పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్‌గా ఐటీ సోదాలు | IT Raids At Kohinoor Group And King Place Houses At Old City | Sakshi
Sakshi News home page

Hyderabad: కోహినూర్ గ్రూప్స్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో ఐటీ దాడులు

Published Sat, Nov 25 2023 9:07 AM | Last Updated on Sat, Nov 25 2023 10:49 AM

IT Raids At Kohinoor Group And King Place Houses At Old City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్‌ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.

కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కింగ్స్‌ గ్రూప్‌ ఓనర్‌ షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో  సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లు అనుమానం రావడంతో దాడులకు దిగారు.

మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటి అధికారుల దాడులు చేపట్టారు. పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాడ్యుర్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్‌పై ఐటీ సోదాలు జరుపుతున్నారు.  హోటల్ యజమాని శేఖర్ గౌడ్  హైదరాబాద్ చెందిన వ్యక్తి కాగా.. యజమాని ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి డబ్బులు మరుతాయని ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం.
చదవండి: సోనియా దీవిస్తే సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement