అందుకే శ్రావ్యపై మణికంఠ దాడి: ఛత్రినాక ఇన్స్పెక్టర్ | Hyderabad: Boyfriend Attacked His Girlfriend With A Knife In Chatrinaka | Sakshi
Sakshi News home page

అందుకే శ్రావ్యపై మణికంఠ దాడి: ఛత్రినాక ఇన్స్పెక్టర్

Published Tue, Jun 18 2024 10:50 AM | Last Updated on Tue, Jun 18 2024 1:41 PM

Lover Attacked His Girl Friend At Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని.. మరొకరితో సన్నిహితంగా ఉంటోందని ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమెను వెంబడించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగింది. 

ఛత్రినాక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు శ్రావ్య స్వస్థలం వరంగల్‌. పదిహేనేళ్ల కిందట నగరానికి వచ్చిందామె. దాడికి పాల్పడ్డ నిందితుడు మణికంఠకు శ్రావ్యకు దూరపు బంధువు. ఇదిలా ఉంటే.. శ్రావ్యకు 2019లో వివాహమైంది. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఆ పిటిషన్‌ నడుస్తోంది. 

ఈ క్రమంలో.. మణికంఠ శ్రావ్యకు దగ్గరయ్యాడు. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. విడాకుల వ్యవహారం తేలేంత వరకు ఆగమని శ్రావ్య అతన్ని కోరింది. ఆపై తల్లితో కలిసి ఎస్ఆర్టి కాలనీకి నివాసం మార్చిందామె. ఈలోపు.. శ్రావ్య గత కొంతకాలం మణిని దూరం పెడుతూ వచ్చింది. అయితే మరొకరితో చనువుగా ఉంటోందని మణికంఠ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. 

దీంతో మణికంఠ కోపం పెంచుకున్నాడు. ఈ ఉదయం జిమ్‌కు వెళ్లి వస్తున్న శ్రావ్యను ఫాలో అయ్యాడు. శ్రావ్య ఇంట్లోకి వెళ్ళంగానే మణికంఠ గడియ పెట్టి ఆమెపై దాడి చేశాడు. అప్పటికే శ్రావ్య ఫోన్‌ కాల్‌లో ఉంది. దీంతో మరింత రెచ్చిపోయిన మణికంఠ స్క్రూ డ్రైవర్ తో ఆమెపై దాడి చేశాడు. దీంతో శ్రావ్య ఛాతి భాగం, మొహంపై గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే.. స్థానికులు నిందితుడు మణికంఠను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సకాలంలో వైద్యం అందడంతో శ్రావ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగింది అని ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement