్రియుడు హత్యాయత్నం
మండ్య: ఓ యువకుడు యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన మండ్య నగరంలోని మండ్య వైద్య కళాశాల ఆవరణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... మండ్య తాలూకా వై యరహళ్లి గ్రామానికి చెందిన నవ్య (20) మండ్య మిమ్స్ ఎంఆర్డీ విభాగంలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన తన బంధువు పరమేశ్, నవ్య నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల నవ్య పరమేశ్‌కు దూరంగా ఉంటోంది. దీన్ని సహించలేని పరమేశ్ ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. గురువారం మధ్యాహ్నం నుంచి నవ్య కోసం అక్కడే వేచి ఉన్నాడు. 4.30 గంటల సమయంలో నవ్య కళాశాల నుంచి బయటకు రాగా తను వెంట తెచ్చుకున్న బలమైన కట్టెతో దాడి చేశాడు. దీంతో నవ్య తలకు తీవ్రంగా గాయమైంది. అక్కడే ఉన్న విద్యార్థులు పరమేశ్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్ర రక్తస్రావమైన నవ్యను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు. చదవండి: (ఎస్ఐ వివాహేతర సంబంధం.. గుట్టురట్టు చేసిన భార్య) -
Hyderabad: ప్రేమ పేరుతో వేధింపులు.. నడిరోడ్డుపై మహిళపై దాడి
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ప్రేమ పేరిట వివాహితను వేధిస్తూ.. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. హఫీజ్ బాబా నగర్లో ఓ రెస్టారెంట్ ముందు నిల్చొని ఉన్న నూరు భాను అనే మహిళపై కత్తితో దాడి చేశాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళ వెనుక నుంచి విచక్షణ రహితంగా కత్తితో పొడిచి గాయపరిచాడు. రోడ్డుపై అంత ఘోరం జరుగుతున్నా ఎవరూ అడ్డుకోకపోవడం బాధించే విషయం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని హబీబ్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సంతోష్ నగర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ‘కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎ–బ్లాక్ ప్రాంతానికి చెందిన నూర్ భాను (40) భర్త ఇంతియాజ్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నూర్ భాను కుమారుడితో కలిసి నివాసముంటోంది. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన షేక్ నసీరుద్దీన్ ఆలియాస్ హబీబ్ (32) ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నూర్ భాను ఉమర్ రెస్టారెంట్ ముందుకు రాగానే.. షేక్ నసీరుద్దీన్ వెనుక నుంచి యాక్టివా ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముఖం, చేతులు, ఇతర ప్రాంతాల్లో కత్తితో దాడి చేశాడు. బాధితురాలు అక్కడే స్పృహ కోల్పోయింది. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. ఇల్లు అద్దెకు ఇస్తానంటూ యువతిని బంధించి.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మహిళను ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. నిందితుడిని పట్టుకోవడానికి అయిదు బృందాలు ఏర్పాటు చేశాం. గతంలోనూ హబీబ్‌పై నూర్ భాను ఫిర్యాదు చేసింది. 2021లో కేసు నమోదు చేసి హాబీబ్‌ను అరెస్ట్ చేశాం’ అని ఏసీపీ పేర్కొన్నారు. అదే విధంగా చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బాధితురాలిని పరామర్శించి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చిధైర్యం చెప్పారు. చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా.. -
యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటన.. స్పందించిన డాక్టర్లు..
సాక్షి, హస్తినాపురం(హైదరాబాద్): ప్రేమోన్మాది బస్వరాజు దాడిలో గాయపడిన యువతి పూర్తిగా కోలుకోవడంతో హస్తినాపురంలోని నవీన ఆసుపత్రి వైద్యులు గురువారం డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి చైర్మన్ సుభాన్‌రెడ్డి, ఎండీ రాజవర్ధన్‌రెడ్డి, రఘుపతిరెడ్డి వైద్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో చేరినప్పుడు యువతి పొట్ట భాగంలో 18 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్నారు. అయితే, తమ ఆసుపత్రి వైద్య బృందం రణధీర్‌రెడ్డి, రవితేజ, మంజునాథ్, శ్రీను నాయక్‌లు గాయపడ్డ యువతిని ఐసీయూలో ఉంచి మెరుగైన వైద్య చికిత్స అందించారన్నారు. యువతి శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నా కూడా ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండానే బాధితురాలు పూర్తి స్థాయిలో కోలుకునే విధంగా వైద్యం అందించామని వారు తెలిపారు. -
ప్రియునికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి..
సాక్షి, శిడ్లఘట్ట(కర్ణాటక): ప్రియునికి కాబోయే భార్యపై హత్యాయత్నం చేసిన యువతి జైలుపాలైంది. శిడ్లఘట్ట తాలూకా ఆనేమడుగు గ్రామానికి చెందిన గంగోత్రి (20), మోనిక (19) అనే ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు. వీరిద్దరిని గంగరాజు (20) అనే యువకుడు గుట్టుగా ప్రేమించాడు. అయితే ఇటీవల మోనిక– గంగరాజుకు వివాహం నిశ్చయమైంది. ఇది తట్టుకోలేని గంగోత్రి ఆదివారం తెల్లవారుజామున చాకుతో దాడి చేయడంతో మోనిక చేతికి, మెడకు గాయాలయ్యాయి. దిబ్బూరహళ్లి పోలీసులు గంగోత్రిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
Gachibowli: ప్రేమను నిరాకరించిందని యువతి గొంతు కోసిన యువకుడు
-
హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు
సాక్షి, హైదరాబాద్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. ప్రేమ వద్దంటూ యువతి నిరాకరించింది.. దీంతో కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా యువతిని చంపేయాలని యువకుడు నిశ్చయించుకున్నాడు. కత్తితో అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి యువతిపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. ఈ ఘటన వట్టినాగులపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గచ్చబౌలి ఇన్స్పెక్టర్ గోనె సురేష్ వివరాలను వెల్లడించారు. వట్టినాగులపల్లిలో నివసించే తుల్జాబాయి, గణేష్‌సింగ్ దంపతులకు హనుమాన్సింగ్, రూఖీసింగ్(21) ఇద్దరు సంతానం. రూఖీసింగ్ మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బీఆర్క్ నాల్గో సంవత్సరం చదువుతోంది. కేపీహెచ్‌బీలోని ఎంఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రేమ్‌సింగ్ (21) రూఖీసింగ్‌కు రెండుసార్లు తెలిసిన వారి శుభకార్యాల్లో కనిపించింది. అన్నా అంటూ పలకరించింది. దాంతో అప్పటి నుంచి ఆమె వెంట పడటం మొదలు పెట్టాడు. ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు. చదవండి: వామ్మో! గుండె గుబేలు.. కరెంటు బిల్లు రూ.లక్షా 21వేలు ఎప్పటిలాగే బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో హనుమాన్‌సింగ్‌కు కిడ్నీలో నొప్పి రావడంతో లింగంపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంజక్షన్ ఇప్పించి తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఎవరి గదిలో వారు నిద్రించారు. అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో ఇంట్లో అలజడి కావడంతో వారికి మెలకువ వచ్చింది. చెల్లి గదిలో అలజడి అయినట్లు హనుమాన్ తల్లిదండ్రులకు చెప్పాడు. అందరూ కలిసి రూమ్ తలుపులను గట్టిగా తోయడంతో తలుపులు తెరుచుకున్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మెడ, ఎడమచేతి వేళ్లకు, ఎడమకాలిపై గాయాలయ్యాయి. ఎదురుగా ఉండే బంధువులతో కలిసి కారులో ఆమెను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కత్తితో దాడి చేసిన ప్రేమ్‌సింగ్‌ను ఇంట్లోనే బంధించి చితకబాదారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించగా వారు అతడిని కొండాపూర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని ఉరితీయాలి తమ కూతురిపై కత్తితో దాడి చేసిన నిందితుడు ప్రేమ్‌సింగ్‌ను ఉరి తీయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి చొరబడి రెండు కత్తులతో దాడి చేశాడన్నారు. అలజడితో మేల్కొన్నామని, తలుపులు పగులగొట్టి అతడిని పట్టుకున్నామన్నారు. తమ కూతురికి తీవ్ర గాయాలయ్యాయని, చికిత్స పొందుతోందన్నారు. చదవండి: ‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే.. -
యువతిపై పెట్రోలు దాడి: దిశా యాప్‌తో బాధితురాలిని రక్షించాం
-
ప్రేమించలేదంటూ యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. బోయిన్పల్లి బాపూజీ నగర్లో ఈ ఘటన జరిగింది. యువతకి స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం యువకుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి దమ్మైగూడకు చెందిన గిరీష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
లవర్‌పై యువకుడి బ్లేడుతో దాడి
క్రిష్ణగిరి: విబేధాల కారణంగా యువతిపై దాడి చేసిన వ్యక్తిని బేరికె పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరు సమీపంలోని బేరికె అన్నానగర్‌కు చెందిన లావణ్య (19), అదే ప్రాంతానికి చెందిన బంధువు శివకుమార్ (29) మధ్య విభేదాలు ఉన్నా యి. బుధవారం శివకుమార్ లావణ్యపై బ్లేడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. -
బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి..
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు వేధింపులకు గురిచేయడమే కాకుండా కిడ్నాప్‌కు యత్నించడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... చావ వినయ్ చౌదరి అనే యువకుడు కొంత కాలం క్రితం యువతితో సహజీవనం చేశాడు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు వినయ్ చౌదరి అక్రమంగా బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె ఫోన్‌ను పగలగొట్టాడు. అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. బలవంతంగా ఆమెను బయటికి ఈడ్చుకొచ్చి కారులోకి తోసి కిడ్నాప్‌కు యత్నించగా ఆమె అరుపులకు ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారు బయటికు వచ్చి నిందితుడిని పట్టుకునేందుకు యత్నించి బాధితురాలిని కాపాడారు. అదే సమయంలో వినయ్ చౌదరి అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు వినయ్ చౌదరిపై ఐపీసీ సెక్షన్ 448, 354, 427,506 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు! -
సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
సాక్షి, రంగారెడ్డి: నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగి పోలీస్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ లక్ష్మీ నగర్ కాలనీ లోటస్ హిల్స్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న షాలినిపై ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచాడు. అనంతరం ఆ యువకుడు ఇంట్లో నుంచి పారిపోతుండగా అపార్టుమెంట్ అతన్ని పట్టుకొని నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఆ యువతిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? -
ప్రేమిస్తే తాళి కట్టించుకో, లేదా కత్తితో పొడిపించుకో
సాక్షి, కర్ణాటక : ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తాళి తను ప్రేమిస్తున్న యువతి వద్దకు వెళ్లిన యువకుడు నన్ను ప్రేమిస్తుంటే తాళి కట్టించుకో, లేదంటే చాకుతో పోడిపించుకో అంటూ ఒక యువతిని అడ్డగించి ప్రశ్నించాడు. నిరాకరించిన యువతిని కత్తితో పోడిచాడు. ఈ ఘటన రాజాజీనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రాజాజీనగరకు చెందిన అభిగౌడ, సమీపంలోని ప్రకాశ్నగరకు చెందిన 19 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నాడు. అభిగౌడ రౌడీయిజం చేస్తున్నట్లు తెలిసి అమ్మాయిని అతన్ని దూరం పెట్టింది. సోమవారం సాయంత్రం యువతికి ఫోన్ చేసి అర్జంటుగా మాట్లాడాలని పిలుపించుకున్నాడు. గిరినగరలోని తన స్నేహితుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తాళి గొడవ జరిగి అతడు కత్తితో యువతి కడుపులో పొడిచాడు. తీవ్రగాయాలతో ఆమె మరణించగా దుండగుడు పరారయ్యాడు. తల్లీదండ్రులు రాజాజీనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి -
రవళికి కన్నీటి వీడ్కోలు
సంగెం: ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన రవళికి కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అశ్రు నివాళులర్పించారు. గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావు ఏకైక కూతురు రవళిపై తోటి విద్యార్థి ఫిబ్రవరి 27న హన్మకొండలోని రాంనగర్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో రవళి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం స్వ గ్రామానికి.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి హన్మకొండ, పర్వతగిరి సీఐలు సంపత్‌రావు, శ్రీధర్‌రావు పంచానామా నిర్వహించిన తర్వాత పోస్టుమార్టమ్ చేపట్టారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు రవళి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య రామచంద్రాపురం గ్రామానికి తీçసుకు వచ్చారు. విద్యార్థి్థని మృతదేహాన్ని చూడగానే బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రవళిపై దాడి చేసిన నిందితుడిని కాల్చి చంపాలని గట్టిగా నినాదాలు చేశారు. అరటి మొక్కతో పెళ్లి.. రవళి మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అరటి మొక్కతో పెళ్లి జరిపించారు. అయ్యగారు పెళ్లి తంతు జరిపిస్తుండగా రవళి తల్లితండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బందోబస్తు మధ్య అంత్యక్రియలు.. రవళి మృతదేహాన్ని ఇంటి నుంచి ఊరచెరువు శ్మశాన వాటిక వరకు పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా తరలించారు. తండ్రి సుధాకర్‌రావు తలకొరివి పెట్టి రవళి చితికి నిప్పంటించాడు. అయ్యో రవళి అంటూ అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మామునూర్ ఏసీపీ జి.శ్యాంసుందర్, హన్మకొండ, గీసుకొండ, పర్వతగిరి సీఐలు సంపత్‌రావు, సంజీవరావు, శ్రీధర్‌రావు, సంగెం, ఐనవోలు ఎస్సైలు నాగరాజు, నర్సింహరావు, 40 మంది కానిస్టేబుళ్లు, 8 మంది మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. కడసారి చూపుకు నోచుకోలేక.. కన్నకూతురును కడసారి చూసుకోని పరిస్థితి మరే తల్లితండ్రులకూ రావద్దని రవళి తల్లితండ్రులు పద్మ, సుధాకర్‌రావు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పెట్రోలు దాడిలో పూర్తిగా కళ్లు, ముఖం కాలిపోయిన కూతురు ముఖంను చూసుకోలేకపోయామని బావురుమన్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన రవళి
-
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి
వరంగల్ క్రైం: ప్రేమను నిరాకరించిదనన్న అక్కసుతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీ వ్రంగా గాయపడిన తోపుచర్ల రవళి(22) మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం యశోద ఆస్పత్రిలో కన్ను మూసింది. హన్మకొండ రాంగనర్‌లో ఫిబ్రవరి 27న లలితారెడ్డి హాస్టల్ ముందు ప్రేమోన్మాది పెండ్యాల సాయిఅన్వేష్ చేతిలో దాడికి గురైన విద్యార్థిని ఆరు రోజుల పాటు నరకం అనుభవించి మృత్యువు ఒడిలోకి చేరింది. ఐసీయూలో ఆరు రోజుల నరకయాతన.. ఫిబ్రవరి 27వ తేదీన హన్మకొండలోని రాంనగర్లో ఉదయం 9.05 గంటలకు హాస్టల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న రవళిపై ప్రేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన తరువాత చివరగా తన స్నేహితురాలు కావ్యతో నిందితుని వివరాలు చెప్పింది. ఆ తరువాత ఎంజీఎం ఆస్పత్రికి ఉదయం 9.30 గంటలకు చేరుకున్న రవళి మధ్యాహ్నం 12 గంటల వరకు చికిత్స పొందింది. మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా 3.15 గంటలకు యశోద ఆస్ప త్రిలో ఐసీయూలో చేర్చారు. అప్పటి నుంచి సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు ప్రాణా లతో పోరాడింది. ఆరు రోజుల పాటు నరకయాతన అనుభవించి చివరకు రవళి ప్రాణాలను వదిలింది. శ్వాస నాళాలు ఉబ్బి.. పెట్రోల్ దాడిలో గాయపడిన రవళి ముఖం ఎక్కువ మొత్తంలో కాలిపోయింది. తీవ్రమైన గాయాల వల్ల శ్వాసనాళాలు ఉబ్బిపోయాయి. చర్మంపై ఉన్న మూడు పొరలు పూర్తి స్థాయిలో దెబ్బతిని, ఊపిరితిత్తులు పాడైపోయాయి. ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి. శ్వాస నాళాలు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోలేక మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఐసీయూలో ఆరు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. నేడు గాంధీలో పోస్టుమార్టం.. మృతదేహానికి సోమవారం పంచనామా అనంతరం ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సెంట్రల్ జైల్లో ప్రేమోన్మాది సాయిఅన్వేష్ 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపిం చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటంతో నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. హన్మకొండ ఇన్స్పెక్టర్ సంపత్‌రావు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. హైదరబాద్‌లో పంచనామా నిర్వహించిన తరువాతనే పోస్టుమార్టం చేపడుతారు. ఆరు రోజుల పాటు హన్మకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ ఎస్సై రవళి ఆరోగ్య పరిస్థితిని దగ్గర ఉండి పర్యవేక్షించారు. సెంట్రల్ జైల్లో పేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా కాల్చిన ప్రేమోన్మాది సాయిఅన్వేష్ వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. హన్మకొండ పోలీసులు 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమైండ్ విధించారు. మృతురాలు రవళి ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటం నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. రవళి మృతిపై మంత్రి ఎర్రబెల్లి సంతాపం పాలకుర్తి: ఇటీవల హన్మకొండలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ రవళి సోమవారం మృతి చెందింది. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తిలో విలేకరులతో మాట్లాడారు. రవళి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రవళి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. అత్యంత భాధకరం పెట్రోల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ రవళి మృతి చెందటం అత్యంత బాధాకరం. ప్రేమోన్మాది సాయిఅన్వేష్ను అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇన్స్పెక్టర్ సంపత్‌రావును హైదరాబాద్‌కు పంపించి పోస్టుమార్టం నిర్వహిస్తాం. పోలీసు శాఖాపరంగా సరైన అధారాలు కోర్టుకు అందజేసి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాను. యువతులు, మహిళలను ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. షీ టీమ్స్, 100కు డయల్ చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రవీందర్, సీపీ సంగెం : రవళి స్వగ్రామం రామచంద్రాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంగెం ఎస్సై ఎం.నాగరాజు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంగళవారం రవళి మృతదేçహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్న క్రమంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. మరో తల్లికి గర్భశోకం లేకుండా చూడాలి.. ప్రేమ పేరుతో రవళిని వేధించి చివరకు పెట్రోల్ పోసి నిప్పటించి తన పైశాచికానికి బలి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి. అతడికి విధించిన శిక్షను చూసి మరో మృగాడు ఏ ఆడపిల్ల వైపు కూడా కన్నెత్తి చూడకూడదు. రవళి తల్లితండ్రులకు కలిగిన గర్భశోకం మరే తల్లిదండ్రులకు రాకుండా చూడాలి. ప్రేమ పేరుతో వేధించే వారి పట్ల చట్టాలు కఠినంగా అమలు చేయాలి. బొంపల్లి జయశ్రీ, సర్పంచ్, రామచంద్రాపురం ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి.. సమాజంలో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు పోతున్న ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి. దీంతో వారిని కళాశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రేమ పేరుతో వేధించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఒక్కగానోక్క కూతురును పొట్టన పెట్టుకున్న అన్వేష్‌ను కఠినంగా శిక్షించాలి. రవళి తల్లిదండ్రులకు తగిన న్యాయం జరిగేలా అతనిని శిక్షించాలి. కత్తి రాధిక, ఎంపీటీసీ సభ్యురాలు,రామచంద్రాపురం -
ప్రాణాలతో బయటపడతాననుకోలేదు: మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్ధిని మధులిక(17) బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఉన్మాదిగా మారిన భరత్.. ఈ నెల 6న కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మధులికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన మధులిక.. దాదాపు 15 రోజుల తర్వాత కోలుకుంది. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని, ప్రాణాపాయం లేదని, లోపలి గాయాలు తగ్గడానికి మరికొన్ని రోజులు ఇంటిపట్టునే ఉండి మందులు వాడితే సరిపోతుందని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అసలు ప్రాణాలతో బయటపడటమే కష్టమనుకున్న తమ కూతురి ప్రాణాలు కాపాడిన వైద్యులు దేవుళ్లంటూ మధులిక తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని దేవుని ప్రార్థించిన వందలాది మందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మధులిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకిదో పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తాను ప్రాణాలతో బతికి బట్టకడతానని అసలు అనుకోలేదంటూ కంటతడిపెట్టుకుంది. తనలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని దేవుడ్ని ప్రార్థించింది. ఇదిలా ఉంటే, భరత్‌ను ఎన్కౌంటర్ చేయాలని మధులిక కుటుంబం డిమాండ్ చేస్తోంది. తన కూతురి లాంటి పరిస్థితి ఏ తల్లీదండ్రులకూ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. -
భరత్‌ని కఠినంగా శిక్షించాలి: మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్ధిని మధులిక(17) బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. పదిహేను రోజులుగా యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఈ రోజు మరోసారి పూర్తిగా పరీక్షించిన వైద్యులు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా మధులిక మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడికి పాల్పడిన భరత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరింది. మధులిక వైద్య చికిత్సల కోసం ఇప్పటివరకు 10 లక్షల రూపాయలు ఖర్చు కాగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయల సహాయం అందింది. చదవండి: నోరు మూసి బలవంతంగా లాక్కెళ్లి గేటు వేశాడు -
నోరు మూసి బలవంతంగా లాక్కెళ్లి గేటు వేశాడు
కాచిగూడ: ఇంటర్ విద్యార్థిని మధులికపై ఈ నెల 6న భరత్ అనే యువకుడు కొబ్బరి బొండాల కత్తితో దాడికి పాల్పడిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన కాచిగూడ పీఎస్ పరిధిలోని బర్కత్‌పురా సత్యానగర్ లో జరిగింది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక స్టేట్మెంట్ను మూడు రోజుల క్రితం పోలీసులు రికార్డు చేసినట్లు తెలిసింది. గత మూడు నెలలుగా భరత్ తన వెంటపడి వేధిస్తున్నాడని, తరచూ తన కాలేజీ వద్దకు వచ్చి వేధింపులకు గురిచేసేవాడని మధులిక పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈనెల 6నన ఉదయం తన బాబాయ్ ఇంటికి వెళుతుండగా దారిలో తనను అడ్డుకున్న భరత్ తన నోరు మూసి బలవంతంగా పక్కనే ఉన్న ఇరుకైన సందులోకి లాక్కెళ్లి గేటు వేశాడని, అతను తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటికి తీయడంతో తాను భయంతో కేకలు వేసినట్లు చెప్పినట్లు తెలిసింది. అయినా అతను తనపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడని మధులిక పేర్కొన్నట్లు సమాచారం. భరత్ పథకం ప్రకారమే తనపై దాడి చేశాడని , అతడికి వారి బంధువుల సహకారం కూడా ఉందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెట్లో పేర్కొన్నట్లు తెలిసింది. -
జ్వరంతో బాధపడుతున్న మధులిక
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది కిరాతక దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆస్పత్రి వైద్యులు బుధవారం మెడికల్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి శరీరంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఆమెకు.. అది తగ్గేందుకు చికిత్స అందిస్తున్నామని, ఇంకా అత్యవసర విభాగంలోనే ఉంచి ఆమెకు వైద్యం కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. మధులిక ఇంకా జ్వరంతో బాధపడుతున్నారని, ఆమెకు జ్వరం వస్తూ పోతూ ఉండడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. తన ప్రేమను నిరాకరించిందని ఇంటర్ విద్యార్థిని అయిన మధులికపై ప్రేమోన్మాది భరత్ కొబ్బరిబోండాల కత్తితో కిరాతకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శరీరంలోని బలమైన గాయాలు కావడంతో గాయాలకు ఎప్పటికప్పుడు డ్రెసింగ్ చేస్తూ.. ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని యశోదా వైద్యులు తెలిపారు. -
వేధింపులతో యువతి ఆత్మహత్యాయత్నం
వరంగల్ అర్బన్: ప్రేమోన్మాది వేధింపులు భరించలేక ఒక యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోటలో జరిగింది. తనను పెళ్లి చేసుకోమంటూ మనోహర్ అనే యువకుడు ఆరు నెలలుగా రమ్య అనే యువతి వెంట పడుతున్నాడు. ఈ విషయంలో అతని సోదరులు సోమవారం రాత్రి ఆమె ఇంటి వద్ద గొడవకు దిగారు కూడా. దీంతో అవమానం భరించలేక ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో ప్రాణాపాయ స్థితిలో ఆమె చికిత్స పొందుతున్నది. -
ప్రేమించలేదని పెట్రోలు పోసి హత్యాయత్నం
సాక్షి, ఒంగోలు క్రైం: తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించబోయాడు ఓ మృగాడు. సమయానికి బాధితురాలి తల్లిదండ్రులు వచ్చి అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన వివరాల మేరకు.. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు ప్లైఓవర్ సమీపంలో ఆటోమొబైల్స్ షాపు నిర్వహిస్తున్న సాధిక్ అనే యువకుడు స్థానిక సుజాతనగర్లో నివసించే ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. డిగ్రీ చదువుతున్న ఆ యువతి అతని ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో పలుమార్లు సాధిక్ ఆ యువతి ఇంటికి వచ్చి బెదిరించాడు. తల్లిదండ్రులకు ఇది తెలిసినప్పటికీ పరువుపోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 9.20 గంటల సమయంలో పెట్రోల్ డబ్బాతో యువతి ఇంటికి వచ్చిన యువకుడు వాకిట్లో ఉన్న ఆ యువతిపై పెట్రోలు పోశాడు. ఆమె తేరుకొని కేకలు వేయడంతో తల్లిదండ్రులు బయటకు వచ్చారు. అడ్డుకోబోయిన వారిపై కూడా ఆ ఉన్మాది పెట్రోలు కుమ్మరించాడు. అతడు వెంట తెచ్చుకున్న లైటర్‌తో నిప్పటించబోయాడు. పెనుగులాటలో లైటర్ కిందపడిపోయింది. ఇంతలో ఇరుగుపొరుగు అక్కడికి చేరుకోవడంతో పెద్దగా కేకలు వేస్తూ సాధిక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రియురాలిపై కత్తితో దాడి
సాక్షి, గన్నవరం: ప్రియురాలు మాట్లాడటం లేదన్న కోపంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడిచేసి గాయపర్చాడు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ జిల్లా బగానా గ్రామానికి చెందిన కమల కాంత్ నాయక్ (23), అదే జిల్లాలోని సుందర్పూర్ గ్రామానికి చెందిన రింకీరాణి (20) రెండేళ్లుగా స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ, కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వారి మద్య ఏర్పడిన పరిచేయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే ప్రాంతం, కులం వారు కావడంతో తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. 15 రోజుల క్రితం రింకీరాణి స్వగ్రామానికి వెళ్లగా, కమల కాంత్‌నాయక్ కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధంపై మాట్లాడారు. పెళ్లి చర్చల్లో రెండు కుటుంబాల్లో భేదాభిప్రాయాలు రావటంతో వివాహం సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తిరిగి వచ్చిన రింకీరాణి తన ప్రియుడితో మాట్లాడటం మానేసింది. దీంతో కమలకాంత్‌నాయక్ ఆగ్రహం చెందాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో క్వార్టర్స్‌లోని తన గదిలో స్నేహితులతో కలిసి ఉన్న రింకీరాణితో మాట్లాడేందుకు కమలకాంత్ వెళ్లాడు. ఆమె మాట్లాడేందుకు నిరాకరించగా అకస్మాత్తుగా కత్తితో ఆమెపై దాడి చేసి గాయపర్చాడు. రింకీరాణి మెడ, నడుం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. వీరవల్లి ఎస్ఐ నాగ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కమల కాంత్ నాయక్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పెళ్లి చేసుకోమంటే.. గొంతుకోశాడు!
- వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం - గాయంతో మూగబోయిన యువతి గొంతు.. - మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలింపు ఏటూరునాగారం: ప్రేమించాడు.. పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే ప్రాణాలు తీయడానికి తెగబడ్డాడు ఓ ప్రేమోన్మాది. శనివారం రాత్రి వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన సునారికాని రాజబాబు (22) అదే గ్రామానికి చెందిన జనగాం లక్ష్మి అలియాస్ ఉపేంద్ర (19)ను ప్రేమించాడు. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలను సైతం చెడగొట్టాడు. ఆమె కాయకష్టం చేసి సంపాదించిన రూ. 80 వేలు కాజేశాడు. ఈ క్రమంలో ఇటీవలే రాజబాబుకు మేనత్త కూతురితో పెళ్లి కుదిరింది. దీంతో లక్ష్మి ‘నన్ను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటావా?’ అని రాజబాబును నిలదీసింది. ఆగ్రహించిన రాజబాబు, బావమరిదితో కలసి ఆమెను అంతమొందించడానికి పథకం రచించాడు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో లక్ష్మి ఇంట్లో నిద్రిస్తుండగా, మాట్లాడే పని ఉందంటూ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో లక్ష్మి గొంతు కోసి పరారయ్యూడు. స్పృహ కోల్పోయిన లక్ష్మి రాత్రంతా అడవిలోనే ఉంది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో మెలకువ రావడంతో ఎలాగోలా ఏటూరు గ్రామానికి చేరుకుంది. లక్ష్మిని గమనించిన గ్రామస్తులు ఏం జరిగిందని ఆరా తీసినా.. ఆమె గొంతు మూగబోవడంతో ఏమీ చెప్పలేకపోయింది. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆమెకు ఆశ్రయమిచ్చారు. వీఆర్వో గంపల నర్సయ్య పోలీసులకు సమాచారమిచ్చారు. ఈమేరకు కేసు నమోదుచేసి, నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్సై వర్స వినయ్‌కుమార్ తెలిపారు. అనంతరం లక్ష్మిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ వాహనం కంతనపల్లి సమీపంలో దిగబడింది. దీంతో బొలెరో వాహనంలో ఏటూరు నుంచి కంతనపల్లి వరకు లక్ష్మిని తరలించి అక్కడినుంచి మరో 108లో ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరా తీసిన రాజబాబు రాత్రివేళ గొంతుకోసి అడవిలో వదిలేసిన లక్ష్మి చనిపోయిందా.. లేక బతికే ఉందా..? అనే సమాచారం కోసం రాజబాబు ఏటూరులో తిరుగుతూ వాకబు చేశాడు. ఎవరైనా ఓ అమ్మాయి ఇటు వచ్చిందా? అని వాకబు కూడా చేశాడు. చంపుతానని బెదిరించాడు బ్లేడుతో రెండంగుళాల లోతులో గొంతు కోయడంతో లక్ష్మి మాట మూగబోయింది. అడవిలో జరిగిన ఘటన గురించి చెప్పలేకపోతోంది. తల్లి మల్లక్కను చూసి భోరున విలపించింది. ఏం జరిగిందని పోలీసులు అడిగితే.. తనకు జరిగిన అన్యాయాన్ని పెన్నుతో పేపర్‌పై రాసి చూపించింది. ‘నన్ను ప్రేమిస్తున్నానని రాజబాబు వెంటబడ్డాడు. నేనూ నమ్మాను. నేను కష్టపడి వెనకేసిన రూ. 80 వేలను.. మళ్లీ ఇస్తానని నమ్మబలికి కాజేశాడు. నా ఒంటిపై ఉన్న కమ్మలు, పట్టా గొలుసులు కూడా లాక్కున్నాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. అమ్మకు నేనొక్కదాన్నే ఆధారం’ అని రాసి చూపిస్తూ.. లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. -
ఈ నవ్వులు ఇక లేవు
ఈ చిరునవ్వులను ఓ ఉన్మాది చిదిమేశాడు. ఇంటి దీపాలను ఆర్పేశాడు. తన ను ప్రేమించలేదనే అక్కసుతో... మృగంగా మారిన యువకుడు... తాను మనసు పడిన అమ్మాయితో పాటు ఆమె సోదరినీ పొట్టన పెట్టుకున్నాడు. కొత్తపేటలోని గాయత్రీపురం రోడ్ నెం-1లో మంగళవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన నగరంలో కలకలం సృష్టించింది. - ప్రేమోన్మాది దాడిలో అక్కాచెల్లెళ్ల మృతి ఉలిక్కిపడిన నగరం - ఆగని హత్యోదంతాలు ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకం సాక్షి, సిటీబ్యూరో/భాగ్యనగర్ కాలనీ/ముషీరాబాద్: మహా నగరంలో ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. అబలలపై దాడులకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. మొన్న కూకట్పల్లి... నిన్న చాంద్రాయణగుట్ట... నేడు కొత్తపేట... ఇలా మృగాళ్ల పైశాచికత్వానికి అమాయక ఆడపిల్లలు గాయపడడమో...ప్రాణాలు కోల్పోవడమో పరిపాటిగా మారింది. ఈ ఘటనలు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా మరో ఉన్మాది అమాయక యువతిపై పగబట్టాడు. అల్లారు ముద్దుగా పెరిగిన అక్కాచెల్లెళ్లను కిరాతకంగా హతమార్చాడు. గొప్ప చదువులు చదువుకొని... జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశించిన వారి కలలను కాలరాశాడు. కొత్తపేట గాయత్రీపురం రోడ్ నెం-1లోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కాచెల్లెళ్లు శ్రీలేఖ, యామినిలను అమిత్ అనే ఉన్మాది అంతమొందించాడు. కొద్ది నెలల వ్యవధిలో నగరంలో చోటుచేసుకున్న దుర్ఘటనలు భీతిగొల్పుతున్నాయి. మానని గాయం... అది 2014 అక్టోబర్ 13వ తేదీ. ఎప్పటిలాగానే రవళి బండ్లగూడలోని అరోరా కళాశాలకు బయలుదేరింది. బస్సు దిగి లోనికి ప్రవేశిస్తుండగానే... మానవ రూపంలో ఉన్న మృగం దాడి చేసింది. తనను ప్రేమించాలని కొంతకాలంగా వెంటపడుతున్న ప్రేమోన్మాది కాలేజీ బ్యాగ్‌లో కత్తిని పెట్టుకొని వచ్చి అందరూ చూస్తుండగానే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రవళి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కానీ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. ఆమెపై దాడి చేసిన ప్రేమోన్మాది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ గాయం నుంచి నెమ్మదిగా బయటపడిన రవళి అదే కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ‘ఆ సంఘటన తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. రిటైర్డు బ్యాంకు ఉద్యోగి అయిన మా నాన్న గోపిదేవ్ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు రాంనగర్ చౌరస్తా వరకు వచ్చి బస్సెక్కిస్తారు. సాయంత్రం తిరిగి తీసుకెళ్తారు. ఆ దాడిని ఇంట్లో ఎవ్వరమూ మరచిపోలేకపోతున్నాం’ అంటూ రవళి గద్గద స్వరంతో చెప్పింది. ‘ఇటువంటి సంఘటన ఏ తల్లిదండ్రులకూ ఎదురు కాకుడదు... పెళ్లయ్యే వరకూ పిల్లలను మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ ప్రభుత్వమూ, ఏ షీ టీమ్‌లూ రక్షణ కల్పించలేవని’ రవళి తండ్రి గోపిదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. బిడ్డలను కాపాడుకున్న వల్లభరావు... పెళ్లికి నిరాకరించిందన్న కసితో ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ తెల్లవారు జామున 5.30 గంటలకు కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో ఓ యువతిపై మరో ప్రేమోన్మాది దాడికి దిగాడు. తూర్పు గోదావరి జిల్లా ఎర్రపాలెంకు చెందిన వల్లభరావుకు ముగ్గురు కూతుళ్లు. మూడో కుమార్తె నీరజ కష్ణవేణిని చేవెళ్ల బ్రాహ్మణ కాలనీకి చెందిన నేదరి మల్లేష్ అలియాస్ రాజు అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించి చివరకు కత్తితో దాడి చే శాడు. ఆమె తిరస్కరణను సహించలేక హతమార్చేందుకు సిద్ధపడ్డాడు. తల్లి తులసమ్మ, సోదరుడైన దుర్గా గంగాధర్లపైన దాడికి దిగాడు. యువతి తండ్రి వల్లభరావు ఆ సమయంలో బయటి నుంచి ఇంటికి రావడం... నిందితుడిపై ప్రతి దాడికి దిగడంతో వారు బతికి బయటపడ్డారు. లేకపోతే ఆ యువతితో పాటు, తల్లి, సోదరుడు బలయ్యేవారే. వల్లభరావు చేతిలో గాయపడ్డ ఉన్మాది అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్భయ చట్టాన్ని అమలు చేయండి చైతన్యపురి: నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని ఎన్ఎస్యూఐ నాయకులు సాయిగౌడ్, ప్రవీణ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యామిని, శ్రీలేఖ హత్యలకు నిరసనగా మంగళవారం చైతన్యపురిలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ప్రేమోన్మాది అమిత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరం నడిబొడ్డున యువతులను ప్రేమోన్మాది హతమార్చినా హోం మంత్రి స్పందించకపోవడం దారుణమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బీజేవైఎం ఆధ్వర్యంలో... ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో చైతన్యపురి నుంచి కొత్తపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోల్గం యశ్పాల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో మహిళలు, యువతులక రక్షణ కరవ వుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్‌రెడ్డి, కిరణ్, తరుణ్, భరత్, యాదగిరి, శివ, శ్రీకాంత్, నవీన్, నగేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కఠినంగా శిక్షించాలి నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా ఈ హత్యాకాండ ఆగడం లేదు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న అక్కాచెల్లెళ్లను నిందితుడు దారుణంగా హతమార్చాడు. ఆ హంతకుడిని అత్యంత కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. చిన్నారులను సైతం ఈ మృగాళ్లు వదిలిపెట్టడం లేదు. రెండు, మూడేళ్ల పసిపిల్లలు మొదలు వయస్సు పైబడిన మహిళల వరకూ ఇలాంటి మృగాళ్ల లైంగిక దాడులకు, హింసకు బలవుతూనే ఉన్నారు. ఇటువంటి దుర్మార్గుల పీచమణిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. షీ టీమ్స్ ఉన్నాయి. శిక్షలు కఠినంగా ఉంటే తప్ప మృగాళ్లలో మార్పు రాదనిపిస్తోంది. - కొమ్ము ఉమాదేవి యాదవ్, టీఆర్ఎస్ మహిళా విభాగం చిన్నప్పటి నుంచే విలువలు నేర్పాలి చిన్నప్పటి నుంచి పిల్లలకు నైతిక విలువలు నేర్పించకపోతే ఇలాంటి మృగాళ్లే తయారవుతారు. సహజంగా మనిషి ఆలోచనా జీవి. కానీ ఆ ఆలోచన విస్మరించడం వల్లనే మృగాడుగా మారుతున్నాడు. ఈ ఆలోచన కోల్పోవడానికి తల్లిదండ్రులు, కుటుంబం మాత్రమే బాధ్యులు కారు. అలాగని పోలీసులు, స్కూళ్లు, కాలేజీలనూ బాధ్యులను చేయడం సరికాదు. మొత్తం సమాజంలోనే మార్పు రావాలి. - లలిత దాస్, మానసిక నిపుణురాలు -
పెళ్లాడమంటే చంపబోయాడు ..
ప్రేమించిన యువతిని కాదని, మరొకరిని వివాహం చేసుకునేందుకు ప్రియుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. తనను వివాహం చేసుకోవాలని అడిగినందుకు స్నేహితులతో కలిసి ప్రేమికురాలిని హత్య చేసేందుకు యత్నించాడు. మోపిదేవి మండలం పెద కళ్లేపల్లిలో ఈ ఘటన జరిగింది. అవనిగడ్డ: ప్రేమించిన యువతిపై ప్రియుడు స్నేహితులతో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మోపిదేవి మం డలం పెదకళ్లేపల్లిలో జరిగిన ఈ ఘటన ఈ ప్రాం తంలో కలకలం సృష్టించింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నంబూరి గౌతమి ప్రియాంక అదే గ్రామానికి చెందిన అనుమకొండ ఈశ్వరరావు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల క్రితం అతడు వేరే యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక తనను వివాహం చేసుకోవాలని కోరింది. ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక బుధవారం రాత్రి బాత్రూమ్కు వెళుతుండగా ముగ్గురు యువకులు గోడ దూకి ఇంటి ఆవరణలోకి చొరబడ్డారు. ఒకరు వెనుక నుంచి ఆమె కళ్లుమూయగా, మరొకరు కేకలు వేయకుండా గమ్ పూసిన పేపర్‌ను నోటికి అడ్డుగా పెట్టాడు. ఇంకో వ్యక్తి నైలాన్ తాడుతో గొంతుబిగించి చంపేందుకు యత్నించాడు. దీంతో ఆమె పెనుగులాడి విడిపించుకుంది. ఆమె కేకలు విని బాబాయి భాస్కరరావు రావడంతో యువకులు పరారయ్యారు. అనంతరం ఆమె స్పృహ తప్పి పడిపోగా, 108లో అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలు ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈశ్వరరావు మోసం చేశాడని, తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. విషయం తెలుసుకున్న సోషల్ యాక్షన్ కమిటీ అవనిగడ్డ అధ్యక్షురాలు టీపీఎం బేగం, మోపిదేవి మండల అధ్యక్షురాలు గండి సుశీల వైద్యశాలకు వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ప్రేమపేరుతో నమ్మించి, తరువాత వదిలించుకో వాలని చూడటం దారుణమని పేర్కొన్నారు. ప్రియాం కకు న్యాయం చేసి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చల్లప ల్లి పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రియుడే హంతకుడు
కర్నూలు, న్యూస్‌లైన్ : తనకు నచ్చని వారితో తిరుగుతోందన్న అనుమానంతో ప్రియురాలిని హత్యచేసిన ఓ వ్యక్తి నేరం బయటకు రాకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తమదైన రీతిలో విచారణ ప్రారంభించి ఎట్టకేలకు ఛేదించారు. ఇందిరాగాంధీ నగర్ సీపీఎం కార్యాలయ సమీపంలో మురుగు కాల్వలో లభించిన మహిళ మృతదేహం కేసులో ముగ్గురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం ఫోర్థ్ టౌన్ సీఐ కేశవరెడ్డి సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గొంతుకు తాళ్లతో బిగించి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు గుర్తు తెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారం గడవకముందే కేసు మిస్టరీని ఛేదించారు. ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన వడ్డె రంగ మురళి, అతని తల్లి శేషమ్మ, స్నేహితుడు చాకలి బండరాముడిని అరెస్ట్ చేసి గురువారం మధ్యాహ్నం కర్నూలు డీఎస్పీ వైవి.రమణకుమార్ ఎదుట హాజరు పరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ పిటి.కేశవరెడ్డితో కలిసి డీఎస్పీ రమణకుమార్ విలేకరులకు వెల్లడించారు. హైదరాబాద్ శివరాంపల్లి ప్రాంతానికి చెందిన బుడగ జంగాల ముత్యాలమ్మ(32) రెండో భర్త రాముడితో మనస్పర్థలు రావడంతో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఏడాదిన్నర క్రితం కర్నూలు చేరుకుంది. రైల్వే స్టేషన్లో ఉంటూ ప్లాట్‌ఫారంతోపాటు నగరంలో కూడా హిజ్రాలతో కలిసి భిక్షాటన చేస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన వడ్డె రంగమురళితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య కొంతకాలం వివాహేతర సంబంధం కొనసాగింది. అనంతరం ఆమెపై అనుమానం పెంచుకున్న రంగ మురళి తాను చెప్పినట్టే నడుచుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఈ నేపథ్యంలో తనను వదిలించుకునేందుకు ముత్యాలమ్మ ప్రయత్నిస్తున్నదని గ్రహించి ఈనెల 9 వతేదీ రాత్రి డోన్ నుంచి యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి తెల్లవారుజామున రెండు గంటల కు కర్నూలు చేరుకున్నాడు. ఇందిరాగాంధీ నగర్లో ఉన్న తన ఇంటికి పిలుచుకెళ్లి హత్య చేశాడు. తల్లి శేషమ్మ, మిత్రుడు చాకలి రాముడి సాయంతో మృతదేహాన్ని సంచిలో మూట గట్టి కేసీ కాల్వలో పడేసే ప్రయత్నంలో మురికి కాల్వ వద్ద మూట జారిపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెతోపాటు రైల్వే స్టేషన్లో తిరిగిన మహిళలు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు వడ్డె రంగ మురళి కొత్త బస్టాండ్ దగ్గర అరటి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. విచారణలో నేరం అంగీకరించాడు. -
అనంతపురంలో ప్రేమోన్మాది ఘాతుకం
అనంతపురం: అనంతపురంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసి ఘాతుకానికి పాల్పడ్డాడు. రాఘవ అనే యువకుడు డిగ్రీ విద్యార్ధిని వాణి తనని ప్రేమించడం లేదని ఆ విద్యార్థినిపై యాసిడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రాఘవ తనని ప్రేమించాలంటూ ముదిగుబ్బకు చెందిన వాణి వెంటపడ్డాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో గతంలో ఓసారి వాణి ముదిగుబ్బ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాఘవను హెచ్చరించి విడిచిపెట్టారు. ఈరోజు మళ్లీ వెంటపడి ఎన్ హెచ్ 44 బళ్లారి రోడ్డులో వాణి వెళుతుండగా శరీరంపై యాసిడ్ పోశాడు. ఆ తరువాత రాఘవ పరారయ్యాడు.