old city
-
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
-
HYD: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని మదీనా, అబ్బాస్ టవర్స్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.వివరాల ప్రకారం.. పాతబస్తీలోని దివాన్‌దేవిడిలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదీనా, అబ్బాస్ టవర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భవనం నాలుగో అంతస్తులోని వస్త్ర దుకాణం నుంచి వచ్చిన మంటలు.. పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి.ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
అలనాటి స్మృతుల్లో.. అలా సాగిపోతూ..
శతాబ్దాల చారిత్రక అస్తిత్వం.. హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. విభిన్న జీవన సంస్కృతుల సమాహారం పాతబస్తీ.. కుతుబ్‌షాహీల నుంచి ఆసఫ్‌జాహీల వరకు 400 ఏళ్ల నాటి చార్మినార్ మొదలుకొని ఎన్నెన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, మరెన్నో అందమైన ప్యాలెస్‌లు, మహళ్లు, దర్వాజాలు, దేవిడీలు, బౌలీలు, నవాబుల సమాధులు, పార్కులు ప్రపంచ చిత్రపటంలో పాతబస్తీ ఉనికిని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. హైదరాబాద్‌కు వచ్చే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు పాతబస్తీని సందర్శిస్తేనే ఆ పర్యటన పరిపూర్ణం అవుతుంది. అలాంటి పాతబస్తీలో ఇప్పుడు మెట్రో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏ ఒక్క చారిత్రక కట్టడానికి విఘాతం కలిగించకుండా, వాటి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెట్రో మెలికలు తిరగనుంది. చారిత్రక కట్టడాలను చుట్టేస్తూ మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల వందేళ్లకు పైబడిన ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు తదితర భవనాలు పాక్షికంగానో, పూర్తిగానో నేలమట్టం కానున్నాయి. సుమారు 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ గుర్తించింది. ఇప్పటి వరకు 270 మంది తమ ఆస్తులు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ⇒ చదరపు గజానికి రూ.81 వేల చొప్పున ఆస్తులు కోల్పోనున్న వారిలో 170 మందికి సుమారు రూ.80 కోట్లు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న ఎంతోమంది పాతబస్తీవాసులుపూర్వీకుల నాటి భవనాలను కోల్పోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో వల్ల తరతరాలుగా వారసత్వంగా వచ్చే భవనాలను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో పాతబస్తీలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం..చారిత్రక రహదారులపై మెట్రో కారిడార్.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మీరాలంమండి రోడ్డు మీదుగా దారుల్షిఫా, పురానీహవేలి, ఎతెబార్చౌక్, అలీజాకోట్ల, బీబీబజార్, సుల్తాన్‌షాహీ, హరి»ౌలి, శాలిబండ, అలియాబాద్, శంషీర్‌గంజ్, ఫలక్‌నుమా వంటి చారిత్రక రహదారిపైన మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. ⇒ ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రోనూ మళ్లించారు. చారి్మనార్‌కు 500 మీటర్ల దూరంలో మెట్రో రానుంది. ఇలా చారిత్రకకట్టడాలు ఉన్న చోట ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు వంటి చర్యలు చేపట్టారు. కానీ ఇదే రూట్లో ఎంతోమంది పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా దుకాణాలు, హోటళ్లు, పలు చోట్ల స్కూల్ భవనాలు ప్రభావితం కానున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపుతో ఎంతో సందడిగా ఉండే దారుల్ఫా స్వరూపం మారనుంది.⇒ ‘ఒకప్పుడు మా ఇల్లు 1200 గజాల్లో ఉండేది. 2002లో రోడ్డు విస్తరణ కోసం 131 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు మెట్రో కోసం 700 గజాలు ప్రభావితమవుతోంది. పూరీ్వకుల నుంచి ఉన్న మా ఇంటి ఉనికిని కోల్పోతున్నాం.’ అని దారుల్íÙఫాకు చెందిన ఆబిద్ హుస్సేన్ తెలిపారు. మొహర్రం బీబీకాలం ఆలం సందర్భంగా ఏనుగు మా ఇంటికి వస్తుంది. రేపు మెట్రో వచి్చన తర్వాత అది సాధ్యం కాదు కదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ రోడ్లపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో మెట్రో నిర్మించాలన్నారు. ⇒ పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. నిజాం కాలం నాటి భవనాలు కోల్పోవడం బాధగా ఉంది. మాపూర్వీకులు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో మా తాత, మా నాన్న, ఇప్పుడు మేము కిరాణ జనరల్ స్టోర్ నడుపుతున్నాం. 280 చదరపు గజాలు ఉన్న మా ఇంటి నుంచి మెట్రో కోసం 65 చదరపు గజాల స్థలాన్ని కోల్పోతున్నాం. పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచి్చంది. – సయీద్ బిన్ అహ్మద్ మహపూజ్, వ్యాపారిపాతకాలం నాటి ఇల్లు పోతోంది ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రోరైల్ ఎంతో అవసరం, పాతబస్తీ ప్రజలకు మెట్రో సదుపాయం రావడం ఆహ్వానించదగ్గదే.. కానీ పూరీ్వకుల నాటి ఇంటిని కోల్పోవాల్సి రావడం కష్టంగానే ఉంది. మా కళ్ల ముందే మా ఇంటిని కూల్చివేస్తుంటే చూడలేకపోతున్నాం. ఎంతో బాధగా ఉంది. – మహ్మద్ బీన్ అహ్మద్, ఇంటి యజమానిపరిహారం అవసరం లేదు హెరిటేజ్ రోడ్లపై నుంచి మెట్రో నిర్మించడం సరైంది కాదు.. దీనివల్ల మా ఇల్లు 700 గజాలు కోల్పోవాల్సి వస్తుంది. పరిహారం కోరుకోవడం లేదు. త్వరలో న్యాయం కోసం కోర్టుకు వెళ్తాను. ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్రోకు స్థలం ఇవ్వను. – ఆబిద్‌హుస్సేన్, దారుల్ఫా జిగ్‌జాగ్ మెట్రో ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో ప్రధానమైన మార్గాల్లో కట్టారు. కానీ పాతబస్తీ అందుకు విరుద్దం. ఇలాంటి జిగ్‌జాగ్ మెట్రో ఎక్కడా చూడలేదు. చాలావరకు చారిత్రక భవనాలను కాపాడుతున్నామంటున్నారు. కానీ స్పష్టత లేదు. – అనురాధారెడ్డి, ఇంటాక్ ఆ ఘుమఘుమలు మాయమేనా..? పాతబస్తీ పేరు వింటేనే కమ్మటి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసా, బన్‌మస్కా, పసందైన బిర్యానీ రుచులు ఘుమఘుమలాడుతాయి. ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే జనజీవనంతో బీబీబజార్, మొగల్పురా, షాలిబండ తదితర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. మెట్రో రాక వల్ల అనేక మార్పులు రానున్నాయి. బీబీబజార్‌లోని విక్టోరియా హోటల్ కనుమరుగవుతోంది. అలాగే ఎతేబార్‌చౌక్‌లోని ఏళ్ల నాటి ముఫీద్–ఉల్–ఆనమ్ స్కూల్, పురానీహవేలీలోని ప్రిన్సెస్ ఎస్సేన్ గరŠల్స్ హైసూ్కల్ తదితర విద్యాసంస్థలు ప్రభావితం కానున్నాయి. కొన్ని స్కూళ్లు పాక్షికంగా దెబ్బతింటాయి. పాతబస్తీ మెట్రోపైన మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మార్గం సుగమమైంది. ‘అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. కానీ పాతబస్తీ రూపురేఖలు, చిహ్నాలు మారిపోతాయనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది.’ అని మీర్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు. -
ఒకవైపు కూల్చివేతలు.. మరోవైపు పరిహారం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనులు పట్టాలెక్కి పరుగులు తీస్తున్నాయి. మెట్రో రూట్లో కూల్చివేతలు ఊపందుకున్నాయి. మీరాలంమండి నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న మార్గంలో కూల్చివేతలు చకచకా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం (Metro Route) నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీంతో జేబీఎస్ (JBS) నుంచి చాంద్రాయణగుట్ట వరకు అతి పెద్ద గ్రీన్‌కారిడార్ (Green Corridor) అందుబాటులోకి రానుంది. ఈ రూట్లో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణను సకాలంలో పూర్తి చేసేందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట వరకు తొలగించాల్సిన 1,100 ఆస్తులను అధికారులు ఇప్పటికే గుర్తించారు.41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లింపు...భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్ఏఎంఎల్ (HAML) చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. పాతబస్తీలో గుర్తించిన 1100 ఆస్తులకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లించవలసి ఉంటుందని అంచనా. గజానికి రూ.81 వేల చొప్పున చెల్లించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ, మెట్రో నిర్మాణంలో మతపరమైన, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తున్నట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి (NVS Reddy) తెలిపారు. పర్యాటకంగా మరింత ఆకర్షణ... మెట్రో రైల్ రాకతో పాత నగరానికి కొత్త సొబగులు సమకూరనున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి. కాలుష్యరహితంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు చార్మినార్ సందర్శన ఒక ప్రత్యేకత. మెట్రో రాకతో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఆస్తులను కోల్పోవడంపై విచారం మరోవైపు దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న, ఉపాధి పొందుతున్న భవనాలు, షాపులను మెట్రోరైల్ నిర్మాణంలో భాగంగా కోల్పోవడం పట్ల పాతబస్తీ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులను కోల్పోవడం బాధగానే ఉన్నప్పటికీ పాతబస్తీ అభివృద్ధి దృష్ట్యా అంగీకరిస్తున్నట్లు మీరాలంమండికి చెందిన ఇబ్రహీం అనే ఛాయ్ దుకాణదారు తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న వస్త్ర, కిరాణా దుకాణాలు, హోటళ్లు కనుమరుగు కానున్నాయి.చదవండి: మరో రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులు -
Hyderabad: దుమ్ములో బంగారం కోసం వెదుకులాట
చార్మినార్: మట్టిలో మాణిక్యాలేమో కానీ.. పాతబస్తీలో ఏళ్ల తరబడి ఓ కుటుంబం మట్టిలో బంగారం, వెండిని వెదుకుతున్నారు. బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసే ఖార్ఖానాల్లో మట్టిని ఏకం చేసి అందులో ఏమైనా చిన్న చిన్న తుకడలు (ముక్కలు) దొరుకుతాయేమోననే ఆశతో వడపోస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి కంటికి కనిపించని సూక్ష్మంగా పౌడర్ తరహాలో కూడా దొరుకుతుందని చెబుతున్నారు. మట్టిలో నుంచి వడపోత ద్వారా మట్టి లాంటి పసుపు, తెలుపు రంగు పౌడర్ రూపంలో బంగారం, వెండి లభిస్తుందంటున్నారు. పాతబస్తీ కేంద్రంగా... నిజాం కాలం నుంచి పాతబస్తీలోని చార్మినార్ పరిసరాలు బంగారు, వెండి ఆభరణాల క్రయ విక్రయాలకు పెట్టింది పేరు. ఆభరణాల దుకాణాలతో పాటు ఆర్డర్లపై ఆభరణాలను తయారు చేసే ఖార్ఖానాలు కూడా ఇక్కడి గల్లీల్లో అధికంగా ఉన్నాయి. దాదాపు 250–300 వరకూ దుకాణాలున్నాయి. కొనుగోలుదారుల ఆర్డర్ మేరకు దుకాణ దారులు అర్చుల రూపంలో వసువు తయారీకి బంగారం అందజేస్తారు. తరుగు, మజూరీ నుంచే... ఆభరణాల తయారీ సమయంలో ముద్ద లాంటి బంగారపు కడ్డీనీ కరిగించి, మరిగించి ఆభరణాలను తయారు చేస్తారు. ఇలా చేసే క్రమంలో సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువుల రూపంలో బంగారం కింద పడి దుమ్ము, మట్టిలో కలుస్తుంది. దీన్నే బంగారపు షాపుల వారు తరుగు కింద లెక్కగడతారు. (తరుగు అంటే వేస్టేజ్, మజూరీ అంటే చేత కూలి) ఈ రోజువారీ తయారీ ప్రక్రియలో వందల సంఖ్యలో బంగారపు వస్తువులు తయారవుతుంటాయి. ఈ క్రమంలో తయారీ దారులు ఎక్కువ శాతం ఆ రజన్లోని ప్రధాన భాగాన్ని వారే వడపోసుకుంటారు. వారు కూడా సేకరించలేని రేణువులనే వడపోతకు అప్పగిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ.. ఈ ప్రకియ్ర కోసం ముందుగా డబ్బులు చెల్లించి మట్టి, చెత్త సేకరిస్తారు. గుల్జార్‌హౌజ్–కాలికమాన్ వద్ద ఈ బంగారం, వెండి వడపోత కార్యక్రమం ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగుతుంది. లాల్‌దర్వాజకు చెందిన విజయ్ కుటుంబం దశాబ్దాలుగా తాత ముత్తాతల నుంచి ఈ పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పురానాపూల్‌కు చెందిన ప్రెమ్‌కుమార్ చార్మినార్, కాలికమాన్, గుల్జార్‌హౌజ్, మామాజుమ్లా పాఠక్, కోకర్‌వాడి, రికాబ్‌గంజ్, ఆనంద్గల్లి, ఘాన్జీబజార్ తదితర ప్రాంతాల్లోని ఖార్ఖానాల నుంచి ఈ చెత్తను వడపోస్తున్నారు. ఈ ప్రక్రియలో ఒక్కోసారి బంగారం దొరికినా, దొరక్కపోయినా నెలవారీ డబ్బులు మాత్రం చెల్లించాల్సిందే..అణువణువూ గాలించాలి.. వడపోత సమయంలో అణువణువూ జాగ్రత్తగా శోధించాలి. చివరికి అయస్కాంతంతోనూ వేరు చేస్తాం. ఈ పౌడర్‌ను మళ్లి వేడి చేసి చిన్న ముద్దలాగా తయారు చేస్తాం. ఒక్కో రోజు పావు గ్రాము నుంచి అర గ్రాము వరకూ దొరుకుతుంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం గ్రాము రూ.7500..అదృష్టం బాగుంటే ఒక గ్రాము జమవుతుంది. ఎప్పుడైనా అనుకోకుండా తులం (10 గ్రాములు) లభిస్తే..దుకాణాల యజమానులు వచ్చి ఇది మాదే అని లాక్కుపోతారు. – ప్రేమ్ కుమార్, పురానాపూల్ -
ఓల్డ్ సిటీ అభివృద్ధిపై అక్బరుద్దీన్ తో మాట్లాడా: CM Reventh
-
ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్ డివిజన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మాదన్నపేటలో ఓ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలకు తోడుగా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజిన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తుంది. -
Hyderabad: పాత బస్తీలో మెట్రోరైలు పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ వాసుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎన్నో ఏళ్ల తర్జనభర్జనలు..ప్రభుత్వ నిర్ణయాల అనంతరం ఇక్కడ మెట్రో రైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు చారిత్రక పాతబస్తీలో మెట్రో పనులు మొదలయ్యాయి. మెట్రో రూట్లో రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ లైన్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ రూట్లో పాతబస్తీలో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ పనులను సకాలంలో పూర్తి చేసి మెట్రో నిర్మాణ పనులను పట్టాలెక్కించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌మెట్రో రైల్ కార్యాచరణను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలియజేస్తున్నట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి చెప్పారు. సుమారు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట మార్గంలో 1100 ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆస్తుల సేకరణ పనులు వేగవంతమయ్యాయన్నారు. త్వరలో పరిహారం చెల్లింపు... భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్ఏఎంఎల్ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు గుర్తించిన 1100 ఆస్తులలో 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ను మెట్రోరైల్ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ మేరకు ఆయన వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ వివిద దఫాలుగా విడుదల చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులలో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్‌ను కూడా జారీ చేశారు. వాటిలో 200 ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సేకరించిన వాటికి పరిహారం చెల్లించి కూల్చివేతలు చేపట్టనున్నారు. దీంతో మెట్రో రైలు మార్గ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యాజమానులతో సానుకూలంగా చర్చించి, వాటిని భూసేకరణ చట్టం ప్రకారం సేకరించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్టు ఎండీ వివరించారు. రోడ్డు విస్తరణలోను, మెట్రో నిర్మాణంలోను మతపరమైన, చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తుస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. పర్యాటకంగా మరింత ఆకర్షణ... మెట్రో రైల్ రాకతో పాత నగరం మరింత ఆకర్షణను సంతరించుకోనుంది. ఇప్పటికే జాతీ య, అంతర్జాతీయ పర్యాటకులు చార్మినార్ సహా పలు ప్రాంతాలను సందర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న సంగతి తెలిసిందే. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు. -
Old City Metro Rail: అనగనగా మెట్రో..
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ నిర్మాణానికి నిధుల లభ్యతలో ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు తక్కువ వడ్డీ రేటుకు నిధులు అందజేసేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 2028లో రెండో దశ పూర్తయ్యేనాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటారని.. 2030 నాటికి 10 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. రెండో దశ కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్‌పై లీ అసోసియేషన్ సంస్థ రూపొందించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ నివేదిక (సీఎంపీ) ప్రకారం ప్రతిపాదించిన అయిదు కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్ అత్యధికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ మొదట దశ ప్రాజెక్టుకు 7 ఏళ్లు పూర్తయిన (ఈ నెల 28) సందర్భంగా మంగళవారం బేగంపేట్ మెట్రో భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్వీఎస్ రెడ్డి ఏం చెప్పారంటే.. ఏడేళ్లలో 63.40 కోట్ల ప్రయాణికులు.. గత ఏడేళ్లలో నాగోల్– రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జూబ్లీ బస్టేషన్–ఎంజీబీఎస్ మూడు కారిడార్లలో 63.40 కోట్ల మంది ప్రయాణం చేశారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. ఈ ఏడాది ఆగస్టు 14న అత్యధికంగా 5.63 లక్షల మంది ప్రయాణం చేశారు. రెండో దశ పూర్తిస్థాయిలో అందుబాటు లోకి వస్తే మొదటి, రెండు దశల్లో కలిపి సుమారు 15 లక్షల నుంచి క్రమంగా 20 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వచ్చే డిసెంబరు నెలాఖరుకు పాతబస్తీలో రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టనున్నాం. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో రెండో దశ పనులు ప్రారంభమవుతాయి. జాయింట్ వెంచర్.. ⇒సమాజంలోని అన్ని వర్గాల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రెండో దశ రూట్లను ఎంపిక చేశాం. ఇది మొత్తం 6 కారిడార్లలో 116.4 కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్‌సిటీ మెట్రోకు సర్వే పనులు ప్రారంభించాం. రెండో దశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (50: 50) జాయింట్ వెంచర్. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఈ నెల 4న కేంద్రానికి అందజేశారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే పనులు మొదలవుతాయి. ప్రస్తుతం 5 కారిడార్లలో చేపట్టనున్న 76.4 కి.మీ. కారిడార్ల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,313 కోట్లు (30 శాతం), కేంద్రం రూ.4,230 కోట్లు (18 శాతం) చొప్పున అందజేయనున్నాయి. మిగతా 48 శాతం నిధు లు రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్ గ్యా రంటీతో జైకా, ఏడీబీ, ఎన్డీపీ వంటి మల్టీ లేటరల్ సంస్థల నుంచి సేకరించనున్నారు. మరో 4 శాతం నిధులు రూ.1,033 కోట్లను మాత్రం పీపీపీ విధానంలో సమకూర్చుకుంటారు. రెండోదశలో నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. భూసేకరణ వేగవంతం... ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. రోడ్డు విస్తరణతో 1100 పైగా ఆస్తులు ప్రభావితం కానున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 800 ఆస్తుల వివరాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేశాం. వాటిలో 200 కట్టడాల తొలగింపునకు ఆయన చర్యలు చేపట్టారు. డిసెంబర్లో పరిహారం చెల్లింపుతో పాటు కూలి్చవేతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం అక్కడ గజానికి రూ.23,000 చొప్పున ఉంది. దానికి రెట్టింపుగా ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా గజానికి రూ.65,000 చొప్పున చెల్లించనున్నారు. మొత్తం ఆస్తుల సేకరణకు సుమారు రూ.700 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. 3 కోచ్‌లు.. 35 కి.మీ వేగం.. ప్రస్తుతం మొదటి దశలో ఉన్నట్లుగానే రెండో దశలోనూ మెట్రో రైల్‌కు 3 కోచ్‌లు ఉంటాయి. గంటకు 35 కిలోమీటర్ల సగటు వేగంతో రైళ్లు నడుస్తాయి. ప్లాట్‌ఫాంలు మాత్రం 6 కోచ్‌లు నిలిపేందుకు వీలుగా నిర్మిస్తారు. -
కేంద్రం అనుమతిస్తేనే.. మెట్రో రెండో దశకు కదలిక
హైదరాబాద్ మెట్రో రెండో దశకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో కేంద్రం అనుమతి తప్పనిసరిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఆమోదం కీలకంగా మారింది. మొదటి దశ ప్రాజెక్టు అనంతరం రెండో దశకు ప్రణాళికలను రూపొందించినప్పటికీ.. ఇప్పటికే తీవ్ర జాప్యం నెలకొంది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాప్యం కారణంగా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రెండు, మూడో దశలు కూడా పూర్తయ్యాయి. కానీ.. నగరంలో రెండోదశ ఏడెనిమిదేళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం గమనార్హం. కేబినెట్ ఆమోదంతో ఒక అడుగు ముందుకు పడింది కానీ ఇప్పుడు కేంద్రం అనుమతితో పాటు నిధుల కేటాయింపే కీలకంగా మారింది. 2029 నాటికి పూర్తయ్యే అవకాశం.. భాగ్య నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో రెండో దశ అనివార్యంగా మారింది. మొదటి దశలో మూడు కారిడార్లలో మెట్రో పరుగులు తీస్తోంది. నిత్యం సుమారు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రెండో దశ పూర్తయితే 8 లక్షల మంది మెట్రోల్లో పయనించే అవకాశం ఉంది. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు చేపట్టిన మెట్రో మొదటి దశ నిర్మాణానికి రూ.22 వేల కోట్ల వరకు ఖర్చు కాగా, ప్రస్తుత రెండో దశకు రూ.24, 269 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైల్ డీపీఆర్‌ను రూపొందించింది. 5 కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. కేంద్రం సకాలంలో అనుమతించి నిధులు కేటాయిస్తే 2029 నాటికి రెండో దశ పూర్తయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అనుమతి లభించడంలో ఆలస్యం జరిగితే ఈప్రాజెక్టు మరింత వెనక్కి వెళ్లనుంది. రానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆమోదంతో పాటు నిధుల కేటాయింపు తప్పనిసరి.9వ స్థానానికి.. మెట్రో రెండో దశలో ఆలస్యం కారణంగా ఢిల్లీ తర్వాత రెండో స్థాననంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయినట్లు రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి పెద్ద నగరాలతో పాటు, పుణె, నాగపూర్, అహ్మదాబాద్ వంటి చిన్న నగరాలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్‌ను అధిగమించాయి. రెండో దశ నిర్మాణంలో జరిగిన ఆలస్యం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాల్సిన ఎంజీబీఎస్– ఫలక్‌నుమా మార్గం నిలిచిపోయింది. ప్రస్తుతం దాన్ని రెండో దశలో కలిపి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్!ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మెట్రో రెండో దశతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా భావించి కార్యాచరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24.269 కోట్లలో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు.5 కారిడార్లలో రెండో దశ..నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు (36.8 కి.మీ) రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ (11.6 కి.మీ) ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ) మియాపూర్–పటాన్చెరు (13.4కి.మీ) ఎల్బీనగర్–హయత్ నగర్ (7.1 కి.మీ.) -
Nimrah Cafe: సిటీ స్పాట్స్.. సెల్ఫీ షాట్స్
మనిషి జీవనశైలిలో వచ్చిన అధునాతన మార్పుల్లో సెల్ఫీకి ప్రత్యేక స్థానముంది. ప్రస్తుత జీవన విధానంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్బుక్, వాట్సాప్.. ఇలా ఎన్నో వేదికలపై సెల్ఫీ అజరామరంగా వెలుగుతోంది. 2012 తర్వాత సెల్ఫీ అనే వ్యాపకం గ్లోబల్ వేదికగా తన ప్రశస్తిని పెంచుకూంటూ వస్తోంది. అయితే.. ప్రస్తుతం నగరంలోని ఓల్డ్ సిటీ సెల్ఫీ స్పాట్స్‌గా గుర్తింపు పొందుతోంది. తమని తాము మాత్రమే కాకుండా తమ వెనుక ఓ చారిత్రక కట్టడం, వారసత్వ వైభవాన్ని క్లిక్‌మనిపించడం ఈ తరానికి ఓ క్రేజీ థాట్‌గా మారింది. ఇందులో భాగంగానే పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు సెల్ఫీ స్పాట్స్‌కు హాట్‌స్పాట్స్‌గా మారాయి..! ప్రస్తుతం హైదరాబాద్ అంటే ఐటీ, మోడ్రన్ లైఫ్ వంటి విషయాలు మదికి వస్తాయేమో కానీ.., గతంలో మాత్రం చార్మినార్ గుర్తొచ్చేది. ఇప్పటికీ కూడా హైదరాబాద్‌ను మొదటిసారి సందర్శించిన ప్రతి ఒక్కరూ చార్మినార్‌ను చూడాలనే అనుకుంటారు. అనుకోవడమే కాదు.. నగరానికొచ్చి చార్మినార్‌తో సెల్ఫీ తీసుకోలేదంటే ఏదో అసంతృప్తి. ఇలా సిటీలో బెస్ట్ సెల్ఫీ స్పాట్‌గా చార్మినార్ అందరినీ దరిచేర్చుకుంటుంది. ఉదయం వాకింగ్ మొదలు అర్ధరాత్రి ఇరానీ ఛాయ్ ఆస్వాదించే వారి వరకు ఈ చార్మినార్‌తో సెల్ఫీ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఓల్డ్‌సిటీ ఇప్పటికీ తన వైభవాన్ని సగర్వంగా నిలుపుకుంటుంది అంటే చార్మినార్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో అర్ధరాత్రి నగరవాసులు అతి ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతాల్లో ఈ సెల్ఫీ స్పాట్ ఒకటి. ఓల్డ్‌సిటీ షాపింగ్ అంటే లక్షల క్లిక్కులే.. ఓల్డ్ సిటీ అంటే ఒక్క చార్మినార్ మాత్రమే కాదు.. ఇక్కడ దొరికే మట్టి గాజులకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. షాపింగ్ అంటే నో చెప్పని యువతులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. యువతుల మనస్సును హత్తుకునే ఎన్నో అలంకరణ వస్తులు, గాజులు, డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ విరివిగా లభ్యమవుతాయి. రంజాన్ సీజన్లో ఇక్కడ షాపింగ్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి సైతం రావడం విశేషం. ఈ సమయంలో ఇక్కడే లక్షలసెల్ఫీలు క్లిక్, క్లిక్మంటుంటాయి. చింత చెట్టు కింద సెల్ఫీ.. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన వరదలకు దాదాపు 15 వేల మందికి పైగా మరణించారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా ప్రాణనష్టం జరిగింది. ఈ తరుణంలో అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు సమీపంలో ఉన్న చింతచెట్టు దాదాపు 150 మంది ప్రాణాలను కాపాడింది. వరదల్లో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగరవాసులు ఈ చెట్టు ఎక్కి తమ ప్రాణాలను దక్కించుకున్నాను. అయితే ఇప్పటికీ ఈ చెట్టు పటిష్టంగా ఉంది. ఈ చరిత్ర తెలిసిన వారు ఆ సమీపంలోకి వెళ్లినప్పుడు ఓ సెల్ఫీ తీసుకోవడం మాత్రం మరిచిపోరు. ఈ వీధులన్నీ సెల్ఫీలమయమే.. పాతబస్తీలోనే కొలువుదీరిన సాలార్జంగ్ మ్యూజియం, వందేళ్ల సిటీ కాలేజ్, హైకోర్టు పరిసర ప్రాంతాలు, పురానాపూల్, చార్మినార్ చౌరస్తా కేంద్రంగా నాలుగు దిక్కుల్లోని విధుల్లో నిర్మించిన కమాన్లు కూడా సెల్ఫీ స్పాట్లుగా మారాయి. మిడ్ నైట్ స్పాట్.. నిమ్హ్రా చార్మినార్ పక్కనే ఉన్న నిమ్హ్రా కేఫ్ కూడా ది బెస్ట్ సెల్ఫీ స్పాట్‌గా మారింది. ఇక్కడ టీ తాగుతూ సెల్ఫీ తీసుకోవడం, అది కూడా అర్ధరాత్రి ఛాయ్‌కి రావడం ఇక్కడి ప్రత్యేకత. పాతబస్తీకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఛాయ్ ఆహా్వనించడం నిమ్హ్రా కేఫ్ ప్రత్యేకత. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఇదే కేఫ్‌లో సెల్ఫీ దిగి అక్కడే ఫోన్ మర్చిపోయి ఎయిర్పోర్ట్ వెళ్లాడు. అయితే అంతే జాగ్రత్తగా తన ఫోన్ తనకు తిరిగి రావడంతో నగరవాసులపై గౌరవం పెరిగిందని చెప్పుకున్నారు. దీనికి సమీపంలోని షాగౌస్ బిర్యాని తింటూ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఓ ట్రెండ్. ఇలా పిస్తాహౌజ్, ఇరానీ ఛాయ్, పాయా సూప్ తదితర ఫుడ్ స్పాట్లు సెల్ఫీ స్పాట్లుగా మారాయి.మొదటి ‘సెల్ఫీ’.. సెల్ఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఆ్రస్టేలియాలోని ఓ న్యూస్ వెబ్సైట్లో వాడారు. కానీ సెల్ఫీ అనే పదం ప్రాచూర్యం పొందింది మాత్రం 2012 తర్వాతే అని చెప్పాలి. సోషల్ మీడియా ఊపందుకుంటున్న 2013లో ఈ సెల్ఫీ అనే కొత్త పదం విపరీతంగా చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ పదం బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ సెల్ఫీ అనే పదాన్ని ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. -
గిరాకీ బంగారమాయెనే
చార్మినార్: నగరంలో 400 ఏళ్ల కిందట బంగారం వ్యాపారం అంటేనే పాతబస్తీ. నిజాం కాలం నుంచి పాతబస్తీలో కొనసాగుతున్న బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు ప్రస్తుతం కష్టకాలమొచి్చంది. ఇక్కడి వ్యాపారాలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అసలే బాటిల్ నెక్ రోడ్లు.. దీనికి తోడు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీలో బంగారం వ్యాపారం తగ్గింది. చిన్న వ్యాపారులు రూ.50 లక్షల నుంచి.. పెద్ద పెద్ద షోరూం వ్యాపారులు రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి తమ వ్యాపారాలను కొనసాగించాల్సి ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్న ఇక్కడి వ్యాపారులకు మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో పాతబస్తీలోని దుకాణదారులు తమ వ్యాపారాలను నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధాన సమస్య పార్కింగే.. పాతబస్తీలో ద్విచక్ర వాహనాల పార్కింగ్తో పాటు కార్లు, భారీ వాహనాలకు పార్కింగ్ సమస్య, నిత్యం ట్రాఫిక్ రద్దీ పాతబస్తీలో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయి. వీటిని ఎక్కడ పార్క్ చేయాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రానురాను తమ వ్యాపారాలు కుంటు పడుతున్నాయంటున్నారు. పార్కింగ్ అందుబాటులో లేకపోవడమే కాకుండా నిత్యం వాహనాల రద్దీతో పాటు రోడ్లపై నెమ్మదిగా కదిలే వాహనాలు పాతబస్తీలోని బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు అడ్డుగా మారాయి. నిజాం కాలం నుంచి.. ఒకప్పుడు చార్మినార్ పరిసరాల్లో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేసుకోవడానికి నిజాం సర్కార్‌లో అప్పటి నిజాం స్వయంగా కొంత మందిని ఉత్తర భారతదేశం నుంచి రప్పించినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. నిజాం కాలం నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్, కాలికమాన్, చార్‌కమాన్, ఘన్సీబజార్, శాలిబండ, సిద్ధి అంబర్ బజార్ తదితర ప్రాంతాల్లో దాదాపు 300 వరకు దుకాణాలుండేవి. ప్రస్తుతం 50 నుంచి 100 దుకాణాలకు తగ్గిపోయాయి. వీరంతా నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడ తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు. బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసి ఇవ్వడానికి పనిచేసే వలస కార్మికులు సరైన ఆర్డర్లు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. పాతబస్తీలో వ్యాపారాభివృద్ధికి చర్యలు చేపట్టాలి మదీనా నుంచి చార్‌కమాన్–చార్మినార్ వరకు వ్యాపారాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దుకాణాల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సరైన స్థలాలు లేకపోవడంతో అటు వ్యాపారులతో పాటు ఇటు వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ రద్దీతో పాటు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. – నాగ్నాథ్ మాశెట్టి, గుల్జార్‌హౌస్/బషీర్‌బాగ్ -
హైదరాబాద్ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో బ్యాంకును బురిడీ కొట్టించి రూ.175 కోట్లు కొల్లగొట్టారు. సైబర్ నేరగాళ్లకు ఇద్దరు ఆటో డ్రైవర్లు సహకరించారు. జాతీయ బ్యాంక్‌లో 6 బ్యాంక్ అకౌంట్లను ఆటో డ్రైవర్లు ఓపెన్ చేశారు. వారి ద్వారా రూ. 175 కోట్ల లావాదేవీలు సైబర్ కేటుగాళ్లు జరిపారు.హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు నిధులు బదిలీ చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు ట్రాన్స్ఫర్ చేసిన ఆటో డ్రైవర్లు.. బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారు.హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపారు. 600 కంపెనీలకు అకౌంట్లను సైబర్ నేరగాళ్లు లింక్ చేశారు. సైబర్ నేరగాళ్ల డబ్బులకు ఆశపడి ఆటోడ్రైవర్లు అకౌంట్లు తెరిచారు. సైబర్ నేరగాళ్ల వెనుక చైనా కేటుగాళ్ల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు ఆటో డ్రైవర్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. -
పాతబస్తీ మెట్రోకు భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో మార్గంలో భూసేకరణపై హైదరాబాద్ మెట్రో రైల్ కసరత్తు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న ఓల్డ్‌సిటీ మెట్రో మార్గాన్ని రెండోదశలో భాగంగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కొత్త అలైన్మెంట్ కోసం భూసేకరణకు హెచ్ఎంఆర్ఎల్ నోటిఫికేషన్ వెల్లడించింది. కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో సేకరించనున్న స్థలాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 60 రోజుల గడువు విధించారు. మరోవైపు అభ్యంతరాలను స్వయంగా తెలియజేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అవకాశం కలి్పంచింది. భూ సేకరణలో భాగంగా ఆస్తులను కోల్పోయే బాధితులు అభ్యంతరాలను, ప్రతిపాదనలను బేగంపేట్‌లోని మెట్రో భవన్ కార్యాలయంలో స్పెషల్ కలెక్టర్‌కు స్వయంగా తెలియజేయవచ్చు. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్షంగా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. దారుషిఫా నుంచి శాలిబండ వరకు.. మొదటి దశలోని మూడో కారిడార్‌లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ వరకు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ మార్గాన్ని రెండో దశలో భాగంగా ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కానీ.. ఈ రూట్లో దారుíÙఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషుర్ ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు మరో 6 చిల్లాలు సహా మొత్తం 103 నిర్మాణాలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను సైతం 80 అడుగులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ ఆస్తులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రూట్లో ఆస్తులను కోల్పోనున్న వివిధ వర్గాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి నుంచి అభ్యంతరాలు, ఆస్తుల అంచనాలను స్వీకరించనున్నారు. ⇒ 2012లోనే చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు పనులను 2023 వరకు కాలయాపన చేయడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగి ప్రస్తుతం రూ.2500 కోట్లకు చేరింది. కిలోమీటర్‌కు సుమారు రూ.250 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. 5.5 కిలోమీటర్ల కారిడార్‌తో పాటు భూములు, ఆస్తులను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరి»ౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ అలైన్మెంట్ ఉంటుంది. ⇒ మెట్రో రైల్ మార్గంలో ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట నుంచి మైలార్‌దేవ్‌పల్లి మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రెండో దశ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచి్చన తర్వాత మెట్రో రెండోదశ డీపీఆర్‌ను వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు -
పాతబస్తీలో అగ్ని ప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కామటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అయిదు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తోంది. భవనంలో ఉన్నవారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. చుట్టుపక్కలా ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది. -
హైదరాబాద్ : అమ్మవారి రంగం ఊరేగింపుల్లో హోరెత్తిన భక్తులు (ఫొటోలు)
-
భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి
-
ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం..
-
HYD: అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి, పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఓ చిన్నారి మృతిచెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పాతబస్తీలోని కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశనగర్‌లో సోఫా తయారీ గోదాంలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. మూడు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో సోఫా తయారీ గోదాం ఉండటంలో మంటలు భవనం పైఅంతస్తులోకి వ్యాపించాయి. భారీగా ఎగిసిపడిన మంటలు ఫస్ట్ ఫ్లోర్‌కు వ్యాపించండంతో భవనంలో నివాసం ఉంటున్న 25 మంది మంటల్లో చిక్కుకుపోయారు.అనంతరం, స్థానికులు మంటలు అర్పే ప్రయత్నం చేయగా కొందరు మంటలను నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో భవనంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్, నాగరాణి దంపతులు, శివప్రియ, హరిణి గాయపడ్డారు. ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో శ్రీనివాస్ పెద్ద కూతురు శివప్రియ(10) మృతిచెందింది. ఇక, ఘటనలో మరో ఎనిమిదికి గాయాలు కావడంతో వారికి చికిత్స జరుగుతోంది. కాగా, భవనం మొదటి అంతస్తులో సోఫాల తయారీ గోడౌన్ ఉంది. రెండు, మూడు అంతస్తుల్లో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనాన్ని మంటలు చుట్టు ముట్టడంతో ఓ వ్యక్తి తప్పించుకునేందుకు పైనుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు.భవనం కింద భాగంలో ఫోమ్ మెటిరియల్ నిల్వ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలతో పాటు పొగలు దట్టంగా అలుముకోవడంతో చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో భవనం మొత్తం కాలిపోయింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంటలు చెలరేగుతూరే ఉన్నాయి. గోడౌన్ యజమాని ధనుంజయ్ పరారీలో ఉన్నాడు. -
పోలీస్ స్టేషన్ లో రీల్స్..
-
Insta Reels: పోలీస్ స్టేషన్‌ను వదల్లేదు!
హైదరాబాద్, సాక్షి: సోషల్ మీడియాలో మోజుతో ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. మొన్నీమధ్య తిరుమల పుణ్యక్షేత్రంలోనూ రీల్స్ చేసి ఆకతాయిలు భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను వదల్లేదు. పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్న స్నేహితుడిని చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడ ఇన్‌స్టా రీల్ చేశాడు. పీఎస్ ఆవరణలో అంతా వీడియో తీశాడు. పైగా దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాటను ఉంచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. A viral video filmed at the Bandlaguda Police Station in Hyderabad's Old City shows a suspect in lock-up meeting another person while recording a reel, they had posted on Instagram also. This incident highlights the issue of VIP treatment to suspects, rowdies and criminals at… pic.twitter.com/WRaLmYJoLH— Naseer Giyas (@NaseerGiyas) July 16, 2024 -
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం..కత్తితో ప్రేమోన్మాది దాడి
-
అందుకే శ్రావ్యపై మణికంఠ దాడి: ఛత్రినాక ఇన్స్పెక్టర్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని.. మరొకరితో సన్నిహితంగా ఉంటోందని ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమెను వెంబడించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగింది. ఛత్రినాక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు శ్రావ్య స్వస్థలం వరంగల్. పదిహేనేళ్ల కిందట నగరానికి వచ్చిందామె. దాడికి పాల్పడ్డ నిందితుడు మణికంఠకు శ్రావ్యకు దూరపు బంధువు. ఇదిలా ఉంటే.. శ్రావ్యకు 2019లో వివాహమైంది. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఆ పిటిషన్ నడుస్తోంది. ఈ క్రమంలో.. మణికంఠ శ్రావ్యకు దగ్గరయ్యాడు. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. విడాకుల వ్యవహారం తేలేంత వరకు ఆగమని శ్రావ్య అతన్ని కోరింది. ఆపై తల్లితో కలిసి ఎస్ఆర్టి కాలనీకి నివాసం మార్చిందామె. ఈలోపు.. శ్రావ్య గత కొంతకాలం మణిని దూరం పెడుతూ వచ్చింది. అయితే మరొకరితో చనువుగా ఉంటోందని మణికంఠ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. దీంతో మణికంఠ కోపం పెంచుకున్నాడు. ఈ ఉదయం జిమ్‌కు వెళ్లి వస్తున్న శ్రావ్యను ఫాలో అయ్యాడు. శ్రావ్య ఇంట్లోకి వెళ్ళంగానే మణికంఠ గడియ పెట్టి ఆమెపై దాడి చేశాడు. అప్పటికే శ్రావ్య ఫోన్ కాల్లో ఉంది. దీంతో మరింత రెచ్చిపోయిన మణికంఠ స్క్రూ డ్రైవర్ తో ఆమెపై దాడి చేశాడు. దీంతో శ్రావ్య ఛాతి భాగం, మొహంపై గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే.. స్థానికులు నిందితుడు మణికంఠను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సకాలంలో వైద్యం అందడంతో శ్రావ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగింది అని ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. -
400 సీట్లలో బీజేపీ గెలవాలి.. అందులో హైదరాబాద్ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లోనూ విజయపథంలో తీసుకువెళ్తున్న నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత గెలుపు కోసం బుధవారం రాత్రి పాతబస్తీలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలవాలని, అందులో హైదరాబాద్ సీటు తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించారు. 40 ఏళ్లుగా రజా కార్లు హైదరాబాద్‌ను ఏలుతున్నారనీ, ఈ సారి బీజేపీకి మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుపుతో ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న అమిత్‌షా తాము అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేయా లని పిలుపునిచ్చారు. అప్పుడే హైదరాబాద్ ప్రజలను ఎవ్వరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. అప్పటికే సమయం రాత్రి పదిగంటలవడంతో అమిత్‌షా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ముందుగా మాధవీలత మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయ, ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆశీస్సులతో ఈసారి తప్పకుండా పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇక్కడ అణిచివేతకు గురవుతున్న ప్రజలందరిలోని ఆవేశం ఓటు కింద మారాలని పిలుపునిచ్చారు. మహంకాళీ అమ్మవారికి అమిత్ షా పూజలు బుధవారం రాత్రి 9.24 గంటలకు అమిత్‌షా లాల్‌దర్వాజా మహంకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి ఐదు నిమిషాల పాటు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివాదం చేస్తూ..విజయ సంకేతం చూపుతూ.. పూజల అనంతరం అమిత్ షా 9.31 గంటలకు ప్రచార ర థం ఎక్కి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ..లాల్ దర్వాజా నుంచి వెంకట్రావ్ స్కూల్, లాల్ దర్వాజ్ మోడ్, సుధా టాకీస్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో కమలనాధులు కదం తొక్కారు. వందేమాతరం...భారత్ మాతాకీ జై..జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు అమిత్‌షాపై పూల వర్షం కురిపించారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆయన ఒక చేత్తో విజయ సంకేతం, మరో చేత్తో కమలం పువ్వును చూపిస్తూ ముందుకు సాగారు. సుమారు 25 నిమిషాల పాటు ఓపెన్‌టాప్ జీప్‌పై నిలబడి రోడ్ షో నిర్వహించారు. యాకుత్‌పుర, చాంద్రా యణగుట్ట, చార్మినార్, బహదుర్‌పుర, మలక్‌పేట్, ఘోషామహల్, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఈ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాజ్‌పేయి తర్వాత.. షానేపాతబస్తీలో బీజేపీ అభ్యర్థుల తరపున గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రచారం చేయగా, ఆ తర్వాత దేశ హోంశాఖామంత్రి హోదాలో అమిత్‌షా ఇక్కడికి రావడం విశేషం. ఎంఐఎంకు కంచుకోటలా ఉన్న పాతబస్తీలో అమిత్‌షా రోడ్ షో నిర్వహించడం ఆ పార్టీ శ్రేణులోŠల్ జోష్ నింపింది. కాగా, అమిత్‌షాకు పలువురు ముస్లింలు మర్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలకడం విశేషం. ఇక నిన్న మొన్నటి వరకు ఎడమొఖం.. పెడముఖంగా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి ప్రచారం నిర్వహించడం గమనార్హం. -
HYD: గన్‌తో కాల్చుకుని ఆర్ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్పుకుని ఆర్ఎస్ఐ బాలేశ్వర్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కాగా, బాలేశ్వర్ నాగర్ కర్నూల్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది. వివరాల ప్రకారం.. అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టీఎస్ఎస్పీ రిజర్వ్ ఎస్ఐగా కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆదివారం ఉదయం తన సర్వీర్ రివాల్వర్‌తో తనను తానే కాల్చుకుని బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. బాలేశ్వర్ మృతిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించాము. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామన్నారు. -
పాతబస్తీపై ఫోకస్!
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, పాతబస్తీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీతో కలసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం పాతబస్తీ మెట్రోరైల్ నిర్మాణ పనులకు ఫలక్‌నుమా ఫారూక్‌నగర్‌లో సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘హైదరాబాద్‌లో రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం. కంటోన్మెంట్లో రోడ్ల విస్తరణ చేపట్టాం. హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో మెట్రోరైల్ విస్తరిస్తే సామాన్య ప్రజలకు వెసులుబాటుగా ఉంటుంది. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. అందరూ ఈ ప్రాంతాన్ని ఓల్డ్ సిటీ అని చిన్నచూపు చూస్తుంటారు. కానీ ఈ ప్రాంతమే ఒరిజినల్ సిటీ. ఓల్డ్ సిటీపై నాకు అవగాహన ఉంది. మా ఊరు(కల్వకుర్తి)కు చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్ మీదుగానే వెళతాం. పాతబస్తీలో రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ అసదుద్దీన్ కోరిన వెంటనే రూ.200 కోట్లు మంజూరు చేశాం. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడో మెట్రోరైల్‌ను ప్లాన్ చేసిన గత పాలకులు పాతబస్తీ మెట్రోను విస్మరించారు. మేం నాగోల్ నుంచి ఎల్బీనగర్కు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పి–7 రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రోను అనుసంధానం చేస్తాం. దీంతోపాటు రాజేంద్రనగర్‌లో నిర్మించనున్న హైకోర్టు వరకు, రాయదుర్గం–ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మియాపూర్–ఆర్సీపురం వరకు మెట్రోను విస్తరిస్తాం. మీరాలం ట్యాంక్ వద్ద రూ.363 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే.. మెట్రోరైల్, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ అన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించాం. 2004 నుంచి 2014 మధ్య హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి తాగునీటిని తీసుకొచి్చన ఘనత కాంగ్రెస్‌దే. మూసీ నదిని సుందరీకరించి, దేశంలోనే చక్కటి టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తాం. ఇందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీతో కలసి లండన్‌లో థేమ్స్ నదిపై అధ్యయనం చేశాం. గుజరాత్లో సబర్మతీ నదిని అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ.. ఇక్కడ గండిపేట నుంచి 55 కిలోమీటర్ల పొడవునా మూసీ సుందరీకరణకు కూడా కేంద్ర నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచి్చనది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే. నేను కూడా మైనారీ్టల అభ్యున్నతికి కృషి చేస్తా. అందుకే మైనార్టీ శాఖ, మున్సిపల్ శాఖలను నా వద్దే ఉంచుకున్నా. చంచల్‌గూడ జైలును తరలిస్తాం చంచల్‌గూడ జైలును హైదరాబాద్ నగరం వెలుపలకు తరలిస్తాం. ఆ స్థలంలో కేజీ, పీజీ క్యాంపస్ ద్వారా విద్యను అందిస్తాం. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మిస్తాం. 1994–2004 మధ్య టీడీపీ, 2004–2014 కాంగ్రెస్, 2014–2023 వరకు బీఆర్ఎస్ పాలించాయి. నేను 2024 నుంచి 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ముబీన్, మీర్ జులీ్ఫకర్ అలీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, అహ్మద్ బలాలా, ఎమ్మెల్సీ రియాజుల్ హఫెండీ, ప్రభుత్వ సలహారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాతబస్తీకి మెట్రో సంతోషకరం: అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీకి మెట్రో రైల్ వస్తుండటం సంతోషకరమని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇది అందుబాటులోకి వస్తే పాతబస్తీ నుంచి నిత్యం 10–15వేల మంది హైటెక్ సిటీకి వెళతారని చెప్పారు. సీఎం రేవంత్ పాతబస్తీ అభివృద్ధిపై దృష్టి సారించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరారు. డీఎస్సీని ఉర్దూ మాధ్యమంలో కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ సుందరీకరణకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. దేశంలో విద్వేషాన్ని నింపుతున్న వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
పాత బస్తీ మెట్రోకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అంటే పాత నగరం కాదని.. ఇదే అసలైన హైదరాబాద్ నగరమని.. దీనిని పూర్థిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఫలక్‌నుమాలోని ఫరూక్నగర్ దగ్గర పాత బస్తీ మెట్రో లైన్ పనులకు భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. ‘‘ఇది ఓల్డ్ సిటీ కాదు..ఇదే ఒరిజినల్ సిటీ. అసలైన నగరాన్ని పూర్థిస్తాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. అలాగే.. మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇందు కోసమే లండన్ నగరాన్ని ఇక్కడి ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో కలిసి పరిశీలించాం. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు. మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తాం’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు తాజాగా సీఎం రేవంత్ ఆయన శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా ఈ మెట్రో రూట్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే.. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించాం. మూసీ నదిని 55 కి.మీ మేర సుందరీకరిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తాం. మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కే కాదు పాతబస్తీకి ఉండాలి. అందులో సంపన్నులే కాదు మధ్యతరగతి ప్రజలూ ప్రయాణించాలి. చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోంది. చంచల్‌గూడ జైలును అక్కడి నుంచి తరలించి.. విద్యాసంస్థ ఏర్పాటు చేస్తాం. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తాం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుంది. అభివృద్ధికి మేం సహకరిస్తాం. రేవంత్‌రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి.. వాటిని అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారు. మూసీ నది అభివృద్ధికి మా పార్టీ సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు. -
7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో రైల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చుకానున్నట్లు అంచనా. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే నిలిపివేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ, నిర్మాణాల కూల్చివేతలకు ఆటంకం వంటి కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే అడ్డంకులన్నీ తొలగిపోయి డీపీఆర్ సహా అన్ని పనులు పూర్తయినప్పటికీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కూడా నిర్లక్ష్యం చేసింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించి, బడ్జెట్లోనూ నిధులు కేటాయించింది. డ్రోన్ సర్వే... ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం గత ఆగస్టులో డ్రోన్ సర్వే నిర్వహించారు. దారుల్షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు 103 మతపరమైన, ఇతర సున్నితమైన కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పు లు తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ ద్వారా సేకరించిన డేటా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేశారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా వరకు మె ట్రో రైలు అందుబాటులోకి వస్తే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని మెట్రో రైల్లో వెళ్లి సందర్శించవచ్చు. అలాగే, సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలనూ వీక్షించే అవకాశం ఉంటుంది. ఐదు స్టేషన్లు: ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడి నుంచి దారు షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్ను మా వరకు ఈ 5.5 కి.మీ. అలైన్మెంట్ ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తరువాత సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉంటాయి. -
HYD: కిడ్నాప్‌నకు గురైన పాప సేఫ్..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మాదన్నపేటలో కిడ్నాప్‌నకు గురైన తొమ్మిది నెలల పాప సురక్షితమని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన మహిళ ఎంజీబీఎస్‌లో జహీరాబాద్‌లో బస్సు ఎక్కినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ బస్సు దిగిన వెంటనే మహిళను అదుపులోకి తీసుకుని పాపను రక్షించారు. వివరాల ప్రకారం.. పాతబస్తీలోని మాదన్నపేటలో పాపను కిడ్నాప్ చేశారు. ఓ మహిళ పాపను కిడ్నాప్ చేసి చంచల్ గూడ నుండి ఎంజీబీఎస్‌వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అనంతరం.. జహీరాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్టు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. అయితే, కిడ్నాప్ చేసిన మహిళను సహనాజ్‌ఖాన్‌గా గుర్తించారు. బాధితుల ఇంట్లో ఆమె రెండు నెలల క్రితమే పని మనిషిగా చేరినట్టు తెలుస్తోంది. జహీరాబాద్ పోలీసులను మాదన్నపేట్ పోలీసులు అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ మహిళ జహీరాబాద్‌లో బస్సు దిగిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా కాపాడారు. కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చిన్నారి కుటుంబ సభ్యులు, మాదన్నపేట్ పోలీసులు చేరుకున్నారు. అనంతరం పాపను పేరెంట్స్‌కు అప్పగించారు. -
పాతబస్తీలో 9నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం
-
7న పాతబస్తీలో మెట్రోరైలు పనులకు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో రైలు పను లకు ఈ నెల 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దేశంలో ముస్లింలతో పాటు దళిత సామాజిక వర్గాలను టార్గెట్ చేసి నల్లచ ట్టాలను ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం మైదా నంలో శనివారం జరిగిన పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముస్లిం, దళితులపై ఉక్కుపాదం మోపుతుందని, సీఏఏ చట్టం ఏన్పీఆర్, ఎన్ఆర్సీలో ఇమిడి ఉందని పేర్కొ న్నారు. మరోమారు బీజేపీ గద్దెనెక్కకుండా అడ్డుకో వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పదేళ్ల పాల నలో నిరుద్యోగం పెరిగి పోయిందని. హిందూత్వ ఎజెండా తప్ప అభివృద్ధి లేదన్నారు. దేశంలో మత చిచ్చుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్ని స్తోదని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీజేపీ పాగావేయాలన్నది ఆ పార్టీ పగటి కలేనని ఒవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలని మోదీకి సవాల్ విసిరారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతోపాటు పార్టీ శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్ -
పాతబస్తీ: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా గతంలోనూ షానవాజ్ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. -
ఓల్డ్ సీటీలో ఎంఐఎం నేతలు అరెస్ట్
-
పాతబస్తీ బడా వ్యాపారులు టార్గెట్ గా ఐటీ సోదలు
-
పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్‌ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కింగ్స్ గ్రూప్ ఓనర్ షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లు అనుమానం రావడంతో దాడులకు దిగారు. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటి అధికారుల దాడులు చేపట్టారు. పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాడ్యుర్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్‌పై ఐటీ సోదాలు జరుపుతున్నారు. హోటల్ యజమాని శేఖర్ గౌడ్ హైదరాబాద్ చెందిన వ్యక్తి కాగా.. యజమాని ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి డబ్బులు మరుతాయని ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం. చదవండి: సోనియా దీవిస్తే సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
అర్థరాత్రి ఓల్డ్ సిటీలో సందడి చేసిన మంత్రి కేటీఆర్
-
నా భార్య తల నరికేస్తామన్నారు
కరీంనగర్‌టౌన్: తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘ఏయ్ బండి సంజయ్.. పాతబస్తీలో సభ పెట్టాలనే ఆలోచన విరమించుకోకుంటే నీ భార్య తల నరికి నీకు గిఫ్ట్‌గా ఇస్తాం. నీ ఇద్దరు కొడుకులను కిడ్నాప్ చేస్తాం..’అంటూ బెదిరించారు. అయినా వెనుకంజ వేయకుండా పాతబస్తీలో సభ పెట్టిన చరిత్ర మాది’అని సంజయ్ పేర్కొ న్నారు. ఆదివారం కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్స్‌లో జరిగిన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్ ఎంపీగా తాను గెలిచానంటే అది కార్యకర్తలతోనేనని అన్నారు. ప్రజలు ఎంపీగా గెలిపించారు కాబట్టే తెలంగాణ అంతా తిరిగి పేదల పక్షాన పోరాడానని, ఫాంహౌస్‌కు పరి మితమైన కేసీఆర్‌ను ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చానని పేర్కొ న్నారు. కాగా, ధర్మం కోసమే పోరాడే మరో నాయకుడు రాజాసింగ్ ఏడాదిపాటు బీజేపీకి దూరమైనా.. చంపుతామని కొందరు బెదిరించినా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టలేదని సంజయ్ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్. విఠల్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇన్చార్జి మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు వాయిదా
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మతపెద్దల సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీన గణేష్ నిమజ్జనం ఉన్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ నిమజ్జనం ఉన్నందున.. వచ్చే నెల ఒకటో(అక్టోబర్ 1వ) తేదీన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్ణయించాలని మత పెద్దలు నిర్ణయించారు. -
పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు.. ఇద్దరు అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్ఐఏ సోదాలు చేపట్టారు అధికారులు. ఐఎస్ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అటు తమిళనాడులో కూడా ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, నగరంలో వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్ఐఎస్ఐ మాడ్యుల్లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఐసిస్ సానుభూతి పరుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు సహా హైదరాబాద్‌లోని పాతబస్తీ, మలక్‌పేట, టోలీచౌకీ సహా మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇక, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగిస్తోంది. 2022లో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్‌కు సంబంధించి ఎన్ఐఏ దాడులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సోదాల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. #WATCH | NIA conducts raids at 30 locations in both Tamil Nadu and Telangana in ISIS Radicalization and Recruitment case. The raids are underway in 21 locations in Coimbatore, 3 locations in Chennai, 5 locations in Hyderabad/Cyberabad, and 1 location in Tenkasi. (Visuals from… pic.twitter.com/KcCiO7SZ6u — ANI (@ANI) September 16, 2023 ఇది కూడా చదవండి: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో నటుడు నవదీప్ పేరు -
హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం ఒక్క రోజే రెండు హత్యలు వెలుగు చూశాయి. పటాన్చెరు పరిధిలోని ఇస్నాపూర్ శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన నదీమ్ అహ్మద్(27)గా గుర్తించారు. టోలిచౌకిలో నివసిస్తున్న నదీమ్.. సంగారెడ్డిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇస్నాపూర్ వద్ద గొడవ జరగడంతో గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో గొంతు కొసి చంపినట్లు తేలింది. .మృతుడి తండ్రి అబ్దుల్ ఖయ్యూం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నజీర్ అహ్మద్‌గా గుర్తించారు. రెండు సంవత్సరాల క్రితం జహీరాబాద్‌లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహమ్మద్ నిందితుడిగా ఉన్నాడు. విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ సహా ఏడుగురు నిందితులుగా ఉన్నారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం -
HYD: కారు బీభత్సం.. మద్యం మత్తులో యువకులు హల్చల్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు.. హైస్పీడ్‌లో దూసుకెళ్లారు. ఈ క్రమంలో కిలోమీటర్ మేర వాహనాలను ఢీకొడుతూ కారు దూసుకెళ్లింది. వివరాల ప్రకారం.. మీర్చౌక్లో మద్యం మత్తులో ఉన్న యువకులు కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. హైస్పీడ్‌లో కారు నడుపుతూ వాహనాలకు ఢీకొడుతూ ముందుకు సాగారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం, స్థానికులు కారును వెంబడించి వాహనాన్ని ఆపి యువకులకు దేహశుద్ధి చేశారు. ఈ సందర్భంగా కారులో మద్యం బాటిళ్లను గుర్తించారు. ఇది కూడా చదవండి: ఫ్రీగా ఫోన్ అని ఆశ చూపి.. బాలికను గదిలోకి తీసుకెళ్లి -
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహిళకు షాకిచ్చిన బ్యూటీపార్లర్
-
పాతబస్తీలో అంబారీపై ఊరేగిన అమ్మవారు (ఫొటోలు)
-
లాల్‌దర్వాజ బోనాలు: ఆలయం వద్ద చికోటీ ప్రవీణ్ ఓవరాక్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్‌దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని కొలిచేందుకు భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. కాగా, లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటతో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఇక, ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ వద్ద వెపన్స్ ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమని తెలిపారు. అనంతరం.. ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, వెపన్స్‌కు లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని -
హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్‌దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ‘‘రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయాన్ని చాటి చెప్పారు. కుల మతాలకు అతీతంగా ఐక్యత తో బోనాల ఉత్సవాలు చేసుకోవాలి. ప్రశాంతంగా బోనాలు ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు. చదవండి: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు మాజీ క్రికెటర్ మిథాలిరాజ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్.. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటున్నాయి. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. ఈ రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది. -
Hyderabad Bonalu: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16,17 తేదీల్లో పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలు, సామూహిక ఘటాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మండలంలోని ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, బహదూర్‌పురా ట్రాఫిక్ పోలస్స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నందున వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లింపు ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి 17వ తేదీ రాత్రి 11 గంటల వరకు దారి మళ్లింపులు ఉంటాయన్నారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఆషాఢ మాసం బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటోంది. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. నేడు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది. -
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కాల్పుల కలకలం
-
ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే ఎలా పెరిగాయి?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, బండి సంజయ్ బుధవారం కరీంనగర్లో టీటీడీ ఆలయ భూమిపూజకు హాజరయ్యారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అంటకాగే పార్టీ ఎంఐఎం. పాతబస్తీని ఎందుకు ఎంఐఎం అభివృద్ధి చేయలేకపోయింది. ఇప్పటి వరకు ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయి. దమ్ముంటే ఎంఐఎం అన్ని చోట్లా పోటీ చేయాలి. డిపాజిట్ కూడా రాదు. నరికి చంపుతామన్న ఎంఐఎం నాయకుల మాటలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మా చేతుల్లో ఉందనడం హాస్యాస్పదమన్నారు. మేము అడిగిన ఒక్క పని కూడా బీఆర్ఎస్ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఈటల Vs విజయశాంతి: ట్విట్టర్లో పొలిటికల్ పంచాయితీ.. -
హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
-
కేసీఆర్ హింసించే పులకేశి: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా హైదరాబాద్‌లో మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఐదుగురు హిజ్బూ ఉత్ తహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ ఉగ్రవాద అనుమానితులు చిక్కారు. ఈ మాడ్యుల్‌కు సూత్రధారిగా ఉన్న మహ్మద్ సలీం.. ఓ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేస్తుండగా, పట్టుబడినవారిలో ఒక దంత వైద్యుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఉగ్రనేత ఒవైసీ కుటుంబానికి చెందిన దక్కన్ కాలేజీలో హెచ్వోడీగా పనిచేస్తున్నాడు. టెర్రరిస్టులకు సపోర్టు చేస్తానని గతంలో ఒవైసీ ప్రకటించారు. ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు మజ్లిస్ ఆశ్రయమిస్తోంది. ఆరుగురు ఉగ్రవాదులు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. ఐఎస్ఐ లాంటి సంస్థలకు పాతబస్తీలో షెల్టర్ ఇస్తున్నారు. అధికారం కాపాడుకోవాలనే తప్ప.. దేశ భద్రతపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు. అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకైక లక్ష్యం అధికారమే. శాంతిభద్రతలపై ఒక్క సమీక్ష కూడా కేసీఆర్ చేయడం లేదు. ఉగ్రవాదుల కదలికలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలి. భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ హింసించే పులకేశి. మేం సర్జికల్ స్టైక్ చేస్తామని చాలా మంది ఓవర్‌గా మాట్లాడారు. అందులో ట్విట్టర్ టిల్లు కూడా ఉన్నారు. ఓట్ల కోసమే అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సీఎం కేసీఆర్ సలహాదారుగా తీసుకున్నారు. పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం బెదిరిస్తోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘సోమేష్ కుమార్‌ను నియమించి అందుకే..’ -
సమస్యల వలయంలో దారుల్ షిఫా ఫుట్ బాల్ గ్రౌండ్
-
రంజాన్ కి ముస్తాబవుతున్న పాతబస్తి మీర్ ఆలం ఈద్గా
-
పాతబస్తిలో దారుణం
-
Karnataka Assembly Elections 2023: పాత మైసూరు.. కొత్తపోరు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు సంపూర్ణ మెజార్టీ సాధించలేదు. ఎన్నికలకు ముందు, తర్వాత పెట్టుకొన్న పొత్తులు, స్వతంత్రులపై వల, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వంటి వాటితో ప్రభుత్వాలు నడిపింది. దీనికి ప్రధాన కారణం వొక్కలిగ ప్రాబల్య ప్రాంతమైన పాత మైసూరులో పాగా వెయ్యలేకపోవడమే.ఈ సారి ఎన్నికల్లోనైనా పాత మైసూరులో పట్టు బిగించి సంపూర్ణ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ విపక్షాలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడడంతో ఈ ప్రాంతం కొత్త పోరాటాలకు వేదికగా మారింది. కాంగ్రెస్‌కు కలిసొస్తుందా..? ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండే పాత మైసూరు ప్రాంతం జేడీ (ఎస్) వచ్చాక క్రమంగా పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్న వొక్కలిగ సామాజిక వర్గీయులు మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను తమకు తండ్రిలా భావిస్తారు. గత ఎన్నికల్లో కూడా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో 66 స్థానాలకు గాను 30 సీట్లు చేజిక్కించుకొని జేడీ(ఎస్) ముందు వరసలో ఉంది. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కింగ్ మేకర్‌గా ఒక పార్టీ చక్రం తిప్పి అధికార అందలాన్ని అందుకుంటుందని పాత మైసూర్లో వొక్కలిగలు తమ పొలిటికల్ పవర్ చూపించారు. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాత మైసూరు, బెంగళూరు అర్బన్ కలిపి 89 స్థానాలు ఉన్నాయి. 1983 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభ వెలిగిపోయింది. జనతాపార్టీ మూలస్థంభాల్లో ఒకరైన మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధించారు. 1999లో దేవెగౌడ జనతా పార్టీ నుంచి బయటకి వచ్చి జేడీ(సెక్యులర్–ఎస్) స్థాపించిన తర్వాత పోటీ పడలేక క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. వొక్కలిగ సామాజిక వర్గీయులు రాజకీయ ప్రయోగాల్ని కూడా ఇష్టపడరు. 2005 సంవత్సరంలో అప్పట్లో జేడీ(ఎస్) నాయకుడిగా ఉన్న కురుబ వర్గానికి చెందిన నాయకుడు సిద్దరామయ్య మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులతో ‘‘అహిందా’’ అనే కొత్త సామాజిక సమీకరణకు తెరతీశారు. వొక్కలిగ ఓట్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని జేడీ(ఎస్) ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్‌లో చేరారు. 2018లో సిద్దరామయ్య తన సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరిలో వొక్కలిగ ఓట్లు పడకపోవడంతో ఓటమి పాలయ్యారు. 66 స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు వస్తే 2018 నాటికి ఆరు స్థానాలు కోల్పోయి 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో వ్యూహాలు మార్చుకొని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు డి.కె. శివకుమార్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. జేడీ(ఎస్) నుంచి ఎస్. శ్రీనివాస్, శ్రీనివాస గౌడ, శివలింగ గౌడ గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో ప్రధాన నాయకులు శివకుమార్, సిద్దరామయ్యలు ఈ ప్రాంతానికి చెందినవారే కావడం పార్టీకి కలిసొచ్చేఅంశం. ఉప ఎన్నికల గెలుపుతో పెరుగుతున్న బీజేపీ పట్టు పాత మైసూరు ప్రాంతానికి చెందిన బలమైన నాయకుల్ని ఆపరేషన్ కమల్ పేరుతో తమ వైపు లాక్కొని బీజేపీ పట్టు పెంచుకుంటోంది. డి. సుధాకర్, కె.సి.నారాయణ గౌడ, హెచ్‌టీ సోమశేఖర్, బైరఠి బసవరాజ్, వి. గోపాలయ్య వంటి వారు బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. యడ్డియూరప్ప నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన 15 మంది నాయకుల్లో 12 మంది బీజేపీ టికెట్‌పై ఉప ఎన్నికల్లో నెగ్గారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా వొక్కలిగ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహరచన మొదలు పెట్టింది. అందులో భాగంగానే ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలిగ, లింగాయత్‌లకు రెండేసి శాతం చొప్పున కట్టబెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ఈ ప్రాంతంలోనే అధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. వొక్కలిగ ఆత్మనినాదం పేరుతో ఆ సామాజిక వర్గం నాయకుడు కెంపె గౌడ కంచు విగ్రహాన్ని బెంగుళూరు విమానాశ్రయం సమీపంలో మోదీ ఆవిష్కరించారు. ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్‌ను చంపిన వొక్కలిగ సైనికులైన ఉరిగౌడ, నంజెగౌడలను హీరోలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో వొక్కలిగల మద్దతు లభించే అవకాశాలున్నాయి. పట్టు నిలుపుకునే వ్యూహంలో జేడీ (ఎస్) రెండు దశాబ్దాలుగా పాత మైసూరులో పట్టు కొనసాగిస్తూ వస్తున్న జేడీ(ఎస్) దానిని నిలుపుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. వొక్కలిగలు తమకు పెద్ద దిక్కుగా భావించే దేవగౌడ వృద్ధాప్యంతో, అనారోగ్య సమస్యలతో ప్రచారానికి రాలేకపోతున్నారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి అంతా తానై పార్టీ భారాన్ని మోస్తున్నప్పటికీ కుటుంబ పార్టీ ముద్ర, వలసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరు స్థానం నుంచి స్వయంగా ఓటమిపాలైన దేవెగౌడ ఇంటికే పరిమితమయ్యారు. కులపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఎన్నికల్లో తమకి అనుకూలంగా మార్చుకోవడంలో తలపండిన దేవెగౌడ పార్టీ ఎన్నికల ప్రచారం పంచరత్న సభకి వీల్‌చైర్‌లో రావడంతో జనం పోటెత్తారు. వొక్కలిగలో వివిధ ఉపకులాల్లో కూడా దేవెగౌడకు ఆదరణ ఎక్కువగా ఉంది. కన్నడ ఆత్మగౌరవ నినాదంతో జాతీయ పార్టీలను అక్కున చేర్చుకోవద్దంటూ ప్రచారం చేస్తున్న జేడీ(ఎస్) ఈ సారి ఎన్నికల్లో కూడా పాత మైసూరులో 25 నుంచి 35 స్థానాలు గెలుచుకొని సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వొక్కలిగ సంఘ్ మైసూరు ప్రాంతంలో పట్టు సాధించాలంటే వొక్కలిగల మనసు గెలుచుకోవడం మినహా మార్గం లేదు. రాష్ట్రంలో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15%జనాభా ఉన్న వొక్కలిగ ఓట్లు ఇప్పటివరకు జేడీ(ఎస్), కాంగ్రెస్ పంచుకుంటూ ఉన్నాయి.1906 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా వొక్కలిగ సంఘ్‌ను ఏర్పాటు చేశారు. మాండ్యలో ఉన్న ఒకే ఒక్క వొక్కలిగ మఠం (ఆదిచుంచనగిరి మఠ్) సామాజిక వర్గాన్ని ఒకటి చేసింది. బాగా చదువుకోవడం మొదలు పెట్టిన వారు క్రమక్రమంగా కర్ణాటకలో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగారు. అసెంబ్లీలో నాలుగో వంతు మంది ప్రజాప్రతినిధులు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. 2018 ఎన్నికలు జేడీ(ఎస్) 30 కాంగ్రెస్ 20 బీజేపీ 15 బీఎస్పీ 1 2013 ఎన్నికలు జేడీ (ఎస్) 26 కాంగ్రెస్ 26 బీజేపీ 8 ఇతరులు 6 పాత మైసూర్ రామనగరం, మాండ్య, మైసూరు, చామరాజ్నగర్, కొడగు, కోలార్, తుమకూరు, బెంగళూరు రూరల్, హసన్, కోలార్, చిక్కబళ్లాపూర్ ప్రాబల్య కులం: వొక్కలిగ (రాష్ట్ర జనాభాలో 15%) అసెంబ్లీ సీట్లు – 66 – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారాయన. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారాయన. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటు దారులను అరికట్టేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్‌తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. -
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ
-
Hyderabad: గన్ చూపించి కారును ఆపిన ఎస్సై.. అవాక్కైన వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: మీర్‌చౌక్ ఏసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పాతబస్తీ ఎతేబార్‌చౌక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు ఓపెన్ టాప్ కారులో ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ అడ్డుకుని దానిని ఆపడానికి కారు ముందుకు వెళ్లాడు. దీనిని గమనించిన విధి నిర్వహణలో మీర్‌చౌక్ ఎస్సై వెంటనే స్పందించి తన పౌచ్‌లో ఉన్న గన్ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు. దీంతో ఎస్సై చేతిలో గన్ను చూసిన కారులోని యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎస్సై ఆవేశంతో ఆగ్రహంగా గన్‌తో యువకుల వద్దకు చేరుకోవడాన్ని చూసిన వాహనదారులు కొద్దిసేపు నిర్ఘాంత పోయారు. దీంతో సదరు యువకులు కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించారు. డిక్కీతో పాటు వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాతబస్తీలో ఓ ఎస్సై గన్ చూపించి సినిమా ఫక్కీలో హల్చల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాతబస్తీలో ఇప్పటి వరకు ఓ ఎస్సై గన్ చూపించి తనిఖీలు నిర్వహించిన సందర్భం, సంఘటనలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ శబ్ధ కాలుష్యానికి పాల్పడిన వాహన యజమానికి మీర్‌చౌక్ పోలీసులు ఫైన్ విధించి పంపించారు. How can SI take out his service revolver gun to stop vehicle during cheking in mirchowk old city ? @CPHydCity @DCPSZHyd sir kindly take action on this... On small small issues a police officer can't take out his firearm @TelanganaDGP pic.twitter.com/SPWBZKphTk — Mohammed Inayath ulla sharief (@InayathShafi) December 27, 2022 చేతిలో వెపన్ తప్పులేదు: డీసీపీ సాయి చైతన్య వాస్తవానికి అర్ధరాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించేటప్పుడు చేతిలో వెపన్లతో సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఎస్సై స్థాయి అధికారి వాహనాల తనిఖీల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ వెపన్ చేతిలోనే ఉంటుందన్నారు. (క్లిక్ చేయండి: కేసీఆర్ ఫాంహౌస్ సినిమా అట్టర్‌ఫ్లాప్) -
Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తుండగా.. పాతబస్తీలో ఇంకా పనులను కూడా ప్రారంభించకపోవడంపై నిరాశకు గురవుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో పనులు పూర్తయ్యి ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. పాతబస్తీలో మెట్రో రైలు పనుల ఊసే లేదు. ఇటీవల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నూతనంగా నిర్మించనున్న మెట్రో పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన సైతం చేశారు. దీంతో ఇప్పట్లో పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు తీసే పరిస్థితులు కనిపించడం లేదు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్‌చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరి»ౌలి, శాలిబండ, సయ్యద్ అలీ ఛబుత్రా, అలియాబాద్, షంషీర్గంజ్ ద్వారా ఫలక్‌నుమా వరకు 6 కిలో మీటర్ల పనులు జరగాల్సి ఉంది. మెట్రో రైలు పనులను ప్రారంభించడానికి ఒక దశలో ముందుకు వచ్చిన ప్రాజెక్టు అధికారులు అంచనా వ్యయం పెరిగిందని వెనక్కి తగ్గారు. ఇదిలా ఉండగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి పాతబస్తీలో మెట్రో రైలు పనుల కోసం రూ.500 కోట్ల నిధులను మంజూరు చేయించామని పేర్కొంటూ వెంటనే పనులు ప్రారంభించాలని రెండు నెలల క్రితం మెట్రో రైలు ప్రాజెక్ట్ ఎండీని కలిసి కోరారు. అయినా.. పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభం కాలేదు. ట్విటర్లో పోస్టుచేసి మరచిన కేటీఆర్.. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని గతేడాది మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను మరిచిపోయాడని పాతబస్తీ ప్రజలు అంటున్నారు. గతంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అసెంబ్లీలో పాతబస్తీ మెట్రో రైలు ప్రస్తావన తెచ్చి.. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో పాతబస్తీ ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018లో అలైన్‌మెంట్‌ను పరిశీలించిన మెట్రో ఎండీ, ఎమ్మెల్యేలు.. 2018 ఆగస్టు 25న పాతబస్తీలో మెట్రో రైలు అలైన్మెంట్ పనులను ప్రారంభించడానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీతో పాటు మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు పాతబస్తీలో పర్యటించారు. గతంలో ప్రతిపాదించిన విధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(ఎంజీబీఎస్) నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు పనులను చేపట్టడానికి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారుల బృందం పరిశీలించింది. పాత అలైన్మెంట్ ప్రకారమే పనులు ప్రారంభిస్తామని అధికారులు, ఎమ్మెల్యేలు అప్పట్లో తేల్చి చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. -
Hyd: కష్టాలు తొలగిస్తానని నగ్న చిత్రాలు తీసి.. ఆపై వ్యభిచారంలోకి!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బయటపడ్డ ఫేక్ బాబా అరెస్ట్ వ్యవహారంలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు సయ్యద్ హుస్సేన్. వాళ్ల కష్టాలు తీర్చే శక్తి తనకుందని నమ్మబలుకుతూ.. నిస్సహాయత ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఫలక్ నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళల నగ్న వీడియోలు, ఫోటోలను తీసిన సయ్యద్ హుస్సేన్(35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ‘డెకాయ్ ఆపరేషన్’ చేపట్టి.. అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు మొబైల్ ఆధారంగా కీలక సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. నిందితుడు సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతని స్వస్థలం కర్నాటక బీదర్ జిల్లా బసవకళ్యాణ్. కలబురిగి(గుల్బర్గా)లో ఉన్న గులాం అనే వ్యక్తి తనను పంపించినట్టు చెప్తున్నాడు సయ్యద్. మానసికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, యువతులు రోగాలు తొలగిస్తాము అని మాయమాటలు చెప్పి నగ్నంగా వాళ్లను ఫోటోలను తీశాడు సయ్యద్. ఈ మేరకు సయ్యద్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి గ్యాలరీని పరిశీలించారు పోలీసులు. అంతేకాదు.. గులాం తో సయ్యద్ చాట్ చేసిన కొన్ని వాట్సప్ చాటింగ్స్‌ను పరిశీలించినట్లు వెల్లడించారు. అయితే.. ఆ ఫోటోలను ఎక్కడికి పంపిస్తున్నాడు అనే దానిపై విచారణ జరుగుతున్నట్లు ఫలక్‌నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించారు. గుల్బర్గాలో ఉన్న గులాం గురించి సెర్చ్ టీమ్స్ ను పంపించినట్లు తెలిపిన ఆయన.. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని కోరుతున్నారు. ఫిజిక్‌ను బట్టి రేటు.. తన దగ్గరకు వచ్చే మహిళలను అందరినీ సయ్యద్ హుస్సేన్ టార్గెట్ చేయడం లేదు. ఆకర్షణీయంగా ఉండే ఫిజిక్‌ను బట్టే వాళ్లను రప్పించుకుంటున్నాడు. ముఖం.. కాళ్లు మినహాయించి కేవలం శరీరాన్ని మాత్రమే నగ్నంగా చిత్రీకరించి పంపినట్లు తెలుస్తోంది. ఒక సామాజిక కార్యకర్త ధైర్యం చేసి ఈ వ్యభిచార ముఠాను వెలుగులోకి తేగలిగారు. కలబురిగి ప్రాంతానికి గులాం.. వ్యభిచార గృహాల నిర్వాహకుడిగా ఓ అంచనాకి వచ్చారు. గులాం చెబితే.. వారం కిందట హుస్సేన్ పాతబస్తీ చేరాడు. బార్కస్ ఉంటున్న తన మరదలి ఇంట్లో అద్దెకు దిగాడు. ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ తన దగ్గరకు వచ్చే మహిళలకు, యువతులకు మాటలతో గాలం వేసేవాడు. తన గదిలో వాళ్లను నగ్నంగా ఫొటోలు తీశాడు. వాళ్ల శరీర సౌష్టవాన్ని బట్టి గులాం వారికి ధర నిర్ణయించేవాడని వాట్సాప్ ఛాటింగ్‌ల ఆధారంగా తేలింది. అలా వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు తెలుస్తోంది. -
Hyderabad: పాతబస్తీలోని కాలాపత్తర్‌లో దారుణం.. వీడియోకాల్‌లో..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని కాలాపత్తర్‌లో దారుణం జరిగింది. ప్రేయసితో వీడియోకాల్ మాట్లాడుతూ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేయసి పెళ్లికి దూరమవుతోందన్న బెంగతో మహ్మద్ తబ్రేజ్ అలీ ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలోనే వీరిరువురి వివాహం నిశ్చయమైంది. అయితే రెండు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవల నేపథ్యంలో పెద్దలు పెళ్లిని రద్దు చేశారు. దీంతో యువతితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. చదవండి: (మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?) -
పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్ చేసి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం సృష్టిస్తోంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఎన్ని గంటల వరకు హోటల్ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగారు. దీంతో మహమూద్ అలీ స్పందిస్తూ.. నేను హోంమంత్రిని.. నాకు వంద టెన్షన్లు ఉంటాయంటూ అర్ధరాత్రి ఫోన్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్ సీపీని కలిసిన విషయం తెలిసిందే. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు తెలిపారు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ భార్య మృతి) -
మత్తిచ్చి.. రెండ్రోజులపాటు కీచకపర్వం!
డబీర్‌పురా: హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంటి సమీపంలోని ఓ మందుల షాప్‌కు వెళ్లిన మైనర్ బాలిక (14)ను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి ఆమెకు మత్తుమందు ఇచ్చి ఏకంగా రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. రెండు నెలల కిందట సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఉదంతాన్ని మరచిపోక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీర్‌చౌక్ ఏసీపీ ప్రసాద్‌రావు... డబీర్‌పురా ఇన్స్పెక్టర్ కోటేశ్వర్రావు, ఎస్సైలతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. డబీర్‌పురా ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (14) తొమ్మిదో తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 12న రాత్రి 8 గంటల సమయంలో తన తల్లి కాస్త అస్వస్థతకు గురికావడంతో మందులు తీసుకొచ్చేందుకు ఇంటి సమీపంలోని మందుల దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో రెయిన్‌బజార్ షా కాలనీకి చెందిన సయ్యద్ నైమత్ అహ్మద్ (26), సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీ (20) క్వాలిస్ కారు (ఏపీ28 డీబీ 2729)లో అక్కడకు చేరుకున్నారు. సయ్యద్ రవిష్ స్కూల్ డ్రాపవుట్ కాగా సయ్యద్ నైమత్ సౌదీ అరేబియాలో కళ్లద్దాల దుకాణం నిర్వహిస్తూ ఇటీవలే నగరానికి వచ్చాడు. రవిష్ బాలికకు పరిచయస్తుడే. వారు మాయమాటలు చెప్పి బాలికను కారులో ఎక్కించుకొని తొలుత నాంపల్లిలోని సృజన ఇన్ లాడ్జికి తీసుకెళ్లారు. అనంతరం బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మర్నాడు త్రీ క్యాజిల్స్ డీలక్స్ లాడ్జికి తరలించి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి 12న అర్ధరాత్రి దాటాక డబీర్‌పురా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ నెల 14న బాలిక తల్లికి ఫోన్ చేసిన నిందితులు.. బాలిక తమ వద్దే ఉందని చెప్పి ఆమెను చాదర్‌ఘాట్–ఎంజీబీఎస్ నాలా వద్ద విడిచిపెట్టి పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న డబీర్‌పురా పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. నిందితుల ఫోన్ నంబర్ ఆధారంగా సయ్యద్ నైమత్ అహ్మద్, సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీలను అరెస్టు చేయడంతోపాటు వారు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే లాడ్జీల గదుల నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా, తమ కుమార్తె చేతిపై ఇంజక్షన్లు ఇచ్చిన గుర్తులు ఉన్నట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. -
పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం.. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో క్షుద్ర పూజల కలకలం రేగింది. భార్యను చంపేందుకు చేతబడి ప్రయోగం చేశాడో భర్త. రెండో పెళ్లికి అడ్డుగా ఉన్న భార్యపై క్షుద్రపూజలు చేయించాడు. అయితే స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. పూజల స్థావరంపై దాడిచేసి దొంగ బాబాను అరెస్ట్ చేశారు. బాధిత మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు. చదవండి: (భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...) -
మజ్లీస్కోటలో పాగా వేసేది ఎవరు? అక్బరుద్దీన్‌తో పోటీ అంత కఠినమా?
హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాలు మారుతాయా? మజ్లీస్కోటను ఎవరైనా ఢీకొట్టగలరా? మజ్లీస్‌కు దూరమైన కాంగ్రెస్ వ్యూహమేంటి? మిత్రపక్షానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్అభ్యర్థులు బరిలో దిగుతారా? కమలదళం చార్మినార్ పై జెండా ఎగురవేస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఒరిజినల్ హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు పాతబస్తీ అని పిలుస్తున్నారు. నలు దిక్కులా విస్తరించిన మహా నగరానికి గుండెకాయలాంటి పాతబస్తీలో దశాబ్దాలుగా మజ్లీస్‌పార్టీ పాగా వేసింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏడు లేదా 8 స్థానాలు మజ్లిస్ పార్టీ గెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు కూడా అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం రెడీగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు తమ ఎమ్మెల్యేలున్న ఏడు స్థానాలు మావే అంటున్నారు ఎంఐఎం నేతలు. చార్మినార్, యాకుత్‌పుర , చంద్రాయణ గుట్ట, నాంపల్లి, కార్వాన్, బహదూర్ పుర, మలక్ పేట్ నియోజకవర్గాలు ఎంఐఎం పార్టీకి కంచుకోటలు. ఈ సెగ్మెంట్లలో మరో పార్టీ గెలవాలంటే బాగా శ్రమించాల్సిందే. ఈ సారి ఎలాగైనా తమ బలాన్ని చూపాలని బీజేపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి . నాంపల్లిలో టీఆర్ఎస్ నుంచి ఎవరంటే! నాంపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్ది ఫిరోజ్ ఖాన్ మీద ఎంఐఎం అభ్యర్ది జాఫర్ హుస్సేన్ 9 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఈ సారి నాంపల్లి నుంచి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపి నుంచి దేవర కరుణాకర్ మళ్ళీ పోటీ చేస్తారని తెలుస్తుంది. టిఆర్ఎస్ నుంచి ఆనంద్ కుమార్ పోటీలో ఉండొచ్చని సమాచారం. చార్మినార్‌లో టీఆర్ఎస్ నుంచి లోధి చార్మినార్నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఉమా మహేంద్రపై ఎంఐఎం అభ్యర్ధి ముంతాజ్ అహ్మద్ ఖాన్ 32 వేల మెజారిటితో గెలుపోందారు. ఎంఐఎం నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, టిఆర్ఎస్నుంచి మహ్మద్ సలాహుద్దీన్ లోధి, కాంగ్రేస్ నుంచి టీ పిసీసీ సెక్రటరి షేక్ ముజబ్, బీజేపి నుంచి ఉమా మహేంద్రలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. చాంద్రాయణ గుట్టలో అది అసాధ్యమా? చాంద్రాయణ గుట్ట సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది సయ్యద్ షాహెజాదిపై ఎంఐఎం అభ్యర్ది అక్బరుద్దిన్ ఓవైసీ 80 వేల ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎంఐఎం నుంచి అక్బరుద్దిన్ ఓవైసీ, బీజేపి నుంచి షాహెజాది, టిఆర్ఏస్ నుంచి సీతారామ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బినోబైద్ మిస్త్రీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఎంబీటీకి పట్టున్న చాంద్రాయణగుట్టలో కూడా ఎంఐఎం పాతుకుపోయింది. ఇక్కడ అక్బరుద్దీన్‌ను ఓడించడం అసాధ్యమనే వాదన కూడా ఉంది. హజరి, యూసఫ్లలో ఒకరు పోటీలో పక్కా! కార్వాన్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది అమర్ సింగ్ పై ఎంఐఎం అభ్యర్ది కౌసర్ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి కౌసర్, బీజేపి నుంచి అమర్ సింగ్, టీఆర్ఎస్ నుంచి మహ్మద్ అల్ హజరి, అప్సర్ యూసఫ్ జాహిలలో ఓకరు పోటీ చేసే అవకాశం ఉది. (చదవండి: సీమాపాత్ర చేతిలో చిత్రహింసలకు గురైన సునీత.. చదువుకు సాయం అందిస్తానన్న కేటీఆర్) సంతోష్ కుమార్‌కు మరో అవకాశం? మలక్ పేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఆలె జితేంద్రపై ఎంఐఎం అభ్యర్ది బలాల 30 వేల మెజారిటితో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి బలాల, బీజేపి నుంచి ఆలె జితేంద్ర మరోసారి పోటీ పడనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి సంగిరెడ్డి , చెక్కిలోకర్ శ్రీనివాస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఏస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన చావా సంతోష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. యాకుత్ పురలో ఖాద్రితో పోటీకి దిగేది ఎవరో? యాకుత్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్అభ్యర్ది సామ సుందర్ రావు పై 47 వేల ఓట్ల మెజారిటితో ఎంఐఎం అభ్యర్ది పాషా ఖాద్రి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ, టిఆర్ఎస్ నుంచి సుందర్ రావు , బీజేపి నుంచి రూప్ రాజ్, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రాజు, కోట్ల శ్రీనివాస్ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు . బహదూర్ పుర భారీ మెజారిటీతో ఎంఐఎం బహదూర్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ది అలీ బక్రీ పై ఎంఐఎం అభ్యర్ది మోజం ఖాన్ 80 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి మోజం ఖాన్, టిఆర్ఏస్ నుంచి అలీ బక్రీ , కాంగ్రెస్‌నుంచి కలీం బాబ, బీజేపి నుంచి అనీఫ్ అలీ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. పాతబస్తీలోని 7 అసెంబ్లీ సీట్లపై బీజేపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు పెద్దగా ఆశలు లేనప్పటికి అక్కడ గట్టి పోటీ ఇవ్వటం ద్వారా... ఇతర సీట్లపై దృష్టి పెట్టకుండా మజ్లిస్‌ను పాతబస్తికే పరిమితం చేయొచ్చని పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో పాత బస్తిలో బోణీ కోట్టాలనే పట్టుదలనుకూడా ప్రదర్శిస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ 7 సీట్లతో పాటు రాజేంద్రనగర్ , జూబ్లిహిల్స్ సీట్లలో కూడా గెలిచేందుకు స్కెచ్ వేస్తోంది. దీంతో పాతబస్తీ రాజకీయం రసకందాయంలో పడింది. (చదవండి: మునుగోడులో బీజేపీకి బూస్ట్.. ‘ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది’) -
మరో వీడియో విడుదల చేసిన రాజాసింగ్.. సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తనను నగర బహిష్కరణ చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రెండోసారి అరెస్ట్‌కు ముందు ఆయన స్పందిస్తూ.. వీడియో విడుదల చేశారు. తాను తుపాకీ గుళ్లకు, ఉరిశిక్షకు భయపడేవాడిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: రాజాసింగ్‌కు ఊహించని షాక్.. ఇలా జరిగిందేంటి? ‘‘నేను మహ్మద్ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు. పాతబస్తీలో ఒవైసీ మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నా తల నరుకుతామని నినాదాలు చేస్తున్నారు’’ అని రాజాసింగ్ అన్నారు. రెచ్చగొట్టే నినాదాలు చేసినవారిపై ఎన్ని కేసులు పెట్టారు అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. నన్ను ఇవాళ రాత్రి, లేదా తెల్లవారుజామున అరెస్ట్ చేస్తారనే సమాచారం అందింది. పాత కేసుల్లో అరెస్ట్ చేయాలని కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. -
Hyderabad: పరేషాన్లో పాతబస్తీ.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్!
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం వారం, పదిరోజులుగా నిత్యం ఏదో ఒక విషయంతో జాతీయ స్థాయి వార్తల్లో ఉంటోంది. మునావర్ కామెడీ షో అనౌన్స్మెంట్ మొదలు తాజాగా జరుగుతున్న రాజాసింగ్ ఇష్యూ వరకు ప్రతి రోజూ నగరానికి సంబంధించిన విషయాలు వేడి పుట్టిస్తున్నాయి. నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు పహారా పెంచడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాత బస్తీలో ఆంక్షలు విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకసారి ఈ మొత్తం ఘటనలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో మునావర్ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గతంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన మునావర్ షోకు అనుమతి ఎలా ఇస్తారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. మునావర్ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. షోను అడ్డుకుంటామని చెప్పారు. అంతకు ముందు కూడా ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్‌ను దగ్దం చేస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితులు నడుమ రాజాసింగ్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకొని హౌజ్ అరెస్ట్ చేశారు. ఉత్కంఠతో మొదలై.. ప్రశాంతంగా ముగిసిన మునావర్ షో ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రిక్తత, అరెస్టుల నడుమ మునావర్ ఫారూఖీ ఆగస్టు 20న హైదరాబాద్‌లో నిర్వహించిన కామెడీ లైవ్ షో ‘డోంగ్రీ టు నోవేర్’ ప్రశాంతంగా ముగిసింది. మునావర్ గతంలో హిందూ దేవతలను కించపరిచారని... అందుకే నగరంలో ఆయన షోను జరగనివ్వబోమంటూ బీజేపీ, వీహెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక, పరిసర ప్రాంతాల్లో 1,500 మంది పోలీసులు బందోబస్తు చేపట్టి కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఒకటి తర్వాత మరొకటి నగరంలో సోమవారం రాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కె.కవిత ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతల అరెస్టులు జరుగుతుండగానే... ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పదల వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. దీనిపై పెద్ద స్థాయిలో నిరసనలు, కేసులు, అరెస్టు తదితరాలతో నగరం రణరంగంగా మారింది. దీనికితోడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం పరిణామాల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై సోమవారం బీజేపీ నాయకులు దాడి చేశారు. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు, కార్యకర్తలపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు, అరెస్టులపై బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి వరకు ఆందోళనలకు దిగాయి. ఇది సద్దుమణగక ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. దీంతో నగర వ్యాప్తంగా నిరసనలు జరగడంతో పాటు ఆందోళనకారులు బషీర్‌బాగ్ పాత కమిషనరేట్ వద్దే ఆందోళనకు దిగారు. ఆపై రాజాసింగ్‌పై వరుస ఫిర్యాదులు, కేసుల నమోదు మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్లపల్లిలోని రైల్వే టెర్మినల్ సందర్శన సైతం రద్దయింది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా నగరంలోని అనేక సంస్థలు, వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా అన్నట్లు మంగళవారం రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం సృష్టించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగింది. దీంతో సోమవారం నుంచి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో నగర ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. పాత కమిషనరేట్ వద్ద నిరసన ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై ఓ పక్క బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఆందోళనకారులు బషీర్‌బాగ్‌కు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దాదాపు 3 వేల మంది ఆందోళనకారులు బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ వద్దకు వచ్చారు. రాజాసింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అయితే అక్కడకు వచ్చిన ప్రత్యేక బలగాలు పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నాయి. కేసుల మీద కేసులు రాజాసింగ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ దక్షిణ మండలంలోని డబీర్‌పుర ఠాణాలో మొదటి కేసు నమోదైంది. ఆపై మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్, బాలానగర్ సహా ఆరు చోట్ల కేసులు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలోని మరికొన్ని పోలీసుస్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. 10 నిమిషాల 27 సెకన్ల నిడివితో ఉన్న రాజాసింగ్ వీడియోకు సంబంధించి మంగళ్‌హాట్ ఠాణాలో ఐపీసీలోని 153–ఎ, 295–ఎ, 505 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఉద్రిక్తత మధ్య అరెస్టు మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ధూల్‌పేట్‌లోని రాజాసింగ్ ఇంటికి మంగళ్‌హాట్ పోలీసులతో పాటు నగర టాస్క్‌ఫోర్స్ అధికారులు చేరుకున్నారు. వీరిని రాజాసింగ్ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ దశలో పోలీసులు, రాజాసింగ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ రాజాసింగ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని, వెనక్కి తగ్గేదిలేదని అన్నారు. తన వీడియో రెండో పార్ట్ కూడా త్వరలోనే విడుదల చేస్తానన్నారు. అతికష్టమ్మీద రాజాసింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారు. నేరుగా బొల్లారం ఠాణాకు తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ వద్ద నుంచి ఆందోళనకారులు వెళ్లిపోయారు. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తక్షణమే పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ మంగళవారం ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూన్ నెలలో నూపుర్ శర్మ ఉదంతంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, రాజాసింగ్ వీడియోను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. పార్టీకి నష్టం జరగకుండా చూసే క్రమంలో ఎమ్మెల్యేపై చర్యలకు దిగింది. కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనల అనంతరం.. పోలీసుల వినతిని తిరస్కరించారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌ను మంగళవారం రాత్రి ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. రాజాసింగ్ కోర్టులో ఉన్న సమయంలో ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా అనేకమంది కోర్టు వద్దకు చేరుకున్నారు. ఓ దశలో పరిస్థితి అదుపుతప్పేలా కన్పించింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా చార్మినార్ పరిసరాల్లోని చిరు వ్యాపారులతో దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలిపారు. వదంతులు నమ్మొద్దు ‘రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయి. వీడియో పోస్టు చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశాము. చర్యలు తీసుకున్నాము. ఈ కేసులో ఓ లీగల్ అడ్వైజర్‌ను ఏర్పాటు చేశాం. ఎవరూ వదంతులు నమ్మవద్దు. ముందస్తు చర్యల్లో భాగంగా సెన్సిటివ్ ఏరియాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పెట్టాము. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దు అనీ విజ్ఞప్తి చేస్తున్నాము. పాతబస్తీలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు. పాతబస్తీ అంత కూడా ప్రశాంతంగా ఉంది. పరిస్థితులు కంట్రోల్లో ఉన్నాయి' అని సౌత్‌జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. దూసుకొచ్చిన ఆందోళనకారులు శాలిబండ చౌరస్తాలో రాజా సింగ్‌కు వ్యతిరేకంగా బుధవారం మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనకారులు దూసుకొచ్చారు. నల్లజెండాలు ప్రదర్శిస్తూ.. నిరసన తెలుపుతూ శాలిబండ చౌరస్తా నుంచి చార్మినార్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమూహాన్ని శాలిబండ చౌరస్తాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనాలను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పాతబస్తీలో హైటెన్షన్ ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శాలిబండ, మొగల్‌పూర ఘటనలపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఇప్పటికే మతపెద్దలతోనూ చర్చించారు. మరోసారి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు. పాతబస్తీలో 14 సున్నిత ప్రదేశాల్లో భారీగా బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. సీఎం కేసీఆర్ రివ్యూ పాతబస్తీ అలజడిపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 7గంటలలోపు షాపులన్నీ బంద్ చేయాలని పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్‌తో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాతబస్తీలో దుకాణాలను పోలీసులు మూసివేయించారు. పలుచోట్ల పెట్రోల్ బంక్‌లు బంద్ చేయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఓల్డ్‌సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. సిటీలో ఆందోళనలపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా పోలీసుల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. -
పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మినీ భారతదేశం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు.. ఉత్తరాదివారు ఎక్కువగా నివసించే నగరం హైదరాబాద్. పైగా మైనారిటీలు కూడా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఒక్కో నియోజకవర్గం వైవిధ్యభరితంగా ఉంటుంది. సామాజిక సమీకరణాల్లో కూడా విభిన్నమైన నగరం. అందుకే ఏ పార్టీ అయినా హైదరాబాద్ నగరాన్ని గెలవాలనుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని నగరం మీద ఏ పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంది. పోటీలో నిలిచేదెవరు? గెలిచేదెవరు? రాజధాని రాజకీయాలపై సాక్షి ప్రత్యేక కథనాలు. చదవండి: ‘రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా.. కేంద్ర పెద్దల హస్తం ఉందా?’ తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాజకీయాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌కు అతీతంగా హైదరాబాద్ ప్రజల తీర్పు ఉంటోంది. పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. న్యూ సిటీలోని 8 సెగ్మెంట్లలో ఆధిపత్యం కోసమే అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. ఇందుకోసం అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించేశాయి. కోటికి పైగా ఉన్న జనాభాతో నగరం కిక్కిరిసి ఉండటంతో పార్టీల ప్రచారం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. చాలా సెగ్మెంట్లలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరా హోరీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో డివిజన్లు సాధించుకున్న కాషాయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలం నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. అదేవిధంగా పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో గోషామహల్ సీటులో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన ఏడు సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నందున గులాబీ పార్టీ కొందరు సిటింగ్‌లను మారుస్తుందనే ప్రచారం సాగుతోంది. పాతబస్తీలోని సీట్లను గెలవడం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కష్టమే అయినప్పటికీ ఈ పార్టీలు సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నాయి. అదే వ్యూహంతో బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న సున్నిత అంశాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై వెల్లువెత్తిన నిరసనలు, పార్టీలోనే అసంతృప్తి.. ఇవన్నీ కూడా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు. ఇన్నాళ్లు పాత బస్తీని ప్రయోగ క్షేత్రంగా తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పాతబస్తీకి బ్రాండ్ అంబాసిడర్ చార్మినార్‌కు కూతవేటు దూరంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ కార్యక్రమాన్నయినా చేపడుతున్నారు. హోంమంత్రి అమిత్‌షా, ఢిల్లీ నుంచి ఏ ప్రముఖులు వచ్చినా ఇక్కడ పూజలు నిర్వహించడం వల్ల బీజేపీ ఓ వర్గం ఓట్లన్నింటిని కేంద్రీకృతం చేసే వ్యూహాంలో ఉన్నట్టు కనిపిస్తోంది. న్యూ సిటీలోని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు, కార్పోరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలలో ఇప్పటికే టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీలు తమ బలాలు, బలహీనతలపై అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేలో వెల్లడైన సానుకూల అంశాలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని టిక్కెట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో రాజధాని నగర రాజకీయం వేడెక్కుతుంది. -
పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్‌కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్‌సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాతబస్తీలో రోడ్లపైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి.. ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొఘల్‌పురాలో పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో.. హైటెన్షన్ నెలకొంది. పోలీసులు నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయితే చివరకు పోలీస్ అధికారులు నిరసనకారులతో మాట్లాడి.. పంపించేశారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం(బుధవారం) మరోసారి చార్మినార్ పరిసర ప్రాంతంలో యువత గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పాతబస్తీ నుంచి గోషామహల్‌కు వెళ్లే రోడ్లు మూసేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బేగంబజార్‌లోని ఛత్రి బ్రిడ్జి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నడుమ.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడుల్లోనూ కేసీఆర్ కుటుంబమే లక్ష్యం?! -
హైదరాబాద్: ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధం
-
హైదరాబాద్ యువకుల అనైతిక సంబంధం.. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే..!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో కొత్త కల్చర్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అయితే వీరిద్దరిలో ఒకరు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనతో నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో బాధిత యువకుడు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. శాలిబండకు చెందిన ఓ యువకుని భార్య 2017లో మృతిచెందింది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పేవాడు. 2018లో అతనికి మొఘల్‌పురాకు చెందిన మరో యువకుడు పరిచయమయ్యాడు. శాలిబండ యువకుడు ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో మహిళల వస్త్రాలు ధరించేవాడు. దీంతో యువకులు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరు స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. 10 లక్షల ఆర్థిక సాయం అనంతరం శాలింబండ యువకునికి మరో యువతితో రెండో పెళ్లి జరిగింది. అయితే విషయాన్ని పసిగట్టిన రెండవ భార్య కొన్నాళ్ళకే అతన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ వీరిద్దరు పీకల్లోడుతు ప్రేమలో మునిగిపోయి సహజీవనం సాగిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో మొఘల్‌పురాకు చెందిన యువకుడికి ఓ యువతితో వివాహం జరిగే సమయంలో శాలిబండకు చెందిన యువకుడు 10 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇదే అదనుగా భావించిన మొఘల్‌పురా వాసి అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తనతో కలిసి ఉన్న సమయంలో సీక్రెట్‌గా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిపులకు గురిచేశాడు. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం అప్పట్లో మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదయ్యింది. ఆ తర్వాత కూడా తనను దగ్గరికి రానివ్వకపోవడంతో మొఘల్‌పురా వ్యక్తి నుంచి రోజు రోజుకు బెదిరింపులు అధికమయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శాలింబండ యువకుడు మంగళవారం అర్థరాత్రి 40 గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతేగాక అతనే 100 కంట్రోల్ రూమ్, 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న యువకున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నైట్ బజార్.. ఫుల్ హుషార్.
చార్మినార్: పాతబస్తీలోని రంజాన్ మార్కెట్లో నిత్యం సందడి కనిపిస్తోంది. వస్తువులను అతి తక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు చేపడితే నష్టం ఉండదంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. రంజాన్ మాసంలోని చివరి ఘట్టమైన జుమ్మత్ ఉల్ విదా పూర్తి కావడంతో ముస్లింలు ఇక ఈద్–ఉల్–ఫితర్ పండగ కోసం సిద్ధమవుతున్నారు. పండగకు ఇంకా ఒకరోజే మిగిలి ఉండటంతో పాతబస్తీలో ఎటుచూసినా రంజాన్ పండగ సంతోషం కనిపిస్తోంది. నైట్ బజార్ అర్ధరాత్రి దాటిన తర్వాత 2–3 గంటల వరకు కూడా కొనసాగుతోంది. (చదవండి: ఉన్నత విద్యలోనూ ఉత్తర, దక్షిణాలే! ) -
బహదూర్‌పురా ఫ్లై ఓవర్ ప్రారంభం.. జూపార్కు టూరిస్టులకు ఇక సాఫీ ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: నగరం కోర్‌సిటీ వైపు నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్‌నగర్ జిల్లా వైపు (పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా కాకుండా) రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ చిక్కుల నుంచి ఉపశమనం కలిగించేలా పాతబస్తీలో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి మంగళవారం ప్రారంభించారు. బహదూర్‌పురా జంక్షన్ వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌తో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి, జూపార్కు సందర్శించే టూరిస్టులకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించారు. ఫ్లై ఓవర్‌తోపాటు మీరాలం ట్యాంక్ వద్ద మ్యూజికల్ ఫౌంటెన్, ముర్గీచౌక్, మీరాలంమండి, సర్దార్ మహల్ ఆధునికీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీటితోపాటు కార్వాన్ నియోజకవర్గంలో మూడు ప్రాంతాల్లో రూ.297 కోట్ల విలువైన సివరేజి పనులకు, కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల అంచనా వ్యయం దాదాపు రూ. 500 కోట్లు. బహదూర్‌పురా ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం: రూ. 69 కోట్లు పొడవు: 690 మీటర్లు వెడల్పు: 24 మీటర్లు క్యారేజ్‌వే: రెండు వైపులా(ఒక్కోవైపు 3లేన్లు) ► ప్రాజెక్టులో భాగంగా జరిపిన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ తదితరాలు కలిపితే మొత్తం వ్యయం రూ.108 కోట్లు. ► ట్రాఫిక్ చిక్కులు తప్పడంతోపాటు ప్రయాణ సమయం, వాహన.. ధ్వని కాలుష్యం, ఇంధనం, వాహన నిర్వహణ వ్యయం వంటివి తగ్గుతాయి. ► ఫ్లై ఓవర్ కింద పచ్చదనం ప్రజలకు ఆహ్లాదం కలిగించనుంది. ► క్రాష్‌బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్ తదితర పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించినట్లు, పాతబస్తీలో ఈ టెక్నాలజీ వాడటం దీనితోనే ప్రారంభించినట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ దత్తుపంత్ తెలిపారు. పాతబస్తీలో పనులు.. కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పాత బస్తీలోనూ పలు పనులు చేపట్టారు. పాతబస్తీ వైపు ప్రయాణించే వారికి ఇప్పటికే ఏపీజీ అబ్దుల్‌కలాం ఫ్లై ఓవర్, బైరామల్‌గూడ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రావడం తెలిసిందే. కొత్తగా చేపట్టినవి.. ముర్గీచౌక్ (మహబూబ్‌చౌక్) ఆధునికీకరణ వ్యయం : రూ. 36 కోట్లు. మాంసం మార్కెట్‌గా పేరుగాంచిన ముర్గీచౌక్ కాంప్లెక్స్‌ను సంప్రదాయ డిజైన్‌ను మార్చకుండా అదనపు అంతస్తుతో ఆధునికీకరించనున్నారు. ప్లాజా ఎంట్రెన్స్ వరకు లైటింగ్, బెంచీలు, పచ్చదనం వంటివాటితో నవీకరించనున్నారు. ప్రదేశం చరిత్రను కాపాడుతూనే నగరీకరణకు అనుగుణంగా మార్చనున్నారు. మీరాలం మండి.. వ్యయం: రూ.21.90 కోట్లు అతి పెద్ద, పురాతన మీరాలం మండిని విక్రేతలకు తగిన ప్లాట్‌ఫారాలు, షెడ్లు, అంతర్గత రోడ్లు, నడక దారులు వంటి వాటితోపాటు ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఆధునికీకరించనున్నారు. ఈ మార్కెట్లో 43 హోల్సేల్దుకాణాలతోపాటు దాదాపు 300 మంది విక్రేతలు ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నారు. సర్దార్‌మహల్.. వ్యయం : రూ. 30 కోట్లు వారసత్వ భవనమైన సర్దార్‌మహల్‌ను 1900 సంవత్సరంలో నిర్మించారు. శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరణ, ఆధునికీకరణలతో పాటు సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. మీరాలంట్యాంక్ మ్యూజికల్ ఫౌంటెన్.. వ్యయం: రూ. 2.55 కోట్లు జూపార్కు సందర్శకులకు మరో ఆకర్షణగా దగ్గర్లోనే ఉన్న మీరాలంట్యాంక్ వద్ద వినియోగంలోకి రానున్న మల్టీ మీడియా మ్యూజికల్ ఫౌంటెన్ ప్రత్యేక రంగుల లైటింగ్, మ్యూజిక్లతో పర్యాటకులను ఆకట్టుకోనుంది. ప్రతిరోజు సాయంత్రం 15 నిమిషాల వ్యవధితో రెండు షోలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఎస్సార్డీపీతో.. జీహెచ్ఎంసీలో ఫ్లైఓవర్లు వంటి పనులకు ప్రత్యేకంగా ఎస్సార్డీపీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఎస్సార్డీపీ మొదటిదశలో చేపట్టిన 47 నుల్లో దాదాపు 30 పూర్తయినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వాటిలో 13 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్‌లున్నాయి. మ్యూజికల్ ఫౌంటెన్.. డ్యాన్సింగ్ అదిరెన్ నగరవాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేసే అద్భుతమైన మల్టీమీడియా మ్యూజికల్ ఫౌంటెన్ మంగళవారం ప్రారంభమైంది.పాతబస్తీ వాసులతో పాటు జూపార్కు సందర్శనకు వచ్చే పర్యాటకులకు దీంతో ఎంతగానో ఆహ్లాదం కలగనుంది. ఈ ఫౌంటెన్ ఒక వినూత్నమైన అనుభవాన్ని అందజేయనుంది. రంగు రంగుల హరివిల్లులతో మ్యూజికల్ ఫౌంటెన్ ఒకేసారి సంగీతాన్ని, డ్యాన్సింగ్ ఎఫెక్ట్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఈ మొత్తం వ్యవస్థ ఆధునిక సాంకేతికత, సంగీతాలను మేళవించుకొని పని చేసేవిధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. -
అర్థరాత్రి చార్మినార్‌లో సందడి చేసిన రాజమౌళి.. ఫోటోలు వైరల్
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్ చార్మినార్‌లో సందడి చేశారు. కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్‌ను సందర్శించాడు. సాధారణ వ్యక్తిలా వెళ్లి నైట్ నైట్ బజార్ అందాలను తిలకించారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయ్యిండి కూడా ఇంత సింపుల్‌గా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా రంజాన్ మాసంలో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్‌లో షాపింగ్ హడావిడి కొనసాగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యంగా రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఇటీవలె ఆర్ఆర్ఆర్తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న రాజమౌళి మహేశ్ బాబుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. -
హల్చల్ చేసిన పాతబస్తీ కార్పొరేటర్
సాక్షి, హైదరాబాద్: భోలక్‌పూర్ కార్పొరేటర్ వ్యవహారం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో ఎంఐఎం కార్పొరేటర్ హల్చల్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. యునాని ఆస్పత్రి దగ్గర పార్కింగ్ విషయంలో సదరు కార్పొరేటర్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫిర్యాదు అందిందని ఎస్సై సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా.. ఆ కార్పొరేటర్ మాత్రం తగ్గలేదు. ఎస్సై మాటలు పట్టించుకోకుండా.. గట్టిగట్టిగా అరుస్తూ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ ఎస్సైపై చిందులు తొక్కాడు. ఎస్ఐకి దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. దమ్కీ ఇచ్చిన కార్పొరేటర్.. పత్తర్‌గట్టీ ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రిగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భోలక్‌పూర్ కార్పొరేటర్ వ్యవహారం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడం, ఆపై పోలీసులు కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కామెంట్ చేశారు. రేవ్ పార్టీ రిచ్ కిడ్స్ను వదిలేశారని, చట్టం పేద, ధనిక వర్గాలకు ఒకేలా వర్తించాలంటూ హైదరాబాద్ పోలీస్, మంత్రి కేటీఆర్ ట్విటర్ ట్యాగులను జత చేసి మరీ ట్వీట్ చేశారు. Rule of law is supreme Art 13 & it is very unfortunate that cocaine was found in this “Rave party” and all offspring’s of Rich kids where released not a single arrest apart from the owner of the place Law should be applied equally to poor & rich @CPHydCity @KTRTRS https://t.co/WehHaS5BTK — Asaduddin Owaisi (@asadowaisi) April 6, 2022 -
హైదరాబాద్‌లో ఐసిస్ కలకలం.. సానుభూతిపరుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సులేమాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఐపీ అడ్రస్ ద్వారా మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సులేమాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ ఫలక్‌నుమా పరిధిలోని రైతు బజార్లో కొంతకాలంగా నివాసముంటున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. కాగా 2020లోనే పహాడీషరీఫ్‌లో సులేమాన్‌కు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సిలింగ్ తరువాత కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న సులేమాన్ తరువాత ఫండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సోషల్ మీడియా వేదికగా సులేమాన్ ఏకంగా 20 ఖాతాలను తెరిచి యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా చేస్తున్నాడని పోలీసులు తేల్చారు. ఇక ఉగ్రవాద కార్యకలాపాలు మరోసారి తెరమీదకు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక లతో ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చదవండి: యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్ దిగే లోపు పోలీసుల ఎంట్రీ -
తగ్గేదేలే.. అంతా మా ఇష్టం..
సాక్షి,చార్మినార్(హైదరాబాద్): పాతబస్తీలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రాకపోకలు సాగిస్తున్నారు. పాతబస్తీలోని దక్షిణ మండలంలో చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, బహదూర్‌పురా నాలుగు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో రెండు, మూడు జాతీయ రహదారులతో పాటు ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లలో ప్రతిరోజు వాహనాల రాకపోకలు జోరుగా కొనసాగుతాయి. అయితే కొంత మంది వాహనదారులు నిబంధనలు డోంట్ కేర్ అంటూ.. వాహనాలను ఇష్టానుసారంగా నడుపుతూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఉన్నా.. వారు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ► ప్రధాన కూడళ్లలో ఆశించిన మేరకు ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడం, సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో ఉండాల్సినప్పటికీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ► అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రోడ్లలో సైతం యువతీ, యువకులు రయ్.. మంటూ దూసుకెళ్తూ ఇతర వాహనదారులకు ఆటంకాలు కలిగిస్తున్నారు. నంబర్ ప్లేట్ల మార్పులు.. ► పాతబస్తీలో కొందరు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబర్ ప్లేట్లను మార్చేస్తున్నారు. ► కొందరైతే ఉద్దేశపూర్వకంగా తమ నంబర్ ప్లేట్లను కనిపించకుండా సగం వరకు వంచేయడం, ఇంకొందరు విరగ్గొట్టడం, ప్లాస్టర్లు అతికించడం వంటివి చేస్తూ ఆర్టీఏ, ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. (చదవండి: మరమ్మతు చేస్తుండగా కరెంట్ సరఫరా ) ప్రమాదాలు కొని తెచ్చుకునేలా.. ► అసలే ఇరుకు రోడ్లు.. ఆపై రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో స్పీడ్‌గా వాహనాలను నడపడానికి పాతబస్తీలో ఏ మాత్రం అవకాశం లేదు. అయినప్పటికీ కొందరు కుర్రాళ్లు రెట్టింపు ఉత్సాహంతో స్పీడ్‌గా ముందుకెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ► ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి త్రిబుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల బారీ నుంచి తమను తాము కాపాడుకోవడమే కాకుండా ఇతరులకు ప్రమాదాలు కలిగించరాదంటూ అవగాహన కల్పిస్తామన్నారు. పాతబస్తీలో కూడా ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తాం. – శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, దక్షిణ మండలం -
తన వద్దకు రావొద్దంటూ.. ఆస్పత్రి భవనంపై నుంచి దూకిన బాలింత
సాక్షి, హైదరాబాద్: ప్రసూతి కోసం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన ఓ బాలింత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి వర్గాలు, పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన సంపూర్ణ(33) గత నెల 26వ తేదీన ప్రసవం కోసం పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. 29వ తేదీన ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఒక బాలుడు, ఒక బాలిక జన్మించగా ఇరువురు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళ ప్రసవించిన అనంతరం రెండు, మూడు రోజులుగా నిద్రలేని సమస్యతో ఏదో ఆలోచనతో బాధపడుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. గురువారం ఆమె భర్త సంపూర్ణను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చాడు. అప్పటికే మానసిక ఒత్తిడితో ఉన్న ఆమె భర్తను చూసి మరింత ఒత్తిడికి గురై ఆసుపత్రి ఆవరణలోనే గట్టిగా ఆరుస్తూ తన వద్దకు రావొద్దంటూ.. వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. గట్టిగా అరుస్తూ ప్రధాన గేటు వైపు నుంచి మొదటి అంతస్తు నుంచి దూకడానికి ప్రయత్నించింది. అప్పటికే పరిస్థితిని అర్థం చేసుకున్న ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు ఆమె దూకడాన్ని గమనించి అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడారు. స్వల్ప గాయాలకు గురైన ఆమెను ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, భర్తపై కోపంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి -
పాతబస్తీలో పోలీసుల అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసి పర్యవేక్షిస్తున్నారు. ఓల్డ్ సిటీలో క్విక్ రియాక్షన్ టీం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు కలగకుండా చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఒవైసీ వాహనంపై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరగడంతో హైదరాబాద్ పాతబస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల గురించి ప్రచార, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం కావడంతో కలకలం రేగింది. ఆందోళనకు గురైన ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమాచారం తెలుసుకునేందుకు దారుస్సలాంకు పరుగులు తీశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఇందుకోసం ఏకంగా 7వేల మంది పోలీసుల భారీ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత వార్త: ఒవైసీ కారుపై దుండగుల కాల్పులు.. ఒకరి అరెస్టు.. పిస్తోల్ స్వాధీనం