crocodile
-
మొసలి అస్వస్థత
వేసవికాలం.. సుందరవనం అనే అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక మొసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగిన వెంటనే ఆ మొసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని మొసలితో ‘ఓ మొసలి మామా! నీకు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికో మందు చెబుతాను. నన్ను వదిలిపెట్టు అంది. ఆ మొసలి నిజంగానే అస్వస్థతతో బాధపడుతున్నది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి ‘నీకు నా అస్వస్థత సంగతి ఎలా తెలుసు?’ అని అడిగింది. ‘నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది’ అని చెప్పిందా జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది ‘అదిగో! ఆ నక్కను తింటే నీ అస్వస్థత మాయమౌతుంది. దాన్ని పట్టుకో!’అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టింది మొసలి. ఒడ్డుకు చేరిన జింక పిల్ల ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఎదురుగా ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరుగెత్తింది. బుజ్జి నక్కకూ ఆ మడుగులో మొసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అదీ నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడా మొసలి బుజ్జి నక్క కాలును పట్టుకొని ‘నా అస్వస్థతకు నీ మాంసమే మందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా అస్వస్థతను పోగొట్టుకుంటాను’ అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా ‘అయ్యో.. నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను. నన్ను తిన్నవారిక్కూడా వ్యాధి సోకుతుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీదున్న తోడేలు పిల్లనడుగు’ అంది. అప్పుడు మొసలి ‘ఈ నక్క చెప్పింది నిజమేనా’ అంటూ తోడేలును అడిగింది. ‘ఔను నిజమే’ అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క ‘నీ అస్వస్థతకు సరైన మందును వైద్యుడైన ఎలుగుబంటి చెబుతుంది దాన్నడుగు’ అన్నది. దాంతో బుజ్జి నక్కను వదిలేసింది మొసలి. వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోకే ఎలుగుబంటి వచ్చిందక్కడికి. మొసలి తన అస్వస్థతకు దాన్ని మందు అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు గనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి, కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ‘ఎలుగు మామా! ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందట.. నిజమేనా!’అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి ‘దానికా వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది. ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా’ అంది. ‘మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే’ అంది మొసలి. ‘దానికది ఊతపదం. ఏం మాట్లాడినా అది ఔను! నిజమే అంటుంది. ఆ జింక పిల్ల,బుజ్జి నక్క తెలివిగలవి. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేంటీ? రేప్పొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా! చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని, వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నిటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇకనుంచైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో! ఆ చెట్టు పండ్లను తిని కడుపు నింపుకో! అవి ఆరోగ్యాన్నిస్తాయి’ అంది ఎలుగుబంటి. ‘ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ మొసలికి చిక్కుతున్నాయి. మరికొన్ని కొలనులు తవ్వించి, జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి’ అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
నెలకు 5,000 ఖర్చు చేయలేక.. మొసళ్ల నదిలో వదిలేశారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఒక మొసలికి ఆహారంగా రోజుకు సుమారు అర కిలో మాంసం వరకు సరిపోతుంది. వీటికి రోజువిడిచిరోజు ఓ కిలో వర కు బీఫ్ ఆహారంగా వేస్తారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం నెలకు ఎక్కు వలో ఎక్కువ రూ.ఐదు వేల వరకు.. ఏడాదికి రూ.60 వేలకు మించి ఖర్చు కావు. ఈ మాత్రం నిధులు లేవనే సాకుతో అటవీశాఖ అధికారులు మంజీరా అభయారణ్యం వద్ద ఉన్న మొసళ్ల పునరావాస కేంద్రాన్నే మూసివేశారు. ఈ కేంద్రంలో ఉన్న మొసళ్లను నదిలో వదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మూడింటిని కూడా మేపలేక..సంగారెడ్డికి సమీపంలో ఉన్న మంజీరా అభయార ణ్యం విభిన్న పక్షి జాతులకు నిలయం. మంజీరా డ్యాం వద్ద ఉన్న చిత్తడి నేలల్లో ఏటా వివిధ దేశాల నుంచి వలస పక్షులు కూడా వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ డ్యాంవద్ద అటవీశాఖకు సంబంధించి మొసళ్ల పునరావాస కేంద్రం ఉంది. ఇందులో రెండు ఆడ, ఒక మగ మొసలి ఉండేవి. వీటికి మేతకు నిధులు రావడం లేదని ఆ మొసళ్లను నదిలో వది లేసి ఈ కేంద్రాన్ని మూసివేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తుంటే, ఈ నామమాత్ర నిధులు రావడం లేదంటూ మొసళ్లను నదిలో వదిలేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు దారితీస్తోంది.పెదవి విరుస్తున్న వన్యప్రాణుల ప్రేమికులుమొసళ్ల పునరావాస కేంద్రాన్ని మూసివేయడం పట్ల వన్యప్రాణుల ప్రేమికులు, సందర్శకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యాం వద్దకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు కూడా ఈ అభయారణ్యానికి వస్తుంటారు. ఈ కేంద్రం మూసి ఉండటంతో వీరంతా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. కాంపా నిధులూ కేటాయించలేరా?వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కాంపా (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ) నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద ఏటా రూ.కోట్లలో నిధులు వస్తున్నప్పటికీ., ఈ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి మాత్రం నిధులు కేటాయించడం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఎలి.. ఎంత తెలివైన స్టూడెంటో కదా!
థాయ్‌తో పాటు అమెరికాకు చెందిన కుస్తీ వీరులు.. పదునైన పళ్ళతో ఉన్న మొసళ్ళ దవడ మధ్య వాళ్ల తలను దూరుస్తూ కనిపించారు. “ఖచ్చితంగా ఆ జంతువులు శిక్షణ పొందినవి కదూ?” అని నేను రోమిని అడిగా నమ్మలేకపోతూ. అయితే ఆ విన్యాసంలో వారిని అవి నమిలేయకుండా ఉండేంతగా కుస్తీ వస్తాదులు మొసళ్ళని భయపెడతారని రోమ్ అనుకున్నారు. మనం అంగీకరించాల్సింది ఏమిటంటే?.. మొసళ్లకి శిక్షణ ఇవ్వలేము కానీ మచ్చిక చేసుకోవచ్చు. ఇండోనేషియా పడమర పపువాలో రోమ్ ఒక న్యూ గిని మంచినీటీ మొసలి ఒక చెక్క ఇంట్లో ఉండటం చూసాడు. ఆ మొసలి పొదిగిన పిల్లగా ఉన్నప్పటి నుంచి పిల్లల, మనుషులతో ఓ పెంపుడుకుక్కలా పెరిగి ఇప్పుడు ఐదడుగుల పొడుగయ్యింది. చల్లటి వర్షాకాలం రాత్రులలో అక్కడి సభ్యులతో కలిసి అది చలికాచుకుంటూ ఉంటుంది కూడా.మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ డైరెక్టర్‌గా 2008వ సంవత్సరం మధ్యలో కొద్దికాలం పాటు పనిచేసిన రాల్ఫ్ సామెర్లడ్.. జర్మనీలో ఓ తోటమాలి దక్షిణ అమెరికా రకమైన కెమన్ అనే మొసలిని పెంచుకున్నట్లు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆ తోటమాలి మోకాళ్లపై కూర్చున్నప్పుడు, కుక్క పిల్లలా ఆ మొసలి అతని తలకూ, భుజాలకూ రాసుకునేదట. రాల్ఫ్ మద్రాస్ మొసళ్లకి శిక్షణ ఇచ్చే ఒక కార్యక్రమానికి నాంది పలికాడు. అప్పట్లో అసిస్టెంట్ క్యూరేటర్ అయిన సోహం ముఖర్జీ.. మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించేలా, ఆ ఆలోచనను రాను రాను ఎంతో సరదాగా, ఆకర్షణీయమైన కార్యక్రమంగా అభివృద్ధి చేశారు.ఎలి చిన్నపిల్లగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వడం జరిగింది, కానీ, అది పెద్దయినప్పటి నుంచి ఆ అభ్యాసం ఇవ్వడం తగ్గించేశారు. ఎలికి తన పేరు ఇంకా గుర్తుంది. శిక్షణ పునః ప్రారంభించాడానికి ఇది ఒక మంచి విషయం. తను ఒక ఆదేశం పాటించిన ప్రతీసారి ఒక మాంసం ముక్క బహుకరించేవారు. అచ్చం ఒక కుక్కకి శిక్షణ ఇచ్చినట్లుగా. ఏటొచ్చి ఇది ఒక పెద్ద పోలుసులు కలది. అంతే. ఒక వారం తరువాత, ఎలికి శిక్షణ ఇస్తున్నప్పుడు, వెనుకన ఉన్న ఒక మగ్గర్ మొసలి ఆదేశాలకి చక్కగా స్పందించడం సోహం గమనించారు. ఆ మొసలి ఏ బహుమతి సహాయం లేకుండా, చూసి నేర్చుకుంటోంది. సోహం దానికి పింటూ అని పేరు పెట్టాడు. ఆ మొసలి వెంటనే ఆ కార్యక్రమంలో భాగమైంది. కాలక్రమేణా మరి నాలుగు మొసళ్లు చేరాయి. ప్రతీ మధ్యాహ్నం మూడింటికి శిక్షణ మొదలయ్యేది. దానికి పది నిముషాల ముందే ఆ ఆరుగురు శిష్యులు కొలను అంచున, సోహం గొంతు నుంచి విలువడే అతి చిన్న శబ్దం కోసం ఆత్రంగా ఎంతో అప్రమత్తతతో వేచి చూసేవి. అతను వచ్చాక వాటి ఆనందం మాములుగా లేదు. ఆ మొసలి శిష్యులకి వాటిని ఏ వరుసలో పిలుస్తారో తెలుసు. ఇక వారి వంతు కోసం ఎంతో సహనంతో వేచి ఉండేవి. ఆచ్చం నా కుక్కలలాగే వాటికి ఆదేశల వరుస ఎంత బాగా తెలుసంటే, అవి ముందస్తుగానే ఆ విన్యాసాలు చేసేసేవి. కనుక సోహం ఆదేశాలను తారుమారు చేయాల్సొచ్చేది. ఆ మొసలి శిష్యులు వారంలో ఏ రోజు శిక్షణ నుంచి సెలవు వస్తుందో కూడా తెలుసుకున్నాయి. పింటూ లాగే, వేరే మోసళ్లు కూడా శిక్షకుడి ఆదేశాల పట్ల ఎంతో శ్రద్ధ వహించి, చూసి నేర్చుకున్నాయి. త్వరలోనే కొమోడో, థాయ్ సాయమీస్, ఉప్పు నీటి మొసలి మిక్, మారియు నైల్ మొసలి అబూ, అన్ని జాతుల రంగురంగుల మొసళ్ళ కలగంపగా ఆ శిక్షణ పాఠశాలకు హాజరు అయ్యాయి. ఆఖరికి వయసులో పెద్దదైన మగ్గర్ రాంబో కూడా ఆ కార్యక్రమంలో చేరి, కొత్త విన్యాసాలు నేర్చుకోవడానికి వయసు అవరోధం కాదని నిరూపించింది. కానీ గారాల కూచి ఎలి మాత్రం రా, ఉండు, పైకి, కూర్చో, తిరుగు, నోరు తెరు వంటి పన్నెండు ఆదేశాలు తెలిసిన అత్యుత్తమ విద్యార్థి. ఒకసారి ఎలి శిక్షణ రాంప్ పై సగం దూరం వెళ్ళాక, సోహం తనని ‘గెంతు’ అని ఆదేశించారు. ఒక జారెడు బల్ల వంటి రాంప్ పైనుంచి గెంతటం ఎంత కష్టమో మీరు ఊహించగలరు, కానీ ఎలి బహుమతి పొందే అవకాశం వదులదలచలేదు. రాంప్ వదలకుండా ఎలి తన కాలివేళ్లపై నుంచుని పొట్ట కిందకి ఆంచి, మెల్లగా గెంతడానికి సిద్ధమవుతున్నట్టు అనుకరించింది. ఎంతో ఆశ్చర్యకరం. ఆ పాఠశాల, ఎనిమిది నెలల నుంచి నలభై ఏళ్లు ఉన్న వేర్వేరు జాతులకు చెందిన ముప్పై మొసళ్ళ ఉండేంతగా పెరిగి పెద్దదయ్యింది.కెమన్ బల్లులు, అల్డబ్రా తాబేళ్లను కూడా శిష్యులుగా చేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ఆ పాఠశాల పేరును రెప్టైల్ పాఠశాలగా మార్చారు. పాములు, మానిటర్ బల్లులు, తాబేళ్ళు పాఠశాలలో చేరడానికి వేచి ఉన్న జాబితాలో ఉన్నాయి. మరి స్పష్టంగా, గవర్నమెంట్ నిబంధనలకు కట్టుబడి, విద్యార్థులు చేరడానికి నిర్ణీత రుసుము కూడా లేదు! ::జానకి లెనిన్ రాసిన దానికి రోహిణి చింత అనువాదం(చదవండి: యంగ్ టాలెంట్: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు) -
రెజ్లింగ్ పాటకు మొసలి హుషారు
90వ దశకంలో టీవీల్లో వచ్చే రెజ్లింగ్ క్రీడకు భారతీయ టీనేజర్లలో క్రేజీ అంతాఇంతా కాదు. అలాంటి క్రేజ్ ఇప్పుడు భారత్‌లో తగ్గిపోయినా అమెరికా తదితర దేశాల్లో ఇంకా ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) అభిమానులకు ఒక మొసలి సైతం జతకలిసింది. స్టార్‌వార్స్ ప్రఖ్యాత థీమ్సాంగ్ అయిన ‘ది ఇంపీరియల్ మార్చ్’ పాట వినబడగానే ఈ మొసలి హుషారుగా కదలివస్తోంది. గంటలతరబడి కదలకుండా ఉండగలిగే మొసలిలో సైతం మా సాంగ్ కదలిక తెప్పిస్తోందని, మెప్పిస్తోందంటూ పలువురు రెజ్లింగ్ అభిమానులు సంబంధిత వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్గ్లేడ్స్ హాలిడే పార్క్‌లో డార్త్ గేటర్ అనే మొసలి ఉంది. ఇది ఈ పాట వినగానే చేస్తున్న హంగామా చూసి గేటర్బాయ్స్ టీవీషో స్టార్ పౌల్ బేడార్ట్ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. స్వయంగా మొసలి సమీపానికి వెళ్లి మాంసం ముక్కలను పట్టుకుని థీమ్‌సాంగ్‌ను ప్లే చేయడం, మొసలి వచ్చి హుషారుగా ముక్కలను లటుక్కున మింగేయడం వీడియోలో రికార్డయింది. దీనిని ఇప్పుడు లక్షలాది మంది లైక్‌లు, షేర్లు కొడుతున్నారు. – న్యూయార్క్ -
‘హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై మొసలి’
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు ఎలాంటి విచిత్రాలు కనిపిస్తాయో ఎవరూ చెప్పలేరు. కడుపుబ్బా నవ్వించే వీడియోలతో పాటు కంగుతినిపించే వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాయి. ఇదేకోవకు చెందిన ఒక వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.గుజరాత్‌కు చెందిన ఈ వీడియో ఒక పట్టాన నమ్మేలా లేదు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చ్యపోతున్నారు. భారీ వర్షాలకు నదిలో నుంచి మొసళ్లు బయటకు రావడాన్ని చూసిన జనం.. అలాంటి మొసలి స్కూటర్‌పై వెళ్లడాన్ని చూసి కంగుతింటున్నారు. ఈ వీడియోలో ఇద్దరు యువకులు స్కూటర్‌పై వెళుతుండటాన్ని చూడవచ్చు. వారి మధ్య ఓ మొసలి కూడా ఉంది. ఒకరు స్కూటర్ నడుపుతుండగా, మరొకరు ఆ భారీ మొసలిని ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. కుక్కలను, పిల్లులను ఇలా స్కూటర్‌పై ఎక్కించుకుని తీసుకుని వెళ్లడాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. కానీ ఇలా మొసలిని బండిపై తీసుకువెళ్లడాన్ని ఎప్పుడూ చూడలేదని ఈ వీడియో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోను @gharkekalesh అనే ఖాతా ద్వారా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ‘వడోదరలోని విశ్వామిత్ర నది నుంచి బయటకు వచ్చిన ఒక మొసలిని ఇద్దరు యువకులు స్కూటర్‌పై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి తీసుకెళ్లారు’ అని రాసివుంది. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ మొసలిని నీటిలో నుంచి బయటకు తీసి, దాని నోటిని తాడుతో కట్టేస్తే అది బలహీనపడిపోతుంది’ అని రాశారు. మరొక యూజర్ ‘సోదరుని ధైర్యానికి వందనం’ అని రాయగా, ఇంకొకరు ‘హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై మొసలి ఎలా వెళుతుంది? అని రాశారు. Two young men took a crocodile found in Vishwamitra river in Vadodara to the forest department office on a scooter🫡pic.twitter.com/IHp80V9ivP— Ghar Ke Kalesh (@gharkekalesh) September 1, 2024 -
Viral: వర్షాలతో రోడ్డుపైకొచ్చిన భారీ మొసలి
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డు మీదకి వరద నీరు పోటెత్తుతుంది. తాజాగా రత్నగిరి జిల్లాలో నీటి ప్రవాహంలో రోడ్డు మీదకు ఓ భారీ మొసలి కొట్టుకొచ్చింది. రోడ్డు మీద అర్ధరాత్రి వాహనదారుల ముందే పాకుతూ కనిపించింది. కొంకణ్ లోని చిప్లూన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.భారీ మొసలి రోడ్డుపై నెమ్మదిగా నడుచుకుంటూ రావడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. కొందరు వాహనదారులు మొసలిని వెంబడిస్తూ వీడియో తీశారు. కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసినవాళ్లు సమీపంలోని పెద్ద చెరువు ఉందని బహుశా అక్కడి నుంచి బయటకు వచ్చిందని అంటున్నారు.#Maharashtra : Video of Crocodile Roaming Ratnagiri Roads Goes Viral After Heavy Rain; Suspected to Have Come From Shiv River.#Ratnagiri #chiplun #Crocodile #Monsoon pic.twitter.com/CSnwB3TgPS— Pune Pulse (@pulse_pune) July 1, 2024 -
గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 10 అడుగుల భారీ మొసలి జనాలను హడలెత్తించింది. కాలువలో నుంచి పొరపాటున బయటకు వచ్చిన మొసలి.. కాసేపు సమీప ప్రాంతంలో సంచరించింది. స్థానికులు కంటపడంతో ఏం చేయాలో తోచక కంగారుపడిపోయింది. అనంతరం అక్కడున్న ఇనుప రెయిలింగ్‌పై నుంచి నీటిలో దూకేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన బులంద్‌షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి 10 అడగుల మొసలి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది.అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్‌ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది. చివరకు అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు.UP: This crocodile came out of Ganganahar in Narora of #Bulandshahr district. The forest department team reached and rescued him and released him back into the canal. #Heatwave #Weatherupdate pic.twitter.com/HiwdLwMVf9— Shivaji Mishra | शिवाजी मिश्रा (@08febShivaji) May 29, 2024 -
ఎంత ఘోరం.. కొడుకుని కాలువలో పడేసిన తల్లి.. మొసళ్లు కొరకడంతో
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన వెలుగుచూసింది. భార్యభర్తల గొడవ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. దంపతుల మధ్య వివాదం కారణంగా ఆరేళ్ల మూగవాడైన కొడుకును కాలువలో పడేయడంతో అందులోని మొసళ్లు బాలుడిని కొరికి చంపేశాయి.. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో నివసించే సావిత్రి అనే 33 ఏళ్ల మహిళ సావిత్రికి, భర్త రవికుమార్, కుమారులు వినోద్(6), రెండేళ్ల బాలుడు ఉన్నారు. సావిత్రి ఇంట్లో పనులు చేస్తూ జీవిస్తుండగా రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.కాగా పెద్ద కొడుక్కి చెవులు వినబడకపోవడం, మాటలు రాకపోవడంతో అతడి విషయంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. గత శనివారం వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సావిత్రి తన కొడుకుని ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ కాలువలో పడేసింది. అయితే ఆ కాలువలో మూసళ్లు ఉండటంతో బాలుడిని దారుణంగా కొరికి చంపేశాయి.దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. అదే రోజు రాత్రి కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటి రోజు ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అంతా కొరికిన గుర్తులు ఉండగా, బాలుడి కుడి చేయి కూడా కనిపించలేదు. దీంతో చిన్నారిని మొసళ్లు కొరికి చంపేసి ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. తల్లిదండ్రులు రవి, సావిత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.అయితే తన కొడుక్కి చావుకు భర్తే బాధ్యుడని సావిత్రి పేర్కొంది. మూగ కుమారుడిని ఎందుకు కన్నావ్ అంటూ రవి తనతో పదే పదే గొడవపడేవాడని సావిత్రి తెలిపింది. తినడం తప్ప ఏం చేతగాని కొడుకును కాల్వలో పడేసి చంపేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ‘నా భర్త అలా మాట్లాడుతుంటే, కొడుకు మాత్రం ఎంత టార్చర్ భరించగలడు. నా బాధను ఎవరితో చెప్పుకోగలను’ అని పేర్కొంది. చివరికి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై హత్యకేసు నమోదు చేశారు. -
చక్రవాకాలు: ఆ స్త్రీల కోసం మొసళ్లు కూడా తోడుగా
'పాస్‌పోర్ట్ లేని అతిథులు పక్షులు. అవి మనల్ని ఫుడ్ అడగవు. వెచ్చటి బెడ్‌రూమ్‌లూ అడగవు. తొణికిసలాడే నీటి తావూ, వాలడానికి విస్తారంగా చెట్లు ఉంటే చాలు. కాని అవి వచ్చినప్పుడు వాటిని నమిలి మింగుదామనుకుంటే?.. కుదరదు అంటున్నారు స్త్రీలు. కేవలం డజన్ మందే. ఒడిశాలోని అరాచండిలో ప్రతి శీతాకాలం వచ్చే అరుదైన పక్షులను కాపాడి తిరిగి ఇళ్లకు పంపుతారు.' అంతా కలిపి ఒకటిన్నర చదరపు కిలోమీటర్లు. తేమ మైదానాలు. భువనేశ్వర్ నుంచి గంటన్నర దూరంలో ఉన్న ‘బంకి’ అనే ఊళ్లో ఉంటాయి. వాటిని ‘అరాచండి మైదానాలు’ అని పిలుస్తారు. అక్కడకు ప్రతి సంవత్సరం చలికాలంలో చలి దేశాల నుంచి వలస పక్షులు వస్తాయి. బూడిద కొంగలు, వల్లంకి పిట్టలు, పెయింటెడ్ స్టార్క్స్, చక్రవాకాలు (రడీ షెల్డక్)... ఇంకా డజను రకాల పక్షులు వస్తాయి. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో ఇవి వలస వచ్చి ఫిబ్రవరి–మార్చి నాటికి తిరిగి సొంత ప్రాంతాలకు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతాయి. దేశం కాని దేశం ఎందుకు వస్తాయవి? మనుషుల్ని నమ్మి. ఆ నమ్మకం అందరూ నిలబెట్టుకోరు. కొందరు నిలబెట్టేందుకు నడుం కడతారు. ఆ పన్నెండు మంది ఈ మైదానాల పక్కనే ఉండే నిస్తిపూర్ అనే గ్రామంలో నివసించే సూర్యకాంతి మొహంతి అనే గృహిణి ఒకరోజు ఈ తేమ మైదానాల వైపు వచ్చింది. అక్కడ కొంతమంది వేటగాళ్లు ఈ అందమైన పక్షులు, వలస వచ్చిన అతిథులను వేటాడుతూ కనిపించారు. ఆమె మనసు వికలమైపోయింది. తమ ఊరిని ఈ పక్షులు క్షమిస్తాయా అనిపించింది. వెంటనే ఊళ్లో ఉన్న ఇతర గృహిణులకు ఈ విషయం చెప్పడం మొదలుపెట్టింది. ‘అందరం కలిసి పక్షులను కాపాడదాం’ అంది. చాలామంది పట్టించుకోలేదు. ‘లగాన్’ సినిమాలో ఒక్కొక్కరూ దొరికినట్టు కేవలం 12 మంది గృహిణులు అంగీకరించారు. వీరంతా తమ భర్తలకు విషయాన్ని చెప్పి ఒప్పించారు. భర్తలు అంగీకరించాక 12 మంది కలిసి ‘అరాచండి పక్షి సురక్షా సమితి’ గా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఆ పక్షులకు వారే తల్లిదండ్రులు, కాపలాదారులు, సైనికులుగా మారారు. పక్షుల కోసమని.. ‘ఈ పక్షులు ఎంతో సున్నితమైనవి. కాలుష్యం బారిన పడితే చచ్చిపోతాయి. అందుకే పక్షులను చూడటానికి వచ్చే వారిని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుపడ్డారు. అలాగే పిక్నిక్ల పేరుతో వచ్చి హారన్లు కొట్టడం, పాటలు పెట్టి సౌండ్లు చేయడం కూడా నిరోధించాం. ఈ పక్షులు చుట్టుపక్కల పొలాల నుంచే ఆహారాన్ని పొందుతాయి. అందుకే రైతుల దగ్గరకు వెళ్లి క్రిమిసంహారక మందులు ఉపయోగించని సేంద్రియ పంటలే పండించమన్నాం. రైతులు మా వేడుకోలును మన్నించారు. పక్షులు ఉన్నంత కాలం ప్రతి రోజూ మేము ఈ ప్రాంతానికి వచ్చి కాపలా కాస్తాం. ప్లకార్డులు ప్రదర్శిస్తాం. చెత్త లేకుండా చూస్తాం’ అంటారు ఈ పన్నెండు మంది గృహిణులు. మొసళ్లు తోడయ్యాయి.. అయితే ఈ స్త్రీలకు మొసళ్లు కూడా తోడయ్యాయి. ఇక్కడి నీటిమడుగుల్లో మొసళ్లు ఉంటాయి. వేటగాళ్లు నీటి లోపలికి చొచ్చుకొచ్చి పక్షులను వేటాడకుండా ఈ మొసళ్ల భయం అడ్డుకుంటోంది. ‘మొసళ్లు పక్షులకు కాపలా ఉన్నప్పుడు మనుషులు ఉండటానికేమి?’ అంటారు ఈ స్త్రీలు. వీరి కృషి మెల్లగా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. అయినా సరే ప్రభుత్వం చేసే పని కన్నా ప్రజలు చేసే పనే ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది. ‘ఈ పక్షులను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. చక్రవాకాలు గొప్ప ప్రేమతో ఉంటాయి. ఒంటరి చక్రవాకాలను చూద్దామన్నా కనిపించవు. జంటగా ఉండాల్సిందే’ అంటారు ఈ స్త్రీలు. వీరి సేవకు ప్రభుత్వ మెచ్చుకోలుకన్నా ప్రకృతి ఆశీస్సులు తప్పక దొరుకుతాయి. ఇవి కూడా చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు -
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్ ఘటన!
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిందే. అత్యంత ధనిక ఆలయం అందులోని నేలమాళిగల్లో రాశుల కొద్ది బంగారు, వజ్రవైఢూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయంటూ వార్తల్లో నిలిచింది కూడా. ఈ గుడికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. దేవస్థానానికి సంబంధించిన సరస్సులో 'బబియా' అనే శాకాహార మొసలి ఉంటుందని, అది భక్తులు ఇచ్చే పండ్లు, ఫలాహారాలు తప్ప ఇంకేదీ తినదని చెబుతుంటారు. గుడికి వచ్చే పర్యాటకులు ఈ మొసలిని చూసేందుకు తెగ ఆసక్తి కనబరిచేవారు. ఎన్నో ఏళ్లుగా ఆ చెరువులో ఉంటోన్న 'బబియా'.. గత ఏడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా.. చనిపోయిన 'బబియా' స్థానంలో మరో కొత్త మొసలి ప్రత్యక్షమైందన్న వార్త ఇప్పుడూ హాట్ టాపిక్‌గా మారింది. ఓ మిస్టరీలా మరో మొసలి.. బబియా' మరణించిన ఏడాది తర్వాత మరో మొసలి 4 రోజుల క్రితం అనూహ్యంగా కనపడింది. నవంబర్ 8న సరస్సు వెంబడి ఉన్న ఒక గుహలో ఈ కొత్త మొసలిని కొందరు భక్తులు గుర్తించారు. ఈ విషయం కాస్తా అధికారులకు వరకు చేరడంతో వారు శనివారం ఆ మొసలిని గుర్తించి.. ఆలయ ప్రధాన పూజారికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఐతే ఇది చిన్న మొసలని, ఆలయ పూజారికి విషయం తెలియజేశాం కాబట్టి తదుపరి ఏ చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తారని అన్నారు. ఇలా ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కనబడటం అనివార్యంగా జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. కాగా, ఇంతకు ముందు చనిపోయిన బబియా అనే మొసలి మూడోది. దీని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా తదుపది ఆ సరస్సులో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. అయితే ఈ బబియా శాకాహారి, ఆలయ పూజారి పెట్టే ప్రసాదంతోనే జీవించేది. ఎవరికి హాని తలపెట్టేది కాదు. పైగా ఆ సరస్సులో ఉండే చేపలను కూడా ముట్టదు బబియా. దీనికి "బబియా" అని పేరు ఎవరూ పెట్టారో కూడా ఎవ్వరికీ తెలియదు. అత్యంత గమ్మత్తైన విషయం ఏంటంటే.. . ఈ బబియా అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం. (చదవండి: దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?) -
మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..!
బెంగళూరు: కర్ణాటకాలో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. కరెంటు కోతలు ఎక్కువవుతున్నాయని ఆరోపిస్తూ ఓ మొసలితో స్థానిక సబ్‌స్టేషన్‌కి వచ్చారు. కరెంటు ఇస్తారా..? మొసలిని వదలాలా..? అంటూ రోడ్లపైకి ఎక్కారు. కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌ని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ షేర్ చేశారు. ముందుంది ముసళ్ల పండగ అంటే ఇదేనేమో..? అంటూ రాసుకొచ్చారు. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో 😄 https://t.co/oGp0pJhgZV — KTR (@KTRBRS) October 24, 2023 అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్ ఇవ్వడంతో పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి మొసలి పిల్లలు, వన్యప్రాణులు వస్తున్నాయని తెలిపారు. రాత్రి పొలానికి వెళ్లిన సమయంలో దొరికిన మొసలిని ట్రాక్టర్లో సబ్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత కార్యాలయం వద్దకు వచ్చిన అటవీశాఖ సిబ్బంది.. మొసలిని బంధించి సంరక్షణకేంద్రానికి తరలించారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల
-
ఖైరతాబాద్‌లో మొసలి పిల్ల కలకలం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బుధవారం భారీగా కురిసిన వానకు నాలాలన్నీ పొంగిపొర్లాయి. ఇదే క్రమంలో చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల ఒకటి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. చింతల్ బస్తీలో నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర నాలా వద్ద మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. వెంటనే భయభ్రాంతులకు గురైన స్థానికులు మొసలిని కర్రలతో బెదిరించే ప్రయత్నం చేశారు. మొసలి పిల్ల అరవడం మొదలుపెట్టడంతో అక్కడివారంతా తలోదిక్కూ పరుగులు తీశారు. అక్కడివారు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి సమాచారమందించారు. భారీగా కురిసిన వర్షానికి రోడ్డు మీదకు వచ్చిన డ్రైనేజీ నీటి ఉధృతికి మొసలి రోడ్డుపైకి కొట్టుకుని వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనం.. మెట్రో సేవల సమయం పొడిగింపు.. -
రాకాసి మొసలి
ఈ రాకాసి మొసలి అమెరికాలోని మిసిసిపీ రాష్టంలో వేటగాళ్ల బృందానికి దొరికింది. యజూ నదిలో ఇటీవల వేటకు వెళ్లిన వేటగాళ్ల బృందానికి ఈ అతిభారీ మొసలి చిక్కింది. దీని పొడవు 14.3 అడుగులు, బరువు 364.007 కిలోలు. మిసిసిపీలో ఇదివరకు దొరికిన భారీ మొసలి కంటే ఇది పొడవులోను, బరువులోను ఎక్కువగా ఉండటంతో ఈ మొసలి కొత్త రికార్డును నెలకొల్పింది. మిసిసిపీలోనే 2017లో ఒక భారీ మొసలి దొరికింది. దాని పొడవు 14.0 అడుగులు, బరువు 347.67 కిలోలు. యజూ నది ఒడ్డుకు చేరువలో ఉండే జనాలు ఇక్కడకు తమ పెంపుడు కుక్కలను విహారానికి తీసుకొస్తుంటారు. కొంతకాలంగా ఈ మొసలి ఒడ్డుకు వచ్చి తిరుగుతూ, దొరికిన కుక్కనల్లా పలారం చేసేస్తుండటంతో దీనికోసం వేటగాళ్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వేటగాళ్లు పట్టి తెచ్చిన ఈ మొసలి పొడవు, బరువు వివరాలను మిసిసిపీ వన్యప్రాణులు, జలచరాలు, ఉద్యానవనాల సంరక్షణ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల కిందట దొరికిన భారీ మొసలి రికార్డును ఇది అధిగమించిందని వారు ప్రకటించారు. -
భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు.. గుండె గుభేల్మనిపిస్తున్న వీడియో..!
మనిషి తాను చాలా తెలివైనవాడినని అనుకుంటాడు. అయితే ఎంతటి తెలివైనవాడైనా క్రూరజంతువులకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సివస్తుంది. ఎందుకంటే అవి అత్యంత ప్రమాదకరమైనవి. ఒకవేళ ఇంటికి సమీపంలో ఏదైనా క్రూర జంతువు కనిపిస్తే ప్రాణాలు పోయినంత పనవుతుంది. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక గల్లీలో భూమికి పగుళ్లు కనిపిస్తాయి. అక్కడ సగభాగం లోపలికి, మరో సగభాగం బయటకు ఉన్న మొసలి కనిపిస్తుంది. అటవీశాఖ అధికారులు ఆ మెసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో కొంచెం ముందుకు వెళితే, భూమిని చీల్చుకువస్తున్న మరో మొసలి కూడా కనిపిస్తుంది. దానిని చూసిన అక్కడున్న జనం భయపడటాన్ని గమనించవచ్చు. ఇలా మరో మొసలి కూడా లోపలి నుంచి వస్తుందని అక్కడున్నవారెవరూ ఊహించలేరు. ఆ మొసళ్లు అక్కడున్నవారిని అమాంతం మింగేద్దామనే రీతిలో బయటకు వచ్చాయి. అయితే అక్కడున్న అధికారులు ఆ మొసళ్లను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలివేశారు. ఈ వీడియో ఏప్రాంతానికి చెందినదో ఇప్పటివరకూ స్పష్టం కాలేదు. ఈ వీడియోను ట్విట్టర్లో @Figen అనే అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివకూ 2.2 మిలియన్ల వ్యూస్ దక్కగా, 26 వేలమంది వీడియోను లైక్ చేశారు. అలాగే పలువురు యూజన్లు కామెంట్లు కూడా చేశారు. ‘ఈ వీడియో నమ్మశక్యంగా లేదని’ ఒక యూజర్ పేర్కొనగా, మరొక యూజర్ ‘ఇక్కడేం జరుగుతోంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: చెత్తతో 6 చక్రాల వాహనం.. ‘మెకానికల్ గాడిద’ సూపర్ సే ఊపర్ అంటూ కితాబు! OMG what are they doing there?😂pic.twitter.com/jhilcitIeY — Figen (@TheFigen_) August 11, 2023 -
మొసలి దాడిలో ఫుట్‌బాల్ ప్రముఖ క్రీడాకారుడు మృతి
కోస్టారికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్(29) ప్రమాదవశాత్తు మొసలి దాడిలో ప్రాణాల కోల్పోయాడు. కోస్టారికాలోని కానస్ నదిలో ఈ ఘటన జరిగింది. వ్యాయామం చేస్తూ ఫిషింగ్ బ్రిడ్జ్ నుంచి ఓర్టిజ్.. నదిలో దూకాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నదిలో మొసళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ క్రీడాకారుడు నదిలో దూకినట్లు పేర్కొన్నారు. ఓర్టిజ్ కానస్ నదిలో దూకగానే భారీ పరిమాణంలో ఉన్న మొసలి అతన్ని నీటిలోకి లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కోస్టారికా రాజధాని సాన్ జోసెకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓర్టిజ్ని మొసలి నదిలోకి లాక్కెళ్లిన భయానక దృశ్యాలు తమను ఇంకా వెంటడాతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓర్టిడ్ ప్రముఖ డిపోర్టివో రియో కానాస్ క్లబ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కోస్టారికాకు చెందిన అసెన్సో లీగ్‌లో కూడా ఆయన కనిపించారు. సంబంధిత ఫేస్బుక్ పోస్టు ఆధారంగా ఓర్టిజ్ మరణాన్ని ఈ మేరకు జట్టు నిర్దారించింది. జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్ మరణంతో తమ జట్టు శోకసంద్రంలో మునిగినట్లు పేర్కొంది. ఓర్టిజ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరింది. 'ఆటగాడిగా, కోచ్‌గా నీ సేవలు మరవలేనివి. భౌతికంగా లేకపోయినా.. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు' అని జట్టు తమ ఫేస్బుక్ పోస్టులో ఓర్టిజ్‌ను ఉద్దేశించి సంతాపం తెలిపింది. ఓర్టిజ్ శరీరాన్ని వెలికితీయడానికి స్థానిక యంత్రాంగం ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. -
మొసలి నోటికి చిక్కిన మహిళ.. గంట తర్వాత బయటపడిందిలా..!
ఈ భూమి మీద నూకలున్నంత వరకూ ప్రాణం ఎలాగైనా నిలబడుతుందంటారు. ఇది 38 ఏళ్ల మహిళ విషయంలో నిరూపితమయ్యింది. ఒక భారీ మెసలి ఆమెపై దాడి చేసింది. నీటిలోతుల్లోకి లాక్కుపోయింది. గంట పాటు ఆ మహిళను మొసలి నోటిలో చిక్కుకుని విలవిలలాడిపోయింది. అయితే అప్పుడే అద్భుతం జరిగింది. ఆమె ప్రాణాలతో బయటపడింది. సోషల్ మీడియాలో ఆమె కథ విపరీతంగా వైరల్ అవుతోంది. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం 38 ఏళ్ల ఫమ్లిరా.. పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. ఇటీవల ఆమె ఒక నదిలో నీటిని పాత్రలో పట్టుకుంటోంది. ఆ నదిలో మొసళ్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదు. ఇంతలో ఒక మొసలి క్షణాల్లో ఆమెను నీటిలోనికి లాక్కుపోయింది. ఫ్లమిరా బాధతో తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఆమెతో పాటు పనిచేసే కూలీలు ఆమెను కాపాడేందుకు పరుగులు పెట్టారు. వారు ఆ మొసలిని కర్రలతో కొట్టాసాగారు. దీంతో బాధితురాలు ఆ మెసలి నోటి బారి నుంచి ఎలాగోలా బయటపడింది. అయితే ఆమెను కాపాడేందుకు కూలీలు గంటకుపైగా శ్రమించారు. ఈ సమయంలో ఫల్మిరా కూడా మొసలి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. అటు కూలీల దాడి, ఇటు బాధితురాలి పెనుగులాట మధ్య ఆ మొసలి ఆమెను తన నోటి నుంచి విడిచిపెట్టింది. బాధితురాలిని మొసలి బారి నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన కొందరు గాయాలపాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఫమ్లిరా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మొసలి నోటికి చిక్కిన తాను దాని బారి నుంచి బయటపడుతాననుకోలేదన్నారు. ఇప్పటికీ తన కళ్ల ముందు మొసలి ఉన్నట్లుందన్నారు. కాగా మొసలి దాడిలో ఫల్మిరా పాదాలకు, ఉదర భాగానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు? -
వామ్మో.. రోడ్లపైకి మొసళ్లు..!
మహబూబ్‌నగర్: మండలంలోని గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు అనుబంధంగా ఉన్న చెరువులు, కుంటల నుంచి రాత్రిళ్లు మొసళ్లు రోడ్లపైకి వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గోవర్ధనగిరి గ్రామ కత్వా, కామదేనుపల్లి ఊరకుంట సమీపంలో రాత్రి వేళల్లో తరుచూ సంచరిస్తూ రోడ్డుపైనే వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురై కిందపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని గోవర్ధనగిరి, గోపల్‌దిన్నె, వీపనగండ్ల, రంగవరం గ్రామాల రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్లపైకి రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
మంచం కింద మొసలి.. మంచంపైన ఇంటి యజమాని.. తెల్లారి కళ్లు తెరవగానే..
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీలోని భీరా పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఫుట్హా గ్రామంలోని ఆ ఇంటిలోని వారంతా ఆ క్షణంలో వణికిపోయి, బయటకు పరుగులు తీశారు. ఆ ఇంటి బెడ్రూంలోని మంచం కింద రాత్రంతా ఒక భారీ మెసలి నక్కివుంది. ఉదయాన్నే అది వారి కంటపడింది. అంతే ఇంటిలోని వారందరికీ ఆ క్షణంలో ప్రాణాలు పోయినట్లు అనిపించింది. వెంటనేవారంతా బయటకు పరుగులు తీశారు. ఈ విషయం గ్రామంలోని వారందరికీ తెలియడంతో వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో ఈ సమాచారాన్ని ఎవరో అటవీశాఖ అధికారులకు చేరవేశారు. అయితే వారు వచ్చేలోగానే గ్రామస్తులంతా కలసి దానిని ఒక సంచీలో బంధించి నదిలో వదిలివేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శారదా నదిలోకి వరదనీరు చేరింది. ఈ నేపధ్యంలోనే శారదా నది నుంచి కొట్టుకువచ్చిన ఒక మొసలి గ్రామానికి చెందిన లాలా రామ్ ఇంటిలోనికి ప్రవేశించింది. అది రాత్రంతా మంచం కిందే ఉంది. ఆ మంచం మీదనే ఇంటి యజమాని లాలా రామ్ పడుకున్నాడు. ఉదయం ఆయన కళ్లు తెరవగానే అతనికి భారీ ఆకారంలో ఉన్న మొసలి కనిపించింది. వెంటనే అతను భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. అతని అరుపులు విని అక్కడికి వచ్చిన ఇంటిలోని వారంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలియగానే గ్రామస్తులంతా లాలా రామ్ ఇంటికి చేరుకున్నారు. వారు దానిని ఒక సంచీలో బంధించి, తరువాత నదిలో విడిచిపెట్లారు. ఇది కూడా చదవండి: తాజ్‌మహల్‌ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ -
గుజరాత్ లో భయానక దృశ్యాలు.. వర్షాలకు రోడ్డెక్కిన మొసళ్ళు
-
మొసలిని పెళ్లి చేసుక్ను మేయర్! ఎందుకో తెలుసా!
మొసలిని పెళ్లి చేసుకున్నాడు ఓ మేయర్. తన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో ఆ మొసలిని పరిణయమాడేందుకు సిద్ధయ్యాడు. ఆ పెళ్లి కూడా ఏదో తూతూ మంత్రంగా చేయారు. పెద్ద ఊరేగింపుగా ఊరు ఊరంతా ఉత్సాహంగా పాల్గొని మరీ చేస్తారు. ఈ వింత ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఎందుకిలా చేస్తున్నారు. దీని వెనకున్న రీజన్ ఏమిటంటే.. మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా మేయర్ విక్టర్ హ్యూగో సోసా తన ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అలిసియా అడ్రియానా అనే మొసలిని పెళ్లి చేసుకున్నాడు. మధ్య అమెరికాలోని మెక్సికోలో అనాదిగా వస్తున్న ఆచారం ఇది. రెండు స్వదేశీ సముహాలు శాంతికి వచ్చిన రోజుకి గుర్తుగా మనిషి మొసలిని పరిణయమాడటం అనేది అక్కడి ఆచారం. ఇలా చేస్తే తమకు మంచి జరుగుతుందని అక్కడి వారి విశ్వాసం. ఇది 230 సంత్సరాల నాటి నుంచి వస్తున్న ఆచారం. దీన్ని అక్కడి ప్రజలు ఇప్పటికి కొనసాగిస్తూ వస్తుండటం విశేషం. అందులో భాగంగానే మేయర్ హ్యూగో సోసా ఈ మొసలిని పెళ్లిచేసుకున్నాడు.. భూమాత సస్యమాలంగా ఉండేలా సకాలంలో మంచిగా వర్షాలు పడతాయనేది చరిత్రకారుల నమ్మకమని, అందుకే తాము ఇలా చేస్తుంటామని మేయర్ హ్యూగో సోసా చెబుతున్నాడు. వివాహ వేడుకకు ముందుగా ఈ మొసలిని ఇంటి ఇంటికి ఊరేగింపుగా తిప్పుతారు. ఆ తర్వాత ఆ మొసలిని కూడా అందమైన పెళ్లి కూతురు మాదిరిగా రెడీ చేస్తారు. అలాగే ఆ మొసలి ఆ తంతులో ఎవరిపైన దాడి చేయకుండా ఉండేలా దాని నోటికి తాళం వేస్తారు. ఆ తంతులో మేయర్ ఇరువురం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఆమె బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసి మరీ మొసలిని పరిణయమాడతాడు. ఆ తర్వాత మేయర్ ఆ మొసలితో కలిసి నృత్యం చేయడమే గాక చివరిగా దాని ముద్దాడటంతో పెళ్లి తంతు ముగుస్తుంది. స్థానిక జాలర్లు తమ మేయర్ ఇలా చేయడం కారణంగా తమ వలకు అధిక సంఖ్యలో చేపలు పడతాయని, తమ జీవితాలు మంచిగా మారతాయని ఆనందంగా చెబుతున్నారు. 👰🐊 Como parte de una #tradición, el alcalde de San Pedro Huamelula, #Oaxaca, Víctor Hugo Sosa, se casó con un lagarto llamado princesa Alicia, esto para simbolizar la unión del hombre con lo divino. #México pic.twitter.com/Us8COaHYeL — Luis Gabriel Velázquez (@soyluisgabriel1) July 2, 2023 (చదవండి: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే!) -
లెగ్గుపీసే కానీ కోడిది కాదు..
ఏ విషయంలో ముందున్నా లేకున్నా... అన్ని జంతువులను సమభావంతో చూడటంలో చైనీయులు, తైవాన్వాసులు ఎప్పుడూ ముందుంటారు.. అందుకే తినే విషయంలో అదీ ఇదీ అని చూడరు. కనువిందుగా కనిపిస్తే చాలు.. ఏదైనా సరే.. నాలుగు రకాల మసాలాలు కుమ్మేసి.. ఆ నూడుల్స్‌తో కలిపేసి.. ఎంచక్కా మింగేస్తుంటారు. తైవాన్‌కు చెందిన విచ్ క్యాట్ అనే రెస్టారెంటోడికి కూడా ఓ మొసలి ఇలాగే కనిపించినట్లుంది. పైగా అక్కడి చెఫ్‌లకు క్రియేటివిటీ కూడా కాసింత ఎక్కువేనట. అందుకే ఎప్పుడూ చికెన్ లెగ్గుపీసులేనా.. మనిసన్నాక కూసింత కళాపోసన ఉండాలని చెప్పి.. మొసలి లెగ్గు పీసుతో ఇదిగో ఈ వంటకాన్ని సిద్ధం చేసేశారు. దీన్ని రుచి చూస్తే. రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయట. అయితే.. రెస్టారెంట్‌కు వచ్చినోళ్లంతా.. ఫొటోలు తీసుకుంటున్నారు తప్పిస్తే.. దీన్ని ట్రై చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. మరి.. ఆ ధైర్యం మీకుందా? -
తల్లిదండ్రుల ఎదుటే బాలుడిని తిన్న మొసలి.. కర్రలతో కొట్టి..
బిహార్: బాలున్ని మొసలి తినేసిందనే కోపంతో కుటుంబ సభ్యులు ఆ మొసలిని కొట్టి చంపారు. ఈ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగింది. రాఘవాపుర్ దియారా గ్రామానికి చెందిన అంకిత్ కుమార్(14) ఐదవ తరగతి చదువుతున్నాడు. కొత్త బైక్ కొన్న సందర్భంగా బాలుడు బైక్‌కు పూజ చేయించాలనుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గంగా నది వద్దకు చేరారు. నీటి కోసం నదిలోకి దిగగా.. మొసలి నోట చిక్కాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే బాలున్ని మొసలి తినేసింది. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు బాలున్ని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి మొసలిని నది నుంచి బయటకు లాగారు. అనంతరం దాన్ని తాళ్లతో కట్టి, కర్రలతో కొట్టి చంపారు. 'కొత్త బైక్ కొన్నాము.పూజ చేయించడానికి గంగాజలం కోసం నది వద్దకు వెళ్లాము. అక్కడ మొసలి అంకిత్‌ను పట్టి నీళ్లలోకి లాక్కెళ్లింది. బాలున్ని రక్షించే ప్రయత్నం చేశాము.. కానీ కొన్ని శరీర భాగాలు మాత్రమే లభించాయి. ఆ మొసలిని బయటకు లాగి చంపేశాము'అని అంకిత్ తాతయ్య చెప్పారు. ఇదీ చదవండి:సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను చెట్టుకు కట్టేసి..ఆ తర్వాత -
వామ్మో 276 కోట్ల..ఒక్క సారిగా షాక్ ఇచ్చిన ఊర్వశి
-
ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్‌తో పాటు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. అయితే ఈ వేడుకల్లో ఆమె ధరించిన క్రోకోడైల్ నెక్లెస్‌పైనే అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆమె వేసుకున్న నెక్లెస్ ధర ఎంతై ఉంటుందని నెటిజన్స్‌లో తెగ చర్చిస్తున్నారు. దీంతో తాజాగా ఆమె టీమ్ నెక్లెస్ ధరను వెల్లడించింది. (ఇది చదవండి: 'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కొత్త డ్రెస్సులు, తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.అయితే ఆమె ధరించిన మొసలి నెక్లెస్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. పింక్ కలర్ గౌనులో మెరిసిన ఊర్వశి రౌతేలా.. ఫేక్ నెక్లెస్ పెట్టుకుని వెళ్లిందని ట్రోల్స్ కూడా చేశారు. View this post on Instagram A post shared by Brut India (@brut.india) (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?) అయితే ఈ ట్రోల్స్‌పై నటి బృందం క్లారిటీ ఇచ్చింది. నెక్లెస్ ధర తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఊర్వశి ధరించిన నెక్లెస్ ఫేక్ కాదు. దాని ధర రూ.276 కోట్ల వరకు ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్ నిదర్శనం.' అని పేర్కొంది. ప్రస్తుతం దీని ధర చూసి అందరూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నెక్లెస్ అంత ధర ఉంటుందా? జోక్ బాగుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఆడిపాడిన ఊర్వశి.. ఇటీవల అఖిల్ ఏజెంట్‌లోనూ కనిపించింది. -
చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన జరిగింది. కెన్నెడీ నదీ తీరంలో చేపల వేటకు వెళ్లిన కెవిన్ డార్మోడీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతను కన్పించకపోవడానికి ముందు అరుపులు, కేకలు విన్పించినట్లు అక్కడున్న వాళ్లు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే అతనికోసం సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి ఆనవాళ్లు కన్పించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. అయితే కెవిన్ అదృశ్యమైన ప్రాంతంలో రెండు భారీ రాక్షస మొసళ్లను గుర్తించారు అధికారులు. అవేమైనా అతడ్ని చంపి తిని ఉంటాయా అనే అనుమానంతో వాటిని షూట్ చేశారు. ఈ రెండు మొసళ్లలో ఒకటి 4.1 మీటర్ల పొడవు ఉండగా.. మరొకటి 2.8 మీటర్ల పొడవు ఉంది. వీటిలో ఓ మొసలి కడుపులో కెవిన్ మృతదేహం లభ్యమైంది. దీంతో అధికారులు అతడ్ని అధికారికంగా ధ్రువీకరించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరగడం రెండోసారి అని జాలర్లు తెలిపారు. గతంలోనూ ఓ వ్యక్తిని మొసళ్లు చంపాయని వెల్లడించారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. కెవిన్ వయసు 65 ఏళ్లు. ఓ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి చాలా కాలంగా చేపలు పట్టడం అలవాటని, ఇందులో ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా బాగా తెలుసుని స్నేహితుడు తెలిపాడు. కానీ కెవిన్ ఇలా చనిపోతాడని అసలు ఊహించలేదన్నాడు. చదవండి: మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే ఇద్దరూ మృతి -
వైరల్ వీడియో: తల్లి ప్రేమ.. మొసలికే చక్కులు చూపించింది
-
ఆయుష్షు గట్టిదే.. మూడుసార్లు మొసలి దాడి.. నోట్లో కరుచుకొని వెళ్లినా!
కూక్‌టౌన్(ఆ్రస్టేలియా): మొసలి పలుమార్లు దాడి చేసి, నోట కరుచుకుని నీటి అడుగుకు లాక్కెళ్లిన తర్వాత కూడా ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి, ప్రాణాలతో బయటపడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన శనివారం ఆ్రస్టేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రం కూక్టౌన్లో చోటుచేసుకుంది. నలభయ్యేళ్ల ఓ వ్యక్తి సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నాలుగున్నర మీటర్ల పొడవుండే ఓ మొసలి అతడి వైపుగా వచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టి తప్పించుకునేందుకు యత్నించాడు. తన వద్ద ఉన్న స్పియర్ గన్ను పేల్చేందుకు ప్రయత్నించాడు. మొసలి అతడిపై మూడుసార్లు దాడి చేసి తల, భుజాలు, కాళ్లను గాయపరిచి, నోట కరుచుకుని నీటి అడుగుకు లాక్కెళ్లింది. ధైర్యం కోల్పోని ఆ వ్యక్తి తన చేతి వేళ్లతో మొసలి కళ్లలోకి బలంగా గుచ్చాడు. బాధతో అది పట్టు సడలించడంతో సురక్షితంగా బయటపడ్డాడు. గాయాలపాలైన అతడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. -
Viral Video: చిరుతపై మొసలి బీకర దాడి
-
గోదావరిలో మొసళ్లు!.. బెంబేలెత్తుతున్న భక్తులు..
బాల్కొండ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో మొసళ్ల సంచారం పెరిగింది. శుక్రవారం పుష్కర ఘాట్ వద్ద పెద్ద మొసలి కనిపించడంతో పుణ్య స్నానాలకు వెళ్లిన భక్తులు ఒక్క సారిగా బెంబేలెత్తిపోయారు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో మొసళ్లు కొట్టుకు వచ్చి ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా మొసళ్ల ఉనికితో నదికి వచ్చే భక్తులతో పాటు జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే పలు గ్రామాల్లోని చెరువుల్లో మొసళ్లు కనిపించాయి. దీంతో కొన్ని చెరువుల్లో ఇప్పటికీ మత్స్యకారులు చేపలు పట్టడం లేదు. ముప్కాల్ మండల నల్లూర్ ఊర చెరువులో రెండు పెద్ద మొసళ్లు గత ఏడాది నుంచి సంచరిస్తున్నాయి. మెండోరా మండలం బుస్సాపూర్ ఊర చెరువులో రెండు మొసళ్లు ఉండ గా ఒక మొసలిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. రెండో మొసలి గురించి ఇప్పటికీ పత్తాలేదు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్ వద్ద కాకతీయ కాలువ పక్కన గల చిన్న చెరువులో మొసలి ఉండటంతో అధికారులు పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలా మొసళ్లు అప్పుడప్పుడూ బయటపడుతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా గోదావరిలోని స్నా నాల ఘాట్ వద్ద మొసలి కనిపించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఉన్నతాధికారుల ఆదేశానుసారం మొసళ్లను గోదావరిలో వదిలి పెడుతున్నాం. గోదావరిలో నీటిలోనే మొసలి ఉంటుంది. సేద తీరడం కోసం ఒడ్డుకు వస్తుంటుంది. అలా వచ్చిన మొసలిని పట్టుకుని మళ్లీ నీరు అధికంగా ఉన్న ప్రాంతంలో వదిలేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటాం. – గణేశ్, సెక్షన్ ఆఫీసర్, మెండోరా చెరువుల్లో పట్టి నదిలో వదిలి.. చెరువుల్లో పట్టుకున్న మొసళ్లను ఫారెస్టు అధి కారులు ఎస్సారెస్పీ దిగువన గోదావరిలో వదులు తున్నారు. మెండోరా మండలం బు స్సాపూర్ చెరువులో మే నెలలో జాలరుల వలకు చిక్కిన మొసలిని దూదిగాం శివారు లోని గోదావరిలో వదిలి వేశారు. ఆ సమయంలో నదిలో నీరు కూడా లేదు. అలా వది లేస్తే గోదావరికి పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తుల పరిస్థితి ఏంటని పలువురు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం దూదిగాం శివారులో జాతీయ రహదారి 44 పైకి పెద్ద మొసలి వచ్చి నానా హంగామా చేసింది. ఫారెస్ట్ అధికారులు ఎక్కడెక్కడో చెరువుల్లో దొరికిన మొసళ్లను పట్టుకు వచ్చి గోదావరిలో వదిలి వేస్తున్నారని, తిరిగి అవే మొసళ్లు చెరువుల్లోకి వచ్చి చేరుతున్నాయని గ్రామీ ణులు ఆరోపిస్తున్నారు. ప్రతి శుక్ర సోమవారాల్లో గోదావరిలోకి స్నానానికి భక్తులు, నిత్యం బట్టలు ఉతుక్కోవడానికి గ్రామస్తు లు వెళ్తుంటారు. మొసళ్ల వలన ప్రమాదాల భారిన పడితే ఎవరు దిక్కు అని ప్రశి్నస్తున్నారు. పట్టుకున్న మొసళ్లను జంతు ప్రదర్శన శాలకో, జంతువుల పెంపకం ప్రదేశాలకో పంపించాలని కోరుతున్నారు. -
ఇంట్లో మొసలి కలకలం... బిక్కుబిక్కుమంటూ రాత్రంతా ఆ కుటుంబం....
ఒక మొసలి అనుహ్యంగా ఒక గ్రామంలోని రాత్రివేళ ఇంటిలోకి ప్రవేశించింది. ఎలా వచ్చిందో ఏమో గానీ దాని ఎంట్రీతో ఆ కటుంబం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ జాగారం చేస్తూ గడిపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఇటావాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని హర్మామ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం. ...రాత్రి 10.గంటల సమయంలో వాళ్ల అమ్మ అరుపుతో తన కుమార్తె గది తలుపు తెరిచింది. అంతే ఆ సమయంలో ఈ మొసలి లోపలికి వచ్చేసింది. అది ఎలా వచ్చిందో తమకు తెలియదని తమ మేకలు చప్పుడు చేయడంతో ఏదో జరిగినట్లు అనుమానం వచ్చిందని ఇంటి యజమాని చెబుతున్నాడు. తీరా చూస్తే మొసలి దీంతో తాము భయపడి పోలీసులకు సమాచారం అందిచామని చెప్పాడు. పోలీసులు స్థానికి వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ త్రిపాఠికి సమాచారం అందించారు. అతను ఇంటికి తాళం వేసి బయటకు వచ్చేసి ఉండమని చెప్పారు. దీంతో వారంతా అలానే చేసి రాత్రంతా జాగారం చేస్తూ ఇంటి బయటే కూర్చొన్నారు. ఈ వార్త ఆ గ్రామంలోని స్థానికులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో జనాలు సదరు యజమాని ఇంటి వద్ద గుమిగూడారు. ఈ మేరకు పోలీసులు, డాక్టర్ త్రిపాఠి ఇక గంటపాటు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ఆ మొసలిని పట్టుకున్నారు. అనంతరం ఆ మొసలిని అటవీశాఖకు అప్పగించారు. ఐతే ఈ మొసలి పెద్దది కాదని బాల్యదశలో ఉందని చెప్పారు. రాత్రి సమయంలో ఈ మొసలి చాలా దూకుడుగా ఉంటుందని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించలేదని డాక్టర్ త్రిపాఠి చెప్పారు. పక్కనే ఉన్న కాలువ నుంచి రాత్రిపూటా ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు తెలిపారు. (చదవండి: వాట్ ఏ సెల్ఫీ! ఎంతా బాగా ఫోజ్ పెట్టిందో...) -
రేయ్.. అది పెళ్లామో.. గర్ల్ ఫ్రెండో కాదు!
పుర్రెకో బుద్ధి.. మనిషి తీరు ఒక్కోసారి బహు విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదుగానీ.. కొన్ని పనులు మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అలాంటిదే 15 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకున్న ఓ ట్విట్టర్ వీడియో. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇలా మొసలితో రొమాంటిక్ డ్యాన్స్ చేసినట్లు విపరీతంగా వైరల్ అవుతోంది. విచిత్ర ధోరణితో ఫ్లోరిడా ప్రజలు వార్తల్లోకి ఎక్కుతారనే ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో సరదాగా వైరల్ అవుతుంటుంది. ఆ కోవకు చెందిన ఓ వ్యక్తే.. అంటూ బోర్న్ఏకాంగ్ అనే ట్విట్టర్ థ్రెడ్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయ్యింది. అంతేకాదు.. ఈ వీడియో గతంలోనూ వైరల్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యూస్ దక్కించుకుని ట్రెండింగ్‌లోకి వచ్చింది. నమ్మశక్యంగా అనిపించని ఆ సరదా వీడియోను మీరూ చూసేయండి.. Florida man strikes again pic.twitter.com/MAgGnFkymk — Lance🇱🇨 (@BornAKang) October 18, 2022 వీడియో ఒక ఎత్తయితే.. ఆ వీడియో కింద కనిపించే కామెంట్లు మరో ఎత్తు. అది పెళ్లామో .. గర్ల్‌ఫ్రెండో కాదని, మొసలికి నీళ్లలో బలం ఎక్కువని, తేడా వస్తే పని అంతేఅని కొందరు.. ఆ మొసలికి అతను బాగా నచ్చి ఉంటాడని మరికొందరు.. ఇలా కామెంట్ల పర్వం హిలేరియస్‌గా ఉంది. -
కేరళ అనంత పద్మనాభస్వామి : బబియాకు కన్నీటి వీడ్కోలు (ఫొటోలు)
-
శాఖాహార మొసలి బబియా ఇక లేదు
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిని శాఖాహార బబియా అనే మొసలి మరణించింది. ఈ మొసలి కేరళలోని అనంతపుర గ్రామంలోని దేవాలయంలో ప్రధాన ఆకర్షణగా ఉండేది. కేవలం అన్నం మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించేది. ఈ మొసలి అనంత ద్మనాభ స్వామి ఆలయం చెరువు మధ్యలో ఉండేది. ఈ ఆలయా చెరువులోకి ఈ మొసలి ఎలా వచ్చిందనేది ఎవరికి తెలియదు. పైగా దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. కానీ అది ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని ఆ చెరువులో ఉండే చేపలను కూడా తినలేదని ఆ ఆలయ పూజారి చెబుతున్నాడు. ఆ ఆలయ పూజారికి మొసలికి చాలా అవినాభావ సంబంధం ఉంది. రోజు పూజారి ఆ మొసలికి రెండు సార్లు అన్నాన్ని అందిస్తాడని, ఒక్కోసారి ఆయనే అన్నాన్ని బంతిలా చేసి ఆ మొసలి నోటికి అందిస్తాడని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. పురాతన ఆలయ సాంప్రదాయానికి అనుగుణంగా పూర్తి శాఖాహార మొసలి అని ఆలయ పూజారి చెబుతున్నాడు. పూరాణాల ప్రకారం తిరువనంతపురంలో ఉన్న అనంతపద్మనాభ స్వామి మూలస్థానం ఇదేనని, ఆయని ఇక్కడే స్థిరపడినట్లు భక్తుల విశ్వసిస్తారు. అదీగాక ఈ బబియా అనే మొసలిని ఆలయాన్ని రక్షించడానికి దేవుడు నియమించిన సంరక్షకురాలని భక్తుల ప్రగాఢంగా నమ్ముతారు. (చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్) -
జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి.. భయంకర దృశ్యాలు వైరల్
జంతువులతో జోక్స్ చేయడం మంచిది కాదు. చిన్నవైనా, పెద్దవైనా వాటితో సాహసాలు చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటుంది. జంతువులని ఎంత మచ్చిక చేసుకున్నప్పటికీ ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అనేక సార్లు అవి మనుషులకు హాని కలిగించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి భయంకర ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వైల్డ్ లైఫ్ పార్క్‌లోని ఉద్యోగిపై ఓ భారీ మొసలి అనూహ్యంగా దాడి చేసింది. దీనిని వైల్డ్ హార్ట్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ ఫేస్బుక్లో పోస్టు చేసింది. క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లోని క్రొకోడైల్ క్రీక్ ఫామ్‌లో సెప్టెంబర్ 10న ఈ భయానక సంఘటన జరిగింది. జూకీపర్ సీన్ లే క్లస్ రెండు మొసళ్లతో లైవ్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో హన్నిబల్ అనే 16 అడుగుల పొడవైన, 660 కేజీల బరువుండే పెద్ద మొసలి ఉంది. దాని పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. క్లస్ గత 30 సంవత్సరాలుగా ఈ భారీ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు. చదవండి: ఇలా కూడా ఉద్యోగాన్ని రిజెక్ట్ చేస్తారా!.. చైనా కంపెనీపై మండుతున్న నెటిజన్లు షోలో భాగంగా జూ కీపర్ ‘ఈ ఆఫ్రికా మొత్తంలో దీనిపై మాత్రమే నేను ఇలా కూర్చోగలను’ అంటూ మొసలి వీపుపై కూర్చున్నాడు. వెంటనే దాని నుంచి దిగి పక్కకు వెళ్తున్న అతనిపై ఆ మొసలి ఒక్కసారిగా ఎదురు తిరిగింది. తన పదునైన పళ్లతో ఆయన తొడను గట్టిగా పట్టేసి విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. జూ కీపర్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. కాగా క్రూర జంతువులతో ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
హడలెత్తించిన మొసళ్లు
కడెం(ఖానాపూర్)/ఏటూరునాగారం: వేర్వేరు చోట్ల రెండు మొసళ్లు హడలెత్తించాయి. నిర్మల్ జిల్లా ఎలగడప గ్రామంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఓ మొసలి ప్రవేశించి.. గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గ్రామస్తుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది మొసలిని చాకచక్యంగా తాళ్లతో బంధించి తీసుకెళ్లి కడెం ప్రాజెక్టులో వదిలారు. అలాగే, ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం జాలర్ల వలకు ఓ మొసలి చిక్కింది. భయాందోళనకు గురైన జాలర్లు వెంటనే దానిని తిరిగి గోదావరి నదిలోకి వదిలేశారు. గోదావరిలోకి మొసళ్లు వచ్చాయని, స్నానాలకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు హెచ్చరించారు. -
పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకి..వాట్ ఏ పవర్
అడవి నియమాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ బతకాలంటే బలంతోపాటు వేట సాగించాల్సిందే. జాలి దయ లాంటివి అస్సలు ఉండవు. ఒక జంతువు ఆకలికి మరో ప్రాణి బలి కావాల్సిందే. ఇక సింహం, పులి, చిరుత లాంటి క్రూర మృగాలు వాటికి ఏ జంతువు నచ్చితే వాటిని వేటాడి తమకు ఆహారంగా మార్చేసుకుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో సరిగ్గా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. ఓ జాగ్వార్(చిరుతపులి) నదిలోకి దూకి మొసలిని వేటాడి ఆహారంగా మలుచుకుంది. ముందుగా చెట్టు పొదల్లో నక్కిన చిరుతపులి మెల్లగా నది ఒడ్డుకు వచ్చింది. తర్వాత నీటిలో తేలియాడుతున్న మొసలిపై ఒక్క ఉదుటున దూకి భయంకరంగా దాడి చేసింది. వెంటనే దాని దవడలతో మొసలి మెడ భాగంలో కరిచి పట్టుకొని నది నుంచి బయటకు లాక్కెళ్లింది. అయితే చిరుత నుంచి తప్పించుకోవడానికి మొసలి ఎంత పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి పైచేయి జాగ్వార్దే అయ్యింది. ఈ వీడియోను ఫిగెన్ అనే వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేశాడు. వాస్తవానికి ఈ వీడియోను రెండేళ్ల కిందటే వాహ్సీ హయత్లార్ అనే వ్యక్తి షేర్ చేయగా.. ప్రస్తుతం మరోసారి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. 42 సెకన్ల నిడివిగల ఈ వీడియోను ఇప్పటి వరకు 2.6 మిలియన్ల మంది వీక్షించారు. 27 లైక్‌లు వచ్చాయి.‘ జాగ్వార్ దవడలు చాలా దృడంగా ఉంటాయి. చిరుతపులి చాలా ఆకలిగా ఉన్నట్లు ఉంది. ఓ దేవుడా జాగ్వార్‌కు ఎంత శక్తి ఉంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ.. OMG what a power!! pic.twitter.com/LHZazN2zwP — Figen (@TheFigen) August 14, 2022 -
భారీ వర్షాల కారణంగా కాలనీలోకి వచ్చేసిన మొసలి: వీడియో వైరల్
భారీ వర్షాలకు ఓ కాలనీలోకి ఏకంగా మొసలి వచ్చేసింది. ఇంతవరకు వర్షాలకు పాములు, చేపలు వంటివి కొట్టుకురావడం గురించి విన్నాం కానీ ఏకంగా మొసలి కొట్టుకురావడం వినలేదు కదా. కానీ మధ్యప్రధేశ్‌లోని ఒక కాలనీ ఈ ఘటన చోటుచోసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున కురిసిని భారీ వర్షాలకు ఒక మొసలి కొట్టుకు వచ్చింది. ఈ మేరకు ఆ మొసలి శివపురి జిల్లాలోని ఓ నివాస కాలనీ సంచరించడం మొదలు పెట్టింది. దీంతో ఆ కాలనీ వాసులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మాధవ్ నేషన్ల్ పార్క్ నుంచి రెస్క్యూ టీంని రంగంలోకి దింపి గంటపాటు శ్రమించి ఆ మొసలిని బంధించారు. సుమారు ఎనిమిది అడుగులు ఉన్న ఈ మొసలిని సాంఖ్యసాగర్ సరస్సులో విడిచిపెట్టామని అధికారులు తెలిపారు. ఈ మేరకు మొసలి ఆ రెసిడెన్షియల్ కాలనీలోని ఇరుకైన సందులో సంచరిస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Crocodile in shivpuri m.p pic.twitter.com/D2kVvDmlAH — Pankaj Arora (@Pankajtumhara) August 14, 2022 (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
షాకింగ్ వీడియో: మొసలిని దగ్గరికి తీశాడు, ఆపై..
వైరల్: ఎవరైనా ఏ కుక్కనో, పిల్లినో సాదుకుంటారు. కొంచెం రిస్క్ అయినా సరే.. వన్య మృగాలను సైతం పెంచుకుంటారు కొందరు. కానీ, ఏ కండకు ఆ కండను పీక్కుతినే మొసలితో పరాచికాలు ఆడతారా? తాజాగా ఇంటర్నెట్ను పదిహేను సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో కుదిపేస్తోంది. ఏదో చంటిబిడ్డలా కాళ్ల సందులో మొసలిని ఉంచుకుని.. దాని నోటికి ఆడిస్తూ ఆహారం అందించాడు ఓ వ్యక్తి. పైగా దాని మూతి మీద తట్టి మరీ అభినందించడంతో ఆది నీళ్లలోకి తిరుగు టపా కట్టింది. ‘ఇదేం తరహా పెంపుడు జీవి బ్రో’ అంటూ ఫైజెన్ అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. నాలుగున్నర మిలియన్ల వ్యూస్ పూర్తి చేసుకున్న ఆ వీడియోను మీరూ చూసేయండి. What type of pet is that bro?pic.twitter.com/SjlJRYJsDA — Figen (@TheFigen) August 2, 2022 -
అనకొండతో మొసలి జీవన పోరాటం.. వీడియో వైరల్
బ్రెసిలియా: అనకొండ పాములు భారీ ఆకారంతో పొడవుగా ఉంటాయి. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయి. గ్రీన్ అనకొండలు సుమారు 30 అడుగుల మేర పెరుగుతాయి. సుమారు 550 పౌండ్ల బరువు ఉంటాయి. ఏదైనా జీవిని వేటాడేందుకు దానిని పూర్తిగా చుట్టేసి చంపేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ భారీ ఎలిగేటర్(మొసలి)ని భారీ అనకొండ బంధించింది. మొసలికి ఊపిరిసలపకుండా చేసి ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. అనకొండ బారినుంచి తప్పించుకునేందుకు ఎలిగేటర్ చేసిన ప్రయత్నాన్ని ఇండియానాకు చెందిన కిమ్ సులివాన్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కుయాబా నదిలో మొసలి, అనకొండలు పోరాడాయి. సుమారు 40 నిమిషాల పాటు వాటి పోరాటం సాగినట్లు కిమ్ తెలిపారు. పూర్తిగా చుట్టేయటం వల్ల ఎలిగేటర్ ఊపిరితీసుకునేందుకు ఇబ్బందులు పడింది. పాము నుంచి తప్పించుకునేందుకు మొసలి నీటి అడుగునకు వెళ్లిందని, దాంతో పాము గాలి తీసుకోలేకపోయిందని చెప్పారు. కొద్ది సమయం తర్వాత మొసలి బయటకు వచ్చిందని, అయినప్పటికీ అనకొండ వదలకుండా అలాగే పట్టినట్లు చెప్పారు కిమ్. దీంతో మరోసారి మొసలి నీటి అడుగుకు చేరుకుని కొన్ని నిమిషాల తర్వాత పైకి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అనకొండ కనిపించలేదన్నారు. ఊపిరి పీల్చుకున్న మొసలి తన చోటుకు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ వీడియోను ఆఫ్రికా వైల్డ్‌లైఫ్1 తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Wildlife | Africa | Lodges | Photography | Videography (@africanwildlife1) ఇదీ చదవండి: వీడియో: క్రేన్‌కు భారీ ‘రాకాసి’ చేప.. విలయం తప్పదంటూ వణుకుతున్న జనాలు -
హృదయ విదారకం.. 10 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి..
-
హృదయ విదారకం.. 10 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి..
భోపాల్: ఇంట్లో పిల్లలు ఉంటే నిత్యం వారిని ఓ కంట గమనించుకుంటూ ఉండాలి. అందరూ ఉన్నారు కదా చూసుకుంటారనే నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అన్నిజాగ్రత్తలు చెబుతూ, ఎప్పుకప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే క్షణకాలపు అజాగ్రత్త జీవిత కాలపు బాధను మిగిలిస్తుంది. అచ్చం ఇలాగే మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. షియోపూర్‌లోని చంబల్ నదిలో సోమవారం స్నానం చేస్తున్న బాలుడిపై మొసలి దాడి చేసి, నదిలోకి లాక్కెళ్లింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నది వద్దకు చేరుకొని బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు. కర్రలు, తాడు, వల సాయంతో నదిలో ఉన్న మెసలిని బంధించి బయటకు లాగారు. మొసలిని చంపి బాలుడిని రక్షించాలని గ్రామస్తులు భావించారు. ఇంతలో సమాచారం అందుకున్న మొసళ్ల సంరక్షణ బృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని గ్రామస్తుల బారినుంచి రక్షించేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించారు. అయితే ఇందుకు కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు అస్సలు అంగీకరించలేదు. మొసలి కడుపులో బిడ్డ బతికే ఉంటుందని ఆశగా ఎదురు చూశారు. పిల్లాడిని బయటకు తీసినప్పుడే వదిలేస్తామని చెప్పారు. చదవండి: వరద బీభత్సం.. హెలికాప్టర్ రాకపోతే ప్రాణాలు పోయేవే! అయితే మొసలి కడుపులో ఉన్న పిల్లవాడు బతికే అవకాశం లేదని పిల్లాడి తల్లిదండ్రులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసు అధికారులు, మొసళ్ల సంరక్షణ విభాగం ఒప్పించడంతో గ్రామస్థులు మొసలిని విడిచిపెట్టారు. ఈ ఘటనపై రఘునాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శ్యామ్ వీర్ సింగ్ తోమర్ మాట్లాడుతూ.. బాలుడు స్నానం చేస్తూ నదిలోకి లోతుగా వెళ్ళాడని తెలిపారు. చిన్నారిని మొసలి మింగేయడంతో వల, కర్రలతో మొసలిని పట్టుకున్నట్లు గ్రామస్తులు చెప్పారని వెల్లడించారు. కాగా మాయదారి మొసలి కన్న కొడుకుని దూరం చేసి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. #MadhyaPradesh: 10-year-old boy swallowed by crocodile while bathing in Chambal river pic.twitter.com/iSzcJtWdWw — Neha Singh (@NehaSingh1912) July 12, 2022 -
అదృష్టవంతుడు.. మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చాడు!
ముంబై: సాధారణంగా చేపలు పట్టడం కొందరికి హాబీ అయితే, మరికొందరికి జీవనోపాధిగా ఉంటుంది. అయితే చేపల వేట కోసమని వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు! వివరాల్లోకి వెళితే.. ఒక ఆదివాసీ తెగకు చెందిన 40 ఏళ్ల విజయ్ కాక్వే చేపలు పట్టేందుకు ముంబైలోని పొవై ప్రాంతంలోని చెరువు వద్దకు వెళ్లాడు. ఒడ్డున కూర్చోని చేపలు పడుతున్నాడు. ఇంతలో అతనిపై ఓ మొసలి దాడి చేసింది. ఎట్టికేలకు అతను మొసలితో పోరాడి దాని నోట్లో పడకుండా బయటపడ్డాడు కానీ ఈ దాడిలో అతని కాలికి తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు కాక్వేని ఘట్కోపర్లోని రాజవాడి ఆస్పత్రికి తరలించారు. పొవై సరస్సు అంచున నిర్మించిన ర్యాంప్ వల్ల ఈ మొసలి దాడి నుంచి బయటపడినట్లు స్థానికులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బీఎంసీ అధికారులు ఆ ప్రాంతంలో మరిన్ని వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు కారణం ఇదేనా.. ప్రతి ఏడాదిలో ఈ సమయంలో.. మొసళ్ళు పొవై సరస్సు పక్కన మెత్తటి నేలపై గుడ్లు పెడుతుంటాయి. అయితే ఇప్పటికే, సరస్సు అవతలి వైపు, రెనైసాన్స్ హోటల్‌కు సమీపంలో చాలా నిర్మాణ కార్యకలాపాలు జరిగాయి. అలాగే, చాలా మంది పిక్నిక్ స్పాట్లుగా ఆ ప్రాంతానికి వెళ్లడం, సరస్సు సమీపంలో పార్టీలు లాంటివి జరగడంతో ఇవి ఆ సరస్సులోని సముద్ర జాతులకు ఆటంకంగా మారింది. ఈ కారణంగానే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. చదవండి: ఉత్తరాఖండ్‌లో దారుణం.. కదులుతున్న కారులో తల్లీ, కూతురిపై సామూహిక అత్యాచారం -
నీటి మడుగులో కాచుకున్న మొసలి.. రిస్కు చేసి గొర్రెను కాపాడి!
వనపర్తి: గొర్రెను నోట కరుచుకుని నీటిలోకి జారుకుంటున్న మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డాడొక కాపరి. మొసలి దాడి చేసిన గొర్రె చిన్న గాయంతో ప్రాణాలు దక్కించుకోగా.. దాన్ని కాపాడిన కాపరి ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపురం శివారు ప్రాంతంలోని కృష్ణా నదిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. పెబ్బేరు మండలం రాంపురం గ్రామానికి చెందిన కొరి రాములు, బీసన్నలకు చెందిన 300 గొర్రెలను మేత కోసం నెల రోజుల క్రితం కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పొలాల్లో గొర్రెలను మేపుకొని కృష్ణా నదిలోని గుంతల్లో నిల్వ ఉన్న నీటిని తాగిస్తుండేవారు. ఎప్పట్లాగే శుక్రవారం సాయంత్రం వేళ గొర్రెలను నదిలో నీరున్న గుంతల వద్దకు తీసుకెళ్లారు. గుంపులోని ఒక గొర్రె నీటిని తాగేందుకు వెళ్లగా.. మడుగులోని మొసలి దానిపై దాడి చేసింది. గొర్రె అరుపులు విన్న కాపరి కొరి రాములు చేతిలోని కర్రతో మొసలిపై దాడి చేశాడు. దీంతో మొసలి గొర్రెను వదిలేసి కాపరిపై దాడి చేసి.. అతని రెండు చేతులు, కడుపు భాగంలో గాయపరిచింది. కాపరి చేతుల్ని నోట కరుచుకొని నీటిలోకి మొసలి లాక్కెళ్తుండగా.. రాములు అరుపులు విన్న సహచర కాపరి బీసన్న రాళ్లతో దానిపై దాడి చేశారు. దీంతో మొసలి రాములును వదిలి నీటిలోకి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రాములును 108 అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యానికి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం తన తండ్రి పరిస్థితి నిలకడగానే ఉందని రాములు కుమారుడు మల్లేశ్ తెలిపాడు. రాములు అధైర్యపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సహచర కాపరి బీసన్న తెలిపాడు. -
మొసలి నెత్తిన పిడిగుద్దులు, కళ్లలో పొడిచి..
కుర్రాడే కదా.. అనుకుని నీళ్లలోకి లాగేసిన ఆ మొసలికి చుక్కలు చూపించాడు. పది నిమిషాలపాటు వీరోచితంగా పోరాడి మొసలి నోట్లోంచి సజీవంగా బయటపడ్డాడు. ఒడిషా కేంద్రపడా జిల్లా నేషనల్ పార్క్ పరిధిలో భితర్కనికా నది ఉంది. అరజా గ్రామానికి చెందిన కొందరు కుర్రాళ్లు సరదాగా ఆ నది ఒడ్డుకు ఈతకు వెళ్లారు. అందులో పద్నాలుగేళ్ల ఓంప్రకాశ్ సాహోను.. ఉన్నట్లుండి ఆరడుగుల పొడవు ఉన్న ఓ మొసలి నీళ్లలోకి లాక్కెల్లింది. నడుము లోతు నీటిలోకి మునిగిపోయిన కుర్రాడు.. ప్రాణ భయంతో కేకలు వేశాడు. వెంటనే మిగతా పిల్లలు ఒడ్డుకు చేరి సాయం కోసం స్థానికులను పిలిచారు. అయితే అప్పటికే మొసలి నోట్లో సాహో చిక్కుకుపోయాడు. ఈలోపు ఒడ్డున్న ఉన్న కొందరు మొసలిపైకి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా శక్తిని కూడదెచ్చుకుని మొసలి కళ్లలో తన వేళ్లతో పొడిచి.. దాని తలపై పిడిగుద్దులు గుద్దాడు సాహో. ఆ దెబ్బకి విలవిలలాడుతూ.. అతన్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయింది మొసలి. ఒడ్డుకు ఎలాగోలా చేరిన కుర్రాడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాళ్లు చేతులకు గాయాలు కావడంతో కటక్ ఎస్సీబీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. సాహసంతో మొసలితో పోరాడి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ కుర్రాడిని అంతా మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే నెల వ్యవధిలో భితర్కనికా నదిలో ఒడిషాలో మొసళ్ల బారిన పడి ముగ్గరు చనిపోవడం విశేషం. నదులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అవి నెమ్మదిగా నదిని ఆనుకుని ఉన్న ఊళ్లలోకి ప్రవేశించి.. దాడులు చేస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. -
Viral Video: అటు చూడు బే!
-
వైరల్ వీడియో: అడుగు ముందుకు పడ్డా చావే! అంతలో..
Viral Video: మనిషికి ఏదో ఒక భయం ఉండడం సహజం. అలాంటిది చావు ఎదురుగా దూసుకొస్తుంటే.. బెదరకుండా ఉండగలడా?. ఇక్కడో పెద్దాయన అడుగు దూరంలో ఉన్నా బెదరలేదు మరి!. ఓ వ్యక్తి తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. గాలానికి పడ్డ చేపను ఆ కొడుకు ఒడ్డుకు లాగుతుంటే.. దానిని అనుసరిస్తూనే నాలుగు మీటర్ల పొడవున్న ఓ భారీ మొసలి ఒడ్డు వైపు వస్తోంది. అది చూసి కంగారులో ఆ కొడుకు టోపీ కింద పడేసుకున్నాడు. మొసలి దాదాపుగా ఒడ్డు మీదకు వచ్చేసింది. ఆ క్షణం.. అక్కడొక భయానక వాతావరణం కనిపించింది. అయితేనేం తన కొడుకు టోపీ కోసం ఓ అడుగు ముందుకేశాడు ఆ పెద్దాయన. అడుగు దూరంలోని మొసలి-ఆ వ్యక్తి ఎదురుపడ్డ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో కర్రతో వెంటనే వెనక్కి రావడం, ఆ మొసలి ముందకు వచ్చే ప్రయత్నం చేయకపోవడంతో పెద్దాయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్ట్రేలియాలోని కాకాడులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒడ్డున్న నిల్చుని అదంతా చూస్తున్న కొందరు.. చేపను వదిలేయాలని అరుస్తున్నా ఆ వ్యక్తి రోస్కేర్ల్ చేపను వదలకపోవడం, అతని తండ్రి ఆ టోపీ తీసుకోవడం పెద్ద సాహసంగా నిలిచింది ఆ ప్రాంతంలో. ఈ అనుభవంతో.. కొన్నాళ్లపాటు ఆ తండ్రీకొడుకులిద్దరూ చేపల వేటకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నారట. View this post on Instagram A post shared by Scott Roscarel (@nuffblokescotty) -
చేపల కోసం వలేస్తే.. మొసలి చిక్కింది!
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామశివారులోని పెద్దచెరువులో శుక్రవారం మత్స్యకారుల వలకు ఓ మొసలి చిక్కింది. చేపల పట్టుకునేందుకు కొందరు వలలు వేయగా.. ఆ వలలో మొసలి పడింది. మరికొందరితో కలిసి దానిని ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు, ఫారెస్ట్ బీట్ అధికారి రత్నాకర్‌కు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో కలిసి వచ్చిన ఆయన మొసలిని తీసుకెళ్లారు. సమీప గోదావరి నదిలో విడిచి పెట్టారు. మొసలి వయసు సుమారు రెండేళ్లు ఉంటుందని, అరవై కేజీల బరువుంటుందని రత్నాకర్ తెలిపారు. కాగా, గ్రామ చెరువులో తొలిసారి మొసలి ప్రత్యక్షం కావడంతో మత్స్యకారులు కొద్దిగా ఆందోళన చెందారు. -
హృదయ విదారకం: బిడ్డను కాపాడటం కోసం శత్రువుకెదురెళ్లి తల్లి ప్రాణ త్యాగం
ప్రపంచంలోని తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. తనకంటే పిల్లల గురించే ఎక్కువ ఆలోచించే ఏకైక వ్యక్తి అమ్మ. పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లికి చిన్నవారే. ఏ ఆపద ఎదురైనా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రమాదం నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చివరికి తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగం చేస్తోంది.. తాజాగా తల్లి ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయెల్ ఓ జింకపై దాడి చేయబోతున్న మొసలి వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో నదిలో ఆకలితో ఉన్న ఓ మొసలికి కొంత దూరంలో జింక ఈత కొడుతూ కనిపించింది. జింకను ఆహారంగా చేసుకోవాలని భావించిన మొసలి.. దానిని పట్టుకునేందుకు వేగంగా కదులుతుంది. అయితే కొంత దూరంలో ఉన్న తల్లి జింక రాబోయే ప్రమాదాన్ని గమనిస్తుంది. తన బిడ్డను రక్షించుకునేందుకు వెంటనే నీటిలోకి దూకి రెండింటి మధ్యలోకి వస్తుంది. దీంతో దూరంలో ఉన్న పిల్ల జింకను వదిలేసి పక్కనే ఉన్న తల్లి జింక మొసలికి ఆహారంగా మారుతుంది. No words can describe the power, beauty and heroism of mother's love 🙏🏻 Heartbreaking video of a mother deer sacrificing herself for saving her baby 😞 It reminds us to Never ignore your parents and family. Respect them and take care of them when it's your turn 🙏🏻 (VC : SM ) pic.twitter.com/e8K9WQiqIc — Sonal Goel IAS (@sonalgoelias) April 6, 2022 తన బిడ్డను కాపాడుకునే క్రమంలో తల్లి జింక ప్రాణత్యాగం చేస్తుంది. ఏప్రిల్ 6న పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు జింక ప్రాణ త్యాగం తల్లి ప్రేమకు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన గుండెల్ని పిండేస్తోందని కామెంట్ చేస్తున్నారు. తల్లికి తన బిడ్డ పట్ల ఉన్న ఎనలేని ప్రేమను గుర్తు చేస్తుందంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. చదవండి: Viral Video: ఓరిని తెలివి సల్లగుండా.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా! Mother is the heartbeat in the home and without her, there seems to be no heartthrob No any one palace full of her — MATALABKHAN7429 (@MATALABKHAN7421) April 6, 2022 getting emotional!!! true lesson.... Maa To Maa hoti hai.. — Sunil Sihag 🇮🇳 (@SunilSihagMiran) April 6, 2022 -
మొసలితో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి... వీడియో వైరల్
Dance with a crocodile: మాములుగా మొసలి అంటే ఎవరైన భయపడతాం. గతంలో దానితో సాహసోపేతమైన ఫీట్లు చేసి భంగపాటుకు గురైనవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు కాస్త అజాగ్రత్తగా వ్యవహరించిన ఇక అంతే సంగతులు. అలాంటిది ఇక్కడొక వ్యక్తి ఏకంగా మొసలితో డ్యాన్స్ చేస్తున్నాడు. వివరాల్లోకెళ్తే...ఫ్లోరిడాలోని ఒక వ్యక్తి మొసలితో కలిసి డ్యాన్స్ చేశాడు. నిజానికి మొసలి కనబడితేనే భయంతో అమాంతంగా పారిపోతం. కానీ ఈ వ్యక్తి ఏకంగా దానితో కలిసి నీళ్లల్లో ఎంచక్కా చిందులు వేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్స్ట్రాగ్రాంలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇంతకీ ఆ మొసలి బతికే ఉంటే అతను అలా డ్యాన్స్ చేయలేడు అంటూ రకరకాలుగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by MEMES | COMEDY | CULTURE (@bitchreject) (చదవండి: ఢిల్లీ మహిళ ప్రపంచ రికార్డు... కాలినడకనే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా.. 110 రోజుల్లో) -
ఆడు మగాడ్రా బుజ్జి.. ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి
మూగ జీవాలకు సాయం చేయడం.. అది వైరల్ కావడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ, మనుషుల్ని చంపి పీక్కుతినే జీవికి సాయం చేయడం.. అదీ మూడురోజులు ఓపికగా ఎదురు చూడడమే ఇక్కడి ఘటనలో విశేషం. స్థానికులంతతా ముద్దుగా ‘మువాయ కలంగ్ బన్’.. అని పిలుచుకునే ఆ మొసలికి ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి కలిగింది. ఆ మూగ జీవికి నరకం లాంటి బాధ నుంచి విముక్తి కలిగించిన టిల్లి అనే వ్యక్తి సాహసానికి, మంచి మనసుకి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇండోనేషియా ఐల్యాండ్ సులావేసిలో పాలూ దగ్గర 2016లో ఒక మొసలి కనిపించింది. ఈ ఉప్పు నీటి మొసలి అప్పుడప్పుడు పశువులు, మనుషుల మీద దాడి చేస్తుండేది. అయితే ఎలా వచ్చి పడిందో తెలియదుగానీ.. దాని మెడకు ఓ టైర్ బిగుసుకుపోయింది. తీద్దామని అనుకున్నా.. దాడి చేస్తుందనే భయంతో దాని దగ్గరగా వెళ్లేందుకు అంతా భయపడ్డారు. బహుశా దానిని చంపేందుకో లేదంటే పెంచుకునేందుకో ఆ టైర్‌ను మెడకు ఉచ్చులా వేసి ఉంటారని భావించారు. ఈలోపు రెండేళ్లు గడిచాయి. 2018లో ఈ మొసలి వీడియో ప్రపంచం దృష్టితో పాటు జంతు సంరక్షకుల దృష్టిని ఆకర్షించింది. టైరు క్రమక్రమంగా దాని మెడకు బిగుసుకుపోతుండడంతో.. దానిని సంరక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2020లో ఆస్ట్రేలియా నుంచి మ్యాట్ రైట్ అనే పాపులర్ సంరక్షకుడు సైతం దానిని రక్షించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో దానికి టైర్ తొలగించినవాళ్లకు మనీ ప్రైజ్ ఆఫర్ చేశారు అధికారులు. అయితే టిల్లి మాత్రం రివార్డు కోసం ముందుకు రాలేదు. మూగజీవాలు ఆపదలో ఉన్నాయంటే.. అక్కడ వాలిపోతుంటాడు ఈ 33 ఏళ్ల వ్యక్తి. గతంలో పాముల నుంచి ఎన్నింటినో చాలా ఓపికగా రక్షించాడు కూడా. అందుకే మూడు రోజులు ఎదురుచూసి.. ఓ కోడిని ఎరగా వేసి మొత్తానికి ఆ మొసలిని పట్టేసుకున్నాడు. స్దానికుల సాయంతో దాని మెడకు పట్టిన టైరును తొలగించి.. పదమూడు అడుగులకు పైన ఉన్న ఆ రాకాసి మొసలిని తిరిగి నీళ్లలోకి వదిలేశాడు. ఇంతకీ మువాయ కలంగ్ బన్ అంటే.. మెడలో టైరు హారంగా ఉన్న మొసలి అని మీనింగ్ (crocodile with a tyre necklace). ఇచ్చిన ప్రకటన ప్రకారం రివార్డు ఇద్దామని అధికారులు అనుకుంటున్నప్పటికీ.. టిల్లి మాత్రం ఆ డబ్బును శాంక్చురీ కోసం విరాళంగా ప్రకటించేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. -
మొసళ్ల కన్నీళ్లు తుడిచారు.. మీరు భేషుగ్గా ఈ నదిలో ఉండవచ్చు!
Tide Turners Plastic Challenge: గుజరాత్‌లోని బరోడా నగరం గుండా ‘భూఖీ’ అనే నది ప్రవహిస్తుంటుంది. ఇది ఒకప్పుడు మొసళ్లకు ఆవాస కేంద్రంగా ఉండేది. నది ప్రవాహంలో ఎక్కడో ఒకచోట మొసళ్లు కనిపించేవి. రానురానూ ఈ నది కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భూఖీ ఉన్నచోట ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు! ఈ దెబ్బతో ఎటు వెళ్లాయో, ఎప్పుడు వెళ్లాయో, ఎక్కడికి వెళ్లాయో తెలియదు. ఎంత వెదికినా ఒక్క మొసలి కూడా కనిపించేది కాదు. కేవలం జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి! అయితే ఒక చాలెంజ్ నిర్జీవమైన భూఖీకి జీవాన్ని ఇచ్చింది. చైతన్యం చేసింది. గతంలో కనిపించినంత కనిపించకపోయినా... ఇప్పుడు ఎనిమిది నుంచి పది మొసళ్లు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. కాలుష్యం భరించలేక కన్నీళ్లు పెట్టుకొని పారిపోయిన మొసళ్ల కన్నీరు తుడిచింది ఎవరు? ‘ఇప్పుడు మీరు భేషుగ్గా ఈ నదిలో ఉండవచ్చు’ అని ధైర్యం ఇచ్చింది ఎవరు? రోజుకో సరదా చాలెంజ్‌ల గురించి వినిపిస్తున్న రోజుల్లో ఆఫ్రికా నుంచి ఆసియా వరకు ఎన్నో దేశాల యువతను అమితంగా ఆకట్టుకుంది... టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ చాలెంజ్. యూఎన్ ఎన్విరాన్మెంటల్ ప్రొగ్రామ్‌లో భాగంగా వచ్చిన ఈ చాలెంజ్... సముద్రాలు, నదులు, కాలువల్లో తిష్ఠ వేసిన కాలుష్య భూతంపై మోగించిన సమరభేరి. ఎంట్రీ, చాంపియన్, లీడర్... ఇలా విభిన్న స్థాయిలో ఈ చాలెంజ్‌కు రూపకల్పన చేశారు. ఇది సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (సీయియి) ద్వారా ఇండియాకు కూడా వచ్చింది. మహారాజా షాయజీరావు యూనివర్శిటీ ఆఫ్ బరోడాకు ఈ చాలెంజ్ వచ్చినప్పుడు ఎంఏ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ స్టూడెంట్ అయిన స్నేహ షాహీలాంటి ఒక్కరు ఇద్దరు తప్ప పెద్దగా ఉత్సాహం ప్రదర్శించిన వారు లేరు. తొలి సంతకం చేసిన స్నేహ అక్కడితో ఆగిపోలేదు. ఈ చాలెంజ్ చేసే మేలు గురించి యూనివర్శిటీలో విస్తృతంగా ప్రచారం చేసింది. అలా ఈ చాలెంజ్‌లో 300 మంది విద్యార్థులు భాగం అయ్యారు. ముందుగా తమ యూనివర్శిటి నాలాలలో నుంచి కిలోల కొద్దీ చెత్తను ఎత్తిపారేసారు. ఇక భూఖీ ప్రక్షాళన ప్రారంభించారు. భూఖీ నదికి ఒకనాటి పాతకళను తెచ్చారు. నది నుంచి వెలికి తీసిన ప్లాస్టిక్, థర్మకోల్ వ్యర్థాలను శుభ్రం చేసి స్మాల్ ప్లాంటర్స్, వాల్హ్యాంగిగ్స్ తయారుచేసి వినియోగంలోకి తెచ్చారు. గ్లాస్బాటిల్స్ను రీసైకిలింగ్‌కు పంపించారు. అవగాహన ఆచరణకు దారి చూపుతుంది. అదే ఆచరణ ఎంతోమందికి అవగాహన కలిగిస్తుంది. ప్రస్తుతం స్నేహ, ఆమె బృందం ఇదే పనిలో ఉంది. ‘అవర్ కామన్ ఫ్యూచర్’ అనే పేరుతో బృందంగా ఏర్పడి పర్యావరణానికి మేలు చేసే పనులు చేస్తున్నారు. ‘జలాల్లో కాలుష్యానికి మనమే కారణం. ఆ తప్పును సరిదిద్దుకోవాలి’ అంటూ ఎంతోమందిని దిద్దుబాటు బాటలోకి నడిపిస్తున్నారు. -
కృత్రిమ మొసలి అనుకుని సెల్ఫీకి యత్నం... ఇక అంతే చివరికి
ఇటీవలకాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ సెల్ఫీ మోజు మాములుగా లేదు. వేగంగా వెళ్లుతున్న బస్సు లేక రైలు పక్కన సెల్ఫీలు దిగడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారంటే ఏమని అనాలో కూడా అర్థంకాదు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ మోజుతో ఎంత పిచ్చి పని చేశాడో చూడండి. (చదవండి: ఏడాదిగా షాప్‌కు వస్తున్న ప్రమాదకరమైన పక్షి!) అసలు విషయంలోకెళ్లితే...ఫిలిప్పీన్స్‌లోని నెహెమియాస్ చిపాడా అనే 60 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో సహా కాగయన్ డి ఓరో సిటీలోని అమయా వ్యూ అమ్యూజ్మెంట్ పార్క్‌ను సందర్శించడానికి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి ఆ కొలనులో కృత్రిమ మొసళ్లు ఉంటాయనుకుని వాటితో సెల్ఫీకోసం అక్కడ ఉన్న థీమ్ పార్క్‌లోని కొలనులోనికి దిగిపోయాడు. ఇక అంతే అతను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మొసలితో సెల్ఫీ తీసేందుకు ప్రయత్నిస్తుండగా వెంటనే ఆ మొసలి అతని పై దాడి చేసి గట్టిగా ఎడమచేయి పట్టుకుని లాగుతుంది. అయితే చిపాడ పాపం ఏదోరకంగా ఆ చెయ్యిని విడిపించుకుని బయటపడతాడు. దీంతో చిప్పాడను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు అతని ఎడమ చేతికి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం అతను బాగానే కోలుకుంటున్నాడు. అంతేకాదు అతను కుటుంబసభ్యులు ఆ కొలనులోని దిగవద్దని హెచ్చరిక బోర్డులు లేవు అందువల్ల అతను దిగాడంటూ ఆ పార్క్వాళ్లపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు . ఈ మేరకు అమయా వ్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాండీ ఉనాబియా ఈ ఆరోపణలను ఖండించారు. అంతేకాదు మొసలి కూడా కృత్రిమమైనదని వారు భావించడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. పైగా తాము తమ పార్క్ టూర్ గైడ్లో ముందుగానే ఆ ప్రాంతాన్ని పరిమితులకు లోబడే సందర్శించాలనే విషయాలను పర్యాటకులకు చెబుతామని అన్నారు. అయితే చివరికి అమయా వ్యూ పార్క్ అధికారులు చిపడా వైద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం గమనార్హం. (చదవండి: ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం) -
మొసలిని చెప్పుతో తరిమి కొట్టిన మహిళ.. వైరల్ వీడియో
నీటిలో, నేల మీద జీవించే జీవుల్లో మొసలి ఒకటి. మొసలికి నీటిలో అమితమైన బలం ఉంటుంది. పెద్ద ఎనుగును కూడా ఈడ్చి పడేస్తుంది. అందుకే నీటిలో ఉండే వేటాడి ఆహారం తింటుంది. నేల మీద మొసలి జీవించలగలదు కానీ బలం అంతగా ఉండదు. అయితే నదిలో ఉన్న మొసలి ఒడ్డున ఉన్న కుక్క పిల్లను తినేయాలని చూస్తుంది. ఇంతలో ఓ మహిళ తన చెప్పు తీసి మొసలిని బెదిరించేసరికి తోకముడిచి వెనక్కి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రెడ్ షుల్ట్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఎర్ర తేళ్లేనా? ఈ వీడియోలో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో నద వద్ద నిలబడి ఉంది. ఈ నదిలో చాలా మొసళ్లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కా గా మహిళ కుక్క అక్కడక్కడే తిరుగుతూ ఉండగా దాన్ని చూసిన మొసలి వేగంగా ఒడ్డు వద్దకు వస్తుంది. అలా వస్తున్న మొసలిని చూసిన మహిళ ఇసుమంత కూడా భయపడకుండా దాన్ని అలాగే చూస్తూ నిల్చుంటుంది. ఆ మొసలి దగ్గరి దాక వచ్చాక మహిళ తన కాలుకు ఉన్న చెప్పును చూపించి బెదిరిస్తుంది. దీంతో ఆ మొసలి భయపడిందో ఏమో గానీ వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి నీళ్లలోకి వెళ్లిపోయింది. చదవండి: రేయ్! రేయ్!.. తప్పుకోండిరా బాబు... మీదకు వచ్చేస్తోంది..!! Everyone knows what it means when mom takes the shoe off. 😏😂🐊🥿 pic.twitter.com/CXD94m6PVz — Fred Schultz (@fred035schultz) November 9, 2021 అన్నట్టు ఇది ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతమైన. కాకాడు నేషనల్ పార్కులో జరిగింది. ఈ వీడియోలోని మహిళ చేసిన ఫన్ నెటిజన్లను ఆకర్షిస్తుంది. దీంతో ట్విట్టర్లో మీమ్స్ సృష్టిస్తున్నారు. ఎలాంటి సమస్యకైనా చెప్పు ఉంటే చాలు... పరిష్కారం దొరుకుతుంది. డేరింగ్ లేడి. భర్త ఆలస్యంగా ఇంటికి రావడం, పిల్లలు నటించడం, కుక్కను బెదిరించడం ఇలా ప్రతి దానిలో చెప్పునే ఉపయోగిస్తాం’. అంటూ రకరకాల మీమ్స్ వేస్తున్నారు. -
చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’
ప్రమాదాలనేవి చెప్పిరావు. ఒక్కొసారి అనూహ్యంగా మన ప్రమేయం లేకుండానే ప్రమాదాలు జరిగిపోతుంటాయి. కానీ అలాంటి సమయంలోనే సమయస్పూర్తితో వ్యవహరించి ఆ ఆపద నుంచి సురక్షితంగా బయటపడాలి. అచ్చం అలానే చేశాడు ఇక్కడొక ఆస్ట్రేలియన్ వ్యక్తి. బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలోని 60 ఏళ్ల వ్యక్తి కైర్న్స్కి సమీపంలోని హోప్ వేల్ నగరంలోని ఒక నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే అతను పని ముగించుకుని తిరిగి నదిఒడ్డుకి వచ్చే క్రమంలో అక్కడ ఉన్న ఎద్దుని అదిలించాడు. దీంతో ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఒక మొసలి క్షణాల్లో అతని పై దాడిచేసింది. పైగా ష్యూస్ వేసుకుని ఉన్న అతని రెండు కాళ్లను బలంగా లాగడానికి ప్రయత్నించింది. (చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్) అతను అక్కడ ఉన్న చెట్టు కొమ్మలను సైతం పట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నించాడు. అయితే అతను ఆ ప్రయత్నంలో విఫలం అవ్వడంతో చేసేదేమి లేక చివరికి అతని పాకెట్లో ఉన కత్తితో అదే పనిగా దాడిచేశాడు. దీంతో అతను కొద్దిమొత్తంలో గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత అతను ఆసుపత్రికి వెళ్లినట్లు క్వీన్స్లాండ్ పర్యావరణ విభాగం పేర్కొంది. (కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు) -
Crocodile: వంక గట్టున మొసలి.. గ్రామస్తుల హడల్...
సాక్షి, కంప్లి(కర్ణాటక): ఎమ్మిగనూరు గ్రామ సమీపానగల జడెసిద్ధేశ్వర రామక్క వంక గట్టున మొసలి కనిపించడంతో గ్రామస్తులు హడలిపోయారు. సోమవారం ఓ రైతు పశువులను కడుగుతుండగా మొసలి ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురై గ్రామస్తులకు తెలిపాడు. నిత్యం వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామస్తులు ఇదే వంక దాటి వెళ్తుంటారు. ఆ సమయంలో వారిపై ఎక్కడ దాడి చేస్తుందో అనే భయంతో ఉన్నారు. ఈ వంకలో పదేపదే మొసళ్లు ప్రత్యక్షమవుతున్నాయని తెలిపారు. చదవండి: పూజ సామాగ్రిని నీటిలో కలపడానికి వెళ్లారు.. అంతలోనే.. -
Shocking Video: స్విమ్మర్‌పై మొసలి భయంకర దాడి..
-
మొసలిని తిప్పితిప్పి తుక్కుతుక్కు చేసింది..!
ఆఫ్రికా: జంతువులు తమ పిల్లల జోలికి వస్తే ఎంతలా దాడి చేస్తాయో అందరికి తెలిసిందే. పైగా అవి చాలా సార్లు తమ సంతానాన్ని కాపాడుకోవటం కోసం తమ కన్న పెద్ద జంతువులతో పోరాడటానికి కూడా వెనకాడవు. అచ్చం అలాంటి సంఘటనే జాంబియా దేశంలో చోటు చేసుకుంది. నిజానికి ఏనుగులు ఎక్కడకి వెళ్లిన గుంపులు గుంపలుగా వెళ్లతాయి. అయితే ఇక్కడ ఒక తల్లి ఏనుగు తన పిల్లలతో నీళ్లు తాడగడం కోసం నదిలోకి దిగుతుంది. (చదవండి: 900 ఏళ్ల నాటి పురాతన కత్తి) అంతే ఇంతలో ఒక్కసారిగా ఒక మొసలి ఆ పిల్ల ఏనుగులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తల్లి ఏనగు కోపంతో ఆ మొసలిపై దాడి చేయడమే కాక తొండంతో ఒడిసి పట్టుకుని కాళ్లతో తొక్కి చంపేస్తుంది. అయితే ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగినప్పటికీ ప్రస్తుతం మళ్లీ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తల్లి ఏనుగుతో గొడవపడకండి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఏడాది చిన్నారి నెలకు ఏకంగా రూ.75 వేలు సంపాదన) -
వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి..
గాంధీనగర్: భారీ వర్షాల కారణంగా ఒక్కొసారి అడవిలోని జంతువులు మానవ ఆవాసాల దగ్గరికి వస్తుంటాయని విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్లో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ రెండు భయంకరమైన జీవులు జనావాసాల సమీపంలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, వడోదరకు సమీపంలో ఒక చెరువు ఉంది. ఈ క్రమంలో, అక్కడి నుంచి 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి రెండు కూడా జనావాసాల్లోకి వచ్చాయి. వీటిని చూడగానే స్థానికులు భయంతో వణికిపోయారు. ఆ తర్వాత వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వెంటనే ఆ జీవులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో కలిసి కొండచిలువ, మొసలిని బంధించారు. ఆ తర్వాత వాటిని దగ్గరలోని అడవిలోకి వెళ్లి వదిలినట్లు ఫారెస్టు అధికారి అర్వింద్ పవార్ తెలిపారు. కాగా, ఆ జీవుల నుంచి ఎలాంటి అపాయం లేకుండా రెస్క్యూ సిబ్బంది పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు -
గాయాలతో మొసలి.. 25 నిమిషాలు నిలిచిన రాజధాని ఎక్స్‌ప్రెస్
ముంబై: మొసలి పట్టాలపైకి రావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన వడోదర-ముంబై రైల్వే లైన్ మధ్య చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం రైలు పట్టాలపై గాయంతో బాధపడుతున్న మొసలి ప్రత్యక్షమైంది. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 25 నిమిషాల పాటు నిలిచిపోయింది. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మొసలిని పక్కకు తీసిన అనంతరం రైళ్ల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మిగతా రైళ్లు దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం కర్జన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. వన్యప్రాణుల కార్యకర్త హేమంత్ వద్వాన వచ్చి మొసలికి సపర్యలు చేసి పట్టాలపై నుంచి తొలగించాడు. ‘నాకు 3.15 నిమిషాలకు కర్జాన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ పట్టాలపై మొసలి ఉందని ఫోన్ చేశారు. మొసలి వలన రైలు ఆగడం ఆశ్చర్యమేసింది. స్టేషన్ నుంచి మేం మొసలి ఉన్న దగ్గరకు వెళ్లడానికి ఐదు నిమిషాలు పట్టింది.’ అని హేమంత్ తెలిపారు. ‘మొసలి తీవ్ర గాయాలతో బాధపడుతోంది. ఆలస్యంగా వెళ్లి ఉంటే మొసలి చనిపోయి ఉండేది’ అని మరో వన్యప్రాణి కార్యకర్త నేహ పటేల్ వివరించారు. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు ‘పట్టాలపై నుంచి మొసలిని తొలగించిన అనంతరం కిసాన్ రైలులో తరలించాం. అనంతరం అటవీ శాఖ అధికారులకు మొసలిని అప్పగించాం’ అని కర్జాన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సంతోశ్ శర్మ తెలిపారు. వన్యప్రాణి కార్యకర్తలంతా అగ్నివీర్ ప్రాణీణ్ ఫౌండేషన్ సభ్యులు. వారు ఇలా వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ఈ ఫౌండేషన్ సభ్యులు కాపాడుతారు. -
ఎనిమిదడుగుల మొసలి.. ఫారెస్ట్ అధికారులను రెండు గంటలపాటు..
జైపూర్: సాధారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నీళ్లలో ఉండే జీవులు మానవ ఆవాసాలకు కొట్టుకుని వస్తుంటాయి. పాములు, మొసళ్లు, తదితర జీవులు నీటిప్రవాహంలో కొట్టుకుని వస్తుంటాయనే విషయం మనకు తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా చెరువులన్ని నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో.. ఎనిమిదడుగుల మొసలి దారితప్పి ఒక ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. సవాయి మాధోపూర్ జిల్లాలోని ఒక ఇంటి ఆవరణలోకి ఎనిమిది అడుగుల భారీ మొసలి ప్రవేశించింది. ఆ ఇల్లు చెరువుకు దగ్గరలో ఉంటుంది. కాగా, ఇంటి ఆవరణలో మొసలిని చూసిన వారు భయాందోళనలకు గురయ్యారు. ఆ మొసలి అటు ఇటూ తిరుగుతూ కాసేపు బీభత్సాన్ని సృష్టించింది. భారీ మొసలిని చూడటానికి స్థానికులు పెద్దఎత్తున ఎగబడ్డారు. దీంతో, ఇంట్లోని వారు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాసేపటికి రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు మొసలిని చూసి ఆశ్చర్యపోయారు. దాన్ని బంధించడానికి పెద్ద బోనును తీసుకువచ్చారు. మొసలిని తాళ్లసహయంతో పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే, మొసలి అధికారులకు ముప్పు తిప్పలు పెట్టి.. చిక్కినట్టే చిక్కి తప్పించుకోసాగింది. కాగా, దాదాపు రెండు గంటలపాటు శ్రమించి చివరకు మొసలిని బంధించారు. ఈ సంఘటనను చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీన్ని తమ ఫోనులో రికార్డు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
మొసలి కలకలం
-
సారపాక శివారు వాగులో మొసలి సంచారం
-
ఊళ్లోకి వచ్చిన మొసలి.. భయంతో పరుగులు తీసిన జనం!
బెంగళూరు: సాధారణంగా నదులు, చెరువుల్లో మొసళ్లు కనిపిస్తేనే భయపడతాం. అలాంటిది ఏకంగా మొసలి ఓ గ్రామానికి పర్యటనకు వచ్చింది. అవును.. నిజం.. కర్ణాటకలోని కోగిల్బాన్ గ్రామంలోకి గురువారం ఉదయం ఓ భారీ మొసలి ప్రవేశించింది. దానిని చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామ వీధుల్లో మొసలి తిరుగుతున్న సమాచారాన్ని స్థానికులు వెంటనే అటవీ అధికారులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకొని నీటిలో వదిలిపెట్టారు. కాలీ నది నుంచి గ్రామంలోకి మొసలి వచ్చిందని అధికారులు తెలిపారు. గ్రామానికి చేరుకున్న మొసలి సుమారు అరగంట పాటు వీధుల వెంట తిరిగిందని పేర్కొన్నారు. అయితే.. అదృష్టవశాత్తూ మొసలి ఎవరిపైనా దాడి చేయలేదని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి.. మహిళా డాక్టర్‌పై అత్యాచారం -
కోగిబన్ గ్రామంలోకి ప్రవేశించిన మొసలి
-
వైరల్: మొసలిపై కొంగ సవారీ .. నోరెళ్లబెట్టిన నెటిజన్లు
మొసలిని చూస్తే ఎవరైనా భయపడతారు. ఇక అదే మొసలి నీటిలో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లేనని ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ఏ జంతువు అయినా దానికి ఆహారం కావాల్సిందే. అంతెందుకు ఆకారంలో పెద్దగా ఉండే ఏనుగు కూడా నీళ్లలో మొసలికి చిక్కితే దాని పరిస్థితి దబిడిదిబిడే మరి. కానీ నాకివన్నీ తెలియదు భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అన్నట్లు ప్రవర్తించింది ఓ కొంగ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఓ కొంగ మొసలిని చూసి భయపడటం కాదు కదా ఏకంగా దాని మీద ఎక్కి మరీ సవారీ చేసింది. అంతేనా, ఆ కొంగ ఎంచక్కా రైడ్ చేస్తున్నట్లు ఫోజులిస్తూ మనకు కనిపిస్తుంది. ఇంతలో అనుకోకుండా అక్కడికి మరో రెండు మొసళ్ళు వచ్చాయి. అవి ఈ కొంగ పని పడతాయని అనుకున్నారు ఈ వీడియో చూసిన వాళ్లంతా కానీ, ఆ మొసళ్ళు కూడా కొంగను చూసి సైలెంట్‌గా వెళ్లిపోయాయి. అలానే కొంగ నిల్చున్న మొసలి కూడా ఏమీ ఆ పక్షిని గాయపరచకుండా జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువెళ్లడం మరో వింత. మామూలుగా అయితే ఇలాంటి సంఘటనలు జరగడం అరుదు. అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కొందరు ఆ కొంగ ధైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరు ఆ మొసలి, కొంగ స్నేహితులేమో అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’ -
Photo Feature: యాదాద్రి వైభవం.. తాజ్ పునఃప్రారంభం
తెలంగాణలోని యాదాద్రి పుణ్యక్షేత్రంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపి వేయాలని తెలంగాణ సర్కారును డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు పర్యాటకులను బుధవారం నుంచి అనుమతిస్తున్నారు. -
మొసలి నుంచి తప్పించుకొని కోమాలోకి ; ఆ తర్వాత
సాధారణంగా మొసలి నీళ్లలో ఉంటే వెయ్యి ఎనుగులంత బలం అంటారు. నీళ్లలో మొసలికి చిక్కామంటే మన ప్రాణాలు పోవడం ఖాయం. ఒక యువతి మాత్రం తన కవల సోదరి సాయంతో మొసలి పంజా నుంచి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.. కానీ పదిరోజుల పాటు కోమాలో ఉంది. తాజాగా కోమాలో నుంచి లేచిన ఆమె తన కుటుంబాన్ని మళ్లీ చూస్తానని అనుకోలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. వివరాలు.. లండన్‌కు చెందిన 28 ఏళ్ల మెలిస్సా లౌరి, జార్జియా లౌరిలు కవలలు. ఇద్దరికి బోటింగ్ అంటే మహాప్రాణం. పదిరోజల కిందట మెక్సికోలోని మానియాల్టెపెక్ లగూన్ తీర ప్రాంతానికి బోటింగ్ వెళ్లారు. ప్యూర్టో ఎస్కాండిడో ఐలాండ్‌లో రాత్రికి బస చేశారు. ఆ రాత్రి సరదాగా ఐలాండ్ నుంచి పది మైళ్ల దూరంపాటు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత మెలిస్సా ఉన్నట్టుండి నీళ్లలో మునిగిపోయింది. ఆమెకు కొంచెం దూరంలో ఉన్న జార్జియా మెలిస్సా కనిపించకపోవడంతో గట్టిగా కేకలు వేసింది. ఏ రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె ప్రమాదంలో పడిందని గ్రహించిన జార్జియా ఆమె దగ్గరికి వెళ్లింది. అప్పటికే మెలిస్సా కాలును బలంగా పట్టుకున్న మొసలి ఆమెను నీటి అడుగుభాగంలోకి లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే జార్జియా చాకచక్యంగా వ్యవహరించి రక్షణ కోసం తనతో పాటు తెచ్చుకున్న వస్తువును మొసలిపై పదేపదే దాడికి పాల్పడంతో మొసలి తన పట్టును విడవడంతో వారిద్దరు నీటిపైకి వచ్చారు. అయితే మొసలి మరోసారి దాడిచేయడంతో ఈసారి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జార్జియా ఎలాగోలా మెలిస్సాను మొసలి బారీ నుంచి కాపాడి బయటకు తీసుకువచ్చింది. కానీ మెలిస్సా అప్పటికే సృహ కోల్పోయి కోయాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి బయటపడిన వీరిద్దరు ఆసుపత్రిలో చేరారు. జార్జియా గాయాలనుంచి కోలుకోగా.. పది రోజల పాటు కోమాలో ఉండిపోయిన మెలిస్సా రెండు రోజుల క్రితం కళ్లు తెరవడంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆందోళన తగ్గింది. కోమా నుంచి బయటపడినా ఊపిరి తీసుకోవడంలో మెలిస్సాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మరోసారి ఆమెను ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే ఇప్పడిప్పుడే తనంతట తాను ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో డాక్టర్లు ఆక్సిజన్ పైప్‌ను తీసేశారు. ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. కాగా 2019లో 54 ఏళ్ల వ్యక్తి తన బొటనవేలితో మొసలి కంట్లో పొడిచి తన ప్రాణాలను దక్కించుకోవడం సంచలనంగా మారింది. చదవండి: ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో ఉన్నాడు -
వయసు 75 ఏళ్లు.. 80 మంది ప్రాణాలు తీసింది
కంపాలా(ఉగాండా): ఒకప్పుడు అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ పేరు చెబితే పాశ్చాత్య దేశాలు, అమెరికాకు వెన్నులో వణుకు పుట్టేది. అయితే ఉగాండాలోని విక్టోరియా సరస్సులో ఉండే ఒసామా బిన్ లాడెన్ అనే ఓ మొసలి(75) అక్కడి పిల్లలకు, పెద్దలకు దశాబ్దాలపాటు వెన్నులో వణుకు పుట్టించింది. ఒసామా 1991 నుంచి 2005 మధ్య కాలంలో దాదాపు 16 భారీ సరిసృపాలను తినేసింది. అంతేకాకుండా లుగాంగా అనే గ్రామంలోని జనాభాలో పదోవంతు మంది కనిపించకుండా పోయారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఒసామా ఇప్పటివరకు గ్రామంలోని 80 మందికి పైగా స్థానికులను పొట్టన బెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఫిషింగ్ బోట్ల క్రింద దాక్కుని సరస్సులో నీటి కోసం వచ్చే పిల్లలను పట్టుకునేదని స్థానికుల కథనం. ఇక మత్స్యకారులు వేటకు బయలు దేరినప్పుడు వారిపై దాడి చేసి చంపేసేది. భయానక ఘటన: పాల్ కైవాల్యాంగా మాట్లాడుతూ.. “మేము చేపలు పడుతున్నాం. అయితే ఓ రోజు ఒసామా నీటిలో నుంచి పడవలో దూకింది. దాంతో నేను కూర్చున్న పడవ వెనుక భాగం మునిగిపోయింది. ఆ భయంకరమైన మొసలి నా తమ్ముడు పీటర్ కాళ్లను పట్టుకుని నీటిలోకి ఈడ్చుకుపోయింది. పీటర్ అరుస్తూ ఐదు నిమిషాల పాటు దానితో పోరాడాడు. అతన్ని కాపాడటానికి నేను ఎంత ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. కొన్ని రోజుల తరువాత అతని తల, చెయ్యి నీటిలో తేలుతూ కనిపించాయి.’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా గ్రామస్తులు 2005లో అధికారులను సహాయం కోరారు. 50 మంది స్థానిక పురుషులు, వన్యప్రాణి అధికారుల సహాయంతో ఆ భారీ మొసలిని పట్టుకున్నారు. ఇంకా ఉంది: అయితే ఒసామా కథ అక్కడితో ముగిసిపోలేదు. గ్రామస్తులు ఆ మొసలిని వెంటనే చంపాలని అనుకున్నారు. కానీ ఉగాండాలో దీనికి అనుమతి లేదు. ఒసామాకు కూడా జీవించే హక్కు ఉందని, శిక్షగా చంపలేమని అధికారులు తెలిపారు. చంపకుండా ఈ మొసలిని ఉగాండాలోని మొసళ్ల పెంపకం కేంద్రానికి ఇచ్చారు. ఈ మొసలి ద్వారా కలిగే సంతానం తోలుతో హ్యాండ్‌బ్యాగులు తయారు చేసి ఇటలీ, దక్షిణ కొరియాకు ఎగుమతి చేయవచ్చని భావించారు. కాగా ఒసామా వచ్చినప్పటి నుంచి ఈ సంతానోత్పత్తి కేంద్రం పర్యాటకులతో రద్దీగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం 5000 మొసళ్ల దాకా ఉన్నాయి. చదవండి: హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరో 132 మంది -
వైరల్: నీటి కోసం వెళ్లి మొసలికి బలైన చిరుత!
చెట్లను అవలీలగా ఎక్కడం, పాకడంతో పాటు నీటిలో ఈదడంలో ఆరితేరిన జంతువు చిరుత పులి. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుత అనడంలో సందేహమే లేదు. అయితే ఎంత బలవంతుడికైనా ఓ బలహీనత ఉంటుందని! అందుకే అంటారు. నీటిలో మొసలికి తిరుగులేదు. నీటిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద జంతువైనా మొసలి ముందు తల వంచాల్సిందే. అదే మొసలి బలం. ఓ చిరుత పులి నదిలో దాహం తీర్చుకుంటుండగా మొసలి హఠాత్తుగా దాడి చేసింది. చీతా(చిరుత పులి) దాని బారి నుంచి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. చిరుత నివాసం భూమి కాబట్టి అది మొసలితో నీటిలో పోరాడలేక పోయింది. మొసలి కేవలం మూడు సెకన్లలోనే ఆ చిరుతను నీటి అడుగుకి తీసుకెళ్లిపోయింది. అయితే ఆరు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘60 సెకన్లలో అంతా అయిపోయింది!! ఓ క్రూర జంతువు మరో క్రూర జంతువుకు ఆహారం అవుతుంది. ఇదే అడవిలో జరిగేది.’’ అంటూ మరల ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోను కొద్ది గంటల్లోనే ఎనభై వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘ ఈ భయంకరమైన ఘటన జరిగిన కొద్ది సెకన్లలోనే నీరు చాలా ప్రశాంతంగా మారింది. ఆ నిశ్శబ్దం బహుశా.. తన స్నేహితుడిని కోల్పోయిన నీరు దుఃఖిస్తున్నందుకు కావచ్చు’’. అంటూ ఓ నెటిజన్ విచారాన్ని వ్యక్తం చేశాడు. (చదవండి: ఈ మామిడి పండు ఖరీదు రూ.1000 గురూ!) -
వైరల్: ఎప్పుడూ నువ్వేనా.. ఈ సారి నీ పప్పులుడకవులే!
మొసలి.. దాని పట్టు, బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! నీటిలో ఉన్నప్పుడు ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. అలాంటి బలమైన మొసలికి-పులికి మధ్య ఎప్పుడూ ఆహారం కోసం వేటాడడంలో పోటీ ఉంటుంది. అయితే ఈ వేటలో మొసలి పైచేయి సాధిస్తే.. పులి భంగపాటు గురయ్యేది కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదు. తాజాగా మొసలి వర్సెస్ చిరుత ఫైట్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మేహ్ర తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ చిరుతపులి నీరు తాగేందుకు సమీపంలోని కుంట ఒడ్డు వద్దకు వచ్చింది. పులి నీరు తాగుతుండగా అప్పటికే నీళ్లలో దాగి ఉన్న మొసలి ఒక్కసారిగా చిరుతపై మెరుపుదాడి చేసింది. దాని శక్తివంతమైన దవడలతో చిరుతను నోట కరచుకొని నీటిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో మొసలి ఓడిపోయింది. మొసలి దాడి చేసేందుకు ప్రయత్నించగా.. పులి ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరి తప్పించుకుంది. ప్రస్తుతం ఆ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. చిరుత చాలా వేగంగా చాకచాక్యంతో తప్పించుకున్న తీరుకు ఫిదా అవుతున్నారు. ‘ఎప్పుడూ నువ్వేనా.. ఈ సారి నీ పప్పులుడకవులే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Wilderness is full of uncertainties and surprises.. ‘Survival of fittest..’ #Wilderness @susantananda3 pic.twitter.com/yFfDggi3a1 — Surender Mehra IFS (@surenmehra) May 29, 2021 -
చేపలకు వల వేస్తే 100 కేజీల మొసలి పడింది!
సాక్షి, గూడూరు(వరంగల్): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంట ఊర చెరువులో చేపల కోసం వేసిన వలలో ఓ భారీ మొసలి చిక్కింది. మత్స్యకారులు పెసరి శివ, స్వామి, రాములు ఎప్పటిలాగానే మంగళవా రం రాత్రి చేపలు పట్టడం కోసం వలలు వేసి వెళ్లారు. బుధవారం వలలో పడిన చేపలను బయటికి తీసేందుకు రాగా భారీ మొసలి కనిపించింది. సుమారు 100 కిలోలకు పైగా ఉన్న మొసలిని బంధించేందుకు రెండు గంటల పాటు శ్రమించారు. అనంతరం అటవీ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది మొసలిని పాకాల సరస్సులో వదిలేందుకు జీపులో తీసుకెళ్లారు. -
మొసలి పొట్ట కోసి.. బాలుడ్ని బయటకు తీసి..
జాకార్తా : 26 అడుగుల పొడవైన మొసలిని చంపి, దాని కడుపు కోసి అది మింగిన బాలుడ్ని బయటకు తీసిన ఘటన ఇండోనేషియాలో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా, ఈస్ట్ కలిమన్‌తన్‌కు చెందిన దిమస్ ముల్కన్ సపుత్ర అనే ఎనిమిదేళ్ల బాలుడు బుధవారం తండ్రి సుబ్లియాన్షాతో కలిసి చేపలు పట్టడానికి దగ్గరలోని నదికి వెళ్లాడు. ఇద్దరూ చేపలు పడుతుండగా 26 అడుగుల ఓ పొడవైన మొసలి దిమస్‌పై దాడి చేసింది. అది గమనించిన సుబ్లియాన్షా మొసలిని కొట్టి కుమారుడ్ని కాపాడాలని చూశాడు. అయితే అది బాలుడితో సహా నీళ్ల అడుగులోకి వెళ్లిపోయింది. మొసలి కడుపులోనుంచి బాలుడ్ని బయటకు తీస్తున్న దృశ్యం నమలకుండానే బాలుడ్ని మింగేసింది. గురువారం గ్రామస్తులు మొసలిని చంపి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ‘దిమస్.. దిమస్’’ అంటూ అరవటం మొదలుపెట్టారు. అనంతరం దాని పొట్టను కోసి దిమస్ మృతదేహాన్ని బయటకు తీశారు. బాధాతప్త హృదయాలతో కన్నీరు కార్చారు. దిమస్‌కు కన్నీటి వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి : వైరల్: చేప కడుపులో తాబేలు చక్కర్లు! ఏడాదిగా మైనర్ బాలుడిపై అత్యాచారం చేస్తోన్న మహిళ -
మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి
సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చెరువుకు ఆనుకొని పుర్తిగా ఇళ్లు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెరువులోని మొసలిని పట్టుకెళ్లాలని కోరుతున్నారు. చదవండి: డ్యాన్సర్‌కు రూ.11.75 లక్షల టోకరా -
వైరల్ : నీ టైం బాగుంది ఇంపాల
మన అదృష్టం బాగుంటే పులి నోట్లో తల పెట్టి పడుకున్నా గాటు కూడా పడకుండా బయటపడొచ్చు.. పాము తోక మీద నాట్యం చేయోచ్చు.. సునామిలో కూడా షికారు చేయోచ్చు..ఇదంతా అతిశయోక్తిలా అనిపించొచ్చు. కానీ, వాస్తవం. ఇప్పుడు మనం చెప్పుకునే అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిందో ఇంపాలా. క్షణకాలంలో ముసలి వేట నుంచి తప్పించుకుని ప్రాణాలు నిలుపుకుంది. వివరాల్లోకి వెళితే.. సౌత్ ఆఫ్రికాలోని లువాంగ్వా నేషనల్ పార్కులో ఉంటున్న కొన్ని ఇంపాలాలు అక్కడి ఓ నీటి కుంట దగ్గరకు దాహం తీర్చుకోవటానికి వెళ్లాయి. ఓ ఆడ ఇంపాల భయంభయంగా అటుఇటు చూస్తూ నీళ్లు తాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిలో దాక్కున్న ఓ పెద్ద మొసలి ఠక్కున దాని మీదకు దూకింది. ఇది గమనించిన ఇంపాల అంతకంటే వేగంగా పైకి ఎగిరి తప్పించుకుంది. బతుకుజీవుడా అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది. మొసలికూడా నోటి కాడి కూడు పోయేసరికి నిరాసతో నీళ్లలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనను ఫొటోగ్రాఫిక్ గైడ్ పీటర్ గెరిడిట్స్ వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘ నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావ్ ఇంపాల’’.. ‘‘ఓపిక లేకపోతే ఎలా క్రొకడైల్ బాబు’’..‘‘ అమావాస్యకో.. పున్నానికో మొసల్లనుంచి ఇలా తప్పించుకుంటూ ఉంటాయి..’’.. ‘‘ నీ టైం బాగుంది ఇంపాల’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : దెయ్యం కోసం వెళితే పుర్రె కనపడింది ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ -
గుంతలో మొసలి.. జడుసుకున్న కూలీలు!
మర్పల్లి: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో షెడ్డు నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలోకి మొసలి వచ్చింది. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. బిల్కల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫాంహౌస్ ఉంది. అందులో షెడ్డు నిర్మాణం కోసం కూలీలు పిల్లర్ గుంతలు తీస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 200 కిలోల బరువున్న మొసలి ఉదయం ఓ పిల్లర్ గుంతలో కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్ శ్రీనివాస్ ఫారెస్టు అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పిల్లర్ గుంతలో ఉన్న మొసలిని పైకి తీసి తాళ్లతో బంధించారు. బంట్వారం ఫారెస్టు సెక్షన్ అధికారి ఫరీద్ ఆధ్వర్యంలో మొసలిని సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టుకు తరలించి అందులో వదిలేశారు. బిల్కల్ గ్రామ సమీపంలోని మిలిగిరిపేట్ చెరువులోంచి మొసళ్లు వస్తున్నాయని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు ఫారెస్టు అధికారులు మొసళ్లను బంధించి ప్రాజెక్టులో వదిలేశారని పేర్కొన్నారు. మొసళ్లు గ్రామాల్లోకి రాకుండా మిలిగిరిపేట్ చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి -
చిరుత వర్సెస్ మొసలి.. పైచేయి ఎవరిది?
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుత పులి. చెట్లను ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలో ఇది ఆరితేరిన జంతువు. వెంటాడి, వేటాడి ఎలాంటి జంతువునైనా నిమిషాల్లో తనకు ఆహారం చేసుకుంటుంది. అలాగే మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే. నీటిలో ఉన్నప్పుడు దాని బలం అధికంగా ఉంటుంది. మరి అలాంటి మెసలి, చిరుతకు మధ్య పోరు జరిగితే ఎలా ఉంటుంది. చిరుత వర్సెస్ మొసలి ఆహారపు వేటలో చివరకు పై చేయి మొసలిదే అయ్యింది. చిరుత ఓడి మొసలి ఆకలికి ఆహారంగా మారింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేకుంది. ఈ భయంకర వీడియోను దక్షిణాఫ్రికా వైల్డ్ ఎర్త్ సఫారి గైడ్ బుసాని మ్థాలీ.. అండ్ బియాండ్ ఫిండా ప్రైవేట్ గేమ్ రిజర్వ్ వద్ద తీశారు. చదవండి: జంతు ప్రేమికులకు గుడ్‌న్యూస్ ఈ వీడియోలో దాహంతో చిరుత నీటిని తాగేందుకు సమీపంలోని ఓ నీటి కుంట వద్దకు వచ్చింది. అయితే అప్పటికే ఆ నీటి లోపల 13 అడుగుల పొడవైన నైలు మొసలి దాక్కొని ఉంది. దానిని గమనించని చిరుత నీటిని తాగుతుండగా ఒక్కసారిగా మొసలి బయటకి వచ్చి తన నోటితో చిరుత మెడను కరుచుకొని ఆమాంతం నీటిలోకి లాక్కెళ్లింది. కొన్ని క్షణాల్లోనే చిరుత మొసలి మెరుపు దాడికి బలైంది. చూడటానికి భయంకరంగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది వీక్షించారు. కాగా ఆఫ్రికా ఖండంలో నైల్ మొసళ్లను అతి పెద్ద మొసలి జాతిగా పరిగణిస్తారు. చాలా శక్తివంతమైన కాటుతో వీటి దాడి భయంకరంగా ఉంటుంది. చదవండి: పాపం.. మొసలి అతని సరదా తీర్చేసింది -
కొడుకు మరణవార్తతో తల్లి ఆకస్మిక మృతి
సాక్షి, మక్తల్ : కొడుకు మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఆ తల్లి గుండెపోటుతో మృత్యువాత పడిన సంఘటన మక్తల్ మండలం చందాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ బీరప్ప(35) రెండురోజుల క్రితం కిందపడటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఈ మరణ వార్త విన్న బీరప్ప తల్లి లక్ష్మమ్మ(75) కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. అయితే బీరప్పకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకువచ్చి గ్రామ శివారులో కుటుంబసభ్యులు దూరంగా ఉండగా ఖననం చేశారు. ఇంటి దగ్గర తల్లి శవం ఉండగానే కొడుకుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మకు ముగ్గురు కుమారులు కాగా బీరప్ప పెద్దవాడు. బీరప్పకు భార్య నర్సమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చదవండి: మీ స్థాయి ఎంత.. మీ లెక్కెంత..? నీటిసంపులో పడి బాలుడు.. పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్): మండలంలోని పెద్ద కారుపాముల చెందిన కృష్ణయ్య, యాదమ్మ దంపతుల కుమారుడు సుశాంత్ (3) శనివారం ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడ్డాడు. కాగా చాలాసేపటి తర్వాత గుర్తించడంతో అప్పటికి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చెరువులో మొసలి కలకలం మాగనూర్ (మక్తల్): మండలంలోని అమ్మపల్లి పెద్ద చెరువులో మొసలి కలకలం సృష్టించింది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనుల కోసం చెరువు పక్కకు వెళ్తుండగా గట్టుపైకి మొసలి వస్తుందని రైతులు తెలిపారు. ఫారెస్టు అధికారులు వచ్చి మొసలిని వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
గుడిలోకి మొసలి, పూజరి వినతితో వెనకకు
తిరువనంతపురం: ఉత్తర కేరళలోని కాసరగోడ్‌లో ఉన్న శ్రీ అనంతపుర ఆలయ ప్రాంగణంలోకి ఒక పెద్ద మొసలి ప్రవేశించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గుడిలో ఉన్న పూజరి తిరిగి దానిని నీటిలోకి వెళ్లమని కోరగా... అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. చాలా ఏళ్ల నుంచి ఆలయంలో ఉన్న సరస్సులో బాబియా అనే ఒక మొసలి ఉంటుంది. అది శాఖాహారి. ప్రతి రోజు పూజరి దానికి రెండు పూటల ప్రసాదాన్ని ఆహారంగా అందిస్తారు. సరస్సు దగ్గరకు వెళ్లి పిలవగానే మొసలి పైకి వచ్చి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని ఆరగిస్తూ ఉంటుంది. ఆ మొసలి అక్కడి సరసులోకి ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ చాలా రోజుల నుంచి ఎవరికి హాని చేయకుండా అక్కడే ఉంటుంది .అయితే మొదటిసారి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిందని పూజరి తెలిపారు. అలా వచ్చిన దాన్ని తిరిగి వెళ్లిపోవాలని ఆలయ ప్రధాన అర్చకుడు చంద్రప్రకాష్ నంబిసన్ ఆదేశించారు. అంతే.. మొసలి కిమ్మనకుండా అక్కడ నుంచివెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మొసలి గర్భగుడిలోకి ప్రవేశించిందని ప్రచారం జరుగుతుందని అది వాస్తవం కాదని ప్రధాన అర్చకులు తెలిపారు. ఇక బాబియా ఎప్పుడు క్రూరంగా ప్రవర్తించలేదని అక్కడి వారు తెలుపుతున్నారు. చదవండి: భర్తను సజీవ దహనం చేసిన భార్య -
13 అడుగుల మొసలిని కామ్‌గా తొలగించాడు
-
వైరల్ వీడియో.. స్మూత్‌గా తప్పించాడు
కాన్బెర్రా: సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే జంతువులకు ఆదేశాలు జారీ చేయగలం. ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటాం కాబట్టి మనం కమ్, సిట్, గో అంటూ ఆదేశాలు జారీ చేస్తే.. చెప్పినట్లు వింటాయి. కానీ ఇదే ఆదేశాలను మొసలికి జారీ చేయగలరా.. అది కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఆస్ట్రేలియాకు చెందిన రాంగ్లర్ మాట్ రైట్ మాత్రం ఇలాంటి పనులను చాలా అలవోకగా చేయగలడు. ఆ వీడియోలను మనకు చూపించగలడు. రాంగ్లర్ 13 అడుగుల భారీ మొసలిని బుజ్జగిస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివరాలు.. రైట్ ఆస్ట్రేలియా ఉత్తర భూభాగంలోని ఒక నది మార్గాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మొసలి అతడిని సమీపించింది. వేటడానికి రెడీగా దవడలను విశాలంగా తెరిచి రైట్ వైపు రాసాగింది. ఆ సమయంలో అతడు కాక అక్కడ వేరే ఎవరు ఉన్నా ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగు తీసేవారు. (చదవండి: తాబేలుతో అంత వీజీ కాదు!) కానీ మాట్ రైట్ మాత్రం మొసలిని సరదాగా మార్చడానికి ప్రయత్నించాడు. బోన్క్రంచర్ అనే మొసలిని కూర్చొండి.. వెళ్లండి.. ఉండండి అంటూ బుజ్జగించాడు. అలా దాన్ని మాటల్లో పెట్టి నెమ్మదిగా మొసలి ముక్కు పట్టుకుని దాన్ని స్మూత్‌గా తన మార్గం నుంచి పక్కకు తప్పిస్తాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడయో తీసిన రైట్ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మూడు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈవీడియోను ఇప్పటికే 1.8లక్షల మంది వీక్షించారు. ‘కుక్కపిల్లలాగే మొసలితో మాట్లాడుతున్నాడు.. సూపర్’ అని కొందరు కామెంట్ చేయగా.. మరి కొందరు మాత్రం ‘ప్రమాదకరమైన స్టంట్.. పర్యాటకులు దీనిని అనుకరించే ప్రమాదం ఉంది’ అంటూ విమర్శించారు. ఇక రైట్ ఒక న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘నాకు చాలా సంవత్సరాలుగా బోన్ క్రంచెర్ తెలుసు. అది చాలా ప్రశాంతమైనది. ఏళ్లుగా నాకు దానితో ఎంతో సంబంధం ఉంది. కానీ జనాలు దీన్ని ఉదాహరణగా తీసుకుని అనుకరించే ప్రయత్నం చేయకూడదు’ అన్నారు. -
తాబేలుతో అంత వీజీ కాదు!
న్యూయార్క్ : ఎంతటి బలవంతులైనా అన్ని విషయాల్లో విజయం సాధించటం అన్నది సాధ్యపడదు. కొన్నికొన్ని సార్లు సృష్టిలోపాల కారణంగా ఓటమి పాలుకాక తప్పదు. అలాంటి పరస్థితే ఎదురైంది ఓ మొసలికి. మామూలుగా మొసలి నోట చిక్కిన ఏ జీవికైనా మరణం 99 శాతం ఖాయమైనట్లే. కానీ, ఓ తాబేలు మాత్రం చావు(మొసలి)నోట్లోకెళ్లి బయటకు వచ్చేసింది. చాలా కాలం క్రితం అమెరికాలోని సౌత్ కరోలినా.. హిల్టన్ హెడ్ ఐలాండ్‌లోని ఓ ఇంటి వెనుక భాగంలో ఓ మొసలి తాబేలును నోట కరుచుకుంది. ( దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు ) దాన్ని కొరికి మింగేయటానికి ప్రయత్నించింది. కానీ, తాబేలు పైడిప్ప గట్టిగా ఉండటం వల్ల జారిపోసాగింది. దానికి తోడు మొసలి పళ్ల మధ్య పడి అది కొద్దిగా సేఫ్ అవుతూ వచ్చింది. అటువైపు, ఇటువైపు జారి చివరకు దాన్నుంచి తప్పించుకుంది. మొసలి కూడా దాన్ని పట్టుకుని తినే ఓపిక లేనట్లు వదిలేసింది. తాబేలు బ్రతుకు జీవుడా అంటూ అక్కడినుంచి తుర్రుమంది. 2017 ప్రాంతానికి చెందిన ఈ వీడియోను ఐఆర్ఎస్ అధికారి నవీద్ త్రుంబు తాజాగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ( కూతురి బర్త్‌డే: ఆ తండ్రి కోరిక ఇదే! ) Thick skin and a strong mind are essential if you want to survive in this world. Nobody can break you down if you don't let them. -Unknown pic.twitter.com/NePsZm5REq — Naveed Trumboo IRS (@NaveedIRS) September 15, 2020 -
పాతబస్తీలో మొసళ్ల కలకలం
-
హైదరాబాద్ వర్షాలు: కొట్టుకొచ్చిన మొసళ్లు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని పురానాపూల్‌లో మొసళ్లు కనిపించడంతో కలకలం రేగింది. గడిచిన రెండు రోజులుగా రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న కురిసిన భారీ వర్షానికి రెండు మొసళ్లు కొట్టుకొచ్చాయి. స్థానికులు వన్యప్రాణి సంరక్షణా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, నెహ్రూ జూపార్క్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని బంధించే పనిలో నిమగ్నమయ్యారు. హిమాయత్ సాగర్ నుంచి వరద నీటిలో ఈ మొసళ్లు కొట్టుకొచ్చినట్టు అధికారులు భావిస్తన్నారు. ఇక భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం తడిసిముద్దవుతోంది. చెరువు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. (చదవండి: జాగ్రత్త! నీ చెయ్యి చికెన్ పీస్ అయిపోద్ది) -
జాగ్రత్త! నీ చెయ్యి చికెన్ పీస్ అయిపోద్ది
క్రూర జంతువులతో చెలిమి ఎప్పటికైనా ప్రాణాల మీదకు తెస్తుందన్నది చాలా సందర్భాల్లో రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా పెంపుడు క్రూరమృగాల చేతిలో మృత్యువాతపడ్డవారు అనేకం. మనం జాగ్రత్తగా లేకపోతే కొన్ని కొన్ని సార్లు సాధు జంతువులైన కుక్కలు, ఎద్దులు, బర్రెలు తదితరాలు మన పాలిట యమపాశమవుతాయి. అలాంటిది మొసలి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా శరీరానికి తూట్లు పడతాయి.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. క్రిస్టోఫర్ జిలెట్ అనే వైల్డ్‌లైఫ్ బయోలజిస్టు ప్రమాదం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వీడియో మోజులో పడి, సెవెన్ అనే పొడవైన మొసలికి అతి దగ్గరగా వెళ్లాడు. చేత్తో చికెన్ ముక్క తినిపించాలని చూశాడు. అయితే మొసలి దాన్ని పట్టుకోలేక కిందపడేసుకుంది. అవమానంగా ఫీలైందో ఏమో.. వెంటనే నీళ్లలోకి వెళ్లిపోయింది. క్రిస్టోఫర్ మాత్రం నీళ్లలో ఉన్న దానికి చికెన్ ముక్క పెట్టే ప్రయత్నాన్ని మానలేదు. ( అర్ధరాత్రి నడి రోడ్డులో మొసలి కలకలం ) దీనిపై క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. ‘‘సెవెన్ చికెన్ ముక్కను పట్టుకోలేక కిందపడేసుకోవటం, ఇబ్బందిగా ఫీలై నీళ్లలోకి వెళ్లిపోవటం చాలా క్యూట్‌గా ఉంది. సెవెన్‌కు చికెన్ తినిపించి ఓ చక్కటి వీడియో తీద్దామనుకున్నాం. కానీ, అది కాస్తా క్యూట్ వీడియోగా మారింది’’ అని పేర్కొన్నాడు. ఆగస్టు 28వ తేదీన పోస్టయిన ఈ వీడియో ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘మొసలి అలిగింది! బుంగమూతి పెట్టింది.. చికెన్ ముక్కను పట్టుకోలేకపోయినందుకు సెవెన్ బాధపడుతున్నాడు. ఎందుకంటే అక్కడంతా ఇసుక ఉంది కాబట్టి.. వీడియో నిజంగానే చాలా క్యూట్‌గా ఉంది’’ అంటూ కొంతమంది. ‘‘ సెవెన్‌తో గెమ్స్ వద్దు! శాల్తీలు లేచిపోతాయి.. జాగ్రత్త! నీ చెయ్యి చికెన్ పీస్ అయిపోద్ది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram How cute is Seven fumbling the chicken and getting embarrassed 🥺! He’s so adorable, @gabbynikolle and I were feeding him and trying to make a cool impressive video with the big gator and instead it became an adorable one 😂 At @evergladesholidaypark This video is from last year but has recently gained popularity! You’ll notice Seven is green in this video, that’s just an algae accumulation from the pump being broken that week, it’s totally normal and does not affect the gators in any way. They have it in the wild all the time. But it does bring up the point, there are actually NO GREEN GATORS!! even though they’re portrayed green in every cartoon and animation, they do not have green skin! Black, gray, yellows, oranges in their patterns, but no green. The only green you’ll see is from algae like this. #Gator#Alligator#Florida#SouthFlorida#Everglades#Glades#Miami#FortLauderdale#biggator #animals #reptiles #cuteanimals A post shared by Christopher Gillette (@gatorboys_chris) on Aug 28, 2020 at 9:31am PDT -
అర్ధరాత్రి నడి రోడ్డులో మొసలి కలకలం
కర్ణాటక,బళ్లారి టౌన్: నగరంలోని సెకండ్ రైల్వే గేట్ వద్ద ఆదివారం రాత్రి ఓ మొసలి నడిరోడ్డు పైకి వచ్చి కలకలం సృష్టించింది. స్థానికంగా ఉంటున్న కాంగ్రెస్ నేత మోహన్‌బాబు ఆ సమయంలో తన కారులో వెళుతుండగా రోడ్డుపై మొసలి కనిపించింది. దీంతో కారును ఆపి కొద్ది సేపు అది దూరంగా వెళ్లేంత వరకు అలాగే ఉండి వెళ్లి పోయారు. కాగా ఇదే ప్రాంతంలో జూ కూడా ఉంది. అందులో నుంచి ఏమైనా తప్పించుకొని వచ్చి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా మొసలి ఒక్కసారిగా నడి రోడ్డుపైకి రావడం ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేసింది. -
వైరల్: పొలాల్లో ఏడడుగుల మొసలి
అహ్మదాబాద్: సాధారణంగా మొసళ్లు నదులు, పెద్ద చెరువుల్లో సంచరిస్తాయి. కానీ, గుజరాత్ వడోదరలోని ఓ గ్రామంలో మాత్రం పంట పొలాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా వడోదరాలో కేలన్పూర్ గ్రామంలోని పంట పొలాల్లోకి ఏడు అడుగుల మొసలి కనిపించింది. దాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అదించారు. మొసళ్లను పట్టే ఫారెస్ట్ రెస్క్యూ బృందం కేలన్పూర్కు చేరుకొని మొసలిని పట్టుకున్నారు. చాలా శ్రమపడి ఎట్టకేలకు రెస్క్యూ బృందం మొసలిని పట్టుకొని బంధించి గుజరాత్ ఆటవీశాఖ ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘మై వడోదరా’ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (బ్రిటన్‌లో మరో జార్జ్ ఫ్లాయిడ్!) A crocodile was rescued by wildlife rescuers from Kelanpur. Crocodile was handed over to Forest dept.#vadodara #wildlife pic.twitter.com/r9MDkrw9Ex — My Vadodara (@MyVadodara) July 18, 2020 ‘తమ గ్రామంలోని పంట పొలాల్లో మొసలి సంచరిస్తోందని కేలన్పూర్ గ్రామస్తులు మాకు ఫోన్ ద్వారా సమాచారం అందిచారు. వెంటనే మేము ఆ ప్రదేశానికి చేరుకొని మొసలిని పట్టుకొని గుజరాత్ ఆటవీ శాఖ జంతసంరక్షణ కేంద్రానికి తరలించాము’ అని రెస్క్యూ టీంలోని ఓ వ్యక్తి తెలిపారు. అదే విధంగా ఈ గ్రామంలో మొసలిని పట్టుకోవటం ఇది ఏడోసారి అని చెప్పారు. ఇక జంతువులను పట్టుకునే క్రమంలో జాగ్రత్తలు పాటిస్తాము. తగిన భద్రలు చర్యలు తీసుకుంటాము. మేము జంతువులకు సాయం చేస్తున్నామని వాటికి తెలియదు. అందుకే తమపై దాడి చేయానికి ప్రయత్నిస్తాయని పేర్కొన్నారు. -
ఈ ఫొటోలో ఉన్న జంతువును గుర్తుపట్టారా?
జైపూర్: ఈ జంతువును గుర్తు పట్టారా? అంటూ ఓ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లంతా ఇది ఏ జంతువో తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. రాజస్థాన్‌లో తీసిన ఈ ఫొటోను ఐఏఎస్ అధికారి సోనీ ఇటీవల తన ట్విటర్లో షేర్ చేశారు. దీనికి ‘ఈ ఫొటోలో ఉన్న జంతువును గుర్తుపట్టగలరా! ప్రకృతి అద్భుతమైనది, బాహుముఖ కళాఖండమని మీరు ఒప్పుకోక తప్పదు’ అంటూ ట్వీట్ చేశారు. (జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్) So dear friends, Can you identify what is this in photo ??? 😊 You must appreciate that #Nature is the finest, biggest and most versatile artist. Nature nurtures! pic.twitter.com/0JgFiLhfQU — Dr. JK Soni, IAS (@Jksoniias) June 25, 2020 ఫొటోలో ప్రింటేడ్ బెడ్‌షీట్‌తో కప్పబడినట్లు ఉండి రెండు కళ్లు బయటకు కనిపిస్తుండంతో అది గూడ్లగుబ అయుంటుందేమోనని నెటిజన్లంతా అభిప్రాయపడ్డారు. అయితే ‘అది గూడ్లగుబ కాదని క్రాప్ చేసిన మొసలి ఫొటో’ అంటూ ఆయన మరో ట్వీట్లో వెల్లడించారు. ‘‘ఈ ఫొటో రాజస్థాన్‌లోని కంబాల్ నది వద్ద తీసింది. అక్కడ 7 మొసళ్లు దాదాపు 1 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని, అందులో ఒక మొసలిని జూమ్ తీయగా ఇలా వచ్చింది’’ అని చెప్పారు. దీంతో నెటిజన్లు ‘ప్రకృతి నిజంగా అద్భుతమైనది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
సింహాల వల్ల కాలేదు: చిరుతలు సాధించాయి!
న్యూఢిల్లీ : ‘నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు.. బైట కుక్క చేత భంగ పడును’ అన్న పద్యం కచ్చితంగా వినే ఉంటాము. నీళ్లలో ఉన్నప్పుడు మొసలి శక్తి ఏనుగును సైతం చంపేలా ఉంటుందని, బైటి కొచ్చినపుడు కుక్క కూడా దాంతో ఓ ఆట ఆడుకుంటుందని దానర్థం. అయితే కొన్ని కొన్నిసార్లు నీళ్లలో ఉన్నప్పుడు కూడా మొసలి ప్రాణాలకు భరోసా ఉండదు. చిరుత పులి ప్లాన్ వేసి నీళ్లలోకి దూకిందంటే మొసలి ఖతం కాక తప్పదు. ( 1100 కి.మీ. ప్రయాణించిన మొసలి) సింహాల గుంపుకు సాధ్యంకాని పనిని కూడా చిరుత పులులు ఈజీగా చేసేస్తాయి. చిరుత పులులు మొసళ్లను వేటాడిన పాత వీడియో సమూహం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్ట్ ఫర్ నేచర్ లవర్స్ అనే ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. -
1100 కి.మీ. ప్రయాణించిన మొసలి
కోల్‌కతా: లాక్డౌన్ వల్ల వలస కార్మికులు వందలాది కిలోమీటర్లు నడుస్తూ సొంతగూటికి చేరుకుంటున్నారు. అయితే ఓ మొసలి కూడా ఏకంగా రాష్ట్రాలనే దాటుతూ పయనించింది, కానీ స్వదేశం నుంచి వలస వస్తూ మన దేశంలో అడుగుపెట్టింది. దీని విశేషమేంటో ఓసారి చూసేద్దాం.. ఈ మొసలి ఘరియల్ జాతికి చెందినది. ఈ జాతి మొసళ్లు ఇప్పటికే అంతరించిపోతున్న జీవాల జాబితాలో ఉన్నాయి. ఇవి కేవలం చేపలను మాత్రమే ఆహారంగా భుజిస్తాయి. అందుకనుగుణంగా వీటి నోటి భాగం కూడా పొడవుగా ఉంటుంది. ఈ ఘరియల్ మొసలిని నేపాల్ దేశం అడవిలో విడిచిపెట్టింది. (వామ్మో.. మొసలి) అది అక్కడనుంచి నదుల్లో పాక్కుంటూ 1100 కి.మీ. ప్రయాణించి పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదికి చేరుకుంది. ఇక్కడికి చేరుకోడానికి ఘరియల్‌కు 61 రోజుల సమయం పట్టింది. దాని శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా దీన్ని నేపాల్‌కు చెందినదిగా భారత శాస్త్రజ్ఞులు గుర్తించారు. దీని గురించి తెలియజేస్తూ 'వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఇండియా' ఘరియల్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీని యాత్ర కథ తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. "ఈ ప్రయాణానికి పుల్‌స్టాప్ పడిందా? లేదా యాత్ర కొనసాగుతుందా?" అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలోనూ ఓ ఘరియల్ 234 రోజుల్లో వెయ్యి కి.మీ చుట్టేసి ఔరా అనిపించింది. (లాక్డౌన్ తొలగిస్తే ఇలాగే పరిగెడతారేమో!) You may be under #lockdown but this #gharial travelled 1100km from #Nepal to Hooghly! Read more here: https://t.co/JDHETRRhhv #CriticallyEndangered #savingspecies@vivek4wild @LAZoo pic.twitter.com/rdbHntRShM — Wildlife Trust India (@wti_org_india) May 25, 2020 -
లాక్డౌన్ తొలగిస్తే ఇలాగే పరిగెడతారేమో!
ఢిల్లీ : కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మార్చి 25 నుంచి అమల్లో ఉన్న లాక్డౌన్ మే 17వరకు కొనసాగనుంది. కాగా ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేస్తే ప్రజలు ఏ విధంగా ఉరుకులు పరుగులు పెడతారనేది ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో ఒక వీడియో ద్వారా చూపించారు. ఆ వీడియోలో ఒక ముసలి మొదట నీటిలో మెల్లిగా సంచరిస్తూ కదులుతుంది. తర్వతా కొద్దిసేపటికే వెనుక నుంచి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా మొసలి తన ప్రమేయం లేకుండానే వేగంగా వెళ్లి పెద్ద నీటి మడుగులో పడింది. పర్వీన్ ఈ వీడియోను లాక్డౌన్ కు లింక్ చేస్తూ ఒక క్యాప్షన్ జత చేశారు.' లాక్డౌన్ పూర్తైతే జనం కూడా మొసలి లాగే పరుగులు పెడతారేమో' అంటూ పేర్కొన్నారు. కాగా మొరాకోలోని ఒక జూలో మొసలి సంచరిస్తున్నప్పుడు ఈ వీడియో తీశారు. (వైరల్ : ఇది నిజంగా ఊహించని దాడి) లాక్డౌన్ పుణ్యమా అని ప్రతీ ఒక్క వ్యక్తి సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తున్నాడు. కానీ ఒక్కసారి లాక్డౌన్ ఎత్తేస్తే పరిస్థితి నీటిలో ఉన్న మొసలిలానే తయారవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం. పర్వీన్ కశ్వాన్ షేర్ చేసిన ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోనూ 33వేలకు పైగా వీక్షించారు.' పర్వీన్ కశ్వాన్.. లాక్‌డౌన్‌ను ఉద్దేశిస్తూ మీరు లింక్ చేసిన వీడియో చాలా బాగుంది'.. 'లాక్డౌన్ పూర్తయ్యాక కూడా మాస్క్‌లు పెట్టుకోండి'..'లాక్డౌన్ తర్వాత షాపింగ్ మాల్లో మాత్రం పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ' నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్‌పై దేశద్రోహం కేసు) -
‘ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మొసలి’
సాధారణంగా అరుదుగా కనిపించే ఓ అతి పెద్ద మమొసలి రోడ్డు సమీపంలో తిరుగుతూ కనిపించింది. ఫ్లోరిడాలోని కోలియర్ కౌంటీ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం అంతర్జాతీయ రహదారి 75 పక్కన ఉన్న ఆర్మీ కంచె వద్ద మొసలి చక్కర్లు కొడుతూ స్థానికంగా ఉన్న సైనికులను ఆశ్చర్యానికి గురిచేసింది. కంచెకు ఆనుకొని మోసలి సంచరిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దాదాపు 7వేల మంది దీన్ని వీక్షించారు. (టీవీ నటుల ఛాలెంజ్.. నెటిజన్ల మండిపాటు) Troopers met this large🐊on Alligator Alley in Collier County this morning! Way to atleast stay in the grass shoulder and out of the travel lanes! pic.twitter.com/L9SsC63mDI — FHP SWFL (@FHPSWFL) April 26, 2020 ‘కోలియర్ కంటి సమీపంలో ఈ అలిగేటర్ కనిపించింది. రోడ్డుపై వాహనాలకు అడ్డురాకుండా గడ్డిలో వెళ్లుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తోంది.’ అంటూ అధికారులు మొసలి వీడియోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన అనేక మంది మోసలిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. మొసలి భారీ స్థాయిలో ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఫ్లోరిడా అధికారులు మోసళ్లను వెతకాలని పౌరులను హెచ్చరించారు. ‘ఇది మోసళ్లకు సంభోగం కాలం. ఈ సమయంలో అవి చాలా చురుకుగా ఉంటాయి’ అని తెలిపిన అధికారులు తొమ్మిది అడుగుల పొడవైన మోసలి ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.(నేను అతన్ని ప్రేమిస్తున్నాను: హీరోయిన్) -
మొసలికి ఊపిరాడకుండా చేసి..
హరారే : తల్లికి తన బిడ్డలే సర్వస్వం. అలాంటిది వారి జోలికొస్తే అది మనుషులైనా, జంతువులైనా లెక్క చేయకుండా పోరాడేందుకు సై అంటుంది. ఓ తల్లి కూడా అదే పని చేసింది. తన కూతురును పొట్టన పెట్టుకోవాలని చూసిన మొసలితో పోరాడి బిడ్డను కాపాడుకుంది. ఈ ఘటన జింబాబ్వేలోని చిరేద్జీలో చోటు చేసుకుంది. వివరాలు.. మారినా ముసిసిన్యానా అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రూండే నదీతీరానికి వెళ్లింది. వారిని ఆడుకోమని చెప్పి చేపలు పట్టడానికి అవతలి ఒడ్డుకు పోయింది. ఇంతలో ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. అటువైపు తలతిప్పి చూడగా మొసలి తన మూడేండ్ల కొడుకు జిడియాన్పై దాడి చేస్తోంది. బాలుడి తలను నోట కరుచుకుని నీళ్లలోకి లాక్కుపోతోంది. అంతే.. ఒక్క అంగలో అక్కడికి చేరుకుని మొసలిపైకి దూకింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాని ముక్కులోకి వేళ్లు పోనిచ్చి ఊపిరాడకుండా చేసింది. (మొసలితో బాలిక పోరాటం.. కళ్లు పీకేసి) దీంతో అది నెమ్మదిగా అతడిపై పట్టు కోల్పోయి వదిలేసింది. కానీ ఆమె చేతిని బలంగా కొరికింది. మరోవైపు బాలుడికి కూడా మొహంపై గాయాలతోపాటు రక్తస్రావం అవుతుండటంతో దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లింది. బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన గురించి మారినా మాట్లాడుతూ.. "మొసలికి శ్వాస ఆడకుండా చేస్తే అది తన పట్టు కోల్పోతుంది. నేనూ అదే చేశాను. కానీ నేను నా కొడుకును రక్షించుకున్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారగా నెటిజన్లు ఆమె సాహసాన్ని అభినందిస్తున్నారు. "అందుకే తల్లి ప్రేమ గొప్పది, వెలకట్టలేనిది" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా వీరు వెళ్లిన రూండే నదిలో సుమారు 20 అడుగుల పొడవు పెరిగే మొసళ్లు నివసిస్తున్నాయి. (కరోనాపై బి 'పాజిటివ్'!) -
బాబోయ్.. చేపలకు బదులు మొసళ్లు!
సాక్షి, కూసుమంచి(ఖమ్మం): ఆహ్లాదాన్ని పంచుతూ..మత్స్యసంపదకు నిలయంగా ఉన్న పాలేరు రిజర్వాయర్ మొసళ్లకు ఆవాసంగా మారుతోంది. ఏడాది కాలంగా అప్పుడప్పుడూ మొసలి పిల్లలు నీళ్లపై తేలియాడుతూ కనిపించడం, కొన్నిసార్లు మత్స్యకారుల వలలకు చిక్కడం పరిపాటిగా మారింది. తాజాగా ఈ నెల 26వ తేదీన రిజర్వాయర్ పరిధిలోని సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ ప్రాంతంలో ఓ మత్స్యకారుడి వలకు భారీ మొసలి చిక్కడంతో ఇప్పుడు మరింత భయాందోళన నెలకొంది. పోయిన సంవత్సరం రిజర్వాయర్‌లో మొసలి పిల్లలు ప్రత్యక్షం కాగా..అవి ఇప్పుడు పెద్దవి అయ్యాయని స్థానికంగా భావిస్తున్నారు. వాటి సంతానం ఉత్పత్తి అవుతుండడంతో రిజర్వాయర్ వాటికి ఆవాసంగా మారి భవిష్యత్‌లో ప్రమాదకరంగా మారే అవకాశముందని జంకుతున్నారు. దాదాపు 50కుపైగానే పిల్ల మొసళ్లు ఉంటాయని కొందరు వాదిస్తున్నారు. తాజాగా 70కిలోల మొసలి చిక్కడంతో..ఆ స్థాయిలోనే పెద్దవి మరికొన్ని ఉంటాయని, వాటని్నంటినీ బయటకు పంపే ప్రయత్నం చేయాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. త్వరలో చేపల వేట.. పాలేరు రిజర్వాయర్‌లో ప్రతి సంవత్సం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో చేపలు, రొయ్యల వేట సాగుతుంది. ఈ సారి మార్చి మొదటి వారంలో చేపల వేట ప్రారంభం కానుంది. ఇప్పుడు రిజర్వాయర్‌లో మొసళ్లు ప్రత్యక్షం కావడం మత్స్యకారుల్లో కలకలం రేపుతోంది. సుమారు 1500 మంది మత్స్యకారులు నెలకుపైగా రిజర్వాయర్‌లో తెప్పలపై వెళుతూ చేపలు, రొయ్యలు వేటాడాల్సి ఉంటుంది. తమపై మొసళ్ల దాడి జరిగితే పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. చేపలకు బదులు అవి చిక్కితే ప్రాణాలతో చెలగాటమేనని భయపడుతున్నారు. మొసళ్లను తరలించాలి పాలేరు రిజర్వాయర్‌లో వందవరకు మొసళ్లు ఉన్నాయి. మేం త్వరలో చేపల వేటకు వెళతాం. మొసళ్లకు మా వాళ్లు భయపడుతున్నారు. గతంలో ఒక్క మొసలి కూడా ఉండేది కాదు. వాటిని పట్టి వేరేప్రాంతానికి తరలించాలని అధికారులను కోరుతున్నాం. లేకుంటే మేం వేటకు వెళ్లడం కష్టమే. – దేశబోయిన ఏడుకొండలు, మత్స్య సొసైటీ కార్యదర్శి -
ఇండోనేషియా బంపర్ ఆఫర్.. కానీ ఓ రిస్క్!
-
ఇండోనేషియా బంపర్ ఆఫర్.. కానీ ఓ రిస్క్!
జకార్తా: ఇండోనేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఓ మొసలి మెడలో ఇరుక్కున్న టైర్‌ను తీసిన సాహసవంతులకు భారీ మొత్తంలో నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే ఇందుకోసం వారు 13 అడుగుల మొసలికి ఎదురు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా ఇండోనేషియా సెంట్రల్ సులవేసిలోని ఉప్పునీటి సరస్సులో నివసిస్తున్న ఈ మొసలి మెడకు మోటర్ సైకిల్ టైర్ ఇరుక్కుంది. రోజు రోజుకు ఆ టైరు మొసలి మెడ నుంచి పొట్టమీదకు జారుతూ బిగుసుకుపోతోంది. కాగా టైరు వల్ల ఇబ్బంది పడుతున్నమొసలి ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు దానిని తీయడానికి ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించారు. అయితే ఆ ఆఫర్‌కు ఆకర్షితులైన కొంత మంది ఈ సాహసానికి పూనుకుని ముందుకు వచ్చారు. ఆ టైర్‌ను తీసేందుకు సరస్సులోకి దిగిన వారు మొసలిని ఎదుర్కొలేక వెనుతిరుగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో ఆఫర్‌ను ప్రకటించిన ప్రభుత్వ అధికారి ‘ముసలిని రక్షించడానికి వన్యప్రాణ సంరక్షణ నేపథ్యం ఉన్న వ్యక్తుల కోసం చూస్తున్నాము. ఎందుకంటే వారైతేనే ముసలిని రక్షించగలరని నా నమ్మకం. అందుకే ఎంత బహుమతి అనేది పేర్కొన లేదు. వారు అడిగినంత ఇస్తాం’ అని చెప్పారు. ఇక ముసలికి దగ్గరగా వెళ్లొద్దని.. సహజ వనరుల పరిరక్షణ సంస్థ అధికారి హస్ముని హస్మార్ హెచ్చరిస్తున్నారు. దాని జీవితానికి...ఏమాత్రం భంగం కలిగించవద్దని ప్రజలను ఆయన కోరుతున్నారు. అలాగే జంతు ప్రేమికులు కూడా దీనిపై పెద్ద ఎత్తున తమ స్పందనలను తెలుపుతున్నారు. -
చనిపోయాడనుకున్నారు.. కానీ బతికే ఉన్నాడు
సిడ్నీ : ఒక వ్యక్తి మూడు వారాల పాటు ఎవరికి కనిపించకుండాపోవడంతో అందరూ అతను చనిపోయాడనే భావించారు. కానీ హఠాత్తుగా ఆ వ్యక్తి బతికేఉన్నాడన్న వార్త విని చాలా సంతోషించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆస్ట్రేలియాకి చెందిన లెమిక్ అనే వ్యక్తి క్వీన్స్‌లాండ్‌లోని డైంట్రీ అటవీప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు డిసెంబర్ 22న అతని వాహనం బోల్తా పడింది. అప్పటినుంచి లెమిక్ అదృశ్యమయ్యాడు.లెమిక్ అదృశ్యమైన అటవీ ప్రాంతానికి సముద్రం దగ్గరగా ఉండడంతో కొన్ని వేళ మొసళ్లు అక్కడ జీవిస్తున్నాయి. దీంతో లెమిక్ వాటికి ఆహారం అయ్యుంటాడని భావించారు. అటవీ అధికారులు అతని కోసం రెండు వారాలు గాలించినా ఫలితం లేకపోవడంతో తమ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం లెమిక్ వాహనం బోల్తా పడిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అతను బతికే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా మూడు వారాల పాటు అడవిలోనే చిక్కుకున్న లెమిక్ ఆరోగ్యం, మానసిక పరిస్థితి బాగానే ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మూడు వారాల పాటు అడవిలో ఉన్నలెమిక్ బెర్రీ, ఇతర పండ్లు తిని జీవించాడని తెలిపారు. -
హల్చల్ చేసిన భారీ మొసలి
సాక్షి, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ఓ భారీ మొసలి హల్చల్ చేసింది. వ్యవసాయపనులకు వెళుతున్న రైతులు మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలివి.. మహాదేవపూర్ మండలం పల్గుల అటవీ ప్రాంతంలోకి ఓ భారీ మొసలి వచ్చింది. మొసలి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా స్థానికులు గుర్తించి.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అతి కష్టం మీద మొసలిని బంధించి.. శివ్వారం మొసళ్ళ సంరక్షణ కేంద్రంలో వదిలారు. ఇటీవలి వర్షాలకు అన్నారం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో మొసలి కొట్టుకువచ్చినట్టు భావిస్తున్నారు. భారీగా ఉన్న మొసలిని చూసి స్థానికులు, రైతులు భయోందోళనకు గురయ్యారు. -
హల్చల్ చేసిన భారీ మొసలి
-
ఇంట్లోకి మొసలి.. హడలెత్తిన కాలనీ
కృష్ణా (మక్తల్): మండల కేంద్రంలోని ధర్మశాల ప్రాంతంలో ఓ మొసలి శక్రవారం తెల్లవారుజామున ఏకంగా ఇంట్లోకి ప్రవేశించింది. దాంతో ఆ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మశాల వీధి కృష్ణానది ఒడ్డునుంచి దాదాపు 100 అడుగుల దూరంలో ఉంటుంది. కాగా ప్రతి రోజు మాదిరిగానే అర్చకుడు గిరీష్జోషి తెల్లవారుజామున లేచి నదికి వెళ్దామని ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా ఇంటి ఆవరణలో ఓ మూలన మొసలి కనిపించింది. దీంతో ఇంట్లో వారు భయబ్రాంతులకు గురై చుట్టు ప్రక్కల జనాలను పిలిచారు. ఆ ప్రాంతంలోని వ్యక్తులు చేపలు పట్టడంలో నిష్ణాతులవడంతో ఆ మొసలిని చాకచక్యంగా పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. విషయాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దానిని వారు స్వా«దీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా, నీటిని వదిలి జనవాసాల్లోకి మొసళ్లు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
వామ్మో.. మొసలి
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం వద్ద జాతీయ రహదారి 44 పైకి పెద్ద మొసలి వచ్చింది. అప్రోచ్ రోడ్డు వంతెనపై వరకు వెళ్లి దిగువకు దిగే ప్రయత్నంలో వేలాడుతూ అలాగే ఉండి పోయింది. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీ సహాయంతో మొసలిని పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. తాళ్లతో బంధించి దూదిగాం శివారులోని గోదావరిలో వదిలేశారు. –బాల్కొండ -
మొసళ్లనూ తరలిస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: మొసలి ‘కన్నీరు’పెడుతోంది. మొసగాళ్ల వలలో మోసళ్లు చిక్కాయి. నగరం నుంచి అక్రమంగా రవాణా అవుతున్నాయి. రెండు మొసలి పిల్లల్ని ముంబైకి తరలిస్తున్న ముఠాను మహారాష్ట్రలోని బొరివలి అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ సహా ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు హైదరాబాదీలు ఉన్నారు. వివరాలు... హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొసళ్ల అక్రమ రవాణా జరుగుతున్నట్లు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఓ ప్రత్యేక బృందం బొరివలి ప్రాంతంలో మాటు వేసింది. అక్కడి వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే మీదుగా వచి్చన సదరు ప్రైవేట్ బస్సును ఆపి తనిఖీ చేసింది. డ్రైవర్ సీటు సమీపంలో కార్టన్ బాక్స్‌లో ప్యాక్ చేసిన బోనును గుర్తించి తెరిచి చూడగా అందులో రెండు ఆడ మొసలి పిల్లలున్నాయి. ఆ బాక్సును తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చారని, హైదరాబాద్ నుంచి ముంబై తీసుకువెళ్లాలంటూ రూ.1500 చెల్లించారని బస్సు డ్రైవర్ అయిన హైదరాబాద్‌వాసి మహ్మద్ అబ్దుల్ రహీం హఫీజ్ విచారణలో చెప్పాడు. అందులో కొన్ని ఔషధాలు ఉన్నాయని నమ్మబలికారని వెల్లడించాడు. అదేబస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాదీ శివాజీ బాలయ్య, కర్ణాటకకు చెందిన లతీఫ్ బేగ్ ఆపెట్టెను తీసుకువచ్చారని చెప్పాడు. దీంతో ఆ ఇద్దరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొసలిపిల్లలకు చికిత్స అధికారులు ఆ రెండు మొసలి పిల్లల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని పశువైద్యులు పరిశీలించి ఆ పిల్లల వయస్సు మూడు నెలలలోపే ఉంటుందని, ఒక్కోటి రెండు అడుగుల పొడవు ఉందని తేల్చారు. చాలాసేపు ఓ చిన్న పెట్టెలో ప్యాక్ చేయడంతో అనారోగ్యానికి గురైన మొసలి పిల్లలకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ మొసళ్లను ఎక్కడ నుంచి తీసువస్తున్నారనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. నాగార్జునసాగర్, మంజీరనది నుంచే వీటిని సేకరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటివిలువ మార్కెట్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ముంబై, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో మొసలి పిల్లలకు భారీ డిమాండ్ ఉందని సమాచారం. ప్రముఖులకు చెందిన ఫామ్‌హౌస్‌ల్లోని కొలనుల్లో మొసళ్లను పెంచుకోవడం ఇటీవల కాలంలో పెరిగింది. అధికారికంగా పెంచుకోవడానికి అనుమతి లేకపోవడంతో అక్రమ రవాణా ద్వారా సేకరిస్తుననట్లు సమాచారం. బొరివాలి వ్యవహారంపై వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) రంగంలోకి దిగనుంది. తదుపరి దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర అటవీశాఖకు చెందిన ప్రత్యేక బృందం సిటీకి రానుంది. -
మొసలి అతడ్ని గట్టిగా పట్టుకుంది.. అప్పుడు..
భువనేశ్వర్ : గుండె ధైర్యం, సమయస్పూర్తితో ఓ వ్యక్తి మృత్యు ఒడిలోంచి బయటపడగలిగాడు. ఎనిమిది అడుగుల మొసలి నోటినుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ సంఘటన ఒరిస్సాలోని కేంద్రపారా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రపారా జిల్లా మహాకల్పద ఏరియాకు చెందిన భజకృష్ణ ప్రదాన్ ఆదివారం చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ఓ ఎనిమిది అడుగుల మొసలి అతడిపైకి దూకింది. వాడైన పళ్లతో అతడ్ని ఒడిసి పట్టుకుంది. ఈ అనుకోని సంఘటనతో ప్రదాన్ మొదట షాక్‌కు గురైనా.. ఆ వెంటనే తేరుకున్నాడు. గుండె ధైర్యం, సమయస్పూర్తితో తన పక్కనే ఉన్న వెదురు కర్రతో దాని కంటిపై బాదాడు. అతడ్ని పట్టుకున్న మొసలి నొప్పి తాళలేక విడిచిపెట్టి నీటిలోకి వెళ్లిపోయింది. ప్రదాన్ బ్రతుకు జీవుడా అంటూ అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ దాడిలో ప్రదాన్ కుడి చేయికి చిన్న గాయం మాత్రమే అయ్యింది. చదవండి : వైరల్: ఎంత అలసిపోతే మాత్రం.. అప్పుడు నిద్రపోతారా? -
‘బాబోయ్ ఇది మొసలి కాదు.. రాక్షస బల్లి’!
సాధారణంగా మొసళ్లు నీటిలోంచి బయటకు వస్తే.. వాటిని చూసి భయపడి వెంటనే దూరంగా పరుగెడుతాం. కానీ ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి ఏం చేశాడో... చూస్తే నోళ్లు వెళ్లబెట్టకుండా ఉండలేరు. తన మీదకు వచ్చిన ఓ భారీ మొసలి(ఎలిగేటర్)ని చూసి భయపడి పరిగెత్తకపోగా దానికి అతి దగ్గరగా వెళ్లి దాని తోకని నిమురుతున్న వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోను షేర్ చేసి చాలా రోజులైనప్పటికీని ఇప్పటీకీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోకు టన్నుల కొద్దీ కామెంట్లు, షేర్స్ వస్తున్నాయి. ఇంతటి భారీ మొసలిని చూసిన నెటిజన్లంతా భయపడుతూ... దానిని డైనోసర్‌తో పోలుస్తున్నారు. మరికొందరు ‘గాడ్జీల్లా’లా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా భారీ మొసలిని చూసి ఆశ్చర్యపోతుంటే కొందరు నెటిజన్లు మాత్రం ‘ఇతనికి బ్రతుకు మీద ఆశ లేదా.. చావాలనుకుంటున్నాడా?’ అంటూ ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. అయితే ఇదే వ్వక్తి కొన్ని నెలల క్రితం ఇలాంటి వీడియోనే షేర్ చేశాడు. అందులో అయితే ఏకంగా మొసలి దవడలకు చిక్కేంత దగ్గరగా వెళ్లాడు. Umm nope. Nope. Nope. 🐊 🎥 (IG) @mattwright1 #travel #nature #adventure #crocodile pic.twitter.com/PlGpWpkxQG — Ryan Hodgson (@Ryanintheus) October 6, 2018 -
భారీ మొసలికి అండగా నిలిచిన బాలుడు
కాన్బెర్రా : ఓ 10 సంవత్సరాల బాలుడు 13 అడుగుల భారీ ఉప్పునీటి మొసలికి అండగా నిలిచాడు. తన మొసలి స్నేహితుడ్ని స్వేచ్ఛగా ఉన్నచోటే వదిలేయాలంటూ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రికి లేఖ రాశాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సమీపంలోని మియాలో అనే గ్రామానికి చెందిన ఎల్రాయ్ వుడ్స్ అనే 10 ఏళ్ల బాలుడికి అక్కడి చెరువులో ఉంటున్న 13 అడుగుల మొసలి ‘‘ హావర్డ్’’ అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు నీటిలో సంచరించే మొసలిని చూస్తూ ఆనందపడిపోయేవాడు. అయితే మొసలి కారణంగా అక్కడ ఉంటున్న ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భావించిన పర్యావరణ అధికారులు దాన్ని పట్టి వేరేచోట వదిలేయాలని భావించారు. ఇందుకోసం అక్కడి నీటిలో వలవేసి ఉంచారు. అధికారుల నిర్ణయంతో వుడ్స్ కలత చెందాడు. ఎలాగైనా తన మిత్రుడ్ని అది ఉంటున్న చోటే స్వేచ్ఛగా బ్రతకనివ్వాలనుకున్నాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి లీయన్నే ఎనోచ్కు లేఖ రాశాడు. ఆ లేఖలో‘‘ నా పేరు ఎల్రాయ్ వుడ్స్. నేను గత ఐదు సంవత్సరాలుగా బాంబూ క్రీక్ రోడ్లో నివాసముంటున్నాను. హావర్డ్(మొసలి) అంటే నాకు ఎంతో ఇష్టం. అక్కడి బ్రిడ్జి మీద నుంచి నీటిలో ఈదుతున్న దాన్ని చూడటమంటే ఎంతో సరదా. మీరు హావర్డ్ను పట్టకుండా అదున్న చోటే వదిలేయండి’’ అంటూ వేడుకున్నాడు. దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా జూ అధికారులు వుడ్స్‌కు అండగా నిలిచారు. ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగి దాన్ని పట్టకుండా ఉంటామని హామీ ఇచ్చింది. -
అనకొండ, మొసలి భీకర పోరాటం..
సాక్షి, న్యూఢిల్లీ : బ్రెజిల్ దక్షిణ ప్రాంతంలోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో కార్చిచ్చు రగులుకుందంటూ ఇటీవల వచ్చిన వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ దావానలాన్ని కవర్ చేయడానికి వెళ్లాడేమోగానీ ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ కేవిన్ డూలే (58) ఇటీవల అమెజాన్ అడవిలో పెంటానల్ వద్ద మొసళ్ల మడుగు పక్కన కూర్చొని భోంచేస్తున్నారు. ఇంతలో ఆ మడుగు నుంచి భారీ శబ్దం వచ్చింది. అటు తల తిప్పి చూడగా ఓ భారీ అనకొండ, ఓ మొసలి భీకరంగా పోరాడుతూ కనిపించాయి. డూలే వెంటనే భోజనం తినడం ఆపేసి.. ఆ జంతువుల భీకర పోరాటాన్ని కెమేరాలో బంధించేందుకు ప్రయత్నించారు. పసుపు పచ్చ శరీరంపై నల్లటి చారికలు గల అనకొండ ఏకంగా 28 అడుగుల పొడవు ఉందట. సాధారణంగా ఆ అడవిలో ఆ ప్రాంతంలో అనకొండలు 30 అడుగుల వరకు పొడగు ఉంటాయట. వాటి బరువు 250 కిలోల వరకు ఉంటుందట. నీటిలో ఆ రెండు జంతువులు కూడా చాల బలమైనవే. మొసలిని చుట్టిన అనకొండ నీటిలో మెలికలు తిరిగుతూ మొసలి రెండు కాళ్లను బలంగా విరిచివేసింది. దాంతో ఒక్కసారిగా కోపం, బాధతో మెలికలు తిరిగిపోయిన మొసలు ఒక్కసారి అనకొండ మెడ అందిపుచ్చుకొని కొరికిందట. అయినా లాభం లేకపోయింది. అనతికాలంలోనే మొసలి చనిపోయింది. ఎనిమిది నిమిషాల సేపు కొనసాగిన ఈ భీకర పోరాటంలో అనకొండ గెలిచినప్పటికీ అలసిపోయి నీటిలో మునిగిపోయిందని ఫొటోగ్రాఫర్ డూలే తెలిపారు. తన వృత్తిలో ఇలా అనకొండ, మొసలి పోరాటాలను ఒకటి, రెండు సార్లు మాత్రమే చూశానని, ఈసారి తనకు అదష్టం కలిసి రావడం వల్ల అతి దగ్గరి నుంచి ఆ దశ్యాలను చూడడమే కాకుండా తన కెమేరాలో ఆ దృశ్యాలను బంధించగలిగానని డూలే మీడియాకు వివరించారు. ఇంతకు ఈ రెండు జంతువుల్లో ఏదీ ముందుగా దాడి చేసిందని ప్రశ్నించగా, తాను చూసేటప్పటికే వాటి మధ్యం భీకర పోరాటం ప్రారంభమైందని, మొసలి రెండు కాళ్లను అనకొండ ముందుగానే విరిచేసినందువల్ల మొసలే అనకొండపై ముందుగా దాడి చేసి ఉంటుందని ఆయన చెప్పారు. సాధారణంగా అనకొండలు తాను వేటాడాలనుకొన్న జంతువు, ఊపిరాడకుండా తన శరీరంతో భిగించి చంపేస్తుందని, ఆ తర్వాత దాని భాగాలను నమిలి విరిచేస్తుందని ఆయన అన్నారు. ఇక్కడ మొసలిని ఊపిరాడకుండా నలిపేసి చంపడం కన్నా ముందే దాన్ని కాళ్లను, ఆ తర్వాత చేతులను విరిచేసిందంటే కచ్చితంగా మొసలే ముందుగా దాడి చేసి ఉంటుందని ఆయన అన్నారు. సాధారణంగా పందులు, జింకలు, చేపలతోపాటు చిన్న చిన్న జంతువులను తినే అనకొండలు అప్పడప్పుడు మొసళ్లను తింటాయట. -
నా నోటికి చిక్కిన దేన్ని వదలను
అనుకోకుండా మొసలి నోటికి ఏదైనా చిక్కితే వదలదు. అలాంటిది కావాలనే మొసలి నోట్లోకి విసిరితే ఇక అది వదులుతుందా. అస్సలు వదలదు. ఇలాంటి దృశ్యమే ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఓ మొసలి తన దవడలతో ఒక్క దెబ్బతో పుచ్చకాయను అమాంతం రెండు ముక్కలు చేసింది. ఈ విడియోను గత గురువారం ఫ్లోరిడాకు చెందిన సెయింట్ ఆగస్టిన్ ఎలిగేటర్ ఫార్మ్ జులాజికల్ పార్క్ షేర్ చేసింది. ఇందులో ఓ వ్యక్తి పుచ్చకాయను నేరుగా మొసలి నోట్లోకి విసరగా, వెంటనే మొసలి దాన్ని అందుకొని తన పదునైన దవడలతో రెండు ముక్కలుగా చేసింది. వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే కొన్ని వేలమంది నెటజన్లు చూడగా ‘అయ్యో! నేను(మొసలి) శాఖాహారిని కాదు‘, ‘ నా నోటికి అందిన దేనని వదలను’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఇంటి పైకప్పుపై మొసలి.. వైరల్ వీడియో!
బెంగళూరు: వర్షాలు పడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో నివసించే ప్రమాదకరమైన జలచరాలు మనుషుల మధ్యకు వచ్చి హల్చల్ చేస్తున్నాయి. మొన్నామధ్య వడోదర నగరంలోని వీధుల్లో మొసళ్లు యధేచ్ఛగా విహరించిన సంగతి తెలిసిందే. వీధుల్లో తిష్టవేసిన మొసళ్లను తరలించడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు. ఇక, ఓ వీధిలోని నీటిలో తిష్టవేసిన మొసలి.. అక్కడే తచ్చాడుతున్న కుక్కుపై అమాంతం దాడిచేయబోయింది. కుక్కు చివరినిమిషంలో అప్రమత్తమై తప్పుకోవడంతో ప్రాణాలతో మిగిలింది. వడోదరలో జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వర్షాలతో అతాలకుతం అవుతున్న కర్ణాటకలోని బెలగావ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు బెలగావ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వీధులే కాదు ఇళ్లు సైతం వరదనీటికి మునిగిపోయాయి. దీంతో ఓ మొసలి ఇంటిపైకప్పు మీదకు చేరింది. బెలగావ్‌లోని రాయ్‌బాగ్ తాలూకులో ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంటు రెకులతో కట్టిన ఇంటి పైకప్పు మీదకు చేరిన మొసలి నోరు తెరుచుకొని కాలక్షేపం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటిపైకప్పు వరకు చేరిన వరదనీళ్లను ఈ వీడియోలో చూడొచ్చు. చదవండి: మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే! -
మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!
-
మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!
దండిగా వర్షాలు పడ్డాయి. వీధులు చెరువులుగా మారాయి. భారీ వర్షాలతో గుజరాత్‌లోని వడోదరా పట్టణం ఇప్పుడు అతలాకుతలం అవుతోంది. వీధుల్లో వరదనీరు వచ్చి చేరడంతో పట్టణంలోని చాలా వీధులు చెరువుల్ని తలపిస్తున్నాయి. చుట్టూ చేరిన నీరుతో బయటకు వెళ్లలేక పట్టణవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు వరద నీళ్లో మొసళ్లు తిష్టవేశాయి. వరదనీటిలో ఎక్కడ చూసినా మొసళ్లు తిరుగుతున్నాయి. దీంతో గుండెల్ని అరచేత పట్టుకొని.. వడోదరా వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వడోదర వీధుల్లోని వరదనీటిలో మొసళ్లు తిష్టవేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియోలో వరదనీటిలో మొసలి వేట భయంగొలిపే రీతిలో ఉంది. వరదనీటిలో చేరిన మొసలి.. వరదలో బిక్కుబిక్కమంటూ ఉన్న ఓ కుక్కను మింగేయాలని చూసింది. కుక్కకు ఏమాత్రం అనుమానం కలుగకుండా మెల్లగా దానిని అనుసరిస్తూ.. దగ్గరగా వెళ్లి.. అమాంతం దాడి చేసేందుకు మొసలి ప్రయత్నించింది. అయితే, అప్రమత్తంగా ఉన్న కుక్క వెంటనే పక్కకు తొలగడంతో దాడి నుంచి తప్పించుకుంది. అక్కడే మరో కుక్క బిక్కుబిక్కుమంటూ ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
జనావాసాల్లోకి వచ్చిన మొసలి..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని దామో పట్టణంలో ఓ మొసలి జనావాసాల్లోకి రావడం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు దామో పట్టణం సమీపంలోని నది ఉప్పొంగడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొసలి రాకతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని పట్టుకున్నారు. అనంతరం దానిని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై దామో ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ పర్మ్‌లాల్ మాట్లాడుతూ.. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతోనే మొసలి పట్టణంలోకి ప్రవేశించిందని తెలిపారు. అది 10 ఫీట్లకు పైగా పొడవు ఉందని.. స్థానికులు, తమ సిబ్బంది సాయంతో దానిని జాగ్రత్తగా పట్టుకున్నామని పేర్కొన్నారు. -
మొసలికి చిప్..
ఇక్కడ కనిపిస్తున్నవి ఓ బకెట్లో ఉంచిన చిన్న చిన్న మొసలి పిల్లలు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం హోంస్టెడ్లో ఉన్న అణు విద్యుత్ కేంద్రం వద్ద మొసళ్లు చాలా ఉంటాయి. ఈ అణువిద్యుత్ కేంద్రానికి సంబంధించిన 168 మైళ్ల పొడవైన కాలువల్లో ఇవన్నీ పెరుగుతుంటాయి. వీటి ఎదుగుదలను గమనించేందుకు, వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా నిపుణులు ఉన్నారు. చిన్న మొసళ్ల శరీరంలో ఓ చిప్‌ను అమర్చి, మళ్లీ వాటిని నీళ్లలో వదిలేసి, వాటి ఆరోగ్య వివరాలను ఆ చిప్ ద్వారా తెలుసుకుంటుంటారు. పర్యావరణ మార్పులు, వేటగాళ్ల బారి నుంచి మొసళ్లను కాపాడేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. -
మొసలిని మింగిన కొండచిలువ!
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం... చూసిన వారంతా బాబోయ్! అనకుండ ఉండలేరు. కొండచిలువ మొసలికి మధ్య జరిగిన పోరాటంలో చివరికి మొసలిపై పైథాన్ గెలుపు సాధించింది. ఆలివ్ పైథాన్ మంచి నీటి మొసలితో పోరాడి చివరకు దానిని పూర్తిగా మింగేసింది. ఈ పోరాట దృశ్యాన్ని మొదటి నుంచి చివరి వరకు ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి అందులో కొన్ని ఫోటోలను జీజీ వైల్డ్ లైఫ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లంతా కామెంట్లు పెట్టకుండా ఉండలేక పోతున్నారు. ‘ఇంత భయంకరమై కొండచిలువను జూలో కూడా చూడలేదని, ఇలాంటి ఘటనను దగ్గర చూసే అవకాశం కూడా ఎప్పుడు రాలేదని’ కామెంట్లు పెట్టారు. సామాజిక మాధ్యమంలో సెన్సేషనల్‌గా మారిన ఈ ఫోటోలకు ఇప్పటివరకు 23 వేల కామెంట్లు, 48 వేల షేర్లు, 23 వేల లైక్‌లు వచ్చాయి. -
పెంపుడు మొసలి చేతిలో బలైన మహిళ
జకర్తా : సాదు జీవులైన కుక్కలను, పిల్లులను పెంచుకుంటే బాగానే ఉంటుంది. కానీ పాములు, మొసళ్లు, పులులు వంటి క్రూర మృగాలను పెంచుకుంటే చివరకూ వాటి చేతిలోనే బలి అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనే ఒకటి ఇండోనేషియాలో జరిగింది. ముద్దుగా పెంచుకుంటున్న మొసలి యాజమానురాలినే చంపేసింది. వివరాలు.. ఇండోనేషియాకు చెందిన ఓ 44 ఏళ్ల మహిళా సైంటిస్ట్ తన ఇంటిలో ఓ మొసలిని పెంచుకుంటుంది. ప్రస్తుతం దాని పొడవు 14 అడుగులు. ఎంత బాగా చూసుకున్నప్పటికి దాని అసలు స్వభావం మారదు కదా. ఫలితం ఏముంది.. పాలు పోసి పెంచిన చేతినే కాటేసిందన్నట్లు ఆ మొసలి యజమానురాలిపై దాడి చేసి క్రూరంగా చంపేసింది. మరుసటి రోజు ఉదయం మహిళ ఇంటికి వచ్చిన సహోద్యోగులకు దారుణంగా గాయపడిన సైంటిస్ట్ మృతదేహం దర్శనమిచ్చింది. మొసలి సదరు మహిళ మీద దాడి చేసి ఒక చేతిని పూర్తిగా తినేయడమే కాక.. ఆమె ఉదర భాగాన్ని కూడా గుర్తించడానికి వీలు లేనంతగా గాయపర్చింది. వెంటనే వారు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, ఆర్మీ, పోలీసులతో పాటు మరి కొంతమంది జనాల సాయంతో ఆ భారీ మొసలిని సదరు శాస్త్రవేత్త ఇంటి నుంచి జంతు పరిరక్షణ కేంద్రానికి తరలించారు. -
సత్రశాలలో మొసళ్ల సంచారం
అమరావతి ,సత్రశాల (రెంటచింతల): రెంటచింతల మండలం సత్రశాల సమీపంలో కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లో మొసళ్ల సంచారం పెరిగింది. జన సంచారం లేని సమయంలో మొసళ్లు ఒడ్డుకు చేరుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు రిజర్వాయర్ సుమా రు 1,900 హెక్టార్లలో ఉంది. ఎగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ రిజర్వాయర్‌లోకి మొసళ్లు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. -
ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్..
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపుకెళ్లి తొడ కొట్టిందట.. ఇదో సినిమాలోని డైలాగు.. సపోజ్.. ఫర్ సపోజ్.. కోడి నిజంగానే తొడకొడితే ఏమవుతుంది.. సాయంత్రానికి చికెన్ పకోడి అవుతుంది! ఇదిగో ఈ కొంగబావ కూడా ఆ కోడి టైపే.. అందుకే ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్న తెలివిడి లేకుండా.. మొసలితోనే పరాచికాలాడింది.. అయినా.. ఫ్లూటు జింక ముందు ఊదాలి.. సింహం ముందు కాదు.. ఊదితే ఏమవుతుంది.. ఇలా అవుతుంది. పరాచికాలకు దిగిన కొంగ మరు క్షణంలోనే మొసలికి పలహారమైపోయింది. ఈ ఫొటోలను కెన్యాలోని మారా నది వద్ద తీశారు. -
నరమాంస పిపాసి.. ఎట్టకేలకు దొరికింది..
సిడ్నీ : ఎనిమిదేళ్ల నిరంతర వేట అనంతరం నరమాంస పిపాసి అయిన రాకాసి ఉప్పునీటి మొసలిని ఆస్ట్రేలియా అధికారులు మంగళవారం పట్టుకున్నారు. దాదాపు 4.7 మీటర్లు(15.4 అడుగులు) పొడవున్న భారీ మొసలి 600 కిలోల బరువుంది. దీని వయసు 60 సంవత్సారాలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. క్యాథరిన్ నదిలోని బ్యాక్ వాటర్స్‌లో ఉండే ఈ మొసలి పలుమార్లు స్థానికులపై దాడులు చేసింది. ఉప్పు నీటి మొసళ్లు సాధారణంగా సైజులో భారీగానే ఉంటాయి. అయితే, క్యాథరిన్ నదిలో ఇప్పటివరకూ దొరికిన మొసళ్లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. గతేడాది ఓ పెద్దావిడపై దాడి చేసిన ఈ మొసలి తీవ్రంగా గాయపర్చింది. దీంతో ఆమె మరణించారు. అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో 1970ల్లో ఆస్ట్రేలియాలో మొసళ్లను రక్షిత జీవులుగా ప్రకటించారు. అప్పటినుంచి వీటి సంఖ్య భారీగా పెరిగింది. ఆస్ట్రేలియాలో ఏటా 250కి పైగా ఉప్పు నీటి మొసళ్లు కనీసం ఇద్దరు వ్యక్తులనైనా చంపుతున్నాయి. దీంతో వీటి సంతతిని అరికట్టడానికి అక్కడి వైల్డ్ లైఫ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా మారిన మొసళ్లను పట్టుకుని క్రోకోడైల్స్ ఫార్మ్‌లో ఉంచుతున్నారు. తాజాగా పట్టుబడ్డ రాకాసి మొసలిని కూడా అక్కడికే తరలించారు. -
మత్స్యకారులకు చిక్కిన మొసలి
కూసుమంచి : పాలేరు రిజర్వాయర్ ఒడ్డున సోమవారం పట్టుకున్న మొసలిని మత్స్యకారులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పాలేరు రిజర్వాయర్‌లో మొసళ్లు ఉన్నట్లు ఇదివరకే వెలుగులోకి వచ్చింది. కాగా సోమవారం రిజర్వాయర్ ఒడ్డున (స్మశానవాటిక సమీపంలో) నీటి మడుగులు ఉండగా.. అందులో మొసలి కదలికలను కొందరు స్థానికులు గమనించారు. దీంతో వారు అది మొసలిగా భావించి మత్స్యకారులకు సమాచారం అందించారు. వారు మడుగులో నీటిని తోడటంతో మొసలి కనబడగా.. దాన్ని వలల్లో బంధించారు. వలకు చిక్కిన మొసలి సుమారు 12 కిలోలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మొసలిని స్వాధీనం చేసుకున్నారు. కాగా రిజర్వాయర్‌లో మొసళ్లు పెద్దవి అవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. -
ఈ బ్యాగ్ ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బయటికి వెళ్తున్నామంటే భుజాన బ్యాగ్ తప్పక ఉండాల్సిందే. ఇక పార్టీలకు వెళ్లేపుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలంటే డ్రెస్‌తో పాటు ఆభరణాలు, వెంట తీసుకెళ్లే ఆక్ససరీస్ ట్రెండీగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆసియాకు చెందిన ఓ మహిళ కూడా తన వెంట తీసుకెళ్లే బ్యాగు ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. అయితే అందుకోసం ఆమె వెచ్చించిన సొమ్ము ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. హాంగ్‌కాంగ్‌లో క్రిస్టీస్ అనే సంస్థ నిర్వహించిన వేలంలో 2కోట్ల 57లక్షల రూపాయలు చెల్లించి మరీ బ్యాగును ఆమె సొంతం చేసుకున్నారు. హ్యాండ్ బ్యాగుకే అంత ధరా అని ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది ప్రఖ్యాత ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ ‘హెర్మ్స్’కు చెందిన బిర్కిన్ బ్రాండ్ బ్యాగు. హ్యాండు బ్యాగుల తయారీ కోసం ప్రత్యేకంగా మొసళ్లను పెంచి మరీ వాటి చర్మంతో బ్యాగులు, పర్సులు తయారు చేసే హెర్మ్స్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. విక్టోరియా బెక్‌హామ్ నుంచి అమెరికన్ టీవీ నటి కిమ్ కర్దాషియన్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు తమ చేతిలో ప్రఖ్యాత హెర్మ్స్ బ్రాండ్ బ్యాగు ఉండాలని పోటీ పడి వాటిని సొంతం చేసుకుంటారు. బిర్కిన్ బ్యాగు ప్రారంభ ధర 7 వేల డాలర్లకు తక్కువగా ఉండదు. ప్రస్తుతం ఆసియన్ మహిళ సొంతం చేసుకున్న బ్యాగును హిమాలయన్ నీలో మొసలి చర్మంతో తయారుచేశారు. అరుదైన 245.. 18 క్యారట్ వైట్ గోల్డ్ డైమండ్స్‌తో పొదగబడిన లాక్‌తో రూపొందిన గ్రేడియన్ కలర్ బ్యాగును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది ష్యాషన్ ప్రియులు పోటీ పడటంతో చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన బ్యాగుగా రికార్డుకెక్కిందని క్రిస్టీస్ నిర్వాహకులు తెలిపారు. -
కనిపించకుండా పోయి మొసలి పొట్టలో..
బాలిక్పాపన్ (ఇండోనేషియా) : కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మొసలికి ఆహారంగా మారాడు. ఆఖరికి అతడి చేతులు, కాళ్లు మాత్రమే ఆ మొసలి పొట్టలో కనిపించాయి. ఈ విషయాన్ని ఇండోనేషియా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ పామాయిల్ తోటలో పనిచేసే వ్యక్తి దానికి సమీపంలోని నది ఒడ్డుకు వెళ్లాడు. అయితే, అక్కడ అతడి బైక్, చెప్పులు మాత్రమే కనిపించాయి. దాంతో పోలీసులు ఆ నదిలో తీవ్రంగా గాలింపులు జరిపారు. అయితే, అందులో కొంత చిద్రమైన దేహం కనిపించింది. అదే సమయంలో ఒడ్డుకు సమీపంలోనే వారికి ఓ మొసలి కనిపించింది. దాంతో పోలీసులు దాన్ని కాల్చి చంపారు. అనంతరం దాని పొట్ట చీల్చి చూడగా అందులో ఆ వ్యక్తి కాలు, చేయి బయటపడ్డాయి. ఆ మొసలి దాదాపు ఆరు మీటర్లు (20 అడుగులు) పొడవుంది. బహుశా అతడు స్నానానికి దిగిన సమయంలో మొసలి దాడి చేసి ఉంటుందని పోలీసులు చెప్పారు. గతంలో కూడా ఆ మొసలి బారిన పడి ఓ రష్యన్ వ్యక్తి చనిపోయినట్లు వారు వెల్లడించారు. -
తీలేర్‌లో మొసలి కలకలం
మరికల్ (నారాయణపేట) : మండలంలో ని పర్ధీపూర్ చెరువులో నుంచి దారి తప్పి వచ్చిన భారీ మొసలిని శుక్రవారం తీలేర్ గ్రామ రైతులు ప ట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి సమయం లో జాతీయ రహదారి దాటుతున్న మొసలిని గ మనించిన ఓ లారీ డ్రైవర్ తన వాహనాన్ని నిలి పి చూస్తుండగా, వెనకలే కారులో వచ్చిన సీఐ శ్రీకాంత్‌రెడ్డి మొసలిని గమనించి రోడ్డును దా టించారు. అనంతరం దాని ఆచూకీ కోసం ప్ర యత్నించగా కనిపించకపోవడంతో చుట్టుపక్క ల గ్రామాల రైతులకు మొసలి సంచరిస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శుక్రవా రం మధ్యాహ్న సమయంలో తీలేర్ పెద్ద చెరువు కింద ఉన్న డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి వ్యవసాయ పొలం పక్కలే ఉన్న ఓ కాల్వలో నిద్రిస్తున్న మొ సలిని గమనించిన్న రైతులు వెంటనే పోలీసుల కు, అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు వచ్చేలోపు గ్రామస్తులు వలలో మొసలిని బంధించి గ్రామ పంచాయతీ దగరకు తీసుకువచ్చారు. ఎస్ఐ జములప్ప గ్రామస్తులు పట్టుకున్న మొసలిని వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మొసలిని గమనించిన బీట్ ఆఫీసర్ విజయ్‌రాజ్ మాట్లాడుతూ రెండేళ్ల వయస్సు, 5 ఫీట్ల పొడవు ఉంటుందన్నారు. దీని మహబూబ్‌నగర్ పిల్లలమర్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సవారన్న, ఎంపీటీసీ తిరుతపమ్మ, అశోక్, బసన్న, కుర్మన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో మొసలి..!
బాల్కొండ : ముప్కాల్ మండలం నాగంపేట్ ఊర చెరువులో మొసలి ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు జంకు తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుం చి నీటి సరఫరా చేసే లక్ష్మీ కాలువ ద్వారా చెరువు నిండుతోంది. దీంతో చెరువులోకి లక్ష్మీకాలువ ద్వారా మొస లి వచ్చి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. అధికారులు మొసలిని పట్టుకోవాలని కోరుతున్నారు. -
మొసలిని వణికించిన కుక్క
-
మొసలిని వణికించిన కుక్క
బలం కన్నా ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నవారిని విజయం వరిస్తుంది. ఈ సూత్రం మనుషులకేకాక జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు తాజా ఆస్ట్రేలియాలోని గోట్ ఐర్లాండ్ తీరంలో జరిగిన ఘటనే నిదర్శనం. ఆకలితో ఉన్న ఒక భారీ మొసలి ఆహారం కోసం తీరం ఒడ్డుకు వచ్చింది. పచ్చటి గడ్డి మీద ఎవరికీ కనిపించకుండా.. జంతువు కోసం ఎదురు చూస్తోంది. ఏ జంతువైనా అక్కడి వచ్చింటే.. మొసలి చేతిలో చచ్చేదే. మొసలి చేష్టలను ఒక కుక్క దూరంనుంచి గమనిస్తూనే ఉంది. కొన్ని క్షణాల తరువాత కుక్క.. అత్యంత వేగంగా మొసలి తోక మీద దాడి చేసింది. కుక్క దాడికి భయపడ్డ మొసలి నీటిలోకి జారుకుంది. నార్తరన్ టెరిటరీకి చెందిన కేసీ అనే వ్యక్తి నది ఒడ్డున విహరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన కుక్క పోరాటాన్ని వీడియో తీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. -
డిజిటల్ ఫీవర్
‘అమూల్’య నివాళి నూటయాభైకి పైగా సినిమాలలో నటించిన బాలీవుడ్ నట దిగ్గజం శశికపూర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మరణించిన సంగతి అందరికీ తెలుసు కదా! ఆయన మృతికి సంతాపంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా ఎందరో అధికార, అనధికార ప్రముఖులు, అమితాబ్ బచన్ వంటి గొప్ప నటులు, అభిమానులు ట్వీట్లు చేశారు. వీటన్నిటినీ అందరూ మామూలుగా చూశార ంతే! అయితే, అందరినీ ఆకట్టుకున్న ట్వీట్ ఏమిటో తెలుసా? అమూల్ కంపెనీ శశికపూర్ దీవారా చిత్రంలో ఎంతో భావోద్వేగంతో చెప్పిన మేరా పాస్ మా హై’ అన్న ఆల్‌టైమ్ పాపులర్ డైలాగ్‌ను ‘మేరే పాస్ ఆప్ కా సినిమా హై...’ అంటూ ఒక కార్టూన్‌ను పోస్ట్ చేసి ప్రేక్షకులు శశిని ఎప్పటికీ మరచిపోనివ్వకుండా చేసింది. అభిమానులు ఆ కార్టూన్‌ను ఎంతో అమూల్యంగా చూస్తూ, షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. దింపుడు మొసలి అక్రమంగా జంతువులను రవాణా చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు ఉప్పందింది. వెంటనే వారు అప్రమత్తం అయారు. చివరకి ఒకరి వద్దనున్న బాక్స్‌ను తెరిపించారు. ఆ తర్వాత ఆశ్చర్యంతో నోరువెళ్ల ట్టారు. ఎవరైనా పిల్లిని పెంచుకుంటారు, కుక్కను పెంచుకుంటారు, గినియా పిగ్స్‌ను పెంచుకునే వాళ్లనూ చూశాం కానీ, ఇలా మొసళ్లను పెంచుకునే వాళ్లను చూశామా? అని నోళ్లు నొక్కుకున్నారు.న్యూయార్క్‌లోని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బాక్స్‌ను ఓపెన్ చేయడం... అందులోనుంచి బయటపడ్డ సుమారు నాలుగడుగుల పొడవున్న మొసలి పిల్లను చూసి అధికారులు నోరుÐð ళ్లబెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నట్టు ఎత్తుకు తగ్గ లావుతో స్లిమ్‌గా ఉన్న ఆ మొసలి పిల్లకు ఆఫీసర్లు ఆర్నాల్డ్ షార్జ్నిగ్గర్ అని నామకరణం చేసేశారు. ఒక మొసలి పిల్లని అక్రమంగా దిగుమతి చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సుఫోల్క్ దేశస్థులు ఇలా అక్రమంగా జంతువులను రవాణా చేస్తూ పట్టుబడటం కొత్తేమీ కాదు కానీ, ఇలా పెంపుడు మొసలిని తరలించడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు అధికారులు. మీడియా టోర్నడోలు సాధారణంగా వరదలు, తుపాన్లు, సునామీలు, అగ్నిప్రమాదాలు వంటì ప్రకృతి విపత్తులను ఎవరూ అపురూపంగా చూడరు. గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అయితే, ఈశాన్య ఇటలీలోని సన్రెమో అనే పట్టణంలో సంభవించిన ఒక టోర్నడో దృశ్యాలను అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. ఎందుకంటే, మందపాటి మబ్బుపొరను పదునైన దబ్బనంతో ఎవరో పొడిచినట్టుగా అందులోంచి గాలి, నీళ్లు దూసుకువచ్చి, సముద్రంపై ఫౌంటెన్లా నీటిని చిమ్ముతున్న దృశ్యాలు ఎవరికి మాత్రం వింతగా అనిపించవు మరి!నిజానికి అది భయంకరమైన తుఫానులా మారి, తీరప్రాంతాల్లోని పట్టణాలను, నగరాలను ముంచెత్తాలి. కానీ, అదృష్టవశాత్తూ మధ్యలోనే ఏ అదృశ్యశక్తో ఆపేసినట్టుగా సుడిగాలి, నీళ్లు పైనుంచి చిమ్మి అంతటితో సరిపెట్టింది. ఈ సంఘటన జరగడానికి ముందే తుపాను వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు బీచ్‌లోకి సందర్శకులను రానివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో పెద్దఎత్తున జన, ధననష్టం జరిగే ముప్పు తప్పింది. స్థానికులు ఆ దృశ్యాలను వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
అరుదు : మొసలిని చంపి తిన్న చిరుత
లుసాకా : ఆఫ్రికాలోని కీకారణ్యాల గురించి తెలియని వారుండరు. రకరకాల జంతువులకు ఆవాసం ఆఫ్రికా అడవులు. నిత్యం సాగే జీవన పోరాటాల్లో ఒక జీవిని మరో జీవి చంపడం కూడా అక్కడ పరిపాటే. కానీ, తూర్పు ఆఫ్రికాలోని జాంబియా దేశ అడవిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నీటి కోసం మడుగు దగ్గరకు వెళ్లిన ఓ చిరుత ఒడ్డున సేదదీరుతున్న మొసలిని వేటాడింది. ఇలా మొసళ్లను ఓ జంతువు వేటాడటం చాలా అరుదని పదేళ్లుగా జాంబియా అడవుల్లో సంచరిస్తూ జంతువుల కదలికలను నిశితంగా గమనిస్తున్న ఫొటోగ్రాఫర్ ఒకరు తెలిపారు. ఏదైనా జంతువు నీటి దగ్గరకు వచ్చినప్పుడు మొసళ్లన్నీ జాగ్రత్త పడతాయని వెల్లడించారు. ఈ మొసలి ఆదమరిచి ఉండి ఉంటుందని చెప్పారు. రెండు అడుగులు పొడవున్న మొసలిని వేటాడిన తర్వాత చిరుత ఫొటోలను ఆయన సోషల్‌మీడయాలో షేర్ చేశారు. -
ఇంట్లోకి అనుకోని అతిథి.. చూస్తే షాక్!
భువనేశ్వర్ : ఓ ఇంటికి అనుకోని అతిథి రావడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. అతిథి వస్తే షాకవడం ఏంటనుకుంటున్నారా.. ఇంట్లోకి చొరబడింది మనిషి కాదు.. పెద్ద మొసలి. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలో గురువారం ఈ విచిత్రం చోటుచేసుకుంది. తొలుత ఏదో అలికిడి వినిపించడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారని కుటుంబం భావించింది. కానీ ఎవరొచ్చాని అని చూడగా భారీ అకారంలో ఉన్న మొసలిని చూసిన వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంట్లో వాళ్లను అప్రమత్తం చేయగా, ఒకరు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. విషయం ఆ నోటా ఈనోటా పాకడంతో మనాటా గ్రామస్తులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. అటవీశాఖ అధికారులు మొసలి ప్రవేశించిన ఇంట్లోకి వెళ్లి.. కొద్దిసేపు తీవ్రంగా శ్రమించి పట్టుకున్నారు. ఓ బోనులోకి మొసలి వెళ్లేలా చేసిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొసలిని చూసేందుకు చిన్నాపెద్దా తేడా లేకుండా గ్రామస్తులు చాలామంది వచ్చారని, ఇలాంటివి జరిగినప్పుడు భయపడకుండా తమకు సమాచారం అందించాలని అటవీశాఖ ఉద్యోగి ఒకరు సూచించారు. -
బావిలో కనిపించిన మొసలి
పిడుగురాళ్లరూరల్: బావిలో మొసలి పిల్ల కనిపించిన ఘటన మండలంలోని కామేపల్లి గ్రామ బైపాస్ వద్ద జరిగింది. షేక్ మాబు సైదా తన పొలం పక్కనే ఉన్న బావిలో నుంచి వరి పొలానికి నీళ్లు పెడుతుండగా బుధవారం బావి అడుగున చిన్న మొసలి పిల్ల బయటపడింది. 12 కిలోల బరువు, సుమారు నాలుగు అడుగులు పొడవు ఉంది. ఈ విషయం వెంటనే స్థానికులు ఫారెస్టు అధికారులకు తెలపగా ప్రస్తుతం తాము సీఎం పర్యటనలో ఉన్నామని, గురువారం ఉదయం వస్తామని చెప్పినట్లు సమాచారం. -
ఫోర్ ఇడియట్స్.. ప్రాణాలతో చెలగాటం!
క్వీన్స్ లాండ్ : ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అటువైపుగా వెళ్లేందుకు దాదాపుగా ఎవరూ సాహసించరు. కానీ, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఇలాంటి వెకిలి వేషాలు వేస్తే మూర్ఖులు కాక ఏమంటారు చెప్పండి. క్వీన్స్ లాండ్‌లోని పోర్ట్ డగ్లస్ మెరీనా దగ్గర రెండు వారాల క్రితం వృద్ధురాలు మొసలి బారిన పడి చనిపోయింది. ఆ సరస్సులో మొసళ్ల బారిన పడి చాలా మంది గాయపడుతున్నారని ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోకపోవటంతో ఆ ఘోరం జరిగింది. అయితే ఆ తర్వాత వాటిని పట్టుకునేందుకు అక్కడక్కడా ఉచ్చులను(బోనులను) ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 20న నలుగురు యువకులు ఆ సరస్సులోకి దిగి సుమారు గంటకు పైగా గడిపారు. అక్కడే ఉన్న ఓ బోనులో కూర్చుని ఫోటోలు దిగారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన వాళ్లు.. ఆ ఫోటోలను తమ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వారి వేషాలపై విమర్శలు గుప్పించారు. వారు ఫోటోలు దిగిన ప్రాంతానికి 4 మీటర్ల దూరంలోనే మొసలి ఇంతకు ముందు వృద్ధురాలిని చంపటం విశేషం. ఘటనపై డగ్లస్ షైర్ మేయర్ జూలీ ల్యూ స్పందిస్తూ... వారు సరదాగా చేసిన ఆ యత్నం చాలా చెండాలంగా ఉంది. ప్రాణాలతో చెలగాటం సాహసమని వారి భావించి ఉండొచ్చు. కానీ, వారి చేసిన పని మూర్ఖపు చర్యే. వారిని వదిలే ప్రసక్తేలేదు. చర్యలు తీసుకుని తీరతాం అని అన్నారు. నిబంధనల అతిక్రమించి నీటిలో దిగి బోను దగ్గరికి వెళ్లినందుకుగానూ వారికి 15 వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఫోటోను ముందుగా పోస్ట్ చేసిన స్టేసీ డబ్ల్యూ క్లేటన్ అనే యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇడియట్స్ ఆఫ్ ది సెంచరీ యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Srsly? The meat we put in these traps is bait. For crocodiles. Don’t swim in them! It’s stupid, and illegal. @qldpol @7NewsCairns pic.twitter.com/nQsUZwI3Wc — Steven Miles (@StevenJMiles) 23 October 2017 -
ఈ హోటల్లో మొసలితో ఆడుకోవచ్చు..
బీజింగ్: మొసళ్ల అంటే ఎంత భయం.. చూస్తేనే ఒళ్లు గగుల్పొడుస్తుంది. అలాంటిది అది పక్కన ఉండగా భోజనం ఎలా చేస్తం.. భయంతో చచ్చిపోతాం. కానీ చైనాలోని ఓ రెస్టారెంట్లో ఎంచక్కా దానితో సెల్ఫీ దిగవచ్చు.. ఆడుకోవచ్చు. రెస్టారెంట్‌కు కస్టమర్లను రప్పించాలని వినూత్నంగా ఆలోచించిన ఓ యజమాని ఏకంగా మొసలిని పెంపుడు జంతువులా పెంచుతున్నాడు. ఇక ఈ రెస్టారెంట్‌కు వచ్చిన యువత డిన్నర్ అనంతరం తెగ ముచ్చటపడుతూ మొసలితో సెల్పీలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లలైతే పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నట్లు ఆడుకుంటున్నారు. అయితే ఈ హోటల్ నిర్వాహుకులపై కొందరు జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. మొసలిని చూడాలంటే జూపార్క్‌లకు వెళ్లాలి. కానీ రెస్టారెంట్లో పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
ఈ హోటల్లో మొసలితో ఆడుకోవచ్చు..
-
మొసలి దాడిలో విలేకరి మృతి
కొలంబో: శ్రీలంకలో ఓ బ్రిటన్ జర్నలిస్ట్ పాల్ మెక్‌క్లీన్(24) మొసలిదాడిలో మృతి చెందాడు. దేశ రాజధాని కొలంబోకు 360 కిలో మీటర్ల దూరంలోని పనామా గ్రామ శివారులో ఉన్న ఓ బూరదగుంటలో పడి ఉన్నాడు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆ ప్రాంతంలో ఎక్కువగా మొసళ్లు తిరుగుతుంటాయని అవే దాడి చేసి హతమార్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. యూకేకు చెందిన పాల్ మెక్‌క్లీన్ బ్రిటీష్ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. అతను తన మిత్రులలతో కలిసి శ్రీలంకలో పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. -
కారుకు అడ్డొచ్చిన మొసలి
భారీ వరదల్లో కొట్టుకొచ్చిన ఓ మొసలి.. రోడ్డుపై ఆగింది. వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న ఆ రోడ్డుపై వాహనాలు అడపాదడపా నడుస్తూనే ఉన్నాయి. అలా వెళ్తున్న ఓ కారుకు అడ్డు మొసలి అడ్డు వచ్చింది. నీరు ప్రవహిస్తుండటంతో అతి నిదానంగా కదులుతోంది. దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది. అసలే వరద నీరు.. ఉధృతి పెరిగితే కార్లు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మొసలిని త్వరగా వెళ్లిపొమ్మంటూ హారన్ కొట్టసాగాడు. హారన్ పెద్దగా మోగడం విన్న మొసలి వెంటనే రోడ్డు దాటేసింది. ఈ సన్నివేశం ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. దీన్ని చిత్రించిన ఓ వ్యక్తి వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. లక్షల మంది ఇప్పటికే ఈ వీడియోను వీక్షించి లైక్‌లు కొట్టేశారు. -
భార్యే మొసలి అయితే!
‘‘ఆకాశం దిగివచ్చి... మబ్బులతో వేసింది ఆ పందిరి! ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరిగింది పెళ్లంటే మరి!!’’ అవును, నిజంగానే అంగరంగ వైభవంగా జరిగిందా పెళ్లి. అందరి కళ్లు ఆ పెళ్లికూతురు మీదే. తెల్లని గౌన్‌లో కుందనపు బొమ్మలా మెరిసిన ఆమె... పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అందరి ఆశీస్సులతో ఓ మేయర్‌కి శ్రీమతి అయిపోయింది. అయితే కథలో ట్విస్ట్ ఏమిటంటే.. పెళ్లికూతురు మొసలి. మీరు చదివింది కరెక్టే. మొ..స..లి! ఏ ప్రాణినైనా అమాంతం నోటకరచి కరకరలాడించేందుకు ఎగబడే మొసలే. మెక్సికోలోని శాన్ పెడ్రో హుమెలెల అనే ప్రాంత మేయర్ (విక్టర్ అగైలార్).. ఓ మొసలిని పెళ్లాడాడు. ఆ తరువాత ప్రేమగా ముద్దాడాడు. ఇంతకీ ఇదంతా ఓ ఆచారమట. ఇలా మొసలికి పెళ్లి చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం. అందుకే.. అంత ఘనంగా పాటలు, నృత్యాలు చేయడంతో పాటు... సంప్రదాయ విన్యాసాలతో ప్రతి ఏడాది ఈ పెళ్లితంతును ఓ పండుగలా జరుపుకుంటారు. పెళ్లి జరిగే ముందు రోజు కూడా పెళ్లి కూతురి(మొసలి)ని ముస్తాబు చేసి బాజాభజంత్రీల మధ్య ఊరంతా ఊరేగిస్తారు. ఈ ఆచారం ఇంచుమించు 18వ శతాబ్దం నాటిదట. భారతీయ సంతతికి చెందిన చోనాటల్ తెగవారు ఇంచుమించు 1789 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. -
సర్ప్రైజ్.. ఇంట్లో మొసలి..
చెరువుల్లో.. నదుల్లో మొసలిని చూసుంటాం.. దాన్ని చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుతుంది. అలాంటిది ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది..! భయంతో చస్తాం.! కానీ ఓ మొసలి ఇంట్లోకి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. గుజరాత్‌లోని వడదోరాలో గత బుధవారం 4.5 అడుగులన్న ఓ మొసలి ఓ ఇంట్లోకి వచ్చింది. దానిని పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు అక్కడి కాలనీ వాసులు.. అయితే గత కొద్ది రోజులుగా గుజరాత్లో వరదలు ముంచెత్తడంతో నీరు ఇంట్లోకి చేరింది. ఈ కారణంగానే మొసలి ఇంట్లోకి చేరినట్లు కాలనీవాసులు భావిస్తున్నారు. ఈ వీడియోను ఏఎన్ఐ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. అధికారులు ఆ మొసలిని చెరువులో విడిచిపెట్టినట్లు తెలిపారు. -
హవ్వా.. మత్తులో ఇలా కూడా చేస్తారా..?
సిడ్నీ: మద్యం, పొగ, మత్తుపదార్థాలు సేవించడం ఆరోగ్యానికి హానీకరం అంటారు. ఆరోగ్యమే కాదు.. అది ఆలోచనకు కూడా వినాశిని. విచక్షణ కోల్పోయి ఎప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉండే మనసును కకావికలం చేసి మొత్తాన్ని ఎదుటివారి వినాశనానికో లేద తన నాశనానికో దారి తీస్తుంది. ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తికి అదే అనుభవం ఎదురైంది. అప్పటి వరకు తమ కళ్ల ముందున్న స్నేహితుడు కనిపించకుండా పోయిన పరిస్థితి ఎదురై చివరకు చనిపోయాడులే అని నిర్ణయించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. తీవ్రంగా మత్తుపదార్థాలతో నిండిన పొగతాగడం మూలంగా ఓ ఆస్ట్రేలియన్ వికృత ఆలోచన చేసి బలయ్యాడు. ఏకంగా మొసలితో సంపర్కాన్ని కోరుకుని దాని నోట్లు ఇరుక్కుని చేతులారా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని ఓ 26 ఏళ్ల యువకుడు తన ఐదుగురు స్నేహితులతో కలిసి బీచ్ దగ్గర రిసార్ట్ దగ్గర పార్టీ చేసుకుంటూ ఫుల్లుగా మద్యం సేవించి అనంతరం మత్తుపొగను తాగాడు. దాంతో అప్పటి వరకు క్రమబద్ధంగా ఉన్న ఆ వ్యక్తి కాస్త అదుపు తప్పాడు. వెంటనే తన మనసులో మాట బయటకు చెప్పి వారి మత్తు దిగిపోయేలా చేశాడు. తనకు మొసలితో అలాంటి పనిచేయాలని ఉందంటూ బిత్తరపోయేట్లు చేశాడు. వారి వద్దని వారిస్తున్నా వారిపైకి సీరియస్‌గా చూస్తూ ఓ సైకోలాగా చేస్తూ అదే మాటను పదేపదే చెప్పాడు. స్నేహితుడు కావడంతో వారి మరోసారి అతడిని వారించే ప్రయత్నం చేసినా వారి నుంచి విడిపించుకొని బీచ్ వెంట పరుగులు తీయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే అతడికి మొసలి కనిపించిందో వెంటనే తన దుస్తులన్నీ విప్పేసి దాని దగ్గరకు వెళ్లాడు. ఏమాత్రం భయపడకుండా వెళ్లి నేరుగా దానిని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా ఆ స్నేహితులకు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగింది. వారు అతడిని నివారించేలోగానే వెంటనే ఆ ముసలి అతడిని అందుకొని నీళ్లలోకి వెళ్లిపోయింది. అతడు చనిపోయాడా బతికాడా అనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు. అతడికోసం తనిఖీలు నిర్వహించిన గస్తీ బలగానికి కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో అతడు చనిపోయాడని నిర్దారణకు వచ్చారు. అసలు అతడలా వికృతంగా ఎలా ఆలోచించాడని ఆరా తీయగా వారు సేవించిన మత్తుపదార్థాల్లో విపరీతంగా లైంగిక వాంఛలు పెంచేందుకు అనువైన ఐస్ అనే పదార్థం ఉందని తెలిసింది. ఇలా మత్తులో పడి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడనే సోయి కూడా లేకుండా నిండూ జీవితాన్ని బలి తీసుకున్నాడు. -
గజేంద్రమోక్షం: మొసలి-ఏనుగు హోరాహోరీ!
మడుగులో దిగిన ఏనుగు మొసలి బారిన పడటం.. మొసలి నోట చిక్కిన గజేంద్రుడిని ఆ శ్రీమహా విష్ణుమూర్తి కాపాడటం.. ఇదంతా తెలుగువారికి సుపరిచితమే. పోతనామాత్యుడు రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షలాంటి ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ మడుగులో నీటిని తాగేందుకు గజేంద్రుల గుంపు వెళ్లింది. అక్కడ ఓ చిన్ని ఏనుగు నీళ్లు తాగుతుండగా.. మడుగులో గుట్టుగా మాటు వేసిన మొసలి.. దాని తొండాన్ని నోట కరుచుకుంది. అంతే ఇద్దరి మధ్య జీవర్మరణ పోరాటమే తలపించింది. మొసలి నోట తొండం చిక్కిన ఏనుగు మొదట గట్టిగానే ప్రతిఘటించింది. మొసలిని తొండంతో ఇటు-అటు కొట్టి ఓడ్డుకు ఈడ్చే ప్రయత్నం చేసింది. తోటి ఏనుగులు మొదట భయపడినా.. ఆ తర్వాత సాయం చేయడంతో మొసలి తొకముడవక తప్పలేదు. ఈ ఘటన మలావిలోని లివోండే జాతీయ పార్కులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అలెగ్జాండర్ మాకెంగ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పెట్టగా.. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
రైతు చేపల చేరువులో మొసలి
-
మొసలితో పోరాడి గెలిచిన చిన్నారి
-
మొసలితో పోరాడి గెలిచిన చిన్నారి
కేంద్రపర: ఆరేళ్ల చిన్నారి తన స్నేహితురాలి ప్రాణాలు కాపా డటం కోసం మొసలితో పోరాడిన ఘటన ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో చోటుచేసుకుంది. బాంకు లాలా గ్రామానికి చెందిన టికీ దలాయ్ తన స్నేహితురాలు బసంతి దలాయ్‌తో కలసి చెరువులో స్నానం చేయడానికి వెళ్లింది. ఇంతలో మొసలి బసంతిపై దాడిచేసింది. చాకచక్యంగా వ్యవహరించిన టికీ తన సమీపంలోని కర్రతో మొసలి తలపై మోది స్నేహితురాలిని కాపాడింది. ప్రమాదంలో బసంతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించారు. తన ధైర్య సాహసాలతో స్నేహితురాలి ప్రాణాలు కాపాడినందుకు టికీని స్థానికులు అభినందించారు. కాగా, బసంతి వైద్యానికి అయ్యే ఖర్చులు తామే భరిస్తామని, నష్ట పరిహారాన్ని కూడా అందిస్తామని అటవీ అధికారులు తెలిపారు. -
అదృష్టమంటే ఇదే: మొసలి నోట చిక్కినా..
నీళ్లలో మొసలి నోటికి చిక్కామంటూ ప్రాణాలతో బయటపడటం అంత సులువు కాదు. కానీ ఓ ఆస్ట్రేలియన్ కుర్రాడు మాత్రం మొసలి నోటికి చిక్కినా లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. తన ఎడమచేతిని నోటకరుచుకొని దాడికి సిద్ధపడ్డ మొసలి తలపై గట్టిగా ఒక పంచ్ ఇవ్వడం ద్వారా తప్పించుకున్నాడు. ఈశాన్య ఆస్ట్రేలియాలోని జాన్స్టోన్ నదిలో అర్ధరాత్రి స్నేహితులతో కలిసి 18 ఏళ్ల లీ డీ పౌవ్ ఈత కొడుతున్నాడు. ఈ సందర్భంగా ఆనందంగా కేరింతలు కొడుతున్న సమయంలో ఓ మొసలి అతనిపై దాడి చేసింది. అకస్మాత్తుగా వచ్చి అతని ఎడమ చేతిని నోట కరుచుకుంది. అయినా భయాందోళనకు గురికాని లీ డీ తెలివిగా దాని నెత్తిమీద ఒక్క పిడిగుద్దు విసరడంతో అది చేతిని వదిలిపెట్టింది. ఈ ఘటనలో అతని చేతికి పెద్ద గాయమైంది. అయినప్పటికీ అతను ప్రాణాలతో బయటపడటం చాలా అదృష్టమనే చెప్పాలని అతనికి చికిత్స అందించిన డాక్టర్ నీల్ నోబెల్ తెలిపారు. చేతికి తీవ్ర గాయాలు అవ్వడంతో పలు శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు చెప్పారు. -
పాతబస్తీలో మొసలి పిల్ల కలకలం
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో మొసలి పిల్ల కలకలం రేపింది. ఆజంపురాలోని మూసీ నాలా నుండి ఓ మొసలి ఒడ్డుకు చేరింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా మొసలిని బంధించి చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంబంధిత అధికారులకు విషయాన్ని తెలియజేశారు. జూ అధికారులు, సిబ్బందితో అక్కడికి చేరుకుని మొసలి పిల్లను జంతు పరిరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
షార్క్ చేప కోసం మనిషి మొసలి పోటీ
-
మొసలిని బంధించిన గ్రామస్తులు
అడవిదేవులపల్లి(నల్లగొండ): నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామస్తులు మొసలిని పట్టుకుని బందీని చేశారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన మహిళలు సమీపంలోని కృష్ణా నదిలో దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. అయితే, నీటిలో ఉన్న ఓ మొసలి మహిళలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒడ్డుకు వచ్చిన మొసలి మెడకు ఉచ్చు వేసి బంధించారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా, గ్రామస్తులపై మొసలి దాడి చేయటం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. -
నీళ్లలో ఉన్న మొసలినీ చంపేసింది!
-
నీళ్లలో ఉన్న మొసలినీ చంపేసింది!
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు బట్టు బయట గుక్కచేత భంగపడును స్థానబలముగాని తన బలిమికాదయా విశ్వదాభిరామ వినురవేమ అనేది వేమన శతకంలో పద్యం. సాధారణంగా నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి బలం చాలా ఎక్కువగా ఉంటుందని, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరని అంటారు. కానీ అది కూడా తప్పేనని తేలిపోయింది. నీళ్లలో ఉన్న ఓ మొసలిని చిరుతపులి వెంటాడి.. వేటాడి మరీ దాని తల పట్టుకుని కొరికి చంపేసి మరీ గట్టుమీదకు లాక్కొచ్చింది. బ్రెజిల్ అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ దృశ్యం కెమెరా కంట పడింది. చిరుత పులులను 'కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్' అంటారు. ఆకలిగా ఉన్నప్పుడు ఇవి ఎంతటి సాహసమైనా చేస్తాయి. అచ్చం అలాంటి పరిస్థితిలోనే ఉన్న ఓ బలమైన చిరుత పులి.. ఎక్కడ చూసిందో గానీ నీళ్లలో ఉన్న మొసలిని చూసింది. అమాంతం దానిమీదకు దూకి, నోటితో దాని తల వెనక భాగంలో గట్టిగా కొరికి పట్టుకుని, ఒడ్డు మీదకు తీసుకొచ్చేసింది. చివరి నిమిషంలో చిరుతను గమనించిన మొసలి వేగంగా ఈదుకుంటూ వెళ్లిపోడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం దక్కలేదు. అయితే, దాడి చేసి మొసలిని చంపింది ఆడ చిరుత కాగా.. అందులో చాలా భాగాన్ని మగ చిరుత కూడా పంచుకుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. చిరుత పులికి ఎలా దాడి చేయాలన్న విషయం బాగా తెలుసు. మొసలి తల వెనుక భాగం చాలా బలహీనంగా ఉంటుంది. సరిగ్గా అక్కడ దాడి చేస్తే అది కోలుకునే అవకాశం లేదు. ఆ విషయాన్ని తెలుసుకున్న చిరుత అలాగే దాడి చేసిందని అంటున్నారు. -
దొరికిన మొసలి పిల్ల
గోదావరిలో వదిలిన అటవీశాఖ అధికారులు కొత్తపేట : ఎట్టకేలకు మొసలి పిల్ల అటవీశాఖ అధికారుల వలకు చిక్కింది. మండలంలోని పలివెల–మాచవరం పంట కాలువలో అవిడి గ్రామ ముఖ ద్వారం సమీపంలోని డామ్ వద్ద శని, ఆదివారాల్లో మొసలి పిల్ల సంచరించిన సంగతి తెలిసిందే. స్థానికులు, వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ ఎ¯ŒS.శ్రీధర్ అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ రాజమండ్రి రేంజ్ ఆఫీసర్ రవి సిబ్బందితో మొసలి పిల్ల సంచరించిన ప్రదేశానికి చేరుకుని మొసళ్లను పట్టుకునే వలలతో గాలించి అర్ధరాత్రి ఒక మొసలి పిల్లను పట్టుకున్నారు. దానిని డ్రమ్‌లో బంధించి వానపల్లి శివారు నారాయణలంక వద్ద గౌతమీ గోదావరిలో వదిలినట్టు తహసీల్దార్ తెలిపారు. -
మళ్ళీ మొసలి పిల్ల కలకలం
కొత్తపేట : కొత్తపేట మండలం అవిడి పంట కాలువలో ఆదివారం సాయంత్రం మొసలి పిల్ల మళ్లీ కలకలం సృష్టించింది. బొబ్బర్లంక–అమలాపురం ప్రధాన పంట కాలువ నుంచి అనుసంధానంగా మండల పరిధిలోని పలివెల లాకుల సమీపం నుంచి వెళ్లిన అవిడి–మాచవరం ³ల్ల కాలువలో అవిడి రేవు సమీపంలో డామ్ వద్ద శనివారం రాత్రి యువకులకు మొసలి పిల్లలు కనిపించి అదృశ్యమైన విషయం తెలిసిందే. కాగా ఇరిగేష¯ŒS సిబ్బందికి సమాచారం ఇచ్చి కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో కాలువలో నీరు తగ్గడంతో ఒక మొసలి పిల్ల కాలువ గట్టుపైకి ఎక్కి తుప్పల్లోకి వెళ్లింది. ఈ విషయం గ్రామం అంతటా వ్యాపించడంతో జనం భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దానితో తుప్పల్లోంచి మళ్లీ కాలువలోకి వెళ్లిపోయింది. -
నీటిలో ఉండాల్సిన మెసళ్లు జనావాసాల్లోకి
-
సోన్‌పేట చెరువులో మొసలి
బాల్కొండ మండలంలోని సోన్‌పేట్ గ్రామ చెరువులో ఆదివారం ఉదయం జాలారులు మొసలిని బంధించి పట్టుకున్నారు. శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్ ఆనకట్ట దిగువ భాగనే సోన్‌పేట్ గ్రామ ఊర చెరువు ఉండటంతో ప్రాజెక్ట్‌లో నుంచి మొసలి చెరువులోకి వచ్చి ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గతేడాది కూడ చెరువులోకి మొసలి రావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టుకున్న మొసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.