
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో విషాదం నెలకొంది. ఆర్థిక కారణాలతో ఓల్డ్ బోయిన్‌పల్లి భవానీ నగర్‌లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చి, తర్వాత తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో తండ్రితోపాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను తండ్రి శ్రీకాంత్(42), పిల్లలు స్రవంతి(8), శ్రావ్యగా(7) గుర్తించారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ద్యర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వీరి ఆత్మహత్యలకు అసలు కారణాలు ఏంటన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ వెండి షాపులో శ్రీకాంత్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: మాట కలిపి, కారం చల్లి.. ఆపై దారుణం!
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment