
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నవకేతన్ కాంప్లెక్స్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసే యత్నం చేస్తున్నారు. సెల్లార్ నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. చుట్టుపక్కల ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదానికి గల కారణాలు.. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment