
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో ఈ ఘటన జరిగింది. యువతకి స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం యువకుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి దమ్మైగూడకు చెందిన గిరీష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment