సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని పురానాపూల్‌లో మొసళ్లు కనిపించడంతో కలకలం రేగింది. గడిచిన రెండు రోజులుగా రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న కురిసిన భారీ వర్షానికి రెండు మొసళ్లు కొట్టుకొచ్చాయి. స్థానికులు వన్యప్రాణి సంరక్షణా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, నెహ్రూ జూపార్క్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని బంధించే పనిలో నిమగ్నమయ్యారు. హిమాయత్ సాగర్ నుంచి వరద నీటిలో ఈ మొసళ్లు కొట్టుకొచ్చినట్టు అధికారులు భావిస్తన్నారు. ఇక భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం తడిసిముద్దవుతోంది. చెరువు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి.
(చదవండి: జాగ్రత్త! నీ చెయ్యి చికెన్ పీస్ అయిపోద్ది)
పాతబస్తీలో మొసళ్ల కలకలం
Published Thu, Sep 17 2020 4:09 PM | Last Updated on Thu, Sep 17 2020 4:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment