
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా హైదరాబాద్‌లో మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఐదుగురు హిజ్బూ ఉత్ తహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ ఉగ్రవాద అనుమానితులు చిక్కారు. ఈ మాడ్యుల్‌కు సూత్రధారిగా ఉన్న మహ్మద్ సలీం.. ఓ మెడికల్ కాలేజీలో డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తుండగా, పట్టుబడినవారిలో ఒక దంత వైద్యుడు, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉండటం కలకలం రేపుతోంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఉగ్రనేత ఒవైసీ కుటుంబానికి చెందిన దక్కన్ కాలేజీలో హెచ్‌వోడీగా పనిచేస్తున్నాడు. టెర్రరిస్టులకు సపోర్టు చేస్తానని గతంలో ఒవైసీ ప్రకటించారు. ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు మజ్లిస్ ఆశ్రయమిస్తోంది. ఆరుగురు ఉగ్రవాదులు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. ఐఎస్ఐ లాంటి సంస్థలకు పాతబస్తీలో షెల్టర్ ఇస్తున్నారు. అధికారం కాపాడుకోవాలనే తప్ప.. దేశ భద్రతపై బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు.
అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఏకైక లక్ష్యం అధికారమే. శాంతిభద్రతలపై ఒక్క సమీక్ష కూడా కేసీఆర్ చేయడం లేదు. ఉగ్రవాదుల కదలికలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలి. భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ హింసించే పులకేశి. మేం సర్జికల్ స్టైక్ చేస్తామని చాలా మంది ఓవర్‌గా మాట్లాడారు. అందులో ట్విట్టర్ టిల్లు కూడా ఉన్నారు. ఓట్ల కోసమే అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సీఎం కేసీఆర్ సలహాదారుగా తీసుకున్నారు. పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం బెదిరిస్తోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: ‘సోమేష్ కుమార్‌ను నియమించి అందుకే..’
Comments
Please login to add a commentAdd a comment