
బలం కన్నా ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నవారిని విజయం వరిస్తుంది. ఈ సూత్రం మనుషులకేకాక జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు తాజా ఆస్ట్రేలియాలోని గోట్ ఐర్లాండ్ తీరంలో జరిగిన ఘటనే నిదర్శనం. ఆకలితో ఉన్న ఒక భారీ మొసలి ఆహారం కోసం తీరం ఒడ్డుకు వచ్చింది. పచ్చటి గడ్డి మీద ఎవరికీ కనిపించకుండా.. జంతువు కోసం ఎదురు చూస్తోంది. ఏ జంతువైనా అక్కడి వచ్చింటే.. మొసలి చేతిలో చచ్చేదే. మొసలి చేష్టలను ఒక కుక్క దూరంనుంచి గమనిస్తూనే ఉంది. కొన్ని క్షణాల తరువాత కుక్క.. అత్యంత వేగంగా మొసలి తోక మీద దాడి చేసింది. కుక్క దాడికి భయపడ్డ మొసలి నీటిలోకి జారుకుంది. నార్తరన్ టెరిటరీకి చెందిన కేసీ అనే వ్యక్తి నది ఒడ్డున విహరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన కుక్క పోరాటాన్ని వీడియో తీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.